1) 🌹 11, JANUARY 2023 WEDNESDAY, బుధవారం, సౌమ్య వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 117 / Kapila Gita - 117 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 01 / 3. Understanding Material Nature - 01 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 709 / Vishnu Sahasranama Contemplation - 709 🌹 🌻709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 670 / Sri Siva Maha Purana - 670 🌹 🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 8 / Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 8 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 290 / Osho Daily Meditations - 290 🌹 🍀 291. ఏకత్వం / 291. ONENESS 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 423 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 2 🌹 🌻 423. 'ద్విజబృంద నిషేవితా' - 2 / 'Dwijabrinda Nishevita' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹11, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ బుధవారం, సౌమ్య వాసరే Wednesday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌺. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌺*
*🍀. శ్రీ గణేశ హృదయం - 3 🍀*
5. గకారరూపం వివిధం చరాచరం
ణకారగం బ్రహ్మ తథా పరాత్పరమ్ |
తయోః స్థితాస్తస్య గణాః ప్రకీర్తితా
గణేశమేకం ప్రణమామ్యహం పరమ్
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : మనలోని గంభీర సత్యమగు దివ్యశక్తిని గుర్తించుకొని, బాహ్య పరిస్థితుల ప్రాబల్యాన్ని తిరస్కరించ గల ఆంతరంగిక బలాన్ని సుప్రతిష్ఠితం చేసుకోడమే యోగసాధన ముఖ్యాశయం. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్, హేమంత ఋతువు,
దక్షిణాయణం, పౌష్య మాసం
తిథి: కృష్ణ చవితి 14:32:16 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: మఘ 11:51:56 వరకు
తదుపరి పూర్వ ఫల్గుణి
యోగం: ఆయుష్మాన్ 12:02:12
వరకు తదుపరి సౌభాగ్య
కరణం: బాలవ 14:30:16 వరకు
వర్జ్యం: 20:42:20 - 22:28:36
దుర్ముహూర్తం: 12:01:27 - 12:46:07
రాహు కాలం: 12:23:47 - 13:47:34
గుళిక కాలం: 11:00:00 - 12:23:47
యమ గండం: 08:12:27 - 09:36:14
అభిజిత్ ముహూర్తం: 12:01 - 12:45
అమృత కాలం: 09:10:12 - 10:57:24
సూర్యోదయం: 06:48:40
సూర్యాస్తమయం: 17:58:53
చంద్రోదయం: 21:40:51
చంద్రాస్తమయం: 09:50:55
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 11:51:56 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 117 / Kapila Gita - 117🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 01 🌴*
*శ్రీభగవానువాచ*
*01. ప్రకృతిస్థోఽపి పురుషో నాజ్యతే ప్రాకృతైర్గుణైః*
*అవికారాదకర్తృత్వాన్నిర్గుణత్వాజ్జలార్కవత్॥*
*శ్రీకపిలభగవానుడు వచించెను*:
*అమ్మా! జలములోని సూర్యుని ప్రతిబింబమునకు ఆ జలము యొక్క ధర్మములైన చల్లదనము, చాంచల్యము మున్నగు వాటితో ఎట్టి సంబంధమూ ఉండదు. అట్లే ప్రకృతి కార్యరూపమైన శరీరము నందు ఉన్నప్పటికిని వాస్తవముగా ఆత్మకు ఆ శరీరము యొక్క సుఖదుఃఖాదులతో ఎట్టి సంబంధము ఉండదు. ఏలయన ఆత్మ సహజముగా నిర్వికారము, అకర్త, నిర్గుణము.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 117 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 3. Understanding Material Nature - 01 🌴*
*01. śrī-bhagavān uvāca*
*prakṛti-stho 'pi puruṣo nājyate prākṛtair guṇaiḥ*
*avikārād akartṛtvān nirguṇatvāj jalārkavat*
*The Personality of Godhead Kapila continued: When the living entity is thus unaffected by the modes of material nature, because he is unchanging and does not claim proprietorship, he remains apart from the reactions of the modes, although abiding in a material body, just as the sun remains aloof from its reflection on water.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 709 / Vishnu Sahasranama Contemplation - 709🌹*
*🌻709. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ🌻*
*ఓం వాసుదేవాయ నమః | ॐ वासुदेवाय नमः | OM Vāsudevāya namaḥ*
*ఇదం జగత్ వాసయత్యాచ్ఛాదయతి మాయయాయ ।*
*ఇతి వాసుస్సదేవోఽయం వాసుదేవ ఇతీర్యతే ॥*
*ఛాదయామి జగద్విశ్వం భూత్యా సూర్య ఇవాంశుభః ।*
*ఇతిహి శ్రీవ్యాసముని భగవద్వాక్య సంస్మృతేః ॥*
*తన మాయచే జీవులను వాసించును లేదా కప్పివేయునుగనుక వాసుః. అట్టివాడేయగు దేవుడు వాసుదేవుడు. మహాభారత శాంతి పర్వమునందలి 'నేను నా భూతిచే అనగా మాయచే సూర్యుడు తన కిరణములచేత వలె సర్వజగత్తును కప్పివేయుదును' అను భగవద్ వచనము ఇందులకు ప్రమాణము.*
:: విష్ణు పురాణే షష్ఠాంశే పంచమోఽధ్యాయః :
భూతేషు వసతే సోఽన్తర్వసన్త్యత్ర చ తాని యత్ ।
ధాతా విధాతా జగతాం వాసుదేవస్తతః ప్రభుః ॥ 82 ॥
*ప్రభువు సమస్త భూతములయందును వ్యాపించి, సర్వభూతములును తనయందే వసించియున్నవాడు. సంసార రచయితయు, రక్షకుడును అయి ఉన్నందున ఆ ప్రభువు వాసుదేవుడని పిలువబడుచున్నాడు.*
*ఏది నేత్రములులకు గోచరించదో, ఏది స్పర్శేంద్రియము చేత స్పృశించ శక్యము కాదో, ఏది ఘ్రాణేంద్రియము ద్వారా ఘ్రాణమునకు (ముక్కు, వాసన) దొరకదో, ఏది రసేంద్రియమునకు అందక అతీతముగనుండునో, దేనిపై సత్త్వ రజస్ తమస్సులనబడు త్రిగుణముల ప్రభావము ఉండదో, అది సర్వవ్యాపియో సాక్షియై ఉండి సంపూర్ణ జగత్తుయొక్క ఆత్మగా తెలియబడుచున్నది. అన్ని ప్రాణులు నశించినప్పటికి ఏదైతే తాను స్వయముగా నశ్వరము కాదో, ఏది 'అజన్మా,' 'నిత్యము,' 'సనాతనము,' 'నిర్గుణము,' 'నిష్కలంకము'గా చెప్పబడుచున్నదో, ఏది ఇరువదినాలుగు తత్త్వములకు అతీతమై ఇరువదిఐదవ తత్త్వముగా విఖ్యాతినొందినదో, ఏది నిష్క్రియమో, దేనిని పురుషుడు అని పిలిచెదరో, జ్ఞానమయ నేత్రములచేత మాత్రమే ఏది ఎరుంగ యోగ్యమై యుండునో, దేనియందు ప్రవేశించిన ద్విజులు ముక్తులౌదురో అదే సనాతన పరమాత్మ. దానినే వాసుదేవ నామముతో ఎరుంగ వలయును.*
332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 709🌹*
*🌻709. Vāsudevaḥ🌻*
*OM Vāsudevāya namaḥ*
इदं जगत् वासयत्याच्छादयति माययाय ।
इति वासुस्सदेवोऽयं वासुदेव इतीर्यते ॥
छादयामि जगद्विश्वं भूत्या सूर्य इवांशुभः ।
इतिहि श्रीव्यासमुनि भगवद्वाक्य संस्मृतेः ॥
*Idaṃ jagat vāsayatyācchādayati māyayāya,*
*Iti vāsussadevo’yaṃ vāsudeva itīryate.*
*Chādayāmi jagadviśvaṃ bhūtyā sūrya ivāṃśubhaḥ,*
*Itihi śrīvyāsamuni bhagavadvākya saṃsmrteḥ.*
*He conceals or covers the worlds by māya therefore Vāsuḥ. He devaḥ, too and hence He is Vāsudevaḥ. 'I envelop the entire world as he sun by his rays' mentioned in Mahābhārata Śānti Parva can be a reference here.*
:: विष्णु पुराणे षष्ठांशे पञ्चमोऽध्यायः :
भूतेषु वसते सोऽन्तर्वसन्त्यत्र च तानि यत् ।
धाता विधाता जगतां वासुदेवस्ततः प्रभुः ॥ ८२ ॥
Viṣṇu Purāṇa - Section 6, Chapter 5
Bhūteṣu vasate so’ntarvasantyatra ca tāni yat,
Dhātā vidhātā jagatāṃ vāsudevastataḥ prabhuḥ. 82.
*The Lord is all pervading; He permeates all the elements and beings and all these are sheltered in Him. Since He is the creator and the protector of the worlds, the Lord is known as Vāsudevaḥ.*
332. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
695. వాసుదేవః, वासुदेवः, Vāsudevaḥ
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतावासो वासुदेवः सर्वासुनिलयोऽनलः ।दर्पहा दर्पदोऽदृप्तो दुर्धरोऽथापराजितः ॥ ७६ ॥
భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।దర్పహా దర్పదోఽదృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ 76 ॥
Bhūtāvāso vāsudevaḥ sarvāsunilayo’nalaḥ,Darpahā darpado’drpto durdharo’thāparājitaḥ ॥ 76 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 670 / Sri Siva Maha Purana - 670 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 18 🌴*
*🌻. గణాలకు అధిపతిగా పట్టాభిషేకం - గణేశుని వ్రత వర్ణనము - 8 🌻*
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాత్ముడగు గణేశునకు శివుడు ఇట్లు చెప్పెను. అపుడు సమస్త దేవతలు, మహర్షులు (61). శివునకు ప్రియులగు సర్వగణములు 'అటులనే చేసెదము' అని పలికి గణేశుని శ్రద్ధతో యథావిధిగా పూజించిరి (62). అపుడు సర్వగణములు ఆ గణేశునకు ప్రణమిల్లి అనేక వస్తువులతో ఆదరముగా ప్రత్యేక పూజను చేసిరి (63). ఓ మహర్షీ! అపుడు పార్వతి పొందిన హర్షమును నేను నాల్గు ముఖములతోనైననూ వర్ణింపజాలను (64).
దేవదుందుభులు మ్రోగినవి. అప్సరసలు నాట్యమాడిరి. గంధర్వశ్రేష్ఠులు గానము చేసిర. పుష్పవృష్టి కురిసెను (65). గణేశుడు ఈవిధముగా పురుజ్జీవుతడై పూజింపబడగా జగత్తు స్వస్ధతను పొందెను. గొప్ప ఉత్సవము జరిగెను. అందరి దుఃఖము తొలగిపోయెను (66).
ఓ నారదా! పార్వతీ పరమేశ్వరులు మిక్కిలి సంతసించిరి. అంతటా సుఖకరమగు మంగళోత్సవము విస్తరముగా జరిగెను (67). అపుడు అచటకు విచ్చేసిన సమస్త దేవతా గణములు, మరియు బుషి బృందములు శివుని అనుమతిని పొంది తమ నెలవులకు వెళ్లిరి (68). పార్వతిని, గణేశుని చాల సార్లు ప్రశంసించి, శివుని స్తుతించి యుద్ధమును గురించి సవిస్మయముగా వర్ణిస్తూ వారు వెళ్లిరి (69).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 670🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 18 🌴*
*🌻 Gaṇeśa crowned as the chief of Gaṇas - Description of Ganesha Vrata - 8 🌻*
Brahmā said:—
61-62. When this was mentioned by Śiva to Gaṇeśa of great soul, O sage, the gods, the sages and the Gaṇas, favourites of Śiva said “So be it” and worshipped Gaṇeśa according to prescribed rules.
63. All the Gaṇas, particularly bowed to Gaṇeśa and adored him respectfully with various articles.
64. O great sage, how can I describe even with my four mouths the indescribable delight of Pārvatī.
65. The divine drums were sounded. The celestial damsels danced. The Gandharva chiefs sang. Flowers were showered upon him.
66. When Gaṇeśa was installed, the whole universe attained peace and normalcy. There was great jubilation. All miseries ended.
67. O Nārada, Pārvatī and Śiva rejoiced in particular. Good and plentiful auspiciousness was conducive to happiness everywhere.
68-69. The gods and the sages, who had come there, returned at the bidding of Śiva praising Pārvatī and Gaṇeśa again and again, eulogising Śiva and saying “O what a battle!”
