МĔŚŚĂĞĔŚ ŦŔŐМ 1 ŤŐ 194 . . .
ČŐМĨŃĞ ŚŐŐŃ . . .
. .
M̷͔͚̮͖͕̞͚̽͊e̴̖̅̇̈́̏̈͒s̵̢̧͕̟̤̓͠s̵̯̗̹̖͓̙̓̓͒a̵͔͛ǵ̸̪̪̬͚̱̤̋͌̂̿̕̚e̴̗̲̞̹͛͝͝s̷̥̰̃͠ ̸̭̖͖͙͈͖̮̀f̵̘͌̑̾͝r̴̢̼̼̗̖͔̘͑o̴̺̱̭̩̠͒͊̿̓̚͝m̴̨̢̪̯̮̦͌̏̓͜ ̵̡̢̨̤̳̟͍̰̖̬͆̄͂̀͋̕ ̸̲̤͙̺͕̦̜̪̮͎̆͠͝ ̷͙̹̮̈͊̃̀1̴̤̣̙̳̳̟͓̯̆̉͑̀͋̈́͝ ̵̨̢̧̬͚͓̃́̅̈́̀͗͘͝ ̵͕̲̞̘̬̩͆́̇̈́̍ ̴̹͚̭̻̯̦̳̭̞̽̆̒͗̈́̎̓̓̆̕ẗ̷̞͔̳́̓̃̌̔̑̕͝ͅȍ̸͖̪̙̣͎̠͌̎̈́͜ ̸̹̻͎̭̪̥̂͗͛̒̽́̊ ̵̡͖̆̊̕ ̷̠͓̟̣͙̣̟̘͂̽̄1̸̢̭̠̭̩͆̌̈́͂͛̀̿͝9̴͇̣̃̊̋̑4̸͉̫͚̣͎̓̓̃́͗͛̿͝ ̸̥͍͓̲̙͍̑̃̎̏̚ ̵̛̛̛̠͕̖̙̩͌̓̏͂̐͊͝.̴̳̝̫̪͈͓̪̤́̀ ̵̗̣̖̱͖̬͒͜ͅ.̵̩̬̻̈ͅ ̴͉͙̟̦̞̾͐̿̈́̿̇̋͋̀̕.̷͕̥̓̌̑͘͘͜ ̸̩̤̓̅́̋͐C̵̥̲͆͒͗̍̐̀̓͐̈́o̵͈̟̲̹̿̅̐̍̚͝͝ṃ̵͕̻͕̞̰̞̜̋̓́̎̽̀̓̐̔̐ì̷̧̺̝̩̫̞̽͆͋̀́͠n̵̟͈̤̔̐g̶͕̤͚̫̤̻͕̥͈̦̒̒̾ ̴̨͎̀̅̈S̴̨̞̰͚͚̲̜̩̖͗̿̅̈̔͂o̷̙͙̖͊o̴̯̰̣̱̙͊͛͒̿n̴͓̠͂̍̔̈̓̊̀̎̅
------------------------------------ x ------------------------------------
🌹 . శ్రీ శివ మహా పురాణము - 195 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 2 🌻
పక్వాన్న గంధమాఘ్రామ యజ్ఞదత్తాత్మజో ద్విజః | పితృత్యక్తో మాతృహీనః క్షిధితస్స తమన్వ గాత్ || 12
ఇదమన్నం మయా గ్రాహ్యం శివాయోపకృతం నిశి | సుప్తే శైవజనే దైవాత్సర్వస్మిన్ వివిధం మహత్ || 13
ఇత్యాశామవలంబ్యాథ ద్వారి శంభోరుపావిశత్ |దదర్శ చ మహాపూజాం తేన భక్తేన నిర్మితామ్ || 14
విధాయ నృత్యగీతాది భక్తాస్సుప్తాః క్షణ యదా | నైవేద్యం సతదాదాతుం భర్గాగారం వివేశ హ || 15
తండ్రిచే విడువబడి, తల్లి లేక ఆకలి గొనియున్న ఆ యజ్ఞదత్తపుత్రుడగు బ్రాహ్మణుడు ఆహారపదార్ధముల గంధము నాఘ్రాణించి అతని వెనుకనే వెళ్లెను (12).
శివభక్తులు ఈ అన్నమును శివునకు నివేదన చేసి రాత్రి యందు నిద్రించగనే, నేను ఈ వివిధములగు దివ్యమైన వంటకములను పరిగ్రహించెదను (13).
అతడీ తీరున ఆ శించిన శివసన్నిధిలో ద్వారము నందు కూర్చుండి, ఆ భక్తుడు చేసిన మహాపూజను దర్శించెను (14).
ఆ భక్తులు నాట్యములను చేసి, పాటలను పాడి నిద్రించగనే; ఆ నైవేద్యమును గ్రహించుటకు ఆతడు శివసన్నిధిలోనికి ప్రవేశించెను (15).
దీపం మందప్రభం దృష్ట్వా పక్వాన్న వీక్షణాయ సః | నిజచైలాంచలాద్వర్తిం కృత్వా దీపం ప్రకాశ్య చ || 16
యజ్ఞదత్తత్మా జస్సోsథ శివనైవేద్యమాదరాత్ | జగ్రాహ సహసా ప్రీత్యా పక్వాన్నం బహుశస్తతః || 17
తతః పక్వాన్న మాదాయ త్వరితం గచ్ఛతో బహిః | తస్య పాదతలాఘాతాత్ర్పసుప్తః కోsప్యబుధ్యత|| 18
కోsయం కోsయం త్వరాపన్నో గృహ్యతాం గృహ్యతా మసౌ | ఇతి చుక్రోశ స జనో గిరా భయమహోచ్చయా || 19
యావద్భయాత్సమాగత్య తావత్స పురరక్షకైః | పలాయమానో నిహతః క్షణా దంధత్వ మాగతః || 20
ఆతడు ఆ వివిధ ఆహారపదార్థములను చూడబోగా దీపకాంతి తగినంత లేకుండెను. ఆతడు తన ఉత్తరీయము నుండి వస్త్ర శకలమును చింపి వత్తిని చేసి దీపమును ప్రకాశింపజేసెను (16).
ఆపుడా యజ్ఞదత్తుని పుత్రుడు వివిధములైన వంటకములుగల శివనైవేద్యమును ప్రీతితో ఆదరముతో స్వీకరించెను (17).
ఆతడు ఆహారమును తీసుకొని త్వరితముగా బయటకు వెళ్లుచుండగా కాలు తగిలి నిద్రపోవుచున్న వ్యక్తి యొకడు తెలివిని పొందెను (18).
ఎవరు వారు? ఎవరు వారు? వానిని తొందరగా పట్టుకొనుడు, పట్టుకొనుడు అని ఆతడు భయముతో పెద్ద స్వరముతో అరచెను (19).
గుణనిధి భయపడి పరుగెత్తుచుండగా రక్షక భటులు కొట్టిరి. అతడు పడిపోయెను. మరియు చూపును కోల్పోయెను (20).
అభక్షయచ్చ నైవేద్యం యజ్ఞదత్తాత్మజో మునే | శివానుగ్రహతో నూనం భావిపుణ్యబలాచ్చ సః || 21
అథ బద్ధ స్సమాగత్య పాశముద్గరపాణి భిః | నినీషు భి స్సంయమనీం యామ్యైస్స వికటెర్భటైః || 22
తావత్పారిషదాః ప్రాప్తాః కింకిణీ జలమాలినః | దివ్యం విమాన మాదాయ తం నేతుం శూల పాణయః || 23
ఓమహర్షీ! ఆ యజ్ఞదత్త కుమారుడు శివుని అనుగ్రహము వలన, మరియు లభించబోవు పుణ్యము యొక్క ప్రభావము వలన నైవేద్యమును భక్షించి మరణించెను (21).
అపుడు భయంకరాకారులు, పాశము ముద్గరము అను ఆయుధములను ధరించిన వారునగు యమభటులు అచటకు వచ్చి ఆతనిని బంధించి యమపురికి తీసుకొని పొవనుద్యమించిరి (22).
ఇంతలో చిరుగంటల మాలలను ధరించిన, చేతియందు శూలనముగల శివగణములు ఆతనిని తీసుకొని వెళ్లుటకై దివ్యవిమానమును తీసుకొనివచ్చిరి (23).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11.Aug.2020
------------------------------------ x ------------------------------------
🌹 . శ్రీ శివ మహా పురాణము - 196 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 3 🌻
శివగణా ఊచుః |
ముంచతైనం ద్విజం యామ్యా గణాః పరమధార్మకమ్ | దండ యోగ్యో న విప్రోsసౌ దగ్ద సర్వాఘ సంచయః || 24
ఇత్యాకర్ణ్య వచస్తే హి యమరాజగణాస్తతః | మహాదేవగణానాహుర్బ భూవశ్చకితా భృశమ్ || 25
శంభోర్గణానథాలోక్య భీతైసై#్తర్యమకింకరైః | అవాది ప్రణతైరిత్థం దుర్వృత్తోsయం గణా ద్విజః || 26
శివగణముల వారిట్లనిరి |
యమగణములారా! గొప్ప ధార్మికుడగు ఈద్విజుని విడువుడు. ఈ విప్రుడు శిక్షకు అర్హుడు కాడు. ఈతని పాపములన్నియూ నశించినవి (24).
ఈ మాటను విన్న యమగణముల వారు ఆశ్చర్యమగ్నులై మహాదేవగణముల వారతో ఇట్లు మాటలాడిరి (25).
శంభుగణములను చూచి భయపడిన యమగణముల వారు నమస్కరించి "ఓ గణములారా! ఈ ద్విజుడు దుర్మార్గుడు"అని పలికిరి (26)
యమగణా ఊచుః |
కులాచారం ప్రతీర్యైష పిత్రోర్వాక్యపరాఙ్ముఖః సత్యశౌచపరిభ్రష్టస్సంధ్యాస్నాన వివర్జితః || 27
అస్తాం దూరేస్య కర్మాన్యచ్ఛివనిర్మాల్యలంఘకః | ప్రత్యక్షతోsత్ర వీక్షధ్వ మస్పృశ్యోsయం భవాదృశామ్ || 28
శివనిర్మాల్య భోక్తారశ్శివ నిర్మాల్య లంఘకాః | శివనిర్మాల్య దాతార స్స్పర్శస్తేషాం హ్యపుణ్యకృత్ || 29
విషమాలోక్య వా పేయం శ్రేయో వా స్పర్శనం పరమ్ | సేవితవ్యం శివస్వం న ప్రాణౖః కంఠగతైరపి || 30
యమగణములిట్లు పలికిరి -
ఈతడు కులాచారము నుల్లఘించి తల్లిదండ్రుల మాటను జవదాటినాడు. సత్య శౌచములను, సంధ్యా స్నానములను పరిత్యజించినాడు (27).
ఇతని ఇతర పాపకర్మల నటుంచుడు. ఈతడు శివనిర్మాల్యమును అవమానించుటను మనము ప్రత్యక్షముగా చూచియుంటిమి. మీవంటి వారు స్పృశించుటకు ఈతడు దగడు (28).
శివనిర్మాల్యమును భుజించిన వారిని, అవమానించిన వారిని, మరియు ఇచ్చిన వారిని స్పృశించినచో పాపము కలుగును (29).
విషమను స్పృశించవచ్చును; లేదా, త్రాగవచ్చును. కాని ప్రాణములు పోవునప్పుడైననూ శివధనమును సేవించరాదు (30).
యూయం ప్రమాణం ధర్మేషు యథా న చతథా వయమ్ | అస్తి చేద్ధర్మలేశోsస్య గణాస్తం శృణుమో వయమ్ || 31
ఇత్థం తద్వక్యమాకర్ణ్య యామానాం శివకింకరాః | స్మృత్వా శివపదాంభోజం ప్రోచుః పారిషదాస్తు తాన్ || 32
ధర్మముల విషయములో మీరే ప్రమాణము. మేము కాదు. ఓ గణములారా! వీనియందు ధర్మలేశము ఉన్నచో, మేము వినగోరుచున్నాము (31).
శివకింకరులు యమకింకరుల ఈ మాటలను విని శివుని పాదపద్మమును స్మరించి వారితో నిట్లనిరి (32).
శివకింకరా ఊచుః |
కింకరా శ్శివధర్మా యే సూక్ష్మాస్తే తు భవాదృశైః | స్థూలలక్ష్యైః కథం లక్ష్యా లక్ష్యా యే సూక్ష్మదృష్టిభిః || 33
అనే నానేనసా కర్మ యత్కృతం శృణుతేహ తత్ | యజ్ఞదత్తాత్మజేనాథ సావధానతయా గుణా ః || 34
పతంతీ లింగశిరసి దీపచ్ఛాయా నివారితా | స్వచై లాంచలతోsనేన దత్త్వా దీపదశాం నిశి || 35
అపరోsపి పరో ధర్మో జాతస్తత్రాస్య కింకరాః | శృణ్వతశ్శివనామాని ప్రసంగాదపి గృహ్ణతామ్ || 36
శివకింకరులిట్లు పలికిరి -
ఓ కింకరులారా! శివధర్మములు సూక్ష్మమైనవి. సూక్ష్మదృష్టి గలవారు మాత్రమే దర్శించగల ఆ ధర్మములు స్థూల దృష్టి గల మీ వంటి వారికి ఎట్లు భాసించును ? (33)
అపాపియగు ఈ యజ్ఞదత్త కుమారుడు చేసిన కర్మను, ఓ గణములారా! సావధానముగా వినుడు (34).
ఈతడు నిన్న రాత్రి తన వస్త్రముతో వత్తిని చేసి దీపమును కాపాడి లింగశిరస్సుపై దీపపు నీడ పడకుండగా నివారించినాడు (35).
ఓ కింకరులారా! ప్రసంగవశాత్తు శివనామములను ఆతడు విని మరియొక గొప్ప ధర్మము నాచరించినాడు (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
13.Aug.2020
------------------------------------ x ------------------------------------
🌹 . శ్రీ శివ మహా పురాణము - 197 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 4 🌻
భక్తేన విధినా పూజా క్రియమాణా నిరీక్షితా | ఉపోషితేన భూతాయా మనేనాస్థిత చేతసా || 37
శివలోకమయం హ్యద్య గంతాస్మాభి స్సహైవ తు | కంచిత్కాలం మహాభోగాన్ కరిష్యతి శివానుగః || 38
కలింగరాజో భవితా తతో నిర్ధూతకల్మషః | ఏషద్విజవరో నూనం శివప్రియతరో యతః || 39
అన్యత్కించిన్న వక్తవ్యం యూయం యాత యథాగతమ్ | యమదూతాస్స్వలోకం తు సుప్రసన్నేన చేతసా || 40
భక్తుడు ఉపవాసముండి మనస్సును లగ్నము చేసి యథా విధిగా చేసిన పూజను ఈతడు చూచినాడు (37).
ఈతడిప్పుడు మాతో శివలోకమునకు వచ్చి, శివుని అనుచరుడై, కొంత కాలము మహాభోగముల ననుభవించగలడు.(38).
తరువాత, సర్వ దోషములు తొలగిన ఈ ద్విజశ్రేష్ఠుడు శివునకు మిక్కిలి ప్రీతి పాత్రుడగుటచే కళింగరాజు కాగలడు (39).
మీతో చెప్పదగినది మరి ఏదియూ లేదు. యమదూతలారా! మీరు ప్రసన్నచిత్తులై వచ్చిన దారిని మీలోకమునకు పొండు (40).
బ్రహ్మో వాచ |
ఇత్యాకర్ణ్య వచస్తేషాం యమదూతా మునీశ్వర |యథాగతం యయుస్సర్వే యమలోకం పరాఙ్ముఖాః || 41
సర్వం నివేదయామాసుశ్శమనాయ గణా మునే | తద్వృత్తమాదితః ప్రోక్తం శంభూదూతైశ్చ ధర్మతః || 42
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మునిశ్రేష్ఠా! యమదూతలు వారి ఈ మాటలను విని వెనుదిరిగి యమలోకమునకు వచ్చిన దారిని అందరు వెళ్లిరి (41).
ఓ మహర్షీ! శంభుని దూతలు ధర్మము ప్రకారము చేసిన ఈ కార్యమునంతనూ యమునకు ఆ దూతలు ఆదినుండి అంతమువరకు విన్నవించిరి (42).
ధర్మరాజ ఉవాచ |
సర్వే శృణుత మద్వాక్యం సావధానతయా గణాః | తదేవ ప్రీత్యా కురుత మచ్ఛాసన పురస్సరమ్ || 43
యే త్రిపుండ్ర ధరా లోకే విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 44
ఉద్ధూలనకరా యే హి విభూత్యా సితయా గణాః | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 45
యే రుద్రాక్షధరా లోకే జటా ధారిణ ఏవ యే | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 46
శివ వేషతయా లోకే యేన కేనాపి హేతునా | తే సర్వే పరిహర్తవ్యా నానే తవ్యాః కదాచన || 47
ధర్మరాజు ఇట్లు పలికెను -
ఓ గణములారా! మీరందరు సావధానముగా నా మాటలను విని, నా ఈ ఆజ్ఞను ప్రీతితో ఆచరించుడు (43).
లోకములో తెల్లని విభూతితో త్రిపుండ్రమును ధరించు వారిని (44),
తెల్లని విభూతితో శరీరమునంతయూ భస్మమయముగా చేసుకొను వారిని (45),
రుద్రాక్షలను ధరించువారిని, జటాధారులను (46),
కారణమేదైనా లోకములో శివవేషమును ధరించు వారిని ఇచటకు ఎన్నడునూ తీసుకొని రావలదు. వారికి దూరముగా నుండుడు (47).
ఉప జీవనహేతోశ్చ శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 48
దంభేనాపి చ్ఛ లేనాపి శివవేషధరా హి యే | తే సర్వే పరిహర్తవ్యా నానేతవ్యాః కదాచన || 49
ఏవ మాజ్ఞాపయామాస స యమో నిజకింకరాన్ | తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్ శుచిస్మితాః || 50
జీవిక కొరకై శివవేషమును ధరించువారిని (48),
తాము ధర్మాత్ములమని చేప్పుకొనుట కొరకు గాని, లేదా ఇతరులను మోసగిచుట కొరకు గాని శివవేషమును ధరించు వారినైననూ ఇచ్చటికి ఏనాడు గొనిరావలదు. వారికి దూరముగా నుండుడు (49).
ఆ యముడు తన భటులనీ తీరున ఆజ్ఞాపించెను. వారందరూ చిరునవ్వులతో అటులనే చేసెదమని నిర్ణయించుకొని ఊరకుండిరి (50).
బ్రహ్మోవాచ |
పార్షదైర్యమదూతే భ్యో మోచితస్త్వితి స ద్విజః | శివలోకం జగామాశు తైర్గణౖ శ్శుచి మానసః || 51
తత్ర భుక్త్వాఖిలాన్ భోగాన్ సంసేవ్య చ శివాశి వౌ | అరిందమస్య తనయః కలింగాధిపతేరభూత్ || 52
దమ ఇత్య భిధానోsభూ చ్ఛివసేవాపరాయణః | బాలోsపి శిశుభిస్సాకం శివభక్తిం చకార సః || 53
క్రమాద్రాజ్య మవాప్యాథ పితర్యుపరతే యువా | ప్రీత్యా ప్రవర్త యా మాస శివధర్మాంశ్చ సర్వశః || 54
నాన్యం ధర్మం స జానాతి దుర్దమో భూపతిర్దమః | శివాలయేషు సర్వేషు దీప దానాదృతే ద్విజాః || 55
బ్రహ్మ ఇట్లు పలికెను -
యమదూతల నుండి ఈ తెరంగున శివగణములచే విడిపింపబడిన ఆ బ్రాహ్మణుడు శుద్ధమగు అంతఃకరణము గల వాడై వారితో గూడి శీఘ్రముగా శివలోకమునకు వెళ్లెను. (51).
అచట అతడు సమస్త భోగముల ననుభవించి, పార్వతీ పరమేశ్వరులను చక్కగా సేవించి, కలింగరాజగు అరిందముని కుమారుడై జన్మించెను (52).
ఆతనికి దముడు అని పేరు. అతడు బాల్యము నుండియూ శివుని సేవించుట యందు శ్రద్ధ గలవాడై పిల్లలతో గూడి శివుని భజించెడివాడు (53).
కొంత కాలమునకు తండ్రి రాజ్యాధికారము నుండి నివృత్తుడయ్యెను. అపుడు యువకుడగు దముడు రాజు అయ్యెను. అతడు సర్వత్రా ప్రీతితో శివధర్మములను ప్రవర్తిల్ల జేసెను (54).
ఓ ద్విజులారా! జయింప శక్యము కాని ఆ దమ మహారాజునకు , శివాలయములన్నింటి యందు దీపములను వెలిగింపజేయుట తక్క మరియొక ధర్మము తెలియదు (55).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
------------------------------------ x ------------------------------------
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
43. అధ్యాయము - 18
🌻. గుణనిధి సద్గతిని పొందుట - 5 🌻
గ్రామాధీశాన్స మహూయ సర్వాన్స విషయస్థితాన్ |ఇత్థమాజ్ఞాపయామాస దీపా దేయాశ్శివాలయే || 56
అన్యథా సత్యమేవేదం సమే దండ్యో భవిష్యతి | దీపదానాచ్ఛి వస్తుష్టో భవతీతి శ్రుతీరితమ్ || 57
యస్య యస్యాభితో గ్రామం యావంతశ్చ శివాలయాః | తత్ర తత్ర సదా దీపో ద్యోతనీయోsవిచారితమ్ || 58
మామాజ్ఞాభంగో దోషేణ శిరశ్ఛేత్స్యా మ్య సంశయమ్ | ఇతి తద్భయతో దీప్తాః ప్రతి శివాలయమ్ || 59
అతడు తన రాజ్యమందలి గ్రామాధికారుల నందరిని పిలిచి, ఇట్లు ఆజ్ఞాపించెను. శివాలయమందు దీపములను వెలిగించవలెను (56).
అట్లు చేయని వ్యక్తిని నేను దండించెదను. ఇది సత్యము. దీపములను వెలిగించినచో, శివుడు సంతుష్టుడగునని వేదములు చెప్పుచున్నవి (57).
ప్రతి అధికారి తన అధికారక్షేత్రములోని గ్రామములలో ఉన్న శివాలయములన్నింటి యందు నిత్యము దీపమునకు ఏర్పాటు చేయవలెను. దీని విషయములో చర్చకు తావు లేదు (58).
నా ఆజ్ఞను ఉల్లంఘించిన వారికి ఉరిశిక్ష వేయబడును. సందేహము లేదు. ఈవిధముగా రాజ భయము వలన ప్రతి శివాలయమునందు దీపములు ప్రకాశించెను (59).
అనేనైవ స ధర్మేణ యావజ్జీవం దమో నృపః | ధర్మర్థిం మహతీం ప్రాప్య కాలధర్మవశం గతః || 60
స దీపవాసనాయోగా ద్బహూన్దీపాన్ర్పదీప్య వై | అలకాయాః పతిరభూద్రత్నదీపశిఖాశ్రయః || 61
ఏవం ఫలతి కాలేన శివేsల్పమపి యత్కృతమ్ | ఇతి జ్ఞాత్వా శివే కార్యం భజనం సుసుఖార్థిభిః || 62
క్వ స దీక్షితదాయాదస్సర్వ ధర్మారతిస్సదా | శివాలయే దైవయోగాద్యాతశ్చోరయితుం వసు || 63
దమ మహారాజు జీవించి యున్నంత కాలము ఇదే ధర్మము నాచరించి గొప్ప పుణ్య సమృద్ధిని పొంది మరణించెను (60).
అతడు దీపమును వెలిగించిన సంస్కారబలముచే అనేక దీపములను వెలిగించి, రత్న దీపముల కాంతులకు నిలయమైన అలకానగరమునకు ప్రభువు ఆయెను (61).
ఈ తీరున శివునకు చేసిన ఆరాధన అల్పమైనా కొంత కాలమునకు ఫలించునని యెరింగి సుఖమును గోరు మానవులు శివుని భజించవలెను (62).
సర్వదా సర్వధర్మములకు విముఖుడైన దీక్షితపుత్రుడు ఎక్కడ? ఆతడు దైవయోగము వలన సంపదనపహరించుటకు శివాలయమును జొచ్చినాడు (63).
స్వార్థదీప దశోద్యోతలింగమౌలి తమోహరః | కలింగ విషయే రాజ్యం ప్రాప్తో ధర్మరతిం సదా || 64
శివాలయే సముద్దీప్య దీపాన్ ప్రాగ్వాసనోదయాత్ | క్వైషా దిక్పాలపదవీ మునీశ్వర విలోకయ || 65
మనుష్యధర్మిణానేన సాంప్రతం యేహ భుజ్యతే | ఇతి ప్రోక్తం గుణనిధేర్యజ్ఞ దత్తాత్మజస్య హి || 66
చరితం శివ సంతోషం శృణ్వతాం సర్వకామదమ్ | సర్వ దేవశివేనాసౌ సఖిత్వం చ యథేయివాన్ || 67
తదప్యేకమనా భూత్వా శృణు తాత బ్రవీమి తే || 68
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే సృష్ట్యుపాఖ్యానే కైలాసగమనో పాఖ్యానే గుణనిధే స్సద్గతి వర్ణనం నామ అష్టాదశోSధ్యాయః (18).
ఒక ప్రయోజనము నాశించి ఈతడు దీపమును ప్రకాశింపజేయగా శివలింగ శిరస్సు పై గల చీకటి తొలగినది. దాని మహిమచే ఈతడు కలింగాధిపతియై, సర్వదా ధర్మశ్రద్ధ కలిగియుండెను (64).
పూర్వ జన్మ సంస్కారము ఉద్బుద్ధమగటచే నీతడు శివాలయములలో దీపములను పెట్టించినాడు. ఓ మునిశ్రేష్ఠా! తిలకించుము. ఈతడు ఇప్పుడు దిక్పాల పదవిని పొందినాడు (65).
ఈతడు ఇప్పుడు కుబేరుడై దుస్సాధ్యమగు దిక్పాల పదవిని అనుభవించుచున్నాడు. యజ్ఞదత్తుని కుమారుడగు గుణనిధి యొక్క వృత్తాంతము నింతవరకు చెప్పితిని (66).
ఈ చరితము శివునకు ప్రీతిని కలిగించును. వినువారల కోర్కెల నన్నిటినీ ఈడేర్చును. దేవదేవుడగు శివునితో ఈతనికి మైత్రి ఎట్లు కలిగినది ? (67).
అను వృత్తాంతమును చెప్పెదను. హే వత్సా! నీవు మనస్సును లగ్నము చేసి వినుము (68).
శ్రీ శివ మహాపురాణమునందు రెండవదియగు రుద్ర సంహితలో మొదటిదియగు సృష్టిఖండములో గుణనిధి సద్గతిని పొందుట అనే పదునెనిమిదవ అధ్యాయము ముగిసినది (18).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
15.Aug.2020
------------------------------------ x ------------------------------------
🌹 . శ్రీ శివ మహా పురాణము - 199 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
44. అధ్యాయము - 19
🌻. శివునితో కుబేరుని మైత్రి - 1 🌻
బ్రహ్మోవాచ |
పాద్మే కల్పే మమ పురా బ్రహ్మణో మానసాత్సుతాత్ | పులస్త్యాద్విశ్రవా జజ్ఞే తస్య వైశ్రవణస్సుతః || 1
తేనేయ మలకా భుక్తా పురీ విశ్వకృతా కృతా | ఆరాధ్య త్ర్యంబకం దేవషుత్యుగ్ర తపసా పురా || 2
వ్యతీతే తత్ర కల్పేవై ప్రవృత్తే మేఘ వాహనే | యాజ్ఞ దత్తి రసౌ శ్రీ దస్తపస్తేపే సుదుస్సహమ్ || 3
భక్తి ప్రభావం విజ్ఞాయ శంభోస్తద్దీపమాత్రతః | పురా పురారేస్సం ప్రాప్య కాశికాం చిత్ర్ప కాశికామ్ || 4
బ్రహ్మ ఇట్లు పలికెను -
పూర్వము పాద్మకల్పమునందు బ్రహ్మనగు నా యొక్క మానసపుత్రుడైన పులస్త్యునకు విశ్రవసుడు అను కుమారుడు కలిగెను| అతనికి వైశ్రవణుడు (కుబేరుడు) అను కుమారుడు కలిగెను (1).
పాద్మకల్పము గడిచి, మేఘ వాహన కల్పము రాగా, యజ్ఞదత్తుని కుమారుడుగా నున్న ఈ కుబేరుడు ఘోరమగు తపస్సును చేసెను (3).
దీపమును వెలిగించుట మాత్రము చేత తనకు లభించిన మహా ఫలముచే భక్తియొక్క ప్రభావమును ఎరింగి, ఆతడు పూర్వము పురారియగు శివుని చైతన్య స్వరూపమును ప్రకాశింపజేయు కాశీనగరమును చేరుకొనెను (4).
శివైకాదశముద్బోధ్య చిత్తరత్నప్రదీపకైః | అనన్య భక్తిస్నేహాఢ్య స్తన్మయో ధ్యాననిశ్చలః || 5
శివైక్యం సుమహాపాత్రం తపోsగ్ని పరిబృంహితమ్ | కామక్రోధమహావిఘ్న పతంగాఘాతవర్జితమ్ || 6
ప్రాణసంరోధనిర్వాతం నిర్మలం నిర్మలేక్షణాత్ | సంస్థాప్య శాంభవం లింగం సద్భావకుసుమార్చితమ్ || 7
తావత్తతాప స తపస్త్వగస్థిపరిశేషితమ్ | యావద్బభూవ తద్వర్ష్మ వర్షాణామయుతం శతమ్ || 8
ఆతడు చిత్తము అనే రత్న దీపముచే ఏకాదశ రుద్రులను మేల్కొలిపి, అనన్యమగు భక్తితో, ప్రేమతో నిండిన హృదయము గలవాడై. ధ్యానమునందు అచంచలుడై యుండెను (5).
ఆతడు మహాత్ములకు మాత్రమే లభ్యమగునట్టియు, తపస్సు అనే అగ్నిచే వృద్ధి పొందింపబడునట్టియు, కామక్రోధరూపములో నుండే మహావిఘ్నములను పక్షుల దెబ్బలు తగులనట్టి శివైక్యమును భావనచే పొందెను (6).
ఆతడు ప్రాణాయామములో వాయువును స్తంభింపజేయుటచే వాయు సంచారము లేనట్టియు, దోషరహితమగు అంతర్ముఖత్వముచే కాలుష్యములు లేనట్టి మనో దేశమునందు శంభులింగమును స్ధాపించి పవిత్రమగు చిత్త వృత్తులనే పుష్పములచే నారాధించెను (7).
ఆతడు శరీరములో చర్మము, ఎముకలు మాత్రమే మిగులునంత వరకు పదివేల వంద సంవత్సరముల కాలము తపస్సు చేసెను (8).
తతస్సహ విశాలక్ష్యా దేవో విశ్వేశ్వరస్స్వయమ్ | అలకాపతి మాలోక్య ప్రసన్నేనాంతరాత్మనా || 9
లింగే మనస్స మాధాయ స్థితం స్థాణుస్వరూపిణమ్ | ఉవాచ వరదోSస్మీతి తదాచక్ష్వాలకాపతే || 10
ఉన్మీల్య నయనే యావత్స పశ్యతి తపోధనః | తావదుద్యత్స హస్రాంశు సహస్రాధికతేజసమ్ || 11
పురో దదర్శ శ్రీ కంఠం చంద్రచూడము మాధవమ్ | తత్తేజః పరిభూతాక్షితేజాః సంమీల్య లోచనే || 12
ఉవాచ దేవదేవేశం మనోరథపదాతిగమ్ | నిజాం ఘ్రిదర్శనే నాత దృక్సామర్థ్యం ప్రయచ్ఛమే || 13
అపుడు విశ్వేశ్వర దేవుడు నిడివికన్నుల అర్ధాంగితో కూడి ప్రసన్నమగు మనస్సుతో స్వయముగా ప్రత్యక్షమై అలకాపతియగు కుబేరుని చూచెను (9).
ఆతడు మనస్సును లింగమునందు లగ్నము చేసి స్థాణువు వలె నిశ్చలుడై యుండెను. అపుడు ఆయన 'హే అలకాపతే! వరము నిచ్చెదను కోరుకొనుము' అని పలికెను (10).
తపస్సే ధనముగా గల ఆ కుబేరుడు కన్నులను తెరచి, ఉదయించే కోటి సూర్యుల కన్న అధికమగు తేజస్సు కలిగినట్టియు (11),
విషమును కంఠమునందు ధరించినట్టియు, చంద్రుని శిరస్సుపై అలంకరించుకొనియున్న పార్వతీ పతిని ఎదురుగా చూచెను. ఆ తేజస్సును కన్నులతో చూడజాలక, ఆతడు వెంటనే కన్నులను మూసుకొనెను (12).
