1) 🌹 శ్రీమద్భగవద్గీత - 517 / Bhagavad-Gita - 517 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 50, 51 / Vishnu Sahasranama Contemplation - 50, 51🌹
3) 🌹 Sripada Srivallabha Charithamrutham - 305 🌹
4) 🌹. శివగీత - 90 / The Shiva-Gita - 90 🌹
5) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 74🌹
6) 🌹 Guru Geeta - Datta Vaakya - 93 🌹
7) 🌹. గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 79 / Gajanan Maharaj Life History - 79 🌹
8) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 72 🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 33, 34 / Sri Lalita Chaitanya Vijnanam - 33, 34 🌹
10) *🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 20🌹*
11) 🌹. శ్రీమద్భగవద్గీత - 432 / Bhagavad-Gita - 432 🌹
12) *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 4 / Sri Devi Mahatyam - Durga Saptasati - 4🌹*
13) 🌹. శివ మహా పురాణము - 246 🌹
14) 🌹 Light On The Path - 4 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 134 🌹
16) 🌹 Seeds Of Consciousness - 198 🌹
17) 📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 52 📚
18) 🌹. అద్భుత సృష్టి - 53🌹
19) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 36 / Sri Vishnu Sahasranama - 36 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 518 / Bhagavad-Gita - 518 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 03, 04 🌴*
03. న రూపమస్యేహ తథోపలభ్యతే
నాన్తో న చాదిర్న చ సంప్రతిష్టా |
అశ్వత్థమేనం సువిరూఢమూలం
అసంగశస్త్రేణ దృఢేన ఛిత్వా ||
04. తత: పదం తత్పరిమార్గతవ్యం
యస్మిన్ గతా న నివర్తన్తి భూయ: |
తమేవ చాద్యం పురుషం ప్రపద్యే
యత: ప్రవృత్తి: ప్రసృతా పురాణీ ||
🌷. తాత్పర్యం :
ఈ వృక్షపు యథార్థరూపము ఈ జగమునందు తెలియబడదు. దాని అదిగాని, అంతమునుగాని లేదా మూలముగాని ఎవ్వరును అవగతము చేసికొనజాలరు. కాని స్థిరముగా నాటుకొని యున్న ఈ సంసారవృక్షమును మనుజుడు దృఢచిత్తముతో అసంగమను శస్త్రముచే ఖండించి వేయవలయును. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్యపదమును పొందుటకు ప్రయత్నించి, అనాదికాలము నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యెనో మరియు వ్యాప్తినొందెనో అట్టి పరమపురుషుని అచ్చట శరణుపొందవలెను.
🌷. భాష్యము :
ఈ భౌతికజగమునందు అశ్వత్థవృక్షము యథార్థరూపము అవగతము కాదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. మూలము ఊర్థ్వముగా నున్నందున ఈ వృక్షపు విస్తారము క్రిందుగా నున్నది.
అట్టి వృక్షము యొక్క విస్తారమునందు బద్ధుడైనపుడు మనుజుడు అది ఎంతవరకు వ్యాపించియున్నదనెడి విషయముగాని, దాని మొదలుగాని గాంచలేడు. అయినను అతడు ఈ వృక్షకారణమును కనుగొనియే తీరవలెను.
నేను ఫలానావారి కుమారుడును, నా తండ్రి ఫలానావారి కుమారుడు, నా తండ్రి యొక్క తండ్రి ఫలానావారి కుమారుడు అనుచు పరిశోధన గావించుచు పోయినచో చివరకు గర్భోదకశాయివిష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియును.
చివరకు బ్రహ్మదేవునికి ఆదియైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన పరిసమాప్తి చెందును. ఈ సంసారవృక్షపు అట్టి మూలమును (పూర్ణపురుషోత్తముడగు భగవానుని) దేవదేవుని గూర్చిన సంపూర్ణజ్ఞానము కలవారి సాంగత్యమున ప్రతియొక్కరు పరిశోధింపవలెను.
అట్టి అవగాహనచే మనుజుడు క్రమముగా యథార్థము యొక్క మిథ్యాప్రతిబింబము నుండి అసంగుడై, జ్ఞానముచే దానితో బంధమును ఛేదించి యథార్థవృక్షమునందు నిజాముగా ప్రతిష్టితుడగును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 518 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 15 - Purushothama Yoga - 03, 04 🌴*
03. na rūpam asyeha tathopalabhyate
nānto na cādir na ca sampratiṣṭhā
aśvattham enaṁ su-virūḍha-mūlam
asaṅga-śastreṇa dṛḍhena chittvā
04. tataḥ padaṁ tat parimārgitavyaṁ
yasmin gatā na nivartanti bhūyaḥ
tam eva cādyaṁ puruṣaṁ prapadye
yataḥ pravṛttiḥ prasṛtā purāṇī
🌷 Translation :
The real form of this tree cannot be perceived in this world. No one can understand where it ends, where it begins, or where its foundation is.
But with determination one must cut down this strongly rooted tree with the weapon of detachment. Thereafter, one must seek that place from which, having gone, one never returns, and there surrender to that Supreme Personality of Godhead from whom everything began and from whom everything has extended since time immemorial.
🌹 Purport :
It is now clearly stated that the real form of this banyan tree cannot be understood in this material world. Since the root is upwards, the extension of the real tree is at the other end. When entangled with the material expansions of the tree, one cannot see how far the tree extends, nor can one see the beginning of this tree. Yet one has to find out the cause. “I am the son of my father, my father is the son of such-and-such a person, etc.”
By searching in this way, one comes to Brahmā, who is generated by the Garbhodaka-śāyī Viṣṇu. Finally, in this way, when one reaches the Supreme Personality of Godhead, that is the end of research work. One has to search out that origin of this tree, the Supreme Personality of Godhead, through the association of persons who are in knowledge of that Supreme Personality of Godhead.
Then by understanding one becomes gradually detached from this false reflection of reality, and by knowledge one can cut off the connection and actually become situated in the real tree.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 50, 51 / Vishnu Sahasranama Contemplation - 50, 51🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 50. విశ్వకర్మా, विश्वकर्मा, Viśvakarmā 🌻*
*ఓం విశ్వకర్మణే నమః | ॐ विश्वकर्मणे नमः | OM Viśvakarmaṇe namaḥ*
విశ్వం కర్మ యస్య సః ఎవని సృష్టి ఈ విశ్వమో అతడు. లేదా విశ్వమంతయూ ఎవని పని వలననే సృజించబడినదో ఆతండు. లేదా విశ్వం కర్మ విచిత్ర ప్రకార నిర్మాణశక్తిః యస్య విచిత్రములగు రీతులుగల నిర్మాణ శక్తులు గలవాడు. లేదా దేవతల విశ్వకర్మ (వడ్లంగి/వడ్రంగి) త్వష్ట అనునాతడు.
:: పోతన భాగవతము - అష్టమ స్కందము, గజేంద్ర మోక్షము ::
క.విశ్వకరు విశ్వదూరుని, విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్ శాశ్వతు నజు బ్రహ్మ ప్రభు, నీశ్వరునిం బరమపురుషు నే భజియింతున్.
లోకాన్ని సృష్టిచేసి, లోకానికి దూరంగా ఉంటూ, లోకానికి అంతరాత్మయై, లోకానికి బాగా తెలుసుకో తగినవాడై, లోకమే తానై, లోకాతీతుడై పుట్టుక లేకుండా ఎల్లప్పుడూ ఉంటూ, ముక్తికి నాయకుడై, లోకాన్ని నడిపిస్తున్న పరమాత్ముని నేను ఆరాధిస్తాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 50 🌹*
📚. Prasad Bharadwaj
*🌻. 50. Viśvakarmā 🌻*
*OM Viśvakarmaṇe namaḥ*
Viśvaṃ karma yasya saḥ He whose creation is the universe. Or the universe whose action (creation) it is.
Viśvaṃ karma vicitra prakāra nirmāṇaśaktiḥ yasya He who has the power of creating the wonderful manifold. By His similarity to Tvaṣṭa, the celestial architect known as Viśvakarmā.
Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
So'haṃ viśvasṛjaṃ viśvam aviśvaṃ viśvavedasam,
Viśvātmānam ajaṃ brahma praṇato'smi paraṃ padam. (26)
He who has created this universe, He who himself is the universe being transcendental to this universe and He who is the only One to be known about since He is the soul of this universe never having taken birth and has been existing eternally - to that supreme consciousness which is The transcendental refuge, I offer my respectful obeisances.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥
Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 51/ Vishnu Sahasranama Contemplation - 51🌹*
📚. Prasad Bharadwaj
*🌻51. మనుః, मनुः, Manuḥ🌻*
*ఓం మనవే నమః | ॐ मनवे नमः | OM Manave namaḥ*
మనస్సు చేయు సంకల్పన వికల్పనాత్మక వ్యాపారము మననము. అట్టి మననము చేయు మూల తత్త్వముగా విష్ణువు 'మనుః' అనబడును. నాఽన్యోఽతోఽస్తి మన్తా (బృహదారణ్యకోపనిషత్, తృతీయాధ్యాయం, సప్తమ బ్రాహ్మణమ్) ఇతనికంటే ఇతరుడు మననము చేయువాడు ఎవరును లేడు అనునది ప్రమాణము. లేదా మంత్రమునకు 'మనుః' అనునది వ్యవహారము; అదియూ విష్ణురూపమే. లేదా చతుర్దశమనువులు అనబడు ప్రజాపతులలో ఏయొకడయినను మనుః - అతడును విష్ణుని రూపమే.
:: భగవద్గీత - విభూతి యోగము ::
మహర్షయస్సప్త పూర్వే చత్వారో మనవస్తథా ।
మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః ॥ 6 ॥
లోకమునందీ ప్రజలు యెవరియొక్క సంతతియైయున్నారో అట్టి పూర్వీకులైన సప్తమహర్షులును, సనకాదులైన నలుగురు దేవర్షులున్ను, మనువులు పదునలుగురున్ను, నా యొక్క భావము (దైవ భావము) గలవారై నా యొక్క మనస్సంకల్ప్ము వలననే పుట్టిరి.
:: భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధమ్ ।
మన్త్రోఽహమేవాజ్యమహమగ్నిరహం హుతమ్ ॥ 16 ॥
క్రతువును నేనే, యజ్ఞము నేనే, పితృదేవతలకిచ్చు అన్నము నేనే, ఔషధము నేనే, మంత్రము నేనే, అగ్ని నేనే, హోమకర్మమును నేనే అయియున్నాను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION - 51 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 51.Manuḥ 🌻*
*OM Manave namaḥ*
He who thinks. Nā’nyo’to’sti mantā vide the Śruti Br̥hadāraṇyakopaniṣat 3.7.23, there is no thinker apart from Him. Or He is called Manu because He manifests in the form of Mantra. Or of Manu, the Prajāpati or the Patriarch.
Bhagavad Gīta - Chapter 10
Maharṣayassapta pūrve catvāro manavastathā,
Madbhāvā mānasā jātā yeṣāṃ loka imāḥ prajāḥ. (6)
The seven great sages as also the fourteen Manus of ancient days, of whom are these creatures in the world, had their thoughts fixed on Me, and they were born from My mind.
Bhagavad Gīta - Chapter 8
Ahaṃ kraturahaṃ yajñaḥ svadhāhamahamauṣadham,
mantro’hamevājyamahamagnirahaṃ hutam. (16)
I am the Kratu (Vedic sacrifice), I am the Yajña (sacrifice as prescribed by Smr̥tis), I am the Svadhā (the food that is offered to the manes), I am the Aushadha (food that is eaten by all creatures or can also mean medicine for curing diseases), I am the Mantrā, I Myself am the Ājya (oblation), I am the Agniḥ (the fire into which oblation is poured) and I am the Hutam (the act of offering).
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अप्रमेयो हृषीकेशः पद्मनाभोऽमरप्रभुः ।विश्वकर्मा मनुस्त्वष्टा स्थविष्ठस्थ्सविरोध्रुवः ॥ 6 ॥
అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థ్సవిరోధ్రువః ॥ 6 ॥
Aprameyo hr̥ṣīkeśaḥ padmanābho’maraprabhuḥ ।Viśvakarmā manustvaṣṭā sthaviṣṭhasthsavirodhruvaḥ ॥ 6 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 305 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 42
*🌻 Chanting of ‘ Datta Digambara! Datta Digambara! Sripada Vallabha Datta Digambara!’ started for the first time by the people of Peethikapuram, spreads throughout the world 🌻*
*🌻 Sripada gives His divine darshan always to His parents, Bapanarya, Narasimha Varma and Venkatappaiah Shresti 🌻*
After completing afternoon meals, Sri Bhaskara Pundit started telling, ‘Sripada gave Datta deeksha in the house of a Sudra, that too only for one night.
There was no worship normally prescribed in the rules of deeksha. He only tied a thread around devotees’ wrist and made them do only Bhajana.
The Brahmins in Peethikapuram thought that it was all contrary to what was written in shastras. They also took objection to Sripada declaring Himself as Datta and that if they remembered Him, His devotees’ troubles would vanish.
They thought it was like ridiculing shastras. So all the Brahmins became one and wanted to complain to Shankaracharya and excommunicate Bapanarya and Appala Raju Sharma from Brahmin caste.
But meanwhile, sudden disappearance of Sripada became the subject matter of discussion. Without Shankaracharya’s consent, no title is given to any person in spiritual matters. So, they thought that 16 year old boy declaring Himself as Datta Prabhu would be blasphemy.
Some Brahmins, keeping enemity in heart, went to Sri Bapanarya’s house to express comforting words. They found no one in the house being sad because of disappearance of Sripada. Moreover Bapanarya said, ‘Now Datta will raise. That Prabhu moved in our house as Sripada Srivallabha.
He gave us divine ‘ananda’. He removed the vieil of ‘Maya’ from our eyes. He is now moving in our eyes. He is giving divya darshan more times than before. We are all blessed.’ The Brahmins who came were stunned. From there, expressing consoling words, they went to Sripada Srivallabha’s house.
Sumathi Maharani, Appala Raju Sharma, brothers and sisters were all extremely happy. Sharma said, ‘we used to have many worries about Sripada. Now, our hearts became light. He appears to our mind’s eye if we simply remember Him. The movement we request, he talks to us with His gross body.
Our ‘janma’ got fulfilled being the parents of Datta Prabhu. We are extremely happy.’ The situation there was quite different from what they had thought. Venkatappaiah Shresti said, ‘Oh! Greatest among Brahmins, previously we used to spend with Sripada for a few hours.
Now He is always present in our mental vision. Moreover, He is appearing with His gross body and roaming in our house very often.’ Narasimha Varma told Brahmins.
‘The veil of maya obstructing our eyes was removed. That Maha Prabhu being eternal enjoyer and divine enjoyer is moving in our house, with fun filled conversation in front of our eyes mingling with us. He is showing darshan with his gross body more often now.’
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 74 🌹*
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఆత్మను తెలుసుకొను విధము -04 🌻*
“అపేక్ష అనేదాని వలననే మాలిన్యం ఏర్పడుతుంది”. ఎవరైతే ఈ ఫలాపేక్షను ఆంతరిక యజ్ఞంలో, పూర్ణాహుతిగా సమర్పిస్తాడో, ఈ ఆంతరిక యజ్ఞాన్ని నిరంతరాయంగా చేసి, జ్ఞానాగ్నిగా మార్చుకుంటాడో, ఆ జ్ఞానాగ్నిలో తనను తానే దహింపచేసుకుంటాడో, వ్యవహారిక జీవభావములను పూర్తిగా హవిస్సులుగా సమర్పించి, ఆత్మభావములో నిలకడ చెంది, ఆత్మనిష్ఠుడై తనను తానే పోగొట్టుకుంటున్నాడో, నామరూపాది లక్షణములను పోగొట్టుకుంటున్నాడో, అటువంటి వాడు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతున్నాడు, అది నిర్మలత్వం. త్రిగుణ మాలిన్యమనేది వాడికిక అంటేటువంటి అవకాశం లేదు. సర్వకాలము వాడు గుణాతీతుడుగా వుంటాడు. అట్లా ఉన్నప్పుడు ఏమైందట?
మనస్సు నిర్మలమైపోయింది. ఇంద్రియములు నిర్మలమైపోయాయి. బుద్ధి ప్రసన్నతను పొందింది. బాహ్యవిషయములనుండి బుద్ధికి ప్రవృత్తి నుండి నివృత్తికి మరలింది. ఇంకేమి తెలిసిందట?
బుద్ధికి ఒక శక్తి లభించింది.
‘బుద్ధిగ్రాహ్యమతీంద్రయం’ - అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి దివ్యత్వాన్ని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి ఆత్మానుభూతిని, అతీంద్రియ లక్షణాలతో ఉన్నటువంటి పరమాత్మ స్థితిని గ్రహించగలిగేటటువంటి శక్తి, బుద్ధికి లభించింది.
