మైత్రేయ మహర్షి బోధనలు - 80


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 80 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 66. విఘ్నములు - వినియోగము 🌻


విఘ్నములు కలిగినపుడు మానవుని యొక్క లో శక్తి, మేధస్సు ఎక్కువగ పనిచేయును. కష్టములు కలిగినపుడు మేధస్సునకు, శక్తికి మరింత పని తగులును. ఆపదలు వచ్చినప్పుడు మానవుడు తన సమస్త శక్తిని, మేధస్సును వినియోగించును. సంపూర్ణముగ తన యందలి శక్తి సామర్ధ్యములను వినియోగించుటకు అవకాశమప్పుడే ఏర్పడును. అప్రమత్తతకూడ అప్పుడే ఏర్పడును. సాధారణ సమయమున అట్టి శక్తి, మేధస్సు నిద్రాణముగను, నిరుపయోగముగను యుండును.

మీ యందలి శక్తి సామర్ధ్యములను, మేధస్సును మీ ఉన్నతికి ఉపయోగించుటకు, మీ పరిణితికి తోడ్పాటు చేయుటకు ప్రకృతి విఘ్నములు, కష్టములు, ఆపదలు కలిగించుచుండును. సౌఖ్యము
లనుభవించుచున్నప్పుడు అప్రమత్తత యుండదు. మీరప్రమత్తు లగుటయే మా ఆశయము. అప్రమత్తులే లోకహిత కార్యములకు సహకరించగలరు. అందువలననే లోకహిత మార్గమున నడచువారికి కష్టములు, నష్టములు, ఆపదలు తరచుగ కలుగు చుండును. భీతి, భయము చెందక ధీశక్తిని వినియోగించుచు, ముందుకు నడచుటయే గాని చతికిలపడుట మా మార్గమున లేదు.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 145 / Osho Daily Meditations - 145

 

🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 145 / Osho Daily Meditations - 145 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 145. సరిహద్దులు - జైళ్లు 🍀

🕉 . మీ ఉనికికి హద్దులు లేని విపరీతమైన స్వేచ్ఛ వుంది. అన్ని హద్దులు తప్పు. అందుకే ప్రేమలో మాత్రమే మనం ఆరోగ్యంగా మరియు సంపూర్ణంగా ఉంటాము. ఎందుకంటే ప్రేమ అన్ని సరిహద్దులను తీసి వేస్తుంది; అది మిమ్మల్ని వర్గీకరించదు. మీరు ఎవరైనప్పటికీ అది మిమ్మల్ని అంగీకరిస్తుంది. 🕉

ఎవరూ నిజంగా అనారోగ్యంతో లేరు. నిజానికి, సమాజం అనారోగ్యంతో ఉంది, వ్యక్తులు బాధితులు. సమాజానికి చికిత్స అవసరం; వ్యక్తులకు కేవలం ప్రేమ అవసరం. సమాజం రోగి మరియు ఆసుపత్రి అవసరం. వ్యక్తులు సమాజాన్ని పట్టుకోలేనందున బాధపడుతున్నారు; అది అదృశ్యంగా ఉంటుంది. మీరు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించి నప్పుడు, ఒక వ్యక్తి కనుగొన బడతాడు మరియు బాధ్యత వహిస్తాడు - అతను కేవలం బాధపడుతూ ఉంటాడు. అతను నిస్సహాయుడు. అతనికి అవగాహన అవసరం, చికిత్స కాదు; ప్రేమ, చికిత్స కాదు. సమాజం అతనికి అవగాహన ఇవ్వలేదు, ప్రేమను ఇవ్వలేదు. సమాజం అతనికి బిగుతైన దుస్తులు, బంధనములు ఇచ్చింది. సమాజం అతన్ని బలవంతంగా పావురాల గుట్టలోకి నెట్టింది, అతనిని వర్గీకరించింది, "ఇది నువ్వు, ఇది నీది గుర్తింపు అని."

మీరు స్వయంగా స్వేచ్ఛయే . మీకు సమాజపు గుర్తింపు లేదు. మీరు వర్గీకరింప లేరు మరియు అదియే మీ అందం మరియు కీర్తి - మీరు ఎవరో మీరే చెప్పలేరు. కానీ మీరు ఎల్లప్పుడూ తయారీలో ఉంటారు. నువ్వు ఇదిగో అదిగో అని చెప్పుకునే సమయానికి నువ్వు కదిలి పోయావు. మీరు ప్రతి క్షణం ఎలా ఉండాలో నిర్ణయించు కుంటున్నారు - ఉండాలా వద్దా? ప్రతి క్షణం కొత్త నిర్ణయం, జీవితం యొక్క తాజా విడుదల. పాపి ఒక్క క్షణంలో పుణ్యాత్ముడవుతాడు, సాధువు ఒక్క క్షణంలో పాపి అవుతాడు. అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా మారవచ్చు, ఆరోగ్యవంతులు ఒక్క క్షణంలో అనారోగ్యానికి గురవుతారు. కేవలం నిర్ణయం మార్పు, కేవలం అంతర్దృష్టి, దృష్టిలో మార్పు మరియు ప్రతిదీ మారుతుంది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Osho Daily Meditations - 145 🌹

📚. Prasad Bharadwaj

🍀 145. BOUNDARIES - PRISONS 🍀

🕉 You are a tremendous freedom with no boundaries to your being. All boundaries are false. That's why only in love do we become healthy and whole, because love takes away all boundaries, all labels; it does not categorize you. It accepts you, whoever you are. 🕉

Nobody is really ill. In fact, the society is ill, individuals are victims. Society needs therapy; individuals simply need love. The society is the patient and needs hospitalization. Individuals suffer because you cannot catch hold of society; it remains invisible. When you try to catch hold of it, an individual is found and then becomes responsible-and he is simply suffering, he is avictim. He needs understanding, not therapy; love, not therapy. Society has not given him understanding, has not given him love. Society has given him straitjackets, prisons. Society has forced him into a pigeonhole, categorized him, labeled him "this is you, this is your identity."

You are freedom and you have no identity. You cannot be labeled, and that's your beauty and glory-that you cannot say who you are. You are always in the making. By the time you have asserted that you are this or that, you have moved. You are deciding each moment what to be - to be or not to be. Each moment there is a fresh decision, a fresh release of life. A sinner can become a saint in a single moment, and a saint can be a sinner in a single moment. The unhealthy can become healthy, and the healthy can become unhealthy in a single moment. Just a change of decision, just a change of insight, of vision, and everything changes.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భక్తి సాధనా రహస్యములు -2 🌻


ఒక రూపమును విడిచియుండ లేకుండుట భక్తిగాదు. మనస్సు, బుద్ధియు, తనువును, మమత విడిచి మర్మము ఎరుగక అంతర్యామికిచ్చి మనుగడ సాగించినచో మన బ్రతుకని యుండదు. అది ఆయనదే అగును. సాధకుని కథ, దేవుని కథ అగును. భక్తి సాధనలో‌ ప్రేమయే ప్రధానము. జ్ఞానమన్న స్వామికరుణయే. భగవన్నామమును, గుణములను కీర్తించుచు పుణ్యక్షేత్ర దర్శనము గావించుట‌ సాధనకు ఉపకరించును.

గురువు యొక్క లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించుటయేగాని చర్చించుట సాధనకు అడ్డుగా నిలుచును. శివుడన, విష్ణువన, శక్తియన‌ ఒకే పరతత్త్వము యొక్క వివిధములగు రూపములే అను వేదభావనతో‌ దర్శింపనగును. మనలోని స్వభావమే సర్వాంతర్యామికి సమర్పితమైనపుడు దివ్యమగును..

....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2022

శ్రీ శివ మహా పురాణము - 526 / Sri Siva Maha Purana - 526


🌹 . శ్రీ శివ మహా పురాణము - 526 / Sri Siva Maha Purana - 526 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 45

🌻. శివుని సుందర రూపము - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మేన ఇట్లు పలికి చంద్రశేఖరుని బాగుగా స్తుతించి చేతులు జోడించి నమస్కరించెను. అపుడా హిమవత్పత్ని మిక్కిలి సిగ్గుపడెను (24). ఇంతలో నగరమునందు నివసించు ఎందరో స్త్రీలు శివుని చూడగోరి వివిధ కార్యములను విడిచిపెట్టి బయటకు వచ్చిరి (25). ఒకామె పార్వతీ వరుడగు శంకరుని చూడవలెననే కుతూహలమును పట్ట జాలక స్నానము చేయుచూ ఆ చూర్ణముతో సహ బయటకు వచ్చెను (26). ఒకామె భర్త యొక్క సేవను విడనాడి చెలికత్తెతో గూడి చేతిలో అందమగు చామరము ఉండగనే శంభుని దర్శించవలెననే ప్రీతితో వెళ్లెను (27).

ఒకామె స్తన్యమును శ్రద్ధతో త్రాగు చున్న బాలకుని వాడు తృప్తి చెందకుండగనే విడిచిపెట్టి శివుని దర్శించవలెననే ఉత్కంఠతో వెళ్లెను (28). ఒకామె బంగరు మొలత్రాటిని కట్టు కొన బోయి అది చేతి యందుండగనే వెళ్లెను. ఒకామె చీరను తల్ల క్రిందలుగా ధరించి వెళ్లెను (29).ఒకామె పార్వతీవరుని చూడవలెననే తృష్ణతో,కుతూహలముతో, ప్రీతితో భోజనమునకు కూర్చున్న భర్తను విడిచి వెళ్లెను(30). ఒకామె చేతియందు కాటుకక భరిణను పట్టుకొని ఒక కన్నుకు మాత్రమే కాటుక నిడి ఇంతలో పార్వతీ వరుని చూచుటకై అదే భంగిమలో వెళ్లెను(31).

ఒక సుందరి పాదములను లత్తుకరంగుతో దిద్దు కొనుచూ ఊరేగింపు శబ్దమును విని ఆ పనిని పెట్టి శివుని చూచుటకు వెళ్లెను (32). స్త్రీలు ఇత్యాది వివిధ కార్యములను విడిచి పెట్టి చేతిలోని వస్త్రమును క్రింద బారవైచి వెళ్లిరి. వారపుడు శంకరుని రూపమును చూచి మోహమును పొందిరి (33). అపుడు వారు శివుని చూచి ఆనందించి ప్రేమతో నిండిన హృదయము గలవారై ఆ శివుని రూపమును హృదయమునందిడు కొని ఈ మాటలను పలికిరి (34).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 526 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴

🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 3 🌻


Brahmā said:—

24. After saying thus and eulogising the moon-crested lord, Menā, the beloved of the mountain, bowed to Him with palms joined in reverence and stood shy.

25. By that time the ladies of the town left the work they were engaged in, in their eagerness to see Śiva.

26. A certain lady in the midst of her bath and toilet was overwhelmed with the desire to see Śiva, the bridegroom of Pārvatī. She came out with the shampoo powder still held in her hands.

27. A certain lady engaged in fanning her husband in the company of her maid left that job and came out to see Śiva with the fan still in her hands.

28. Another lady engaged in suckling her babe at her breast left him dissatisfied and came out eagerly to see the lord.

29. Another lady engaged in trying her waist girdle came out with it. Another lady came out with garments worn inside out

30. Another lady left her husband who had sat down to dine and came out athirsting and enthusiastic to see the bridegroom.

31. A certain lady holding the collyrium in her hand after applying it to one of her eyes came out to see the bridegroom of the daughter of the mountain with the salve stick still in her hand.

32. Another damsel engaged in applying the red lac juice to her feet heard the tumult outside and so left it in the middle and came out to see the procession.

33. Thus the ladies forsook their activities, left their houses and came out. On seeing the exquisite form of Śiva they were greatly fascinated.

34. Delighted on seeing Śiva and overwhelmed by affection they cherished the comely form in their hearts and spoke as follows:—


Continues....

🌹🌹🌹🌹🌹


27 Feb 2022

గీతోపనిషత్తు -328


🌹. గీతోపనిషత్తు -328 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-1 📚

🍀 26-1. భక్తి శ్రద్ధలు - భక్తి యున్న చోట హృదయము నిర్మలమై యుండును. మనసు పరిశుద్ధముగ నుండును. ఆరాధన యందనురక్తి యుండును. అట్టి అనురక్తి ఎదుటి జీవునికి ప్రీతి కలిగించును. ఆ జీవుని యందలి దైవమునకు కూడ ప్రీతి కలిగించును. ఇట్లు జీవుల యందలి దైవమునకు ప్రీతి కలిగించు రీతిలో ప్రవర్తించుట వలన దైవము ప్రీతి చెందును. ఈశ్వరుడు కోరినది భక్తి ధనమే గాని ధనము కాదు. ఈశ్వరుని బలముతో కూడ మెప్పింపలేము. భక్తి బలమే నిజమగు బలము. దాని వలన ఈశ్వరుడు ప్రసన్నుడగును. అట్లే ఎట్టి విద్యలతోను కూడ దైవమును మెప్పించలేము. భక్తి విద్య యొక్కటే దైవమును మెప్పింప గలదు. 🍀

26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||

తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.

వివరణము : ఆరాధనకు గాని, అనుసంధానమునకు గాని, యోగ సాధనకు గాని ప్రధానముగ వలసినది భక్తి. భక్తి యున్న చోట హృదయము నిర్మలమై యుండును. మనసు పరిశుద్ధముగ నుండును. ఆరాధన యందనురక్తి యుండును. అట్టి అనురక్తి ఎదుటి జీవునికి ప్రీతి కలిగించును. ఆ జీవుని యందలి దైవమునకు కూడ ప్రీతి కలిగించును. ఇట్లు జీవుల యందలి దైవమునకు ప్రీతి కలిగించు రీతిలో ప్రవర్తించుట వలన దైవము ప్రీతి చెందును. ఎవ్వరికైనను తాగు నీరిచ్చినపుడు, ఒక ఫలము నిచ్చునపుడు, ఒక పుష్పము నిచ్చినపుడు లేక ఒక తులసీ దళమో, మారేడు దళమో ఇచ్చినపుడు ఆ జీవుని యందలి ఈశ్వరుని దర్శించుచు జీవేశ్వరులకు ప్రీతికలుగునట్లుగ అందించవలెను. అట్లందించి నపుడు జీవుడే కాక అందలి ఈశ్వరుడు కూడ ప్రసన్నుడగును.

భక్తితో సమర్పించుట అనగా ఎదుటి జీవుల యందలి ఈశ్వరుని కూడ దర్శనము చేయుచు, వినయముతో, శ్రద్ధతో రెండు హస్తములతో అందించవలెను. అట్టి శ్రద్ధ, వినయము, భక్తి లోపించినపుడు ఎంత విలువైన వస్తువు లందించినప్పటికి ఈశ్వరుడు ప్రీతి చెందడు. నిజమునకు ఈశ్వరునకు వలసిన దేమియు లేదు. ఎంత ధనముతో నైనను ఈశ్వరుని మెప్పించ లేము. ఈశ్వరుడు కోరినది భక్తి ధనమే గాని ధనము కాదు. ఈశ్వరుని బలముతో కూడ మెప్పింపలేము. భక్తి బలమే నిజమగు బలము. దాని వలన ఈశ్వరుడు ప్రసన్నుడగును. అట్లే ఎట్టి విద్యలతోను కూడ దైవమును మెప్పించలేము. భక్తి విద్య యొక్కటే దైవమును మెప్పింపగలదు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Feb 2022

27 - FEBRUARY - 2022 ఆదివారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 27, ఆదివారం, ఫిబ్రవరి 2022 భాను వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 26-1 - 328 - పరమ పదము🌹
3) 🌹. శివ మహా పురాణము - 526 / Siva Maha Purana - 526 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -156🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 144 / Osho Daily Meditations - 144 🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 80🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శుభ ఆదివారం మిత్రులందరికీ 🌹*
*భాను వాసరే, 27, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ద్వాదశ ఆదిత్య ధ్యాన శ్లోకాలు - 8 🍀*

*🌟 8. విష్ణుః –*
*విష్ణురశ్వతరో రంభా సూర్యవర్చాశ్చ సత్యజిత్ |*
*విశ్వామిత్రో మఖాపేత ఊర్జమాసం నయంత్యమీ*
*భానుమండలమధ్యస్థం వేదత్రయనిషేవితమ్ |*
*గాయత్రీప్రతిపాద్యం తం విష్ణుం భక్త్యా నమామ్యహమ్* 

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : మీరు ఎప్పుడూ ఆత్మ స్మృతిలోనే ఉండాలి. సాధనలో ఇదే మీరు ఎప్పుడూ గుర్తుంచు కోవలసిన ముఖ్య విషయం. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : గౌణ, వైశానవ, విజయ ఏకాదశి, Gauna, Vaishnava, Vijaya Ekadashi*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శిశిర ఋతువు,
మాఘ మాసం 
తిథి: కృష్ణ ఏకాదశి 08:13:59 వరకు
తదుపరి కృష్ణ ద్వాదశి
నక్షత్రం: పూర్వాషాఢ 08:49:29 వరకు
తదుపరి ఉత్తరాషాఢ
యోగం: వ్యతీపాత 17:38:54 వరకు
తదుపరి వరియాన
కరణం: బాలవ 08:13:04 వరకు
సూర్యోదయం: 06:35:51
సూర్యాస్తమయం: 18:21:54
వైదిక సూర్యోదయం: 06:39:26
వైదిక సూర్యాస్తమయం: 18:18:19
చంద్రోదయం: 03:44:36
చంద్రాస్తమయం: 15:01:35
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: ధనుస్సు
వర్జ్యం: 16:13:20 - 17:42:12
దుర్ముహూర్తం: 16:47:45 - 17:34:49
రాహు కాలం: 16:53:38 - 18:21:54
గుళిక కాలం: 15:25:23 - 16:53:38
యమ గండం: 12:28:52 - 13:57:07
అభిజిత్ ముహూర్తం: 12:05 - 12:51
అమృత కాలం: 04:21:48 - 05:50:52
మరియు 25:06:32 - 26:35:24
శుభ యోగం - కార్య జయం 08:49:29
వరకు తదుపరి అమృత యోగం - 
కార్య సిధ్ది

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. గీతోపనిషత్తు -328 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 26-1 📚*
 
*🍀 26-1. భక్తి శ్రద్ధలు - భక్తి యున్న చోట హృదయము నిర్మలమై యుండును. మనసు పరిశుద్ధముగ నుండును. ఆరాధన యందనురక్తి యుండును. అట్టి అనురక్తి ఎదుటి జీవునికి ప్రీతి కలిగించును. ఆ జీవుని యందలి దైవమునకు కూడ ప్రీతి కలిగించును. ఇట్లు జీవుల యందలి దైవమునకు ప్రీతి కలిగించు రీతిలో ప్రవర్తించుట వలన దైవము ప్రీతి చెందును. ఈశ్వరుడు కోరినది భక్తి ధనమే గాని ధనము కాదు. ఈశ్వరుని బలముతో కూడ మెప్పింపలేము. భక్తి బలమే నిజమగు బలము. దాని వలన ఈశ్వరుడు ప్రసన్నుడగును. అట్లే ఎట్టి విద్యలతోను కూడ దైవమును మెప్పించలేము. భక్తి విద్య యొక్కటే దైవమును మెప్పింప గలదు. 🍀*

*26. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |*
*తదహం భక్త్యుపహృత మశ్నామి ప్రయతాత్మనః ||*

*తాత్పర్యము : భక్తిపూర్వకముగ నాకు ఒక పత్రమును గాని, పుష్పమును గాని, ఫలమును గాని, నీటిని గాని ఎవరందించినను నేను స్వీకరించి అనుగ్రహింతును.*

*వివరణము : ఆరాధనకు గాని, అనుసంధానమునకు గాని, యోగ సాధనకు గాని ప్రధానముగ వలసినది భక్తి. భక్తి యున్న చోట హృదయము నిర్మలమై యుండును. మనసు పరిశుద్ధముగ నుండును. ఆరాధన యందనురక్తి యుండును. అట్టి అనురక్తి ఎదుటి జీవునికి ప్రీతి కలిగించును. ఆ జీవుని యందలి దైవమునకు కూడ ప్రీతి కలిగించును. ఇట్లు జీవుల యందలి దైవమునకు ప్రీతి కలిగించు రీతిలో ప్రవర్తించుట వలన దైవము ప్రీతి చెందును. ఎవ్వరికైనను తాగు నీరిచ్చినపుడు, ఒక ఫలము నిచ్చునపుడు, ఒక పుష్పము నిచ్చినపుడు లేక ఒక తులసీ దళమో, మారేడు దళమో ఇచ్చినపుడు ఆ జీవుని యందలి ఈశ్వరుని దర్శించుచు జీవేశ్వరులకు ప్రీతికలుగునట్లుగ అందించవలెను. అట్లందించి నపుడు జీవుడే కాక అందలి ఈశ్వరుడు కూడ ప్రసన్నుడగును.*

*భక్తితో సమర్పించుట అనగా ఎదుటి జీవుల యందలి ఈశ్వరుని కూడ దర్శనము చేయుచు, వినయముతో, శ్రద్ధతో రెండు హస్తములతో అందించవలెను. అట్టి శ్రద్ధ, వినయము, భక్తి లోపించినపుడు ఎంత విలువైన వస్తువు లందించినప్పటికి ఈశ్వరుడు ప్రీతి చెందడు. నిజమునకు ఈశ్వరునకు వలసిన దేమియు లేదు. ఎంత ధనముతో నైనను ఈశ్వరుని మెప్పించ లేము. ఈశ్వరుడు కోరినది భక్తి ధనమే గాని ధనము కాదు. ఈశ్వరుని బలముతో కూడ మెప్పింపలేము. భక్తి బలమే నిజమగు బలము. దాని వలన ఈశ్వరుడు ప్రసన్నుడగును. అట్లే ఎట్టి విద్యలతోను కూడ దైవమును మెప్పించలేము. భక్తి విద్య యొక్కటే దైవమును మెప్పింపగలదు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 526 / Sri Siva Maha Purana - 526 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 45

*🌻. శివుని సుందర రూపము - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మేన ఇట్లు పలికి చంద్రశేఖరుని బాగుగా స్తుతించి చేతులు జోడించి నమస్కరించెను. అపుడా హిమవత్పత్ని మిక్కిలి సిగ్గుపడెను (24). ఇంతలో నగరమునందు నివసించు ఎందరో స్త్రీలు శివుని చూడగోరి వివిధ కార్యములను విడిచిపెట్టి బయటకు వచ్చిరి (25). ఒకామె పార్వతీ వరుడగు శంకరుని చూడవలెననే కుతూహలమును పట్ట జాలక స్నానము చేయుచూ ఆ చూర్ణముతో సహ బయటకు వచ్చెను (26). ఒకామె భర్త యొక్క సేవను విడనాడి చెలికత్తెతో గూడి చేతిలో అందమగు చామరము ఉండగనే శంభుని దర్శించవలెననే ప్రీతితో వెళ్లెను (27).

ఒకామె స్తన్యమును శ్రద్ధతో త్రాగు చున్న బాలకుని వాడు తృప్తి చెందకుండగనే విడిచిపెట్టి శివుని దర్శించవలెననే ఉత్కంఠతో వెళ్లెను (28). ఒకామె బంగరు మొలత్రాటిని కట్టు కొన బోయి అది చేతి యందుండగనే వెళ్లెను. ఒకామె చీరను తల్ల క్రిందలుగా ధరించి వెళ్లెను (29).ఒకామె పార్వతీవరుని చూడవలెననే తృష్ణతో,కుతూహలముతో, ప్రీతితో భోజనమునకు కూర్చున్న భర్తను విడిచి వెళ్లెను(30). ఒకామె చేతియందు కాటుకక భరిణను పట్టుకొని ఒక కన్నుకు మాత్రమే కాటుక నిడి ఇంతలో పార్వతీ వరుని చూచుటకై అదే భంగిమలో వెళ్లెను(31).

ఒక సుందరి పాదములను లత్తుకరంగుతో దిద్దు కొనుచూ ఊరేగింపు శబ్దమును విని ఆ పనిని పెట్టి శివుని చూచుటకు వెళ్లెను (32). స్త్రీలు ఇత్యాది వివిధ కార్యములను విడిచి పెట్టి చేతిలోని వస్త్రమును క్రింద బారవైచి వెళ్లిరి. వారపుడు శంకరుని రూపమును చూచి మోహమును పొందిరి (33). అపుడు వారు శివుని చూచి ఆనందించి ప్రేమతో నిండిన హృదయము గలవారై ఆ శివుని రూపమును హృదయమునందిడు కొని ఈ మాటలను పలికిరి (34).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 526 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴*

*🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 3 🌻*

Brahmā said:—

24. After saying thus and eulogising the moon-crested lord, Menā, the beloved of the mountain, bowed to Him with palms joined in reverence and stood shy.

25. By that time the ladies of the town left the work they were engaged in, in their eagerness to see Śiva.

26. A certain lady in the midst of her bath and toilet was overwhelmed with the desire to see Śiva, the bridegroom of Pārvatī. She came out with the shampoo powder still held in her hands.

27. A certain lady engaged in fanning her husband in the company of her maid left that job and came out to see Śiva with the fan still in her hands.

28. Another lady engaged in suckling her babe at her breast left him dissatisfied and came out eagerly to see the lord.

29. Another lady engaged in trying her waist girdle came out with it. Another lady came out with garments worn inside out

30. Another lady left her husband who had sat down to dine and came out athirsting and enthusiastic to see the bridegroom.

31. A certain lady holding the collyrium in her hand after applying it to one of her eyes came out to see the bridegroom of the daughter of the mountain with the salve stick still in her hand.

32. Another damsel engaged in applying the red lac juice to her feet heard the tumult outside and so left it in the middle and came out to see the procession.

33. Thus the ladies forsook their activities, left their houses and came out. On seeing the exquisite form of Śiva they were greatly fascinated.

34. Delighted on seeing Śiva and overwhelmed by affection they cherished the comely form in their hearts and spoke as follows:—

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

 *🌻. భక్తి సాధనా రహస్యములు -2 🌻*

*ఒక రూపమును విడిచియుండ లేకుండుట భక్తిగాదు. మనస్సు, బుద్ధియు, తనువును, మమత విడిచి మర్మము ఎరుగక అంతర్యామికిచ్చి మనుగడ సాగించినచో మన బ్రతుకని యుండదు. అది ఆయనదే అగును. సాధకుని కథ, దేవుని కథ అగును. భక్తి సాధనలో‌ ప్రేమయే ప్రధానము. జ్ఞానమన్న స్వామికరుణయే. భగవన్నామమును, గుణములను కీర్తించుచు పుణ్యక్షేత్ర దర్శనము గావించుట‌ సాధనకు ఉపకరించును.*

*గురువు యొక్క లేక ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించుటయేగాని చర్చించుట సాధనకు అడ్డుగా నిలుచును. శివుడన, విష్ణువన, శక్తియన‌ ఒకే పరతత్త్వము యొక్క వివిధములగు రూపములే అను వేదభావనతో‌ దర్శింపనగును. *మనలోని స్వభావమే సర్వాంతర్యామికి సమర్పితమైనపుడు దివ్యమగును..*

....✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 145 / Osho Daily Meditations - 145 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 145. సరిహద్దులు - జైళ్లు 🍀*

*🕉 . మీ ఉనికికి హద్దులు లేని విపరీతమైన స్వేచ్ఛ వుంది. అన్ని హద్దులు తప్పు. అందుకే ప్రేమలో మాత్రమే మనం ఆరోగ్యంగా మరియు సంపూర్ణంగా ఉంటాము. ఎందుకంటే ప్రేమ అన్ని సరిహద్దులను తీసి వేస్తుంది; అది మిమ్మల్ని వర్గీకరించదు. మీరు ఎవరైనప్పటికీ అది మిమ్మల్ని అంగీకరిస్తుంది. 🕉*
 
*ఎవరూ నిజంగా అనారోగ్యంతో లేరు. నిజానికి, సమాజం అనారోగ్యంతో ఉంది, వ్యక్తులు బాధితులు. సమాజానికి చికిత్స అవసరం; వ్యక్తులకు కేవలం ప్రేమ అవసరం. సమాజం రోగి మరియు ఆసుపత్రి అవసరం. వ్యక్తులు సమాజాన్ని పట్టుకోలేనందున బాధపడుతున్నారు; అది అదృశ్యంగా ఉంటుంది. మీరు దానిని పట్టుకోవడానికి ప్రయత్నించి నప్పుడు, ఒక వ్యక్తి కనుగొన బడతాడు మరియు బాధ్యత వహిస్తాడు - అతను కేవలం బాధపడుతూ ఉంటాడు. అతను నిస్సహాయుడు. అతనికి అవగాహన అవసరం, చికిత్స కాదు; ప్రేమ, చికిత్స కాదు. సమాజం అతనికి అవగాహన ఇవ్వలేదు, ప్రేమను ఇవ్వలేదు. సమాజం అతనికి బిగుతైన దుస్తులు, బంధనములు ఇచ్చింది. సమాజం అతన్ని బలవంతంగా పావురాల గుట్టలోకి నెట్టింది, అతనిని వర్గీకరించింది, "ఇది నువ్వు, ఇది నీది గుర్తింపు అని."*

*మీరు స్వయంగా స్వేచ్ఛయే . మీకు సమాజపు గుర్తింపు లేదు. మీరు వర్గీకరింప లేరు మరియు అదియే మీ అందం మరియు కీర్తి - మీరు ఎవరో మీరే చెప్పలేరు. కానీ మీరు ఎల్లప్పుడూ తయారీలో ఉంటారు. నువ్వు ఇదిగో అదిగో అని చెప్పుకునే సమయానికి నువ్వు కదిలి పోయావు. మీరు ప్రతి క్షణం ఎలా ఉండాలో నిర్ణయించు కుంటున్నారు - ఉండాలా వద్దా? ప్రతి క్షణం కొత్త నిర్ణయం, జీవితం యొక్క తాజా విడుదల. పాపి ఒక్క క్షణంలో పుణ్యాత్ముడవుతాడు, సాధువు ఒక్క క్షణంలో పాపి అవుతాడు. అనారోగ్యంగా ఉన్నవారు ఆరోగ్యంగా మారవచ్చు, ఆరోగ్యవంతులు ఒక్క క్షణంలో అనారోగ్యానికి గురవుతారు. కేవలం నిర్ణయం మార్పు, కేవలం అంతర్దృష్టి, దృష్టిలో మార్పు మరియు ప్రతిదీ మారుతుంది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 145 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 145. BOUNDARIES - PRISONS 🍀*

*🕉 You are a tremendous freedom with no boundaries to your being. All boundaries are false. That's why only in love do we become healthy and whole, because love takes away all boundaries, all labels; it does not categorize you. It accepts you, whoever you are. 🕉*
 
*Nobody is really ill. In fact, the society is ill, individuals are victims. Society needs therapy; individuals simply need love. The society is the patient and needs hospitalization. Individuals suffer because you cannot catch hold of society; it remains invisible. When you try to catch hold of it, an individual is found and then becomes responsible-and he is simply suffering, he is avictim. He needs understanding, not therapy; love, not therapy. Society has not given him understanding, has not given him love. Society has given him straitjackets, prisons. Society has forced him into a pigeonhole, categorized him, labeled him "this is you, this is your
identity."*

*You are freedom and you have no identity. You cannot be labeled, and that's your beauty and glory-that you cannot say who you are. You are always in the making. By the time you have asserted that you are this or that, you have moved. You are deciding each moment what to be - to be or not to be. Each moment there is a fresh decision, a fresh release of life. A sinner can become a saint in a single moment, and a saint can be a sinner in a single moment. The unhealthy can become healthy, and the healthy can become unhealthy in a single moment. Just a change of decision, just a change of insight, of vision, and everything changes.*
 
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 80 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 66. విఘ్నములు - వినియోగము 🌻*

*విఘ్నములు కలిగినపుడు మానవుని యొక్క లో శక్తి, మేధస్సు ఎక్కువగ పనిచేయును. కష్టములు కలిగినపుడు మేధస్సునకు, శక్తికి మరింత పని తగులును. ఆపదలు వచ్చినప్పుడు మానవుడు తన సమస్త శక్తిని, మేధస్సును వినియోగించును. సంపూర్ణముగ తన యందలి శక్తి సామర్ధ్యములను వినియోగించుటకు అవకాశమప్పుడే ఏర్పడును. అప్రమత్తతకూడ అప్పుడే ఏర్పడును. సాధారణ సమయమున అట్టి శక్తి, మేధస్సు నిద్రాణముగను, నిరుపయోగముగను
యుండును.*

*మీ యందలి శక్తి సామర్ధ్యములను, మేధస్సును మీ ఉన్నతికి ఉపయోగించుటకు, మీ పరిణితికి తోడ్పాటు చేయుటకు ప్రకృతి విఘ్నములు, కష్టములు, ఆపదలు కలిగించుచుండును. సౌఖ్యము
లనుభవించుచున్నప్పుడు అప్రమత్తత యుండదు. మీరప్రమత్తు లగుటయే మా ఆశయము. అప్రమత్తులే లోకహిత కార్యములకు సహకరించగలరు. అందువలననే లోకహిత మార్గమున నడచువారికి కష్టములు, నష్టములు, ఆపదలు తరచుగ కలుగు చుండును. భీతి, భయము చెందక ధీశక్తిని వినియోగించుచు, ముందుకు నడచుటయే గాని చతికిలపడుట మా మార్గమున లేదు.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