నారద భక్తి సూత్రాలు - 109



🌹.   నారద భక్తి సూత్రాలు - 109   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 79

🌻. 79. సర్వదా సర్వభావేన నిశ్చింతై: (చితైః) భగవానేవ భజనీయః || 🌻

సమస్త వ్యాకులతలను వదలి జీవించి ఉన్నంతకాలం నిరంతరం భగవంతుని భజిస్తూనే ఉండాలి. ముఖ్యంగా వ్యాకులపాటు ఉన్న సమయంలో ఎక్కువగా భజించాలి.

మెహెర్ బాబా సందేశం ఏమంటే "DON'T WORRY, BE HAPPY" ఇది సాధన వాక్యంగా తీసుకుంటే వ్యాకులపాటు వచ్చినప్పుడే సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.

సత్య వాక్యంగా తీసుకుంటే “నీవూ భగవంతు డవే. భగవంతుడు ఆనంద స్వరూపుడు గనుక, నీవు కూడా ఎప్పుడూ, ఆనందంగా ఉండు, వ్యాకులపడకు” అని, దైవేచ్ఛ ప్రకారం జీవిస్తున్నామనే భావనలో ఏది జరిగినా భగవంతుని ఇచ్ఛ అనుకోవాలి. బాధలున్నప్పుడు దైవం నాకు పరీక్ష పెట్టి, పిదప అనుగ్రహిస్తాడు అనుకోవాలి.

ఏ పరిస్థితిలో ఉన్నా, దైవం నన్నీ పరిస్థితిలో ఉంచాడు, అది నా మేలుకేనని అనుకోవాలి. భజన నిరంతరం చేస్తూ చేస్తూ, జీవించి ఉండగానే ముఖ్యభక్తుడవాలి.

లేకపోతే భగవంతుని ధ్యానిస్తూ ధ్యానిస్తూ, మరణించాలి. వ్యాకులపాటు లేని భజన వలన భక్తి పుష్పించి, భావ సమాధికి చేరుస్తుంది. అప్పుడు సాధకుడు వెనుదిరగడు. ముఖ్యభక్తిలో స్థిరమవుతాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group :
https://t.me/ChaitanyaVijnanam


No comments:

Post a Comment