మనోగోచరము కాని ఆ దేవదేవునితో ఆతడిట్లనెను. నాథా! నీ పాదములను చూడగలిగే శక్తిని నా కన్నులకు ఇమ్ము (13).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 200 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
44. అధ్యాయము - 19
🌻. శివునితో కుబేరుని మైత్రి - 2 🌻
ఆయమేవ వరో నాథ యత్త్వం సాక్షాన్నిరీక్ష్యసే | కిమన్యేన వరేణశ నమస్తే శశిశేఖర || 14
ఇతి తద్వచనం శ్రుత్వా దేవదేవ ఉమాపతిః | దదౌ దర్శన సామర్ధ్యం సృష్ట్వా పాణితలేన తమ్ || 15
ప్రసార్య నయనే పూర్వముమామేవ వ్యలోకయత్ | తతోSసౌ యాజ్ఞదత్తిస్తు తత్సామర్థ్య మవాప్య చ || 16
నాథా! నిన్ను ప్రత్యక్షముగా చూడగలుగుటయే నేను కోరే వరము. ఈశా! ఇతర వరములతో పనియేమి? ఓ చంద్రశేఖరా! నీకు నమస్కారమగు గాక! (14).
దేవదేవుడగు పార్వతీపతి ఈ మాటను విని, ఆతనిని అరచేతితో స్పృశించి, చూడగలిగే శక్తిని ఇచ్చెను (15).
యజ్ఞదత్త కుమారుడగు ఆ కుబేరుడు చూడగలిగే శక్తిని పొంది, కన్నులను తెరచి, ముందుగా పార్వతీ దేవిని చూచెను (16).
శంభోస్సమీపే కా యోషిదేషా సర్వాంగ సుందరీ | ఆనయా కిం తపస్తప్తం మమాపి తపసోsధికమ్ || 17
అహో రూపమహో ప్రేమ సౌభాగ్యం శ్రీ రహో భృశమ్ | ఇత్యావాదీదసౌ పుత్రో ముహుర్మహురతీవ హి || 18
క్రూరదృగ్వీక్షతే యావత్పునః పునరిదం వదన్ | తావత్పుస్ఫోట తన్నేత్రం వామం వామావిలోకనాత్ || 19
అథ దేవ్య బ్రవీద్దేవ కిమసౌ దుష్టతాపనః | అసకృద్వీక్ష్య మాం వక్తి కురు త్వం మే తపః ప్రభామ్ || 20
అసకృద్వీక్షణనాక్‌ష్ణా పునర్మామేవ పశ్యతి | అసూయ మానో మే రూపప్రేమ సౌభాగ్య సంపదా || 21
శంభుని సమీపములో సర్వాంగ సుందరియగు ఈ యువతి ఎవరు? ఈమె ఎట్టి తపస్సును చేసినదో? నా కంటె అధికమైన తపస్సును చేసినది (17).
అహో!ఏమి రూపము! అహో! ఏమి ప్రేమ! ఏమి సౌభాగ్యము! ఏమి శోభ! ఇట్లు కుబేరుడు మరల మరల పలుకుచు అతిగా ప్రవర్తించెను (18).
ఇట్లు పలుకుచూ క్రూరమగు చూపులతో ఆమెను చూచుటచే, అతని ఎడమ నేత్రము పగిలిపోయెను (19).
అపుడా దేవి దేవునితో నిట్లనెను. ఏమి ఇది? ఈ దుష్టతాపసుడు అదే పనిగా నన్ను చూచి మాటలాడుచున్నాడు. నాతపశ్శక్తిని వీనికి తెలుపుడు జేయుము (20).
మరల మరల నన్నే చూచుచున్నాడు. నా రూపమును, ప్రేమను, సౌభాగ్యమును, సంపదను చూచి అసూయపడుచున్నాడు (21).
ఇతి దేవీగిరం శ్రుత్వా ప్రహస్య ప్రాహ తాం ప్రభుః | ఉమే త్వదీయః పుత్రోసౌ న చ క్రూరేణ చక్షుషా|| 22
సంపశ్యతి తపోలక్ష్మీం తవ కిం త్వధి వర్ణయేత్ | ఇతి దేవీం సమాభాష్య తమీశః పునరబ్రవీత్ || 23
వరాన్ దదామి తే వత్స తపాసానేన తోషితః | నిధీనామథ నాథస్త్వం గుహ్యకానాం భవేశ్వరః || 24
యక్షాణాం కిన్నరాణాం చ రాజ్ఞాం రాజా చ సువ్రతః | పతిః పుణ్యజనానాం చ సర్వేషాం ధనదో భవ || 25
దేవి యొక్క ఈ మాటలను విని శివప్రభువు చిరునవ్వుతో ఆమెతో నిట్లనెను. ఉమా! ఈతడు నీ కుమారుడు. ఈతడు నిన్ను క్రూరదృష్టితో చూచుటలేదు (22).
పైగా నీతపస్సంపదను వర్ణించుచున్నాడు. ఇట్లు దేవితో పలికి ఈశుడు మరల కుబేరునితో నిట్లనెను (23).
వత్సా! నీ తపస్సును నేను మెచ్చితిని. నీకు వరములనిచ్చెదను. నీవు నిధులకు నాథుడవు అగుము. గుహ్యకులకు ప్రభువ అగుదువు (24).
యక్షులకు, కిన్నరులకు, రాజలకు రాజువై వ్రతములననుష్ఠించుము. పుణ్యాత్ములకు ప్రభువు అగుదవు. అందరికీ నీవే ధనమును ఇచ్చెదవు (25).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 201 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
44. అధ్యాయము - 19
🌻. శివునితో కుబేరుని మైత్రి - 3 🌻
మయా సఖ్యం చ తే నిత్యం వత్స్యామి చ తవాంతికే | అలకాం నిక షా మిత్ర తవ ప్రీతి వివృద్ధయే || 26
ఆగచ్ఛ పాదయోరస్యాః పత తే జననీ త్వియమ్ | యజ్ఞదత్త మహాభక్త సుప్రసన్నేన చేతసా || 27
నీకు నాతో నిత్యమైత్రి కలిగినది. నేను నీకు దగ్గరగా అలకానగర సమీపములో నివసించెదను. హే మిత్రమా! నేను నీకు అధికమగు ప్రీతిని కలిగించెదను (26).
యజ్ఞదత్త కుమారా! నీవు మహాభక్తుడవు. రమ్ము. ఈమె నీ తల్లి. ప్రసన్నమగు మనస్సుతో ఈమె పాదములపై పడుము (27).
బ్రహ్మో వాచ |
ఇతి దత్త్వా వరాన్దేవః పునరాహ శివాం శివః | ప్రసాదం కురు దేవేశి తపస్విన్యంగజేsత్రవై || 28
ఇత్యా కర్ణ్య వచశ్శంభోః పార్వతీ జగదంబికా | అబ్రవీద్యాజ్ఞదత్తిం తం సుప్రసన్నేన చేతసా || 29
బ్రహ్మ ఇట్లు పలికెను -
శివ దేవుడు ఈ విధముగా వరములనిచ్చి, మరల దేవితో నిట్లనెను; ఓ దేవదేవీ! తపశ్శాలియగు ఈ నీ పుత్రుని పై దయను చూపుము (28).
శంభుని ఈ మాటలను విని, జగదంబ యగు పార్వతి ప్రసన్నమగు మనస్సు గలదై యజ్ఞదత్త కుమారునితో నిట్లనెను (29).
దేవ్యువాచ |
వత్స తే నిర్మలా భక్తిర్భవే భవతు సర్వదా | భవైక పింగో నేత్రేణ వామేన స్ఫుటితేన హ || 30
దేవేన దత్తా యే తుభ్యం వరాస్సంతు తథైవ తే | కుబేరో భవ నామ్నా త్వం మమ రూపేర్ష్యయా సుత || 31
ఇతి దత్త్వా వరాన్దేవో దేవ్యా సహ మహేశ్వరః | ధనదాయ వివేశాథ ధామ వైశ్వేశ్వరాభిధమ్ || 32
ఇత్థం సఖిత్వం శ్రీ శంభోః ప్రాపైష ధనదః పురమ్ | అలకాన్నికషా చాసీత్కైలాసశ్శంకరాలయః || 33
ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాస గమనోపాఖ్యానే కుబేరస్య శివమిత్రత్వ వర్ణనం నామ ఏకోనవింశః అధ్యాయః (19).
దేవి ఇట్లు పలికెను -
వత్సా! నీకు సర్వకాలములయందు శివునిపై నిర్మలమగు భక్తి కలుగుగాక! నీ ఎడమ కన్ను పగిలినది గదా! కాన ఎర్రని ఒకే నేత్రము గల వాడవు కమ్ము (30).
నీకు శివుడు ఇచ్చిన వరములు ఫలించుగాక! ఓ కుమారా! నీవు నా రూపమునందు ఈర్ష్యను పొందితివి గాన, కుబేరుడు అను పేర ప్రసిద్ధుడవగుదువు (31).
మహేశ్వరుడు ఈ విధముగా దేవితో గూడి కుబేరునకు వరములనిచ్చి, విశ్వేశ్వరధామమును ప్రవేశించెను (32).
కుబేరుడు ఈ తీరున శ్రీ శంభుని మైత్రిని, అలకానగరమును పొందెను. శంకరుని నివాసమగు కైలాసము అలకా నగరమునకు సమీపనములో వెలసెను (33).
శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్ర సంహితయందు మొదటి ఖండములో కుబేరునకు శివునితో మైత్రి కలుగుట అనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసినది (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
45. అధ్యాయము - 20
🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 1 🌻
బ్రహ్మోవాచ |
నారద త్వం శృణు మునే శివాగమన సత్తమమ్ | కైలాసే పర్వత శ్రేష్ఠే కుబేరస్య తపోబలాత్ || 1
నిధిపత్వ వరం దత్త్వా గత్వా స్వస్థానముత్తమమ్ | విచింత్య హృది విశ్వేశః కుబేర వరదాయకః || 2
విధ్యంగజ స్వరూపో మే పూర్ణః ప్రలయ కార్యకృత్ | తద్రూపేణ గమిష్యామి కైలాసం గుహ్యకాలయమ్ || 3
రుద్రో హృదయ జో మే హి పూర్ణాంశో బ్రహ్మనిష్కలః | హరి బ్రహ్మాదిభిస్సేవ్యో మదభిన్నో నిరంజనః || 4
తత్స్వ రూపేణ తత్రైవ సుహృద్భూత్వా విలాస్యహమ్ | కుబేరస్య చ వత్స్యామి కరిష్యామి తపో మహత్ || 5
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ నారదమునీ! కుబేరుని తపః ప్రభావము వలన శివుడు పర్వతరాజమగు కైలాసమునకు వచ్చుట అనే పుణ్య వృత్తాంతమును వినుము (1).
విశ్వేశ్వరుడు కుబేరునకు వరములనిచ్చి, శ్రేష్ఠమగు తన ధామను పొంది, హృదయములో నిట్లు ఆలోచించెను (2).
బ్రహ్మ శరీరము నుండి ఆవిర్భవించిన ప్రళయ కర్తయగు రుద్రుడు నా పూర్ణావతారము. నేను ఆ రూపములో గుహ్యకులుండే కైలాసమునకు వెళ్లెదను (3).
నా హృదయము నుండి పుట్టిన రుద్రుడు పూర్ణాంశము గలవాడు, నిర్గుణ పరబ్రహ్మ, హరి బ్రహ్మాదులచే సేవింపబడువాడు, నా కంటె వేరు కానివాడు, దోషరహితుడు (4).
నేను ఆ రూపముతో అచట కుబేరుని మిత్రుడనై విహరించెదను. మరియు గొప్ప తపస్సు చేసెదను (5).
ఇతి సంచింత్య రుద్రోsసౌ శివేచ్ఛాం గంతుముత్సుకః | ననాద తత్ర ఢక్కాం స్వాం సుగతిం నాదరూపిణీమ్ || 6
త్రైలోక్యా మానశే తస్యా ధ్వనిరుత్సాహ కారకః | ఆహ్వానగతి సంయుక్తో విచిత్రస్సాంద్రశబ్దకః || 7
తచ్ఛ్రుత్వా విష్ణుబ్రహ్మాద్యా స్సురాశ్చ మునయస్తథా | ఆగమా నిగమా మూర్తా స్సిద్ధా జగ్ముశ్చ తత్ర వై || 8
సురాసురాద్యాస్స కలాస్తత్ర జగ్ముశ్చ సోత్సవాః | సర్వేsపి ప్రమథా జగ్ముర్యత్ర కుత్రాపి సంస్థితాః || 9
ఇట్లు తలపోసినంతనే, రుద్రుడు శివుని ఇచ్ఛను పూర్తిచేయుటలో ఉత్సాహము గలవాడై, పుణ్యగతిని ఇచ్చే నాదస్వరూపిణియగు తన ఢక్కను నినదించెను (6).
ఉత్సాహమును కలిగించునది, గమనమునకు ఆహ్వానించునది,విచిత్రమైనది, గంభీరశబ్దము గలది అగు ఆ ఢక్క యొక్క ధ్వని ముల్లోకములలో వ్యాపించెను (7).
ఆ ధ్వనిని విని, విష్ణు బ్రహ్మాది దేవతలు, మునులు, ఆగమములు, వేదములు మూర్తి దాల్చి, సిద్ధులు అచటకు వెళ్లిరి (8).
అందరు దేవతలు, రాక్షసులు ఉత్సాహముతో నచటకు వెళ్లిరి. ప్రమథులు (రుద్ర గణములు) ఎక్కడ ఉన్ననూ అచటకు బయలు దేరిరి (9).
గణపాశ్చ మహా భాగాస్సర్వలోక నమస్కృతాః | తేషాం సంఖ్యా మహం వచ్మి సావధానతయా శృణు || 10
అభ్యయాచ్ఛంఖ కర్ణశ్చ గణకోట్యా గణశ్వరః | దశభిః కేకరాక్షశ్చ వికృతోsష్టాభిరేవ చ || 11
చతుష్టఎ్టా్య విశాఖశ్చ నవభిః పారియాత్రకః | షడ్భి స్సర్వాంతక శ్ర్శీమాన్ దుందుభోష్టాభిరేవ చ || 12
జాలంకో హి ద్వాదశభిః కోటి భిర్గణ పుంగవః | సప్త భి స్సమద శ్ర్శీమాంస్త థైవ వికృతాననః || 13
పంచభిశ్చ కపాలీ హి షడ్భి స్సందారకశ్శుభః | కోటి కోటి భిరేవేహ కండుకః కుండకస్తథా || 14
మహాత్ములు, సర్వ జీవులచే నమస్కరింపబడువారు నగు గణపతులు కూడ బయలు దేరిరి. వారి సంఖ్యను నేను చెప్పెదను. సావధానముగా వినుము (10).
శంఖకర్ణుడగు గణనాథుడు కోటి గణములతో బయలుదేరెను. కేకరాక్షుడు పది, వికృతుడు ఎనిమిది (11),
విశాఖుడు అరవై నాలుగు, పారియాత్రకుడు తొమ్మిది, సర్వాంతకుడు ఆరు, శ్రీమాన్ దుందుభుడు ఎనిమిది (12),
గణశ్రేష్ఠుడగు జాలంకుడు పన్నెండు, శ్రీమాన్ సమదుడు ఏడు, వికృతాననుడు కూడ ఏడు (13),
కపాలి అయిదు, శుభకరుడగు సందారకుడు ఆరు, కండుకుడు, కండకుడు ఒక్కొక్కటి కోట్ల గణములతో కూడి వెళ్ళిరి (14).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 . శ్రీ శివ మహా పురాణము - 203 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
45. అధ్యాయము - 20
🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 2 🌻
విష్టంభోsష్టాభిరగమదఎ్టాభిశ్చంద్రతాపనః |మహాకేశస్సహస్రేణ కోటీనాం గణపో వృతః || 15
కుండీ ద్వాదశభి ర్వాహస్తథా పర్వతకశ్శుభః | కాలశ్చ కాలకశ్చైవ మహాకాలశ్శతేన వై || 16
అగ్ని కశ్శతకోట్యావై కోట్యా భిముఖ ఏవ చ | ఆదిత్య మూర్ధా కోట్యా చ తథ చైవ ధనావహః || 17
సన్నాహశ్చ శతేనైవ కుముదః కోటిభిస్తథా | అమోఘః కోకిలశ్చైవ కోటి కోట్యా సుమంత్రకః || 18
కాకపాదోsపరష్షష్ట్యా షఎ్టా్య సంతానకః ప్రభుః | మహాబలశ్చ నవభిర్మధుబపింగశ్చ పింగలః || 19
విష్టంభుడు ఎనిమిది, చంద్ర తాపనుడు ఎనిమిది, మహాకేశుడనే గణపతి వేయి (15),
కుండి, వాహుడు, శుభకరుడగు పర్వతకుడు, కాలుడు, కాలకుడు అనువారు ఒక్కొక్కరు పన్నెండు, మహాకాలుడు వంద (16),
అగ్నికుడు వంద, అభిముఖుడు, ఆదిత్యమూర్దుడు, ధనావహుడు ఒక్కొక్కటి (17),
సన్నాహుడు వంద, కుముదుడు వంద, అమోఘుడు, కోకిలుడు, సుమంత్రకుడు ఒక్కొక్కటి (18),
కాకపాదుడను వాడు అరవై, సంతానకుడను గణపతి అరవై, మహాబలుడు, మధుపింగుడు, పింగలుడు ఒక్కొక్కరు తొమ్మిది కోట్ల గణములతో వచ్చిరి (19).
నీలో నవత్యా దేవేశం పూర్ణ భద్రస్తథైవ చ | కోటీనాం చైవ సప్తానాం చతుర్వక్త్రో మహాబలః || 20
కోటికోటి సహస్రాణాం శతైర్వింశతిభిర్వృతః | తత్రాజగామ సర్వేశః కైలాసగమనాయ వై || 21
కాష్ఠాగూఢశ్చ తుష్షఎ్టా్య సుకేశో వృషభస్తథా | కోటి భిస్సస్తభిశ్చైత్రో నకులీశస్స్వయం ప్రభుః || 22
లోకాంతకశ్చ దీప్తాత్మా తథా దైత్యాంతకః ప్రభుః | దేవో భృంగీ రిటిశ్ర్శీమాన్ దేవదేవప్రియస్తథా || 23
అశనిర్భానుకశ్చైవ చతుష్షఎ్టా్య సనాతనః | నందీశ్వరో గణాధీశశ్శత కోట్యా మహాబలః || 24
నీలుడు తొంభై, పూర్ణ భద్రుడుకూడ తొంభై, మహాబలశాలియగు చతుర్వక్త్రుడు ఏడు కోట్ల గణములతో శివుని వద్దకు వచ్చిరి (20).
సర్వేశ్వరుడగు శివుడు కైలాసమునకు వెళ్లుటకై ఇరువది వందల కోటి కోట్ల గణములతో కూడి బయలుదేరెను (21).
కాష్ఠాగూఢుడు, సుకేశుడు, వృషభుడు ఒక్కొక్కరు అరవై నాలగు, చైత్రుడు, నకులీశుడు (22),
లోకాంతకుడు, దీప్తాత్మ, దైత్యాంతకుడు, భృంగి దేవుడు, శివునకు అతి ప్రియుడగు శ్రీమాన్ రిటి (23),
అశని, భానుకుడు ఒక్కొక్కరు ఏడు, సనాతనుడు అరవై నాలుగు, మహాబలుడగు నందీశ్వరుడనే గణపతి వంద కోట్ల గణములతో విచ్చేసిరి (24).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
------------------------------------ x ------------------------------------
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
45. అధ్యాయము - 20
🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 3 🌻
సర్వే చంద్రావతంసాశ్చ నీలకంఠాస్త్రిలోచనాః | హారకుండలకేయూర ముకుటాద్వై రలంకృతాః || 26
బ్రహ్మేంద్ర విష్ణు సంకాశా అణి మాది గణౖర్వృతాః | సూర్యకోటి ప్రతీకాశాస్తత్రా జగ్ముర్గణశ్వరాః || 27
ఏతే గణాధిపాశ్చాన్యే మహాత్మానోsమలప్రభాః | జగ్ముస్తత్ర మహాప్రీత్యా శివదర్శనలాలసాః || 28
వీరేగాక మహాబలశాలురగు గణాధీశులు ఎందరో లెక్కలేనంత మంది వచ్చిరి. వారందరు అనేక హస్తములను కలిగియుండిరి. వారు జటలను కిరీటములను ధరించి యుండిరి (25).
వీరందరు చంద్రుని శిరస్సుపై ధరించిరి. నల్లని కంఠమును, మూడు కన్నులను కలిగియుండిరి. వారు హారములు, కుండలములు, కేయూరములు, కిరీటములు మొదలగు వాటితో అలంకరించుకొనిరి (26).
వారు బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువులతో సమమగు సామర్థ్యమును కలిగియుండిరి. వారిని అణిమాది సిద్ధులు సేవించుచుండెను. కోటి సూర్యుల కాంతితో ఒప్పు గణపతులు అచటకు వచ్చియుండిరి (27).
మహాత్ములు, దివ్యకాంతితో ఒప్పువారు, శివుని దర్శించుట యందు అభిరుచి గల వారునగు ఎందరో గణాధిపులు అచటకు వచ్చిరి (28).
గత్వా తత్ర శివం దృష్ట్వా నత్వా చక్రుః పరాం నతిమ్ | సర్వే సాంజలయో విష్ణుప్రముఖా నతమస్తకాః || 29
ఇతి విష్ణ్వాదిభిస్సార్దం మహేశః పరమేశ్వరః | కైలాసమగమత్ర్పీత్యా కుబేరస్య మహాత్మనః || 30
కుబేరోsప్యాగతం శంభుం పూజయామాస సాదరమ్ | భక్త్యా నా నోపహారైశ్చ పరివారసమన్వితః || 31
తతో విష్ణ్వాదికాన్ దేవాన్ గణాంశ్చాన్యానపి ధ్రువమ్ | శివానుగాన్స మానర్చ శివతోషణ హేతవే || 32
విష్ణువు మొదలగు వారందరు శివుని వద్దకు వెళ్లి, ఆయనను చూచి, దోసిలియొగ్గి శిరసా నమస్కరించి గొప్ప స్తోత్రములను చెసిరి (29).
పరమేశ్వరుడగు మహేశుడు విష్ణువు మొదలగు వారితో గూడి, మహాత్ముడగు కుబేరునియందలి ప్రీతితో, కైలాసమునకు వెళ్లెను (30).
కుబేరుడు పరివారముతో గూడి, వేంచేసిన శివుని ఆదరముతో, భక్తితో గూడిన వాడై అనేకములగు ఉపహారములనర్పించి పూజించెను (31).
తరువాత ఆయన శివుని ఆనందింపజేయుట కొరకై విష్ణువు మొదలగు దేవతలను, శివుని అనుచరులగు గణములను ఆదరముతో పూజించెను (32).
అథ శంభుస్సమాలింగ్య కుబేరం ప్రీతమానసః | మూర్ధ్ని చాఘ్రాయ సంతస్థావలకాం నికషాఖిలైః || 33
శాశస విశ్వకర్మాణం నిర్మాణార్థం గిరౌ ప్రభుః | నానాభ##క్తైర్ని వాసాయ స్వపరేషాం యథోచితమ్ || 34
విశ్వకర్మాతతో గత్వా తత్ర నానావిధాం మునే | రచయామాస ద్రుతం శంభోరనుజ్ఞయా || 35
అథ శంభుః ప్రముదితో హరిప్రార్థనయా తదా | కుబేరాను గ్రహం కృత్వా య¸° కైలాసపర్వతమ్ || 36
అపుడు శంభుడు ఆనందించిన మనస్సు గలవాడై, కుబేరుని ఆలింగనము చేసుకొని, లలాటముపై ముద్దిడి, అందరితో గూడి అలకానగర సమీపములో నుండెను (33).
ప్రభువగు శివుడు తనకు, తన భక్తులందరికీ నివసించుట కొరకై తగిన నివాసములను పర్వతమునందు నిర్మించుమని విశ్వకర్మను ఆజ్ఞాపించెను (34).
ఓ మహర్షీ! విశ్వకర్మ శంభుని యాజ్ఞచే కైలాసమునకు వెళ్లి, అచట నానావిధములగు ప్రాసాదములను శీఘ్రముగా నిర్మించెను (35).
అపుడు మిక్కిలి యానందించిన శివుడు విష్ణువు యొక్క ప్రార్థననాలకించి, కుబేరుని అనుగ్రహించి, కైలాస పర్వతమునకు వెళ్లెను (36).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
24.Aug.2020
🌹 . శ్రీ శివ మహా పురాణము - 207 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴
45. అధ్యాయము - 20
🌻. శివుడు కైలాసమునకు వెళ్లుట - 6 🌻
క్వచిత్కైలాస కుధరసుస్థానేషు మహేశ్వరః | విజహార గణౖః ప్రీత్యా వివిధేషు విహారవిత్|| 55
ఇత్థం రుద్రస్వరూపోsసౌ శంకరః పరమేశ్వరః | అకార్షీత్స్వగిరౌ లీలా నానా యోగివరోsపి యః || 56
నీత్వా కాలం కియంతం సోsపత్నీకః పరమేశ్వరః | పశ్చాదవాప స్వపత్నీం దక్షపత్నీ సముద్భవామ్ || 57
విజహార తయా సత్యా దక్షపుత్ర్యా మహేశ్వరః | సుఖీ బభూవ దేవర్షే లోకాచార పరాయణః || 58
విహారమునెరింగిన మహేశ్వరుడు ఒకప్పుడు కైలాస పర్వతప్రదేశముల యందు గణములతో కూడి ప్రీతితో విహరించెడివాడు (55).
శంకర పరమేశ్వరుడు యోగి శ్రేష్ఠుడే అయినా, ఈ తీరున రుద్ర రూపుడై తన పర్వతమునందు అనేక లీలలను చేసెను (56).
ఆ పరమేశ్వరుడు భార్య లేకుండగా కొంతకాలమును గడిపి, తరునాత దక్షుని కుమార్తెను వివాహమాడెను (57).
ఓ దేవర్షీ! మహేశ్వరుడు దక్షపుత్రియగు ఆ సతీదేవితో గూడి లోకాచారములను అనుష్ఠించుచూ సుఖియై విహరించెను (58).
ఇత్థం రుద్రావతారస్తే వర్ణి తోsయం మునీశ్వర| కైలాస గమనం చాస్య సఖిత్వాన్నిదిపస్య హి || 59
తదంతర్గత లీలాపి వర్ణితా జ్ఞాన వర్థినీ | ఇహాముత్ర చ యా నిత్యం సర్వకామఫలప్రదా || 60
ఇమాం కథాం పఠేద్యస్తు శృణుయాద్వా సమాహితః | ఇహ భుక్తిం సమాసాద్య లభేన్ముక్తిం పరత్ర సః || 61
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ప్రథమ ఖండే కైలాసోపాఖ్యానే శివస్య కైలాసగమనం నామ వింశోsధ్యాయః (20).
ఓ మహర్షీ! నీకు ఈ తీరున రుద్రావతారమును, కుబేరుని మైత్రి కారణము వలన శివుడు కైలాసమునకు వెళ్లుటను వర్ణించితిని (59).
ఈ గాథలో అంతర్గతముగా నున్న లీలలను కూడ వర్ణించితిని. ఈ గాథ జ్ఞానమును వృద్ధి పొందించును. ఇహ పరములయందు నిత్యము కోర్కెలనన్నిటినీ ఈడేర్చును (60).
ఎవరైతే ఈ కథను శ్రద్ధతో పఠించెదరో, లేదా వినెదరో, వారు ఇహలోకములో భుక్తిని పొంది, పరలోకములో ముక్తిని పొందెదరు (61).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు మొదటి ఖండములో కైలాసోపాఖ్యానములో శివుడు కైలాసమునకు వెళ్లుట అనే ఇరువదియవ అధ్యాయము ముగిసినది (20).
శ్రీ కృష్ణార్పణమస్తు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
27 Aug 2020
🌹 . శ్రీ శివ మహా పురాణము - 208 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 1 🌻
అథ ప్రథమోధ్యాయః
శ్రీ గణేశాయ నమః | అథ సతీఖండో ద్వితీయః ప్రారభ్యతే ||
నారద ఉవాచ |
విధే సర్వం విజానాపి కృపయా శంకరస్య చ | త్వయాsద్భుతా హి కథితాః కథా మే శివయోశ్శుభాః || 1
త్వన్ముఖాంభోజ సంవృత్తాం శ్రుత్వా శివకథాం పరామ్ | అతృప్తో హి పునస్తాం వై శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో || 2
పూర్ణాంశశ్శంకరసై#్యవ యో రుద్రో వర్ణతః పురా | విధే త్వయా మహేశానః కైలాసనిలయో వశీ || 3
స యోగీ సర్వవిష్ణ్వాది సురసేవ్యస్సతాం గతిః | నిర్ద్వంద్వః క్రీడతి సదా నిర్వికారీ మహాప్రభుః || 4
శ్రీ గణేశునకు నమస్కరించి, రెండవది యగు సతీఖండము ఆరంభింపబడుచున్నది.
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! శంకరుని కృపచే నీకు సర్వము దెలియును. నీవు నాకు అద్భుతములైన, శుభకములైన పార్వతీ పరమేశ్వరుల గాథలను చెప్పియుంటివి (1).
హే ప్రభో! నీ ముఖపద్మము నుండి వెలువడే శ్రేష్ఠమగు శివకథను వినినాను. కాని నాకు ఇంకనూ తృప్తి కలుగలేదు. మరల శివకథను వినగోరుచున్నాను (2).
హే బ్రహ్మన్! శంకరుని పూర్ణాంశావతారమగు రుద్రుని తమరు ఇదివరలో వర్ణించియుంటిరి. జితేంద్రియుడు, కైలాసవాసి, మహేశ్వరుడు (3),
యోగి, విష్ణ్వాది దేవతలచే సేవింపబడువాడు, సత్పురుషులకు శరణము, సుఖదుఃఖాది ద్వంద్వములకు అతీతుడు, వికారరహితుడు, మహా ప్రభువు అగు రుద్రుడు సర్వదా క్రీడించుచున్నాడు (4).
సోsభూత్పునర్గృహస్థశ్చ వివాహ్య పరమాం స్త్రియమ్ | హరి ప్రార్థనయా ప్రీత్యా మంగలాం స్వతపస్వినీమ్ || 5
ప్రథమం దక్ష పుత్రీ సా పశ్చాత్సా పర్వతాత్మజా | కథ మేక శరీరేణ ద్వయో రప్యాత్మజా మతా || 6
కథం సతీ పార్వతీ సా పునశ్శివముపాగతా | ఏతత్సర్వం తథాన్యచ్చ బ్రహ్మన్ గదితుమర్హసి || 7
ఆయన విష్ణువు ప్రార్థననంగీకరించి, తన గురించి, తపస్సు చేసిన పతివ్రతారత్నమగు సర్వమంగళను ప్రీతితో వివాహమాడి గృహస్థుడాయెను (5).
ఆమె ముందుగా దక్షుని కుమార్తె, తరువాత హిమవంతుని కుమార్తె. ఇది ఎట్లు పొసగును? ఒకే శరీరముతో ఇద్దరికీ కుమార్తె ఎట్లు కాగలదు? (6)
సతి పార్వతియై మరల శివుని పొందిన విధమెట్టిది? హె బ్రహ్మన్! నీవీ గాథను, ఇతర గాథలను పూర్తిగా చెప్పదగుదువు (7).
సూత ఉవాచ |
ఇతి తస్య వచశ్ర్శుత్వా సురర్షే శ్శంకరాత్మనః | ప్రసన్న మానసో భూత్వా బ్రహ్మా వచనమబ్రవీత్ || 8
బ్రహ్మోవాచ |
శృణుతాత మునిశ్రేష్ఠ కథయామి కథాం శుభామ్ | యాం శ్రుత్వా సఫలం జన్మ భవిష్యతి న సంశయః || 9
పురాహం స్వసుతాం దృష్ట్వా సంధ్యాహ్వాం తనయైస్సహ |అభవం వికృతస్తాత కామబాణ ప్రపీడితః || 10
ధర్మ స్మృతస్తదా రుద్రో మహాయోగీ పరః ప్రభుః | ధిక్కృత్య మాం సుతైస్తాత స్వస్థానం గతవానయమ్ || 11
యన్మాయా మోహితశ్చాహం వేదవక్తా చ మూఢధీః | తేనాకార్షం సహాకార్యం పరమేశేన శంభునా || 12
తదీర్ష్య యాహమకార్షం బహూ పాయాన్సుతైస్సహ | కర్తుం తన్మోహనం మూఢశ్శివమాయా విమోహితః || 13
బ్రహ్మ ఇట్లు పలికెను -
వత్సా! మహర్షీ! వినుము. శుభకరమగు కథను చెప్పెదను. ఈకథను విన్నవారి జన్మ సార్థకమగుననుటలో సందేహము లేదు (9).
