స్పష్టతతోనే జీవనసౌందర్యం

*'అష్టావక్రగీత' 9, 10 ప్రకరణల నుండి (241)*_
🕉🌞🌏🌙🌟🚩

_*స్పష్టతతోనే జీవనసౌందర్యం*_

_*జ్ఞానికి కూడా దేహం ఉన్నంత వరకూ దైనందిన జీవితం ఉంటుంది. అది అత్యంత స్పష్టతతో కూడి ఉంటుంది. జ్ఞాని నిర్వర్తించే ప్రతి పనీ ఆ పనియొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబించేదిగా ఉంటుంది.

మనం కూడా మనం చేసే ప్రతిపని ఉద్దేశాన్ని తెలుసుకొని అది ప్రతిబింబించేలా, నెరవేరేలా ఆ కర్మను స్పష్టతతో ఆచరిస్తే అందులోని సౌందర్యం మనకు తెలుస్తుంది. సంప్రదాయంలోని ప్రతి క్రతువూ అలాంటిదే. అవి శ్రద్ధగాచేస్తే ఫలితాలు వస్తాయి.

ఉదాహరణకు పెళ్ళి క్రతువు అంతా దంపతులు అన్యోన్యంగా సుఖంగా ఉండేందుకు. అది శాస్త్ర ప్రక్రియే కానీ పటాటోపంకోసం చేసేది కాదు. నలుగురి మెప్పుకోసం చేయటమూ కాదు ! నలుగురు ఇబ్బంది పడకుండా చెయడమే మన సంప్రదాయం. పెళ్ళి లాగానే జీవన సంస్కరణలైన షోడశ సంస్కారాలు కూడా వాటి ఉద్దేశం తెలుసుకొని ఆచరించడం ద్వారా పూర్ణ ఫలం ఉంటుంది.

ఈ విధంగా జ్ఞాని కర్మల్లోని స్పష్టతనే  అనుసరించటం సులువైన మార్గం. శాస్త్ర కర్మలు ఆడంబరంగా చేయడంవల్ల ప్రయోజనం అందకపోగా శాస్త్రాన్ని తులనాడిన దోషం కూడా తప్పదు !*_
       
🕉🌞🌏🌙🌟🚩

No comments:

Post a Comment