Showing posts with label నారద భక్తి సూత్రాలు. Show all posts
Showing posts with label నారద భక్తి సూత్రాలు. Show all posts

నారద భక్తి సూత్రాలు - 115


🌹.   నారద భక్తి సూత్రాలు - 115   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 84

🌷. చివరి భాగము 🌷

🌻 84. య ఇదం నారద ప్రోక్తం శివానుశాసనం విశ్వసితి శ్రద్ధతే , స భక్తిమాన్ భవతి, సః ప్రేతం లభతే, సః ప్రేష్ఠం లభే || 🌻

ఈ గ్రంథం శివ శాసన ఫలంగా నారదునిచే చెప్పబడినది. నారదుల వారు వారంతట వారు సంకల్పించింది కాదు.

శివుని ఆజ్ఞానుసారం, శివుని ప్రేరణగా చెప్పబడింది. ఎవరైతే నారద విరచిత భక్తి శాస్త్ర గ్రంథాన్ని విశ్వసించి శ్రద్ధ గలవారై ఉంటారో, వారు భక్తిమంతులవుతారు. చిట్ట చివరగా జీవిత పరమావధి అయిన ముక్తి అనే ప్రయోజనం వారికి కలుగుతుంది.

ఇదే కోరదగింది. ఇదే శ్రేయస్సు, మంగళకరమైనది. ముమ్మాటికి అందరూ పరమార్థమైన కళ్యాణాన్ని పొందెదరు గాక !

🌻. నారద మహర్షి ఆశీర్వాదం 🌻

నారద మహర్షి ఈ సూత్ర గ్రంథాన్ని రచించి, దీనిని భక్తి శ్రద్ధలతో అనుష్టానం చేసే వారికి భగవదనుగ్రహం కలుగు గాక అని ఇలా ఆశీర్వదిస్తున్నారు.

శ్లో|| నమస్తుభ్యం భగవతే నిర్గుణాయ గుణాత్మనే

కేవలా యాద్వితీయాయ గురవే బ్రహ్మరూపిణే

యో 2 హం మమాస్తియత్కించి దిహలోకే పరత్ర చ

తత్సర్వం భవతోనాథ చరణేషు సమర్పితమ్ ||

శ్లో|| పదే పదే యథాభక్తిః పాదయోస్తవ

జాయతే

తథా కురుష్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభో ||

పతి పుత్ర సుహ్మద్ భ్రాతృ పితృవన్మాతృవద్దరిమ్ ||

యే ధ్యాయంతి సదోద్యుక్తా స్తేభ్యో 2 పీహ నమోనమః ||

ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః

🙏 🙏 🙏 🙏 🙏

సమాప్తం..
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


05 Oct 2020

నారద భక్తి సూత్రాలు - 114




🌹.  నారద భక్తి సూత్రాలు - 114  🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 83

🌻 83. ఇత్యేవం వదంతి జనజల్ప నిర్భయాః ఏకమతాః కుమార - వ్యాస - శుక - శాండిల్య - గ - విష్ణు - కౌండిన్య - శేషోద్ధవారుణి - బలి - హనుమద్ విభీషణాదాయో భక్త్యాచార్యాః || 🌻

ఈ క్రింది వారు భక్తి శాస్త్రానికి ఆచార్యులుగా గుర్తించబడినవారు. సనత్కుమారుడు, వ్యాసుడు, శుకుడు, శాండిల్యుడు, గర్గుడు, విష్ణువు, కౌండిన్యుడు, శేషుడు, ఉద్దవుడు, ఆరుణి, బలి చక్రవర్తి, హనుమంతుడు, విభీషణుడు మొదలైనవారు. వీరంతా భక్తే ముక్తి మార్గమని ఘంటా పథంగా చాటి చెప్పినవారు. గొప్ప భక్తులు చాలామందే ఉన్నారు. కాని వారిలో భక్తిశాస్త్రాన్ని చాటి చెప్పినవారు కొందరే. అందులోనూ మనకు లభించే శాస్త్రాలు ఇంకా తక్కువే. నారదులవారు తన గురించి తాను చెప్పుకోలేదు గాని, నారద మహర్షి కూడా అట్టి ఆచార్యులలో ఒకరు.

ఈ శాస్త్రం ప్రయోజనమేమంటే గౌణభక్తినీ, బాహ్యభక్తినీ మాత్రమే నిజమైన భక్తిగా భావించేవారు చాలామంది ఉన్నారు. వారందరికి ఈ విషయం చక్కగా తెలియాలి. సాధన మార్గం కూడా తెలియాలి. అది ముక్తి లక్ష్యంగా తెలిసి, చేయాలి. కొందరు జ్ఞాన మార్గంలో ఉన్నవారు భక్తిని తేలికగా చులకనగా తీసుకుంటున్నారు.

ఈ శాస్త్రం వారికి కూడా కనువిప్పు కలిగించి, వారి సాధనలో సహకరిస్తుంది. అపరభక్తితో గమ్యం చేరలేరు. అది పరాభక్తిగా సిద్ధమవ్వాలి. మీదు మిక్కిలి సాధనగా తీసుకునే వారికి భక్తి మార్గం సులభం. భగవంతుని ఆలంబనగా చేసుకోవడం ద్వారా సాధకుడు అజ్ఞానం నుండి విడుదలవడం తేలిక. తత్త్వ విచారణ అనేది తెలివైన వారికి మాత్రమే కుదురుతుంది.

భక్తికి తెలివి కంటే శరణాగతి ముఖ్యం. శ్రద్ధ, విశ్వాసం ఉంటే ఎవరైనాన శరణాగతి చేసి భగవదర్పితం కావచ్చును. లోకంలో ఇతర మార్గాల నవలంబించే వారికంటే భక్తులే ఎక్కువగా ఉన్నారు. కనుక భక్తి శాస్త్రానికి ప్రచారం అవశ్యం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 
https://t.me/ChaitanyaVijnanam


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


04 Oct 2020

నారద భక్తి సూత్రాలు - 113

🌹.   నారద భక్తి సూత్రాలు - 113   🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 82

🌻 82. పరమ విరహాసక్తి, రూపా ఏకధా అపి ఏకాదశధా భవతి || 🌻

.

పరమార్థ దృష్టికి భక్తి అనేది ఏకరూపమే. కాని వ్యవహార దశలో అది 11 రూపాలుగా కనబడుతుంది.

1) భగవత్కళ్యాణ గుణాభివర్ణన

2) భగద్దివ్య మంగళ విగ్రహానురాగం

3) భగవత్పూజనం

4) భగవత్స్మరణం

5) భగవత్సేవ

6) భగవంతుని పట్ల సఖ్యభావ ప్రేమ

7) భగవంతుని పుత్రుడుగా భావించి ప్రేమించడం

8) భగవంతుని భర్తగా ప్రేమించడం

9) భగవంతునికి సర్వ సమర్పణ చేయడం

10) భగవన్మయుడై ఉండడం

11) భగవంతుని ఎడబాసి ఉండలేకపోవడం


ఈ విధాలైన భక్తి వారి వారి పూర్వ జన్మల సంస్కారాల ననుసరించి కలుగు తుంటాయి. ఇవి ఏకాదశ రూపాలే కాదు. ఇంకా అనేక రూపాలుగా కూడా ఉండవచ్చును.

నారదుడు, వ్యాసులవారు మొదలైనవారు భగవంతుని కళ్యాణ గుణాభి వర్ణన చేసేవారు.

బృందావన స్త్రీలు భగవానుని దివ్య మంగళ విగ్రహంపై అనురాగం కలిగినవారు. అంబరీషుడు భగవత్పూజలో ఆసక్తి కలవాడు. ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణను విడువనివాడు. హనుమంతుడు శ్రీరాముని సేవకే అంకితమయ్యాడు. ఉద్ధవార్జునులు సఖ్య భక్తిగలవారు.

దేవకీ, కౌసల్యలు పుత్ర వాత్సల్యంతో కూడిన ప్రేమ గలవారు. రుక్మిణీ సత్యభామలు భగవంతుని భర్త రూపంలో ప్రేమించేవారు. బలి చక్రవర్తి, విభీషణుడు భగవంతునికి సర్వ సమర్పణ అయినవారు. సనత్కుమార యాజ్ఞవల్క్యులు భగవన్మయులుగా ఉన్నారు.

గోపికలు భగవంతుడిని విడచి ఉండలేని ప్రేమికులు. వీరి ప్రేమ సాధారణం కాదు. మానవ ప్రేమ వంటిది కూడా కాదు. వీరంతా ఆయా అవతారాలను భగవత్స్వరూపంగా గుర్తెరిగి ప్రేమించినవారే. అందువల్లనే వారు ఉదాహరణీయులు.

వీరు ఒక్కోసారి భ్రాంతిలోపడి, నా పుత్రుడు, నా స్నేహితుడు, నా భర్త అని అనుకున్నప్పటికీ వారిలో సహజంగా ఉన్న నానా విధ ప్రేమ వ్యక్తీకరణాలలో భక్తి భావం ఏకరూపం గానే నిరంతరం ఉన్నది. వీరు భ్రాంతి లేని సమయంలో తన్మయత్వం చెంది ఉంటారు.

విరహాసక్తి గల భక్తికి రాధాకృష్ణులు అత్యుత్తమం. రాధాకృష్ణులు ఇద్దరు కాదు. శ్రీకృష్ణుడే తన ప్రేమ క్రీడ కొరకు తన శరీరాన్ని రెండుగా విభజించుకున్నాడు.

ఒకటి తానైతే, రెండవది తన ఛాయ. ఆ రెండవదే రాధ. శ్రీ కృష్ణుడు రాధను ప్రేమించడమంటే, లేక రాధ శ్రీకృష్ణుని ప్రేమించడమంటే వారిని వారే ప్రేమించు కున్నట్లు. శ్రీ చైతన్య ప్రభువులు ఇలా వర్ణించి చెప్పారు. దీని అర్థమే క్రింది శ్లోకం.

శ్లో|| యేయం రాధాయశ్చ కృష్ణో రసాభిః

ద్వేదృశ్చైకః క్రీడానార్ధం ద్వివిధాభూత్

దేహో యథా ఛాయా శోభమానః ||

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


03 Oct 2020

నారద భక్తి సూత్రాలు - 112



🌹.   నారద భక్తి సూత్రాలు - 112   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 2

🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 2 🌻

ఈ ఐదు విభవాలు భక్తులకు ఆరాధ్యాలు. ఇవి గాక, అంతర్యా మిత్వం కూడా ఆయన యొక్క విభవమే. అంతర్యామి అంటే అగ్నియందు ఉష్ణత్వంగా, జలమందు ద్రవత్వంగా, జడములందు జడశక్తిగా, ప్రాణులందు ప్రాణ శక్తిగా, జీవులందు జీవచైతన్యంగా, మానవులందు “నేను” గా వ్యక్తమయ్యే మూలశక్తి. ఆ మూలశక్తే పరమాత్మ చైతన్యం, ప్రజ్ఞానం. అదే సత్యం. అది నిరాకారం. దీనినే భగవంతునిగా ఆరాధిస్తాం. విగ్రహాల్లో కూడా అంతర్యామిత్వం ఉంటుంది.

అంతర్యామి అంటే లక్ష్మీ సమేతుడై, దివ్య మంగళ స్వరూపుడై భక్తుల హృదయంలో, సర్వత్రా కొలువై ఉన్నవాడు. తెలుసుకోలేని వారిలో, తెలుసుకోగలిగిన వారిలో కూడా ఉన్నాడు. భక్తి సాధనచేత తెలుసుకొని భగవదైక్యం పొందడానికి భక్తులకే సులభం.

అవాజ్మానస గోచరమైన భగవానుడు జ్ఞాన, ధ్యాన యోగాలలో కంటే భక్తి యోగంలో భక్త సులభుడు. అయితే జ్ఞానుల అవగాహనకోసం కూడా భగవంతుడు వ్యూహాలుగా వ్యాపకమై ఉన్నాడు. అవి అయిదు వ్యూహాలు. మొదటిది పరతత్త్వం.

మిగిలిన నాలుగు (1) వాసుదేవ వ్యూహం (2) ప్రద్యుమ్న వ్యూహం (3) సంకర్షణ వ్యూహం (4) అనిరుద్ధ వ్యూహం.

1. పరతత్త్వం :

కోటి భాస్కర తేజుడై శ్రీ నీళా భూసమేతుడై, హేమ పీతాంబరుడై, శంఖు చక్ర గదా పద్మ ధరుడై, దివ్యాభరణ భూషితుడై, గరుడ, అనంత, విష్వక్సేనుల వంటి నిత్య సూరులచే సేవింపబడుతూ ఉండే తత్త్వం. ముక్తులకు తప్ప, సాధారణ భక్తులకు, ఇతరులకు దొరకనిదే పరతత్త్వం. ఆయన పరమపదమున అపరిమిత ఆనందభరితుడై ఉన్నాడు.

2. వాసుదేవ వ్యూహం :

శ్రీకృష్ణుడు అర్జునునితో కూడి నరనారాయణుడై తదీయ ప్రతిజ్ఞా నిర్వహణార్థం వైదిక పుత్ర సవకంబున తీసుకొని వచ్చిన స్థానాన్ని వాసుదేవ వ్యూహమంటారు. ఈ వ్యూహం కేవలం నిత్య సూరులకే తెలియబడుతుంది.

3. ప్రద్యుమ్న వ్యూహం :

బ్రహ్మలోకంలో వసించి, బ్రహ్మచేత పూజింప బడుతూ, తద్దేశవాసులను రక్షించే వ్యూహం.

4. సంకర్షణ వ్యూహం :

పాతాళంలో వసించి, బలి చక్రవర్తి, తద్దేశ వాసులను రక్షించే వ్యూహం.

5. అనిరుద్ధ వ్యూహం :

క్షీర సాగరంలో ఒక వైకుంఠాన్ని నిర్మించి, లక్ష్మీ సమేతుడై వసించే వ్యూహం. ఇది పూర్ణావతారాలకు మూల కందం. బ్రహ్మాది మునిపుంగవులు ఆయనను అవతరించమని ప్రార్థించేది ఇక్కడే. బ్రహ్మ, రుద్రులు, దేవతలు, సనకాది మునీంద్రులు, అక్కడికి వెళ్ళారు. ఇది వారి వారి కొరతలు తీర్చుకొనడానికి అనుకూలమైన వ్యూహం.

సాధారణ భక్తులకు ఈ వ్యూహాలు అందుబాటులో ఉండవు. సాధన ఫలితంగా వారు ఆయా వ్యూహాలలో చేరి, ఆనందిస్తారు. భక్తి సలపడానికి విభవ స్వరూపాలే అందుబాటులో ఉంటాయి. అవతారాల కాలం కాకపోయినా వారి విగ్రహాలను అర్చావతారాలుగా భావించి భక్తి సలపడం అందుబాటు లోనిది.

మానసిక భక్తిగా మారే వరకు విగ్రహారాధన చేసే క్రియలను అపరాభక్తి అంటారు. మానసిక భక్తిగా మారి, అది ముఖ్యభక్తి అయినప్పుడు మిగిలింది పరాభక్తి అంటారు. ఈ సూత్రంలో భగవంతుని విభవ రూపాలలో భావించి ప్రేమించడం, దానిని త్రికరణ శుద్ధిగా చేయడం, ఉత్తమ భజనగా చెప్ప బడింది. కాని ఆయన అంతర్యామిత్వాన్ని అర్థం చేసుకొని భజిస్తే పరాభక్తి సిద్ధిస్తుంది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


02 Oct 2020

నారద భక్తి సూత్రాలు - 111


🌹.   నారద భక్తి సూత్రాలు - 111   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 81 - part 1

🌻 81. త్రి సత్యస్య భక్తిరేవ గరీయసీ, భక్తిరేవ గరీయసీ || - 1 🌻

భగవంతునికి భక్తి చేయడం అంటే ఆయనను త్రికరణ శుద్ధిగా ప్రేమించడమే. అలా ప్రియతమ భగవంతుడిని ప్రేమికుడిగా ప్రేమించడం ఉత్తమ భజన అవుతుంది. ముమ్మాటికీ ప్రియతముడు, ప్రేమికుడు అనే పద్ధతిలో ప్రేమించడమే ఉత్తమం.

నామ రూపాలు లేని భగవంతుడిని ఎలా ప్రేమించడం ? లక్షణ వృత్తిగా ప్రకృతి ధర్మాలకు వ్యతిరేకార్థంగా నిర్ణయించిన నామాలే భగవన్నా మాలు. ఆనృత జడ దుఃఖాలకు వ్యతిరేకార్థంగా సత్ చిత్ ఆనందమని భగవంతుని నామం. ప్రకృతి ఇహం అయితే పరమాత్మ పరం.

ప్రకృతి అనిత్యమయితే ఆయన నిత్యుడు. అలాగే అన్ని నామాలూ, బోధనార్థం భగవంతుడికి పరం, నిత్యం, సత్యం, జ్ఞానం, అనంతం, అద్వయం, నిర్వి కారం, నిరాకారం, అచలం, సనాతనం మొదలైన నామాలతో పిలుస్తారు.

ఈ నామాలు అర్థం చేసుకుంటే ఆయన ఇంద్రియ గోచరం కాదని తెలుస్తుంది. అందువలన ఆయనను ప్రేమించడం ఎలా? మంచిని ప్రేమిస్తాం.

మంచితనం ఎలా కనబడుతుంది? ఆ గుణమున్నవాడు చేసే క్రియలలో మంచితనం తెలుస్తుంది. మంచివాడిని ప్రేమిస్తే మంచితనాన్ని ప్రేమించినట్లే అవుతుంది. మనం దేహాన్ని ప్రేమించడంలేదు. ఆ దేహంలో ఉన్న మంచితనాన్ని ప్రేమిస్తున్నాం. వాడిలో మంచితనం లేకపోతే ఆ దేహం ప్రేమించబడటానికి యోగ్యం కాదు.

అలాగే భగవంతుని ప్రేమించడానికి రామకృష్ణాది అవతార రూపాలను ప్రేమిస్తాం. ఆ అవతార మూర్తులు ఇప్పుడు లేరు కదా అంటే, ఆయా రూపాలలోని దైవత్వం శాశ్వతం కదా! మనం దైవాన్ని ప్రేమిస్తున్నప్పుడు, రూపం అనేది మొదట్లో దైవత్వానికి చిరునామాగా ఉంది. దైవ భావం అర్థం కాగానే చిరునామాతో పనిలేదు కదా ! మన పెద్దలను వారు బ్రతికి ఉన్నప్పుడు ప్రేమించామనుకోండి. వారిప్పుడు లేకపోయినా వారి పటాన్ని పెట్టుకొని ప్రేమ వ్యక్తం చేయడం లేదా ? వారికిప్పుడు రూపం లేదు. పటమే వారు కాదు. అయినా వారిపై ప్రేమ వ్యక్తం చేయడానికి ఆ పటం ఆధారమైనట్లే, భగవంతుని అవతార రూపాలు, విగ్రహాలు మనకు ఆధారమవుతాయి. పెద్దల పటం మన ఎదుట లేకపోయినా, ప్రేమించగలం.

అలాగే భగవంతుని రూపం మనస్సులో పెట్టుకొని ఆయనను ప్రేమిస్తాం. బొమ్మలే కదా అని వాటిని పారేస్తే భగవంతుని అవమానించినందుకు భక్తుడు విలపిస్తాడు. త్యాగరాజు ఆరాధించే రాముడు మొదలైన విగ్రహాలను కావేరీ నదిలోకి విసిరేస్తే ఆయన విలపించగా, కావేరి పొంగి ఆ విగ్రహాలు నది ఒడ్డుకు కొట్టుకు వచ్చేటట్లు చేసింది. ఆ విగ్రహాలు దొరకగానే త్యాగరాజ స్వామి ఎంతో ఆనందించారు. మనమైనా, మన పెద్దల పటాన్ని అవమానిస్తే పటమే కదా అని ఊరుకోం కదా ! మన పెద్దలనే అవమానపరచినట్లు భావిస్తాం.

ఈ విధంగా భగవదారాధన ద్వారా భక్తిని పెంచుకోవడమంటే ఆయనను అధికాధికంగా, ఇంకా అధికంగా ప్రేమించడమే. ఈ ఆరాధన కోసం భగవత్స్వరూపాలను అనేక వ్యూహాలుగా, విభవాలుగా నిర్ణయించారు విశిష్టాద్వైతులు. భక్తులకు విభవ రూపాలు ఆరాధ్యం.

వీటిలో పూర్ణావతారం, ఆవేశావతారం, పామరజన మోహనావతారం, అంశావతారం, అర్చావతారం అని అయిదు విధాలు.

1. పూర్ణావతారం : ధర్మ సంస్థాపన కొరకు భూలోకంలో అవతరించిన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, రామ, కృష్ణావతారాలుగా చెప్తారు. ఈ అవతారాల వల్లనే భక్తులు ముముక్షువులై భగవదనుగ్రహం పొందుతున్నారు, ముక్తులవు తున్నారు.

2. ఆవేశావతారం : పరశురాముడు విష్ణువు యొక్క ఆవేశం వలన అవతార కార్యక్రమం నెరవేర్చేవాడు.

3. పామరజన మోహనావతారం : బౌద్ధావతారం పామరులకు ఆకర్షణ.

4. అంశావతారాలు : శివుడు, అర్జునుడు, వ్యాసుడు నారదుడు మొదలగు అవతారాలు.

