🍀 22 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀

🌹🍀 22 - NOVEMBER - 2022 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🍀🌹
1) 🌹 22 - NOVEMBER - 2022 TUESDAY, మంగళవారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 93 / Kapila Gita - 93 🌹 సృష్టి తత్వము - 49
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 132 / Agni Maha Purana - 132 🌹 🌻. శిలా విన్యాస విధి - 2🌻
4) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 267 / Osho Daily Meditations - 267 🌹 పునరావృతత - REPETITION
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 414-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 414-2 🌹 ‘స్వప్రకాశ -2 - 'Swaprakasha'-2

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹22, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మాస శివరాత్రి, Masik Shivaratri🌻*

*🍀. శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం - 3 🍀*

*3. ఆపన్నాఖిల లోకార్తిహారిణే శ్రీహనూమతే |*
*అకస్మాదాగతోత్పాత నాశనాయ నమో నమః*
*4. సీతావియుక్త శ్రీరామశోక దుఃఖభయాపహ |*
*తాపత్రితయ సంహారిన్ ఆంజనేయ నమోఽస్తుతే*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : నిష్కామ కర్మానుష్ఠానానికి మొట్టమొదట సాధించ వలసినది కామరాహిత్యం. మంచివి గాని, చెడ్డవి గాని కోరికలు లేని స్థితిని నీవు మొదట నెలకొల్పుకోవాలి. కర్మ చేసేది వాస్తవానికి ఈశ్వర శక్తియని నీవు తెలుసుకోవాలి. నీ లోపలా వెలుపలా జరిగే సమస్త కర్మయూ మంచిది గానీ, చెడ్డది గానీ, అంతా ఆమె చేసేదే. 🍀*

🌷🌷🌷🌷🌷

శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,
దక్షిణాయణం, కార్తీక మాసం
తిథి: కృష్ణ త్రయోదశి 08:50:54 వరకు
తదుపరి కృష్ణ చతుర్దశి
నక్షత్రం: స్వాతి 23:13:06 వరకు
తదుపరి విశాఖ
యోగం: సౌభాగ్య 18:37:02 వరకు
తదుపరి శోభన
కరణం: వణిజ 08:47:54 వరకు
వర్జ్యం: 05:36:32 - 07:08:24 మరియు
28:26:50 - 29:56:30
దుర్ముహూర్తం: 08:39:31 - 09:24:31
రాహు కాలం: 14:50:45 - 16:15:07
గుళిక కాలం: 12:02:00 - 13:26:23
యమ గండం: 09:13:16 - 10:37:38
అభిజిత్ ముహూర్తం: 11:40 - 12:24
అమృత కాలం: 14:47:44 - 16:19:36
సూర్యోదయం: 06:24:31
సూర్యాస్తమయం: 17:39:29
చంద్రోదయం: 04:33:32
చంద్రాస్తమయం: 16:22:32
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు : ధ్వజ యోగం - కార్య సిధ్ధి
23:13:06 వరకు తదుపరి శ్రీవత్స
యోగం - ధన లాభం , సర్వ సౌఖ్యం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. కపిల గీత - 93 / Kapila Gita - 93🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 49 🌴*

*49. పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్సమన్వయాత్*
*అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే*

*వాయువు మొదలగు కార్యతత్త్వములయందు ఆకాశాది కారణతత్త్వములు గూడ ఉండుట వలన వాటి గుణములను కూడ క్రమమగా గ్రహింపనగును. కనుక పంచ మహాభూతములయొక్క గుణములైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు కేవలము పృథ్వియందు మాత్రమే గోచరించును. ఆకాశమునందు శబ్దగుణము ఒక్కటే ఉండును. వాయువునందు శబ్ద, స్పర్శ గుణములు రెండు ఉండును. తేజస్సునందు (అగ్నియందు) శబ్ద, స్పర్శ, రూప గుణములు మూడు ఉండును. జలమునందు శబ్ద, స్పర్శ, రూప, రస గుణములు నాలుగు ఉండును. పృథ్వియందు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ గుణములు ఐదును ఉండును*

*కార్యము యందు కారణ ధర్మం ఉంటుంది. అలా ఉంటుంది అని ఒప్పుకోకుంటే భూమిలో అయిదు గుణాలు ఉండటానికి అవకాశము దొరకదు. భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి. అందుకే అన్ని విశేష గుణాలూ భూమి యందు కనపడుతున్నాయి.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 93 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 2. Fundamental Principles of Material Nature - 49 🌴*

*49. parasya dṛśyate dharmo hy aparasmin samanvayāt*
*ato viśeṣo bhāvānāṁ bhūmāv evopalakṣyate*

*Since the cause exists in its effect as well, the characteristics of the former are observed in the latter. That is why the peculiarities of all the elements exist in the earth alone.*

*Sound is the cause of the sky, sky is the cause of the air, air is the cause of fire, fire is the cause of water, and water is the cause of earth. In the sky there is only sound; in the air there are sound and touch; in the fire there are sound, touch and form; in water there are sound, touch, form and taste; and in the earth there are sound, touch, form, taste and smell. Therefore earth is the reservoir of all the qualities of the other elements. Earth is the sum total of all other elements. The earth has all five qualities of the elements, water has four qualities, fire has three, air has two, and the sky has only one quality, sound.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 132 / Agni Maha Purana - 132 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 41*

*🌻. అథ శిలా విన్యాస విధి - 2🌻*

ఆ ఘారము, ఆజ్యభాగము అను ఆహుతులను ప్రణవముతో చేయవలెను. పిమ్మట అష్టాక్షరమంత్రముతో ఎనిమిది అహుతులిచ్చి ''ఓం భూః స్వాహా'' ''ఓం భువః స్వాహా'' ''ఓం సువః స్వాహా'' అని మూడు వ్యాహృతులతో క్రమముగాలోకేశ్వరుడైన అగ్నికిని, సోమగ్రహమునకును, శ్రీ మహావిష్ణువునకును ఆహుతులర్పింపివలెను. పిమ్మట ప్రాయశ్చిత్తహోమముచేసి, ప్రణవయుక్తమగు ద్వాదశాక్షరమంత్రముతో మినుములు, ఘృతము, తిలలు కలిపి పూర్ణాహుతి చేయవలెను. పిమ్మట ఆచార్యుడు పూర్వాభిముఖుడై, ఎనిమిది దిక్కులందు స్థాపించిన కలశములపై వేరువేరుగ పద్మాదిదేవతలను స్థాపించి పూజింపవలెను. 

మధ్య యందు కూడ భూమి అలికి ఒక శిలను కలశమును స్థాపింపవలెను. ఈ తొమ్మిదికలశములపై ఈ క్రింద జెప్పిన దేవతలను స్థాపింపవలెను. పద్మ-మహాపద్మ-మకర-కచ్ఛప-కుముద-ఆనంద-పద్మ- శంఖములను ఎనిమిది కలశములపై స్థాపించి, పద్మినిని మధ్యనున్న కలశముపై స్థాపింపవలెను.

ఈ కలశలను కదపగూడదు., వాటి సమీపమున తూర్పునుండి ప్రారంభించి ఈశాన్యదిక్కువరకును ఒక్కొక్క ఇటుక ఉంచవలెను. వాటిపై వాటి దేవతలైన విమలమొదలగు శక్తులను స్థాపింపవలెను. మధ్య అనుగ్రహ అను దేవతలను స్థాపింపవలెను. పిమ్మట- ''మునిశ్రేష్ఠుడైన అంగిరసుని పుత్రియై ఓ ఇష్టకాదేవీ! నీ ఏ అవయవము కూడ విరుగలేదు. వికృతము కాలేదు, నీవు నీ సర్వాంగములతో పూర్ణమై యున్నావు. ఇపుడు నిన్ను నేను ప్రతిష్ఠంచుచున్నాను అని'' ప్రార్థింపవలెను. ఉత్తముడైన ఆచార్యుడు ఈ మంత్రముతో ఇష్టకాస్థాపనముచేసి, ఏకాగ్రచిత్తుడై మధ్యప్రదేశము నందు గర్భాధానము చేయవలెను. 

దాని విధి-ఒక కలశముపై శ్రీ మహావిష్ణువును, శ్రీ మహాలక్ష్మిని స్థాపించి వారి సమీపమున మట్టి, పుష్పములు, ధాతువులు, రత్నములు ఉంచవలెను. పిమ్మట పండ్రెండు అంగుళముల వైశాల్యము, నాలుగు అంగుళముల ఎత్తగల, లోహాదినిర్మితమగు గర్భపాత్రలో అస్త్రపూజ చేయవలెను. పిమ్మట కమలాకారమగు తామ్రపాత్రలో పృథివిని పూజించి ఈ విధముగ ప్రార్థింపవలెను.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 132 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 41*
*🌻 Mode of performing consecration - 2 🌻*

10. The primary offering and the offering with clarified butter should be done with the syllable oṃ. Then subsequently eight offerings and again eight offerings with clarified butter (should be offered) with the syllables (known as) vyāhṛtis[11] duly.

11. After that offer oblation (in the fire) to the gods, Agni, Soma and Puruṣottama separately with vyāhṛtis.

12-13. The preceptor (officiating at the rite) should do the expiatory rite facing the eastern quarter offering to the image, meat, and sesamum along with ghee separately in the pitchers with the vedic syllables or the mystic formula of twelve syllables. Having scattered (sesamum) in the eight directions a stone and a pitcher should be placed at the centre and the following divinities (should be invoked) in order.

14. Padma[12], mahāpadma, makara, kacchapa, kumuda, nanda, padma, śaṅkha and padminī (are the divinities).

15. The pitchers should not be moved. Eight bricks should be placed in them duly beginning with the eastern direction and ending with the north-east.

16. The female energies Vimalā and others, the presiding deities of these bricks, should be invoked in their proper pitchers. The energy Anugraha should be invoked at the central pitcher.

17. “O perfect, unbroken, full-bodied brick, the daughter of the sage Aṅgiras, I am establishing you. You grant me the desired thing.”

18-20. The preceptor, having placed the brick with this mystic syllable should do garbhādhāna[13]. Having invoked the goddess Padminī at the central pitcher, earth, flowers, minerals, gems, and iron pieces as well as the weapons of deities of quarters (should be placed) in the hole of twelve fingers’ width and four fingers’ depth.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 267 / Osho Daily Meditations - 267 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀 267. మృదుత్వం 🍀*

*🕉. మృదువైనది ఎల్లప్పుడూ కఠినాన్ని అధిగమిస్తుంది. మృదువైనది సజీవంగా ఉన్నది; కఠినమైనది చచ్చిపోయినది. మృదువైనది పూలలాంటిది, కఠినమైనది శిలలా ఉంటుంది, శక్తివంతంగా కనిపిస్తుంది కానీ నపుంసకమైనది. మృదువైనది పెళుసుగా కనిపిస్తుంది కానీ సజీవంగా ఉంటుంది. 🕉*

*ఏది సజీవంగా ఉంటుందో అది ఎల్లప్పుడూ పెళుసుగా ఉంటుంది మరియు జీవన నాణ్యత ఎంత ఎక్కువగా ఉంటే అది మరింత పెళుసుగా, సున్నితంగా ఉంటుంది. కాబట్టి మీరు ఎంత లోతుగా వెళ్తే, అంతగా మీరు మృదువుగా అవుతారు, లేదా మీరు మృదువుగా మారితే, మీరు అంత లోతుగా వెళ్తారు. లోపలి మూలం ఖచ్చితంగా మృదువైనది. అది లావోట్జు యొక్క మొత్తం బోధన, టావో యొక్క బోధన: మృదువుగా ఉండండి, నీరులా ఉండండి; రాయిలా ఉండకు. నీరు రాతిపై పడుతోంది. చివరకు నీరు గెలుస్తుందని ఎవరూ ఊహించలేరు. నీరు గెలుస్తుందంటే నమ్మలేం.*

*రాయి చాలా బలంగా, దూకుడుగా ఉన్నట్లు అనిపిస్తుంది మరియు నీరు చాలా నిష్క్రియంగా ఉన్నట్లు అనిపిస్తుంది. బండపై నీరు ఎలా గెలుస్తుంది? కానీ కాలక్రమేణా రాయి అదృశ్య మవుతుంది. మృదువుగా ఉన్న నీరు గట్టిగా చొచ్చుకుపోతుంది. కాబట్టి ఇది నిరంతర స్మరణగా ఉండనివ్వండి. ఎప్పుడైతే మీరు కష్ట పడుతున్నారని ఫీలవుతున్నారో, దాని పర్యవసానంగానైనా వెంటనే శాంతంగా అయి మృదువుగా మారండి. మీరు ఓడిపోయినా, క్షణికావేశంలో మీకు నష్టం జరుగుతుందని చూసినా సరే. అది నష్టమే, కానీ మృదువుగా మారండి - ఎందుకంటే దీర్ఘకాలంలో, మృదుత్వం ఎల్లప్పుడూ గెలుస్తుంది.*
 
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 267 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 267. SOFTNESS 🍀*

*🕉. The soft always overcomes the hard. The soft is alive; the hard is dead. The soft is flowerlike, the hard is rocklike. The hard looks powerful but is impotent. The soft looks fragile but is alive. 🕉*

*Whatever is alive is always fragile, and the higher the quality of life, the more fragile it is. So the deeper you go, the softer you become, or the softer you become, the deeper you go. The innermost core is absolutely soft. That is the whole teaching of Lao Tzu, the teaching of Tao: Be soft, be like water; don't be like a rock. The water falls on the rock. Nobody can imagine that finally the water is going to win. It is impossible to believe that the water is going to win.*

*The rock seems to be so strong, so aggressive, and the water seems to be so passive. How is the water going to win over the rock? But in due course the rock simply disappears. By and by the soft goes on penetrating the hard. So let this be a continuous remembrance. Whenever you start feeling that you are becoming hard, immediately relax and become soft, whatever the consequence. Even if you are defeated and momentarily you see that there will be a loss, let it be a loss, but become soft - because in the long run, softness always wins.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 414 -2 / Sri Lalitha Chaitanya Vijnanam - 414 -2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।*
*అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀*

*🌻 414. 'స్వప్రకాశా’ - 2🌻* 

*ఇనుము, సత్తు వంటి లోహములు; గాడిద, వూరకుక్క వంటి జంతువులు; తుమ్మ, తాడి వంటి వృక్షములు; తమోగుణ ప్రధానులైన మానవులు; తమస్సుతో కూడిన అసురులు; తక్కువ ప్రకాశము గల వారగుటచే అంతగ పూజనీయులు కారు. అమ్మ అస్థిత్వమును బట్టే ఎవ్వరికైనను పూజార్హత.*

*ఆమె ఎవరియందు ఎక్కువ భాసించునో వారిని ఇతరులు పూజింతురు. పూజలన్నియూ చేరునది శ్రీమాతనే. పూజ లందుకొనువారు కూడ అమ్మకు అందించ వలసినదే. తమను పూజించు చున్నారని భ్రమపడినచో పతనము చెందుదురు. “సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి" అనునది సత్యము. ఈ సత్యమును మరచినవారు పూజనీయులు కారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 414 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*

*🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita*
*Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻*

*🌻 414. 'Swaprakasha' - 2🌻*

*Metals like iron and zinc; Animals like donkey, stray dogs; Trees like sage tree(tumma) and palm; Human beings who are lazy; Asuras with darkness; These are of lesser brightness and so are not worshiped. One is deemed worthy of worship only because of the Srimata's presence in them. He who has in him the presence of Srimata shall be worshipped by others. It is Sri Mata to whom all worship ultimately reaches.*

*Those who receive the worship also should ultimately offer it to Amma. They will fall when they are under the illusion that they are being worshipped. 'Sarvadeva namaskarah kesavam pratigachhati' is the truth. Those who forget this truth are not worthy of worship.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj

Be Aware

🌹Be Aware 🌹

The foundation of all spiritual growth and personal development is the awakening of self awareness. Most people however are not yet self aware, and the majority of those, are not aware that they are not aware.

Self awareness is easy and begins with simply taking a mental step back, and observing your thoughts, feelings, attitudes and actions. Whenever you do you learn about our self and the basis of personal change and growth is always learning.

Step back, what do you see, what enters your awareness? What does it tell you? What does it show you about yourself? Don't judge it, just see it. Don't run away from what you see just watch it. Accept it. Allow whatever is happening within your thoughts and feelings just to be. And suddenly you will find that inner peace which surpasseth all pleasure.

నిర్మల ధ్యానాలు - ఓషో - 262


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 262 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నీ ఆలోచనలు, మనసు, నీ అహం యివన్నీ మాయమయి పోయినపుడే ఆ గాఢ నిశ్శబ్దంలోనే నువ్విక్కడికి యాదృచ్చికంగా రాలేదని అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు.🍀


ఒకసారి నువ్వు ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెడితే నీ దృష్టి, దృక్పథం మారిపోతాయి. నువ్విక్కడికి యాదృచ్చికంగా రాలేదని అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమయిన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు. అస్తిత్వం నీ వెనకనే వుంటుంది.

నీ ఆలోచనలు, మనసు, నీ అహం యివన్నీ మాయమయి పోయినపుడే ఆ గాఢ నిశ్శబ్దంలోనే నువ్వా సంగతి గ్రహిస్తావు. ఆ స్పష్టతలో అన్ని మేఘాలూ అదృశ్యమయినపుడు నీ ముందు సూర్యుడు వెలుగుతాడు. ఆ కాంతిలో జీవితం రూపాంతరం చెందుతుంది. అప్పుడు జీవితానికి అర్థం, ప్రత్యేకత ఏర్పడతాయి. వాటి నించి ఉల్లాసం, ఆనందం వస్తాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

నిత్య ప్రజ్ఞా సందేశములు - 363 - 28. మనిషి ఎప్పుడూ . . . / DAILY WISDOM - 363 - 28. Man is not . . .


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 363 / DAILY WISDOM - 363 🌹

🍀 📖. ది ఫిలాసఫీ ఆఫ్ రిలిజియన్ నుండి 🍀

📝. ప్రసాద్ భరద్వాజ్

🌻28. మనిషి ఎప్పుడూ మేల్కొనే ఉండేవాడు కాదు🌻


మనిషి మేల్కొనే స్థితికి భిన్నమైన స్థితుల గుండా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. మనిషి ఎప్పుడూ మేల్కొనే ఉండడు; అతను మేల్కొని లేనప్పటికీ ఉనికిలో ఉండే సందర్భాలు ఉన్నాయి. కల అనేది ఒక ఉదాహరణ. మనిషి కలలో కూడా ఉంటాడు; అతను చనిపోలేదు. కానీ ఇక్కడ మేల్కొనే స్పృహ పనిచేయదు; ఇంద్రియాలు చురుకుగా ఉండవు. అప్పుడు తన భౌతిక కళ్లతో చూడడు, చెవులతో వినడు. కలలు కంటున్నప్పుడు చెవుల దగ్గర శబ్దం వస్తే, అతను వినకపోవచ్చు; నాలుకపై మధురమైన పదార్థాన్ని ఉంచినట్లయితే, అతను దానిని రుచి చూడలేడు.

స్వప్న స్థితిలో కూడా ఒక యంత్రాంగం పనిచేస్తూనే ఉంటుంది. 'నేను నిన్న కలలు కన్నాను,' అనేది కల నుండి మేల్కొన్నప్పుడు అందరూ సాధారణంగా చెప్పేది. 'నేను' కలలో ఉందా? అవును, 'నేను' అనేది ఉనికిలో ఉంది. ‘నేను’ ఏ స్థితిలో ఉంది? శరీరం వలె కాదు, ఎందుకంటే శరీరం క్రియారహితంగా ఉంది. అప్పుడు అక్కడ శరీరం ఉనికి గురించి తెలియదు. అప్పుడు ఆ వ్యక్తి శరీరంతో తనను తాను గుర్తించలేడు. మనిషి తన కలలో ఈ శరీరం కాదు. అప్పుడు అతను ఏమిటి? సరే, 'నేను మనస్సు మాత్రమే' అని ఒకరు అనవచ్చు. మనస్సు పనిచేస్తోంది; మనస్సు ఉనికిలో ఉంది; మనస్సు పనిచేస్తోంది; మనస్సు ఒక కల అని పరిగణించబడే మొత్తం దృగ్విషయాలను అనుభవిస్తోంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 DAILY WISDOM - 363 🌹

🍀 📖 from The Philosophy of Religion 🍀

📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj

🌻28. Man is not Always Waking🌻


There are occasions when man passes through states which are different from the waking one. Man is not always waking; he is in other conditions also, when he still exists. Dream is one instance. Man exists even in dream; he is not dead. But here the waking consciousness does not operate; the senses are not active. One does not see with the eyes, does not hear with the ears. If a sound is made near the ears when one is dreaming, he may not hear it; if a particle of sugar is placed on the tongue, he may not taste it.

A mechanism operates even in the state of dream. And, “I dreamt yesterday,” is what everyone generally says when one wakes up from dream. Did ‘I' exist in dream? Yes, ‘I' did exist. In what condition did ‘I' exist? Not as the body, for the body was inactive. One was not aware of the existence of the body. One could not identify oneself with the body. Man was not the body at all, for all practical purposes, in his dream. What was he, then? Well, one may say, “I was only the mind.” The mind was operating; the mind was existing; the mind was functioning; the mind was experiencing the whole phenomena of what could be regarded as a dream life.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

శ్రీ శివ మహా పురాణము - 646 / Sri Siva Maha Purana - 646


🌹 . శ్రీ శివ మహా పురాణము - 646 / Sri Siva Maha Purana - 646 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴

🌻. గణేశ యుద్ధము - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను -

శివ విభుడిట్లు పలుకగా గణములు దృఢనిశ్చయము చేసుకొని సర్వసన్నద్ధులై పార్వతీ మందిరమునకు వెళ్లిరి (1).

గణాధ్యక్షులందరు యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి యుండుటను గాంచి గణేశుడు వారితో నిట్లనెను (2).


గణేశుడిట్లు పలికెను -

శివుని ఆజ్ఞను పాలించు గణాధ్యక్షలందరీకీ స్వాగతము. బాలుడు, ఏకాకి అగు నేను పార్వతీ దేవి ఆజ్ఞను పాలించెదను (3). పార్వతీదేవి తన కుమారుని బలమును చూచుగాక! శివుడు కూడా తన గణముల బలమును చూడగలడు (4). ఈ యుద్ధములో భవాని పక్షమున బాలుడు, శివుని పక్షమున బలవంతులగు గణములు ఉన్నారు. మీరు పూర్వము అనేక యుద్ధములలో రాటు దేలిన యుద్ధ నిపుణులు (5). నేను పూర్వము యుద్ధమును చేయనే లేదు. బాలుడనగు నేను ఇపుడు యుద్ధమును చేయబోవు చున్నాను (6).

ఈ సంధర్భములో నాకు కలుగబోయే వినాశ##మేమియూ లేదు. పార్వతీ పరమేశ్వరులు సిగ్గుపడినచో, అది నాకు మీకు కూడ సిగ్గుపడదగినవిషయమే యగును (7). ఓ గణనాథులారా! మీరీ సత్యమునెరింగి యుద్ధమునకు దిగుడు. మీరు మీ ప్రభువు ముఖమును, నేను నా తల్లి ముఖమును చూచి (8), యుద్ధమును చేసెదము. ఎట్టి యుద్ధము జరుగవలసియున్నదో అట్టి యుద్ధము జరుగుగాక! దానిని అపగల సమర్థుడు ముల్లోకములలో లేడు (9).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 SRI SIVA MAHA PURANA - 646🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴

🌻 Gaṇeśa’s battle - 1 🌻



Brahmā said:—

1. When Śiva told them thus, they came to a decisive resolution. They got ready and went to Śiva’s palace.

2. On seeing the excellent Gaṇas, fully equipped for war, coming, Gaṇeśa spoke thus to them.


Gaṇeśa said:—

3. Welcome to the leaders of Gaṇas, carrying out the behests of Śiva. I am only one and that too a mere boy carrying out the directions of Pārvatī.

4. Yet let the goddess see the strength of her son. Let Śiva see the strength of his Gaṇas too.

5. The fight between the parties of Pārvatī and Śiva is the one between a strong army and a boy. You are all experts in warfare and have fought in many a battle.

6. I have never fought in a battle before. I am a mere boy. I am going to fight now. Still if you are put to shame, it will be shameful to Śiva and Pārvatī.

7. But that will not happen to me. If I am put to shame, the contrary will happen to me. Pārvatī and Śiva will be put to shame but not I.

8. O leader of the Gaṇas, the war shall be fought after realising this. You shall look up to your lord and I to my mother.

9. What sort of a fight shall be fought? Let what is destined to occur, occur. No one in the three worlds can ward it off.


Continues....

🌹🌹🌹🌹🌹

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 684 / Vishnu Sahasranama Contemplation - 684


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 684 / Vishnu Sahasranama Contemplation - 684🌹

🌻684. రణప్రియః, रणप्रियः, Raṇapriyaḥ🌻

ఓం రణప్రియాయ నమః | ॐ रणप्रियाय नमः | OM Raṇapriyāya namaḥ

రణప్రియః, रणप्रियः, Raṇapriyaḥ


ప్రియో రణో యస్య యతో ధత్తే పఞ్చమహాయుధమ్ ।
సతతం లోకరక్షార్థమతో వాఽయం రణప్రియః ॥

లోక రక్షార్థమై సతతము శంఖ, చక్ర, గదా, ధనుస్సు, కడ్గములను మహా ఆయుధములను ధరించుచుండువాడు. కావున ఆతడు రణ ప్రియుడు. ఎవనికి రణము ప్రియమో అట్టివాడు రణప్రియః.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 684🌹

🌻684. Raṇapriyaḥ🌻

OM Raṇapriyāya namaḥ


प्रियो रणो यस्य यतो धत्ते पञ्चमहायुधम् ।
सततं लोकरक्षार्थमतो वाऽयं रणप्रियः ॥

Priyo raṇo yasya yato dhatte pañcamahāyudham,
Satataṃ lokarakṣārthamato vā’yaṃ raṇapriyaḥ.


He always carries the five great warfare paraphernalia viz., the conch shell, discus, mace, bow and sword; ever ready to engage in war to protect the worlds.

🌻 🌻 🌻 🌻 🌻


Source Sloka

स्तव्यस्स्तवप्रियस्स्तोत्रं स्तुतिः स्तोता रणप्रियः ।पूर्णः पूरयिता पुण्यः पुण्यकीर्तिरनामयः ॥ ७३ ॥

స్తవ్యస్స్తవప్రియస్స్తోత్రం స్తుతిః స్తోతా రణప్రియః ।పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ 73 ॥

Stavyasstavapriyasstotraṃ stutiḥ stotā raṇapriyaḥ,Pūrṇaḥ pūrayitā puṇyaḥ puṇyakīrtiranāmayaḥ ॥ 73 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹

శ్రీమద్భగవద్గీత - 285: 07వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 285: Chap. 07, Ver. 05

 

🌹. శ్రీమద్భగవద్గీత - 285 / Bhagavad-Gita - 285 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 7 వ అధ్యాయము - జ్ఞానవిజ్ఞాన యోగం - 05 🌴

05. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ |
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ||


🌷. తాత్పర్యం :

ఓ మాహాబాహుడవైన అర్జునా! వాటికి అన్యముగా న్యునమైన ప్రకృతిని ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొక్కటి కలదు.

🌷. భాష్యము :

జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతమైన ప్రకృతికి (శక్తికి) చెందినవారని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అను వివిధాంశములుగా ప్రదర్శింపబడు భౌతికపదార్థమే న్యూనమైన శక్తి. భుమ్యాది స్థూలవిషయములు రెండు ప్రకృతిరూపములు న్యునశక్తి నుండి ఉద్భవించినట్టివే. వివిధప్రయోజనములకై ఈ న్యునశక్తులను వినియోగించుకొను జీవులు శ్రీకృష్ణభగవానుని ఉన్నతశక్తికి సంబంధించినవారై యున్నారు. అటువంటి ఈ ఉన్నతశక్తి వలననే సమస్తజగత్తు నడుచుచున్నది.

ఉన్నతశక్తికి చెందిన జీవుడు నడుపనిదే భౌతికజగత్తు నడువలేదు. కాని శక్తులు అన్నివేళలా వానిని కలిగియున్న శక్తిమానినిచే నియమింపబడి యున్నందున జీవులు సదా భగవానునిచే నియమింపబడెడివారే. కనుక వారికెన్నడును స్వతంత్ర ఉనికి యనునది ఉండదు. కొందరు బుద్ధిహీనులు ఊహించునట్లు వారెన్నడును భగవానునితో సమశక్తిమంతులు కాజాలరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 285 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 7 - Jnana Vijnana Yoga - 05 🌴

05. apareyam itas tv anyāṁ prakṛtiṁ viddhi me parām
jīva-bhūtāṁ mahā-bāho yayedaṁ dhāryate jagat


🌷 Translation :

Besides these, O mighty-armed Arjuna, there is another, superior energy of Mine, which comprises the living entities who are exploiting the resources of this material, inferior nature.

🌹 Purport :

Here it is clearly mentioned that living entities belong to the superior nature (or energy) of the Supreme Lord. The inferior energy is matter manifested in different elements, namely earth, water, fire, air, ether, mind, intelligence and false ego. Both forms of material nature, namely gross (earth, etc.) and subtle (mind, etc.), are products of the inferior energy. The living entities, who are exploiting these inferior energies for different purposes, are the superior energy of the Supreme Lord, and it is due to this energy that the entire material world functions. The cosmic manifestation has no power to act unless it is moved by the superior energy, the living entity.

Energies are always controlled by the energetic, and therefore the living entities are always controlled by the Lord – they have no independent existence. They are never equally powerful, as unintelligent men think.

🌷 🌷 🌷 🌷 🌷


21 Nov 2022 Daily Panchang నిత్య పంచాంగము


🌹21, నవంబరు, November 2022 పంచాగము - Panchagam 🌹

శుభ సోమవారం, Monday, ఇందు వాసరే

మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : ప్రదోష వ్రతం, Pradosh Vrat🌻

🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 8 🍀

13. కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహాన్

14. స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మానవుల హేతుబద్ధ ప్రవృత్తి లక్షణం విశ్వాసాలను అనుసరించడం. సహజ, ప్రవృత్తులను సమర్థించడం. ఇదే సామాన్యంగా హేతుబద్ధ మనుకొనే బుద్ధిచేసే పని. కాని, అందుకు ప్రేరణ అంతశ్చేతనలో నుంచి కానరాకుండా జరుగుతున్నందు వల్ల మానవులు తాము హేతుబద్ధంగా ప్రవర్తిస్తున్నామనే అనుకుంటూ వుంటారు. 🍀

🌷🌷🌷🌷🌷


శుభకృత్‌ సంవత్సరం, శరద్‌ ఋతువు,

దక్షిణాయణం, కార్తీక మాసం

తిథి: కృష్ణ ద్వాదశి 10:08:27 వరకు

తదుపరి కృష్ణ త్రయోదశి

నక్షత్రం: చిత్ర 24:14:49 వరకు

తదుపరి స్వాతి

యోగం: ఆయుష్మాన్ 21:07:20 వరకు

తదుపరి సౌభాగ్య

కరణం: తైతిల 10:04:27 వరకు

వర్జ్యం: 08:29:20 - 10:03:48

మరియు 29:35:46 - 31:07:42

దుర్ముహూర్తం: 12:24:16 - 13:09:18

మరియు 14:39:22 - 15:24:25

రాహు కాలం: 07:48:24 - 09:12:51

గుళిక కాలం: 13:26:11 - 14:50:38

యమ గండం: 10:37:18 - 12:01:45

అభిజిత్ ముహూర్తం: 11:39 - 12:23

అమృత కాలం: 17:56:08 - 19:30:36

సూర్యోదయం: 06:23:58

సూర్యాస్తమయం: 17:39:31

చంద్రోదయం: 03:38:02

చంద్రాస్తమయం: 15:41:46

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: కన్య

యోగాలు : ముద్గర యోగం - కలహం 24:14:49

వరకు తదుపరి ఛత్ర యోగం - స్త్రీ లాభం

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