Showing posts with label Nagula Chavithi నాగుల చవితి. Show all posts
Showing posts with label Nagula Chavithi నాగుల చవితి. Show all posts

నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram



https://youtu.be/W7z8M6_6yRo



🌹 నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం - నాగ స్తోత్రం 🌹

🐍 కలిదోష నివారణకు, సర్వ దోష విముక్తికి తప్పక పఠించ వలసిన స్తోత్రాలు 🐍



🌹 Navanaga Nama Stotram - Sarpa Suktam - Naga Stotram 🌹

🐍 Stotras that must be recited to prevent Kali Dosha and get rid of all sins 🐍


పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం పూజా విధులలో కొలుస్తారు. అవి అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ నాగులు. సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాముకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

Like and Share

https://youtube.com/@ChaitanyaVijnaanam

ప్రసాద్‌ భరధ్వాజ

🌹🌹🌹🌹🌹

'నమో నాగరాజ నమో ఫణిరాజా నమో నమో నాగేంద్రా' 'Namo Nagaraja Namo Phaniraja Namo Namo Nagendra' (a YT Short)



https://youtube.com/shorts/qaqX0xb2mBQ


🌹 నమో నాగరాజ నమో ఫణిరాజా నమో నమో నాగేంద్రా 🌹


🌹 Namo Nagaraja Namo Phaniraja Namo Namo Nagendra 🌹


(a YT Short)


నాగులచవితి రోజున చేయవలసిన సర్ప ప్రార్థన Nagulu Prarthana (Snake prayer) to be performed on Nagula Chavithi day



https://youtube.com/shorts/oGkWiySUAlA


🌹 నాగులచవితి రోజున చేయవలసిన సర్ప ప్రార్థన. తప్పక వినండి. 🌹

🌹 Snake prayer to be performed on Nagula Chavithi day. Must listen. 🌹


(a YT Short)

ఆపదలను కష్టాలను తొలగించి, దోషాలను నివారించే The Navanaga Nama Stotram - Sarpa Suktham


https://youtu.be/mxNBm68X2I8


🌹ఆపదలను కష్టాలను తొలగించి, దోషాలను నివారించే, రక్షణను కల్పించే నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం. 🌹

🌹The Navanaga Nama Stotram - Sarpa Suktham, which removes obstacles and hardships, prevents faults, and provides protection. 🌹



🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ


ఈ సందేశం నాగుల చవితి పర్వదినాన్ని గురించి వివరిస్తోంది. నాగుల చవితి పూజ విశిష్టతను, శరీరంలోని కాలనాగం పాత్రను, మనస్సులో ఉన్న కోపం, కామం మొదలైన పాపాలు ఎలా హరించ బడతాయో వివరిస్తుంది. శ్రీ మహావిష్ణువు శేషపాన్పుగా మారే ఆంతర్యమని కూడా తెలియజేస్తుంది. నవనాగ నామ స్తోత్రం, సర్ప సూక్తం వాచ్యముల విశేషాలు, వాటి ఫలితాలు ఇవ్వబడ్డాయి.

🌹🌹🌹🌹🌹


నాగుల చవితి శుభాకాంక్షలు Greetings on Nagula Chavithi


🐍. నాగులచవితి విశిష్టత 🐍

🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ


కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వారా తెలుస్తుంది.


🍀. నవనాగ నామ స్తోత్రం - సర్ప సూక్తం 🍀

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!


ఫలశృతి:

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!

సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!


సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!

సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!


సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!

తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!


🙏ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి🙏

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.

🐍🐍🐍🐍🐍




🌹. సర్ప సూక్తం 🌹


బ్రహ్మలోకేషు యేసర్పాః శేషనాగ పురోగమాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


ఇంద్రలోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


ఇంద్రలోకేషు యేసర్పాః తక్షకా ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


సత్యలోకేషు యేసర్పాః వాసుకి నా సురక్షితాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


మలయేచైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


పృథివ్యాం చైవ యేసర్పాః యే సాకేత నివాసినః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


గ్రామే యదివారణ్యే యేసర్పాః ప్రచరన్తిచ

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


సముద్ర తీరే యేసర్పాః యే సర్పా జలవాసినః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః


రసాతలేఘ యేసర్పాః అనంతాది మహాబలాః

నమోస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదాః

🌹 🌹 🌹 🌹 🌹


నాగుల చవితి శుభాకాంక్షలు - Good Wihses on Nagula Chavithi


🌹🍀. నాగుల చవితి శుభాకాంక్షలు అందరికి, Nagula Chavithi Good Wihses to All 🍀🌹

ప్రసాద్ భరద్వాజ

🌹. నాగులచవితి విశిష్టత 🌹


కాలనాగము మానవ శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ ! కామ , క్రోధ , లోభ , మోహ , మద , మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ మానవునిలో 'సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది , అందరి హృదయాలలో నివసించే 'శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలో గల అంతర్యమని కొంత మంది పెద్దల మాటల ద్వార తెలుస్తుంది.


🍀. నాగులకు పాలు పోయడంలోని అంతరార్థం 🍀

పాలు స్వచ్ఛతకు ప్రతీక. ఈ పాలను వేడి చేసి చల్లపరచి దానికి కొద్దిగా చల్లను చేరిస్తే పెరుగవుతుంది. ఆ పెరుగును చిలుకగా వచ్చిన చల్లలో నుంచి వచ్చే వెన్నను కాయగా నెయ్యి అవుతుంది. దీనిని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకనే పాలను జ్ఞానమనే వేడితో కాచి వివేకమనే చల్ల కలిపితే సుఖమనే పెరుగు తయారవుతుంది. ఈ పెరుగును ఔదార్యమనే కవ్వంతో చిలుకగా శాంతి అనే చల్ల లభిస్తుంది. ఆ చల్లను సత్యం , శివం , సుందరం అనే మూడు వేళ్ళతో కాస్త వంచి తీస్తే సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. ఆ వెన్నకు భగవంతుని ఆరాధన అనే జ్ఞానాన్ని జోడిస్తే త్యాగము , యోగము , భోగమనే మూడు రకముల నెయ్యి ఆవిర్భవిస్తుంది. ఇదే సకల వేదాలసారం , సకల జీవనసారం అయిన పాలను జీవనమునకు ప్రతీక అయిన నాగులకు అర్పించడంలోని అంతరార్థం.

”దేవా: చక్షుషా భుంజానా: భక్తాన్‌ పాలయంతి” అనేది ప్రమాణ వాక్యం , అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం. పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి.


🐍. నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం 🐍

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!


నాగులచవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.


"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||


పాములకు చేసే ఏదైనా పూజ , నైవేద్యం నాగదేవతలకు చేరుతుందని నమ్ముతారు. అందువల్ల ఈ రోజు ప్రజలు పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేవతలు ఉన్నప్పటికీ 12 మందిని మాత్రం నాగుల చవితి పూజా సమయంలో కొలుస్తారు.

చవితి నాడు సర్పాలను పూజిస్తే కుజ దోషం , కాలసర్ప దోషానికి ఆదిదేవుడు సుభ్రహ్మణ్య స్వామి కాబట్టి నాగుపాము పుట్టకు పూజ చేస్తే కళత్ర దోషాలు తొలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి.

దేవతా సర్పాలుగా పేర్కొనబడే - అనంత, వాసుకి, శేష, పద్మ, కంబాల, కర్కోటకం, ఆశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియా, తక్షక, పింగళ అనే 12 దేవతా సర్పాలను ఈ రోజు పూజించి ఆశీర్వాదాలు పొందుతారు. ఈ విశ్వంలో పాములు - ఆకాశంలో , స్వర్గంలో, సూర్యకిరణాలో , సరస్సులలో , బావులు చెరువులలో నివసిస్తున్నాయి.

పాము పుట్టలో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .

నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వు పడకు నీ కంట నేను పడకుండా చూడు తండ్రీ అని చెప్పాలి.

ప్రకృతిని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము, అని అర్ధము. పిల్లల చేత ఇవి చెప్పించటం ఎందుకంటే వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము. మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము.

నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం , రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులకు ఆహారంను పెట్టటం అన్నమాట, ఉదాహరణకు చీమలకు ఆహారంగా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు, ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.

🌹 🌹 🌹 🌹 🌹


నాగుల చవితి శుభాకాంక్షలు - విశిష్టత, Happy Nagula Chaviti - its Significance


🌹.నాగుల చవితి శుభాకాంక్షలు మిత్రులందరికి, Happy Nagula Chaviti to All 🌹

🍀నాగుల చవితి విశిష్టత 🍀

ప్రసాద్‌ భరధ్వాజ

🌿. సర్ప స్తోత్రం 🌿


🌼. పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా! సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా ! అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం! 🌼

🌻. సర్ప గాయత్రి మంత్రం🌻

భుజంగేషాయ విద్మహే, క్షక్షు శివాయ ధీమహి

తన్నో సర్ప ప్రచోదయాత్ !


🍀🪱.నాగుల చవితి విశిష్టత 🪱🍀

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని,పామును - ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకొంటూ! పూజిస్తూ వస్తున్నారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే ... అందులో భాగంగానే ' నాగుపాము" ను కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.

ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారము వలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్ప పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు" నకు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయుటలోగల అంతర్యమని చెప్తారు.

నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. ఆ సందర్భంగా పుట్టవద్ద " దీపావళి" నాడు మిగిలిన మతాబులు, కాకరపువ్వొత్తులు, టపాసులు మొదలైనవి చిన్నపిల్లలు ఎంతో సంతోషంగా కూడా కాలుస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు.


🌼. నవ నాగ స్తోత్రం 🌼

అనంతం వాసుకిం శేష పద్మనాభంచ కంబలం

శంఖుపాలం ధృతరాష్ట్రంచ తక్షకం కాళీయం తథా

ఏతాని నవ నామాని నాగానాంచ మాహాత్మనాం

సాయంకాలే పఠనేనిత్యం ప్రాతః కాలే విశేషతః

తస్మై విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్|

🌹 🌹 🌹 🌹 🌹