శ్రీ లలితా సహస్ర నామములు - 183 / Sri Lalita Sahasranamavali - Meaning - 183

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 183 / Sri Lalita Sahasranamavali - Meaning - 183 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 183. శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా ।
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ॥ 183 ॥ 🍀

🍀 998. శ్రీశివా :
సుభములను కల్గినది

🍀 999. శివశక్తైక్యరూపిణీ :
శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది

🍀 1000. లలితాంబికా :
లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత

🌻 ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం . 🌻

🍀 ॥ ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితారహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః ॥ 🍀

సమాప్తం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 183 🌹

📚. Prasad Bharadwaj

🌻 183. Shri shiva shivashaktyaikya rupini lalitanbika
Yvam shri lalita devya namnam sahasrakam jaguh ॥ 183 ॥ 🌻

🌻 998 ) Sri shivaa -
She who is the eternal peace

🌻 999 ) Shiva shakthaikya roopini -
She who is unification of Shiva and Shakthi

🌻 1000 ) Lalithambika -
The easily approachable mother

🌻 Sree Lalitha Sahasranama Stotram Samaptam. 🌻🙏

The End...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 135

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 135 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : పద్మావతి దేవి

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. ధ్యానము - విశిష్టత -2 🌻

సృష్టిని నారాయణుని అడుగు జాడలుగ స్మరించువారికి అదే పరబ్రహ్మము కనుమూసినను, కనుతెరచినను తానే అయి నిత్యముగ భాసించును.

"అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః", అని వేదమంత్రములు భాగవత మార్గమును గూర్చి అభయముద్ర పట్టియున్నవి.

ఇట్లు ఇంద్రియములను , మనస్సును సొంతముగా దమించుకొని హృదయమున పరబ్రహ్మము దుకాణము పెట్టుకొనువారి మార్గము కన్న అట్లు సాధన చేయునట్టి తన్నే అంతర్యామికి‌ సమర్పణ చేసి శరణాగతి చెందు మార్గము శాశ్వతానందమిచ్చును.

✍🏼 మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2022

శ్రీ శివ మహా పురాణము - 505

🌹 . శ్రీ శివ మహా పురాణము - 505 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 41

🌻. వివాహ మండపము - 5 🌻

నారదడిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ నాథా! వివాహము నందు విఘ్నము కలుగుననే భయము ఏమియూ లేదు (42). హిమవంతుడు కన్యకను నీకిచ్చుట నిశ్చయము. ఈ పర్వతులు నిన్ను దోడ్కొని వెళ్లుటకై వచ్చి యున్నారు. సంశయము లేదు (43). ఓ సర్వజ్ఞా! కాని దేవతలను మోమింపజేసి కుతూహలమును కలిగించుట కొరకై అద్భుతమగు మాయ రచింపబడినది. విఘ్నము కలిగే ప్రసక్తియే లేదు (44). హే విభూ! హిమవంతుని ఆజ్ఞచే ఆతని గృహమునందు మహామాయావి యగు విశ్వకర్మ అనేకములగు అద్భుతములతో నిండియున్న విచిత్ర మగు మండపమును నిర్మించెను (45).

దేవ సమాజమంతయూ అచట మోహమును కలిగించు రీతిలో నిర్మింపబడనది. నేను దానిని చూచి ఆ మాయచే విమోహితుడనై విస్మయమును పొందితిని (46).

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! లోకాచారములను ప్రవర్తిల్ల జేయు శంభు ప్రభుడు ఆ మాటను విని నవ్వి విష్ణువు మొదలగు దేవతలందరితో నిట్లనెను (47).

