🌹 22, AUGUST 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹

🍀🌹 22, AUGUST 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, AUGUST 2023 TUESDAY మంగళవారం, భౌమ వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 03 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 03 🌴
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263 🌹 
🌻. శివ పూజాంగ హోమ విధి - 8 / Mode of installation of the fire (agni-sthāpana) - 8 🌻
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 31 / Osho Daily Meditations  - 31 🌹
🍀. 31. ప్రయోగం / 31. EXPERIMENTATION 🍀
5) 🌹. శివ సూత్రములు - 131 / Siva Sutras - 131 🌹 
🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -3 / 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 22, అగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : కల్కి జయంతి, స్కందషష్టి, Kalki Jayanti, Skanda Sashti, 🌻*

*🍀. శ్రీ ఆంజనేయ సహస్రనామ స్తోత్రం - 17 🍀*

34. క్రోధహర్తా తాపహర్తా భక్తాభయవరప్రదః |
భక్తానుకంపీ విశ్వేశః పురుహూతః పురందరః
35. అగ్నిర్విభావసుర్భాస్వాన్ యమో నిరృతిరేవ చ |
వరుణో వాయుగతిమాన్ వాయుః కుబేర ఈశ్వరః

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : భావన, జ్ఞానోపలబ్ధి - లక్ష్యమును గురించిన భావన వేరు, ఆధ్యాత్మిక జ్ఞానోపలబ్ధి వేరు. భావన ఆధ్యాత్మిక జ్ఞానోపలబ్ధికి నిన్ను అభిముఖునిగా జేయవచ్చును. అంతేతప్ప, అదే జ్ఞానోపలబ్ధి కానేరదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
 తిథి: శుక్ల షష్టి 27:07:30 వరకు
తదుపరి శుక్ల-సప్తమి
నక్షత్రం: చిత్ర 06:32:11 వరకు
తదుపరి స్వాతి
యోగం: శుక్ల 22:18:09 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: కౌలవ 14:34:16 వరకు
వర్జ్యం: 12:30:38 - 14:13:06
దుర్ముహూర్తం: 08:31:49 - 09:22:17
రాహు కాలం: 15:28:15 - 17:02:54
గుళిక కాలం: 12:18:57 - 13:53:36
యమ గండం: 09:09:40 - 10:44:19
అభిజిత్ ముహూర్తం: 11:53 - 12:43
అమృత కాలం: 22:45:26 - 24:27:54
సూర్యోదయం: 06:00:23
సూర్యాస్తమయం: 18:37:32
చంద్రోదయం: 10:34:10
చంద్రాస్తమయం: 22:17:43
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: ధ్వాo క్ష యోగం - ధన
నాశనం, కార్య హాని 06:32:11 వరకు
తదుపరి ధ్వజ యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🍀. కల్కి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Kalki Jayanti to All. 🍀🌹*
*- ప్రసాద్ భరద్వాజ*
22-8-2023

*🌻. శ్రీ కల్కి స్తోత్రం 🌻*

సుశాంతోవాచ |
జయ హరేఽమరాధీశసేవితం
తవ పదాంబుజం భూరిభూషణమ్ |
కురు మమాగ్రతః సాధుసత్కృతం
త్యజ మహామతే మోహమాత్మనః 

తవ వపుర్జగద్రూపసంపదా
విరచితం సతాం మానసే స్థితమ్ |
రతిపతేర్మనో మోహదాయకం
కురు విచేష్టితం కామలంపటమ్ 

తవ యశో జగచ్ఛోకనాశకం
మృదుకథామృతం ప్రీతిదాయకమ్ |
స్మితసుఖేక్షితం చంద్రవన్ముఖం
తవ కరోత్యలం లోకమంగళమ్ 

మమ పతిస్త్వయం సర్వదుర్జయో
యది తవాప్రియం కర్మణాచరేత్ |
జహి తదాత్మనః శత్రుముద్యతం
కురు కృపాం న చేదీదృగీశ్వరః 

మహదహంయుతం పంచమాత్రయా
ప్రకృతిజాయయా నిర్మితం వపుః |
తవ నిరీక్షణాల్లీలయా జగ-
-త్స్థితిలయోదయం బ్రహ్మకల్పితమ్ 

భూవియన్మరుద్వారితేజసాం
రాశిభిః శరీరేంద్రియాశ్రితైః |
త్రిగుణయా స్వయా మాయయా విభో
కురు కృపాం భవత్సేవనార్థినామ్ 

తవ గుణాలయం నామ పావనం
కలిమలాపహం కీర్తయంతి యే |
భవభయక్షయం తాపతాపితా
ముహురహో జనాః సంసరంతి నో 

తవ జపః సతాం మానవర్ధనం
జినకులక్షయం దేవపాలకమ్ |
కృతయుగార్పకం ధర్మపూరకం
కలికులాంతకం శం తనోతు మే 

మమ గృహం ప్రతి పుత్రనప్తృకం
గజరథైర్ధ్వజైశ్చామరైర్ధనైః |
మణివరాసనం సత్కృతిం వినా
తవ పదాబ్జయోః శోభయంతి కిమ్ 

తవ జగద్వపుః సుందరస్మితం
ముఖమనిందితం సుందరాననమ్ |
యది న మే ప్రియం వల్గుచేష్టితం
పరికరోత్యహో మృత్యురస్త్విహ 

హయచర భయహర కరహరశరణ
ఖరతరవరశర దశబలదమన |
జయ హతపరభవ భరవరనాశన
శశధర శతసమరసభరమదన ||

ఇతి శ్రీకల్కిపురాణే శ్రీసుశాంతకృతం కల్కిస్తోత్రమ్ |
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 417 / Bhagavad-Gita - 417 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 03 🌴*

*03. ఏవమేత ద్యథాత్థ త్వమాత్మానం పరమేశ్వర |*
*ద్రష్టుమిచ్చామి తే రూపమైశ్వరం పురుషోత్తమ ||*

*🌷. తాత్పర్యం : ఓ పురుషోత్తమా! ఓ పరమేశ్వారా! నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థరూపమును నేను నా యెదుట చూడగలిగినను, నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితివో నేను గాంచ నభిలషించుచున్నాను. నీ యొక్క ఆ రూపమును నేను దర్శించగోరుదును.*

*🌷. భాష్యము : భౌతికవిశ్వమునందు తాను తన స్వీయప్రాతినిధ్యముచే ప్రవేశించియున్న కారణముగా అది సృష్టినొంది, నడుచుచున్నదని శ్రీకృష్ణభగవానుడు పలికెను. తనకు సంబంధించినంతవరకు అర్జునుడు శ్రీకృష్ణుని వచనములచే జ్ఞానవంతుడయ్యెను. కాని శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యని భావించు నవకాశము కలిగిన భావిజనులకు విశ్వాసము కలిగించుట కొరకు అతడు ఆ దేవదేవుని విశ్వరూపమునందు గాంచగోరెను. తద్ద్వారా ఏ విధముగా ఆ భగవానుడు విశ్వమునకు పరుడై యున్నను విశ్వకార్యము నొనరించునో అతడు తెలియనెంచెను. అర్జునుడు శ్రీకృష్ణుని “పురుషోత్తమ” అని సంబోధించు యందును ప్రాముఖ్యము కలదు. ఏలయన దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునుని అంతరమునందు నిలిచి అతని కోరికను ఎరిగియుండెను.*

*స్వీయ రూపమునందు గాంచుటనే సంపూర్ణముగా తృప్తిని బడసియున్నందున తనను విశ్వరూపమునందు నమ్మకమును కలిగించుటకే అతడు విశ్వరూపమును గాంచ గోరుచున్నాడనియు శ్రీకృష్ణుడు ఎరిగియుండెను. అనగా నిర్ధారణమును గూర్చి అర్జునుడు ఎట్టి స్వీయకోరికను కలిగియుండలేదు. భవిష్యత్తులో పలువురు తాము భగవానుని అవతారములని పలుకు అవకాశమున్నందున ఆ విషయమున ఒక ప్రమాణమును లేదా గురుతును ఏర్పరచుటకు అర్జునుడు విశ్వరూపమును గాంచగోరెనని శ్రీకృష్ణుడు అవగతము చేసికొనెను. కనుక తాము అవతారములని ప్రకటించుకొనివారి విషయమున జనులు జాగరూకులై యుండవలెను. తాను కృష్ణుడనని పలుకువాడు విశ్వరూపమును చూపి తన పలుకు సత్యమని జనులకు నిరూపణ చేయ సంసిద్ధుడై యుండవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 417 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 03 🌴*

*03. evam etad yathāttha tvam ātmānaṁ parameśvara*
*draṣṭum icchāmi te rūpam aiśvaraṁ puruṣottama*

*🌷 Translation : O greatest of all personalities, O supreme form, though I see You here before me in Your actual position, as You have described Yourself, I wish to see how You have entered into this cosmic manifestation. I want to see that form of Yours.*

*🌹 Purport : The Lord said that because He entered into the material universe by His personal representation, the cosmic manifestation has been made possible and is going on. Now as far as Arjuna is concerned, he is inspired by the statements of Kṛṣṇa, but in order to convince others in the future who may think that Kṛṣṇa is an ordinary person, Arjuna desires to see Him actually in His universal form, to see how He is acting from within the universe, although He is apart from it. Arjuna’s addressing the Lord as puruṣottama is also significant. Since the Lord is the Supreme Personality of Godhead, He is present within Arjuna himself; therefore He knows the desire of Arjuna, and He can understand that Arjuna has no special desire to see Him in His universal form, for Arjuna is completely satisfied to see Him in His personal form of Kṛṣṇa.*

*But the Lord can understand also that Arjuna wants to see the universal form to convince others. Arjuna did not have any personal desire for confirmation. Kṛṣṇa also understands that Arjuna wants to see the universal form to set a criterion, for in the future there would be so many imposters who would pose themselves as incarnations of God. The people, therefore, should be careful; one who claims to be Kṛṣṇa should be prepared to show his universal form to confirm his claim to the people.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 75*

*🌻. శివ పూజాంగ హోమ విధి - 8 🌻*

*యజ్ఞాగ్నికిని,శివునకును తనతో నాడీసంధానము చేసి శక్త్యను సారముగ మూలమంత్రముతో అంగసహితముగ దశాంశహోమము చేయవలెను. ఒక్కొక్క కర్షప్రమాణము గల ఘృత-క్షీర-మధులను,శుక్తిప్రమాణము గల పెరుగును. చారెడు పాయసమును హోమము చేయవలెను. లాజలు, సర్వభక్ష్యములు పిడికిలి ప్రమాణమున గ్రహించి హోమము చేయవలెను. మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఈయవలెను-ఫలములో వాటిప్రమాణ మెంత ఉండునో అంతే చేయవలెను. అన్నము ప్రమాణము గ్రాసములో సగము. చిన్న (కిన్‌మిస్‌ వంటి) వాటిని పర్యాయమునకు ఐదేసి గ్రహించి హోమము చేయవలెను. చెరకు ఒక కణుపు గ్రహించవలెను. లతలు రెండేసి అంగుళము లుండవలెను. పుష్పపత్రముల ప్రమాణము వాటి ప్రమాణము ననుసరించి ఉండవలెను. సమిధలు పది అంగుళములు పొడవుండవలెను.*

*కర్పూర-చందన-కేసర-కస్తూరీ-యక్షకర్దమములు కలాయ ప్రమాణమున (శనగగింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉంచడవలెను. కందముల ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్న మగు నటుల చేయవలెను.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 263 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 75*
*🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 8 🌻*

46. Having established a union among the god of the sacrificial fire, god Śiva and his soul situated in his arteries, (the worshipper) should offer oblations with the principal mantra befitting one’s capacity and using one-tenth of mantras as a. supplement.

47. A kārṣika (a particular weight) of the clarified butter, milk and honey and a śukti (twice that of kārṣika) of the curd and a handful of sweet porridge (should be) offered.

48-49. The worshipper should offer as deemed fit the oblation with all the eatables, a handful of fried grains, three pieces of roots and an equal number of fruits. Five halfmouthfuls of cooked rice, bits of sugarcane of the length of a span and stems of sacrificial creepers measuring two fingers in length should be offered into the fire.

50. The oblations of flowers and leaves should be according to their own measure. The sacrificial twigs should measure ten fingers in length. The camphor, sandal, saffron, musk and an ointment made of camphor, aggallochum and kakkola in equal parts (should also be offered).

51. (The worshipper) should make an oblation of the kalāya (a leguminous seed) and guggulu (a fragrant (gum-resin) of the size of the kernel of the jujube fruit and eight parts of the roots as laid down.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 31 / Osho Daily Meditations  - 31 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀. 31. ప్రయోగం 🍀*

*🕉. ఎల్లప్పుడూ బహిరంగంగా మరియు ప్రయోగాత్మకంగా ఉండండి, మీరు ఇంతకు ముందెన్నడూ నడవని మార్గంలో నడవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. ఎవరికీ తెలుసు? అది పనికిరాదని రుజువైనా, అది అనుభవమే. 🕉*

*ఎడిసన్ దాదాపు మూడు సంవత్సరాలు ఒక నిర్దిష్ట ప్రయోగంలో పని చేస్తున్నాడు మరియు అతను ఏడు వందల సార్లు విఫలమయ్యాడు. అతని సహచరులు మరియు అతని విద్యార్థులందరూ పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు. ప్రతిరోజు ఉదయం అతను ల్యాబ్‌కి సంతోషంగా మరియు ఆనందంతో హుషారుగా వస్తాడు, మళ్లీ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏడు వందల సార్లు మరియు మూడు సంవత్సరాలు వృధా! ఇది చాలా ఎక్కువ: ప్రయోగం వల్ల ఏమీ జరగబోదని అందరూ దాదాపుగా నిశ్చయించుకున్నారు. మొత్తానికి పనికిరానిది, ఊహ కందనిపించింది. వారంతా సమావేశమై ఎడిసన్‌తో, 'మనం ఏడు వందల సార్లు విఫలమయ్యాము. మనం ఏమీ సాధించలేదు. ఆపాలి.' ఎడిసన్ ఉలిక్కిపడి నవ్వాడు. అతను, 'ఏం మాట్లాడుతున్నావు? విఫలమైందా? ఏడువందల పద్దతులు ఎలాంటి సహాయం చేయవని తెలుసుకోవడంలో మనం విజయం సాధించాము. అన్నాడు.*

*మనం రోజురోజుకూ సత్యానికి దగ్గరగా వస్తున్నాం! ఆ ఏడు వందల తలుపులు మనం తట్టకుంటే మనకు తెలిసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు మేము ఏడు వందల తలుపులు తప్పు అని నిశ్చయించుకున్నాము. ఇది గొప్ప విజయం! ఇది ప్రాథమిక శాస్త్రీయ దృక్పథం: ఏదైనా తప్పు అని మీరు నిర్ణయించ గలిగితే, మీరు సత్యానికి దగ్గరగా వస్తున్నారు. మార్కెట్‌లో సత్యం అందుబాటులో లేదు కాబట్టి నేరుగా వెళ్లి ఆర్డర్ చేయలేరు. ఇది రెడీమేడ్ కాదు, అందుబాటులో లేదు. మీరు ప్రయోగం చేయాలి. కాబట్టి ఎల్లప్పుడూ ప్రయోగాత్మకంగా ఉండండి. మీరు చేసేది సరైనది అని ఎప్పుడూ అనుకోకండి. ఇది ఎప్పుడూ పరిపూర్ణమైనది కాదు. దానిపై మెరుగుపరచడం ఎల్లప్పుడూ సాధ్యమే; దానిని మరింత పరిపూర్ణంగా చేయడం ఎల్లప్పుడూ సాధ్యపడుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 31 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 31. EXPERIMENTATION 🍀*

*🕉 Always remain open and experimentative, always ready to walk a path you have never walked before. Who knows? Even if it proves useless, it will be an experience. 🕉*

*Edison was working on a certain experiment for almost three years, and he had failed seven hundred times. All his colleagues and his students became completely frustrated. Every morning he would come to the lab happy and bubbling with joy, ready to start again. It was too much: seven hundred times and three years wasted! Everybody was almost certain that nothing was going to come of the experiment. The whole thing seemed to be useless, just a whim. They all gathered and told Edison, "We have failed seven hundred times. We have not achieved anything. We have to stop." Edison laughed uproariously. He said, "What are you talking about? Failed? We have succeeded in knowing that seven hundred methods won't be of any help.*

*We are coming closer and closer to the truth every day! If we had not knocked on those seven hundred doors, we would have had no way of knowing. But now we are certain that seven hundred doors are false. This is a great achievement! This is the basic scientific attitude: If you can decide that something is false, you are coming closer to the truth. Truth is not available in the market so that you can go directly and order it. It is not ready-made, available. You have to experiment. So always remain experimentative. And never become smug. Never think that whatever you are doing is perfect. It is never perfect. It is always possible to improve on it; it is always possible to make it more perfect.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 131 / Siva Sutras - 131 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-10. విద్యాసంహారే తదుత్త స్వప్న దర్శనం -3 🌻*

*🌴. ఆత్మశుద్ధి త్యాగంలో నిమ్న జ్ఞానము నశించి నప్పుడు, యోగి , ప్రపంచాన్ని శివుని స్వప్నంగా మరియు  అతని శరీరం ఏర్పడినట్లు అనుభవిస్తాడు. అతను తన మాయ స్వరూపాన్ని గ్రహించి, స్వచ్ఛమైన జ్ఞానంలో స్థిరపడతాడు. 🌴*

*సాంకేతికంగా చెప్పాలంటే, క్రియాశీల స్థితిలో ఉన్న సమయంలో నెరవేరని కోరికలు స్వప్న స్థితిలో ఉద్భవిస్తాయి. చిట్టచివరకు చైతన్యం మాత్రమే భగవంతునిగా వ్యక్తమవుతుంది. చైతన్యం యొక్క అత్యల్ప స్థాయి అంటే, భౌతిక జీవితంతో ముడిపడి ఉన్న ఆలోచన ప్రక్రియ. చైతన్యం యొక్క అత్యున్నత స్థాయి అంటే దేనితోనూ సంబంధం లేని ఆలోచన ప్రక్రియ, అది ఒంటరిగా ఉంటుంది. దీనిని ఎడారిలో ఒంటరి వ్యక్తితో పోల్చవచ్చు. మైళ్లకొద్దీ ఇసుక తిన్నెలను మాత్రమే చూస్తాడు. అతని మనస్సు క్రమంగా ఈ శూన్యతకు అలవాటు పడిపోతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 131 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-10.  vidyāsamhāre taduttha svapna darśanam -3 🌻*

*🌴. When the knowledge is thus destroyed in the sacrifice of self-purification, the yogi experiences the world as a dream of Shiva and his body as a formation. He realizes their illusory nature and becomes established in pure knowledge.   🌴*

*Technically speaking, unfulfilled desires during the active state emerge during dream state. Ultimately it is only the consciousness that manifests as God. The lowest level of consciousness means, the thought process associated with material life. The highest level of consciousness means the thought process that is not associated with anything at all, where it remains all alone. This can be compared to a lonely person in a desert. For miles and miles he sees only sand dunes. His mind gradually gets accustomed to this nothingness.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 471 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 471 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 471 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 471 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 97. వజ్రేశ్వరీ, వామదేవీ, వయోఽవస్థా వివర్జితా ।
సిద్ధేశ్వరీ, సిద్ధవిద్యా, సిద్ధమాతా, యశస్వినీ ॥ 97 ॥ 🍀

🌻 471. ‘సిద్ధవిద్యా’- 1 🌻


సిద్ధ విద్యారూపిణి శ్రీమాత అని అర్థము. శ్రీమాతను పంచదశీ మంత్రమున ఉపాసించినచో ఆమె అనుగ్రహము సిద్ధించును. అదియే సిద్ధవిద్య. శ్రీమాత అనుగ్రహము సిద్దించుటయే సిద్ధవిద్యగాని, ఇక యే యితర శోధనలు, సాధనలు నిజమునకు సిద్ధుల నీయలేవు. ఇతర విద్యలు సిద్ధులు కలిగినట్లు భ్రమ గొలుపునుగాని సిద్ధించవు. శ్రీమాత ఆరాధకులకు అనుగ్రహము లభించినపుడు సిద్ధులన్నియూ ఆరాధకుని వరించును. అనుగ్రహమున్నంత వరకే సిద్ధులు పనిచేయును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 471 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 97. Vajreshvari vamadevi vayovasdha vivarjita
sideshvari sidhavidya sidhamata yashasvini ॥ 97 ॥ 🌻

🌻 471. 'Siddhavidya'- 1 🌻


It means Srimata is Siddha Vidyarupini. If you worship Sri Mata with Panchdasi Mantra, Her grace will be obtained. That is Siddhavidya. Obtaining Srimata's grace itself is Siddhavidya, and other searches and sadhanas do not lead to Siddhas. Other vidyas give an illusion of siddhas but they don't give them. When the worshipers of Sri Mata are blessed, all the siddhas are showered on the worshiper. Siddhas work only as long as there is grace.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 129 : 8. Philosophy is not to be Confused / నిత్య ప్రజ్ఞా సందేశములు - 129 : 8. తత్వశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 129 / DAILY WISDOM - 129 🌹

🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 8. తత్వశాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు 🌻


తత్వశాస్త్రం అనేది అంతర్దృష్టితో, ఆధ్యాత్మిక అనుభవంతో పోల్చి చూడకూడదు. అయితే ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భారతదేశంలోని తత్వశాస్త్రం ఋషులు చెప్పిన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి మానవజాతి యొక్క భవిష్యత్తు తరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. ఆధ్యాత్మిక అనుభవం మనస్సుకు, హేతువుకు పూర్తి అతీతంగా ఉంటుంది. అయితే, తత్వశాస్త్రంలో ఈ రెండూ ఉంటాయి కానీ వాటి మూలాలు ఆధ్యాత్మికతలో ఉంటాయి.

తత్వశాస్త్రం ద్వారా అంతర్దృష్టి సత్యాలు హేతుబద్ధంగా వివరించబడినప్పటికీ, మేధో లేదా శాస్త్రీయ వర్గాల ద్వారా ఈ సత్యాల స్వభావాన్ని నిరూపించడానికి ప్రయత్నించదు. ఎందుకంటే ఇది సాధ్యం కాదు కాబట్టి. తత్వశాస్త్రం పూర్తిగా "న ఇతి" అనే సిద్ధాంతం పై నడుస్తుంది. అంటే ఇంద్రియ అనుభవం మరియు తార్కిక ఆలోచనా విధానంలో ఉన్న లోటుపాట్లను సమగ్రంగా విశ్లేషించి వాస్తవికత అంటే ఏది కాదో చెప్తుంది. తత్వశాస్త్రం మొత్తం నిజంగా దాని స్వభావంలో అంతర్లీనంగా ఉన్న అసమానతల యొక్క అనుభవంతో వచ్చిన అసంతృప్తి నుండి ఉద్భవించింది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 129 🌹

🍀 📖 The Philosophy of Life 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 8. Philosophy is not to be Confused 🌻


Philosophy is not to be confused with intuition, with mystic or religious experience, though it is a very powerful aid in achieving this end. Philosophy in India is based on the revelations of the sages and provides the necessary strength to the future generation of mankind for realising this goal. In mystic or religious experience the intellect and the reason are completely transcended, while philosophy is all intellect and reason, though it is grounded ultimately in deep religious experience.

While the intuitional truths are rationally explained by philosophy, it does not pretend to prove the nature of these truths through intellectual or scientific categories. Philosophy has a purely negative value—of offering an exhaustive criticism of sense experience and logical thought and indirectly arriving at the concept of Reality by demonstrating the limitations and inadequacies of the former. All philosophy really springs from an inward dissatisfaction with immediate empirical experience consequent upon the perception of the inadequacies inherent in its very nature.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీ శివ మహా పురాణము - 777 / Sri Siva Maha Purana - 777


🌹 . శ్రీ శివ మహా పురాణము - 777 / Sri Siva Maha Purana - 777 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 19 🌴

🌻. దూత సంవాదము - 1 🌻


వ్యాసుడిట్లు పలికెను- ఓ సనత్కుమారా! నీవు సర్వజ్ఞుడవు. నారదుడు ఆకాశమార్గములో నిర్గమించిన పిదప, ఆ రాక్షసరాజు ఏమి చేసెను? వివరముగా చెప్పుము (1).

సనత్కుమారుడిట్లు పలికెను- నారదుడు సెలవు తీసుకొని ఆకాశమార్గములో నిర్గమించిన పిదప ఆ రాక్షసుడు ఆమెయొక్క రూపమును గూర్చి వినియుండుట వలన మన్మథ జ్వరముయొక్క పీడకు గురి ఆయెను (2). బుద్ధి నశించి, మోహమునకు వశుడై మృత్యువునకు ఆధీనుడై జలంధరాసురుడు అపుడు రాహువును దూతగా పంపుటకై పిలిపించెను (3). సముద్ర తనయుడగు జలంధరుడు కామనచే ఆక్రమింపబడిన మనస్సు గలవాడై తన వద్దకు వచ్చిన రాహువును గాంచి చక్కగా సంబోధించి ఇట్లు వివరించెను (4).

జలంధరుడిట్లు పలికెను- ఓయీ రాహూ! నీవు దూతలందరిలో శ్రేష్ఠుడవు. నీవు కార్యముల నన్నిటినీ చక్కబెట్టగలవు. ఓయీ మహాబుద్ధిశాలీ! కైలాస పర్వతమునకు వెళ్లుము (5). అచట తపశ్శాలి, జటలను ధరించువాడు, భస్మతో అలంకరింపబడిన సర్వావయవములు గలవాడు, విరాగి, ఇంద్రియములను జయించినవాడు అగు శంభుయోగి గలడు (6). ఓయీ దూతా! నీవు అచటకు వెళ్లి, జటాధారి, వైరాగ్యసంపన్నుడు అగు శంకరయోగితో నిర్భయమగు హృదయముతో నిట్లు చెప్పుము (7). ఓయీ యోగీ! దయానిధీ! భూత ప్రేతపిశాచాదులతో సేవింపబడే వనవాసివగు నీకు భార్యారత్నముతో పని యేమి? (8) ఓ యోగీ! నేను భువనమునకు ప్రభువునై యుండగా ఇట్టి పరిస్థితి ఉచితము కాదు. కావున నీవు శ్రేష్ఠవస్తువులకు భోక్తనగు నాకు నీ భార్యారత్నమునిమ్ము (9). ముల్లోకములలోని శ్రేష్ఠ సుందరవస్తువులన్నియు నా వద్ద గలవు. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతయు నా ఆధీనములో నున్నదని యెరుంగుము (10). ఏనుగులలో గొప్పది యగు ఇంద్రుని ఐరావతమును, ఉత్తమమగు ఉచ్చైశ్శ్రవసమనే గుర్రమును, మరియు పారిజాత వృక్షమును నేను శీఘ్రమే బలాత్కారముగా లాగుకొంటిని (11).



సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 777🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 19 🌴

🌻 Jalandhara’s emissary to Śiva - 1 🌻


Vyāsa said:—

1. O omniscient Sanatkumāra, what did the king of Daityas do after the departure of Nārada to heaven? Please narrate to me in detail.


Sanatkumāra said:—

2. When Nārada departed to heaven after taking leave of the Daitya, the king of Daityas who had heard of the exquisite beauty of Pārvatī became harassed with pangs of love.

3. The deluded Daitya, Jalandhara, who had lost clear thinking, being swayed by Time (the annihilator) called his messenger Rāhu.

4. The infatuated son of the ocean, Jalandhara, addressed him politely with these words.


Jalandhara said:—

5. O Rāhu of great intellect, most excellent of my emissaries, go to the mountain Kailāsa, O accomplisher of all activities.

6. A sage and a Yogin named Śiva lives there. He has matted locks of hair. He is detached. He has controlled his senses. His body is smeared with ashes.

7. O messenger, you shall go there and tell the detached Yogin Śiva with matted locks of hair, fearlessly.

8. ‘O Yogin, ocean of mercy, of what avail is an exquisitely beautiful wife to you who stay in the jungle attended by ghosts, goblins, spirits and other beings?

9. O Yogin, this state of affairs is no good in a world with me as the Ruler. Hence you give up your wife, the most excellent lady, to me, the enjoyer of all excellent things.

10. Know that the whole universe including the mobile and immobile beings is under my suzerainty. All the excellent things of the three worlds have come into my possession.

11. I have forcibly seized the most excellent elephant of Indra, the most excellent horse, Uccaiḥśravas and the celestial tree pārijāta.



Continues....

🌹🌹🌹🌹🌹



విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 816 / Vishnu Sahasranama Contemplation - 816


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 816 / Vishnu Sahasranama Contemplation - 816🌹

🌻816. సర్వతోముఖః, सर्वतोमुखः, Sarvatomukhaḥ🌻

ఓం సర్వతోముఖాయ నమః | ॐ सर्वतोमुखाय नमः | OM Sarvatomukhāya namaḥ


సర్వతోఽక్షి శిరోముఖమితి భగవదుక్తితః ।
సర్వతోముఖ ఇతి స విష్ణురేవాభిధీయతే ॥

అన్ని వైపులకును ముఖములు ఎవనికి కలవో అట్టివాడు సర్వతోముఖుడు.


:: శ్రీమద్భగవద్గీత క్షేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ::

సర్వతః పాణిపాదం తత్సర్వతోఽక్షి శిరోముఖమ్ ।
సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్ఠతి ॥ 14 ॥

బ్రహ్మము అంతటను చేతులు, కాళ్ళు గలదియు; అంతటను కన్నులు, తలలు, ముఖములు గలదియు, అంతటను చెవులు గలదియునయి ప్రపంచమునందు సమస్తమును వ్యాపించుకొనియున్నది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 816🌹

🌻816. Sarvatomukhaḥ🌻

OM Sarvatomukhāya namaḥ


सर्वतोऽक्षि शिरोमुखमिति भगवदुक्तितः ।
सर्वतोमुख इति स विष्णुरेवाभिधीयते ॥

Sarvato’kṣi śiromukhamiti bhagavaduktitaḥ,
Sarvatomukha iti sa viṣṇurevābhidhīyate.


He who has faces in all directions is Sarvatomukhaḥ.

That which has hands and feet everywhere, which has eyes, faces and mouths everywhere, which has ears everywhere, exists in creatures by pervading them all.


🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

कुमुदः कुन्दरः कुन्दः पर्जन्यः पावनोऽनिलः ।
अमृतांशोऽमृतवपुस्सर्वज्ञस्सर्वतोमुखः ॥ ८७ ॥

కుముదః కున్దరః కున్దః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాంశోఽమృతవపుస్సర్వజ్ఞస్సర్వతోముఖః ॥ 87 ॥

Kumudaḥ kundaraḥ kundaḥ parjanyaḥ pāvano’nilaḥ,
Amr‌tāṃśo’mr‌tavapussarvajñassarvatomukhaḥ ॥ 87 ॥



Continues....

🌹 🌹 🌹 🌹🌹


కపిల గీత - 224 / Kapila Gita - 224


🌹. కపిల గీత - 224 / Kapila Gita - 224 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 34 🌴

34. మనసైతాని భూతాని ప్రణమేద్బహు మానయన్|
ఈశ్వరో జీవకళయా ప్రవిష్టో భగవానితి॥


తాత్పర్యము : జీవ రూపములో పరమేశ్వరుని యంశయే సకల ప్రాణులలో ఉన్నదని భావించి, సకల ప్రాణులను సమాదరించుచు, నమస్కరించ వలెను.

వ్యాఖ్య : ఒక పరిపూర్ణ భక్తుడు, పైన వివరించిన విధంగా, పరమాత్మ ప్రతి జీవి యొక్క శరీరంలోకి ప్రవేశించి నందున, ప్రతి జీవి భగవంతునిగా లేదా పరమాత్మగా మారినట్లు భావించడం కూడదు. ఇది మూర్ఖత్వం. ఒక వ్యక్తి గదిలోకి ప్రవేశించాడని అనుకుందాం; గది ఆ వ్యక్తిగా మారిందని దీని అర్థం కాదు. అదే విధంగా, పరమాత్ముడు 8,400,000 నిర్దిష్ట రకాల భౌతిక శరీరాలలోకి ప్రవేశించాడు అంటే ఈ శరీరాలు ప్రతి ఒక్కటి పరమాత్మగా మారాయని కాదు. పరమేశ్వరుడు ఉన్నందున, స్వచ్ఛమైన భక్తుడు ప్రతి శరీరాన్ని భగవంతుని ఆలయంగా స్వీకరిస్తాడు మరియు భక్తుడు అటువంటి ఆలయాలకు పూర్తి జ్ఞానంతో గౌరవాన్ని అందిస్తాడు కాబట్టి, అతను భగవంతునితో సంబంధం ఉన్న ప్రతి జీవికి గౌరవాన్ని ఇస్తాడు. మాయావాది తత్వవేత్తలు పరమాత్మ ఒక పేదవాడి శరీరంలోకి ప్రవేశించినందున, పరమేశ్వరుడు దరిద్ర నారాయణుడు లేదా పేద నారాయణుడు అయ్యాడని తప్పుగా భావిస్తారు. ఇవన్నీ నాస్తికులు మరియు భక్తి లేనివారి దైవదూషణ ప్రకటనలు.


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 224 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 5. Form of Bhakti - Glory of Time - 34 🌴

34. manasaitāni bhūtāni praṇamed bahu-mānayan
īśvaro jīva-kalayā praviṣṭo bhagavān iti


MEANING : Such a perfect devotee offers respects to every living entity because he is under the firm conviction that the Supreme Personality of Godhead has entered the body of every living entity as the Supersoul, or controller.

PURPORT : A perfect devotee, as described above, does not make the mistake of thinking that because the Supreme Personality of Godhead as Paramātmā has entered into the body of every living entity, every living entity has become the Supreme Personality of Godhead. This is foolishness. Suppose a person enters into a room; that does not mean that the room has become that person. Similarly, that the Supreme Lord has entered into each of the 8,400,000 particular types of material bodies does not mean that each of these bodies has become the Supreme Lord. Because the Supreme Lord is present, however, a pure devotee accepts each body as the temple of the Lord, and since the devotee offers respect to such temples in full knowledge, he gives respect to every living entity in relationship with the Lord. Māyāvādī philosophers wrongly think that because the Supreme Person has entered the body of a poor man, the Supreme Lord has become daridra-nārāyaṇa, or poor Nārāyaṇa. These are all blasphemous statements of atheists and nondevotees.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


21 Aug 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 21, ఆగష్టు, AUGUST 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : నాగ / గరుడ పంచమి, మంగళగౌరి వ్రతం, Naga / Garuda Panchami, Mangala Gouri Vratam 🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 44 🍀

89. తోరణస్తారణో వాతః పరిధీపతిఖేచరః |
సంయోగో వర్ధనో వృద్ధో హ్యతివృద్ధో గుణాధికః

90. నిత్య ఆత్మా సహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివి సుపర్వణః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : పూర్ణయోగ లక్షీకమైన జ్ఞానానుభవం - సచ్చిదానందాత్మక మైన పరతత్వమున్నది. అది నిర్విశేషమే కాక మహాశక్తి సమన్వితం. ఆ దివ్యచేతనా అనుభూతిని ఇహజీవనంలో సెతం ప్రతిష్ఠితం చేసుకోవచ్చు, అనెడి పూర్ణయోగ లక్షిత జ్ఞానం మనస్సుకు సంబంధించినది కాదు. మనస్సున కతీతమైన ఆనుభూతికి సంబంధించినది, అనుభూతి కలుగక పూర్వం, అంతరాత్మ నిష్ఠమైన విశ్వాసానికి సంబంధించినది. ప్రాణ మనఃకోశముల అనువర్తనం సాధించునది ఆ విశ్వాసమే. 🍀

🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, దక్షిణాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల పంచమి 26:01:56

వరకు తదుపరి శుక్ల షష్టి

నక్షత్రం: చిత్ర 30:32:49 వరకు

తదుపరి స్వాతి

యోగం: శుభ 22:21:31 వరకు

తదుపరి శుక్ల

కరణం: బవ 13:12:28 వరకు

వర్జ్యం: 13:05:20 - 14:50:00

దుర్ముహూర్తం: 12:44:28 - 13:35:00

మరియు 15:16:05 - 16:06:37

రాహు కాలం: 07:34:56 - 09:09:41

గుళిక కాలం: 13:53:57 - 15:28:43

యమ గండం: 10:44:27 - 12:19:12

అభిజిత్ ముహూర్తం: 11:54 - 12:44

అమృత కాలం: 23:33:20 - 25:18:00

సూర్యోదయం: 06:00:10

సూర్యాస్తమయం: 18:38:13

చంద్రోదయం: 09:44:24

చంద్రాస్తమయం: 21:41:33

సూర్య సంచార రాశి: సింహం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు: ముద్గర యోగం - కలహం

30:32:49 వరకు తదుపరి ఛత్ర యోగం

- స్త్రీ లాభం

దిశ శూల: తూర్పు

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹



నాగ పంచమి - Naga Panchami (Nag Panchami)


🌹. నాగ పంచమి 🌹

🌹. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.🌹

🌸. ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. "నాగులచవితి" మాదిరిగానే "నాగ పంచమి" నాడు నాగ దేవతనుపూజించి, పుట్టలో పాలు పోస్తారు.

🌸. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా,అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

🌸. చలి చీమ నుండి... చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు,అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది.

🌸. హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పమేస్వరుడి కష్టాభరణమ్. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

🌸. నాగ జాతి జనము : కశ్యప ప్రజాపతికి, కద్రువ దంపతులకు.. అనంతుడు, తక్షకుడు, వాసుకి, ననినాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు.

🌸. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు. "విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాడు.

🌸. గరుడ మంత్రం చదివే వారిని, ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు, జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి. వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి. మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.

🌸. దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది.

🌸. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు. పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది. ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది.

🌸. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

🌸. శ్రావణ మాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.

🌸. అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి.

🌸. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.

🌸. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి.

🌸. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.


🌹🌹🌹🌹🌹


అగు ఋషులు (అతీంద్రియ జ్ఞానులు) - Aggu Rishis (Transcendental Wise Men)




లభన్తే బ్రహ్మనిర్వాణ మృషయః క్షీణకల్మషాః!
 ఛిన్నద్వైధా యతాత్మానః సర్వభూతహితేరతాః!!

భావం: పాప రహితులును, సంశయ వర్జితులును, ఇంద్రియ మనంబులను స్వాధీన పరచుకొనినవారును, సమస్త ప్రాణులయొక్క క్షేమమందు ఆసక్తి గలవారును అగు ఋషులు (అతీంద్రియ జ్ఞానులు) బ్రహ్మ సాక్షాత్కారమును (మోక్షమును) పొందుచున్నారు. - గీత05:25