శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-1

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 307-1. 'రమ్యా' 🌻

రమ్యముగ నుండునది శ్రీమాత అని అర్థము. రమ్యమే తన తత్వముగ నున్నది. రమింప చేయునది శ్రీమాత. తానెప్పుడునూ అమితమగు ఆనంద స్థితియందే యుండును. అట్టి స్థితి జీవులకు కూడ కల్పించు చుండును. రమణీయమగు వస్తువును గాని, దృశ్యమునుగాని చూచునపుడు జీవులు రమ్యత నొందుదురు. రమ్యత కలిగిన స్థితిలో తాముండక ఆనందమే యుండును. రమ్యమగు దృశ్యము గోచరించినపుడు హృదయము పొంగి తమను తాము మరచుట జరుగుచుండును కదా! దీనికి కారణము శ్రీమాతయే.

తాను ఎల్లప్పుడునూ శివమగు సత్యమునందే రమించుచుండుట వలన రమ్యమైనది. అట్టి రమ్యత్వమును సృష్టియం దేర్పరచినది. జీవులు కూడా సృష్టియందనేక విషయములను రమించుచుచున్నారు. ధనము, వస్తువులు, వాహనములు, ఆస్తులు, సంపదలు, అధికారము- ఇట్టి వానితో రమించుచూ జీవులు తీరుబడిలేక జీవించు చుండుటకు శ్రీమాత రమ్యత్వమే కారణము. తాను సత్యమునందు రమించుచూ జీవులకు సృష్టి రమ్యత ఏర్పరచి సుఖపెట్టు చుండును.

ఇతర విషయములం దాసక్తి కలిగిన జీవులు క్రమముగ శాశ్వతానందము కొరకై అడ్రులు చాచగ, శివమగు సత్యము వైపునకు కూడ శ్రీమాత దారి చూపును. పురో గమనము, తిరోధానము రెండునూ గూడ అమ్మ ఆరాధకులకు సుఖ వంతమే. అమ్మ నారాధించు వారికి మార్గము రమ్యమై యుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 307 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 307. Ramyā रम्या (307) 🌻

She is the most beautiful of all.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

03 Sep 2021

నిర్మల ధ్యానాలు - ఓషో - 67

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 67 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రతి మనిషిలోని ఉన్నత శిఖరం దేవుడే. నువ్వు దేవుడి వైపు ఆరోహించడం ఆరంభిస్తే దేవుడు నీ వేపు అవరోహించడం ఆరంభిస్తాడు. అంటే నీవేపు సాగుతాడు. ఆ ఆరోహణ, అవరోహణల మధ్య ఎక్కడో ఒక కేంద్రంలో కలయిక జరుగుతుంది. దేవుడు నువ్వు సాగందే నీలోకి రాడు. 🍀

నువ్వు పైకి వెళుతూ వుంటావు. దైవాన్ని అందుకోవాలను కుంటావు. ఎందుకంటే ఉన్నత స్థానానికి, నిజమైన ఉన్నత స్థానానికి ఎగబాకడమంటే అదే. తక్కిందంతా కింది స్థానంలో వున్నదే. నువ్వు దేవుని వైపు ప్రయాణిస్తే నువ్వు ఆరోహణలో వుంటావు. అక్కడ జరిగే అద్భుతమేమిటంటే నువ్వు దేవుడి వైపు ఆరోహించడం ఆరంభిస్తే దేవుడు నీ వేపు అవరోహించడం ఆరంభిస్తాడు.

అంటే నీ వేపు సాగుతాడు. ఆ ఆరోహణ, అవరోహణల మధ్య ఎక్కడో ఒక కేంద్రంలో కలయిక జరుగుతుంది. అది వన్ వే కాదు, ఏ క్షణం అన్వేషకుడు సాగడం మొదలు పెడతాడో, అదే క్షణం దేవుడు తను సాగడం ఆరంభిస్తాడు. రెండూ ఏక కాలంలో సాగుతాయి. అవి ఒకే విధానానికి భిన్న ధృవాలు. చూసేవాడు, చూడబడేది. రెండూ ఒకటే. దేవుడు నువ్వు సాగందే నీలోకి రాడు. నువ్వు ఆరోహించందే అవరోహించడు.

మనుషులు నిశ్చలనంగా జీవిస్తారు. ఏ మార్పు లేకుండా జీవిస్తారు. అవకాశం లేనట్లు జీవిస్తారు. అక్కడ అనంత అవకాశం వుంది. మనిషి అనంత శక్తితో భూమిలోకి వచ్చాడు. ప్రతి మనిషిలోని ఉన్నత శిఖరం దేవుడే. మన అస్తిత్వం దేవుడే. మనిషే దైవ ప్రయత్నం చేస్తున్నాడనుకో కూడదు. దేవుడు కూడా మనిషి కోసం ప్రయత్నిస్తున్నాడు. అది ఏకపక్షమయితే అక్కడ అందముండదు. చలనముండదు. చైతన్యముండదు, అట్లాకాదు. అది రెండు వైపుల్నించీ సాగే ప్రేమ వ్యవహారం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

03 Sep 2021

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 483 / Vishnu Sahasranama Contemplation - 483

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 483 / Vishnu Sahasranama Contemplation - 483 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 483. సహస్రాంశుః, सहस्रांशुः, Sahasrāṃśuḥ 🌻

ఓం సహస్రాంశవే నమః | ॐ सहस्रांशवे नमः | OM Sahasrāṃśave namaḥ

సహస్రాంశుః, सहस्रांशुः, Sahasrāṃśuḥ

త ఆదిత్యాదిగతా అప్యంశవోస్య హరే రితి

వేలకొలదిగా కిరణములు కలవాడు కావున సూర్యునకు సహస్రాంశుః అని వ్యవహారము. ఆదిత్యునియందు ఉండు కిరణములు ఈ పరమాత్మునివే కావున ముఖ్యుడగు సహస్రాంశుడు విష్ణువే!

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::

యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

సూర్యునియందు ఏ తేజస్సు, ప్రకాశము, చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అదియంతయు నాదిగా నెరుంగుము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 483 🌹

📚. Prasad Bharadwaj

🌻 483. Sahasrāṃśuḥ 🌻

OM Sahasrāṃśave namaḥ

Ta ādityādigatā apyaṃśavosya hare riti / त आदित्यादिगता अप्यंशवोस्य हरे रिति

The rays of the sun and other luminaries are truly His. So, He is the chief Sahasrāṃśuḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योगमु ::

यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15

Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. 12.

That light in the sun which illumines the whole world, that which is in the moon and the which is in fire - know that light to be Mine.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

03 Sep 2021

3-SEPTEMBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 3 సెప్టెంబర్ 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 86  / Bhagavad-Gita - 86 - 2-39🌹*
3) 🌹. శ్రీమద్భగవద్గీత - 655 / Bhagavad-Gita -  655 -18-66🌹
4) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 483 / Vishnu Sahasranama Contemplation - 483🌹
5) 🌹 DAILY WISDOM - 161🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 67 🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307 / Sri Lalitha Chaitanya Vijnanam - 307 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ శుక్రవారం మిత్రులందరికీ 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం 🍀*

దేవా ఊచుః |
నమః శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః |
నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః || 1

ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యై నమో నమః |
నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః || 2

విచిత్రక్షౌమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః |
పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః || 3

🌻 🌻 🌻 🌻 🌻

03, శుక్రవారం, సెప్టంబర్‌ 2021
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ
దక్షిణాయణం, వర్ష ఋతువు
చాంద్రమానం : శ్రావణ మాసం
 తిథి: కృష్ణ ఏకాదశి 07:45:10 వరకు 
తదుపరి కృష్ణ ద్వాదశి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: పునర్వసు 16:42:09 వరకు 
తదుపరి పుష్యమి
యోగం: వ్యతీపాత 10:10:54 వరకు 
తదుపరి వరియాన
 కరణం: బాలవ 07:43:10 వరకు
వర్జ్యం: 03:50:00 - 05:32:56 మరియు
25:03:20 - 26:43:36
దుర్ముహూర్తం: 08:31:33 - 09:21:16 మరియు
12:40:07 - 13:29:49
రాహు కాలం: 10:42:03 - 12:15:15
గుళిక కాలం: 07:35:38 - 09:08:50
యమ గండం: 15:21:40 - 16:54:53
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 14:07:36 - 15:50:32
సూర్యోదయం: 06:02:26, 
సూర్యాస్తమయం: 18:28:05
వైదిక సూర్యోదయం: 06:05:58
వైదిక సూర్యాస్తమయం: 18:24:32
చంద్రోదయం: 02:22:21, 
చంద్రాస్తమయం: 15:57:20
సూర్య సంచార రాశి: సింహం, 
చంద్ర సంచార రాశి: జెమిని
ఆనందాదియోగం: లంబ యోగం - చికాకులు, 
అపశకునం 16:42:09 వరకు తదుపరి 
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 
పండుగలు : అజా ఏకాదశి

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 86 / Bhagavad-Gita - 86 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద 
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 39 🌴

39. ఏషా తేభిహితా సాంఖ్యే 
బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు |
 బుద్ధ్యా యుక్తో యయా 
పార్థ కర్మబన్ధం ప్రహాస్యసి ||

🌷. తాత్పర్యం :
ఇంతవరకు ఈ జ్ఞానమును నేను సాంఖ్యము ననుసరించి నీకు వివరించితిని. ఇప్పుడు దానిని ఫలాపేక్ష లేనటువంటి కర్మ రూపమున వివరించెదను ఆలకింపుము. ఓ పృథాకుమారా! అట్టి జ్ఞానము ననుసరించి నీవు వర్తింతువేని కర్మబంధము నుండి విడివడగలవు.

🌻. భాష్యము :
వేదనిఘంటువైన “నిరుక్తి” ననుసరించి “సాంఖ్యము” అనగా సంపూర్ణముగా వివరించునదని భావము. సాంఖ్య మనునది ఆత్మ యొక్క నిజస్వభావమును వివరించు తత్త్వము కాగా, యోగము ఇంద్రియముల నియమమును కూడియుండును. 

ఇచ్చట యుద్ధము నుండి విరమించుటనెడి అర్జునుని ప్రతిపాదన ఇంద్రియ ప్రీతిపై ఆధారపడి యున్నది. ధృతరాష్ట్రుని తనయులైన తన సోదరులను, జ్ఞాతులను యుద్ధములో జయించి రాజ్యము ననుభవించుట కన్నాను వారిని యుద్ధములో వధింపకుండుట తనకు ఎక్కువ ఆనందమును కలుగజేయునని తలచియుండుట చేతనే ముఖ్యధర్మమును మరచి అతడు యుద్ధము నుండి విరమిమప గోరెను. 

అర్జునుడు యోచించిన ఈ రెండు విషయములను ఇంద్రియ ప్రీతికి సంబంధించినవే. వారిని జయించుటచే కలిగెడి ఆనందము మరియు వారిని జీవితులుగా గాంచుటచే ఒసగూడెడి ఆనందము రెండును జ్ఞాన ధర్మములను పణముగా పెట్టునటువంటి దేహభావనపై ఆధారపడియున్నవి. పితామహుని దేహమును వధించుట ఆత్మను వధించుట కాబోదని శ్రీకృష్ణభగవానుడు అర్జునునకు వివరింపగోరెను. 

సర్వులు ఆత్మస్వరూపులైనందున తాను మరియు ఇతరులందరును శాశ్వతముగా వ్యక్తిగతులనియు, అందరును భూత, భవిష్యత్, వర్తమానములందిన్ని వేళలా ఉండగలరనియు భగవానుడు వివరించెను. కేవలము మనము దేహములనే పలురీతులుగా మార్చుచున్నాము. కాని దేహబంధము నుండి ముక్తి పిదపయు మన వ్యక్తిత్వము నిలిచియుండును. ఈ విధముగా ఆత్మ మరియు దేహములకు సంబంధించిన విశ్లేషణాత్మక వివరణను శ్రీకృష్ణభగవానుడు తెలియజేసెను. వివిధకోణములలో కావింపబడిన ఆత్మ మరియు దేహములకు సంబంధించిన వివరణాత్మక జ్ఞానమే నిరుక్తి నిఘంటువు ననుసరించి సాంఖ్యజ్ఞానముగా తెలుపబడినది. 
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 86 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada 
📚 Prasad Bharadwaj 

🌴 Chapter 2 - Sankhya Yoga - 39 🌴

39. eṣā te ’bhihitā sāṅkhye buddhir yoge tv imāṁ śṛṇu 
buddhyā yukto yayā pārtha karma-bandhaṁ prahāsyasi

🌻 Translation :
Thus far I have described this knowledge to you through analytical study. Now listen as I explain it in terms of working without fruitive results. O son of Pṛthā, when you act in such knowledge you can free yourself from the bondage of works.

🌻 Purport :
According to the Nirukti, or the Vedic dictionary, saṅkhyā means that which describes things in detail, and sāṅkhya refers to that philosophy which describes the real nature of the soul. And yoga involves controlling the senses. Arjuna’s proposal not to fight was based on sense gratification. Forgetting his prime duty, he wanted to cease fighting, because he thought that by not killing his relatives and kinsmen he would be happier than by enjoying the kingdom after conquering his cousins and brothers, the sons of Dhṛtarāṣṭra. In both ways, the basic principles were for sense gratification. 

Happiness derived from conquering them and happiness derived by seeing kinsmen alive are both on the basis of personal sense gratification, even at a sacrifice of wisdom and duty. Kṛṣṇa, therefore, wanted to explain to Arjuna that by killing the body of his grandfather he would not be killing the soul proper, and He explained that all individual persons, including the Lord Himself, are eternal individuals; they were individuals in the past, they are individuals in the present, and they will continue to remain individuals in the future, because all of us are individual souls eternally. 

We simply change our bodily dress in different manners, but actually we keep our individuality even after liberation from the bondage of material dress. An analytical study of the soul and the body has been very graphically explained by Lord Kṛṣṇa. And this descriptive knowledge of the soul and the body from different angles of vision has been described here as Sāṅkhya, in terms of the Nirukti dictionary. 
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 655 / Bhagavad-Gita - 655 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 66 🌴*

66. సర్వధర్మాన్ పరిత్యజ 
మామేకం శరణం వ్రజ |
అహం త్వాం సర్వపాపేభ్యో 
మోక్ష్యయిష్యామి మా శుచ: ||

🌷. తాత్పర్యం : 
సర్వవిధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము. నిన్ను సర్వపఫలముల నుండి నేను ముక్తిని గావింతును. భయము నొందకుము.

🌷. భాష్యము :
పరబ్రహ్మజ్ఞానము, పరమాత్మజ్ఞానము, వర్ణాశ్రమధర్మజ్ఞానము, సన్న్యాసాశ్రమ జ్ఞానము, అసంగత్వము, శమదమాదులు, ధ్యానము మొదలగువానికి సంబంధించిన జ్ఞానము, ధర్మవిధానములను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఇంతవరకు వివరించియున్నాడు. 

ధర్మవిధానములను పలువిధములుగా సైతము అతడు వర్ణించియుండెను. ఇక ఇప్పుడు గీతాజ్ఞానమును సంగ్రహపరచుచు తాను ఇంతవరకు వివరించియున్న ధర్మవిధానముల నన్నింటిని విడిచి, కేవలము తనకు శరణము నొందుమని అర్జునినితో శ్రీకృష్ణభగవానుడు పలుకుచున్నాడు. 

శ్రీకృష్ణభగవానుడు తానే స్వయముగా రక్షణము నొసగుదునని ప్రతిజ్ఞ చేసియున్నందున అట్టి శరణాగతి అర్జునుని తప్పక సర్వవిధములైన పాపఫలముల నుండి ముక్తుని చేయగలదు. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 655 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 66 🌴*

66. sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja
ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi mā śucaḥ

🌷 Translation : 
Abandon all varieties of religion and just surrender unto Me. I shall deliver you from all sinful reactions. Do not fear.

🌹 Purport :
The Lord has described various kinds of knowledge and processes of religion – knowledge of the Supreme Brahman, knowledge of the Supersoul, knowledge of the different types of orders and statuses of social life, knowledge of the renounced order of life, knowledge of nonattachment, sense and mind control, meditation, etc. He has described in so many ways different types of religion. 

Now, in summarizing Bhagavad-gītā, the Lord says that Arjuna should give up all the processes that have been explained to him; he should simply surrender to Kṛṣṇa. That surrender will save him from all kinds of sinful reactions, for the Lord personally promises to protect him.

In the Seventh Chapter it was said that only one who has become free from all sinful reactions can take to the worship of Lord Kṛṣṇa. Thus one may think that unless he is free from all sinful reactions he cannot take to the surrendering process. 

