మైత్రేయ మహర్షి బోధనలు - 80
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 80 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 66. విఘ్నములు - వినియోగము 🌻
విఘ్నములు కలిగినపుడు మానవుని యొక్క లో శక్తి, మేధస్సు ఎక్కువగ పనిచేయును. కష్టములు కలిగినపుడు మేధస్సునకు, శక్తికి మరింత పని తగులును. ఆపదలు వచ్చినప్పుడు మానవుడు తన సమస్త శక్తిని, మేధస్సును వినియోగించును. సంపూర్ణముగ తన యందలి శక్తి సామర్ధ్యములను వినియోగించుటకు అవకాశమప్పుడే ఏర్పడును. అప్రమత్తతకూడ అప్పుడే ఏర్పడును. సాధారణ సమయమున అట్టి శక్తి, మేధస్సు నిద్రాణముగను, నిరుపయోగముగను యుండును.
మీ యందలి శక్తి సామర్ధ్యములను, మేధస్సును మీ ఉన్నతికి ఉపయోగించుటకు, మీ పరిణితికి తోడ్పాటు చేయుటకు ప్రకృతి విఘ్నములు, కష్టములు, ఆపదలు కలిగించుచుండును. సౌఖ్యము
లనుభవించుచున్నప్పుడు అప్రమత్తత యుండదు. మీరప్రమత్తు లగుటయే మా ఆశయము. అప్రమత్తులే లోకహిత కార్యములకు సహకరించగలరు. అందువలననే లోకహిత మార్గమున నడచువారికి కష్టములు, నష్టములు, ఆపదలు తరచుగ కలుగు చుండును. భీతి, భయము చెందక ధీశక్తిని వినియోగించుచు, ముందుకు నడచుటయే గాని చతికిలపడుట మా మార్గమున లేదు.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
27 Feb 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment