మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2


🌼. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 2 🌼

సంకలన : వేణు మాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ

🥀. ఆధ్యాత్మిక‌ జీవన విధానమును అవలంబించిన‌ వారు‌ జీవితంలో చాలా కష్టాలను‌ అనుభవించవలసి ఉంటుందని, చాలా పరీక్షలకి వారు తట్టుకొని నిలవాలని చెపుతారు. అది ఎంత వరకు సత్యము ? 🥀

🌻. తనను అన్వేషించు వారి మార్గంలో అవరోధాలను కలిగించి ముళ్ళను పరచుట భగవంతునికి ఇష్టమైన పనికాదు.

మానవుడు తాను నడిచే దారిలో తానే అరటిపండు తొక్కలు, ముళ్ళు పడవేసుకోకుండా ఉంటే చాలు. ఇతరుల మార్గంలో కూడ అతడు ఆ విధంగా చేయకుండా ఉండాలని కోరుకొనడమైనది.

అతడు బాధ్యతను గుర్తించవలసి యున్నది. పొరబాటైన ఆలోచన, మాట, ఆచరణ అనే వాటిలో పొరబాట్లు రాకుండా ఉండేటట్లుగా అభ్యాసము చేయాలి.

మనకి మనమే ఏర్పరచుకొనే పరీక్షలు తప్ప వేరే పరీక్షలకు మనము గురికావలసిన పనిలేదు. ఒక యువకుడు ఒక యువతితో భావావేశ పూరితమైన స్నేహంలోకి దిగినప్పుడు ఆ వ్యవహారము చక్కబడి అతడు దాని నుండి బయటపడే స్థితిలో తనను తాను ఉంచుతాడు.

ఆ విధంగా తనకు తానే పరీక్ష పెట్టుకుంటాడు. ఆ సన్నవేశాలను పరిష్కరించుకొనే ప్రయత్నంలో తాను వెతుకుచున్న‌ కష్టాలను చవిచూస్తాడు. కారణాలు మాత్రము తనకన్నా బాహ్యములైనవిగా ఉంటాయి.

తన కష్టాలకు గల కారణాలను తెలుసుకొనే ప్రయత్నంలో అతడు ఇతరులను అనుమానిస్తాడు. నక్షత్రాలను, గ్రహములను, చివరకు తన ఉనికికి కారణమైన భగవంతుని కూడ అనుమానిస్తాడు. ఆ విధంగా నీ ఆధ్యాత్మిక మార్గంలో ఇతరులు పెట్టే పరీక్షలు ఏమీ ఉండవు.

నీకు మంచిని సూచించడానికే గురువుకు సమయం దొరుకుతుంది గాని నిన్ను పరీక్షించడానికి కాదు.

🌼 🌼 🌼 🌼 🌼




23 Mar 2021

No comments:

Post a Comment