To such doubts it is here said that even if one is not free from all sinful reactions, simply by the process of surrendering to Śrī Kṛṣṇa he is automatically freed. There is no need of strenuous effort to free oneself from sinful reactions. One should unhesitatingly accept Kṛṣṇa as the supreme savior of all living entities. With faith and love, one should surrender unto Him.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 483 / Vishnu Sahasranama Contemplation - 483 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 483. సహస్రాంశుః, सहस्रांशुः, Sahasrāṃśuḥ 🌻*

*ఓం సహస్రాంశవే నమః | ॐ सहस्रांशवे नमः | OM Sahasrāṃśave namaḥ*

సహస్రాంశుః, सहस्रांशुः, Sahasrāṃśuḥ

త ఆదిత్యాదిగతా అప్యంశవోస్య హరే రితి 

వేలకొలదిగా కిరణములు కలవాడు కావున సూర్యునకు సహస్రాంశుః అని వ్యవహారము. ఆదిత్యునియందు ఉండు కిరణములు ఈ పరమాత్మునివే కావున ముఖ్యుడగు సహస్రాంశుడు విష్ణువే!

:: శ్రీమద్భగవద్గీత - పురుషోత్తమప్రాప్తి యోగము ::
యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఽఖిలమ్ ।
యచ్చన్ద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకమ్ ॥ 12 ॥

సూర్యునియందు ఏ తేజస్సు, ప్రకాశము, చైతన్యము ప్రపంచమునంతను ప్రకాశింపజేయుచున్నదో, అట్లే చంద్రునియందును, అగ్నియందును ఏ తేజస్సుగలదో, అదియంతయు నాదిగా నెరుంగుము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 483 🌹*
📚. Prasad Bharadwaj

*🌻 483. Sahasrāṃśuḥ 🌻*

*OM Sahasrāṃśave namaḥ*

Ta ādityādigatā apyaṃśavosya hare riti / त आदित्यादिगता अप्यंशवोस्य हरे रिति 

The rays of the sun and other luminaries are truly His. So, He is the chief Sahasrāṃśuḥ.

:: श्रीमद्भगवद्गीत - पुरुषोत्तमप्राप्ति योगमु ::
यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलम् ।
यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकम् ॥ १२ ॥

Śrīmad Bhagavad Gīta - Chapter 15
Yadādityagataṃ tejo jagadbhāsayate’khilam,
Yaccandramasi yaccāgnau tattejo viddhi māmakam. 12.

That light in the sun which illumines the whole world, that which is in the moon and the which is in fire - know that light to be Mine.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
धर्मगुब् धर्मकृद् धर्मी सदसत्क्षरमक्षरम् ।अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः ॥ ५१ ॥

ధర్మగుబ్ ధర్మకృద్ ధర్మీ సదసత్క్షరమక్షరమ్ ।అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః ॥ 51 ॥

Dharmagub dharmakrd dharmī sadasatkṣaramakṣaram,Avijñātā sahasrāṃśurvidhātā krtalakṣaṇaḥ ॥ 51 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 161 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 9. We Must Understand Life as It Is 🌻*

To understand life in its true perspective would be true philosophy. We must understand life as it is. We should not have a wrong idea about it. When we go to a place, we must understand where we are staying and what kind of people are around us. 

We should not go just like a fool, without knowing anything about the circumstances prevailing outside. “Where am I; what is this country; what kind of people are living around me, and what are the conditions in which I am going to be there?” All these are thoughts that might occur to our minds when we go to a new place. 

When we are in life, when we are living in this world, it must be our duty to understand what is the circumstance in which we find ourselves. “What is it that I am seeing in front of me; how am I related to these things, and what am I to do with these things? I have got to do something with them. I cannot just ignore them because they look at me, and they seem to be wanting something from me. How am I going to deal with these things that I call the world in front of me?”

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 67 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ప్రతి మనిషిలోని ఉన్నత శిఖరం దేవుడే. నువ్వు దేవుడి వైపు ఆరోహించడం ఆరంభిస్తే దేవుడు నీ వేపు అవరోహించడం ఆరంభిస్తాడు. అంటే నీవేపు సాగుతాడు. ఆ ఆరోహణ, అవరోహణల మధ్య ఎక్కడో ఒక కేంద్రంలో కలయిక జరుగుతుంది. దేవుడు నువ్వు సాగందే నీలోకి రాడు. 🍀*

నువ్వు పైకి వెళుతూ వుంటావు. దైవాన్ని అందుకోవాలను కుంటావు. ఎందుకంటే ఉన్నత స్థానానికి, నిజమైన ఉన్నత స్థానానికి ఎగబాకడమంటే అదే. తక్కిందంతా కింది స్థానంలో వున్నదే. నువ్వు దేవుని వైపు ప్రయాణిస్తే నువ్వు ఆరోహణలో వుంటావు. అక్కడ జరిగే అద్భుతమేమిటంటే నువ్వు దేవుడి వైపు ఆరోహించడం ఆరంభిస్తే దేవుడు నీ వేపు అవరోహించడం ఆరంభిస్తాడు. 

అంటే నీ వేపు సాగుతాడు. ఆ ఆరోహణ, అవరోహణల మధ్య ఎక్కడో ఒక కేంద్రంలో కలయిక జరుగుతుంది. అది వన్ వే కాదు, ఏ క్షణం అన్వేషకుడు సాగడం మొదలు పెడతాడో, అదే క్షణం దేవుడు తను సాగడం ఆరంభిస్తాడు. రెండూ ఏక కాలంలో సాగుతాయి. అవి ఒకే విధానానికి భిన్న ధృవాలు. చూసేవాడు, చూడబడేది. రెండూ ఒకటే. దేవుడు నువ్వు సాగందే నీలోకి రాడు. నువ్వు ఆరోహించందే అవరోహించడు.  

మనుషులు నిశ్చలనంగా జీవిస్తారు. ఏ మార్పు లేకుండా జీవిస్తారు. అవకాశం లేనట్లు జీవిస్తారు. అక్కడ అనంత అవకాశం వుంది. మనిషి అనంత శక్తితో భూమిలోకి వచ్చాడు. ప్రతి మనిషిలోని ఉన్నత శిఖరం దేవుడే. మన అస్తిత్వం దేవుడే. మనిషే దైవ ప్రయత్నం చేస్తున్నాడనుకో కూడదు. దేవుడు కూడా మనిషి కోసం ప్రయత్నిస్తున్నాడు. అది ఏకపక్షమయితే అక్కడ అందముండదు. చలనముండదు. చైతన్యముండదు, అట్లాకాదు. అది రెండు వైపుల్నించీ సాగే ప్రేమ వ్యవహారం.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-1🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।*
*రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀*

*🌻 307-1. 'రమ్యా' 🌻* 

రమ్యముగ నుండునది శ్రీమాత అని అర్థము. రమ్యమే తన తత్వముగ నున్నది. రమింప చేయునది శ్రీమాత. తానెప్పుడునూ అమితమగు ఆనంద స్థితియందే యుండును. అట్టి స్థితి జీవులకు కూడ కల్పించు చుండును. రమణీయమగు వస్తువును గాని, దృశ్యమునుగాని చూచునపుడు జీవులు రమ్యత నొందుదురు. రమ్యత కలిగిన స్థితిలో తాముండక ఆనందమే యుండును. రమ్యమగు దృశ్యము గోచరించినపుడు హృదయము పొంగి తమను తాము మరచుట జరుగుచుండును కదా! దీనికి కారణము శ్రీమాతయే. 

తాను ఎల్లప్పుడునూ శివమగు సత్యమునందే రమించుచుండుట వలన రమ్యమైనది. అట్టి రమ్యత్వమును సృష్టియం దేర్పరచినది. జీవులు కూడా సృష్టియందనేక విషయములను రమించుచుచున్నారు. ధనము, వస్తువులు, వాహనములు, ఆస్తులు, సంపదలు, అధికారము- ఇట్టి వానితో రమించుచూ జీవులు తీరుబడిలేక జీవించు చుండుటకు శ్రీమాత రమ్యత్వమే కారణము. తాను సత్యమునందు రమించుచూ జీవులకు సృష్టి రమ్యత ఏర్పరచి సుఖపెట్టు చుండును. 

ఇతర విషయములం దాసక్తి కలిగిన జీవులు క్రమముగ శాశ్వతానందము కొరకై అడ్రులు చాచగ, శివమగు సత్యము వైపునకు కూడ శ్రీమాత దారి చూపును. పురో గమనము, తిరోధానము రెండునూ గూడ అమ్మ ఆరాధకులకు సుఖ వంతమే. అమ్మ నారాధించు వారికి మార్గము రమ్యమై యుండును.  

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 307 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |*
*rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀*

*🌻 307. Ramyā रम्या (307) 🌻*

She is the most beautiful of all.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