✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని రెండవ పాత్ర. - పరమాత్ముడు - 13 🌻
83. సర్వమ్(భగవంతుడు వున్నాడు అనుస్థితి)లో అంతర్నిహితమై యున్న ఆభావమునుండి, దివ్య అంతశ్చైతన్యము మాత్రమే ఓం బిందువు ద్వారా తప్పనిసరిగా బహిర్గతమైనది.
84. భగవంతుని దివ్యసుషుప్తినుండి భగవంతుని అంతఃచైతన్యము, సృష్టిబిందువు (ఓం) ద్వారా పైకిలేచునప్పుడు దివ్య సుషుప్తికి భంగము వాటిల్లు భగవంతుని మూలనాదమైన (బ్రహ్మనాదం) ఓంకార ధ్వనితోపాటు - దేశము (ప్రదేశము) కాలము, భౌతికవిశ్వము దానికి, సంబంధించిన వస్తుజాలము ( పరిమిత అహం, మనస్సు, ప్రాణము) వివిధములైన వ్యష్టి రూపములు బహిర్గతమగునట్లు చేసినది.
85. భగవంతుడు తన దివ్య సుషుప్తినుండి (పరాత్పర స్థితి) దివ్యజాగృతికి (అహం బ్రహ్మాస్మి స్థితి) మేల్కొనవలెనన్నచో తన దివ్యస్వప్నస్థితియైన మాయాసృష్టిని దాటి రావలయును.
86 . అభావముగా అంతర్నిహితమైయున్న సృష్టి, పరమాణు ప్రమాణమైన బిందువు ద్వారా, అభివ్యక్తమైనది. ఈ బిందువునే "ఓమ్" బిందువనియు, సృష్టి బిందువనియు అందురు. ఈ బిందువు కూడా పరాత్పరస్థితిలో అంతర్నిహితమై యున్నది
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
23.Aug.2020
No comments:
Post a Comment