నారద భక్తి సూత్రాలు - 74

🌹. నారద భక్తి సూత్రాలు - 74 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. చలాచలభోధ

తృతీయాధ్యాయము - సూత్రము - 43

🌻. 43. దుస్సంగః సర్వధైవ త్యాజ్యః ॥ 🌻

ఏ రకమైన దుస్సాంగత్యమైనా సరే, అన్నీ వదలివెయాలి.

సాధనలో ఉన్న భక్తుడు, కోరికలను నిగ్రహిస్తూ ఉండగా, దుస్పాంగత్యం కలిగితే ఆ కోరికలు రెట్టించి, అవకాశాన్ని వినియోగించు కుంటాయి. సాధకుడు పతనమవుతాదు.

కామ్యక కర్మలను చేస్తాడు. ఇంకా దిగజారితే నిషిద్ల కర్మలను కూడా చేస్తాడు. అక్రమ మార్గాల నవలంబిస్తాడు. వీటివల్ల నిగ్రహ శక్తి కోల్పోతాడు.

అహంకార మమకారాలను అడ్డు తొలగించు కోవలసింది పోయి వాటిని పెంచి గట్టి పరచుకుంటాడు. విరోధ ఉపాయం విఫలమవుతుంది. అనుకూల ఉపాయాలకు విఘ్నమేర్పడుతుంది.

అవకాశం కోసం పొంచి ఉండే అరిషడ్వర్గం, సందు దొరకగానె దాడి చేస్తుంది. విషయ సంగత్వం గాఢంగా కలుగుతుంది.

అంతవరకు చేసిన సాధనంతా మంటగలసి పోతుంది. సాధనలో పురోగమనం ఉండకపోగా తిరోగమనం జరుగుతుంది.

దుస్సాంగత్యం వలన పతనమైనవాడు తిరిగి పుంజుకోవడం అరుదు. పశ్చాత్తాప పడినప్పటికీ నైరాశ్యం ఆవరించి ఖిన్నుడవుతాడు. గురువు పర్యవేక్షణలో సాధన చెస్తే శిష్యుడిని సకాలంలో హెచ్చరిస్తాడా గురువు. తిరిగి సన్మార్గంలో పెడతాడు.

ఒక్కోసారి సన్మార్గంలో ఉన్న శిష్యుని దుష్ట సంస్కారాలను బయటికి లాగి గురువు పరిక్ష పెడతాడు. అప్పుడది ముందు జాగ్రత్త చర్య అవుతుంది.

బలహీనమైన మనసు గల శిష్యుడిని హెచ్చరిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. గురు కృప రుచి మరిగిన శిష్యుడైతే, గుర్వాజ్జను పాటిస్తూ, సాధన చేసాడు.

గురువు ప్రత్యక్షంగా లేకపోయినా గురు కృపను గుర్తించలేక పోయినా, శిష్యుడు దుస్సాంగత్యంలో పడిపోయె ప్రమాదమున్నది.

అతనిని ఇక రక్షించేవారే ఉండరు. ఇటువంటి అవాంతరాల విషయాల్లో ముందస్తు జాగ్రత్త అవసరమని ఈ సూత్రం చెప్తున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 40 / T̾h̾e̾ ̾S̾i̾v̾a̾-̾G̾i̾t̾a̾ ̾-̾ ̾4̾0̾

🌹. శివగీత - 40 / T̾h̾e̾ ̾S̾i̾v̾a̾-̾G̾i̾t̾a̾ ̾-̾ ̾4̾0̾ 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ
షష్ట మాధ్యాయము

🌻. విభూతి యోగము - 4 🌻

ప్రాణః కాల స్థథా మృత్యు - రమృతం భూత మప్యహమ్,
భవ్యం భవిష్య త్క్రు త్స్నం చ - విశ్వం సర్వాత్మ కోప్య హమ్ 26

ఓమాదౌ చ తథా మధ్యే - భూర్భువస్స వస్త థైవ చ,
త తో హం విశ్వ రూపోస్మి - వీర్షం చ జపతాం సదా 27

ఆశితం పాయితం చాహం - కృతం చాక్రుతం మప్యహ మ్
పరం చైవాపరం చాహ - మహం సూర్యః పరాయణః 28

మొట్టమొదట (ఆదిలో) ఓంకారముగాను,

మధ్యలో భూ:- భువః:- సువర్లోకములు, అంతయును, విశ్వరూపుడను నేనే.

జపించువారి ఫలితమును నేనే, తినబడినది, తాగబడినది, చేయబడినది, పరము, అపరము, సూర్యుడు, పరాయణుడు లోకహితము, దివ్యము, అక్షరము, సూక్ష్మము, ప్రాజాపత్యము, పవిత్రమును, సౌమ్యము, అగ్రాహ్యము, అగ్రియయును నేనే అయి యున్నాను.

అహం జగద్ది తందివ్య - మక్షరం సూక్ష్మ మప్యహమ్
ప్రాజాపత్యం పవిత్రం చ - సౌమ్యమగ్రాహ్య మగ్రియమ్ 29

ఆహామేవో పసం హర్తా - మహాగ్రాసౌ జసాం నిధి:
హృదయే దేవతాత్వేన - ప్రాణత్వేన ప్రతిష్టితః 30

లోకహితము విచిత్రమైనది, నాశము లేనిది, సూక్ష్మమైనది, ప్రాజాపత్యము, మేధ్యము, సౌమ్యము, అగ్రాహ్యము ఉత్తమోత్తమమైనది నేనే.

ఉపసంహరించువాడను, తెజోనిధిని,

సమస్త ప్రాణుల హృదయాంతరాళమున సూక్ష్మరూపుండునై యుండెదను, ప్రాణ పదమున నుండువాడను నేనే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  శివగీత - 40 / T̾h̾e̾ ̾S̾i̾v̾a̾-̾G̾i̾t̾a̾ ̾-̾ ̾4̾0̾   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 06 :
🌻 Vibhooti Yoga - 4
🌻

In the beginning as Omkara (Pranava), in the middle as BhuBhuvahSuvar etc. worlds, and in the end as the Vishwaroopa (cosmic form) I alone am.

I'm the fruit of the Japa. I'm the edible and drinkable items. I'm the doable and nondoable things also. I'm the Param (supreme) and I'm the Aparam (nonsupreme).

I'm the sun. I'm Parayana. I'm the well being of the universe. I'm the divinity. I'm the imperishable.

I'm the microatom (Sukshmam). I'm the Prajapatyam, holyness (Sacredness), I'm the softness (Soumya). And Agraahyam, Agriyam are also me only.

I'm the one who withdraws entire creation into myself (at the end of time), I'm the supreme light.

I remain seated in the heart's core of all the creatures. I exist as Prana (soul) in the beings.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 31 / Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 31

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 31 / Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 31 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 7వ అధ్యాయము - 2 🌻

నామకః ఈ ఉత్సవాలు హనుమంతుని కొరకు, కాని ప్రజలందరి కుతూహలం పాటిల్ ను సంతోషపెట్టడం కోసం. ఈపాటిల్ స్వభావం చాలా దురుసుగాను, అసమంజసంగాను ఉండి షేగాంలో తరుచుగా తగువులకు, వివాదాలకు దారితీసేది.

అతను అందరినీ నిందించేవాడు. కనీసం యోగులను కూడా విడిచిపెట్టేవాడు కాదు. తన తమ్ములతో ఈ హనుమాన్ మందిరానికి వెళ్ళి శ్రీమహారాజును అనరాని మాటలతో అవహేళన చెయ్యడం మొదలు పెట్టాడు. ఇందులో ఒకళ్ళయితే మహారాజును బయటకువచ్చి మల్లయుద్ధం చేసి ప్రజలకు తన గొప్పతనం నిరూపించవలసిందిగా ప్రేరేపిస్తాడు.

ఈ అన్నదమ్ములు శ్రీమహారాజును తన గొప్పదనం నిరూపించమని లేని పక్షంలో తమచేతి దెబ్బలు తినేందుకు సిద్ధం కమ్మని అంటారు. శ్రీమహారాజు దీనికి కోపగించుకోకుండా నవ్వుతారు. బలం, డబ్బు, అధికారం ఉన్న ఈ ఆకతాయి పాటిల్ సోదరుల నుండి మనం దూరంగా అకోలి వెళిపోదాం అని భాస్కరు శ్రీమహారాజుతో అన్నాడు. భాస్కర్ కొద్దిగా ఆగు.

ఈపాటిల్ సోదరులంతా నాయొక్క గొప్ప భక్తులు. వీరికి సరళత్వం తక్కువ కానీ నువ్వు జాగ్రత్తగా చూస్తే నాయందు వాళ్ళకు ఉన్న అభిమానం నీకు తెలుస్తుంది. వీళ్ళు యోగుల ఆశీర్వాదాలు ఇంతకు ముందే పొందారు, నాపిల్లలలాంటివారు.

అధికారానికి సాధారణంగా ఈదురుసుతనం తోడుగా ఉంటుంది. పులి ఆవులా ఎలా ప్రవర్తించగలదు ? నిప్పు ఎప్పుడయినా చల్లగా ఉంటుందా ? పదునులేని కత్తి నిరుపయోగం. వర్షాకాలంలోని బురద నీరు శీతాకాలం రాగానే స్వచ్ఛమయినట్టు, వీళ్ళ ఆకతాయితనం కూడా కొంత సమయంతరువాత కనిపించదు అని శ్రీమహారాజు సమాధానం చెపుతారు.

హరిపాటిల్ ఒకరోజు గుడికి వచ్చి, శ్రీమహారాజును తనతో మల్లయుద్ధం చెయ్యమని, అంతేకాక తను ఆయన్ని ఓడిస్తానని అంటాడు. గణ గణ గణాత బోతె అనుకుంటూ శాంతంగా కూర్చోకండి. అందరూ మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు, మీ గొప్పదనం ఈరోజు నేను పరీక్షించాలనుకున్నాను. నన్ను మల్లయుద్ధంలో మీరు ఓడిస్తే మీకు ' ఒక బహుమానం ఇస్తాను అని అన్నాడు.

శ్రీమహారాజు అతని ఆహ్వానం అంగీకరించి క్రిందకూర్చుని, నిజంగా బలవంతుడవయితే నన్ను లేవదీయమని అన్నారు. హరీపాటిల్ తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించినా ఒక్క అంగుళంకూడా శ్రీమహారాజును కదపలేకపోయాడు. మల్లయుద్ధంలోని యుక్తులన్నీ మరియు పూర్తి శక్తిని ఉపయోగించినా అతని శరీరం చెమటలు పట్టడం మొదలయిందేతప్ప, శ్రీమహారాజును అసలు కదపలేక పోయాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Sɾι Gαʝαɳαɳ Mαԋαɾαʝ Lιϝҽ Hιʂƚσɾყ - 31  🌹 

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 7 - part 2 🌻

For name's sake the celebrations were for Lord Hanuman, but in fact everybody was interested in pleasing the Patil. The attitude of the Patil was rude and unreasonable which frequently resulted in quarrels and disputes in Shegaon.

He abused everybody and did not spare even the saints. Patil, with his brothers, went to the temple of Lord Hanuman and started jesting at Shri Gajanan Maharaj by making bad puns on his name.

One of them even challenged Maharaj to come out for wrestling and prove the greatness bestowed upon Him by the people. The brothers asked Shri Gajanan Maharaj to prove His greatness or get ready to receive beatings at their hands.

Shri Gajanan Maharaj just laughed away their remarks and never got angry. Looking at all this rude behaviour of Patil brothers, Shri Bhaskara said, Maharaj let us go to Akoli, away from these insolent boys, corrupted by their strength, money and power. Shri Gajanan Maharaj replied, Bhaskar, wait a bit.

All these Patil brothers are my great devotees. They lack modesty, but observe them closely to know their affection for me. They are just like my sons and have already recieved blessings from the other saints. Executive power generally is accompanied by rudeness.

How can a tiger behave like a cow? Can fire ever be cold? Sword will be useless if it is soft. After some time this insolence will disappear as muddy water of rainy seasons becomes clear in winter. One day Hari Patil came to the temple and said to Shri Gajanan, come on wrestle with me and I will defeat you, don't sit quietly chanting Gan Gan Ganat Bote.

All people praise you and I want to test that greatness of yours. If you defeat me in wrestling, I will give you a prize. Maharaj accepted the challenge and sat down saying, Come on, if you are really strong, come and pull me up.

Hari Patil wrestled and applied all his strength, but could not move Shri Gajanan Maharaj even an inch. He used all his strength and the tricks of wrestling and all his body started perspiring, but could not move Shri Gajanan Maharaj at all.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 22

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 22 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. భగవంతుని రెండవ పాత్ర. - పరమాత్ముడు - 13 🌻

83. సర్వమ్(భగవంతుడు వున్నాడు అనుస్థితి)లో అంతర్నిహితమై యున్న ఆభావమునుండి, దివ్య అంతశ్చైతన్యము మాత్రమే ఓం బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైనది.

84. భగవంతుని దివ్యసుషుప్తినుండి భగవంతుని అంతఃచైతన్యము, సృష్టిబిందువు (ఓం) ద్వారా పైకిలేచునప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లు భగవంతుని మూలనాదమైన (బ్రహ్మనాదం) ఓంకార ధ్వనితోపాటు - దేశము (ప్రదేశము) కాలము, భౌతికవిశ్వము దానికి, సంబంధించిన వస్తుజాలము ( పరిమిత అహం, మనస్సు, ప్రాణము) వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లు చేసినది.

85. భగవంతుడు తన దివ్య సుషుప్తినుండి (పరాత్పర స్థితి) దివ్యజాగృతికి (అహం బ్రహ్మాస్మి స్థితి) మేల్కొనవలెనన్నచో తన దివ్యస్వప్నస్థితియైన మాయాసృష్టిని దాటి రావలయును.

86 . అభావముగా అంతర్నిహితమైయున్న సృష్టి, పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా, అభివ్యక్తమైనది. ఈ బిందువునే "ఓమ్" బిందువనియు, సృష్టి బిందువనియు అందురు.   ఈ బిందువు కూడా పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నది

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

23.Aug.2020

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134

🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. జీవుని - నారాయణుని - నిద్ర _1 🌻

కల్పాంతమున తాను కూడ నిద్రలోనికి పోయినచో లోకములతో బాటు తాను గూడ నుండడు. అపుడు నారాయణుడు సృష్టికి మాత్రమే ఈశ్వరుడగును గాని సర్వేశ్వరుడు కాలేడు. నిద్రనుండి మెలకువ వచ్చిన తర్వాత తాముంటిమని జ్ఞప్తి గలిగి తమ ప్రకృతి ననుసరించి చరించువారు జీవులు.

వారు మరల నిద్రాసమయము వరకు మాత్రమే ఉందురు. నిద్రలో తాముండరు. ఉన్నపుడు కూడ తమ తెలివికి తాము అధిపతులు కాక , తమ స్వభావమునకు బద్ధులై, అసహాయులై జీవింతురు.

అట్టి జీవులయందు అంతర్యామిగా నున్న నారాయణుడు ప్రకృతి కూడ అతీతుడే కాని బద్ధుడు కాడు.

.......... ✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

23.Aug.2020

శ్రీ లలితా సహస్ర నామములు - 71 / 🆂🆁🅸 🅻🅰🅻🅸🆃🅰 🆂🅰🅷🅰🆂🆁🅰🅽🅰🅼🅰🆅🅰🅻🅸 - 🅼🅴🅰🅽🅸🅽🅶 - 71

 🌹.  శ్రీ లలితా సహస్ర నామములు - 71 / 🆂🆁🅸    🅻🅰🅻🅸🆃🅰   🆂🅰🅷🅰🆂🆁🅰🅽🅰🅼🅰🆅🅰🅻🅸   -   🅼🅴🅰🅽🅸🅽🅶 - 71  🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మంత్రము - అర్ధం 🌻

🌻. శ్లోకం 135

రాజ్యలక్ష్మి: కోశనాధా చతురంగబలేశ్వరీ
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా

691. రాజ్యలక్ష్మి: :
రాజ్యలక్ష్మీ రూపిణీ

692. కోశనాధా :
కోశాగారముకు అధికారిణీ

693. చతురంగబలేశ్వరీ :
చతురంగ బలాలకు (రధ, గజ, తురగ, పదాదులు) అధిపతి

694. సామ్రాజ్యదాయినీ :
సామ్రాజ్యమును ఇచ్చునది

695. సత్యసంధా :
సత్యస్వరూపిణి

696. సాగరమేఘలా :
సముద్రములే వడ్డాణముగా కలిగినది

🌻. శ్లోకం 136

దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ
సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ

697. దీక్షితా :
భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది

698. దైత్యశమనీ :
రాక్షసులను సం హరించునది

699. సర్వలోకవశంకరీ :
సమస్తలోకములను వశము చేసుకొనునది

700. సర్వార్ధదాత్రీ :
కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది

701. సావిత్రీ :
గాయత్రీ మాత

702. సచ్చిదానందరూపిణీ :
సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹
📚. Prasad Bharadwaj

🌻 Sahasra Namavali - 71 🌻

691) Chathuranga baleswai -
She who is the leader of the four fold army (Mind, brain, thought and ego)

692) Samrajya Dhayini -
She who makes you emperor

693) Sathya Sandha -
She who is truthful

694) Sagara Mekhala -
She who is the earth surrounded by the sea

695) Deekshitha -
She who gives the right to do fire sacrifice

696) Dhaitya Shamani -
She who controls anti gods

697) Sarva loka vasam kari -
She who keeps all the world within her control

698) Sarvartha Dhatri -
She who gives all wealth

699) Savithri -
She who is shines like the sun

700) Sachidananda roopini -
She who is personification of the ultimate truth

701) Desa kala parischinna -
She who is not divided by region or time

702) Sarvaga -
She who is full of everywhere

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

23-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 467 / Bhagavad-Gita - 467🌹
2) 🌹 Sripada Srivallabha Charithamrutham - 255🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 135 🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 157 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 71 / Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 74 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 44🌹
8) 🌹. శివగీత - 40 / The Shiva-Gita - 40🌹
9) 🌹. సౌందర్య లహరి - 82 / Soundarya Lahari - 82🌹
10) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 22🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382🌹 

12) 🌹. శివ మహా పురాణము - 204🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 80 🌹
14) 🌹.శ్రీ మదగ్ని మహాపురాణము - 75 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 91 🌹
16) 🌹 Twelve Stanzas From The Book Of Dzyan - 22🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 40 🌹
18) 🌹. అద్భుత సృష్టి - 12 🌹
19) 🌹 Seeds Of Consciousness - 155🌹 
20) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 34 🌹
21) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 11 📚
22)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 467 / Bhagavad-Gita - 467 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 08 - 12 🌴*

08. అమానిత్వమదమ్భిత్వమహింసా క్షాన్తిరార్జవమ్ |
ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహ: ||

09. ఇన్ద్రియార్థేషు వైరాగ్యమనహంకార ఏవ చ |
జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్ ||

10. అసక్తిరనభిష్వఙ్గః పుత్రదారగృహాదిషు |
నిత్యం చ సమచిత్తత్వమిష్టానిష్టోపపత్తిషు ||

11. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ |
వివిక్తదేశసేవిత్యమరతిర్జనసంసది ||

12. అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ |
ఏతజ్ జ్ఞానమితి ప్రోక్తమజ్ఞానం యదతో(న్యథా ||

🌷. తాత్పర్యం : 
వినమ్రత, గర్వరాహిత్యము,అహింస, సహనము, సరళత్వము, ప్రామాణికగురువు నాశ్రయించుట, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మనిగ్రహము, ఇన్ద్రియార్థముల పరిత్యాగము, మిథ్యాహంకార రాహిత్యము, జన్మమృత్యుజరా వ్యాధుల దోషమును గుర్తించుట, అనాసక్తి, పుత్రకళత్రగృహాదుల బంధము నుండి విముక్తి, సుఖదుఃఖ సమయములందు సమభావము, నా యందు నిత్యమగు అనన్యమైన భక్తి, ఏకాంతవాస కోరిక, సామాన్యజనుల సహవాసమునందు అనాసక్తి, ఆధ్యాత్మజ్ఞానపు ప్రాముఖ్యమును అంగీకరించుట, పరతత్త్వము యొక్క తాత్త్వికాన్వేషణము అనునవన్నియును జ్ఞానమని నేను ప్రకటింపచున్నాను. వీటికి అన్యమైనది ఏదైనను అజ్ఞానమే.

🌷. భాష్యము :
ఈ జ్ఞానవిధానము అల్పజ్ఞులైన మనుజులచే కొన్నిమార్లు కర్మక్షేత్రపు అంత:ప్రక్రియ యనుచు తప్పుగా భావింపబడును. కాని వాస్తవమునకు ఇదియే నిజమైన జ్ఞానవిధానము. ఇట్టి విధానము మనుజుడు స్వీకరించినచో పరతత్త్వమును చేరగల అవకాశము కలుగకలుగగలదు. 

పూర్వము వివరించినట్లు ఈ జ్ఞానము కర్మక్షేత్రమునందలి ఇరువదినాలుగు అంశముల యొక్క అంత:ప్రక్రియ గాక వాటి బంధము నుండి ముక్తినొందుట నిజమైన మార్గమై యున్నది. అనగా చతుర్వింశతి తత్త్వములచే (అంశములచే) తయారైన ఆచ్ఛాదనము వంటి దేహమునందు జీవుడు చిక్కుబడి యున్నాడు. 

ఇచ్చట తెలుపబడిన జ్ఞానము అనునది అతడు దాని నుండి బయటపడుటకు మార్గమై యున్నది. ఈ జ్ఞానవిధాన వర్ణనలలో అత్యంత ముఖ్యమైనది పదునొకండవ శ్లోకపు మొదటి పాదమునందు వివరింపబడినది. 

అదియే “మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ” యనునది. అనగా జ్ఞానమనునది శ్రీకృష్ణభగవానుని విశుద్ధ భక్తియుతసేవ యందే పరిసమాప్తి నొందును.

 కనుక శ్రీకృష్ణుని భక్తియుక్తసేవను స్వీకరింపనిచో లేక అంగీకరింపలేకపోయినచో ఇతర తొమ్మిది జ్ఞానప్రక్రియలు విలువరహితములు కాగలవు. కాని సంపూర్ణకృష్ణభావనలో శ్రీకృష్ణుని భక్తియుతసేవను స్వీకరించినచో మనుజుని యందు మిగిలిన పంతొమ్మిది అంశములు అప్రయత్నముగా వృద్ధినొందగలవు. 

వాస్తవమైన ఆధ్యాత్మికజీవనము ఆధ్యాత్మికగురువును పొందిన పిమ్మటయే ఆరంభమగును గనుక భక్తియోగము నందున్నవారికి కూడా గురువును స్వీకరించుట అత్యంత ముఖ్యమైనది. ఈ జ్ఞానవిధానమే నిజమైన మార్గమని పూర్ణపురుషోత్తముడగు శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట స్పష్టముగా పలుకుచున్నాడు. దీనికి అన్యముగా ఊహింపబడునదంతయు అర్థరహితమే.

మొదటిదైన వినమ్రత అనగా ఇతరులచే గౌరవమును పొందవలెనని ఆరాటపడకుండుట యని భావము. 

అహింస యనునది చంపకుండుట లేదా దేహమును నశింపజేయకుండుటనెడి భావనలో స్వీకరించుబడుచుండును. కాని వాస్తవమునకు ఇతరులను కష్టపెట్టకుండుటయే అహింస యనుదాని భావము.

సహనమనగా ఇతరుల నుండి కలుగు మానావమానములను సహించు ఆభాసమును కలిగియుండుట యని భావము. 

ఆర్జవమనగా ఎట్టి తంత్రము లేకుండా శత్రువునకు సైతము సత్యమును తెలుపగలిగనంత ఋజుత్వమును కలిగయుండుట యని భావము. 

ఆధ్యాత్మిక జీవనమున పురోగతి సాధింపవలెను దృఢనిశ్చయమును మనుజుడు కలిగియుండుటయే స్థిరత్వమనుదాని భావము. 

మిథ్యాహంకారమనగా దేహమునే ఆత్మయని భావించుట. మనుజుడు తాను దేహమును కానని, ఆత్మనని తెలిసినప్పుడు వాస్తవ అహంకారమునకు వచ్చును. అహంకారమనునది సత్యమైనది. అనగా మిథ్యాహంకారమే నిరసించబడుచున్నది గాని అహంకారము కాదు. 

ఈ జన్మము, మృత్యువు, ముసలితనము మరియు వ్యాధుల యందలి దుఖమును తలచుచు భౌతికజీవితమునందు నిరాశ మరియు వైరాగ్యదృష్టిని కలిగియుండనిదే మన ఆధ్యాత్మికజీవనము నందు పురోగతికి ప్రేరణము లభింపదు.

పుత్ర, కళత్ర, గృహములందు అసంగత్వముగా వారియెడ ఎట్టి ప్రేమను కలిగియుండరాదని భావముకాదు. వాస్తవమునకు ప్రేమకు అవియన్నియును సహజ లక్ష్యములు. కాని ఆధ్యాత్మికపురోగతికి వారు అనుకూలము గాకున్నచో మనుజుడు వారియెడ ఆసక్తిని కలిగియుండరాదు.

సుఖదుఃఖములనునవి భౌతికజీవనమునకు అనుబంధమైన విషయములు. కనుక గీతయందు ఉపదేశింపబడినట్లు వాటిని సహించుటను అలవరచుకొనవలెను. సుఖదుఃఖముల రాకపోకలను నిరోధించుట అసాధ్యము గనుక మనుజుడు భౌతికజీవన విధానమునందు ఆసక్తిని విడనాడవలెను. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 467 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 08 to 12 🌴*

08. amānitvam adambhitvam
ahiṁsā kṣāntir ārjavam
ācāryopāsanaṁ śaucaṁ
sthairyam ātma-vinigrahaḥ

09. indriyārtheṣu vairāgyam
anahaṅkāra eva ca
janma-mṛtyu-jarā-vyādhi-
duḥkha-doṣānudarśanam

10. asaktir anabhiṣvaṅgaḥ
putra-dāra-gṛhādiṣu
nityaṁ ca sama-cittatvam
iṣṭāniṣṭopapattiṣu

11. mayi cānanya-yogena
bhaktir avyabhicāriṇī
vivikta-deśa-sevitvam
aratir jana-saṁsadi

12. adhyātma-jñāna-nityatvaṁ
tattva-jñānārtha-darśanam
etaj jñānam iti proktam
ajñānaṁ yad ato ’nyathā 

🌷 Translation : 
*Humility; pridelessness; nonviolence; tolerance; simplicity; approaching a bona fide spiritual master; cleanliness; steadiness; self-control; renunciation of the objects of sense gratification; absence of false ego; the perception of the evil of birth, death, old age and disease; detachment; freedom from entanglement with children, wife, home and the rest; even-mindedness amid pleasant and unpleasant events; constant and unalloyed devotion to Me; aspiring to live in a solitary place; detachment from the general mass of people; accepting the importance of self-realization; and philosophical search for the Absolute Truth – all these I declare to be knowledge, and besides this whatever there may be is ignorance.*

🌹 Purport :
This process of knowledge is sometimes misunderstood by less intelligent men as being the interaction of the field of activity. 

But actually this is the real process of knowledge. If one accepts this process, then the possibility of approaching the Absolute Truth exists. 

This is not the interaction of the twenty-four elements, as described before. This is actually the means to get out of the entanglement of those elements. 

The embodied soul is entrapped by the body, which is a casing made of the twenty-four elements, and the process of knowledge as described here is the means to get out of it. 

But if one takes to devotional service in full Kṛṣṇa consciousness, the other nineteen items automatically develop within him. 

The principle of accepting a spiritual master, as mentioned in the eighth verse, is essential. Even for one who takes to devotional service, it is most important. Transcendental life begins when one accepts a bona fide spiritual master. 

The Supreme Personality of Godhead, Śrī Kṛṣṇa, clearly states here that this process of knowledge is the actual path. Anything speculated beyond this is nonsense.

Humility means that one should not be anxious to have the satisfaction of being honored by others.

Nonviolence is generally taken to mean not killing or destroying the body, but actually nonviolence means not to put others into distress. 

Tolerance means that one should be practiced to bear insult and dishonor from others

Simplicity means that without diplomacy one should be so straightforward that he can disclose the real truth even to an enemy

Cleanliness is essential for making advancement in spiritual life. There are two kinds of cleanliness: external and internal. 

Steadiness means that one should be very determined to make progress in spiritual life. Without such determination, one cannot make tangible progress. 

self-control means that one should not accept anything which is detrimental to the path of spiritual progress. One should become accustomed to this and reject anything which is against the path of spiritual progress. 

False ego means accepting this body as oneself. When one understands that he is not his body and is spirit soul, he comes to his real ego. Ego is there. False ego is condemned, but not real ego.

As for detachment from children, wife and home, it is not meant that one should have no feeling for these. They are natural objects of affection. But when they are not favorable to spiritual progress, then one should not be attached to them.

Happiness and distress are concomitant factors of material life. One should learn to tolerate. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 255 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 29
*🌴. Explanation of couples who did Agni pravesam - 5 🌴*

*🌻 The names of couples who did ‘agni pravesam’ - 2 🌻*

60. Shyamalamba – Krishna Shresti 
61. Saraswathi – Parasiva Shresti
 62. Kalivathamsa – Balaka Shresti 
63. Hema Rekha – Swarnaradha Shresti 
64. Manishalaka – Kandarpa Shresti 
65. Medhamba – Markandeya Shresti   
66. Prithvi Devi – Prudhunama Shresti 
67. Dhanadamba – Moolaryulu 
68. Prollasini – Punyarasi Gupta
 69. Bimbadhari – Peenapaksharyulu 
70. Pallavamba – Bhogakhya Shresti 
71. Hemangi – Mruthsyadwajaryulu 
72. Devamba – Bhogakhya Shresti 
73. Ibhayana – Nagahvyaya Shresti 
74. Bhumamba – Brahmaryulu
75. Vidhuramba – Madhavaryulu 
76. Somaprabha – Simhadwaja Shresti 
77. Kambukanthi – Kapilaryulu 
78. Vasanthika – Ardhanareesa Shresti 
79. Pipulamba – Nagadwaja Shresti 
80. Manjuvani – Gunapunja Gupta 
81. Neelaveni – Bhanu Gupta 
82. Krishnamba – Nagahvyaya Shresti 
83. Pushpadhama – Vidakhya Gupta 
84. Prabhavathi – Padmanabha Shresti 
85. Navaneethangi – Vinnakhya Shresti 
86. Vinnamamba – Vishwanatha Shresti 
87. Medhamba – Veerabhadraryulu 
88. Gangabhavani – Vidhyadhara Shresti 
89. Chitrangi – Vinnavarenya Shresti
90. Sundari – Jeemutha Shresti 91. Rajamukhi – Rajeswara Shresti 92. Uthrulakshi – Punditharyulu 93. Padmagandhi – Balabhanu Shresti 94. Satyavathi – Satyasandha Shresti 95. Chandramba – Jaladakya Shresti 96. Pavanidevi – Chandrabana Shresti 97. Padmakshi – Meghasena Gupta 98. Chapalakshi – Simhamukha Shresti 99. Manimala –  Ghanamukharyulu 100. Davani – Nirjalasena Gupta 101. Leelavathi – Janardhana Gupta 102. Kumudavalli – Sudharshana Shresti 

After telling these details, Sripada went into ‘dhyana’. We were also told to be in ‘dhyana’.   

End of Chapter 29

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 134 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. జీవుని - నారాయణుని - నిద్ర _1 🌻*

కల్పాంతమున తాను కూడ నిద్రలోనికి పోయినచో లోకములతో బాటు తాను గూడ నుండడు. అపుడు నారాయణుడు సృష్టికి మాత్రమే ఈశ్వరుడగును గాని సర్వేశ్వరుడు కాలేడు. నిద్రనుండి మెలకువ వచ్చిన తర్వాత తాముంటిమని జ్ఞప్తి గలిగి తమ ప్రకృతి ననుసరించి చరించువారు జీవులు.  

వారు మరల నిద్రాసమయము వరకు మాత్రమే ఉందురు. నిద్రలో తాముండరు. ఉన్నపుడు కూడ తమ తెలివికి తాము అధిపతులు కాక , తమ స్వభావమునకు బద్ధులై, అసహాయులై జీవింతురు.  

అట్టి జీవులయందు అంతర్యామిగా నున్న నారాయణుడు ప్రకృతి కూడ అతీతుడే కాని బద్ధుడు కాడు.
.......... ✍🏼 *మాస్టర్ ఇ.కె.*🌻 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 155 🌹*
*🌴 The Emotional Plane - 1 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 Planes of Existence, 🌻*

The one existence manifests through seven planes. 

Existence emerges from pure existence as awareness, as love, as wisdom or buddhic existence, as mental, emotional and physical existence. 

I AM exists as a universal consciousness and appears in us as an individual consciousness, as an individual soul. 

As souls, we came down from the super-soul to experience at all planes. But we mostly live on the physical, the emotional and the mental planes; sometimes we also touch buddhi.

We should ask ourselves where we prefer to stay. Most people today are strongly focused on the material plane. 

If we are only physically oriented and express the lower desires of life, we are stuck at the base centre. When we are emotional, we move about in the sacral centre. When we are intellectually oriented and like to talk about our personal opinions, it is through the solar plexus. 

When we are caught within the triangular forces of the solar plexus, sacral and base centres, we are governed by emotions, impulses, and instincts, and our energies flow downwards. Majority of our problems is due to the imbalance of emotions - either when we suppress emotional desires or indulge in too much emotion.

 90 percent of humanity is still very emotional. Also, most of the diseases that humanity suffers from have emotional causes.

People who turn to meditation usually do not realize the need for the preparatory steps. 

Many are concerned with occultism without having first satisfied the basic material and emotional needs. Because of their economic and emotional shortcomings, they will have problems as they progress. 

Meditation exercises require an orderly physical life, emotional stability, and a healthy, balanced thinking. Without purity on the mental, emotional and physical planes, you cannot experience the Light.

🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K.P. Kumar: Healer’s Handbook. Notes from seminars.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 71 / Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 135
*రాజ్యలక్ష్మి: కోశనాధా చతురంగబలేశ్వరీ*
*సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా*

691. రాజ్యలక్ష్మి: : 
రాజ్యలక్ష్మీ రూపిణీ 

692. కోశనాధా : 
కోశాగారముకు అధికారిణీ 

693. చతురంగబలేశ్వరీ : 
చతురంగ బలాలకు (రధ, గజ, తురగ, పదాదులు) అధిపతి 

694. సామ్రాజ్యదాయినీ : 
సామ్రాజ్యమును ఇచ్చునది 

695. సత్యసంధా : 
సత్యస్వరూపిణి 

696. సాగరమేఘలా : 
సముద్రములే వడ్డాణముగా కలిగినది  

🌻. శ్లోకం 136
*దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ*
*సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ*

697. దీక్షితా : 
భక్తులను రకించుట యెందు దీక్ష వహించినది 

698. దైత్యశమనీ : 
రాక్షసులను సం హరించునది 

699. సర్వలోకవశంకరీ :
 సమస్తలోకములను వశము చేసుకొనునది 

700. సర్వార్ధదాత్రీ : 
కోరిన కోర్కెలన్నిటినీ తీర్చునది 

701. సావిత్రీ : 
గాయత్రీ మాత 

702. సచ్చిదానందరూపిణీ : 
సత్,చిత్, ఆనందములే రూపముగా కలిగినది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 71 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 71 🌻*

691 ) Chathuranga baleswai -   
She who  is the leader of the four fold army (Mind, brain, thought and ego)

692 ) Samrajya Dhayini -   
She who makes you emperor

693 ) Sathya Sandha -   
She who is truthful

694 ) Sagara Mekhala -   
She who is the earth surrounded by the sea

695 ) Deekshitha -   
She who gives the right to do fire sacrifice

696 ) Dhaitya Shamani -  
 She who controls anti gods

697 ) Sarva loka vasam kari -   
She who keeps all the world within her control

698 ) Sarvartha Dhatri -  
 She who gives all wealth

699 ) Savithri -  
 She who is shines like the sun

700 ) Sachidananda roopini -   
She who is personification of the ultimate truth

701 ) Desa kala parischinna -   
She who is not divided by region or time

702 ) Sarvaga -   
She who is full of everywhere

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 74 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
 తృతీయాధ్యాయము - సూత్రము - 43

*🌻. 43. దుస్సంగః సర్వధైవ త్యాజ్యః ॥ 🌻* 
 
*ఏ రకమైన దుస్సాంగత్యమైనా సరే, అన్నీ వదలివెయాలి.* 
 
సాధనలో ఉన్న భక్తుడు, కోరికలను నిగ్రహిస్తూ ఉండగా, దుస్పాంగత్యం కలిగితే ఆ కోరికలు రెట్టించి, అవకాశాన్ని వినియోగించు కుంటాయి. సాధకుడు పతనమవుతాదు. 

కామ్యక కర్మలను చేస్తాడు. ఇంకా దిగజారితే నిషిద్ల కర్మలను కూడా చేస్తాడు. అక్రమ మార్గాల నవలంబిస్తాడు. వీటివల్ల నిగ్రహ శక్తి కోల్పోతాడు. 

అహంకార మమకారాలను అడ్డు తొలగించు కోవలసింది పోయి వాటిని పెంచి గట్టి పరచుకుంటాడు. విరోధ ఉపాయం విఫలమవుతుంది. అనుకూల ఉపాయాలకు విఘ్నమేర్పడుతుంది. 

అవకాశం కోసం పొంచి ఉండే అరిషడ్వర్గం, సందు దొరకగానె దాడి చేస్తుంది. విషయ సంగత్వం గాఢంగా కలుగుతుంది.
 
అంతవరకు చేసిన సాధనంతా మంటగలసి పోతుంది. సాధనలో పురోగమనం ఉండకపోగా తిరోగమనం జరుగుతుంది. 
 
దుస్సాంగత్యం వలన పతనమైనవాడు తిరిగి పుంజుకోవడం అరుదు. పశ్చాత్తాప పడినప్పటికీ నైరాశ్యం ఆవరించి ఖిన్నుడవుతాడు. గురువు పర్యవేక్షణలో సాధన చెస్తే శిష్యుడిని సకాలంలో హెచ్చరిస్తాడా గురువు. తిరిగి సన్మార్గంలో పెడతాడు. 

*ఒక్కోసారి సన్మార్గంలో ఉన్న శిష్యుని దుష్ట సంస్కారాలను బయటికి లాగి గురువు పరిక్ష పెడతాడు. అప్పుడది ముందు జాగ్రత్త చర్య అవుతుంది.*

బలహీనమైన మనసు గల శిష్యుడిని హెచ్చరిస్తూ, రక్షిస్తూ ఉంటాడు. గురు కృప రుచి మరిగిన శిష్యుడైతే, గుర్వాజ్జను పాటిస్తూ, సాధన చేసాడు.

*గురువు ప్రత్యక్షంగా లేకపోయినా గురు కృపను గుర్తించలేక పోయినా, శిష్యుడు దుస్సాంగత్యంలో పడిపోయె ప్రమాదమున్నది.*

అతనిని ఇక రక్షించేవారే ఉండరు. ఇటువంటి అవాంతరాల విషయాల్లో ముందస్తు జాగ్రత్త అవసరమని ఈ సూత్రం చెప్తున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Guru Geeta - Datta Vaakya - 43 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj

Now the Lord begins to give his answer. 
Iswara uvacha: 

*🌻 Verse: Mama … “O Devi, you and I are one. Out of love for you I will give an answer to your question that has been posed for the benefit of all the worlds. 🌻*

No one has questioned me like this before.” It shows that Lord Siva was pleased by her posing the most valuable question. There are proper procedures for posing questions. 

When it is done in a proper manner, those who have questioned, and those who hear the answer, will all receive benefit. 

Asking irrelevant questions in an improper manner, and asking questions at inappropriate moments,  will not fetch good results. 

There is an Upanishad called Prasnopanishad. The first four questions deal with (Prana) the life force. The questions that follow deal with (Pranava) the syllable OM. 

Parikshit, who was a good listener only asked questions that would benefit the worlds. He cleared many of his doubts from the highly devout Suka Yogi. 

Sage Suka (Suka Brahma) has given us the Bhagavatam. It contains many  secrets. Shall we discuss them?  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 40 / The Siva-Gita - 40 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

షష్ట మాధ్యాయము

*🌻. విభూతి యోగము - 4 🌻*

ప్రాణః కాల స్థథా మృత్యు - రమృతం భూత మప్యహమ్,
భవ్యం భవిష్య త్క్రు త్స్నం చ - విశ్వం సర్వాత్మ కోప్య హమ్ 26
ఓమాదౌ చ తథా మధ్యే - భూర్భువస్స వస్త థైవ చ,
త తో హం విశ్వ రూపోస్మి - వీర్షం చ జపతాం సదా 27
ఆశితం పాయితం చాహం - కృతం చాక్రుతం మప్యహ మ్
పరం చైవాపరం చాహ - మహం సూర్యః పరాయణః 28

మొట్టమొదట (ఆదిలో) ఓంకారముగాను,
 మధ్యలో భూ:- భువః:- సువర్లోకములు, అంతయును, విశ్వరూపుడను నేనే.

 జపించువారి ఫలితమును నేనే, తినబడినది, తాగబడినది, చేయబడినది, పరము, అపరము, సూర్యుడు, పరాయణుడు లోకహితము, దివ్యము, అక్షరము, సూక్ష్మము, ప్రాజాపత్యము, పవిత్రమును, సౌమ్యము, అగ్రాహ్యము, అగ్రియయును నేనే అయి యున్నాను.

అహం జగద్ది తందివ్య - మక్షరం సూక్ష్మ మప్యహమ్
ప్రాజాపత్యం పవిత్రం చ - సౌమ్యమగ్రాహ్య మగ్రియమ్ 29
ఆహామేవో పసం హర్తా - మహాగ్రాసౌ జసాం నిధి:
హృదయే దేవతాత్వేన - ప్రాణత్వేన ప్రతిష్టితః 30   

లోకహితము విచిత్రమైనది, నాశము లేనిది, సూక్ష్మమైనది, ప్రాజాపత్యము, మేధ్యము, సౌమ్యము, అగ్రాహ్యము ఉత్తమోత్తమమైనది నేనే. 

ఉపసంహరించువాడను, తెజోనిధిని,
 సమస్త ప్రాణుల హృదయాంతరాళమున సూక్ష్మరూపుండునై యుండెదను, ప్రాణ పదమున నుండువాడను నేనే.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 40 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 06 :
*🌻 Vibhooti Yoga - 4 🌻*

In the beginning as Omkara (Pranava), in the middle as BhuBhuvahSuvar etc. worlds, and in the end as the Vishwaroopa (cosmic form) I alone am.

 I'm the fruit of the Japa. I'm the edible and drinkable items. I'm the doable and nondoable things also. I'm the Param (supreme) and I'm the Aparam (nonsupreme). 

I'm the sun. I'm Parayana. I'm the well being of the universe. I'm the divinity. I'm the imperishable. 

I'm the microatom (Sukshmam). I'm the Prajapatyam, holyness (Sacredness), I'm the softness (Soumya). And Agraahyam, Agriyam are also me only.

I'm the one who withdraws entire creation into myself (at the end of time), I'm the supreme light. 

I remain seated in the heart's core of all the creatures. I exist as Prana (soul) in the beings.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 31 / Sri Gajanan Maharaj Life History - 31 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 7వ అధ్యాయము - 2 🌻*

నామకః ఈ ఉత్సవాలు హనుమంతుని కొరకు, కాని ప్రజలందరి కుతూహలం పాటిల్ ను సంతోషపెట్టడం కోసం. ఈపాటిల్ స్వభావం చాలా దురుసుగాను, అసమంజసంగాను ఉండి షేగాంలో తరుచుగా తగువులకు, వివాదాలకు దారితీసేది. 

అతను అందరినీ నిందించేవాడు. కనీసం యోగులను కూడా విడిచిపెట్టేవాడు కాదు. తన తమ్ములతో ఈ హనుమాన్ మందిరానికి వెళ్ళి శ్రీమహారాజును అనరాని మాటలతో అవహేళన చెయ్యడం మొదలు పెట్టాడు. ఇందులో ఒకళ్ళయితే మహారాజును బయటకువచ్చి మల్లయుద్ధం చేసి ప్రజలకు తన గొప్పతనం నిరూపించవలసిందిగా ప్రేరేపిస్తాడు.

ఈ అన్నదమ్ములు శ్రీమహారాజును తన గొప్పదనం నిరూపించమని లేని పక్షంలో తమచేతి దెబ్బలు తినేందుకు సిద్ధం కమ్మని అంటారు. శ్రీమహారాజు దీనికి కోపగించుకోకుండా నవ్వుతారు. బలం, డబ్బు, అధికారం ఉన్న ఈ ఆకతాయి పాటిల్ సోదరుల నుండి మనం దూరంగా అకోలి వెళిపోదాం అని భాస్కరు శ్రీమహారాజుతో అన్నాడు. భాస్కర్ కొద్దిగా ఆగు. 

ఈపాటిల్ సోదరులంతా నాయొక్క గొప్ప భక్తులు. వీరికి సరళత్వం తక్కువ కానీ నువ్వు జాగ్రత్తగా చూస్తే నాయందు వాళ్ళకు ఉన్న అభిమానం నీకు తెలుస్తుంది. వీళ్ళు యోగుల ఆశీర్వాదాలు ఇంతకు ముందే పొందారు, నాపిల్లలలాంటివారు.

 అధికారానికి సాధారణంగా ఈదురుసుతనం తోడుగా ఉంటుంది. పులి ఆవులా ఎలా ప్రవర్తించగలదు ? నిప్పు ఎప్పుడయినా చల్లగా ఉంటుందా ? పదునులేని కత్తి నిరుపయోగం. వర్షాకాలంలోని బురద నీరు శీతాకాలం రాగానే స్వచ్ఛమయినట్టు, వీళ్ళ ఆకతాయితనం కూడా కొంత సమయంతరువాత కనిపించదు అని శ్రీమహారాజు సమాధానం చెపుతారు.

హరిపాటిల్ ఒకరోజు గుడికి వచ్చి, శ్రీమహారాజును తనతో మల్లయుద్ధం చెయ్యమని, అంతేకాక తను ఆయన్ని ఓడిస్తానని అంటాడు. గణ గణ గణాత బోతె అనుకుంటూ శాంతంగా కూర్చోకండి. అందరూ మిమ్మల్ని బాగా పొగుడుతున్నారు, మీ గొప్పదనం ఈరోజు నేను పరీక్షించాలనుకున్నాను. నన్ను మల్లయుద్ధంలో మీరు ఓడిస్తే మీకు ' ఒక బహుమానం ఇస్తాను అని అన్నాడు. 

శ్రీమహారాజు అతని ఆహ్వానం అంగీకరించి క్రిందకూర్చుని, నిజంగా బలవంతుడవయితే నన్ను లేవదీయమని అన్నారు. హరీపాటిల్ తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించినా ఒక్క అంగుళంకూడా శ్రీమహారాజును కదపలేకపోయాడు. మల్లయుద్ధంలోని యుక్తులన్నీ మరియు పూర్తి శక్తిని ఉపయోగించినా అతని శరీరం చెమటలు పట్టడం మొదలయిందేతప్ప, శ్రీమహారాజును అసలు కదపలేక పోయాడు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 31 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 7 - part 2 🌻*

For name's sake the celebrations were for Lord Hanuman, but in fact everybody was interested in pleasing the Patil. The attitude of the Patil was rude and unreasonable which frequently resulted in quarrels and disputes in Shegaon. 

He abused everybody and did not spare even the saints. Patil, with his brothers, went to the temple of Lord Hanuman and started jesting at Shri Gajanan Maharaj by making bad puns on his name. 

One of them even challenged Maharaj to come out for wrestling and prove the greatness bestowed upon Him by the people. The brothers asked Shri Gajanan Maharaj to prove His greatness or get ready to receive beatings at their hands. 

Shri Gajanan Maharaj just laughed away their remarks and never got angry. Looking at all this rude behaviour of Patil brothers, Shri Bhaskara said, Maharaj let us go to Akoli, away from these insolent boys, corrupted by their strength, money and power. Shri Gajanan Maharaj replied, Bhaskar, wait a bit. 

All these Patil brothers are my great devotees. They lack modesty, but observe them closely to know their affection for me. They are just like my sons and have already recieved blessings from the other saints. Executive power generally is accompanied by rudeness. 

How can a tiger behave like a cow? Can fire ever be cold? Sword will be useless if it is soft. After some time this insolence will disappear as muddy water of rainy seasons becomes clear in winter. One day Hari Patil came to the temple and said to Shri Gajanan, come on wrestle with me and I will defeat you, don't sit quietly chanting Gan Gan Ganat Bote. 

All people praise you and I want to test that greatness of yours. If you defeat me in wrestling, I will give you a prize. Maharaj accepted the challenge and sat down saying, Come on, if you are really strong, come and pull me up. 

Hari Patil wrestled and applied all his strength, but could not move Shri Gajanan Maharaj even an inch. He used all his strength and the tricks of wrestling and all his body started perspiring, but could not move Shri Gajanan Maharaj at all. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 22 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని రెండవ పాత్ర. - పరమాత్ముడు - 13 🌻*

83. సర్వమ్(భగవంతుడు వున్నాడు అనుస్థితి)లో అంతర్నిహితమై యున్న ఆభావమునుండి, దివ్య అంతశ్చైతన్యము మాత్రమే ఓం బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైనది.

84. భగవంతుని దివ్యసుషుప్తినుండి భగవంతుని అంతఃచైతన్యము, సృష్టిబిందువు (ఓం) ద్వారా పైకిలేచునప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లు భగవంతుని మూలనాదమైన (బ్రహ్మనాదం) ఓంకార ధ్వనితోపాటు - దేశము (ప్రదేశము) కాలము, భౌతికవిశ్వము దానికి, సంబంధించిన వస్తుజాలము ( పరిమిత అహం, మనస్సు, ప్రాణము) వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లు చేసినది.

85. భగవంతుడు తన దివ్య సుషుప్తినుండి (పరాత్పర స్థితి) దివ్యజాగృతికి (అహం బ్రహ్మాస్మి స్థితి) మేల్కొనవలెనన్నచో తన దివ్యస్వప్నస్థితియైన మాయాసృష్టిని దాటి రావలయును.

86 . అభావముగా అంతర్నిహితమైయున్న సృష్టి, పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా, అభివ్యక్తమైనది. ఈ బిందువునే "ఓమ్" బిందువనియు, సృష్టి బిందువనియు అందురు. ఈ బిందువు కూడా పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నది

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 82 / Soundarya Lahari - 82 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

82 వ శ్లోకము

*🌴. నీటి సంబంధ సమస్యల నివారణకు, జల తత్వం మీద విజయం, ఇంద్రుని వంటి శక్తుల కొరకు 🌴*

శ్లో: 82. కరీన్ద్రాణాం శుణ్డాన్ కనక కదలీకాణ్డ పటలీ ముఖాభ్యా మూరుభ్యా ముభయమపి నిర్జిత్య భవతీ సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుధకరికుమ్భద్వయమసిll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా! శాస్త్రములు అన్నియు తెలిసిన ఓ హిమవంతుని తనయా ! నీవు దిగ్గజములయిన ఏనుగుల తొండములు, బంగారు అరటి బోదెల సముదాయమును , నీ రెండు తొడల చేతను జయించి, భర్త యగు పరమ శివునికి మోకాళ్ళ మీద నమస్కరించుటచే కఠినములు అయిన మోకాళ్ళతో దేవతా గజమయిన ఐరావతము కుంభముల జంటను జయించి ప్రకాశించు చున్నావు కదా !

🌻. జప విధానం - నైవేద్యం:- ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, ద్రాక్ష పండ్లు నివేదించినచో జల ప్రమాదాల నుండి రక్షణ, జల తత్వం మీద విజయం, ఇంద్రదేవుని వంటి శక్తులు, నీటి సంబంధ సమస్యల నివారణ లభించును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹Soundarya Lahari - 82 🌹*
📚 Prasad Bharadwaj 

SLOKA - 82

*🌴 Stopping Flood and Getting Powers like Indhra 🌴*

82. Karrendranam sundan kanaka kadhali kaadapatali Umabhamurubhyam - mubhayamapi nirjithya bhavathi Savrithabhyam pathyu pranathikatinabham giri suthe Vidhigne janubhysm vibhudha karikumbha dwayamasi
 
🌻 Translation : 
Oh daughter of the mountain, who knows the rules of the Vedas, using your two thighs, you have achieved victory over, the trunks of the elephant,and the golden pseudo stem of group of banana plants, and achieved victory over frontal globes, of Iravatha the divine elephant, by your holy round knees,which have become hard,by repeated prostrations to your lord.

🌻 Iravatha refers to the elephant on which Indra rides 🌻

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) :  
If one chants this verse 1000 times a day for 45 days, offering honey and grape fruit as prasadam, it is believed that to overcome disasters such as flood, hurricane etc. 
 
🌻 BENEFICIAL RESULTS: 
Skills to float on or remain and water, ownership of mines and vast wealth. 
 
🌻 Literal Results:  
Abundant wealth, great prosperity. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 382 / Bhagavad-Gita - 382 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 31 🌴

31. పవన: పవతాస్మి రామ: శస్త్రభృతామహమ్ |
ఝషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ ||

🌷. తాత్పర్యం :
నేను పవిత్రమొనర్చువానిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, జలజంతువులలో మకరమును, నదులలో గంగానదిని అయి యున్నాను.

🌻. భాష్యము : 
అతిపెద్దవైన జలజంతువులలో మకరము ఒకటి. అది నిక్కముగా మానవునకు ప్రమాదకరమైనది. అట్టి మకరము శ్రీకృష్ణునకు ప్రాతినిధ్యము వహించును.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 382 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 31 🌴

31. pavanaḥ pavatām asmi
rāmaḥ śastra-bhṛtām aham
jhaṣāṇāṁ makaraś cāsmi
srotasām asmi jāhnavī

🌷 Translation : 
Of purifiers I am the wind, of the wielders of weapons I am Rāma, of fishes I am the shark, and of flowing rivers I am the Ganges.

🌹 Purport : 
Of all the aquatics the shark is one of the biggest and is certainly the most dangerous to man. Thus the shark represents Kṛṣṇa.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