కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 8

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 8 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

నచికేతుడు మూడవ వరముగా ‘ఆత్మతత్వము’ను గురించి అడుగగా, యముడు నచికేతునకుగల యోగ్యతను తెలుసుకొనుటకున్నూ, వాని దృఢత్వమును ఎఱుగ గోరియూ, యముడు ఈ విధముగా అనుచున్నాడు
నూరు సంవత్సరములు జీవించునట్టి, పుత్ర పౌత్రులను అడుగుము. 

వారితో కూడా సుఖముగా జీవించుటకు వీలగునట్లు ఆలమందలను, ఏనుగులను, గుర్రములను, బంగారము మొదలగువానిని కోరుకొనుము. విశాలమైన ఈ భూభాగమును లేక మాండలిక రాజ్యమును కోరుకొనుము. 

ఈ సంపదలన్ని ఉన్నప్పటికిని నేను అల్పాయిష్కడనైతినే అని, వీని వలన కలుగు ఫలమేమని నీవు తలంచినచో, ఈ సంపదల వలన కలుగు సుఖమును అనుభవించుటకు, నీవు ఎంతకాలము జీవింప తలంతువో, అంతకాలము సుఖముగా జీవించి యుండు నటుల, వరమును కోరుకొనుము. విస్తారమైన ధనమును, దివ్యములు మానుషములు అగు, ఏ యే కామములు కలవో, వానిని అన్నింటిని కోరుకొనుము. 

ఈ లోకమున మానవులకందని కోరికలు ఎన్నియో కలవు. ఆ కోరికలన్నింటిని నీవు స్వేచ్ఛగా అడుగుము. రథములతోను, వాద్యములతోను కూడినట్టి స్త్రీలను, నీకు ఒసంగు చున్నాను. ఈ స్త్రీలచే అన్ని విధములైన సేవలు చేయించుకొనుము. అన్ని సుఖములను అనుభవింపుము. అంతేకానీ, మరణానంతర విషయము నన్ను అడుగకుము అని యముడు చెప్పెను.

         ఇక్కడ మనందరి విశేషాలను చెబుతున్నారన్నమాట. మనమందరం కామ్యక కర్మలుగా పూజలు చేసేటప్పడు రోజువారి నిత్యజీవితంలో కూడా, నిత్యపూజలు చేసేటప్పుడు, అనేక రకములైనటువంటి కోర్కెలను మనం అడుగుతూ ఉంటాము.

ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాది సిద్ధ్యర్థం, ఇలా ‘ధం’ అని చెప్పేటటువంటి ఎన్ని మంత్రాలు శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో, విధుల రూపంలో ఏవైతే మనం రోజువారీ అడుగుతున్నామో, అవన్నీ కూడా మనకి ఇప్పుడిక్కడ బోధిస్తున్నారన్నమాట. 

మానవులందరూ సాధారణంగా అడిగేవి ఏమిటి? అంటే, నా మనవళ్ళు, ముని మనవళ్ళని చూచేంత వరకూ నేను బ్రతికి ఉండుట. మునిమనుమడికి మునిమనుమడు పుట్టేవరకూ అనుగ్రహించా పో! అన్నాడాయన.  

పూజలు జరిపేటప్పుడు మనం గుడికెళ్ళి పూజించారనుకోండి, ఏం చెబుతారు? ధన వస్తు వాహన కనక పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అంటాడాయన, ఒకేసారి అన్నీ కలిపి కోరేశాడన్నమాట. 

ఒక్కోసారి ఒక్కొక్కటి అడిగితే కష్టమని. ధన, వస్తు, వాహన, కనక మళ్ళా వస్తువులలో, వాహనాలలో కనకం ఉంటుందో లేదో అని, మళ్ళా కనకం వేరుగా ధన, వస్తు, వాహన, కనక ఇంకేమిటి? రధ, గజ, తురగ ‘రధ గజ తురగ’ - అంటే, ఏనుగులు, గుర్రాలు, రధాలు. ఇంకేం కావాలట? ఇవన్నీ ఉన్నాయండీ మరి సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కావలసినటువంటి కుటుంబ సౌఖ్యం అమరేటటువంటివన్నీ కూడా కావాలా? వద్దా? అవి కూడా ఇచ్చారు. 

ఇవన్నీ కలిపి ఏక మొత్తంగా ఒక్కొక్కటి విడివిడిగా అడగాల్సిన పనిలేకుండా, నీకు మొత్తం ఒకసారే ఇచ్చేశాను అనుకో, అవన్నీ తీసేసుకోవయ్యా, ఈ ఆత్మతత్వాన్ని విడిచిపెట్టు అన్నాడు.
         
ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని బోధిస్తున్నారు. ఏమిటంటే, మానవులెవరైతే, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని, తీవ్రమైనటువంటి తపన చెందుతూ ఉంటారో, తీవ్రమోక్షేచ్ఛను పొందాలనే ప్రయత్నం చేస్తారో, తీవ్ర వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ప్రకృతి వీటన్నింటినీ అనుగ్రహించడం మొదలుపెడుతుంది. అనుకున్నదే తడవుగా అయిపోవడంతో మొదలౌతుంది. ఇప్పుడు ఏదన్నా వర్షం ఆగిపోతే బాగుండు, అనుకుంటాడు. వర్షం ఆగిపోతుంది. 

ఇప్పుడు ఏదన్నా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అనుకుంటాడు. ఎవరో వస్తారు, టక్కుమని ఎక్కమంటారు, ఎక్కించుకుని తీసుకువెళ్ళి చేరవలసిన గమ్యస్థానంలోకి దించేస్తారు. 

ఇప్పుడు నన్ను ఎవరైనా కీర్తిస్తే బాగుండు అనుకుంటాడు, వెంటనే ఆ సమయం సందర్భం ఒనగూడి, ఆయన్ని అద్భుతంగా ఇంద్రుడని, చంద్రుడని, సూర్యుడని వాళ్ళకంటే గొప్పవాడని, ఇంకా అంతకంటే రాజరాజని, చక్రవర్తి అని ఈ రకంగా పొగిడేస్తారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు. 

వెంటనే మండలాధిపత్యమో, లేకపోతే సామ్రాజ్యాధిపత్యమో ఇంకా మరీ అయితే చతుర్దశ భువన భాండములందు ఆయన కోరినటువంటి లోకానికి అధిపతిగానో, వెంటనే చేయబడుతాడు. 

ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ, ప్రేరణ నీలో కలుగుతుంది. కలగగానే నీవు సరే అంటే చాలు అంతే, ఇంకేమి ఎక్కువ అననవసరం లేదు. ఓకే అంటే చాలు, రెండు అక్షరాల పదం, సరే అంటే చాలు. ఔను అంటే చాలు. తల పంకించినా చాలట, దానికి ఎక్కువ అవసరం లేదు, ఔను అని తల ఊపినా చాలట. అంతే, అది అయిపోతావు అంతే వెంటనే. 

ఆ రకంగా నీవు ఈ రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి, భోగ భాగ్య సంపదలతో కూడిన సమస్తము నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందేలోగానే వస్తుంది. వాటన్నింటి యందు నీవు విరక్తుడవై, పూర్ణవైరాగ్యమును పూని ఉన్నవాడవైతేనే నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. శివగీత - 9 / The Siva-Gita - 9 🌹


*🌹. శివగీత - 9 / The Siva-Gita - 9 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 9 🌻*

అతి స్వల్పత రాయుశ్శ్రీ - ర్భూతే శాంశాధి పోపియః,
సతు రాజా హమస్మీతి - వాది నం హన్తి స్వాన్వయమ్. 33

కర్తాపి సర్వ లోకానా - మక్ష యైశ్వర్య వానపి,
శివ శ్శివో హమ స్మీతి - వాది నం యం చ కంచన 34

ఎట్టి మహేశాం శమున బుట్టిన వాడైనను, " నేనే ప్రభువును " అనే అహంభావము ఎవనిలో ఉండునో అట్టి వానికి ఆయువు క్షీణించుటే కాకుండా నిర్వంశ మగుటకు మూలమగును.

 కావున మూడు లోకములకు ప్రభువైన ప్పటికి ఐశ్వర్య వంతుడైనను దురభిమానమునకు లోను గాక శివో హం భావముతో నుండిన అధవా దాసోహం భావంతో నుండి నను ఆ పర శివ మూర్తి మిక్కిలి ప్రసన్నుం డై తనలో ఐక్య మొనర్చు కొనును.

ఆత్మనా సహ తాదాత్మ్య - భాగినం కురుతే బృశమ్,
ధర్మార్ధ కామ మోక్షాణాం - పారం యాస్యన్తి యేన వై .35

మునయస్త త్ప్ర వక్ష్యామి - వ్రతం పాశు పతాభిదమ్,
కృత్వాతు విరజాం దీక్షాం - భూతి రుద్రాక్ష దారిణః 36

జపంతో వేద సారాఖ్యం శివ నామ సహస్రకమ్,
సంత్య జ్యతేన మర్త్యత్వం శేవీం తను మవాప్య . 37

ఓయి ! (ఋషి) మునివరులారా ! తొల్లి మునీశ్వరులే ఆచరించి; ధర్మము, అధర్మము ,కామము మరియు మోక్షమనెడు చతుర్విధములగు ఫల పురుషార్ధముల సారముల చక్కగా అవగతము చేసికొన్న పాశుపత మనెడి వ్రతమునకు నీకు వివరించెదను వినుడు.  

మీరు కూడా నేను వివరించిన విధముగా విరజా దీక్షను బొంది, విభూతి, రుద్రాక్షలను మేన దాల్చిన చతుర్వేద సారములైన శివ సహస్ర నామములను వల్లింపు చుండ దత్ప్రభావము చేత అశాస్వతమగు నీ మనుష్యత్వమును వీడి శివ స్వరూపమును పొందగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 9 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 9 🌻*

33. 34. Even if someone is an incarnation of Mahesha if he develops self pride by thinking, "I'm the Lord", such a person's life span would decline and also his lineage would get culminated. 

Hence, even if someone is a lord of the three worlds, if he remains free from ego and pride, and simply either remains filled with "Shivoham" feeling or else with the feeling of Lord's Servant (Devotee), that Supreme Lord Shiva would get pleased with him and would make him merge inside himself.

36. 37. Hey Monks! I would narrate one great 'Vratam' which bestows all the 'Chaturvarga Phala Purushardhas' viz.

 Dharma, Artha, Kaama, Moksha. that Vratam is called 'Pasupata Vratam'. 

You all may take the 'Viraja Deeksha' as per my instructions by applying Ash and wearing Rudraksha Mala, and chant the Shiva Sahasranama which is a summary taken from all the four vedas. 

If you do this kind of 'deeksha' you would leave your this ephimeral human body and would attain divinity by gaining Shiva's form itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

23-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 436 / Bhagavad-Gita - 436🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 224 / Sripada Srivallabha Charithamrutham - 224 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 104🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 127🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 40 / Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 67🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 44 🌹 
8) 🌹. శివగీత - 9 / The Shiva-Gita - 9🌹 
9)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 14 🌹 
10) 🌹. సౌందర్య లహరి - 51 / Soundarya Lahari - 51🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹

12) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 178🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 54 🌹
14) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 50 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 65 🌹
16) 🌹 Seeds Of Consciousness - 129 🌹
17) 🌹. మనోశక్తి - Mind Power - 69 🌹
18) 🌹 Guru Geeta - Datta Vaakya - 11🌹
19) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 8 🌹
20)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 436 / Bhagavad-Gita - 436 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 46 🌴*

46. కిరీటినం గదినం చక్రహస్తం
ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ |
తేనైవ రూపేణ చతుర్భుజేన
సహస్రబాహో భవ విశ్వమూర్తే ||

🌷. తాత్పర్యం : 
ఓ విశ్వరూపా! సహస్రబాహో! కిరీటము ధరించి శంఖ,చక్ర, గద, పద్మములను హస్తములందు కలిగియుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదురు. నిన్ను ఆ రూపమునందు గాంచ నేను అభిలషించుచున్నాను.

🌷. భాష్యము : 
బ్రహ్మసంహిత యందు (5.39) “రామాదిమూర్తిషు కలానియమేన తిష్ఠన్” అని చెప్పబడినది. అనగా శ్రీకృష్ణభగవానుడు వేలాది రూపములలో నిత్యస్థితుడై యుండుననియు మరియు రాముడు, నృసింహుడు, నారాయాణాది రూపములు వానిలో ముఖ్యమైనవనియు తెలుపబడినది. వాస్తవమునకు అట్టి రూపములు అసంఖ్యాకములు. కాని శ్రీకృష్ణుడు ఆదిదేవుడనియు, ప్రస్తుతము తన తాత్కాలిక విశ్వరూపమును ధరించియున్నాడనియు అర్జునుడు ఎరిగియున్నాడు. కనుకనే అతని దివ్యమగు నారాయణరూపమును చూపుమని అర్జునుడు ప్రార్థించుచున్నాడు. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడనియు మరియు ఇతర రూపములు అతని నుండియే ఉద్భవించుననియు తెలిపిన శ్రీమధ్భాగవతవచనము ఈ శ్లోకము నిస్సందేహముగా నిర్ధారించుచున్నది. ప్రధాన విస్తృతాంశములైన వివిధ రూపములు అతనికి అభిన్నములు. అట్టి అసంఖ్యాక రూపములన్నింటి యందును అతడు భగవానుడే. వాటన్నింటి యందును నిత్య యౌవననిగా అలరారుట యనునది ఆ దేవదేవుని ముఖ్యలక్షణమై యున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తెలిసికొనగలిగినవాడు భౌతికజగత్తు యొక్క సమస్త కల్మషము నుండి శీఘ్రమే ముక్తుడు కాగలడు
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 436 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 46 🌴*

46. kirīṭinaṁ gadinaṁ cakra-hastam
icchāmi tvāṁ draṣṭum ahaṁ tathaiva
tenaiva rūpeṇa catur-bhujena
sahasra-bāho bhava viśva-mūrte

🌷 Translation : 
O universal form, O thousand-armed Lord, I wish to see You in Your four-armed form, with helmeted head and with club, wheel, conch and lotus flower in Your hands. I long to see You in that form.

🌹 Purport :
In the Brahma-saṁhitā (5.39) it is stated, rāmādi-mūrtiṣu kalā-niyamena tiṣṭhan: the Lord is eternally situated in hundreds and thousands of forms, and the main forms are those like Rāma, Nṛsiṁha, Nārāyaṇa, etc. There are innumerable forms. 

But Arjuna knew that Kṛṣṇa is the original Personality of Godhead assuming His temporary universal form. He is now asking to see the form of Nārāyaṇa, a spiritual form. 

This verse establishes without any doubt the statement of the Śrīmad-Bhāgavatam that Kṛṣṇa is the original Personality of Godhead and all other features originate from Him. He is not different from His plenary expansions, and He is God in any of His innumerable forms. 

In all of these forms He is fresh like a young man. That is the constant feature of the Supreme Personality of Godhead. One who knows Kṛṣṇa becomes free at once from all contamination of the material world.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 224 / Sripada Srivallabha Charithamrutham - 224 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 42
*🌻. విచిత్ర శిక్షా విధానం 🌻*

ఇంతలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆలయానికి వచ్చి తన పేరు నరసింహఖాన్ అని, కాశ్యప గోత్రీకుడనని, దత్త దీక్ష కోసం మరాఠా దేశంనుండి వచ్చానని చెప్పాడు. ఆయన బొడ్డు దగ్గరున్న వరహాలమూటని చూసేసరికి బైరాగికి అంతకు ముందు ఏర్పడిన భయం స్థానంలో మళ్ళీ ధనాశ చిగురించింది. 

వెంటనే దీక్షా కార్యక్రమాన్ని చేపట్టి అందులో ఒక భాగంగా బ్రాహ్మణుని చేయి చాపమని చెప్పి కమండలం నుండి అతని చేతిలో నీళ్ళను పోస్తుండగా "అనేక సంవత్సరాలనుండి నీవు సంపాదించిన పుణ్యం అంతా నాకు ధార పోసావు, నేనిది పీఠికాపురానికి దత్తం చేస్తున్నానని" ప్రకటిస్తూ ఆ బ్రాహ్మణుడు అదృశ్యం అయ్యాడు. 

అయితే ఆ బైరాగి నీళ్ళు పోస్తుండగా నీటితో పాటు ఒక తేలు కూడా క్రింద పడింది. అది ఎవరో ఒక బ్రాహ్మణుని కుట్టింది. పాపం, అతనికి ఎన్ని తేలుమంత్రాలు వేసినా బాధ తగ్గకపోగా నోట్లోంచి నురగ కూడా ప్రారంభ మయ్యింది.

*🌻. మూఢాః పరప్రత్యయనేయ బుద్ధి 🌻*

కమండలంనుండి తేలు పడటం చూసిన ఒక బ్రాహ్మణుడు తేలుకాటు పాముకాటుగా మారడం కొండజాతి వారికి మాత్రమే తెలిసిన తాంత్రిక ప్రయోగం అని, ఆ విద్య తెలిసిన బైరాగి దాన్ని ఆ బ్రాహ్మణుని మీద ప్రయోగించాడని, ఆ విద్య ప్రకారం దెయ్యం నీళ్ళనుండి మొదట తేలులా వచ్చి, కరిచాక పాములా మారి, ఆ తరువాత మళ్ళీ దెయ్యంలా మారిపోతుందని, అలా మారిన క్షణమే తేలు కుట్టిన వ్యక్తి పిచ్చి గంతులు వేయడం ప్రారంభిస్తాడని, ఇక ఆ దెయ్యం తనని ప్రయోగించిన వ్యక్తి ఇష్టాన్ని బట్టి అందరి ఇళ్ళలోనూ జొరబడి ధనం దొంగిలించి వాడికి ఇస్తుందని చెప్పి తన వైదుష్యాన్ని ప్రదర్శించాడు. ఇంతలో తేలు కుట్టిన వ్యక్తి బాధ భరించలేక గెంతడం మొదలు పెట్టేసరికి ఆ మహాఙ్ఞాని వాణి సత్యమై అందరూ నివారణోపాయం కూడా అతన్నే అడిగారు. 

ప్రతి ఒక్క ఇంటిముందు 'ఓ దయ్యమా! రేపు రా' అని బొగ్గుతో వ్రాసి ఉంచినట్లయితే అది చదివిన దెయ్యం ఆ రోజు పోయి మరునాడు వస్తుందని, అదే వ్రాత కనిపించ డంతో మళ్ళీ రేపు వద్దామని తలచి వెళ్ళి పోతుందని ఈ రకంగా మోసగిస్తూ దాని బెడద తప్పించు కోవచ్చని చెప్పాడు. 

ఈ సూచనను ఆమోదించి వీళ్ళు వాళ్ళు అన్న భేదం లేకుండా అందరు ఉరుకులు పరుగులు తీస్తూ వెళ్ళి తమ తమ ఇళ్ళ ముందు 'ఓ దయ్యమా! రేపు రా' అనే ఆహ్వాన పత్రిక వ్రాసి ఉంచారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 224 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

*🌻 Explanation of the secret of Siva worship The greatness of Sivayogi’s devotion – Sripada’s teaching to him - 2 🌻*

The priests did not know what to do. The priests had some agents. If there was any rich devotee among the people coming to the temple, they used to say pleasing words to them.  

One of the priests by name Suryachandra Shastri was not only a pundit but also an austere person who does ‘anusthaanam’ daily.  

He had great devotion and love for Sripada. He remembered Sripada and started chanting ‘Namaka Chamakas’ with ‘swaram’ melodiously.  

The snakes that came there also were moving their hoods to the tune of the ‘swaram’, expressing their happiness. Suryachandra Shastri brought Sivayogi to Bapanarya’s house. Sivayogi was given food to his satisfaction.  

Later Sivayogi had darshan of Sripada also. Sripada gave darshan to him in Siva Shakti form. That Siva yogi remained in a state of ‘samadhi’ for 3 days.  

After 3 days Sripada fed him with his divine hands, and said ‘My Dear! You get your life fulfilled following the ‘dharma karmas’ as prescribed in sanathana dharma. The things mentioned in puranas are not imaginary stories, they are not untrue.  

The general meaning in them is different and the secret hidden meaning is different. Sadhakas doing ‘anushtanam’ only will understand their inner meaning and the secrets hidden in them. The Sun and the Moon are the cause for seasons.  

Sun is the representative of paramatma and moon is the representative of ‘manas’ (mind). Unless Sun (chit) combines with the moon (mind), the process of creation cannot happen. Amavasya (the darkest day of lunar month) is representative of ‘Maya’.  

This form of ‘Maya’ is creating the ‘kalaas’ named ‘vasuvulu’. It is infusing kalaas in ‘chandra bimbam’ and again reabsorbing them into it. Paramatma’s tejas is spreading into the man, the form of manas. Similarly Sun’s rays fall on Moon.  

Though Maya and Amavasya are ‘Jada’ (inert) forms, the Jagat born from them has become ‘chit-jada’ combined form because of nearness to ‘chit’.  

The cycle of seasons starting from ‘Vasantha Rutu’ is becoming the cause for creation. Similarly the cycles of woman are becoming the cause for the birth of babies.  

The desire for ‘Brahmajnana’ will be there only for ‘jeevas’ born in woman’s womb. The Rajas (arthavam) that is in women opposes Brahma. So it is born of ‘Brahma Hatya’. Thus the pundits say. The secrets of Vedas are masked by ‘chandassu’.  

That is why they are called ‘chandasam’. The ‘aarthavam’ has a distorted quality, so a woman in her menstrual period is kept away for three days. ‘Swargam’ (Heaven) is a glowing globe which has it’s own natural light. ‘Martya lokam’ (earth) is a place having births and deaths.  

All the ‘paathaalas’ are lighted because of sun’s light. So they are called ‘prusnulu’. All the seven ‘paathaalas’ have the supporting Gods like ‘Jaathaveda’. The earth on which we are living is before these paathaalas. Agni is the supporting God for it.  

These eight supporting Gods are called ‘Astha Vasuvus’. They are called ‘Vasuvus’ because they get light from the Sun. The columns of air between these eight globes are called the ‘seven seas’ (sapta samudras).  

Yacchya Maharshi says that the air (vayuvu) indicates ‘sea’. Common people think of the seven seas as water forms, but it is not true.  

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 104 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. మహాశివరాత్రి పర్వదిన సందేశము - 4 🌻*
 
రుద్రసూక్తము మహాసముద్రము వంటిది. ఇలా కూర్చుని ఒక సంవత్సరం పాటు చెప్పుకోవచ్చు. తిండి తింటున్నారు, నీళ్ళు త్రాగుతున్నారు, మీరంతా ఆ తిండి రూపంలోను నీళ్ళ రూపంలోను కూడా రుద్రుడు మీ మీద పనిచేస్తన్నాడు. 

నువ్వు తిన్న దాన్ని బట్టి ఆ రుద్రుడు "యేపాత్రేషు వివిధ్యన్తి" ఆ పాత్రల్లో ఉండి నువ్వు జాగ్రత్తగా మూతబెడితే తిననిస్తున్నాడు. 

మూత పెట్టకపోతే ఆ అన్నమునే ఆ ఆహారమునే ఆయుధాలుగా తీసికొని "అన్నం వాతో వర్షంఇషవః" అన్నము, గాలి, నీరు, వీటిని (బాణాలుగా) ఆయుధాలుగా గ్రహించి నీవు చేసిన తినకూడనివి తినుట, త్రాగకూడనివి త్రాగుట తినకూడని సమయమున తినుట, మొదలగు పనులకు, పొట్టలో శూలాలు పెట్టి (కడుపునొప్పి) పొడుచుట డమరుకములను మ్రోగించుట చేయుచున్నారు‌ జాగ్రత్త జాగ్రత్త ఇలాంటివన్నీ రుద్రసూక్తంలో లక్షలు ఉన్నాయి. 

నేడు రుద్రాన్ని మనం చేస్తున్నాము. సంతోషకరమైన విషయం ఏమంటే ఏమనుకోకండి మీలో వయస్సులో నా కంటే చిన్నవాళ్ళు ఉన్నారు వయస్సులో మాత్రమే ఈ పరమపవిత్రమయిన యజ్ఞం ఈ రోజున గాదు ఏ రోజున జరిగినా నేను భౌతికంగా రాగలిగిన పరిస్థితిలో తప్పక వస్తాను‌ 

నమస్సోమాయాచ...... రుద్రాయచ......అని ముక్త కంఠాలతో, ఉచ్చై స్వరాలతో మానవాళి మొత్తం శివుడు, శంకరుడు, అయిన ఆ రుద్రమూర్తిని అర్చించే పుణ్యదినం మహాశివరాత్రి. 

బలవంతపు జాగారం కాకుండా, శివుని సన్నిధిలో ఆత్పార్పణం జరిగిన సాధకునికి, తానుండటం మానివేసి, ఆ రాత్రి శివుడే తనలో వసించి, సాన్నిధ్యం ప్రసాదించడం వల్ల అప్రయత్నంగా ఆ రాత్రి గడిచి, ఉషోదయం జరుగుతుంది. అటువంటి రాత్రిని శివరాత్రి అనాలి. అందరికీ‌ శివరాత్రి శుభాకాంక్షలు..
..✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 126 🌹*
*🌴 The Pulsation - 4 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Five Pulsation 🌻

The pulsation works in the body in a five-fold manner, and we should understand these five pulsations in order to understand respiration. In Sanskrit they are also called the five Pranas or Vayus.

The first pulsation, Prana, is the impulse from circumference to centre. It initiates the process of inhalation and brings in oxygen.

 It is related to the mouth and speech, the heart and lungs. It functions from the root of the nose to the heart, and enables the intake of life energy.

The process of combustion in the body generates carbon, and this is expelled through the counter-movement, the impulse from the centre to the circumference called Apana. 

Apana directs the area from solar plexus to the soles of foot and controls the excretory processes as well as the organs of procreation. Imbalances of Prana have a negative effect on the respiration as well as on the develop-ment of the higher centres. Apana disturbances are connected with digestive problems and a wrong use of sexuality.

The gap between Prana and Apana, between the solar plexus and the heart, is bridged by Samana, the balancing power. Samana emerges when Prana and Apana are balanced. 

It is the interlude, where there is neither inhalation nor exhalation and where we can feel the subtle pulsation in the heart beat. Samana has a particular relation to the stomach, to diet, which should be well balanced. 

Samana causes a change of focus from a self-centered to a selfless attitude and leads to the ascending movement, Udana.

Udana moves in the area of the brain, between nose and top of the head. This pulsation is experienced in the third eye; it leads the human consciousness into the divine realms. 

The connection of Samana and Udana lifts the separation of the inner and the outer man and unity emerges.

The fifth pulsation called Vyana remains as the back-ground of the other four; it permeates the entire body via the subtle energy channels and the blood stream. 

By means of Vyana man experiences himself as an embodiment of light and realizes the light body within the material body.

These five pulsations have to be synthesized in order to be able to ascend to the higher planes of our being. 

This regulation is called Pranayama, regulated Prana, the fourth step of Yoga. It doesn’t mean breathing exercises, but the result of the exercises, by which the following steps can then be easily reached. If we remain consciously in the subtle pulsating principle, the goal of Yoga, Samadhi, is reached: to be one with the Lord.

🌻 🌻 🌻 🌻 🌻 
Master K.P. Kumar: Listening to the Invisible Master / notes from seminars / Master E. Krishnamacharya: Spiritual Psychology.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 40 / Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 73

321. కామ్యా - 
కోరదగినటువంటిది.

322. కామకళారూపా - 
కామేశ్వరుని కళయొక్క రూపమైనది.

323. కదంబకుసుమప్రియా - 
కడిమి పువ్వులయందు ప్రేమ కలిగినది.

324. కళ్యాణీ - 
శుభ లక్షణములు కలది.

325. జగతీకందా - 
జగత్తుకు మూలమైనటువంటిది.

326. కరుణా రససాగరా - 
దయాలక్షణానికి సముద్రము వంటిది.

🌻. శ్లోకం 74

327. కళావతీ - 
కళా స్వరూపిణీ.

328. కలాలాపా - 
కళలను ఆలాపనా స్వరూపముగా కలిగినది.

329. కాంతా - 
కామింపబడినటువంటిది.

330. కాదంబరీ ప్రియా - 
పరవశించుటను ఇష్టపడునది.

331. వరదా - 
వరములను ఇచ్చునది.

332. వామనయనా - 
అందమైన నేత్రములు గలది.

333. వారుణీమదవిహ్వలా - 
వరుణ సంబంధమైన పరవశత్వము చెందిన మనోలక్షణము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 40 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 40 🌻*

321 ) Kaamya - She who is of the form of love

322 ) Kamakala roopa - She who is the personification of the art of love

323 ) Kadambha kusuma priya - She who likes the flowers of Kadamba

324 ) Kalyani - She who does good

325 ) Jagathi kandha - She who is like a root to the world

326 ) Karuna rasa sagara - She who is the sea of the juice of mercy

327 ) Kalavathi - She who is an artist or she who has crescents

328 ) Kalaalapa - She whose talk is artful

329 ) Kaantha - She who glitters

330 ) Kadambari priya - She who likes the wine called Kadambari or She who likes long stories

331 ) Varadha - She who gives boons

332 ) Vama nayana - She who has beautiful eyes

333 ) Vaaruni madha vihwala - She who gets drunk with the wine called varuni(The wine of happiness)

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 43 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 26

🌻 26. ఫలరూపత్వాత్‌ 🌻

            పరాభక్తి అంటే సాధించగా వచ్చే ఫలితం కాదు. దానికదే ఫలరూపంగా ఉన్నది. అది సిద్ధమే గాని సాధ్యంగా వచ్చేది కాదు.

            ఈ పరాభక్తి సిద్ధించే వరకే ఏ యోగమైనా. అది సిద్ధించడానికి ఒక మెట్టు క్రిందితో యోగాలన్నీ ఆగిపోతాయి. 

అనగా యోగాలు, సాధనలు, వాటి ఫలితాలు భక్తుడిని పరాభక్తి అనే అనుభూతికి సంసిద్ధ పరుస్తాయే గాని, సాధనల ఫలితం పరాభక్తి కాదు. 

సాధనలన్నీ పరాభక్తి లక్ష్యంగా అహంకారాదుల అడ్డు తొలగించే ఉపాయాలుగా అవసరమౌతాయి. పరా భక్తికి ఒక మెట్టు క్రింద కలిగే ముఖ్యభక్తికి తీసుకొని వెళ్తాయి. 

పరాభక్తి మాత్రం సిద్ధ వస్తువు. అది ఎప్పటినుండో, ఎట్టి మార్పు లేకుండా ఉన్నదున్నట్లున్నదే. కొన్ని అవాంతర కారణాల వలన భక్తుడికి తెలియబడలేదు. 

తెలియబడటంలో జాప్యమేగాని అన్ని విధాలైన అడ్డంకులను తొలగించుకుంటూ పోయేవరకు మొదట అది లేదన్నట్లుండి, అడ్డు తొలగిన వెంటనే అది అలాగే, అక్కడే సాక్షాత్కరించినట్లైంది. 

తెర వెనుకనే ఉండి, తెర తీయగానే దర్శనమైనట్లు, అది ఆద్యంతాలు లేక సిద్ధమై ఉన్నది. అన్ని సాధనలూ తెరలు తొలగించడానికే గాని, పరాభక్తిని పొందడానికి కాదు. తెర చినిగితే అది ఉండనే ఉన్నది. 

అందువలన పరాభక్తిని ఫల రూపంగానే చెప్తున్నారు. పరాభక్తికి ప్రాప్తి, అప్రాప్తి అని లేదు. దానిని స్వతఃసిద్ధం అంటే సరిపోతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 9 / The Siva-Gita - 9 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 9 🌻*

అతి స్వల్పత రాయుశ్శ్రీ - ర్భూతే శాంశాధి పోపియః,
సతు రాజా హమస్మీతి - వాది నం హన్తి స్వాన్వయమ్. 33

కర్తాపి సర్వ లోకానా - మక్ష యైశ్వర్య వానపి,
శివ శ్శివో హమ స్మీతి - వాది నం యం చ కంచన 34

ఎట్టి మహేశాం శమున బుట్టిన వాడైనను, " నేనే ప్రభువును " అనే అహంభావము ఎవనిలో ఉండునో అట్టి వానికి ఆయువు క్షీణించుటే కాకుండా నిర్వంశ మగుటకు మూలమగును.

 కావున మూడు లోకములకు ప్రభువైన ప్పటికి ఐశ్వర్య వంతుడైనను దురభిమానమునకు లోను గాక శివో హం భావముతో నుండిన అధవా దాసోహం భావంతో నుండి నను ఆ పర శివ మూర్తి మిక్కిలి ప్రసన్నుం డై తనలో ఐక్య మొనర్చు కొనును.

ఆత్మనా సహ తాదాత్మ్య - భాగినం కురుతే బృశమ్,
ధర్మార్ధ కామ మోక్షాణాం - పారం యాస్యన్తి యేన వై .35

మునయస్త త్ప్ర వక్ష్యామి - వ్రతం పాశు పతాభిదమ్,
కృత్వాతు విరజాం దీక్షాం - భూతి రుద్రాక్ష దారిణః 36

జపంతో వేద సారాఖ్యం శివ నామ సహస్రకమ్,
సంత్య జ్యతేన మర్త్యత్వం శేవీం తను మవాప్య . 37

ఓయి ! (ఋషి) మునివరులారా ! తొల్లి మునీశ్వరులే ఆచరించి; ధర్మము, అధర్మము ,కామము మరియు మోక్షమనెడు చతుర్విధములగు ఫల పురుషార్ధముల సారముల చక్కగా అవగతము చేసికొన్న పాశుపత మనెడి వ్రతమునకు నీకు వివరించెదను వినుడు.  

మీరు కూడా నేను వివరించిన విధముగా విరజా దీక్షను బొంది, విభూతి, రుద్రాక్షలను మేన దాల్చిన చతుర్వేద సారములైన శివ సహస్ర నామములను వల్లింపు చుండ దత్ప్రభావము చేత అశాస్వతమగు నీ మనుష్యత్వమును వీడి శివ స్వరూపమును పొందగలవు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 9 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 9 🌻*

33. 34. Even if someone is an incarnation of Mahesha if he develops self pride by thinking, "I'm the Lord", such a person's life span would decline and also his lineage would get culminated. 

Hence, even if someone is a lord of the three worlds, if he remains free from ego and pride, and simply either remains filled with "Shivoham" feeling or else with the feeling of Lord's Servant (Devotee), that Supreme Lord Shiva would get pleased with him and would make him merge inside himself.

36. 37. Hey Monks! I would narrate one great 'Vratam' which bestows all the 'Chaturvarga Phala Purushardhas' viz.

 Dharma, Artha, Kaama, Moksha. that Vratam is called 'Pasupata Vratam'. 

You all may take the 'Viraja Deeksha' as per my instructions by applying Ash and wearing Rudraksha Mala, and chant the Shiva Sahasranama which is a summary taken from all the four vedas. 

If you do this kind of 'deeksha' you would leave your this ephimeral human body and would attain divinity by gaining Shiva's form itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 14 🌹*
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అచ్చమ్మకు చెప్పిన జ్యోతిష్యం - 2 🌻*

మొదట తెలంగాణా లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే కరువు ఉండేది. ఇప్పుడు రాయలసీమలో కూడా కరువు పెరిగిపోయింది. దీన్ని తట్టుకోలేక రైతులు పొలాలను వదిలేసి కూలీలుగా పట్నాలకు వలస వెళ్లిపోవడం సాధారణంగా మారిపోయింది. 

నీటికి కరవులేని కోస్తా జిల్లాల్లో కూడా ఇప్పుడు కొత్తగా నీటి సమస్య మొదలైంది. దీనివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తు ఇంకా ఘోరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బ్రాహ్మణులు తమ ధర్మాలను, పౌరోహిత్యం వదిలి ఇతర కర్మలను చేపడతారు. దానివల్ల అంతా అల్లకల్లోలంగా మారుతుంది.

పోతులూరి చెప్పిన కాలంలో ఇది విడ్డూరమే. అప్పట్లో ఏ కులంవారు, ఆ కులవ్రుత్తి చేపట్టేవారు. ఇప్పుడు కులవృత్తులు లేవు. ఎవరికీ ఏ పని ఇష్టమైతే, ఆ పనిలో స్థిరపడుతున్నారు.

చోళ మండలం నష్టమైపోతుంది..

తుఫానులు ఎక్కువగా తమిళనాడు తీరాన్ని తాకుతూ ఉంటాయి. ఈ కారణంవల్ల ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. ఏనుగుకు పంది పుడుతుంది. పందికి కోడి పుడుతుంది..

ఇలాంటి వింత సంఘటనలు తరచుగా పేపర్లలో చదువుతూనే ఉన్నాం. కుక్కకు పిల్లి, పంది కడుపున కోతి పుట్టిన ఉదంతాలు ఫొటోలతో సహా వార్తల్లో చూశాం. 

వివిధ జన్యు కారణాలవల్ల ఇలా జరుగుతోందని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. వీటిని ఏ విధంగానూ ఆపలేమని కూడా శాస్త్రజ్ఞులు చెప్పారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 1 / Sri Gajanan Maharaj Life History - 1 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

1. అధ్యాయము 
*🌻. ప్రార్ధన - 1 🌻*

శ్రీగణేశాయనమః ! 

శ్రీగణేశా, నీవు కరుణకు, వీరత్వానికి ప్రసిద్దుడివి. ఓ గౌరీపుత్రా మహామేధావులు, ప్రసిద్ధులు అందరూ కూడా ప్రతి పని ప్రారంభించేముందు నిన్ను స్మరిస్తారు. అన్ని విఘ్నాలు కూడా, నీ బలీయమైన ఆశీశులతో అగ్ని ముందు దూదిలా దూరమయి పోతాయి.

 అటువంటి ఆశీశ్శులే నాకు ఇచ్చి నేను అతి కమనీయమైన, శ్రేష్ఠమయిన కవితను చెప్ప గలిగేట్టు చెయ్యమని మీ పాదాలకు విమ్రతతో మొక్కుతున్నాను. ఏవిధమయిన కవిత్వం చెప్పేగుణాలు లేని, తెలివిలేని, బుద్ధి హీనుడను, అయినా మీఆశీర్వాదాలు ఉంటే కవిత రాసేపని తప్పక అవుతుంది. 

బ్రహ్మ నుండి ఉద్భవించిన మరియు కవులకు ప్రేరణ కలిగించే ఆదిమాయా సరస్వతి శారద కు ఇప్పుడు నానమస్సులు. నా ఆత్మగౌరవాన్ని నిలబెట్టమని ఇప్పుడు జగదంబకు నానమస్సులు. ఈమె ఆశీర్వచనాలు ఎంత గొప్పవంటే వాటితో ఒక అవిటివాడుకూడా మేరుపర్వతం ఎక్కగలుగుతాడు మరియు ఒక అల్పబుద్ధివాడు కూడా మంచివక్త అవుతాడు. 

ఆ నమ్మకంతోనే ఈ శ్రీగజానన్ గ్రంధ వ్రాయడంలో దాసగణుకు సహకరించమని ప్రార్ధిస్తున్నాను. పండరిపురం పురాణపురుషుడయిన పాండురంగను తన కరుణావీక్షణాలు నాయందు ఉంచమని వేడుకుంటున్నాను.

ప్రతి చిన్నబిందువు నుండి బ్రహ్మాండం వరకు ప్రతి దానిలో నిండిఉంటూ, ఈ విశ్వానికి నీవే ఆధారం. ప్రతి వస్తువు నీవల్లే ఉద్భవిస్తుంది, వాటి కదలికలు నీవే నిర్దేశిస్తావు. 

ఈప్రపంచము నీవే, ఇందులోని జీవ,నిర్జీవులు నీవే, తుది శక్తివీనీవే. సగుణ, నిర్గుణ, నాతండ్రి మరియు తల్లి నీవే. ఓ పురుషోత్తమా నీవెంత గొప్పవాడిఓ వర్నించడానికి నేను చాలాసూక్ష్మజీవిని. శ్రీరాముని ఆశీర్వాదాలతో కోతుల బలం పెరిగింది. గోకులం గొల్లపిల్లల విషయంలో అదేజరిగింది. 

మీ సహాయం పొందడానికి ధనం అవసరంలేదు, కానీ పూర్తిగా మీకే అర్పితమయిపోవాలి, అని ఋషులు కూడా చెప్పారు. నేను ఈకారణం వల్లనే మీద్వారం ముందుకు వచ్చాను. నన్ను నిరాశ పరచవద్దు అని ప్రార్ధిస్తున్నాను. ఓ పండరిపురి పాండురంగా మీరు నాలో పీఠం వేసుకొని ఈప్రఖ్యాత యోగి జీవితచరిత్ర వ్రాసేందుకు నాకు సహకరించండి. 

ఓభవానీవరా, నీలకంఠా, గంగాధరా, ఓంకారరూపా, త్రయంబకేశ్వరా నన్ను ఆశీర్వదించు. స్పర్శవేదమణి ఇనుముని బంగారంగా మారుస్తుంది, అదేవిధంగా నీకృప స్పర్శవేదమణ లాంటిది నేను ఇనుముని. దయతో సహకరించి నన్ను నిరాశపరచకు. నీకు అసంభవమయినది ఏదిలేదు, అందుకే ఇప్పుడు ఇంక ప్రతీది నీచేతులో ఉంది. దయచేసి త్వరగా వచ్చి మీఈసంతానం చేత ఈపుస్తకాన్ని రూపు దిద్దేందుకు సహకరించండి.
అన్ని శుభంగాజరిగేటట్టు ఆశీర్వదించమని కొల్హాపూర్లో ఉండే మా కులదేవతను వేడుకుంటూ ప్రార్ధిస్తున్నాను. 

తుల్జాపూర్ వాసి అయిన ఓ దుర్గామాతా, భవానీ మీ ఆశీర్వచనాలు నాశిరస్సుపై ఉంచమని వేడుకుంటున్నాను. శ్రీగజానన్ గొప్పతనాన్ని వర్ణించి పాడేందుకు స్ఫూర్తి కలిగించమని శ్రీదత్తాత్రేయుడుని వేడుకుంటూ మొక్కుకుంటున్నాను.

 మునీశ్వరులయిన శ్రీశాండిల్య, శ్రీవశిష్ఠ, శ్రీగౌతమ, శ్రీపరాసర మరియు
శ్రీశంకరాచార్యులకు నా వందనములు. నాచెయ్యి పట్టుకుని, నాచే ఈగ్రంధం పూర్తిచేయించవలసిందిగా అందరు మునులను, ఋషులను ప్రార్ధిస్తున్నాను. 

ఈజీవన వాహినిలో శ్రీగహిని, శ్రీనివృత్తి, శ్రీధ్యాణేశ్వర్, శ్రీతుకారాం ఓడ లాంటివారు వీరికి నా నమస్కారములు. ఓ షిరిడి సాయిబాబా మరియు వామనశా శ్రీ (దాసగణు కి గురువు) కరుణించి నన్ను పిరికి తనంనుండి ముక్తున్ని చెయ్యండి. 

మీ అందరి కృపాదృష్టివలనే నేను ఈగ్రంధం పూర్తిచేయగలను. కావున నన్ను కరుణించండి. పిల్లమీద ఉన్న ఏవిధమయిన సహజ ప్రేమవల్ల తల్లి మాట్లాడడం నేర్పిస్తుందో అదేవిధమయిన సంబంధం మీది నాది. 

కలం అక్షరాలు వ్రాస్తుంది, కాని అది కలం గొప్పతనంకాదు, వ్రాసేందుకు కలం ఓక ఉపకరణం మాత్రమే. అదేవిధంగా దాసగణు ఒక కలం, మునులందరినీ ఈకలం చేపట్టి ఈజీవతచరిత్రను అతిశ్రవణానంద కరంగా వ్రాయించమని ప్రార్ధిస్తునన్నాను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 1 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj 

Chapter 1 
*🌻. Prayer - 1 🌻*

 Shri Ganeshayanmah! 

