శివగీత - 16 / The Siva-Gita - 16


🌹. శివగీత - 16 / The Siva-Gita - 16 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

ద్వితీయాధ్యాయము
🌻. వైరాగ్య యోగము - 7 🌻

మునే ! సర్వ మిదం సత్యం - యన్మ దగ్రే త్వయేరితమ్ 40

తదాపిన జహాత్యేత - త్ప్రార బ్దా దృష్ట ముల్బణమ్,
మత్తం కుర్యా ద్యదా మద్యం - నష్టా విద్య మపి ద్విజమ్ 41

తద్వత్ప్రా రబ్ద భోగో పిన జహాతి వివేకినమ్,
తతః కింబ హునోక్తేన - ప్రారబ్ద స్స శివ స్మృరః 42

బాధతే మాం ది నారాత్ర - మహంకారో పితా దృశః.
అత్యన్త పీడితో జీవ - స్థ్సూల దేహం విముం చతి 43

తస్మా జ్జీవాప్తయే మహ్య - ముపాయః క్రియతాం ద్విజ!
ఇతి శ్రీ పద్మ పురాణే, శివ గీతాయా ద్వితీయో ధ్యాయః 44

శ్రీ రాముడు పలుకును : ఓయీ ముని పుంగవా! మీరు నా యందలి 
అనుగ్రహముచేత నేమి యాన తిచ్చితిరో అవి యన్నియు 
వాస్తవములే అయినప్పటికిన్ని, నా ప్రారబ్ధ రూపంబగు ప్రియురాలైన
 సీత యొక్క ఎడబాటుతో నాలో రగిలిన దుఃఖాగ్ని యుపశమింపకున్నది.

 ఆ కారణము వలన వేయేల? నా ప్రారబ్ధ రూపుండైన శివుడే 
అలరు విల్తుని రూపంబున నన్ను రేయింబవళ్ళు వేధింపు చున్నారు. 
అహంకారము కూడా అటువంటిదే. 
ఈ విధముగా ప్రాణి మిగుల పీడింప బడినచో నీ జడ దేహము విడిపోవును. 

కనుక ఓ శివ భక్తాగ్రేసరా ! జీవ ధారణ చేయుటకు ఉపాయ మేదో తెల్పుము.
ఇది వ్యాసోక్త పద్మ పురాణాంతర్గతం బైన శివ గీతలో ద్వితీయో ధ్యాయము సమాప్తము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 The Siva-Gita - 16 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 02 : 
🌻 Vairagya Yoga - 7 🌻

40. 41. Sri Rama said: Hey Muni! Whatever discourse of Vairagya you gave to me is indeed true however due to my Prarabdha Karma the sadness which is burning me like fire, which is caused due to the separation from my beloved is not getting put off. 

42. That Prarabdha which is of the form of Shiva is himself tormenting me day and night. Even pride is also like that. 

In this way if a being gets tormented then there are chances for this body to fall down. Hence Hey foremost devotee of Shiva! Show me the path to Jeevadharana 

43. Here ends the second chapter of Shiva Geeta from Padma Purana Uttara Khanda

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment