శివగీత - 77 / The Siva-Gita - 77




🌹.   శివగీత - 77 / The Siva-Gita - 77   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

దశమాధ్యాయము

🌻. జీవ స్వరూప నిరూపణము - 3 🌻

కో మొహస్తత్ర కస్శోక - ఏకత్వ మను పశ్యతః
ఏష సర్వేషు భూతేషు - గూడో త్మా న ప్రకాశతే 11

దృశ్యతే త్వగ్ర్య యా బుద్ధ్యా - సూక్ష్మయా సూక్ష్మ దర్శిభి:
అనాద్య విద్యయా యుక్త - స్తథాప్యేకో హ మన్యయః 12

అవ్యాకృత బ్రహ్మరూపో - జగత్కర్తా మహాస్త్రశ్వరః
జ్ఞానమాత్రే యథా దృశ్య - మిదం స్వప్నే జగత్త్రయమ్ 13

తద్వన్మయి జగత్సర్వం - దృశ్యతే స్తి విలీయతే
నానావిద్యా సమాయుక్తో - జీవత్వేన వసామ్యహమ్ 14

పంచ కర్మేంద్రి యాణ్యే వ - పంచ జ్ఞానేంద్రి యాణి చ,
మనో బుద్ధి రహంకార - శ్చిత్తం చేత చతుష్టయమ్ 15

ఇట్టి పరమాత్ముడు సమస్త ప్రాణులలోను బ్రహ్మము నేరిమ్గిన సూక్ష్మదర్శులకు మాత్రమే చూడబడును.

సజాతీయ విజాతీయ స్వగతభేద శూన్యుడనగు నేను మాత్రమే అనాదియగు జ్ఞానము చేత నన్నాక్రమించియున్నవాడ నైనా మరూపానభి వ్యక్తమగు బ్రహ్మరూపుడగు సృష్టికర్త నగుచున్నాను.

స్వప్నములో నీ మూడు లోకములు అజ్ఞానము చేత ప్రత్యక్ష జ్ఞానమున కల్పింపబడుచున్నట్లుగా ఈ లోకమంతయు నాలోనే అగుపడుచున్నది, ఉన్నది, లయమగుచున్నది.

రాముడు ప్రశ్నించుచున్నాడు: పైన నేను ప్రశ్నించిన వాటిలోని జీవుని సంగతి రానేలేదే, అని ప్రశ్నించగా, జీవుని గురించి వివరిస్తూ అజ్ఞానముతో కూడి నేనే జీవుడను వ్యవహారముతో జీవుని లక్షణములను వివరించి దానికి జన్మలేదని చెప్పి అజ్ఞాన కర్మ బంధమునుండి విడుదలై ఒక జీవునికి ముక్తి యైన యెడల యనేక ప్రాణులకు ముక్తి శూన్యమని చెప్పి అజ్ఞానము నశించుటే అసలైన ముక్తి యని వివరించి సుమారుగా ప్రశ్నలకు సమాధానమిచ్చి లోకాంతర గమనాగమనముల గురించిన ప్రశ్నలతో లింగ దేహము వుడుదలయ్యేవరకు ప్రానికయ్యద సాధ్యపడదని యానతిచ్చి లింగ దేహము సందర్భమురాగా అట్టి లింగదేహము గురించి యాదేశించుచున్నాడు.

ఈ లింగ శరీరము పాప పుణ్యముల ననుభవించుటకై దేహమునందు చిన్నదిగా నిడిమి యుండును. ఇది యేయే వస్తువులతో నిర్మింపబడినదనగా పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రి యములు, మనోబుద్ధి అహంకార చిత్తములు, పంచ మహావాయువులును, ఇట్లు ఈ పందొమ్మిది వద్తువులు కల్సి లింగ శరీరమగును .

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   The Siva-Gita - 77   🌹

🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj


Chapter 10

🌻 Jeeva Swaroopa Niroopanam -3 🌻

Such a Paramatma (I) resides in all creatures in secrecy and stays invisible. A yogi who sees with a micro vision of yoga to such a brahmagyani only this paramatma would be visible.

Devoid of caste and creeds, devoid of mine & yours feelings, I am the ancient one but covering myself through ignorance in the form of Brahma I am becoming the creator.

In the dream the three worlds due to ajnana (ignorance) appears as being created in reality, all these worlds appear inside me, stay in me and vanish in me. All this creation is just my projection. Under the blanket of ignorance (Ajnanam) I only remain as Jiva. The Jiva is unborn.

True liberation is nothing but destruction of ignorance (Ajnanam). [There is no liberation in literal sense as such. Atma is ever liberated, only Jiva has to realize that, and this is possible only after the destruction of Ajnanam (ignorance)].

There exists a subtle body called as Sookshma Shareeram or Linga Deham inside the Sthoola (gross) body. In order to enjoy the fruits of virtues and vices, this linga deham remains in the gross body in a very minute form.

This linga deham is composed of five motor organs, five sense organs, mind, intellect, ego, chittam, and five major winds. In this way with these nineteen elements put together, form the linga deham.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group :
https://t.me/ChaitanyaVijnanam

WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


No comments:

Post a Comment