5. అర్చావతారం : లోహ శిలా రూపాలు, ప్రతిమలు, విగ్రహాలు. దేవాలయాలలో ప్రతిష్ఠించబడినవి కొన్ని, వెలిసిన విగ్రహాలకు దేవాలయాలు నిర్మించబడినవి కొన్ని, భక్తుల గృహమందు పూజింపబడే సాలగ్రాములు మొదలైనవి. భక్తులచే షోడశోపచారాలు స్వీకరించి వారి అభీష్టాలను సిద్ధింపచేసేవి ఈ అవతారాలు.

ఈ విగ్రహాలు జ్ఞానం, శక్తి, ఐశ్వర్యంతో కూడి ఉంటాయని విశ్వసించాలి. ఈ విగ్రహాలను జడమనడం భగవదనుగ్రహానికి విరోధమవుతుందని విరోధోపాయ స్వరూపంలో చెప్పబడింది. అందుకే విగ్రహాలకు పవళింపు సేవలు, మేలుకొలుపులు, కళ్యాణాలను జరుపుతూ ఉంటారు. ఇవన్నీ భక్తులు నామ రూపాలు లేని భగవంతుని ప్రేమించడానికి తగిన ఉపాయాలుగా తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


01 Oct 2020

నారద భక్తి సూత్రాలు - 110




🌹.   నారద భక్తి సూత్రాలు - 110   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 80

🌻 80. స కీర్తనీయః (కీర్త్యమానః) శీఘ్రమేవావిర్భవ

త్యనుభావయతి (చ) భక్తాన్ || 🌻

భగవంతుడిని భజిస్తే, భజన తీవ్రతను బట్టి ఆ భగవంతుడు వెంటనే ప్రసన్నుడవుతాడు. భక్తుని తనలో మమేకం చేసుకోవడానికి అవసరమైన తత్త్వానుభూతిని అనుగ్రహిస్తాడు. నిశ్చింత భజన వలన భావ సమాధి ప్రాప్తిస్తుంది.

భావ సమాధి ఫలమేమంటే భక్తుడు భగవంతుని ఏ రూపంలో భజిస్తాడో, అదే రూపంలో ఆయన భక్తుల అంతర్దృష్టికి గోచరిస్తాడు. ఇది భావమాత్రం కాదు, ముఖా ముఖిగా ఉంటుంది. దీనిని సాలోక్య ముక్తి అంటారు. సాలోక్య ముక్తిలో భక్తుడు భగవంతునితో నిరంతరం ఉంటూ, ప్రపంచంలో జరిగేవన్నీ భగవంతుని విలాసంగా గ్రహిస్తాడు.

భగవద్విలాసంగా చూస్తూ ఉండడాన్ని సామీప్య ముక్తి అంటారు. భగవంతునితో ఉంటూ, దైవీ విలాసాన్ని చూస్తూ ఉండడంలో భక్తుడు తన్మయమవుతాడు. ఫలితంగా భక్తుడిలో భగవద్వృత్తికి దారి తీస్తుంది. ఇది సారూప్య ముక్తి అనబడుతుంది. భక్తిశాస్త్రం సారూప్య ముక్తిని చరమ ఫలంగా నిర్ణయిస్తుంది. అద్వైతమతం సాయుజ్య ముక్తినే భగవదైక్యంగా చెప్పి దీనిని చరమ ఫలంగా చెప్తుంది.

విశిష్టాద్వైత మతం ప్రకారం, భక్తుడు సాయుజ్యాన్ని కోరడు. భగవంతుని సేవిస్తూ తద్రూపాన్ని అనుభవిస్తూ ఉండిపోవడమే భక్తుడి కోరిక. కాని భక్తుడు కోరకపోయినా, భగవంతుడు సాలోక్యాది పదవులే గాక, సాయుజ్య ముక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ముఖ్యభక్తి యొక్క పరమావధినే సాయుజ్య ముక్తి అంటారు.

దీనినే ఏకాంత భక్తి అని కూడా అంటారు. ఏకాంత భక్తిని పరాభక్తి లేక పరమప్రేమ అని కూడా అంటారు. మధ్వ మతంలో అనగా ద్వైతమతంలో

1) హరిసర్వోత్తముడు

2) జీవులు అస్వతంత్రులు, పరమాత్మకు సేవకులు

3) మోక్షమంటే పరమాత్మ పదకమలాల జేరి, స్వస్వరూప ఆనందానుభూతిని పొందటం.

4) పరమాత్మునియందు అచంచల భక్తే మోక్ష సాధనం.

విశిష్టాద్వైత మతం ప్రకారం జీవుని స్వరూపాన్ని అయిదు దశలుగా చెప్తారు. 1) నిత్యులు (2) ముక్తులు (3) కేవలులు (4) బద్దులు (5) ముముక్షువులు.

1 నిత్యులు : జనన మరణాది అవస్థలెరుగనివారు. స్వయం ప్రకాశమానులు. నిరంతర భగవదనుభవపరులు. వీరిని నిత్య సూరులు అంటారు. అనగా గరుడ, అనంత, విష్వక్సేనులు మొదలగువారు. వీరు విష్ణు లోకంలో ఉంటూ, విశ్వ పోషణకు విష్ణు మూర్తికి సహాయపడుతూ ఉంటారు. ముక్తి పొందినవారు ఇక్కడికి చేరుతారు. వీరందరూ శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటారు.

2. ముక్తులు : భగవద్భక్తులై, దేహ త్యాగానంతరం పరమపదం జేరి నిత్య సూరులతో కలసి ఆనందిస్తూ ఉంటారు.

3. కేవలులు : జ్ఞాన, యోగ సాధనలచే బంధ విముక్తులై పైన చెప్పిన ముక్త స్థితికి ఆవలివారై కైవల్యం పొంది అనుభవమే తామైన వారుగా ఉంటారు. దీనినే సాయుజ్య ముక్తి అంటారు.

4. బద్ధులు : తమ స్వరూపాన్ని మరచి దేహమే సత్యమని, ఇంద్రియ లోలురై కష్టపడుతూ ఉంటారు. కష్టపడటంలోనే సుఖమున్నదను భ్రాంతి పొందుచు, చివరకు దుఃఖపడుతూ ఉంటారు.

5. ముముక్షువులు : ప్రపంచం విష్ణు మాయ అని, సంసారం బంధమని తెలిసి, భగవద్భాగవతాచార్య కైంకర్యపరులై ఉండువారు. ఈ మతంలో భక్తులు సాలోక్య, సామీప్య, సారూప్య ముక్తులనే కోరు కుంటారు. వీరు ఆనంద పరవశాన్ని. భగవత్సేవను మాత్రమే కోరు కుంటారు. సాయుజ్య ముక్తిలో అవి ఉండవు. లడ్డూగా ఉండడం సాయుజ్య మైతే, తీపిననుభవించడం సాలోక్యాది త్రయముక్తులు. వీరు లడ్డూగా ఉంటే ఏ ఆనందం ఉండదు గనుక, ఆ లడ్డూలోని తీపి దనాన్ని అనుభవిస్తూ ఆనందంగా ఉండడం ఉత్తమ మంటారు. పైగా భక్తుడూ, భగవంతుడూ ఒక్కటేననే దాన్ని అపచారంగా భావిస్తారు.

సాయుజ్య ముక్తి పొందిన వారెలా ఉంటారంటే నవ యౌవన సుందర కోమలాంగి సర్వాలంకార భూషితయై భర్తను వీడిన వనిత వంటివారు అని అంటారు. ఇట్టి సాయుజ్యాన్ని వారు కోరరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


30 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 109



🌹.   నారద భక్తి సూత్రాలు - 109   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 79

🌻. 79. సర్వదా సర్వభావేన నిశ్చింతై: (చితైః) భగవానేవ భజనీయః || 🌻

సమస్త వ్యాకులతలను వదలి జీవించి ఉన్నంతకాలం నిరంతరం భగవంతుని భజిస్తూనే ఉండాలి. ముఖ్యంగా వ్యాకులపాటు ఉన్న సమయంలో ఎక్కువగా భజించాలి.

మెహెర్ బాబా సందేశం ఏమంటే "DON'T WORRY, BE HAPPY" ఇది సాధన వాక్యంగా తీసుకుంటే వ్యాకులపాటు వచ్చినప్పుడే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.

సత్య వాక్యంగా తీసుకుంటే “నీవూ భగవంతు డవే. భగవంతుడు ఆనంద స్వరూపుడు గనుక, నీవు కూడా ఎప్పుడూ, ఆనందంగా ఉండు, వ్యాకులపడకు” అని, దైవేచ్ఛ ప్రకారం జీవిస్తున్నామనే భావనలో ఏది జరిగినా భగవంతుని ఇచ్ఛ అనుకోవాలి. బాధలున్నప్పుడు దైవం నాకు పరీక్ష పెట్టి, పిదప అనుగ్రహిస్తాడు అనుకోవాలి.

ఏ పరిస్థితిలో ఉన్నా, దైవం నన్నీ పరిస్థితిలో ఉంచాడు, అది నా మేలుకేనని అనుకోవాలి. భజన నిరంతరం చేస్తూ చేస్తూ, జీవించి ఉండగానే ముఖ్యభక్తుడవాలి.

లేకపోతే భగవంతుని ధ్యానిస్తూ ధ్యానిస్తూ, మరణించాలి. వ్యాకులపాటు లేని భజన వలన భక్తి పుష్పించి, భావ సమాధికి చేరుస్తుంది. అప్పుడు సాధకుడు వెనుదిరగడు. ముఖ్యభక్తిలో స్థిరమవుతాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group :
https://t.me/ChaitanyaVijnanam


నారద భక్తి సూత్రాలు - 108


🌹.   నారద భక్తి సూత్రాలు - 108   🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 78

🌻 78. అహింనా సత్య శౌచ దయాస్తిక్వాది చారిత్ర్యాణి పరిపాలనీయాణి ॥ 🌻

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం మొదలైనవి కూడా భక్తిని నిలుపు కోవడానికి ఉపయోగపదే సాధనలు.

అహింస అంటే తన వలన ఇతరులకు ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ విధమైన బాధ కలుగకుండుట. ఇతరులు బాధ పెట్టినా, ప్రతీకారంగా చెసేది కూడా హింసే అవుతుంది. ఇతరుల మనస్సుకు భక్తుడి వలన ఎట్టి బాధ కలుగకూడదు. సాధకుడు రజోగుణం విడిచి, సాత్వికుదైతే గాని భక్తి నిలవదు.

సాధకుడి వ్రతం అహింస గనుక, తన కారణంగా ఇతరులకు బాధ కలుగక పోయినా తన తలపులలో కూడా ఇతరులకు బాధను కలిగించే ఆలోచన రాకూడదు. అంతేకాదు, శత్రువును కూడా ప్రేమించ గలగాలి.

జిల్లళ్ళమూడి అమ్మ బాధల గురించి ఏమి నిర్వచించారో చూడండి. “శరీరానికి తగిలితే నొప్పి, మనస్సుకు తగిలితే బాధ. మనస్సుకు బాధ ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటె లేదు. సుఖంగా బాధను అనుభవిస్తే బాధ బాధ కాదు. బాధంటే చైతన్యమే. బాధ లేకపోతే స్థాణువై పోతాడు. బాధలు అనుభవిస్తున్నా అది బాధ అనిపించనప్పుడు సహజ సహనమవుతుంది. సర్వకాల సర్వావస్థలందు సహజ సహనమె సమాధి. సమాధి అంటే మోక్షమే కదా !

అహింసకు అమ్మ చెప్పిన భాష్యమేమంటే బాధలుండడం భగవంతుని దయ. ఎందుకంటె బాధలు సహించుకోవడాన్ని సహజం చేసుకోవడానికి పరీక్ష అవసరం. ఆ పరిక్ష కోసమే బాధలున్నాయి. కనుక ప్రతిచర్య హింస అవుతుంది.

సత్యం అంటే అబద్దములాడకుండుట. సత్య వాక్పరిపాలనకు శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు ఉదాహరణీయం. సత్యవ్రతం అంటే సత్యం జ్ఞానం అనంతం అయిన భగవంతునితో అనుసంధానం చేసుకోవడం. అనిత్య వస్తువుల యెడ ఆసక్తి వీడి, సత్యమైన భగవంతుని మీద అనురాగం పెంచుకోవడం. స్వార్ధాన్ని త్వాగం చేయదం సత్యమే అవుతుంది.

అంతఃకరణ శుద్ధి భక్తికి కావలసిన ఉత్సాహం బాహ్య శౌచం వలన కలుగుతుంది. సర్వ జీవులందు వాటి దీనత్వాన్ని బట్టి కలిగేది దయ. నా వారు, ఇతరులు అనే భేదం లేకుండా కలిగేది దయ.

భక్తి చేసేవాడికి “భగవంతుడున్నాడు, తప్పక అనుగ్రహిస్తాడు” అనె విశ్వాసం ఉండాలి. దీనినే ఆస్తిక్యము అంటారు. ఇట్టి దృఢ విశ్వాసం లేకపోతే భక్తి సఫలం కాదు.

అహింస, సత్యం, శౌచం, దయ, ఆస్తికం ఉన్నప్పుడు, గొణభక్తి ముఖ్యభక్తిగా పరిణమిస్తుంది. రాగద్వేష అసూయలున్న వారికి భక్తి అనేది, కపట ప్రదర్శనే అవుతుంది. కనుక భక్తిని నిజాయితీగా సలపడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


28 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 107


🌹.   నారద భక్తి సూత్రాలు - 107   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 77

🌻 77. సుఖ దుఃఖెచ్చా లాభాది త్వక్తే కాలే ప్రతీ(క్ష్య్ర)క్షమాణ క్షణార్ధమపి వ్యర్థం న నెయమ్‌ ॥ 🌻

భక్తుడు సుఖ దుఃఖాది ద్వంద్వాలను జయించినప్పుడు అతడికి సామాన్యమైన కర్తవ్యాలు ఏమీ ఉండవు. అప్పుడు ఊరకే ఉండడానికి కాలం భారంగా తోస్తుంది. కాలాన్ని వ్యర్థం చేయకుండా ఉండడానికి భక్తుడు శ్రేయో మార్గాన్ని అవలంపీస్తూ కాలాన్ని వినియోగినాడు.

అలా కాకుండా ఊరక ఉంటే మానసికమైన వ్యాపారాలు జనిస్తాయి. వాటికి సందు ఇస్తే ఆ విషయాలే బలీయమై, భక్తికి ఆటంకం కలిగించడమే కాకుండా భక్తిని చెడగొదడతాయి. అందువలన సాధకులు వారు అందుకున్న స్థాయిని (కిందికి దిగజార్చకుండా అప్రమత్తంగా ఉండాలి.

ఎంతమంచి ఇత్తడి అయినా ప్రతిరోజూ శుభ్రపరచకపోతే చిలుము పట్టుతుంది కదా ! అలాగే సాధన క్రమంలో పట్టు జారకుండా చూచుకుంటె ఆ భక్తి ప్రవర్ధమానమై తేజరిల్లుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

27 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 106



🌹.   నారద భక్తి సూత్రాలు - 106   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 76

🌻 76. భక్తిశాస్తాణి మననీయాని త(దు)ద్బోధక కర్మాణి కరణియాని ॥ 🌻

సాధకులు భగవంతుడి పట్ల భక్తి ప్రేమలను గూర్చి వివరించే శాస్త్రాలను విశ్లేషించి, మననం చెస్తూ ఉండాలి. భక్తి ప్రమలను ప్రబోధించి భగవత్మథలను వినాలి, వారి నిత్య కర్మలలో ఆ ప్రమ ప్రతిఫలించాలి.

భక్తి శాస్త్రమంటెే భాగవతం, భగవద్గీత, నారద పాంచరాత్రం, భక్తి రసనాయనం మొదలగునవి. నారద భక్తి సూత్రాలు, శాండిల్య భక్తి సూత్రాలు మొదలగునవి కూదా. భక్తుల చరిత్రలు, పురాణ కాలానివి, ఈ మధ్య కాలానివి కలిపి పఠించాలి. ఈ పఠన, శ్రవణ, మననాల వంటి కర్మలు, పవిత్ర కర్మలవడంచేత శుభవాసన ఎర్పడుతుంది. దానివలన సుకృత విశేషం కలిగి, భక్తి పక్వమై పండుతుంది.

భక్తిక్రియా వివరాలు, సాధనా క్రమం, శాస్త్రియ పద్ధతి మొదలైనవి తెలియడమే గాక, పూర్వ భక్తుల సాధన, సాధ్యాలను ఉదాహరణగా సందేహ రహితంగా, అభ్యాసం చేయడానికి వీలవుతుంది. శ్రద్ధ, విశ్వానాలు కలుగుతాయి.

భాగవత కథాగానం, సంకీర్తనం చేయాలి, వినాలి. కాలక్షేపానికైనా సరే నిరంతరం చేస్తూ పోతె భక్తి దానంతట అదే కలిగి, వృద్ది చెందుతుంది. భక్తి పురోగమనం మాట ఎలా ఉన్నా ఈ క్రియల వలన ఇతరమైన అవాంఛిత కర్మల నుండి దూరమవుతాడు.

ఆళ్వారుల భక్తి కీర్తనలు, గోదా దేవి పాశురాలు, తుకారాం, రామదాసు పాటలు, అన్నమయ్య పదాలు, కబీరు గీతాలు, జయదేవుని అష్టపదులు, త్యాగరాయ కీర్తనలు మొదలైనవి విని, పాడుతూ, అనుసరిస్తూ తన్మయమైతే అదీ భక్తే. ప్రహ్లాదుడు, అంబరీషుడు, గజేంద్రుడు మొదలైన భాగవతంలోని భక్తులకు సంబంధించి, శ్రీ బమ్మెర పోతన కవి రచించిన పద్యాలను వల్లె వేస్తే మంచిది. ఉదయాస్తమానం భక్తి రసం పొంగేటట్లు ఏది బాగుంటె దానిని తనకిష్టమైనట్లు భక్తుడు సాధనగా చేస్తే అతడు ముఖ్యభక్తుడవుతాడు. కనుక ఈ విధమైన శుభ కర్మలు నిరంతరం చేస్తూ ఉండాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


26 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 105




🌹.   నారద భక్తి సూత్రాలు - 105   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 75

🌻 75. బాహుళ్యావకాశత్వాత్‌ అనియతత్వాశ్చ ॥ 🌻

పరమార్ధం ఒక్కటే అయినా ఒక్కొక్కరు భగవత్స్వరూపాన్ని ఒక్కొక్క రూపంగా చూదదం కూడా ఉంటుంది.

భక్తి సాధన భగవంతుని నాకారంగా భావించి చేయదం వలన, వారికి ఆ విధమైన సవికల్ప రూవాలు, దర్శనాలు ఉంటాయి. అంతమాత్రం చెత అది సత్యం కాకపోదు. సత్యానికి ఒక పార్వ్వం కావచ్చును. అయితే సంయక్‌ సత్యం మాత్రం వీటన్నిటినీ కలిపి ఉంచే పరిపూర్ణత. ముఖ్య భక్తుల దర్శనాలు ఇలాగే ఉంటాయి.

ఎలాగంటే ధృవుడికి నారదుడు ఉపదేశించిన విష్ణు రూపం ఎలా ఉందో, ధృవుడికి అలాగే ప్రత్యక్షమైంది. అదెమంటే ధృవుడు శంఖు చక్ర గదా పద్మహస్తుడై, పట్టు పీతాంబర ధారియై నీల మేఘశ్యాముడైన విష్ణు స్వరూపాన్ని దర్శించాడు. పరమాత్మ దర్శనాన్ని దేదీప్వ్యమైన ప్రకాశంగా చూచేవారున్నారు.

శివున్ని పన్నగ భూషణునిగా, త్రిశూల ధమరుక హస్తుడైన వానిగా, గంగా చంద్రులను ధరించిన వానిగా, బూడిద పూసుకున్న నటరాజుగా దర్శించవచ్చును.

పరాభక్తిలో ఈ విధమైన సవికల్పాలుండవు. అది నిర్వకల్ప సత్‌చిదానంద అనుభవంగా ఉంటుంది. పరాభక్తి అంటె పూర్ణం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


25 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 104




🌹. నారద భక్తి సూత్రాలు - 104 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 74

🌻 74. వాదో నావలంబ్యః ॥ 🌻

ముఖ్యభక్తుల విషయంలో వారికి భగవంతుని గురించి గాని, భక్తుల గురించి గాని, శాస్త్రాల గురించి గాని వాదోపవాదాలు చెయాలని అనిపించదు. వారికి వారి అనుభవమే ప్రమాణం.

ఇతరుల విషయంలో సహజంగానే ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్షలు కలుగుతాయి. ఇది బాహ్యానికి మాత్రమె. అంతరంలో సర్వం భగవన్మయంగా ఉంటుంది. అందువలన వాదోపవాదాలకు తావులేదు.

ఒకవేళ వారితో ఎవరైనా వాదానికి దిగితే నాకు తెలియదు. మీరు చెబితే తెలుసుకుంటాను” అంటారు. అహంకార ముందదు గనుక అవమానపదరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

24 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 103


🌹.   నారద భక్తి సూత్రాలు - 103   🌹 

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 73

🌻 73. యత స్తదియా ॥ 🌻

అందువలన భక్తులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. ముఖ్య భక్తిగా మారితే అట్టి భక్తులకు కూడా జీవులందరూ సమానులే. సర్వం హరిమయం.

హరిమయం కానిది ఏమీ లేదు అనే అనన్య భక్తులకు ఈ చరాచర జగత్తులో భిదాలు ఎందుకు తోస్తాయి కాని, నేను, ఇతరులు అని గుణభేదంతో చూచేవారికి భేదాలే తోస్తాయి. అట్టి వారికి ముక్తి లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group
https://t.me/ChaitanyaVijnanam

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

23 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 102


🌹.   నారద భక్తి సూత్రాలు - 102   🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 73

🌻 73. యత స్తదియా ॥ 🌻

అందువలన భక్తులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. ముఖ్య భక్తిగా మారితే అట్టి భక్తులకు కూడా జీవులందరూ సమానులే. సర్వం హరిమయం.