Shri Ganesha, You are famous for your generosity and valour. O Gouriputra, all intellectuals and saints first remember you before starting any work. 

With your powerful Blessings all obstructions are just like cotton before fire. So I solemnly bow at your feet and invoke your blessings to bring out the best and the sweetest poetic recitation of my narration. 

I am ignorant, dull and have no qualities of a poet. But if you bless me, my work will be done. Now I give my obeisance to Adi Maya Saraswati-Sharada, who is born of Brahma and who is a great inspiration to the poets. 

Next I pay my obeisance to Jagadamba, to whom I pray for upholding my self-respect. Her blessings are so great that with her Ashis even a lame can climb a mountain and a dumb become a good orator. 

In keeping with that reputation kindly help Dasganu to write this book of Shri Gajanan. Now I beseech the Puran Purush Panduranga of Pandharpur to have an obliging glance at me.

You are the sole supporter of this universe and occupy every animate and inanimate object in it. You are the creator of everything, omnipotent and command all the actions in the universe. You are this world, the life in this world and also the ultimate power. 

You are Saguna, Nirguna, my father and also my mother. O Purushottama! You are so great that I am too small to comprehend You. Shri Rama blessed the monkeys who thereafter gained enormous strength. 

Same thing happened with the cowherd boys of Gokula. Saints have said that money is not required to receive Your favour, but a complete surrender at Your feet earns us Your support. That is why I have come to Your door. Please do not disappoint me. O Panduranga of Pandharpur, kindly help me write this great saint's biography, by residing in me. 

O Bhavanivara, Nilkantha, Gangadhara, Onkarrupa, Trimbakeshwara bless me. Paras changes iron into gold. Now Your favour is Paras and I am iron. Kindly help and do not disappoint me. Nothing is impossible for You since every thing is in Your hands. Kindly come quickly and help this child of Yours compose this book. Now I pay my obeisance to my family Deity who resides at Kolhapur. I beseech Her to bless me with everything auspicious. 

O Durgamata Bhavani of Tuljapur, I invoke Your blessings by having your hand on my head. Then I pay my obeisance to Lord Dattatraya and request Him for inspiration to sing in praise of Gajanan. Now I bow to the Saints of Saints Shri Shandilya, Shri Vashishta, Shri Goutam, Shri Parashar and Shri Shankaracharya the sun in the sky of wisdom. My obeisance to all the saints and sages who should, by holding my hand, get this writing done. 

Shri Gahani, Nivrutti, Shri Dyaneshwar, Shri Tukaram and Ramdas are dependable ships in the ocean of life. I bow to them. O Saibaba of Shirdi and Waman Shastri (Shri Dasganu's Guru) kindly free me of all fears. 

By the kind grace of You all only, I shall be able to write this book. So be kind to me. Only the real affection can teach a child to speak; and I share a relationship with you like that of a child with the mother. Pen writes letters, but receives no credit for writing them. 

A pen is only a means for writing; Dasganu is a pen and I beseech all the saints to hold it to write and make this biography melodious.

Continues.. 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 51 / Soundarya Lahari - 51 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

51 వ శ్లోకము 

*🌴. దేవీ అనుగ్రహం - పలుకుబడి, కీర్తి ప్రతిష్ఠలు 🌴*

శ్లో: 51. శివే శృంగారార్ద్రా తదితరజనే కుత్సనపరా 
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీl 
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ
సఖీషుస్మేరా తేమయి జనని దృష్టిః సకరుణాll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! నీ చూపు పరమ శివుని యందు శృంగార రసముతో తడుపబడి, ఆయనకు ప్రేమ కలదిగా యుండెను.ఇతరుల దృష్టి వికారము యందు ఏవగింపు కలదియు, సవతి అయిన గంగా దేవి యందు రోషముతో కూడి ఉన్నది. మన్మధుని దగ్ధము చేసిన ఫాల నేత్రమున ఆశ్చర్యము కలదియు,ఆయన ఆభరణములు అయిన పాముల యందు భయము కలదియు,ఎర్రని కలువల యందు సొందర్య రసము కలిగి ఉన్నది.చెలికత్తెల యందు చిరు నవ్వు కలిగి హాస్యముగా ఉన్నది. నిన్ను స్తుతి చేయు నా వంటి భక్తుల యందు కరుణ రసము కలిగి ఉన్నది . కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, తీపి మినప గారెలు నివేదించినచో దేవీ అనుగ్రహం, పలుకుబడి అభివృద్ధి, కీర్తి ప్రతిష్ఠలు లభ్యమగును అని చెప్పబడింది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 51 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 51 

*🌴 Obtaining Devi's grace and achieving high influence 🌴*

51. Shive sringarardhra tad-ithara-jane kutsana-paraa Sarosha Gangayam Girisa-charite'vismayavathi; Har'ahibhyo bhita sarasi-ruha-saubhagya-janani Sakhishu smera the mayi janani dristih sakaruna 
 
🌻 Translation : 
 Mother of all universe, the look from your eyes, is kind and filled with love, when looking at your lord, is filled with hatred at all other men, is filled with anger when looking at ganga, the other wife of your lord, is filled with wonder, when hearing the stories of your lord, is filled with fear, when seeing the snakes worn by your lord, is filled with red color of valor of the pretty lotus fine, is filled with jollity, when seeing your friends, and filled with mercy, when seeing me.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) : If one chants this verse 1000 times a day for 45 days, offering honey and vada (urad dhal)as prasadam, it is believed that they will be able obtaining Devi's grace and achieving high influence
 
🌻. BENEFICIAL RESULTS: 
Enticing people, obtaining Devi's grace and achieving high influence.
 
🌻 Literal Results: 
The rasas involved in this sloka (fear, disgust, dislike, anger, love, heroism, compassion and wonder) are one less than the navarasas; full of potency to rejuvenate the life
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 350 / Bhagavad-Gita - 350 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 9వ అధ్యాయము - రాజవిద్యా రాజగుహ్య యోగం - 31 🌴*

31. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాన్తిం నిగచ్చతి |
కౌన్తేయ ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి ||

🌷. తాత్పర్యం :
అతడు శీఘ్రమే ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందును. ఓ కౌంతేయా! నా భక్తుడెన్నడును నశింపడని ధైర్యముగా ప్రకటింపుము.

🌷. భాష్యము : 
 ఈ శ్లోకమును తప్పుగా అర్థము చేసికొనరాదు. దురాచారుడైనవాడు తన భక్తుడు కాలేడని భగవానుడు సప్తమాధ్యాయమున తెలిపియున్నాడు. 

అలాగుననే భగవద్భకుడు కానివానికి ఎట్టి శుభలక్షణములు ఉండవనియు మమమెరిగియున్నాము. అట్టి యెడ యాదృచ్చికముగా లేక ప్రయత్నపూర్వకముగా పాపమును ఒనరించినవాడు ఎట్లు భక్తుడగును? ఇటువంటి ప్రశ్న ఇచ్చట ఉదయించుట సహజమే. 

గీత యందలి సప్తమాధ్యాయమున పేర్కొనబడిన దుష్కృతులు (వారెన్నడును శ్రీకృష్ణుని భక్తియోగమునకు రారు) ఎటువంటి శుభలక్షణములను కలిగియుండరని శ్రీమద్భాగవతము నందు తెలుపబడినది. కాని భక్తుడైనవాడు అట్లుగాక నవవిధములైన భక్తిమార్గముల ద్వారా తన హృదయమాలిన్యమును తొలగించుకొన యత్నమున ఉన్నట్టివాడు. 

అతడు శ్రీకృష్ణభగవానుని సదా తన హృదయమునందే నిలిపియుండుటచే, అతని పాపములన్నియును సహజముగనే నశించిపోయియుండును. భగవానుని నిరంతర చింతన అతనిని పరమపవిత్రునిగ చేయును. ఉన్నతస్థితి నుండి పతనము చెందినవాడు పవిత్రతకై కొన్ని ప్రాయశ్చిత్తకర్మలను చేయవలెనని వేదానుసారము కొన్ని నియమములు కలవు. 

పవిత్రీకరణ విధానము భక్తుని హృదయమునందు ఇదివరకే నెలకొనియున్నందున అటువంటి పరిస్థితి భక్తియోగమునకు అన్యయింపదు. హృదయమునందు అతడు శ్రీకృష్ణభగవానుని సదా స్మరించుటయే అందులకు కారణము. కనుకనే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే / హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను దివ్యమాహామంత్ర జపకీర్తనలు నిలుపుదల లేకుండా సదా జరుగవలెను. 

అట్టి కార్యము భక్తుని సర్వవిధములైన యాదృచ్చిక పతనముల నుండి రక్షించును. ఆ విధముగా అతడు భౌతికసంపర్కము నుండి సదా ముక్తుడై యుండగలడు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 350 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 9 - Raja Vidya Raja Guhya Yoga - 31 🌴*

31. kṣipraṁ bhavati dharmātmā
śaśvac-chāntiṁ nigacchati
kaunteya pratijānīhi
na me bhaktaḥ praṇaśyati

🌷 Translation : 
He quickly becomes righteous and attains lasting peace. O son of Kuntī, declare it boldly that My devotee never perishes.

🌹 Purport :
This should not be misunderstood. In the Seventh Chapter the Lord says that one who is engaged in mischievous activities cannot become a devotee of the Lord. 

One who is not a devotee of the Lord has no good qualifications whatsoever. The question remains, then, How can a person engaged in abominable activities – either by accident or by intention – be a pure devotee? This question may justly be raised. 

The miscreants, as stated in the Seventh Chapter, who never come to the devotional service of the Lord, have no good qualifications, as is stated in the Śrīmad-Bhāgavatam. 

Generally, a devotee who is engaged in the nine kinds of devotional activities is engaged in the process of cleansing all material contamination from the heart. He puts the Supreme Personality of Godhead within his heart, and all sinful contaminations are naturally washed away. 

Continuous thinking of the Supreme Lord makes him pure by nature. According to the Vedas, there is a certain regulation that if one falls down from his exalted position he has to undergo certain ritualistic processes to purify himself. 

But here there is no such condition, because the purifying process is already there in the heart of the devotee, due to his remembering the Supreme Personality of Godhead constantly. 

Therefore, the chanting of Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare should be continued without stoppage. 

This will protect a devotee from all accidental falldowns. He will thus remain perpetually free from all material contaminations.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 178 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
40. అధ్యాయము - 15

*🌻. రుద్రావతార ఆవిర్భావము - 1 🌻*

అథ పంచదశోsధ్యాయః
రుద్రావతారావిర్భావము

నారద ఉవాచ |

విధే విధే మహాభాగ ధన్యస్త్వం సురసత్తమ | శ్రావితాద్యాద్భుతా శైవకథా పరమపావనీ || 1

తత్రాద్భుతా మహాదివ్యా లింగోత్పత్తి శ్ర్శుతా శుభా | శ్రుత్వా యస్యాః ప్రభావం చ దుఃఖనాశో భవేదిహ || 2

అనంతరం చ యజ్ఞాతం మహాత్మ్యం చరితం తథా | సృష్టైశ్చైవ ప్రకారం చ కథయ త్వం విశేషతః || 3

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! మహాత్మా! సురశ్రేష్ఠా! నీవు ధన్యుడవు. నీవీనాడు అద్భుతము, పరమపవిత్రమునగు శివగాథను వినిపించితివి (1). 

ఆ గాథలో భాగముగా మిక్కిలి దివ్యమైనది, శుభకరము అగు లింగోద్భవమును వినిపించితివి. లింగ మహాత్మ్యమును విన్న మానవులకు ఈ లోకములో దుఃఖము నశించును (2). 

లింగోద్భవము తరువాత జరిగిన వృత్తాంతమును, మహత్మ్యమును, సృష్టి ప్రకారమును వివరించి చెప్పుము (3).

బ్రహ్మోవాచ |

సమ్యక్‌ పృష్టం చ భవతా యజ్ఞాతం తదనంతరమ్‌ | కథయిష్యామి సంక్షేపాద్యథా పూర్వం శ్రుతం మయా || 4

అంతర్హితే తదా దేవే శివరూపే సనాతనే | అహం విష్ణుశ్చ విప్రేంద్ర అధికం సుఖమాప్తవాన్‌ || 5

మయా చ విష్ణునా రూపం హంస వారాహయోస్తదా | సంవృతం తు తతస్తాభ్యాం లోకసర్గావనేచ్ఛయా || 6

బ్రహ్మ ఇట్లు పలికెను -

నీవు చక్కగా ప్రశ్నించితివి. తరువాత జరిగిన వృత్తాంతమును నేను పూర్వము వినియుంటిని. ఆ వృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను (4). 

అపుడు సనాతనుడగు శివదేవుడు అంతర్హితుడయ్యెను. హే విప్రశ్రేష్ఠా! నేను మరియు విష్ణువు మిక్కిలి సుఖమును పొందితిని (5). 

అపుడు లోకములను సృష్టించవలెననే కోరిక గలవాడనై నేను హంసరూపమును ఉపసంహరించుకుంటిని. విష్ణువు లోకములను రక్షించుటకై వరాహ రూపమను ఉపసంహరించెను (6).

నారద ఉవాచ |

విధే బ్రహ్మాన్‌ మహాప్రాజ్ఞ సంశయో హృది మే మహాన్‌ | కృపాం కృత్వాతులాం శీఘ్రం తం నాశయితుమర్హసి || 7

హంస వారాహయో రూపం యువాభ్యాం చ ధృతం కథమ్‌ | అన్యద్రూపం విహాయైవ కిమత్ర వద కారణమ్‌ || 8

నారదుడిట్లు పలికెను -

హే బ్రహ్మాన్‌! నీవు మహాప్రాజ్ఞుడవు. నా హృదయములో గొప్ప సందేహము ఒకటి గలదు. నీవు దయతో ఆ సందేహమును వెనువెంటనే పారద్రోల దగుదువు. (7). 

మీరిద్దరు ఇతర రూపములను వీడి హంస వరాహరూపములను మాత్రమే ధరించుటకు గల కారణమేమియో చెప్పుము (8).

సూత ఉవాచ |

ఇత్యేతద్వచనం శ్రుత్వా నారదస్య మహాత్మనః | స్మృత్వా శివపదాం భోజం బ్రహ్మా సాదరమబ్రవీత్‌ || 9

సూతుడిట్లు పలికెను-

నారద మహాత్ముని ఈ మాటను విని, బ్రహ్మ శివుని పాదపద్మములను స్మరించి ప్రేమతో నిట్లనెను (9).

బ్రహ్మోవాచ |

హంసస్య చోర్ధ్వ గమనే గతిర్భవతి నిశ్చలా |తత్త్వాతత్త్వ వివేకోS స్తి జలదుగ్ధ విభాగవత్‌ || 10

అజ్ఞాన జ్జానయోస్తత్వం వివేచయతి హంసకః |హంసరూపం ధృతం తేన బ్రహ్మణా సృష్టికారిణా || 11

వివేకో నైవ లబ్ధశ్చ యతో హంసో వ్యలీయత | శివస్వరూపతత్త్వస్య జ్యోతీరూపస్య నారద || 12

సృష్టి ప్రవృత్తి కామస్య కథం జ్ఞానం ప్రజాయతే | యతో లబ్దో వివేకోsపి న మయా హంసరూపిణా || 13

బ్రహ్మ ఇట్లు పలికెను -

హంస నిశ్చలముగా పైకి పయనించగలదు. మరియు నీటిని పాలను వేరు చేసిన తీరున, హంస తత్త్వమును, అతత్త్వమును (10),

 జ్ఞానమును, అజ్ఞానమును వేరు చేయగలదు. అందువలననే, సృష్టికర్తయగు బ్రహ్మ హంసరూపమును ధరించెను (11). 

ఓ నారదా! జ్యోతిస్స్వరూపుడగు శివుని తత్త్వము యొక్క వివేకము, ఆ హంస రూపము లీనమగుటచే, నాకు లభించనే లేదు (12). 

సృష్టిలో ప్రవర్తిల్లవలెననే కోరిక గలవానికి జ్ఞానము ఎట్లు కలుగును? హంస రూపమును పొందియూ నేను వివేకమును పొందలేకపోతిని (13),

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 54 🌹*
Chapter 15
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 THE GOVERNING OF THE OCEANS - 1 🌻*

God is Ocean, and the infinitude of God is Oceanic. But in the infinitude of God, there are two oceans and both are infinite. 

There is the Ocean of Everything, which is the Ocean of his substance. And, there is the Ocean of Nothing, which is the Ocean of his shadow. Both Oceans expand infinitely to an immeasurable and unfathomable infinitude. 

Only the CONSCIOUS INFINITE CONSCIOUSNESS can fathom the Ocean of Everything, and it is the CONSCIOUS INFINITE UNCONSCIOUSNESS, in the embodiment of the Avatar, that plumbs the depths of the Ocean of Nothing. 

As both Oceans expand infinitely, they spread out their infinitude beyond measure drop by drop, and thus creation goes on spreading out everywhere.

The Avatar was the First Drop that came out of the Ocean of Everything, and out of the infinitude of his own Drop, he proceeded himself to create the Ocean of Nothing. This Ocean of Nothing is only a drop of the infinity of the First Drop. 

As the First Drop stirred within Its own Oceanic infinitude, It was the First to pass through the seven levels of evolution and the seven levels of involution within the infinitude of the Ocean of Nothing, and thus It was the First to realize Its Godhood. 

After the realization of Its Godhood, the First Drop took upon Itself the responsibility of the evolution and involution of everyone and everything in the Ocean of Nothing. 

This responsibility is to push each drop in the Ocean of Nothing (creation) toward the Ocean of Everything (Reality), and ultimately to make each drop realize that it is not a drop but Ocean Itself by expanding each drop into Ocean! 

This expansion of the drops into Ocean is by the push of the First Drop, and this push increases the capacity of consciousness by taking each drop beyond its limit to reach the Ocean. 

In other words, this push by the Avatar annihilates the limitations of a drop's consciousness by taking each drop's consciousness beyond its present capacity.

Since the Ocean of Nothing is infinite, the process of creation is endless, and the responsibility of the First Drop, the Avatar, is also endless. 

The First Drop is eternally free from all limitations, but It is bound by the responsibility to make each drop free from limitations, and so It, the Oceanic Drop, is bound eternally by Its own responsibility toward all drops (creation itself), pushing them and thereby expanding them into Ocean.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 50 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 24
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. కుండ నిర్మాణాగ్ని కార్యవిధి - 1 🌻*

అథ చతుర్వింశోధ్యాయః 24
అథ కుణ్డనిర్మాణాగ్ని కార్యాదివిధిః

నారద ఉవాచ :
అగ్నికార్యం ప్రవక్ష్యామి యేన స్యాత్సర్వకామభాక్‌ | చతురభ్యధికం వింశమజ్గులం చతురస్రకమ్‌ 1

సూత్రేణ నూత్రయిత్వా తు క్షేత్రం తావత్ఖనీత్సమమ్‌ | ఖాతస్య మేఖలాః కౌర్యాస్తక్త్యా చైవాజ్గులద్వాయం 2

సత్ఞ్వాదిసంజ్తాః పూర్వాస్యాద్ధ్వాదశాజ్గులముచ్ఛ్రితాః | అష్టాజ్గులా ద్వ్యజ్గులాథ చతురజ్గులవిస్తృతా. 3

యోనిర్దశాజ్గులా రమ్యా షట్‌చతుర్ద్వ్యజ్గులాగ్రగా | క్రమాన్నిమ్నా తు కర్తవ్యా పశ్చిమాశావ్యవస్థితా. 4

అశ్వత్థపత్రసదృశీ కిఞ్చిత్కుణ్డ నివేశితా | తుర్యాజ్గులాయతం నాలం పఞ్చదశాజ్గులాయతమ్‌. 5

మూలన్తు త్య్రజ్గులం యోన్యా అగ్రం తస్యాః షడజ్గులమ్‌ | లక్షణం చై కహస్తస్య ద్విగుణం ద్వికరాదిషు. 6

నారదుడు పలికెను:

అన్ని కోరికలను తీర్చు అగ్నికార్యమును చెప్పెదను. ఇరవైనాలుగు అంగుళముల చతురస్ర క్షేత్రమును సూత్రముతో కొలచి సమముగా అంతటను సమముగా త్రవ్వవలెను. ఆ విధముగా త్రవ్వినదానికి రెండంగుళములు విడచి మేఖలలు (ఒడ్డాణము వంటి కట్లు) చేయవలెను. 

సత్త్వము మొదలగు పేర్లుగల ఆ మేఖలలు పూర్వాభిముఖములు గాను, పండ్రెండు అంగుళములు ఎత్తు కలవిగా ఉండవలెను. ఒకటి ఎనిమిది అంగుళముల విస్తారము కలది, రెండవది రెండు అంగుళములు విస్తారము కలది, మూడవది నాలగు అంగుళముల విస్తారము కలది అయి ఉండవలెను. 

పది అంగుళముల రమ్యమైన యోని ముందు వైపు వరుసగా ఆరు-నాలుగు-రెండు అంగుళములు ఎత్తు ఉండవలెను. పడమట నున్న దానిని క్రమముగా లోతుగా నుండు నట్లు చేయవలెను. రావి ఆకు ఆకారములో నున్న దానిని కొద్దిగా కుండములోనికి చేర్చి నిర్మింపవలెను. 

దాని నాళము నాలుగు, ఐదు, పది అంగుళాల పొడవు ఉండవలెను. ఆ యోనియొక్క మూలము మూడు అంగుళములు, దాని అగ్రము ఆరు అంగుళములు ఉండవలెను. ఏకహస్తకుండలక్షణము ద్విహస్తకుండాదుల విషయమున రెట్టింపు అగుచుండును.

