🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 3 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 3 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 3 🌻*

8. అపారము అనంతము దివ్యము పరమము అయిన ఈ కేవల శూన్యత్వములో -

1. చైతన్య స్థితియు లేదు, చైతన్యరాహిత్య స్థితియు లేదు.

2. అపరిమిత అహమ్‌ లేదు (దివ్యాహమ్‌), పరిమిత అహమ్‌ లేదు.

౩. సార్వభౌమిక మనస్సు లేదు, పరిమిత మనస్సు లేదు.

4. అపారమైన శక్తి లేదు. పరిమిత శక్తి లేదు.

5. మహాకారణ శరీరము లేదు. పరిమిత దేహము లేదు.

6. విశ్వములు లేవు, లోకములు లేవు.

చైతన్యమందుగాని లేక, చైతన్యరాహిత్యస్థితి యందు గాని అసలు ఎరుకే లేదు.
ఇది - నిర్గుణ నిరాకారమును కాదు. సగుణ సాకారమును కాదు. 
అక్కడ ఉన్నదే “భగవంతుడు” చైతన్యము “లేదు”. 

9. అపారము, కేవలము (పూర్ణము) అనంత దివ్యశూన్యత్వము (మహాకాశము) అయిన
పరాత్పరస్తితిలో అన్ని గుణములు, అన్ని రూపములు, అన్ని స్పితులు, అణు ప్రమాణ చైతన్యము, అనంతముగా ఎరుకగల అనంత చైతన్యమును; అనంతముగా ఎరుకలేని అనంత చైతన్యమును, అనంత భగవల్లీలయు, తనను తాను తెలిసి కొనవలెననెడి అనంత ఆదిప్రేరణము, భగవంతుని స్వీయ అనంత స్వభావత్రయము, తదితరములు

అన్నియు అంతర్ష్నిహితములై యున్నవి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 4 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 4 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 4 🌻*

భగవంతుడు శాశ్వతముగా ఏక కాలమందే పది వేర్వేరు వాత్రలను ధరించి నిర్వహించుచున్నాడు.

అవి
1. పరబ్రహ్మ స్తితి లో భగవంతుడు. 
2. పరమాత్మ స్థితి లో భగవంతుడు. . 
3. సృష్టికర్తగానున్న భగవంతుడు. 
4. శరీరిగానున్న భగవంతుడు, . 
5. పరిణామదశలలో భగవంతుడు. 
6. మానవరూపములో పునర్జ్దన్మలు పొందుచున్న భగవంతుడు.
7. ఆధ్యాత్మిక సాధకులలో భగవంతుడు.
8. బ్రహ్మేభూతుడైన భగవంతుడు.
9. జీవన్ముక్తునిగా భగవంతుడు.
10. సద్దురువుగను, అవతార పురుషునిగను వున్న భగవంతుడు.

భగవంతుదెలప్పుడును ఉందెను
భగవంతుదెలప్పుడును ఉండును
అతడెప్పుడును నిర్వికల్పుడే
మాయాలీలయే అతని శాశ్వత ఖేల
                         —— మెహెర్‌ బాబా

భగవంతుడు =
అనంత అస్తిత్వము
అనంత జ్ఞానము
అనంత శక్తి
అనంత ఆనందము
అనంత చైతన్యము
అనంత సర్వవ్యాపకత్వము

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 5 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 5 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 5 🌻*

10. ఉండి “లేని” స్థితి (శూన్యము, ఆకాశము, అభావము)
లేకుండి “ఉన్న” స్థితి (సృష్టి) ఆభాసము.

ఉదా:-
* క్షీరములలో - పెరుగు, మజ్జిగ, వెన్న, నేయి అంతర్నిహితమై యుండి, బాహ్యమునకు లేకున్నవి.

* తంత్రిలో - శబ్దము అంతర్షిహితమై లేనట్టుగా ఉన్నది.

* చెకుముకి జాతిలో - అగ్ని అంతర్షిహితమైలేనట్టుగా ఉన్నది.

* విత్తనములో - వృక్షము అంతర్షిహితమై లేనట్టుగా ఉన్నది.

* వీర్యకణములో - సర్వాంగ సుందరమైన స్థూలశరీరము అంతర్నిహితమై
లేనట్టుగా ఉన్నది.

* గ్రామఫోను రికార్డులో - సంగీతము, వాద్యధ్వనులు అంతర్నిహితములై
లేనట్లుగా ఉన్నవి.

11. పరాత్పర స్థితిలో - సమస్తము అభావమై ఉన్నవి.

 సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 6 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 6 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 6 🌻*

12. సర్వమ్ అయిన పరాత్పర పరబ్రహ్మ స్థితిలో, లేనిస్థితి (అభావము) కూడా ఉన్నది.

13. పరాత్పర స్థితిలో - అనంతఙ్ఞానము
అనంత శక్తి
అనంత ఆనందము
అనంత వైభవము
అనంత సౌందర్యము
అంతర్నిహితమై, అభావమై యున్నవి.

14. ‘అనంత సర్వమ్’ అయిన భగవంతునికి, విరుద్ధమైన అభావము అత్యంత సూక్ష్మమై యుండవలెను.

15. పరిమిత అభావము అనంత మెట్లయ్యెను?

భగవంతుని అనంత స్వభావమైన - అనంతఙ్ఞాన శక్త్యానందములే, పరిమిత అభావమునకు అనంతత్వమును కలుగజేసినవి.

సర్వమ్ = భావము (EVERYTHING)
అభావము; = (NOTHING)
సృష్టి = ఆభాసము (Nothingness)

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 7 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 7 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 7 🌻*

16. అత్యంత పరిమితమైన అభావము అభివ్యక్తమైనప్పుడు దాని ఆవిష్కారం క్రమక్రమముగా బయటకి నిగి నిగిడి అనంతముగా వ్యాపించెను.

17. సర్వములో అంతర్నిహితమై యున్నది ఏదైనను అభావమే. సర్వములో చైతన్యం కూడా అభావమై యున్నది

భావము X అభావము
అభావము X ఆభాసము

EVERYTHING X NOTHING
NOTHING X Nothingness
శూన్యం = vacum

Notes: సృష్టి రూపమున వ్యాపాకమై ఉన్న భగవంతుని సృష్టికర్త యనియు, ఈశ్వరుడు అనియు అందురు. ఈశ్వర-శబ్దము, సందర్భము ననుసరించి 'పరమాత్మ' అనికూడా నొప్పును. ఇట్టి ఈశ్వరునకు పరుడు ఎవడు? పరమేశ్వరుడు, పరేశుడు.

పరుడు=ఆవలివాడు (God, the beyond state)
పరాత్పరుడు= పరునకు ఆవలి వాడు (God,the beyond state)
పారాత్ + పరః = పరాత్పరః
(God, The beyond beyond state)
పరుడు=ప్రకృతి మాయను దాటిన వాడు.

బ్రహ్మ=సృష్టికర్త, జగత్కర్త,ఈశ్వరుడు
పరబ్రహ్మము=సృష్టికర్తను మించిన వాడు (పరమాత్ముడు)
ఈశ్వరుడు=జగత్కర్త (Creator)
పరమేశ్వరుడు=(God, the Beyond State of Creation)

18.పరాత్పర పరబ్రహ్మస్థితి అనూహ్యమైన అనన్యమైన పరిశుద్ధ స్వరూపము. సమస్తజ్ఞానము సమస్త అంతర సత్యములు దాగియున్న పరమనిధి. 

అవాంగ్మానస గోచరమైన అవ్యక్తస్థితి. ఇది పరిమితమును గాదు, అపరిమితమును గాదు. సగుణమును కాదు, నిర్గుణమును కాదు. సాకారమును కాదు,నిరాకారమును కాదు. అనంత అగోచర స్థితి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 8 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 8 🌹
✍️. శ్రీ బాలగోపాల్ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 8 🌻*

19 . ఎవరైనను ఈ పరాత్పర పరబ్రహ్మస్థితి యొక్క అనుభూతిని పొందినచో, దానిని యితరులకు వర్ణించి చెప్పవలెనన్నచో, రెండవ స్థితి అయిన పరమాత్మ స్థితిని మాత్రమే చెప్పగలరు. ఈ పరిశుద్ధ స్వరూపమునకు తనయందు గాని, ఇతరమందు గాని స్పృహయే లేదు. పరమ నిగూఢ స్థితి.

20. భగవంతుని ప్రధాన దశావస్థలలో పరాత్పరస్థితి అనాది ఆదిమూలస్థితి. ఈ దశస్థితులలో తక్కిన 9 స్థితులును లేనప్పుడు కూడా'భగవంతుడు ఉన్నాడు'అనెడు పరాత్పరస్థితియే ఉన్నది.

21.భగవంతుని పరాత్పరస్థితియొక్క అనాద్యనంతత్వములోని అనంతత, అపారముగను, నిరవధికముగను, కేవలము గాను, అనంత దివ్యశూన్యత్వముగను (మహాకాశము) ఆవిష్కారమగుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

అద్భుత సృష్టి - 1

🌹. అద్భుత సృష్టి - 1 🌹
 ✍. DNA స్వర్ణలత గారు
📚. ప్రసాద్ భరద్వాజ

 *ఈ పుస్తకం గురించి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మాటలు*

🌟 *"అద్భుత సృష్టి"*🌟

మహాయోగిని, పిరమిడ్ మాస్టర్ "స్వర్ణలత" గారికి నా హృదయపూర్వక అభినందనలు! ఇంత గొప్ప గ్రంథం తెలుగు భాషలో రావటం చాలా అద్భుతమైన విషయం! ఎన్నో లోకాలు!
 ఎన్నో శరీరాలు
ఎన్నో చక్రాలు 
ఎంతో ఉన్నతి చెందాలి! అన్నింటికీ ఉంటాయి అర్థాలు!

 తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత!
 ప్రతి పిరమిడ్ ధ్యాని తప్పక చదవాలి!
 ఏమీ అర్థం కాకపోయినా చదవాలి!
తినగ తినగ వేము తీయగనుండును కదా! ఈ పుస్తకాన్ని తింటూనే ఉందాం!
 మరొకసారి స్వర్ణలత గారికి అభినందనలు!
             ***

*🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 1 🌻*

కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం అంటే (బిలియన్, ట్రిలియన్ సంవత్సరాలకు పూర్వం) *"మూల చైతన్యం"*( దానినే మనం 'దేవుడు లేదా ఎటర్నల్ బుద్ధా అంటాం') ఒక అమరత్వం ..తనని తాను సృష్టించుకుంది.

 🔺వ్యక్తంకాని.. 
అవ్యక్తరూపం.. శూన్యంగా ఉన్న స్థితి. ఈ స్థితి వ్యక్తం అవ్వడం ప్రారంభించింది.

🔺మొదట శూన్యంగా ఉన్న ఈ అవ్యక్త రూపం కొద్దిగా కదిలింది. ఈ కదలికనే *"ఆలోచన"* అన్నారు. ఈ ఆలోచనే మొదటి ఆలోచన. మొదటి ఆలోచన పుట్టిన స్థలం *"ఆది మానసం"*(మొదటి మనస్సు) అన్నాం. మొదటి మనస్సులో పుట్టిన మొదటి ఆలోచనే *"ఆది సంకల్పం"*.

🔺ప్రతి ఆలోచనకు ఒక *"శక్తి"* ఉంటుంది. శక్తికి ప్రకంపన ఉంటుంది.( వైబ్రేషన్) *"వైబ్రేట్"* అంటే ప్రకంపించేది లేదా కదిలేది. అలలు అలలుగా ఈ ప్రకంపనా రంగం నుండి ఒక పెద్ద విస్పోటనం సృష్టించబడింది. విస్పోటనం గావించబడిన మూల చైతన్యం నుండి *"మూల ఆత్మలు"* సృష్టించబడ్డాయి.

*సంకల్పం*=ఒక పనిని పూర్తి చేయడానికి వేసుకునే బలమైన ప్రణాళిక.

సశేషం.... 

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 23

🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 23 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 11 🌻

మోహమునకు ఒక ఉపమానం వుంది. ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది. ఎవరో కఫం వచ్చి ఉమ్మేశాడు. అది విసర్జించ బడదగినటువంటి అంశము కాబట్టి వాడు విసర్జించాడు. వీడు విసర్జించినటువంటి కఫము, శ్లేష్మము ఈగకు ఆహారముగా కనబడుతున్నది.

కనబడి ఆ శ్లేష్మము, కఫములో ఉన్నటువంటి సూక్ష్మజీవులని ఆహారంగా పుచ్చుకోవాలని ఈ ఈగ ఆ శ్లేష్మంలో ప్రవేశించింది.

ప్రవేశించేటప్పటికి ఆ శ్లేష్మానికున్నటువంటి జిగురు దాని రెక్కలకంటుకుంటుంది. అంటుకునేటప్పటికి అది ఎగరడానికి అసక్తమైపోతుంది. అసక్తమైపోయి ఆ శ్లేష్మంలోనే పడి చనిపోయింది.

ఇది మోహంలో వున్నటువంటి గొప్ప విశేషం. ధన కనక వస్తు వాహన శరీరగత వ్యామోహములన్నీ ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటకి ఎగరనివ్వలేవు. నిన్ను, నీ స్వేచ్ఛని హరిస్తాయి. నీయొక్క మానవజన్మకి సంబంధించిన స్వధర్మాచరణని చేయనివ్వవు.

కాబట్టి ఈ రకమైనటువంటి ఉపమానాన్ని వాటిల్లో వున్న దోషలక్షణాన్ని స్పష్టముగా గుర్తెరగవలసినటువంటి అవసరం వుందనమాట. ఆహా, మరల నేను ఈ రకమైనటువంటి మోహంలో చిక్కుకోబోతున్నాను.

మోహమనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అన్నారు. పెద్దలేమన్నారంటే మొహాన్ని పులితో పోల్చారనమాట. ఒకసారి పులిబారిన పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. కారణమేమిటంటే పులి అక్కడా ఇక్కడా పట్టుకోదు.

సరాసరి మెడ దగ్గరే పట్టుకుంటుంది ఏ జీవినైనా సరే. ఇక ఆ మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశము ఉండదనమాట. వీడు తప్పించుకోవడానికి గిలగిలలాడేటంత లోపలే దాని యొక్క పంజా, దాని యొక్క పళ్ళు వీడి యొక్క కంఠనరాలని తెంచేస్తాయి. తద్వారా మృత్యువుబారిన పడతాడనమాట.

కాబట్టి ఈ మొహమనేటటువంటి వ్యాఘ్రము ఎలా వుందయ్యా అంటే నీ ఆయువుని హరించివేస్తూ వుంటుంది. నిరంతరాయముగా నీ ఆయువుని హరించివేస్తుంది. కాలయాపన జరిగేటట్లుగా చేస్తుంది. నిన్ను మేలుకోనివ్వకుండా ఉండేట్లు చేస్తుంది.

నిన్ను విడిపించుకోనివ్వకుండా బంధములో ఉంచేట్లు చేస్తుంది. నిన్ను ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే అంతగా బిగుసుకుపోయేట్లుగా మార్పుచేస్తుంది. ఈ వ్యామోహం యొక్క ప్రభావం ఇది.

ఆ జన్మాంతర విశేషం అయినటువంటి వాసనాబల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై వున్నది. అటువంటి మోహము నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మజ్ఞానము అత్యావశ్యకము.

ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిచారణని పొందుతారో వాళ్ళు ఈ మొహములో నుండి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుండీ బయటపడతారు.

కాబట్టి మానవజన్మని ధన్యత చెందించుకోవాలి అంటే ఉత్తమమైన మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునకి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తూ వున్నాడు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 18 / Sri Gajanan Maharaj Life History - 18

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 18 / Sri Gajanan Maharaj Life History - 18 🌹
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻. 4వ అధ్యాయము - 3 🌻

మీరు షేగాంలో శివుని వంటివారు కాని నేను మిమ్మల్ని తెలుసుకో లేక పోయాను. నా సందేహాలన్నీ దూరమయ్యాయి. ఇప్పుడు మీరు నాకు విధించిన శిక్ష నేను సరిఅయిన మార్గానికి వచ్చేందుకు సరిపడుతుంది. నాలాంటి అనాధను ఆదుకోగలింగింది మీరే, కావున దయచేసి క్షమించండి అని జానకిరాం ఆయనతో అంటాడు. నువ్వు అబద్ధం చెపుతున్నావు, నీకూర స్వఛ్ఛంగా ఉంది, దానిలో ఏవిధమయిన పురుగులు లేవు అని శ్రీమహారాజు సమాధానం చెప్పారు. 

అంతే నిజంగానే ఆకూర స్వచ్ఛంగా, పురుగులు లేకుండా ఉంది. పురుగులన్నీ ఒక్కక్షణంలో మాయం అయిపోయాయి. అక్కడ ఉన్నవాళ్ళు ఆ అద్భుతం చూసి, శ్రీమహారాజుకు వంగి నమస్కారంచేసారు. 

చందు ముకిన్ అనే శ్రీమహారాజు భక్తుని కధ ఇప్పుడు వినండి......... వేసవికాలం, జ్యేష్ఠమాసంలో శ్రీమహారాజు చుట్టూ ఆయన భక్తులు కూర్చునిఉన్నారు. ఆయనకు వీళ్ళు పండ్లు, చక్కెరఉండలు, పూలదండలు ఇచ్చి, గంధం ఆయన శరీరానికి రాస్తూ, కొంతమంది విని కర్రతో విసురుతూ చల్లదనం ఇస్తున్నారు. 

ఆ సమయంలో శ్రీమహారాజు తనకు మామిడి పండ్లు వద్దు, కానీ చందూ ఇంట్లో మట్టికుండలో ఉంచిన రెండు కజ్జికాయలు కావాలి అంటారు.

చందూ చేతులు కట్టుకొని తన ఇంటివద్ద కజ్జికాయలు ఏమీలేవని, కానీ అవసరమయితే తాజాగా తయారుచేయిస్తాను అంటాడు. నాకు తాజావికాదు నీఇంటిలో మట్టికుండలో ఉంచిన ఆ నిలవ కజ్జికాయలే కావాలి అని శ్రీమహారాజు దానికి బదులు చెప్పారు. 

చందూ ఇంటికి వెళ్ళి శ్రీమహారాజు అన్నవిషయం భార్యకు చెపుతాడు. ఒక నెలక్రితం అక్షయతిదియ నాడు కజ్జికాయలు తయారు చేసాము, మరియు అన్నీ ఆరోజే పూర్తి అయిపోయాయి. ఒకవేళ ఏమయినా మిగిలి ఉంటే ఈసరికి గట్టిపడి పాడయిపోయి ఉంటాయి అని అతని భార్య అంది. 

శ్రీమహారాజు కోసం తాజా కజ్జికాయలు చేసేందుకు తన సుముఖత తెలుపుతుంది. శ్రీమహారాజుకు ఆనిలవ ఉన్నవే కావాలిట కాని తాజావివద్దుట, సరిగ్గా గుర్తు చేసుకో, ఎందుకంటే శ్రీమహారాజు అబద్ధం చెప్పలేరు అని చందూ ఆంటాడు. 

కొద్దిసేపు ఆలోచించిన తరువాత శ్రీమహారాజు చెప్పినదినజమేనని ఆమెకు మెరుపులాగ జ్ఞాపకంవచ్చింది. మట్టికుండలో నిజంగానే 2 కజ్జికాయలు దాచిఉంచిన విషయం ఆమెకు గుర్తువచ్చింది. అవి తీసి ఆమె చందూకు ఇచ్చింది. ఆశ్ఛర్యం ఏమిటంటే అవి గట్టిపడలేదు, పాడవనూలేదు. 

అది చూసి ఇద్దరూ సంతోషపడ్డారు. వెనక్కి వెళ్ళి శ్రీమహారాజుకు ఆ కజ్జికాయలు చందూ సమర్పించాడు. శ్రీమహారాజు యొక్క దివ్యశక్తికి అందరూ ఆశ్చర్య పోయారు. శ్రీరాముడు శబరి ఇచ్చిన పండ్లు సంతోషంగా స్వీకరించిన విధంగా శ్రీగజానన్ ఆ కజ్జికాయలు తిన్నారు.

మాధవ్ అనే బ్రాహ్మణుడు షేగాం దగ్గర చించోలి లో ఉండేవాడు. అతను 60 ఏళ్ళు పైనఉండి బలహీనంగా ఉన్నాడు. అన్ని భోగ భాగ్యాలతో యుక్తవయస్సు అంతా గడిపాడు. ఎవరి అదృష్టాన్ని మార్చడం సఖ్యంకాదు. భార్య, పిల్లలు పోయి మాధవ్ ఈప్రపంచంలో ఒంటరిగా మిగిలాడు. 

జీవితం మీద విరక్తి కలిగి, అన్ని వస్తువులు అమ్మివేసి, ఈ భోగ భాగ్యాలలో పడి భగవంతుడిని ఎప్పుడూ తలుచుకోలేదు అని అతను చింతించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 18 🌹 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

🌻 Chapter 4 - part 3 🌻

You are Lord Shiva in Shegaon and I did not recognize You. Now I am free from all doubts, and whatever punishment is given to me today should be enough to improve me. You are the protector of orphans like me, so kindly pardon me. Shri Gajanan Maharaj replied, You are telling a lie. Your curry is fine and there are no worms in it. 

And really the curry was clean and fine. All the worms had disappeared in a moment! The people around, saw the miracle and bowed before Shri Gajanan Maharaj. Now listen to the story of Chandu Mukin, a devotee of Shri Gajanan Maharaj. In the month of Jeshta in summer all the devotees were sitting around Shri Gajanan Maharaj . 

They were offering Him fruits, sugar balls, garlands, applying sandalwood paste to his body were cooling air by hand fans. At that time Shri Gajanan Maharaj said that He did not want mangoes or fruits but two Kanholes that were kept in the earthen pitcher at Chandu’s House. 

Chandu, with folded hands said that there were no Kanholes at his house, but would get prepared fresh if necessary. Maharaj replied that He did not want fresh Kanholes, but only those stale ones that were lying in the earthen pitcher at his house. 

Chandu went home and told his wife what Shri Gajanan Maharaj had said. His wife said that the Kanholes were prepared a month ago on Akshaya Tritiya day and were all consumed the same day, and if at all some were left, they must be stale and hard by this time. 

She however, showed her readiness to prepare fresh Kanholes for Shri Gajanan Maharaj . But Chandu replied that Maharaj wanted only the stale ones and not fresh ones. He asked her to remember where she kept them since Swamiji could not lie. 

She paused and immediately remembered that what Swamiji had said was, in fact, correct. She remembered that two Kanholes were really kept by her in the earthen pitcher.

She took out the Kanholes and gave them to Chandu; the wonder was that they had not hardened or dried at all. Looking to it they both were happy. Chandu went back and offered the Kanholes to Shri Gajanan Maharaj . All were surprised at the divine knowledge of Shri Gajanan Maharaj . Shri Gajanan happily ate the Kanholes as fruits offered by Shabari to Shri Ram.

At Chincholi, a town near Shegaon, there was a Brahmin by the name of Madhao. He was over sixty years old and was very weak. 

He passed his youth in attaining material pleasure only. It is not possible to change ones fate. Madhao lost all his children and wife and was left alone in this world at an old age. He lost all interest in life, sold out all his possessions and regretted that while in material pursuits he never remembered the Almighty God. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹

శివగీత - 26 / The Siva-Gita - 26

🌹. శివగీత - 26 / The Siva-Gita - 26 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
🌻. శివ ప్రాదుర్భావము - 2 🌻

అధ జాతో మహా నాదః ప్రళయాం బుధీ భీషణః,
సముద్ర మధనో ద్భూత మంద రావనిబృ ద్ధ్వని: 11

రుద్ర బాణాగ్ని సందీప్త బృశత్త్రి పుర విభ్రమః,
తమా కర్ణ్యాధ సంభ్రాం తో యావత్పశ్యతి పుష్కరమ్ 12

తరువాత ఒక దినమున ప్రళయ కాలపు మహా సముద్రపు సవ్వడి వలె మరియు సాగర మధన సమయంబున బొడ మిన మందర పర్వత స్వనము వలె, మరియు త్రిపుర సంహార కాలమున రుద్ర బాణాగ్ని ధ్వనిం బోలిన అతి భీషణం బైన ధ్వని వినబడగా

భయ భ్రాంతితో ఎదుట వీక్షింపగా.

తావ దేవ మహా తేజో రామస్యా సీత్ర పురో ద్విజాః,
తేజసా తేన సంభ్రాం తో నా పశ్యత్ప దిశో దశ 13

అంది కృ తేక్షణ స్తూర్ణం మోహం యాతో నృ పాత్మజః,
విచింత్య తర్కయా మాస దైత్య మాయాం ద్విజేశ్వరాః 14

ఒక మహా తేజస్సు గోచరించెను. అది చూచి సంభ్రాంత మనస్సు చేత శ్రీ రాముడు దశ దిశల గలయ చూచెను. అట్టి మహా తేజశ్శక్తి ప్రభావమున దృష్టి గాన రానివాడై ఒక్కతృటి కాలము మిగుల మొహు గలవాడై మొదట దానవుల మాయగా దలచెను.

అధో త్దాయ మహావీర - స్సజ్యం కృత్వా ధను స్స్వకమ్,
ఆ విద్య న్ని శితైర్బాణై - ర్ది వ్యాస్త్రై రాభి మంత్రితై: 15

ఆగ్నేయం వారుణం సౌమ్యం - మోహనం సౌర పార్వతమ్,
విష్ణు చక్రం మహా చక్రం - కాల చక్రం చ వైష్ణవమ్ 16

పిదప లేచి తన కోదండమును బాణములతో సంధింప చేసి ఆగ్నేయము - వారుణము - మోహన - పాశుపత సౌమ్యం విష్ణు చక్రం, మహాచక్రం - కాలచక్రం వైష్ణవమ్ - రౌద్రం – బ్రాహ్మం -కౌబేరం- కులిశం - అనిలం - భార్గవం మున్నగు అనేకాస్త్రములను అభి మంత్రించి రాముడు ప్రయోగించెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 26 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 04 :
🌻 Shiva Praadurbhaavam - 2 🌻

One fine day Rama heard a terrible and fear striking sound which resembled the roars of oceans as made during the time of cosmic dissolution, which resembled the sound made by the mount Mandara during the churning of ocean, which resembled the terrible sound made by the arrow of Rudra when shot while destroying the three cities.

Hearing that fear striking terrible noise Rama looked around startled with fear.

Rama beheld a huge brilliance spread all around. Seeing that in a confused state Rama looked around in all directions. Due to that high intensity brilliance for a second Rama felt as if he went blind and couldn't see anything apart from light.

He thought all that was probably the illusion of some demons.

Thereafter Rama stood up holding his Kodanda bow in his hands, and projected in the air many divine missiles (arrows) through the power of Mantra viz.

Agneyam, Varunam, Mohanam, saurapaarvatam, viShnuchakraM, mahaachakram, kaalachakram, vaiShnavam, raudram, paashupatam, braahmam, kauberam, and kulishaanilam weapons.
🌹 🌹 🌹 🌹 🌹

9-August-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 453 / Bhagavad-Gita - 453🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 241 / Sripada Srivallabha Charithamrutham - 241 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 143 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 57 / Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 60 🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 28🌹
8) 🌹. శివగీత - 26 / The Shiva-Gita - 26 🌹
9) 🌹. సౌందర్య లహరి - 68 / Soundarya Lahari - 68🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367🌹

11) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 80 🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 69 🌹
13) 🌹. అద్భుత సృష్టి - 1🌹
14) 🌹 Seeds Of Consciousness - 145 🌹
15)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 29🌹
16) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 23🌹
17) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 8 🌹
18)

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 453 / Bhagavad-Gita - 453 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -10 🌴*

10. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||

🌷. తాత్పర్యం : 
భక్తియోగ నియమములను కూడా నీవు అభ్యసింపజాలనిచో నా కొరకు కర్మ నొనరించుటకు యత్నింపుము. ఏలయన నా కొరకు కర్మచేయుట ద్వారా నీవు పూర్ణశక్తిని పొందగలవు.

🌷. భాష్యము :
భక్తియోగమునందలి నియమములను సైతము విధిగా గురువు నిర్దేశమునందు పాటింపలేనివాడు భగవానుని కొరకు కర్మ చేయట ద్వారా ఈ పూర్ణత్వస్థితిని చేరగలడు. ఆ కర్మను ఏ విధముగా నొనరింపవలెనో ఏకాదశాధ్యాయపు ఏబదిఐదవ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అనగా మనుజుడు కృష్ణచైతన్య ప్రచారోద్యమము సాగించు భక్తులకు సహాయము చేయవచ్చును. 

భక్తియోగనియమములను ప్రత్యక్షముగా అభ్యసింపలేకపోయినను మనుజుడు ఇట్టి ప్రచారకార్యక్రమమునకు సహాయము నందింపవచ్చును. లోకములో ప్రతికార్యక్రమమునకు కొంత స్థలము, పెట్టుబడి, వ్యవస్థ, పరిశ్రమ లనునని అవసరములు. 

ఏదేని వ్యాపారమునకు స్థలము, పెట్టుబడి, పరిశ్రమ మరియు దానిని నడుపుటకు వ్యవస్థ అవసరమైనట్లే, కృష్ణుని సేవకొరకు కూడా ఇవన్నియు అవసరములై యున్నవి. కాని ఆ రెండు కర్మలలో భేదమేమనగా భౌతికస్థితిలో కర్మ స్వీయప్రీతికై ఒనరింపబడగా, రెండవదానిలో అది కృష్ణుని ప్రీత్యర్థమై ఒనరింపబడును. అట్లు కృష్ణప్రీత్యర్థమై ఒనరింపబడునదే ఆధ్యాత్మిక కర్మము. 

ఎవరైనను ధనమును అధికముగా కలిగియున్నచో కృష్ణభక్తుని ప్రచారము చేయుటకు కార్యాలయముగాని, మందిరమునుగాని నిర్మింపవచ్చును లేదా కృష్ణసంబంధవిజ్ఞానము ముద్రించుటలో తోడ్పడవచ్చును. ఈ విధమైన కృష్ణపరకర్మలు పలుగలవు. మనుజుడు అట్టి కర్మల యందు అనురక్తుడు కావలెను. 

ఒకవేళ మనుజుడు తన కర్మల ఫలముగా లభించినదానిని సంపూర్ణముగా త్యాగము చేయలేకున్నచో దాని యందు కొంతశాతమునైనను కృష్ణభక్తి ప్రచారమునకై దానము చేయవచ్చును. 

ఈ విధముగా కృష్ణచైతన్యోద్యమ ప్రచారము స్వచ్ఛందముగా చేయబడు సేవ మనుజుని క్రమముగా అత్యున్నతమైన భగవత్ప్రేమస్థాయికి గొనిపోవును. అంతట అతడు పరిపూర్ణుడు కాగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 453 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 12 - Devotional Service - 10 🌴*

10. abhyāse ’py asamartho ’si
mat-karma-paramo bhava
mad-artham api karmāṇi
kurvan siddhim avāpsyasi

🌷 Translation : 
If you cannot practice the regulations of bhakti-yoga, then just try to work for Me, because by working for Me you will come to the perfect stage.

🌹 Purport :
One who is not able even to practice the regulative principles of bhakti-yoga, under the guidance of a spiritual master, can still be drawn to this perfectional stage by working for the Supreme Lord. How to do this work has already been explained in the fifty-fifth verse of the Eleventh Chapter. 

One should be sympathetic to the propagation of Kṛṣṇa consciousness. There are many devotees who are engaged in the propagation of Kṛṣṇa consciousness, and they require help. 

So, even if one cannot directly practice the regulative principles of bhakti-yoga, he can try to help such work. Every endeavor requires land, capital, organization and labor. 

Just as in business one requires a place to stay, some capital to use, some labor and some organization to expand, so the same is required in the service of Kṛṣṇa. The only difference is that in materialism one works for sense gratification. 

The same work, however, can be performed for the satisfaction of Kṛṣṇa, and that is spiritual activity. If one has sufficient money, he can help in building an office or temple for propagating Kṛṣṇa consciousness. Or he can help with publications. 

There are various fields of activity, and one should be interested in such activities. If one cannot sacrifice the results of his activities, the same person can still sacrifice some percentage to propagate Kṛṣṇa consciousness. 

This voluntary service to the cause of Kṛṣṇa consciousness will help one to rise to a higher state of love for God, whereupon one becomes perfect.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 241 / Sripada Srivallabha Charithamrutham - 241 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ 

అధ్యాయం 50
*🌻. ప్రభునామస్మరణం - భవభయహరణం 🌻*

*🌻. నామ కీర్తన - మహిమ 🌻*

ఒకనాడు కడుపు నెప్పితో విలవిలలాడుతూ ఆ నెప్పిని భరించడం కంటె ఆత్మహత్యే మేలు అనే స్థితిలో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చారు. 

“నీవు పూర్వ జన్మలో ఎందరినో విషతుల్య వాగ్బాణాలతో, సూటి పోటి మాటలతోను హింసించావు. దాని ఫలితంగానే నీకు ఈ వ్యాధి సంక్రమించింది. కలియుగంలో భగవంతుని నామ స్మరణమే వాగ్దోషాలను పోగొట్టే సాధనం," అని శ్రీపాదులు వారితో చెప్పారు. 

శ్రీచరణుల ఆదేశ ప్రకారం కురుంగడ్డలో మూడు రాత్రులు, మూడు పగళ్ళు 'శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా!' అనే నామ కీర్తన చేసాము. ఆ మూడు రాత్రులు నన్ను కురుంగడ్డలో ఉండటానికి అనుమతి ఇచ్చారు. ఆ వృద్ధుని కడుపునెప్పి తగ్గింది.

 *🌻. వాయుయఙ్ఞం 🌻*

భగవన్నామ స్మరణమే వాయు యఙ్ఞమని వివరిస్తూ శ్రీపాదులు ఇలా అన్నారు, " ఈనాడు వాయుమండలం అంతా తప్పుడుగా మాట్లాడబడే మాటలతో కలుషితమై ఉంది.

 మానవుడు ఒక మాటని పలికేటప్పుడు ప్రకృతిలోని సత్త్వ, రజస్తమో గుణాలలో ఒకటిగాని, రెండు కాని లేదా మూడూ కాని రెచ్చగొట్టబడి అవి మంచికి దోహదం కలిగించ లేని కారణాన పంచభూతాలను అపవిత్రం చేస్తున్నాయి. 

తద్వారా మానవుని శరీరం, మనసు, అంతరాత్మ, బుద్ధి, మేధ కల్మష భూయిష్టమై పాపకర్మలు చేస్తున్నాడు. తత్ఫలితముగ నానా రకాల కష్టాలను అనుభవిస్తున్నాడు. ఇది కార్య కారణాలనుండి ఉద్భవించే కర్మఫల విష వలయం. 

దీనినుండి విముక్తుడు అవడానికి మానవుడు 'త్రికరణ శుద్ధిగా ఉండాలి, అంటే మనస్సులో తలచిందే మాటల్లో రావాలి, మాటల్లో వచ్చిందే కర్మలో ఆచరించాలి. ఇటువంటి వ్యక్తి మహనీయుడైతే, దీనికి పూర్తి విరుద్ధంగా నడిచేవాడు 'దురాత్ముడు'. 

భగవన్నామ స్మరణతో వాయు మండలం పరిశుద్ధం అవడమే కాకుండా ఆ దివ్య నామం ఎప్పుడూ నాలుకపై నాట్యమాడటం వల్ల పవిత్రమైన మాటలు మాట్లాడటం అలవాటు అవుతుంది. మనసు భగవంతుని మీద లగ్నం అవడంవల్ల మనస్సు కూడా పవిత్రమై తద్వారా పవిత్ర కర్మలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.. కలియుగంలో దైవనామ స్మరణే ముక్తి దాయకం. 

మానవుడు ఏ పనిలో నిమగ్నుడై ఉన్నప్పటికి మనసులో నామ సంకీర్తన నిరంతరం జరుగుతూ ఉండాలి. ఈ విధంగా వాయుమండలాన్ని పరిశుద్ధం చేసే యఙ్ఞమే వాయు యఙ్ఞం.
 మన రోగాలే మన పాపాలు/మన పాపాలే మన రోగాలు

ఒకసారి క్షయ, మధుమేహ, మరికొన్ని యితర వ్యాధులతో బాధపడుతున్న ఒక వ్యక్తి కురువపురానికి వచ్చారు. 

ఆయనను చూడగానే ప్రభువులు కోపగించుకొని, "ఇతడు పూర్వ జన్మలో గజదొంగ. ఎందరో అమాయకుల సొమ్ము దొంగిలించి వాళ్ళకు కష్టాలు కలిగించాడు. కుమార్తె వివాహం కోసం ఎంతో కష్టపడి కూడబెట్టిన ఒక తండ్రి ధనం దొంగిలించి ఆ యువతి అకాల మృత్యువుకి కారణం అయినాడు," అని అతడి గురించి చెప్పారు. 

తరువాత ఆ వ్యాధి పీడితుని దీనాలాపాలకు కరుణించి పంచదేవపహాడ్ దర్బార్ లోని గోశాలలో పడుకోమని ఆదేశం ఇచ్చారు. అతనికి మంచినీళ్ళు కూడా ఇవ్వవద్దని నిషేధించారు.

 ఆ రాత్రికి ఆతని కలలో రాక్షసులు కన్పించి పీక నొక్కు తున్నట్లు కొంతసేపు, చాతీపై పెద్ద రాతిబండ పెట్టి దానిపై ఒక బలిష్ఠుడైన పహిల్వాను కూర్చున్నట్లు మరికొంతసేపు కనిపించి విపరీతమైన బాధకు గురి అయ్యాడు. 

దీనితో అతను కర్మ విముక్తిని పొంది స్వస్థుడు అయ్యాడు. భౌతికంగా అనేక సంవత్సరాలు పడవలసిన బాధను మహా ప్రభువులు కొద్ది క్షణాలు మానసికంగా అనుభవింపచేసి అతన్ని కర్మవిముక్తుణ్ణి, ఆరోగ్య వంతుణ్ణి చేసారు.

శ్రీపాద రాజం శరణం ప్రపద్యే

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 241 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 26
*🌻 Kanayaka Puranam - 3 🌻*

Sripada Srivallabha will leave his ‘yathi’ form and manifest as Padmavathi Venkateswara. Sri Padmavathi will be born in Simhala desam, Sri Prabhu will be born in Shambala village.  

At the end of Kaliyugam, their marriage will happen. Sri Kalki Prabhu will come to Brihat Sila Nagaram. ‘I’ in the form of Vasavee Kanyaka, my Prabhu in the form of Nagareswar will bring Sripada Srivallabha with honours. I also will tie ‘raksha bandhan’ to my brother as a token of love.  

With affection on me, My brother, will give divine ornaments, vajras, vydhuryas and divine royal clothes and perform our marriage grandly. Our divine marriage will be witnessed by the couple belonging to 102 gothras who entered Agni kundam with me.  

After that, we, the newly married couple will come to Peethikapuram. That Maha Prabhu who is in Kalki form will give darshan in the form of his previous avathar Sripada Srivallabha, in the midst of thousands of devotees.  

My Dear! Silada! When our marriage happens, along with Kalki Prabhu, you also will take part as my brother in the marriage celebrations and be blessed.’ 

My Dear! on the western side of this tributary Kingdom with capital Brihit Sila Nagaram, Gosthani river is there as one boundary. On the southern side, there is Antharvedi. Godavari river is there on East and North. In Kusuma Shresti’s house, there is a metallic hand and metallic hand bell for giving ‘mangala harathi’.  

Together they weigh 16½ veesas (1 veesa is equal to 120 tolas). Similarly, in the house of Bhaskaracharya also there are metallic hand and a hand bell used for giving mangala harathi. They also weigh 16½ veesas together.  

This metallic hand and hand bell present in Bhaskaracharya’s house will reach Peethikapuram after my Maha Samsthan is established and remain many feet deep under the Oudumbar tree near our Murthis. After they reach, my Charithamrutham will come into light.   

My Dear! Tomorrow is the birth day of Sri Vasavi Kanyaka. Moreover it is Friday. According to the calculations in sandra sindhu vedam, it is highly sacred time. You build one small house with dry grass in that place called Pancha Deva Parvatham.  

You go immediately. All the things required will be arranged. Tomorrow I will do ‘darbar’ there. Woman seeking the fortune of ‘mangalyam’ will certainly have to take the ‘pasupu kommu’ (turmeric tuber) distributed there.  

The fortune of ‘mangalyam’ will be granted to them, who keep it in the puja mandir. Tomorrow I will narrate the story of Sri Kanyaka Parameswari in totality. All my devotees who come to Pancha Deva Pahad tomorrow will be blessed.  

It is due to the merit of many births of yours, you will be able to hear the incidents of the most sacred Vasavee Kanyaka avathar from me. From now, I will do darbar on every Friday. It can be at Kurungadda or Pancha Dev Pahad or at any other place according to My convenience.  

Every Thursday, dharma will be taught. It can be at Kurungadda or Panchadeva Pahad. Many changes are going to come in future. In the coming centuries, Bharata Desam will come under the rule of Mlecchas and white people. The ways of fate are wonderful.  

Only by the flow of spiritual power, liberation will come to this karma bhumi and vedabhumi. If Datta is not forgotten, Datta will not forget. Forgetfulness is like death. Rememberance will give new birth. 

End of Chapter 26

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 121 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. లోకోద్ధరణము- వ్యక్తి ఉద్ధరణము 🌻*

అనంతసృష్టిలో జీవుడు అణువు మాత్రమే. అంతర్యామి యొక్క శక్తియే అణువు ద్వారా పనిచేసేది. ఇది గుర్తించి. 

తనను తాను సమర్పించుకొన్న వానికి తన ద్వారా జరుగు లోకహితము యొక్క ఫలము తనకు అందాలని అనిపించదు. గుర్తింపుతో అతనికి ప‌నిలేదు. వీనిని తలచువానికి అంతర్యామితో, సద్గురువుతో అనుసంధానము తెగిపోవును. 

తన ద్వారా అన్న వస్త్రాది లౌకికములయిన ప్రయోజనములు గాని, విజ్ఞానము కాని అందుకొన్నవాడెట్లును తనను క్రమముగా గౌరవించుట నేర్చికొనును‌ అట్లు అతనిని అంతర్యామి ప్రేరేపించును. అతనిలో దివ్యత్వము యొక్క మేలుకొలుపునకు అది నాంది. 

కాని వారిచ్చు ఆ గౌరవాన్ని, మన్ననను స్వప్రయోజనముకై వ్యయం చేసే సాధకుడు అఖండ దివ్యానందమనే పరమపదాన్ని అందుకోలేడు. గౌరవాదరాలు కూడ తగ్గే సరికి, ఇక తనమేలును మరచినట్లు భ్రాంతి కలిగి, చిరాకు, చికాకు, కోపము, అవమానము, దుఃఖములకు గురియగుట జరుగును. 

తన వద్దకు వచ్చిన వారిపై ఉద్వేగపడుటతో, స్వస్థత చెడును. తన ద్వారా మేలు పొందదగువారు ఆ మేలు వారి కర్మఫలముగా దైవము విధించగా, వేరొకరిని చేరుదురు. 

ఇంతకును తేలినదేమనగా లోక హితార్ధ కర్మాచరణము తన ఉద్ధరణకే. దివ్యత్వమనెడి ప్రేమ సాగరమున చినుకే తాను. ఆ సాగరముగా తానగుటయే తన ఆచరణ యొక్క లక్ష్యము. 

ఇతరులెల్లరు పవిత్రులు కావలెననియు, తానెట్లును పవిత్రుడనే కాన సుఖపడవలెను అని అనుకొనిన దానవుడు అగును. తాను పవిత్రుడుగావలెననియు, ఇతరులెల్లరు సుఖపడవలెననియు గోరువాడు దివ్యుడగును. 

ఇతరుల యందు రజస్తమో దోషములు వెదుకుట వలన, ఆ దోషములు తన యందు విజృంభించును. ఇతరుల యందు 'తనను' దర్శించి ప్రేమలో కరిగినపుడు పరమపవిత్రుడగును. శుద్ధ సత్వమయుడగును‌ అనుదినము ఇట్టి పవిత్రత వైపు సాగిపోవుటకై ఆత్మ శోధన సాధకుని కర్తవ్యము..
..✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 𝕋𝕙𝕖 𝕄𝕒𝕤𝕥𝕖𝕣𝕤 𝕠𝕗 𝕎𝕚𝕤𝕕𝕠𝕞 - 𝕋𝕙𝕖 𝕁𝕠𝕦𝕣𝕟𝕖𝕪 𝕀𝕟𝕤𝕚𝕕𝕖 - 143 🌹*
*🌴 𝔻𝕖𝕒𝕝𝕚𝕟𝕘 𝕨𝕚𝕥𝕙 𝕆𝕓𝕤𝕥𝕒𝕔𝕝𝕖𝕤 - 5 🌴*
✍️ 𝕄𝕒𝕤𝕥𝕖𝕣 𝔼. 𝕂𝕣𝕚𝕤𝕙𝕟𝕒𝕞𝕒𝕔𝕙𝕒𝕣𝕪𝕒
📚 . ℙ𝕣𝕒𝕤𝕒𝕕 𝔹𝕙𝕒𝕣𝕒𝕕𝕨𝕒𝕛

*🌻 𝕄𝕒𝕤𝕥𝕖𝕣𝕚𝕟𝕘 𝕥𝕙𝕖 𝕊𝕥𝕠𝕣𝕞 🌻*

𝑶𝒖𝒓 𝒑𝒆𝒓𝒔𝒐𝒏𝒂𝒍𝒊𝒕𝒚 𝒄𝒂𝒏 𝒅𝒓𝒂𝒈 𝒖𝒔 𝒊𝒏𝒕𝒐 𝒊𝒍𝒍𝒖𝒔𝒊𝒐𝒏𝒔, 𝒂𝒏𝒅 𝒘𝒆 𝒄𝒂𝒏 𝒈𝒆𝒕 𝒄𝒂𝒖𝒈𝒉𝒕 𝒃𝒚 𝒐𝒖𝒓 𝒊𝒅𝒆𝒂𝒔 𝒂𝒏𝒅 𝒄𝒐𝒏𝒄𝒆𝒑𝒕𝒔. 𝑻𝒉𝒖𝒔 𝒊𝒏 𝒐𝒖𝒓 𝒊𝒏𝒏𝒆𝒓 𝒂 𝒔𝒕𝒐𝒓𝒎 𝒎𝒂𝒚 𝒄𝒐𝒎𝒆 𝒂𝒃𝒐𝒖𝒕, 𝒂 𝒇𝒊𝒈𝒉𝒕 𝒃𝒆𝒕𝒘𝒆𝒆𝒏 𝒍𝒊𝒈𝒉𝒕 𝒂𝒏𝒅 𝒔𝒉𝒂𝒅𝒐𝒘, 𝒊𝒏 𝒘𝒉𝒊𝒄𝒉 𝒘𝒆 𝒄𝒂𝒏 𝒆𝒂𝒔𝒊𝒍𝒚 𝒇𝒆𝒆𝒍 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒍𝒐𝒔𝒕. 

𝑾𝒉𝒆𝒏 𝒘𝒆 𝒘𝒂𝒏𝒕 𝒕𝒐 𝒑𝒓𝒐𝒈𝒓𝒆𝒔𝒔 𝒊𝒏 𝒔𝒑𝒊𝒕𝒆 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒔𝒕𝒐𝒓𝒎, 𝒘𝒆 𝒘𝒊𝒍𝒍 𝒂𝒍𝒔𝒐 𝒈𝒆𝒕 𝒕𝒐 𝒇𝒆𝒆𝒍 𝒕𝒉𝒆 𝒔𝒕𝒐𝒓𝒎 𝒇𝒓𝒐𝒎 𝒐𝒖𝒕𝒔𝒊𝒅𝒆: 𝒅𝒊𝒇𝒇𝒆𝒓𝒆𝒏𝒄𝒆𝒔 𝒊𝒏 𝒕𝒉𝒆 𝒇𝒂𝒎𝒊𝒍𝒚 𝒐𝒓 𝒔𝒐𝒄𝒊𝒂𝒍 𝒐𝒃𝒍𝒊𝒈𝒂𝒕𝒊𝒐𝒏𝒔 𝒌𝒆𝒆𝒑 𝒖𝒔 𝒂𝒘𝒂𝒚 𝒇𝒓𝒐𝒎 𝒘𝒉𝒂𝒕 𝒘𝒆 𝒂𝒔 𝒔𝒐𝒖𝒍𝒔 𝒘𝒐𝒖𝒍𝒅 𝒍𝒊𝒌𝒆 𝒕𝒐 𝒅𝒐. 𝑾𝒉𝒆𝒏 𝒔𝒐𝒄𝒊𝒂𝒍 𝒂𝒄𝒕𝒊𝒗𝒊𝒕𝒊𝒆𝒔 𝒂𝒓𝒆 𝒄𝒐𝒏𝒔𝒕𝒂𝒏𝒕𝒍𝒚 𝒅𝒆𝒎𝒂𝒏𝒅𝒊𝒏𝒈 𝒖𝒔, 𝒘𝒆 𝒇𝒊𝒏𝒅 𝒏𝒐 𝒍𝒐𝒏𝒈𝒆𝒓 𝒆𝒏𝒐𝒖𝒈𝒉 𝒕𝒊𝒎𝒆 𝒕𝒐 𝒅𝒆𝒗𝒐𝒕𝒆 𝒐𝒖𝒓𝒔𝒆𝒍𝒗𝒆𝒔 𝒕𝒐 𝒐𝒖𝒓 𝒆𝒙𝒆𝒓𝒄𝒊𝒔𝒆𝒔. 

𝑶𝒖𝒓 𝒄𝒐𝒏𝒄𝒆𝒑𝒕𝒔 𝒐𝒇 𝒐𝒖𝒓 𝒓𝒆𝒑𝒖𝒕𝒂𝒕𝒊𝒐𝒏 𝒂𝒏𝒅 𝒑𝒓𝒆𝒔𝒕𝒊𝒈𝒆, 𝒐𝒇 𝒇𝒂𝒎𝒊𝒍𝒚 𝒐𝒓 𝒑𝒓𝒐𝒇𝒆𝒔𝒔𝒊𝒐𝒏 𝒄𝒂𝒏 𝒃𝒆𝒄𝒐𝒎𝒆 𝒂𝒏 𝒊𝒎𝒑𝒆𝒅𝒊𝒎𝒆𝒏𝒕. 𝑾𝒆 𝒔𝒉𝒐𝒖𝒍𝒅𝒏’𝒕 𝒈𝒆𝒕 𝒔𝒕𝒖𝒄𝒌 𝒊𝒏 𝒐𝒖𝒓 𝒐𝒘𝒏 𝒄𝒐𝒏𝒄𝒆𝒑𝒕𝒔, 𝒃𝒖𝒕 𝒄𝒍𝒆𝒂𝒓 𝒕𝒉𝒆 𝒉𝒊𝒏𝒅𝒓𝒂𝒏𝒄𝒆𝒔 𝒐𝒇 𝒕𝒉𝒆 𝒄𝒐𝒏𝒄𝒆𝒑𝒕𝒔 𝒘𝒆 𝒉𝒂𝒗𝒆 𝒄𝒓𝒆𝒂𝒕𝒆𝒅. 

𝑴𝒂𝒔𝒕𝒆𝒓 𝑪𝑽𝑽 𝒔𝒂𝒊𝒅: “𝑩𝒆 𝒎𝒐𝒅𝒆𝒔𝒕 𝒊𝒏 𝒂𝒍𝒍 𝒚𝒐𝒖 𝒅𝒐”, 𝒂𝒏𝒅 𝒆𝒎𝒑𝒉𝒂𝒔𝒊𝒔𝒆𝒅 𝒂 𝒉𝒆𝒂𝒍𝒕𝒉𝒚 𝒈𝒓𝒐𝒘𝒕𝒉 𝒐𝒇 𝒎𝒂𝒏 𝒊𝒏 𝒓𝒆𝒈𝒂𝒓𝒅 𝒕𝒐 𝒇𝒂𝒎𝒊𝒍𝒚, 𝒆𝒄𝒐𝒏𝒐𝒎𝒚 𝒂𝒏𝒅 𝒔𝒐𝒄𝒊𝒆𝒕𝒚.

𝑺𝒐𝒄𝒊𝒆𝒕𝒚 𝒊𝒔 𝒂𝒍𝒔𝒐 𝒄𝒂𝒍𝒍𝒆𝒅 𝒕𝒉𝒆 “𝒃𝒊𝒈𝒈𝒆𝒓 𝒑𝒆𝒓𝒔𝒐𝒏𝒂𝒍𝒊𝒕𝒚”. 𝑾𝒉𝒆𝒏𝒆𝒗𝒆𝒓 𝒔𝒐𝒎𝒆𝒃𝒐𝒅𝒚 𝒘𝒂𝒏𝒕𝒔 𝒕𝒐 𝒑𝒖𝒕 𝒕𝒉𝒊𝒏𝒈𝒔 𝒔𝒕𝒓𝒂𝒊𝒈𝒉𝒕 𝒊𝒏 𝒔𝒐𝒄𝒊𝒆𝒕𝒚, 𝒉𝒆 𝒂𝒍𝒔𝒐 𝒆𝒗𝒐𝒌𝒆𝒔 𝒐𝒑𝒑𝒐𝒔𝒊𝒕𝒊𝒐𝒏 𝒕𝒓𝒚𝒊𝒏𝒈 𝒕𝒐 𝒅𝒊𝒔𝒄𝒐𝒖𝒓𝒂𝒈𝒆 𝒉𝒊𝒎. 

𝑰𝒏𝒊𝒕𝒊𝒂𝒕𝒆𝒔 𝒍𝒊𝒌𝒆 𝑺𝒐𝒄𝒓𝒂𝒕𝒆𝒔, 𝑷𝒚𝒕𝒉𝒂𝒈𝒐𝒓𝒂𝒔 𝒂𝒏𝒅 𝑱𝒆𝒔𝒖𝒔 𝒉𝒂𝒗𝒆 𝒊𝒏𝒇𝒍𝒖𝒆𝒏𝒄𝒆𝒅 𝒕𝒉𝒆 𝒔𝒐𝒄𝒊𝒆𝒕𝒚 𝒂𝒏𝒅 𝒃𝒓𝒐𝒖𝒈𝒉𝒕 𝒊𝒕 𝒕𝒐 𝒓𝒆𝒗𝒊𝒆𝒘 𝒕𝒉𝒊𝒏𝒈𝒔. 𝑻𝒉𝒆𝒚 𝒉𝒂𝒗𝒆 𝒑𝒓𝒐𝒗𝒐𝒌𝒆𝒅 𝒂 𝒔𝒕𝒓𝒐𝒏𝒈 𝒐𝒑𝒑𝒐𝒔𝒊𝒕𝒊𝒐𝒏. 

𝑾𝒆 𝒂𝒓𝒆𝒏’𝒕 𝒚𝒆𝒕 𝒔𝒕𝒓𝒐𝒏𝒈 𝒆𝒏𝒐𝒖𝒈𝒉 𝒕𝒐 𝒇𝒂𝒄𝒆 𝒕𝒉𝒊𝒔 𝒔𝒕𝒐𝒓𝒎, 𝒃𝒖𝒕 𝒘𝒉𝒆𝒏 𝒘𝒆 𝒕𝒖𝒓𝒏 𝒕𝒐𝒘𝒂𝒓𝒅𝒔 𝒕𝒉𝒆 𝒍𝒊𝒈𝒉𝒕, 𝒘𝒆 𝒘𝒊𝒍𝒍 𝒈𝒓𝒐𝒘 𝒂𝒏𝒅 𝒃𝒆 𝒂𝒃𝒍𝒆 𝒕𝒐 𝒇𝒂𝒄𝒆 𝒕𝒉𝒆 𝒄𝒉𝒂𝒍𝒍𝒆𝒏𝒈𝒆𝒔 𝒘𝒉𝒊𝒄𝒉 𝒄𝒐𝒎𝒆 𝒖𝒑 𝒕𝒐 𝒖𝒔.

🌻 🌻 🌻 🌻 🌻
𝑺𝒐𝒖𝒓𝒄𝒆𝒔 : 𝑴𝒂𝒔𝒕𝒆𝒓 𝑲.𝑷. 𝑲𝒖𝒎𝒂𝒓: 𝑺𝒂𝒕𝒖𝒓𝒏 / 𝑱𝒖𝒑𝒊𝒕𝒆𝒓 / 𝒏𝒐𝒕𝒆𝒔 𝒇𝒓𝒐𝒎 𝒔𝒆𝒎𝒊𝒏𝒂𝒓𝒔 / 𝑴𝒂𝒔𝒕𝒆𝒓 𝑬. 𝑲𝒓𝒊𝒔𝒉𝒏𝒂𝒎𝒂𝒄𝒉𝒂𝒓𝒚𝒂: 𝑻𝒉𝒆 𝒀𝒐𝒈𝒂 𝒐𝒇 𝑷𝒂𝒕𝒂𝒏𝒋𝒂𝒍𝒊.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 57 / Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకం 107

519. ముద్గౌదనాసక్తచిత్తా -
 పులగములో ప్రీతి కలది.

520. సాకిన్యంబా స్వరూపిణీ - 
సాకినీ దేవతా స్వరూపముగా నుండునది.

521. ఆజ్ఞా చక్రాబ్జనిలయా - 
ఆజ్ఞాచక్ర పద్మంలో వసించునది.

522. శుక్లవర్ణా - 
తెలుపురంగులో ఉండునది.

523. షడాసనా - 
ఆరు ముఖములు కలది.

🌻. శ్లోకం 108

524.nమజ్జా సంస్థా - 
మజ్జా ధాతువును ఆశ్రయించి ఉండునది.

525. హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా - 
హంసవతీ, క్షమావతీ ముఖ్య శక్తులతో కూడి ఉండునది.

526. హరిద్రాన్నైక రసికా - 
పచ్చని అన్నములో మిక్కిలి ప్రీతి కలది.

527. హాకినీ రూపధారిణీ - 
హాకినీ దేవతా రూపమును ధరించి ఉండునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 57 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 57 🌻*

519 ) Mudgou danasaktha chittha -   
She who likes rice mixed with green gram dhal

520 ) Sakinyambha swaroopini -   
She who has the name “Sakini”

521 ) Agna chakrabja nilaya -   
She who sits on the lotus called Agna chakra or the wheel of order

522 ) Shukla varna -   
She who is white coloured

523 ) Shadanana -   
She who has six faces

524 ) Majja samstha -   
She who is in the fat surrounding the body

525 ) Hamsavathi mukhya shakthi samanvitha -  
 She who is surrounded by shakthis called Hamsavathi

526 ) Hardrannaika rasika -   
She who likes rice mixed with turmeric powder

527 ) Hakini roopa dharini -   
She who has the name “Hakini”

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 60 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 35

*🌻. 35. తత్తు విషయత్యాగాత్‌ సంగత్యాగాత్‌ చ ॥ - 3 🌻*

ప్రహ్లాదుని భక్తి మనకు మార్గదర్శకంగా, లక్ష్యంగా ఉందాలి. నిరంతరం 
భగవచ్చింతనతో మునిగిన ప్రహ్లాదుడు మరలా విషయాసక్తు డెలాగవుతాడు ? ఈ ప్రపంచంలో ఏముందని ? వ్యాధి, బాధలు, జరా, మరణం, దుఃఖం, భయం తప్ప ? 

కొందరి విషయంలో తాత్కాలిక విషయానందం ఉంటున్నప్పటికీ, సమస్యలు, బాధలు లేని సంసారం లేదు. బ్రహ్మానందం ముందు ఏ సుఖమైనా తక్కువే, అశాశ్వతం. అందువలన ప్రహ్ల్హాదు దేమంటున్నాదో చూడండి. 
 
మందార మకరంద మాధుర్యమునదేలు 
మధుపంబు వోవునే మదనములకు 
నిర్మల మందాకినీ వీిచికల దూగు 
రాయంచ చనునె తరంగిణులకు 
లలితరనాల పల్లవ ఖాదియై చొక్కు 
కోయిల చేరునె కుటజములకు 
బూర్లేందు చంద్రికా స్ఫురిత చకోరకం 
బరుగునే సాంద్రనీహారములకు 
తే. నంబుజోదర దివ్య పాదారవింద 
చింతనామృత పాన విశేష మత్త 
చిత్త మెరితి నితరంబు జేరనిచ్చు 
వినుత గుణశీల మాటలు వేయునెల ! 
 
తా: మందారాలలోని తేనెల మాధుర్యాన్ని మరిగిన తేనెటీగ ఉమ్మెత్త చెట్ల చెంతకు చేరునా ? నిర్మలమైన మందాకిని నదిలో చిరు తరంగాలపై ఊయలవలె ఊగులాదే రాజహంస వడివడిగా ప్రవహించి నదుల వైపుకు వెళ్తుందా ? లేలేత మామిడి చిగుళ్ళను ఆరగిస్తూ పరవశించి కోయిల కొండమల్లైె తుప్పల వైపుకు వెళ్తుందా ? నిండు పున్నమి వెన్నెలలో విహరిస్తూ ఆనందించే చకోరపక్షి దట్టమైన పొగమంచులో ప్రవేశిస్తుందా ? 

ఆ విధంగా శ్రీహరి పాదకమలమందు నిలిపి ధ్యానామృతాన్ని గ్రోలి భక్తుడు భక్తి భావంతో మత్తెక్కిన తన చిత్తాన్ని ఇతర ప్రాపంచిక విషయాల మీదికి పోనిస్తాడా ? అది అసంభవం. ఇక వెల మాటలెందుకు ? అని తన దివ్యానుభూతి బెన్నత్యాన్ని తండ్రితో చెప్తున్నాడు ప్రహ్లాదుడు. 
 
వస్తు రస జ్ఞానం లేని వాడికి దానితో కోర్కె కలిగే అవకాశం లేదు. 
కావున భగవంతుని యందున్న ప్రితిని అన్నిటియందు చేర్చిన అన్యం తోచదు, కోర్కె కలుగదు అని ప్రహ్లాదుడు నిరూపించాడు. 
 
ప్రహ్లాదుని భక్తి మనందరికి అనుసరణియం. భగవద్భక్తి పెరుగుతూ ఉంటే, విషయాసక్తి తగ్గుతూ ఉంటుంది. విషయాలమీద విరక్తి పెరుగుతూ ఉంటే, భక్తి నిశ్చలమవుతూ ఉంటుంది. తుదకు గౌణభక్త్‌ ముఖ్యభక్తిగా మార్పు చెందుతుంది. అందువలన విషయ త్యాగం, విషయాలతో అసంగత్వం ప్రధానమని చెప్పబడింది. 
 
సంగత్యాగం చేయమని గీతా వాక్యం. అనగా వస్తువును తాకకుండా 
ఉండటం కాదు. దానిపై కోరికను పూర్తిగా వదలడం. మానసికంగా త్యజించి, గుర్తించకుండా ఉండడం. ఉదాహరణకు, నాలుకపై కలకండ ముక్క వేసుకొని నాలుగు గంటల తరువాత కరిగివోని ఆ పొడి ముక్కను యథాతథంగా తీసి చేతికిచ్చుట లాంటిదే అసంగత్వం. 
 
మోక్షం కావాలనే తీవ్రమైన కోరిక ఉంటె విషయ త్యాగం తేలికవుతుంది. ఏ సాధనైనా బలవంతంగా చేసేది కాదు. ఒక శారిరక బాధ నివారణ కోసం శస్త్ర చికిత్స ఎంత బాధాకరమైనా, దానిని అంగీకరించినట్లు, తీవ్ర మోక్షేచ్చ గనుక ఉంటే, విషయ త్యాగం అంగీకారమే. పరిక్షలలో మంచి మార్కులు రావాలంటే ఒక విద్యార్ధి అదె రోజు చూడాలనుకునె సినిమాను చూడడాన్ని నిగ్రహించడంలేదా?
 
ఉత్తమమైన, శాశ్వతమైన పరాభక్తి లక్ష్యంలో భక్తుడు ఎన్నో త్యాగాలను ఇష్ట పూర్వకంగా చేస్తాడు. చేయక తప్పని పనులు చేస్తూనే సంగరహితంగా ఉంటాడు. అప్పుడు భక్తుడు ఏ పనిచేసినా అది అకర్మ అవుతుంది. 
 
విషయాలు, వాటి వలన కలిగే ప్రీతి మిథ్యా రూపమని, సత్యం కాదని 
నిర్ణయం కలవాడై ప్రాప్తించిన దానిని మమకారం లేకుండా భగవత్రసాదంగా అనుభవించడం విషయ త్యాగమవుతుంది. 
 
త్యాగః ప్రపంచ రూపస్య చిదాత్మ త్వావలోకనమ్‌ ॥| 
- అపరోక్షానుభూతి 
 
ప్రథమావస్థలో వస్తు త్యాగాన్ని తీవ్రమైన విముఖతను పాటించాలి. 
ఇంద్రియాలు కోరిన వాటిని ఇవ్వకుండా వాటిని తపింపచేసి, మమకారాన్ని పోగొట్టుకోవాలి. 

తదుపరి కాలంలో అవి ఎదురైనా, వాటిపై వికలత్వం చెందక ఉందేటంత తీవ్రతను పొందాలి. చరమావస్టలో కర్మ ఫలత్యాగమైన సన్యాస స్థితిని బుద్ధి పూర్వకంగా, సహజంగా చేయగలుగుతాడు. వీరికి భోగి, భోగ్యం, భోగాలనే భావ త్రిపుటి ఉండదు.

సశేషం...  
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 𝔾𝕦𝕣𝕦 𝔾𝕖𝕖𝕥𝕒 - 𝔻𝕒𝕥𝕥𝕒 𝕍𝕒𝕒𝕜𝕪𝕒 - 28 🌹* 
✍️ 𝕊𝕣𝕚 𝔾𝕊 𝕊𝕨𝕒𝕞𝕚 𝕛𝕚 
📚. ℙ𝕣𝕒𝕤𝕒𝕕 𝔹𝕙𝕒𝕣𝕒𝕕𝕨𝕒𝕛

*🌻 𝔾𝕦𝕣𝕦 𝕞𝕦𝕤𝕥 𝕟𝕖𝕧𝕖𝕣 𝕓𝕖 𝕣𝕖𝕤𝕥𝕣𝕚𝕔𝕥𝕖𝕕 𝕥𝕠 𝕛𝕦𝕤𝕥 𝕠𝕟𝕖 𝕚𝕞𝕒𝕘𝕖 𝕠𝕣 𝕠𝕟𝕖 𝕗𝕠𝕣𝕞. 𝔾𝕦𝕣𝕦 𝕚𝕤 𝕒𝕝𝕨𝕒𝕪𝕤 𝕒𝕝𝕝-𝕡𝕖𝕣𝕧𝕒𝕤𝕚𝕧𝕖. 🌻*

We have learned that the technique of Ajapa Japa links the breath which is in the form of two swans, continuously with the two syllables Gu and Ru, thus absorbing the Guru mantra into the heart. 

In the individual who practices this without a break, in addition to the ordinary heart, the yoga heart that is located on the right side also gets cleansed. 

To the one who contemplates on Guru as the manifestation of the two syllables of Gu and Ru following the Ajapa Japa method, the Guru out of his own accord reveals himself. Such meditation is the best kind. 

How does Guru manifest himself? Does he appear in the form of a human being or a celestial being? Does he appear with a beard, or with a shaven head?
 
All the descriptive phrases used in the above verse explain Guru’s supreme status. Guru appears as the Supreme Master. The Universe consists of names and forms. Guru is the cause of the Universe. The Universe emerges out of Guru.

Hence, the entire Creation is His form. The substance of ornaments such as bracelets, necklaces and rings made of gold is essentially nothing but gold. The pieces of jewelry are all different forms of gold. Similarly, the countless forms that Guru possesses are all essentially the same substance as he.
 
Some people keep a small picture of their guru and refer to it as their Guru. It is not right. All forms are Guru’s forms. 

That conviction must be followed and practiced. It is not enough if it is verbally expressed constantly. The principle must be kept in mind all the time. For normal worldly interaction a photo may be used as a reference.
 
We must observe one significant fact. We do not always enjoy complete freedom. We do not even have the freedom to die at will. It is not in our control. Why go that far? We have no control over our own nature or Nature. For that matter, we do not have control over our mind. 

The mind insists on dwelling on a thought even if we will against it. Where do we have the freedom to control the mind? It acts as it wishes, against our commands. 

Whatever we wish to forget, keeps coming back into the mind, including even in dreams. The mind does more and more of what we do not wish for it to do.
 
But, Guru is not like that. He is absolutely free. He is completely in control of his mind. He has the option of letting his mind function freely, or otherwise. We lack that ability. He can perfectly control himself. 

Any life he can control. He can bind it or free it as he chooses. Not just that. He keeps this entire Creation under his control. How is it possible? It is possible because Guru is the Universe. 

We have already described him as the cause, and the form of this endless Creation, and that his form is Bliss. He permeates the entire Universe. He is not limited to one picture or one substance. 

One should keep contemplating on the concept that Guru is in all forms, all substances, all photographs, and all images. Guru must never be restricted to just one image or one form. Guru is all-pervasive. 

He can manifest in any form and at the same time he can remain without appearing in any form.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 26 / The Siva-Gita - 26 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
*🌻. శివ ప్రాదుర్భావము - 2 🌻*

అధ జాతో మహా నాదః ప్రళయాం బుధీ భీషణః,
సముద్ర మధనో ద్భూత మంద రావనిబృ ద్ధ్వని: 11
రుద్ర బాణాగ్ని సందీప్త బృశత్త్రి పుర విభ్రమః,
తమా కర్ణ్యాధ సంభ్రాం తో యావత్పశ్యతి పుష్కరమ్ 12

తరువాత ఒక దినమున ప్రళయ కాలపు మహా సముద్రపు సవ్వడి వలె మరియు సాగర మధన సమయంబున బొడ మిన మందర పర్వత స్వనము వలె, మరియు త్రిపుర సంహార కాలమున రుద్ర బాణాగ్ని ధ్వనిం బోలిన అతి భీషణం బైన ధ్వని వినబడగా
 భయ భ్రాంతితో ఎదుట వీక్షింపగా.

తావ దేవ మహా తేజో రామస్యా సీత్ర పురో ద్విజాః,
తేజసా తేన సంభ్రాం తో నా పశ్యత్ప దిశో దశ 13
అంది కృ తేక్షణ స్తూర్ణం మోహం యాతో నృ పాత్మజః,
విచింత్య తర్కయా మాస దైత్య మాయాం ద్విజేశ్వరాః 14

ఒక మహా తేజస్సు గోచరించెను. అది చూచి సంభ్రాంత మనస్సు చేత శ్రీ రాముడు దశ దిశల గలయ చూచెను. అట్టి మహా తేజశ్శక్తి ప్రభావమున దృష్టి గాన రానివాడై ఒక్కతృటి కాలము మిగుల మొహు గలవాడై మొదట దానవుల మాయగా దలచెను.

అధో త్దాయ మహావీర - స్సజ్యం కృత్వా ధను స్స్వకమ్,
ఆ విద్య న్ని శితైర్బాణై - ర్ది వ్యాస్త్రై రాభి మంత్రితై: 15
ఆగ్నేయం వారుణం సౌమ్యం - మోహనం సౌర పార్వతమ్,
విష్ణు చక్రం మహా చక్రం - కాల చక్రం చ వైష్ణవమ్ 16

పిదప లేచి తన కోదండమును బాణములతో సంధింప చేసి ఆగ్నేయము - వారుణము - మోహన - పాశుపత సౌమ్యం విష్ణు చక్రం, మహాచక్రం - కాలచక్రం వైష్ణవమ్ - రౌద్రం – బ్రాహ్మం -కౌబేరం- కులిశం - అనిలం - భార్గవం మున్నగు అనేకాస్త్రములను అభి మంత్రించి రాముడు ప్రయోగించెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 26 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 04 : 
*🌻 Shiva Praadurbhaavam - 2 🌻*

One fine day Rama heard a terrible and fear striking sound which resembled the roars of oceans as made during the time of cosmic dissolution, which resembled the sound made by the mount Mandara during the churning of ocean, which resembled the terrible sound made by the arrow of Rudra when shot while destroying the three cities. 

Hearing that fear striking terrible noise Rama looked around startled with fear.

Rama beheld a huge brilliance spread all around. Seeing that in a confused state Rama looked around in all directions. Due to that high intensity brilliance for a second Rama felt as if he went blind and couldn't see anything apart from light. 

He thought all that was probably the illusion of some demons.

Thereafter Rama stood up holding his Kodanda bow in his hands, and projected in the air many divine missiles (arrows) through the power of Mantra viz. 

Agneyam, Varunam, Mohanam, saurapaarvatam, viShnuchakraM, mahaachakram, kaalachakram, vaiShnavam, raudram, paashupatam, braahmam, kauberam, and kulishaanilam weapons.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 18 / Sri Gajanan Maharaj Life History - 18 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. 4వ అధ్యాయము - 3 🌻*

మీరు షేగాంలో శివుని వంటివారు కాని నేను మిమ్మల్ని తెలుసుకో లేక పోయాను. నా సందేహాలన్నీ దూరమయ్యాయి. ఇప్పుడు మీరు నాకు విధించిన శిక్ష నేను సరిఅయిన మార్గానికి వచ్చేందుకు సరిపడుతుంది. నాలాంటి అనాధను ఆదుకోగలింగింది మీరే, కావున దయచేసి క్షమించండి అని జానకిరాం ఆయనతో అంటాడు. నువ్వు అబద్ధం చెపుతున్నావు, నీకూర స్వఛ్ఛంగా ఉంది, దానిలో ఏవిధమయిన పురుగులు లేవు అని శ్రీమహారాజు సమాధానం చెప్పారు. 

అంతే నిజంగానే ఆకూర స్వచ్ఛంగా, పురుగులు లేకుండా ఉంది. పురుగులన్నీ ఒక్కక్షణంలో మాయం అయిపోయాయి. అక్కడ ఉన్నవాళ్ళు ఆ అద్భుతం చూసి, శ్రీమహారాజుకు వంగి నమస్కారంచేసారు. 

చందు ముకిన్ అనే శ్రీమహారాజు భక్తుని కధ ఇప్పుడు వినండి......... వేసవికాలం, జ్యేష్ఠమాసంలో శ్రీమహారాజు చుట్టూ ఆయన భక్తులు కూర్చునిఉన్నారు. ఆయనకు వీళ్ళు పండ్లు, చక్కెరఉండలు, పూలదండలు ఇచ్చి, గంధం ఆయన శరీరానికి రాస్తూ, కొంతమంది విని కర్రతో విసురుతూ చల్లదనం ఇస్తున్నారు. 

ఆ సమయంలో శ్రీమహారాజు తనకు మామిడి పండ్లు వద్దు, కానీ చందూ ఇంట్లో మట్టికుండలో ఉంచిన రెండు కజ్జికాయలు కావాలి అంటారు.

చందూ చేతులు కట్టుకొని తన ఇంటివద్ద కజ్జికాయలు ఏమీలేవని, కానీ అవసరమయితే తాజాగా తయారుచేయిస్తాను అంటాడు. నాకు తాజావికాదు నీఇంటిలో మట్టికుండలో ఉంచిన ఆ నిలవ కజ్జికాయలే కావాలి అని శ్రీమహారాజు దానికి బదులు చెప్పారు. 

చందూ ఇంటికి వెళ్ళి శ్రీమహారాజు అన్నవిషయం భార్యకు చెపుతాడు. ఒక నెలక్రితం అక్షయతిదియ నాడు కజ్జికాయలు తయారు చేసాము, మరియు అన్నీ ఆరోజే పూర్తి అయిపోయాయి. ఒకవేళ ఏమయినా మిగిలి ఉంటే ఈసరికి గట్టిపడి పాడయిపోయి ఉంటాయి అని అతని భార్య అంది. 

శ్రీమహారాజు కోసం తాజా కజ్జికాయలు చేసేందుకు తన సుముఖత తెలుపుతుంది. శ్రీమహారాజుకు ఆనిలవ ఉన్నవే కావాలిట కాని తాజావివద్దుట, సరిగ్గా గుర్తు చేసుకో, ఎందుకంటే శ్రీమహారాజు అబద్ధం చెప్పలేరు అని చందూ ఆంటాడు. 

కొద్దిసేపు ఆలోచించిన తరువాత శ్రీమహారాజు చెప్పినదినజమేనని ఆమెకు మెరుపులాగ జ్ఞాపకంవచ్చింది. మట్టికుండలో నిజంగానే 2 కజ్జికాయలు దాచిఉంచిన విషయం ఆమెకు గుర్తువచ్చింది. అవి తీసి ఆమె చందూకు ఇచ్చింది. ఆశ్ఛర్యం ఏమిటంటే అవి గట్టిపడలేదు, పాడవనూలేదు. 

అది చూసి ఇద్దరూ సంతోషపడ్డారు. వెనక్కి వెళ్ళి శ్రీమహారాజుకు ఆ కజ్జికాయలు చందూ సమర్పించాడు. శ్రీమహారాజు యొక్క దివ్యశక్తికి అందరూ ఆశ్చర్య పోయారు. శ్రీరాముడు శబరి ఇచ్చిన పండ్లు సంతోషంగా స్వీకరించిన విధంగా శ్రీగజానన్ ఆ కజ్జికాయలు తిన్నారు.

మాధవ్ అనే బ్రాహ్మణుడు షేగాం దగ్గర చించోలి లో ఉండేవాడు. అతను 60 ఏళ్ళు పైనఉండి బలహీనంగా ఉన్నాడు. అన్ని భోగ భాగ్యాలతో యుక్తవయస్సు అంతా గడిపాడు. ఎవరి అదృష్టాన్ని మార్చడం సఖ్యంకాదు. భార్య, పిల్లలు పోయి మాధవ్ ఈప్రపంచంలో ఒంటరిగా మిగిలాడు. 

జీవితం మీద విరక్తి కలిగి, అన్ని వస్తువులు అమ్మివేసి, ఈ భోగ భాగ్యాలలో పడి భగవంతుడిని ఎప్పుడూ తలుచుకోలేదు అని అతను చింతించాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 18 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 4 - part 3 🌻*

You are Lord Shiva in Shegaon and I did not recognize You. Now I am free from all doubts, and whatever punishment is given to me today should be enough to improve me. You are the protector of orphans like me, so kindly pardon me. Shri Gajanan Maharaj replied, You are telling a lie. Your curry is fine and there are no worms in it. 

And really the curry was clean and fine. All the worms had disappeared in a moment! The people around, saw the miracle and bowed before Shri Gajanan Maharaj. Now listen to the story of Chandu Mukin, a devotee of Shri Gajanan Maharaj. In the month of Jeshta in summer all the devotees were sitting around Shri Gajanan Maharaj . 

They were offering Him fruits, sugar balls, garlands, applying sandalwood paste to his body were cooling air by hand fans. At that time Shri Gajanan Maharaj said that He did not want mangoes or fruits but two Kanholes that were kept in the earthen pitcher at Chandu’s House. 

Chandu, with folded hands said that there were no Kanholes at his house, but would get prepared fresh if necessary. Maharaj replied that He did not want fresh Kanholes, but only those stale ones that were lying in the earthen pitcher at his house. 

Chandu went home and told his wife what Shri Gajanan Maharaj had said. His wife said that the Kanholes were prepared a month ago on Akshaya Tritiya day and were all consumed the same day, and if at all some were left, they must be stale and hard by this time. 

She however, showed her readiness to prepare fresh Kanholes for Shri Gajanan Maharaj . But Chandu replied that Maharaj wanted only the stale ones and not fresh ones. He asked her to remember where she kept them since Swamiji could not lie. 

She paused and immediately remembered that what Swamiji had said was, in fact, correct. She remembered that two Kanholes were really kept by her in the earthen pitcher.

She took out the Kanholes and gave them to Chandu; the wonder was that they had not hardened or dried at all. Looking to it they both were happy. Chandu went back and offered the Kanholes to Shri Gajanan Maharaj . All were surprised at the divine knowledge of Shri Gajanan Maharaj . Shri Gajanan happily ate the Kanholes as fruits offered by Shabari to Shri Ram.

At Chincholi, a town near Shegaon, there was a Brahmin by the name of Madhao. He was over sixty years old and was very weak. 

He passed his youth in attaining material pleasure only. It is not possible to change ones fate. Madhao lost all his children and wife and was left alone in this world at an old age. He lost all interest in life, sold out all his possessions and regretted that while in material pursuits he never remembered the Almighty God. 

Continues
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సౌందర్య లహరి - 68 / Soundarya Lahari - 68 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

68 వ శ్లోకము

*🌴. రాజు నుండి, అధికారి నుండి అనుకూల సహాయం, ఇతరులను ప్రభావం చేయుటకు 🌴*

శ్లో:68. భుజాశ్లేషాన్నిత్యం పురదమయితుః కంణ్టకవతీ తవ గ్రీవా ధత్తే ముఖకమలనాళ శ్రియ మియమ్ 
స్వత శ్వేతా కాలాగురుబహుళ జమ్బాలమలినా 
మృణాళీలాలిత్యం వహతి యదథో హారలతికాll 
 
🌷. తాత్పర్యం : 
అమ్మా! త్రిపురాంతకుడయిన ఈశ్వరుని కౌగిలింత వలన నిత్యమూ రోమాంచిత అగు ముఖ కమలము అను పద్మము యొక్క కాడ అందమును ధరించు చున్నది, ఎందువలన అనగా దాని క్రింది భాగమున సహజముగా తెల్లనిదయి నల్లనిదగు విస్తారమయిన బురద చేత మలినమయిన దియునూ తీగవంటి హారము తామర లత యొక్క లాలిత్యము వహించు చున్నది. కదా! 

🌷. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాయసం, తేనె, తాంబూలము నివేదించినచో, గొప్ప రాజు యొక్క, అధికారుల సహాయము లభంచునని, ఇతరుల మీద ప్రభావమును కలిగి ఉండగలరు అని చెప్పబడింది.

ఈ శ్లోకము గురువు యొక్క ప్రత్యక్ష మార్గదర్శనం యందు చేయవలసిందిగా ప్రత్యేకముగా చెప్పబడింది. 

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 SOUNDARYA LAHARI - 68 🌹*
📚. Prasad Bharadwaj 

SLOKA - 68 

*🌴 Favours of kings and government, influence on others 🌴*

68. Bhujasleshan nithyam Pura-damayituh kantaka-vathi Tava griva dhatte mukha-kamalanaala-sriyam iyam; Svatah swetha kaalaagaru-bahula-jambala-malina Mrinali-lalithyam vahati yadadho hara-lathika. 
 
🌻 Translation : 
Your neck appears full of thorns always, due to the hairs standing out, by the frequent embrace of thy lord, who destroyed the three cities. and looks like the beauty of the stalk, of your lotus like face. the chain of white pearls worn below, is dulled by the incense and myrrh, and the paste of sandal applied there, and is like the tender stalk, dirtied by the bed of mud.

🌻 Chanting procedure and Nivedhyam (offerings to the Lord) : 
If one chants this verse 1000 times a day for 45 days, offering paysam, honey and thambulam as prasadam, they will get Favours of kings and government, influence on others.

Note : 
This Sloka should be chanted only after being properly guided by a Guru.

🌻 BENEFICIAL RESULTS: 
Favours of kings and government, influence on others. 
 
🌻 Literal Results: 
Charm and magnetic attraction, followed by masses. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 367 / Bhagavad-Gita - 367 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 16 🌴

16. వక్తుమర్హస్యశేణ దివ్యా హ్యాత్మవిభూతయ: |
యాభిర్విభూతిభిర్లోకానిమాంస్త్వం వ్యాప్య తిష్టసి ||

🌷. తాత్పర్యం :
నీవు ఏ దివ్యవిభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును వ్యాపిచియుందువో వాటన్నింనిటిని దయతో నాకు విశదముగా తెలియజేయుమ.

🌷. భాష్యము :
దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన తన అవగాహనచే అర్జునుడు సంతుష్టి చెందియే ఉన్నట్లుగా ఈ శ్లోకమున గోచరించుసునది. 

కృష్ణుని కరుణ వలన అతడు స్వానుభావమును, బుద్ధిని, జ్ఞానమును మరియు వాని ద్వారా తెలిసికొనదగిన సర్వవిషయములను ఏరుగజాలి శ్రీకృష్ణుని దేవదేవునిగా అవగతము చేసికొనగలిగెను. 

తనకెటువంటి సందేహము లేకున్నను ఇచ్చట అర్జునుడు శ్రీకృష్ణుని సర్వవ్యాపకక లక్షణమును వివరింపుమని అడుగుచున్నాడు. 

శ్రీకృష్ణభగవానుని ఈ సర్వవ్యాపక లక్షణమునకే సామాన్యజనులు, ముఖ్యముగా నిరాకారవాదులు ఎక్కువ ప్రాముఖ్యము నొసగుటయే అందులకు కారణము. 

కనుకనే వివిధశక్తుల ద్వారా శ్రీకృష్ణుడు ఏ విధముగా సర్వవ్యాపియై యుండునో అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. ఈ ప్రశ్నను అర్జునుడు సామాన్యజనుల పక్షమున అడిగినట్లుగా ప్రతియొక్కరు గుర్తింపవలెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 367 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 16 🌴

16. vaktum arhasy aśeṣeṇa
divyā hy ātma-vibhūtayaḥ
yābhir vibhūtibhir lokān
imāṁs tvaṁ vyāpya tiṣṭhasi

🌷 Translation : 
Please tell me in detail of Your divine opulences by which You pervade all these worlds.

🌹 Purport :
In this verse it appears that Arjuna is already satisfied with his understanding of the Supreme Personality of Godhead, Kṛṣṇa. 

By Kṛṣṇa’s grace, Arjuna has personal experience, intelligence and knowledge and whatever else a person may have, and through all these agencies he has understood Kṛṣṇa to be the Supreme Personality of Godhead. 

For him there is no doubt, yet he is asking Kṛṣṇa to explain His all-pervading nature. People in general and the impersonalists in particular concern themselves mainly with the all-pervading nature of the Supreme. 

So Arjuna is asking Kṛṣṇa how He exists in His all-pervading aspect through His different energies. One should know that this is being asked by Arjuna on behalf of the common people.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 80 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అష్టావక్ర – సుప్రభ - 4 🌻*

20. Space లో జీవులు ఎక్కడికి వెళితే ఈ భూలోకావాసన ఉండదో, ఎక్కడికి వెళితే దివ్యమైనటువంటి ఆనందం, అనుభూతి కలుగుతుందో అంత దూరం భూలోకంనుంచీ వెళ్ళటమనే సత్యమే అందులో ఉంది. 

21. ఇక్కడినుంచీ దూరంగా ఉన్న ఆ లోకాలలో అట్టి ఉత్తమస్థితి ఉంది. కాని ఈ భౌతికమయిన, నశ్వరమై పంచభూతాత్మకమైన శరీరంతో, పుట్టినప్పటి నుంచీ చావుకి దగ్గరగా వెళ్లటమే! రోజూ అదేపని మనకు. ఆ ఊర్ధ్వలోకాలు అట్లాంటివి కావు. 

22. భౌతికమైన, అంటే పాంచభౌతికమయిన శరీరాలున్న లోకము ఈ భూలోకం ఒక్కటే! పాంచభౌతికదేహంమాత్రం లేక, దేహాత్మభావన – దేహాభిమానము – దేహాలక్షణములు కలిగినటువంటి లోకం ప్రేతలోకం.

23. భూలోకావాసన అసలేలేకుండా ఆనందము, సుఖము మాత్రము – భూలోకంలో ఏది సుఖమనుకున్నాడో అట్టి సుఖాన్నిమాత్రం అపరిమితంగా – జీవుడు అనుభవిస్తూ, శరీరంలేకుండా ఉండేలోకం స్వర్గలోకం. అక్కడ భూమివాలె ఓక గోళము అంటూ ఏమీ లేదు. తల్లితండ్రుల అనుబంధం, నవమాసాలు మోసి బిడ్డనుకనటం వంటివి ఉండవు అక్కడ. 

24. జీవాత్మ సుఖాన్ని అనుభవిస్తుంది. దానికే స్వర్గమని పేరు. జీవుడు పొందే ఆ అనుభూతికి ఉత్తమ లోకాలని పేరు. 

25. ఇలాంటి భూలోకం కలిగిన సౌరమండలాలు (భౌతికమయిన శరీరములను, జీవకోటిని మోసేటటువంటి లోకములు) అక్కడక్కడ సకృత్తుగా ఉన్నవి. 

26. అట్లాంటి లోకములు మొత్తం ఈ సృష్ఠిలో వేలకోట్ల కొద్దీ ఉన్నప్పటికీ, అవి లవలేశం మాత్రమే అవుతాయి అనంతమైన ఈ విశ్వంలో.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 𝑨𝑽𝑨𝑻𝑨𝑹 𝑶𝑭 𝑻𝑯𝑬 𝑨𝑮𝑬 𝑴𝑬𝑯𝑬𝑹 𝑩𝑨𝑩𝑨 𝑴𝑨𝑵𝑰𝑭𝑬𝑺𝑻𝑰𝑵𝑮 - 69 🌹*
𝑪𝒉𝒂𝒑𝒕𝒆𝒓 19
✍️ 𝑩𝒉𝒂𝒖 𝑲𝒂𝒍𝒄𝒉𝒖𝒓𝒊
📚 . 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

*🌻 𝑻𝒉𝒆 𝑭𝒂𝒕𝒉𝒆𝒓 𝒐𝒇 𝑪𝒓𝒆𝒂𝒕𝒊𝒐𝒏 - 1 🌻*

When the First Soul realized who he was, God, he simultaneously realized that he was everything and everyone. 

But because everything and everyone existed in illusion, and were thereby separated from him, he took on the responsibility of helping every- thing and everyone become one with him. When he, the Avatar, puts his responsibility into action, he comes to earth, and is known as the Father of all creation.
 
Mankind is steeped in ignorance, and when the Avatar declares to humanity, "I am the Avatar, and therefore I am your Real Father. Listen to Me, for I have come not to teach you about Truth, I am here to awaken you and take you to the path of Truth." 

People, asleep in their ignorance, resent his declaration. They demand that he answer their questions: "What proof do you have that you are our Father? You must prove that you are our Father. 

Without proof we will not accept you. We feel resentful of your declaration—who then are our parents? Either prove your declaration, or be prepared to bear our punishment!" 
So, the Avatar enters into silence and works to create a situation in the world that enables people to accept him. 

He has to work in an adverse atmosphere, and this adver- sity is his suffering while he works. 
Most of humanity are ignorant of the divinity of the Avatar; their consciousness, when compared to his INFINITE CONSCIOUSNESS, is the consciousness of children. 

The Avatar has Infinite Knowledge, and this makes him the Father of all mankind most of whom are in a state of deep ignorance. The Father leaves his children behind for 700 to 1400 years. When, after this long time he returns, he declares to his children: 

"I am your Father. I have returned, and this time I have brought treasure for you." However, the children have forgotten about their Real Father, and reply, "You are not our Father! You show no proof that you are such. 

We will not accept the treasure unless you prove to us who you really are." Patiently, the Father shows his children various documents, and points out to them that he is the Same One. 

"Here are the Avestas, I was Zarathustra. Here is the Gita, I was Krishna. Here are the Gospels, I was Jesus. Here is the Koran, I was Mohammed. These documents have all told you that I would return, and I have come. My identity is in these documents, so here is your proof." 

But the people resent this, and respond, "How can we believe that you were Zarathustra? That you were Krishna! That you were Buddha, Jesus and Mohammed! We cannot believe you or those documents! You still have to convince us that you are our Father." 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 1 🌹*
 ✍. DNA స్వర్ణలత గారు
📚. ప్రసాద్ భరద్వాజ

          *ఈ పుస్తకం గురించి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ మాటలు*

🌟 *"అద్భుత సృష్టి"*🌟

మహాయోగిని, పిరమిడ్ మాస్టర్ "స్వర్ణలత" గారికి నా హృదయపూర్వక అభినందనలు! ఇంత గొప్ప గ్రంథం తెలుగు భాషలో రావటం చాలా అద్భుతమైన విషయం! ఎన్నో లోకాలు!
 ఎన్నో శరీరాలు
ఎన్నో చక్రాలు 
ఎంతో ఉన్నతి చెందాలి! అన్నింటికీ ఉంటాయి అర్థాలు!

 తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత!
 ప్రతి పిరమిడ్ ధ్యాని తప్పక చదవాలి!
 ఏమీ అర్థం కాకపోయినా చదవాలి!
తినగ తినగ వేము తీయగనుండును కదా! ఈ పుస్తకాన్ని తింటూనే ఉందాం!
 మరొకసారి స్వర్ణలత గారికి అభినందనలు!
             ***

*🌻. విశ్వం/సృష్టి ఆవిర్భావం - 1 🌻*

కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం అంటే (బిలియన్, ట్రిలియన్ సంవత్సరాలకు పూర్వం) *"మూల చైతన్యం"*( దానినే మనం 'దేవుడు లేదా ఎటర్నల్ బుద్ధా అంటాం') ఒక అమరత్వం ..తనని తాను సృష్టించుకుంది.

 🔺వ్యక్తంకాని.. 
అవ్యక్తరూపం.. శూన్యంగా ఉన్న స్థితి. ఈ స్థితి వ్యక్తం అవ్వడం ప్రారంభించింది.

🔺మొదట శూన్యంగా ఉన్న ఈ అవ్యక్త రూపం కొద్దిగా కదిలింది. ఈ కదలికనే *"ఆలోచన"* అన్నారు. ఈ ఆలోచనే మొదటి ఆలోచన. మొదటి ఆలోచన పుట్టిన స్థలం *"ఆది మానసం"*(మొదటి మనస్సు) అన్నాం. మొదటి మనస్సులో పుట్టిన మొదటి ఆలోచనే *"ఆది సంకల్పం"*.

🔺ప్రతి ఆలోచనకు ఒక *"శక్తి"* ఉంటుంది. శక్తికి ప్రకంపన ఉంటుంది.( వైబ్రేషన్) *"వైబ్రేట్"* అంటే ప్రకంపించేది లేదా కదిలేది. అలలు అలలుగా ఈ ప్రకంపనా రంగం నుండి ఒక పెద్ద విస్పోటనం సృష్టించబడింది. విస్పోటనం గావించబడిన మూల చైతన్యం నుండి *"మూల ఆత్మలు"* సృష్టించబడ్డాయి.

*సంకల్పం*=ఒక పనిని పూర్తి చేయడానికి వేసుకునే బలమైన ప్రణాళిక.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 29 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులను పరీక్షించ దలచి, కుక్క మాంసం తినమని ఆజ్ఞాపించిన సందర్భంలో, వాళ్ళు తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెందారు. అప్పుడు వీరబ్రహ్మేంద్రస్వామి –

“ఇప్పటికైనా మీరు నిజం గ్రహించారు. ఎవరయితే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతారో, సేవిస్తారో, వారిమీద నేను ఎక్కువగా కరుణ చూపుతాను. దీనికి మీరు చేయవలసింది స్వార్థం వదిలివేయటమే !” అన్నారు.

ఈ సంఘటనతో సిద్దయ్య మాదిరిగా బ్రహ్మంగారి మిగిలిన శిష్యులందరూ కూడా స్వార్థ రహితంగా స్వామిగారిని సేవించడం మొదలు పెట్టారు. అనంతరం స్వామి ఆయన శిష్య బృందం తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ఒకరోజున మొత్తం ప్రయాణించిన తర్వాత బాగా అలసిపోవడంతో ఒక ప్రదేశంలో ఆగారు. అక్కడ విశ్రమించిన సమయంలో స్వామివారు తన శిష్యులతో ఆధ్మాత్మిక సంబంధమైన సంభాషణలు ప్రారంభించారు.

అలా కాలం గడుస్తుండగా బ్రహ్మంగారు హఠాత్తుగా తన శిష్యులలో ఒకరైన వెంకటయ్య వేపు తిరిగి “మరి కొద్ది సమయానికి ఒక అద్భుతం జరగబోతోంది ” అని తెలియజేశారు.

ఆ తర్వాత మళ్ళీ తన శిష్యులతో సంభాషణలో మునిగిపోయారు.

స్వామి వారు సిద్ధయ్యతో మాట్లాడుతూ వుండగా దగ్గరలో వున్న ఒక ప్రదేశం నుంచి ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు వినబడ్డాయి. అలా కొంతసేపు మాటలు వినిపించిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దం…తర్వాత మళ్ళీ మాటలు వినబడ్డాయి.

అది గ్రహించిన స్వామివారు శిష్యుడు సిద్ధయ్యడు, ఇతర శిష్యులతో “వారెవరో తెలుసుకుందాం పదండి ” అని అందరినీ తన వెంట తీసుకుని అక్కడికి బయలుదేరి వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా, ఒక బ్రాహ్మణ స్త్రీ,కుష్టు రోగియైన తన భర్తను, తన ఒడిలో వుంచుకుని విలపించడం కనిపించింది.

అప్పుడు బ్రహ్మంగారు “ఏమమ్మా…మీరు ఎక్కడినుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? నీ భర్తకు ఈ వ్యాధి ఎలా వచ్చింది? మీ వివరాలన్నీ చెప్పండి ” అన్నారు.

ఆ బ్రాహ్మణ స్త్రీ చెప్పినవన్నీ విన్న తర్వాత ::-
బ్రహ్మంగారు “ఇక మీ కష్టాలన్నీ పోయినట్టీ. మీ గత జన్మ పాపం వల్లే ఈ వ్యాధి మీకు వచ్చింది. మిమ్ముల్నినేను ఆ పాపం నుంచి విముక్తి చేస్తాను” అని అభయమిచ్చారు. తర్వాత బ్రాహ్మణ యువకుని ఒక్కసారి తన చేతితో తడిమారు.

అంతే… ఆ బ్రాహ్మణుని కుష్టువ్యాధి పూర్తిగా తగ్గిపోయింది. తర్వాత బ్రహ్మంగారు ఆ దంపతులకు పంచాక్షరి మంత్రం ఉపదేశించారు.

“స్వామీ, మీరు చేసిన ఉపకారం మేం ఎప్పటికీ మరిచిపోలేము. మీరు మా ఊరికి మాతోపాటు రావాలి. మా ఊరి వాళ్ళందరికీ మీ ఉపదేశాలతో జ్ఞానాన్ని కలగచేయాలి ” అని ప్రార్థించారు.

“ఇప్పుడు నేను పర్యటనలో వున్నాను. తగిన సమయం వచ్చినప్పుడు మీరు పిలవకుండానే మీ ఊరికి వస్తాను” అని బదులిచ్చి వారిని పంపివేశారు. తనశిష్యులతోపాటు కందిమల్లాపాలెం జేరి తమ పనులలో నిమగ్నమయ్యారు బ్రహ్మంగారు.

*🌻. బ్రహ్మంగారి పై నేరారోపణ - 1 🌻* 

ఒకరోజు వీరబ్రహ్మంగారికి కడప నవాబు నుంచి ఒక జాబు వచ్చింది. అందులో పేరి సాహెబు అనే ఒక ముస్లిం తన కుమారుడైన సిద్దయ్యను స్వామీజీ ప్రలోభ పెట్టి హిందువుగా మార్చారని స్వామిపై నేరారోపణ చేశాడు. దీని గురించి విచారించేందుకు బ్రహ్మంగారిని తాము కడపకు రమ్మని ఆదేశిస్తున్నామని ఆ లేఖలో సారాంశం.

ఆ లేఖ అందుకున్న వీరబ్రహ్మంగారు తాను నవాబు దగ్గరకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. శిష్యులు తాము కూడా కడపకు బయల్దేరి వస్తామని చెప్పగా, బ్రహ్మంగారు దానికి ఒప్పుకోలేదు. 

తాను ఒక్కడే అక్కడికి వెళ్తానని చెప్పారు. కానీ సిద్ధయ్య , మాత్రం ఇది తనకు సంబంధించిన విషయం కాబట్టి, తాను మాత్రమే కడపకు వెళ్తానని, బ్రహ్మంగారు అక్కడికి రానక్కరలేదని చెప్పాడు. మొదట అందుకు ఒప్పుకోకపోయినా సిద్ధయ్య పట్టుపట్టడంతో అందుకు ఒప్పుకోక తప్పలేదు బ్రహ్మంగారికి.

ఆ లేఖను తీసుకు వచ్చిన జవాన్లతో కలిసి కడపకు బయలుదేరాడు సిద్ధయ్య. మార్గమధ్యంలోనే జవాన్లను ఏమార్చి వారికి కనబడకుండా, వేరే మార్గంలో ముందుగానే కడపకు చేరుకున్నాడు సిద్ధయ్య. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని వచ్చిన వారితో మాట సంబంధమైన సంభాషణలు మొదలుపెట్టాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 𝑺𝒆𝒆𝒅𝒔 𝑶𝒇 𝑪𝒐𝒏𝒔𝒄𝒊𝒐𝒖𝒔𝒏𝒆𝒔𝒔 - 145 🌹*
✍️ 𝑵𝒊𝒔𝒂𝒓𝒈𝒂𝒅𝒂𝒕𝒕𝒂 𝑴𝒂𝒉𝒂𝒓𝒂𝒋 
📚. 𝑷𝒓𝒂𝒔𝒂𝒅 𝑩𝒉𝒂𝒓𝒂𝒅𝒘𝒂𝒋

*🌻 𝑻𝒉𝒆 𝒖𝒍𝒕𝒊𝒎𝒂𝒕𝒆 𝒑𝒐𝒊𝒏𝒕 𝒐𝒇 𝒗𝒊𝒆𝒘 𝒊𝒔 𝒕𝒉𝒂𝒕 𝒕𝒉𝒆𝒓𝒆 𝒊𝒔 𝒏𝒐𝒕𝒉𝒊𝒏𝒈 𝒕𝒐 𝑼𝒏𝒅𝒆𝒓𝒔𝒕𝒂𝒏𝒅 🌻*

Now, you are trying to understand all this but you cannot, because you have on the swaddling clothes of 'I am this or that'. Remove them. The ultimate point of view is that there is nothing to understand. 

So, trying to understand is just indulging in mental acrobatics. Whatever you have understood you are not. Spit it all out. Whatever you understand is not the truth. Throw it overboard.

Do not try to catch hold of any concepts and cling to them. Don't employ any words, but look at yourself as you are.
Throw away every thought, every experience, everything that happens after the consciousness, the beingness comes. 

Other than throwing it away as useless, there is nothing to be done beyond this firm understanding in which you become more and
more absorbed. Before the beingness was there, look at that, be in that state.

Do not get lost in words and thoughts and ideas. Do not crave for mind knowledge and concepts in the name of spirituality. Anything that is seen and interpreted by the mind is only an appearance in consciousness, and, therefore, cannot be true. 

The knowledgeable one just witnesses whatever experiences are obtainable through the mind, viewing them as without substance. 

The mind may be sprouting, expressing itself with various concepts. But, don't identify with that, let it go. Don't be a customer to your mind concepts. 

The knower of the mind is just a witness. He does not interfere in anything.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 23 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్రేయోమార్గము - ప్రేయోమార్గము - 11 🌻*

మోహమునకు ఒక ఉపమానం వుంది. ఎగిరేటటువంటి ఈగ నేల మీద ఉన్నటువంటి శ్లేష్మాన్ని చూస్తుంది. ఎవరో కఫం వచ్చి ఉమ్మేశాడు. అది విసర్జించ బడదగినటువంటి అంశము కాబట్టి వాడు విసర్జించాడు. వీడు విసర్జించినటువంటి కఫము, శ్లేష్మము ఈగకు ఆహారముగా కనబడుతున్నది. 

కనబడి ఆ శ్లేష్మము, కఫములో ఉన్నటువంటి సూక్ష్మజీవులని ఆహారంగా పుచ్చుకోవాలని ఈ ఈగ ఆ శ్లేష్మంలో ప్రవేశించింది.

 ప్రవేశించేటప్పటికి ఆ శ్లేష్మానికున్నటువంటి జిగురు దాని రెక్కలకంటుకుంటుంది. అంటుకునేటప్పటికి అది ఎగరడానికి అసక్తమైపోతుంది. అసక్తమైపోయి ఆ శ్లేష్మంలోనే పడి చనిపోయింది. 

ఇది మోహంలో వున్నటువంటి గొప్ప విశేషం. ధన కనక వస్తు వాహన శరీరగత వ్యామోహములన్నీ ఈ శ్లేష్మంలో పడ్డ ఈగలాగా నిన్ను బయటకి ఎగరనివ్వలేవు. నిన్ను, నీ స్వేచ్ఛని హరిస్తాయి. నీయొక్క మానవజన్మకి సంబంధించిన స్వధర్మాచరణని చేయనివ్వవు. 

కాబట్టి ఈ రకమైనటువంటి ఉపమానాన్ని వాటిల్లో వున్న దోషలక్షణాన్ని స్పష్టముగా గుర్తెరగవలసినటువంటి అవసరం వుందనమాట. ఆహా, మరల నేను ఈ రకమైనటువంటి మోహంలో చిక్కుకోబోతున్నాను. 

మోహమనే వ్యాఘ్రము బారిన పడబోతున్నాను అన్నారు. పెద్దలేమన్నారంటే మొహాన్ని పులితో పోల్చారనమాట. ఒకసారి పులిబారిన పడినటువంటి వాడు సాధారణంగా తప్పించుకోవడం అనేది సాధ్యపడదు. కారణమేమిటంటే పులి అక్కడా ఇక్కడా పట్టుకోదు. 

సరాసరి మెడ దగ్గరే పట్టుకుంటుంది ఏ జీవినైనా సరే. ఇక ఆ మెడ దగ్గర చిక్కినటువంటి జీవి అది తప్పించుకోవడానికి అవకాశము ఉండదనమాట. వీడు తప్పించుకోవడానికి గిలగిలలాడేటంత లోపలే దాని యొక్క పంజా, దాని యొక్క పళ్ళు వీడి యొక్క కంఠనరాలని తెంచేస్తాయి. తద్వారా మృత్యువుబారిన పడతాడనమాట. 

కాబట్టి ఈ మొహమనేటటువంటి వ్యాఘ్రము ఎలా వుందయ్యా అంటే నీ ఆయువుని హరించివేస్తూ వుంటుంది. నిరంతరాయముగా నీ ఆయువుని హరించివేస్తుంది. కాలయాపన జరిగేటట్లుగా చేస్తుంది. నిన్ను మేలుకోనివ్వకుండా ఉండేట్లు చేస్తుంది. 

నిన్ను విడిపించుకోనివ్వకుండా బంధములో ఉంచేట్లు చేస్తుంది. నిన్ను ఎంత విడిపించుకునేందుకు ప్రయత్నిస్తే అంతగా బిగుసుకుపోయేట్లుగా మార్పుచేస్తుంది. ఈ వ్యామోహం యొక్క ప్రభావం ఇది.
    
ఆ జన్మాంతర విశేషం అయినటువంటి వాసనాబల ప్రభావము చేత ఏర్పడినటువంటి ఈ మోహము జీవులందరికీ కూడా బంధకారణమై వున్నది. అటువంటి మోహము నుంచి విడిపించుకోవడానికి ఈ ఆత్మజ్ఞానము అత్యావశ్యకము. 

ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని ఆత్మవిచారణని పొందుతారో వాళ్ళు ఈ మొహములో నుండి బయటపడతారు. ఇప్పుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటిలో నుండీ బయటపడతారు. 

కాబట్టి మానవజన్మని ధన్యత చెందించుకోవాలి అంటే ఉత్తమమైన మార్గము ఆత్మజ్ఞానాన్ని పొందటం. ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని యమధర్మరాజు నచికేతునకి ఆత్మజ్ఞాన విశేషాన్ని గురించి బోధిస్తూ వున్నాడు. - విద్యా సాగర్ స్వామి

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 8 🌹*