సమర్థవంతమైనటు వంటి బుద్ధి లభించింది. అట్టి మహిమను తెలుసుకో గలుగుతాడు. మహిమ అంటే మహత్తు స్థితియందు ఏదైతే ఉన్నదో, మహిమ అంటే ప్రకృతిలో ఆచరించబడేటటు వంటివి, నీ కనుల ముందు నీవు ఊహించ గలిగేటటు వంటివి, జరిగేటటువంటివి కావు.
బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రతీ ఒక్కరూ కూడా. అందరూ మహిమలు, మహిమలు అంటే, ఏమిటంటే ఏదైనా కొత్తవి సృష్టించడం కానీ, ఉన్నవి పోయేటట్లు చేయడం కానీ, లేదా నీకు తెలియనటువంటి వాటిని చెప్పడం గాని, ఇలాంటి ప్రకృతి ధర్మాలకు లోబడనటువంటి, జగద్ధర్మాలకు లోబడనటువంటి వాటిని ఏవైనా చేస్తే, వాటిని మహిమలు అని అందరూ ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ, నిజానికి ఇవేవీ మహిమలు కావు. ఒకే ఒక మహిమ ఉన్నది - అది ఏమిటంటే, మహత్తు స్థితిని ప్రాప్తింప చేయటమే అది మహిమ.
“ఆత్మానుభూతి కలుగజేసేటటు వంటిది ఏదైతే ఉన్నదో, దాని పేరు మహిమ”- అటువంటి మహిమలు తెలుసుకున్నటు వంటి వాళ్ళు మాత్రమే, అటువంటి ఆత్మానుభూతిని పొందినటు వంటివాళ్ళు మాత్రమే, పరమాత్మస్థితిని తెలుసుకోవడానికి అధికారులు అవుతున్నారు. ఆత్మానుభూతే లేనటువంటివాడు, పరమాత్మ స్థితిని ఎట్లా తెలుసుకుంటాడు? కాబట్టి దీని వల్ల ఒక గొప్ప పరిణామం లభించిందట, శాశ్వత పరిణామం లభించింది.
ఏమిటయ్యా అంటే, శోకము నశించింది. దుఃఖం అవ్యాప్తి. వ్యాప్తి అంటే దుఃఖమే జీవితమంతా ఉంది. అంటే అర్థమేమిటంటే, ప్రసవ వేదనతో ప్రారంభమైనటువంటి జీవితం, మరణవేదనతో ముగించబడుతున్నది. జీవితకాలమంతా వేదనలే వున్నాయి. ఈ వేదనంతా శోకరూపంలో వున్నది.
శోక ప్రవాహమే జీవనము, వేరే ఇంకేమీ లేదు. మరి అటువంటి శోక ప్రవాహమేమైపోయిందట ఇప్పుడు? ఈ ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, ఈ నిష్కామ కర్మ ప్రభావం చేత, ఈ హృదయాకాశ స్థితి యందు చేయబడుతున్నటువంటి, ఆంతరిక యజ్ఞ ప్రభావం చేత, జ్ఞానాగ్ని ప్రభావం చేత, సర్వకర్మలను ఫలత్యాగ రహితంగా చేయడం వలన, ఫలత్యాగ పద్ధతిగా చేయడం ద్వారా, ఫలరహిత పద్ధతిగా చేయడం ద్వారా, సర్వకర్మలను హవిస్సులుగా ఆ ఆంతరిక యజ్ఞంలో అర్పించడం ద్వారా, సర్వస్యశరణాగతిని పొందడం ద్వారా, ఆత్మానుభూతిని ఆశ్రయించడం ద్వారా ఆ పరమాత్మస్థితిని తెలుసుకోగలిగేటటువంటి సమర్థత నీకు కలుగుతున్నది. తద్వారా ఒక గొప్పఫలం లభించింది. ఏమిటంటే శోక రహిత స్థితి.
వాడు ఎప్పటికీ దేని గురించీ శోకించడు. శోకము లేకపోవడమే కదా ఆనందం అంటే. ఆనందం అంటే అర్థం ఏమిటంటే శాశ్వతంగా శోకమునకు దూరమైపోయిన వాడు ఎవడైతే వున్నాడో వాడు ఆనంద స్థితుడు. ఆనంద స్థితుడు అంటే అర్థం అది.
వాడికి ఆనంద చాలామందికి మీరు పేర్లు వింటూ వుంటారు, తేజోమయానందా, తత్త్వమయానందా, నిజానంద ఈ రకంగా పేర్లు ఉంటాయన్నమాట! చిన్మయానంద, పరమార్దానంద ఈ రకంగా పేర్లుంటాయన్నమాట! ఇవన్నీ సన్యాస నామాలు. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 90 / The Siva-Gita - 90 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ఏకాదశాధ్యాయము
*🌻. జీవ గత్యాది నిరూపణము - ఉపాసనా మాహాత్మ్యము - 4 🌻*
ఏవం జీవ గతి: ప్రోక్తా - కిమన్య చ్చ్రోతు మిచ్చపి,
భగవన్ ! యత్త్వయా ప్రోక్తం - ఫలం తు జ్ఞాన కర్మణో: 31
బ్రహ్మ లోకే చంద్రలోకే - భుం క్తే భోగా నీతి ప్రభో !
గంధర్వాది షు లోకేషు - కధం భోగ స్సమీరతః 32
దేవత్వం ప్రాప్ను యాత్కశ్చి - త్కశ్చి దింద్రత్వ మేవచ,
ఎతత్కర్మ ఫలం వాస్తు- విద్యా ఫల మధా పివా 33
తద్బ్రూహి గిరిజా కాంత ! - తత్ర మే సంవయో మహాన్,
తద్వి దయా కర్మణో రేవా - నుసారేణ ఫలం భవేత్ ? 34
యువాచ సుందర శ్శూరో - నీరోగో బలవాన్భ వేత్,
సప్త ద్వీపాం వసుమతీం -భుం క్తే నిష్కంటకం యది. 35
రాముడు ప్రశ్నించు చున్నాడు: ఓ పూజ్యుడా ! జ్ఞాన కర్మముల యొక్క ఫలితముగా బ్రహ్మ చంద్ర లోకములలో ను భోగముల ననుభవించు నని యాదేశిం చితివి, గంధర్వాది లోకములలోను భోగ మెట్లు లభించును? దేవత్వ మింద్ర త్వమును నవి. విద్యా ఫలమా ? కర్మ ఫలమా ? ఓ పార్వతీ పతీ ! తెలియ పరచుమని రాముడు ప్రశ్నించెను.
పార్వతీ పతి ఇట్లా దేశించు చున్నాడు: ఓ రామా ! విద్యా కర్మానుసారముగా ఫలము లభించును. పిన్న వయస్సున నున్నవాడు ను , చూడ చక్కని వాడైనను, శూరుడైనను, నిరోగి యైనను శక్తి వంతుడై, ఏడు దీవులను నిర్విఘ్నముగా పరిపాలించి నచో నెటువంటి యానందము కలుగునో అది మానవానంద మని చెప్పబడినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 90 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 11
*🌻 Jiva Gatyaadi Niroopanam - Upasana Mahatya - 4 🌻*
Rama questioned: O worshipable Lord! You have detailed out the enjoyments of abodes of Brahma, Surya, and Chandra based on the merits gained from knowledge and Karmas.
However I would like to know when does enjoy the pleasures in Gandharva etc. abodes? Also, the post of deities, and Indra is also
obtained based on knowledge or Karma? Kindly explain these O consort of Parvati!
Sri Bhagawan said:
O Rama! Merits are gained based on knowledge and karmas. for a young aged man, who looks handsome, who is valorous, who is healthy without any diseases, who is strong, who rules over the seven continents without any problem; whatever amount of happiness such a man gains that bliss is termed as 'manavanandam' (happiness of human). When a man does penance, he becomes gandharva, as a Gandharva he gains 100 times the human happiness.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 93 🌹*
✍️ Sadguru Ganapathi Sachidananda
📚. Prasad Bharadwaj
86
We discussed that the elders compared this samsara with a tree, it’s been variously called the “tree of samsara” or the “poisonous tree”. This tree of samsara grows with unstinting velocity.
The infant grows up in to a little girl right in front of our eyes, wearing cute little dresses and then grows up to be a mother, and eventually turns into an old woman without any teeth. This is how the tree of samsara is. It doesn’t stop there. She also dies one day. Who is dying here? It means, she drops off from the tree.
The tree doesn’t die, she just falls off from the tree of samsara. The only one who can save from this fate is the Guru. That is why, we should focus attention on the Guru.
Everybody should prostrate to the Guru without fail. Many wonder how a Guru can help someone who is caught in the shackles of samsara. The story of the animal, Gajendra (elephant), is enough to answer this question.
Let us learn this story. Gajendra was the king of Mount Trikoota. He had many wives. When he wandered the forests with his wives and sons, he was very pleased seeing his own grandeur and his great retinue.
Filled with ego and immersed in the pleasures of life, he once went to the forests with his entire family, charged through the forest recklessly, uprooting trees, trampling with arrogance, leaving a trail of destruction in the entire forest.
He entered a territory that didn’t belong to him. He lost all discretion. Without any caution, he entered a lake and got caught in the jaws of an alligator.
Once the alligator caught him, he struggled a lot. He fought for a thousand years. His arrogance, strength and ego diminished. He realized he was caught in the clutches of time. “I am finished. I couldn’t win even after fighting a thousand years. So, I am going away now.”
He realized that his wives, sons and relatives were not able to help, he knew they could not save him. “Even though I have so many relatives and so many children, no one is able to save me. There is no use anymore. I am succumbing to death.
No one is able to help”. Realizing that Lord Narayana was his only savior, he surrendered his intellect and cried out to the Lord. “You are my intellect, O Lord, there is nothing I can do. Please save me!” The Lord, moved by this prayer, immediately came to Gajendra.
“Gajendra moksham (moksham=liberation) is a great episode. Even if we recalled this episode countless number of times, it will not be enough.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 79 / Sri Gajanan Maharaj Life History - 79 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 16వ అధ్యాయము - 1 🌻*
శ్రీగణేశాయనమః ! ఓ పరశుధారా, జమదగ్ని కుమారా మీకు జై జై లు. దయచేసి నన్ను మరువకండి. బ్రాహ్మణులకు కలిగిన అవమానం సహించలేక మీరు సహస్రార్జునుని సంహరించి బ్రాహ్మణులను రక్షించారు. ఇప్పుడు చూస్తుంటే మీరు వాళ్ళదారిన వాళ్ళని వదలివేసి కళ్ళు మూసుకున్నట్టు ఉంది. మీరు నిద్రలో ఉన్నారా ? ఈవిపరీతి తల ఎత్తుతున్న పరిస్థితులలో మీరు దయచేసి కళ్ళు తెరవండి. ఇది ఈప్రస్తుత పరిస్థితులలో చాలా అవసరం. మీ సమర్ధనలేనిదే ప్రతికార్యం వ్యర్ధం. మీ సహాయం లేనిదే ఈ ఆర్యుల జీవనసరళి పొదిల పరచడం వీలుకాదు.
శ్రీగజానన్ మహారాజు చర్యలు విచిత్రంగా ఉంటాయి. ఎవరూ వాటిని ఊహించలేరు. ముండగాంలో శ్రీమహారాజు భక్తుడు ఒకడు ఉన్నాడు. అతని పేరు పుండలీక. ఇతను ప్రతినెల ఒక నిశ్ఛయించిన రోజున నిష్ఠగా షేగాం వెళ్ళేవాడు, మరియు శ్రీగజానన్ మహారాజు మీద అత్యంత భక్తి కలిగి ఆయనే ఇతనికి ముఖ్యదైవం.
అదే గ్రామంలో భగాబాయి అనే పేరుగల స్త్రీ ఉండేది. ఈమె చంచలమైన మనస్సుతో దేనిమీద స్థిరమయిన ఏకాగ్రత లేకుండా ఉండేది. ఒకరకంగా ఈమె కపటి సన్యాసిని మరియు ప్రజలను మభ్యపెట్టడమే ఆమె పని. ఒకసారి పుండలీకునితో......... ఇంతవరకూ ఏగురువునూ సంపాదించలేని నీజీవతం వృధా అయింది.
నీవు తరచు షేగాం వెళ్ళి శ్రీగజానన్ మహారాజును గురువుగా భావిస్తున్నావు, ఆయన నీకు ఏదయినా గురుమంత్రం ఇచ్చారా ?(గురువు తన భక్తునికి చెవిలో చెప్పే గూఢమయిన మంత్రం) నాకు చెప్పు. క్రమమయిన క్రియాదికాలు లేకుండా ఎవరూ గురువు కాలేరని తెలుసుకో. నిజానికి ఈ షేగాం నివాసి గజానన్ ఒక పిచ్చివాడు. నువ్వు ఒక్క జ్వరవిముక్తుడువి కావటం కారణంచేతనే ఈయనని గురురువుగా అంగీకరిస్తున్నావు. అది యాదృచ్ఛికంగా జరిగింది. కనుక నువ్వు దానికి బలి కాకూడదు.
గణ గణ గణాత అనే ఆయన జపం, పిచ్చిగా ప్రవర్తించడం, ఎవరి చేతి ఆహారమయినా తినడం ఇవన్నీ ఆయన ఒక దిగజారిన మనిషి అని రుజువు చేస్తున్నాయి. అందుకే మనం అంజనగాం వెళ్ళి కెకాజీ శిష్యుడిని మనగురువుగా చేసుకుందాం అని చెప్పడానికే నేను వచ్చాను, రేపు తెల్లవారు ఝామున అంజనగాంలో ఆయన కీర్తనకు హాజరు అవుదాం. గురువు అనేవాడు బాగా చదువుకుని, విషయావగాహన కలిగి, తెలివైనవాడై, అన్ని శాస్త్రాలలో నిపుణుడయి, అత్యంత ఉన్నత సామర్ధ్యతకలిగి, ఆత్మజ్ఞానం పొందేలా నీకు దారి చూపించే మార్గదర్శి అయి ఉండాలి.
ఇందులో ఏఒక్క గుణంకూడా నీ గజానన్లో కనిపించదు, కావున మనం అంజనగాం వెళదాం అని భగాబాయి అంది. ఇటువంటి భగాబాయి మాటలకి పవిత్రుడయిన పుండలీకుడు కలత చెందాడు. మరుసటిరోజు ఉదయం అంజనగాం వెళ్ళేందుకు ఆమెకు తన అంగీకారం తెలిపాడు. పుండలీకుడు ఈవిధంగా నిశ్చయిచుకున్నాకా, బాగా నిద్రపోయాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 79 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 16 - part 1🌻*
Shri Ganeshayanmah! O Parshudhara! O Son of Jamdagni! Jai to You. Please do not ignore me. Not bearing the insult to Brahmins, You killed Sahasrarjun and protected Your Brahmins.
But now, You seem to have closed Your eyes to their plight. Are You asleep? Please open Your eyes as it is most necessary in the present emergent situation. All actions are useless without Your support. This Aryan culture cannot be preserved without Your help.
Mysterious are the actions of Shri Gajanan Maharaj and nobody can predict them. There was one devotee of Shri Gajanan Maharaj at Mundgaon. His name was Pundalik. He used to go to Shegaon regularly on a fixed day every month, and was very much devoted to Shri Gajanan Maharaj , who was a prime deity for him.
There was one Bhagabai of the same village, who had a wavering mind and, thus, could not concentrate on anything.
In a way she was a great hypocrite and her only business was to befool people. She once said to Pundalik, “Your life is wasted as you could not get any Guru so far. You go to Shegaon frequently and treat Shri Gajanan Maharaj as your Guru.
But tell me, has He given you any Guru Mantra (i.e. secret incantation which is whispered in the ear of the devotee by the Guru)? Mind you, one does not become a Guru without proper rituals. In fact this Gajanan of Shegaon is a mad person and you are accepting Him as Guru only because you got relief from fever; it was a mere coincidence and you should not be a victim to that.
His chanting of “Gan Gan Ganat Bote”, mad like behavior, and eating food from anybody's hands, all this confirm that he is a fallen person.
So I have come to tell you that we shall all go to Anjangaon and make Kekaji’s disciple as our Guru. Early morning tomorrow, we will go to attend his Kirtan at Anjangaon. Guru should be well read, learned, wise, an expert in all shastras, of high caliber and a guide to help you attain self realization.
None of these qualities are visible in your Gajanan, so let us go to Anjangaon.” This talk of Bhagabai disturbed Pundalik, who a pious man. He gave his consent to her for going to Anjangaon the next morning. Pundalik, having decided as above, slept well.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 72 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. భగవంతుని ఆరవ పాత్ర - మానవ రూపములో పునర్జన్మలు (సంసార చక్రము) - 22 🌻*
*🌻. వ్యతిరేక సంస్కారముల ఆవశ్యకత : 🌻*
301.సంస్కారములు రద్దగుటకు , భిన్న అనుభవములు తప్పక అవసరము . ఎందుచేతననగా , భిన్న అనుభవములు మాత్రమే చిక్కగానున్న సంస్కారములను సమూలముగా పెకలించగలవు .
302. జాగ్రదవస్థలో , మానవుడు బాహ్యకార్య కలాప నిమగ్నుడై యుండుట వంటిది పునర్జన్మ ప్రక్రియ .
303. సంస్కారముల వలననే ,సృష్టిలోనిద్రావసయు , జాగ్రదవస్థయు , పగటి దైనందినజీవితమును స్థాపింపబడుచున్నవి .
304. సృష్టిలోనున్న మిథ్యా జీవితము , సాధారణ సుషుప్తి తోడను , సాధారణ జాగృతితోడను ఏర్పడియున్నది .
305. సృష్టిలో ఒక ప్రాణిపొందు సుషుప్తికిని ,మానవుని సుషుప్తికిని భేదమున్నది . అట్లే సామాన్యుని సుషుప్తి కిని ఆధ్యాత్మిక మార్గములో నున్న వాని సుషుప్తికిని అట్లే భేదమున్నది .
306. ప్రపంచములోనున్న ప్రత్యగాత్మలు భౌతిక గోళము యొక్క సరిహద్దుల లోపలనే యున్నవి ..
307. అన్ని భౌతిక సూర్యులు , అన్ని చంద్రులు , అన్ని ప్రపంచములు , రోదసి (అంతరిక్షము ) అంతయు కలిసి భౌతిక గోళము .
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 33, 34 / Sri Lalitha Chaitanya Vijnanam - 33, 34 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని*
*నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి*
*🌻. 33. 'కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ' 🌻*
తన స్తనములను ప్రతిపణముగ నిచ్చి పరమశివుని ప్రేమ అను రత్నమును సంపాదించినది అని భావము. అట్టి మణిని ధరించి యున్నది అని భావము. అనగా తన హృదయమును భగవంతునకు అర్పణము చేసి భగవంతుని ప్రేమపూరితమైన కాంతిని తన హృదయమున పొందుపరచు కొన్నది. హృదయమును అర్పించుట యనగా తనను తాను సమర్పణము చేసుకొనుట.
అనగా దైవము కొరకే తాను జీవించుట. మరియొక జీవనము గాని, అస్థిత్వము గాని లేకుండుట. మనలను మనము భగవంతునికి ఎంత సమర్పణము
చేసుకొందుమో, మనకు భగవంతుడు అంత మాత్రముగనే అనుగ్రహించును. “ఎంత మాత్రమున ఎవ్వరు కొలచిన అంత మాత్రమే నీవు" అను అన్నమాచార్య కీర్తన సందేశాత్మకము. భగవంతుడు నీ హృదయమున ప్రతిష్ఠితుడై వెలుగొందుచు నుండవలె నన్నచో నీ హృదయమును భగవంతున కర్పింపవలెను.
శ్రీదేవి హృదయమున భగవత్ కాంతి మెరయుటనే ప్రేమ రత్నమణి అని వర్ణించబడినది. హృదయమునుండి వచ్చు కాంతి ప్రేమ, దాక్షిణ్యము, కారుణ్యము కలిగి యుండును. మణి కావున కాంతులను విరజిమ్మును. ప్రేమ రత్నమణి కావున ప్రేమతో కూడిన కాంతులను ప్రసరింపచేయును.
దానిని పొందుటకు శ్రీదేవి తన హృదయమునే ప్రతిపణముగ పెట్టినది. ఇదియే సాధకులకు ఉత్తమోత్తమమైన మార్గము. దీనిని సర్వసమర్పణ మార్గమని, సర్వహుత యజ్ఞమని తెలుపుదురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 33 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 33. Kāmeśvara- premaratna- maṇi-pratipaṇa-stanī* *कामेश्वर-प्रेमरत्न-मणि-प्रतिपण-स्तनी (33) 🌻*
She offers her two bosoms to Kāmeśvara (Śiva) in return for His love.
The subtle meaning is that She will give Her blessings to Her devotees, twice the amount of devotion offered to Her.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 34 / Sri Lalitha Chaitanya Vijnanam - 34 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*14. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని*
*నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి*
*🌻 34. 'నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి' 🌻*
నాభి నుండి ఊర్ధ్వముగ ఏర్పడిన రోమ పంక్తివంటి లత నుండి ఉద్భవించిన రెండు ఫలములవంటి కుచములు కలదానా అని భావము.
సమస్తమైన ప్రకృతియును భగవతి నాభినుండియే పుట్టుకు వచ్చినది. అంధకార బంధురమగు తామర తంపరవంటి సృష్టిని రోమములతో పోల్చి చెప్పుట ఒక సంప్రదాయము. తన మాయాజాలముచే, త్రిగుణాత్మక శక్తిచే నిర్మింపబడ్డ ప్రకృతి శ్రీదేవి బొడ్డునుండి పాదుకొని లతవలె ప్రాకుతూ అనంతముగ పెరిగియున్నది. ఈ లతకాధారము శ్రీదేవి నాభియే.
తన సృష్టియందలి జీవుడు ఇహపర వైభవములను అనుభవించుటకు తద్వారా ఆనందించుటకు జ్ఞాన విజ్ఞాన ఫలములను కూడ ఏర్పరచినది. విజ్ఞాన ఫలమును పొంది, ఇహలోక వైభవమను జ్ఞాన ఫలమును పొంది, పరలోక వైభవమును అనుభవించుటకు శ్రీదేవి వద్ద గల రెండు క్షీర కుంభములనే స్తన ద్వయముగ వర్ణింపబడినది.
జ్ఞాన విజ్ఞానములను పొందుట యందు ఆసక్తి గలవారికి తల్లివలె శ్రీదేవి తన స్తనద్వయము నందించును.