ఏకత్రిమేఖలం కుణ్డం వర్తులాది వదామ్యహమ్‌ | కుణ్డార్ధే తు స్థిరం సూత్రం కోణ యదతిరిచ్యతే. 7

తదర్దం దిశి సంస్థాప్య భ్రామితం వర్తులం భవేత్‌ |

ఒక మేఖల, మూడు మేఖలలు గల వర్తులాదికుండములను గూర్చి చెప్పెదను. కుండము యొక్క అర్థమునందు సూత్రము నుంచగా కోణమునందు మిగిలిన ఆ సూత్రములోని అర్ధమును దిక్కునందుంచి త్రిప్పినచో అది వర్తుల మగును. 7

కుణ్డార్ధం కోణభాగార్దం దిశా చోత్తరతో బహిః 
పద్మాకారే దలాని స్యుర్మేఖలాయాంతు వర్తులే. 8

పూర్వపశ్చిమతో యత్నల్లాఞ్ఛయిత్వా తు మధ్యతః | సంస్థాప్య భ్రామితం కుణ్డమర్థచన్ద్రం భవేచ్ఛుభమ్‌. 9

కుండార్ధమును మించిన కోణభాగార్ధమును బయట ఉత్తరభాగమున పెంచి పూర్వపశ్చిమములు వైపు బైటకు చాపి మద్యమునందు ఉంచి సూత్రము త్రిప్పినచో అర్ధచంద్రాకార మైన శుభకరమైన కుండము ఏర్పడును. పద్మాకారమైన వర్తులకుండమునందు మేఖలయందు దలము లుండును.

బాహుదణ్డప్రమాణన్తు హోమార్థం కారయే త్సృచమ్‌. 10

సప్తపఞ్చాజ్గులం వాపి చతురస్రం తు కారయేత్‌ | త్రిభాగేన భవేద్గర్తం మధ్యే వృత్తం సుశోభనమ్‌. 11

తిర్యగూర్ధ్వం సమం ఖాత్వా బహిరర్ధం తు శోధయేత్‌ | అఙ్గులస్య చతుర్థాంశం శేషార్ధార్ధం తథాన్తతః 12

ఖాతస్య మేఖలాం రమ్యాం శేషార్దేన తు కారయేత్‌ | కణ్ఠం త్రిభాగవిస్తార మఙ్గుష్ఠక సమాయతమ్‌. 13

సార్దమఙ్గుష్ఠకం వా స్యాత్తదగ్రే తు ముఖం భవేత్‌ | చతురజ్గుల విస్తారం పఞ్చాఙ్గుషలమథాపి వా. 14

త్రికం ద్వ్యఙ్గులకం తత్స్యాన్మధ్యం తస్య సుశోభనమ్‌ | ఆయామస్తత్సమ స్తస్య మధ్య నిమ్నః సుశోభనః.

సుషిరం కణ్ఠదేశే స్యాద్విశేద్యావత్కనీయసీ | శేషం కుణ్డం తు కర్తవ్యం యథారుచి విచిత్రితమ్‌ . 16

హోమము చేయుటకై చేయు ప్రమాణము లేదు పండ్రెండు అంగుళముల ప్రమాణము గల సృక్కును చేయించవలెను. దాని మూలభాగము చతురస్రముగా ఏడు లేదా ఐదు అంగుళములు ఉండవలెను. 

దాని మధ్యయందు త్రిభాగమున అందమైన, వర్తులాకార మైనగర్తము (గొయ్యి) ఉండవలెను. అడ్డముగా, పై భాగమున సమముగా ఆ గర్తము నిర్మించి పైన అర్ధాంగుళ భాగమును శోధించవలెను. (చెక్కి నున్నగా చేయవలెను).

 నాల్గవ వంతు అంగుళమును మిగిలిన అర్ధములో అర్థమును కూడ శోధించవలెను. మిగిలిని అర్ధముచే గుర్తమునకు రమ్యమైన మేఖలను ఏర్పరుపవలెను. 

త్రిభాగవిస్తారము కలదియు, అంగుష్ఠ మంత ఆయతు మైనదియు అగు కంఠమును చేయవలెను. దాని అగ్రమునందు నాలుగు లేదా ఐదు అంగుళముల ప్రమాణము గల ముఖ ముండవలెను. దాని మధ్యము ఆరు అంగుళముల ప్రమాణ ముండవలెను. 

దాని ఆయామము కూడా అంతయే ఉండి మధ్యమున పల్లమై అందముగా ఉండవలెను. దాని కంఠదేశమునందు చిటికెనవ్రేలు ప్రవేశించు నంత రంధ్ర ముండవలెను. మిగిలిన కుండము ( స్రుక్కు/ముఖము) అభిరుచి ననుసరించి విచిత్రముగ చేయవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 65 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భృగువు మహర్షి - ఖ్యాతి - 1 🌻*

వంశము: బ్రహ్మ, కర్దమ-దేవహూతి (మామగారు-అత్తగారు)
భార్య(లు): ఖ్యాతి, ఉశన, పులోమ
కుమారులు/కుమార్తెలు: ధాత, విధాత, శ్రీ(కుమార్తె), కవి, చ్యవనుడు
కాలము:
భౌగోళిక ప్రాంతములు: వింధ్య పర్వతాలు, కైలాసపర్వతం, మణికూట పర్వతం
నదులు: సరస్వతి
బోధనలు/గ్రంధాలు: భృగుసూత్రములు, నాడీశాస్త్రం

🌻. జ్ఞానం:
1. బ్రహ్మదేవుడి యొక్క హృదయంనుంచి పుట్టిన నవబ్రహ్మలలో భృగుమహర్షి ఒకడు.

2. విధి! దాన్నే దైవం అంటాం. అన్ని ప్రశ్నలకూ సమాధానం ఉండనఖ్ఖరలేదు. ఎప్పుడూ ప్రశ్న ప్రపంచంలో సజీవంగా ఉంటుంది. అనేక సందేహాలు. వాటికే చిరంజీవిత్వం ఉంటుంది. సమాధానంలో చిరంజీవిత్వం లేదు. ఆ ప్రశ్న గురువును అడిగితే గురువు చెప్పిన ఉత్తరం(జవాబు) ఉందే, అక్కడే ఆ క్షణమందే సజీవం అది. అది అడిగినవాడికొరకే ఏర్పడింది. సమాధానం అతడిని తరింపచేస్తుంది. మళ్ళీ అంతర్థానమైపోతుంది. ఆ ప్రశ్నోత్తరముల యొక్క రహస్యం అలాగే ఉండిపోతుంది లోకంలో. Again the question remains alive for all others, for their use. 

వేదంలో ‘పన్నం’ అంటారు. అంటే, ‘ప్రశ్న’ అనేపదమే ‘పన్నం’ అయింది. వేదంలో ప్రశ్నలంటారు వాటిని. అందుకే ప్రశ్న అనేది చిరంజీవి.

3. భృగు మహర్షిని భరర్ద్వాజ మహర్షి నుండి కొన్ని విషయములు తెలుసుకున్నాడు. అవి

1. భూతసృష్టి ఏవిషంగా జరుగుతున్నది? ఈ సృష్టిలో జీవులు, శరీరాలు, జీవన్మరణాలు ఎలా జరుగుతున్నాయి?

2. సత్యం ఒకరికి తెలిసినా, మరొకరి నోటవింటే ఎదుటివారి ముఖంలోని వాణి, ఆ భాష ఇంకొకలాగ నూతన భావాన్ని కలుగజేస్తుంది. దానినే ‘ముఖే ముఖే సరస్వతీ’ అనటం పరిపాటి. కాబట్టే భృగువును ఆదిగాడు భరద్వాజుడు.

3. భృగువు, “భరద్వాజా! సనాతనుడు, అవ్యయుడు, అనంతుడు అయినటువంటి నారాయణుడు అనేవాడొకడునాడు. 

4. ఈ భూతసృష్టిచేయటానికై తనలో ఒక సహస్రాంశభాగాన్ని బయటికితీసుకొచ్చి ఆయన మనస్సు అనే ఒక జరా మృత్యువులు లేనటువంటి ఒక అనుపమానమైన వ్యక్తిని సృష్టించాడు. అతడిలోంచి మహత్తు అనేటువంటిది పుట్టింది.అతదివ్యతేజోమయమైన ఒక పద్మాన్ని సృష్టించాడు. 

5. ఆ పద్మంలోంచి బ్రహ్మ పుట్టాడు. ఆ బ్రహ్మ యొక్క భావనచేత ఆకాశము, దానియందు జలము, జలంనుంచి వాయువు, ఆ వాయువునుంచి అగ్ని, దానివల్ల మరుత్తులు, దానివల్ల భూమి సృష్టించాడు ఆ బ్రహ్మ. 

6. అఖిలభూతాత్ముడై అతడికే కారణమైన వాడు విష్ణువు. ఈ ప్రకారంగా విష్ణువువల్లనే విశ్వం అంతా కలిగింది” అని అన్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 11 🌹*
✍️ Sri GS Swami ji 
📚. Prasad Bharadwaj

*🌻 Guru subjects disciples to tests to remove the dirt that is inside them. 🌻*

It is possible for the devotee to forget the purpose for which he has taken refuge with Guru in the first place, after seeing the glorious form of Guru. 

It is natural that once the divinity of Guru is experienced, the feeling comes that now Guru should be used to satisfy all worldly desires. The original purpose of earning spiritual knowledge and merging with the Supreme Soul is often forgotten.

The disciple is given the task of counting the heaps and heaps of gold. Regardless of who it belongs to, he is given the job of counting it. He is tempted to pocket a few fistfuls. 

That he has been brought here in the first place to perform the divine task of counting the gold is forgotten. The thought comes into the mind, “Why can’t Guru give me a part of the heap of gold that he possesses?” 

The feeling comes into the mind that worldly desires can now be fulfilled by the absolutely pure and perfect Sadguru’s immense power and grace. 

In spite of coming into the divine presence of Sadguru, the fundamental aim is forgotten and is replaced by the desire to enjoy worldly pleasures. There are many people who reach this stage and then slip and suffer a downfall.

As if this is not enough, Guru’s tests commence at this point. As soon as Sadguru is seen, the list of desires surfaces in the mind of the disciple. 

Desire wreaks havoc in his mind. The sense that he has obtained this immense boon of obtaining Guru, and a chance to obtain spiritual knowledge, is wiped out. 

The disciple now worries that he may forget to ask Guru for this or that worldly favor, and so recites the entire list of wishes in the presence of Guru on the very same day. 

That is the weakness suffered by many. He fails to recognize his blessing that he has earned Guru‘s grace.

The disciple begins to think, “Yes, it is true that there is much happiness in my heart since Guru has entered my life, but my troubles at home have increased since then.” With this thought some people leave their Guru. ”I used to be moderately healthy before. 

After I started taking this medicine, my health has deteriorated,” Is the complaint of some disciples. Such people use this excuse to leave Guru. 

The reason that the symptoms that were hitherto suppressed have now become severe is because the infection, the toxic contamination that has been hiding inside is now being taken out, being expelled, by Guru.

For example, if you kiss a dirty silk garment and carefully store it inside, it is not going to become clean. 

It will get clean only if it is washed with a cleaning agent. Similarly, a lump of gold is not usable as it is. Only if it gets repeatedly purified in fire, it will be possible to make ornaments with it. 

If because the fabric is pure silk, you do not wish to wash it, or because it is gold, you refuse to apply heat to it, they will forever remain dirty and impure.

Guru subjects disciples to tests to remove the dirt that is inside them. Not knowing this, and not wishing to undergo such tests, some people leave Guru. 

The severity of Guru’s tests is exemplified in the example of Deepaka in Datta Purana. Several examples are given of tests administered by Sadguru. The more he tests, the more the disciple gets purified. 

How much heat should be applied to retrieve the purest form of gold! Do you know? How can you be satisfied by being left as dirty and impure gold? Several stories are there to explain this.
🌻 🌻 🌻 🌻 🌻


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 68 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 Q 61:--మానవ దేహ, జంతు చరిత్ర - 2 🌻*

5) రాక్షసబల్లులు కొన్ని మిలియన్ సంవత్సరాలు ఉండి చైతన్య పరిణామం భూమి మీద ఇక చెందలేవు అనుకున్న క్షణం అవి నిష్క్రమించాయి.

6) మనిషి గాని ఇతర జీవజాతులు గాని గ్రహాంతర వాసుల సంపర్కం వల్ల సృష్టింపబడలేదు. మానవ దేహం లోని chromozomes జెనెటిక్ నిర్మాణం ఇతర లోకవాసులు సృషించలేదు లేదా వారు సంగమించడం ద్వారా సృష్టింపబడలేదు.

7) భూమి మీద చైతన్య పరిణామ పరిస్తితులుకు అనుగుణంగా జెనెటిక్ నిర్మాణం తయారై దేహాకృతులను తీసుకుని ఆత్మశకలాలు భూమ్మీదకు రావడం జరుగుతుంది.

8) ఇప్పటివరకు భూమ్మీదకు అవతరించిన అన్ని జీవజాతుల dna నిర్మాణం, జెనెటిక్ code భాష అంతా ఇతర డిమెన్షన్స్ లో భద్రపరచబడింది. మరల ఆ దేహాకృతి అవసరమైనప్పుడు మళ్లీ అవతరించగల అవకాశం ఉంటుంది.

9) ఇతర dimensions గల లోకాల్లో ఉన్న జీవజాతుల dna, జెనెటిక్ codes కూడా అంతరించి పోతున్నా వాటి కోడ్స్ కూడా విశ్వంలో కొన్ని డిమెన్షన్స్ గల లోకాల్లో భద్రపరచబడతాయి.

10) పులి, సింహం,ఇతర పక్షి జాతులు భూమ్మీద అంతరించిపోతున్నాయి. వాటంతట అవి నిష్క్రమించాలి అనుకుంటే తప్ప మానవజాతి వాటిని నిర్మూలించలేదు.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 129 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 WAIT IN SILENCE 🌻*

Keep quiet, undisturbed, and the wisdom and the power will come on their own. You need not hanker. 

Wait in silence of the heart and mind. It is very easy to be quiet, but willingness is rare. You people want to become supermen overnight. 

Stay without ambition, without the least desire, exposed, vulnerable, unprotected, uncertain and alone, completely open to and welcoming life as it happens, without the selfish conviction that all must yield you pleasure or profit, material or so-called spiritual.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 8 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

నచికేతుడు మూడవ వరముగా ‘ఆత్మతత్వము’ను గురించి అడుగగా, యముడు నచికేతునకుగల యోగ్యతను తెలుసుకొనుటకున్నూ, వాని దృఢత్వమును ఎఱుగ గోరియూ, యముడు ఈ విధముగా అనుచున్నాడు
నూరు సంవత్సరములు జీవించునట్టి, పుత్ర పౌత్రులను అడుగుము. 

వారితో కూడా సుఖముగా జీవించుటకు వీలగునట్లు ఆలమందలను, ఏనుగులను, గుర్రములను, బంగారము మొదలగువానిని కోరుకొనుము. విశాలమైన ఈ భూభాగమును లేక మాండలిక రాజ్యమును కోరుకొనుము. 

ఈ సంపదలన్ని ఉన్నప్పటికిని నేను అల్పాయిష్కడనైతినే అని, వీని వలన కలుగు ఫలమేమని నీవు తలంచినచో, ఈ సంపదల వలన కలుగు సుఖమును అనుభవించుటకు, నీవు ఎంతకాలము జీవింప తలంతువో, అంతకాలము సుఖముగా జీవించి యుండు నటుల, వరమును కోరుకొనుము. విస్తారమైన ధనమును, దివ్యములు మానుషములు అగు, ఏ యే కామములు కలవో, వానిని అన్నింటిని కోరుకొనుము. 

ఈ లోకమున మానవులకందని కోరికలు ఎన్నియో కలవు. ఆ కోరికలన్నింటిని నీవు స్వేచ్ఛగా అడుగుము. రథములతోను, వాద్యములతోను కూడినట్టి స్త్రీలను, నీకు ఒసంగు చున్నాను. ఈ స్త్రీలచే అన్ని విధములైన సేవలు చేయించుకొనుము. అన్ని సుఖములను అనుభవింపుము. అంతేకానీ, మరణానంతర విషయము నన్ను అడుగకుము అని యముడు చెప్పెను.

         ఇక్కడ మనందరి విశేషాలను చెబుతున్నారన్నమాట. మనమందరం కామ్యక కర్మలుగా పూజలు చేసేటప్పడు రోజువారి నిత్యజీవితంలో కూడా, నిత్యపూజలు చేసేటప్పుడు, అనేక రకములైనటువంటి కోర్కెలను మనం అడుగుతూ ఉంటాము.

ఇష్టకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం, మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, పుత్ర పౌత్రాది సిద్ధ్యర్థం, ఇలా ‘ధం’ అని చెప్పేటటువంటి ఎన్ని మంత్రాలు శ్లోకాల రూపంలో, మంత్రాల రూపంలో, విధుల రూపంలో ఏవైతే మనం రోజువారీ అడుగుతున్నామో, అవన్నీ కూడా మనకి ఇప్పుడిక్కడ బోధిస్తున్నారన్నమాట. 

మానవులందరూ సాధారణంగా అడిగేవి ఏమిటి? అంటే, నా మనవళ్ళు, ముని మనవళ్ళని చూచేంత వరకూ నేను బ్రతికి ఉండుట. మునిమనుమడికి మునిమనుమడు పుట్టేవరకూ అనుగ్రహించా పో! అన్నాడాయన.  

పూజలు జరిపేటప్పుడు మనం గుడికెళ్ళి పూజించారనుకోండి, ఏం చెబుతారు? ధన వస్తు వాహన కనక పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అంటాడాయన, ఒకేసారి అన్నీ కలిపి కోరేశాడన్నమాట. 

ఒక్కోసారి ఒక్కొక్కటి అడిగితే కష్టమని. ధన, వస్తు, వాహన, కనక మళ్ళా వస్తువులలో, వాహనాలలో కనకం ఉంటుందో లేదో అని, మళ్ళా కనకం వేరుగా ధన, వస్తు, వాహన, కనక ఇంకేమిటి? రధ, గజ, తురగ ‘రధ గజ తురగ’ - అంటే, ఏనుగులు, గుర్రాలు, రధాలు. ఇంకేం కావాలట? ఇవన్నీ ఉన్నాయండీ మరి సౌకర్యాన్ని అమర్చుకోవడానికి కావలసినటువంటి కుటుంబ సౌఖ్యం అమరేటటువంటివన్నీ కూడా కావాలా? వద్దా? అవి కూడా ఇచ్చారు. 

ఇవన్నీ కలిపి ఏక మొత్తంగా ఒక్కొక్కటి విడివిడిగా అడగాల్సిన పనిలేకుండా, నీకు మొత్తం ఒకసారే ఇచ్చేశాను అనుకో, అవన్నీ తీసేసుకోవయ్యా, ఈ ఆత్మతత్వాన్ని విడిచిపెట్టు అన్నాడు.
         
ఇందులో ఒక గొప్ప రహస్యాన్ని బోధిస్తున్నారు. ఏమిటంటే, మానవులెవరైతే, ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలని, తీవ్రమైనటువంటి తపన చెందుతూ ఉంటారో, తీవ్రమోక్షేచ్ఛను పొందాలనే ప్రయత్నం చేస్తారో, తీవ్ర వైరాగ్యాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, అప్పుడు ప్రకృతి వీటన్నింటినీ అనుగ్రహించడం మొదలుపెడుతుంది. అనుకున్నదే తడవుగా అయిపోవడంతో మొదలౌతుంది. ఇప్పుడు ఏదన్నా వర్షం ఆగిపోతే బాగుండు, అనుకుంటాడు. వర్షం ఆగిపోతుంది. 

ఇప్పుడు ఏదన్నా బండి వచ్చి నన్ను ఎక్కించుకెళ్తే బాగుండు అనుకుంటాడు. ఎవరో వస్తారు, టక్కుమని ఎక్కమంటారు, ఎక్కించుకుని తీసుకువెళ్ళి చేరవలసిన గమ్యస్థానంలోకి దించేస్తారు. 

ఇప్పుడు నన్ను ఎవరైనా కీర్తిస్తే బాగుండు అనుకుంటాడు, వెంటనే ఆ సమయం సందర్భం ఒనగూడి, ఆయన్ని అద్భుతంగా ఇంద్రుడని, చంద్రుడని, సూర్యుడని వాళ్ళకంటే గొప్పవాడని, ఇంకా అంతకంటే రాజరాజని, చక్రవర్తి అని ఈ రకంగా పొగిడేస్తారు. ఇప్పుడు నాకు అర్జెంటుగా అధికారం లభిస్తే బాగుండు అనుకుంటాడు. 

వెంటనే మండలాధిపత్యమో, లేకపోతే సామ్రాజ్యాధిపత్యమో ఇంకా మరీ అయితే చతుర్దశ భువన భాండములందు ఆయన కోరినటువంటి లోకానికి అధిపతిగానో, వెంటనే చేయబడుతాడు. 

ఈ రకంగా సకామ్యమైనటువంటి ఆకర్షణ, ప్రేరణ నీలో కలుగుతుంది. కలగగానే నీవు సరే అంటే చాలు అంతే, ఇంకేమి ఎక్కువ అననవసరం లేదు. ఓకే అంటే చాలు, రెండు అక్షరాల పదం, సరే అంటే చాలు. ఔను అంటే చాలు. తల పంకించినా చాలట, దానికి ఎక్కువ అవసరం లేదు, ఔను అని తల ఊపినా చాలట. అంతే, అది అయిపోతావు అంతే వెంటనే. 

ఆ రకంగా నీవు ఈ రకమైనటువంటి ప్రకృతితో కూడినటువంటి, భోగ భాగ్య సంపదలతో కూడిన సమస్తము నీవు పొందేటటువంటి అవకాశము ఆత్మసాక్షాత్కార జ్ఞానం పొందేలోగానే వస్తుంది. వాటన్నింటి యందు నీవు విరక్తుడవై, పూర్ణవైరాగ్యమును పూని ఉన్నవాడవైతేనే నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందుతావు.
🌹 🌹 🌹 🌹 🌹