1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 13, సోమవారం, డిసెంబర్ 2021 ఇందు వాసరే 🌹2) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 290 🌹
3) 🌹. శివ మహా పురాణము - 489🌹
4) 🌹 వివేక చూడామణి - 166 / Viveka Chudamani - 166🌹
5)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -118🌹
6) 🌹 Osho Daily Meditations - 107 🌹
7) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 166 / Sri Lalitha Sahasra Namaavali - Meaning - 166🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 13, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. రుద్ర నమక స్తోత్రం -2 🍀*
*ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!*
*శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!*
*శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!*
*యా తే రుద్రశివా నిత్యం సర్వంగల సాధనమ్!!4!!*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: శుక్ల-దశమి 21:34:39
వరకు తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: రేవతి 26:07:08
వరకు తదుపరి అశ్విని
యోగం: వరియాన 29:55:01
వరకు తదుపరి పరిఘ
కరణం: తైతిల 08:44:42 వరకు
వర్జ్యం: -
దుర్ముహూర్తం: 12:32:23 - 13:16:49
మరియు 14:45:40 - 15:30:06
రాహు కాలం: 08:00:16 - 09:23:35
గుళిక కాలం: 13:33:28 - 14:56:46
యమ గండం: 10:46:52 - 12:10:10
అభిజిత్ ముహూర్తం: 11:48 - 12:32
అమృత కాలం: -
సూర్యోదయం: 06:36:58
సూర్యాస్తమయం: 17:43:22
వైదిక సూర్యోదయం: 06:40:51
వైదిక సూర్యాస్తమయం: 17:39:28
చంద్రోదయం: 13:54:42
చంద్రాస్తమయం: 01:39:04
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మీనం
మతంగ యోగం - అశ్వ లాభం
26:07:08 వరకు తదుపరి
రాక్షస యోగం - మిత్ర కలహం
పండుగలు : లేవు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు -290 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚*
శ్లోకము 17-1
*🍀 17-1. ప్రణవ స్వరూపుడు - ఈ జగత్తు పుట్టించిన సృష్టికర్త యందు నేనే యున్నాను. అట్లే నిన్ను పుట్టించిన నీ తండ్రి యందు నీ నేనే యున్నాను. నిన్ను ధరించి, భరించిన తల్లి యందు కూడ నేనే యున్నాను. సాధకుని యందు ఇది స్థిరపడవలెను. ఇట్లు స్థిరపడక ఎన్ని తెలిసినను ఒకటే. అజ్ఞానము మిగులును. ఏమి చూచినను, ఏమి విన్నను, ఏమి స్పృశించినను, ఏమి రుచి చూచినను, ఏమి వాసన చూచినను, ఏమి భావించినను, ఏ గ్రంథమందలి విజ్ఞానమైనను, ఏ శాస్త్రమైనను, అన్నిటి యందు తెలియవలసినది ఈశ్వరుడే. ఇంతకన్న ఏమి చెప్పవలెను. 🍀*
పితా హమస్య జగతో మాతా ధాతా పితామహః |
వేద్యం పవిత్ర మోంకార ఋక్సామ యజురేవ చ || 17
