విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 6 (Sloka 13 to 21)

 🌹. విష్ణు సహస్ర స్తోత్ర పాఠం - 6 🌹

🎤. స్వామి చిన్మయానంద మిషన్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. శ్లోకములు 13 నుండి 21 - సామూహిక సాధన 🌻

Audio file: Download / Listen    (VS-Lesson-06 Sloka 13 to 21.mp3)

రుద్రో బహుశిరా బభ్రుర్విశ్వయోనిః శుచిశ్రవాః |
అమృతః శాశ్వతస్థాణుర్వరారోహో మహాతపాః ‖ 13 ‖

సర్వగః సర్వ విద్భానుర్విష్వక్సేనో జనార్దనః |
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ‖ 14 ‖

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః |
చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః ‖ 15 ‖

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్నుర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ‖ 16 ‖

ఉపేంద్రో వామనః ప్రాంశురమోఘః శుచిరూర్జితః |
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ‖ 17 ‖

వేద్యో వైద్యః సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ‖ 18 ‖

మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః |
అనిర్దేశ్యవపుః శ్రీమానమేయాత్మా మహాద్రిధృక్ ‖ 19 ‖

మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాంగతిః |
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ‖ 20 ‖

మరీచిర్దమనో హంసః సుపర్ణో భుజగోత్తమః |
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ‖ 21 ‖

Whatsapp Group 
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin

Telegram Group 
https://t.me/ChaitanyaVijnanam

22 Sep 2020

నవగుంజర - ఇది ఎప్పుడైనా విన్నారా? విష్ణుమూర్తి అవతారం (Navagunjara - Vishnu Murthy avatar)

🌹. నవగుంజర - ఇది ఎప్పుడైనా విన్నారా???? విష్ణుమూర్తి అవతారం 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

ఇది ఇక జంతువు,ఇది 9 జంతువులు గా మారగలదు, కనిపించగలదు. మహాభారతం లో దీని పాత్ర కూడా అద్భుతం గా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో.ఇది గీత లో కూడా చెప్పబడింది.

ఒడియా లో మహాభారతాన్ని పోయెట్ సరలదాస గారు రాశారు.అందులో ఈ నవగుంజర యొక్క గోప్పత్తనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు,ఎప్పుడైతే అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా అప్పుడు విష్ణు మూర్తి ఈ నవగుంజర రూపం లో ప్రత్యక్షమయ్యాడు.

నవగుంజర అనేది ఇలా ఉంటుంది. దీని తల కోడిలా ఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది. అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్లు ఎలా అంటే,వరుసగా ఏనుగు కాలు,పులి కాలు,గుర్రం కాలు, నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతి గా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది.దాని మెడ నెమలి మెడ లా, తల పైభాగం లో ఒక దున్నపోతులా,పూర్తి వెనక భాగం ఒక సింహము లా దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు. మంచి విషయాలు అందరికీ తెలపడం వలన జ్ఞానం పెరుగుతుంది .🚩🚩
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj

22 Sep 2020

*🌹. నవగుంజర - ఇది ఎప్పుడైనా విన్నారా???? విష్ణుమూర్తి అవతారం 🌹*

శ్రీ విష్ణు సహస్ర నామములు - 18 / Sri Vishnu Sahasra Namavali - 18

🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 18 / Sri Vishnu Sahasra Namavali - 18 🌹
నామము - భావము

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻

వృషభరాశి- మృగశిర నక్షత్ర 2వ పాద శ్లోకం

18. వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|
అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||

అర్ధము :

163) వేద్యః -
తప్పక తెలుసుకోదగినవాడు.

164) వైద్యః -
అన్ని విద్యలు తెలిసినవాడు, సర్వజ్ఞుడు.

165) సదాయోగీ -
విశ్వముతో ఎల్లప్పుడూ అనుసంధానంతో వుండువాడు.

166) వీరహా -
మహాబలవంతుడు, దుష్టశక్తులను నాశనము చేయువాడు.

167) మాధవః -
మనస్సు ద్వారా తెలుసుకోబడువాడు.

168) మధుః -
అత్యంత ప్రియమైనవాడు, మంగళకరుడు.

169) అతీంద్రియః -
ఇంద్రియములకు అతీతుడు.

170) మహామాయః -
మాయను కలిగించువాడు, తొలగించువాడు కూడా అతడే.

171) మహోత్సాహః -
ఎంతో ఉత్సాహముతో, సహనముతో విశ్వమును పాలించువాడు.

172) మహాబలః -
అంతులేని బలము కలవాడు, అన్నింటికీ బలమును ప్రసాదించువాడు.

🌹   Vishnu Sahasra Namavali - 18   🌹
Name - Meaning

📚 Prasad Bharadwaj

🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻

Sloka for Vrushabha Rasi, Mrugasira 2nd Padam

18. vedyō vaidyaḥ sadāyōgī vīrahā mādhavō madhuḥ |
atīndriyō mahāmāyō mahōtsāhō mahābalaḥ ||18 ||

163) Vedyaḥ:
One who has to be known by those who aspire for Mokshas.

164) Vaidhyaḥ:
One who knows all Vidyas or branches of knowledge.

165) Sadāyogī: 
One who is ever experienceble, being ever existent.

166) Vīrahā:
One who destroys heroic Asuras for the protection of Dharma.

167) Mādhavaḥ:
One who is the Lord or Master of Ma or knowledge.

168) Madhuḥ:
Honey, because the Lord gives joy, just like honey.

169) Atīndriyaḥ:
One who is not knowable by the senses.

170) Mahāmāyaḥ:
One who can cause illusion even over other great illusionists.

171) Mahotsāhaḥ:
One who is ever busy in the work of creation, sustentation and dissolution.

172) Mahābalaḥ:
The strongest among all who have strength.,

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

22 Sep 2020

అద్భుత సృష్టి - 36

🌹.   అద్భుత సృష్టి - 36   🌹

✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌟. DNA యాక్టివేషన్ మూడు విధాలుగా జరుగుతుంది.

🔵 లెవల్ -1
✨ 1 నుండి 4 తంతుల యాక్టివేషన్ లో బ్రెయిన్ చక్రా యాక్టివేషన్ అవుతుంది. సహస్రార స్థితిలోకి మారుతాం.

🟢 లెవల్ -2
✨5 నుండి 8 తంతుల యాక్టివేషన్ లో సోల్ చక్రా యాక్టివేషన్ లోకి వస్తుంది. పూర్ణాత్మ స్థితిలోకి మారుతాం.

🟣 లెవల్ -3
✨ 9 నుండి 12 తంతుల యాక్టివేషన్ లో హైయ్యర్ కాన్షియస్ తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. సుప్రీమ్ సోల్ (మూల చైతన్య స్థితి) లోకి మారుతాం.

🌟. 13. DNA 12 ప్రోగులు - 12 లేయర్స్

💫. 1వ స్ట్రాండ్:
మన శరీర నిర్మాణం అంటే మన ఆరోగ్యం, నాడీమండలం, శరీర అవయవ నిర్మాణం, మొత్తం మన భౌతిక విషయాలకు సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంటుంది.

💫. 2 వ స్ట్రాండ్ :
దీనిని మన "ఎమోషనల్ లేయిర్" అంటారు. ధర్మం - అధర్మం, చీకటి - వెలుగు, జ్ఞానం - అజ్ఞానం అనే విషయాలు వివేచనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లేయర్ బ్యాలెన్స్ కొరకు చాలా ముఖ్యమైనది. జీవిత పాఠాలు కలిగి ఉన్న ఈ లేయర్ పేరు "డివైన్ బ్లూప్రింట్".

ఈ పొరలో ద్వంద్వత్వం దాగి వుంది. మొదటి పొర భౌతికత్వాన్నీ, రెండవ పొర అంతరంగం అనే వేరువేరు విషయాలను చూపి కొన్ని వేల సంవత్సరాలుగా ద్వంద్వత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

💫. 3వ స్ట్రాండ్ :
ఈ లేయర్ "అసెన్షన్ యాక్టివేషన్" కు సంబంధించినది. అసెన్షన్ కి సంబంధించిన కోడింగ్ ఈ లేయర్ లో ఉంటుంది.

💫. 4వ & 5వ స్ట్రాండ్స్ :
ఈ లేయర్స్ "ఆకాశిక్ రికార్డ్స్" కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ లేయర్స్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన DNA నుండి తొలగించబడిన సమాచారమంతా మళ్ళీ పొందవచ్చు.

💫. 6వ స్ట్రాండ్ :
ఈ లేయర్ మన గుణాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఆ గుణాలలో మాస్టరీ పొందడం జరుగుతుంది.

💫. 7వ స్ట్రాండ్ :
ఈ లేయర్ కి లెమూరియన్ భాషలో "సోలారా" అంటారు. దీని అర్థం "DNA మాస్టర్" అని అర్థం. ఇది మూల బీజపు లేయర్. ఇది ఎంత ఎక్కువ వైబ్రేషన్స్ కలిగి ఉంటే అంత ఎక్కువగా ఎదుగుతుంది. ఈ మూల బీజపు లేయర్ అతి సూక్ష్మ గ్రాహ్యతను అభివృద్ధి పరుస్తుంది.

ఈ లేయర్ వలన మనం విశ్వ రహస్యాలను టెలిస్కోప్, మైక్రోస్కోప్ లేకుండా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తో కాస్మోస్ కి ట్యూన్ అయి సమస్త సమాచార జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం.

💫. 8వ స్ట్రాండ్ :
ఇది వ్యక్తిగత ఆకాషిక్ రికార్డు లాంటిది. 4వ డైమెన్షన్ తర్వాత ట్రైమ్ స్పేస్ ఉండదు. కాబట్టి మన గత జన్మలన్నీ సమాంతర జన్మలుగా ఏకకాలంలో మన వివిధ జన్మలను తెలియజేస్తుంది. ఇది శాశ్వతత్వానికి సంబంధించినది.

💫. 9వ స్ట్రాండ్ :
దీని యాక్టివేషన్ ద్వారా హీలింగ్ పవర్ యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇది మన కర్మలను విడుదల చేసి మనలో చైతన్య విస్తరణ, ఆధ్యాత్మిక ప్రగతిని పెంపొందిస్తుంది.

💫. 10వ స్ట్రాండ్ :
ఇది మనల్ని గాడ్ కాన్షియస్నెస్ లోకి (దేవుని చైతన్యంలోకి) తీసుకుని వెళ్తుంది. దీనిని "చైతన్యపు లేయర్" అంటారు.

💫. 11వ స్ట్రాండ్ :
దీనిని "విజ్ డమ్ ఆఫ్ ఫెమినైన్ (స్త్రీ తత్వపు విజ్ఞానం)" అంటారు. ఇది శక్తి, కరుణ మరి శాంతిని యాక్టివేషన్ చేస్తుంది. స్త్రీ - పురుష శక్తులను సమతుల్యం చేస్తుంది.

💫. 12వ స్ట్రాండ్ :
ఇది దైవత్వపు లేయర్. ప్రేమ, దైవత్వం మనలో నింపుతుంది మరి మనం అంతరంగంలో దైవ మానవునిగా జీవిస్తూ, భూమిపైన వాస్తవికతతో జీవిస్తాం. సకల జీవరాశిని సమంగా ప్రేమిస్తూ తల్లిలా అందరినీ సంరక్షిస్తాం.

🌟. 12 స్ట్రాండ్ DNA యాక్టివేషన్ మూడు విధాలుగా జరుగుతుంది.🌟

💫. 1. సహస్రార చక్ర క్రిస్టల్స్ యాక్టివేషన్ లోకి వస్తాయి. తల మధ్యభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని చుట్టూ 12 క్రిస్టల్స్ ఉంటాయి. ఈ 12 క్రిస్టల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానం పొందుతాయి. ఈ 12 క్రిస్టల్స్ 12 చక్రాలతోనూ, 12 డైమెన్షన్స్ తోనూ DNA ప్రోగులతోనూ కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఎనర్జీని తయారు చేసుకోవటానికి ఒక దానితో ఒకటి కనెక్ట్ అయి.. ఒక రూపాన్ని తీసుకుంటాయి.

💫. 2. ఈ రూపాన్నే "మెర్కాబా" అంటారు. దీనిని "యూనివర్సల్ యాంటీనా " అంటారు. మన సూక్ష్మ శరీరం మెర్కాబా షేప్ తీసుకొని డైమెన్షన్ టూ డైమెన్షన్ ప్రయాణిస్తుంది. ఈ మెర్కాబా వలన ఔటర్ బాడీ అనుభవాలు వస్తాయి. హైయ్యర్ డైమెన్షనల్ మెస్సేజెస్ అన్నీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది.

💫. 3.మన తలలో పీనియల్, పిట్యూటరీ గ్రంధులతో పాటు హైపోథాలమస్ గ్రంథి ఉంటుంది. ఈ మూడు గ్రంథులు యాక్టివేషన్ లోకి వస్తాయి. ఈ హైపోథాలమస్ గ్రంథిని "యూనివర్సల్ ట్రాన్స్ లేటర్" అంటారు. ఉన్నత లోకాల సమాచారాన్నీ మరి జ్ఞానాన్నీ ఇది ట్రాన్సిలేట్ చేస్తుంది. (ఉన్నత సమాచారం కాంతి భాషల్లో ఉంటుంది).

🌟. DNA యాక్టివేషన్ కి అడ్డుపడే అంశాలు🌟

1. కర్మ సిద్ధాంతం
2. డెత్ సీల్స్ (J స్టీల్స్ )
3. ఇంప్లాంట్స్
4. చక్రాలు సీల్స్

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #అద్భుతసృష్టి

22 Sep 2020

కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 59

🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 59   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఆత్మ విచారణ పద్ధతి - 23 🌻

కాబట్టి, నచికేతుడు ఎంతటి బుద్ధిశాలో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. 

యమధర్మరాజు ఇప్పటివరకూ చెప్పినటువంటి అంశాలనన్నిటినీ నచికేతుడు తనలో తాను సమీక్షించుకున్నాడు. ఎట్లా సమీక్షించాడు? 

మొదటి వరంలోనేమో తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షి కోరిన వరాన్ని ఇచ్చారు. రెండవ వరంలో నచికేతాగ్నిచయనము గురించినటువంటి బోధంతా చెప్పారు. 

ఆ నచికేతాగ్ని చయనము అనేటటువంటి అగ్నిచయనాన్ని కర్మగా చేస్తే, నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అనీ చెప్తున్నాడు, రెండవ పద్ధతిలో ఏం చెప్తున్నాడంటే నకర్మణా - ఏం చేయడం ద్వారా కూడా నువ్వు పొందలేవు అని తద్‌విరుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా బోధిస్తున్నాడు. 

అతి సూక్ష్మము, అత్యంత సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి పద్ధతిని కూడా చెప్తూ, ఒక పక్కన ఏం చెప్తున్నాడు? అంటే నచికేతాగ్నిని అనుష్టయనం చేసి తాను అష్ట దిక్పాలకులలో ఒకడుగా అయ్యాను అనేటటువంటి స్థితిని కూడా చెప్తున్నాడు. ఈ రెండు విరుద్ధములను ఒకేసారి చెప్తున్నాడేమిటి? అనేటటువంటి దానిని సంశయించాడు. 

ఇంకేంటట? మధ్యమధ్యలో ఈ నచికేతుని యొక్క అధికారిత్వమును గురించి ప్రశంసించి, ఈయనని దాటవేస్తున్నాడేమో ఒకవేళ తాను ఏదైతే పొందాలని అనుకున్నాడో, తన ప్రశ్న ఏదైతే వుందో, మరణానంతరం జీవితం వుందా? మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి? అనే ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడేమో, కాబట్టి, అలాంటి పద్ధతి కాకుండా, ఆచార్యుడిని నేను స్పష్టముగా ప్రశ్నించాలి. ‘పరిప్రశ్నేన సేవయా’ - అనేటటువంటి పద్ధతిగా నేను తిరిగి ప్రశ్నించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మరల ప్రశ్నిస్తున్నాడు.

ఆచార్యా! నేను బ్రహ్మోపదేశమునకు అర్హుడనైతినేని, మీకు నా యందు సంపూర్ణ అనుగ్రహమున్న యెడల వేదవిహిత కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టియు, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము, దాని ఫలమునకు వేరైనట్టియు, కార్యకారణ జగత్తునకు వేరైనట్టియు, కాలత్రయముచే బాధింపబడక అపరిచ్ఛిన్నమైనదో అట్టి పరమాత్మ తత్వమును నీవెరిగి యున్నావు. నీవెరిగిన ఆ తత్వమునే నాకు బోధింపుమని నచికేతుడు యముని ప్రార్థించెను.

అయ్యా! నీవు... ‘నేను అధికారిని’ అని అంటున్నావు కాబట్టి, మీ వద్ద వున్నటువంటి, పరమాత్మ తత్వమునకు సంబంధించినటువంటి, బ్రహ్మోపదేశాన్ని నాకు చేయండి. ఎందువల్ల? అంటే, దాని విశేషం ఏమిటంటే...

కర్మలు ద్వివిధింబులు.
1. వేద విహితమైన కర్మ.
2. వేద నిషిద్ధమైన కర్మ.

వేద విహితమైన కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యములని పొందవచ్చు. వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు. 

వేద నిషిద్ధమైన కర్మ చేయడం ద్వారా ద్వంద్వానుభూతులైనటువంటి ఈ జగత్తునకు పుణ్యపాప కర్మల చేత, జనన మరణముల చేత, బాధించబడుతూ... స్వర్గ నరకముల చేత, అనుభూతములను పొందుతూ, సుఖదుఃఖాలను పొందుతూ, కష్ట నష్టాలను పొందుతూ... రాత్రి పగళ్ళయందు చరిస్తూ.... ఈ రకమైనటువంటి ద్వంద్వాలలో మునిగి తేలుతూ వుండేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. మరి ఈ రెండూ కూడా పరతత్వమును పొందింప జాలవు. 

కాబట్టి వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానము, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము.... ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఫలము ‘ఆత్మనిష్ఠ’ కాదు. కాబట్టి మీరు కార్యకారణ జగత్తుకు వేరైనట్టి... ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే కార్యకారణ వివేకం కనుక నీవు పొందకపోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు కాలేవు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

35. గీతోపనిషత్తు - అంకుశము

🌹 35. గీతోపనిషత్తు - అంకుశము - ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడును 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 67 📚

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో నువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు క్నావ మివాంభసి || 67

నీటియందు తేలు నావ గాలిని బట్టి పోవుచుండును. గాలి వాలును బట్టి నావ పలుదిక్కులకు ఈడ్వబడు చుండును కదా! అట్టు పలు విధములుగ ఈడ్యబడుట నావకు ప్రయాణ మెటు కాగలదు?

ముక్కుతాడు వేయని ఎద్దు చేలయందుబడి పంటను విధ్యంసము చేయుచు, చిందులు వేయుచు తినినంత తిని, మిగిలినది పాదములతో త్రొక్కుతూ స్వైర విహారము చేయును. అట్టి ఎద్దు పొలమున కెట్టు ఉపయోగపడ గలదు?

కళ్ళెములేని గుజ్జములతో గూడిన రథము, గుజ్జములెటు లాగినచో అటుపోవును. తత్కారణముగ రథము నశించునుకదా ! శిక్షణము, మావటి లేని మదపుటేనుగు అపాయకరము కదా!

అట్లే రాగద్వేషముల ననుసరించుచు, ఇంద్రియముల ద్యారా ఇంద్రియార్థముల కొరకై పరుగెత్తు మనస్సు మనుజుని హరించును.

నావ పయనించవలె నన్నచో తెరచాప, చుక్కాని ఏర్పరచవలెను. ఎద్దు ఉపయోగపడవలె నన్నచో ముక్కుకు తాడు బిగించి, శిక్షణ నిచ్చి అరక కట్టించవలెను. గుర్రములు ప్రయాణమునకు వినియోగ పడవలెనన్నచో కళ్ళకు గంతలు కట్టి, కళ్ళెము వేసి పగ్గములు పట్టి నడిపించవలెను. మదపుటేనుగు బలము వినియోగ పడవలెనన్నచో అంకుశముతో మావటివాడు అధిష్టించి యుండవలెను.

అట్లే ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడునని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 116

🌹.   భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 116   🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మతంగ మహర్షి - 4 🌻

25. ఋషులెప్పుడు సత్యవాక్కులే చెపుతారు. వాళ్ళుచెప్పేది శాపం అంటారుకాని, అది సత్యమే! ఆ వాక్కు యథార్థమవుతోంది.

26. “నీలో రాక్షస ప్రవృత్తి ఉన్నది కాబట్టి రాక్షసుడివై పుట్టు. బ్రాహ్మణుడియొక్క రూపంలో రాక్షసవృత్తి కలిగిఉండి తిరిగితే, నిన్ను బ్రాహ్మణుడనుకుని నమస్కరిస్తారు. అందువలన అలా తిరగకు. ఇతరులు మోసపోకుండా ఉందురుగాక! నీవు సహజమైన జన్మ ఎత్తు!” అని ఋషుల తాత్మర్యం.

27. దానిని ఈ జన్మలో శాపం అంటాం మనం. ఏం! ఇది సత్యం కాదా! సత్యవాక్కులు వాళ్ళవి. మహర్షులు సత్యాన్ని ఆరాధిస్తారు. అంతఃకరణలో ఎప్పుడూ సత్యాన్నే పెట్టుకుంటారు. అసత్యం అనేది మనసా వాచా కర్మణా అంటదు వాళ్ళను.

28. మహర్షులందరూ సత్యవచనులు కాబట్టి వారు మహాత్ములవుతారు. ఏదో యోగబలముండి, తపోబలముండి, మనిషిని కుక్కను చేయగడొకడు. అంటే మాయల మరాఠికూడా అలా చేయగలడు. అయితే అంతమాత్రంచేత వాడు మహాత్ముదవుతాడా? అలాకాదు. ఋషులు అలాంటివారు కారు.

29. సత్యమే బ్రహ్మవస్తువు. సత్యమే జ్ఞానము. సత్యమే పరతత్త్వము. సత్యమే పరమేశ్వరుడు. సత్యమే శాశ్వతమైన వస్తువు.

30. సత్యము కానటువంటి వస్తువు అసలు ఉండదు. ఎల్లకాలము అది అనిత్యమైనది. అనిత్యమైనవస్తువు ఎప్పుడూ సత్యముకాదు. నిత్యము సత్యము అయిన వస్తువునే మహర్షులు ఉపాసిస్తారు. మనసులో ఏ భావనలో ఉంటారో, చిత్తమందుకూడా అదే భావన. అంతఃకరణలో అదేభావన చేస్తారు. వాళ్ళు దానిని అట్లాగే ప్రకటిస్తారు.

31. అసత్యంలో ఉండేవాళ్ళు సామాన్యులు, పామరులు. కాబట్టి మనకు ఋషులనుంచీ శిక్షగా వినిపిస్తుంది ఆ మాట. ఆ సత్యానికి దారితెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం వైదిక, ధార్మిక స్వధర్మనిర్వహణ.

32. అట్టి మార్గమే సత్త్వగుణ ప్రధానత కలిగిన మార్గం అని సంప్రదాయం చెపుతోంది. ఆ సంప్రదాయంలో ఉన్న – వేదం చదివిన బ్రాహ్మణుడైనా, కాకపోయినా, సత్య మార్గంలో ఉండేవాడు-ఎవడైనా సరే, తనకు విహితమైన ధర్మమున్నదే – ఆ ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని ఉపాసిస్తే – క్రమంగా ముక్తికి వెళతాడు. అంతేకాని పాండిత్యంచేత, కేవలం కర్మచేత కాదు.

‘నకర్మణా న ప్రజయా ధనేన| త్యాగేనైకే అమృతత్త్వమానశుః‘ –
అమృతత్త్వం అంటే సత్యమే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

22 Sep 2020

శ్రీ శివ మహా పురాణము - 229

🌹 .   శ్రీ శివ మహా పురాణము - 229   🌹 

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సతీఖండః  🌴 
50. అధ్యాయము - 5

🌻. సంధ్య యొక్క చరిత్ర - 5 🌻

కిమర్థ మాగతా భ##ద్రే నిర్జనం త్వం మహీధరమ్‌ | కస్య వా తనయా కిం వా భవత్యాపి చికీర్షితమ్‌ || 50
ఏతది చ్ఛామ్యహం శ్రోతుం వద గుహ్యం న చేద్భవేత్‌ | వదనం పూర్ణచంద్రాభం నిశ్చేష్టం వా కథం తవ || 51

వసిష్ఠుడిట్లు పలికెను -

ఓ మంగళ స్వరూపురాలా! ఈ నిర్జనమగు కొండపైకి ఏల వచ్చితివి? నీవు ఎవరి కుమార్తెవు? నీవు ఏమి చేయ దలచితివి? (50). 

ఇది రహస్యము కానిచో నేను వినగోరు చున్నాను. పున్నమి చంద్రుని వంటి నీ ముఖము అలంకార విహీనము గా ఉన్నది యేల? (51).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా వచనం తస్య వసిష్ఠస్య మహాత్మనః | దృష్ట్వా చ తం మహాత్మానం జ్వలంతమివ పావకమ్‌ || 52
శరీరధృగ్‌ బ్రహ్మచర్యం విలసంతం జటా ధరమ్‌ | సాదరం ప్రణిపత్యాథ సంధ్యోవాచ తపోధనమ్‌ || 53

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్ముడగు వసిష్ఠుని ఆ పలుకులను విని, అగ్నివలె ప్రకాశించుచున్న ఆ మహాత్ముని చూచి (52), 

మూర్తిదాల్చిన బ్రహ్మచర్య మా యన్నట్లు జటలను ధరించి ప్రకాశించుచున్న ఆ తపోనిష్ఠుడగు వసిష్ఠునకు ఆదరముతో ప్రణమిల్లి, అపుడు సంధ్య ఇట్లు పలికెను (53).

సంధ్యో వాచ |

యదర్థమాగతా శైలం సిద్ధం తన్మే నిబోధ హా | తవ దర్శనమాత్రేణ యన్మే సేత్స్యతి వా విభో || 54
తపశ్చర్తుమహం బ్రహ్మన్నిర్జనం శైలమాగతా | బ్రహ్మణోsహం సుతా జాతా నామ్నా సంధ్యేతి విశ్రుతా || 55
యది తే యుజ్యతే సహ్యం మా త్వం సముపదేశయ | ఏతచ్చికీర్షితం గుహ్యం నాన్యైః కించన విద్యతే || 56
అజ్ఞాత్వా తపసో భావం తపోవనముపాశ్రితా | చింతయా పరి శుష్యేsహం వేపతే హి మనో మమ || 57

సంధ్య ఇట్లు పలికెను -

నేను ఏ ప్రయోజనము నాశించి ఈ పర్వతమునుకు వచ్చి యుంటినో, ఆ ప్రయోజనము సిద్ధించినదని యెరుంగుడు. హే ప్రభో! మిమ్ములను దర్శించుట మాత్రము చేతనే, నాకు ఆ ప్రయోజనము సిద్ధించగలదు (54). 

హే బ్రాహ్మణా!నేను తపస్సును చేయుటకై ఈ జనసంచారము లేని పర్వతమునకు వచ్చి యుంటిని. నేను బ్రహ్మగారి కుమార్తెను. నాకు సంధ్య అనే పేరు ప్రసిద్ధమై యున్నది(55).

 మీకు ఉచితమని తోచినచో, నాకు చక్కగా ఉపదేశించుడు. నేను ఈ తపస్సును రహస్యముగా చేయగోరితిని. దీనికి ఇతరులతో పనిలేదు (56). 

తపస్సును చేయువిధమును తెలియకుండగనే, నేను తపోవనమును చేరుకుంటిని. నేను దుఃఖముతో ఎండి పోవుచున్నాను. నామనస్సు వణుకుచున్నది (57).

బ్రహ్మోవాచ |

ఆకర్ణ్య తస్యా వచనం వసిష్ఠో బ్రహ్మ విత్తమః | స్వయం చ సర్వ కృత్యో జ్ఞో నాన్యత్కించన పృష్టవాన్‌ || 58
అథ తాం నియతాత్మానం తపసేsతి ధృతోద్యమామ్‌ | ప్రోవాచ మనసా స్మృత్వా శంకరం భక్తవత్సలమ్‌ || 59

బ్రహ్మ ఇట్లు పలికెను -

బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడు, తపస్సు యొక్క సర్వకార్యములను స్వయముగా నెరింగినవాడు నగు వసిష్ఠుడు ఆమె మాటను విని ఆమెను ఏమియూ ప్రశ్నించలేదు (58). 

ఆయన భక్తవత్సలుడగు శంకరుని మనస్సులో స్మరించుకొని, నియంత్రింపబడిన దేహేంద్రియమన స్సంఘాతము కల్గినది, తపస్సు కొరకు గొప్ప దీక్షతో ఉద్యమించినది అగు ఆ సంధ్యతో నిట్లనెను (59).

వసిష్ఠ ఉనాచ |

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |పరమః పరమారాధ్యః శంభుర్మనసి ధార్యతామ్‌ || 60
ధర్మార్థ కామ మోక్షాణాం య ఏకస్త్వాదికారణమ్‌ | తమేకం జగతా మాద్యం భజస్వ పురుషోత్తమమ్‌ || 61
మంత్రేణానేన దేవేశం శంభుం భజ శుభాననే | తేన తే సకాలావాప్తి ర్భవిష్యతి న సంశయః || 62
ఓం నమశ్శంకరాయేతి ఓమిత్యం తేన సంతతమ్‌ | మౌనతపస్యా ప్రారంభం తన్మే నిగదతశ్శృణు || 63

వసిష్ఠుడిట్లు పలికెను -

ఎవరు తేజో మూర్తులలో కెల్లా గొప్ప తేజో మూర్తియో, తపస్సులలో కెల్లా గొప్ప తపో మూర్తియో, పూజ్యులలో కెల్లా గొప్ప పూజ్యుడో అట్టి శంభుని మనస్సునందు నిలుపుము (60). 

ధర్మార్థకామ మోక్షములకు ఏకైక ప్రథమ కారణము, జగత్తులకు తండ్రి, పురుషశ్రేష్ఠుడునగు శంభుని సేవింపుము (61).

 ఓ సుందరవదనా! ఈ మంత్రముతో దేవదేవుడగు శంభుని భజింపుము. అట్లు భజించుట వలన నీకు నిస్సందేహముగా కోర్కెలన్నియూ ఈడేరగలవు (62). 

ఓం నమశ్శంకరాయ ఓం అను ఆద్యంతములందు ఓంకారము గల మంత్రమును జపించుము. మౌన తపస్సును నేను చెప్పెదను. నీవు విని, ఆరంభింపుము (63).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

సిద్ధకుంజికా స్తోత్రం / सिद्धकुञ्जिका स्तोत्रम्

🌹. సిద్ధకుంజికా స్తోత్రం / सिद्धकुञ्जिका स्तोत्रम् 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

సకల దుఃఖాలను తొలగించి, అనేక శుభాలు కలిగించి, సిద్ధిని కలిగించే స్తోత్రము సిద్ధ కుంజికా స్తోత్రము. ఈ స్తోత్రము చదవటం వల్ల అపమృత్యుదోషం ఉండదు.
--  సద్గురు పండిత శ్రీరామశర్మ ఆచార్య

ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |

శివ ఉవాచ –

శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమమ్ |
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ || ౧ ||

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ |
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ || ౨ ||

కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ |
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ || ౩ ||

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి |
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికమ్ |
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికాస్తోత్రముత్తమమ్ || ౪ ||

అథ మంత్రః |

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే |

ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా || ౫ ||

ఇతి మంత్రః |

నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని |
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని || ౬ ||

నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని |
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే || ౭ ||

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా |
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే || ౮ ||

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ |
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి || ౯ ||

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ |
క్రాం క్రీం క్రూం కాలికా దేవి శాం శీం శూం మే శుభం కురు || ౧౦ ||

హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ |
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః || ౧౧ ||

అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం |
ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా || ౧౨ ||

పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా |
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే || ౧౩ ||

కుంజికాయై నమో నమః |

ఇదం తు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే |
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి || ౧౪ ||

యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేత్ |
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా || ౧౫ ||

ఇతి శ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీసంవాదే కుంజికాస్తోత్రం సంపూర్ణమ్ |

🌹. सिद्धकुञ्जिका स्तोत्रम् 🌹

ओं अस्य श्रीकुञ्जिकास्तोत्रमन्त्रस्य सदाशिव ऋषिः, अनुष्टुप् छन्दः, श्रीत्रिगुणात्मिका देवता, ओं ऐं बीजं, ओं ह्रीं शक्तिः, ओं क्लीं कीलकम्, मम सर्वाभीष्टसिद्ध्यर्थे जपे विनियोगः ।

शिव उवाच –

शृणु देवि प्रवक्ष्यामि कुञ्जिकास्तोत्रमुत्तमम् ।
येन मन्त्रप्रभावेण चण्डीजापः शुभो भवेत् ॥ १ ॥

न कवचं नार्गलास्तोत्रं कीलकं न रहस्यकम् ।
न सूक्तं नापि ध्यानम् च न न्यासो न च वार्चनम् ॥ २ ॥

कुञ्जिकापाठमात्रेण दुर्गापाठफलं लभेत् ।
अति गुह्यतरं देवि देवानामपि दुर्लभम् ॥ ३ ॥

गोपनीयं प्रयत्नेन स्वयोनिरिव पार्वति ।
मारणं मोहनं वश्यं स्तम्भनोच्चाटनादिकम् ।
पाठमात्रेण संसिद्ध्येत् कुञ्जिकास्तोत्रमुत्तमम् ॥ ४ ॥

अथ मन्त्रः ।

ओं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ।
ओं ग्लौं हुं क्लीं जूं सः ज्वालय ज्वालय ज्वल ज्वल प्रज्वल प्रज्वल
ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ज्वल हं सं लं क्षं फट् स्वाहा ॥ ५ ॥

इति मन्त्रः ।

नमस्ते रुद्ररूपिण्यै नमस्ते मधुमर्दिनि ।
नमः कैटभहारिण्यै नमस्ते महिषार्दिनि ॥ ६ ॥

नमस्ते शुम्भहन्त्र्यै च निशुम्भासुरघातिनि ।
जाग्रतं हि महादेवि जपं सिद्धं कुरुष्व मे ॥ ७ ॥

ऐङ्कारी सृष्टिरूपायै ह्रीङ्कारी प्रतिपालिका ।
क्लीङ्कारी कामरूपिण्यै बीजरूपे नमोऽस्तु ते ॥ ८ ॥

चामुण्डा चण्डघाती च यैकारी वरदायिनी ।
विच्चे चाभयदा नित्यं नमस्ते मन्त्ररूपिणि ॥ ९ ॥

धां धीं धूं धूर्जटेः पत्नी वां वीं वूं वागधीश्वरी ।
क्रां क्रीं क्रूं कालिका देवि शां शीं शूं मे शुभं कुरु ॥ १० ॥

हुं हुं हुङ्काररूपिण्यै जं जं जं जम्भनादिनी ।
भ्रां भ्रीं भ्रूं भैरवी भद्रे भवान्यै ते नमो नमः ॥ ११ ॥

अं कं चं टं तं पं यं शं वीं दुं ऐं वीं हं क्षं ।
धिजाग्रं धिजाग्रं त्रोटय त्रोटय दीप्तं कुरु कुरु स्वाहा ॥ १२ ॥

पां पीं पूं पार्वती पूर्णा खां खीं खूं खेचरी तथा ।
सां सीं सूं सप्तशती देव्या मन्त्रसिद्धिं कुरुष्व मे ॥ १३ ॥

कुञ्जिकायै नमो नमः ।

इदं तु कुञ्जिकास्तोत्रं मन्त्रजागर्तिहेतवे ।
अभक्ते नैव दातव्यं गोपितं रक्ष पार्वति ॥ १४ ॥

यस्तु कुञ्जिकया देवि हीनां सप्तशतीं पठेत् ।
न तस्य जायते सिद्धिररण्ये रोदनं यथा ॥ १५ ॥

इति श्रीरुद्रयामले गौरीतन्त्रे शिवपार्वतीसंवादे कुञ्जिकास्तोत्रं सम्पूर्णम् ।

🌹🌹🌹🌹🌹

22 Sep 2020

మంత్ర పుష్పం - భావగానం - 3

🌹. మంత్ర పుష్పం - భావగానం - 3 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మంత్ర పుష్పం 5. 🌻

నారాయణ పరో
జ్యోతి రాత్మా
నారాయణః పరః
నారాయణ పరమ్
బ్రహ్మ తత్వం
నారాయణః పరః
నారాయణ పరో
ధ్యాతా ధ్యానం
నారాయణః పరః

భావగానం:
నారాయణుడే పరమలోకము
నారాయణుడే జ్యోతిరూపము
నారాయణుడే ఆత్మ రూపము
నారాయణుడే పరబ్రహ్మము
నారాయణునే ధ్యానిoచుము

🌻. మంత్ర పుష్పం 6.🌻

యచ్చకించి జ్జగత్సర్వం దృశ్యతే శ్రూయతే౭ పివా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్స్థితః

భావగానం:

చూసే దంతా వినే దంతా
లోకమంతా మారే దంతా
లోనా బైటా వుండే దంతా
పైనా కింద వుండే దంతా
నారాయణుడే అ దంతా

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మంత్రపుష్పం

22 Sep 2020

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 52

🌹.  భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 52  🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 2 🌻

203. సూక్ష్మ-కారణదేహములు‌,విడువబడిన గత భౌతకరూప యొక్క సంస్కారములను నిలిపియుంచినవి.

204. పూర్వజన్మ సంస్కారములను అనుభవించుటకే‌‌, ఆత్మ మరియొక రూపముతో సహచరించున్నది.

205. పూర్వజన్మ సంస్కారములు సంపుటయే ప్రస్తుత జన్మకు రూపమిచ్చును.

ఏల పునర్జన్మము కావలసి వచ్చినది?

206. తొలి మానవ రూపము యొక్క, మానవ రూపమును పూర్వమందున్న పరిణామ రూపముల యొక్క సంస్కారములను అనుభవించుటకే, ఆత్మ, మానవ రూపములో మరల మరల పునర్జన్మములను పొందవలసి వచ్చినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్

22 Sep 2020

శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 59 / Sri Gajanan Maharaj Life History - 59

🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 59 / Sri Gajanan Maharaj Life History - 59 🌹

✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. 12వ అధ్యాయము - 1 🌻

శ్రీగణేశాయనమః ! ఓగణపతి, మయూరేశ్వరా వచ్చి నా హృదయంలో కూర్చుని నేను ఈగ్రంధం పూర్తి చెయ్యడంలో నాకు సహాయం చెయ్యండి. మీరు విద్య, తెలివితేటలు ఇచ్చేవారు, మీరే అన్ని విఘ్నాలు తొలగించి భక్తులకోరికలు పూర్తి చేసేది మీరొక్కరే. పురాణాలుకూడా అదే చెపుతున్నాయి.

ఓ ఏకదంతా, లంబోదరా, పార్వతీసుతా, బాలచంద్రా, సింధూరా నన్ను అన్ని ఆదుర్ధలనుండి బయట పడనివ్వండి. ధనవంతుడు, ఉదారుడు అయిన ఒక బచులాల్ అగరవాల్ అనే వ్యక్తి అకోలాలో ఉండేవాడు. కారంజావాసి లక్ష్మణగుడే వృత్తాంతం విన్నాక అతని మనసులో కొన్ని అనుమానాలు కలిగాయి.

అతను ఇంకా దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుందాము అని అనుకుంటూ ఉండగా, శ్రీమహారాజు స్వయంగా అకోలా వచ్చి అతని ఇంటికి చేరారు. బచులాల్ అమిత ఆనందంపొంది, శ్రీమహారాజును పూజించాలన్న తన కోరికను ఆయనకు వ్యక్తపరిచాడు. ఆయన తన అనుమతి ఇచ్చారు.

శ్రీబచులాల్ పూజకొరకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసాడు. మొదట శ్రీమహారాజుకు సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి, తరువాత ఒక పట్టుపంచ, ఒక కాశ్మీరీషాలు మరియు పట్టుబట్టతో చేసిన ఒక ముకుటం ఇచ్చాడు. ఒక బంగారం గొలుసు మెడలో వేసి, అన్ని వేళ్ళకీ బంగారం ఉంగరాలు పెట్టాడు. ఒక వజ్రాల కంకణం ఎడమ చేతికి పెట్టి అత్తరు శరీరంమీద చల్లాడు. తరువాత జిలేబి మరియు ఇతర మిఠాయిలతో భోజనం పెట్టారు. ఆతరువాత ఒక బంగారు పళ్ళెంనిండా సుమారు పదివేల రూపాయలు, నాణాలు ఒక కొబ్బరికాయతో సహా శ్రీమహారాజుకు దక్షిణగా అందించాడు.

తరువాత చేతులుకట్టుకుని, మహారాజ్ ! రామనవమి ఉత్సవాలు జరిపేందకు నాఇంటి ప్రాంగణంలో స్థలం సరిపోవడం లేదు, కావున నేను శ్రీరాముని మందిరం కట్టాలనుకుంటున్నాను, దయచేసి నాకోరిక పూర్తి చెయ్యండి అని బదులాల్ అన్నాడు. అలాఅంటూ అతివినయంగా తన తలను శ్రీమహారాజు పాదాలమీద పెడతాడు.

శ్రీ రామచంద్ర భగవానుడు నీకోరిక తీరుస్తారు అని నేను నిన్ను దీవిస్తున్నాను. కానీ ఇన్ని ఆభరణాలు నాశరీరంమీద పెట్టి ఏమిటినువ్వు చేసింది ? నువ్వు నన్ను పోలానాటి ఎద్దును చేసావు.

నేను ఇలా పోలానాటి ఎద్దునుకాని, దశరానాటి గుర్రాన్ని కాని కాను. ఈ ఆభరణాలు నాకు నిరుపయోగం. ఇవి నాకు ఒక విషంలాంటివి. నేను కనీసం వాటిని ముట్టుకోకూడదు. నన్ను ఇటువంటి ప్రాపంచిక వస్తువులతో ప్రలోభితం చెయ్యడానికి ప్రయత్నించకు. లేక ఇవన్నీ నీసంపత్తిని ప్రదర్శించేందుకు చేసావా ?

ఎదుటి మనిషి తీసుకుందుకు ఇష్టపడే వస్తువులు మాత్రమే నీవు ఇవ్వాలి. నేను ఒక పిచ్చగా , నగ్నంగా తిరిగే సన్యాసిని. ఇవన్నీ నీవద్దనే ఉండనీ, నీలా సంసారికజీవనం గడిపేవారికి ఇవి ఉపయోగపడతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Gajanan Maharaj Life History - 59 🌹

✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj

🌻 Chapter 12 - part 1 🌻

Shri Ganeshayanmah! O Ganapati! Mayureshwar! Come, sit in my heart and help me complete this book. You are the giver of knowledge and intelligence and the only one to fulfill the desires of His devotees by removing all the obstacles. Puranas also say so.

O Ekdanta! Lambodara! Parvatisuta! Bhalchandra! Sindura! Please rid me of all anxieties. There was one Bachchulal Agrawal at Akola a rich and generous person. He had heard about the episode of Laxman Ghude of Karanja which had created some doubts in his mind.

As he was thinking to find the real fact behind it, Shri Gajana Maharaj, himself, came to Akola and reached his house. Bachchulal was immensely happy and expressed to Maharaj the desire to worship Him.

Shri Gajanan Maharaj gave his consent. Shri Bachchulal made elaborate arrangements for the Puja; first Shri Gajanan Maharaj was given a bath with scented water and then offered a fine silken pitambar, a Kashmiri shal and a silken pheta.

A gold chain was placed around His neck and gold rings on all His fingers. A bracelet of diamonds was put on his left arm and perfumes were sprinkled on the body. Then, meals with jalebi and other sweets were given to him.

Thereafter a golden thali full of rupees and moharas was offered to Shri Gajanan Maharaj as Dakshina which amounted to about Rs. Ten thousands and on it was put a coconut.

Then, with folded hands, Bachchulal said, Maharaj, I wish to construct a Shri Ram temple as the space in my courtyard is insufficient for the annual celebration of Ram Navami. Kindly fulfill my desire.”

Saying so he, most reverently, put his head on the feet of Shri Gajanan Maharaj . Then upon Shri Gajanan Maharaj said, “I bless you that God Shri Ramchandra will fulfill your desire. But what have you done this by putting so many ornaments on my body?

You have made me look like a bullock of the ‘Pola’ festival. You see, I am neither a bullock of Pola nor a horse of Dasherra. These ornaments are of no use to me, or rather they are poison for me and I should not have even a touch of them.

Don't try to tempt me by all these material attachments or Bachchulal have you done all this exhibit your wealth? You should offer only those things which can be liked by the receiver. I am a mad, wandering, naked saint. Let these things be with you only. It is useful for people leading a family life like you.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గజాననమహరాజ్ #GajananMaharaj

22 Sep 2020

శివగీత - 70 / The Siva-Gita - 70

🌹.   శివగీత - 70 / The Siva-Gita - 70   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

నవమాధ్యాయము

🌻. శరీర నిరూపణము - 4 🌻

కర్మేంద్రి యాణాం జానీయా - న్మన శ్చైవో భయాత్మకమ్,
క్రియా స్తేషాం మనో బుద్ధి - రహంకార స్తతః పరమ్ 18

అంతః కరణ మిత్యాహు - శ్చిత్తం చేతి చతుష్టయ మ్,
సుఖం దుఃఖం విషయౌ - విజ్ఞేయౌ మనసః క్రియాః 19

స్మృతీభీ టివి కల్పాద్యాః - బుద్ధి: - స్సాన్నిశ్చయాత్మికా,
అమం మమేత్య హంకార - శ్చిత్తం చేత యతే యతః 20

స్మృతి - భీతి - వికల్పము - మొదలగునవి, సుఖదుఃఖ సాక్షాత్కారము, మసస్సు చేయు క్రియలు, నిశ్చయాత్మక క్షాము బుద్ధి, నేను, నాది యనునది యహంకారము, ఇంద్రియ గోరములను దలంపచేయునది చిత్తము.

సత్త్వాఖ్య మంతః కరణం - గుణభే దాత్త్రిదా మతమ్,
సత్త్వం రజ స్తమ ఇతి - గుణా స్సత్వాత్తు సాత్త్వికాః 21

ఆస్తిక్య శుద్ధి ధర్మైక - రుచి ప్రభ్రుత యో మతాః
రజసో రాజసా భావాః - కామక్రోధ మదాదయః 22

నిద్రాలస్య ప్రమాదాది - వంచనాద్యాస్తు తామసాః
ప్రసన్నేంద్రియ తారోగ్యా - నాలప్యాద్యా సతు సత్త్వాజాః 23

దేహొ మాత్రాత్మక స్తస్మా - దాదత్తే తద్గుణా నిమాన్,
శబ్ద స్శ్రోత్రం ముఖరతా - వైచిత్ర్యం సూక్ష్మ తా ధృతి 24

బలంచ గగనా ద్వాయో - స్స్వర్శశ్చ స్పర్శనేంద్రియమ్,
ఉతేక్ష పణ మనక్షే పా - కుంచనే గమనం తథా 25

ప్రసారణ మీటి మాని - పంచ కర్మాణి రూక్షతా,
ప్రాణపానౌ త థా వ్యాన - సమానో దాన సంజ్ఞ కాన్ 26

నాగం కూర్మం చ కృకరం - దేవదత్తం ధనంజయమ్,
ద శైతా వాయు వికృతీ - స్తథా గృహ్ణాతి లాఘవమ్ 27

నామాంతరము చేత సత్వగుణమని చెప్పబడు అంతఃకరణము, గుణభేదము వలన మూడు ప్రకారములు అవియే సత్త్వర జస్త మోగుణములు.

సాత్విక గుణములు ఏమియనగా: ఆస్తికత్వము, శుభ్రత, ధర్మాసక్తి మొదలగు మంచి గుణములన్నియు సాత్వికగుణములు (సత్వగుణ జన్మములు).

రజోగుణము నుండి రాజసగుణములు అనగా కామ - క్రోధ - మదము మొదలగునవి.

మధ్యగుణములు, నిద్ర - ఆలస్యము (సోమరితనము) పరమాడం (జాగ్రత్త లేనిది) వంచించుట ఇవే మొదలగునవి తమోగుణ జన్యములు తామసములు.

నిర్మలేంద్రియత్వము ఆరోగ్యము. కుశలత, మొదలగునవి పైన బెర్కొనిన సాత్విక గుణ జన్యములు. ఈ శరీరము పంచతన్మాత్రాత్మకము, కనుక తద్గుణములనే స్వీకరించును.

శబ్దము శ్రోత్రేంద్రియము. మాటలాడుట, పనిలో నిపుణత లాఘవము, ధైర్యము, శక్తి - ఇవి ఆకాశమునుండి లభించును. స్పర్శము, స్పర్శేంద్రియము (చర్మము పైనుండి స్పర్శేంద్రి యమనుట) చాచుట - వంచుట - ముడుచుట - విస్తరింపచేయుట, గమనము, కాటిన్యము ప్రాణ - అపాన, వ్యాన ఉదాన, సమానములు అను పంచ మహావాయువులు, నాగము కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అను పంచోపవాయువులు, తేలికయగుట, ఈ గుణములు వాయువుచేత లభ్యములు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹   The Siva-Gita - 70   🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj

Chapter 09 :
🌻 Deha Svarupa Nirnayam - 4
🌻

Ears, five sense organs, sabdha, sparsha, rupa, rasa, gandha, five tanmaatras, vakpanipadapayovastha, karmendriyas, excretary organs, organs of speech, mind, mindegointellect, chitta, antahkarana, are all called as Chatushtyam; among them, smruti (memory), bheeti (fear), vikalpam (idea), happiness and sorrow, acts done by the mind, buddhi, ego, the feeling of mine such qualities which are not known by indriyas are experienced by the help of chittam.

Satvika qualities are faith (in god), cleanliness, inclination towards righteousness, etc. good qualities which are formed from the Satwa qualities.

From Rajas qualities arise lust, anger, infatuation, etc. qualities. From tamo guna arise sleep, laziness, careless nature etc qualities.

Having controlled senses, sound health, skillfulness, etc are again the products of Satwa quality.

From the sky element sound, ears, speech, skillfulness, patience, strength, are obtained. Touch, skin, movements, expansion contractions, harhsness, prana, apana, vyana, udana, samana winds, naga, kurma, krukuram, devadattam, dhananjayam kind of five subwinds etc attributes are obtained from the wind element.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

22 Sep 2020

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 16 / Vishnu Sahasranama Contemplation - 16

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 16 / Vishnu Sahasranama Contemplation - 16 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 16. క్షేత్రజ్ఞః, क्षेत्रज्ञः, Kṣetrajñaḥ 🌻

ఓం క్షేత్రజ్ఞాయ నమః | ॐ क्षेत्रज्ञाय नमः | OM Kṣetrajñāya namaḥ

క్షేత్రం - శరీరం - జానాతి; క్షేత్రమును - చైతన్యమునకు ఆశ్రయమగు శరీరమును తన జ్ఞానశక్తితో ఎరుగువాడు క్షేత్రజ్ఞుడు.

:: మహాభారతం - శాంతి పర్వం ::

క్షేత్రాణి హి శరీరాణి బీజం చాపి శుభాశుభం ।

తాని వేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే ॥ 351.6 ॥

శరీరములను క్షేత్రములందురు. ప్రాణుల శుభాశుభకర్మములు వానికి బీజము. యోగాత్ముడగు పరమాత్ముడు ఈ రెంటిని ఎరిగియుండును. అందుచే అతడు క్షేత్రజ్ఞుడని వ్యవహరింపబడుతాడు.

:: భగవద్గీత - కేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ::

ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే ।

ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 2 ॥

శ్రీ భగవానుడు చెప్పెను - కుంతీపుత్రుడవగు ఓ అర్జునా! ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దానిని తెలిసికొనువాడు క్షేత్రజ్ఞుడని - క్షేత్ర క్షేత్రజ్ఞుల నెఱింగినవారు చెప్పుదురు.

ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒకశక్తి తెలిసికొనుచున్నది. ఆ ప్రజ్ఞారూపమగు వస్తువునే క్షేత్రజ్ఞుడందురు. క్షేత్రమగు శరీరమును తెలిసికొనువాడు క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యగాత్మ.

దేహేంద్రియాది సంఘాతమున కంతయు అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, పంచకోశ విలక్షణుడు. జడమగుదానిని జడమగునది తెలిసికొనలేదు. ప్రజ్ఞయే దానిని తెలిసికొనగలది. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. 'వేత్తి' (ఎరుంగుచున్నాడు) అని చెప్పుటవలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు, జడస్వరూపుడు కాడనియు స్పష్టమగుచున్నది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 16 🌹
📚. Prasad Bharadwaj

🌻 16. Kṣetrajñaḥ 🌻

OM Kṣetrajñāya namaḥ

The knower of the field or body is called Kṣetrajña.

Mahābhārata - Śānti Parvaṃ

Kṣetrāṇi hi śarīrāṇi bījaṃ cāpi śubhāśubhaṃ,
tāni vetti sa yōgātmā tataḥ kṣetrajña ucyate. (351.6)

These bodies are the fields in which seeds consisting of man's good and bad acts yield their fruits as enjoyments and sufferings. As the dwelling spirit is the Knower of all these, He is called Kṣetrajña.

Bhagavad Gitā- Chapter - 13

Idaṃ śarīraṃ kaunteya kṣetramityabhidhīyate,
Etadyo vetti taṃ prāhuḥ kṣetrajña iti tadvidaḥ. (2)

O son of Kuntī! This body is referred to as the 'field.' Those who are versed in this call him who is the conscious of it as the 'Knower of the field.'

Field of activity is the body. And what is the body? The body is made of senses.

The conditioned soul wants to enjoy sense gratification, and, according to his capacity to enjoy sense gratification, he is offered a body, or field of activity. Therefore the body is called kṣetra, or the field of activity for the conditioned soul.

Now, the person, who should not identify himself with the body, is called Kṣetrajñaḥ, the knower of the field. It is not very difficult to understand the difference between the field and its knower, the body and the knower of the body.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥

Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama

22 Sep 2020

నారద భక్తి సూత్రాలు - 102

🌹.   నారద భక్తి సూత్రాలు - 102   🌹
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ
📚. ప్రసాద్ భరద్వాజ

పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 73

🌻 73. యత స్తదియా ॥ 🌻

అందువలన భక్తులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. ముఖ్య భక్తిగా మారితే అట్టి భక్తులకు కూడా జీవులందరూ సమానులే. సర్వం హరిమయం.

హరిమయం కానిది ఏమీ లేదు అనే అనన్య భక్తులకు ఈ చరాచర జగత్తులో భిదాలు ఎందుకు తోస్తాయి కాని, నేను, ఇతరులు అని గుణభేదంతో చూచేవారికి భేదాలే తోస్తాయి. అట్టి వారికి ముక్తి లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

22 Sep 2020

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 6

🌹.   శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 6  🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత
రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల

🌻 6. 'ఉద్యద్భాను సహస్రాభా' 🌻

ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతి గలది అని అర్థము. ఉదయించుచున్న సూర్యుడు ఎర్రని కాంతి కలవాడై ఉండును. వేయి సూర్యు లొక్కమారు ఉదయించినచో ఏర్పడు ఎర్రని కాంతిని దేవి

కలిగియున్నదని తెలియవలెను. అనగా మిక్కిలి ఎర్రని దేహచ్ఛాయ గలదై దేవి ఉద్భవించుచున్నదని, అట్లే ఉపాసించ తగినదని ఈ నామము తెలుపుచున్నది. '

జపా కుసుమ భాసురా' అని కూడ దేవికి నామము కలదు. అనగా ఆమె శరీర కాంతి దాసానిపూవు వంటి ఎరుపుదనము కలిగినదని అర్థము. అరుణత్వము అమ్మ ఉద్భవించునప్పటి కాంతి. అరుణము రజస్సునకు, సంకల్పబలమునకు సంకేతము. దేవి అరుణత్వము కనులకు అగపడునది కాదు. వాక్కునకు అందునది కాదు.

బ్రహ్మాండమంతయు వ్యాపించియుండు తేజస్సే ఈ అరుణత్వము. అవ్యక్తమగు తత్త్వము నందు మొట్టమొదట వ్యక్తమగు కాంతి కూడ ఎరుపే నని

తెలియవలెను. ఈ ఎర్రదనము దేవి పరాక్రమమునకు, శక్తికి కూడ చిహ్నము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹  Sri Lalitha Chaitanya Vijnanam - 6  🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 6. Udyadbhānu-sahasrābhā उद्यद्भानु-सहस्राभा (6) 🌻

Udyad – rising; bhānu-sun; sahasra – thousand or countless; abhā - light. Lalitāmbikā appears as bright as thousand suns rising at the same time.

The colour of the rising sun is red. The complexion of Lalitāmbikā is red as described in the dhyāna śloka of this Sahasranāma (sakuṅkuma-vilepanām). Almost all the tantra śastra-s and ancient scriptures talk about Her complexion as red. In the previous nāma Her prakāśa form was discussed and in this nāma Her vimarśa form is being described. She has three forms – the prakāśa form or the subtle form, the vimarśa form or the physical form and Her parā form or the supreme form.

The prakāśa form of Her is said to be made of various mantra-s, the supreme one being mahā ṣodaśī mantra. Her vimarśa form is Her physical form. She is worshiped in thousands of forms. Her supreme form is realised through mental worship.

These forms and the associated red colour are for easier contemplation. From the next nāma onwards, Her physical form is being described. The red colour also indicates care. She looks after Her devotees with great care and affection like a mother.

Kṛṣṇa says (Bhagavad Gīta II.12) “If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi

22 Sep 2020

22-September-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 496 / Bhagavad-Gita - 496🌹
2 ) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 16 / Vishnu Sahasranama Contemplation - 16🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 285🌹
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 6 / Sri Lalita Chaitanya Vijnanam - 6🌹
5) 🌹. నారద భక్తి సూత్రాలు - 102🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 73🌹
7) 🌹. శివగీత - 70 / The Shiva-Gita - 70🌹
8) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 58 / Gajanan Maharaj Life History - 58 🌹 
9) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 52🌹
10. 🌹. మంత్రపుష్పం - భావగానం - 3🌹
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412🌹

12) 🌹. శివ మహా పురాణము - 229 🌹
13) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 105🌹
14) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 116🌹
15) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 59🌹
16) 🌹 Seeds Of Consciousness - 181🌹 
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 35 📚
18) 🌹. అద్భుత సృష్టి - 36 🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 18 / Sri Vishnu Sahasranama - 18🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 496 / Bhagavad-Gita - 496 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ 

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 6 🌴*

06. తత్ర సత్త్వం నిర్మలత్వాత్ ప్రకాశమనామయమ్ |
సుఖసఙ్గేన బధ్నాతి జ్ఞానసఙ్గేన చానఘ ||

🌷. తాత్పర్యం : 
ఓ పాపరహితుడా! సత్త్వగుణము మిగిలిన రెండుగుణముల కన్నను పవిత్రమైనదగుటచే ప్రకాశమానమై మనుజుని సర్వపాపఫలము నుండి ముక్తుని చేయును. ఆ గుణమునందున్నవారు సుఖభావన చేతను, జ్ఞానభావన చేతను బద్ధులగుదురు

🌷. భాష్యము :
భౌతికప్రకృతిచే బద్ధులయ్యెడి జీవులు పలురకములుగా నుందురు. వారిలో ఒకడు సుఖిగా గోచరించును, వేరొకడు క్రియాశీలుడుగా కనిపించును, మరి ఇంకొకడు నిస్సహాయునిగా నుండును. మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి యందు జీవుల బద్దస్థితికి కారణములగుచున్నవి. 

జీవులెట్లు వివిధరీతులుగా బంధితులగుదురో ఈ అధ్యాయమున వివరింపబడినది. అట్టి బంధకారణములలో మొదట ఇచ్చట సత్త్వగుణము పరిశీలింపబడుచున్నది. సత్త్వగుణము నలవరచుకొనుట ద్వారా మనుజుడు బద్ధులైన ఇతర గుణములవారి కన్నను బుద్ధిమంతుడగును. జగములో సత్త్వగుణాభివృద్ధి యొక్క ఫలమిదియే. 

ఆ విధముగా సత్త్వగుణమును వృద్ధిచేసికొనినవాడు భౌతికక్లేశములచే అంతగా ప్రభావితుడు కాడు. అంతియేగాక అట్టివాడు జ్ఞానమును పొందవలెనను భావనయు కలిగియుండును. అట్లు సత్త్వగుణము నందు స్థితుడై యుండవలెను. 

సత్త్వగుణమునందలి సుఖభావనకు మనుజుడు తాను దాదాపు సర్వపాపముల నుండి ముక్తిని పొందియున్నాననెడి అవగాహనయే కారణము. కాని వాస్తవమునకు వేదంజ్ఞానము ప్రకారము సత్త్వగుణమనగా ఉన్నతమైన జ్ఞానము మరియు అధికతరమైన సుఖభావనమని భావము. 

కాని వచ్చిన చిక్కేమనగా జీవుడు సత్త్వగుణమునందు స్థితుడైనంతనే తాను జ్ఞానాభివృద్ధి నొందితిననియు మరియు ఇతరులకన్నను మెరుగనియు తలచును. ఈ విధముగా అతడు బద్ధుడగును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 496 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 06 🌴*

06. tatra sattvaṁ nirmalatvāt
prakāśakam anāmayam
sukha-saṅgena badhnāti
jñāna-saṅgena cānagha

🌷 Translation : 
O sinless one, the mode of goodness, being purer than the others, is illuminating, and it frees one from all sinful reactions. Those situated in that mode become conditioned by a sense of happiness and knowledge.

🌹 Purport :
The living entities conditioned by material nature are of various types. One is happy, another is very active, and another is helpless. All these types of psychological manifestations are causes of the entities’ conditioned status in nature. How they are differently conditioned is explained in this section of Bhagavad-gītā. The mode of goodness is first considered. 

The effect of developing the mode of goodness in the material world is that one becomes wiser than those otherwise conditioned. A man in the mode of goodness is not so much affected by material miseries, and he has a sense of advancement in material knowledge. 

The representative type is the brāhmaṇa, who is supposed to be situated in the mode of goodness. This sense of happiness is due to understanding that, in the mode of goodness, one is more or less free from sinful reactions. Actually, in the Vedic literature it is said that the mode of goodness means greater knowledge and a greater sense of happiness.

The difficulty here is that when a living entity is situated in the mode of goodness he becomes conditioned to feel that he is advanced in knowledge and is better than others. In this way he becomes conditioned. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Sripada Srivallabha Charithamrutham - 285 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj

Chapter 36
*🌻 Sripada’s wonderful talk in Brahmana Parishad - 4 🌻*

Sripada while going to Kurungadda by this way, came to our ashramam and blessed us. He said, ‘After leaving the body, you will be born again as Brahmin according to the debt relation. Bangaramma will take ‘sudra’ janma, according to the debt relation.  

Then you will become husband and wife. You will have children. Your children will get the fortune of worshipping me in Kurungadda. May you have all happiness.’ Sir! This is my story.’  

Thus he explained to us their story as related to Sripada. He said again, ‘Sripada told us that you would be travelling this way, you had His anklets and I should take those anklets from you and give the leather padukas to you. We worship Mathangi Devi, daughter of Mathanga Muni. 

 If this great Mother is worshipped, the bliss of marriage will be great. She is also called by the names ‘Raja Mathangi’ and ‘Karna Mathangi. Once Sripada come to our ashramam physically and gave darshan. At that time, Bangaramma was warming the milk.  

We had a darshan that the ‘gomatha’ from whom these ‘Charma Padukas’ (leather chappals) came, passed in front of us moving its head. Sripada took milk from us. He said that the idol of Mathangi we were worshipping would reach many yards deep under the Oudumbar tree in the Maha Samsthanam that would be established in His name.  

He called Bangaramma and said, ‘Amma! Your husband is a capable person. In the coming next birth, you will have all happiness with him. I readied a ‘golden bottu’ for you. I got made a most auspicious Mangala Sutram for you.  

They are safely preserved in Hiranyalokam’. In your next birth I Myself will perform your marriage and grace you.’ Sirs! You have heard our story. Always chant ‘Siddha Mangala Stotram’. You will certainly receive the grace of Maha purushas. Siddhas, Maha Siddhas, Maha Yogis all are like the hands of Sripada.  

Sripada will fulfill His ‘will’ through them. Once, He gave us dharshan as Raja Mathangi Devi and graced us. All this creation and all its secrets are in His hands. You always remember Him.  

Do his dhyana and worship Him. He Himself is all siddhis. He will protect you like mother. Sripada’s love on His devotees is more than the love of a crore mothers. 

End of Chapter 36

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 16 / Vishnu Sahasranama Contemplation - 16 🌹* 
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 16. క్షేత్రజ్ఞః, क्षेत्रज्ञः, Kṣetrajñaḥ 🌻*

*ఓం క్షేత్రజ్ఞాయ నమః | ॐ क्षेत्रज्ञाय नमः | OM Kṣetrajñāya namaḥ*

క్షేత్రం - శరీరం - జానాతి; క్షేత్రమును - చైతన్యమునకు ఆశ్రయమగు శరీరమును తన జ్ఞానశక్తితో ఎరుగువాడు క్షేత్రజ్ఞుడు.

:: మహాభారతం - శాంతి పర్వం ::
క్షేత్రాణి హి శరీరాణి బీజం చాపి శుభాశుభం ।
తాని వేత్తి స యోగాత్మా తతః క్షేత్రజ్ఞ ఉచ్యతే ॥ 351.6 ॥

శరీరములను క్షేత్రములందురు. ప్రాణుల శుభాశుభకర్మములు వానికి బీజము. యోగాత్ముడగు పరమాత్ముడు ఈ రెంటిని ఎరిగియుండును. అందుచే అతడు క్షేత్రజ్ఞుడని వ్యవహరింపబడుతాడు.

:: భగవద్గీత - కేత్రక్షేత్రజ్ఞ విభాగయోగము ::
ఇదం శరీరం కౌన్తేయ క్షేత్రమిత్యభిధీయతే ।
ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ॥ 2 ॥

శ్రీ భగవానుడు చెప్పెను - కుంతీపుత్రుడవగు ఓ అర్జునా! ఈ శరీరమే క్షేత్రమనబడుచున్నది. దానిని తెలిసికొనువాడు క్షేత్రజ్ఞుడని - క్షేత్ర క్షేత్రజ్ఞుల నెఱింగినవారు చెప్పుదురు.

ఈ జడమైన శరీరమును చైతన్యవంతమైన ఒకశక్తి తెలిసికొనుచున్నది. ఆ ప్రజ్ఞారూపమగు వస్తువునే క్షేత్రజ్ఞుడందురు. క్షేత్రమగు శరీరమును తెలిసికొనువాడు క్షేత్రజ్ఞుడు. అతడే ప్రత్యగాత్మ. 

దేహేంద్రియాది సంఘాతమున కంతయు అతడు సాక్షి, నిర్వికారుడు, చిద్రూపుడు, అవినాశి, పంచకోశ విలక్షణుడు. జడమగుదానిని జడమగునది తెలిసికొనలేదు. ప్రజ్ఞయే దానిని తెలిసికొనగలది. ఆ ప్రజ్ఞయే క్షేత్రజ్ఞుడు. 'వేత్తి' (ఎరుంగుచున్నాడు) అని చెప్పుటవలన క్షేత్రజ్ఞుడు ప్రజ్ఞావంతుడనియు, జడస్వరూపుడు కాడనియు స్పష్టమగుచున్నది.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 16 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 16. Kṣetrajñaḥ 🌻*

*OM Kṣetrajñāya namaḥ*

The knower of the field or body is called Kṣetrajña.

Mahābhārata - Śānti Parvaṃ 
Kṣetrāṇi hi śarīrāṇi bījaṃ cāpi śubhāśubhaṃ,
tāni vetti sa yōgātmā tataḥ kṣetrajña ucyate. (351.6)

These bodies are the fields in which seeds consisting of man's good and bad acts yield their fruits as enjoyments and sufferings. As the dwelling spirit is the Knower of all these, He is called Kṣetrajña.

Bhagavad Gitā- Chapter - 13
Idaṃ śarīraṃ kaunteya kṣetramityabhidhīyate,
Etadyo vetti taṃ prāhuḥ kṣetrajña iti tadvidaḥ. (2)

O son of Kuntī! This body is referred to as the 'field.' Those who are versed in this call him who is the conscious of it as the 'Knower of the field.'

Field of activity is the body. And what is the body? The body is made of senses. 

The conditioned soul wants to enjoy sense gratification, and, according to his capacity to enjoy sense gratification, he is offered a body, or field of activity. Therefore the body is called kṣetra, or the field of activity for the conditioned soul. 

Now, the person, who should not identify himself with the body, is called Kṣetrajñaḥ, the knower of the field. It is not very difficult to understand the difference between the field and its knower, the body and the knower of the body.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka 
पूतात्मा परमात्मा च मुक्तानां परमा गतिः ।
अव्ययः पुरुषस्साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च ॥ 2 ॥
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమా గతిః ।
అవ్యయః పురుషస్సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ 2 ॥
Pūtātmā paramātmā ca muktānāṃ paramā gatiḥ ।
Avyayaḥ puruṣassākṣī kṣetrajño’kṣara ēva ca ॥ 2 ॥

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 102 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
పంచమాధ్యాయం - భక్తి మహిమ - సూత్రము - 73

*🌻 73. యత స్తదియా ॥ 🌻*

అందువలన భక్తులందరూ భగవంతుని దృష్టిలో సమానులే. ముఖ్య భక్తిగా మారితే అట్టి భక్తులకు కూడా జీవులందరూ సమానులే. సర్వం హరిమయం.

 హరిమయం కానిది ఏమీ లేదు అనే అనన్య భక్తులకు ఈ చరాచర జగత్తులో భిదాలు ఎందుకు తోస్తాయి కాని, నేను, ఇతరులు అని గుణభేదంతో చూచేవారికి భేదాలే తోస్తాయి. అట్టి వారికి ముక్తి లేదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 6 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత*
*రాగాస్వరుప పాశాడ్యా క్రోధా కారంకుశోజ్జ్వల*

*🌻 6. 'ఉద్యద్భాను సహస్రాభా' 🌻*

ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతి గలది అని అర్థము. ఉదయించుచున్న సూర్యుడు ఎర్రని కాంతి కలవాడై ఉండును. వేయి సూర్యు లొక్కమారు ఉదయించినచో ఏర్పడు ఎర్రని కాంతిని దేవి
కలిగియున్నదని తెలియవలెను. అనగా మిక్కిలి ఎర్రని దేహచ్ఛాయ గలదై దేవి ఉద్భవించుచున్నదని, అట్లే ఉపాసించ తగినదని ఈ నామము తెలుపుచున్నది. '

జపా కుసుమ భాసురా' అని కూడ దేవికి నామము కలదు. అనగా ఆమె శరీర కాంతి దాసానిపూవు వంటి ఎరుపుదనము కలిగినదని అర్థము. అరుణత్వము అమ్మ ఉద్భవించునప్పటి కాంతి. అరుణము రజస్సునకు, సంకల్పబలమునకు సంకేతము. దేవి అరుణత్వము కనులకు అగపడునది కాదు. వాక్కునకు అందునది కాదు. 

బ్రహ్మాండమంతయు వ్యాపించియుండు తేజస్సే ఈ అరుణత్వము. అవ్యక్తమగు తత్త్వము నందు మొట్టమొదట వ్యక్తమగు కాంతి కూడ ఎరుపే నని
తెలియవలెను. ఈ ఎర్రదనము దేవి పరాక్రమమునకు, శక్తికి కూడ చిహ్నము.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 6 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 6. Udyadbhānu-sahasrābhā उद्यद्भानु-सहस्राभा (6) 🌻*

Udyad – rising; bhānu-sun; sahasra – thousand or countless; abhā - light. Lalitāmbikā appears as bright as thousand suns rising at the same time.  

The colour of the rising sun is red. The complexion of Lalitāmbikā is red as described in the dhyāna śloka of this Sahasranāma (sakuṅkuma-vilepanām). Almost all the tantra śastra-s and ancient scriptures talk about Her complexion as red. In the previous nāma Her prakāśa form was discussed and in this nāma Her vimarśa form is being described. She has three forms – the prakāśa form or the subtle form, the vimarśa form or the physical form and Her parā form or the supreme form.  

The prakāśa form of Her is said to be made of various mantra-s, the supreme one being mahā ṣodaśī mantra. Her vimarśa form is Her physical form. She is worshiped in thousands of forms. Her supreme form is realised through mental worship.  

These forms and the associated red colour are for easier contemplation. From the next nāma onwards, Her physical form is being described. The red colour also indicates care. She looks after Her devotees with great care and affection like a mother. 

Kṛṣṇa says (Bhagavad Gīta II.12) “If hundreds of thousands of suns were to rise at once into the sky, their radiance might resemble the effulgence of the Supreme Person in that universal form.”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శివగీత - 70 / The Siva-Gita - 70 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ 

నవమాధ్యాయము
*🌻. శరీర నిరూపణము - 4 🌻*

కర్మేంద్రి యాణాం జానీయా - న్మన శ్చైవో భయాత్మకమ్,
క్రియా స్తేషాం మనో బుద్ధి - రహంకార స్తతః పరమ్ 18

అంతః కరణ మిత్యాహు - శ్చిత్తం చేతి చతుష్టయ మ్,
సుఖం దుఃఖం విషయౌ - విజ్ఞేయౌ మనసః క్రియాః 19

స్మృతీభీ టివి కల్పాద్యాః - బుద్ధి: - స్సాన్నిశ్చయాత్మికా,
అమం మమేత్య హంకార - శ్చిత్తం చేత యతే యతః 20

స్మృతి - భీతి - వికల్పము - మొదలగునవి, సుఖదుఃఖ సాక్షాత్కారము, మసస్సు చేయు క్రియలు, నిశ్చయాత్మక క్షాము బుద్ధి, నేను, నాది యనునది యహంకారము, ఇంద్రియ గోరములను దలంపచేయునది చిత్తము.

సత్త్వాఖ్య మంతః కరణం - గుణభే దాత్త్రిదా మతమ్,
సత్త్వం రజ స్తమ ఇతి - గుణా స్సత్వాత్తు సాత్త్వికాః 21

ఆస్తిక్య శుద్ధి ధర్మైక - రుచి ప్రభ్రుత యో మతాః
రజసో రాజసా భావాః - కామక్రోధ మదాదయః 22

నిద్రాలస్య ప్రమాదాది - వంచనాద్యాస్తు తామసాః
ప్రసన్నేంద్రియ తారోగ్యా - నాలప్యాద్యా సతు సత్త్వాజాః 23

దేహొ మాత్రాత్మక స్తస్మా - దాదత్తే తద్గుణా నిమాన్,
శబ్ద స్శ్రోత్రం ముఖరతా - వైచిత్ర్యం సూక్ష్మ తా ధృతి 24

బలంచ గగనా ద్వాయో - స్స్వర్శశ్చ స్పర్శనేంద్రియమ్,
ఉతేక్ష పణ మనక్షే పా - కుంచనే గమనం తథా 25

ప్రసారణ మీటి మాని - పంచ కర్మాణి రూక్షతా,
ప్రాణపానౌ త థా వ్యాన - సమానో దాన సంజ్ఞ కాన్ 26

నాగం కూర్మం చ కృకరం - దేవదత్తం ధనంజయమ్,
ద శైతా వాయు వికృతీ - స్తథా గృహ్ణాతి లాఘవమ్ 27

నామాంతరము చేత సత్వగుణమని చెప్పబడు అంతఃకరణము, గుణభేదము వలన మూడు ప్రకారములు అవియే సత్త్వర జస్త మోగుణములు.  

సాత్విక గుణములు ఏమియనగా: ఆస్తికత్వము, శుభ్రత, ధర్మాసక్తి మొదలగు మంచి గుణములన్నియు సాత్వికగుణములు (సత్వగుణ జన్మములు). 

 రజోగుణము నుండి రాజసగుణములు అనగా కామ - క్రోధ - మదము మొదలగునవి. 

మధ్యగుణములు, నిద్ర - ఆలస్యము (సోమరితనము) పరమాడం (జాగ్రత్త లేనిది) వంచించుట ఇవే మొదలగునవి తమోగుణ జన్యములు తామసములు.

నిర్మలేంద్రియత్వము ఆరోగ్యము. కుశలత, మొదలగునవి పైన బెర్కొనిన సాత్విక గుణ జన్యములు. ఈ శరీరము పంచతన్మాత్రాత్మకము, కనుక తద్గుణములనే స్వీకరించును.

శబ్దము శ్రోత్రేంద్రియము. మాటలాడుట, పనిలో నిపుణత లాఘవము, ధైర్యము, శక్తి - ఇవి ఆకాశమునుండి లభించును. స్పర్శము, స్పర్శేంద్రియము (చర్మము పైనుండి స్పర్శేంద్రి యమనుట) చాచుట - వంచుట - ముడుచుట - విస్తరింపచేయుట, గమనము, కాటిన్యము ప్రాణ - అపాన, వ్యాన ఉదాన, సమానములు అను పంచ మహావాయువులు, నాగము కూర్మము, కృకరము, దేవదత్తము, ధనుంజయము అను పంచోపవాయువులు, తేలికయగుట, ఈ గుణములు వాయువుచేత లభ్యములు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 The Siva-Gita - 70 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 09 :
*🌻 Deha Svarupa Nirnayam - 4 🌻*

Ears, five sense organs, sabdha, sparsha, rupa, rasa, gandha, five tanmaatras, vakpanipadapayovastha, karmendriyas, excretary organs, organs of speech, mind, mindegointellect, chitta, antahkarana, are all called as Chatushtyam; among them, smruti (memory), bheeti (fear), vikalpam (idea), happiness and sorrow, acts done by the mind, buddhi, ego, the feeling of mine such qualities which are not known by indriyas are experienced by the help of chittam.

Satvika qualities are faith (in god), cleanliness, inclination towards righteousness, etc. good qualities which are formed from the Satwa qualities. 

From Rajas qualities arise lust, anger, infatuation, etc. qualities. From tamo guna arise sleep, laziness, careless nature etc qualities. 

Having controlled senses, sound health, skillfulness, etc are again the products of Satwa quality. 

From the sky element sound, ears, speech, skillfulness, patience, strength, are obtained. Touch, skin, movements, expansion contractions, harhsness, prana, apana, vyana, udana, samana winds, naga, kurma, krukuram, devadattam, dhananjayam kind of five subwinds etc attributes are obtained from the wind element.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Guru Geeta - Datta Vaakya - 73 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
*Part 67*

Sloka:
 Ananyascintayanto ye dhruvam tesam param padam | Tasmat sarva prayatnena guroraradhanam kuru || 

Those who meditate upon the Guru with no other thought will certainly attain Parampad (the blissful state). 

*So worship Guru in all faith and by all means. “Sarva prayatnena” indicates you should serve the Guru in various ways.*

*Serve the Guru in all the various ways there are to please the Guru, in all the various ways there are to serve him so we can be redeemed from our sins, all the various ways we want the grace of the Guru.* 

We should meditate upon the Guru whenever we have a moment. We should offer salutations to the Guru every time we see Him. You can never do enough salutations to the Guru. Even a lifetime of salutations is not enough. Worshiping the Guru through all lifetimes is also not enough. 

That is why, you should worship the Guru in various ways possible thinking, “May be this will work well”, “May be the Guru will be pleased with this”, “May be the Guru will bless me if I do this”, while dedicating everything to the Guru Principle. Regardless of how extensively we decorate our Lord, we are never satisfied.  

That is why we keep thinking, “May be we can place this diamond necklace on the Lord”, “May be this garland will look good”, “May be this color garland will look good”. We keep trying various decorations for our own satisfaction. But, we are never satisfied.  

There is a small difference when it come to service to the Guru, though. In the former case, you are decorating the Lord with a lot of affection. In the case of service to the Guru, you should give up all affections and serve. That is why they ask you to serve in every way possible. 

You can’t just try one method of service and exclude everything else. You should take everything into account. You should dedicate every small task to the Guru. You should think for yourself about all the various ways you can serve the Guru. 

No one will tell you. You cannot say, “No one tells me, I don’t know how to serve the Guru”. Once you figure out how to please the Guru, you should try all the possible ways to continue to please Him. 

The Guru will not be annoyed, he will keep blessing when you tell him, “I did this task”, “I did that task”. All we need is to please him. That is why, we should have a volunteer mindset. We should be self-starters. 

 We should analyze and think for ourselves. We should do everything we can. But, that doesn’t mean you show off in the presence of the Guru. You should not boast or pretend in the presence of the Guru, “That’s not a big deal, I can do that”.  

He is always witness to what you are doing whether or not he’s physically present. He’s witness to what you are doing in your life. He knows what you’ve done in your past, what you are doing now and what you are capable of doing in the future. 

That’s why, all you need is to serve the Guru without any other thought. You should have no other thoughts. You should not even have expectations of praise. You should just surrender. You should do your tasks and surrender them.  

If the Guru praises you, it will boost your ego. When that happens, you should immediately realize and be ashamed. That is why you should be very careful.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 59 / Sri Gajanan Maharaj Life History - 59 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. 12వ అధ్యాయము - 1 🌻*

శ్రీగణేశాయనమః ! ఓగణపతి, మయూరేశ్వరా వచ్చి నా హృదయంలో కూర్చుని నేను ఈగ్రంధం పూర్తి చెయ్యడంలో నాకు సహాయం చెయ్యండి. మీరు విద్య, తెలివితేటలు ఇచ్చేవారు, మీరే అన్ని విఘ్నాలు తొలగించి భక్తులకోరికలు పూర్తి చేసేది మీరొక్కరే. పురాణాలుకూడా అదే చెపుతున్నాయి. 

ఓ ఏకదంతా, లంబోదరా, పార్వతీసుతా, బాలచంద్రా, సింధూరా నన్ను అన్ని ఆదుర్ధలనుండి బయట పడనివ్వండి. ధనవంతుడు, ఉదారుడు అయిన ఒక బచులాల్ అగరవాల్ అనే వ్యక్తి అకోలాలో ఉండేవాడు. కారంజావాసి లక్ష్మణగుడే వృత్తాంతం విన్నాక అతని మనసులో కొన్ని అనుమానాలు కలిగాయి. 

అతను ఇంకా దాని వెనుక ఉన్న అసలు కారణం తెలుసుకుందాము అని అనుకుంటూ ఉండగా, శ్రీమహారాజు స్వయంగా అకోలా వచ్చి అతని ఇంటికి చేరారు. బచులాల్ అమిత ఆనందంపొంది, శ్రీమహారాజును పూజించాలన్న తన కోరికను ఆయనకు వ్యక్తపరిచాడు. ఆయన తన అనుమతి ఇచ్చారు. 

శ్రీబచులాల్ పూజకొరకు పెద్దఎత్తున ఏర్పాట్లు చేసాడు. మొదట శ్రీమహారాజుకు సుగంధ ద్రవ్యాలు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి, తరువాత ఒక పట్టుపంచ, ఒక కాశ్మీరీషాలు మరియు పట్టుబట్టతో చేసిన ఒక ముకుటం ఇచ్చాడు. ఒక బంగారం గొలుసు మెడలో వేసి, అన్ని వేళ్ళకీ బంగారం ఉంగరాలు పెట్టాడు. ఒక వజ్రాల కంకణం ఎడమ చేతికి పెట్టి అత్తరు శరీరంమీద చల్లాడు. తరువాత జిలేబి మరియు ఇతర మిఠాయిలతో భోజనం పెట్టారు. ఆతరువాత ఒక బంగారు పళ్ళెంనిండా సుమారు పదివేల రూపాయలు, నాణాలు ఒక కొబ్బరికాయతో సహా శ్రీమహారాజుకు దక్షిణగా అందించాడు. 

తరువాత చేతులుకట్టుకుని, మహారాజ్ ! రామనవమి ఉత్సవాలు జరిపేందకు నాఇంటి ప్రాంగణంలో స్థలం సరిపోవడం లేదు, కావున నేను శ్రీరాముని మందిరం కట్టాలనుకుంటున్నాను, దయచేసి నాకోరిక పూర్తి చెయ్యండి అని బదులాల్ అన్నాడు. అలాఅంటూ అతివినయంగా తన తలను శ్రీమహారాజు పాదాలమీద పెడతాడు. 

శ్రీ రామచంద్ర భగవానుడు నీకోరిక తీరుస్తారు అని నేను నిన్ను దీవిస్తున్నాను. కానీ ఇన్ని ఆభరణాలు నాశరీరంమీద పెట్టి ఏమిటినువ్వు చేసింది ? నువ్వు నన్ను పోలానాటి ఎద్దును చేసావు. 

నేను ఇలా పోలానాటి ఎద్దునుకాని, దశరానాటి గుర్రాన్ని కాని కాను. ఈ ఆభరణాలు నాకు నిరుపయోగం. ఇవి నాకు ఒక విషంలాంటివి. నేను కనీసం వాటిని ముట్టుకోకూడదు. నన్ను ఇటువంటి ప్రాపంచిక వస్తువులతో ప్రలోభితం చెయ్యడానికి ప్రయత్నించకు. లేక ఇవన్నీ నీసంపత్తిని ప్రదర్శించేందుకు చేసావా ? 

ఎదుటి మనిషి తీసుకుందుకు ఇష్టపడే వస్తువులు మాత్రమే నీవు ఇవ్వాలి. నేను ఒక పిచ్చగా , నగ్నంగా తిరిగే సన్యాసిని. ఇవన్నీ నీవద్దనే ఉండనీ, నీలా సంసారికజీవనం గడిపేవారికి ఇవి ఉపయోగపడతాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Gajanan Maharaj Life History - 59 🌹* 
✍️. Swamy Dasaganu 
📚. Prasad Bharadwaj

*🌻 Chapter 12 - part 1 🌻*

Shri Ganeshayanmah! O Ganapati! Mayureshwar! Come, sit in my heart and help me complete this book. You are the giver of knowledge and intelligence and the only one to fulfill the desires of His devotees by removing all the obstacles. Puranas also say so. 

O Ekdanta! Lambodara! Parvatisuta! Bhalchandra! Sindura! Please rid me of all anxieties. There was one Bachchulal Agrawal at Akola a rich and generous person. He had heard about the episode of Laxman Ghude of Karanja which had created some doubts in his mind. 

As he was thinking to find the real fact behind it, Shri Gajana Maharaj, himself, came to Akola and reached his house. Bachchulal was immensely happy and expressed to Maharaj the desire to worship Him. 

Shri Gajanan Maharaj gave his consent. Shri Bachchulal made elaborate arrangements for the Puja; first Shri Gajanan Maharaj was given a bath with scented water and then offered a fine silken pitambar, a Kashmiri shal and a silken pheta. 

A gold chain was placed around His neck and gold rings on all His fingers. A bracelet of diamonds was put on his left arm and perfumes were sprinkled on the body. Then, meals with jalebi and other sweets were given to him. 

Thereafter a golden thali full of rupees and moharas was offered to Shri Gajanan Maharaj as Dakshina which amounted to about Rs. Ten thousands and on it was put a coconut. 

Then, with folded hands, Bachchulal said, Maharaj, I wish to construct a Shri Ram temple as the space in my courtyard is insufficient for the annual celebration of Ram Navami. Kindly fulfill my desire.” 

Saying so he, most reverently, put his head on the feet of Shri Gajanan Maharaj . Then upon Shri Gajanan Maharaj said, “I bless you that God Shri Ramchandra will fulfill your desire. But what have you done this by putting so many ornaments on my body? 

You have made me look like a bullock of the ‘Pola’ festival. You see, I am neither a bullock of Pola nor a horse of Dasherra. These ornaments are of no use to me, or rather they are poison for me and I should not have even a touch of them. 

Don't try to tempt me by all these material attachments or Bachchulal have you done all this exhibit your wealth? You should offer only those things which can be liked by the receiver. I am a mad, wandering, naked saint. Let these things be with you only. It is useful for people leading a family life like you.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 52 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 2 🌻*

203. సూక్ష్మ-కారణదేహములు‌,విడువబడిన గత భౌతకరూప యొక్క సంస్కారములను నిలిపియుంచినవి.

204. పూర్వజన్మ సంస్కారములను అనుభవించుటకే‌‌,ఆత్మ మరియొక రూపముతో సహచరించున్నది.

205. పూర్వజన్మ సంస్కారములు సంపుటయే ప్రస్తుత జన్మకు రూపమిచ్చును. 
ఏల పునర్జన్మము కావలసి వచ్చినది?

206. తొలి మానవ రూపము యొక్క, మానవ రూపమును పూర్వమందున్న పరిణామ రూపముల యొక్క సంస్కారములను అనుభవించుటకే, ఆత్మ, మానవ రూపములో మరల మరల పునర్జన్మములను పొందవలసి వచ్చినది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మంత్ర పుష్పం - భావగానం - 3 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మంత్ర పుష్పం 5. 🌻*

*నారాయణ పరో*
*జ్యోతి రాత్మా*
 *నారాయణః పరః*
*నారాయణ పరమ్*
*బ్రహ్మ తత్వం*
*నారాయణః పరః*
*నారాయణ పరో*
*ధ్యాతా ధ్యానం*
*నారాయణః పరః*

*భావగానం:*
నారాయణుడే పరమలోకము
నారాయణుడే జ్యోతిరూపము
 నారాయణుడే ఆత్మ రూపము
నారాయణుడే పరబ్రహ్మము
నారాయణునే ధ్యానిoచుము

*🌻. మంత్ర పుష్పం 6.🌻*

 *యచ్చకించి జ్జగత్సర్వం* *దృశ్యతే శ్రూయతే౭ పివా*
*అంతర్బహిశ్చ తత్సర్వం* *వ్యాప్య నారాయణ స్స్థితః*

*భావగానం:*
 చూసే దంతా వినే దంతా
లోకమంతా మారే దంతా
లోనా బైటా వుండే దంతా
పైనా కింద వుండే దంతా
నారాయణుడే అ దంతా

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 20 🌴

20. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా: |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదమ్
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలతనొందుచున్నది.

🌷. భాష్యము : 
“ద్యావాపృథివ్యో” (స్వర్గమునకు, భూమికి నడుమగల ప్రదేశము) మరియు “లోకత్రయం” (ముల్లోకములు) అను పదములు ఈ శ్లోకమున ప్రాముఖ్యమును కలిగియున్నవి. అర్జునుడే గాక ఇతర లోకములందలి వారు కూడా శ్రీకృష్ణభగవానుని ఈ విశ్వరూపమును గాంచినట్లు గోచరించుటయే అందులకు కారణము. అర్జునుని విశ్వరూపదర్శనము స్వప్నము కాదు. దివ్యదృష్టి ఒసగబడిన వారందరును రణరంగమున విశ్వరూపమును గాంచగలిగినారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 412 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 20 🌴

20. dyāv ā-pṛthivyor idam antaraṁ hi
vyāptaṁ tvayaikena diśaś ca sarvāḥ
dṛṣṭvādbhutaṁ rūpam ugraṁ tavedaṁ
loka-trayaṁ pravyathitaṁ mahātman

🌷 Translation : 
Although You are one, You spread throughout the sky and the planets and all space between. O great one, seeing this wondrous and terrible form, all the planetary systems are perturbed.

🌹 Purport :
Dyāv ā-pṛthivyoḥ (“the space between heaven and earth”) and loka-trayam (“the three worlds”) are significant words in this verse because it appears that not only did Arjuna see this universal form of the Lord, but others in other planetary systems saw it also. Arjuna’s seeing of the universal form was not a dream. All whom the Lord endowed with divine vision saw that universal form on the battlefield.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 229 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴* 
50. అధ్యాయము - 5

*🌻. సంధ్య యొక్క చరిత్ర - 5 🌻*

కిమర్థ మాగతా భ##ద్రే నిర్జనం త్వం మహీధరమ్‌ | కస్య వా తనయా కిం వా భవత్యాపి చికీర్షితమ్‌ || 50

ఏతది చ్ఛామ్యహం శ్రోతుం వద గుహ్యం న చేద్భవేత్‌ | వదనం పూర్ణచంద్రాభం నిశ్చేష్టం వా కథం తవ || 51

వసిష్ఠుడిట్లు పలికెను -

ఓ మంగళ స్వరూపురాలా! ఈ నిర్జనమగు కొండపైకి ఏల వచ్చితివి? నీవు ఎవరి కుమార్తెవు? నీవు ఏమి చేయ దలచితివి? (50). 

ఇది రహస్యము కానిచో నేను వినగోరు చున్నాను. పున్నమి చంద్రుని వంటి నీ ముఖము అలంకార విహీనము గా ఉన్నది యేల? (51).

బ్రహ్మోవాచ |

తచ్ఛ్రుత్వా వచనం తస్య వసిష్ఠస్య మహాత్మనః | దృష్ట్వా చ తం మహాత్మానం జ్వలంతమివ పావకమ్‌ || 52

శరీరధృగ్‌ బ్రహ్మచర్యం విలసంతం జటా ధరమ్‌ | సాదరం ప్రణిపత్యాథ సంధ్యోవాచ తపోధనమ్‌ || 53

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాత్ముడగు వసిష్ఠుని ఆ పలుకులను విని, అగ్నివలె ప్రకాశించుచున్న ఆ మహాత్ముని చూచి (52), 

మూర్తిదాల్చిన బ్రహ్మచర్య మా యన్నట్లు జటలను ధరించి ప్రకాశించుచున్న ఆ తపోనిష్ఠుడగు వసిష్ఠునకు ఆదరముతో ప్రణమిల్లి, అపుడు సంధ్య ఇట్లు పలికెను (53).

సంధ్యో వాచ |

యదర్థమాగతా శైలం సిద్ధం తన్మే నిబోధ హా | తవ దర్శనమాత్రేణ యన్మే సేత్స్యతి వా విభో || 54

తపశ్చర్తుమహం బ్రహ్మన్నిర్జనం శైలమాగతా | బ్రహ్మణోsహం సుతా జాతా నామ్నా సంధ్యేతి విశ్రుతా || 55

యది తే యుజ్యతే సహ్యం మా త్వం సముపదేశయ | ఏతచ్చికీర్షితం గుహ్యం నాన్యైః కించన విద్యతే || 56

అజ్ఞాత్వా తపసో భావం తపోవనముపాశ్రితా | చింతయా పరి శుష్యేsహం వేపతే హి మనో మమ || 57

సంధ్య ఇట్లు పలికెను -

నేను ఏ ప్రయోజనము నాశించి ఈ పర్వతమునుకు వచ్చి యుంటినో, ఆ ప్రయోజనము సిద్ధించినదని యెరుంగుడు. హే ప్రభో! మిమ్ములను దర్శించుట మాత్రము చేతనే, నాకు ఆ ప్రయోజనము సిద్ధించగలదు (54). 

హే బ్రాహ్మణా!నేను తపస్సును చేయుటకై ఈ జనసంచారము లేని పర్వతమునకు వచ్చి యుంటిని. నేను బ్రహ్మగారి కుమార్తెను. నాకు సంధ్య అనే పేరు ప్రసిద్ధమై యున్నది(55).

 మీకు ఉచితమని తోచినచో, నాకు చక్కగా ఉపదేశించుడు. నేను ఈ తపస్సును రహస్యముగా చేయగోరితిని. దీనికి ఇతరులతో పనిలేదు (56). 

తపస్సును చేయువిధమును తెలియకుండగనే, నేను తపోవనమును చేరుకుంటిని. నేను దుఃఖముతో ఎండి పోవుచున్నాను. నామనస్సు వణుకుచున్నది (57).

బ్రహ్మోవాచ |

ఆకర్ణ్య తస్యా వచనం వసిష్ఠో బ్రహ్మ విత్తమః | స్వయం చ సర్వ కృత్యో జ్ఞో నాన్యత్కించన పృష్టవాన్‌ || 58

అథ తాం నియతాత్మానం తపసేsతి ధృతోద్యమామ్‌ | ప్రోవాచ మనసా స్మృత్వా శంకరం భక్తవత్సలమ్‌ || 59

బ్రహ్మ ఇట్లు పలికెను -

బ్రహ్మ వేత్తలలో శ్రేష్ఠుడు, తపస్సు యొక్క సర్వకార్యములను స్వయముగా నెరింగినవాడు నగు వసిష్ఠుడు ఆమె మాటను విని ఆమెను ఏమియూ ప్రశ్నించలేదు (58). 

ఆయన భక్తవత్సలుడగు శంకరుని మనస్సులో స్మరించుకొని, నియంత్రింపబడిన దేహేంద్రియమన స్సంఘాతము కల్గినది, తపస్సు కొరకు గొప్ప దీక్షతో ఉద్యమించినది అగు ఆ సంధ్యతో నిట్లనెను (59).

వసిష్ఠ ఉనాచ |

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |పరమః పరమారాధ్యః శంభుర్మనసి ధార్యతామ్‌ || 60

ధర్మార్థ కామ మోక్షాణాం య ఏకస్త్వాదికారణమ్‌ | తమేకం జగతా మాద్యం భజస్వ పురుషోత్తమమ్‌ || 61

మంత్రేణానేన దేవేశం శంభుం భజ శుభాననే | తేన తే సకాలావాప్తి ర్భవిష్యతి న సంశయః || 62

ఓం నమశ్శంకరాయేతి ఓమిత్యం తేన సంతతమ్‌ | మౌనతపస్యా ప్రారంభం తన్మే నిగదతశ్శృణు || 63

వసిష్ఠుడిట్లు పలికెను -

ఎవరు తేజో మూర్తులలో కెల్లా గొప్ప తేజో మూర్తియో, తపస్సులలో కెల్లా గొప్ప తపో మూర్తియో, పూజ్యులలో కెల్లా గొప్ప పూజ్యుడో అట్టి శంభుని మనస్సునందు నిలుపుము (60). 

ధర్మార్థకామ మోక్షములకు ఏకైక ప్రథమ కారణము, జగత్తులకు తండ్రి, పురుషశ్రేష్ఠుడునగు శంభుని సేవింపుము (61).

 ఓ సుందరవదనా! ఈ మంత్రముతో దేవదేవుడగు శంభుని భజింపుము. అట్లు భజించుట వలన నీకు నిస్సందేహముగా కోర్కెలన్నియూ ఈడేరగలవు (62). 

ఓం నమశ్శంకరాయ ఓం అను ఆద్యంతములందు ఓంకారము గల మంత్రమును జపించుము. మౌన తపస్సును నేను చెప్పెదను. నీవు విని, ఆరంభింపుము (63).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 105 🌹*
Chapter 37
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 The Imposter - 1 🌻*

The Father of creation is responsible for his children. Even if the children do not  
obey him, do not respect him, oppose him, reject him, still the Father loves them, benefits  
them, and is forgiving. 

The Avatar is our real Father and remains responsible for each of us whether we want his help or not. His help never fails to benefit us, because he loves us. The Avatar has worked to make it possible for humanity to accept him as the Real Father. 
 
There are now many seeking spiritual guidance, like children who seek the help of their father. But if a person seeking help accepts it from someone who is not his real father, but who poses as if he is his father, then that person seeking help will surely fall along the way. 

How can someone show another person the way to the goal, when he himself has not found it? That person is posing, and he poses because he has selfish interests that only serve himself, and not the persons whom he supposedly is guiding. 
 
These impostors are the false gurus, false saints, the false holy men now to be found  
almost everywhere. Today there are many such impostors in the world; they arise in both the east and the west. 

They call themselves saints of God, holy men, miracle-workers, healers; some even call themselves perfect masters or avataras. They are fakes, as fake as artificial flowers that have no fragrance. They dazzle, they entrance, they hypnotize, but they cannot lead you to God. 
 
In the west, these impostors are like wolves who prey upon the lambs of the Father. In the east, they are like serpents, poisoning the hearts of the sincere. Ordinary people are far better than the hypocritical false men of God. 

Throughout the world, such impostors are collecting large numbers of followers, deceiving the simple-minded religious people and the spiritually-naive. They are simple because they are deceived, and they are naive because they believe these fakes. 

They are attracted to the artificial flowers, the howling of wolves, and charm of serpents. They have no experience of the inner fragrance of the real saints or Perfect Masters. 

They do not understand the significance of the Avatar's silence, and the natural flow of his love and mercy. People are satisfied and content with the shows of attractive appearance, the howling of wolves before a moon, and enchanting movements of snakes. 
 
Though large numbers become followers of these spiritual posers, there is no spiritual gain in following such impostors. 

On the contrary, there is a spiritual setback, since these impostors are attached to illusion, though they pose as if they are men of God. These impostors only show their followers other pathways into further illusion, instead of the path toward Truth. The pathways into deeper ignorance are religious rituals, ceremonies, orthodoxy, intellectual pride, dogma, superstitions, creeds, and so forth. 

These are a source of deepening ignorance. Such pathways do not increase one's knowledge of the Reality of God, or the experience of God.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 116 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. మతంగ మహర్షి - 4 🌻*

25. ఋషులెప్పుడు సత్యవాక్కులే చెపుతారు. వాళ్ళుచెప్పేది శాపం అంటారుకాని, అది సత్యమే! ఆ వాక్కు యథార్థమవుతోంది. 

26. “నీలో రాక్షస ప్రవృత్తి ఉన్నది కాబట్టి రాక్షసుడివై పుట్టు. బ్రాహ్మణుడియొక్క రూపంలో రాక్షసవృత్తి కలిగిఉండి తిరిగితే, నిన్ను బ్రాహ్మణుడనుకుని నమస్కరిస్తారు. అందువలన అలా తిరగకు. ఇతరులు మోసపోకుండా ఉందురుగాక! నీవు సహజమైన జన్మ ఎత్తు!” అని ఋషుల తాత్మర్యం. 

27. దానిని ఈ జన్మలో శాపం అంటాం మనం. ఏం! ఇది సత్యం కాదా! సత్యవాక్కులు వాళ్ళవి. మహర్షులు సత్యాన్ని ఆరాధిస్తారు. అంతఃకరణలో ఎప్పుడూ సత్యాన్నే పెట్టుకుంటారు. అసత్యం అనేది మనసా వాచా కర్మణా అంటదు వాళ్ళను. 

28. మహర్షులందరూ సత్యవచనులు కాబట్టి వారు మహాత్ములవుతారు. ఏదో యోగబలముండి, తపోబలముండి, మనిషిని కుక్కను చేయగడొకడు. అంటే మాయల మరాఠికూడా అలా చేయగలడు. అయితే అంతమాత్రంచేత వాడు మహాత్ముదవుతాడా? అలాకాదు. ఋషులు అలాంటివారు కారు.

29. సత్యమే బ్రహ్మవస్తువు. సత్యమే జ్ఞానము. సత్యమే పరతత్త్వము. సత్యమే పరమేశ్వరుడు. సత్యమే శాశ్వతమైన వస్తువు.

30. సత్యము కానటువంటి వస్తువు అసలు ఉండదు. ఎల్లకాలము అది అనిత్యమైనది. అనిత్యమైనవస్తువు ఎప్పుడూ సత్యముకాదు. నిత్యము సత్యము అయిన వస్తువునే మహర్షులు ఉపాసిస్తారు. మనసులో ఏ భావనలో ఉంటారో, చిత్తమందుకూడా అదే భావన. అంతఃకరణలో అదేభావన చేస్తారు. వాళ్ళు దానిని అట్లాగే ప్రకటిస్తారు.

31. అసత్యంలో ఉండేవాళ్ళు సామాన్యులు, పామరులు. కాబట్టి మనకు ఋషులనుంచీ శిక్షగా వినిపిస్తుంది ఆ మాట. ఆ సత్యానికి దారితెలుసుకోవటానికి ఉత్తమమైన మార్గం వైదిక, ధార్మిక స్వధర్మనిర్వహణ. 

32. అట్టి మార్గమే సత్త్వగుణ ప్రధానత కలిగిన మార్గం అని సంప్రదాయం చెపుతోంది. ఆ సంప్రదాయంలో ఉన్న – వేదం చదివిన బ్రాహ్మణుడైనా, కాకపోయినా, సత్య మార్గంలో ఉండేవాడు-ఎవడైనా సరే, తనకు విహితమైన ధర్మమున్నదే – ఆ ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని ఉపాసిస్తే – క్రమంగా ముక్తికి వెళతాడు. అంతేకాని పాండిత్యంచేత, కేవలం కర్మచేత కాదు.

*‘నకర్మణా న ప్రజయా ధనేన| త్యాగేనైకే అమృతత్త్వమానశుః‘ –*
*అమృతత్త్వం అంటే సత్యమే.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 35. గీతోపనిషత్తు - అంకుశము - ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడును 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 67 📚*

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో నువిధీయతే |
తదస్య హరతి ప్రజ్ఞాం వాయు క్నావ మివాంభసి || 67

నీటియందు తేలు నావ గాలిని బట్టి పోవుచుండును. గాలి వాలును బట్టి నావ పలుదిక్కులకు ఈడ్వబడు చుండును కదా! అట్టు పలు విధములుగ ఈడ్యబడుట నావకు ప్రయాణ మెటు కాగలదు? 

ముక్కుతాడు వేయని ఎద్దు చేలయందుబడి పంటను విధ్యంసము చేయుచు, చిందులు వేయుచు తినినంత తిని, మిగిలినది పాదములతో త్రొక్కుతూ స్వైర విహారము చేయును. అట్టి ఎద్దు పొలమున కెట్టు ఉపయోగపడ గలదు? 

కళ్ళెములేని గుజ్జములతో గూడిన రథము, గుజ్జములెటు లాగినచో అటుపోవును. తత్కారణముగ రథము నశించునుకదా ! శిక్షణము, మావటి లేని మదపుటేనుగు అపాయకరము కదా!

అట్లే రాగద్వేషముల ననుసరించుచు, ఇంద్రియముల ద్యారా ఇంద్రియార్థముల కొరకై పరుగెత్తు మనస్సు మనుజుని హరించును.

నావ పయనించవలె నన్నచో తెరచాప, చుక్కాని ఏర్పరచవలెను. ఎద్దు ఉపయోగపడవలె నన్నచో ముక్కుకు తాడు బిగించి, శిక్షణ నిచ్చి అరక కట్టించవలెను. గుర్రములు ప్రయాణమునకు వినియోగ పడవలెనన్నచో కళ్ళకు గంతలు కట్టి, కళ్ళెము వేసి పగ్గములు పట్టి నడిపించవలెను. మదపుటేనుగు బలము వినియోగ పడవలెనన్నచో అంకుశముతో మావటివాడు అధిష్టించి యుండవలెను. 

అట్లే ఇంద్రియములను, మనస్సును అధిష్టించి మానవ ప్రజ్ఞ జీవనయానము వైభవోపేతముగా నిర్వర్తించ దలచుకొన్నచో కర్తవ్యమను అంకుశముతో మనసును నడిపించవలెను. లేనిచో ప్రజ్ఞ హరింపబడునని శ్రీకృష్ణుడు తెలుపుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 181 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 28. Prior to birth where was the ‘I am’? Don’t contaminate the ‘I am’ with the body idea, I as the Absolute am not the ‘I am’. 🌻* 

 What were you before you were born? Where was the ‘I am’? You were ‘Nothing’ and there was no ‘I am’. 

On this Nothingness of yours has the ‘I am’ appeared and it has got contaminated with the body idea. 

Now, through discrimination you need to undertake a decontamination procedure, free the ‘I am’ of the body idea, abide in it and transcend it, because you as the Absolute are not the ‘I am’.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 59 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్ 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆత్మ విచారణ పద్ధతి - 23 🌻*

కాబట్టి, నచికేతుడు ఎంతటి బుద్ధిశాలో దీనిని బట్టి మనం గ్రహించవచ్చు. 

యమధర్మరాజు ఇప్పటివరకూ చెప్పినటువంటి అంశాలనన్నిటినీ నచికేతుడు తనలో తాను సమీక్షించుకున్నాడు. ఎట్లా సమీక్షించాడు? 

మొదటి వరంలోనేమో తండ్రి యొక్క సుఖాన్ని ఆకాంక్షి కోరిన వరాన్ని ఇచ్చారు. రెండవ వరంలో నచికేతాగ్నిచయనము గురించినటువంటి బోధంతా చెప్పారు. 

ఆ నచికేతాగ్ని చయనము అనేటటువంటి అగ్నిచయనాన్ని కర్మగా చేస్తే, నువ్వు ఆత్మస్థితిని పొందుతావు అనీ చెప్తున్నాడు, రెండవ పద్ధతిలో ఏం చెప్తున్నాడంటే నకర్మణా - ఏం చేయడం ద్వారా కూడా నువ్వు పొందలేవు అని తద్‌విరుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించి కూడా బోధిస్తున్నాడు. 

అతి సూక్ష్మము, అత్యంత సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమము అనేటటువంటి పద్ధతిని కూడా చెప్తూ, ఒక పక్కన ఏం చెప్తున్నాడు? అంటే నచికేతాగ్నిని అనుష్టయనం చేసి తాను అష్ట దిక్పాలకులలో ఒకడుగా అయ్యాను అనేటటువంటి స్థితిని కూడా చెప్తున్నాడు. ఈ రెండు విరుద్ధములను ఒకేసారి చెప్తున్నాడేమిటి? అనేటటువంటి దానిని సంశయించాడు. 

ఇంకేంటట? మధ్యమధ్యలో ఈ నచికేతుని యొక్క అధికారిత్వమును గురించి ప్రశంసించి, ఈయనని దాటవేస్తున్నాడేమో ఒకవేళ తాను ఏదైతే పొందాలని అనుకున్నాడో, తన ప్రశ్న ఏదైతే వుందో, మరణానంతరం జీవితం వుందా? మరణానంతరం మానవుని యొక్క స్థితి ఏమిటి? అనే ప్రశ్న సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నాడేమో, కాబట్టి, అలాంటి పద్ధతి కాకుండా, ఆచార్యుడిని నేను స్పష్టముగా ప్రశ్నించాలి. ‘పరిప్రశ్నేన సేవయా’ - అనేటటువంటి పద్ధతిగా నేను తిరిగి ప్రశ్నించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మరల ప్రశ్నిస్తున్నాడు.

    ఆచార్యా! నేను బ్రహ్మోపదేశమునకు అర్హుడనైతినేని, మీకు నా యందు సంపూర్ణ అనుగ్రహమున్న యెడల వేదవిహిత కర్మానుష్ఠానము దాని ఫలమునకు వేరైనట్టియు, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము, దాని ఫలమునకు వేరైనట్టియు, కార్యకారణ జగత్తునకు వేరైనట్టియు, కాలత్రయముచే బాధింపబడక అపరిచ్ఛిన్నమైనదో అట్టి పరమాత్మ తత్వమును నీవెరిగి యున్నావు. నీవెరిగిన ఆ తత్వమునే నాకు బోధింపుమని నచికేతుడు యముని ప్రార్థించెను.

    అయ్యా! నీవు... ‘నేను అధికారిని’ అని అంటున్నావు కాబట్టి, మీ వద్ద వున్నటువంటి, పరమాత్మ తత్వమునకు సంబంధించినటువంటి, బ్రహ్మోపదేశాన్ని నాకు చేయండి. ఎందువల్ల? అంటే, దాని విశేషం ఏమిటంటే...

కర్మలు ద్వివిధింబులు.
1. వేద విహితమైన కర్మ.
2. వేద నిషిద్ధమైన కర్మ.

    వేద విహితమైన కర్మ ద్వారా స్వర్గలోకాది సౌఖ్యములని పొందవచ్చు. వాటిని సూక్ష్మ శరీరంతో అనుభవించవచ్చు. 

వేద నిషిద్ధమైన కర్మ చేయడం ద్వారా ద్వంద్వానుభూతులైనటువంటి ఈ జగత్తునకు పుణ్యపాప కర్మల చేత, జనన మరణముల చేత, బాధించబడుతూ... స్వర్గ నరకముల చేత, అనుభూతములను పొందుతూ, సుఖదుఃఖాలను పొందుతూ, కష్ట నష్టాలను పొందుతూ... రాత్రి పగళ్ళయందు చరిస్తూ.... ఈ రకమైనటువంటి ద్వంద్వాలలో మునిగి తేలుతూ వుండేటటువంటి పద్ధతి కూడా ఉన్నది. మరి ఈ రెండూ కూడా పరతత్వమును పొందింప జాలవు. 

కాబట్టి వేద విహితమైనటువంటి కర్మానుష్ఠానము, వేద నిషిద్ధమైన కర్మానుష్ఠానము.... ఈ రెండింటి ద్వారా వచ్చేటటువంటి ఫలము ‘ఆత్మనిష్ఠ’ కాదు. కాబట్టి మీరు కార్యకారణ జగత్తుకు వేరైనట్టి... ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే కార్యకారణ వివేకం కనుక నీవు పొందకపోయినట్లయితే నువ్వు బ్రహ్మనిష్ఠుడవు కాలేవు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. అద్భుత సృష్టి - 36🌹*
 ✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
          
🌟. *DNA యాక్టివేషన్ మూడు విధాలుగా జరుగుతుంది.*

🔵 *లెవల్ -1*

✨ 1 నుండి 4 తంతుల యాక్టివేషన్ లో బ్రెయిన్ చక్రా యాక్టివేషన్ అవుతుంది. సహస్రార స్థితిలోకి మారుతాం.

🟢 *లెవల్ -2*

✨5 నుండి 8 తంతుల యాక్టివేషన్ లో సోల్ చక్రా యాక్టివేషన్ లోకి వస్తుంది. పూర్ణాత్మ స్థితిలోకి మారుతాం.

🟣 *లెవల్ -3*

✨ 9 నుండి 12 తంతుల యాక్టివేషన్ లో హైయ్యర్ కాన్షియస్ తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. సుప్రీమ్ సోల్ (మూల చైతన్య స్థితి) లోకి మారుతాం.

🌟. *13. DNA 12 ప్రోగులు - 12 లేయర్స్*

💫. *1వ స్ట్రాండ్:* 
మన శరీర నిర్మాణం అంటే మన ఆరోగ్యం, నాడీమండలం, శరీర అవయవ నిర్మాణం, మొత్తం మన భౌతిక విషయాలకు సంబంధించిన సమాచారం అంతా ఇందులో ఉంటుంది.

💫. *2 వ స్ట్రాండ్ :* 
దీనిని మన *"ఎమోషనల్ లేయిర్"* అంటారు. ధర్మం - అధర్మం, చీకటి - వెలుగు, జ్ఞానం - అజ్ఞానం అనే విషయాలు వివేచనకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ లేయర్ బ్యాలెన్స్ కొరకు చాలా ముఖ్యమైనది. జీవిత పాఠాలు కలిగి ఉన్న ఈ లేయర్ పేరు *"డివైన్ బ్లూప్రింట్"*.

ఈ పొరలో ద్వంద్వత్వం దాగి వుంది. మొదటి పొర భౌతికత్వాన్నీ, రెండవ పొర అంతరంగం అనే వేరువేరు విషయాలను చూపి కొన్ని వేల సంవత్సరాలుగా ద్వంద్వత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

💫. *3వ స్ట్రాండ్ :* 
ఈ లేయర్ *"అసెన్షన్ యాక్టివేషన్"* కు సంబంధించినది. అసెన్షన్ కి సంబంధించిన కోడింగ్ ఈ లేయర్ లో ఉంటుంది.

💫. *4వ & 5వ స్ట్రాండ్స్ :* 
ఈ లేయర్స్ *"ఆకాశిక్ రికార్డ్స్"* కు అనుసంధానం చేయబడి ఉంటాయి. ఈ లేయర్స్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మన DNA నుండి తొలగించబడిన సమాచారమంతా మళ్ళీ పొందవచ్చు.

💫. *6వ స్ట్రాండ్ :* 
ఈ లేయర్ మన గుణాలను బ్యాలెన్స్ చేస్తుంది. ఆ గుణాలలో మాస్టరీ పొందడం జరుగుతుంది.

💫. *7వ స్ట్రాండ్ :* 
ఈ లేయర్ కి లెమూరియన్ భాషలో *"సోలారా"* అంటారు. దీని అర్థం *"DNA మాస్టర్"* అని అర్థం. ఇది మూల బీజపు లేయర్. ఇది ఎంత ఎక్కువ వైబ్రేషన్స్ కలిగి ఉంటే అంత ఎక్కువగా ఎదుగుతుంది. ఈ మూల బీజపు లేయర్ అతి సూక్ష్మ గ్రాహ్యతను అభివృద్ధి పరుస్తుంది.

  ఈ లేయర్ వలన మనం విశ్వ రహస్యాలను టెలిస్కోప్, మైక్రోస్కోప్ లేకుండా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ తో కాస్మోస్ కి ట్యూన్ అయి సమస్త సమాచార జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాం.

💫. *8వ స్ట్రాండ్ :* 
ఇది వ్యక్తిగత ఆకాషిక్ రికార్డు లాంటిది. 4వ డైమెన్షన్ తర్వాత ట్రైమ్ స్పేస్ ఉండదు. కాబట్టి మన గత జన్మలన్నీ సమాంతర జన్మలుగా ఏకకాలంలో మన వివిధ జన్మలను తెలియజేస్తుంది. ఇది శాశ్వతత్వానికి సంబంధించినది.

💫. *9వ స్ట్రాండ్ :* 
దీని యాక్టివేషన్ ద్వారా హీలింగ్ పవర్ యాక్టివేషన్ లోకి వస్తుంది. ఇది మన కర్మలను విడుదల చేసి మనలో చైతన్య విస్తరణ, ఆధ్యాత్మిక ప్రగతిని పెంపొందిస్తుంది.

💫. *10వ స్ట్రాండ్ :* 
ఇది మనల్ని గాడ్ కాన్షియస్నెస్ లోకి (దేవుని చైతన్యంలోకి) తీసుకుని వెళ్తుంది. దీనిని *"చైతన్యపు లేయర్"* అంటారు.

💫. *11వ స్ట్రాండ్ :* 
దీనిని *"విజ్ డమ్ ఆఫ్ ఫెమినైన్ (స్త్రీ తత్వపు విజ్ఞానం)"* అంటారు. ఇది శక్తి, కరుణ మరి శాంతిని యాక్టివేషన్ చేస్తుంది. స్త్రీ - పురుష శక్తులను సమతుల్యం చేస్తుంది.

💫. *12వ స్ట్రాండ్ :* 
ఇది దైవత్వపు లేయర్. ప్రేమ, దైవత్వం మనలో నింపుతుంది మరి మనం అంతరంగంలో దైవ మానవునిగా జీవిస్తూ, భూమిపైన వాస్తవికతతో జీవిస్తాం. సకల జీవరాశిని సమంగా ప్రేమిస్తూ తల్లిలా అందరినీ సంరక్షిస్తాం.

🌟. *12 స్ట్రాండ్ DNA యాక్టివేషన్ మూడు విధాలుగా జరుగుతుంది.*🌟

💫. 1. సహస్రార చక్ర క్రిస్టల్స్ యాక్టివేషన్ లోకి వస్తాయి. తల మధ్యభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. దాని చుట్టూ 12 క్రిస్టల్స్ ఉంటాయి. ఈ 12 క్రిస్టల్స్ ఒకదానితో ఒకటి అనుసంధానం పొందుతాయి. ఈ 12 క్రిస్టల్స్ 12 చక్రాలతోనూ, 12 డైమెన్షన్స్ తోనూ DNA ప్రోగులతోనూ కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఎనర్జీని తయారు చేసుకోవటానికి ఒక దానితో ఒకటి కనెక్ట్ అయి.. ఒక రూపాన్ని తీసుకుంటాయి.

💫. 2. ఈ రూపాన్నే *"మెర్కాబా"* అంటారు. దీనిని *"యూనివర్సల్ యాంటీనా "* అంటారు. మన సూక్ష్మ శరీరం మెర్కాబా షేప్ తీసుకొని డైమెన్షన్ టూ డైమెన్షన్ ప్రయాణిస్తుంది. ఈ మెర్కాబా వలన ఔటర్ బాడీ అనుభవాలు వస్తాయి. హైయ్యర్ డైమెన్షనల్ మెస్సేజెస్ అన్నీ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది.

💫. 3.మన తలలో పీనియల్, పిట్యూటరీ గ్రంధులతో పాటు హైపోథాలమస్ గ్రంథి ఉంటుంది. ఈ మూడు గ్రంథులు యాక్టివేషన్ లోకి వస్తాయి. ఈ హైపోథాలమస్ గ్రంథిని *"యూనివర్సల్ ట్రాన్స్ లేటర్"* అంటారు. ఉన్నత లోకాల సమాచారాన్నీ మరి జ్ఞానాన్నీ ఇది ట్రాన్సిలేట్ చేస్తుంది. (ఉన్నత సమాచారం కాంతి భాషల్లో ఉంటుంది).

🌟. *DNA యాక్టివేషన్ కి అడ్డుపడే అంశాలు*🌟

*1. కర్మ సిద్ధాంతం*
*2. డెత్ సీల్స్ (J స్టీల్స్ )*
*3. ఇంప్లాంట్స్*
*4. చక్రాలు సీల్స్*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 18 / Sri Vishnu Sahasra Namavali - 18 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*వృషభరాశి- మృగశిర నక్షత్ర 2వ పాద శ్లోకం*

*18. వేద్యో వైద్య స్సదా యోగీ వీరహా మాధవో మధుః|*
*అతీన్ద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః||*

అర్ధము :
163) వేద్యః - 
తప్పక తెలుసుకోదగినవాడు.

164) వైద్యః - 
అన్ని విద్యలు తెలిసినవాడు, సర్వజ్ఞుడు. 

165) సదాయోగీ - 
విశ్వముతో ఎల్లప్పుడూ అనుసంధానంతో వుండువాడు.

166) వీరహా - 
మహాబలవంతుడు, దుష్టశక్తులను నాశనము చేయువాడు.

167) మాధవః - 
మనస్సు ద్వారా తెలుసుకోబడువాడు.

168) మధుః - 
అత్యంత ప్రియమైనవాడు, మంగళకరుడు. 

169) అతీంద్రియః - 
ఇంద్రియములకు అతీతుడు. 

170) మహామాయః - 
మాయను కలిగించువాడు, తొలగించువాడు కూడా అతడే. 

171) మహోత్సాహః - 
ఎంతో ఉత్సాహముతో, సహనముతో విశ్వమును పాలించువాడు. 

172) మహాబలః - 
అంతులేని బలము కలవాడు, అన్నింటికీ బలమును ప్రసాదించువాడు.

*🌹 Vishnu Sahasra Namavali - 18 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Vrushabha Rasi, Mrugasira 2nd Padam*

*18. vedyō vaidyaḥ sadāyōgī vīrahā mādhavō madhuḥ |*
*atīndriyō mahāmāyō mahōtsāhō mahābalaḥ ||18 ||*

163) Vedyaḥ: 
One who has to be known by those who aspire for Mokshas.

164) Vaidhyaḥ: 
One who knows all Vidyas or branches of knowledge.

165) Sadāyogī: One who is ever experienceble, being ever existent.

166) Vīrahā: 
One who destroys heroic Asuras for the protection of Dharma.

167) Mādhavaḥ: 
One who is the Lord or Master of Ma or knowledge.

168) Madhuḥ: 
Honey, because the Lord gives joy, just like honey.

169) Atīndriyaḥ: 
One who is not knowable by the senses.

170) Mahāmāyaḥ: 
One who can cause illusion even over other great illusionists.

171) Mahotsāhaḥ: 
One who is ever busy in the work of creation, sustentation and dissolution.

172) Mahābalaḥ: 
The strongest among all who have strength.,

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సిద్ధకుంజికా స్తోత్రం / सिद्धकुञ्जिका स्तोत्रम् 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ

*సకల దుఃఖాలను తొలగించి, అనేక శుభాలు కలిగించి, సిద్ధిని కలిగించే స్తోత్రము సిద్ధ కుంజికా స్తోత్రము. ఈ స్తోత్రము చదవటం వల్ల అపమృత్యుదోషం ఉండదు.*
*-- సద్గురు పండిత శ్రీరామశర్మ ఆచార్య*

ఓం అస్య శ్రీకుంజికాస్తోత్రమంత్రస్య సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః,
శ్రీత్రిగుణాత్మికా దేవతా, ఓం ఐం బీజం, ఓం హ్రీం శక్తిః, ఓం క్లీం కీలకమ్,
మమ సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః |

శివ ఉవాచ –
శృణు దేవి ప్రవక్ష్యామి కుంజికాస్తోత్రముత్తమమ్ |
యేన మంత్రప్రభావేణ చండీజాపః శుభో భవేత్ || ౧ ||

న కవచం నార్గలాస్తోత్రం కీలకం న రహస్యకమ్ |
న సూక్తం నాపి ధ్యానం చ న న్యాసో న చ వార్చనమ్ || ౨ ||

కుంజికాపాఠమాత్రేణ దుర్గాపాఠఫలం లభేత్ |
అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్ || ౩ ||

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి |
మారణం మోహనం వశ్యం స్తంభనోచ్చాటనాదికమ్ |
పాఠమాత్రేణ సంసిద్ధ్యేత్ కుంజికాస్తోత్రముత్తమమ్ || ౪ ||

అథ మంత్రః |
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే |
ఓం గ్లౌం హుం క్లీం జూం సః జ్వాలయ జ్వాలయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల
ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే జ్వల హం సం లం క్షం ఫట్ స్వాహా || ౫ ||
ఇతి మంత్రః |

నమస్తే రుద్రరూపిణ్యై నమస్తే మధుమర్దిని |
నమః కైటభహారిణ్యై నమస్తే మహిషార్దిని || ౬ ||

నమస్తే శుంభహంత్ర్యై చ నిశుంభాసురఘాతిని |
జాగ్రతం హి మహాదేవి జపం సిద్ధం కురుష్వ మే || ౭ ||

ఐంకారీ సృష్టిరూపాయై హ్రీంకారీ ప్రతిపాలికా |
క్లీంకారీ కామరూపిణ్యై బీజరూపే నమోఽస్తు తే || ౮ ||

చాముండా చండఘాతీ చ యైకారీ వరదాయినీ |
విచ్చే చాభయదా నిత్యం నమస్తే మంత్రరూపిణి || ౯ ||

ధాం ధీం ధూం ధూర్జటేః పత్నీ వాం వీం వూం వాగధీశ్వరీ |
క్రాం క్రీం క్రూం కాలికా దేవి శాం శీం శూం మే శుభం కురు || ౧౦ ||

హుం హుం హుంకారరూపిణ్యై జం జం జం జంభనాదినీ |
భ్రాం భ్రీం భ్రూం భైరవీ భద్రే భవాన్యై తే నమో నమః || ౧౧ ||

అం కం చం టం తం పం యం శం వీం దుం ఐం వీం హం క్షం |
ధిజాగ్రం ధిజాగ్రం త్రోటయ త్రోటయ దీప్తం కురు కురు స్వాహా || ౧౨ ||

పాం పీం పూం పార్వతీ పూర్ణా ఖాం ఖీం ఖూం ఖేచరీ తథా |
సాం సీం సూం సప్తశతీ దేవ్యా మంత్రసిద్ధిం కురుష్వ మే || ౧౩ ||

కుంజికాయై నమో నమః |

ఇదం తు కుంజికాస్తోత్రం మంత్రజాగర్తిహేతవే |
అభక్తే నైవ దాతవ్యం గోపితం రక్ష పార్వతి || ౧౪ ||

యస్తు కుంజికయా దేవి హీనాం సప్తశతీం పఠేత్ |
న తస్య జాయతే సిద్ధిరరణ్యే రోదనం యథా || ౧౫ ||

ఇతి శ్రీరుద్రయామలే గౌరీతంత్రే శివపార్వతీసంవాదే కుంజికాస్తోత్రం సంపూర్ణమ్ |
🌹 🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Siddha Kunjika Stotram – सिद्धकुञ्जिका स्तोत्रम् 🌹*
*📚. Prasad Bharadwaj