వత్సా! పూర్వమునేను నాకుమారులతో గూడి యుండగా, నా కుమార్తె యగు సంధ్య కనబడెను. అపుడు నేను మన్మథ బాణములచే పీడితుడనై, వికారమును పొందితిని (10).
అపుడు ధర్మునిచే స్మరింపబడి, మహాయోగి, మహాప్రభువునగు రుద్రుడు కుమారులతో కూడిన నన్ను నిందించెను. వత్సా! ఆయన అట్లు నన్ను నిందించి తన ధామకు వెళ్లెను (11).
నేను వేదములను లోకములకందజేసిన వాడనే అయినా, శివుని మాయచే మోహితుడనై, మూర్ఖుడనైతిని. అందువలన పరమేశ్వరుడగు శంభుని విషయములో దోషము నాచరించితిని (12).
శివమాయచే మోహితుడనై మూర్ఖుడనైన నేను ఆయన యందలి ఈర్ష్యచే, కుమారులతో గూడి ఆయనను మోహింపజేయుటకు అనేక యత్నములను చేసితిని (13).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
28 Aug 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 2 🌻
అభవంస్తేsథ వై సర్వే తస్మిన్ శంభౌ పరప్రభౌ | ఉపాయ నిష్పలాస్తేషాం మమ చాపి మునీశ్వర || 14
తదాsస్మరం రమేశానం వ్యర్థోపాయస్సుతై స్సహ | అబోధయత్స ఆగత్య శివభక్తి రతస్సుధీః || 15
ప్రబోధితో రమేశేన శివతత్త్వ ప్రదర్శినా | తదీర్ష్యామత్యజం సోహం తం హఠం న విమోహితః || 16
శక్తిం సంసేవ్య తత్ర్పీత్యో త్పాదయామాస తాం తదా | దక్షాదశిక్న్యాం వీరిణ్యాం స్వపుత్రాద్ధరమోహనే || 17
ఓ మహర్షీ! పరమాత్మయగు ఆ శంభునిపై నేను, వారు ప్రయోగించిన ఉపాయములన్నియు వ్యర్థమయ్యెను (14).
ఈ రకముగా ఉపాయములన్నియూ వ్యర్థము కాగా, నేను సుతులతో గూడి రమాపతిని స్మరించితిని. అపుడు శివభక్తియందు తత్పరుడు, జ్ఞానియగు ఆ విష్ణువు వచ్చి నా మౌఢ్యమును పోగొట్టెను (15).
శివతత్త్వమును బోధించు రమాపతి నా కళ్లు తెరిపించెను. అపుడు నేను ఈర్ష్యము విడిచి పెట్టితిని. కాని మోహితుడనగు నేను మొండి పట్టును వీడలేదు (16).
అపుడు శక్తిని సేవించి ఆమె అనుగ్రహముచే, శివుని మోహింపజేయుట కొరకై, నా కుమారుడగు దక్షుని వలన వీరిణి అనబడే అశిక్ని యందు ఆమె జనించినట్లు చేసితిని (17).
సోమా భూత్వా దక్షసుతా తపః కృత్వా తు దుస్సహమ్ | రుద్రపత్న్య భవ ద్భక్త్యా స్వభక్తహితకారిణీ || 18
సోమో రుద్రో గృహీ భూత్వాsకార్షీల్లీలాం పరాం ప్రభుః | మోహయిత్వాsథ మాం తత్ర స్వవివాహేsవికారధీః || 19
వివాహ్య తాం స ఆగత్య స్వగిరౌ సూతికృత్తయా | రేమే బహువిమోహో హి స్వతంత్రస్స్వాత్తవిగ్రహః || 20
తయా విహరతస్తస్య వ్యతీయాయ మహాన్మనే | కాలస్సుఖరశ్శంభోర్నిర్వి కారస్య సద్రతేః || 21
తతో రుద్రస్య దక్షేణ స్పర్ధా జాతా నిజేచ్ఛయా | మహామూఢస్య తన్మాయో మోహితస్య సుగుర్విణః || 22
ఆ ఉమాదేవి దక్షుని కుమార్తెగా జన్మించి, దుస్సహమగు తపస్సును భక్తితో చేసి రుద్రునకు పత్ని ఆయెను. ఆమె తన భక్తులకు హితమును కలుగజేయును (18).
పరమేశ్వరుడగు రుద్రుడు ఉమాదేవితో కూడి గృహియై లీలలను ప్రకటించెను. ఆయన బుద్ది యందు వికారములేమియూ ఉండవు. ఆయన తన వివాహముందు నన్ను మోహింపజేసెను (19).
సృష్టిని చేయువాడు, మోహములేని వాడు, స్వతంత్రుడు, స్వేచ్ఛచే రూపమును ధరించిన వాడునగు రుద్రుడు ఆమెను వివాహమాడి, తన పర్వతమును చేరి బహువిధముల రమించెను (20).
ఓ మహర్షీ! వికారములు లేనివాడు, సద్విహారియగు శంభుడు చిరకాలము ఆమెతో కలిసి విహరించుచూ సుఖముగా గడిపెను (21).
అపుడు రుద్రునకు మహామూర్ఖుడు, శివమాయచే మోహితుడు, గర్విష్ఠి అగు దక్షునితో, తన ఇచ్ఛ చేత విరోధము ఏర్పడెను (22).
తత్ర్పభావాద్ధరం దక్షో మహాగర్వి విముఢధీః | మహాశాంతం నిర్వికారం నినింద బహు మోహితః || 23
తతో దక్షస్స్వయం యజ్ఞం కృతవాన్ గర్వితోsహరమ్ | సర్వా నాహూయ దేవాదీన్ విష్ణుం మాం చాఖిలాధిపః || 24
నాజుహావ తథాభూతో రుద్రం రోషసమాకులః |తథా తత్ర సతీం నామ్నా స్వపుత్రీం విధి మోహితః || 25
యదా నాకారితా పిత్రా మాయామోహిత చేతసా | లీలాం చకార సుజ్ఞానా మహాసాధ్వీ శివా తదా || 26
గొప్ప గర్వము గలవాడు, విమోహితమైన బుధ్ధి గలవాడునగు దక్షుడు, మిక్కిలి శాంతుడు, వికార రహితుడునగు శివుని మాయా ప్రభావముచే మిక్కలి మోహితుడై అనేక విధములుగా నిందించెను (23).
అపుడు గర్వితుడగు దక్ష ప్రజాపతి దేవతలను, ఇతరులను, నన్ను, విష్ణువును అందరినీ ఆహ్వానించి శివుడు లేని యజ్ఞమును చేసెను (24).
మాయామోహితుడు, గర్విష్ఠి, రోషముతో కల్లోలితమైనమనస్సు గలవాడునగు దక్షుడు రుద్రుని, సతియను తన పుత్రికను ఆ యజ్ఞమునకు ఆహ్వానించలేదు (25).
మాయచే విమూఢమైన మనస్సు గల తండ్రి ఆహ్వానించకపోగా, గొప్ప జ్ఞానవతి మహాసాధ్వియగు సతీదేవి లీలను ప్రకటించెను (26).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
29 Aug 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 3 🌻
అథగతా సతీ తత్ర శివాజ్ఞామధిగమ్య సా | అనాహూతాపి దక్షేణ గర్విణా స్వపితుర్గృహమ్ || 27
విలోక్య రుద్ర భాగం నో ప్రాప్యావజ్ఞాం చ తాతతః | వినింద్య తత్ర తాన్ సర్వాన్ దేహ త్యాగమథాకరోత్ || 28
తచ్ఛ్రుత్వా దేవ దేవేశః క్రోధం కృత్వా తు దుస్సహమ్ | జటాముత్కృత్య మహతీం వీరభద్రమజీజనత్ || 29
సగణం తం సముత్పాద్య కిం కుర్యామితి వాదినమ్ | సర్వాపమాన పూర్వం హి యజ్ఞధ్వంసం దిదేశ హ || 30
అపుడు సతీదేవి శివుని ఆజ్ఞను పొంది, గర్విష్ఠియగు దక్షుడు ఆహ్వానించకపోయినా, పుట్టింటికి విచ్చేసెను (27).
ఆమెకు ఆ యజ్ఞములో రుద్రుని భాగము కానరాలేదు. దానిని ఆమె తండ్రి చేసిన అవమానముగా గ్రహించి, అచట ఉన్న వారందరినీ నిందించి, తరువాత దేహమును విడిచి పెట్టెను (28).
దేవదేవుడగు శివుడు ఈ వృత్తాంతమును విని, సహింపరాని కోపమును పొంది, పెద్దజటనొకదానిని పీకి వీరభద్రుని సృష్టించెను (29).
వీరభద్రుని గణములతో సహా సృష్టించెను. 'నేను ఏమి చేయవలెను?' అని ప్రశ్నించిన వీరభద్రునకు అందరినీ అవమానించి, యజ్ఞమును ధ్వంసము చేయుమని ఆదేశించెను (30).
తదాజ్ఞాం ప్రాప్య స గణాధీశో బహుబలాన్వితః | గతోsరం తత్ర సహసా మహాబల పరాక్రమః || 31
మహోపద్రవమాచేరుర్గణాస్తత్ర తదాజ్ఞయా | సర్వాన్ స దండయామాస న కశ్చిదవ శేషితః || 32
విష్ణుం సంజిత్య యత్నేన సామరం గణసత్తమః | చక్రే దక్ష శిరశ్ఛేదం తచ్ఛిరోsగ్నౌ జుహావ చ || 33
యజ్ఞధ్వంసం చకారాశు మహోపద్రవమాచరన్ | తతో జగామ స్వగిరిం ప్రణనామ ప్రభుం శివమ్ || 34
గణాధీశుడగు ఆ వీరభద్రుడు శివుని యాజ్ఞను పొంది గొప్ప సైన్యముతో కూడిన వాడై శీఘ్రముగా అచటకు వెళ్లెను. గొప్ప బలము, పరాక్రమముగల (31),
ఆ వీరభద్రుని ఆజ్ఞచే గణములచట గొప్ప ఉపద్రవమును కలుగజేసిరి. ఆతడు ఎవ్వరినీ మిగల్చకుండగా, అందరినీ దండించెను (32).
గణశ్రేష్ఠుడగు నాతడు ప్రయత్న పూర్వకముగా, దేవతలతో కూడియున్న విష్ణువును జయించి, దక్షుని తలను నరికి, దానిని అగ్నియందు వ్రేల్చెను (33).
గొప్ప ఉపద్రవమును కలిగించి, ఆతడు శీఘ్రముగా యజ్ఞమును ధ్వంసము చేసి, తరువాత కైలాస పర్వతమును చేరి, శివప్రభువకు నమస్కరించెను (34).
యజ్ఞధ్వంసోsభవచ్చేత్థం దేవలోకే హి పశ్యతి | రుద్రస్యానుచరైస్తత్ర వీరభద్రాదిభిః కృతః || 35
మునే నీతిరియం జ్ఞేయా శ్రుతిస్మృతిషు సంమతా | రుద్రే రుష్టే కథం లోకే సుఖం భవతి సుప్రభౌ || 36
తతో రుద్రః ప్రసన్నోభూత్ స్తుతిమాకర్ణ్య తాం పరామ్ | విజ్ఞప్తిం సఫలాం చక్రే సర్వేషాం దీనవత్సలః || 37
పూర్వ వచ్చ కృతం తేన కృపాలుత్వం మహాత్మనా | శంకరేణ మహేశేన నానాలీలావిహారిణా || 38
వీరభద్రుడు మొదలగు రుద్రాను చరులు, దేవతలు చూచుచుండగా, ఈ తీరున యజ్ఞమును ధ్వంసమొనర్చిరి (35).
ఓ మహర్షీ! మహా ప్రభువగు రుద్రుడు కోపించినచో, లోకములో సుఖమెట్లుండును? ఈ నీతిని వేదములు, స్మృతులు చెప్పుచున్నవి. మనమీ నీతిని తెలియవలెను (36).
అపుడు ఆ దేవతలందరు చేసిన గొప్ప స్తోత్రమును విని, దీనవత్సలుడగు రుద్రుడు ప్రసన్నుడై, వారి విజ్ఞప్తిని సఫలము చేసెను (37).
శుభకరుడు, మహేశ్వరుడు,అనేక లీలలను ప్రదర్శించి విహరించువాడు, మహాత్ముడు నగు రుద్రుడు ఎప్పటివలెనే కరుణను చూపెను (38).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
30.Aug.2020
🌹 . శ్రీ శివ మహా పురాణము - 211 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
46. అధ్యాయము - 1
🌻. సంక్షేప సతీచరిత్రము - 4 🌻
జీవతస్తేన దక్షో హి తత్ర సర్వే హి సత్కృతాః | పునస్స కారితో యజ్ఞ శ్శంకరేణ కృపాలునా || 39
రుద్రశ్చ పూజితస్తత్ర సర్వై ర్దేవైర్వి శేషతః | యజ్ఞే విష్ణ్వాదిభిర్భక్త్యా సుప్రసన్నాత్మభిర్మునే || 40
సతీదేహ సముత్పన్నా జ్వాలా లోక సుఖావహా | పతితా పర్వతే తత్ర పూజితా సుఖదాయినీ || 41
జ్వాలా ముఖీతి విఖ్యాతి సర్వకామ ఫలప్రదా | బభూవ పరమా దేవీ దర్శనా త్పాపహారిణీ || 42
ఆయన దక్షుని జీవింపజేసి, అందరినీ సత్కరించెను. కృపానిధి యగు శంకరుడు మరల ఆ యజ్ఞమును చేయించెను (39).
ఆ యజ్ఞములో దేవతలందరు విష్ణువును ముందిడుకొని ప్రసన్నమగు మనస్సు గలవారై భక్తితో రుద్రుని ప్రత్యేకముగా పూజించిరి (40).
ఓ మహర్షీ! సతియొక్క దేహము నుండి పుట్టినట్టియు, లోకములకు సుఖమనిచ్చు జ్వాల పర్వతమునందు పడెను. అచట ఆమెను పూజించినచో సుఖములనిచ్చును (41).
ఆ పర్వతమునందు సర్వకామనలనీడేర్చునట్టియు, దర్శనముచే పాపములను పోగొట్టు ఆ దేవదేవి జ్వాలాముఖియను పేర ప్రసిద్ధిని గాంచెను (42).
ఇదానీం పూజ్యతే లోకే సర్వకామఫలాప్తయే | సంవిధాభి రనేకాభిః మహోత్సవ పురస్సరమ్ || 43
తతశ్చ సా సతీ దేవీ హిమాలయ సుతాsభవత్ | తస్యాశ్చ పార్వతీ నామ ప్రసిద్ధమభవత్తదా || 44
సా పునశ్చ సమారాధ్య తపసా కఠినేన వై | తమేవ పరమేశానం భర్తారం సముపాశ్రితా || 45
ఏ తత్సర్వం సమాఖ్యాతం యత్పృష్టోహం మునీశ్వర | యచ్ఛ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః || 46
ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సతీసంక్షేప చరిత్ర వర్ణనం నామ ప్రథమః అధ్యాయః (1).
ఇప్పటికీ ఆమె లోకమునందు, కోర్కెలన్నియు ఈడేరి ఫలములు లభించుటకై మహోత్సవ పూర్వకముగా అనేక తెరంగులలో పుజింపబడుచున్నది (43).
ఆ తరువాత ఆ సతీదేవి హిమాలయుని కుమార్తె అయెను. అపుడామెకు పార్వతియను పేరు ప్రఖ్యాతమాయెను (44).
ఆమె మరల కఠోరమగు తపస్సును చేసి ఆ పరమేశ్వరుని భర్తగా పొందెను (45).
ఓమునిశ్రేష్ఠా! నీవు నన్ను ప్రశ్నించిన విషయములనన్నిటినీ చెప్పతిని. దీనిని విన్నవారి పాపములన్నియు తొలగిపోవుననటలో సందేహము లేదు (46).
శ్రీ శివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితములో రెండవ ఖండలో సతీసంక్షేప చరిత్ర వర్ణనము అనే మొదటి అధ్యాయము ముగిసినది (1).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
31.Aug.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
47. అధ్యాయము - 2
🌻. కామప్రాదుర్భావము - 1 🌻
సూత ఉవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్య నైమిషారణ్య వాసినః | పప్రచ్ఛ చ మునిశ్రేష్ఠః కథాం పాపప్రణాశినీమ్ || 1
సూతుడిట్లు పలికెను -
ఓ నైమిషారణ్య నివాసులారా! బ్రహ్మ యొక్క ఈ మాటలను విని మునిశ్రేష్ఠుడగు నారదుడు పాపములను పోగొట్టే కథను గురించి ప్రశ్నించెను (1).
నారద ఉవాచ |
విధే విధే మాహాభాగ కథాం శంభోశ్శుభావహామ్ | శృణ్వన్ భవన్ముఖాంభోజాన్న తృప్తోsస్మి మహాప్రభో || 2
అతః కథయ తత్సరం శివస్య చరితం శుభమ్ | సతీకీర్త్యన్వితం దివ్యం శ్రోతుమిచ్ఛామి విశ్వకృత్ || 3
సతీ హి కథముత్పన్నా దక్షదారేషు శోభనా | కథం హ రో మనశ్చక్రే దారాహరణ కర్మణి || 4
కథం వా దక్ష కోపేన త్యక్త దేహా సతీ పురా | హిమవత్తనయా జాతా భూయో వాకాశమాగతా || 5
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! మహాత్మా!మహాప్రభో! నీ ముఖపద్మము నుండి మంగళకరమగు శుంభుగాథను ఎంత విన్ననూ, నాకు, తృప్తి కలుగుటలేదు (2).
ఓ సృష్టికర్తా! నీవు శివుని శుభచరితమును సంపూర్ణముగా చెప్పుము. సతీ దేవి యొక్క యశస్సుతో గూడిన ఆ దివ్యగాథను నేను వినగోరుచున్నాను (3).
మంగళ స్వరూపురాలగు సతి దక్షపత్నియందు ఎట్లు జన్మించెను? శివుడు వివాహమాడవలెనని తలంచుటకు కారణమేమి? (4)
సతీదేవి పూర్వము దక్షుని యందు కోపముతో దేహమును వీడి, హిమవంతుని కుమార్తెయై జన్మించిన వృత్తాంతమెట్టిది? ఆమె తిరిగి శివుని భర్తగా పొందిన వృత్తాంతమెట్టిది? (5).
పార్వత్యాశ్చ తపోsత్యుగ్రం వివాహశ్చ కథం త్వభూత్ | కథ మర్ధ శరీరస్థా బభూవ స్మరనాశినః || 6
ఏతత్సర్వం సమాచక్ష్వ విస్తరేణ మహామతే | నాన్యోస్తి సంశయచ్ఛేత్తా త్వత్సమో న భవిష్యతి || 7
పార్వతి యొక్క అత్యుగ్రమగు తపస్సు, వివాహము ఎట్లు సంపన్నమైనవి? మన్మథుని భస్మము చేసిన శివునకు ఆమె అర్థాంగి ఎట్లు కాగలిగెను? (6).
ఓ మహాబుద్ధిశాలీ! ఈ సర్వమును విస్తరముగా చెప్పుము. నీతో సమానముగా సంశయములను పోగొట్టగలవాడు లేడు, ఉండబోడు (7).
బ్రహ్మో వాచ |
శృణు త్వం చ మునే సర్వం సతీ శివయశశ్శుభమ్ | పావనం పరమం దివ్యం గహ్యాద్గుహతమం పరమ్ || 8
ఏతచ్ఛంభుః పురోవాచ భక్త వర్యాయ విష్ణవే | పృష్టస్తేన మహాభక్త్యా పరోపకృతయే మునే || 9
తతస్సోsపి మయా పృష్టో విష్ణుశ్శై వవర స్సుధీః | ప్రీత్యా మహ్యం సమాచఖ్యౌ విస్తరాన్ము నిసత్తమ || 10
అహం తత్కథయిష్యామి కథామేతాం పురాతనీమ్ | శివాశివయశోయుక్తాం సర్వకామఫలప్రదామ్ || 11
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! శుభకరము, పవిత్రము జేయునది, గొప్పది, దివ్యము, రహస్యములలో కెల్లా రహస్యమునగు సతీశివుల కీర్తిని నీవు పూర్ణముగా వినుము (8).
ఓ మహర్షీ! శివభక్తులలో శ్రేష్ఠుడగు విష్ణువు లోకోపకారము కొరకై గొప్ప భక్తితో పూర్వము ఇటులనే ప్రశ్నించగా శంభుడు చెప్పియున్నాడు (9).
శివభక్తులలో శ్రేష్ఠుడు, జ్ఞానియగు విష్ణువును నేను ప్రశ్నించగా, ఆయన ప్రీతితో నాకు విస్తరముగా చెప్పెను. ఓ మహర్షీ! (10)
శివశివులకీర్తితో గూడినది, కోర్కెలనన్నిటినీ ఈడేర్చునదియగు ఈ పురాతన గాథను నేను చెప్పగలను (11).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
01 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
47. అధ్యాయము - 2
🌻. కామప్రాదుర్భావము - 2 🌻
పురా యదా శివో దేవో నిర్గుణో నిర్వికల్పకః | అరూపశ్శక్తిరహితశ్చిన్మాత్రస్సదసత్పరః || 12
అభవత్స గుణస్సోsపి ద్విరూపశ్శక్తిమాన్ ప్రభుః | సోమో దివ్యాకృతిర్విప్ర నిర్వికారీ పరాత్పరః || 13
తస్య వామాంగజో విష్ణుర్బ్రహ్మాం దక్షిణాంగజః | రుద్రో హృదయతో జాతోsభవచ్చు మునిసత్తమ || 14
సృష్టి కర్తాsభవం బ్రహ్మా విష్ణుః పాలనకారకః | లయకర్తా స్వయం రుద్రస్త్రిధా భూతస్సదాశివః || 15
శివదేవునకు రెండు రుపములు గలవు. ఒక రూపములో ఆయన నిర్గుణుడు, నిర్వికల్పుడు, రూపము లేని వాడు, శక్తి భేదము లేనివాడు, చైతన్యఘనుడు, మరియు కార్యకారణభావాతీతుడు (12).
ఆయనయే రెండవ రూపములో సగుణుడు, శక్తి భేదమము గలవాడు, జగత్ర్పభువు, ఉమాసహితుడు, దివ్యమగు ఆకారము గలవాడు. ఓ విప్రా! ఆయన వికారములు లేనివాడు, సర్వోత్కృష్టుడు (13).
విష్ణువు ఆయన ఎడమ భాగము నుండి పుట్టెను. బ్రహ్మనగు నేను ఆయన కుడి భాగము నుండి పుట్టితిని. ఓ మునిశ్రేష్ఠా! రుద్రుడు హృదయము నుండి పుట్టెను (14).
బ్రహ్మనగు నేను సృష్టిని చేసితిని. విష్ణువు పాలించుచున్నాడు. రుద్రుడు లయమును చేయును. సదాశివుడు ఈ త్రిమూర్తుల రూపములో స్వయముగా నున్నాడు (15).
తమేవాహం సమారాధ్య బ్రహ్మ లో కపితామహః | ప్రజాస్ససర్జ సర్వాస్తా స్సురాసుర నరాదికాః || 16
సృష్ట్వా ప్రజాపతీన్ దక్షప్రముఖాన్ సురసత్తమాన్ | అమన్యం సుప్రసన్నోsహం నిజం సర్వమహోన్నతమ్ || 17
మరీచిమత్రిం పులహం పులస్త్యాంగిరసౌ క్రతుమ్ | వసిష్ఠం నారదం దక్షం భృగుం చేతి మహాప్రభూన్ || 18
బ్రహ్మాహం మానసాన్ పుత్రానసర్జం చ యదా మునే | తదా మన్మనసో జాతా చారురూపా వరాంగనా || 19
లోకపితా మహుడు, బ్రహ్మ అగునేను ఆ సదాశివుని ఆరాధించి, దేవతలు, రాక్షసులు, మానవులు మొదలగు సంతతిని సృష్టించితిని (16).
దక్షుడు మొదలగు దేవ శ్రేష్ఠులగు ప్రజా పతులను సృష్టించి, నేను చాల ప్రసన్నుడనై నన్ను నేను చాల గొప్ప వానినిగా తలపోసితిని (17).
ఓ మహర్షీ! బ్రహ్మనగు నేను మరచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, అంగిరసుడు, క్రతువు, వసిష్ఠుడు, నారదుడు, దక్షుడు, భృగువు మొదలగు గొప్ప సమర్థులైన (18)
మానసపుత్రులను సృష్టించిన తరువాత నా మనస్సునుండి సుందరమగు రూపము, శ్రేష్ఠమగు అవయమములు గల ఒక యువతి జన్మించెను (19).
నామ్నా సంధ్యా దివః క్షాంతా సాయం సంధ్యా జవంతికా | అతీవ సుందరీ సుభ్రూర్ముని చేతో విమోహినీ || 20
న తాదృశీ దేవలోకే న మర్త్యే న రసాతలే | కాలత్రయేsపి వై నారీ సంపూర్ణ గుణశాలినీ || 21
దృష్ట్వా హం తాం సముత్థాయ చింతయన్ హృది హృద్గతమ్ | దక్షాదయశ్చ స్రష్టారో మరీచ్యా ద్యాశ్చ మత్సుతాః || 22
ఏవం చింతయతో మే హి బ్రహ్మణో మునిసత్తమ | మానసః పురుషో మంజురావిర్భూతో మహాద్భుతః || 23
ఆమె పేరు సంధ్య. ఆమె పగలు క్షీణించి యుండును. సాయంకాలము సుందరముగా ప్రకాశించును. ఆమె మిక్కిలి సుందరి. చక్కని కనుబొమలు గలది. మహర్షుల మనస్సులను వ్యామోహపెట్టునది (20).
సంపూర్ణ గుణములతో విరాజిల్లే అట్టి సుందరి మూడు కాలముల యందు దేవలోక, మనుష్యలోక, పాతాళ లోకములయందు లేదు (21).
ఆమెను చూచి నేను లేచి నిలబడి, నా మనస్సులో నా కుమారులైన దక్షాది ప్రజాపతులను, మరీచి మొదలగు ఋషులను స్మరించుచుండగా (22),
అట్టి నానుండి ఒక పురుషుడు ఉదయించెను. ఓమునిశ్రేష్ఠా! ఆతడు గొప్ప సౌందర్యము గలవాడై, మహాద్భుతముగా నుండెను (23).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
02 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
47. అధ్యాయము - 2
🌻. కామప్రాదుర్భావము - 3 🌻
కాంచనీకృత జాతాభః పీనోరస్క స్సునాసికః | సువృత్తోరు కటి జంఘో నీలవేలిత కేసరః || 24
లగ్న భ్రూయుగలే లోలః పూర్ణచంద్రని భాననః | కపాటాయత సద్వక్షో రోమరాజీవి రాజితః || 25
అభ్రమాతంగ కాకారః పీనో నీలసువాసకః | ఆరక్త పాణినయన ముఖపాదకరోద్భవః || 26
క్షీణ మధ్య శ్చారుదంతః ప్రమత్త గజగంధనః | ప్రపుల్ల పద్మపత్రాక్షః కేసరఘ్రాణతర్పణః || 27
ఆతడు బంగారము వలె ప్రకాశించెను. ఆతడు దృఢమగు వక్షస్థ్సలమును, సుందరముగ ముక్కును, గుండ్రటి ఊరువులను, మోకాళ్లను, పిక్కలను, నల్లని కేశములనుకలిగియుండెను (24).
ఆతని కనుబొమలు కలిసియుండి సుందరముగా కదలాడుచుండెను. ఆతని ముఖము పూర్ణిమ నాటి చంద్రుని బోలియుండెను తలుపువలె విశాలమైన, దృఢమైన వక్షస్థ్సలము గల ఆతడు రోమపంక్తిచే ప్రకాశించెను (25).
అతడు మేఘమువలె, ఏనుగువలె ప్రకాశించెను. ఆతడు బలిసి యుండెను. ఆతడు నీలవర్ణము గల సుందర వస్త్రమును ధరించియుండెను. ఆతని చేతులు, నేత్రములు, ముఖము, పాదములు రక్త వర్ణము కలిగియుండెను (26).
ఆతడు సన్నని నడుముతో, సుందరముగ దంతములతో, మదించిన ఏనుగువలె సుగంధము గలవాడై, వికసించిన పద్మము యొక్క పత్రముల వంటి కన్నులు గలవాడై ఉండెను. అతని ముక్కు పున్నాగ పుష్పము వలె ప్రకాశించెను (27)
కంబుగ్రీవో మీనకేతుః ప్రాంశుర్మకరవాహనః | పంచపుష్పాయుధో వేగీ పుష్పకోదండమండితః || 28
కాంతః కటాక్షపాతేన భ్రామయన్నయనద్వయమ్ | సుగంధిమారుతో తాత శృంగారరససే వితః || 29
తం వీక్ష్య పురుషం సర్వే దక్షాద్యా మత్సుతాశ్చ యే | ఔత్సుక్యం పరమం జగ్ము ర్విస్మయావిష్టమానసాః || 30
అభవద్వికృతం తేషాం మత్సుతానాం మనో ద్రుతమ్ | ధైర్యం నెవాలభత్తాత కామాకులిత చేతసామ్ || 31
మాం సోs పి వేధసం వీక్ష్య స్రష్టారం జగతాం పతిమ్ | ప్రణమ్య పురుషః ప్రాహ వినయానత కంధరః || 32
ఆతడు శంఖము వంటి కంఠము గలవాడు. చేపకన్నుల వాడు. పొడవైన వాడు. మొసలి వాహనముగా గలవాడు. అయిదు పుష్పములే ఆయుధములుగా గలవాడు. వేగము గలవాడు. పూలధనస్సుతో ప్రకాశించువాడు (28).
ప్రియమైన వాడు. కన్నులను త్రిప్పుచూ ఇటునటు చూచువాడు. వత్సా! ఆతనిపై నుండి వచ్చు గాలి పరిమళభరితమై యుండెను. ఆతనిని శృంగార రసము సేవించుచుండెను (29).
ఆ పురుషుని చూచి దక్షుడు మొదలగు నా కుమారులందరు విస్మయముతో నిండిని మనస్సు గలవారై మిక్కిలి ఉత్కంఠను పొందిరి (30).
కామముచే వ్యాకులమైన ఆ నా కుమారులను మనస్సు శ్రీఘ్రమే వికారమును పొందెను. వత్సా! వారు ధైర్యమును కోల్పోయిరి (31).
ఆ పురుషుడు స్రష్ట, జగత్ర్పభువు, బ్రహ్మయగు నన్ను గాంచి వినయముతో తలవంచి నమస్కరించి ఇట్లనెను (32).
పురుష ఉవాచ |
కిం కరిష్యామ్యహం కర్మ బ్రహ్మంస్తత్ర నియోజయ | మాన్యోsద్య పురుషో యస్మాదుచితశ్శోభితో విధే || 33
అభిధానం చ యోగ్యం చ స్థానం పత్నీ చ యా మమ | తన్మే వద త్రిలోకేశ త్వం స్రష్టా జగతాం పతిః || 34
పురుషుడిట్లు పలికెను-
హే బ్రహ్మన్! నేను చేయదగిన కర్మ ఏదియో, దాని యందు నన్ను నియోగింపుము. హే విధీ! ఈ లోకములో పూజనీయుడు, ధర్మశోభితుడు అగు పురుషుడు నీవేగదా (33).
నా పేరును, నాకు యోగ్యమగు స్థానమును, మరియు నా భార్యను గురించి నాకు చెప్పుము. ముల్లోకములకు ప్రభువగు ఓ బ్రహ్మా! సృష్టించువాడవు, జగత్పతివి నీవే గదా! (34).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
03.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
47. అధ్యాయము - 2
🌻. కామప్రాదుర్భావము - 4 🌻
బ్రహ్మోవాచ |
ఏవం తస్య వచశ్ర్శుత్వా పురుషస్య మహాత్మనః | క్షణం న కించిత్ర్పావోచత్స స్రష్టా చాతి విస్మితః || 35
అతో మనస్సు సంయమ్య సమ్య గుత్సృజ్యయ విస్మయమ్ | అవోచత్పురుషం బ్రహ్మా తత్కామం చ సమావహన్ || 36
అనేన త్వం స్వరూపేణ పుష్ప బాణౖశ్చ పంచభిః | మోహయన్ పురుషాన్ స్త్రీ శ్చ కురు సృష్టిం సనాతనీమ్ || 37
అస్మిన్ జీవాశ్చ దేవాద్యాసై#్రలోక్యే సచరాచరే | ఏతే సర్వే భవిష్యంతి న క్షమాస్త్వవలంబనే || 38
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాత్ముడగు ఆ పురుషుని ఈ మాటలను వినిన ఆ బ్రహ్మ మిక్కిలి విస్మితుడై క్షణకాలము ఏమియూ పలుకలేదు (35).
అపుడు బ్రహ్మ మనస్సును నిలద్రొక్కుకొని, విస్మయమును పూర్తిగా విడిచి, ఆ స్త్రీ యందలి కామనను నియంత్రించుకొని, ఆ పురుషునితో నిట్లనెను (36).
నీవు ఈ స్వరూపముతో నున్నవాడై, అయిదు పుష్పబాణములతో స్త్రీ పురుషులను మోహపెట్టుచూ సనాతనమగు సృష్టిని చేయుము (37).
ఈ స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో దేవతలు మొదలగు ఈ జీవులందరూ కూడియు నిన్ను కాదని నిలబడుటకు సమర్థులు కాజాలరు (38).
అహం వా వాసు దేవో వా స్థాణుర్వా పురుషోత్తమః | భవిష్యామస్తవ వశే కిమన్యే ప్రాణధారకాః || 39
ప్రచ్ఛన్న రూపో జంతూనాం ప్రవిశన్ హృదయం సదా | సుఖహేతుస్స్వయం భూత్వా సృష్టిం కురు సనాతనీమ్ || 40
త్వత్పుష్ప బాణస్య సదా సుఖలక్ష్యం మనోద్భుతమ్ | సర్వేషాం ప్రాణినాం నిత్యం సదా మదకరో భవాన్ || 41
నేను, వాసు దేవుడు, పురుషోత్తముడగు శివుడు కూడా నీకు వశమగు వారమే. ఇక ఇతర ప్రాణుల గురించి చెప్పున దేమున్నది? (39).
నీవు ప్రాణుల హృదయములో సర్వదా గుప్త రూపుడవై యుండి వారికి స్వయముగా సుఖమునకు కారణము అగుచూ, సనాతనమగు సృష్టిని చేయుము (40).
అద్భుతమగు ఆ మనస్సు సర్వదా నీ పుష్పబాణములకు లక్ష్యమై సుఖమునిచ్చును. నీవు ప్రాణులందరికీ సర్వదా మదమును కలిగించెదవు (41).
ఇతి తే కర్మ కథితం సృష్టి ప్రావర్తకం పునః | నామాన్యేతే వదిష్యంతి సుతా మే తవ తత్త్వతః || 42
ఇత్యుక్త్వాహం సురశ్రేష్ఠ స్వసుతానాం ముఖాని చ | ఆలోక్య స్వాసనే పాద్మే ప్రోపవిష్టోsభవం క్షణ || 43
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామప్రాదుర్భావో నామ ద్వితీయోsధ్యాయః (2)
ఇట్లు నేను సృష్టిని ప్రవర్తిల్లజేయు నీ కర్మను గురించి చెప్పితిని. ఈ నా కుమారులు నీ స్వరూపమునకు అనుగుణమగు పేర్లను చెప్పగలరు (42).
ఓ దేవశ్రేష్ఠా! నేను ఇట్లు పలికి, నా కుమారుల ముఖములను చూచి, నా పద్మాసనమునందు శ్రీఘ్రమే ఉపవిష్టుడనైతిని (43).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండంలో కామప్రాదుర్భావము అనే రెండవ అధ్యాయము ముగిసినది (2)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
04.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 1 🌻
బ్రహ్మోవాచ |
తతస్తే మునయస్సర్వే తదభిప్రాయ వేదినః | చక్రుస్తదుచితం నామ మరీచి ప్రముఖాస్సుతాః || 1
ముఖావలోకనాదేవ జ్ఞాత్వా వృత్తాంతమన్యతః | దక్షాదయశ్చ స్రష్టార స్థ్సానం పత్నీం చ తే దదుః || 2
తతో నిశ్చిత్య నామాని మరీచి ప్రముఖా ద్విజాః | ఊచుస్సంగతమేతసై#్మ పురుషాయ మమాత్మజాః || 3
బ్రహ్మ ఇట్లు పలికెను -
మరీచి మొదలగు ఆ మునులందరు, మరియు కుమారులు బ్రహ్మయొక్క అభిప్రాయము నెరింగి ఆ పురుషునకు యోగ్యమగు పేర్లనిడిరు (1).
బ్రహ్మ గారు వారి ముఖములోనికి చూడగా ఆయన అభిప్రాయమును గ్రహించి దక్షాది ప్రజాపతులు ఆ పురుషునకు స్థానమును, భార్యను కల్పించిరి (2).
అపుడు నా కుమారులైన మరీచి మొదలగు మహర్షులు ఆతని పేర్లను నిశ్చియించి ఈ యుక్తియుక్తమగు మాటను ఆపురుషునితో పలికిరి (3).
ఋషయ ఊచుః |
యస్మాత్ర్ప మథసే తత్త్వం జాతోsస్మాకం యథా విధేః | తస్మాన్మన్మథ నామా త్వం లోకే ఖ్యాతో భవిష్యసి || 4
జగత్సు కామరూపస్త్వం త్వత్సమో న హి విద్యతే | అతస్త్వం కామనామాపి ఖ్యాతో భవ మనోభవ || 5
మదనాన్మదనాఖ్యస్త్వం జాతో దర్పాత్స దర్పకః | తస్మాత్కం దర్పనామాపి లోకే ఖ్యాతో భవిష్యసి || 6
త్వత్సమం సర్వ దేవానాం యద్వీర్యం న భవిష్యతి |తతస్థ్సా నాని సర్వాణి సర్వవ్యాపీ భవాంస్తతః || 7
దక్షోయం భవతే పత్నీం స్యయం దాస్యతి కామినీమ్ | ఆద్యః ప్రజాపతిర్యో హి యథేష్టం పురుషోత్తమః || 8
నీవు పుట్టగనే మాయొక్క బ్రహ్మ యొక్క మనస్సులను మథించినాడవు గనుక, నీకు లోకములో మన్మథుడను పేరు ప్రసిద్ధి గాంచ గలదు (4).
మనస్సులో పుట్టే ఓ మన్మథా! యధేఛ్ఛగా వివిధ రూపములను ధరించుటలో నీతో సమమైన వాడు జగత్తులలో లేడు గనుక, నీవు 'కాముడు' అను పేర ప్రఖ్యాతిని బడయుము (5).
నీవు జనులను మదాన్వితులను చేయుదువు గాన నీకు మదనుడని పేరు. నీవు దర్పము గలవాడవు. దర్పము నుండి పుట్టినవాడవు. కాన నీకు లోకములో కందర్పుడు అనే పేరు గూడ ప్రసిద్ధిని గాంచగలదు (6).
నీతో సమానమైన బలము గలవాడు దేవతలలో మరియొకరు ఉండబోరు. కావున స్థానములన్నియు నీవియే. నీవు సర్వవ్యాపివి (7).
పురుషశ్రేష్ఠుడు, మొదటి ప్రజాపతియగు ఈ దక్షుడు తనకు నచ్చిన విధముగా నీకు నిన్ను ప్రేమించు భార్యను స్వయముగా ఈయగలడు (8).
ఏషా చ కన్యకా చారురూపా బ్రహ్మమనోభవ | సంధ్యా నామ్నేతి విఖ్యాతా సర్వలోకే భవిష్యతి || 9
బ్రహ్మణో ధ్యాయతో యస్మాత్సమ్యగ్జాతా వరాంగనా | అతస్సంధ్యేతి. విఖ్యాతా క్రాంతాభా తుల్య మల్లికా || 10
బ్రహ్మయొక్క మనస్సు నుండి పుట్టిన ఈ సుందర రూపము గల కన్య లోకములన్నింటియందు సంధ్య యను పేరుతో ప్రసిద్ధిని గాంచెను (9).
ధ్యానము చేయుచున్న బ్రహ్మ నండి ఈ సుందరి చక్కగా జన్మించినది గాన, ఈమె సంధ్యయని ప్రసిద్ధిని బడసినది. ఈ సుందరి మల్లె తీగవలె విశేషంచి ప్రకాశించుచున్నది (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
05.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 2 🌻
బ్రహ్మోవాచ |
కౌసుమాని తథాస్త్రాణి పంచాదాయ మనోభవః | ప్రచ్ఛన్నరూపీ తత్రైవ చింతయామాస నిశ్చయమ్ || 11
హర్షణం రోచనాఖ్యం చ మోహనం శోషణం తథా | మారణం చేతి ప్రోక్తాని మునే ర్మోహకరాణ్యపి || 12
బ్రహ్మణా మమ యత్కర్మ సముద్దిష్టం సనాతనమ్ | తదహైవ కరిష్యామి మునీనాం సన్నిధౌ విధేః || 13
తిష్ఠంతి మునయశ్చాత్ర స్వయం చాపి ప్రజాపతిః | ఏతేషాం సాక్షి భూతం మే భవిష్యంత్యద్య నిశ్చయమ్ || 14
సంధ్యాపి బ్రహ్మణా ప్రోక్తా చేదానీం ప్రేషయేద్వచః | ఇహ కర్మ పరీక్ష్యైవ ప్రయోగాన్మోహయామ్యహమ్ || 15
బ్రహ్మ ఇట్లు పలికెను -
మనస్సులో ఉదయించు మన్మథుడు అయిదు పుష్పబాణములను తీసుకొని, ప్రచ్ఛన్న రూపముతో అక్కడనే యుండి ఆలోచించి ఒక నిశ్చయమునకు వచ్చెను (11).
మునులకు కూడ మోహమును కలిగించు ఈ బాణములకు హర్షణము, రోజనము, మోహనము, శోషము మరియు మారణము అని పేర్లు (12).
బ్రహ్మ నాకు ఉపదేశించిన సనాతన సృష్టి కార్యమును నేను ఇచటనే ఈ మునుల సన్నిధిలో, బ్రహ్మ సన్నిధిలో ప్రయోగించెదను (13).
ఇచట మునులు ఉన్నారు. ప్రజాపతి కూడ స్వయముగ ఉన్నాడు. నా నిశ్చయమునకు వీరందరు ఈనాడు సాక్షులు కాగలరు (14).
సంధ్య కూడ ఇచట గలదు. బ్రహ్మచే నిర్దిష్టమైన పుష్పబాణ ప్రయోగరూప కర్మను పరీక్షకొరకై ఈమె యందు ఆచరించి నేను ఈమెను మోహింపజేయగలను (15).
ఇతి సంచింత్య మనసా నిశ్చిత్య చ మనోభవః | పుష్పజం పుష్పజాతస్య యోజయామాస మార్గణౖః || 16
ఆలీఢ స్థానమాసాద్య ధనురాకృష్య యత్నతః | చకార వలయాకారం కామో దన్వివరస్తదా || 17
సంహితే తేన కోదండే మారుతాశ్చ సుగంధయః | వవుస్తత్ర మునిశ్రేష్ఠ సమ్యగాహ్లాద కారిణః || 18
తతస్తానపి ధా త్రా దీన్ సర్వానేవ చ మానసాన్ | పృథక్ పుష్పశ##రైస్తీక్ణై ర్మోహయామాస మోహనః || 19
తతస్తే మునయస్సర్వే మోహితాశ్చాప్యహం మునే | సంహితో మనసా కంచిద్వికారం ప్రాపురాదితః || 20
మన్మథుడు మనసులో నిట్లు నిశ్చయించుకొని పుష్పధనస్సుపై పుష్ప బాణములను ఎక్కు పెట్టెను (16).
అపుడు ధనుర్ధారులలో శ్రేష్ఠుడగు కాముడు కుడికాలును ముందుకు వంచి, ఎడమ కాలును వెనుకకు పెట్టి, ధనస్సును బలముగా లాగి గుండ్రముగా చేసెను. (17).
ఆతడు ధనస్సును ఎక్కు పెట్టగానే పరిమళ భరితములు అగు వాయువులు అచట వీచినవి. ఓ మహర్షీ! ఆ వాయువులు గొప్ప ఆహ్లాదమును కలిగించినవి (18).
మోహింప జేయు ఆ మన్మథుడు తీక్ణములగు పుష్పబాణములతో బ్రహ్మను, ఆతని మానస పుత్రులనందరినీ మోహింపజేసెను (19).
ఓ మునీ! అపుడు నేను మరియు ఆ మునులందరు మోహితులమైతిమి. మొట్టమొదటిసారిగా బ్రహ్మాదులు మనస్సులో ఒక విలక్షణమైన వికారమును పొందిరి (20).
సంధ్యాం సర్వే నిరీక్షంతస్సవికారం ముహుర్ముహుః | ఆసన్ ప్రవృద్ధమదనాః స్త్రీ యస్మాన్మదనైధినీ || 21
తతస్సర్వాన్ స మదనో మోహయిత్వా పునః పునః | యథేంద్రియవికారంతే ప్రాపుస్తానకరోత్తథా || 22
ఉదీరితేంద్రియో ధాతా వీక్ష్యాహం స యదా చ తామ్ | తదైవ చోన పంచాశద్భావా జాతాశ్శరీరతః || 23
సాపి తైర్వీక్ష్య మాణాథ కందర్పశరపాతనాత్ | చక్రే ముహుర్ముహుర్భావాన్ కటాక్షావరణాదికాన్ || 24
వారందరు సంధ్యను మరల మరల వికారములతో చూచిరి. వారి మన్మథ వికారములు వృద్ధిపొందెను. స్త్రీ కామవికారమును వృద్ధి జేయును గదా! (21).
ఇట్లు ఆ మన్మథుడు వారినందరిని మరల మరల మోహింపజేసి, వారు ఇంద్రియ వికారమును పొందునట్లు చేసెను (22).
బ్రహ్మనగు నేను ఆమెను వృద్ధిపొందిన ఇంద్రియ వికారముతో చూచుచున్న సమయములో శరీరము నుండి నలభై తొమ్మిది పదార్థములు పుట్టినవి (23).
వారు ఇట్లు చూచుచుండగా, ఆమెపై కూడ మన్మథ బాణముల ప్రభావము పడెను. ఆమెయు క్రీగంటితో చూచుట, సంజ్ఞలతో ఆహ్వానించుట మొదలగు శృంగార వికారములను అధికముగా చేయజొచ్చెను (24).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
07.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 3 🌻
నిసర్గసుందరీ సంధ్యా తాన్ భావాన్ మానసోద్భవాన్ |కుర్వంత్యతిరాం రేజే స్వర్నదీప తనూర్మి భిః || 25
అథ భావయుతాం సంధ్యాం వీక్ష్యాకార్షం ప్రజాపతిః | ధర్మాభిపూరిత తను రభిలాషమహం మునే || 26
తతస్తే మునయస్సర్వే మరీచ్యత్రిముఖా ఆపి | దక్షాద్యాశ్చ ద్విజశ్రేష్ఠ ప్రాపుర్వై కారికేంద్రియమ్ || 27
దృష్ట్వా తథావిధా దక్షమరీచిప్రముఖాశ్చ మామ్ | సంధ్యాం చ కర్మణి నిజే శ్రద్దధే మదనస్తదా || 28
సహజ సుందరి యగు సంధ్య , మనస్సులో పుట్టే కామభావములను ప్రకటించుచున్నదై, చిన్న తరంగములతో కూడిన మందాకిని నదివలె మిక్కిలి ప్రకాశించెను (25).
ఓ మహర్షీ! ప్రజాపతియగు నేను కామభావముతో కూడిన సంధ్యను చూచి, కామభావముతో నిండిన శరీరము గలవాడనై ఆమెను అభిలషించితిని (26).
అపుడా మరీచి , అత్రి మొదలగు మునులు, దక్షుడు మొదలగు ప్రజాపతులు కూడా ఇంద్రియ వికారములను పొందిరి (27).
ఓ విప్రశ్రేష్ఠా! దక్షుడు, మరీచి మొదలగు వారు, మరియు నేను అట్లు అగుటను చూచి, మరియు సంధ్యను చూచి, మన్మథునకు తన సామర్ధ్యము పై విశ్వాసము కలిగెను (28).
యదిదం బ్రహ్మణా కర్మ మమోద్దిష్టం మయాపి తత్ | కర్తుం శక్యమితి హ్యద్ధా భావితం స్వభువా తదా || 29
ఇత్థం పాపగతిం వీక్ష్య భ్రాతౄణాం చ పి తుస్తథా | ధర్మ స్సస్మార శంభుం వై తదా ధర్మావనం ప్రభుమ్ || 30
సంస్మరన్మనసా ధర్మశ్శంకరం ధర్మపాలకమ్ | తుష్టావ వివిధైర్వాక్యైర్దీనో భూత్వాజసంభవః || 31
'బ్రహ్మ నాకు అప్పజెప్పిన ఈ కర్మను నేను చేయగలను ' అనే విశ్వాసము మన్మథునకు దృఢముగా కలిగెను (29).
అపుడు ధర్ముడు పాపభావనతో కూడిన సోదరులను, తండ్రిని చూచి, ధర్మ రక్షక ప్రభువగు శంభువును స్మరించెను (30).
బ్రహ్మ పుత్రుడగు ధర్మడు దీనుడై, ధర్మ పాలకుడగు శంకరుని మనస్సులో స్మరించుచూ అనేక వాక్యములతో ఇట్లు స్తుతించెను (31).
ధర్మ ఉవాచ |
దేవ దేవ మహాదేవ ధర్మపాల నమోsస్తుతే | సృష్టి స్థితి వినాశానాం కర్తా శంభో త్వమేవ హి || 32
సృష్టౌ బ్రహ్మా స్థితౌ విష్ణుః ప్రలయే హరరూపధృక్ | రజస్సత్త్వ తమోభిశ్చ త్రిగుణౖరగుణః ప్రభో || 33
నిసై#్రగుణ్యశ్శివస్సాక్షాత్తుర్యశ్చ ప్రకృతేః పరః | నిర్గుణో నిర్వికారీ త్వం నానాలీలా విశారదః || 34
రక్ష రక్ష మహాదేవ పాపాన్మాం దుస్తరాదితః | మత్పితాయం తథా చేమే భ్రాతరః పాపబుద్ధయః || 35
ధర్ముడు ఇట్లు పలికెను -
దేవ దేవా! మహాదేవా! ధర్మరక్షకా! నీకు నమస్కారము. శంభో! సృష్టిస్థితిలయకర్తవు నీవే గదా!(32).
ప్రభో! గుణరహితుడవగు నీవు రజస్సు, సత్త్వము, తమస్సు అను గుణములను స్వీకరించి, సృష్టియందు బ్రహ్మ రూపమును, స్థితియందు విష్ణురూపమును, ప్రళయమునందు రుద్రరూపమును ధరించెదవు (33).
శివుడు త్రిగుణా తీతుడు. త్రిమూర్తుల కతీతమైన తురీయతత్త్వమే శివుడు. ఆయన ప్రకృతి కంటె ఉత్కృష్టుడు. అట్టి నీవు నిర్గుణుడవు. నిర్వికారుడవు. అయిననూ, అనేక లీలలను ప్రకటించుటలో సమర్థుడవు (34).
మహాదేవా! నన్ను తరింప శక్యము గాని ఈ పాపము నుండి రక్షింపుము. రక్షింపుము. ఈ నా తండ్రి, మరియు ఈ నా సోదరులు పాప బుద్ధిని కలిగియున్నారు (35).
బ్రహ్మోవాచ |
ఇతి స్తుతో మహేశానో ధర్మేణౖవ పరః ప్రభుః | తత్రా జగామ శీఘ్రం వై రక్షితుం ధర్మమాత్మభూః || 36
జాతో వియద్గతశ్శంభుర్విధిం దృష్ట్వా తథావిధమ్ | మాం దక్షాద్యాంశ్య మనసా జహా సోపజహాస చ || 37
స సాధువాదం తాన్ సర్వాన్ విహస్య చ పునః పునః | ఉవాచేదం మునిశ్రేష్ఠ లజ్జయన్ వృషభధ్వజః || 38
బ్రహ్మ ఇట్లు పలికెను -
పరమ ప్రభువు, స్వయంభువునగు మహేశ్వరుడు ధర్మునిచే ఈ విధముగా స్తుతింపబడినవాడై, వెంటనే అచటకు ధర్మ రక్షణ కొరకై విచ్చేసెను (36).
బ్రహ్మను (నన్ను) , దక్షుడు మొదలగు వారిని ఆ విధముగా చూసిన శంభుడు ఆకాశమునందే ఉండి ఎంతయూ నవ్వుకొనెను (37).
వృషభవాహనుడగు ఆ శివుడు వారందరితో 'సాధు సాధు' అని పిలికెను. ఓ మహర్షీ! ఆయన మరల మరల నవ్వి, వారికి సిగ్గు కలుగు విధముగా ఇట్లు పలికెను (38).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
08.Sep.2020
🌹 . శ్రీ శివ మహా పురాణము - 219 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 4 🌻
శివ ఉవాచ |
అహో బ్రహ్మంస్తవ కథం కామభావస్సముద్గతః | దృష్ట్వా చ తనయాం నైవ యోగ్యం వేదాను సారిణామ్ || 39
యథా మతా చ భగినీ భ్రాతృపత్నీ తథా సుతా | ఏతాః కుదృష్ట్యా ద్రష్టవ్యా న కదాపి విపశ్చితా || 40
ఏష వై వేదమార్గస్య నిశ్చయస్త్వన్ముఖే స్థితః | కథం తు కామమాత్రేణ స తే విస్మారితో విధే || 41
ధైర్యం జాగరితం బ్రహ్మన్ మనస్తే చతురానన | కథం క్షుద్రేణ కామేన రంతుం విగటితం విధే || 42
శివుడిట్లు పలికెను -
అహో బ్రహ్మన్! కుమార్తె ను చూచి నీకు కామభావము ఎట్లు కలిగినది? వేద మార్గానుయాయులకు ఇది తగదు (39).
వివేకి తల్లిని, సోదరిని, సోదరుని భార్యను, మరియు కుమార్తెను తప్పు దృష్టితో ఎన్నడునూ చూడరాదు (40).
ఇది వేద మార్గము యొక్క నిర్ణయము. వేదము నీ ముఖమునందు గలదు. హే బ్రహ్మన్! అల్పుడగు కాముడు నీవు దీనిని విస్మరించునట్లు ఎట్లు చేయగలిగెను ?(41).
నాల్గు ముఖములు గల ఓ బ్రహ్మ!నీవు మనస్సునందు వివేకమును మేల్కొలుపుము. విధే! నీవు క్షుద్రమగు కామముతో మనస్సును ఎట్లు రంజింపజేయగలవు? (42).
ఏకాంత యోగినస్తస్మాత్సర్వదాదిత్యదర్శినః | కథం దక్షమరీ చ్యాద్యా లోలుపాస్త్రీషు మానసాః || 43
కథం కామోsపి మందాత్మా ప్రాబల్యాత్సోsధునైవ హి | వికృతాన్ బాణౖః కృతవానకాలజ్ఞోల్ప చేతనః || 44
ధిక్తం శ్రు తం సదా తస్య యస్య కాంతా మనోహరత్ | ధైర్యా దాకృష్య లౌల్యేషు మజ్జయత్యపి మానసమ్ || 45
మానసపుత్రలగు దక్ష మరీచ్యాదులు ఉన్నత భూమికకు చెందిన యోగులు. అందువలననే, వారు సదా ఆదిత్యుని దర్శించువారు. అట్టి వారు స్త్రీ వ్యామోహమునెట్లు పొందిరి? (43)
మూర్ఖుడు, కాలము యొక్క ఔచిత్యమునెరుంగని వాడు, అల్పశక్తిమంతుడునగు కాముడు పుట్టిన కొద్ది సేపటికే గర్వితుడై బాణములతో మీయందు వికారమునెట్లు కల్గించినాడు? (44).
ఎవని మనస్సును స్త్రీ అపహరించునో, వానికి వాని పాండిత్యమునకు నిందయగుగాక! అవివేకులు ధైర్యము(వివేకజ్ఞానము) నుండి మనస్సును మరల్చి చంచలమగు విషయ సుఖముల యందు నిమగ్నము చేయుదురు (45)
బ్రహ్మోవాచ |
ఇతి తస్య వచశ్ర్శుత్వా లోకే సోహం శివస్య చ | వ్రీడయా ద్విగుణీ భూత స్స్వేదార్ద్రస్త్వభవం క్షణాత్ || 46
తతో నిగృహ్యైంద్రియకం వికారం చాత్యజం మునే | జిఘృక్షురసి తద్భీత్యా తాం సంధ్యాం కామరూపిణీమ్ || 47
మచ్ఛరీరాత్తు ఘర్మాంభో యత్పపాత ద్విజోత్తమ | అగ్ని ష్వాత్తాః పితృగణా జాతాః పితృగణాస్తతః || 48
భిన్నాంజన నిభాస్సర్వే పుల్లరాజీవలోచనాః | నితాంత యతయః పుణ్యాస్సంసారవిముఖాః పరే || 49
బ్రహ్మ ఇట్లు పలికెను -
అట్టి నేను ఆ శివుని మాటలను విని రెండు రెట్లు అధికముగా సిగ్గుచెందితిని. క్షణములో నా శరీరమంతయూ చెమటతో నిండెను (46).
ఓ మునీ! మనోహర రూపిణి యగు ఆ సంధ్యను పట్టుకొనవలెననే కోరిక ఉన్ననూ, నేను శివుని భయముచే నిగ్రహించుకొని ఇంద్రియ వికారమును విడిచి పెట్టితిని (47).
ఓ ద్విజశ్రేష్ఠా! నా శరీరము నుండి జారిన చెమట నీటి నుండి అగ్నిష్వాత్తులనే పితృదేవతలు, మరియు ఇంకో పితరులు జన్మించిరి (48).
వారందరు కాటుక పొడివలెనుండిరి. వారి నేత్రములు వికసించిన పద్మములవలె నుండెను. ఆ పుణ్యాత్ములు గొప్ప యతిశ్రేష్ఠులు. వారు సంసారమునందు విరక్తిగల మహానుభావులు (49).
సహస్రాణాం చతుషృష్టి రగ్ని ష్వాత్తాః ప్రకీర్తితాః | షడశీతి సహస్రాణి తథా బర్హిషదో మునే || 50
ఘర్మాంభః పతితం భూమౌ తదా దక్షశరీరతః | సమస్త గుణ సంపన్నా తస్మా జ్ఞాతా వరాంగనా || 51
తన్వంగీ సమమధ్యా చ తనురోమావలీ శ్రుతా | మృద్వంగీ చారుదశనా నవకాంచన సుప్రభా || 52
సర్వావయవరమ్యా చ పూర్ణ చంద్రాననాంబుజా | నామ్నా రతిరితి ఖ్యాతా మునీనామపి మోహినీ || 53
ఓ మహర్షీ! అగ్ని ష్వాత్తుల సంఖ్య అరవై నాలుగు వేలు. బర్హిషదుల సంఖ్య ఎనభై ఆరు వేలు (50).
అపుడు దక్షుని శరీరము నుండి చెమట నీరు భూమిపై బడెను. దాని నుండి సమస్తగుణములతో కూడిన ఒక శ్రేష్ఠయువతి జన్మించెను (51).
ఆమె సుందరమగు అవయములను, సమమైన నడుమును, సన్నని రోమ పంక్తిని కలిగియుండెను. ఆమె అవయవములు మృదువుగా నుండెను. ఆమె దంతములు సుందరముగా నుండెను. ఆమె మెరుగుపెట్టిన బంగారము వలె కాంతులీనెను (52).
ఆమె అన్ని అవయవముల యందు రమ్యముగా నుండెను. ఆమె ముఖము పున్నమి నాటి చంద్రుని బోలియుండెను. మునులను కూడ మోహింపజేయు ఆమెకు రతి యని పేరు (53).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
09.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 5 🌻
మరీచి ప్రముఖాష్షడ్వై నిగృహీతేంద్రియక్రియాః |ఋతేక్రతుం వసిష్ఠం చ పులస్త్యాంగిరసౌ తథా || 54
క్రత్వాదీనాం చతుర్ణాం చ బీజం భూమౌ పపాత చ | తేభ్యః పితృగణా జాతా అపరే మునిసత్తమ || 55
సోమపా ఆజ్యపా నామ్నా తధైవాన్యే సుకాలినః | హవిష్మంతస్సుతాస్సర్వే కవ్యవాహః ప్రకీర్తితః || 56
క్రతోస్తు సోమపాః పుత్రా వసిష్ఠాత్కాలినస్తథా | ఆజ్యపాఖ్యాః పులస్త్యస్య హవిష్మంతో ంగిరస్సుతాః || 57
క్రతు, వసిష్ఠ, పులస్త్య, అంగిరసులను మినహాయించి, మరీచి మొదలగు ఆర్గురు ఋషులు ఇంద్రియ వికారమును నిగ్రహించగల్గిరి.(54).
క్రతువు మొదలగు ఆ నల్గురు ఋషుల బీజము భూమిపై పడెను. ఓమునిశ్రేష్ఠా! అపుడు మరికొందరు పితృగణములు జన్మించిరి (55).
సోమపులు, ఆజ్యపులు, సుకాలులు, మరియు హవిష్మంతులని వారి పేర్లు. వీరందరికి హవిర్భాగములను (కవ్యము) అందజేయు అగ్ని కవ్యవాహుడనబడును (56).
క్రతువు నుండి సోమపులు, వసిష్ఠుని నుండి కాలులు అను పుత్రులు జన్మించిరి. పులస్త్యుని సుతులు ఆజ్యపులనియు, అంగిరసుని సుతులు హవిష్మంతలనియు అనబడుదురు (57).
జాతేషు తేషు విప్రేంద్ర అగ్ని ష్వాత్తాదికేష్వథ | లోకానాం పితృవర్గేషు కవ్యవాట్ స సమంతతః || 58
సంధ్యా పితృప్రసూర్భూత్వా తదుద్దేశయుతాs భవత్ | నిర్దోషా శంభు సందృష్టా ధర్మకర్మపరాయణా || 59
ఏతస్మిన్నంతరే శంభురనుగృహ్యాఖిలాన్ ద్విజాన్ | ధర్మం సంరక్ష్య విధివదంతర్ధానం గతో ద్రుతమ్ || 60
అథ శంకరవాక్యేన లజ్జితోsహం పితామహః | కందర్పాయాకోపితం హి భ్రుకుటీ కుటిలాననః || 61
ఓ విప్రశ్రేష్ఠా! అగ్ని ష్వాత్తులు మొదలగు ఈ పితృదేవతలు జన్మించగా, వారందరికి మానవులు సమర్పించే హవ్యములను సమర్పించు అగ్ని కవ్యవాట్ అయినాడు (58).
బ్రహ్మ కుమార్తెయగు సంధ్య తండ్రి గుణములను పుణికి పుచ్చుకొనెను. శంభునిచే చూడబడిన ఆమె దోషములు లేనిదై, ధర్మ బద్ధమగు కర్మలయందు అభిరుచిగలదై యుండెను (59).
ఇంతలో శంభుడు ఆ ఋషులనందరిని అనుగ్రహించి, ధర్మమును యథావిధిగా సంరక్షించి, వెంటనే అంతర్థానము జెందెను (60).
అపుడు పితామహుడనగు నేను శంకరుని మాటలచే సిగ్గు చెందియుంటిని. మన్మథునిపై కోపము కలిగి నా కనుబొమలు ముడివడెను (61).
దృష్ట్వా ముఖమభిప్రాయం విదిత్వా సోsపి మన్మథః | స్వబాణాన్ సంజహారాశు భీతః పశుపతేర్మునే || 62
తతః కోపసమాయుక్తః పద్మయోనిరహం మునే | అజ్వలం చాతిబలవాన్ దిధక్షురివ పావకః || 63
భవనేత్రాగ్ని నిర్దగ్ధః కందర్పో దర్పమోహితః | భవిష్యతి మహాదేవే కృత్వా కర్మ సుదుష్కరమ్ || 64
ఇతి వేధా స్త్వహం కామమక్షయం ద్విజసత్తమ | సమక్షం పితృసంఘస్య మునీనాం చ యతాత్మనామ్ || 65
ఇతి భీతో రతిపతిస్తత్ క్షణాత్త్యక్తమార్గణః | ప్రాదుర్బభూవ ప్రత్యక్షం శాపం శ్రుత్వాతి దారుణమ్ || 66
ఆ మన్మథుడు నా ముఖమును చూచి నా అభిప్రాయమును గ్రహించెను. ఓమునీ! ఆతడు శివునకు భయపడి వెంటనే తన బాణములనుపసంహరించెను (62).
ఓ మహర్షీ! గొప్ప బలము గలవాడను, పద్మము నుండి పుట్టిన వాడను అగు నేను అప్పుడు కోపముతో నిండిన స్వరమును తగులబెట్టు అగ్నివలె మండి పడితిని (63).
గర్వముచే మోహితుడై యున్న ఈ మన్మథుడు మహాదేవుని యందు చేయ శక్యము కాని కర్మను చేయబూని, ఆయన నేత్రము నుండి బయల్వెడలిన అగ్నిచే దహింపబడగలడు (64).
ఓ ద్విజశ్రేష్ఠా! నేను ఈ తీరున, యతీశ్వరులగు మునులు, పితృదేవతలు చూచుచుండగా, కాముని శపించితిని (65).
కాముడు భయపడి వెంటనే బాణములను ఆవల పారవేసి, అతి దారుణమగు ఈ శాపమును విన్న వెంటనే నా ఎదుట ప్రత్యక్షమాయెను (66).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
10.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
48. అధ్యాయము - 3
🌻. కామశాపానుగ్రహములు - 6 🌻
బ్రహ్మాణం మాముహచేదం సదక్షాదిసుతం మునే | శృణ్వతాం పితృసంఘానాం సంధ్యాయాశ్చ విగర్వధీః || 67
ఓ మహర్షీ! దక్షుడు మొదలగు కుమారులతో కూడియున్న బ్రహ్మతో (నాతో) గర్వము తొలగిన బుద్ధిగల కాముడు, పితృదేవతలు, సంధ్య వింటూ ఉండగా, ఇట్లు పలికెను (67).
కామ ఉవాచ |
కిమర్ధం భవతా బ్రహ్మన్ శప్తోహమతి దారుణమ్ |అనాగస్తవ లోకేశ న్యాయ్యమార్గనుసారిణః || 68
త్వయా చోక్తం ను మత్కర్మ యత్తద్బ్రహ్మన్ కృతం మయా | తత్ర యోగ్యోన శాపో మే యతో నాన్యత్ కృతం మయా || 69
అహం విష్ణుస్తథా శంభుస్సర్వే త్వచ్ఛరగోచరాః |ఇతి యద్భవతా ప్రోక్తం తన్మయాపి పరీక్షితమ్ || 70
నాపరాధో మమాప్యత్ర బ్రహ్మన్మయి నిరాగసి | దారుణస్సమయశ్చైవ శాపో దేవ జగత్పతే || 71
ఓ బ్రహ్మా! నీవు నన్ను మిక్కిలి దారుణముగా శపించుటకు కారణమేమి ? ఓ లోక ప్రభూ! నీవు చేయు పనులు పాపరహితములు, న్యాయ్యామార్గమును అనుసరించునవి అయి ఉండును (68).
నేను చేయవలసిన పనిని నీవు నిర్దేశించితివి. ఏ బ్రహ్మా! నేను దానినే చేసితిని. ఆ విషయములో నాకు శాపము నీయదగదు. నేను నీవు చెప్పిన దానికంటె భిన్నమగు పనిని చేయలేదు (69).
నేను, విష్ణువు, శంభుడు, అందరు నీ బాణములకు వశులగుదురు అని నీవు చెప్పిన మాటను మాత్రమే నేను పరీక్షించితిని (70).
ఓ బ్రహ్మా! దీనిలో నా అపరాధము లేదు. ఓ దేవా! జగత్ర్పభూ! తప్పును చేయని నాకు దారుణమగు శాపమునిచ్చితివి (71).
బ్రహ్మో వాచ |
ఇతి తస్య వచశ్ర్శుత్వా బ్రహ్మాహం జగతాం పతిః| ప్రత్యవోచం యతాత్మనం మదనం దమయన్ముహుః || 72
ఆత్మజా మమ సంధ్యేయం యస్మాదేతత్స కామతః | లక్ష్మీకృతోSహం భవతా తతశ్శాపో మయా కృతః || 73
అధునా శాంతరోషోsహం త్వాం వదామి మనోభవ | శృణుష్వ గత సందేహస్సుఖీ భవ భయం త్య జ || 74
త్వం భస్మ భూత్వా మదన భర్గలోచన వహ్నినా | తథైవాశు సమం పశ్చా చ్ఛరీరం ప్రాపయిష్యతి || 75
యదా కరిష్యతి హరోంజసా దారపరిగ్రహమ్ | తదా స ఏవ భవతశ్శరీరం ప్రాపయిష్యతి || 76
బ్రహ్మ ఇట్లు పలికెను -
మన్మథుని ఈ మాటలను విని, జగత్ర్పభువు బ్రహ్మ అగు నేను ఆత్మ నియంత్రణము గల మన్మథుని అనేక పర్యాయములు నిగ్రహించి ఇట్లు బదులిడితిని (72).
ఈ సంధ్య నాకు కుమార్తె. నేను ఈమె యందు కామవికారమును పొందునట్లు నీవు నన్ను నీ బాణములకు లక్ష్యము చేసితివి. అందువలననే , నేను శాపమునిచ్చితిని (73).
ఇపుడు నా కోపము తగ్గినది. ఓ మన్మథా! నేను చెప్పు మాటలను వినుము. నీ సందేహములు తొలగును. నీవు సుఖివి కమ్ము. భయమును వీడుము (74).
మన్మథా! శివుని నేత్రము నుండి వచ్చిన అగ్ని నిన్ను భస్మము చేయును. ఆ తరువాత నీవు శీఘ్రముగా మరల శరీరమును పొందగలవు (75).
శివుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించి, ఆయనయే నీకు శరీరము కలుగునట్లు చేయగలడు (76).
ఏవ ముక్త్వాథ మదనమహం లోకపితామహః | అంతర్దధే మునీంద్రాణాం మానసానాం ప్రపశ్యతామ్ || 77
ఇత్యేవం మే వచశ్ర్శుత్వా మదనస్తేSపి మానసాః | సంబభూవుస్సుతాస్సర్వే సుఖినోsరం గృహం గతాః || 78
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామశాపానుగ్రహో నామ తృతీయోsధ్యాయః (3).
లోకపితామహుడనగు నేను మునీశ్వరులు, మానసపుత్రులు చూచుచుండగా, ఇట్లు పలికి అంతర్ధానమును చెందితిని (77).
ఈ నామాటలను విని, మన్మథుడు, మరియు మానసపుత్రులు అందరు సుఖమును పొంది, శీఘ్రమే గృహములకు వెడలిరి (78).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో కామశాపానుగ్రహములనే మూడవ అధ్యాయము ముగిసినది (3).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
11.Sep.2020
🌹. శ్రీ శివ మహా పురాణము - 222 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
49. అధ్యాయము - 4
🌻. కామ వివాహము - 1 🌻
నారద ఉవాచ |
విష్ణుశిష్య మహాప్రాజ్ఞ విధే లోకకర ప్రభో | అద్భుతేయం కథా ప్రోక్తా శివలీలామృతాన్వితా || 1
తతః కిమభవత్తాత చరితం తద్వదాధునా | అహం శ్రద్ధాన్విత శ్ర్శోతుం యది శంభుకథాశ్రయమ్ || 2
నారదుడిట్లు పలికెను -
ఓ విష్ణుశిష్యా! నీవు గొప్ప ప్రాజ్ఞుడవు. హే విధే! నీవు లోకములను సృష్టించితివి. హే ప్రభో! శివుని లీలలు అనే అమృతముతో కూడిన ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1).
తండ్రీ! ఆతరువాత ఏమైనది? ఆ వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము. నేను శంభుని గాథను వినుటయందు శ్రద్ధ గల వాడను (2).
బ్రహ్మోవాచ |
శంభౌ గతే నిజస్థానే వేధస్యంతర్హితే మయి | దక్షః ప్రాహాథ కందర్పం సంస్మరన్ మమ తద్వచః || 3
బ్రహ్మ ఇట్లు పలికెను -
శంభుడు తన స్థానమునకు వెళ్లెను. బ్రహ్మనగు నేను అంతర్థానము చెందితిని. అపుడు దక్షుడు నా ఆ మాటను స్మరించుచూ, మన్మథునితో నిట్లనెను (3).
దక్ష ఉవాచ |
మద్దేహజేయం కందర్ప సద్రూపగుణసంయుతా | ఏనాం గృహ్ణీష్వ భార్యార్థం భవతస్సదృశీం గుణౖః || 4
ఏషా తవ మహాతేజా స్సర్వదా సహచారిణీ | భవిష్యతి యథాకామం ధర్మతో వశవర్తినీ || 5
దక్షుడిట్లు పలికెను -
ఓ మన్మథా! ఈమె నా దేహమునుండి పుట్టినది. మంచి రూపము, గుణములు కలది. ఈమె గుణములలో నీకు తగినది. ఈమెను భార్యగా స్వీకరింపుము (4).
గొప్ప తేజస్వినియగు ఈమె సదా నీకు తోడుగా నుండును. ఈమె నిన్ను ప్రేమించును. నీకు అనుకూలముగా నుండి ధర్మమును పాలించగలదు (5).
బ్రహ్మో వాచ |
ఇత్యుక్త్వా ప్రదదౌ తసై#్మ దేహ స్వేదాంబుసంభవామ్ | కందర్పాయాగ్రతః కృత్వా నామ కృత్వా రతీతి తామ్ || 6
విహహ్య తాం స్మరస్సోsపి ముమోదాతీవ నారద | దక్షజాం తనయాం రమ్యాం మునీనామపి మోహినీమ్ || 7
అథ తాం వీక్ష్య మదనో రత్యాఖ్యాం స్వస్త్రియం శుభామ్ | ఆత్మా గుణన విద్దోసౌ ముమోహ రతిరంజితః || 8
క్షణ ప్రదాsభవత్కాంతా గౌరీ మృగదృశీ ముదా | లోలాపాంగ్యథ తసై#్యవ భార్యా చ సదృశీ రతౌ || 9
బ్రహ్మ ఇట్లు పలికెను -
దక్షుడు ఇట్లు పలికి తన దేహము యొక్క చెమటనుండి పుట్టిన ఆమెకు రతియను నామకరణము చేసి ఆమెను కందర్పుని ఎదుట నిలిపి సమర్పించెను (6).
ఓ నారదా! సుందరి, మునులను కూడ మోహింపజేయునది అగు ఆ దక్షపుత్రిని వివాహమాడి మన్మథుడు మిక్కిలి ఆనందించెను (7).
అపుడు మన్మథుడు రతి అనే శోభాయుక్తమగు తన భార్యను చూచి, అనురాగముచే నిండిన మనస్సు గలవాడై, తన బాణములచే తానే కొట్టబడినవాడై, మోహమును పొందెను (8).
గౌరవర్ణము గలది, లేడికన్నులు గలది, చంచలమగు ఓర చూపులు గలది, సుందరి అగు ఆ మన్మథుని భార్య అతనితో సమమైన అనురాగము గలదియై, అతనికి ఉత్సవమును కలిగించెను (9).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
12.Sep.2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
49. అధ్యాయము - 4
🌻. కాముని వివాహము - 2 🌻
తస్యా భ్రూయుగలం వీక్ష్య సంశయం మదనోsకరోత్ | ఉత్సాదనం మత్కోదండం విధాత్రాస్యాం నివేశితమ్ || 10
కటాక్షాణా మాశుగతిం దృష్ట్వా తస్యా ద్విజోత్తమ | ఆశు గంతుం నిజాస్త్రాణాం శ్రద్దధేన చచారుతామ్ || 11
తస్యాస్స్వభావ సురభి ధీర శ్వాసానిలం తథా | ఆఘ్రాయ మదనశ్శద్ధాం త్యక్తవాన్మలయాంతికే || 12
పూర్ణేందు సదృశం వక్త్రం దృష్ట్వా లక్ష్మ సులక్షితమ్ | న నిశ్చికాయ మదనో భేదం తన్ముఖ చంద్రయోః || 13
ఆమె కను బొమలను చూచి, ' బ్రహ్మ నా ధనస్సును లాగుకొని ఈమె కనుబొమలను మలచినాడా యేమి?' అని మన్మథుడు సందేహపడెను (10).
ఓ ద్విజశ్రేష్ఠా! ఆతడు ఆమె యొక్క వేగము గల చూపులను పరికించి, తన అస్త్రముల యందు శ్రద్ధను శీఘ్రమే కోల్పోయెను. ఆమె ఇతర సౌందర్యమునైననూ ఆతడు పరికించలేదు (11).
స్వభావ సిద్ధముగా పరిమళముగల ఆమె యొక్క నిటారైన శ్వాస వాయువును ఆఘ్రాణించి మన్మథుడు మలయమారుతము నందు విశ్వాసమును విడిచిపెట్టెను (12).
పూర్ణిమనాటి చంద్రుని బోలియున్న, చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖమును చూచి, మన్మథుడు ఆమె ముఖమునకు, చంద్రునకు గల భేదమును ఎరుంగలేపోయెను (13).
సువర్ణ పద్మకలికాతుల్యం తస్యాః కుచద్వయమ్ | రేజే చూచుకయుగ్మేన భ్రమరేణవ వేష్టితమ్ || 14
దృఢీపీనోన్నతం తస్యాస్త్సనమధ్యం విలంచినీమ్ | ఆనాభి ప్రతలం మాలాం తన్వీం చంద్రాయితాం శుభమ్ || 15
జ్యాం పుష్పధనుషః కామః షట్పదావలి సంభ్రమామ్ | విసస్మార చ యస్మాత్తాం విసృజ్యైనాం నిరీక్షతే || 16
గంభీరనాభి రంధ్రాంతశ్చతుః పార్శ్వత్వగావృతమ్ | ఆననాబ్జేsక్షణద్వంద్వ మారక్తక ఫలం యథా || 17
బంగరుపద్మముల మొగ్గలవంటి ఆమె కుచ ద్వయము భ్రమరములు వాలినవా యన్నట్లున్న చూచుకములతో ప్రకాశించెను (14).
దృఢముగా బలిసి ఎత్తుగా నున్న ఆమె స్తనముల మధ్యలో నాభి గహ్వరము వరకు వెన్నెల వలె తెల్లనైన సన్నని మాల వ్రేలాడుచుండెను. శుభకరమగు (15)
ఆ మాలను నిరీక్షించుచూ, మన్మథుడు తుమ్మెదల పంక్తిచే నిర్మితమై అల్లకల్లోలముగా నున్న పుష్పధనుస్సు యొక్క నారిత్రాటిని మరిచిపోయెను (16).
అన్ని వైపుల మృదువగు చర్మముచే ఆవరింపబడియున్న నాభీరంధ్రములోతుగనున్నది. పద్మము వంటి ఆమె ముఖమునందలి రెండు కన్నులు ఎర్రని ఫలముల వలె ప్రకాశించుచున్నవి (17).
క్షీణాం మధ్యేన వపుషా నిసర్గాష్టాపదప్రభా | రుక్మవేదీవ దదృశే కామేన రమణీ హి సా || 18
రంభా స్తంభాయతం స్నిగ్ధం యదూరు యుగలం మృదు | నిజశక్తి సమం కామో వీక్షాం చ క్రే మనోహరమ్ || 19
ఆరక్త పార్‌ష్ణి పాదాగ్ర ప్రాంతభాగం పదద్వయమ్ | అను రాగమివానేన మిత్రం తస్యా మనోభవః || 20
తస్యాః కరయుగం రక్తం నఖరైః కింశుకోపమైః | వృత్తాభిరంగులీభిశ్చ సూక్ష్మా గ్రా భిర్మనోహరమ్ || 21
సన్నని నడుము గలది, సహజముగా బంగరు వన్నె గలది అగు ఆ రమణి మన్మథునకు బంగరు వేదిక వలె కన్పట్టెను (18).
అరటి బోదెల వలె పొడవైనది, స్నిగ్ధమృదు మనోహరము అగు ఆమె యొక్క ఊరు ద్వంద్వమును చూచి మన్మథుడు తన సమ్మోహనశక్తితో సమమైనదిగా భావించెను (19).
ఆమె రెండు పాదముల అగ్రములు, మధ్య భాగము, మడమలు మిక్కిలి ఎర్రగా నుండి, ఆమెకు ప్రియుడగు మన్మథుని యందు గల అనురాగము వాటి యందు ప్రకటమైనదా అన్నట్లుండెను (20).
ఆమె చేతులు ఎర్రగా నుండి, చిగుళ్లవంటి గోళ్లతో, గుండ్రని సన్నని అగ్రములు గల వ్రేళ్లతో మనోహరముగా నుండెను (21).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
14 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
49. అధ్యాయము - 4
🌻. కాముని వివాహము - 3 🌻
తద్బాహుయుగలం కాంతం మృణాల యుగలాయతమ్ |
నీల నీరద సంకాశః కేశపాశో మనోహరః |
ఏతా దృశీం రతిం నామ్నా ప్రాలేయాద్రి సముద్భవామ్ |
చక్రపద్మాం చారు బాహు మృణాల శకలాన్వితామ్ |
సుందరములు, మృదువైనవి, సిగ్ధమైనవి అగు ఆమె బాహువులు తామర తూడుల వలె పొడవుగా నుండి బంగారు వన్నెతో పగడముల కాంతులతో అతిశయించి ప్రకాశించెను (22).
నల్లని మేఘముల వలె మనస్సును హరించే ఆమె కేశపాశము చమరీమృగము యొక్క గుబురైన తోకవలె భాసించెను (23).
వికసించిన నేత్రములు గల మన్మథుడు ఆ రతీ దేవిని, మహాదేవుడు హిమవత్పర్వతమునుండి పుట్టిన గంగను స్వీకరించెను (24).
ఆమె స్తనములనే పద్మములు కలిగినది, సుందర బాహువులనే తామరతూడులు గలది, కనుబొమల విరుపుల వరుసలనే పిల్ల కెరటములతో ప్రకాశించునది అగు సరస్సువలె విరాజిల్లెను (25).
కటాక్ష పాత తుంగౌఘాం స్వీయ నేత్రోత్పలాన్వితామ్ |
నిమ్న నాభిహ్రదాం క్షామాం సర్వాంగరమణీయకామ్ |
ద్వాదశాభరణౖ ర్యుక్తాం శృంగారైష్షోడశైర్యుతామ్ |
ఇతి తాం మదనో వీక్ష్య రతిం జగ్రాహ సోత్సుకః |
ఆమె వాడి చూపులనే గొప్ప ప్రవాహము గలది, నేత్రములనే నల్ల కలువలు గలది, సన్నని రోమావళి అనే నీటినాచు, గలది, మనోవృత్తులనే వృక్షములతో (ఒడ్డుపై నున్నవి) ప్రకాశించునది (26).
తోతైన నాభి అనే సరస్సు గలది అగు నది వలె ప్రకాశించెను. సన్నని ఆ యువతి సర్వావయములయందు రమణీయముగా నుండెను. లావణ్యము ఆమె యందు నివాసముండెను. ఆమె లక్ష్మివలె ప్రకాశించెను (27).
పన్నెండు ఆ భరణములను ధరించి, పదునారు అలంకారములను చేసుకొని, సర్వలోకములను మోహింపజేయుచూ, పది దిక్కులను ప్రకాశింపజేయుచున్న (28)
ఆ రతిని చూచి, ప్రేమతో దగ్గరకు వచ్చి ఉత్తమమగు లక్ష్మిని విష్ణువు వలె, మన్మథుడు ఆమెను ఉత్సాహముతో స్వీకరించెను (29).
నోవాచ చ తదా దక్షం కామో మోద భవాత్తతః |
తదా మహోత్సవస్తాత బభూవ సుఖ వర్ధనః |
కామోsతీవ సుఖం ప్రాప్య సర్వదుఃఖ క్షయం గతః |
రరాజ చ తయా సార్ధం భిన్న శ్చారు వచస్స్మరః |
ఇతి రతి పతిరుచ్చై ర్మోహయుక్తో రతిం తాం హృదుపరి జగృహే వై యోగ దర్శీవ విద్యామ్ |
రతిరపి పతిమగ్య్రం ప్రాప్య సా చాపి రేజే హరిమివ కమలా వై పూర్ణ చంద్రో పమాస్యా || 34
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే కామవివాహవర్ణనం నా మ చతుర్థోsధ్యాయః (4).
అపుడు మిక్కిలి మోహితుడై యున్న మన్మథుడు బ్రహ్మచే ఈయబడిన దారుణమగు శాపమును ఆనందములో నుండుటచే మరచి, దక్షునితో చెప్పలేదు (30).
వత్సా! అపుడు సుఖమును వర్ధిల్ల జేయు మహోత్సవము ప్రవర్తిల్లెను. తన కుమార్తె యొక్క ఆనందమును చూచి, దక్షుడు మిక్కిలి సంతసిల్లెను (31).
కాముడు మిక్లిలి సుఖమును పొందెను. ఆతని దుఃఖములన్నియూ తొలగిపోయెను. దక్షుని కుమార్తె యగు రతి కూడ కాముని పొంది ఆనందించెను (32).
సుందరముగా మాటలాడు మన్మథుడు ఆమె గూడి, సంధ్యాకాలమునందు సుందరమగు మెరపుతో గూడిన మేఘము వలె ప్రకాశించెను (33).
మిక్కిలి మోహముతో కూడిన మన్మథుడు రతిని, యోగి ఆత్మ విద్యను వలె, హృదయ సింహాసనమునందధిష్ఠింప జేసెను. పూర్ణచంద్రుని వంటి ముఖము గల లక్ష్మి హరిని వలె, రతి గొప్ప భర్తను పొంది మిక్కిలి ప్రకాశించెను (34).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహిత యందు రెండవది యగు సతీఖండములో కామ వివాహ వర్ణనమనే నాల్గవ అధ్యాయము ముగిసినది (4).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
15 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 1 🌻
సూత ఉవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మణో మునిసత్తమః | స ముదోవాచ సంస్మృత్య శంకరం ప్రీతమానసః || 1
సూతుడిట్లు పలికెను -
మునిశ్రేష్ఠుడగు నారదుడు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని, సంతసించిన మనస్సు గలవాడై, శంకరుని స్మరించి ఆనందముతో నిట్లనెను (1).
నారద ఉవాచ |
బ్రహ్మన్ విధే మహాభాగ విష్ణు శిష్య మహామతే | అద్భుతా కథితా లీలా త్వయా చ శశిమౌలినః || 2
గృహీతదారే మదనే హృష్టే హి స్వగృహం గతే | దక్షే చ స్వగృహం యాతే తథా హి త్వయి కర్తరి || 3
మానసేషు చ పుత్రేషు స్వస్వధామసు | సంధ్యా కుత్ర గతా సా చ బ్రహ్మపుత్రీ పితృప్రసూః || 4
కిం చకార చ కేనైవ పురుషేణ వివాహితా | ఏతత్సర్వం విశేషేణ సంధ్యాయాశ్చరితం వద || 5
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! విష్ణుశిష్యా! మహాప్రాజ్ఞా! నీవు చంద్రశేఖరుని అద్భుత లీలను చెప్పితివి (2).
మన్మథుడు వివాహమాడి ఆనందముతో తన గృహమునకు వెళ్లగా, దక్షుడు తన గృహమును చేరుకొనగా జగత్కర్తవగు నీవు కూడ గృహమును పొందగా (3),
మానసపుత్రులు కూడ తమ తమ ధామములకు చేరుకొనగా, బ్రహ్మ పుత్రి, పితృదేవతలకు తల్లి అగు సంధ్య ఎచటకు వెళ్లెను ? (4)
ఆమె ఏమి చేసెను? ఏ పురుషుని వివాహమాడెను? నీవు సంధ్య యొక్క చరిత్ర నంతనూ విస్తారముగా చెప్పుము (5).
సూత ఉవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్య బ్రహ్మ పుత్రస్య ధీమతః | సంస్మృత్య శంకరం భక్త్యా బ్రహ్మా ప్రోవాచ తత్త్వవిత్ || 6
సూతుడిట్లు పలికెను -
బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడునగు ఆ నారదుని మాటను విని, తత్త్వవేత్తయగు బ్రహ్మ భక్తితో శంకరుని స్మరించి ఇట్లు పలికెను (6)
బ్రహ్మో వాచ |
శృణు త్వం చ మునే సర్వం సంధ్యాయాశ్చరితం శుభమ్ | యచ్ఛృత్వా సర్వకామిన్య స్సాధ్వ్యస్స్యు స్సర్వదా మునే || 7
సా చ సంధ్యా సుతా మే హి మనో జాతా పురాs భవత్ | తపస్తప్త్వా తనుం త్యక్త్వా సైవ జాతా త్వరుంధతీ || 8
మేధాతి థేస్సుతా భూత్వా మునిశ్రేష్ఠస్య ధీమతీ | బ్రహ్మ విష్ణు మహేశాన వచనా చ్చరితవ్రతా || 9
వవ్రే పతిం మహాత్మానం వసిష్ఠం శంసితవ్రతమ్ | పతివ్రతా చ ముఖ్యా భూద్వంద్యా పూజ్యా త్వభీషణా || 10
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! శుభకరమగు సంధ్య యొక్క చరితమును నీవు పూర్తిగా వినుము. ఓ మునీ! దీనిని ఎల్లవేళలా వినే స్త్రీ లందరు సాధ్వీమణులగుదురు (7).
ఆ సంధ్య ముందుగా నాకు కుమారైయై పుట్టెను. ఆమె తపస్సును చేసి, శరీరమును వీడి అరుంధతియై జన్మించెను (8).
బుద్ధి మంతురాలగు ఆమె గొప్ప ముని యగు మేథా తిథికి కుమారైయై జన్మించెను. గొప్ప నిష్ఠ గల ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మాటచే (9)
మహాత్ముడు, ప్రశంసింపదగిన తపోనిష్ఠుడునగు వసిష్ఠుని భర్తగా వరించెను. మంచి మనసు గల ఆమె పతివ్రతలలో శ్రేష్ఠురాలై జగత్తునకు నమస్కిరింపదగిన పూజ్యురాలు అయెను (10).
నారద ఉవాచ |
కథం తయా తపస్తప్తం కిమర్థం కుత్ర సంధ్యయా | కథం శరీరం సా త్యక్త్వాsభవన్మేధాతిథే స్సుతా || 11
కథం వా విహితం దేవైర్బ్రహ్మ విష్ణు శివైః పతిమ్ | వసిష్ఠం తు మహాత్మానం సంవవ్రే శంసిత వ్రతమ్ || 12
ఏతన్మే శ్రోష్యమాణాయ విస్తరేణ పితామహ | కౌతూహల మరుంధత్యాశ్చరితం బ్రూహి తత్త్వతః || 13
నారదుడిట్లు పలికెను -
ఆ సంధ్య తపస్సును ఎచట, ఎందుకొరకు, ఎట్లు చేసెను? ఆమె ఎట్లు శరీరమును వీడి మేధాతిథి కుమార్తెగా జన్మించెను? (11)
బ్రహ్మ విష్ణు శివులచే నిర్ణయింపబడిన వాడు, ప్రశంసింపదగిన తపో నిష్ఠ గలవాడు, మహాత్ముడు అగు వసిష్ఠుని ఆమె భర్తగా ఎట్లు వరించెను? (12)
ఓ పితామహా! నేను ఈ అరుంధతీ చరిత్రను విన గోరుచున్నాను ఉత్కంఠ గల నాకు ఈ చరిత్రసారమును విస్తరముగా చెప్పుము (13).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
16 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 2 🌻
బ్రహ్మో వాచ |
అహం స్వతనయాం సంధ్యాం దృష్ట్వా పూర్వమథాత్మనః | కామాయాశు మనోsకార్షం త్యక్తా శివ భయాచ్చ సా || 14
సంధ్యా యాశ్చలితం చిత్తం కామబాణ విలోడితమ్ | ఋషీణామపి సంరుద్ధ మానసానాం మహాత్మనామ్ || 15
భర్గస్య వచనం శ్రుత్వా సోపహాసం చ మాం ప్రతి | ఆత్మనశ్చలితత్వం వై హ్యమర్యాదమృషీన్ ప్రతి || 16
కామస్య తా దృశం భావం మునిమోహకరం ముహుః | దృష్ట్వా సంధ్యా స్వయం తత్రోపయమా యాతి దుఃఖితా || 17
బ్రహ్మ ఇట్లు పలికెను -
పూర్వము నేను నాకుమార్తె యగు సంధ్యను చూచి వెంటనే ఆమెను కామించితిని. కాని శివుని భయము వలన అధర్మమును వీడితిని (14).
మన్మథుడు బాణములచే ప్రహారము చేయగా, సంధ్య యొక్క మనస్సు చలించెను. మనోనిగ్రహము గలవారు, మహాత్ములునగు ఋషులకు కూడ మనో వికారము కలిగెను (15).
శివడు నాతో పరిహాస పూర్వకముగా పలికిన మాటలను సంధ్య విన్నది. తాను పొందిన మనోవికారమును, ఋషుల విషయములో జరిగిన అమర్యాదను కన్నది (16).
మునులకు కూడా మోహమును కలిగించే కాముని సామర్థ్యమును పరిశీలించినది. ఆమె మిక్కిలి దుఃఖితురాలై అచట నుండి వెళ్లిపోయెను (17).
తతస్తు బ్రహ్మణా శప్తే మదనే చ మయా మునే | అంతర్భూతే మయి శివే గతే చాపి నిజాస్పదే || 18
అమర్ష వశమా పన్నా సా సంధ్యా మునిసత్తమ | మమ పుత్రీ విచార్యైవం తదా ధ్యాన పరాsభవత్ || 19
ధ్యాయంతీ క్షణమేవాశు పూర్వం వృత్తం మనస్వినీ | ఇదం విమమృశే సంధ్యా తస్మిన్ కాలే యథోచితమ్ || 20
ఓ మహర్షీ! నేను మన్మథుని శపించి అంతర్ధానమైతిని. శివుడు తన ధామకు వెళ్లెను (18).
ఓ మహర్షీ! ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును సహించలేక పోయెను. నా కుమారైయగు సంధ్య అపుడు ఇట్లు తలపోసి, ధ్యానమగ్నురాలు అయెను (19).
అభిమానవతియగు ఆ సంధ్య జరిగిన వృత్తాంతమును ధ్యానము చేయు చున్నదై, ఆ కాలమునకు ఉచితమగు విధానములో, ఇట్లు విమర్శ చేసుకొనెను (20).
సంధ్యో వాచ |
ఉత్పన్న మాత్రాం మాం దృష్ట్వా యువతిం మదనేరితః | అకార్షీత్సాను రాగోsయమభిలాషం పితా మమ || 21
పశ్యతాం మానసానాం చ మునీనాం భావితాత్మనామ్ | దృష్ట్వై వ మామమర్యాదం సకామమభవన్మనః || 22
మమాపి మథితం చిత్తం మదనేన దురాత్మనా | యేన దృష్ట్వా మునీన్ సర్వాంశ్చ లితం మన్మనో భృశమ్ || 23
ఫలమేతస్య పాపస్య మదనస్స్వయమాప్తవాన్ | యస్తం శశాప కుపితః శంభోరగ్రే పితామహః || 24
సంధ్య ఇట్లు పలికెను -
నేను యువతిగా జన్మించిన మరుక్షణములో, మన్మథునిచే ప్రేరితుడైన నా తండ్రి నన్ను మన్మథ వికారముతో కామించెను (21).
మానసపుత్రులు, అంతః కరణ శుద్ధి గల మునులు చూచుచుండగా ఆయన నన్ను మర్యాద లేని విధముగా చూచి, మనస్సులో కామనను పొందినాడు (22).
దుర్మార్గుడగు మన్మథుడు నా మనస్సును కూడ కల్లోల పెట్టగా , ఆ మునుల నందరినీ చూచుచున్న నా మనస్సు మిక్లిలి చలించెను (23).
ఈ పాపమునుకు ఫలమును మన్మథుడు పొందినాడు. శంభుని యెదుట పితామహుడు కోపించి వానిని శపించినాడు (24).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
19 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 3 🌻
ప్రాప్నుయాం ఫలమేతస్య పాపస్య స్వఘ కారిణీ | తచ్ఛోధన ఫలమహా మాశు చే చ్ఛామి సాధనమ్ || 25
యున్మాం పితా భ్రాతరశ్చ సకామమపరోక్షతః | దృష్ట్వా చక్రుః స్పృహాం తస్మాన్న మత్తః పాపకృత్పరా || 26
మమాపి కామభావోsభూ దమర్యాదం సమీక్ష్యతాన్ | పత్యా ఇవ స్వకే తాతే సర్వేషు సహజేష్వపి || 27
కరిష్యామ్యస్య పాపస్య ప్రాయశ్చిత్తమహం స్వయమ్ | ఆత్మాన మగ్నౌ హోష్యామి వేదమార్గానుసారతః || 28
ఈ పాపమును చేసిన నేను కూడా ఈ పాపఫలమును పొందగలను. కాని నేను వెంటనే ఆ పాపమును క్షాళన చేయగలిగే సాధనమును స్వీకరించ గోరు చున్నాను (25).
నన్ను ప్రత్యక్షముగా చూచిన నా తండ్రి, మరియు సోదరులు కామ వికారములను పొంది నారంటే, నాకంటె పెద్ద పాపాత్మురాలు ఉండబోదు (26).
మర్యాద లేకుండగా నాతండ్రిని, సోదరులనందరినీ చూచిన నాకు కూడా కామభావము అంకురించెను (27).
నేను ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును స్వయముగా చేసుకొనగలను. నేను వేద ధర్మముననుసరించి నా దేహమును అగ్నిలో హోముము చేయగలను (28).
కిం త్వేకాం స్థాపయిష్యామి మర్యాదామిహ భూతలే | ఉత్పన్న మాత్రాన యథా సకామమాస్స్యుశ్శరీరిణః || 29
ఏతదర్థ మహం కృత్వా తపః పరమ దారుణమ్ | మర్యాదాం స్థాపయిష్యామి పశ్చాత్త్యక్ష్యామి జీవితమ్ || 30
యస్మిన్ శరీరే పిత్రా మే హ్యభిలాషస్స్వయం కృతః | భ్రాతృభిస్తేన కాయేన కించిన్నాస్తి ప్రయోజనమ్ || 31
మయా యేన శరీరేణ తాతే చ సహజేషు చ |ఉద్భావితః కామభావో న తత్సు కృత సాధనమ్ || 32
అట్లు చేసి నేను ఈ భూమండలమునందు ఒక మర్యాదను స్థాపించగలను. అది యేదన, మానవులు పుట్టుకతోడనే కామవికారములను పొందకుందురు గాక! (29).
దీని కొరకై నేను పరమ ఉగ్ర తపస్సును చేసి, తరువాత ప్రాణములను విడిచి, మర్యాదను నెలకొల్పగలను (30).
ఏ శరీరమునందు నా తండ్రి, మరియు సోదరులు స్వయముగా కామ వికారమును ప్రదర్శించినారో, అట్టి ఈ శరీరముతో నాకు ప్రయోజనము లేశ##మైననూ లేదు (31).
ఏ శరీరముచే నేను తండ్రి యందు సోదరులయందు కామ వికారమును ఉద్బుద్ధము చేసితినో, ఆ ఈ శరీరము ధర్మసాధనము కాజాలదు (32).
ఇతి సంచింత్య మసా సంధ్యా శైలవరం తతః | జగామ చంద్రభాగాఖ్యం చంద్రభాగాపగా యతః || 33
అథ తత్ర గతాం జ్ఞాత్వా సంధ్యాం గిరివరం ప్రతి | తపసే నియాతాత్మానం బ్రహ్మావోచ మహం సుతమ్ || 34
వశిష్ఠం సంయతాత్మనం సర్వజ్ఞం జ్ఞానయోగినమ్ | సమీపే స్వే సమాసీనం వేద వేదాంగ పారగమ్ || 35
సంధ్య ఇట్లు తలపోసి, తరువాత చంద్ర భాగానదీ తీరము నందు గల చంద్ర భాగపర్వతమునకు వెళ్లెను (33).
అపుడు బ్రహ్మనగు నేను, సంధ్య తపస్సు కొరకు ఆ పర్వత రాజమునకు వెళ్లినదని యెరింగి, నాకుమారుడు (34),
ఇంద్రియనిగ్రహము గల వాడు, సర్వజ్ఞుడు, జ్ఞాన యోగి, వేదవేదాంగముల పారమును చూచిన జ్ఞాని యగు వసిష్ఠుని దగ్గర కూర్చుండ బెట్టుకొని, ఇట్లు పలికితిని (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
20 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 4 🌻
బ్రహ్మో వాచ |
వసిష్ఠ పుత్ర గచ్ఛ త్వం సంధ్యాం జాతాం మనస్వినీమ్ |తపసే ధృతకామాం చ దీక్షసై#్వనాం యథా విధి || 36
మందాక్షమభవత్తస్యాః పురా దృష్ట్వై వ కాముకాన్ | యుష్మాన్మాం చ తథాత్మానం సకామాం మునిసత్తమ || 37
అభూత పూర్వం తత్కర్మ పూర్వం మృత్యుం విమృశ్యసా | యుష్మాకమాత్మనశ్చాపి ప్రాణాన్ సంత్యక్తుమిచ్ఛతి || 38
సమర్యాదేషు మర్యాదాం తపసా స్థాపయిష్యతి | తపః కర్తుం గతా సాధ్వీ చంద్ర భాగాఖ్య భూధరే || 39
న భావం తపసస్తాత సానుజానాతి కంచన | తస్మాద్య థోపదేశాత్సా ప్రాప్నోత్విష్టం తథా కురు || 40
బ్రహ్మ ఇట్లు పలికెను -
పుత్రా! వసిష్టా! అభిమానవతియగు నాకుమార్తె సంధ్య వద్దకు నీవు వెళ్లుము. ఆమె తపస్సును చేయగోరు చున్నది. ఆమెకు యథావిధిగా దీక్షను ఇమ్ము (36).
ఓ మహర్షీ! నన్ను, మిమ్ములను కామ వికారముతో కూడి యుండగా పూర్వము ఆమె చూచి, తాను కూడ కామ వికారమును పొందుటను గాంచి, చాల సిగ్గుపడెను (37).
నా యొక్క, మీ యొక్క ఈ ముందెన్నడూ జరుగని, పాప భావనతో చూచుట అనే కర్మను ఆమె తలపోసి, ప్రాణములను వీడ నిశ్చయించుకున్నది (38).
ఆమె తపస్సుచే లోకములయందు మర్యాదను నెలగొల్ప గలదు. తపస్సును చేయుటకై ఆ సాధ్వి చంద్ర భాగ పర్వతమునకు వెళ్లినది (39).
వత్సా! ఆమెకు తపస్సు ను గురించి ఏమియూ తెలియదు కావున, నీవు ఆమెకు ఉపదేశించి, ఆమెకు హితము కలుగునట్లు ప్రయత్నించుము (40).
ఇదం రూపం పరిత్యజ్య నిజం రూపాంతరం మునే . పరిగృహ్యాంతికే తస్యాస్తపశ్చర్యాం నిదర్శయన్ || 41
ఇదం స్వరూపం భవతో దృష్ట్వా పూర్వం యథాత్ర వామ్ | నాప్నుయాత్సాథ కించిద్వై తతో రూపాంతరం కురు || 42
నారదేత్థం వసిష్టో మే సమాజ్ఞప్తో దయావతా |తథాస్త్వితి చ మాం ప్రోచ్య య¸° సంధ్యాంతికం మునిః || 43
తత్ర దేవ సరః పూర్ణం గుణౖర్మానస సంమితమ్ | దదర్శ స వసిష్ఠోsథ సంధ్యాం తత్తీరగామపి || 44
ఓ మహర్షీ! ఈ నీ నిజరూపమును వీడి, మరియొక రూపమును స్వీకరించి, ఆమె వద్దకు వెళ్లి, ఆమె చేయు తపస్సును పరిశీలించుము (41).
ఆమె నిన్ను ఇచట పూర్వము చూచినది. ఇదే రూపములో నిన్ను చూచినచో, ఆమె ఏదేని వికారమును పొందవచ్చును. కావున రూపమును మార్చుము (42).
ఓ నారదా! నేను ఈ తీరున వసిష్ఠుని దయా బుద్ధితో ఆజ్ఞాపించితిని . ఆయన ' అటులనే యగుగాక' అని నాతో పలికి సంధ్య వద్దకు వెళ్లెను (43).
ఆ వసిష్ఠ మహర్షి అచట గుణములలో అన్ని విధములా మానససరోవరమును పోలియున్న దేవరస్సును, దాని తీరమునందున్న సంధ్యను చూచెను (44).
తీరస్థయా తయా రేజే తత్సరః కమలోజ్జ్వలమ్ | ఉద్యదిందు సునక్షత్రం ప్రదోషే గగనం యథా || 45
మునిర్దృష్ట్వాథ తత్ర సుసంభావం స కౌతుకీ | వీక్షాంచక్రే సరస్తత్ర బృహల్లోహిత సంజ్ఞకమ్ || 46
చంద్రభాగా నదీ తస్మా త్ర్పాకారాద్దక్షిణాంబుధిమ్ | యాంతీ సా చైవ దదృశే తేన సాను గిరేర్మహత్ || 47
నిర్భిద్య పశ్చిమం సా తు చంద్ర భాగస్య సా నదీ | యథా హిమవతో గంగా తథా గచ్ఛతి సాగరమ్ || 48
ప్రదోషకాలమునందు ఉదయించే చంద్రునితో నక్షత్రములతో ఆకాశము నిండియున్నట్లు, ఆ సరస్సు తీరమునందున్న ఆమెతో మరియు కమలములతో నిండి ఉజ్జ్వలముగా ప్రకాశించెను (45).
వసిష్ఠ మహర్షి ఉత్కంఠ గలవాడై గొప్ప నిర్ణయము గల ఆమెనచట దర్శించెను. మరియు అచట బృహల్లోహితమను పేరు గల ఆ సరస్సును చూచెను (46).
ప్రాకారము వలెనున్న ఆ పర్వతమునుండి దక్షిణ సముద్రము వరకు వ్రవహించుచున్న చంద్రభాగా నదిని ఆయన దర్శించెను. ఆనది ఆ పర్వతము యొక్క గొప్ప సానువును (47)
భేదించుకొని, పశ్చిమము వైపునకు ప్రవహించెను. హిమవత్పర్వతము నుండి సముద్రము వైపునకు పయనించే గంగవలె ఆనది శోభిల్లెను (48).
తస్మిన్ గిరౌ చంద్రభాగే బృహల్లోహితతీరగామ్ | సంధ్యాం దృష్ట్వాథ పప్రచ్ఛ వసిష్ఠస్సాదరం తదా || 49
అపుడు ఆ చంద్ర భాగ పర్వతమునందు బృహల్లోహితమనే సరస్సు యొక్క తీరము నందున్న సంధ్యను చూచి, వసిష్ఠుడు ఆ దరముతో నిట్లు ప్రశ్నించెను (49).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
21 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
50. అధ్యాయము - 5
🌻. సంధ్య యొక్క చరిత్ర - 6 🌻
స్నానం మౌనేన కర్తవ్యం మౌనేన హరపూజనమ్ | ద్వయోః పూర్ణజలాహారం ప్రథమం షష్ఠ కాలయోః || 64
తృతీయే షష్ఠకాలే తు హ్యు పవాస పరో భ##వేత్ | ఏవం తపస్సమా ప్తౌ వా షష్ఠే కాలే క్రియా భ##వేత్ || 65
ఏవం మౌనతపస్యాఖ్యా బ్రహ్మ చర్యఫలప్రదా | సర్వా భీష్ట ప్రదా దేవి సత్యం సత్యం న సంశయః || 66
ఏవం చిత్తే సముద్దిశ్య కామం చింతయ శంకరమ్ | స తే ప్రసన్న ఇష్టార్థ మచిరాదేవ దాస్యతి || 67
మౌనముగా స్నానమును చేసి, మౌనముగా శివుని పూజించవలెను. ఆరు ఘడియలు ఒక కాలము అగును.ముందుగా రెండు కాలములయందు పూర్ణముగా నీటిని ఆహారముగా తీసుకొని (64),
మూడవ కాలమునందు ఉపవాసమును చేయవలెను. ఈ తీరున తపస్సు పూర్తి యగు వరకు ఆరవకాలము నందు ఉపవాసము, లేక ఆహారము వచ్చు చుండును (65).
ఓ దేవీ! ఈ తీరున మౌనతపస్యను చేసినచో, బ్రహ్మ చర్య ఫలము లభించుటయే గాక, కోర్కెలన్నియూ ఈడేరును. ఇది ముమ్మాటికీ సత్యము. సంశయము లేదు (66).
ఇట్లు మనస్సులో నిర్ణయించుకొని, యథేచ్ఛగా శంకరుని ధ్యానింపుము. ఆయన ప్రసన్నుడై నీకు శీఘ్రముగా కోరిన ఫలమును ఈయగలడు (67).
బ్రహ్మో వాచ |
ఉపదిశ్య వసిష్ఠోsథ సంధ్యాయై తపసః క్రియామ్ | తామాభాష్య యథాన్యాయం తత్రైవాంతర్దధే మునిః || 68
ఇతి శ్రీ శివ మహాపురాణ ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీ ఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ పంచమోsధ్యాయః (5)
బ్రహ్మ ఇట్లు పలికెను -
వసిష్ఠుడు ఈ తీరున సంధ్యకు తపస్సును చేయవలసిన తీరున యథావిధిగా ఉపదేశించెను. అపుడా ముని అచటనే అంతర్ధనము చెందెను (68).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీ ఖండములో సంధ్యా చరిత్ర వర్ణనమనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
Whatsapp Group
https://chat.whatsapp.com/5LFkJu3UEcQ5Kgx46WRsin
Telegram Group
https://t.me/ChaitanyaVijnanam
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
23 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 1 🌻
బ్రహ్మోవాచ |
సుతవర్య మహాప్రాజ్ఞ శృణు సంధ్యా తపో మహత్ | యఛ్ఛ్రుత్వా నశ్యతే పాపసమూహస్తత్ క్షణాద్ధ్రువమ్ || 1
ఉపదిశ్య తపోభావం వసిష్ఠే స్వగృహం గతే | సంధ్యా పి తపసోభావం జ్ఞా త్వా మోదమవాప హ || 2
తతస్సానందమనసో వేషం కృత్వా తు యాదృశమ్ | తపశ్చర్తుం సమారేభే బృహల్లోహిత తీరగా || 3
యథోక్తం తు వసిష్ఠేన మంత్రం తపసి సాధనమ్ | మంత్రేణ తేన సద్భక్త్యా పూజయామాస శంకరమ్ || 4
బ్రహ్మ ఇట్లు పలికెను -
మహాప్రాజ్ఞ! నీవు నా కుమారులలో శ్రేష్ఠుడవు. సంధ్య యొక్క గొప్ప తపస్సును గురించి వినుము. ఇది విన్నవాని పాపసమూహము వెను వెంటనే నిశ్చితముగా నశించును (1).
తపస్సు యొక్క స్వరూపమును ఉపదేశించి వసిష్ఠుడు తన ఇంటికి వెళ్లెను. సంధ్య తపస్సు స్వరూపము నెరింగి ఆనందించెను (2).
అపుడామె బృహల్లోహిత సరస్సు యొక్క తీరమునందు కూర్చుండి, ఆనందముతో నిండిన మనస్సు గలదై, తపస్సునకు యోగ్యమగు వస్త్రధారణను చేసి తపస్సను చేయుట ఆరంభించెను (3).
తపస్సునందు సాధనముగా వసిష్ఠునిచే ఉపదేశింపబడిన మంత్రముతో ఆమె సద్భక్తి గలదై శంకరుని పూజించెను (4)
ఏకాంతమనసప్తస్యాః కుర్వంత్యా స్సుమహత్త పః | శంభౌ విన్యస్త చిత్తయా గతమేకం చతుర్యుగమ్ || 5
ప్రసన్నోsభూత్తగా శంభుస్తపసా తేన తోషితః |అంతర్బ హిస్తథాకాశే దర్షయిత్వా నిజం వపుః || 6
యాద్రూపం చింత యంతీ సా తేన ప్రత్యక్షతాం గతః | అథ సా పురతో దృష్ట్వా మనసా చింతితం ప్రభుమ్ || 7
ప్రసన్న వదనం శాంతం ముమోదాతీవ శంకరమ్ | ససాధ్వసమహం వక్ష్యే కిం కథం స్తౌమి శంకరమ్ || 8
ఇతి చింతాపరా భూత్వా న్యమీల యత చక్షుషీ |
ఆమె శంభుని యందు చిత్తమును దృఢముగా నిలిపి, ఇతర వ్యాపారములు లేనిదై మిక్కిలి గొప్ప తపస్సను చేయుచుండగా, ఒక మహాయుగ కాలము గడిచి పోయెను (5).
అపుడు శంభుడు ఆ తపస్సు చే సంతసించి, ప్రసన్నుడై, లోపల బయట, మరియు ఆకాశమునందు తన రూపమును ప్రకటించెను (6).
ఆమె ఏ రూపమును ధ్యానించుచుండెనో , అదే రూపముతో ఆయన ప్రత్యక్షమయ్యెను. తాను మనస్సులో ధ్యానించిన ప్రభువును ఆమె తన ఎదుట చూచెను (7).
ప్రసన్నమైన ముఖము గలవాడు, శాంతుడు అగు శంకరుని చూచి ఆమె మిక్కిలి ఆనందించెను. నాకు చాల భయమగు చున్నది. నేనేమి మాటలాడగలను ? శంకరుని ఎట్లు స్తుతించవలెను?(8)
అని ఆమె చింతిల్లి కళ్లను మూసుకొనెను.
నిమీలితాక్ష్యాస్తస్యాస్తు ప్రవిశ్య హృదయం హరః || 9
దివ్యం జ్ఞానం దదౌ తస్యై వాచం దివ్యే చ చక్షుషీ | ప్రత్యక్షం వీక్ష్య దుర్గేశం తుష్టావ జగతాం పతిమ్ || 10
హరుడు కళ్లను మూసుకున్న ఆమె హృదయములో ప్రవేశించి (9)
ఆమెకు దివ్యజ్ఞానమును, దివ్యవాక్కును, దివ్యనేత్రములను ఇచ్చెను. ఆమె జగత్ర్పభువగు పార్వతీపతిని ప్రత్యక్షముగా చూచి ఇట్లు స్తుతించెను (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
25 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 2 🌻
సంధ్యోవాచ |
నిరాకారం జ్ఞానగమ్యం పరం యన్నైవ స్థూలం నాపి సూక్ష్మం న చోచ్చమ్ |
అంతశ్చింత్యం యోగిభిస్తస్య రూపం తసై#్మ తుభ్యం లోకకర్రై నమోsస్తు || 11
సర్వం శాంతం నిర్మలం నిర్వికారం జ్ఞాన గమ్యం స్వప్రకాశేsవికారమ్ |
ఖాధ్వ ప్రఖ్యం ధ్వాంతమార్గా త్పరస్తా ద్రూపం యస్య త్వాం నమామి ప్రసన్నమ్ || 12
ఏకం శుద్ధం దీప్యమానం తథా జం చిదానందం సహజం చావికారి |
నిత్యానందం సత్యభూతి ప్రసన్నం యస్య శ్రీదం రూపమస్మై నమస్తే || 13
గగనం భూర్దిశశ్చైవ సలిలం జ్యోతిరేవ చ |
సంధ్య ఇట్లు పలికెను -
నీవు నిరాకారుడవు. నీ సర్వాతీతమగు తత్త్వము జ్ఞానము చేత మాత్రమే పొందదగును. నీ రూపము స్థూలము గాని, సూక్ష్మముగాని, ఉన్నతముకాని కాదు. యోగులు నీ రూపమును తమ హృదయములో ధ్యానించెదరు. లోకకర్తవగు నీకు నమస్కారము (11).
సర్వవ్యాపకము, శాంతము, దోషరహితము, జ్ఞానముచే పొందదగినది, స్వప్రకాశమునందు వికారములు లేనిది, సంసారమనే తమో మార్గమున కతీతముగా చిదాకాశముందు యోగులకు ప్రసిద్ధమైనది అగు రూపము గల, దయామయుడవగు నీకు నమస్కారము (12).
అద్వయము, శుధ్ధము, ప్రకాశించునది, పుట్టుక లేనిది, చిద్ఘనము, ఆనందఘనము, వికారములు లేనిది, స్వరూప భూతము, శాశ్వతా నందరూపము, సత్యమనే సంపదచే ప్రసన్నమై సంపదలనిచ్చునది అగు రూపము గల నీకు నమస్కారము (13).
ఆకాశము, భూమి, దిక్కులు, నీరు, అగ్ని , కాలము అనునవి నీ రూపములే . అట్టి నీకు నమస్కారము (14).
విద్యాకారో ద్భావనీయం ప్రభిన్నం సత్త్వచ్ఛందం ధ్యేయమాత్మ స్వరూపమ్ |
సారం పారం పావనానాం పవిత్రం తసై#్మ రూపం యస్య చైవం నమస్తే || 15
యత్త్వాకారం శుద్ధ రూపం మనోజ్ఞం రత్నా కల్పం స్వచ్ఛ కర్పూర గౌరమ్ |
ఇష్టాభీతి శూలముండే దధానం హసై#్తర్నమో యోగయుక్తాయ తుభ్యమ్ || 16
ప్రధానపురుషౌ యస్య కాయత్వేన వినిర్గతౌ | తస్మా దవ్యక్తరూపాయ శంకరాయ నమో నమః || 17
యో బ్రహ్మా కురుతే సృష్టిం యో విష్ణుః కురుతే స్థితమ్ |
త్వం పరః పరమాత్మా చ త్వం విద్యా వివిధా హరః |
మిథ్యా జగత్తు కంటె భిన్నమైనది, సత్త్వగుణ ప్రధానమైనది, ప్రత్మగాత్మ కంటె అభిన్నమైనది అగు నీ రూపము జ్ఞానము చేత మాత్రమే తెలియబడును. భక్తులచే ధ్యానింపబడునది, సార భూతమైనది, అలౌకికమైనది, పావనము చేయు తీర్థాలను కూడ పావనము చేయునది అగు రూపముగల నీకు నమస్కారము (15).
నీ రూపము శుద్ధమైనది, మనోహరమైనది, రత్నములచే అలంకరింపబడినది, స్వచ్ఛమగు కర్పూరమువలె తెల్లనైనది. చేతులతో అభయవరదముద్రలను, శూలమును, కపాలమును ధరించిన యోగీశ్వరుడవగు నీకు నమస్కారము (16).
ఎవని శరీరమునుండి ప్రధానము, పురుషుడు ఉద్భవించినవో, అట్టి ఇంద్రియ గోచరము కాని రూపము గల శంకరునకు అనేక నమస్కారములు (17).
బ్రహ్మ రూపములో సృష్టిని, విష్ణు రూపములో స్థితిని, రుద్ర రూపములో సంహారమును చేయు నీకు అనేక నమస్కారములు (18).
నీవు సర్వశ్రేష్ఠుడవు. పరమాత్మవు. వివిధ విద్యలు నీ స్వరూపమే నీవు హరుడవు. జ్ఞానముచేత మాత్రమే లభ్యమయ్యే సద్ఘనుడగు పరబ్రహ్మ నీవే (19),
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
26 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 3 🌻
నమో నమః కారణకారణాయ దివ్యామృత జ్ఞాన విభూతిదాయ |
సమస్తలో కాంతర భూతిదాయ ప్రకాశరూపాయ పరాత్పరాయ || 20
యస్యాsపరం నో జగదు చ్యతే పదాత్ క్షితిర్దిశస్సూర్య ఇందు ర్మనోజః |
బహిర్ముఖా నాభితశ్చాంతరింక్షం తస్మై తుభ్యం శంభవే మే నమోsస్తు || 21
యస్య నాదిర్న మధ్యం చ నాంతమస్తి జగద్యతః |
సర్వకారణకారుణుడు, దివ్యమగు అమృతము వంటి జ్ఞాన సంపదను ఇచ్చువాడు, ఇతర పుణ్యలోకములలో కూడా సంపదనిచ్చువాడు, ప్రకాశస్వరూపుడు, పరాత్పరుడు అగు నీకు నమస్కారము (20).
భూమి, దిక్కులు, సూర్య చంద్రులు, మన్మథుడు ఇత్యాది జగత్తు శివుని కంటె భిన్నముగా లేదని శాస్త్రము బోధించుచున్నది. అంతర్ముఖులే గాక, బహిర్ముఖులు కూడా ఆయన స్వరూపమమే. ఆయన నాభినుండి అంతరిక్షము ఉదయించినది. హే శంభో! అట్టి నీకు నా నమస్కారము (21).
ఎవనికి ఆదిమధ్యాంతములు లేవో, ఎవని నుండి జగత్తు పుట్టినదో అట్టి, వాక్కునకు మనస్సునకు గోచరము కాని ఆ దేవుని శివుని నేను ఎట్లు స్తుతించగలను? (22).
యస్య బ్రహ్మాదయో దేవా మునయశ్చ తపోధనా ః |
స్త్రి యా మయా తే కింజ్ఞేయా నిర్గుణస్య గుణాః ప్రభో |
నమస్తుభ్యం మహేశాన నమస్తుభ్యం తపోమయ |
ఎవని రూపములను బ్రహ్మాది దేవతలు, తపోనిష్ఠులగు మునులు కూడ వర్ణింపజాలరో అట్టి రూపములను నేనెట్లు వర్ణించగలను ? (23).
హే ప్రభూ! ఎవని రూపమును ఇంద్రాది దేవతలు, రాక్షసులు కూడ తెలియ జాలరో, ఇట్టి నిర్గుణుని గుణములను స్త్రీనగు నేనెట్లు తెలియగలను? (24).
ఓ మహేశ్వరా! నీకు నమస్కారము. తపస్స్వరూపుడవగు హే శంభో! నీకు నమస్కారము. నాపై దయచూపుము. హే దేవదేవా! నీకు అనేక నమస్కారములు (25).
బ్రహ్మోవాచ |
ఇత్యాకర్ణ్య వచస్తస్యా స్సంస్తుతః పరమేశ్వరః |
అథ తస్యాశ్శరీరం తు వల్కలాజిన సంయుతమ్ |
హిమానీ తర్జితాం భోజసదృశం వదనం తదా |
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఆమె చేసిన ఈ స్తుతిని విని పరమేశ్వరుడు, భక్తవత్సలుడు అగు శంకరుడు మరింత ప్రసన్నుడాయెను (26).
ఆమె శరీరముపై నార బట్టను, మృగచర్మమును ధరించి యుండెను. పవిత్రమగు ఆమె శిరస్సుపై కేశములు జడలు కట్టి ప్రకాశించెను (27).
ఆమె ముఖము మంచు దెబ్బకు వాడిపోయిన పద్మమువలె నుండెను. ఆమెను చూచి దయ కలిగిన హరుడు ఆమెతో నిట్లనెను (28).
మహేశ్వర ఉవాచ |
ప్రీతాస్మి తపసా భ##ద్రే భవత్యాః పరమేణ వై |
యేన తే విద్యతే కార్యం వరేణాస్మిన్మనోగతమ్ |
మహేశ్వరుడిట్లు పలికెను -
హే భద్రే! నీవు చేసిన గొప్ప తపస్సు చేత, స్తోత్రముచే త నేను ప్రీతుడనైతిని. ఓ శుభకరమగు బుధ్ధి గలదానా! ఇపుడు వరమును కోరుకొనుము (29).
నీ మనస్సులో నున్న కార్యసిద్ధిని నేను కలిగించెదను. వరమునిచ్చెదను. నీకు మంగళమగు గాక ! నీ వ్రతములచే నేను ప్రసన్నుడనైతిని (30).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
27 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 4 🌻
బ్రహ్మోవాచ |
ఇతి శ్రుత్వా మహేశస్య ప్రసన్న మనసస్తదా |
బ్రహ్మ ఇట్లు పలికెను -
అపుడు ప్రసన్నమగు మనస్సు గల మహేశ్వరుని ఈ మాటను విని, సంధ్య మిక్కిలి ఆనందించి, అనేక పర్యాయములు ప్రణమిల్లి ఇట్లు పలికెను (31).
సంధ్యోవాచ |
యది దేయో వరః ప్రీత్యా వరయోగ్యాస్మ్యహం యది |
యది దేవ ప్రసన్నోsసి తపసా మమ సాంప్రతమ్ |
ఉత్పన్న మాత్రా దేవేశ ప్రాణినోస్మిన్న భస్థ్సలే |
యద్ధి వృత్తా హి లోకేషు త్రిష్వసి ప్రథితా యథా |
సంధ్య ఇట్లు పలికెను -
ఓ మహేశ్వరా! ప్రీతితో వరము నిచ్చే పక్షములో, నేను వరమునకు యోగ్యురాలను అయినచో, నేను ఆ పాపమునుండి శుద్ధురాలను అయినచో (32),
హే దేవా! నా ఈ తపస్సునకు నీవు ప్రసన్నుడవైనచో, నాకు దీనిని మొదటి వరముగా నీయవలెను (33).
హే దేవదేవా! ఈ జగత్తులో సమస్త ప్రాణులు పుట్టుక తోడనే కామము గలవి గా పుట్టకుండుగాక! (34).
జరిగిన వత్తాంతము ముల్లోకములలో ప్రసిద్ధి చెంది నేను అపకీర్తిని పొందకుండునట్లు అనుగ్రహించుడు. ఇది నేను కోరు వరములలో ఒకటి (35).
సకామా మమ దృష్టిస్తు కుత్ర చిన్న పతిష్యతి |
యో ద్రక్ష్యతి సకామో మాం పురుషస్తస్య పౌరుషమ్ |
ఏ వ్యక్తిపైననూ కామముతో గూడిన నా చూపు పడకుండుగాక! హేనాథా! నాకు భర్తయగు వ్యక్తి నాకు మంచి మిత్రుడై ఉండవలెను (36).
నన్ను కామముతో చూచు వ్యక్తి యొక్క పురుషత్వము నశించి, వాడు నపుంసకుడు కావలెను (37).
బ్రహ్మోవాచ |
ఇతి శ్రుత్వా వచస్తస్యా శ్శంకరో భక్తవత్సలః |
బ్రహ్మ ఇట్లు పలికెను -
భక్త వత్సలుడగు శంకరుడు సర్వపాపవినిర్ముక్తురాలగు ఆమె పలుకులు విని మిక్కిలి ప్రసన్నమైన మనస్సు గలవాడై ఇట్లు పలికెను (38).
మహేశ్వర ఉవాచ |
శృణు దేవి చ సంధ్యే త్వం త్వత్పాపం భస్మతాం గతమ్ |
యద్యద్వృతం త్వయా భ##ద్రే దత్తం తదఖిలం మయా |
ప్రథమం శైశవో భావః కౌమారాఖ్యో ద్వితీయకః |
తృతీయే త్వథ సంప్రాప్తే వయో భాగే శరీరిణః |
మహేశ్వరుడిట్లు పలికెను -
ఓ సంధ్యాదేవీ!వినుము. నీ పాపము నశించినది. నీవు తపస్సును చేసి శుద్ధురాలవైతివి. నీపై గల కోపమును నేను వీడితిని (39).
ఓ మంగళస్వరూపులారా! సంధ్యా! నీ తపస్సు చేత, మరియు వరముల చేత నేను మిక్కిలి ప్రసన్నుడనైతిని నీవు కోరిన వరములనన్నిటినీ నేను ఇచ్చితిని (40).
మానవులు ముందుగా శైశవము , తరువాతరెండవదియగు కౌమారము, మూడవదియగు ¸°వనము, నాల్గవదియగు వార్ధకము అను దశలను క్రమముగా పొందెదరు (41).
ప్రాణులు మూడవది యగు ¸°వనమును పొందినప్పుడు కామ భావనను కలిగియుందురు. కొన్ని సందర్భములలో రెండవది యగు కౌమారావస్థ అంతములో కూడా వారు సకాములు కావచ్చును (42).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
28 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 5 🌻
తపసా తవ మర్యాదా జగతి స్థాపితా మయి |
త్వం చ లోకే సతీభావం తాదృశం సమవాప్నుహి |
యః పశ్యతి సకామస్త్వాం పాణి గ్రాహమృతే తవ |
పతిస్తవ మహాభాగస్తపోరూపసమన్వితః |
ప్రాణులు పుట్టుక తోడనే కామభావన గలవారు కాకుండుగాక! అను మర్యాదను నేను నీ తపస్సునకు మెచ్చి, లోకములో స్థాపించుచున్నాను (43).
ముల్లోకములలో ఇతర స్త్రీల కెవ్వరికీ లేని పాతివ్రత్య భావమును నీవు పొందుము (44).
నిన్ను చేపట్టిన నీ భర్త తక్క , ఇతరులెవరైననూ నిన్ను కామముతో చూచినచో, అట్టి వ్యక్తి వెంటనే నపుంసకుడై దుర్బలుడగును (45).
నీ భర్త మహాత్ముడు, తపశ్శాలి, రూపము గలవాడు అగును. నీభర్త నీతో గూడి ఏడు కల్పములు పూర్తి యగు వరకు జీవించును (46).
ఇతి తే యే వరా మత్తః ప్రార్థితాస్తే కృతా మయా |
అగ్నౌ శరీరత్యాగస్తే పూర్వమేవ ప్రతిశ్రుతః |
స చ మేధాతిథిర్యజ్ఞే మునిః ద్వా దశవార్షికే |
ఏత చ్ఛైలోపత్యకాయాం చంద్ర భాగానదీ తటే |
ఈ తీరున నేను నీవు కోరిన వరములనన్నిటినీ ఇచ్చితిని. పూర్వజన్మలో జరిగిన వృత్తాంతము నొకదానిని నీకిప్పుడు చెప్పెదను (47).
నీవు అగ్నిలో శరీరమును విడువవలెననని పూర్వమే ప్రతిజ్ఞను చేసితివి. నేను ఆవిషయములో ఒక ఉపాయమును చెప్పెదను. నీవు దానిని తప్పక అమలు చేయుము (48) .
మేధాతిథియను మహర్షి పన్నెండు సంవత్సరముల యజ్ఞమును చేయుచున్నాడు . నీవు తొందరలో అచట చక్కగా ప్రజ్వరిల్లిన అగ్నియందు దేహమును వీడుము (49).
ఈ పర్వత సమీప భూమియందు చంద్ర భాగానదీ తీరములోని ఒక తాపసాశ్రమములో మేధాతిథి ఆ మహా యజ్ఞమును చేయుచున్నాడు (50).
తత్ర గత్వా స్వయం ఛందం మునిభిర్నో పలక్షితా |
యస్తే వరో వాంఛనీయ స్స్వామీ మనసి కశ్చన |
యదా త్వం దారుణం సంధ్యే తపశ్చరసి పర్వతే |
త్రేతాయాః ప్రథమే భాగే జాతా దక్షస్య కన్యకాః |
నీవు నీ ఇచ్ఛననుసరించి అచటకు వెళ్లుము. నా అనుగ్రహముచే నీవు మునులకు కానరావు. నీవు అగ్ని హోత్రమునుండి జన్మించి, అతని పుత్రివి కాగలవు (51).
నీ మనస్సు లో నీకు నచ్చిన ప్రియుని స్మరించుచూ నీ దేహమును అగ్ని యందు వీడుము (52).
ఓ సంధ్యా! నీవీ పర్వతమునందు ఒక మహా యుగ కాలము ఘోరతపస్సును చేసితివి. ఆ సమయములో కృతయుగము గడచెను (53).
అపుడు త్రేతాయుగములోని మొదటి పాదములో దక్షునకు అనేక కన్యలు జన్మించిరి. వారు మిత భాషిణులు. మరియు శీలము గలవారు. దక్షుడు వారికి యథోచితముగా వివాహములను చేసెను (54).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
30 Sep 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
51. అధ్యాయము - 6
🌻. సంధ్య తపస్సును చేయుట - 6 🌻
తన్మధ్యే స దదౌ కన్యా విధవే సప్తవింశతిః |
తద్ధేతోర్హి యదా చంద్రశ్శప్తో దక్షేణ కోపినా |
న దృష్టాశ్చ త్వయా సంధ్యే తే దేవా బ్రహ్మాణా సహ |
చంద్రస్య శాపమోక్షార్థం జాతా చంద్రనదీ తదా |
ఆ కన్యలలో ఇరవై ఏడు మందిని ఆయన చంద్రునకిచ్చి వివాహము చేసెను. చంద్రుడు ఇతరభార్యలను పట్టించుకొనక, రోహిణి యందు మాత్రమే ప్రీతిని కలిగియుండెను (55). ఆ కారణముచే దక్షుడు కోపించి చంద్రుని శపించగా దేవతలందరు నీవు ఉన్న ఈ చోటకు వచ్చిరి (56)
ఓ సంధ్యా!బ్రహ్మతో కూడి వచ్చిన ఆ దేవతలను నాయందు లగ్నమైన మనస్సుగల నీవు చూడలేదు. బ్రహ్మ ఆకసమును చూచి, చంద్రుడు తన పూర్వ రూపమును ఎట్లు పొందునో యని చింతిల్లెను (57).
బ్రహ్మ చంద్రుని శాపవిముక్తి కొరకు చంద్రభాగానదిని సృష్టించెను. అదే సమయములో అచటకు మేధాతిథి విచ్చేసెను | (58).
తపసా తత్సమో నాస్తి న భూతో న భవిష్యతి |
తత్ర ప్రజ్వలితో వహ్నిస్తస్మింస్త్యజ వపుస్స్వకమ్ |
ఏతన్మయా స్థాపితం తే కార్యార్థం భో తపస్విని |
తస్యా హితం చ దేవేశస్తత్రై వాంతరధీయత || 62
ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం ద్వితీయే సతీఖండే సంధ్యా చరిత్ర వర్ణనం నామ షష్ఠోsధాయః (6).
తపస్సులో ఆయనతో సమానమైన వాడు మరియొకడు లేడు. ఉండబోడు. ఆయన అతివిస్తృతమైన జ్యోతిష్టోమమనే యజ్ఞమునారంభించినాడు (59).
అచట అగ్ని ప్రకాశించుచున్నది. నీవు నీ దేహమును దానియందు విడువుము. ఇప్పుడు నీవు మిక్కిలి పవిత్రురాలవు. నీ ప్రతిజ్ఞ నెరవేరుగాక! (60).
ఓ తపస్వినీ! ఈ తీరున నేను నీ కార్యములను సిద్దింపజేసితిని. ఓ మహాత్మురాలా!నేను చెప్పినట్లు చేయుము. ఆ మహాముని యజ్ఞము చేయుచున్న చోటకు వెళ్లుము (61).
ఇట్లు దేవదేవుడు ఆమెకు హితమునుపదేశించి అచటనే అంతర్ధానము నొందెను (62).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవది యగు సతీఖండమునందు సంధ్యా చరిత్ర వర్ణనమనే ఆరవ అధ్యాయము ముగిసినది (6).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
02 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
52. అధ్యాయము - 7
🌻. అరుంధతి 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! శంభుడు వరములనిచ్చి అంతర్ధానము కాగానే, సంధ్య మేధాతిథి మహర్షి ఉన్న స్థానమునకు వెళ్లెను (1).
శంభుని అనుగ్రహముచే ఆమె ఎవ్వరికీ కానరాలేదు. ఆమె తనకు తపస్సు చేయు విధానమునుపదేశించిన బ్రహ్మచారిని స్మరించెను (2).
ఓ మహర్షీ! పూర్వము బ్రహ్మ గారి ఆదేశముచే వసిష్ఠుడు బ్రహ్మచారి రూపములో ఆమెకు తపస్సు చేయు విధానమునుపదేశించెను (3).
తపస్సు చేయు విధమును ఉపదేశించిన ఆ బ్రాహ్మణ బ్రహ్మ చారిని ఆమె మనస్సులో భర్తగా స్వీకరించెను (4).
ఆ మహాయజ్ఞములో ప్రజ్వరిల్లుచున్న అగ్నియందు బ్రహ్మమానస పుత్రికయగు సంధ్య మునులకు కానరానిదై ఆనందముతో ప్రవేశించెను (5).
పురోడాశరూపముగా సమర్పింపబడిన ఆమె దేహము తత్ క్షణమే దగ్ధమై పురోడాశ గంధము సర్వత్రా వ్యాపించెను. ఈ గంధమునకు హేతువు ఎవ్వరికీ తెలియలేదు (6).
అగ్ని శివుని ఆజ్ఞచే ఆమె శరీరమును దహించి, శుద్ధమగు సూక్ష్మశరీరమును సూర్యమండలమునందు ప్రవేశపెట్టెను (7).
సూర్యుడు ఆమె శరీరమును రెండుగా విభజించి, పితరులకు దేవతలకు ప్రీతిని కలిగించుట కొరకై తన రథమునందు స్థాపించెను (8).
ఓ మహర్షీ! ఆమె శరీరము యొక్క పై భాగము రాత్రికి పగటికి మధ్య లో నుండే ప్రాతస్సంధ్య అయెను (9).
ఆమె యొక్క మిగిలిన భాగము సదా పితృదేవతలకు ప్రీతినీ కలిగించునది, పగటికి రాత్రికి మధ్యలో నుండునది యగు సాయం సంధ్య ఆయెను (10).
సూర్యుని ఉదయమునకు ముందుగా అరుణుడు ఉదయించును. ఆ సమయములోనే దేవతలకు ప్రీతిని కలిగించే ప్రాతస్సంధ్య ఉదయించును (11).
ఎర్రని పద్మమును పోలు సూర్యుడు అస్తమించగానే, పితృదేవతల కానందమునిచ్చు సాయంసంధ్య ఉదయించును (12).
అపుడు దయాళువగు శంభుడు ఆమె ప్రాణములను మనస్సుతో కలిపి స్థూల శరీరముగల దేహి యొక్క దివ్యమగు సూక్ష్మ శరీరముగా నిర్మాణము చేసెను (13).
యజ్ఞము పూర్తి కాగానే ఆ మహర్షి అగ్ని మధ్యము నుండి పుటము పెట్టిన బంగారము వలె వెలిగిపోవుచున్న కుమార్తెను పొందెను (14).
ఆ మహర్షి ఆనందముతో గూడినవాడై ఆ కుమార్తెను స్వీకరించెను. ఓ మహర్షీ! ఆయన ఆమెను యజ్ఞము కొరకై స్నానము చేయించి తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను (15).
ఆ మహర్షి ఆమెకు అరుంధతి అను పేరు పెట్టి, తన శిష్యులతో గూడి మిక్కిలి ఆనందించెను (16).
ఆమె ఏ కారణము చేతనైననూ ధర్మమునకు అడ్డు పడదు. అందువలననే, ఆమె ముల్లోకములలో అరుంధతియను అన్వర్థనామమును పొందెను (17).
ఆ మహర్షి యజ్ఞమును పూర్తి గావించి, కుమార్తెను పొంది, సంపదలతో కూడినవాడై తనను తాను కృతార్థునిగా భావించెను. ఓ దేవర్షీ! ఆయన తన ఆశ్రమములో తన శిష్యులతో గూడిన ఆమెను అన్నివేళలా లాలించి పాలించుచూ గడిపెను (18).
అపుడా దేవి చంద్రభాగా నదీ తీరమునందు గల, తాపసారణ్యము అను పేరగల, ఆ మహర్షి యొక్క ఆశ్రయములో పెరిగెను (19).
ఆ సాధ్వి అయిదవ ఏడు వచ్చునాటికి తన గుణములచే చంద్ర భాగా నదిని, తాప సారణ్యమును కూడ పవిత్రము గావించెను(20).
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ అరుంధతికి బ్రహ్మ కుమారుడగు వసిష్ఠునితో పరిణయమును గావించిరి (21).
ఓ మునీ! ఆ వివాహములో సుఖమును వృద్ధి పొందించు గొప్ప ఉత్సవము ప్రవర్తిల్లెను. అందరు దేవతలు, మరియు ఋషులు ఆనందించిరి (22).
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల హస్తముల నుండి జారిన నీటి నుండి పరమపావనములైన శిప్రా మొదలగు ఏడు నదులు పుట్టెను (23).
ఓ మహర్షీ! సాధ్వీ మణులలో కెల్లా శ్రేష్ఠురాలు, మేధాతిథియొక్క కుమార్తె యగు అరుంధతి వసిష్ఠుని వివాహమాడి శోభిల్లెను (24).
ఓ మునిశ్రేష్ఠులారా! వసిష్ఠుని భర్తగా పొందిన ఆమెకు శ్రేష్ఠులు, పుణ్యాత్ములు అగు శక్తి మొ దలగు కుమారులు కలిగిరి (25).
ఓమహర్షీ! పవిత్రము , పావనము, దివ్యము, కోర్కెలన్నిటినీ ఈడేర్చునది అగు సంధ్యా వృత్తాంతమును నేను నీకు చెప్పితిని (26).
స్త్రీ గాని, పురుషుడు గాని పవిత్రమగు నిష్ఠతో ఈ గాథను విన్నచో, వారి కోర్కెలన్నియూ సిద్ధించుననుటలో సందియము లేదు (27).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండయందు ఏడవ అధ్యాయము ముగిసినది (7).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
03 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
53. అధ్యాయము - 8
🌻. వసంతుడు - 1 🌻
సూతుడు ఇట్లు పలికెను -
ప్రజాపతి యగు బ్రహ్మ యొక్క ఈ మాటలను విని ప్రసన్నమగు మనస్సు గలవాడై ఆ నారదుడిట్లనెను (1).
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! నీవు విష్ణుని శిష్యుడవు. మహా ప్రాజ్ఞుడవు. శివభక్తుడవు అగు నీవు ధన్యుడవు. నీవు పరమాత్మ తత్త్వమును కళ్లకు కట్టినట్లు చెప్పగలవు (2).
అరుంధతి గాథను, ఆమె పూర్వజన్మ వృత్తాంతముతో సహా వినిపించితివి. ఈ దివ్య గాథ శివభక్తిని వర్ధిల్లజేయును (3).
ఓ ధర్మజ్ఞా! పవిత్రము, శ్రేష్ఠము, మహాపాపములను పోగొట్టునది, మంగళములనిచ్చునది, ఉత్తమమైనది అగు శివచరితమును ఇప్పుడు చెప్పుము (4).
మన్మథుడు వివాహమాడి ఆనందించగా, వారందరూ తమ స్థానములకు వెళ్లగా, సంధ్య తపస్సు కొరకు వెళ్లగా, అప్పుడు ఏమైనది?(5).
సూతుడిట్లు పలికెను -
పవిత్రమగు అంతఃకరణము గల ఆ ఋషి యొక్క మాటను విని, బ్రహ్మ అత్యంత ప్రసన్నుడై ఇట్లు పలికెను (6).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ విప్రశ్రేష్ఠా! నారదా! శివుని లీలలతో గూడిన ఆ శుభచరితమును భక్తితో వినుము. శివుని సేవకుడవగు నీవు ధన్యుడవు (7).
వత్సా! పూర్వము శివుడి అంతర్ధానము కాగానే నేను మోహమును పొంది, ఆ శివుని వాక్యములనే విషముచే పీడింపబడి సర్వదా చింతిల్లెడివాడను (8).
శివుని మాయచే మోహితుడనైన నేను చిరకాలము మనస్సులో చింతిల్లి శివుని యందు ఈర్ష్యను పొందితిని. ఆ వృత్తాంతమును చెప్పెదను వినుము (9).
అపుడు నేను దక్షాదులు ఉన్న చోటకు వెళ్లితిని. అచట రతితో గూడియున్న మన్మథుని చూచి నేను కొంత గర్వమును పొందితిని (10).
ఓ నారదా! శివుని మాయచే మోహితుడనైన నేను దక్షుని, ఇతర కుమారులను మిక్కిలి ప్రీతితో పలకరించి, ఈ మాటలను పలికితిని (11).
బ్రహ్మ ఇట్లు పలికెను -
హే దక్షా! ఓ మరీచ్యాది కుమారులారా! నా మాటను వినుడు. విని నా కష్టమును దీర్చే ఉపాయము నాచరింపుడు (12).
నేను కాంతయందు అభిలాషను మాత్రమే ప్రకటించగా, అది చూచి, శంభుడు నిందించెను. మహాయోగి యగు శివుడు నన్ను మిమ్ములను బహువిధముల ధిక్కరించి నాడు (13).
ఆ కారణముచే నేను దుఃఖముతో వేగుచున్నాను. నాకెచ్చటనూ సుఖము లభించుట లేదు. ఆయన స్త్రీని వివాహమాడునట్లు మీరు యత్నించవలెను (14).
ఆయన స్త్రీని చెట్టబట్టిన నాడు నేను దుఃఖమును వీడి సుఖమును పొందెదను. కాని, విచారించి చూచినచో, ఈ నా కోరిక తీరేది కాదని తలంచెదను (15).
నేను ఒక స్త్రీని చూచి అభిలాషను మాత్రమే పొందితిని. అది చూచి శంభుడు నన్ను మునుల యెదుట గర్హించినాడు.ఆయన స్త్రీని ఏల గ్రహించును?(16).
ఆయన మనస్సులో ప్రవేశించి, యోగమార్గములో నుండు ఆయన మనస్సును చలింపజేసి, ఆయనకు మోహమును కలిగించగల స్త్రీ ఈ ముల్లోకములలో ఎవరేని గలరా?(17)
యోగీశ్వరుడగు ఆయనను మోహింప జేయుటలో మన్మథుడు కూడా సమర్థుడు కాజాలడు. ఆయన స్త్రీల పేరును గూడ సహించడు (18).
ఆది కారణుడగు శివుడు మన్మథుని బాణముల ప్రభావమును తిరస్కరించినచో, మధ్యమ సృష్టి ప్రథమ సృష్టి వలె నిరాటంకముగా ఎట్లు కొనసాగగలదు?(19).
భూలోకములో కొందరు మహాసురులు మాయచే బంధింపబడుచున్నారు. కొందరు హరిమాయచే, మరికొందరు శివుని మాయచే ఉపాయముగా బంధింపబడుదురు (20).
సంసారమునందు విముఖుడు, మహా విరాగి అగు శంభుని యందు ఈ మోహమును కలిగించుట అను పనిని మనము తప్ప మరియొకరు చేయజాలరు. దీనిలో సందేహము లేదు (21).
నేను దక్షుడు మొదలగు నా కుమారులతో నిట్లు పలికి, రతితో గూడియున్న మదనుని అచట గాంచి, సంతసించినవాడనై ఇట్లు పలికితిని (22).
ఓ కామా! నీవు నా పుత్రులలో శ్రేష్ఠుడవు. నీవు అన్ని విధములా సుఖమును ఇచ్చువాడవు. తండ్రియందు ప్రేమగల ఓ కామా! నీవు నీ భార్యతో గూడి నా మాటను ప్రీతితో వినుము (23).
హే మన్మథ! నీవీ భార్యతో గూడి ప్రకాశించుచున్నావు. ఈమె కూడ భర్తవగు నీతో గూడి మిక్కిలి ప్రకాశించుచున్నది (24).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
04 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
53. అధ్యాయము - 8
🌻. వసంతుడు - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
హరి లక్ష్మితో, లక్ష్మి హరితో, రాత్రి చంద్రునితో, చంద్రుడు రాత్రితో ప్రకాశించినట్లుగా (25),
మీరిద్దరు కూడా అటులనే శోభిల్లుచున్నారు. మీ దాంపత్యము శ్లాఘనీయము. కావున నీవు ఈ జగత్తునకు అధినాయకుడవు కాగలవు (26).
హే వత్సా! నీవు జగత్తునకు మేలుగోరి, శివుని మోహింపజేసి, ఆయన ప్రనన్నమగు మనస్సుతో భార్యను శీఘ్రముగా స్వీకరించునట్లు చేయుము (27).
శివుడు ఏకాంతమైన సుందరప్రదేశమునకు గాని, పర్వతమునకు గాని, సరస్సునకు గాని, ఇతర స్థలములకు గాని ఎచటకు వెళ్లిననూ, నీవు ఈమెతో కూడి వెంబడించుము (28).
ఆత్మనిగ్రహము కల్గి స్త్రీ విముఖుడైయున్న ఈ శివునినీవు మోహింపజేయుము. ఆయనను మోహింపజేయగల వ్యక్తి నీవు తక్క మరియొకరు లేరు (29).
హే మన్మథా! శివుడు అనురాగము కలవాడైనచో, నీశాపమునకు కూడ ఉపశాంతి కలుగును. కావున, నీవు నీ హితమును గోరి అట్లు చేయుము (30).
మహేశ్వరుడు దయాళువగు దైవము. ఆయన ఒక సుందరి యందు అనురాగమును పొందినచో, నిన్ను గూడ తరింపజేయగలడు (31).
కావున, నీవు భార్యతో గూడి శివుని మోహింపజేయుటకై యత్నించుము. మహేశ్వరుని మోహింపజేసి, నీవు జగత్తునకు నాయకుడవు కమ్ము (32).
జగత్ర్పభువు, తండ్రియగు నా ఈ మాటలను విని మన్మథుడు నాతో ఈ సత్యవాక్యమును పలికెను (33).
మన్మథుడిట్లు పలికెను -
హే విభో! నీ మాటను బట్టి నేను శంభుని మోహింపజేసెదను. కాని, నా మహాస్త్రము స్త్రీ. కాన, హే భగవన్! ,అట్టి స్త్రీని సృష్టింపుము (34).
నేను ముందుగా శంభుని మోహింపజేసిన తరువాత ఆమె ఆయనను మరల మోహింపజేయ వలయును. హే బ్రహ్మన్! కావున ఇపుడీ విషయములో చక్కని ఉపాయమును చేయుము (35).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మన్మథుడు ఇట్లు పలుకగా, ప్రజాపతియగు నేను 'ఈ శివుని సమ్మోహింపజేయగల స్త్రీ ఎవరు గలరు?' అను చింతను పొందితిని (36).
ఇట్లు చింతిల్లు చున్న నాయొక్క నిశ్శ్వాసనుండి వసంతుడు పుట్టెను. అతడు పుష్పమాలలచే అలంకరింపబడి (37),
ఎర్రని పద్మము వలె భాసించెను. ఆతని కన్నులు వికసించిన పద్మముల వలె నుండెను అందమగు ముక్కు గల ఆతడు సంధ్యా కాలముందు ఉదయించిన పూర్ణ చంద్రుని వంటి ముఖమును కలిగియుండెను (38).
ఆతని పాదముల క్రింద ధనస్సు ఆకారముగల రేఖలు ఉండెను. ఆతని శిరోజములు నల్లగా వంకరలు తిరిగి యుండెను. సంధ్యాకాలమందలి సూర్యుని వలె నున్న అతని ముఖము రెండు కుండలములతో అలంకరింపబడెను (39).
బలిసిన పొడవైన బాహువులు, ఎతైన భూజములు గల ఆతడు మదించిన ఏనుగువలె మందగమనమును కలిగి యుండెను. ఆతని మెడ శంఖమును పోలి యుండెను. అతని వక్షస్థ్సలము మిక్కిలి విశాలముగ నుండెను. ఆతని ముఖము మంచి ఆరోగ్యముతో భాసిల్లెను (40).
సర్వాంగ సుందరుడు, శ్యామవర్ణము కలవాడు, సర్వలక్షణములతో సంపూర్ణమైనవాడు, మిక్కిలి సుందరుడునగు ఆతడు అందరిని మోహింపజేయుచూ, కామమును వృద్ధి పొందించును (41).
పుష్పములకు ఆశ్రయమగు ఇట్టి వసంతుడు, పుట్టగానే, సుగంధభరితమగు వాయువు వీచెను. చెట్లన్నియూ పుష్పములతో నిండెను (42).
మధురమగు శబ్దమును చేసే వందలాది కోయిలలు పంచమస్వరముతో కూడినవి. స్వచ్ఛమగు నీటితో కూడిన సరస్సులలో పద్మములు వికసించెను (43).
అట్టి ఉత్తముడగు వసంతుని పుట్టుకనుచూడగానే, హిరణ్యగర్భుడనగు నేను మదనునితో మధురమగు ఈ మాటను పలికితిని (44).
హే మన్మథా! నీతో సమానమైన ఈతడు నీకు తోడుగా నుండి సర్వమును నీకు అనుకూలముగా చేయగలడు (45).
అగ్నికి వాయువు సర్వత్రా మిత్రుడై ఉపకరించు తీరున, ఈతడు నీకు మిత్రుడై సదా నిన్ను అనుసరించి ఉండగలడు (46).
ప్రసన్న చిత్తుల ప్రసన్నతను అంతమొందించువాడు గనుక ఈతనికి వసంతుడను పేరు కలుగుగాక! సర్వదా నిన్ను అనుసరిస్తూ లోకములను రంజింపజేయుట ఈతని కర్తవ్యము (47).
ఈ వసంతుడు, వసంతకాలములో నుండే మలయవాయువు సదా నీకు వశవర్తులై నీయందు స్నేహభావమును కలిగియుందురు (48).
భావ ప్రకటనము, హావభావములు, అరువది నాలుగు కళలు మొదలగునవి కూడ నీకు సహకరించును. వీరు నీకు స్నేహితులైనట్లే రతికి కూడా స్నేహితులుగ నుండగలరు (49).
ఇతి శ్రీ శివ మహాపురాణే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సతీ చరిత్రే ద్వితీయే సతీఖండే వసంత స్వరూపవర్ణనం నామాష్టమోsధ్యాయః (8).
హే మన్మథా! నీవు వసంతుడు మొదలగు సహచరులతో, మరియు రతీదేవితో గూడినవాడవై ఈ గొప్ప కార్యమును ఉత్సాహముతో చేపట్టి మహాదేవుని మోహింపజేయుము (50).
వత్సా! హరుని మోహింప జేయగల సుందరిని గూర్చి బాగుగా ఆలోచించి ప్రయత్నపూర్వకముగా సృష్టించగలను (51).
దేవనాయకుడనగు నేను ఇట్లు పలుకగా, కాముడు చాల సంతసించి, భార్యతో గూడి అపుడు నా పాదములకు నమస్కరించెను (52).
మన్మథుడు దక్షునకు, ఇతర బ్రహ్మమానసపుత్రులందరికీ నమస్కరించి, శంభుడు వెళ్లిన స్థానమునకు పయనమయ్యెను (53).
శ్రీ శివ మహాపురాణములో రెండవది యగు రుద్ర సంహితయందు రెండవదియగు సతీఖండములో వసంతస్వరూపవర్ణనమనే ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (8).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణం
WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
05 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
54. అధ్యాయము - 9
🌻. మారగణములు - 1 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! ఆ మన్మథుడు తన అనుచరులతో గూడి శివస్థానమునకు వెళ్లగానే, చిత్రమగు వృత్తాంతము జరిగినది. దానిని వినుము (1).
మహావీరుడు, మోహకారకుడు నగు మన్మథుడు అచటకు చేరి వెంటనే తన ప్రభావమును విస్తరింపజేసెను. మరియు ప్రాణులను మోహపెట్టెను (2).
వసంతుడు కూడా శివుని మోహపెట్టుటకై తన ప్రభావమును విస్తరింపజేసెను . ఓమునీ! ఏకకాలములో వృక్షములన్నియు పుష్పభరితములైనవి (3).
మన్మథుడు రతితో గూడి అనేక ప్రయత్నములను చేసెను. జీవులన్నియు వశమైనవి.కాని గణేశుడు, శివుడు వానికి వశము కాలేదు (4).
ఓ మహర్షీ! మన్మథుడు వసంతునితో కలిసి చేసిన ప్రయత్నములన్నియూ వ్యర్థము కాగా, ఆతని గర్వము తొలగి పోయెను. అపుడా తడు నా వద్దకు మరలి వచ్చెను (5).
ఓ మహర్షీ! ఆతడు గర్వము తొలగినవాడై, నిరుత్సాహముతో నుండి నాకు ప్రణమిల్లి గద్గదస్వరముతో నిట్లు పలికెను (6).
మన్మథుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! యోగనిష్ఠుడగు శంభుని మోహింపజేయుట అసంభవము సుమా! నాకు గాని, ఇతరులకు గాని అట్టి శంభుని మోహింపజేయు శక్తి లేదు (7).
హే బ్రహ్మన్! నేను నా మిత్రుడగు వసంతునితో, మరియు రతితో గూడి శివుని యందు ప్రయోగించిన ఉపాయములన్నియూ వ్యర్థయమ్యెను (8).
హే బ్రహ్మన్! మేము శివుని మోహింపజేయుటకు చేసిన వివిధోపాయములను చెప్పెదను. తండ్రీ! వినుము (9).
శంభుడు ఇంద్రియములను నియంత్రించి సమాధియందుండగా, అపుడు నేను సమాధియందున్న ఆ ముక్కంటి మహాదేవునకు నిరంతరముగా ప్రయత్నపూర్వకముగా చల్లని, వేగముగల, మోహమును కలిగించే, పరిమళభరితమైన వాయువుతో వీచితిని (10.11).
నేను నా అయిదు బాణములను మరియు ధనస్సును చేత బట్టి శివగణములను మోహింపజేయుచూ ఆయన చుట్టు ప్రక్కల తిరుగాడితిని (12).
నేను ప్రవేశించుట తోడనే సర్వ ప్రాణులు నాకు తేలికగా వశమగును. కాని, శివప్రభువు మరియు ఆయన గణములు ఎట్టి వికారమునూ పొందనే లేదు (13).
హే బ్రహ్మన్! ప్రమథ గణాధిపతి యగు ఆ శివుడు హిమవత్పర్వత మైదానములకు వెళ్లగా, అపుడు నేను గూడ రతితి, వసంతునితో గూడి అచటకు వెళ్లితిని (14).
ఆ రుద్రుడు మేరు పర్వతమునకు గాని, నాగకేశర (?) పర్వతమునకు గాని, లేదా కైలాసమునకు గాని వెళ్లినప్పుడు నేను కూడా ఆయా స్థలములకు ఆయనను వెన్నంటి వెళ్లితిని (15).
ఎపుడైననూ శివుడు సమాధిని వీడినచో, ఆ సమయములో నేను ఆయన యెదుట చక్రవాక పక్షుల జంటను ప్రదర్శించితిని (16).
హేబ్రహ్మన్! ఆ పక్షుల జంట పునః పునః హావభావములను ప్రకటించుచూ ఉత్తమమగు దాంపత్యపద్ధతిని ప్రకటించినవి (17).
గణములతో కూడియున్న, నల్లని కంఠము గల ఆ మహాదేవుని యెదుట మృగములు, పక్షులు శృంగామును ప్రకటించినవి (18).
ఆయన యెదుట మరియు సమీపమునందు నెమలి జంట శృంగారరసమును ఉద్ధీపింపజేయు విధముగా వివిధ గతుల నాట్య మాడినది (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
06 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
54. అధ్యాయము - 9
🌻. మారగణములు - 2 🌻
నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివునియందు నాకు ఏనాడూ కానరాలేదు. హే జగత్ర్ప భూ! నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు (20).
వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా! ఆ వృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికీ సత్యమునే పలుకుచున్నానను (21).
శివుడు ఉన్నచోట వసంతుడు సంపెంగలను, కేసరపుష్పములను, కురువేరు పుష్పములను, అరుణవర్ణము గల పొన్నలను, నాగకేశరములను, కింశుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను (22),
అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను (23).
ఆతడు ప్రయత్న పూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధ భరితములగునట్లు చేసి మలయానిలము వీచునట్లు చేసెను (24).
అచట గల లతలన్నియూ పూలతో, చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని యుండెను (25).
పుష్పములతో నిండియున్న ఆ వృక్షములను చూచి, ఆ సుంగధి భరితములగు గాలులను అనుభవించిన మునులు కూడా కామమునకు వశమైరి. ఇతరుల గురించి చెప్పనదేమున్నది? (26).
ఇట్లు ఉన్ననూ శివునకు మోహమును పొందే హేతువు గాన రాలేదు. ఆయనలో లేశమైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడ చేయలేదు (27).
ఈ వృత్తాంతమునంతనూ చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేనీ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను (28).
ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడుటకైననూ సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? (29).
హే బ్రహ్మన్! మండే అగ్నివలె ప్రకాశించు కన్నులు కలిగినట్టియు, జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు, విషమును ధరించియున్న శివుని చూచి, ఆయన యెదుట నిలబడ గలవారెవ్వరు? (30).
బ్రహ్మ ఇట్లు పలికెను -
నాల్గు మోములు గల నేను ఈ మన్మథుని మాటలను విని, సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అపుడు నా మనస్సు చింతతో నిండి పోయెను (31).
శివుని నేను మోహింపచేయ జాలను అను మన్మథుని పలుకులను వింటిని. ఓ మహర్షీ! ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని (32).
నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి (33).
వారందరు అసంఖ్యాకములు, గొప్ప భయంకరమైన ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి (34).
నా నిట్టూర్పుల నుండి పుట్టిన ఆ మహాగణములు నా ఎదుట నిలబడి 'చంపుడు నరుకుడు' అని కేకలు వేసినవి (35).
నన్ను ఉద్దేశించి వారు 'చంపుడు నరుకుడు' అని వేయుచున్న కేకలను విని మన్మథుడు వారిని ఎదుర్కొనెను (36).
ఓ మహర్షీ! అపుడు మన్మథుడు నాయెదుటనున్న ఆ గణములను వారించి, నాతో బ్రహ్మన్ అని సంబోధించి ఇట్లు పలికెను (37).
మన్మథుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! ప్రజాపతీ! సృష్టినంతనూ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే . ఈ భయంకర వీరులు ఉత్పన్నమైరి. వీరెవ్వరు? (38).
హే విధీ! వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరినామము ఏమి? ఈ విషయములను చెప్పి, వీరిని నియోగింపుము (39).