*తాత్పర్యము : ఈ జగత్తునకు తండ్రిని నేనే. తల్లి, తండ్రి, తాత కూడ నేనే. ఓంకారము నేనే. అన్నిటి యందు తెలిసికొనదగినది నేనే. పవిత్ర పదార్థముగ నున్నది నేనే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము నేనే.*
*వివరణము : అన్నియు నేనే. అంతయు నేనే అని తెలిపిన దైవము ముందు తెలిపిన ఉదాహరణలకు తోడుగ మరికొన్ని ఉదాహరణలు తెలుపుచున్నాడు. ఈ జగత్తు పుట్టించిన సృష్టికర్త యందు నేనే యున్నాను. అట్లే నిన్ను పుట్టించిన నీ తండ్రి యందు నీ నేనే యున్నాను. నిన్ను ధరించి, భరించిన తల్లి యందు కూడ నేనే యున్నాను. నీ తల్లిని తండ్రిని పుట్టించిన పితామహుడు, నీ మాతామహుల యందు కూడ నేనే యున్నాను. అందు బంధుత్వమున వీరు ముఖ్యులు కనుక వీరిని ఉదాహరణముగ తెలిపినాడు.*
*అట్లే ఇతర బంధువులు, మిత్రులు, జనులు, జంతువులు అన్నిటియందు తానే యున్నాడని తెలియవలెను. శత్రువు రూపమున కూడ మూలమున తానే యున్నాడు. భార్య, సంతతి ఎన్ని సంబంధము లున్నవో అన్నియు తానే. సాధకుని యందు ఇది స్థిరపడవలెను. ఇట్లు స్థిరపడక ఎన్ని తెలిసినను ఒకటే. అజ్ఞానము మిగులును.*
*ఏమి చూచినను, ఏమి విన్నను, ఏమి స్పృశించినను, ఏమి రుచి చూచినను, ఏమి వాసన చూచినను, ఏమి భావించినను, ఏ గ్రంథమందలి విజ్ఞానమైనను, ఏ శాస్త్రమైనను, అన్నిటి యందు తెలియవలసినది ఈశ్వరుడే. ఇంతకన్న ఏమి చెప్పవలెను. అయినను తెలియజెప్పు చున్నాడు.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 488 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴*
అధ్యాయము - 38
*🌻. వివాహ మండపము - 2 🌻*
కొన్నిచోట్ల కృత్రిమ స్త్రీలు కృత్రిమ పురుషులతో కలిసి నృత్యము చేయుచుండగా ఎందరో కృత్రిమ ప్రేక్షకులు పరవశులై తిలకించుచుండిరి (12).మరియు సుందరాకారులగు ద్వారపాలకులు చేతులతో ధనస్సులను ఎక్కుపెట్టి యుండిరి. అవి బొమ్మలే యైననూ ప్రాణము గలవి యన్నట్లుండెను (13). అద్భుతమగు మహాలక్ష్మీ విగ్రహము ద్వారమునందు నిర్మింపబడెను. సర్వలక్షణములతో విలసిల్లు ఆ విగ్రహము క్షీరసముద్రము నుండి ఆవిర్భవించిన లక్ష్మీదేవియా అన్నట్లుండెను (14). అలంకరింపబడిన కృత్రిమ గజములు యధార్థమగు ఏనుగులను పోలియుండెను. గుర్రములు రౌతులతో, గజములు మావటీండ్రతో కూడి యుండెను (15).
కృత్రిమమగు రథములను కృత్రిమసారథులు తోలుచుండిరి. ఇతర వాహనములు కూడ అటులనే అమర్చబడినవి. మరియు కృత్రిమమగు సైనిక దళములు కూడ ఉండెను. ఈ దృశ్యములన్నియూ మహాశ్చర్యమును కలిగించుచుండెను (16). ఓ మునీ! దేవతలను, మునులను మోహింపజేయుటకై విశ్వకర్మ ఉత్సాహముతో ఇట్టి దృశ్యములను నిర్మించెను (17).
ఓ మహర్షీ! మహాద్వారమునందు ఒక కృత్రిమ నంది నిలబడియుండెను. స్వచ్ఛమగు స్ఫటికము వలె వెలుగొందు ఆ బొమ్మ యథార్థమగు నందివలెనే యుండెను (18). ఆ ద్వారమునకు పైన రత్నములతో, స్వచ్ఛమగు చిగుళ్లతో, మరియు పుష్పములతో అలంకరింపబడిన గొప్ప దివ్యమైన రత్నములతో ప్రకాశించే కృత్రిమ పుష్పక విమానము దేవతలతో గూడి మిక్కిలి శోభిల్లెను (19).
ఎడమవైపు శుద్ధ కాషాయ వర్ణము గల రెండు ఏనుగులు నిర్మింపబడెను. నాల్గు దంతములతో గొప్పగా ప్రకాశించు ఆ ఏనుగులు అరువది సంవత్సరములు వయసు గలవా యున్నట్లు భాసించెను. అవి పరస్పరము స్పృశించుచున్నట్లు భాసించెను (20). మరియు విశ్వకర్మ సూర్యుని వలె ప్రకాశించు రెండు గుర్రములను నిర్మించెను. చామరములచే, మరియు దివ్యాభరణములచే అలంకరింపబడిన ఆ దివ్యాశ్వములు గొప్పగా ప్రకాశించెను (21).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 166 / Viveka Chudamani - 166 🌹*
*✍️ రచన : పేర్నేటి గంగాధర రావు*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍀. 32. నేను బ్రహ్మాన్ని తెలుసుకొన్నవాడిని -13 🍀*
*542. ఒక పర్యాయము తెలివి తక్కువ వానిగా, ఇంకొక పర్యాయము యోగి వలె, కొన్ని సార్లు రాజువలె ఉజ్వలముగా, కొన్ని సార్లు సంచారము చేయుచు, కొన్ని సార్లు కొండ శిలువవలె కదలక పడివుండి ఆహారము లభించినపుడే తింటూ స్థబ్దముగా పడివుండుట, కొన్ని సార్లు దయా సాగరునిగా కనిపిస్తూ, కొన్ని సార్లు గౌరవించబడుతూ, మరికొన్ని సార్లు అవమానించబడుతూ, ఇంకొన్ని సార్లు ఎవరికి తెలియనివాడిగా ఇలా ఆత్మ జ్ఞాని అయిన వ్యక్తి జీవిస్తూ ఎల్లపుడు బ్రహ్మానంద స్థితిలో స్థితుడై ఉంటాడు.*
*543. బ్రహ్మజ్ఞాని తనకు సంపదలు లేనప్పటికి ఎపుడూ తృప్తితో జీవిస్తుంటాడు. నిస్సహాయుడైనప్పటికి శక్తి వంతునిగా బాహ్య వస్తు సముదాయమును అనుభవించుచూ, శాశ్వతముగా తృప్తితో అతడు ఇతరులకు ఆదర్శ ప్రాయుడు కాకపోయినను అందరిని సమానముగా సమ దృష్టితో చూస్తుంటాడు.*
*544. అతడు ఎపుడూ ఏదో ఒకటి చేస్తుంటాడు. అయినా ఏమి చేయని వాడిలా ఉంటాడు. గత జన్మల ఫలితాలు అనుభవిస్తున్నప్పటికి, వాటికి అతీతముగా, తనకు శరీరము ఉన్నప్పటికి దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వకుండా; తాను పరిమితుడైనప్పటికి అన్నింటిలో తానే అయి ఉంటాడు. ఆత్మ దర్శకుని వలె జీవిస్తుంటాడు.*
*సశేషం....*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 VIVEKA CHUDAMANI - 166 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -13🌻*
*542. Sometimes a fool, sometimes a sage, sometimes possessed of regal splendour; sometimes wandering, sometimes behaving like a motionless python, sometimes wearing a benignant expression; sometimes honoured, sometimes insulted, sometimes unknown – thus lives the man of realisation, ever happy with Supreme Bliss.*
*543. Though without riches, yet ever content; though helpless, yet very powerful, though not enjoying the sense-objects, yet eternally satisfied; though without an exemplar, yet looking upon all with an eye of equality.*
*544. Though doing, yet inactive; though experiencing fruits of past actions, yet untouched by them; though possessed of a body, yet without identification with it; though limited, yet omnipresent is he.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 166 🌹*
*✍️ Sri Adi Shankaracharya, Swami Madhavananda*
*📚 Prasad Bharadwaj*
*🌻 32. I am the one who knows Brahman -13🌻*
*542. Sometimes a fool, sometimes a sage, sometimes possessed of regal splendour; sometimes wandering, sometimes behaving like a motionless python, sometimes wearing a benignant expression; sometimes honoured, sometimes insulted, sometimes unknown – thus lives the man of realisation, ever happy with Supreme Bliss.*
*543. Though without riches, yet ever content; though helpless, yet very powerful, though not enjoying the sense-objects, yet eternally satisfied; though without an exemplar, yet looking upon all with an eye of equality.*
*544. Though doing, yet inactive; though experiencing fruits of past actions, yet untouched by them; though possessed of a body, yet without identification with it; though limited, yet omnipresent is he.*
*Continues....*
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
https://t.me/vivekchudamani
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 118 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*సంకలనము : వేణుమాధవ్*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 3 🌻*
*లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి. కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు.*
*కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు. కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు. అలా కాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంత కాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించే వారు విష్ణు ధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు.*
....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Osho Daily Meditations - 107 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 107. OUTLANDISH LOVE 🍀*
*🕉 Only fools know what love is, because love is a kind if madness 🕉*
*Perhaps you have never reached the peaks of love, and you have a great longing for it. You have been in love, but it has never been outlandish, it has never been fantastic, it has never been far out. It has been Iukewarm. It was not like a fire that consumes. You were in it, but you were not destroyed by it; you managed yourself. You have been clever in it, you have not been a fool. And only fools know what love is, because love is a kind of madness.*
*If you are too clever, you can allow only so far and then you stop. Your whole mind says, "Now this is too much. Going beyond this point is dangerous." Love knows only one experience that is satisfying, and that is to go to the very peak, to the ultimate peak, even once. Then there is a great change in energy. To know love once at the climax is enough; then there is no need to go into it again and again. The experience simply changes your whole being. So be less clever. Forget about cleverness; be more muddle-headed!*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 166 / Sri Lalita Sahasranamavali - Meaning - 166 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀 166. విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ ।*
*అయోని ర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ ॥ 166 ॥ 🍀*
🍀 887. విశ్వగ్రాసా :
విశ్వమే ఆహారముగా కలిగినది
🍀 888. విద్రుమాభా :
పగడము వలె ఎర్రనైన కంతి కలిగినది
🍀 889. వైష్ణవీ :
వైష్ణవీ దేవి రూపమున అవతరించినది
🍀 890. విష్ణురూపిణీ :
విష్ణురూపమున జగత్తును రక్షించునది
🍀 891. అయోని: :
పుట్టుక లేనిది
🍀 892. యోనినిలయా :
సమస్త సృష్టి కి జన్మస్థానము
🍀 893. కూటస్థా :
మూలకారణ శక్తి
🍀 894. కులరూపిణీ :
కుండలినీ రూపిణి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 166 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 166. Vishvagrasa vidrumabha vaishnavi vishnuruini*
*Ayoniryoninilaya kulasdha kularupini ॥ 166 ॥ 🌻*
🌻 887 ) Viswa grasa -
She who eats the universe in one handful
🌻 888 ) Vidhrumabha -
She who has the luster of coral
🌻 889 ) Vaishnavi -
She who is the power of Vishnu
🌻 890 ) Vishnu roopini -
She who is Vishnu
🌻 891 ) Ayoni -
She who does not have a cause or She who is not born
🌻 892 ) Yoni nilaya -
She who is the cause and source of everything
🌻 893 ) Kootastha -
She who is stable
🌻 894 ) Kula roopini -
She who is personification of culture
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామములు #LalithaSahasranam
#PrasadBhardwaj
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://mymandir.page.link/wdh7G
https://t.me/ChaitanyaVijnanam
www.facebook.com/groups/chaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మనలో ఒక వైపు లౌకిక భావాలు, మరో వైపు పరిశుద్ధమైన ఆత్మస్థితి ఒకే నాణానికి రెండు ముఖాల్లా ఉన్నాయి. ఈ రెండింటికి దూరమే లేదు. అలాగే ఇప్పుడు లౌకిక భావాలతో ఉన్న మనకు ఆత్మస్థితి ఎంతో దూరంలో లేదు. మనం దైవానికి భావదూరంలోనే ఉన్నాం. అనుభవ సమయంలో ఎవరికైనా నేను అన్న భావమే ఉండటంలేదు. ఆలోచనలోనే అది వస్తుంది ! 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*