🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 8 🌹

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 8 🌹
✍️. శ్రీ బాలగోపాల్ 
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని మొదటి పాత్ర - పరాత్పర - పరబ్రహ్మ - 8 🌻*

19 . ఎవరైనను ఈ పరాత్పర పరబ్రహ్మస్థితి యొక్క అనుభూతిని పొందినచో, దానిని యితరులకు వర్ణించి చెప్పవలెనన్నచో, రెండవ స్థితి అయిన పరమాత్మ స్థితిని మాత్రమే చెప్పగలరు. ఈ పరిశుద్ధ స్వరూపమునకు తనయందు గాని, ఇతరమందు గాని స్పృహయే లేదు. పరమ నిగూఢ స్థితి.

20. భగవంతుని ప్రధాన దశావస్థలలో పరాత్పరస్థితి అనాది ఆదిమూలస్థితి. ఈ దశస్థితులలో తక్కిన 9 స్థితులును లేనప్పుడు కూడా'భగవంతుడు ఉన్నాడు'అనెడు పరాత్పరస్థితియే ఉన్నది.

21.భగవంతుని పరాత్పరస్థితియొక్క అనాద్యనంతత్వములోని అనంతత, అపారముగను, నిరవధికముగను, కేవలము గాను, అనంత దివ్యశూన్యత్వముగను (మహాకాశము) ఆవిష్కారమగుచున్నది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment