Showing posts with label జీవాత్మ ప్రపంచ నియమాలు. Show all posts
Showing posts with label జీవాత్మ ప్రపంచ నియమాలు. Show all posts

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 5 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 5 🌹
🌻 Chapter - సానుకూలంగా ఆలోచించండి. 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q:- మనం ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని మనకు ఎలా తెలుస్తుంది? 🌻 

Ans :-
1) భయం:--
నెగటివ్ ఆలోచనలు వల్ల, మన చుట్టూ -ve ఆలోచనలు చేసే వ్యక్తులు ఉన్న, దైవము పట్ల విశ్వాసం లేకపోయినా, ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల, అవగాహన లోపం వల్ల భయం ఏర్పడుతుంది. ఇది మన ఉపచేతనాత్మక మనస్సు గుర్తిస్తుంది,

మనం మన ఇంటిని నిరాడంబరంగా, శుభ్రంగా, సూర్యరశ్మి తగిలే విధంగా , మొక్కలతో ఉంచుకోవాలి. ఇవన్నీ మనలో సానుకూల స్పందనలు కలిగిస్తాయి.

2) చింత:-
నిరంతరం చింతిస్తూ ఉన్న కూడా కిందకి అనగా కింది ఆవరణకు పడిపోతాం. 

మనం ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి. దైవము పట్ల విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోవడం అంటే కారులో పెట్రోల్ పోయకుండా కారు నడవాలనుకోవడం లాంటిది.

3) సంశయం:--
మనం గురువుని కూడా సంశయిస్తాం. మంచి గురువా కాదా అని. గురువు పట్ల విశ్వాసం ఉండాలి. అలా విశ్వాసం లేకుండా ఉన్న కూడా ప్రతికూలంగా ఆలోచించినట్లే.

4) నసపెట్టడం:--
నస పెట్టడం ఆధ్యాత్మికంగా తప్పు. ఇది అహం నుండి పుడుతుంది. మానసికంగా వేధించడం, మాటలతో చిత్రహింస పెట్టడం, ఇదంతా స్వార్థంతో వారి మాట నిలబెట్టుకోవడం కోసం చేస్తారు.

5) ఫిర్యాదు, గొణుగుతూ ఉండడం:--
-ve గా ఆలోచించే వ్యక్తి ఎప్పుడు గొణుగుతూ, ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. 

ఆ విధంగా -ve నే ఎక్కువగా ఆకర్షిస్తుంటాడు,మనం positive గా ఆలోచిస్తూ ఉంటే ఆ ఆలోచనలే ఆ వ్యక్తులే మన వైపు ఆకర్షింపబడతారు.

6) అవసరమైన దాని కన్నా ఎక్కువ కష్టపడటం:--
ఒక వ్యక్తి తాను ఆ పని చేయలేకపోయినా దానిని చేస్తున్నాడంటే అతనికి గర్వం,అహం ఉన్నట్లు. 

భూలోకంలోని ఆత్మలన్ని ఒకరికొకరు సహాయం చేసుకోవడానికే సృష్టింపబడ్డారు, తానొక్కరే ఆ పనిని చేస్తున్నానని చెప్తే వారికి గర్వం ఉన్నట్లే. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

7) అసూయ:--
మనల్ని వేరొకరితో పోల్చుకుంటే మనం భూలోకంలోకి ఎందుకు వచ్చామో ఆ వచ్చిన లక్ష్యం లో వెనకబడిపోతాం. మనకున్న వాటితో తృప్తి పడాలి.

ఎవరైనా ఏదైనా సాధిస్తే, వారిని చూసి సంతోష పడడం నేర్చుకోవాలి,వారి నుండి స్ఫూర్తిని పొందండి, ఆత్మలోక ఆత్మలు అలానే జీవిస్తాయి, మనకున్నదానికి సదా దైవానికి కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి.

8) ఇతరులను నిందించడం:--
మనలో భాధ ఉంటే నే ఇతరుల్ని నిందిస్తాము, ముందు అదేమిటో తెలుసుకోండి, లోపాన్ని సరిచేసుకుని,మారడానికి ప్రయత్నించండి.

9) ప్రతికూలమైన ఆలోచనలకు బానిస అవడం:--
-ve గా ఆలోచించే వ్యక్తులు సమస్య ఏది లేకపోయినా వారే సృష్టించుకుని బాధపడుతుంటారు, వారి మీద వారు జాలి పడుతూ, ఎప్పుడూ నిరాశ, నిస్పృహలతో వుంటారు.

10) అసహనం:--
అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు,సదా సహనంగా ప్రశాంతంగా ఉండండి.

వీటన్నింటిని మనం గుర్తించాలి,పైన చెప్పిన వాటిలో మనలో ఏ భావం ఉన్న మనం ప్రతికూలంగా ఉన్నట్లే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 4 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 4 🌹
🌻. గర్వం వినయం 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q3:- గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనం అవుతాడు? 🌻 

A:-1) విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు :
గర్వం ఉన్నందువల్ల మనం పూర్తిగా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాము, భౌతిక మనస్సుకు ఆధ్యాత్మిక నియమాలు తెలియవు, ఇతరులు మన గురించి ఏమనుకోవాలనుకుంటామో దాని గురించి ఆలోచించి వారి మెప్పు కోసం పనులు చేస్తూ, అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం.

2) ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు :
గర్వం పెరగడం వల్ల వారు దేవుడున్నడని నమ్మరు,ఉన్నత శక్తి వుండే అవకాశం లేదంటారు, వారి చేష్టల వల్ల వారి ఉపచేతనాత్మక మనస్సుని నిద్రాణ0 చేసుకుంటారు.

3) తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి :
మనం ఏదైనా వ్యతిరేక మయిన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘంలా వ్యతిరేక శక్తి కమ్ముకుని వెలుతురిని రానివ్వకుండా ఒక చక్రం సృష్టింపబడుతుంది, దానివల్ల మనం బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము.

4) అసూయ వస్తుంది :
అసూయ వల్ల మనం ఇతరులతో పోల్చుకుంటాం, మనకు జరిగిన మంచి విషయాలను గమనించకుండా మనకేమి జరగలేదో అవే గుర్తుతెచ్చుకుని బాధపడుతూ, ఇతరులకు జరిగిన మంచి విషయాలు చూసి సహించలేరు.

6) ఎప్పుడు అసంతృప్తితో ఉంటాడు :
భూలోకంలో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం తృప్తి తో జీవించడం, భౌతిక మనస్సు మాట వినడం వల్ల అహం ఏర్పడుతుంది, అది మనల్ని ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది, మనం ఆ కోరికలకు లోబడి పోయి సంపద, అధికారం, కీర్తి, సంపాదిస్తాం, కానీ అవేమి మనకు తృప్తిని ఇవ్వవు.

7) శత్రువులు అధికం అవుతారు :
గర్వాన్ని అదుపులో ఉంచుకోకుండా అనాలోచితంగా మూర్ఖంగా మాట్లాడడం వల్ల శత్రువులు ఏర్పడతారు.

8) బంధుత్వాలు నష్టపోవడం జరుగుతుంది. :
గర్వం వల్ల ఆధిక్యతా భావం వస్తుంది, దీనివల్ల బంధుత్వాలు నిలబడవు.

9) ఆశలు expectations ఎక్కువ అవుతాయి :
అహం ఉన్నందువల్ల ఇది నేనే చెయ్యాలి,ఇది నాకే దక్కాలి, అనుకుంటాం, దీనివల్ల ఆశ , ఆశ వల్ల వత్తిడి, ఆశ వల్ల ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటారు.

ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతడు అతని దృష్టిని మరలుస్తాడో అతను ఆధ్యాత్మికంగా ఎదుగుతాడు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 3 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 3 🌹
🌻. గర్వం వినయం 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ 

🌻 Q:- వినయం ఎలా వస్తుంది. 🌻

A:-1) ఉపచేతనాత్మక మనస్సు (subconcious mind) చెప్పిన్నట్టు వినయం,వినయం సహజ0గా వస్తుంది.

2) ప్రార్థన ఉద్దేశ్యం మనల్ని ఉన్నత చైతన్యం ద్వారా సృష్టింపబద్దామని గుర్తుతెచుకోవడం.

3) దేవుడు అందరిని ఒకేలా సృష్టించాడు,మనం భూలోకంలో పరీక్షలు ఎదుర్కొని శిక్షణ పొందాలి. ప్రతి ఒక్కరు వివిధ రకాల ప్రతిభలతో పుడతారు,కావున మనం అధికులం అనే ప్రసక్తే లేదు.

3) సేవ చేయడం నేర్చుకోండి,నిష్కపట0గా ఉండి ,ఇతరుల అభిప్రాయాల్ని అర్థం చేసుకోండి.

4) తప్పుల్ని అంగీకరించండి,అప్పుడు మాత్రమే మార్పు సాధ్యం అవుతుంది.

5) ఆధ్యాత్మికత పాఠం నేర్చుకోవడమే కాదు,దాన్ని ఆచరించాలి,అప్పుడే ఆత్మ బలోపేతం అవుతుంది.

6) సహనంతో ఉండండి,వ్యక్తులు వారి ఆధ్యాత్మిక అభివృద్ధిలో వివిధ దశల్లో ఉన్నారని,వారి పరీక్షలు,వారి శిక్షణ,వారి కర్మ భిన్నంగా వుంటాయని గ్రహించండి,వారికి ఆధ్యాత్మిక జ్ఞానం భిన్న స్థాయిల్లో ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 2 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 2 🌹
🌻. గర్వం వినయం 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ
 
🌻 Q:- వ్యక్తికి తాను గర్వంగా వున్నానని ఎలా తెలుస్తుంది? 🌻 

A:- గర్వానికి సంకేతాలు.
1)దేవుని ఉనికిని నమ్మడు.
2)తాను చేసిన తప్పుల్ని అంగీకరించడు.
3)వేరొకరు మనల్ని తప్పని,వారిది రైట్ అంటే భరించలేరు.
4)సత్యాన్నుంచి పారిపోతారు.
5)ఇతరుల కంటే అధికులమంటారు.
6)వారికే ప్రతిభ ఉందని అనుకుంటారు.
7)వారికి ఎవరు సాటి లేరనుకుంటారు.
8)అన్ని వారికే తెలుసు అనుకుంటారు.
9)వారి అభిప్రాయం సరైనదనుకుంటారు.
10)ఇతరులను తక్కువగా చూస్తూ వారు తక్కువ వారు అనుకుంటారు.
11)ఎవరినైనా బాధపెట్టిన లెక్కపెట్టరు.
12)వారికి జరిగే మంచి అంతటికీ కారణం వారే అనుకుంటారు.
13)వారికంటే వేరొకరు గొప్ప అని ఏ విషయంలో ఒప్పుకోరు.
14)అందరికి లోపాలుంటాయి,అందరూ తప్పులు చేస్తారు,అని అర్థం చేసుకోరు.
15)వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు.
16)అసహనంతో మొండిగా,విసుగ్గా వుంటారు.
17)మార్పును ప్రతిఘటిస్తారు.
18)ఎవరైనా వారితో ఏకీభవించక పోతే తట్టుకోలేరు.
ఇలాంటివి ఏమైనా మనలో ఉన్నాయా అని మనం అనుక్షణం check చేసుకుంటూ ఉండాలి.ఇలాంటివి ఉంటే మనలో గర్వం ఉన్నట్లే.
🌹 🌹 🌹 🌹 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 1 🌹

🌹. జీవాత్మ ప్రపంచ నియమాలు - 1 🌹
🌻. అక్షం మార్పు 🌻
✍️. భావనగరి
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 Q:-అక్షం మారడమంటే ఏంటి?అక్షం మారితే మనిషి ఎదుర్కోవాల్సిన పరిణామాలేంటి?ఆత్మ లోక ఆత్మ ఎలాంటి వారిని రక్షిస్తాయి? 🌻

A: ఉన్నత చైతన్యం లేదా దేవుడు మనిషికి సంకల్ప స్వేచ్ఛను ఇచ్చాడు కానీ మనిషి పెడదారిలో నడుస్తూ,చెడు పనులు చేస్తూ ఉండడం వల్ల చెడు స్పందనలు ఏర్పడతున్నాయి. ఆ చెడు స్పందనలను ప్రకృతి గ్రహిస్తుంది.

మనిషి ఉపచేతనాత్మక మనస్సుని వినకుండా,పూర్తిగా ఆధ్యాత్మిక మార్గానికి దూరంగా వెళుతున్నాడు. అద్భుతమైన ప్రకృతి సమతుల్యాన్ని నాశనం చేస్తున్నాడు. అందువల్ల ప్రకృతిలో ప్రతికూల శక్తి,చేడు స్పందనలు బాగా ఎక్కువవుతున్నాయి. ఇదంతా ఆధ్యాత్మిక లోపం వల్లనే,ప్రకృతికి మెరుగుపరచగల, నాశనం చేయగల సామర్ధ్యం ఉంది.

మనిషి యొక్క చెడు స్పందనలు వల్ల దృవాల స్థలమార్పు జరుగుతుంది, భౌతికంగా భూఅక్షం మారుతుంది, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి, భూకంపాలు, వరదలు, tornodos, అగ్నిపర్వతాలు బద్దలవడం, ఇవన్నీ ప్రకృతి మన ఆలోచనలు మారాలని మనకిచ్చే హెచ్చరికలు.

ఉదాహరణకు మన శరీరాన్ని భూమితో పోల్చవచ్చు,మన శరీరంలో, జలుబు,fever, వ్యాధుల ద్వారా మన శరీరం సమతుల్యస్థితికి చేరుకుంటుంది,అలాగే ప్రకృతి ప్రకృతివైపరిత్యాల ద్వారా సమతుల్యం పొందుతుంది,దైవాదృష్టి అంతా పవిత్రంగా,ఉదారంగా,శాంతియుతంగా ఉండాలి, మనిషి సన్మార్గంలో నడవాలి.
ఎవరైయితే సన్మార్గంలో వుంటారో,ఎవరైతే ఉన్నత ఆవరణకు చేరి వుంటారో వారిని వారి స్పందనలు బట్టి ఆత్మలోక ఆత్మలు రక్షిస్తాయి.

ప్రపంచంలో 25% మాత్రమే బ్రతుకుతారు. కెనడా, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా లో కొన్ని ప్రదేశాలలో ప్రతికూల ఆలోచనలు తక్కువ ఉన్నాయి.

జలప్రళయం, భూకంపంతో, ప్రపంచమంతా గొలుసుకట్టు ప్రతిస్పందనలు జరుగుతూ శుద్ధప్రక్రియ జరుగుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