శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 307-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 307-1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 307-1. 'రమ్యా' 🌻


రమ్యముగ నుండునది శ్రీమాత అని అర్థము. రమ్యమే తన తత్వముగ నున్నది. రమింప చేయునది శ్రీమాత. తానెప్పుడునూ అమితమగు ఆనంద స్థితియందే యుండును. అట్టి స్థితి జీవులకు కూడ కల్పించు చుండును. రమణీయమగు వస్తువును గాని, దృశ్యమునుగాని చూచునపుడు జీవులు రమ్యత నొందుదురు. రమ్యత కలిగిన స్థితిలో తాముండక ఆనందమే యుండును. రమ్యమగు దృశ్యము గోచరించినపుడు హృదయము పొంగి తమను తాము మరచుట జరుగుచుండును కదా! దీనికి కారణము శ్రీమాతయే.

తాను ఎల్లప్పుడునూ శివమగు సత్యమునందే రమించుచుండుట వలన రమ్యమైనది. అట్టి రమ్యత్వమును సృష్టియం దేర్పరచినది. జీవులు కూడా సృష్టియందనేక విషయములను రమించుచుచున్నారు. ధనము, వస్తువులు, వాహనములు, ఆస్తులు, సంపదలు, అధికారము- ఇట్టి వానితో రమించుచూ జీవులు తీరుబడిలేక జీవించు చుండుటకు శ్రీమాత రమ్యత్వమే కారణము. తాను సత్యమునందు రమించుచూ జీవులకు సృష్టి రమ్యత ఏర్పరచి సుఖపెట్టు చుండును.

ఇతర విషయములం దాసక్తి కలిగిన జీవులు క్రమముగ శాశ్వతానందము కొరకై అడ్రులు చాచగ, శివమగు సత్యము వైపునకు కూడ శ్రీమాత దారి చూపును. పురో గమనము, తిరోధానము రెండునూ గూడ అమ్మ ఆరాధకులకు సుఖ వంతమే. అమ్మ నారాధించు వారికి మార్గము రమ్యమై యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 307 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 307. Ramyā रम्या (307) 🌻

She is the most beautiful of all.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



03 Sep 2021

No comments:

Post a Comment