మనోశక్తి - Mind Power - 74

Image may contain: 1 person, indoor
🌹. మనోశక్తి  - Mind Power  - 74 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 65 :-- నాగరికత జననం, మరణం. 🌻

1) ప్రతి జీవికి జనన మరణ చక్రాలున్నట్లే ప్రతి నాగరికతకు జనన మరణ చక్రాలుంటాయి.

ప్రతి నాగరికతకు లక్ష్యం ఉంటుంది. మానవ జాతి ఇతర జీవజాతులు అన్నీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి.
మానవజాతి సూక్ష్మ శరీరంతో 
ఇతర లోకాలకు వెళ్లగల సామర్ధ్యం కలిగివున్నాడు. 

అలాగే ఇతర జీవజాతులు కూడా అదే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.

2) ఒక్కొక్క నాగరికతలో జీవులు ఒక్కొక్క రీతిలో భౌతిక దేహాలను కలిగి ఉన్నాయి.ఒక నాగరికతలో ఉన్నజీవజాతులు మరో నాగరికతలో continue అవ్వవచ్చు ,లేదా
అంతరించవచ్చు.

3) కొన్ని నాగరికతల్లో కనీ విని ఎరుగని జంతువులు ఉండేవి,
అవి ఇప్పటి నాగరికతలో లేవు
మనుషుల రూపాలు ఒక నాగరికతలో ఒక లాగా మరో నాగరికతలో మరో లాగా ఉండేవి.

4) ఒక నాగరికత లో 50 అడుగుల ఎత్తు ఉండి భారికాయులు లాగా ఉండేవారు,వారి ఆయుష్షు కొన్ని వందల సంవత్సరాలు ఉండేది.
జంతువు తల+మనిషి దేహం
మనిషి తల+జంతువు దేహం
సగం మనిషి +సగం చేప 
కొన్ని నాగరికతల్లో సముద్రజాతి,కొన్ని నాగరికతల్లో  జంతువులు, dominate చేయడం జరిగింది.ప్రస్తుతం మనం domination ఉంది.

5) కొన్ని నాగరికతల్లో వేరే లోకాలకు పయనించి అక్కడి జ్ఞానం భూమి మీదకు తీసుకువచ్చారు.

6).ఒక నాగరికతలో ఉద్భవించిన జీవజాతులు మరింత ఉన్నతి కోసం మళ్లీ భూమి మీద వేరే భౌతిక రూపాలు ఎంచుకుని వేరే లక్ష్యాలు ఎంచుకుని సవాళ్లు ఎంచుకుని వేరే నాగరికతలోకి ప్రవేసిస్తాయి.

7) మన దేహంలో ఒక భాగం పాడైతే శరీరం మొత్తం ఆ బాధను అనుభవించాల్సి ఉంటుంది. దేహంలోని ఇతర భాగాలన్ని దానికి సహకరించి ఆ బాధను తొలగిస్తాయి.
అలాగే భూమి మీద ఒక జాతి crisis లో ఉంటే దాన్ని అన్ని జాతులు భరించాల్సి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

Twelve Stanzas from the Book of Dzyan - 3

🌹 Twelve Stanzas from the Book of Dzyan - 3 🌹
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

🌻 STANZA I - The Genesis of Divine Love - 3 🌻

7. Love reigned supreme all over the world! She was calm and content in her earthly domains. 

All the celestial bodies supported her in that Divine Work. Only the Sun sometimes peered anxiously into the bowels of Earth during the times when she hid her sides from him as she rotated. 

Because of the density of Matter, the Sun was not able to glimpse what was happening on the other side of the planet.

8. Eventually, robust vegetation girdled the world, hiding the gentle flowers in its shadow and choking their tiny stems with its mighty roots. 

These giants seized power and began to swallow light greedily, cutting off the warm solar rays from those who were shorter and much weaker than they. Without the caressing warmth of the All-Loving Sun, lesser creatures withered and perished. 
🌹 🌹 🌹 🌹 🌹

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 14

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 14 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 2 🌻

ప్రేయోమార్గమని మరొక మార్గముంది. అందులో ప్రధానమైన సమస్య ఏమిటంటే సుఖానికి దగ్గరిదారిగా కనబడుతుంది, కానీ శాశ్వతముగా దుఃఖాన్ని అందిస్తుంది. ఇంకేమిటట అందులో దోషం? జననమరణ చక్రంలో పడేట్లుగా చేస్తుంది. కర్మచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. కాలచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. ద్వంద్వానుభూతులయందు మరిగిపోయేట్లుగా చేస్తుంది. తనని తాను మరచిపోయేటట్లుగా చేస్తుంది. 

స్వయం స్థితిని మరచిపోయేట్లుగా చేస్తుంది. హృదయస్థానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. స్వీయజ్ఞానాన్ని, స్వరూపజ్ఞానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. ఇన్ని దోషములు వున్నాయి కాబట్టి పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది.

   శ్రేయోమార్గంలో ఇవన్నీ వ్యతిరేకం. అంటే నీ హృదయస్థానంలో నువ్వు నిలబడి వుంటావు. నీ స్వరూప జ్ఞానంలో నువ్వు నిలబడి ఉంటావు. 

స్వాత్మానుభూతి యందు నిలకడ కలిగి వుంటావు. స్వాత్మనిష్ఠుడవై వుంటావు. సర్వవ్యాపక లక్షణాన్ని కలిగివుంటావు. పరిమితమైనటువంటి అజ్ఞానము , అవిద్యకు దూరంగా వుంటావు. జననమరణ చక్రాలలో నుంచి బయటపడతావు. కర్మచక్రానికి అంటకుండా వుంటావు. ద్వంద్వానుభూతులకి విలక్షణుడవై వుంటావు. 

కాబట్టి శ్రేయోమార్గము ఉత్తమమైనటువంటిది. కాబట్టి అట్టి శ్రేయోమార్గమునే మానవులందరూ కూడా ఆశ్రయించాలి. అదే మానవుని యొక్క స్వధర్మము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 16 / The Siva-Gita - 16

🌹. శివగీత - 16 / The Siva-Gita - 16 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము - 7 🌻

మునే ! సర్వ మిదం సత్యం - యన్మ దగ్రే త్వయేరితమ్ 40

తదాపిన జహాత్యేత - త్ప్రార బ్దా దృష్ట ముల్బణమ్,
మత్తం కుర్యా ద్యదా మద్యం - నష్టా విద్య మపి ద్విజమ్ 41

తద్వత్ప్రా రబ్ద భోగో పిన జహాతి వివేకినమ్,
తతః కింబ హునోక్తేన - ప్రారబ్ద స్స శివ స్మృరః 42

బాధతే మాం ది నారాత్ర - మహంకారో పితా దృశః.
అత్యన్త పీడితో జీవ - స్థ్సూల దేహం విముం చతి 43

తస్మా జ్జీవాప్తయే మహ్య - ముపాయః క్రియతాం ద్విజ!
ఇతి శ్రీ పద్మ పురాణే, శివ గీతాయా ద్వితీయో ధ్యాయః 44

శ్రీ రాముడు పలుకును : ఓయీ ముని పుంగవా! మీరు నా యందలి 
అనుగ్రహముచేత నేమి యాన తిచ్చితిరో అవి యన్నియు 
వాస్తవములే అయినప్పటికిన్ని, నా ప్రారబ్ధ రూపంబగు ప్రియురాలైన
 సీత యొక్క ఎడబాటుతో నాలో రగిలిన దుఃఖాగ్ని యుపశమింపకున్నది.

 ఆ కారణము వలన వేయేల? నా ప్రారబ్ధ రూపుండైన శివుడే 
అలరు విల్తుని రూపంబున నన్ను రేయింబవళ్ళు వేధింపు చున్నారు. 
అహంకారము కూడా అటువంటిదే. 
ఈ విధముగా ప్రాణి మిగుల పీడింప బడినచో నీ జడ దేహము విడిపోవును. 

కనుక ఓ శివ భక్తాగ్రేసరా ! జీవ ధారణ చేయుటకు ఉపాయ మేదో తెల్పుము.
ఇది వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో ద్వితీయో ధ్యాయము సమాప్తము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 The Siva-Gita - 16 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 7 🌻

40. 41. Sri Rama said: Hey Muni! Whatever discourse of Vairagya you gave to me is indeed true however due to my Prarabdha Karma the sadness which is burning me like fire, which is caused due to the separation from my beloved is not getting put off. 

42. That Prarabdha which is of the form of Shiva is himself tormenting me day and night. Even pride is also like that. 

In this way if a being gets tormented then there are chances for this body to fall down. Hence Hey foremost devotee of Shiva! Show me the path to Jeevadharana 

43. Here ends the second chapter of Shiva Geeta from Padma Purana Uttara Khanda

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 8 / Sri Gajanan Maharaj Life History - 8

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 8 / Sri Gajanan Maharaj Life History - 8 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 2వ అధ్యాయము - 4 🌻

ఇంటికి చేరుతున్న ఆవులు శ్రీకృష్ణుడు అనుకుని శ్రీగజానన్ చుట్టూచేరాయి. దుకాణుదారులు సాయంత్రం దీపంపెట్టే సమయంలో శ్రీమహారాజును బనకటలాల్ తమ ఇంటికి తెస్తాడు. 

యోగిని చూచినంత మాత్రంలోనే అతి ఆనందంతో భవానీరాం అతనికి మొక్కి కూర్చునేందుకు ఒక చెక్కపీట ఇచ్చి ఇలా అన్నాడు: శివుని అవతారం అయిన మీరు ఈవిధంగా సాయంత్రం మాయింటికి విచ్చేసారు, నేను భోజనం పెడదామనుకుంటున్నాను, దయచేసి అంగీకరించండి. ఈవిధంగా సాయంత్రం సమయంలో మిమ్మల్ని ఇంటి దగ్గర పొందడానికి నేను చాలా అదృష్టవంతుడను. 

సాయంత్రం సమయంలో శివుని ఆరాధించే అవకాసం దొరకడము చాలా అదృష్టమని స్థందపురాణంలో కూడాచెప్ప బడింది. ఈవిధంగా అంటూ శ్రీమహరాజును భిల్వ పత్రంతో పూజిస్తాడు. బనకటలాల్ తండ్రి శ్రీమహరాజును భోజనానికి అయితే ఆహ్వనించాడు కానీ భోజనం ఇంకా తయారుకాలేదు. 

ఒకవేళ భోజనంతయారు అయ్యేవరకు ఈయోగి ఆగకపోతే చాలానిరాశ అవుతుంది. ఎందుకంటే భగవాన్ శివుడు ఈవిధంగా భోజనం తీసుకోకుండా తన ఇల్లు వదలి వెళ్ళిపోవడం. అందుచేత ఏమి చేయాలనే సంస్జిద్ధంలో పడ్డాడు. 

ఆలోచించి శ్రీమహరజుకు ఉదయం తయారుచేసిన పూరీలు పెడదామని నిర్ణయించాడు, కారణం వేగించిన వస్తువులు పాచి పట్టినవిగా భావించరని. దీనికంటే ముఖ్యంగా తను నిష్కల్మమయిన మనస్సుతో ఈవిధంగా భోజనం కోసం మహరాజును ఆహ్వనించాను అని అతనికి తెలుసు. 

అందుకని పూరీలు, బాదములు, ఎండు ద్రాక్షలు, అరటిపండ్లు మరియు నారింజలు ఒక పళ్ళెంలోతెచ్చి శ్రీమహారాజు ముందు పెడతాడు. నుదుటికి విభూధి పెట్టి మెడలో ఒకపూలహారం కూడావేసాడు. 

శ్రీగజానన్ వడ్డించిన ప్రతి వంటకం తింటూ, కనీసం ముగ్గురు తినగలిగే అహారంతిని ఆరాత్రికి బనకటలాల్ ఇంటిలోనే బసచేసారు. మరుసటి రోజు ఉదయం వంద బిందెలనీళ్ళతో బనకటలాల్ శ్రీగజానన్ కు మంగళ స్నానం చేయించాడు. 

పురుషులు, స్త్రీలు ఆయనకు సుగంధ తైలమర్దనం చేసి, సబ్బుతోతోమి, కడిగి స్నానం చేయించారు.స్నానం తరువాత మంచిఖరీదయిన కాషాయవస్త్రం ధరించేందుకు ఇచ్చి ఒకఎత్తయిన అలంకరించిన ఆసనంమీద కార్చుండబెట్టారు. 

తులసీదళాలు ఉన్న పూలహారాలు ఆయన మెడలో వేసి గంధం నుదుటి మీదపెట్టి, పండ్లు, మిఠాయిలు తినడంకోసం ఇచ్చారు. 

ఆవిధంగా బనకటలాల్ ఇల్లు భక్తులకు ద్వారకలా అయింది. న ఇచ్చారా ఆ వ్య యంత్రం, ఇళ్ళారా నవ్వేకరించి తిన్న తరువా ఆరోజు సోమవారం మహాశివునికి ప్రియమయిన రోజు. 

ఒకేఒక వ్యక్తితప్ప, మిగిలినవారు శ్రీగజానన్ను ఆరాధించి కోరిక నెరవేర్చుకున్నారు. ఆవ్యక్తి బనకటలాల్ కుటుంబీకుడయిన ఇఛ్ఛారాం. అతను శివభక్తుడు మరియు ఆరోజు శివుని ప్రియమైన సోమవారం కావడంవల్ల శ్రీగజానన్ శివస్వరూపం కాబట్టి సాయంత్రం పూజించాలని కోరుకున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 8 🌹
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 2 - part 4 🌻

Cows returning home, gathered around Shri Gajanan thinking Him to be Shri Krishna.

Shopkeepers were preparing to light the lamps when Shri Bankatlal brought Shri Gajanan Maharaj to his house.

 Bhavaniram, overjoyed at the sight of a saint, prostrated before Him, offered Him a wooden Pata to sit on and said You are an incarnation of Shri Shankar, coming to us at the evening. I wish to offer You food, so please kindly accept it. 

I am really very fortunate to have You at my place in the evening. Skandhapurana says that it is a great fortune to worship Lord Shankar in the evening.

 Saying so, he respectfully worshipped Shri Gajanan Maharaj with Bilwapatra. 

Bankatlal's father was now worried because he had requested Shri Gajanan Maharaj to accept the food at his house; however, in fact the food was not yet ready, and if this saint did not wait till the food gets ready, it would be a great disappointment, as this would mean that Lord Shankar going away, without taking any food in the evening from his house. 

So he was in a fix. What to do? He thought over the matter and decided to offer Shri Gajanan Maharaj puris which were prepared in the morning, as fried food is not treated as stale. Moreover he knew that his mind was pious and sincere in offering food to Shri Gajanan. 

Accordingly he brought a thali full of puris, almonds, dates, bananas, and oranges and put it before Shri Gajanan. He applied Bukka on His forehead and put a garland around His neck. 

Shri Gajanan ate everything that was served, consumed about three seers of food and stayed that night with Bankatlal. Next morning Bankatlal gave Shri Gajanan a ceremonious bath with one hundred pitchers of water. Men and women washed Him with soap and massaged His body with scented oils. 

After the bath, a very costly Pitambar (yellow robe) was given to Him to wear and made Him sit on a well-decorated high seat. Garlands of flowers and Tulsi were put around His neck, Kesar paste was applied on His forehead and fruits and sweets were offered to Him to eat. Thus Bankat's house became Dwarka for all the devotees. 

That was Monday, the auspicious day of worshipping Lord Shankar. All the people fulfilled their desire of worshipping Shri Gajanan except one. 

That was Ichharam, a cousin of Bankatlal. He was a devotee of Lord Shankar and it being a Monday, the day of Lord Shiva, he wished to worship Shri Gajanan at evening time by treating Him to be Lord Shiva.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

30-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 443 / Bhagavad-Gita - 443🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 231 / Sripada Srivallabha Charithamrutham - 231 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 133🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 50 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 18 🌹
8) 🌹. శివగీత - 15 / The Shiva-Gita - 16🌹
9) 🌹. సౌందర్య లహరి - 58 / Soundarya Lahari - 58🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 357 / Bhagavad-Gita - 357🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 184🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 60 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 56🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 71 🌹
15) 🌹 Seeds Of Consciousness - 135 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 74 🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 20🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 3 🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 14🌹
19) 🌹. సాయి తత్వం - మానవత్వం - 58 / Sai Philosophy is Humanity - 58 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 443 / Bhagavad-Gita - 443 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 53 🌴*

53. నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా |
శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ||

🌷. తాత్పర్యం : 
దివ్యచక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపము వేదాధ్యయనముచే గాని, తీవ్రతపస్సులచే గాని, దానముచే గాని, పూజలచేగాని అవగతము కాదు. మనుజుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవియన్నియును సాధనములు కాజాలవు.

🌷. భాష్యము : 
శ్రీకృష్ణుడు తన జననీజనకులైన దేవకీవసుదేవులకు తొలుత చతుర్భుజ రూపమున దర్శనమిచ్చి పిదప ద్విభుజరూపమునకు మార్పుచెందెను. 

ఈ విషయమును అవగాహనము చేసికొనుట నాస్తికులైనవారికి లేదా భక్తిరహితులకు అత్యంత కఠినము. వేదవాజ్మయమును కేవలము వ్యాకరణజ్ఞానరూపములో లేదా విద్యాయోగ్యతల రూపములో అధ్యయనము చేసిన పండితులకు శ్రీకృష్ణుని అవగతము చేసికొనుట అసాధ్యము. 

అలాగుననే అంతరంగమున భక్తిభావము లేకుండా బాహ్యముగా పూజలొనర్చుటకు మందిరమునకేగు మనుజులకు సైతము అతడు అవగతము కాడు. వారు మందిరదర్శనము కావించుకొనినను శ్రీకృష్ణుని యథార్థరూపము నెరుగలేరు. 

కేవలము భక్తియోగమార్గము ద్వారానే శ్రీకృష్ణుడు యథార్థముగా అవగతము కాగలడు. ఈ విషయము అతని చేతనే స్వయముగా రాబోవు శ్లోకమున వివరింపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 443 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 53 🌴*

53. nāhaṁ vedair na tapasā
na dānena na cejyayā
śakya evaṁ-vidho draṣṭuṁ
dṛṣṭavān asi māṁ yathā

🌷 Translation : 
The form you are seeing with your transcendental eyes cannot be understood simply by studying the Vedas, nor by undergoing serious penances, nor by charity, nor by worship. It is not by these means that one can see Me as I am.

🌹 Purport :
Kṛṣṇa first appeared before His parents Devakī and Vasudeva in a four-handed form, and then He transformed Himself into the two-handed form. This mystery is very difficult to understand for those who are atheists or who are devoid of devotional service. 

For scholars who have simply studied Vedic literature by way of grammatical knowledge or mere academic qualifications, Kṛṣṇa is not possible to understand. Nor is He to be understood by persons who officially go to the temple to offer worship. 

They make their visit, but they cannot understand Kṛṣṇa as He is. Kṛṣṇa can be understood only through the path of devotional service, as explained by Kṛṣṇa Himself in the next verse.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 231 / Sripada Srivallabha Charithamrutham - 231 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 44
*🌻. పృథ్వీ- జల యజ్ఞాల వివరణ 🌻*

*🌻. పృథ్వీ యజ్ఞం 🌻*

ఆ మరునాడు స్నాన, సంధ్యాదులు ముగించాక మేము, త్రిపురాంతకేశ్వరుని ఆలయానికి వెళ్ళాము. అక్కడే భాస్కరపండితులు శ్రీపాదుల మహిమ గురించి వివరించడం మొదలు పెట్టారు,"

 నాయనలారా! శ్రీపాదులు పీఠికా పురంలో అవతరించడంవల్ల అక్కడ భూమి చైతన్యాన్ని పొందింది. వారి మహా సంస్థాన నిర్మాణం తరువాత మెల్లమెల్లగా అక్కడ భూమి జాగృతమై భూమండలాన్ని అంతా జాగృతం చేస్తుంది. 

ఇలా జాగృతమైన ప్రదేశాలలో ఉన్న జనులు శ్రీపాదుల దివ్యాకర్షణ శక్తి వల్ల పీఠికా పురానికి ఆకర్షింపబడుతారు. శ్రీచరణులు సంచరించిన ప్రదేశాలన్ని కూడా జాగృతిని చెందుతాయి.
 
వారి శరణాగతి లోకి వెళ్ళినవారు అప్రయత్నంగానే ఆయా స్థలాలకు ఆకర్షింపబడుతారు. ఇంతేకాదు, ప్రతి జీవిలోను పృథ్వీ తత్వం ఉంటుంది. ఏ సాధకుల పృథ్వీతత్వం వారి దివ్య కరుణవల్ల జాగృతం అవుతుందో వాళ్ళు తప్పకుండా ప్రభువులు సంచరించిన పీఠికాపురం, కురువపురం మొదలైన ప్రదేశాలకి ఆకర్షింప బడుతారు. 

"అయ్యా! పృథ్వీ తత్వం జాగృతం అయిన వారందరూ భౌతికంగా ఆయా ప్రదేశాలు దర్శిస్తారా?" అని నేను నా సందేహాన్ని వ్యక్తం చేసాను. దానికి వారు నవ్వుతూ, “భౌతికంగా దర్శించినా, దర్శించ లేకపోయినా, సాధకుల పరిణతి స్థాయిని బట్టి వాళ్ళ చైతన్యం ఆయా ప్రదేశాలతో అనుసంధానం చెంది వాళ్ళు ఆ పురవాసులే అవుతారు. భౌతిక పీఠికాపురం వ్యాపించి ఉన్నంతమేరా స్వర్ణపీఠికాపురం ఉంది, ఇది కేవలం దత్తుని చైతన్యంతో నిర్మితమైనది. 

చెక్కు చెదరని భక్తి, శ్రద్ధలవల్ల ఏ క్షణాన సాధకుని చైతన్యం ఈ దివ్య చైతన్యంతో కలుస్తుందో ఆ క్షణంనుండి అతను స్వర్ణపీఠికా పురవాసే అవుతాడు. ఇది చర్మ చక్షువులకు కాక, ఙ్ఞాన చక్షువులకు, యోగ చక్షువులకు మాత్రమే కనిపిస్తుంది. 

అలాగే భౌతిక కాశి ఉన్నంతమేర స్వర్ణకాశి వ్యాపించి ఉంది, నేను కాశీకి వెళ్ళు తున్నాను, అక్కడే నివసిస్తాను అని ఎవరయితే దృఢంగా నిర్ణయం తీసుకొని మానసికంగా తాపత్రయపడుతారో వాళ్ళు భౌతికంగా ఎక్కడ ఉన్నా వాళ్ళకి కాశీవాస ఫలితం తప్పక లభిస్తుంది" అని విశదీకరించారు. 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 231 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 24
*🌻 Siva in the form of ‘Pancha Bhutas’ 🌻*

The Pancha Bhutas (earth, water, fire, air and sky) are Siva’s forms. In our body, Pridhwi tatwam (earth) is present in Mooladhara. As a representative of that, sadhakas worship ‘Parthiva Lingam’.  

There is jala (water) tatwam in swadhisthana. Jala lingam represents that. Manipura chakram will have ‘agni tatwam’ and agli lingam represents it. 

 Vishuddhi chakram has got Vayu (air) tatwam. Vayu lingam represents it. The one which is in heart, the place of ‘aakasa’ (sky) is called Chidambara lingam. 

 This is called ‘aakasa lingam’ also and it has no form at all. The worship, darshan and propitiation of these ‘Pancha Bhuta’ lingas give great fruit. 

The Chidambara secret behind the screen in Chidambara kshetram is - there will be nothing if the screen is removed. The pure ‘aakaasa’ is Siva’s atma lingam. Hrudayam (heart) is the place of ‘chit’. So the aakaasa is the place of ‘atma’. 

 Aakasa has no form. Yogis who concentrate their mind with unwavering looks in dhyana for ‘self manifestation’, will have their ‘Hrudaya aakasam’ (the subtle sky in their heart) opened. 

 They see in their hearts all this creation, all brahmandas, stars and starlets. ‘Runam’ means ‘sin’. The one having no ‘Runam’ is ‘Arunam’. Parameswara is ‘Daharaakaasa’.  

He is there in Arunachalam in the form of Arunachaleswara, the hill of ‘arunachala’ and in the form of a great siddha. His darshan will remove all sins.  

The same Arunachaleswara manifested now in human form in Peethikapuram in the form of Sripada Srivallabha and is at present staying with divine lustre in Kurungadda with the intention of uplifting us. Kurungadda is equal to Arunachala Hill. 

 Sri Arunachaleswara who is in the form of Ardhanareeswara, is indeed Sripada Srivallabha. The Maha Siddha in Arunachala is also in the attire of ‘Yathiswara’. 

 Just like the hill of Arunachala the form of Siva, the Kurungadda is indeed the form of Sripada. There are Siva and Shakti in Arunachala Siva lingam. Similarly Siva and Shakti are there in Sripada Srivallabha form.  

The darshan of Parameswara in the form of Maha Siddha in Arunachalam, is extremely difficult. But the darshan of Maha Siddha in Sripada Srivallabha form is extremely easy’. 

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 111 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. సాధన యొక్క రెండు తరగతులు 🌻*

ఈ రెండు మార్గములలో మొదటి మార్గము వారికి పొరపాటులున్నచో పతనము తప్పదు. ఎంత తెలిసిన వారైనను నిర్ణయము తమది అయినపుడు తమ‌ పొరపాట్లకు తామే బాధ్యులు. ఈ పొరపాట్లను సర్దుకుని దైవమునకు తమ యెడ అనుకూల్యము కలిగించుకొను యత్నముండును. 

ఇక రెండవ తరగతి వారు పొరపాట్లు చేసినచో బాధ్యత తమదికాదు. కనుక వారి మార్గమున పతనము లేదు. ఈ ఇరు మార్గముల వారికిని క్రమశిక్షణ విషయమున, కర్తవ్య నిర్వహణము విషయమున సాధనమొక్కటే! అది లేనిచో రెండు‌ సంప్రదాయముల వారికిని తిరోగతియే గాని పురోగతి లేదు. 

కర్తవ్యమును నిర్వహించి పరిపూర్ణతను ఆర్జించుకున చూచువారు మొదటి తరగతి వారు. కర్తవ్యము నిర్వహించుకొని దానిని భగవదర్పితముగా విడిచిపెట్టువారు రెండవ తరగతి వారు. 

ఈ రెండు తరగతుల వారును వరుసగా జిజ్ఞాసువులు, ముముక్షువులు అనబడుదురు..
....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 133 🌹*
*🌴 Crises and Development - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 Crises of the Solar Angel - 1 🌻

At the beginning of creation there were many great crises where the developing creation was almost extinguished again. As the Indian Puranas narrate, however, high beings saved the creation from destruction. 

There are many stories about how Narada rescued the creation through his intelligent activity.

In the early days of mankind, in the mid-Lemurian period, a great crisis occurred when the Manasaputras, the Sons of Wisdom, awakened the mind in the animal man. 

This made us self-conscious, thinking persons and therefore we can think “I AM”. The soul that we are in our essence is part of a great being. 

It is also called Solar Angel and in the Vedic system Vasudevaya. In each of us, he works as an individual soul. It is as if in the water of a river there were thousands of glasses and in each glass there was water. 

As the Solar Angel descended into the personality, he experienced the crisis of individualization: the one soul appeared as many souls. 

This was part of the great Plan to implant spiritual light into the human beings and make them self-conscious. Two qualities were held back: spiritual love and spiritual life.

The Solar Angel is now again approaching a time of crisis and reorientation. When he realigns himself, everything that is lower than him must necessarily also realign itself to the new order. Now it is a matter of the many becoming one again. 

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Uranus. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 47 / Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 87

399. వ్యాపినీ -
 వ్యాపనత్వ లక్షణము కలది.

400. వివిధాకారా - 
వివిధములైన ఆకారములతో నుండునది.

401. విద్యావిద్యాస్వరూపిణీ - 
విద్యకు సంబంధించిన భాగమును, అవిద్యకు సంబంధించిన భాగమును తన రూపముగా గలది.

402. మహాకామేశ నయనకుముదాహ్లాద కౌముదీ -
 మహాకామేశ్వరుని కన్నులనెడు కలువపువ్వులకు ఆనంద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ.

🌻. శ్లోకం 88

403. భక్తహార్దతమోభేద భానుమద్భాను సంతతిః - 
భక్తుల హృదయగతమైన అంధకార అజ్ఞానమును భేదించునట్టి కాంతితో కూడిన సూర్యకిరణ పుంజము.

404. శివదూతీ - 
శివుని వద్దకు పంపిన దూతిక.

405. శివారాధ్యా - 
శివునిచే ఆరాధింపబడునది.

406. శివమూర్తిః - 
శివుని యొక్క స్వరూపము.

407. శివంకరీ - 
శుభములు చేకూర్చునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 47 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 47 🌻*

399 ) Vyktha Avyaktha swaroopini -  
 She who is visible and not visible

400 ) Vyapini -   
She who is spread everywhere

401 ) Vividhakara -   
She who has several different forms

402 ) Vidhya avidhya swaroopini -   
She who is the form of knowledge as well as ignorance

403 ) Maha kamesha nayana kumudahladha kaumudhi -  
 She who is like the full moon which opens the lotus like eyes of Lord Kameshwara

404 ) Bhaktha hardha thamo bedha bhanu mat bhanu santhathi -   
She who is like the sun’s rays which remove the darkness from the heart of devotees

405 ) Shivadhoothi -   
She who sent Shiva as her representative

406 ) Shivaradhya -   
She who is worshipped by Lord Shiva

407 ) Shiva moorthi -   
She who is of the form of Lord Shiva

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 50 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 28

*🌻 28. తస్యాః జ్ఞానమేవ సాధన మిత్యేకే 🌻*

   జ్ఞానం వల్లనే మోక్షమని కొందరి అభిప్రాయం. అది నిజమే. ఏది సాధించాలన్నా దాని పూర్వాపరాలు తెలియాలి. పెద్దల అనుభవంతో వ్రాయబడిన తత్సంబంధ శాస్త్రాలు పఠించాలి. సాధనలకు తగిన ఉపాయం తోచాలి. ఇదంతా జ్ఞానమే కదా ! 

అంతేకాదు ఆ వస్తువు మనకు అవసరమా? కాదా ? లేక ఎవరైనా సరే తప్పక సాధించవలసిన అవసర ముంటుందా ? ఇవన్నీ తెలిపేదే జ్ఞానం. ఇలాంటి ప్రశ్నలను అనుబంధ చతుష్టయంగా వేదాంతం చెబుతుంది.

            (1) విషయం (2) సంబంధం (3) ప్రయోజనం (4) అధికారి

ఇక్కడ విషయం అంటే భక్తి విషయం. దీని లక్ష్యంగా భగవదను భూతి సిద్ధిస్తుంది. సంబంధం అంటే మానవులందరికీ సంబంధించిందే ఈ భక్తి విషయం. అయితే మాత్రం, భక్తి సాధన చేయవలసిన అవసరమేమున్నది ? ప్రయోజన మున్నది గనుక చేయాలి. 

ఆ ప్రయోజనం వద్దనుకుంటే మరిన్ని జన్మలలో తిరు గాడుతూ కష్టాలు, బాధలు, వ్యాధులు, దరిద్రం, వృద్ధాప్య బాధలు, మరణ బాధ, గర్భస్థ నరకం మొదలగునవి తప్పవు. వీటినుండి విముక్తి కావటమే ప్రయోజనం. 

భగవంతుని చిన్న చిన్న కోరికలను తీర్చమని అడగటం కంటే ఆయనలో ఐక్యత చెందేటందుకు ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని కోరడం ప్రయోజనం కదా !

            భక్తి మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించాక దీనికి మానవు లందరూ అర్హులే. అహంకారాదుల అడ్డు తొలగితేగాని భగవదనుగ్రహం లభించదు గనుక, కొంత ముందస్తు సాధన చేయవలసి ఉంటుంది. అవే శమదమాదులు, యమ నియమాదులు. వీటిని సంపాదించినవాడు భక్తి మార్గంలో ప్రవేశించడానికి అధికారి. అయితే బాహ్యభక్తిని వెంటనే ఆరంభించవచ్చును. 

క్రమంగా అధికారి అయిునవాడు గౌణభక్తిని ముఖ్య భక్తిగా మార్చుకొనగలుగుతాడు. గమ్యమైనట్టి పరాభక్తిని సిద్ధింపచేసు కొంటాడు. యోగం కూడా అభ్యాసమైతే భగవదనుభూతి చెందడం తేలికవుతుంది. 

అంగన్యాస, కరన్యాస, హృదయన్యాస పూర్వకమైన అనుష్ఠానం కూడా పరాభక్తి లక్ష్యంగా చేయవచ్చును. ఆ భగవంతుడిని తన అంగాంగాలయందు భావిస్తూ చివరకు ఏకమొత్తంగా తానే భగవంతుడనే యోగం కలిగితే అదీ యోగ్యతే.

            నారద మహర్షి ప్రకారం భక్తి ప్రధానంగా చేసుకొని జ్ఞానం, యోగం సహాయంగా ఉండాలని నిర్ణయం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 18 🌹*
✍️. Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌷 Only the Guru whom you have hurt and discarded, he alone can wash away your sins and can uplift you. 🌷* 
 
We have learned that, deprived of the strength of Guru, Indra was unable to bear the effects of the sins of killing brahmins, and hence ran away from heaven and took shelter inside a narrow lotus stalk where he spent 10,000 years composing and continuously singing innumerable prayers. Indra could have easily avoided this great calamity. 

To this day we remember and chant the prayers composed by him, such as those addressed to Lakshmi, Datta, and other deities. Nahusha in the meantime became Indra, the Lord of Heaven. 

See what plight Indra had to suffer because he rebelled against Guru? Because of the merit earned by presiding over all the sacrificial rituals performed under the guidance of Viswaroopa, and because of the merit earned by composing and chanting the innumerable prayers, Lord Dattatreya appeared before Indra inside the lake where he was hiding, and disclosed to him the truth which Indra had yet not realized, that the root cause of all his suffering was that he blamed and rejected his Guru Brihaspati. 

Indra was fortunate that Datta gave Indra the clue to get over his predicament, “You knew that no one has the right to change Gurus as if exchanging vegetables. You were blinded by your arrogance. See how low you have had to fall because of your ego? 

People who keep switching their loyalty towards Guru, incur curses, and seek the shelter of other Gurus can never escape this kind of a terrible downfall which results from sin. 

Because you have sung my praises, I have appeared before you. But still, even if you surrender to me now, you will not be spared from the degradation caused to you by your rejection of Guru Brihaspati. 

Since you have blamed and rejected your original Guru Brihaspati, and you have caused him intense grief, regardless of how much penance you perform, and how many deities shower their grace upon you, your situation will not improve. 

The one and only means by which you can atone for your sins is to perform deep penance with unwavering devotion addressing your Sadguru Brihaspati, and to beg and plead with him fervently to forgive you for your sins. Only the Guru whom you have hurt and discarded, he alone can wash away your sins and can uplift you.” 

By his immensely compassionate nature, Datta blessed Indra with the strategy for overcoming his dire situation. Up until now, there was no one else who cared to show Indra the way out. 

Let us see how Indra, who has now realized his mistake, uses this knowledge to make amends, and what the future holds for him.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 16 / The Siva-Gita - 16 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 7 🌻*

మునే ! సర్వ మిదం సత్యం - యన్మ దగ్రే త్వయేరితమ్ 40

తదాపిన జహాత్యేత - త్ప్రార బ్దా దృష్ట ముల్బణమ్,
మత్తం కుర్యా ద్యదా మద్యం - నష్టా విద్య మపి ద్విజమ్ 41

తద్వత్ప్రా రబ్ద భోగో పిన జహాతి వివేకినమ్,
తతః కింబ హునోక్తేన - ప్రారబ్ద స్స శివ స్మృరః 42

బాధతే మాం ది నారాత్ర - మహంకారో పితా దృశః.
అత్యన్త పీడితో జీవ - స్థ్సూల దేహం విముం చతి 43

తస్మా జ్జీవాప్తయే మహ్య - ముపాయః క్రియతాం ద్విజ!
ఇతి శ్రీ పద్మ పురాణే, శివ గీతాయా ద్వితీయో ధ్యాయః 44

శ్రీ రాముడు పలుకును : ఓయీ ముని పుంగవా! మీరు నా యందలి 
అనుగ్రహముచేత నేమి యాన తిచ్చితిరో అవి యన్నియు 
వాస్తవములే అయినప్పటికిన్ని, నా ప్రారబ్ధ రూపంబగు ప్రియురాలైన
 సీత యొక్క ఎడబాటుతో నాలో రగిలిన దుఃఖాగ్ని యుపశమింపకున్నది.

 ఆ కారణము వలన వేయేల? నా ప్రారబ్ధ రూపుండైన శివుడే 
అలరు విల్తుని రూపంబున నన్ను రేయింబవళ్ళు వేధింపు చున్నారు. 
అహంకారము కూడా అటువంటిదే. 
ఈ విధముగా ప్రాణి మిగుల పీడింప బడినచో నీ జడ దేహము విడిపోవును. 

కనుక ఓ శివ భక్తాగ్రేసరా ! జీవ ధారణ చేయుటకు ఉపాయ మేదో తెల్పుము.
ఇది వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో ద్వితీయో ధ్యాయము సమాప్తము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 16 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
*🌻 Vairagya Yoga - 7 🌻*

40. 41. Sri Rama said: Hey Muni! Whatever discourse of Vairagya you gave to me is indeed true however due to my Prarabdha Karma the sadness which is burning me like fire, which is caused due to the separation from my beloved is not getting put off. 

42. That Prarabdha which is of the form of Shiva is himself tormenting me day and night. Even pride is also like that. 

In this way if a being gets tormented then there are chances for this body to fall down. Hence Hey foremost devotee of Shiva! Show me the path to Jeevadharana 

43. Here ends the second chapter of Shiva Geeta from Padma Purana Uttara Khanda

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 8 / Sri Gajanan Maharaj Life History - 8 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 2వ అధ్యాయము - 4 🌻*

ఇంటికి చేరుతున్న ఆవులు శ్రీకృష్ణుడు అనుకుని శ్రీగజానన్ చుట్టూచేరాయి. దుకాణుదారులు సాయంత్రం దీపంపెట్టే సమయంలో శ్రీమహారాజును బనకటలాల్ తమ ఇంటికి తెస్తాడు. 

యోగిని చూచినంత మాత్రంలోనే అతి ఆనందంతో భవానీరాం అతనికి మొక్కి కూర్చునేందుకు ఒక చెక్కపీట ఇచ్చి ఇలా అన్నాడు: శివుని అవతారం అయిన మీరు ఈవిధంగా సాయంత్రం మాయింటికి విచ్చేసారు, నేను భోజనం పెడదామనుకుంటున్నాను, దయచేసి అంగీకరించండి. ఈవిధంగా సాయంత్రం సమయంలో మిమ్మల్ని ఇంటి దగ్గర పొందడానికి నేను చాలా అదృష్టవంతుడను. 

సాయంత్రం సమయంలో శివుని ఆరాధించే అవకాసం దొరకడము చాలా అదృష్టమని స్థందపురాణంలో కూడాచెప్ప బడింది. ఈవిధంగా అంటూ శ్రీమహరాజును భిల్వ పత్రంతో పూజిస్తాడు. బనకటలాల్ తండ్రి శ్రీమహరాజును భోజనానికి అయితే ఆహ్వనించాడు కానీ భోజనం ఇంకా తయారుకాలేదు. 

ఒకవేళ భోజనంతయారు అయ్యేవరకు ఈయోగి ఆగకపోతే చాలానిరాశ అవుతుంది. ఎందుకంటే భగవాన్ శివుడు ఈవిధంగా భోజనం తీసుకోకుండా తన ఇల్లు వదలి వెళ్ళిపోవడం. అందుచేత ఏమి చేయాలనే సంస్జిద్ధంలో పడ్డాడు. 

ఆలోచించి శ్రీమహరజుకు ఉదయం తయారుచేసిన పూరీలు పెడదామని నిర్ణయించాడు, కారణం వేగించిన వస్తువులు పాచి పట్టినవిగా భావించరని. దీనికంటే ముఖ్యంగా తను నిష్కల్మమయిన మనస్సుతో ఈవిధంగా భోజనం కోసం మహరాజును ఆహ్వనించాను అని అతనికి తెలుసు. 

అందుకని పూరీలు, బాదములు, ఎండు ద్రాక్షలు, అరటిపండ్లు మరియు నారింజలు ఒక పళ్ళెంలోతెచ్చి శ్రీమహారాజు ముందు పెడతాడు. నుదుటికి విభూధి పెట్టి మెడలో ఒకపూలహారం కూడావేసాడు. 

శ్రీగజానన్ వడ్డించిన ప్రతి వంటకం తింటూ, కనీసం ముగ్గురు తినగలిగే అహారంతిని ఆరాత్రికి బనకటలాల్ ఇంటిలోనే బసచేసారు. మరుసటి రోజు ఉదయం వంద బిందెలనీళ్ళతో బనకటలాల్ శ్రీగజానన్ కు మంగళ స్నానం చేయించాడు. 

పురుషులు, స్త్రీలు ఆయనకు సుగంధ తైలమర్దనం చేసి, సబ్బుతోతోమి, కడిగి స్నానం చేయించారు.స్నానం తరువాత మంచిఖరీదయిన కాషాయవస్త్రం ధరించేందుకు ఇచ్చి ఒకఎత్తయిన అలంకరించిన ఆసనంమీద కార్చుండబెట్టారు. 

తులసీదళాలు ఉన్న పూలహారాలు ఆయన మెడలో వేసి గంధం నుదుటి మీదపెట్టి, పండ్లు, మిఠాయిలు తినడంకోసం ఇచ్చారు. 

ఆవిధంగా బనకటలాల్ ఇల్లు భక్తులకు ద్వారకలా అయింది. న ఇచ్చారా ఆ వ్య యంత్రం, ఇళ్ళారా నవ్వేకరించి తిన్న తరువా ఆరోజు సోమవారం మహాశివునికి ప్రియమయిన రోజు. 

ఒకేఒక వ్యక్తితప్ప, మిగిలినవారు శ్రీగజానన్ను ఆరాధించి కోరిక నెరవేర్చుకున్నారు. ఆవ్యక్తి బనకటలాల్ కుటుంబీకుడయిన ఇఛ్ఛారాం. అతను శివభక్తుడు మరియు ఆరోజు శివుని ప్రియమైన సోమవారం కావడంవల్ల శ్రీగజానన్ శివస్వరూపం కాబట్టి సాయంత్రం పూజించాలని కోరుకున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 8 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 2 - part 4 🌻*

Cows returning home, gathered around Shri Gajanan thinking Him to be Shri Krishna.

Shopkeepers were preparing to light the lamps when Shri Bankatlal brought Shri Gajanan Maharaj to his house.

 Bhavaniram, overjoyed at the sight of a saint, prostrated before Him, offered Him a wooden Pata to sit on and said You are an incarnation of Shri Shankar, coming to us at the evening. I wish to offer You food, so please kindly accept it. 

I am really very fortunate to have You at my place in the evening. Skandhapurana says that it is a great fortune to worship Lord Shankar in the evening.

 Saying so, he respectfully worshipped Shri Gajanan Maharaj with Bilwapatra. 

Bankatlal's father was now worried because he had requested Shri Gajanan Maharaj to accept the food at his house; however, in fact the food was not yet ready, and if this saint did not wait till the food gets ready, it would be a great disappointment, as this would mean that Lord Shankar going away, without taking any food in the evening from his house. 

So he was in a fix. What to do? He thought over the matter and decided to offer Shri Gajanan Maharaj puris which were prepared in the morning, as fried food is not treated as stale. Moreover he knew that his mind was pious and sincere in offering food to Shri Gajanan. 

Accordingly he brought a thali full of puris, almonds, dates, bananas, and oranges and put it before Shri Gajanan. He applied Bukka on His forehead and put a garland around His neck. 

Shri Gajanan ate everything that was served, consumed about three seers of food and stayed that night with Bankatlal. Next morning Bankatlal gave Shri Gajanan a ceremonious bath with one hundred pitchers of water. Men and women washed Him with soap and massaged His body with scented oils. 

After the bath, a very costly Pitambar (yellow robe) was given to Him to wear and made Him sit on a well-decorated high seat. Garlands of flowers and Tulsi were put around His neck, Kesar paste was applied on His forehead and fruits and sweets were offered to Him to eat. Thus Bankat's house became Dwarka for all the devotees. 

That was Monday, the auspicious day of worshipping Lord Shankar. All the people fulfilled their desire of worshipping Shri Gajanan except one. 

That was Ichharam, a cousin of Bankatlal. He was a devotee of Lord Shankar and it being a Monday, the day of Lord Shiva, he wished to worship Shri Gajanan at evening time by treating Him to be Lord Shiva.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 58 / Soundarya Lahari - 58 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

58 వ శ్లోకము

*🌴. అమ్మ దీవెనలతో అన్ని వ్యాధుల నుండి విముక్తి, ప్రజలచే గౌరవించ బడుటకు 🌴*

శ్లో: 58. అరాళం తే పాళీయుగళ మగరాజన్య తనయే నకేషా మాధత్తే కుసుమశర కోదండ కుతుకంl 
తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలసన్ అపాజ్గవ్యాసజ్గో దిశతి శరసంధాన ధిషణామ్ll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! పర్వత రాజ పుత్రీ నీ వంకరగా ఉన్న కణతల జంట ఎవరి మనస్సుకు అయినా మన్మధుని వింటి యొక్క సౌందర్యమును కలిగించును , ఎలాగు అనగా నీ కటాక్ష వీక్షణము కనుకొలకులను దాటి చెవి త్రోవ మీదుగా మెరయుచున్న బాణములు వదులుచున్న భావము కలిగించు చున్నది కదా!

🌷. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1,000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, రకరకముల అన్నము, తేనె నివేదించినచో అమ్మ దీవెనల ద్వారా సర్వ రోగముల నుండి విముక్తి, ప్రజా గౌరవం కలుగును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SOUNDARYA LAHARI - 58 🌹* 
📚. Prasad Bharadwaj 

SLOKA - 58 🌹

*🌴 Cure from all Diseases and attract all people 🌴*

58. Araalam the paali-yugalam aga-rajanya-thanaye Na kesham adhatte kusuma-shara-kodhanda kuthukam; Tiraschino yathra sravana-patham ullanghya
vilasann- Apaanga- vyasango disati sara- sandhana- dhisanam 
 
🌻 Translation : 
Oh goddess, who is the daughter of king of mountains, who will not but believe, that the two arched ridges between your eyes and ears, are the flower bow of the god of love, side glances of your eyes, piercing through these spaces, makes one wonder as if the arrows have been, sent through thine ears.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering honey and variety rice as nivedhyam, one will be able to attract all people and get rid from all diseases.

🌻 BENEFICIAL RESULTS: 
Command over others, cure of diseases. 
 
🌻 Literal results: 
Dominance and vast influence in society.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 357 / Bhagavad-Gita - 357 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 04, 05🌴

04. బుద్ధిర్ జ్ఞానమసమ్మోహ: క్షమా సత్యం దమ: శమ: |
సుఖం దుఃఖం భవో(భావో భయం చాభయమేవ చ ||

05. అహింసా సమతా తుష్టిస్తపో దానం యశో(యశః |
భవన్తి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధా: ||

🌷. తాత్పర్యం :
బుద్ధి,జ్ఞానము, సంశయముగాని భ్రాంతిగాని లేకుండుట, క్షమాగుణము, సత్యము, ఇంద్రియనిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఃఖములు, జన్మము, మృత్యువు, భయము, భయరాహిత్యము, అహింస, సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, యశస్సు, అపకీర్తి మున్నగు జీవుల వివిధగుణములు నా చేతనే సృష్టించబడినవి.

🌷. భాష్యము : 
జీవుల శుభాశుభములైన వివధ గుణములన్నియును శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి. ఆ గుణములే ఇచ్చట వివరింపబడినవి.

విషయములను సరియైన దృక్పథముతో విశ్లేషించు శక్తియే బుద్ధి యనబడును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికమనెడి అవగాహనయే జ్ఞానము. 

విశ్వవిద్యాలయ చదువుతో లభ్యమైన జ్ఞానము భౌతికమునకు సంబంధించిన జ్ఞానమైనందున, వాస్తవజ్ఞానముగా ఆంగీకరింపబడదు. ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడుమ భేదము నెరుగగలుగుటయే వాస్తవజ్ఞానము. 

కాని నేటి ఆధునిక విద్యావిధానమున ఆధ్యాత్మికత్వమును గూర్చిన ఎట్టి జ్ఞానము లేదు. జనుల కేవలము భౌతికమూలకములు మరియు దేహావసరముల యెడ మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విద్యాలయజ్ఞానము అసంపూర్ణమై యున్నది.

మనుజుడు శంకను వదిలి దివ్యతత్త్వము నవగాహన చేసికొనినప్పుడు సంశయము మరియు భ్రాంతిరాహిత్యమనెడి (అసమ్మోహము) స్థితిని సాధించగలడు. అట్టివాడు నెమ్మదిగా అయినప్పటికిని నిక్కముగా భ్రాంతి నుండి ముక్తుడు కాగలడు. కనుక దేనిని కూడా గ్రుడ్డిగా ఆంగీకరింపక శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసియున్నది. 

ఓర్పు మరియు క్షమాగుణములను (క్షమ) అలవరచుకొని ఇతరుల సాధారణ అపరాధముల యెడ ఓర్పును కలిగి వారిని క్షమింపవలెను. ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా తెలియజేయుటయే సత్యమనుదాని భావము. వాస్తవములనెన్నడును తప్పుగా ప్రదర్శించరాదు. 

ఇతరులకు నచ్చునదైనప్పుడే సత్యమును పలుకుట సాంఘికమర్యాదయైనను వాస్తవమునకు అది సత్యసంధత కానేరదు. కావున వాస్తవములను సర్వులు అవగాహన చేసికొను రీతిలో సత్యమును నిక్కచ్చిగా పలుకవలెను. 

దొంగను దొంగయని పలికి జనులను సావధానపరచుటయే సత్యము కాగలదు. సత్యము కొన్నిమార్లు రుచింపకపోయినను ఎవ్వరును దానిని పలుకుట యందు జంకును కలిగియుండరాదు. 

ఇతరుల లాభము కొరకు వాస్తవములను ఉన్నవియున్నట్లుగా ప్రదర్శించవలెనని సత్యసంధత కోరును. సత్యమునకు ఒసగబడు నిర్వచనమిదియే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 357 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 04, 05 🌴

04. buddhir jñānam asammohaḥ
kṣamā satyaṁ damaḥ śamaḥ
sukhaṁ duḥkhaṁ bhavo ’bhāvo
bhayaṁ cābhayam eva ca

05. ahiṁsā samatā tuṣṭis
tapo dānaṁ yaśo ’yaśaḥ
bhavanti bhāvā bhūtānāṁ
matta eva pṛthag-vidhāḥ

🌷 Translation : 
Intelligence, knowledge, freedom from doubt and delusion, forgiveness, truthfulness, control of the senses, control of the mind, happiness and distress, birth, death, fear, fearlessness, nonviolence, equanimity, satisfaction, austerity, charity, fame and infamy – all these various qualities of living beings are created by Me alone.

🌹 Purport :
The different qualities of living entities, be they good or bad, are all created by Kṛṣṇa, and they are described here.

Intelligence refers to the power to analyze things in their proper perspective, and knowledge refers to understanding what is spirit and what is matter. 

Ordinary knowledge obtained by a university education pertains only to matter, and it is not accepted here as knowledge. Knowledge means knowing the distinction between spirit and matter. 

In modern education there is no knowledge about spirit; they are simply taking care of the material elements and bodily needs. Therefore academic knowledge is not complete.

Asammoha, freedom from doubt and delusion, can be achieved when one is not hesitant and when he understands the transcendental philosophy. 

Slowly but surely he becomes free from bewilderment. Nothing should be accepted blindly; everything should be accepted with care and with caution. 

Kṣamā, tolerance and forgiveness, should be practiced; one should be tolerant and excuse the minor offenses of others. Satyam, truthfulness, means that facts should be presented as they are, for the benefit of others. Facts should not be misrepresented. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 185 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
41. అధ్యాయము - 16

*🌻. సృష్టి వర్ణనము - 2 🌻*

సా పునర్మనునా తేన గృహీతాతీవ శోభనా | వివాహ విధినా తాతాసృజత్సర్గం సమైథునమ్‌ || 13

తస్యాం తేన సముత్పన్నస్తనయశ్చ ప్రియవ్రతః | తథైవోత్తానపాదశ్చ తథా కన్యాత్రయం పునః || 14

ఆ కూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః | ఆకూతిం రుచయే ప్రాదాత్కర్దమాయ తు మధ్యమామ్‌ || 15

దదౌ ప్రసూతిం దక్షాయోత్తానపాదానుజాం సుతాః |తాసాం ప్రసూతి ప్రసవైస్సర్వం వ్యాప్తం చరాచరమ్‌ || 16

హే వత్సా! మనువు మిక్కిలి సుందరియగు ఆమెను యథావిధిగా వివాహమాడి స్త్రీ పురుష సంపర్కజనితమగు సృష్టిని చేసెను (13). 

వారికి ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే కుమారులు, మరియు ముగ్గురు కుమార్తెలు జన్మించిరి (14). 

వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని పేర్లు. ఆ కూతిని రుచికి, దేవహూతిని కర్దమునికి (15), 

ప్రసూతిని దక్షునకు ఇచ్చి వివాహమును చేసిరి. వారిలో ప్రసూతి యొక్క సంతానముచే స్థావర జంగమాత్మకమగు జగత్తు అంతయూ వ్యాప్తమయ్యెను (16).

ఆ కూత్యాం చ రుచేశ్చాభూ ద్ద్వంద్వం యజ్ఞశ్చ దక్షిణా | యజ్ఞస్య జజ్ఞిరే పుత్రా దక్షిణాయాం చ ద్వాదశ || 17

దేవహూత్యాం కర్దమాచ్చ బహ్వ్యో జాతాస్సుతా మునే | దక్షాజ్ఞాతాశ్చతస్రశ్చ తథా పుత్ర్యశ్చ వింశతిః || 18

ధర్మాయ దత్తా దక్షేణ శ్రద్ధాద్యాస్తు త్రయోదశ | శృణు తాసాం చ నామాని ధర్మ స్త్రీ ణాం మునీశ్వ ర || 19

శ్రద్ధా లక్ష్మీర్ధృతిస్తుష్టిః పుష్టిర్మేధా తథా క్రియా | వసుర్బుద్ధిర్లజ్జా శాంతిస్సిద్ధిః కీర్తి స్త్రయోదశ || 20

రుచికి ఆకూతి యందు యజ్ఞము , దక్షిణ అను ద్వంద్వము కలిగెను. యజ్ఞమునకు దక్షిణయందు పన్నెండుమంది పుత్రులు కలిగిరి (17). 

ఓ మహర్షీ! కర్దమునకు దేవహూతియందు చాలామంది కుమారులు కలిగిరి. దక్షునకు ఇరువది నల్గురు కుమార్తెలు కలిగిరి (18). 

దక్షుడు శ్రద్ధా మొదలగు పదముగ్గురిని ధర్మునకు ఇచ్చి వివాహము చేసెను. ఓ మహర్షీ! ధర్ముని భార్యల నామములను వినుము (19).

 శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, వసువు, బుద్ధి, లజ్జా, శాంతి, సిద్ధి, కీర్తి అనునవి వారిపేర్లు (20).

తాభ్యాం శిష్టా యవీయస్య ఏకాదశ సులోచనాః | ఖ్యాతి స్సతీ చ సంభూతిః స్మృతిః ప్రీతిః క్షమా తథా || 21

సన్నతిశ్చానురూపా చ ఊర్జా స్వాహా స్వధా తథా | భృగుర్భవో మరీచిశ్చ తథా చైవాంగిరా మునిః || 22

పులస్త్యః పులహశ్చైవ క్రతుశ్చర్షివరస్తథా | అత్రిర్వసిష్ఠో వహ్నిశ్చ పితరశ్చ యథాక్రమమ్‌ || 23

ఖ్యాతాస్తా జగృహుః కన్యా భృగ్వాద్యాస్సాధకా వరాః | తతస్సంపూరితం సర్వం త్రైలోక్యం సచరాచరమ్‌ || 24

మిగిలిన పదకొండు సుందరులు వారికంటె చిన్నవారు. ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ (21), 

సన్నతి, అనురూప, ఊర్జ, స్వాహా, స్వధా అనునవి వారిపేర్లు. వీరిని క్రమముగా భృగువు, భవుడు, మరీచి, అంగిరస్సు (22), 

పులస్త్యుడు, పులహుడు, ఋషిశ్రేష్ఠుడగు క్రతువు, అత్రి, వసిష్ఠుడు అగ్ని మరియు పితరులు వివాహమాడిరి (23). 

భృగ్వాది సాధకశ్రేష్ఠులు ఈ కన్యలను స్వీకరించిన తరువాత స్థావర జంగమ ప్రాణులతో ముల్లోకములు నిండెను (24).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 60 🌹*
Chapter 16
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 Removing The Veil - 2 🌻*

This threshold between illusion and Reality is bridged only by the universal mind. 

In the Avatar's universal mind are harmonized the individual minds of all beings. Each  
limited individual mind is made of bindings, and it is these bindings that create the veil of  
ignorance which separates one from God. 

To cross this threshold between Reality and illusion the Avatar must lift away the veil, and this veil is not completely removed until one is prepared to abandon illusion forever Bindings serve the purpose of creating this veil between God and man, and this purpose is served as a preparation to see God, for once one sees God he sees nothing else ever again. He becomes blind to illusion. These bindings are as bandages around the eyes—they prepare one for the sight of God. But the bandages must be removed before divine sight can be given. 

It is the Avatar's work to remove these bandages, but the work  
is difficult because the bandages are so old and encrusted, and the consciousness is so used to being blind. 

The Avatar works by cutting the bandages, one by one, pulling them apart, and as light pours in through the thinner layers the Avatar suffers, because the pull of the forces of light and darkness intensifies. 

It takes a long time to remove all these bandages, for every cut produces pain, because when the forces of light and darkness meet there is always more struggle, and thus increased suffering. Because of this struggle between light and darkness, most must remain blindfolded during the whole process of the Avatar's work.  

The Avatar works in inexplicable ways to remove the veil, and it is when one sees  
the suffering he goes through in removing the bandages that one tears at his own veil.  

Through awareness of the Avatar's suffering one's veil is torn. Oh, the suffering of longing that one goes through, for the veil has been torn.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 56 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. వాసుదేవ మంత్ర లక్షణము - 3 🌻*

కనిష్ఠికాది కరాగ్రేషు ప్రకృతిం దేహకే ర్చయేత్‌ | పరాయ పురుషాత్మా స్యాత్‌ ప్రకృత్యాత్మా ద్విరూపకః.

ఓం పరాయాగ్న్యత్మనే చ వస్వర్కౌ చ ద్విరూపకః | అగ్నిత్రిమూర్తౌవిన్యస్య వ్యాపకం కరదేహయోః. 20

వాయ్వర్కౌ కరశాఖాసు సవ్యేతరకరద్వయే | హృది ముర్తౌ తనావేష త్రివ్యూహే తుర్యరూపకే. 21

కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్మాత్య ద్విరూపము. ''ఓం పరాయాగ్న్యత్మనే నమః" ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. 

ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యుందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహమైన తనువునందను వాయ్వర్కులను విన్యసించవలెను.

ఋగ్వేదం వ్యాపకం హస్తే అఙ్గులషు యజుర్న్యసేత్‌ | తలద్వయేథర్వ రూపం శిరో హృచ్చరణాన్తిగమ్‌. 22

ఆకాశం వ్యాపకం న్యస్య కరే దేహే తు పూర్వవత్‌ | అఙ్గులీషు చ వాయ్వాది శిరో హృద్గుహ్యపాదకే. 23

వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అరచేతులలో అథర్వమును, శిరోహృదయ చరణములయందు సామవేదమును, పంచవ్యూహమునందు ఆకాశమును, విన్యసించి కరములందును, దేహము నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్ముము చెప్పనట్లు న్యసించవలెను.

వాయుర్జ్యోతిర్జలం పృథ్వీ పఞ్చావ్యూహః సమీరితః |
మనః శ్రోత్రం త్వగ్దృగ్జిహ్వా ఘ్రాణం షడ్వ్యూహ ఈరితః || 24

వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచవ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రణము వీటి సముదాయము షడ్వ్యూహము.

వ్యాపకం మానసం న్యస్య తతోఙ్గుష్ఠాదితః క్రమాత్‌ |
మూర్ధాస్యహృద్గుహ్యపత్సు కథితః కరణాత్మకః. 25

ఆదిమూర్తిస్తు సర్వత్ర వ్యాపకో జీవసంజ్ఞితః |

వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది "పరమాత్మకవ్యూహన్యాసము". ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.

భూర్భువః స్వర్మహర్జనస్తపఃసత్యం చ సప్తధా.
కరే దేహే న్య సేదాద్యమఙ్గుష్ఠాదిక్రమేణ తు | 26

భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను.

తలసంస్థః సప్తమశ్చ లోకేశో దేహకే క్రమాత్‌.
దేవః శిరోలలాటాస్యహృద్గుహ్యాఙ్ఘ్రిషు సంస్థితిః |

ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.

అగ్నిష్టోమస్తథోక్థస్తు షోడశీ వాజ పేయకః 28

ఆతిరాత్రోప్తోర్యామశ్చ యజ్ఞత్మా సప్తరూపకః |

అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 71 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

43. “మమకారము, అహంకారము వదిలినటువంటి జ్ఞానులు పుణ్యమార్గము, పాపమార్గము రెండూకూడా విసర్జించినవాళ్ళు. కాబట్టి వాళ్ళు లోకాలలో ద్రిమ్మరులై తిరుగగలరు. వాళ్ళు లోకద్రిమ్మరులు అనబడతారు. కర్మలుచేసి పుణ్యలోకాలకువెళ్ళి మళ్ళీ వచ్చేస్తుంటారు పుణ్యజీవులు. వాళ్ళూ ద్రిమ్మరులే. కాని మొదటిరకంవారు అలా కాదు. శాశ్వతమయిన ఆనందాన్ని ఉన్నచోటే పొందుతారు. లోకాంతరప్రాప్తిని కోరరు.

44. యథార్థంగా నశ్వరమయిన ఈ శరీరంలో – ఇంద్రియాలతో ఉండేటటువంటి ఈ శరీరంలోనే ఉండి – శాశ్వతమయిన ఆనందాన్ని పొందే ప్రయత్నంచేస్తాడు వివేకి. దానికి దివ్య శరీరము, దివ్యలోకాలు, చాలా పుణ్యాలూ, యజ్ఞాలు, దానాలు, తపాలు ఇవేమీ అవసరంలేదు. ఉత్తమలోకప్రాప్తికూడా కోరుకోడు. 

45. ఇక్కడ నశ్వరమై ఉన్నశరీరము, అల్పమయిన ఆయుర్దాయము, ఇంద్రియములు, సుఖదుఃఖములతో ఉండే ప్రపంచము, దారాపుత్రులతో కూడిఉండిన జీవితము – ఈ రకమయిన జీవనాన్ని చూచి భయపడక, శాశ్వతమయిన శాంతి కలగటానికి ఇక్కడే ప్రయత్నం చేస్తాడు వివేకి”.

46. పరాశరుడు చెప్పింది జ్యోతిషశాస్త్రం. భృగువు చెప్పింది జీవుల జాతకం. నాడీగ్రంథం అనేది జాతకగ్రంథం. జీవులయొక్క జాతకాలవి. పరాశరమహర్షిది జ్యోతిషశాస్త్రమే. కాబట్టి నాడిగ్రంథం జ్యోతిషశాస్త్రం కాదు. జ్యోతిషశాస్త్ర ఆధారంగా జీవుల చరిత్ర చెప్పారు నాడిలో. అదిచాలా గొప్పవిషయము. ఏనాడి గ్రంథంలోనూ యథార్థమయిన భవిష్యత్తు దొరకదు. అవి శాపగ్రస్తమయిపోయాయి. ఏవిధంగా వేదమంత్రములు నిర్వీర్యమై పోయాయో, అలాగే ఇవీ తమశక్తిని కొల్పోయాయి.

47. బుద్ధుడు నారాయణుడి అవతారమై చేసినటువంటి ఒక కార్యం ఏమిటంటే, వేదమంత్రములు నిర్వీర్యం అయేటట్లు చేసాడు. వాటిని అతడు అపహరించాడు. వాటిని తనలోకి ఆకర్షించుకున్నాడు(అవి ఈ యుగంలో తీవ్రంగా దురుపయోగానికి గురౌతూ ఉండటంచేత). 

48. ఆయన ఆ పని చేయటంచేత, బుద్ధావతారం తరువాత వేద మంత్రాలకు అంతకుపూర్వం ఉన్నటువంటి ప్రజ్ఞ, శక్తి, బలము లేవు. అంటే ఆ మంత్రాల శక్తిని ప్రకాశింప చేసే బ్రహ్మణశక్తి తగ్గిపోయింది. బుద్ధావతారం లోకాలను శాసించగలిగిన అవతారం. ఇది బోధావతారం అహింసా విషయంలో. కొన్ని విషయాలలో ముఖ్యంగా వేదాంత విషయాలలో – అది బోధావతారం.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 135 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻. Beingness goes into no-beingness. 🌻*

The ‘I amness’ is pulsating ‘I am, I am’. The feeling of ‘I amness’ is there because of the essence of the food body and vital breath, when these are gone the pulsation of ‘I amness’ will not be there.

Because of the knowledge ‘I am’ we conduct all activities. In the morning when you wake up you get the first guaranty, that
conviction of ‘I am’. 

Beingness goes into no-beingness. Then because you are not in a position to sustain or tolerate that ‘I amness’ you bestir yourself. You get up and move around here and there and the activity starts.

That attention of ‘I amness’ is always there in the waking state, but we are not alert to watch it. There is no other attention to be followed. Be attentive to that attention ‘I am’.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 74 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. Q 65 :-- నాగరికత జననం, మరణం. 🌻

1) ప్రతి జీవికి జనన మరణ చక్రాలున్నట్లే ప్రతి నాగరికతకు జనన మరణ చక్రాలుంటాయి.

ప్రతి నాగరికతకు లక్ష్యం ఉంటుంది. మానవ జాతి ఇతర జీవజాతులు అన్నీ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉంటాయి.
మానవజాతి సూక్ష్మ శరీరంతో 
ఇతర లోకాలకు వెళ్లగల సామర్ధ్యం కలిగివున్నాడు. 

అలాగే ఇతర జీవజాతులు కూడా అదే సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి.

2) ఒక్కొక్క నాగరికతలో జీవులు ఒక్కొక్క రీతిలో భౌతిక దేహాలను కలిగి ఉన్నాయి.ఒక నాగరికతలో ఉన్నజీవజాతులు మరో నాగరికతలో continue అవ్వవచ్చు ,లేదా
అంతరించవచ్చు.

3) కొన్ని నాగరికతల్లో కనీ విని ఎరుగని జంతువులు ఉండేవి,
అవి ఇప్పటి నాగరికతలో లేవు
మనుషుల రూపాలు ఒక నాగరికతలో ఒక లాగా మరో నాగరికతలో మరో లాగా ఉండేవి.

4) ఒక నాగరికత లో 50 అడుగుల ఎత్తు ఉండి భారికాయులు లాగా ఉండేవారు,వారి ఆయుష్షు కొన్ని వందల సంవత్సరాలు ఉండేది.
జంతువు తల+మనిషి దేహం
మనిషి తల+జంతువు దేహం
సగం మనిషి +సగం చేప 
కొన్ని నాగరికతల్లో సముద్రజాతి,కొన్ని నాగరికతల్లో జంతువులు, dominate చేయడం జరిగింది.ప్రస్తుతం మనం domination ఉంది.

5) కొన్ని నాగరికతల్లో వేరే లోకాలకు పయనించి అక్కడి జ్ఞానం భూమి మీదకు తీసుకువచ్చారు.

6).ఒక నాగరికతలో ఉద్భవించిన జీవజాతులు మరింత ఉన్నతి కోసం మళ్లీ భూమి మీద వేరే భౌతిక రూపాలు ఎంచుకుని వేరే లక్ష్యాలు ఎంచుకుని సవాళ్లు ఎంచుకుని వేరే నాగరికతలోకి ప్రవేసిస్తాయి.

7) మన దేహంలో ఒక భాగం పాడైతే శరీరం మొత్తం ఆ బాధను అనుభవించాల్సి ఉంటుంది. దేహంలోని ఇతర భాగాలన్ని దానికి సహకరించి ఆ బాధను తొలగిస్తాయి.
అలాగే భూమి మీద ఒక జాతి crisis లో ఉంటే దాన్ని అన్ని జాతులు భరించాల్సి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 20 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 8 🌻*

క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి, పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదువేల ఏళ్ళ తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను. .అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు.

దీనికి ఇంకా చాలా సమయం ఉంది. వందల ఏళ్ళు జరగాల్సిఉంది.

విజయనగరం కొన్నాళ్ళు అత్యంత వైభవంగా వెలుగుతుంది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయి నాశనమైపోతుంది.

ఇది ఒక చారిత్రక వాస్తవం. శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి, అసమర్థులు, భోగలాలసులైన చక్రవర్తుల నేతలుగా మారారు.

మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది. మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్నాటక, ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు.

వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.

వేంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే. బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోలు.

కృష్ణా గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడి చచ్చేను.

కృష్ణా గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Twelve Stanzas from the Book of Dzyan - 3 🌹*
🌴 The Prophetic Record of Human Destiny and Evolution 🌴

*🌻 STANZA I - The Genesis of Divine Love - 3 🌻*

7. Love reigned supreme all over the world! She was calm and content in her earthly domains. 

All the celestial bodies supported her in that Divine Work. Only the Sun sometimes peered anxiously into the bowels of Earth during the times when she hid her sides from him as she rotated. 

Because of the density of Matter, the Sun was not able to glimpse what was happening on the other side of the planet.

8. Eventually, robust vegetation girdled the world, hiding the gentle flowers in its shadow and choking their tiny stems with its mighty roots. 

These giants seized power and began to swallow light greedily, cutting off the warm solar rays from those who were shorter and much weaker than they. Without the caressing warmth of the All-Loving Sun, lesser creatures withered and perished. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 14 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయో మార్గము - ప్రేయో మార్గములు స్వధర్మము-పరధర్మము - 2 🌻*

ప్రేయోమార్గమని మరొక మార్గముంది. అందులో ప్రధానమైన సమస్య ఏమిటంటే సుఖానికి దగ్గరిదారిగా కనబడుతుంది, కానీ శాశ్వతముగా దుఃఖాన్ని అందిస్తుంది. ఇంకేమిటట అందులో దోషం? జననమరణ చక్రంలో పడేట్లుగా చేస్తుంది. కర్మచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. కాలచక్రంలో బంధించబడేట్లుగా చేస్తుంది. ద్వంద్వానుభూతులయందు మరిగిపోయేట్లుగా చేస్తుంది. తనని తాను మరచిపోయేటట్లుగా చేస్తుంది. 

స్వయం స్థితిని మరచిపోయేట్లుగా చేస్తుంది. హృదయస్థానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. స్వీయజ్ఞానాన్ని, స్వరూపజ్ఞానాన్ని మరుపుకు తెచ్చేట్లుగా చేస్తుంది. ఇన్ని దోషములు వున్నాయి కాబట్టి పరధర్మము ఆచరణకు అనుచితమైనటువంటిది.

   శ్రేయోమార్గంలో ఇవన్నీ వ్యతిరేకం. అంటే నీ హృదయస్థానంలో నువ్వు నిలబడి వుంటావు. నీ స్వరూప జ్ఞానంలో నువ్వు నిలబడి ఉంటావు. 

స్వాత్మానుభూతి యందు నిలకడ కలిగి వుంటావు. స్వాత్మనిష్ఠుడవై వుంటావు. సర్వవ్యాపక లక్షణాన్ని కలిగివుంటావు. పరిమితమైనటువంటి అజ్ఞానము , అవిద్యకు దూరంగా వుంటావు. జననమరణ చక్రాలలో నుంచి బయటపడతావు. కర్మచక్రానికి అంటకుండా వుంటావు. ద్వంద్వానుభూతులకి విలక్షణుడవై వుంటావు. 

కాబట్టి శ్రేయోమార్గము ఉత్తమమైనటువంటిది. కాబట్టి అట్టి శ్రేయోమార్గమునే మానవులందరూ కూడా ఆశ్రయించాలి. అదే మానవుని యొక్క స్వధర్మము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 58 / Sai Philosophy is Humanity - 58 🌹*
🌴. అధ్యాయము - 8 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. బాబా యొక్క బిక్షాటనం 🌻*

1. శిరిడీజనులు పుణ్యాత్ములు. ఎందుకనగా, వారి యిండ్ల యెదుటనేగదా బాబా భిక్షుకునివలె నిలచి, "అమ్మా! రొట్టెముక్క పెట్టు" డనుచు, దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు! చేత ఒక రేకుడబ్బా పట్టుకొని, భుజానికి ఒక గుడ్డజోలె తగిలించుకొని భిక్షాటనకు పోయెడివారు.

2. బాబా కొన్ని యిండ్లకు మాత్రమే భిక్షకు పోయెడివారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలగునవి రేకు డబ్బాలో పోసుకొనెడివారు.

3. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకొనెడివారు. బాబాకు రుచి యనునది లేదు.

4. వారు జిహ్వను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకుడబ్బాలోను, జోలెలోను వేసికొనెడివారు.

5. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతుష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారుకాదు.

6. వారు నాలుకకు రుచి యనునది లేనట్లే కాన్పించుచుండెను. బాబా భిక్షకు యొక పద్ధతి, కాలనియమము లేకుండెను.

7. ఒక్కొక్కదినము కొన్ని యిండ్లవద్ద మాత్రమే భిక్షచేసెడివారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకువెళ్ళెడివారు.

8. భిక్షలో దొరికిన పదార్థములనిన్నింటిని ఒక మట్టిపాత్రలో వేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి.

9. వాటిని తరిమే వారుకారు. మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ 10-12 రొట్టెముక్కలను నిరాటంకముగా తీసికొనుచుండెడిది.

10. కుక్కలను, పిల్లులనుగూడ కలలో సైతము అడ్డుపెట్టనివారు, ఆకలితోనున్న పేదల ఆహారమునకు అడ్డుచెప్పుదురా? "ఫకీరు పదవియే నిజమైన మహరాజపదవియనీ, అదియే శాశ్వతమనీ, మామూలు సిరిసంపదలు క్షణభంగురాలనీ", బాబాయనుచుండెడివారు.

11. ఆ పావనచరితుని జీవితము వంటి జీవితమేగదా మిగుల ధన్యమైనదు!

12. మొదట శిరిడీ ప్రజలు బాబానొక పిచ్చిఫకీరని భావించి, అటులనే పిలిచెడివారు. భోజనోపాధికై రొట్టెముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసికొనెడు పేదఫకీరన్న ఎవరికి గౌరవమేమియుండును? కానీ, యీ ఫకీరు పరమవిశాలహృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేశమాత్రము లేని నిరాసక్తుడు.

13. బాహ్యదృష్టికి వారు చంచలునిగను, స్థిరత్వము లేనివారుగను గాన్పించినను, లోన వారు స్థిరచిత్తులు.

14. వారి చర్యలు అంతుబట్టనివి. ఆ కుగ్రామములో కూడ ఒక గొప్ప మహాత్మునిగ గుర్తించి, సేవించిన ధన్యజీవులు కొద్దిమంది గలరు.

15. అట్టివారిలో నొకరి వృత్తాంతమిక్కడ చెప్పబోవుచున్నాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sai Philosophy is Humanity - 58 🌹*
Chapter 8
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

*🌻. Baba Begging Food 🌻*

Blessed are the people of Shirdi, in front of whose houses, Baba stood as a beggar and called out, "Oh Lassie, give Me a piece of bread" and spread out His hand to receive the same. 

In one hand He carried a Tumrel (tinpot) and in the other a zoli or choupadari, i.e., a rectangular piece of cloth. He daily visited certain houses and went from door to door. 

Liquid or semi-liquid things such as soup, vegetables, milk or butter-milk were received in the tinpot, while cooked rice, bread, and such solid things were taken in the zoli. 

Baba's tongue knew no taste, as He had acquired control over it. 

So how could He care for the taste of the different things collected together? whatever things He got in His zole and in the tinpot were mixed together and partaken by Baba to His heart's content. 

Whether particular things were tasty or otherwise was never noticed by Baba as if His tongue was devoid of the sense of taste altogether.

 Baba begged till noon, but His begging was very irregular. Some days He went a few rounds, on other days up to twelve noon. 

The food thus collected was thrown in a kundi, i.e. earthen pot. Dog, cats and crows freely ate from it and Baba never drove them away. 

The woman who swept the floor of the Masjid took some 10 or 12 pieces of bread to her house, and nobody prevented her from doing so. 

How could, He, who even in dreams never warded off cats and dogs by harsh words and signs, refuse food to poor helpless people? 

Blessed indeed is the life of such a noble person! People in Shirdi took Him in the beginning for a mad Fakir. He was known in the village by this name. 

How could one, who lived on alms by begging a few crumbs of bread, be revered and respected? But this Fakir was very liberal of heart and hand, disinterested and charitable. 

Tough He looked fickle and restless from outside. He was firm and steady inside. His way was inscrutable. 

Still even in that small village, there were a few kind and blessed people who recognized and regarded Him as a Great Soul. One such instance is given below.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