🌹 త్యాగము, వైరాగ్యమే - మోక్షం 🌹
🍃 *ముఖ్య సాధనా సూచన 1* 🍃
*🌴మానవుడు బంధాలలో ఉన్నంత వరకూ నిజమైన సుఖశాంతులు పొందలేడు. ప్రశాంతతో కూడిన జీవితం త్యాగము, వైరాగ్యము ద్వారానే సాధ్యపడుతుంది.*
*వైరాగ్యమనగా ఇల్లు వాకిలి, కుటుంబాన్ని వదిలేసి అడవులకు పోయి తపస్సుకి కూర్చోవడం కాదు. చాలామంది తమను ఇల్లు, సమాజమే పాడు చేసేసిందని అనుకుంటారు. కానీ అది తప్పు. మన మనసు అనుమతి లేనిదే మనలను ఏ విషయమూ కదిలించలేదు.*
*అంటే మనలను పాడుచేసేది మన మనస్సే కానీ వేరే ఏవీ కావు. కనుక ముందు మనస్సును గెలవాలి. దానిని సరైన మార్గంలో పెట్టాలి. అంటే భగవంతుని ఆశ్రయించి ఉండాలి. ఆయనే మనసు సరైన త్రోవలో పెట్టగల సమర్ధుడు..*
*ఇంకా మనసులోని చెడును త్యాగం చేసి దానిని భగవంతుని వైపు తిప్పాలి. ప్రపంచమందలి వస్తు సుఖాలు అనిత్యములని తెలుసుకోవాలి. అపుడు వైరాగ్యము దానంతటదే కలుగుతుంది. మనసు మాధవునిపై ఉంటే ఇంటిలో ఉండైనా మోక్షంను పొందగలం.*
*మనసు ప్రపంచంపై తిరుగుతుంటే అన్నీ వదిలేసి అడవులలో కూర్చుని ఏమి ప్రయోజనం?? !🌴_*
🌹 🌹 🌹🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్
No comments:
Post a Comment