ఈశ్వరుడిట్లు పలికెను-

హిమవంతుడు నాకు కన్యను ఇచ్చే పక్షంలో మాయతో నాకు పనియేమి? ఓ విష్ణూ! నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము (48). ఓ బ్రహ్మా! ఇంద్రా! మునులారా! దేవతలారా! సత్యమును పలుకుడు. పర్వతరాజు కన్యకు ఇచ్చే పక్షంలో నాకు మాయతో పని యేమి? (49) ఉపాయమేదైన ఫలమును సాధించవలెనని నీతివేత్తలగు పండితులు చెప్పెదరు. కావున మీరందరు విష్ణువును ముందిడు కొని వివాహకార్యము కొరకు శీఘ్రమే ముందుకుసాగుడు (50).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ విధముగా దేవతలతో సంభాషించు చున్న ఆ శంభుడు అపుడు ప్రాకృతమానవుడు వలె మన్మథునకు వశుడైనట్లుండెను (51). అపుడు శంభుని ఆజ్ఞచే విష్ణువు మొదలగు దేవతలు, ఋషులు, మరియు సిద్ధులు మోహజనితమగు భ్రమను విడనాడిరి (52). ఓ మునీ! నిన్ను, ఆ పర్వతులను ముందిడు కొని విస్మ యావిష్టులైన ఆ దేవతలు మొదలగు వారు పరమాశ్చర్యకరమగు హిమవంతుని మందిరమునకు అపుడు వెళ్లిరి (53). తరువాత విష్ణువు మొదలగు వారితో, మరియు ఆనందముతో కూడియున్న తన గణములతో కూడి ప్రహర్షితుడైన శివుడు హిమవన్నగర సమీపమునకు వచ్చెను (54).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో వివాహమండప వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2022

గీతోపనిషత్తు -307

🌹. గీతోపనిషత్తు -307 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 4 📚

🍀 20-4. కోరికలు - కోరిక ఏదైన అది బంధమునకు మార్గమే యగును. భోగములం దాసక్తి జీవుని భోగపరునిగ బంధించును. సకామభక్తులు పూర్ణ వికాసము కలిగిన వారు కాదు. వీరు పునరావృత్తి మార్గమున జనన మరణ సంస్కార చక్రమునందు తిరుగాడుచు నుందురు. వారి కోరికలచే వారిని వారే బంధించుకొను చుందురు. ఎన్ని జన్మలెత్తినను కామములను పూరించుట సాధ్యము కాని పని. కనుక జనన మరణములను అనుభవించుచునే యుందురు. 🍀

20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |
పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ ||

తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.

వివరణము : ఈ శ్లోకమున సకామ కర్మమార్గమునకు కూడ తానే అధిపతినని తెలుపుచున్నాడు. ఇట్టి సకామభక్తులు పూర్ణ వికాసము కలిగిన వారు కాదు. వీరు పునరావృత్తి మార్గమున జనన మరణ సంస్కార చక్రమునందు తిరుగాడుచు నుందురు. వారి కోరికలచే వారిని వారే బంధించుకొను చుందురు.

కోరిక ఏదైన అది బంధమునకు మార్గమే యగును. ఇనుప సంకెళ్ళతో బంధించినను, బంగారు సంకెళ్ళతో బంధింప బడినను, బంధము బంధమే యగును. భోగము లందాసక్తి జీవుని భోగపరునిగ బంధించును.

భోగములు రోగములకు కూడ హేతువు లగుచుండును. భోగ రోగముల నడుమ జీవితము సాగుచుండును. ఎన్ని జన్మలెత్తినను కామములను పూరించుట సాధ్యము కాని పని. చిల్లుకుండలో ఎంతనీరు పోసినను అది నిండుకుండ కాజాలదు. అయినప్పటికిని ఈ జ్ఞానము కలుగువరకు జీవులు కోరుచునే యుందురు. కనుక జనన మరణణము లనుభవించుచునే యుందురు. కామ్యకర్మ జీవునకు పరిష్కారము కాదు. నిష్కామకర్మయే పరిష్కారము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2022

కనుమ శుభాకాంక్షలు Kanuma Subhakankshalu: కనుమ పండగ విశిష్టత Significane of Kanuma : If you feed them, your anomalies will be removed

🌹. కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹

🔥.ఈ కనుమ మన జీవితాలలో సిరి సంపదలను, ఐశ్వర్యమును, సత్స్‌ సంభందములను నెలకొల్పి, అంతః వెలుగు వైపు మన ప్రయాణాన్ని సుగమము చేయుగాక. మనలో దివ్యత్వమును నింపుగాక. 🔥

ప్రసాద్‌ భరధ్వాజ

🌹. Good Wishes and Subhakankshalu on Kanuma Festival to all. 🌹

🔥. Let This Kanuma fill our Lives with all Resources, Good Relations, and Help us in our Journey towards Inner Light and fill with Divinity. 🔥

Prasad Bharadwaj

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. కనుమ పండగ విశిష్టత 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

సంక్రాంతి పండగలో భాగంగా చివరగా జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఏడాదంతా వివిధ రకాల వ్యవసాయ పనుల్లో తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.

కనుమ రోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.

ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.

సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయి ! 🌹

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు.

దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత...

గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే..

మీరు 7 , 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి , కొద్దీగా బెల్లం , కొన్ని తేనె చుక్కలు , కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం , పంచమ రాహు , అష్టమ రాహు , రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది.

అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు.

కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత... మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకునవలేను.

🌹 🌹 🌹 🌹 🌹

16 Jan 2022

16-JANUARY-2022 ఆదివారం MESSAGES కనుమ విశిష్టత

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 16, ఆదివారం, జనవరి 2022 భాను వాసరే 🌹 
🌹. కనుమ పండుగ శుభాకాంక్షలు 🌹 
🌹. కనుమ పండుగ విశిష్టత 🌹 
*🌹. కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయి ! 🌹*
2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 307 🌹  
3) 🌹. శివ మహా పురాణము - 505🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -135🌹  
5) 🌹 Osho Daily Meditations - 124🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 183 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 183 🌹 చివరి భాగము Last Part 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కనుమ శుభాకాంక్షలు, శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 16, జనవరి 2022*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 2 🍀*

*2. అర్యమ –*
*అర్యమా పులహోఽథౌజాః ప్రహేతి పుంజికస్థలీ |*
*నారదః కచ్ఛనీరశ్చ నయంత్యేతే స్మ మాధవమ్*
*మేరుశృంగాంతరచరః కమలాకరబాంధవః |*
*అర్యమా తు సదా భూత్యై భూయస్యై ప్రణతస్యమే*

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
హేమంత ఋతువు, పౌష్య మాసం
తిథి: శుక్ల చతుర్దశి 27:19:40 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: ఆర్ద్ర 26:10:59 వరకు
తదుపరి పునర్వసు
యోగం: ఇంద్ర 15:20:54 వరకు
తదుపరి వైధృతి
కరణం: గార 14:08:48 వరకు
వర్జ్యం: 08:44:48 - 10:32:00
దుర్ముహూర్తం: 16:32:26 - 17:17:17
రాహు కాలం: 16:38:03 - 18:02:09
గుళిక కాలం: 15:13:57 - 16:38:03
యమ గండం: 12:25:46 - 13:49:51
అభిజిత్ ముహూర్తం: 12:03 - 12:47
అమృత కాలం: 15:00:00 - 16:47:12
మరియు 25:59:12 - 27:45:04
సూర్యోదయం: 06:49:22
సూర్యాస్తమయం: 18:02:09
వైదిక సూర్యోదయం: 06:53:11
వైదిక సూర్యాస్తమయం: 17:58:19
చంద్రోదయం: 16:39:19
చంద్రాస్తమయం: 05:26:36
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: జెమిని
ధ్వాంక్ష యోగం - ధన నాశనం, 
కార్య హాని 26:10:59 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
పండుగలు : ముక్కనుమ, బొమ్మల నోము
Kanuma, Magh Bihu (Assam)

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కనుమ పండుగ శుభాకాంక్షలు అందరికి. 🌹*

*🔥.ఈ కనుమ మన జీవితాలలో సిరి సంపదలను, ఐశ్వర్యమును, సత్స్‌ సంభందములను నెలకొల్పి, అంతః వెలుగు వైపు మన ప్రయాణాన్ని సుగమము చేయుగాక. మనలో దివ్యత్వమును నింపుగాక. 🔥*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌹. Good Wishes and Subhakankshalu on Kanuma Festival to all. 🌹*

*🔥. Let This Kanuma fill our Lives with all Resources, Good Relations, and Help us in our Journey towards Inner Light and fill with Divinity. 🔥*
*Prasad Bharadwaj*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కనుమ పండగ విశిష్టత 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*సంక్రాంతి పండగలో భాగంగా చివరగా జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఏడాదంతా వివిధ రకాల వ్యవసాయ పనుల్లో తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.*

*కనుమ రోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.*

*ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.*

*సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.*
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కనుమ రోజు వీటికి ఇవి ఆహారంగా ఇస్తే మీ దోషాలు అన్ని తొలగిపోతాయి ! 🌹*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సంక్రాంతి తరువాత మరుసటి రోజు వచ్చే కనుమ పండగని తెలుగు వారు బాగా జరుపుకుంటారు. అయితే , ఈ రోజున గోమాతలకు , ఇంకా ఇతర జంతువులకు ప్రజలు సేవలు చేస్తుంటారు. 

దేవతలందరు కూడా గోమాతలో ఉంటారు కాబట్టి 12 రాశుల వారు తమ నవగ్రహ దోషాలను తొలగించుకునేందుకు గోమాతకు పదార్దాలను తినిపించినట్లైతే ఫలితం ఉంటుంది. అలాగే , కాలభైరవుడు అనగా ఎంతో విశ్వాసం గల జంతువైన శునకముకు కూడా కనుమ రోజు కొన్ని పదార్థాలను తినిపిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అయితే ఆ కొన్ని పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

కనుమ పండుగ రోజు ఉదయం గాని సాయంత్రం గాని... గోధుమపిండి , బెల్లం , ఓ చెంచా పాలతో 5 గాని , 7 గాని , 11 గానీ రొట్టెలను నెయ్యితో కాల్చి తయారుచేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. అయితే , ఈ రొట్టెలను మగవారు కానీ ఆడవారు కానీ ఇద్దరిలో ఎవరైనా చేయొచ్చు. నవగ్రహ దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆడవారు అయితే రొట్టెలను కాల్చేటప్పుడు ఎడమచేతిని ఎక్కువగా వాడాలి.. మగవారు అయితే కుడిచేతిని ఎక్కువగా వాడాలి. రొట్టెలను తయారు చేసిన తర్వాత...

గోమాత చుట్టూ ప్రదక్షణలు చేసి ఆ తర్వాత గోమాత యొక్క కుడికాలు వద్ద ఉన్న దూలిని తీసుకుని నుదుటన బొట్టు పెట్టుకోవాలి. తరువాత తయారు చేసినటువంటి రొట్టెలను గోమాతకు తినిపించాలి. ఇలా గోమాతకు సేవలు చేస్తే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇకపోతే కాలభైరవుడైన శునకముకు ఎలా తినిపించాలంటే..

మీరు 7 , 11 లేదా 19 రొట్టెలను తయారు చేసుకోవాలి. అయితే వీటిని గోధుమపిండి , కొద్దీగా బెల్లం , కొన్ని తేనె చుక్కలు , కొంచెం పాలు లతో తయారు చేయాలి. ఈ రొట్టెలను కాల్చేటప్పుడు మీరు ఆవాల నూనె ను వాడటం మంచిది. కాలసర్ప దోషం , పంచమ రాహు , అష్టమ రాహు , రాహు కేతువుల పీడలు తొలగించుకోవడానికి ఆవాల నూనె ను వాడటం మంచిది.

అయితే ఈ తయారు చేసినటువంటి రొట్టెలను శునకాలకి ఎలా సమర్పించాలి అంటే.. మొదటిగా మీ వీధి లో ఉన్నటువంటి శునకాల వద్దకు వెళ్ళాలి. ఒకవేళ మీరు శునకాన్ని పెంచినా.. వాటికి మాత్రం మీరు ఈ రొట్టెలను తినిపించ కూడదు.

కేవలం వీధిలో ఉంటున్న శునకాలకి మాత్రమే రొట్టాలను తినిపించాలి. రొట్టెల తినిపించేటప్పుడు మొదటిగా.. మీ కుడి చేతితో రొట్టె ముక్కలు చేసి ఎడమచేత్తో శునకాల కి అందించాలి. శునకాలు రొట్టెలను తిన్న తర్వాత... మీ ఇంటికి వెళ్లి మట్టి కుందిలలో దీపారాధన చేసి మీ మనసులోని కోరికను కోరుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా దోషాలు ఉంటే అది తొలగిపోవాలని దీపారాధన ముందు మీరు కోరుకొనవలేను.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. గీతోపనిషత్తు -307 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 20 - 4 📚*
 
*🍀 20-4. కోరికలు - కోరిక ఏదైన అది బంధమునకు మార్గమే యగును. భోగములం దాసక్తి జీవుని భోగపరునిగ బంధించును. సకామభక్తులు పూర్ణ వికాసము కలిగిన వారు కాదు. వీరు పునరావృత్తి మార్గమున జనన మరణ సంస్కార చక్రమునందు తిరుగాడుచు నుందురు. వారి కోరికలచే వారిని వారే బంధించుకొను చుందురు. ఎన్ని జన్మలెత్తినను కామములను పూరించుట సాధ్యము కాని పని. కనుక జనన మరణములను అనుభవించుచునే యుందురు. 🍀*

*20. త్రైవిద్యా మాం సోమపా: పూతపాపా యథైరిష్ట్యా స్వర్గతిం ప్రార్థయంతే |*
*పుణ్యమాసాద్య సురేంద్రలోక మశ్నంతి దివ్యానివి దేవభోగాన్ ||*

*తాత్పర్యము : స్వర్గప్రాప్తిని వేడుకొనుచు, మూడు వేదము లధ్యయనము చేయువారు, సోమపానము కొరకై సోమయజ్ఞము చేసినవారు, పుణ్యకర్మలు చేసినవారు, పై విధముగ నన్ను పూజించినవారు సురేంద్ర లోకమును చేరి, దివ్యమగు భోగములను అనుభవించు చున్నారు.*

*వివరణము : ఈ శ్లోకమున సకామ కర్మమార్గమునకు కూడ తానే అధిపతినని తెలుపుచున్నాడు. ఇట్టి సకామభక్తులు పూర్ణ వికాసము కలిగిన వారు కాదు. వీరు పునరావృత్తి మార్గమున జనన మరణ సంస్కార చక్రమునందు తిరుగాడుచు నుందురు. వారి కోరికలచే వారిని వారే బంధించుకొను చుందురు.*

*కోరిక ఏదైన అది బంధమునకు మార్గమే యగును. ఇనుప సంకెళ్ళతో బంధించినను, బంగారు సంకెళ్ళతో బంధింప బడినను, బంధము బంధమే యగును. భోగము లందాసక్తి జీవుని భోగపరునిగ బంధించును.*

*భోగములు రోగములకు కూడ హేతువు లగుచుండును. భోగ రోగముల నడుమ జీవితము సాగుచుండును. ఎన్ని జన్మలెత్తినను కామములను పూరించుట సాధ్యము కాని పని. చిల్లుకుండలో ఎంతనీరు పోసినను అది నిండుకుండ కాజాలదు. అయినప్పటికిని ఈ జ్ఞానము కలుగువరకు జీవులు కోరుచునే యుందురు. కనుక జనన మరణణము లనుభవించుచునే యుందురు. కామ్యకర్మ జీవునకు పరిష్కారము కాదు. నిష్కామకర్మయే పరిష్కారము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 505 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 41

*🌻. వివాహ మండపము - 5 🌻*

నారదడిట్లు పలికెను-

దేవ దేవా! మహాదేవా! నా శుభవచనమును వినుము. ఓ నాథా! వివాహము నందు విఘ్నము కలుగుననే భయము ఏమియూ లేదు (42). హిమవంతుడు కన్యకను నీకిచ్చుట నిశ్చయము. ఈ పర్వతులు నిన్ను దోడ్కొని వెళ్లుటకై వచ్చి యున్నారు. సంశయము లేదు (43). ఓ సర్వజ్ఞా! కాని దేవతలను మోమింపజేసి కుతూహలమును కలిగించుట కొరకై అద్భుతమగు మాయ రచింపబడినది. విఘ్నము కలిగే ప్రసక్తియే లేదు (44). హే విభూ! హిమవంతుని ఆజ్ఞచే ఆతని గృహమునందు మహామాయావి యగు విశ్వకర్మ అనేకములగు అద్భుతములతో నిండియున్న విచిత్ర మగు మండపమును నిర్మించెను (45).

దేవ సమాజమంతయూ అచట మోహమును కలిగించు రీతిలో నిర్మింపబడనది. నేను దానిని చూచి ఆ మాయచే విమోహితుడనై విస్మయమును పొందితిని (46). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

వత్సా! లోకాచారములను ప్రవర్తిల్ల జేయు శంభు ప్రభుడు ఆ మాటను విని నవ్వి విష్ణువు మొదలగు దేవతలందరితో నిట్లనెను (47). 

ఈశ్వరుడిట్లు పలికెను-

హిమవంతుడు నాకు కన్యను ఇచ్చే పక్షంలో మాయతో నాకు పనియేమి? ఓ విష్ణూ! నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుము (48). ఓ బ్రహ్మా! ఇంద్రా! మునులారా! దేవతలారా! సత్యమును పలుకుడు. పర్వతరాజు కన్యకు ఇచ్చే పక్షంలో నాకు మాయతో పని యేమి? (49) ఉపాయమేదైన ఫలమును సాధించవలెనని నీతివేత్తలగు పండితులు చెప్పెదరు. కావున మీరందరు విష్ణువును ముందిడు కొని వివాహకార్యము కొరకు శీఘ్రమే ముందుకుసాగుడు (50).

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ విధముగా దేవతలతో సంభాషించు చున్న ఆ శంభుడు అపుడు ప్రాకృతమానవుడు వలె మన్మథునకు వశుడైనట్లుండెను (51). అపుడు శంభుని ఆజ్ఞచే విష్ణువు మొదలగు దేవతలు, ఋషులు, మరియు సిద్ధులు మోహజనితమగు భ్రమను విడనాడిరి (52). ఓ మునీ! నిన్ను, ఆ పర్వతులను ముందిడు కొని విస్మ యావిష్టులైన ఆ దేవతలు మొదలగు వారు పరమాశ్చర్యకరమగు హిమవంతుని మందిరమునకు అపుడు వెళ్లిరి (53). తరువాత విష్ణువు మొదలగు వారితో, మరియు ఆనందముతో కూడియున్న తన గణములతో కూడి ప్రహర్షితుడైన శివుడు హిమవన్నగర సమీపమునకు వచ్చెను (54).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో వివాహమండప వర్ణనమనే నలభై ఒకటవ అధ్యాయము ముగిసినది (41). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 135 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : పద్మావతి దేవి*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. ధ్యానము - విశిష్టత -2 🌻*

*సృష్టిని నారాయణుని అడుగు జాడలుగ స్మరించువారికి అదే పరబ్రహ్మము కనుమూసినను, కనుతెరచినను తానే అయి నిత్యముగ భాసించును.*

*"అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః", అని వేదమంత్రములు భాగవత మార్గమును గూర్చి అభయముద్ర పట్టియున్నవి.*

*ఇట్లు ఇంద్రియములను , మనస్సును సొంతముగా దమించుకొని హృదయమున పరబ్రహ్మము దుకాణము పెట్టుకొనువారి మార్గము కన్న అట్లు సాధన చేయునట్టి తన్నే అంతర్యామికి‌ సమర్పణ చేసి శరణాగతి చెందు మార్గము శాశ్వతానందమిచ్చును.*

✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Osho Daily Meditations - 124 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 124. FAITH AND TRUST 🍀*

*🕉 Faith is a dead trust. In fact, you don’t crust but you still believe, that's what faith is. But trust is something alive. It is just like love. 🕉*
 
*All faiths have lost what you call prayer, they have lost what you call meditation. They have forgotten the whole language of ecstasy. They have all become intellectuals: creeds, dogmas, systems. There are many words, but the meaning is missing, the significance is lost. And that is natural. It has to be so. When a Master is alive, religion walks on the earth, and those Few who are fortunate enough to recognize him, to walk a few steps with him, will be transformed. It is not that you become a religious that's superficial-but something of Divine enters you. Something transpires between you and Divine.*

*You become prayerful. You have different eyes to see with, a different heart beating. Everything remains the same, but you change. The trees are green but now in a different way. The greenery has become alive. You can almost touch the life surrounding you. But once Master is gone, whatever he has said becomes formulated, systematized. Then people become Religious intellectually, but the living God is no longer present. Faith is a dead trust. In fact, you don't trust but you still believe, that's what faith is. But trust is something alive. It is just like love.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 183 / Sri Lalita Sahasranamavali - Meaning - 183 🌹*
*🌻. మంత్రము - అర్ధం 🌻*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 183. శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా ।*
*ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః ॥ 183 ॥ 🍀*

🍀 998. శ్రీశివా : 
సుభములను కల్గినది

🍀 999. శివశక్తైక్యరూపిణీ : 
శివశక్తులకు ఏకమైన రూపము కలిగినది

🍀 1000. లలితాంబికా : 
లలితానామమునా ప్రసిద్ధమైన జగన్మాత 

*🌻 ఏవం శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రం సంపూర్ణం . 🌻*

*🍀 ॥ ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే, శ్రీలలితారహస్యనామ శ్రీ లలితా రహస్యనామ సాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోఽధ్యాయః ॥ 🍀*

*సమాప్తం...* 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 183 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 183. Shri shiva shivashaktyaikya rupini lalitanbika*
*Yvam shri lalita devya namnam sahasrakam jaguh ॥ 183 ॥ 🌻*

🌻 998 ) Sri shivaa -   
She who is the eternal peace

🌻 999 ) Shiva shakthaikya roopini -   
She who is unification of Shiva and Shakthi

🌻 1000 ) Lalithambika -   
The easily approachable mother

*🌻 Sree Lalitha Sahasranama Stotram Samaptam. 🌻🙏*

*The End...*
🌹 🌹 🌹 🌹 🌹
 #లలితాసహస్రనామములు #LalithaSahasranamam
 #PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/  