శ్రీ శివ మహా పురాణము - 526 / Sri Siva Maha Purana - 526


🌹 . శ్రీ శివ మహా పురాణము - 526 / Sri Siva Maha Purana - 526 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 45

🌻. శివుని సుందర రూపము - 3 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ మేన ఇట్లు పలికి చంద్రశేఖరుని బాగుగా స్తుతించి చేతులు జోడించి నమస్కరించెను. అపుడా హిమవత్పత్ని మిక్కిలి సిగ్గుపడెను (24). ఇంతలో నగరమునందు నివసించు ఎందరో స్త్రీలు శివుని చూడగోరి వివిధ కార్యములను విడిచిపెట్టి బయటకు వచ్చిరి (25). ఒకామె పార్వతీ వరుడగు శంకరుని చూడవలెననే కుతూహలమును పట్ట జాలక స్నానము చేయుచూ ఆ చూర్ణముతో సహ బయటకు వచ్చెను (26). ఒకామె భర్త యొక్క సేవను విడనాడి చెలికత్తెతో గూడి చేతిలో అందమగు చామరము ఉండగనే శంభుని దర్శించవలెననే ప్రీతితో వెళ్లెను (27).

ఒకామె స్తన్యమును శ్రద్ధతో త్రాగు చున్న బాలకుని వాడు తృప్తి చెందకుండగనే విడిచిపెట్టి శివుని దర్శించవలెననే ఉత్కంఠతో వెళ్లెను (28). ఒకామె బంగరు మొలత్రాటిని కట్టు కొన బోయి అది చేతి యందుండగనే వెళ్లెను. ఒకామె చీరను తల్ల క్రిందలుగా ధరించి వెళ్లెను (29).ఒకామె పార్వతీవరుని చూడవలెననే తృష్ణతో,కుతూహలముతో, ప్రీతితో భోజనమునకు కూర్చున్న భర్తను విడిచి వెళ్లెను(30). ఒకామె చేతియందు కాటుకక భరిణను పట్టుకొని ఒక కన్నుకు మాత్రమే కాటుక నిడి ఇంతలో పార్వతీ వరుని చూచుటకై అదే భంగిమలో వెళ్లెను(31).

ఒక సుందరి పాదములను లత్తుకరంగుతో దిద్దు కొనుచూ ఊరేగింపు శబ్దమును విని ఆ పనిని పెట్టి శివుని చూచుటకు వెళ్లెను (32). స్త్రీలు ఇత్యాది వివిధ కార్యములను విడిచి పెట్టి చేతిలోని వస్త్రమును క్రింద బారవైచి వెళ్లిరి. వారపుడు శంకరుని రూపమును చూచి మోహమును పొందిరి (33). అపుడు వారు శివుని చూచి ఆనందించి ప్రేమతో నిండిన హృదయము గలవారై ఆ శివుని రూపమును హృదయమునందిడు కొని ఈ మాటలను పలికిరి (34).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 526 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 45 🌴

🌻 Śiva’s comely form and the Jubilation of the Citizens - 3 🌻


Brahmā said:—

24. After saying thus and eulogising the moon-crested lord, Menā, the beloved of the mountain, bowed to Him with palms joined in reverence and stood shy.

25. By that time the ladies of the town left the work they were engaged in, in their eagerness to see Śiva.

26. A certain lady in the midst of her bath and toilet was overwhelmed with the desire to see Śiva, the bridegroom of Pārvatī. She came out with the shampoo powder still held in her hands.

27. A certain lady engaged in fanning her husband in the company of her maid left that job and came out to see Śiva with the fan still in her hands.

28. Another lady engaged in suckling her babe at her breast left him dissatisfied and came out eagerly to see the lord.

29. Another lady engaged in trying her waist girdle came out with it. Another lady came out with garments worn inside out

30. Another lady left her husband who had sat down to dine and came out athirsting and enthusiastic to see the bridegroom.

31. A certain lady holding the collyrium in her hand after applying it to one of her eyes came out to see the bridegroom of the daughter of the mountain with the salve stick still in her hand.

32. Another damsel engaged in applying the red lac juice to her feet heard the tumult outside and so left it in the middle and came out to see the procession.

33. Thus the ladies forsook their activities, left their houses and came out. On seeing the exquisite form of Śiva they were greatly fascinated.

34. Delighted on seeing Śiva and overwhelmed by affection they cherished the comely form in their hearts and spoke as follows:—


Continues....

🌹🌹🌹🌹🌹


27 Feb 2022

No comments:

Post a Comment