శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।
వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀

🌻 349-1. 'వందారు జనవత్సలా' 🌻


నమస్కరించు జనుల యందు వాత్సల్యము కలది శ్రీమాత అని అర్థము. ఎవరైననూ నమస్కరించిన దానిని స్వీకరించువారు సహజ ముగ ప్రీతి చెందుదురు. ఇది యొక రహస్యము. ఎదుటి వ్యక్తి ప్రీతిని, వాత్సల్యమును పొందుటకు నమస్కరించుట భారతీయ సంప్రదాయము. నమస్కారము చేయువారు ఎదుటి వ్యక్తి యందలి దివ్యత్వమును గుర్తించి నమస్కరించినచో ఆ వ్యక్తిలోని దైవము ప్రీతి చెంది ఉన్ముఖు డగును.

అందరి జీవుల హృదయము లందు దైవము ఉపస్థితి చెంది యుండుట చేత అట్టి దైవమునకు నమస్కరించు భావన కలిగినచో దైవము యొక్క ఆనుకూల్యము హెచ్చగును. నమస్కారము భక్తికి, వినయమునకు చిహ్నము. నమస్కారము నందుకొను జీవుడెట్టి వాడైననూ నమస్కరించువారు మాత్రము ఆ జీవుని యందలి దైవమునకే నమస్కారము చేయవలెను. అపుడు చేయు నమస్కారము కేశవు డను దైవమునకు చెంది జీవులు అనుగ్రహింపబడుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 349-1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala
Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻

🌻 349. Vandāru-jana-vatsalā वन्दारु-जन-वत्सला (349) 🌻


This can be considered as an extension of the previous nāma. She loves Her devotees like a mother who loves her children. The vibration of love is emanated through one’s body like fragrance of a flower. Because of caring and loving nature also She is known as Vimalā (nāma 347). One can notice this in daily life. When one serves food for his dog, by impulse he develops love for his dog and this is radiated through his body. The dog reads his vibrations and feels his love and wags its tail as a token of reciprocating his love.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భాగవతము-అనుభూతి -1 🌻

కలి యుగమున కష్ట జీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును.

పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు.

... ..✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2022

శ్రీ శివ మహా పురాణము - 520


🌹 . శ్రీ శివ మహా పురాణము - 520 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 44

🌻. మేన యొక్క మంకు పట్టు - 6 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవత్పత్ని యగు మేన పార్వతి యొక్క ఆ మాటను విని మిక్కిలి కోపించి బిగ్గరగా ఏడ్చి ఆమె శరీరమును పట్టుకొని (61), పళ్ళను పట పట కొరుకుచూ, మిక్కిలి దుఃఖముతో మహాక్రోధముతో తన కుమార్తె యగు పార్వతిని పిడికిళ్లతో, మరియు మోచేతులతో కొట్టెను (62), ఓ మునీ! కుమారా! అక్కడ ఉన్న ఋషులు, నీవు, మరియు ఇతరులు ఆ పార్వతిని ఆమె చేతి నుండి విడిపించి అచటినుండి దూరముగా తీసుకొని పోయిరి (63). అపుడామె వారిని అనేక విధములుగా కోపించి వారికి మరల నిందావచనమును వినిపించు చున్నదై ఇట్లు పలికెను (64)

మేన ఇట్లు పలికెను -

నేను మేనను. దుష్టమగు పట్టుదల గల ఈ పార్వతిని ఏమి చేయుదునో చెప్పనా? ఈమెకు తీవ్రమగు విషమునిచ్చెదను. లేదా, నూతిలో తోసివేసెదను. సందేహము లేదు (65). లేదా, ఈ కాళిని శస్త్రములతో ముక్కలు ముక్కలు నరికివేసెదను. లేదా, నా కుమార్తె యగు ఈ పార్వతిని సముద్రములో ముంచి వేసెదను (66). లేదా, నేనే రేపటి లోపులో నిశ్చితముగా దేహత్యాగము చేసెదను. నా కుమార్తె యగు దుర్గను వికృతాకారుడగు శంభునకీయను (67). ఈ దుష్టురాలు భయంకరాకారుడగు ఎటువంటి వరుని సంపాదించినది? ఈమె నన్ను, హిమవంతుని, మరియు మా కులమును ఆపహాస్యము పాలు చేసినది (68).

ఈతనికి తల్లి లేదు. తండ్రిలేడు, సోదరుడు లేడు, బంధువు లేడు, స్వగోత్రీకుడైననూ లేడు, అందమగు రూపము లేదు, ఇల్లు లేదు, ఏమీలేదు (69). వస్త్రము లేదు, భూషణములు లేవు, పరిచారకులెవ్వరూ లేరు. ఈయనకు వామనము లేదు, శుభకర్మలు లేవు, వయస్సు లేదు, ధనము లేదు (70). పవిత్రత లేదు, విద్యలేదు. దుఃఖమును కలిగించే ఆయన దేహము ఎట్లున్నదియో? సుమంగళయగు నా కుమార్తెను ఏమి చూసి ఈయనకు ఈయదగును? (71).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2022

గీతోపనిషత్తు -322


🌹. గీతోపనిషత్తు -322 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-2 📚


🍀 24-2. తత్త్వదర్శనము - మన ముండుట యనగా దైవ ముండుటయే. ఏ దిక్కునకు పోయినను అన్ని దిక్కులయందు దైవమే యుండును. ఇట్లు దైవమునందుండి, దైవ మాధారముగ జీవుడు తన్నుతాను పరితృప్తిని గావించుకొను కార్యమున ఇమిడి కృషి సలుపును. ఎవ్వరును దైవ ప్రాకారము దాటి పోలేరు. అందుండియే దానిని చూడలేకపోవుట విచిత్రమగు అజ్ఞానము. దైవము నుండి అభివ్యక్తమగుచున్న ప్రకృతి పొరలలో దైవమునే చూచుట యథార్థమగు దర్శనము. 🍀

24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||

తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.

వివరణము : నిజమునకు మనమున్నది దైవమునందే. దైవము నందే చరించుచున్నాము. మన ముండుట యనగా దైవ ముండుటయే. ఏ దిక్కునకు పోయినను అన్ని దిక్కులయందు దైవమే యుండును. ఇట్లు దైవమునందుండి, దైవ మాధారముగ జీవుడు తన్నుతాను పరితృప్తిని గావించుకొను కార్యమున ఇమిడి కృషి సలుపును. ఎవ్వరును దైవ ప్రాకారము దాటి పోలేరు. అందుండియే దానిని చూడలేకపోవుట విచిత్రమగు అజ్ఞానము. నీటియందున్న చేప నీటిని వెదకుకొనుచున్నట్లుగ, దైవమందున్న జీవుడు దైవమును వెదకికొను చుండును.

అన్నిట, అంతట, లోపల, బయట సమస్తము నిండియున్నవాని యందుండి దైవమును గుర్తింప లేకుండుటకు కారణము దైవతత్త్యము నెరుగలేక పోవుటయే. “తత్త్యనమామ్ అభిజానంతి" తత్త్వపరముగ నన్ను తెలియ లేకున్నారు అని దైవము పలుకు చున్నాడు. కనుక దర్శన స్పర్శన భాషణాది అనుభూతులను చెందలేకున్నారు. దైవమును చూడక ఇతరములను చూచుట వలన లోకములోనికి జారిపోవుట సంభవించు చుండును. దైవము నుండి అభివ్యక్తమగుచున్న ప్రకృతి పొరలలో దైవమునే చూచుట యథార్థమగు దర్శనము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


15 Feb 2022

15 - FEBRUARY - 2022 మంగళవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 15, మంగళవారం, ఫిబ్రవరి 2022 భౌమ వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 24-2 - 322 - తత్వదర్శనము 🌹
3) 🌹. శివ మహా పురాణము - 520🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -150🌹  
5) 🌹 Osho Daily Meditations - 139🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-1🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 15, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ ఆంజనేయ స్తోత్రం - 5 🍀*

*9. సుందరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహమ్ |*
*అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలమ్*
*10. నమామి జనతావంద్యం లంకాప్రాసాదభంజనమ్ |*
*అతసీపుష్పసంకాశం దశవర్ణాత్మకం విభుమ్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పరమార్థమునకు మేధాశక్తి కంటే వివేకం ఎక్కువ సహకారి. కాబట్టి ముందు వివేకం సంపాదించు కునేందుకు యత్నించు. 🍀*

*పండుగలు మరియు పర్వదినాలు : లేవు*
🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల చతుర్దశి 21:44:55 వరకు
తదుపరి పూర్ణిమ
నక్షత్రం: పుష్యమి 13:49:41 వరకు
తదుపరి ఆశ్లేష
యోగం: సౌభాగ్య 21:18:19 వరకు
తదుపరి శోభన
కరణం: గార 09:08:42 వరకు
సూర్యోదయం: 06:42:46
సూర్యాస్తమయం: 18:17:44
వైదిక సూర్యోదయం: 06:46:24
వైదిక సూర్యాస్తమయం: 18:14:05
చంద్రోదయం: 17:12:09
చంద్రాస్తమయం: 05:47:46
సూర్య సంచార రాశి: కుంభం
చంద్ర సంచార రాశి: కర్కాటకం
వర్జ్యం: రా 3:22:20 - 5:04:00
దుర్ముహూర్తం: 09:01:45 - 09:48:05
రాహు కాలం: 15:23:59 - 16:50:51
గుళిక కాలం: 12:30:14 - 13:57:07
యమ గండం: 09:36:30 - 11:03:22
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:53
అమృత కాలం: 06:54:20 - 08:38:00
వర్ధమాన యోగం - ఉత్తమ ఫలం 13:49:41
వరకు తదుపరి ఆనంద యోగం - కార్య సిధ్ధి  

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -322 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 24-2 📚*
 
*🍀 24-2. తత్త్వదర్శనము - మన ముండుట యనగా దైవ ముండుటయే. ఏ దిక్కునకు పోయినను అన్ని దిక్కులయందు దైవమే యుండును. ఇట్లు దైవమునందుండి, దైవ మాధారముగ జీవుడు తన్నుతాను పరితృప్తిని గావించుకొను కార్యమున ఇమిడి కృషి సలుపును. ఎవ్వరును దైవ ప్రాకారము దాటి పోలేరు. అందుండియే దానిని చూడలేకపోవుట విచిత్రమగు అజ్ఞానము. దైవము నుండి అభివ్యక్తమగుచున్న ప్రకృతి పొరలలో దైవమునే చూచుట యథార్థమగు దర్శనము. 🍀*

*24. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |*
*న తు మామభిజానంతి తత్త్యనాత శ్చ్యవంతి తే ||*

*తాత్పర్యము : వివిధ దేవతా రూపములను ఆరాధనము చేయువారు తత్త్వ దర్శనము చేయజాలకున్నారు. సర్వయజ్ఞములకును ప్రభువును, భోక్తను నేనే అని తెలియలేకున్నారు. కనుక వారు జారిపోవుచున్నారు.*

*వివరణము : నిజమునకు మనమున్నది దైవమునందే. దైవము నందే చరించుచున్నాము. మన ముండుట యనగా దైవ ముండుటయే. ఏ దిక్కునకు పోయినను అన్ని దిక్కులయందు దైవమే యుండును. ఇట్లు దైవమునందుండి, దైవ మాధారముగ జీవుడు తన్నుతాను పరితృప్తిని గావించుకొను కార్యమున ఇమిడి కృషి సలుపును. ఎవ్వరును దైవ ప్రాకారము దాటి పోలేరు. అందుండియే దానిని చూడలేకపోవుట విచిత్రమగు అజ్ఞానము. నీటియందున్న చేప నీటిని వెదకుకొనుచున్నట్లుగ, దైవమందున్న జీవుడు దైవమును వెదకికొను చుండును.*

*అన్నిట, అంతట, లోపల, బయట సమస్తము నిండియున్నవాని యందుండి దైవమును గుర్తింప లేకుండుటకు కారణము దైవతత్త్యము నెరుగలేక పోవుటయే. “తత్త్యనమామ్ అభిజానంతి" తత్త్వపరముగ నన్ను తెలియ లేకున్నారు అని దైవము పలుకు చున్నాడు. కనుక దర్శన స్పర్శన భాషణాది అనుభూతులను చెందలేకున్నారు. దైవమును చూడక ఇతరములను చూచుట వలన లోకములోనికి జారిపోవుట సంభవించు చుండును. దైవము నుండి అభివ్యక్తమగుచున్న ప్రకృతి పొరలలో దైవమునే చూచుట యథార్థమగు దర్శనము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 520 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 44

*🌻. మేన యొక్క మంకు పట్టు - 6 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

హిమవత్పత్ని యగు మేన పార్వతి యొక్క ఆ మాటను విని మిక్కిలి కోపించి బిగ్గరగా ఏడ్చి ఆమె శరీరమును పట్టుకొని (61), పళ్ళను పట పట కొరుకుచూ, మిక్కిలి దుఃఖముతో మహాక్రోధముతో తన కుమార్తె యగు పార్వతిని పిడికిళ్లతో, మరియు మోచేతులతో కొట్టెను (62), ఓ మునీ! కుమారా! అక్కడ ఉన్న ఋషులు, నీవు, మరియు ఇతరులు ఆ పార్వతిని ఆమె చేతి నుండి విడిపించి అచటినుండి దూరముగా తీసుకొని పోయిరి (63). అపుడామె వారిని అనేక విధములుగా కోపించి వారికి మరల నిందావచనమును వినిపించు చున్నదై ఇట్లు పలికెను (64)

మేన ఇట్లు పలికెను -

నేను మేనను. దుష్టమగు పట్టుదల గల ఈ పార్వతిని ఏమి చేయుదునో చెప్పనా? ఈమెకు తీవ్రమగు విషమునిచ్చెదను. లేదా, నూతిలో తోసివేసెదను. సందేహము లేదు (65). లేదా, ఈ కాళిని శస్త్రములతో ముక్కలు ముక్కలు నరికివేసెదను. లేదా, నా కుమార్తె యగు ఈ పార్వతిని సముద్రములో ముంచి వేసెదను (66). లేదా, నేనే రేపటి లోపులో నిశ్చితముగా దేహత్యాగము చేసెదను. నా కుమార్తె యగు దుర్గను వికృతాకారుడగు శంభునకీయను (67). ఈ దుష్టురాలు భయంకరాకారుడగు ఎటువంటి వరుని సంపాదించినది? ఈమె నన్ను, హిమవంతుని, మరియు మా కులమును ఆపహాస్యము పాలు చేసినది (68). 

ఈతనికి తల్లి లేదు. తండ్రిలేడు, సోదరుడు లేడు, బంధువు లేడు, స్వగోత్రీకుడైననూ లేడు, అందమగు రూపము లేదు, ఇల్లు లేదు, ఏమీలేదు (69). వస్త్రము లేదు, భూషణములు లేవు, పరిచారకులెవ్వరూ లేరు. ఈయనకు వామనము లేదు, శుభకర్మలు లేవు, వయస్సు లేదు, ధనము లేదు (70). పవిత్రత లేదు, విద్యలేదు. దుఃఖమును కలిగించే ఆయన దేహము ఎట్లున్నదియో? సుమంగళయగు నా కుమార్తెను ఏమి చూసి ఈయనకు ఈయదగును? (71).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#శివమహాపురాణము #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 150 🌹*
*✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు*
*📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻. భాగవతము-అనుభూతి -1 🌻*

*కలి యుగమున కష్ట జీవనులకు కావలసినది అనుభూతి. అది భగవంతునికి సంబంధించినది. దీనిని‌‌ కొంత ఇచ్చినను, విజ్ఞానమెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు అనుభుతి నుండి విజ్ఞాన శాఖల మీదికి చెదరిపోవును.*

*పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష‌ విమర్శ అను సంకెళ్ళలో బంధింపబడుట‌ జరుగును. మరియు పొట్టపోసికొనుట, డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు ‌కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తివిధులను, ధర్మమును డబ్బు సంపాదించి తమ కోరికలు తీర్చుకొనుటకు‌ సాధనములుగనే పరిగణింతురు. డబ్బు, గృహావసరములను కర్తవ్యపాలనము, ధర్మాచరణమునకై సమన్వయింప‌ జాలరు.*

... ..✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 139 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 139. ANXIETY 🍀*

*🕉 Create a distance between you and your personality. All your problems are concerned with your personality, not with you. You don't have any problems; nobody really has any problems. All problems belong to the personality. 🕉*
 
*This is going to be the work--that whenever you feel anxiety, just remember that it belongs to the personality. You feel a strain, just remember that it belongs to the personality. You are the watcher, the witness. Create distance. Nothing else is to be done. Once the distance is there, you will suddenly see anxiety disappearing. When the distance is lost, when you have become closed again, again anxiety will arise. Anxiety is getting identified with the problems of the personality. Relaxation is not getting involved, but remaining unidentified with the problems of the personality.*

*So, for one month, watch. Whatever happens, remain far away. For example, you have a headache. Just try to be far away and watch the headache. It is happening somewhere in the body mechanism. You are standing aloof, a watcher on the hills, far away, and it is happening miles away. Just create a distance. Create space between you and the headache and go on making the space bigger and bigger. A point will come when you will suddenly see that the headache is disappearing into the distance. *

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 349-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 349-1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 77. విజయా, విమలా, వంద్యా, వందారు జనవత్సలా ।*
*వాగ్వాదినీ, వామకేశీ, వహ్నిమండల వాసినీ ॥ 77 ॥ 🍀*

*🌻 349-1. 'వందారు జనవత్సలా' 🌻* 

*నమస్కరించు జనుల యందు వాత్సల్యము కలది శ్రీమాత అని అర్థము. ఎవరైననూ నమస్కరించిన దానిని స్వీకరించువారు సహజ ముగ ప్రీతి చెందుదురు. ఇది యొక రహస్యము. ఎదుటి వ్యక్తి ప్రీతిని, వాత్సల్యమును పొందుటకు నమస్కరించుట భారతీయ సంప్రదాయము. నమస్కారము చేయువారు ఎదుటి వ్యక్తి యందలి దివ్యత్వమును గుర్తించి నమస్కరించినచో ఆ వ్యక్తిలోని దైవము ప్రీతి చెంది ఉన్ముఖు డగును.*

*అందరి జీవుల హృదయము లందు దైవము ఉపస్థితి చెంది యుండుట చేత అట్టి దైవమునకు నమస్కరించు భావన కలిగినచో దైవము యొక్క ఆనుకూల్యము హెచ్చగును. నమస్కారము భక్తికి, వినయమునకు చిహ్నము. నమస్కారము నందుకొను జీవుడెట్టి వాడైననూ నమస్కరించువారు మాత్రము ఆ జీవుని యందలి దైవమునకే నమస్కారము చేయవలెను. అపుడు చేయు నమస్కారము కేశవు డను దైవమునకు చెంది జీవులు అనుగ్రహింపబడుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 349-1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 77. Vijaya vimala vandya mandaru janavatsala*
*Vagvadini vamakeshi vahni mandala vasini ॥ 77 ॥ 🌻*

*🌻 349. Vandāru-jana-vatsalā वन्दारु-जन-वत्सला (349) 🌻*

*This can be considered as an extension of the previous nāma. She loves Her devotees like a mother who loves her children. The vibration of love is emanated through one’s body like fragrance of a flower. Because of caring and loving nature also She is known as Vimalā (nāma 347). One can notice this in daily life. When one serves food for his dog, by impulse he develops love for his dog and this is radiated through his body. The dog reads his vibrations and feels his love and wags its tail as a token of reciprocating his love.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