వారికి స్థానమునిచ్చి, పేరు పెట్టి, వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశా! అపుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము (40).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణం
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
07 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
54. అధ్యాయము - 9
🌻. మారగణములు - 3 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ మహర్షీ! సృష్టికర్తనను నేను మన్మథుని ఆ వాక్యమును విని వారి కర్తవ్యము, పేరు ఇత్యాదులను నిర్దేశిస్తూ, మన్మథునితో నిట్లంటిని (41).
వీరు పుట్టుచుండగనే 'మారయ (చంపుడు)' అని పలుమార్లు అరచిరి గాన, వీరికి మారులు అనుపేరు సార్థకమగు గాక! (42).
ఈ గణములు తమను అర్చించకుండగా వివిధములగు కామనలను పొందగోరు మానవులకు సర్వదా విఘ్నములను కలిగించెదరు (43).
హే మన్మథా! నిన్ను అనుసరించి ఉండుట వీరి ప్రధాన కర్తవ్యము. వీరు ఎల్ల వేళలా నిన్ను అను సరించి ఉందురనుటలో సందియము లేదు (44).
నీవు నీ కర్తవ్యమును నిర్వర్తించుటకై ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడకు వెళ్లెదవో, అప్పుడప్పుడు అక్కడక్కడకు వీరు నీ సహయము కొరకు అనుసరించి రాగలరు (45).
నీ అస్త్రములకు వశమగు మానవులకు వీరు చిత్తభ్రాంతిని కలిగించెదరు. వీరు జ్ఞానుల జ్ఞానమార్గమునకు అనేక విధముల విఘ్నములను కలిగించెదరు (46).
ఓ మహర్షీ! ఈ నా మాటను విని, రతీ దేవితో మరియు అనుచరులతో కూడియున్న మన్మథుని ముఖములో కొంత ప్రసన్నత కానవచ్చెను (47).
ఆ గణములన్నియూ కూడ ఈ మాటను విని, నన్ను మన్మథుని చుట్టు వారి యథేచ్చగా అచట నిలబడి యుండిరి (48).
అపుడు బ్రహ్మ మన్మథుని ఉద్దేశించి ప్రీతితో నిట్లనెను. నా ఆజ్ఞను పాలింపుము. నీవు మరల వీరితో గూడి వెళ్లుము. మనస్సును లగ్నము చేసి శివుని మోహింపజేయు యత్నమును చేయుము . (49)
ఈ మారగణములతో సహావెళ్లి, శివుడు మోహమును పొందునట్లు చేయుము. అపుడు శివుడు వివాహమును చేసుకొనగలడు (50).
ఈ మాటలను విని మన్మథుడు నన్ను మర్యాద చేసి వినయముతో ప్రణమిల్లెను. ఓ దేవర్షీ! అపుడాతడు నాతో నిట్లనెను.
మన్మథుడు ఇట్లు పలికెను -
తండ్రీ! శివుని మోహింపజేయు ప్రయత్నమును నేను శ్రద్ధగా చేసితిని. కాని ఆయన మోహమును పొందలేదు. ఇపుడు గాని ఆతడు మోహమును పొందడు (52).
నీ మాట యందలి గౌరవముతో నీ యాజ్ఞాను సారముగా నేను మరల శివుని ధామమునకు వెళ్లెదను. ఈ మారగణములు నాకు కొంత ఆశను కల్గించు చున్నవి (53). కాని నా మనస్సు లో శివుడు మోహమును పొందడనియే నిశ్చయముగా తోచుచున్నది. హే బ్రహ్మన్ ! శివుడు నా దేహమును భస్మము చేయడు గదా యను శంక నాకు గలదు (54).
మన్మథుడు ఇట్లు పలికి భయము గలవాడై వసంతునితో, రతీ దేవితో గూడి అపుడు శివుని ధామమునకు వెళ్లెను. ఓముని శ్రేష్ఠా! మారగణములు కూడ ఆతనిని అనుసరించినవి (55).
అపుడు మన్మథుడు పూర్వమునందు వలెనే వసంతునితో గూడి బాగుగా ఆలోచించి అనేక ఉపాయములను శివుని పై ప్రయేగించి తన ప్రభావమును చూపెను (56).
మారగణములు కూడా అనే ఉపాయములను చేసిరి. కాని శివ పరమాత్మకు మోహము కలుగనే లేదు (57).
అపుడు మన్మథుడు వెనుదిరిగి నా స్థానమునకు వచ్చెను. మారగణములు గర్వమును వీడి దుఃఖముతో నా ముందు నిలబడెను (58),
కుమారా! అపుడు నిరుత్సాహముతో నిండియున్న మన్మథుడు మారగణులతో, వసంతునితో గూడి గర్వమును వీడి నా ముందు నిలబడి ఇట్లు పలికెను (59).
హే బ్రహ్మన్! శివుని మోహింప జేయు యత్నమును పూర్వము కంటె అధికముగా చేసితిని. కాని ధ్యానమునందు లగ్నమైన మనస్సు గల శివునకు మోహము లేశమైననూ కలుగలేదు (60).
దయామయుడగు శివుడు నా దేహమును భస్మము చేయలేదు. పూ ర్వపుణ్యమే దీనికి కారణమై యుండును. ఆ ప్రభువు నందు వికారము లేమియూ కలుగలేదు (61).
ఓ పద్మ సంభవా! శివుడు వివాహమాడ వలెననే ఇచ్ఛ నీకు ఉన్నచో, నీవు గర్వమును వీడి, మరియొక ఉపాయమును చేయవలెనని నా అభిప్రాయము (62).
బ్రహ్మ ఇట్లు పలికెను -
మన్మథుడిట్లు పలికి , నాకు నమస్కరించి, గర్వమును దునుమువాడు దీనులపై ప్రేమను గురిపించువాడునగు శంభుని స్మరించుచూ, తన అనుచరులతో గూడి తన ఆశ్రమమునకు వెళ్లెను (63).
శ్రీశివ మహాపురాణములో రెండవదియగు రుద్ర సంహితయందు సతీఖండములో కామ ప్రభావము - మారగణముల పుట్టుక అనే తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (9).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
08 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 1 🌻
నారదుడిట్లు పలికెను -
హే బ్రహ్మన్! విధీ! మహాత్మా! శివుని యందు లగ్నమైన మనస్సు గల నీవు ధన్యుడవు. శంకర పరమాత్ముని పుణ్యచరితమును చెప్పితివి (1).
మన్మథుడు తన సహచరులతో మరియు రతితో గూడి తన ఆశ్రమమునకు వెళ్లగా ఏమి ఆయెను? నీవు ఏమి చేసితివి? ఆ చరితమునిప్పుడు చెప్పుము (2).
బ్రహ్మ ఇట్లు పలికెను -
నారదా! చంద్రమౌళి యొక్క చరితమును మిక్కిలి ప్రీతితో వినుము. దీనిని విన్నంత మాత్రాన మానవుడు కామక్రోధాది వికారములకు దూరము కాగల్గును (3).
తన అనుచరులతో కూడి మన్మథుడు తన ఆశ్రమమునకు వెళ్లిన తరువాత జరిగిన చరితమును చెప్పెదను. తెలుసు కొనుము (4).
నారదా! నా గర్వము తొలగిపోయెను. నా హృదయములో ఆశ్చర్యము కలిగెను. ఓ మహర్షీ! నా కోరిక తీరనందున నాకు ఆనందము కరువయ్యెను (5).
కామ క్రోధాది వికారములు లేని వాడు, జితేంద్రియుడు, యోగ పరాయణుడునగు ఆ శంకరుడు వివాహమాడే ఉపాయమేది అని నేను మనస్సులో పరిపరి విధముల తలపోసితిని (6).
ఓ మహర్షీ! అపుడు నేను గర్వము తొలగిన వాడనై, పరిపరి విధముల తలపోసి, శివస్వరూపుడు, నాకు తండ్రి అగు విష్ణువును భక్తితో స్మరించితిని (7).
మరియు, దీన వచనములతో గూడిన స్తోత్రములతో ఆయనను స్తుతించితిని. వాటిని విని విష్ణుభగవానుడు వెంటనే నా ఎదుట ప్రత్యక్షమయ్యెను (8).
నాల్గు భుజములు గలవాడు, పద్మముల వంటి కన్నులు గలవాడు, శంఖమును, శార్‌ఙ్గమనే ధనస్సును, గదను ధరించినవాడు, ప్రకాశించే పచ్చని వస్త్రము గలవాడు, నీలమేఘశ్యాముడు, భక్తవత్సలుడు (9),
భక్తులకు శరణునొసంగువాడు అగు ఆ హరిని చూచి కన్నీరు విడుచుచూ, గద్గదమగు వాక్కుతో ప్రేమపూర్వకముగా అనేక పర్యాయములు స్తుతించితిని (10).
ఆ స్తోత్రమును విని తన భక్తుల దుఃఖములను తొలగించే హరి మిక్కిలి ప్రసన్నుడై, శరణు పొందిన నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (11).
విష్ణువు ఇట్లు పలికెను -
హే విధీ! బ్రహ్మన్! సృష్టికర్తవగు నీవు మహా ప్రాజ్ఞుడవు, ధన్యుడవు. ఈనాడు నీవు నన్ను స్మరించి, స్తుతించుటకు కారణమేమి? (12).
నీకు కలిగిన మహాదుఃఖము ఏది? నాకు ఇప్పుడు చెప్పుము. నీ సర్వదుఃఖములను పోగెట్టెదను. నీకు సంశయముఅక్కరలేదు (13).
బ్రహ్మ ఇట్లు పలికెను -
విష్ణువు యొక్క ఈ మాటలను విన్న నా ముఖములో కొద్ది ఉత్సాహము కన్పట్టినది. నేను దోసిలి యొగ్గి విష్ణువునకు నమస్కరించి ఇట్లు పలికితిని (14).
ఓ దేవ దేవా! లక్ష్మీపతీ! మర్యాదను నిలబెట్టువాడా! నా మాటను వినుము. విని, దయను చూపి, దుఃఖమును పోగొట్టి , సుఖమునిమ్ము (15).
నేను రుద్రుని మోహింపజేయుట కొరకై కాముని పంపితిని. హే విష్ణో! ఆతడు మారగణములతో, వసంతునితో, భార్యతో మరియు సహచరులతో గూడి వెళ్లెను (16).
వారు అనేక ఉపాయములను చేసిరి. కానిఅవి నిష్ఫలమయ్యెను. యోగి, సమదర్శి యగు శివునకు వ్యామోహము కలుగలేదు (17).
సర్వజుడు, శివతత్త్వమును బాగుగా నెరింగినవాడు అగు విష్ణువు నా మాటను విని, ఆశ్చర్యమును పొంది నాతో ఇట్లనెను (18).
విష్ణువు ఇట్లు పలికెను -
హే పితామహా! నీకు ఇట్టి ఆలోచన కలుగుటకు కారణమేమి? హేబ్రహ్మన్! నీవు మంచి బుద్ధితో సర్వమును ఆలోచించి నాకు సత్యమును చెప్పుము (19).
బ్రహ్మ ఇట్లు పలికెను -
తండ్రీ! ఆ చరిత్రను వినుము. నీ మాయ మోహింపజేయును. జగత్తంతయూ దానికి వశమై సుఖదుఃఖాదుల యందు లగ్నమై యున్నది (20).
ఆ మాయచే ప్రేరితుడనై నేను పాపము చేయనొడగట్టితిని. ఆ వృత్తాంతమును వినుము. హే దేవదేవా! నీ ఆజ్ఞచే చెప్పు చున్నాను (21).
సృష్ట్యాది యందు నాకు పది మంది దక్షుడు మొదలగు కుమారులు, ఒక కుమార్తె జన్మంచిరి. అతి సుందరియగు ఆమె నా వాక్కు నుండి జన్మించిరి (22).
వక్షస్థ్సలము నుండి ధర్ముడు, మనస్సు నుండి మన్మథుడు, ఇతరకుమారులు దేహమునుండి జన్మించిరి. హేహరే! ఆ కుమార్తెను చూచిన నాకు మోహము కలిగినది (23).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
09 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 2 🌻
నేను నీ మాయచే మోహితుడనై ఆమెను చెడుదృష్టితో చూచితిని. వెంటనే శివుడు వచ్చి నన్ను, మరియు నా కుమారులను నిందించెను. (24). హే నాథా! తాను పరమాత్మ, జ్ఞాని, యోగి, విషయలాలసత లేని జితేంద్రియుడు అని భావించే శివుడు అందరినీ ఉద్దేశించి ధిక్కారమును చేసెను (25).
హే హరీ! నాకుమారుడైన ఈ రుద్రుడు వీరందరి యెదుట నన్ను నిందించినాడని నాకు గొప్ప దుఃఖము కలిగినది. నేను నీ యెదుట సత్యమును చెప్పితిని (26). ఆయన వివాహమాడినచో నాకు దుఃఖము తొలగి సుఖము కలుగును. హే కేశవా! దీనికొరకై నేను నిన్ను శరణు జొచ్చితిని (27).
ఈ నా మాటను విని మధుసూదనుడు నవ్వి సృష్టికర్త, బ్రహ్మ అగు నాకు ఆనందమును కలిగించు వాడై, వెంటనే ఇట్లు పలికెను (28).
విష్ణువు ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! భ్రాంతులనన్నిటినీ తొలగించునది, వేద శాస్త్రములన్నింటి పరమార్థ సారము అగు నామాటను వినుము (29). హే బ్రహ్మన్! నీవీనాడు ఇంత పెద్ద మూర్ఖుడవు ఎట్లు కాగల్గితివి? వేద ప్రవర్తకుడవు, సర్వ జగత్తును సృష్టించినవాడవు అగు నీకు దుర్బుద్ధి ఎట్లు కలిగినది?(30).
ఓ తెలివతక్కువ వాడా! నీ జడత్వమును వీడుము. ఇట్టి ఆలోచనను చేయకుము. కొనియాడదగిన వేదములన్నియూ ఏ పరమాత్మతత్త్వమును బోధించుచున్నవో, దానిని సద్బుద్ధితో స్మరింపుము (31). ఓరీ దుష్టబుద్ధీ! పరమేశ్వరుడగు రుద్రుని నీ కుమారుడని తలపోయుచుంటివి. హేబ్రహ్మన్! నీవు వేద ప్రవర్తకుడవే అయిననూ, విజ్ఞానమునంతనూ మరచిపోయితివి (32).
శంకరుని దేవతలలో ఒకనిగా తలంచి నీవు ద్రోహమును చేయుచున్నావు. ఈనాడు నీకు మంచి బుద్ధి లుప్తమై, దుర్బుద్ధి పుట్టినది (33). ఈశ్వరతత్త్వమును గురించిన సిద్ధాంతమును వినుము. సద్బుద్ధిని కలిగియుండుము. వేదములలో ప్రతిపాదింపబడిన తీరులో వాస్తవమగు సృష్టికర్తను నిర్ణయించుకొనుము (34).
సర్వమును సృష్టించి, రక్షించి, హరించునది శివుడే. ఆయనయే పరాత్పరుడు, పరబ్రహ్మ, పరమేశ్వరుడు. ఆయన నిర్గుణుడు మరియు నిత్యుడు (35). వికారములు లేని శివుని ఇదమిత్థముగా నిర్దేశించలేము. ఆయన అద్వితీయ, అవినాశి, అనంత పరమాత్మ. ప్రలయకర్తయగు ప్రభువు. సర్వవ్యాపకుడగు పరమేశ్వరుడు ఆయనయే (36).
ఆప్రభువు రజస్సత్త్వ తమోగుణ ప్రధానుడై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అను పేర్లతో సృష్టిస్థితి లయములను చేయుచుండును (37). మాయను స్వవశములో నుంచుకునే ఆ మాయావి కంటె వేరుగా మాయ లేదు. ఆయన ఆప్తకాముడు.ఆయన సగుణుడే అయినా నిర్గుణుడు. ఆయన స్వతంత్రుడు, ఆనందఘనుడు (38).
ద్వంద్వములకు అతీతుడగు శివుడు తనయందు తాను రమించే జ్ఞాని. ఆయన భక్తులకు వశుడై, దివ్యమంగళ విగ్రమహమును ధరించియుండును. ఆ మహాయోగి నిత్యము యోగనిష్ఠుడుగా నుండి, భక్తులను యోగమార్గమున చూపును (39). ఆ లోక ప్రభువు దుష్టుల గర్వమునడంచును. ఆయన సర్వకాలములలో దీనులపై దయను చూపును. ఇట్టి ఆ స్వామిని నీవు నీ కుమారుడని భావించుచున్నావు (40).
నీవు ఈ దుష్ట భావనను వీడి, ఆయనను శరణు జొచ్చుము. సర్వ విధములుగా శంభుని భజించుము. ఆయన సంతసించి నీకు సుఖమును కలిగించగలడు (41).
హే బ్రహ్మన్! శంకరుడు భార్యను స్వీకరించవలెననే ఆలోచన నీ హృదయములో నున్నచో, ఉమను ఉద్దేశించి శివుని స్మరించుచూ మంచి తపస్సును చేయుము (42). నీవు హృదయములో మన్మథుని ఉద్దేశించి ఉమను ధ్యానించుము. ఆ దేవదేవి ప్రసన్నురాలైనచో, నీకోర్కెలనన్నిటినీ ఈడేర్చగలదు (43).
ఆ శివాదేవి సగుణయై అవతారమునెత్తి లోకములో మనుష్య దేహముతో ఎవరో ఒకరి గృహములో జన్మించినచో, నిశ్చయముగా శివునకు పత్ని కాగలదు (44). హే బ్రహ్మన్! శివుని కొరకు కన్యను కనుటకై దక్షుడు భక్తితో ప్రయత్న పూర్వకముగా తపస్సును చేయవలెను. కాన ఆతనిని ఆజ్ఞాపించుము (45).
వత్సా! పరబ్రహ్మ స్వరూపులగు ఆ ఉమాపరమేశ్వరులు భక్తసులభులు. వారి స్వరూపమును భక్తిచే తేలికగా తెలియవచ్చును. వారు తమ ఇచ్ఛతే సగుణ రూపమును స్వీకరించెదరు (46).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఇట్లు పలికి విష్ణువు వెను వెంటనే తన ప్రభువగు శివుని స్మరించెను. ఆయన కృపచే ఆయన స్వరూపము నెరింగి తరువాత నాతో నిట్లనెను (47).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
10 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
55. అధ్యాయము - 10
🌻. బ్రహ్మకు జ్ఞనోదయమగుట - 3 🌻
విష్ణువు ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్ ! మనమిద్దరము శంకరుని సంకల్పముచే జన్మించిన సమయములో ఆయనను మనము ప్రార్థించగా, మనలను ఉద్దేశించి ఆయన అపుడు చెప్పిన పలుకులను గుర్తుకు తెచ్చుకొనుము (48).
నీవా వృత్తాంతమునంతనూ మరచితివి. శాంభవీ పరాదేవి ధన్యురాలు. ఆమె చే జగత్తు సర్వము మోహింపబడినది. శివుడు తక్క ఇతరులు ఆమెను ఎరుంగజాలరు (49).
శివుడు తన ఇచ్ఛచే నిర్గుణ స్వరూపము నుండి సగుణుడై నన్ను సృష్టించి, ఆ తరువాత నిన్ను సృష్టించెను. ఆయన తన శక్తితో లీలలను సృష్టించును (50).
అపుడు శంభుప్రభువపు నిన్ను సృష్టిని చేయుమని ఆదేశించెను. హే బ్రహ్మన్! దాని పాలనను నాకు అప్ప జెప్పెను. నాశరహితుడు ఉమా సహితుడునగు శివుడే వాస్తవముగా జగత్కారణమగును (51).
అపుడు మనిమిద్దరము దోసిలి యొగ్గి, సాష్టాంగ ప్రణామమును చేసి, మనస్థానములకు వచ్చితిమి. సర్వేశ్వరుడవగు నీవు కూడా గుణ సంహితుడవై రూపమును స్వీకరించి అవతరించుము (52).
అని మనము కోరగా, కరుణామయుడు అనేక లీలలను సృష్టించుటలో నిపుణుడు అగు ఆ ప్రభువు నవ్వి, ఆకాశము కేసి చూచి మిక్కిలి ప్రీతితో నిట్లనెను (53).
హే విష్ణో! నా శ్రేష్ఠమగు రూపము, నన్ను పోలిన రూపము, బ్రహ్మదేహమునుండి ప్రకటమై లోకములో రుద్రుడను పేర కీర్తింపబడును (54).
ఆ రుద్రుడు నా పూర్ణావతారము. మీరు ఆయనను సర్వదా పూజించుడు. ఆయన మీ కోర్కెలనన్నిటినీ ఈడేర్చును. త్రిగుణసాక్షి, నిర్గుణుడు, గొప్ప యోగమునకు ప్రవర్తకుడునగు ఆ రుద్రుడు లయమును చేయగలడు (55).
ఈ త్రిమూర్తులు నాకుమారులు. వారు నా స్వరూపమే రుద్రుడు విశేషించి నా పూర్ణాంశ గలవాడు. ఉమాదేవికి కూడ మూడు రూపములు ఉండగలవు (56).
ఆమె లక్ష్మి అను పేరుతో విష్ణువునకు భార్య యగును. సరస్వతి అను పేరుతో బ్రహ్మకు పత్నియగును. ఆమె పూర్ణరూపముతో సతియను పేరుగలదై రుద్రునకు భార్య కాగలదు (57).
మహేశ్వరుడు దయతో ఇట్లు పలికి అంతర్ధానమయ్యెను. మనము మనకు అప్పిగించబడిన కార్యముల యందు నిమగ్నులమై సుఖముగా నుంటిమి (58).
హే బ్రహ్మన్! మనము కాలము వచ్చుటచే వివాహమాడితిమి. శంకరుడింకనూ వివాహమాడలేదు.ఆయన స్వయముగా రుద్రుడను పేర అవతరించి కైలాసము నాశ్రయించి ఉన్నాడు (59).
హే ప్రజాపతీ! ఉమాదేవి సతియను పేర అవతరించును. ఆమె పుట్టుట కొరకు ప్రయత్నమును చేయవలెను (60).
విష్ణువు ఇట్లు పలికి మిక్కిలి దయను చూపి అంతర్దానమాయెను. నేను మిక్కిలి అధికమైన ఆనందమును పొందితిని. నాలోని ఈర్ష్య తొలగి పోయెను (61).
శ్రీ శివ మహాపురాణములోని రెండవది యగు రుద్రసంహితయందురెండవది యగు సతీ ఖండములో బ్రహ్మ విష్ణు సంవాదము అనే పదియవ అధ్యాయము ముగిసినది (10).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group
https://t.me/ChaitanyaVijnanam
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
56. అధ్యాయము - 11
🌻. దుర్గాస్తుతి - 1 🌻
నారదుడిట్లు పలికెను -
తండ్రీ! బ్రహ్మన్! నీవు మహా బుద్ధిశాలివి. వక్తలలో శ్రేష్ఠుడవు. మాకు చెప్పుము. విష్ణువు నిష్క్రమించిన తరువాత ఏమయ్యెను? హే విధీ! నీవు ఏమి చేసితివి ?(1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీవు సావధానముగా వినుము. విష్ణుభగవానుడు నిష్క్రమించగనే నేను చేసిన కార్యమేదియో చెప్పెదను (2).
విద్యాస్వరూపిణి, మరియు అవిద్యా స్వరూపిణి, శుద్ధ పరబ్రహ్మ రూపిణి, జగన్మాత, సర్వదా శివప్రియ అగు దుర్గాదేవిని స్తుతించెదను (3).
సర్వవ్యాపకురాలు, నిత్యస్వరూపిణి, ఇతర ఆశ్రయము లేనిది, సంసార దుఃఖములు లేనిది, ముల్లోకములకు తల్లి, గొప్ప వాటి కంటె కూడ గొప్పది, రూపము వాస్తవముగా లేనిది అగు దుర్గను నమస్కరించు చున్నాను (4).
చైతన్యము, బ్రహ్మానందము నీవే . నీవే పరమాత్మ స్వరూపిణివి. దేవదేవీ! నీవు ప్రసన్నురాలవు కమ్ము. నా కార్యము సిద్ధింపజేయుము. నీకు నమస్కారము (5).
ఓ మహర్షీ! నేను యోగనిద్రను ఇట్లు స్తుతించితిని| ఓ దేవర్షీ! అపుడు నా ఎదుట చండిక ప్రత్యక్షమయ్యెను (6).
చిక్కని కాటుక వలె ప్రకాశించునది, సుందరమగు రూపము గలది, ప్రకాశించు నాల్గు భుజములు గలది, సింహము నధిష్ఠించి యున్నది, చేతియందు వరముద్ర గలది, ముత్యములచే నొప్పు చూడా మణితో ప్రకాశించే కేశభారము గలది (7),
శరత్కాల చంద్రుని వంటి ముఖము గలది, చంద్రుని వలె స్వచ్ఛమైన ఫాలభాగము కలది, మూడు కన్నులు గలది, సర్వాంగసుందరి, పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఒప్పారునది (8), శివుని శక్తి అగు ఆ ఉమాదేవిని నా ఎదుట గాంచితిని. ఓ మహర్షీ! నేను భక్తితో శిరస్సును వంచి నమస్కరించి స్తుంతిచితిని (9).
ఓతల్లీ! జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే. జగత్తు యొక్క సృష్టిస్థితులు నీ స్వరూపమే. స్థావరజంగ మాత్మకమగు ప్రాణులలో నీవు శక్తి రూపముగ నుండి సర్వప్రాణులను మోహపెట్టుచున్నావు. నీవు సనాతనివి. నీకు అనేక నమస్కారములు (10).
కేశవుని వక్షస్థ్సలమునందు అలంకారముగా నుండు లక్ష్మీదేవి నీవే. సకలమును భరించి పోషించు నీవు విశ్వంభరవు. నీవు సృష్టిని చేసిన మహేశ్వరివి. ముల్లోకములను లయము చేయునది నీవే.నీవు గుణాతీతురాలవు (11).
యోగులు నిన్ను పూజించి తమ హృదయములలో దర్శించెదరు.అట్టి నిన్ను నమస్కరించుచున్నాను. పరమాణువులలోని సారము (శక్తి) నీవే. యమనియమాదులచే పవిత్రమైన యోగుల హృదయములలో నీవు ఉండి వారికి ధ్యాన మార్గములో దర్శనము నిచ్చెదవు (12).
ప్రకాశము, శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాగ ద్వేషములు లేవు. వివిధ శాస్త్ర విజ్ఞానములకు సంబంధించిన విద్యలన్నియూ నీ స్వరూపమే. నీ స్వరూపము కూటస్థము (మార్పులకు లోను కానిది), మరియు ఇంద్రియములకు అగోచరము. నీవే అనంత రూపములతో ప్రకటమైనావు. నీవు కాల స్వరూపురాలై ముల్లోకములను ధరించి యున్నావు (13).
నీవు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యా రూపములో నున్నావనుట నిశ్చయము. హే శివప్రియే! మూడు గుణములకు ఆశ్రయము నీవే. మరియు నీవు గుణాతీతురాలవై యున్నావు (14).
సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ గుణముల వికారములు నీయందు లేవు. కాని వాటి ఉనికి నీ యందు మాత్రమే గలదు. జగత్తునకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే. నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించి, రక్షించి, భక్షించుచున్నావు (15).
సర్వజగత్తుల బీజము నీవే. జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే. హే శివపత్ని! లోకముల క్షేమమును కోరి నేను సర్వదా నీకు నమస్కరించుచున్నాను (16).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఈ నా మాటను విని లోకరక్షకురాలగు ఆ కాళీదేవి సృష్టికర్తనగు నాతో ప్రీతితో, తల్లి పిల్లవానిని వలె లాలించి, ఇట్లు పలికెను (17).
దేవి ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్! నీవు నా ఎదుట ధైర్యము గలవాడైనచో, నీవు నన్ను స్తుతించుటకు గల కారణమును వెంటనే నిశ్చయముగా చెప్పుము (18).
నేను ప్రత్యక్షమైన పిదప కార్యము సిద్ధించుట నిశ్చయము. కావున నీవు నీ కోర్కెను తెలుపుము. నీచే ఆరాధింపబడిన నేను నీ కోర్కెను తీర్చెదను (19).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
12 Oct 2020
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
56. అధ్యాయము - 11
🌻. దుర్గాస్తుతి - 2 🌻
బ్రహ్మ ఇట్లు పలికెను -
దేవీ! మహేశ్వరీ! నాపై దయఉంచి వినుము. నీవు సర్వము నెరుంగుదువు. అయిననూ నీ ఆజ్ఞచే నా మనస్సులోని కోర్కెను చెప్పెదను (20). హే దేవేశీ! నీ భర్త పూర్వము నా నుదుటి నుండి ప్రకటమయ్యెను గదా ! ఆ శివ యోగి రుద్రనామముతో కైలాసముపై నున్నాడు (21).
కూటస్థుడు (పరివర్తన లేని వాడు) అగు ఆ భూతనాథుడు అచట తపస్సును చేయు చున్నాడు. భార్యా సహాయము లేనివాడు, వికారహీనుడు అగు ఆ ప్రభువు భార్యా సహాయమును కోరుట లేదు (22).
ఓ పతివ్రతా! ఆతడు వివాహమాడుట కొరకై నీవాయనను మోహింపజేయుము. నీవు తక్క ఆయన మనస్సును ఆకర్షించగలవారు మరియొకరు లేరు (23).
కావున నీవే దక్షునకు కుమార్తెగా జన్మించుము. హే శివే! నీవు నీ రూపముతో రుద్రుని మోహింప జేసి ఆయనకు భార్యవు అగుము (24).
నీవు లక్ష్మీరూపముతో శరీరమును ధరించి కేశవుని అలరించినావు. లోక కళ్యాణము కొరకు రుద్రుని కూడ అటులనే చేయుము (25).
ఓ దేవీ! నేను కాంతను అభిలషించినంత మాత్రాన నన్ను నిందించిన ఆ వృషభధ్వజుడు తన ఇచ్ఛచే భార్యను స్వీకరించుట ఎట్లు సంభవమగును ? (26).
ఈ సృష్టి యొక్క ఆది, మధ్య, అంతములకు కారణభూతుడైన ఆ హరుడు విరాగియై భార్యను స్వీకరించని స్థితిలో ఈ సృష్టి మంగళకరము ఎట్లు కాగల్గును ?(27).
ఈ చింత నన్ను పీడించుచున్నది. నీవు తప్ప మరియొకరు నాకు శరణు లేరు. నేనీ కష్టములో నున్నాను. కాన, లోకహితమును గోరి నా కోరికను దీర్చుము (28). ఆయనను విష్ణువు గాని, లక్ష్మిగాని, మన్మథుడు గాని, నేను గాని మోహపెట్టలేము. ఓ జగన్మాతా! నీవు తప్ప మరియొకరి వలన ఈ పని కాదు (29).
కావున, నీవు దక్షుని కుమార్తెగా జన్మించి, దివ్యరూపము గల దానవై, యోగియగు ఈశ్వరుని మోహింపజేసి ఆయనకు భార్యవు కమ్ము. మహేశ్వరీ! నా భక్తిని ఈ విధముగా సఫలము చేయుము (30). ఓ దేవ దేవీ! దక్షుడు క్షీర సముద్ర ఉత్తర తీరమునందు దృఢమగు వ్రతము గలవాడై మనస్సును నీయందు లగ్నము చేసి నిన్ను ఉద్దేశించి తపస్సును చేయు చున్నాడు (31).
ఈ మాటను విని, ఆపుడా ఉమాదేవి ఆలోచించ మొదలిడెను. ఆ జగన్మాత విస్మయమును పొంది తన మనస్సులో ఇట్లు అనుకొనెను (32).
దేవి ఇట్లు పలికెను -
అహో! ఇది చాల పెద్ద ఆశ్చర్యము! వేద ప్రవర్తకుడు, సృష్టికర్త, మహాజ్ఞాని యగు ఈ బ్రహ్మ ఏమి మాటలాడు చున్నాడు? (33).
బ్రహ్మ యొక్క మనస్సులో దుఃఖదాయకమగు మహా మోహము పుట్టినది. అందువలననే వికార రహితుడగు శివప్రభువును మోహింప జేయ గోరు చున్నాడు (34).
హరుని మోహింపజేయవలెననే వరమును ఈ బ్రహ్మ నానుండి పొంద గోరుచున్నాడు దాని వలన ఈతనికి కలిగే లాభమేమి? ఆ విభుడు కూటస్థుడు (పరివర్తన లేని వాడు) గనుక, ఆయనను మోహింపజేయుట సంభవము కాదు (35).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
13 Oct 2020
No comments:
Post a Comment