🌹 వ్యక్తిగా ఎదుగుదాం.. మంచి వ్యవస్థని నిర్మించుకుందాం..! 🌹

🌹 వ్యక్తిగా ఎదుగుదాం..🌹

🍃 మంచి వ్యవస్థని నిర్మించుకుందాం..! 🍃

వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఎదగాలంటే ముందు నువ్వు వ్యక్తివా..? కాదా..? అన్నది నిర్ణయించుకో ..

ఆ తర్వాత నీ వ్యక్తిత్వం ఎంటో తెలుసుకో.!

నీ ప్రపంచంలో నువ్వు చేసే పనులు, నీ చుట్టూ ఉన్న, నువ్వు ఎంచుకున్న మనుషులు నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబింప చేస్తాయి.

ఇది ప్రపంచానికి అనుగుణంగా బలవంతంగా నువ్వు భుజాన వేసుకున్న పద్దతులు లేదా ఈ ప్రపంచం బలవంతంగా నీపై రుద్దబడిన అభిప్రాయాలు..

కానీ ప్రపంచానికి ఇంకా పరిచయమవ్వని నువ్వెంటో, నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఆ తర్వాత ప్రపంచానికి పరిచయం చెయ్యాలి..

వ్యవస్థ వ్యక్తిని శాసించలేదు, కానీ, వ్యక్తి తలుచుకుంటే  వ్యవస్థని శాసించగలడు అలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకుందాం..

నువ్వు ఏ స్థాయి లో ఉన్న నీ కంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని కలువు, నువ్వు ఎలా ఉన్నావో, వారు ఎలా ఉన్నరో గమనించు కేవలం మౌనంగా గమనించు గ్రహించు... అవకాశం వచ్చినప్పుడే మాట్లాడు, మౌనం అనేది మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ దగ్గర  పాటిస్తే అది ఒక అపురూపమైన ఆభరణం, ఎందుకంటే అది మనలోని మంచి గుణాలని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది...

మంచి గుణాలు కలిగిన గొప్ప వారు చాలా అరుదుగా ఉంటారు, అందులోనూ వారు మీతో స్నేహ హాస్తం అందిస్తే అస్సలు వదులుకోకండి.. ఎందుకంటే ఇలాంటి వారు మన జీవితాలకి ఒక ప్రత్యేకమైన కోణాన్ని చూపిస్తారు .. వీరి ఆలోచనలు, వీరి లక్ష్యాలు చాలా భిన్నంగా ఉంటాయి వీరితో ఉంటే మీ జీవితానికి అంటూ ఒక అర్థం ఉంటుంది అని తెలుసుకుంటారు..                     

చివరగా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఇలాంటి వాటితో పోల్చుకోవచ్చు..

ఒక వ్యక్తి తనకి జీతం వస్తున్నా కూడా లంచం తీసుకునే అలవాటు ఉంది,  కానీ ఆ లంచం ఇచ్చే వ్యక్తికి కొన్ని అనారోగ్య కారణాల వల్ల నెల నెల వైద్యానికి కూడా డబ్బు సరిపోదు.. అలాంటి వ్యక్తి మనసు కి కష్టమనిపించిన ఆ లంచం ఇచ్చి పని పూర్తి చేయించుకుంటాడు..

లంచం తీసుకున్న వ్యక్తి పిల్లల జల్సాల కోసం, భార్య బంగారు నగల కోసమో ఖర్చు  చేస్తాడు .. నెల తిరిగే సరికి ఆ వ్యక్తి అనారోగ్యం కారణంగా మరణిస్తాడు ఈ విషయం లంచం తీసుకున్న వ్యక్తికి ఎలాగోలా   తెలిసింది...

ఆ లంచం తీసుకున్న వ్యక్తి స్థానం లో మీరు ఉన్నట్టు ఊహించుకోండి.* *(క్షమించండి కేవలం మీకు అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతో)..!

ఇందులో లంచం తీసుకున్న వ్యక్తికి కరుణ, జాలి, దయ, విధి నిర్వహణ కర్తవ్యం ఎక్కడ ఉంది..? ఇవి లేకుండా వ్యక్తిత్వం ఎలా నిర్ణయింపబడుతుంది ..

ఒక వేళ ఆ లంచం ఇచ్చే స్థానం లో మీరు ఉంటే  ఆ అనారోగ్య కారణాల వల్ల మీరు ఎంత వేదనను అనుభవిస్తారు... ఈ సమాజం పై ఎంత అసహనాన్ని ప్రకటిస్తారు... మీరు ఎన్నుకున్న పాలకులను ఎంతగా అసహ్యించుకుంటారు.. ఒక్కసారి ఆలోచించండి... !

మీరు ప్రాపంచిక అవసరాల కోసం ఎంత కష్టపడిన కేవలం సుఖాన్ని మాత్రమే పొందగలుగుతారు కానీ ఆనందాన్ని,సంతోషాన్ని, మానసిక తృప్తిని పొందలేరు..

మీరు ప్రేమను మాత్రమే ప్రపంచానికి పంచండి..

కోపాన్ని, పగని పెంచుకునే వారిని వదిలేయండి.

అవసరమైతే వారి వల్ల మీ మనసుకు కష్టం అనిపిస్తే మనస్పుర్తిగా క్షమించేసి మీ దారిలో మీరు సమయం వృధా చేసుకోకుండా సాగిపోండి....

🌹🌹🌹🌹🌹🌹🌹
🙏  ప్రసాద్

No comments:

Post a Comment