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 291 / Osho Daily Meditations - 291 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 291. ఏకత్వం 🍀*
*🕉. అన్ని విభాగాలు వలె బయట మరియు లోపల అనేది కేవలం తప్పుడు విభజన. పదాలు లేకుండా మాట్లాడటం కష్టం కాబట్టి అవి కొంత ఉపయోగ పడతాయి. కానీ చివరకు ఏకత్వం మాత్రమే ఉందని మీరు అర్థం చేసుకుంటారు. దానికి బయట మరియు లోపల లేదు. ఇది ఒకటి, మరియు మీరే అది. 🕉*
*ఈ ఏకత్వమే ఉపనిషత్తుల తత్త్వమసి శ్వేతకేతు. ' అది నీవు.' అది అంటే బయట. నీవు అంటే లోపల. అవి ఒకదానికొకటి వంతెనగా ఉన్నాయి. అది నువ్వు అవుతుంది, నువ్వు అది అవుతావు. అకస్మాత్తుగా విభజన మాయం అవుతుంది. ఏ విభజన మిగిలి ఉండదు. మరణమే జీవితం, మరియు జీవితమే మరణం. విరుద్ధమైనది ఒకటిగా ఉండగలదని చూడడానికి మనస్సు అసమర్థమైనది కాబట్టి ఇన్ని విభజనలు ఉన్నాయి.*
*మనస్సు దాని తర్కం వల్ల ఒకే విషయం రెండుగా ఎలా వుండగలదో గ్రహించలేదు. రెండు ఒకటిగా ఎలా ఉండగలవో మనసు చూడలేదు. మనస్సు ఇది లేదా అది అని ఆలోచిస్తుంది; అది లేదా ఇది అని చెబుతుంది. జీవితం రెండూ అయి వుంది. అస్తిత్వం రెండింటినీ తనలో కలిగి వుంది. కానీ అస్తిత్వం రెండూ కలిస్తే ఏర్పడిందని చెప్పడం సరికాదు. అస్తిత్వం ఏ విభజనలూ లేని ఏకత్వం.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 291 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 291. ONENESS 🍀*
*🕉. Outside and inside are just false divisions, as all divisions are. They are useful--because it is difficult to talk without words. But then you come to understand that there is only one. It has no outside to it and no inside. It is one, and you are that. 🕉*
*This oneness is the meaning of the Upanishads' Tattwamasi Swetaketu-- "that art thou." That means the outside, thou means the inside; they are bridged. That becomes thou, and thou becomes that. Suddenly there is no division. There is no division--death is life, and life is death. All divisions exist because the mind is incapable of seeing that the contradictory can be one.*
*It is because of its logic that the mind cannot see how a thing can be both. The mind thinks of either / or; it says either this or that. And life is both, existence is both together--so much so that to say that existence is both things together is not right. It is a tremendous oneness.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 423 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 423. 'ద్విజబృంద నిషేవితా' - 2🌻*
*ఆరాధన మార్గమున వెలుగునందు స్థిరపడిననూ వారా వెలుగులకు మూలమైన శ్రీమాతను ఆరాధించుచునే యుందురు. అట్టి వారి ఆరాధన విశేషమగు ఆరాధన. అట్టి ద్విజులు సామూహికముగ శ్రీమాతను ఆరాధనము చేసినపుడు ఆమె సాన్నిధ్యము అచ్చట నిశ్చయముగ నుండును. కారణము శ్రీమాతకు వారియందు గల అశేష ప్రీతి.*
*అజ్ఞానులు ఆరాధించిననూ శ్రీమాత ప్రీతి చెందును. జ్ఞానులు, సిద్దులు, యోగులు ఆరాధించినపుడు విశేషముగ ప్రీతి చెందును. ఇట్టివారు బృందములుగ నేర్పడి ఆరాధించుట అత్యంత విశేషమైన కార్యము. శ్రీమాత అట్టి పూజల యందు విశేషముగ అవతరించు చుండును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 423 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 423. 'Dwijabrinda Nishevita' - 2🌻*
*On the path of worship, though established in the light, they continue to worship Sri Mata, the source of light. That worship is a special worship. When such a group worships Srimata, her presence is certain. The reason is the eternal love of Srimata towards them.*
*Sri Mata is pleased to be worshiped even by the ignorant. But when worshiped by sages, siddhis and yogis, She is highly pleased. It is a very special thing to worship as a group. Sri Mata's special incarnation happens in such Worships.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj