శివగీత - 26 / The Siva-Gita - 26

🌹. శివగీత - 26 / The Siva-Gita - 26 🌹
🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్దా ధ్యాయము
🌻. శివ ప్రాదుర్భావము - 2 🌻

అధ జాతో మహా నాదః ప్రళయాం బుధీ భీషణః,
సముద్ర మధనో ద్భూత మంద రావనిబృ ద్ధ్వని: 11

రుద్ర బాణాగ్ని సందీప్త బృశత్త్రి పుర విభ్రమః,
తమా కర్ణ్యాధ సంభ్రాం తో యావత్పశ్యతి పుష్కరమ్ 12

తరువాత ఒక దినమున ప్రళయ కాలపు మహా సముద్రపు సవ్వడి వలె మరియు సాగర మధన సమయంబున బొడ మిన మందర పర్వత స్వనము వలె, మరియు త్రిపుర సంహార కాలమున రుద్ర బాణాగ్ని ధ్వనిం బోలిన అతి భీషణం బైన ధ్వని వినబడగా

భయ భ్రాంతితో ఎదుట వీక్షింపగా.

తావ దేవ మహా తేజో రామస్యా సీత్ర పురో ద్విజాః,
తేజసా తేన సంభ్రాం తో నా పశ్యత్ప దిశో దశ 13

అంది కృ తేక్షణ స్తూర్ణం మోహం యాతో నృ పాత్మజః,
విచింత్య తర్కయా మాస దైత్య మాయాం ద్విజేశ్వరాః 14

ఒక మహా తేజస్సు గోచరించెను. అది చూచి సంభ్రాంత మనస్సు చేత శ్రీ రాముడు దశ దిశల గలయ చూచెను. అట్టి మహా తేజశ్శక్తి ప్రభావమున దృష్టి గాన రానివాడై ఒక్కతృటి కాలము మిగుల మొహు గలవాడై మొదట దానవుల మాయగా దలచెను.

అధో త్దాయ మహావీర - స్సజ్యం కృత్వా ధను స్స్వకమ్,
ఆ విద్య న్ని శితైర్బాణై - ర్ది వ్యాస్త్రై రాభి మంత్రితై: 15

ఆగ్నేయం వారుణం సౌమ్యం - మోహనం సౌర పార్వతమ్,
విష్ణు చక్రం మహా చక్రం - కాల చక్రం చ వైష్ణవమ్ 16

పిదప లేచి తన కోదండమును బాణములతో సంధింప చేసి ఆగ్నేయము - వారుణము - మోహన - పాశుపత సౌమ్యం విష్ణు చక్రం, మహాచక్రం - కాలచక్రం వైష్ణవమ్ - రౌద్రం – బ్రాహ్మం -కౌబేరం- కులిశం - అనిలం - భార్గవం మున్నగు అనేకాస్త్రములను అభి మంత్రించి రాముడు ప్రయోగించెను.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 26 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 04 :
🌻 Shiva Praadurbhaavam - 2 🌻

One fine day Rama heard a terrible and fear striking sound which resembled the roars of oceans as made during the time of cosmic dissolution, which resembled the sound made by the mount Mandara during the churning of ocean, which resembled the terrible sound made by the arrow of Rudra when shot while destroying the three cities.

Hearing that fear striking terrible noise Rama looked around startled with fear.

Rama beheld a huge brilliance spread all around. Seeing that in a confused state Rama looked around in all directions. Due to that high intensity brilliance for a second Rama felt as if he went blind and couldn't see anything apart from light.

He thought all that was probably the illusion of some demons.

Thereafter Rama stood up holding his Kodanda bow in his hands, and projected in the air many divine missiles (arrows) through the power of Mantra viz.

Agneyam, Varunam, Mohanam, saurapaarvatam, viShnuchakraM, mahaachakram, kaalachakram, vaiShnavam, raudram, paashupatam, braahmam, kauberam, and kulishaanilam weapons.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment