గీతోపనిషత్తు -174

🌹. గీతోపనిషత్తు -174 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 17

🍀 17. యుక్త ప్రవర్తన - మితమగు ఆహారము, విహారము, యుక్తమగు కర్మ, నిద్ర పాటించు యోగ సాధకునకు దుఃఖము లన్నియు హరింపబడి యోగము సిద్ధించును. ఆహార, నిద్ర, నియమములతో పాటు విహారము, కర్మాచరణము కూడ జోడింపబడినవి. అపుడే యోగసాధన సిద్ధించు అవకాశము కలదు. . దేహబంధము, బాహ్య బంధము కలుగ కుండవలె నన్నచో విచక్షణతో సర్వమును నియంత్రించుకొన వలెను. అట్టి విచక్షణా బుద్ధిని తన యందు బలపరచమని దైవమును అంతరంగమున ప్రార్థించవలెను. సద్గుణము లున్నచోటనే తెలివి సమయమునకు పనికి వచ్చును. సద్గుణములు కలుగుటకు సకల సద్గుణ సంపన్నుడగు దైవము నారాధించుటే మార్గము. 🍀

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు |
యుక్త స్వప్నా వబోధస్య యోగో భవతి దు:ఖహా || 17

మితమగు ఆహారము, విహారము, యుక్తమగు కర్మ, నిద్ర పాటించు యోగ సాధకునకు దుఃఖము లన్నియు హరింపబడి యోగము సిద్ధించును. ఆహార, నిద్ర, నియమములతో పాటు విహారము, కర్మాచరణము కూడ జోడింపబడినవి. అపుడే యోగసాధన సిద్ధించు అవకాశము కలదు. జీవితమున బహిరంగ కార్యక్రమములు కర్మను బట్టి బంధించు అవకాశమెంతైన కలదు.

మన పనులు, చేష్టలు, విహారములు, వ్యవహారములు సరిగ నిర్వర్తించనపుడు జీవుడు బాహ్య ప్రపంచమున బంధితుడగును. ఆహారము, నిద్ర విషయముల యందు నియమములు పాటింపనపుడు అనారోగ్యము కలిగి దేహము బంధించును. దేహబంధము, బాహ్య బంధము కలుగ కుండవలె నన్నచో విచక్షణతో సర్వమును నియంత్రించుకొన వలెను. అట్టి విచక్షణా బుద్ధిని తన యందు బలపరచమని దైవమును అంతరంగమున ప్రార్థించవలెను.

యుక్తమగు ఆహారము, యుక్తమగు విహారము, యుక్తమగు వ్యవహారము, యుక్తమగు నిద్ర ఇవి ప్రతినిత్యము గమనించు కొనుచుండవలెను. ఈ విషయమునందు అశ్రద్ధ యుండరాదు.

బాహ్యమున సాధకుడు ప్రవర్తించు తీరు నుండి చిక్కులు కొనితెచ్చుకొనుట జరుగుచుండును. ఇది సర్వసామాన్యము. తన స్వభావమునందుగల కోరికలు, సంఘమునందలి పోకడలు తనకు అందివచ్చు అవకాశములు సాధకుని యుక్తముకాని విషయములలోనికి ప్రోత్సహించును.

తనకు గాని విషయమున తాను తలదూర్చుట వలన క్రొత్త చిక్కులను తెచ్చుకొనును. జన్మతః

ఉన్న చిక్కులను అనగా ప్రారబ్ధమును నిర్వర్తింపకపోగ మరికొంత జోడగు చుండును. ఒక చిక్కును తొలగించు కొనబోయి పది చిక్కులలో పడుట సాధారణముగ జరుగుచుండును. ఇది పనికిమాలిన తెలివి. తెలివితేటల వలన మాత్రమే చిక్కులను తొలగించుకొన లేము. సద్గుణములున్న చోటనే తెలివి సమయమునకు పనికి వచ్చును.

సద్గుణములు కలుగుటకు సకల సద్గుణ సంపన్నుడగు దైవము నారాధించుటే మార్గము కాని, అడ్డదారులు ఉపయోగ పడవు. దుఃఖము కలుగక యోగము సాగవలె నన్నచో కష్టమైనను, నష్టమైనను ఈ శ్లోకమున చెప్పినవి పాటింపవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 51 / Sri Lalita Sahasranamavali - Meaning - 51

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 51 / Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

🍀 51. దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా ।
సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ॥ 51 ॥🍀

🍀 193. దుష్టదూరా -
దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.

🍀 194. దురాచార శమనీ -
చెడు నడవడికను పోగొట్టునది.

🍀 195. దోషవర్జితా -
దోషములచే విడిచి పెట్టబడింది.

🍀 196. సర్వజ్ఞా -
అన్నిటినీ తెలిసింది.

🍀 197. సాంద్రకరుణా -
గొప్ప దయ గలది.

🍀 198. సమానాధిక వర్జితా -
ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹

📚. Prasad Bharadwaj

🌻 51. duṣṭadūrā durācāra-śamanī doṣavarjitā |
sarvajñā sāndrakaruṇā samānādhika-varjitā || 51 || 🌻

🌻 193 ) Dushta doora -
She who keeps far away from evil men

🌻 194 ) Durachara samani -
She who destroys evil practices

🌻 195 ) Dosha varjitha -
She who does not have anything bad

🌻 196 ) Sarvangna -
She who knows everything

🌻 197 ) Saandra karuna -
She who is full of mercy

🌻 198 ) Samanadhika varjitha -
She who is incomparable

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 196

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 196 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అవతారపురుషుడు - సద్గురువు చేయు మహిమలు 🌻

730. భగవంతునిలో అవతార పురుషునకు గల సంబంధము ఐచ్ఛిక సాన్నిహిత్యము.

731. భగవంతునితో సద్గురువునకు గల సంబంధము అనైఛ్చిక సాన్నిహిత్యము.

732. అవతార పురుషుడు మహిమలు చేయుటలో.... భగవంతుడు అభినేత (కారణుడు) మానవుడు నిమిత్తమాత్రుడు.

733. సద్గురువు మహిమలు చేయుటలో, మానవుడు అభినేత (కారణుడు) భగవంతుడు నిమిత్త మాత్రుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2021

శ్రీ శివ మహా పురాణము - 374

🌹 . శ్రీ శివ మహా పురాణము - 374 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 11

🌻. హిమవంతునితో శివుని సమాగమము - 2 🌻

హే భక్తజనవత్సలా! నీ ఆనందము బాహ్య విషయ భోగమునందు లేదు. త్రిగుణాత్మకమగు మాయ నీ అధీనమునందుండును. పరబ్రహ్మ పరమాత్మ వగు నీకు నమస్కారము (16).

నీవు విష్ణు బ్రహ్మ స్వరూపడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవింతురు. విష్ణు బ్రహ్మలకు ఆనందము నిచ్చునది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కరామగు గాక! (17). తపస్సుపై నీకు ప్రీతి మెండు. నీవు తపోనిధివి. భక్తుల మంచి తపస్సునకు ఫలమునిచ్చునది నీవే. నీవు శాంతుడవు. పరబ్రహ్మవగు నీకు నమస్కారము (18).

నీవు సగుణ రూపములో సర్వేశ్వరుడవై లోకాచారములను ప్రవర్తిల్ల జేయుచూ, వాటిని నీవు స్వయముగా ఆచరించెదవు. పరమాత్మవగు నీకు నమస్కారము (19). ఓ మహేశ్వరా! సాధువులకు సుఖములనిచ్చు నీ లీలను తెలియుట శక్యము కాదు. నీవు భక్తుల వశములో నుండి వారికి అనుకూలమగు కర్మలను చేయుచూ, వారికి ఆత్మరూపుడవై ఉన్నావు (20).

హే ప్రభో! నీవు ఇచటకు విచ్చేయుట నాకు మహా భాగ్యము. దీనవత్సలుడవని వర్ణింపబడు నీవు నన్ను నీ రాకచే సనాథుని చేసినావు (21). ఈనాడు నా పుట్టుక సఫలమైనది. నా జీవనము సఫలమైనది. నీవిచటకు వచ్చుటచే నాకు చెందిన సర్వము సఫలమైనది (22).

ఓ మహేశ్వరా! నేను నీ దాసుడనని యెరుంగుము. నిస్సంకోచముగా నన్ను ఆజ్ఞాపించుము. నేను మరియొక తలంపు లేనివాడనై గొప్ప ప్రీతితో నీ సేవను చేసెదను (23).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడు పర్వత రాజు యొక్క ఈ మాటలను విని, కన్నులను కొద్దిగా తెరచి, పరివార సమేతుడగు హిమవంతుని గాంచెను (24). జగత్ప్రభువు, ధ్యానయోగమునందున్నవాడు అగు వృషధ్వజుడు పరివారముతో గూడి అట్లు సవినయముగా నిలబడియున్న పర్వత రాజును గాంచి, ఆశ్చర్యమును చెందిన వాడు వోలె ఇట్లు పలికెను (25).

మహేశ్వరుడిట్లు పకిలెను-

నేను నీ శిఖరముపై ఏకాంతముగా తపస్సును చేయుటకు వచ్చియుంటిని. నా సమీపమునకు ఎవ్వరైననూ రాని విధముగా ఏర్పాటు చేయుము (26). నీవు మహాత్ముడవు. తపస్సును చేయు అనేక మునులకు నీవు చక్కని ఆశ్రయమై ఉన్నావు. మరియు, దేవతలు, రాక్షసులే గాక ఇతరులగు మహాత్ములు (27), బ్రాహ్మణులు మొదలగు వారు సర్వదా నీయందు నివసించియున్నారు. గంగా జలముచే నీవు నిత్య శుద్ధుడవు. పర్వతములన్నింటికీ రాజగు నీవు పరోపకారమును చేయు ప్రభుడవు (28). నేనీ గంగావతరణ క్షేత్రములో తపస్సును చేసెదను. ఓ పర్వతరాజా! నేను జితేంద్రియుడనై మిక్కిలి ప్రీతితో నిన్ను ఆశ్రయించినాను (29).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

23 Mar 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 3

🌼. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 3 🌼

సంకలనం : వేణు మాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🌸. మహాపూర్ణవాణి 🌸

🥀. సంసారికి మోక్షం లేదు. ఇది తిరుగులేని సిద్ధాంతం, అయితే దీని భావం గృహస్థుకు మోక్షం లేదని కాదు. సంసారం అంటే భార్యాపిల్లలూ అని కాదు అర్థం.

సంసారం అంటే కోరికలు. కోరికలు ఉన్న వానికి మోక్షం లేదు. బాహ్యానికి గృహస్థుడుగా ఉన్నప్పటికీ కోరికలు లేకుండా ఉండగలిగితే వాడు సంసారికాడు.

వానికి మోక్షం కరతలామలకమే. బాహ్యానికి సన్న్యాసిగా ఉన్నప్పటికీ వానికి ఏమాత్రమైనా కోరికలుంటే వానికి మోక్షం గగనకుసుమమే. వాడు సన్న్యాసీ కాడు, గృహస్థుడూ కాడు, సామాన్య సంసారీ కాడు భ్రష్టుడు‌.

🥀. మడి కట్టుకున్నాను అనీ, ఎవరైనా తగిలితే మైలపడిపోతున్నావు అంటున్నావు కదా, ఇతరులు తాకినంత మాత్రాన మైలపడే నీ మడిలో పటుత్వం ఏమి ఉంది!

నీదే కనుక పటుత్వం ఉన్న మడి అయితే, నిన్ను తగిలిన వారంతా మడిపడాలి గాని, నీవు మైల పడరాదు. అంత పటుత్వమైన మడి నీలో ఉన్నది. అది నీవు గ్రహించుకోవటం లేదు.

హృదయాన్ని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచుకో! అందరినీ అన్నిటినీ నీ ఇష్టదైవం యొక్క మారు రూపాలుగా గుర్తించు-చాలు. ఇదే అసలైన పటుత్వం గల మడి.

ఇలా చెప్పాను గదా అని ఇక స్నానం చేయటం మానివేస్తావేమో, స్నానమూ మానరాదు, శాస్ర్తమూ, పెద్దలు విధించిన సత్కర్మలూ మానరాదు. సిద్ధి కలిగే వరకూ అవి చేస్తూ ఉండవలసినదే. కాని కేవలం బాహ్యకర్మలతోటే మడి, పవిత్రతా వస్తాయని మాత్రం భ్రమపడబోకు.

🥀. మడీ, పవిత్రతా గుణముల చేతనే రావాలి.

🌸 🌸 🌸 🌸 🌸

23 Mar 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2

🌼. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2 🌼

సంకలన : వేణు మాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🥀. ఆధ్యాత్మిక‌ జీవన విధానమును అవలంబించిన‌ వారు‌ జీవితంలో చాలా కష్టాలను‌ అనుభవించవలసి ఉంటుందని, చాలా పరీక్షలకి వారు తట్టుకొని నిలవాలని చెపుతారు. అది ఎంత వరకు సత్యము ? 🥀

🌻. తనను అన్వేషించు వారి మార్గంలో అవరోధాలను కలిగించి ముళ్ళను పరచుట భగవంతునికి ఇష్టమైన పనికాదు.

మానవుడు తాను నడిచే దారిలో తానే అరటిపండు తొక్కలు, ముళ్ళు పడవేసుకోకుండా ఉంటే చాలు. ఇతరుల మార్గంలో కూడ అతడు ఆ విధంగా చేయకుండా ఉండాలని కోరుకొనడమైనది.

అతడు బాధ్యతను గుర్తించవలసి యున్నది. పొరబాటైన ఆలోచన, మాట, ఆచరణ అనే వాటిలో పొరబాట్లు రాకుండా ఉండేటట్లుగా అభ్యాసము చేయాలి.

మనకి మనమే ఏర్పరచుకొనే పరీక్షలు తప్ప వేరే పరీక్షలకు మనము గురికావలసిన పనిలేదు. ఒక యువకుడు ఒక యువతితో భావావేశ పూరితమైన స్నేహంలోకి దిగినప్పుడు ఆ వ్యవహారము చక్కబడి అతడు దాని నుండి బయటపడే స్థితిలో తనను తాను ఉంచుతాడు.

ఆ విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఆ సన్నవేశాలను పరిష్కరించుకొనే ప్రయత్నంలో తాను వెతుకుచున్న‌ కష్టాలను చవిచూస్తాడు. కారణాలు మాత్రము తనకన్నా బాహ్యములైనవిగా ఉంటాయి.

తన కష్టాలకు గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో అతడు ఇతరులను అనుమానిస్తాడు. నక్షత్రాలను, గ్రహములను, చివరకు తన ఉనికికి కారణమైన భగవంతుని కూడ అనుమానిస్తాడు. ఆ విధంగా నీ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులు పెట్టే పరీక్షలు ఏమీ ఉండవు.

నీకు మంచిని సూచించడానికే గురువుకు సమయం దొరుకుతుంది గాని నిన్ను పరీక్షించడానికి కాదు.

🌼 🌼 🌼 🌼 🌼

23 Mar 2021

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 1 : సువర్ణ సోపానములు - Golden Stairs - 1

🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 1 🌷

🌴. సువర్ణ సోపానములు - Golden Stairs - 1 🌴

✍️. సద్గురు ఎక్కిరాల కృష్ణమాచార్య.

🌻. పరిపూర్ణత కొరకు జాగరూకత 🌻

పరిశుద్ధ జీవనము, మర్మములేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి యెడల సోదర భావము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట,

దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,

తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,

పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు .......

🌻 🌻 🌻 🌻 🌻

A CLEAN LIFE, AN OPEN MIND, A PURE HEART, AN EAGER INTELLECT, AN UNVEILED SPIRITUAL PERCEPTION, A BROTHERLINESS FOR ONE'S CO-DISCIPLE,

A READINESS TO GIVE AND RECEIVE ADVICE AND INSTRUCTION, A LOYAL SENSE OF DUTY TO THE TEACHER, A WILLING OBEDIENCE TO THE BEHESTS OF TRUTH,

A COURAGEOUS ENDURANCE OF PERSONAL INJUSTICE, A BRAVE DECLARATION OF PRINCIPLES , A VALIANT DEFENCE OF THOSE WHO ARE UNJUSTLY ATTACKED,

AND A CONSTANT EYE TO THE IDEAL OF HUMAN PROGRESSION AND PERFECTION WHICH THE SECRET SCIENCE DEPICTS.

✍️. Master E. K.

THESE ARE THE GOLDEN STAIRS UP THE STEPS OF WHICH THE LEARNER MAY CLIMB TO THE "TEMPLE OF DIVINE WISDOM". — Madam H.P.

"సువర్ణ సోపానములు". ఇవి పరమ పూజ్యురాలు బ్రహ్మవాదిని అగు బ్లావెట్ స్కీ‌ మాత ద్వారమున జ్వాలా కూలమహర్షిచే మానవ లోకమునకు ప్రసాదింపబడినవి.

🌷 🌷 🌷 🌷 🌷

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకె #MasterEK

Join and Share

🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷

www.facebook.com/groups/masterek/

https://t.me/ChaitanyaVijnanam

www.facebook.com/groups/chaitanyavijnanam/

23 Mar 2021

23-MARCH-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 174🌹  
2) 🌹. శివ మహా పురాణము - 374🌹 
3) 🌹 Light On The Path - 123🌹
4) 🌹 Seeds Of Consciousness - 321🌹   
5) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 196🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 51 / Lalitha Sahasra Namavali - 51🌹 
7) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 51 / Sri Vishnu Sahasranama - 51🌹
8) 🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 1 🌹
9) 🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 2 🌹
10) 🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 3🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -174 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 17

*🍀 17. యుక్త ప్రవర్తన - మితమగు ఆహారము, విహారము, యుక్తమగు కర్మ, నిద్ర పాటించు యోగ సాధకునకు దుఃఖము లన్నియు హరింపబడి యోగము సిద్ధించును. ఆహార, నిద్ర, నియమములతో పాటు విహారము, కర్మాచరణము కూడ జోడింపబడినవి. అపుడే యోగసాధన సిద్ధించు అవకాశము కలదు. . దేహబంధము, బాహ్య బంధము కలుగ కుండవలె నన్నచో విచక్షణతో సర్వమును నియంత్రించుకొన వలెను. అట్టి విచక్షణా బుద్ధిని తన యందు బలపరచమని దైవమును అంతరంగమున ప్రార్థించవలెను. సద్గుణము లున్నచోటనే తెలివి సమయమునకు పనికి వచ్చును. సద్గుణములు కలుగుటకు సకల సద్గుణ సంపన్నుడగు దైవము నారాధించుటే మార్గము. 🍀*

యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు |
యుక్త స్వప్నా వబోధస్య యోగో భవతి దు:ఖహా || 17

మితమగు ఆహారము, విహారము, యుక్తమగు కర్మ, నిద్ర పాటించు యోగ సాధకునకు దుఃఖము లన్నియు హరింపబడి యోగము సిద్ధించును. ఆహార, నిద్ర, నియమములతో పాటు విహారము, కర్మాచరణము కూడ జోడింపబడినవి. అపుడే యోగసాధన సిద్ధించు అవకాశము కలదు. జీవితమున బహిరంగ కార్యక్రమములు కర్మను బట్టి బంధించు అవకాశమెంతైన కలదు. 

మన పనులు, చేష్టలు, విహారములు, వ్యవహారములు సరిగ నిర్వర్తించనపుడు జీవుడు బాహ్య ప్రపంచమున బంధితుడగును. ఆహారము, నిద్ర విషయముల యందు నియమములు పాటింపనపుడు అనారోగ్యము కలిగి దేహము బంధించును. దేహబంధము, బాహ్య బంధము కలుగ కుండవలె నన్నచో విచక్షణతో సర్వమును నియంత్రించుకొన వలెను. అట్టి విచక్షణా బుద్ధిని తన యందు బలపరచమని దైవమును అంతరంగమున ప్రార్థించవలెను. 

యుక్తమగు ఆహారము, యుక్తమగు విహారము, యుక్తమగు వ్యవహారము, యుక్తమగు నిద్ర ఇవి ప్రతినిత్యము గమనించు కొనుచుండవలెను. ఈ విషయమునందు అశ్రద్ధ యుండరాదు.
బాహ్యమున సాధకుడు ప్రవర్తించు తీరు నుండి చిక్కులు కొనితెచ్చుకొనుట జరుగుచుండును. ఇది సర్వసామాన్యము. తన స్వభావమునందుగల కోరికలు, సంఘమునందలి పోకడలు తనకు
అందివచ్చు అవకాశములు సాధకుని యుక్తముకాని విషయములలోనికి ప్రోత్సహించును. 

తనకు గాని విషయమున తాను తలదూర్చుట వలన క్రొత్త చిక్కులను తెచ్చుకొనును. జన్మతః
ఉన్న చిక్కులను అనగా ప్రారబ్ధమును నిర్వర్తింపకపోగ మరికొంత జోడగు చుండును. ఒక చిక్కును తొలగించు కొనబోయి పది చిక్కులలో పడుట సాధారణముగ జరుగుచుండును. ఇది పనికిమాలిన తెలివి. తెలివితేటల వలన మాత్రమే చిక్కులను తొలగించుకొన లేము. సద్గుణములున్న చోటనే తెలివి సమయమునకు పనికి వచ్చును. 

సద్గుణములు కలుగుటకు సకల సద్గుణ సంపన్నుడగు దైవము నారాధించుటే మార్గము కాని, అడ్డదారులు ఉపయోగ పడవు. దుఃఖము కలుగక యోగము సాగవలె నన్నచో కష్టమైనను, నష్టమైనను ఈ శ్లోకమున చెప్పినవి పాటింపవలెను. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/BhagavadGita_Telugu_English
www.facebook.com/groups/bhagavadgeetha/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 374🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 11

*🌻. హిమవంతునితో శివుని సమాగమము - 2 🌻*

హే భక్తజనవత్సలా! నీ ఆనందము బాహ్య విషయ భోగమునందు లేదు. త్రిగుణాత్మకమగు మాయ నీ అధీనమునందుండును. పరబ్రహ్మ పరమాత్మ వగు నీకు నమస్కారము (16). 

నీవు విష్ణు బ్రహ్మ స్వరూపడవు. విష్ణు బ్రహ్మాదులు నిన్ను సేవింతురు. విష్ణు బ్రహ్మలకు ఆనందము నిచ్చునది నీవే. నీకు భక్తి ప్రియమైనది. నీకు నమస్కరామగు గాక! (17). తపస్సుపై నీకు ప్రీతి మెండు. నీవు తపోనిధివి. భక్తుల మంచి తపస్సునకు ఫలమునిచ్చునది నీవే. నీవు శాంతుడవు. పరబ్రహ్మవగు నీకు నమస్కారము (18). 

నీవు సగుణ రూపములో సర్వేశ్వరుడవై లోకాచారములను ప్రవర్తిల్ల జేయుచూ, వాటిని నీవు స్వయముగా ఆచరించెదవు. పరమాత్మవగు నీకు నమస్కారము (19). ఓ మహేశ్వరా! సాధువులకు సుఖములనిచ్చు నీ లీలను తెలియుట శక్యము కాదు. నీవు భక్తుల వశములో నుండి వారికి అనుకూలమగు కర్మలను చేయుచూ, వారికి ఆత్మరూపుడవై ఉన్నావు (20).

హే ప్రభో! నీవు ఇచటకు విచ్చేయుట నాకు మహా భాగ్యము. దీనవత్సలుడవని వర్ణింపబడు నీవు నన్ను నీ రాకచే సనాథుని చేసినావు (21). ఈనాడు నా పుట్టుక సఫలమైనది. నా జీవనము సఫలమైనది. నీవిచటకు వచ్చుటచే నాకు చెందిన సర్వము సఫలమైనది (22). 

ఓ మహేశ్వరా! నేను నీ దాసుడనని యెరుంగుము. నిస్సంకోచముగా నన్ను ఆజ్ఞాపించుము. నేను మరియొక తలంపు లేనివాడనై గొప్ప ప్రీతితో నీ సేవను చేసెదను (23). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహేశ్వరుడు పర్వత రాజు యొక్క ఈ మాటలను విని, కన్నులను కొద్దిగా తెరచి, పరివార సమేతుడగు హిమవంతుని గాంచెను (24). జగత్ప్రభువు, ధ్యానయోగమునందున్నవాడు అగు వృషధ్వజుడు పరివారముతో గూడి అట్లు సవినయముగా నిలబడియున్న పర్వత రాజును గాంచి, ఆశ్చర్యమును చెందిన వాడు వోలె ఇట్లు పలికెను (25). 

మహేశ్వరుడిట్లు పకిలెను-

నేను నీ శిఖరముపై ఏకాంతముగా తపస్సును చేయుటకు వచ్చియుంటిని. నా సమీపమునకు ఎవ్వరైననూ రాని విధముగా ఏర్పాటు చేయుము (26). నీవు మహాత్ముడవు. తపస్సును చేయు అనేక మునులకు నీవు చక్కని ఆశ్రయమై ఉన్నావు. మరియు, దేవతలు, రాక్షసులే గాక ఇతరులగు మహాత్ములు (27), బ్రాహ్మణులు మొదలగు వారు సర్వదా నీయందు నివసించియున్నారు. గంగా జలముచే నీవు నిత్య శుద్ధుడవు. పర్వతములన్నింటికీ రాజగు నీవు పరోపకారమును చేయు ప్రభుడవు (28). నేనీ గంగావతరణ క్షేత్రములో తపస్సును చేసెదను. ఓ పర్వతరాజా! నేను జితేంద్రియుడనై మిక్కిలి ప్రీతితో నిన్ను ఆశ్రయించినాను (29). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 123 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 16 🌻*

467. It may be asked: “Why seek it by what it is not, if you can have a touch of atmic consciousness?” Frankly speaking, it is not atmic consciousness you get in the brain, but a little vibration from the manasic aspect of atma differing from any other vibration in the manasic consciousness. 

Vibrations started on higher planes are different from those that begin on the manasic plane. When a person attains to the highest stage of the Path proper – the fourth or Arhat Path – then, in meditation out of the body, he can pass into samadhi and reach the atmic consciousness in nirvana.

468. C.W.L. – This twofold triple division, of the methods by which we are to seek the way and the laws which correspond with those methods, is illuminating and without a doubt intentional. Plunging into the depths of one’s inmost being leads to the study of the laws of being – the laws of that plane which lies beyond all that is manifestation for us, that is to say, nirvana. The higher planes are, of course, still planes of manifestation, and even what lies beyond them is not really unmanifested, but it is so to us, at our present stage. 

Only by study of the laws of being shall we be able to fulfil the real purpose of plunging into the depths of our inmost being, which is to “make obeisance to the dim star which burns within”. Clearly that is a very high stage in development – when we look for the atma and follow only that.

469. The testing of all experience corresponds with the study of the laws of nature, that is to say, the laws of the phenomenal world, those which work on the physical, astral and mental planes into which the personality plunges. 

Then we are to learn to understand the individuality by the study of the laws of the supernatural, by which evidently are meant the laws of those worlds in which the ego, as such, moves, that is to say, the laws of the buddhic plane and the higher part of the mental plane. Of course there is nothing supernatural, but that word is used here evidently in a somewhat technical sense. 

Through all the planes it is the one Life which expresses itself in different ways, and there is no break of natural law and order in the whole scheme; only when we come to a region beyond anything that any of our physical, astral or mental senses can touch, are we reaching up into something beyond the nature which most of us know, where other and wider laws operate. 

I think it is in that sense that the Chohan uses this word “supernatural”. Beyond the sphere of these senses we pass into a region above the phenomenal, to what the Greeks called the noumenal world, which is the source and cause of the phenomenal worlds. 

So the meaning of this passage appears to be that when we thoroughly understand the personality we shall have grasped “the laws of nature”; when we are seeking to understand the individuality, we shall be dealing with the “laws of the supernatural”, and when, beyond that, we try to realize the atma, we shall be studying the “laws of being”.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds Of Consciousness - 321 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 170. Watching happens to the Absolute with the appearance of 'I am', then does it knows that 'it is'.🌻*

The Absolute or 'Parabrahman' is as it is, formless and eternal. It does not require anything and is not dependent on anything. Watching just happens to the Absolute with the spontaneous appearance of 'I am'. 

Just as you begin watching a dream as it spontaneously appears, you are not actually involved in any of the events that are dreamt. With the appearance of the 'I am' the Absolute knows that 'it is', although this knowing is of no use to the Absolute nor does it depend on it.
 
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 196 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అవతారపురుషుడు - సద్గురువు చేయు మహిమలు 🌻*

730. భగవంతునిలో అవతార పురుషునకు గల సంబంధము ఐచ్ఛిక సాన్నిహిత్యము.

731. భగవంతునితో సద్గురువునకు గల సంబంధము అనైఛ్చిక సాన్నిహిత్యము.

732. అవతార పురుషుడు మహిమలు చేయుటలో.... భగవంతుడు అభినేత (కారణుడు) మానవుడు నిమిత్తమాత్రుడు.

733. సద్గురువు మహిమలు చేయుటలో, మానవుడు అభినేత (కారణుడు) భగవంతుడు నిమిత్త మాత్రుడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 51 / Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 51. దుష్టదూరా, దురాచార శమనీ, దోషవర్జితా ।*
*సర్వజ్ఞా, సాంద్రకరుణా, సమానాధికవర్జితా ॥ 51 ॥🍀*

🍀 193. దుష్టదూరా - 
దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.

🍀 194. దురాచార శమనీ - 
చెడు నడవడికను పోగొట్టునది.

🍀 195. దోషవర్జితా - 
దోషములచే విడిచి పెట్టబడింది.

🍀 196. సర్వజ్ఞా - 
అన్నిటినీ తెలిసింది.

🍀 197. సాంద్రకరుణా - 
గొప్ప దయ గలది.

🍀 198. సమానాధిక వర్జితా - 
ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 51 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 51. duṣṭadūrā durācāra-śamanī doṣavarjitā |*
*sarvajñā sāndrakaruṇā samānādhika-varjitā || 51 || 🌻*

🌻 193 ) Dushta doora -   
She who keeps far away from evil men

🌻 194 ) Durachara samani -   
She who destroys evil practices

🌻 195 ) Dosha varjitha -   
She who does not have anything bad

🌻 196 ) Sarvangna -   
She who knows everything

🌻 197 ) Saandra karuna -   
She who is full of mercy

🌻 198 ) Samanadhika varjitha -   
She who is incomparable

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/SriMataChaitanyam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 51 / Sri Vishnu Sahasra Namavali - 51 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*కన్యా రాశి- హస్త నక్షత్రం 3వ పాద శ్లోకం*

*🍀 51. ధర్మకృబ్ధర్మకృద్ధర్మీ సదసక్షర మక్షరం|*
*అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః|| 51 🍀*

 🍀 475) ధర్మగుప్ - 
ధర్మమును రక్షించువాడు.

🍀 476) ధర్మకృత్ - 
ధర్మము నాచరించువాడు.

🍀 477) ధర్మీ - 
ధర్మమునకు ఆధారమైనవాడు.

🍀 478) సత్ - 
మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.

🍀 479) అసత్ - 
పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.

🍀 480) క్షర: - 
వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.

🍀 481) అక్షర: - 
క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.

🍀 482) అవిజ్ఞాతా - 
తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.

🍀 483) సహస్రాంశు: - 
అనంత కిరణములు గలవాడు.

🍀 484) విధాతా - 
సర్వమునకు ఆధారమైనవాడు.

🍀 485) కృతలక్షణ: - 
వేదశాస్త్రములను వెలువరించినవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 51🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Kanya Rasi, Hasta 3rd Padam*

*🌻 51. dharmagubdharmakṛddharmī sadasatkṣaramakṣaram |*
*avijñātā sahasrāṁśurvidhātā kṛtalakṣaṇaḥ || 51 || 🌻*

🌻 475. Dharmagub: 
One who protects Dharma.

🌻 476. Dharmakṛd: 
Though above. Dharma and Adharma, He performs Dharma in order to keep up the traditions in respect of it.

🌻 477. Dharmī: 
One who upholds Dharma.

🌻 478. Sat: 
The Parabrahman who is of the nature of truth.

🌻 479. Asat: 
As the Aparabrahma has manifested as the world He is called Asat (not having reality).

🌻 480. Kṣaram: 
All beings subjected to change.

🌻 481. Akṣaram: 
The changeless one.

🌻 482. Aviñātā: 
One who is without the attributes of a Jiva or vigyata like sense of agency, etc.

🌻 483. Sahasrāṁśuḥ: 
One with numerous rays, that is the Sun.

🌻 484. Vidhātā: 
One who is the unique support of all agencies like Ananta who bear the whole universe.

🌻 485. Kṛtalakṣaṇaḥ: 
One who is of the nature of conscousness.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasra
www.facebook.com/groups/vishnusahasranam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 1 🌷

🌴. సువర్ణ సోపానములు - Golden Stairs - 1 🌴
✍️. సద్గురు ఎక్కిరాల కృష్ణమాచార్య.

🌻. పరిపూర్ణత కొరకు జాగరూకత 🌻

పరిశుద్ధ జీవనము, మర్మములేని మనస్సు, నిర్మల హృదయము, జిజ్ఞాసువగు చిత్తము, మాటుపడని అతీంద్రియ గ్రహణము, సహాధ్యాయి యెడల సోదర భావము, సలహాలను, నియమములను స్వీకరించుటకును, ఇచ్చుటకును సంసిద్ధత కలిగియుండుట,

దేశికుని యెడల విశ్వాసనీయమైన ధర్మానుష్టాన బుద్ధి, సత్యసూత్రములను అంగీకరించి విధేయుడగుట, వ్యక్తిగతముగా తనకు జరిగిన అన్యాయమును ధీరతతో సహించుట,

తన సిద్ధాంతములను నిర్భీతిగా నుద్ఘాటించుట, అన్యాయమునకు గురిచేయబడిన వారిని తెగువతో కాపాడుట, గుప్తవిద్య సూచించు ఆదర్శములగు మానవ పురోభివృద్ధి,

పరిపూర్ణతల యెడ నిరంతరము, జాగరూకత కలిగి యుండుట అనునవి దివ్యజ్ఞానమను ఆలయమునకు సాధకుడు ఆరోహణ చేయుటకు వలసిన సువర్ణ సోపానములు .......

🌻 🌻 🌻 🌻 🌻

A CLEAN LIFE, AN OPEN MIND, A PURE HEART, AN EAGER INTELLECT, AN UNVEILED SPIRITUAL PERCEPTION, A BROTHERLINESS FOR ONE'S CO-DISCIPLE,

A READINESS TO GIVE AND RECEIVE ADVICE AND INSTRUCTION, A LOYAL SENSE OF DUTY TO THE TEACHER, A WILLING OBEDIENCE TO THE BEHESTS OF TRUTH,

A COURAGEOUS ENDURANCE OF PERSONAL INJUSTICE, A BRAVE DECLARATION OF PRINCIPLES , A VALIANT DEFENCE OF THOSE WHO ARE UNJUSTLY ATTACKED,

AND A CONSTANT EYE TO THE IDEAL OF HUMAN PROGRESSION AND PERFECTION WHICH THE SECRET SCIENCE DEPICTS.
✍️. Master E. K. 

THESE ARE THE GOLDEN STAIRS UP THE STEPS OF WHICH THE LEARNER MAY CLIMB TO THE "TEMPLE OF DIVINE WISDOM". — Madam H.P.

"సువర్ణ సోపానములు". ఇవి పరమ పూజ్యురాలు బ్రహ్మవాదిని అగు బ్లావెట్ స్కీ‌ మాత ద్వారమున జ్వాలా కూలమహర్షిచే మానవ లోకమునకు ప్రసాదింపబడినవి.
🌷 🌷 🌷 🌷 🌷
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకె #MasterEK
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌼. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2 🌼
సంకలన : వేణు మాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ 

🥀. ఆధ్యాత్మిక‌ జీవన విధానమును అవలంబించిన‌ వారు‌ జీవితంలో చాలా కష్టాలను‌ అనుభవించవలసి ఉంటుందని, చాలా పరీక్షలకి వారు తట్టుకొని నిలవాలని చెపుతారు. అది ఎంత వరకు సత్యము ? 🥀 

🌻. తనను అన్వేషించు వారి మార్గంలో అవరోధాలను కలిగించి ముళ్ళను పరచుట భగవంతునికి ఇష్టమైన పనికాదు. 

మానవుడు తాను నడిచే దారిలో తానే అరటిపండు తొక్కలు, ముళ్ళు పడవేసుకోకుండా ఉంటే చాలు. ఇతరుల మార్గంలో కూడ అతడు ఆ విధంగా చేయకుండా ఉండాలని కోరుకొనడమైనది. 

అతడు బాధ్యతను గుర్తించవలసి యున్నది. పొరబాటైన ఆలోచన, మాట, ఆచరణ అనే వాటిలో పొరబాట్లు రాకుండా ఉండేటట్లుగా అభ్యాసము చేయాలి.

మనకి మనమే ఏర్పరచుకొనే పరీక్షలు తప్ప వేరే పరీక్షలకు మనము గురికావలసిన పనిలేదు. ఒక యువకుడు ఒక యువతితో భావావేశ పూరితమైన స్నేహంలోకి దిగినప్పుడు ఆ వ్యవహారము చక్కబడి అతడు దాని నుండి బయటపడే స్థితిలో తనను తాను ఉంచుతాడు. 

ఆ విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఆ సన్నవేశాలను పరిష్కరించుకొనే ప్రయత్నంలో తాను వెతుకుచున్న‌ కష్టాలను చవిచూస్తాడు. కారణాలు మాత్రము తనకన్నా బాహ్యములైనవిగా ఉంటాయి. 

తన కష్టాలకు గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో అతడు ఇతరులను అనుమానిస్తాడు. నక్షత్రాలను, గ్రహములను, చివరకు తన ఉనికికి కారణమైన భగవంతుని కూడ అనుమానిస్తాడు. ఆ విధంగా నీ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులు పెట్టే పరీక్షలు ఏమీ ఉండవు. 

నీకు మంచిని సూచించడానికే గురువుకు సమయం దొరుకుతుంది గాని నిన్ను పరీక్షించడానికి కాదు.
🌼 🌼 🌼 🌼 🌼
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్‌ఇకె #MasterEK 
http://www.facebook.com/groups/masterek/
FB Telegram groups 
http://www.facebook.com/groups/chaitanyavijnanam/