హరిమయం కానిది ఏమీ లేదు అనే అనన్య భక్తులకు ఈ చరాచర జగత్తులో భిదాలు ఎందుకు తోస్తాయి కాని, నేను, ఇతరులు అని గుణభేదంతో చూచేవారికి భేదాలే తోస్తాయి. అట్టి వారికి ముక్తి లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

22 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 101


🌹. నారద భక్తి సూత్రాలు - 101 🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 72

🌻 72. నాస్తి తేషు జాతి విద్యారూప కుల ధన క్రియాది ఖెదః ॥ 🌻

భగవత్రసన్నత్వం కలిగినప్పుడు జాతి వగైరా భెదాలు ఉండవు. జ్ఞాన అజ్ఞానాలు, కుల భేదం, ధనిక, పెద ఖేదం వృత్తి భేదం క్రియా భిదం వంటివి ఉందవ.

ముఖ్యభక్తి కలిగాక ఎటువంటి ద్వంద్వాలు తోచవు. భగవదనుగ్రహం భక్తి న్ధాయిని బట్టి ఉంటుంది గాని, జాతి, కులం వంటి భేదాన్ని బట్ట ఉందదు.

నందనారు, రవిదాసు, కన్నపు మొదలగు నిమ్న జాతివారు భగవ దనుగ్రహం పొందారు.

మీరాబాయి, ఆందాళ్‌, అవ్వయ్యారు వంటి స్రీలు భగవనుగ్రహం పొందారు. ప్రథమంలో దురాచారులై, పిమ్మట భక్తులైన వారు కూడా భగవంతుని కృపకు వాత్రులయ్యారు. అజామీళుడు, రత్నాకరుడు (వాల్నీకి), బిళ్వమంగళుడు వీరంతా మొదట దురాచారపరులు. అయినా వారికి భగవంతుని ప్రసన్నత లభించింది. చదువుకోని కబీరు, గురునానక్‌, తుకారాం ప్రభృతులు భక్తి వలన ముక్తులైనారు. రాక్షసులలో ప్రహ్లాద, బలి చక్రవర్తులు మోక్షం పొందారు.

ఎవరైనా సరే భగవంతుని పట్ల పూర్ణ విశ్వాసం, భక్తి ప్రపత్తులు ఉన్నవారు జాతి, మత, లింగ భిదం లేకుండా భగవంతునిచే అనుగ్రహింప బడతారు. భక్తి చేయడానికి గాని, తరించడానికి గాని అందరూ అర్హులే. కాని భక్తి తీవ్రతను బట్టి మాత్రమె భగవంతుని అనుగ్రహం ఉంటుందని గ్రహించాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

21 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 100


🌹.   నారద భక్తి సూత్రాలు - 100   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 71


🌻 71. మోదన్తె పితరో, నృత్యన్తి దేవతాః సనాధాచేయం భూర్భవతి 🌻


ముఖ్యభక్తుని వంశంలోని పితృ దేవతలందరు సంతోషిస్తారు. అతడి కారణంగా దెవతలు ఆనందిసారు. అతడు భూమిమీద నివసించడం వలన భూమి సురక్షితమవుతున్నది. అందువలన భూమిమీద నివసించి అందరూ క్షేమంగా ఉందగలుగుతున్నారు. ప్రకృతి విపత్తులు రావడం లేదు. అతివృష్టి అనావృష్టి వలన నష్టం ఉండటంలేదు. కరువు కాటకాలు లేవు.

పితృ బుణం కర్మకాండగా తీర్చడం లోక సహజం. కాని ముఖ్య భక్తుల విషయంలో అతడి వంశంలోని పితరులందరికీ సర్వవిధ బుణాలు వాటంతట అవే తీరిపోతాయి. ఆ వంశంలో కర్మకాండ అవసరం ఉండదు.

దేవతలు యజ్ఞ యాగాదుల వలన తృప్తి పడతారు. కాని ముఖ్య భక్తుని విషయంలో యజ్ఞ యాగాదులు లేకుండానే తృప్తిచెంది ఉంటారు. యజ్ఞ శేషం దేవతలకు దానంతట అదే చెరుతుంది.

పాపాత్ములను ధరించే ధరణి ఆ పాపాన్ని మోయలెక ఉపద్రవానికి లోనవుతుంది. ముఖ్యభక్తుని ఉనికి వలన ఆ భూమి తిరిగి సురక్షిత మవుతుంది. అప్పుడు ఏ ప్రమాదం ఉండదు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ


20 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 99


🌹.   నారద భక్తి సూత్రాలు - 99  🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ


పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 70

🌻 70. తీర్ధి కుర్వన్త్సి తీర్తాని, సుకర్మి కుర్వన్తి కర్మాణి, సచ్చాస్త్‌ కుర్వన్తి శాస్తాణి ॥| 🌻

ముఖ్యభక్తులు తీర్ధ న్నానాలకు పవిత్రతను కలిగిస్తారు. సకల కర్మలను పావనం చేస్తారు. సర్వ శాన్తాలకు ప్రమాణత్వం ఆవాదిస్తారు.

ఒక్కొక్క బుషి తపో మహిమచేత ఒక్కొక్క క్షేత్రానికి పవిత్రత కలిగి, అది భక్తుల వావాలను హరిస్తుంది. అక్కడి నదులు తీర్ధాలై భక్తుల పాపాలను కడిగేస్తాయి.

కనుక క్షేత్రాలను సందర్శిస్తూ తీర్థాలను సేవిస్తూ అక్కడి క్షేత్ర మహిమను, దానికి కారణమైన బుషి చరిత్రను తెలుసుకుంటూ, తన భక్తిని పెంచుకోవాలే గాని, ఈ యాత్రలను వినోద, విహార యాత్రగా జరుపరాదు. అప్పుదే తీర్ధాటన ఫలం లభిస్తుంది. భాగవతోత్తముల సద్భక్తిని తెలుసుకొని, తన భక్తితో పోల్చుకుని, తన భక్తిని తగిన విధంగా సవరించు కుంటూ పెంపొందించుకోవాలి.

ఏ క్షేత్రమూ సాధారణ మానవులచెత ఏర్పాటవదు. అలా చేసినా, దానికి పవిత్రత కలుగదు. మహాత్ముల స్పర్శచెతనే పవిత్రత సమువార్దించ బడుతుంది. ఏ క్షేత్రం స్వతంత్రంగా మహిమ కలది కాదు. మహాత్ముల వల్లనే మహిమగలది అవుతుంది.

భాగవతోత్తముల అనుభవమే (రగ్రమాణం. వారి అనుభవాలే శాస్త్ర మయింది. తరువాత శాస్త్రానికి ప్రమాణం ఆవాదమయింది.

స్వతంత్రంగా శాస్త్రానికి ప్రమాణం లేదు. అనుభవజ్ఞుల అనుభవానికి శాస్త్రానికి తేడా వస్తే భాగవతోత్తముని అనుభవమే ప్రమాణం. అప్పుడు శాన్తాన్ని వదలి వెయాలి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

19 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 98


🌹.  నారద భక్తి సూత్రాలు - 98  🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 69

🌻 69. తన్మయా ॥ 🌻

ముఖ్యభక్తులక్కడ ఉంటారో అక్కడి ప్రదేశాలు పుణ్యక్షేత్రాలవుతాయి. వారు న్నాన వానాదులు జరిపిన నదీనదాలు తీర్ధాలవుతాయి. వారు సంచరించె చోటు తపోవనమౌతుంది.

గంగానది పాపాత్ముల పాపాలను హరిస్తుంది. అయితే వారి పాపం గంగానది స్వీకరిస్తే ఆ పాపం ముఖ్యభక్తుల స్పర్శచెత నశిస్తూ ఉంటుంది. ఆ నది తిరిగి పవిత్రమవుతుంది. అలాగే అన్ని తీర్దాలున్నూ. వీరెక్కడ నివసిస్తారో, భగవంతుడూ అక్కదే ప్రతిష్టితుడవుతాడు. అందువలన ఎ దేవాలయానికి వెళ్ళినా భగవద్దర్శనానికంటె ముందు ఆళ్వారు దర్శనం చేయదం ఆనవాయితీగా ఉన్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

18 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 97


🌹.   నారద భక్తి సూత్రాలు - 97   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 68


🌻 68. కంఠావరోధ రోమాశ్చాత్రుభిః పరస్పరం లపమానా 2 పావయని కులాని పృథివీంచ || 🌻

ముఖ్యభక్తి లభించినవారు, ఆ భక్తి విశేషం చేత సంభాషించేటప్పుడు వారి గొంతులో ఆర్ధత జనిస్తుంది. దగ్గుత్తిక కలుగుతుంది. రోమాలు నిక్క పొడుచు కుంటాయి. ఆనంద బాష్పాలు రాలుతాయి. శరీరం గగుర్పాటు చెందుతుంది. ఇవన్నీ బాహ్యంగా కనిపించే సూచనలు.

భక్తుల సర్వావస్థలలో వారు ఏదిచేస్తున్నా భక్తి రసంతో నిండి ఉంటుంది. వీరు భక్తి కథామృతాన్ని గ్రోలుతూ ఉంటారు. వీరీవిధంగా చేస్తూ పాపాత్ములను పునీతులుగా చేస్తూ ఉంటారు. వారికి తెలియకుండానే భక్తి పారవశ్యంతో భగవంతుని కల్యాణ గుణ కీర్తన చేస్తూ ఉంటారు. దీని వలన ఇతరులు భక్తి మార్గంలో ప్రవేశిస్తారు.

ఇతరులు వారిని బాధలకు గురిచేసినప్పటికీ భక్తిని మానరు. భక్తి ప్రచారం చేస్తూనే ఉంటారు. వారి భక్తిని బట్టి వారిలో వారి చుట్టూ తేజో మండలం వ్యాపించి, గొప్పగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ఆకర్షణీయమై ఉంటుంది.

ఈ భాగవతోత్తములు ఎక్కడో గుహాంతరాలలో ఉన్నప్పటికీ సుదూరంలో ఉన్న శుద్ధ మానసుల హృదయాలలో వారి తేజస్సు ప్రతిఫలిస్తూ ఉంటుంది. తద్వారా సామాన్య గౌణభక్తులలో సాధన ఉధృతి కలుగుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

17 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 96




🌹.   నారద భక్తి సూత్రాలు - 96   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ


పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 67

🌻 67. భక్తా ఏకాంతినో ముఖ్యాః || 🌻

ఎవరు కేవలం ప్రేమార్ధమే భగవంతుని ప్రేమిస్తారో వారు ఏకాంత భక్తులు.

భక్తి త్రివిధాలు :

1) బాహ్య భక్తి

(2) అనన్య భక్తి

(3) ఏకాంత భక్తి


1. బాహ్య భక్తి :

ఇది గౌణభక్తి క్రిందికి వస్తుంది. ఈ భక్తి కాయికంగాను, వాచికంగాను ఉంటుంది. సాధనచేత మానసికంగా మార్చుకోవాలి.

ఈ బాహ్య భక్తిలోనే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, సఖ్యం, దాస్యం, అర్చనం, ఆత్మ నివేదనం అని నవ విధాలు. పూజలు, వ్రతాలు, జపతపాలు, క్రతవులు కూడా బాహ్య భక్తి క్రిందకే వస్తాయి. ఈ బాహ్య భక్తి అనన్య భక్తిగా మారాలంటే అందరిలోనూ భగవంతుడిని చూడాలి.

దీనికి చేసే సాధనలో ముందుగా తనకంటే వేరైన వారిని నాలుగు తరగతులుగా విభజించి వారిలో ఒక్కొక్క రకం వారితో 1) ముదిత (2) కరుణ (3) మైత్రి (4) ఉపేక్ష అనే పద్ధతులుగా వ్యవహరించాలి.


ముదిత :

భాగవతోత్తములందు, పుణ్యాత్ములందు, సద్గుణ సంపన్నులందు, ముముక్షువులందు కలిగే సంతోషమే ముదిత.


కరుణ :

దుఃఖమందు, నికృష్ట గుణములున్న వాడియందు, అజ్ఞానులందు కలిగే సానుభూతిని కరుణ అంటారు.


మైత్రి :

దైవ భక్తులందు, ఉపాసకులందు, కర్మిష్టులందు, తనతో సమానమైన గుణములున్న వారితో, వీరంతా నావారు అనే బుద్ధిని మైత్రి అంటారు.


ఉపేక్ష :

పాపాత్ములు, పామరులు, మూర్ఖులు, నీచగుణాలున్న వారు కుటిలులు, దుర్మార్గులు, దుర్వ్యసనపరులందు ద్వేష రహితులై ఉదాసీనంగా ఉండాలి. దీనిని ఉపేక్ష అంటారు.


2. అనన్య భక్తి :

సర్వం భగవత్స్వరూపంగా భావించుకుంటూ అన్య చింతన వదలి మనస్సును తదేక నిష్ఠతో ఏకాగ్రం చేసి భగవంతుని నిరంతరం దర్శించడాన్ని అనన్య భక్తి అంటారు.


3. ఏకాంత భక్తి :

భగవదాకారం పొంది భగవంతుడు భక్తుడు వేరు కానట్టి స్థితిని ఏకాంత భక్తి అంటారు. ఇతడు భాగవతోత్తముడు, సత్పురుషుడు. ఇది ముఖ్యభక్తి క్రిందికి వస్తుంది.

ఏకాంత భక్తిని పతివ్రత యొక్క పతిభక్తితో పోల్చవచ్చును. వీరిలో విశేషమేమంటే వీరు ముక్తిని కూడా కోరరు. వీరు భగవంతుని ప్రేమ కోసమే ప్రేమిస్తారు.


అనపేక్షః శుచిర్ధక్షః ఉదాసీనో గతవ్యధః

సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్సమే ప్రియః

- భగవద్గీత (12:16)



ముఖ్యభక్తుడెవడంటే, ఏ మాత్రం కాంక్ష లేనివాడు, శరీరేంద్రియ మనసులందు శుచియై ఉన్నవాడు, దక్షుడు, పక్షపాత రహితుడు, ఎట్టి దుఃఖాలకు చలించనివాడు, సమస్త కర్మలందు కర్తృత్వాభిమానం లేనివాడు. అట్టి ముఖ్యభక్తుడు నాకు ప్రియుడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు.


సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


16 Sep 2020