శ్రీరమణీయం -(114)

శ్రీరమణీయం -(114)


"దేహంపై మనస్సుకు మమకారం లేకుండా ఎలా ఉంటుంది ?"


అశాశ్వతమైన దేహంపైనా మన మమకారం ? తనదే అయిన ఆత్మను వదిలి, తనది కాని దేహంకోసం ప్రాకులాడే మనసు, 'అయినవాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో 'వడ్డిస్తుంది. అహంకారంతో ఈ దేహానికి, కుటుంబానికి, సమాజానికి ఎంత సేవ చేసినా తృప్తి, సంపూర్ణత ఉండవు. అదే తన వెనుకవున్న దైవాన్ని తెలుసుకున్న మనసు తాను నిమిత్తమాత్రమేనని గ్రహించి అహంకార రహితస్థితిలో చేసే సేవ నిజమైన సేవ అవుతుంది. ఆ సేవకు సంపూర్ణత, సార్థకత ఉంటుంది. మనం ఎంతో మమకారంతో పెంచుకున్న ఈ దేహం మరొకరు వదిలేస్తేనే మన వాడుకుంటున్నామని తెలిస్తే గాని దానిపై వ్యామోహం తగ్గదు. ఏ ప్రాణికైనా మరణాంతరం దేహం పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే. తిరిగి మరో కొత్త దేహం ఏర్పడేది కూడా అదే పంచభూతాల నుండే ! అంటే అప్పటికే ఎవరో వాడేసిన దేహం తాలూకా పంచభూతాలతోనే మనం శరీరాన్ని ధరిస్తున్నామనే కదా ! తిరిగి కొంతకాలానికి ఈ దేహానికి మరణం తప్పదు కదా !! అలాంటి దేహంపైనా మన మమకారం !!!

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'దైవానికి, దేహానికి మనసే వారధి !'-

రమణ మహర్షి ‘నేనెవరు?’

రమణ మహర్షి ‘నేనెవరు?’

ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి చెప్పి, దాని లక్షణాల్ని విశదీకరుస్తున్నారు. ఈ ఆత్మ తత్త్వం గురించి మన మన తండ్రి తండ్రి తాతల వయస్కులై వారి మధ్యన ఉండి మోక్షాన్ని బడసిన రమణ మహర్షి ‘నేనెవడను?’ అన్న చిన్న పుస్తకంలో ఇలా అంటారు. ఇందులో ఉన్న ఏడవ సూచిలోని విషయం కొంచెం పెద్దదని పించిన ఆయన ప్రముఖంగా బోధించి, ఎందరికో మార్గాన్ని చూపింది:

 1.    మనస్సు అణిగిపోయిన నిద్రలో ప్రతిరోజు అనుభవించే తనకు స్వాభావికమైన సుఖాన్ని పొందాలంటే తనను తాను తెలుసుకోవాలి. ఆ జ్ఞానం పొందాలంటే ‘నేనెవడను?’ అనే జ్ఞానవిచారణ ముఖ్యసాధనం.

2.    ‘నేనెవడను అన్నది తెలుసుకుంటే సత్‌-చిత్‌-ఆనందం ఏమిటో తెలుసుకునట్లే. . ‘తెలుసుకో’డానికి పరికరం, అన్ని పనులకు ఆధారం అయిన మనస్సు అణగిపోతే చూడబడే ప్రపంచం అణగిపోతుంది. అనగా కనబడుతోందో అట్టి ఆత్మయొక్క దర్శనం లభించదు.

3.    మనస్సు ఆత్మలో నెలకొన్న ఒక అతిశయ శక్తి. అదే తలపులను కల్పించేది.  ఆలోచనలు లేని మనసంటూ ప్రత్యేక వస్తువు లేదు. కాబట్టి ఆలోచనలే మనస్సు యొక్క స్వరూపం. ఆలోచనలకంటే వేరుగా ప్రపంచమనేదీ లేదు. నిద్రలో ఆలోచనలూ లేవు, ప్రపంచం లేదు. జాగ్రత్‌ (మెలకువ), స్వప్నము (కల)లలో తలపులూ ఉన్నాయి, ప్రపంచమూ ఉంది.

4.    మనస్సు తనలోంచి ఇంత ప్రపంచాన్ని బయటకు నిర్మించి మరల తనలోనికి విలీనం చేసుకుంటుంది. మనస్సు ఆత్మను విడిచి బయటకు పోయినపుడల్లా ప్రపంచం కనబడుతుంది. అలా, ప్రపంచము తోచినపుడు ఆత్మ కానరాదు. ఆత్మ అనుభవమైనపుడు ప్రపంచము కనబడదు.

5.    నస్సుయొక్క స్వరూపాన్ని వదలక అన్వేషిస్తే మనస్సు అణగారి, ఆత్మగా మిగులుతుంది.

6.    మనసెప్పుడూ ఒక స్థూలవస్తువు (శరీరం)ను ఆశ్రయించి ఉంటుంది. అది ఒంటరిగా మనలేదు. ”నేను-నేను” అని స్మరించినా అక్కడికి చేరుకోవచ్చు.

7.    ‘నేనెవడను’ అనే విచారణ చేతనే మనస్సు అణిగేది. ఈ విచారణ ఇతర ఆలోచనలను నాశనం చేసి చితిమంటకు వాడే కట్టెవలె తానుకూడా నశిస్తుంది. ఆత్మ సాక్షాత్కరిస్తుంది. ఇతర తలపులెన్ని తోచినా వాటిని పట్టించుకోక, ఒడుపుగా  ”అవి కలిగినది ఎవరికి?” అని విచారించాలి. ఎన్ని తలపులు పుడితే మనకేం, ఒక్కొక్క తలపును పట్టుకొని, ”ఇది ఎవరికి కలిగింది?” అని విచారిస్తే, ”నాకు అని తోస్తుంది. అప్పుడు ”నేను ఎవరు” అని మరల మరల ప్రశ్నించగా మనస్సు తన పుట్టుక స్థానానికి మరలుతుంది. పుట్టిన ఆలోచన కూడా అణగిపోతుంది. ఇలా అభ్యాసం చేయగా, చేయగా మనస్సుకు తన జన్మస్థానంలో నిలిచిఉండగలిగే శక్తి పెరుగుతుంది. సూక్ష్మమైన మనస్సు మెదడు, ఇంద్రియాల ద్వారా బహిర్గతమై, బయటకు పోయేటపుడు స్థూలమైన నామరూపాలు అనుభవమౌతాయి. మనస్సు స్వస్థానమైన హృదయంలో నిలకడ చెంది ఉన్నపుడు నామరూపాలు తోచట్లేదు. మనస్సునిలా బయటకు పోనీక డెందమందు నిలిపి ఉంచుటనే ‘అహం-ముఖము లేక ‘అంతర్ముఖము’ అంటారు. మనస్సును ఎదలోంచి బాహ్యానికి పోనిచ్చుటను ‘బహిర్ముఖము’ అంటారు. మనస్సు ఎడదలో కుదురుగా ఉంటే అన్ని తలపులకు మూలమైన ‘నేను’ పోయి, ఎప్పుడూ ఉన్నట్టుండే ‘తాను’ తోస్తుంది. ‘నేను’ అనే తోపకం సుంతైనా లేని స్థితి, అనుభూతియే స్వరూపము, ఆత్మ.

8.    మనస్సును శాశ్వతంగా అణగార్చటానికి విచారణకంటె వేరుమార్గాలు లేవు. ఒకవేళ ఇతర ఉపాయాలచేత అణగినా, మనస్సు అణిగినట్లే అణిగి, తిరిగి లేచి కూర్చుంటుంది.

9.    ప్రాణాయామంచేత మనస్సును శాంతపరచవచ్చు. అయితే ఈ కుదురు ప్రాణం నిరోధమై ఉన్నంతసేపే. నిరోధం సడలి, ప్రాణం చలించగానే మనస్సు కూడా తిరుగాడటం మొదలెడుతుంది.

10.    ప్రాణాయామంలాగే దేవతామూర్తి (రూప) ధ్యానం, మంత్రజపం, ఆహార నియమం మొదలైనవి మనస్సును తాత్కాలికంగా నియమిస్తాయి. వీటివల్ల మనస్సుకు ఏకాగ్రత లభిస్తుంది. ఏకాగ్ర చిత్తానికి ఆత్మవిచారం సులభం.

11.    నియమాలు అన్నిటిలోకి మితసాత్త్విక ఆహారనియతి శ్రేష్ఠమైనదై, మనస్సుయొక్క సాత్త్విక సత్తువను పెంపొందించి ఆత్మవిచారానికి తోడ్పడుతుంది.

12.    ఒకడు ఎంత పాపి అయినాకానీ, స్వరూప ధ్యానంలో పట్టుదల కలవాడైతే అతడు నిశ్చయంగా కడతేరతాడు.

13.    ఇతరులెంత దుర్మార్గులుగా కనబడినా, వారిని ద్వేషింపరాదు.

14.    ప్రాపంచిక విషయాలలోను, ముఖ్యంగా ఇతరుల వ్యవహారాలలోను మనస్సును వీలైనంతగా పోనీయరాదు.

15.    ఇతరులకు ఇచ్చేవన్నీ నిజానికి ఇచ్చుకునేది తనకే, ఈ సత్యం తెలిస్తే ఇతరులకు ఈయని వారెవరు?

16.    ‘నేను’ లేస్తే సమస్తం లేస్తుంది. ‘నేను’ అణగారితే సకలం శాంతిస్తుంది. మనం ఎంతగా అణకువతో ప్రవర్తిస్తామో, అంతకంత శుభమే జరుగుతుంది. మనస్సు వశమైతే ఎక్కడైనా బతకచ్చు.

17.    యథార్థంగా నిలిచి ఉండేది ఆత్మ ఒక్కటే. జగత్తు (ప్రపంచం), జీవుడు, ఈశ్వరుడు ముత్యపుచిప్పలో వెండి కనబడినట్లే, ఆత్మస్వరూపంలో కల్పితాలు. ఈ మూడు ఒకేసారి ప్రకటమై, ఏకకాలంలో మరుగవుతున్నాయి. స్వరూపమే ప్రపంచం, స్వరూపమే నేను, స్వరూపమే దేవుడు – అంతా శివస్వరూపమైన ఆత్మయే.

18.    ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (తలపులు, ఆలోచనలు) పుట్టుటకు కొంచెమైనా తావీయక, ఆత్మనిష్ఠాపరుడై ఉండటమే తనను తాను దేవునికి అర్పించుకోవడం. ఈశ్వరునిపై ఎంత భారం మోపినా ఆయన దానిని భరిస్తాడు. సర్వకార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్న కారణంగా దానికి మనం లోబడి వుండాలి. అంతేకానీ, ‘అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి’ అంటూ ప్రణాళికలు దేనికి? రైలుబండి సామానులన్నీ మోస్తుందని తెలిసికూడా, ప్రయాణీకులమై ఉండి, మన చిన్నమూటను కూడా అందులో పడవేసి హాయిగా ఉండక దానిని నెత్తికెత్తుకుని ఈసురోమనడం ఎందుకు?

భగవంతుని తత్వం

🌸🌸 భగవంతుని తత్వం🌸🌸

భగవంతుని తత్త్వాన్ని ఎరుక పర్చుకోవడం చాలా కష్టం. భగవంతుని గూర్చి పూర్తిగా తెలుసుకొన్నవారు అరుదే. భగవంతుడు ఎవరు? ఎక్కడ ఉంటాడు? అసలు ఉన్నాడా? లేడా? అన్న సందేహం మాత్రం అందరికీ ఉంటుంది. కొందరు అప్పుడప్పుడు బయటకు వ్యక్తం కూడా చేస్తుంటారు. కాని భగవంతునికి ఆకారం లేదు. నామం లేదు. సృష్టికి కారణకారుడు మాత్రం పరాత్పరుడే అంటారు. జ్ఞానులంతా ధ్యానం చేసి ఏకాగ్రతతో భగవంతుడిని మెప్పించి తమ చర్మచక్షువులతో చూసినవారున్నట్లు పురాణాలు చెబుతాయి.

భగవంతుడిని చూడాలనుకొంటే మంచి మార్గము, సులభమైనది భక్తి ఒక్కటే. తపో,జ్ఞాన మార్గాలున్నప్పటికీ ఇవి చాలా కష్టంతో కూడుకొన్నవి. ఎన్నో వేల యేండ్లు అనే్వషించినా ఫలితం దొరుకుతుందన్న నమ్మకం లేనివి. భక్తిమార్గంలో మాత్రం తప్పక భగవంతుడు మనకు వ్యక్తమవుతాడు. పైగా కోరుకున్న రూపాన్ని కూడా అపాదించుకుని మరీ భగవంతుడు కనిపిస్తాడు అన్న నమ్మకమున్న మార్గమిది. భక్తి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ప్రతివారు సమత్వబుద్ధిని అలవర్చుకుంటారు. ప్రతివారిలోను భగవంతుని అంశను చూస్తారు. వారికి జగత్తు జగన్నాథుడు ఒక్కటే గానే కనిపిస్తుంది. కనుక వారికి భగవంతుడు కాని వస్తువంటూ ఏదీ ఉండదు. దాని వల్లనూ భగవంతుని తత్వాన్ని తెలుసుకొనగలుగుతారు. అట్లాకాకపోయినా ఏ మూర్తిని భావించి వారు తమ భక్తిని వెల్లడిస్తారో ఆ ఆర్చామూర్తే వారి యెడల భగవంతుడుగా కనిపిస్తాడు.

భక్తిసామ్రాజ్యంలో భగవంతుడిని చూచినట్లు చెప్పడానికి భగవంతుని తమ అనుభవంలోకి తెచ్చుకున్నవారు ఎందరో కనిపిస్తారు. బెజ్జమహాదేవి త్రినేత్రుడిని తన బిడ్డడుగా భావించింది. ఆమె ముల్లోకాలను ఏలే ముక్కంటిని తన చంటిపాపగా ఎంచి తలారా స్నానపానాదులు చేయించి పక్షులు పారాడు వేళ బిడ్డడికి కీడుకలుగుతుందని అటువంటిది కలుగకుండా ఉండాలంటూ జాగ్రత్తలు తీసుకొంది.
రామకృష్ణ పరమహంస తన జీవితాన్ని కాళికామాతకే అర్పించాడు. తన భార్యను సైతం ఆది పరాశక్తిగానే భావించాడు. ఆ పరాశక్తి రామకృష్ణ పరమహంసకు కనిపించింది. అతని చేత ఎన్నో ఉపచారాలను పొందింది. అట్లానే యోగానంద, యుక్తేశ్వరస్వామి, బాబాజీ ఇలా ఎందరో మహాత్ములు భగవంతుని తాము కళ్లారా చూచినట్లు పురాణాలు ఇతిహాసాలు చెబుతున్నాయి

మట్టిని పిసికి కుండలు చేసి జీవనోపాధిని పొందే ఓ భక్తుడు భగవంతుని దర్శనానికి నేను వెళ్లలేను కదా అనుకొని తాను అనుకొన్న భగవంతుని రూపాన్ని మట్టితో చేసి ఆ మట్టినే పుష్పాలుగా రూపుదిద్ది భగవంతునికి అర్పించేవాడు. ఆ భక్తుని దగ్గరికే భగవంతుడే నడిచి వచ్చినట్లుగా వేంకటేశ్వరమహాత్మ్యం చెబుతుంది.
అట్లాంటిదే పుండరీకుని భక్తి. మొదట అంతా గాలి తిరుగుళ్లు తిరిగినా సత్యాన్ని తెలుసుకొన్న మీద తల్లి దండ్రుల సేవలో మునిగిపోయాడు. వారినే పరమాత్మ రూపాలుగా ఎంచాడు. వారిసేవలో మునిగిన పుండరీకుని కోసం పాండురంగడే పరుగెట్టి వచ్చి తనభక్తుని కోసం వేచి చూసాడని పాండురంగమహాత్మ్యం చెబుతుంది.

భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి భాగవతుల సేవ కూడా ముఖ్యమే. భాగవతులసేవను భగవంతుడు మెచ్చుతాడు. త్రిలోక సంచారి నారదుడు కూడా భాగవతుల సేవ చేసి నారాయణ మంత్రాన్ని పొంది నిత్యమూ నారాయణ జపంతో త్రిలోకాలు తిరిగే శక్తిని సంపాదించుకున్నాడు. పరమేశ్వరుడైనా, వైకుంఠుడైనా, బ్రహ్మ అయినా త్రిమూర్తులు ఆదిపరాశక్తి స్వరూపాలే సర్వానికి కారణం ఆ ఆదిపరాశక్తి నే అని తెలుసుకొన్నాడు. అందుకే భక్తాగ్రగణ్యుడయ్యాడు. భగవంతునికి ప్రీతి పాత్రుడయ్యాడు.

ఇలా ఎందరి భక్తుల కథల్లోమనకు పురాణాల్లో కనిపిస్తాయి. . అటువంటి భగవంతుడిని చూడాలనుకొంటే ముందుగా సమత్వబుద్ధిని, విశాల భావాన్ని పెంపొందించుకోవాలి. భగవంతుని తత్వాన్ని ఎరుకపర్చుకోవాలి. సర్వం పరాత్పరుని రూపంగా భావించాలి. అపుడు భక్తునికి భగవంతునికి తేడా ఉండదు. భగవంతుని తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా గురుమహాత్మ్యాన్ని తెలుసు కోవాలి. త్రిమూర్తుల కన్నా శక్తిమంతుడైన గురుఅనుగ్రహం పొందితే చాలు అనుకొన్నది సాధించగలుగుతారు.🌹

స్పష్టతతోనే జీవనసౌందర్యం

*'అష్టావక్రగీత' 9, 10 ప్రకరణల నుండి (241)*_
🕉🌞🌏🌙🌟🚩

_*స్పష్టతతోనే జీవనసౌందర్యం*_

_*జ్ఞానికి కూడా దేహం ఉన్నంత వరకూ దైనందిన జీవితం ఉంటుంది. అది అత్యంత స్పష్టతతో కూడి ఉంటుంది. జ్ఞాని నిర్వర్తించే ప్రతి పనీ ఆ పనియొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది.

మనం కూడా మనం చేసే ప్రతిపని ఉద్దేశాన్ని తెలుసుకొని అది ప్రతిబింబించేలా, నెరవేరేలా ఆ కర్మను స్పష్టతతో ఆచరిస్తే అందులోని సౌందర్యం మనకు తెలుస్తుంది. సంప్రదాయంలోని ప్రతి క్రతువూ అలాంటిదే. అవి శ్రద్ధగాచేస్తే ఫలితాలు వస్తాయి.

ఉదాహరణకు పెళ్ళి క్రతువు అంతా దంపతులు అన్యోన్యంగా సుఖంగా ఉండేందుకు. అది శాస్త్ర ప్రక్రియే కానీ పటాటోపంకోసం చేసేది కాదు. నలుగురి మెప్పుకోసం చేయటమూ కాదు ! నలుగురు ఇబ్బంది పడకుండా చెయడమే మన సంప్రదాయం. పెళ్ళి లాగానే జీవన సంస్కరణలైన షోడశ సంస్కారాలు కూడా వాటి ఉద్దేశం తెలుసుకొని ఆచరించడం ద్వారా పూర్ణ ఫలం ఉంటుంది.

ఈ విధంగా జ్ఞాని కర్మల్లోని స్పష్టతనే  అనుసరించటం సులువైన మార్గం. శాస్త్ర కర్మలు ఆడంబరంగా చేయడంవల్ల ప్రయోజనం అందకపోగా శాస్త్రాన్ని తులనాడిన దోషం కూడా తప్పదు !*_
       
🕉🌞🌏🌙🌟🚩

🌹 *అష్టావక్ర మహర్షి - వారి విశిష్టత* 🌹

🌹 *అష్టావక్ర మహర్షి - వారి విశిష్టత* 🌹

            ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీమన్నారాయణుని ఆశ్రయించి, “ఈ అనంత సృష్టి నాచేతనే సృజించబడినది కాబట్టి ఈ సృష్టిలో మొదటివాడను నేనే. ఆద్యంతములు లేక సృష్టంతా వ్యాపించి వున్నవాడను నేనే. కాబట్టి నాకన్న గొప్పవాడు ఈ సృష్టియందు మరొకడు లేడు” అని శ్రీమన్నారాయణునితో సంభాషిస్తే, శ్రీమన్నారాయణుడు సరే అలాగే, ఒకసారి అలా వెళ్ళి పరిశీలించి వద్దాము రండి నడిచి వెళ్ళొద్దాం అన్నాడు.  అని కొంత దూరం తీసుకుని వెళ్ళగా, ఒక చోట ఒక మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు.

ఆయన రోమశ మహర్షి. ఆ రోమశ మహర్షి పక్కన గుట్టగా రోమాలు పడి వున్నాయి. ఆయన ఎంత ఎత్తు వున్నాడో, ఆయన పక్కగా పడి వున్నటువంటి రోమాలు కూడా అంత ఎత్తు గుట్ట వున్నది.

ఈ మహానుభావుడు ఎవరూ అని వారు అడుగుతారు. వారినే మనం అడుగుదాం అని వారి దగ్గరకి వెళ్తే, వారు వారిని పరిచయం చేసుకుంటారు. అయ్యా! నేను రోమశ మహర్షిని.

అప్పుడు ఈ బ్రహ్మగారికి ఒక సందేహం కలిగింది. అయ్యా! మీ ప్రక్కనే ఈ రోమాల గుట్ట ఏమిటి అని?

నాలుగు మహాయుగాలు అంటే కృతయుగము, త్రేతాయుగయు, ద్వాపరయుగము, కలియుగము ఇవి నాలుగు కలిపితే ఒక మహాయుగము. ఇటువంటి మహాయుగాలు అన్నీ కలిపి బ్రహ్మకు ఒక పగలు, మళ్ళా ఇంకో మహాయుగం కలిపి ఒక రాత్రి. అలాంటి వంద సంవత్సరాలు అయితే బ్రహ్మగారికి ఆయుర్దాయం నిండుతుంది. అంటే ఒక బ్రహ్మ గారు వెళ్ళి పోయి మరొక బ్రహ్మగారు వస్తారు. ఒక్కొక్క బ్రహ్మగారు వెళ్ళిపోయినప్పుడల్లా ఒక రోమం వూడి పడిపోతుంది ఆయనకి.

ఇప్పుడు ఆ పక్కనున్న రోమాలన్నీ ఏమిటీ అని అంటే, అంతమంది బ్రహ్మలు వెళ్ళి పోయారు. అని రోమశ మహర్షిగారు చెప్పారు. అప్పుడు ఈ బ్రహ్మగారికి ఏమనిపించింది? ఓహో! సరే, ఇంకా వెళదాం పదండీ అన్నారు. ఇక తెలుసుకోవడం అయిపోయింది, నేనే గొప్పవాడినికాదనే సంగతి నాకు అర్థమైపోయింది. నేను గొప్పవాడిని కాదని, నాలాంటి వాళ్ళు ఎన్ని వేలు, లక్షల మంది వెళ్లిపోయారో ఆ రోమశ మహర్షి రోమాలు చూస్తేనే తెలిసిపోతుంది.

సరేలేండి, ఇప్పుడు ఏమైంది? కొంచెం దూరం వెళ్ళి చూద్దాం అని ముందుకు వెళ్తారు. అక్కడ మరొక మునీంద్రులు, వారు వారి దగ్గరకి వెళ్తే అయ్యా! నమస్కారం.

నేను అష్టావక్ర మునీంద్రుడను. మరి మీరేమిటి, మీరు ఎంతకాలం నుంచి తపస్సు చేస్తున్నారు? నాకంటే ముందు రోమశ మహర్షిగారు వున్నారు. వారి ఒంటి మీద వున్న రోమాలు అన్నీ పడిపోతే, రోమశ మహర్షిగారు వుండరు. వారు చాలిస్తారు. అటువంటి రోమశమహర్షిగారు ఒక్క రోమశ మహర్షి పోతే నాకు వున్నటువంటి 8 వంకర్లలో ఒక వంకర పోతుంది. ఇప్పటికి ఇంకా ఒక వంకర కూడా పోలేదు. అన్నారు. వీళ్ళందరూ చిరంజీవులన్నమాట.

ఆ మాట చెప్పడం కోసం. అంటే సృష్టి వున్నంతకాలం, విశ్వ సృష్టి వున్నంతకాలం వీళ్ళందరూ వుండే వాళ్ళే. అందుకే ధృవమండలం ఎప్పటికీ పడిపోదు. మన పెద్దవాళ్ళు అందుకే ఇదంతా చెప్పకుండా, ఇదంతా అర్థం కాదని, ఏం చెప్పారు? 

సప్త ఋషులు అనేవాళ్ళు ఎప్పటికీ వుంటారు. ధృవమండలం ఎప్పటికీ పడిపోదు. ఇలాగ పెద్దవాళ్ళు చెప్పడానికి కారణం అది. ఇలాగ మహానుభావులు అనంత సృష్టికి, దైవీ ప్రణాళికకు ఆధారంగా వుంటారు.

మైత్రేయుడు ఇలా చాలా మంది వున్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరాయంగా ఆ దైవీ ప్రణాళికలో ఎప్పుడూ వుంటారు. వాళ్ళు ఆ దైవీ ప్రణాళికను నిర్వహిస్తూ వుంటారు.

వీళ్ళు ప్రత్యేకంగా చేసేది ఏమైనా వుందా ఇప్పుడు? ఎందుకని? సంకల్పమే అనంత సృష్టికి ఆధారం. కాబట్టి అటువంటి మహానుభావుడు చెప్పినటువంటిది ఈ గీత.

ఇదంతా ఎందుకు చెప్పుకున్నాము అనంటే, అష్టావక్ర మహర్షి అంటే చాలా మంది 8 వంకరలు అనే వరకే తెలుసు అందరికి. ఎందుకంటే పేరు లోనే వుంది కాబట్టి. ఆయన తపః శక్తిగానీ, ఆయన యొక్క ధీ శక్తి గానీ, ఆయన ఉద్ధరించగలిగేటటువంటి శక్తి ఎంతటిది అని తెలియాలంటే, ఇప్పుడు ఆయన ఎంతకాలం నుంచి వున్నారు? ఆయన జనకరాజర్షికి బోధించారు ఈ అష్టావక్రగీత.

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 సేకరణ : 🌴 ప్రసాద్ 🌴

🌹 త్యాగము, వైరాగ్యమే - మోక్షం 🌹

🌹 త్యాగము, వైరాగ్యమే - మోక్షం 🌹

🍃 *ముఖ్య సాధనా సూచన 1* 🍃

*🌴మానవుడు బంధాలలో ఉన్నంత వరకూ నిజమైన సుఖశాంతులు   పొందలేడు. ప్రశాంతతో కూడిన జీవితం త్యాగము, వైరాగ్యము ద్వారానే సాధ్యపడుతుంది.*

*వైరాగ్యమనగా ఇల్లు వాకిలి,  కుటుంబాన్ని వదిలేసి అడవులకు పోయి తపస్సుకి కూర్చోవడం కాదు. చాలామంది తమను ఇల్లు, సమాజమే పాడు చేసేసిందని అనుకుంటారు. కానీ అది తప్పు.  మన మనసు అనుమతి లేనిదే మనలను ఏ విషయమూ కదిలించలేదు.*

*అంటే మనలను పాడుచేసేది మన మనస్సే కానీ వేరే ఏవీ కావు. కనుక ముందు మనస్సును గెలవాలి. దానిని సరైన మార్గంలో పెట్టాలి. అంటే భగవంతుని ఆశ్రయించి ఉండాలి. ఆయనే మనసు  సరైన త్రోవలో పెట్టగల సమర్ధుడు..*

*ఇంకా మనసులోని చెడును త్యాగం చేసి దానిని భగవంతుని వైపు తిప్పాలి. ప్రపంచమందలి వస్తు సుఖాలు అనిత్యములని తెలుసుకోవాలి. అపుడు వైరాగ్యము దానంతటదే కలుగుతుంది. మనసు మాధవునిపై ఉంటే ఇంటిలో ఉండైనా మోక్షంను పొందగలం.*

*మనసు ప్రపంచంపై తిరుగుతుంటే అన్నీ వదిలేసి అడవులలో కూర్చుని ఏమి ప్రయోజనం?? !🌴_*

🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 *సాధనలోన సత్య అవగాహన* 🌹

🌹 *సాధనలోన సత్య అవగాహన* 🌹

✍ *మాస్టర్ ఇ.కె*

*శ్రీమద్భాగవతము*

🌻 *ఏకాంతి అనగా ఒంటరితనమును అనుభవించువాడని అర్థము. తన్నాశ్రయించిన వారిని విడిచి, ఎప్పుడును తన గదిలోగాని, కొండగుహలలోగాని చేరి సాధన చేయుమని దీని ఉద్ధేశ్యము కాదు.*

*ఏకాంతమనగా అందరిలో ఒక్కనినే చూచుట అభ్యసించి, ఎందరిలో ఉన్నను తానొక్కడే యుండగలుగుట లేనిచో భారతభాగవతాది గ్రంథముల యందు నారదాది సత్పురుషులను ఏకాంతముఖ్యులుగా వర్ణించుట ఎట్లు పొసగును?*

*మననశీలుడు అనగా ధ్యానము తన స్వభావముగా ఏర్పడినవాడు. దేనిని చూచుచున్నను, ఎవరితో వ్యవహరించుచున్నను వారిలోని భగవంతునితో ధ్యానమున వ్యవహరించుట మననశీలము.*

*మత్సరమనగా ఒకరికున్నదానిని చూచి బాధపడుట. దీని‌ వలన నిరంతర దుఃఖము కలుగును. విలువైన, అందమైన వ్యక్తులను, వస్తువులను, దుస్తులను, భూషణాలంకారములను చూచినపుడు వాని యందు దైవత్వము‌ గమనించినచో మత్సరము పుట్టదు.*

*ఎవరితోనైనను మిత్రభావమును అభ్యసింపవలెను. తన్ను ద్వేషించి నిందించువాని ఎడల ఇది ఎట్లు సాధ్యమనరాదు. వాని హితముగోరి సంభాషించుట, పనిచేయుట మిత్రత్వమే అగును.*

*దయాగుణమును‌ అభ్యసింపవలెను. ఆత్మజ్ఞానమును అలవరచుకొనవలెను.*

*శరీరము ఆత్మ కాదనియు, అందు అంతర్యామి ఆత్మయనియు, అతడే పరమాత్మ అనియు తెలిసి చరించుట.*

*తన శరీరమునందును, తనపై ఆదారపడినవారి యందును‌ ఆత్రబుద్ధి తగదు. అది బంధమునకు కారణమగును. (తన శరీరమును అలంకరించు కొనుటలో ఎక్కువ కాలము వ్యర్థము చేయరాదు.*

*శరీరమునకు వ్యాధి కలిగినచో నియమము పాటించి ఔషధ సేవనము చేయవలెను‌గాని వ్యాధిని గూర్చి‌ దిగులు పడరాదు.*

*ముసలితనము కలిగినపుడు దాని‌ లక్షణములను కప్పిపుచ్చుకొనుటకు కంగారుపడరాదు.*

*దేహము విడువవలసివచ్చినపుడు‌ ఉత్కంఠ పడినచో తెలివి తప్పును కనుక మృత్యువు కలుగును. ప్రశాంతి లభించినచో తెలివి తప్పదు కనుక మృత్యువు కలుగక, దేహము తొలగును.......*

🌹🌹🌹🌹🌹🌹🌹
🙏 *ప్రసాద్*

🌹 *మీలోనే అంతా ఉంది - గుర్తించడమే మీ పని*🌹

🌹 *మీలోనే అంతా ఉంది - గుర్తించడమే మీ పని*🌹
🍃🍃🍃🍃🍃🍃🍃

👉 *పాలను భాధ పెడితే పెరుగు వస్తుంది.*
👉 *పెరుగును సతాయిస్తే వెన్న వస్తుంది.*
👉 *వెన్నని తపింప చేస్తే నెయ్యి వస్తుంది.*

👉 *పాల కంటే పెరుగు విలువ ఎక్కువ, పెరుగు కంటే వెన్న విలువ ఎక్కువ, వెన్న కంటే నెయ్యి విలువ ఎక్కువ.*

👉 *కానీ, ఈ నాలిగింటి రంగు తెలుపే.*

👉 *దీని అర్థం ఏమిటంటే... మాటిమాటికి దుఃఖం, పరిస్థితులు వచ్చినా కూడా ఏ వ్యక్తి రంగు మారదో, సమాజంలో ఆ వ్యక్తికే విలువ ఉంటుంది.*

👉 *పాలు ఉపయోగ పడేవే, కానీ ఒక రోజు కోసమే..తరువాత అవి పాడయి పోతాయి....*

👉 *పాలల్లో ఒక చుక్క మజ్జిగ వేయడంతో అది పెరుగు అవుతుంది...కానీ రెండు రోజులే ఉంటుంది...*

👉 *పెరుగును చిలకడంతో వెన్న వస్తుంది. ఇది కూడా 3, 4 రోజులు ఉంటుంది...*
👉 *వెన్నని కాచి నప్పుడు నెయ్యి వస్తుంది. నెయ్యి ఎప్పుడూ పాడు అవ్వదు...

👉 *ఒక్కరోజులో పాడైఏ పాలలో ఎప్పుడూ పాడవ్వని నెయ్యి దాగి ఉంది...*

👉 *అదేవిధంగా మీ మనసు కూడా లెక్కలేన్నని శక్తులతో నిండి ఉంది, దానిలో కొన్ని మంచి ఆలోచనలిని నింపి..మీకు మీరే చింతన చెయ్యండి...మీ జీవితాన్ని సరిచేసుకుని అప్పుడు చూడండి....*

👉 *మీరు ఎప్పుడూ ఓడిపోరు...ధైర్యశాలి అవుతారు*

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 *ప్రసాద్*

మీలో అంతర్లీనంగా అన్నీ సమాధానాలూ ఉన్నాయి!

🌹🦚🙏
మీలో అంతర్లీనంగా అన్నీ సమాధానాలూ ఉన్నాయి!

బయటి నుండి మీ మనస్సుకు  వస్తున్న ప్రశ్నలకు సమాధానాలను మిలోనుంచే మీరు రాబట్టాలీ !

అందుకోసం మీరు చెయ్యాల్సిoదల్లా సమాధానాలన్నీ మీలోనే ఉన్నాయని పూర్తిగా విశ్వసించడం మాత్రమే మిత్రమా !

🌺🕊🦢🦜💐
🙏 ప్రసాద్

🌹 అష్టావక్రగీత కథ 🌹

🌹 అష్టావక్రగీత కథ 🌹

✍️ బి.వి. ప్రసాద్

కెరీర్ లో మంచిస్థితిలో ఉన్న మిత్రుడొకరు  ఫోన్ చేసి ఈ భగవద్గీతా, ఉపనిషత్తులూ ఒకసారి చదవాలనుకొంటున్నాను, తెలుగులో ఎక్కడ దొరుకుతాయి అన్నపుడు, కాస్త నవ్వూ, విచారమూ కలిగాయి.

కొన్ని చదవటం అంటే ఊరికే సరదా కాదు. కొన్ని వృధా చర్చల కోసం సమాచారం ప్రోవు చేసుకోవటంకాదు. నాకు ఎంత తెలుసో చూడు అని చెప్పుకోవటానికీ, నీ నమ్మకాలనీ, వాటి వెనుక ఉన్న నీ ఇగో నీ ఇతర్లపై బలవంతంగా రుద్దటానికీ కాదు.

కొన్ని చదవటం అంటే, ఇప్పటి వరకూ నువ్వు అనుకొంటున్న నిన్ను వదులుకోవటానికి సిద్ధపడటం, మరణించి మళ్ళీ కొత్తగా పుట్టటానికి సాహసించటం. అలా చదవగలిగినపుడే కొన్ని చదవాలి. లేదంటే రాళ్ళని తాకే సెలయేటి పరుగులా, అవి ఏ మంత్రమయ లోకాలకీ తీసుకు పోకుండానే, నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. అందుకే కొన్ని ప్రాచీన గ్రంధాలు 'ఇప్పుడు' అని మొదలుపెడతారు. అంటే, నువ్వు సిద్ధపడి ఉన్నావు గనుక, ఇప్పుడు మాట్లాడుకొందాం అని.

నిజంగా, అలా చదవగలిగితే, 'ఇప్పటికైనా నువ్వు ఏమిటో, నీ జీవితం ఎందుకో తెలుసుకోవాలన్న జ్వరం కనుక పుడితే, మరింత సూటిగా నిన్ను తాకే వేరే గ్రంధాలు కూడా ఉన్నాయి' అని చెప్పాలనిపించింది కాని, అందరిలానే ఆ మిత్రుడూ కేవలం పైపైన బ్రతకటానికే ప్రాధాన్యత ఇస్తాడని తెలుసు గనుక, నాకు తెలిసిన సమాచారం ఏదో చెప్పి ఊరుకొన్నాను.

అట్లా అత్యంత శక్తివంతంగా, నువ్వు అనుకొంటున్న నిన్ను దగ్ధం చేసి, నిజమైన జీవితానుభవంలోకి, నిరపేక్షసత్యంలోకి మేల్కొలిపే గ్రంధాలని స్వరూపవర్ణన గ్రంధాలుగా చెబుతారు. స్వరూపవర్ణన అంటే 'ఆత్మ' లేదా 'తాను' లేదా 'నేను' అంటే ఏమిటో, దానిని ఎలా తెలుసుకోవాలో తెలియచేసే గ్రంధాలు.

వాటిలో నేను చూసినవి ( చదివినవనీ, అధ్యయనం చేసినవనీ అనటంలేదు) అష్టావక్రగీత, ఋభుగీత, అవధూతగీత, యోగవాసిష్టం, త్రిపురారహస్యం ఇత్యాదులు. వీటిలో చాలా వరకూ గురు,శిష్య సంవాద రూపంలో ఉంటాయి. శ్రీ రమణమహర్షి తరచూ వీటిని ప్రస్తావించేవారు. అంతేకాక వాటికి సంబంధించిన కథలు కూడా చెప్పేవారు.

వాటిలోకి ప్రవేశించటానికి యోగ్యత ఎలా, ఎంతగా ఉండాలో ఆ కథలు చెబుతాయి. వాటిలో ఈ రచయితకి అత్యంత ప్రేమాస్పదమైన ఒక కథ ఇక్కడ చెబుతున్నాడు.

ఒకానొక సారి జనకుడి కొలువులో వేదాంతసభ జరుగుతూ వుంటుంది. చర్చలో భాగంగా ఒకరు ప్రాచీనులు చెప్పిన శాస్త్రవాక్యం ఒకటి చెబుతారు. 'ఆత్మజ్ఞానం పొందటానికి ఏమంత సమయంపట్టదు. గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి, రెండవ ప్రక్క రెండవ కాలు వేసేలోగా ఆ జ్ఞానం పొందవచ్చును' అని ఆ వాక్యానికి అర్థం.

అప్పుడా జనకుడు ఈ శాస్త్రవాక్యం నిజమేనా అని అడుగుతాడు. వాళ్ళు నిజమే అంటే, నిరూపించగలరా అంటాడు. మేము అంత శక్తిగలవాళ్ళం కాదంటారు.

జనకుడు దండోరా వేయిస్తాడు, ఈ శాస్త్రవాక్యం నిజమని నిరూపించగలవారికి తగిన బహుమానం ఇస్తానని. ఆ మాట, అరణ్యంలో ఉన్న అష్టావక్రమహర్షిని చేరుతుంది. ఆయన రాజసభకి వస్తారు,, తాను నిరూపిస్తానని చెబుతారు.

జనకుడు సరేనన్నాక, బయట గుర్రం నిలబెడతారు. రాజు ఒక పాదం రికాబులో ఉంచుతాడు. అప్పుడు, మహర్షి నీకు జ్ఞానం బోధిస్తున్నాను గనుక, నాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటారు. బోధన అయ్యాక కదా దక్షిణ ఇవ్వాల్సింది, కానీ, ముందుగా అడగటానికి కారణం ఉంది.

జ్ఞానం పొందినవాడికి ఇక అన్యత్వభావం (తన కంటే వేరుగా ప్రపంచం ఉంది అనే భావం) నశిస్తుంది. తనకి అన్యంగా ఏదీ లేదు గనుక, గురువూ ఉండడు, దక్షిణా, ఇవ్వటమూ కూడా ఉండవు.

జనకుడు గురుదక్షిణగా ఏమి ఇవ్వాలో చెప్పమంటాడు. మహర్షి 'నేను, నాది అనుకొంటున్న సమస్తాన్నీ నాకు ఇవ్వ'మంటాడు. జనకుడు 'ఇచ్చాను' అంటాడు. అంతే. ఇక జనకుడు శిలాప్రతిమలా నిలబడిపోతాడు.

నేను, నాది అనేభావాలతో కూడిన సమస్తాన్నీ, అంటే, నాది అనిపించే దేహంతో సహా, మనస్సుతో సహా మహర్షికి ఇచ్చేసాడు జనకుడు.

ఇక తనపై తనకి ఏ ఆధిపత్యమూ లేదు. అసలు తానే లేడు. నేను అనుకొంటున్నది అంతా గురువుకి ఇవ్వగానే, ఇక ఏదీ, ఎవరిదీ కాని శుద్ధమైన ఎరుక మాత్రమే మిగిలింది.

కాలం గడుస్తున్నా స్థాణువులానే నిలబడిపోయిన రాజుని చూసి, పరివారం ఆందోళన పడ్డారు. ఈ ఋషి రాజుగారిని ఏదో చేసాడని భయపడ్డారు, మళ్ళీ ఆయన్నే ప్రార్ధించారు, మా రాజుగారిని మాకు ఇవ్వమని. మహర్షి 'నాయనా, ఇక కదులు' అన్నారు. గురుస్వాధీనమైన ఆ దేహం, మనస్సూ గురువాజ్ఞతో కదిలాయి.

ఇప్పుడు నీస్థితి ఎలా ఉందో చెప్పమంటారు అష్టావక్రుడు. జనకుడు పరమానందంతో, ఆశ్చర్యపోతూ చెబుతాడు. ఇట్లా, ఆ గురుశిష్యుల పరమస్వచ్ఛమైన సంభాషణతో అష్టావక్రగీత మొదలవుతుంది.

స్వరూపం అంటే ఏమిటో, ఈ దృశ్యమాన ప్రపంచం ఏమిటో, వీటి వింతవింత లేమిటో ఎంతో కవితాత్మకంగా మాట్లాడుకొంటూ వారి సంభాషణ నడుస్తుంది.

వారికి నీడగానైనా నడిచేంత హృదయనైర్మల్యం సాధిస్తే, అలాంటివారికి అష్టావక్రగీత ఎనలేని మేలు చేస్తుంది.

🌹 🌹 🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 మానవుడు  కోల్పోయిన వాస్తవిక జ్ఞానము 🌹

🌹 మానవుడు  కోల్పోయిన వాస్తవిక జ్ఞానము 🌹

ఉనికి (జీవుల కర్మ భూమి)

సూర్యుడు (Sun) 
బుధుడు (Mercury) 
శుక్రుడు (Venus) 
భూమి (Earth) 
కుజుడు (Mars) 
గురువు (Jupiter) 
శని (Saturn) 
ఇంద్రుడు (Uranus) 
వరుణుడు (Neptune) 

ఇది మన సౌరమండలము (Solar System)

Google లో ఒకసారి వాటి స్ధితి గతులను ప్రశ్నించండి, పరిశీలించండి.  మీ ఉనికిని Google Maps యందు పరిశీలించండి.

ఆ తర్వాత, పాలపుంత యందు (MilkyWay) మన సౌర కుటుంబము (Solar System), మన భూమి  యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత,  నక్షత్రవీధి (Galaxy) యందు మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత, విశ్వము (Universe) యందు మన నక్షత్రవీధి (Galaxy),  మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి.

ఆ తర్వాత,  బ్రహ్మాండము (Cosmos) యందు మన విశ్వము (Universe), మన నక్షత్రవీధి (Galaxy),  మన పాలపుంత, మన సౌర కుటుంబము మరియు మన భుామి యెుక్క ఉనికిని ప్రశ్నించి పరిశీలించండి. 

ఇప్పుడు ప్రశ్నించుకోండి,  ఇంత జ్యామితి బద్ధమైనటువంటి, గణిత బద్ధమైనటువంటి క్లిష్టమైనటువంటి బ్రహ్మాండ రచన ఎవరి మేధాశక్తితో జరుగుతోంది? 

గురుత్వాకర్షణ శక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి, మానసిక శక్తి,  ఆలోచనా శక్తి ఇవన్ని పంచభూతములైనటువంటి ఆకాశము, గాలి, అగ్ని, భూమి, నీరు మరియు గ్రహముల యెుక్క కారకత్వము వలన జీవరాశులకు సంభవించుచున్నవి. వీటియందు ఏ ఒక్కటి కొరవడినా మనము నివసించెడు భూమి గతుల యందు ఊహించనటు వంటి మార్పులు సంభవించి ప్రకృతి ప్రళయాలకు దారితీయును.

ధర్మము (Law of Friction and Law of Action) నిర్దేశింపబడి, గ్రహములుకాని, పంచభూతములుకాని పనిచేయుచున్నవి. 

కాలము అనునది ఒక అనిత్యమైన,  అస్ధిరమైన (Variable) పరిమాణం (Dimension). 

ఒక్కొక్క గ్రహమునకు రేయింబగళ్ళు యెుక్క కాలనిర్ణయము,  అవి సూర్యుని చుట్టూ తిరిగే కాలాన్ని బట్టి మారుతూవుంటుంది. అందుచేత కాలము అస్ధిరమైనటువంటి పరిమాణం!

మెుదలు, మన భూమి యొక్క అగణిత పరిభ్రమణాన్ని,  జ్ఞాని, శాస్త్రజ్ఞుడు,  మహా శక్తివంతుడైనటువంటి దేవుడు పెద్దపెద్ద పర్వతముల (Mountain Ranges)  సంస్ధాపనచేత (Installation)  భూమి యొక్క పరిభ్రమణాన్ని ఆయన పరిపూర్ణంగా జ్యామితి (Geometrical) పరచెను. ఆవిధముగా ఆయన భూమి మీద జీవరాశి యొక్క మనుగడకు నాంది పలికారు.

పైన తెలిపినటువంటి సౌర మండలాలు కోటానుకోట్లు ఈ విశ్వమంతా వ్యాపించి యున్నవి. మరి వీటి స్థితిగతులు,  జీవరాశికి ఖర్మనాపాదించుటకు ప్రతి సౌరమండలముయందుండెడు గ్రహముల కారకత్వము (Authorship), వాటి  ఆవశ్యకత,  ఇంతటిని పరిపూర్ణముగా జ్యామితిపరుచుటకు కావలసిన యుక్తి, శక్తి కలవాడై,  దైవము ఈ సమస్త విశ్వమును నడుపుచున్నాడు!

రూపరహితుడైన తను, మాయను (సృష్టి, స్ధితి, లయములు) కార్య, కారణ, కాలమనెడి పరిమాణములాధారంగా జగత్కళ్యాణమును సాధించుచుండును! 

తన స్ధిరమైన (Static or Absolute) ఉనికినుండి యుక్తి, శక్తి అనెడి అస్ధిరత్వాల(Variable)  సం-యెాగముతో ఇచ్ఛా, జ్ఞాన, క్రీయా శక్తుల ద్వారా శాశ్వతసమయమందు (Time Immortal) చరాచర జగత్తును స్పృశించుచుండును. 

ఈ పరిణామక్రమములో, కల్పములయందు జరిగిన, జరుగుచున్న, జరుగబోయెడి రూపాంతరములు కొన్ని పాక్షికస్పృహతో కూడినివై (Partial Consciousness) ఆ తదుపరి తన పూర్తిస్పృహ (Full Consciousness)  యెుక్క అధ్భుతమైనటువంటి సూక్ష్మవిశ్వము తాలూకు నమూనా మనిషి-మానవజాతి!

ఈ మనిషి అనే రూపముయందు తన స్ధిరమైనటువంటి రూపరహిత ఉనికి (SOUL) మరియు అస్ధిరత్వాలైనటువంటి శక్తియుక్తుల సంయెాగముద్వారా, జీవత్వమును (Third Value)  కారణమనెడి పరిమాణముద్వారా సిధ్దింపజేయుచుండును.

కొత్తదనము, పాతదనము యెుక్క త్యాగము (Collapse or Sacrifice) వల్ల సిద్ధించుచుండును. స్ధిరమైన తను అస్ధిరత్వాల సంయెాగము చేత ప్రతి క్షణము రూపాంతరము చెందుచుండును(Reproduction)! 
తనున్నానటువంటి ఉనికిని స్పందన-ప్రతిస్పందన అనెడి చర్యయందు తెలియజేయుచుండును! 

🌴జీవి గర్వము (False Ego)🌴

గాఢ నిద్రయందు జీవుల శ్వాసనిశ్వాసలు నియంత్రించెడి శక్తియుక్తులు, జీవి ప్రమేయము లేకుండుగనే జరుగుచున్నవి!

ఎవరి ఉత్తర్వులమేరకు,  పై చర్య జరుగుచున్నది?

శక్తి-యుక్తి స్వతంత్ర పరిమాణములు (Separate Entities from Life)  అనుటకు నిదర్శనముగా, మెలుకువతోడనే "గాఢంగా నిద్రపోయాను" అన్న అనుభవమును విశదపరుచున్నది ఎవరు,  ప్రశ్నించుకోగలరు?

జీవత్వమన్నది శక్తి-యుక్తుల సంయెాగానుభవమే!

మూడవ విలువైనటువంటి "జీవము" ద్వారా ఒక నిర్ధిష్టమైనటువంటి కట్టబాటు, యెాగము ద్వారా తన్నుతానెరుంగుట ఒక విలాసము!

మరి ఈ అహంకారమనెడి తప్పుడు స్పందన మనిషికి ఎటునుంచి దాపురించినది? 

ఇంకొక ఉదాహరణ......

శారీరక స్పందనల వల్ల  స్త్రీ, పురుష సంయెాగముతో జనించెడు బిడ్డ యెుక్క పోషణ, రచన, తల్లి గర్భముయందు ఎవరు నియంత్రిస్తున్నారు? 
ఆ రచన యందు తల్లిదండ్రుల పాత్ర కొసమెరుపైనా లేదు! 
పోనీ జీవోత్పత్తికి తయారయ్యెడి శుక్రశోణితాలు తల్లిదండ్రులు ఆధీనము నందున్నవా? లేవు!

మరి ఈ అహంకారమనెడి తప్పుడు స్పందన మనిషికి ఎటునుంచి దాపురించినది?

ప్రారబ్ధముననుసరించి,  యుగధర్మమున అభివృద్ధి పేరిట రూపాంతరము చెందుచున్నటువంటి మానవుని శక్తి-యుక్తులు,  బాహ్య ప్రకృతికి కాని, అంతర్ప్రకృతికి గాని దైవము యెుక్క సృజనాత్మకతకు అద్దం పట్టేదిలా ఉండడమే జీవము యెుక్క అత్యున్నతమైనటువంటి నైతిక పరిణామం!

చిత్రవిచత్రమైనటువంటి అశ్రేస్కరమైనటువంటి కోరికల వలయాలయందు గ్రహముల కారకత్వము చేత మనిషి తన్ను తాను గొప్పగా కీర్తించుకుంటున్నాడు! తద్వారా,  యుగధర్మములకు భాధ్యుడైనాడు! 

వ్యాఖ్య: 1

ఒక్కటి తెలుసుకో,  భగవంతుడి కార్యములయందు
స్వేచ్ఛ. 
జ్ఞానము. 
అందము. 
ఆనందము. 
పరమార్థము (Life Supporting, Nature Supporting).  
కాలప్రమాణము యందు శాశ్వతము. 
ఒకదానిననుసరించి ఒకటుంటుంది!

దేహమే నేననెడి భావన - దేహాత్మ
జీవమనెడి భావన - జీవాత్మ. 
సాంఘికముగా జీవులయెడ జీవమును గౌరవించెడు స్ధాయి - మహాత్మ
అన్నిటియందు "నేను" ను స్మరించు స్ధాయి -  పరమాత్మ
పై విధముగా రూపాంతరము చెందినటువంటి ఆత్మను పరమాత్మ స్ధాయికి చేర్చుటయే మనిషి యెుక్క ఖార్మిక కర్తవ్యము! 

ఇంతకు మించిన జీవన ధర్మము ఇంకేముంటుంది?

కల్పాంతరములయందు, ఆధ్యాత్మికత (Spirituality) యందు పురోగతి సాధించినటువంటి ఉత్తమ మానవతావర్గానికి చెందినటువంటి మహనీయులు తమ శక్తి-యుక్తులను తపస్సు ద్వారా భగవంతుడి కల్పనాశక్తి మేరకు అనుసంధానపరచి, భగవంతుడి (Static Omni Potent) విశ్వకళ్యాణ ఆలోచనా తరంగములను "వేదము" (Sacred Thoughts) ల ద్వారా గ్రహించి జీవకోటి కళ్యానమునకు దోహదపడి శాశ్వత ఉనికిని సంపాదించుకొనిరి! 

వ్యాఖ్య: 2

ఆదిఆద్యంతములు లేని ఇంత బ్రహ్మాండ రచన అంత గణితబధ్ధమై పరిపూర్ణమైన నమూనాగా గోచరిస్తూవుంటే, జీవుడేమిటి భగవంతుడి భౌతిక రచనాసామర్ధ్యాన్ని  బాహ్యమునందే అర్ధము చేసుకోలేకున్నాడే,  ఇంక వీడు(జీవుడు) లోపలికి ప్రయాణము చేసి తన్నుతాతెలుసుకొని భగవంతుడి ఆలోచనా దృక్పధము యందు భాగస్వామెప్పుడయ్యేడు!

విశ్వం యెుక్క పుట్టుక,  విశ్వము యందు జరుగుచున్నటు వంటి సమస్త విలాసము, శృతి తప్పక,  గతి తప్పక ప్రకృతీసమేతముగా రూపాంతరము,  భగవంతుడి "వేదతరంగముల" (Sacred Thoughts) ద్వారానే జరుగుచున్నది.

జీవుడిగా మనము ఆయన ఆదేశాలమేరకు బ్రతకడం తప్ప ఇంకే విధమైనటువంటి అధిక వైపరీత్య చదువుల దోరణితో అభివృధ్ది యందు తప్పిదము జరిగినపుడు, భగవంతుడి ఆలోచనా తరంగముల ద్వారా సహజీవనం సాగిస్తున్నటువంటి మన భూమి-ప్రకృతి యందు అగణిత తరంగముల ఉత్పత్తి పెరిగి జీవుని మనుగడయందు లోపమేర్పడును! లోపములను క్రమబధ్దీకరించే నైపుణ్యమును జీవుడు తిరిగి భగవంతుని ఆలోచనా తరంగములనుంచియే (వేదము)  గ్రహించవలసియుంది!

భగవంతుడు సృష్టించిన రచనను అర్ధం చేసుకొని (వాస్తవిక విద్య), మానవుడు అభ్యున్నతిని సాధించవలెను.

♥️||సర్వేజన సుఖినోభవంతు,  లోకాసమస్తా సుఖినోభవంతు|| ♥️

🌹🌹🌹🌹🌹🌹🌹

🙏 సేకరణ : ప్రసాద్