అందలి క్షీరమును గొని జీవులు
వివేకవంతులై వైభవోపేతము, దివ్యము అయిన జీవితములను పొందుచున్నారు. తెనాలి రామకృష్ణునకు అట్టి క్షీర కుంభములను అమ్మ ప్రేమతో అందించినది. అట్లే ద్రవిడ దేశమున జ్ఞాన సంబంధులకు తన స్తన్యములందించి జ్ఞానము నందించినది.
శ్రీదేవి స్తనద్వయమును మాంస మయములుగ చూచుట కరడు గట్టిన అజ్ఞానము. అవి మోహ కారకములు కావు. జ్ఞాన విజ్ఞాన కారకములు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 34 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 34. Nābhyālavāla- romāli-latā- phala-kucadvayā* *नाभ्यालवाल-रोमालि-लता-फल-कुचद्वया (34) 🌻*
Her two bosoms are the fruits of the creeper (refers to hair) that springs from Her navel.
The significance of this nāma is on the navel and heart cakra-s. Meditating on the heart cakra by upwardly moving the kuṇḍalinī from navel cakra, gives fruits of meditation.
Saundarya Laharī (verse 76) says “The God of love afflicted by the fire of Śiva’s anger took shelter in your navel.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Join and Share My Groups 🌹*
Prasad Bharadwaj
*చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram Channel*
https://t.me/Spiritual_Wisdom
*చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group*
https://t.me/ChaitanyaVijnanam
*JOIN, SHARE విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.*
https://t.me/vishnusahasra
*Join and Share శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam*
https://t.me/srilalithadevi
*Join and Share చైతన్య విజ్ఞానం Chaitanya Vijnanam*
https://www.facebook.com/groups/465726374213849/
*Like and Share FB Page*
https://www.facebook.com/విష్ణు-సహస్ర-నామ-తత్వ-విచారణ-Vishnu-Sahasranama-111069880767259/
*Follow and Share FB Page*
https://www.facebook.com/శ్రీ-లలితా-దేవి-చైతన్యము-Sri-Lalitha-Devi-Chatanyam-103080154909766/
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 4 / Sri Devi Mahatyam - Durga Saptasati - 4 🌹*
✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 1
*🌻. మధు కైటభుల వధ వర్ణనము - 4 🌻*
రాజు పలికెను : భగవాన్! మహామాయ అని నీవు చెప్పు దేవి ఎవరు? ఆమె ఎలా ఉద్భవించింది? ఆమె ఏమి చేస్తుంది? ఓ బ్రాహ్మణా! ఆమె స్వభావం ఎటువంటిది? ఆమె స్వరూపం ఎలా ఉంటుంది? ఆమె ఎక్కడి నుండి ఉద్భవించింది? ఇదంతా బ్రహ్మజ్ఞాన వరేణ్యుడవైన నీ నుండి వినగోరుతున్నాను. (59–62)
ఋషి పలికెను : ఆమె నిత్య. ఆమెయే ఈ జగత్తుగా మూర్తీభవించింది. ఈ అంతటా ఆమె వ్యాపించి ఉంది. (63- 64)
కాని ఆమె బహు విధాలుగా ఉద్భవిస్తుంది; అది నేను చెబుతాను, విను! నిత్య అయినప్పటికీ, ఆమె దేవతల కార్యాలను నెరవేర్చడానికి ఎప్పుడు లోకంలో ఆవిర్భవిస్తుందో అప్పుడు ఆమె ఉద్భవించిందని లోకులు పలుకుతారు.
కల్పాంతంలో జగత్తంతా ఏకమై ప్రళయజలరాశి రూపంలో ఉండి, భగవంతుడైన శ్రీమహావిష్ణువు శేషతల్పశాయియై యోగనిద్రలో ఉన్నప్పుడు ఘోరరూపులు, విఖ్యాతులు అయిన మధుకైటభులనే ఇద్దరు అసురులు విష్ణుదేవుని చెవిలోని గుబిలి నుండి ఉద్భవించి బ్రహ్మను చంపడానికి యత్నించారు.
ప్రజాపతియైన బ్రహ్మ విష్ణువు నాభికమలంలో కూర్చొని ఉన్నాడు. ఉగ్రరూపులైన ఈ అసురులిద్దరిని చూచి, విష్ణుదేవుడు నిద్రిస్తుండడం వల్ల ఆయన్ని మేలుకొల్పడానికై, ఆయన నేత్రాలలో వసిస్తున్న యోగ నిద్రను ఏకాగ్రచిత్తంతో స్తుతించాడు. (65–70)
బ్రహ్మదేవుడు తేజోవంతుడైన విష్ణుదేవుని అసమానయైన దేవిని, యోగనిద్రను, సర్వలోక పాలకురాలిని, జగన్నిర్వాహకురాలిని, ప్రపంచ స్థితిలయకారిణిని -స్తుతించాడు. (71)
బ్రహ్మ పలికెను: “నీవు 'స్వాహా మంత్రానివి, నీవు 'స్వధా * మంత్రానివి, స్వర్వానికి 4 మూర్తరూపానివి, వషట్కారమూనీవే కదా! సుధవు* నీవు. నాశము లేని శాశ్వతవు, త్రిమాత్రాత్మికవు నీవే. పూర్ణంగా ఉచ్చరించడానికే శక్యంకాని నిత్యస్వరూపిణివైన అర్ధమాత్రవు నీవే. దేవతల తల్లి, పరదేవత అయిన సావిత్రివి నీవే. (72-74)
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 4 🌹*
✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj
Chapter 1
*🌻 Description of Killing of Madhu and Kaidabha - 4 🌻*
59-62. 'Venerable sir, who is that Devi whom you call Mahamaya? How did she come into being, and what is her sphere of action, O Brahmana? What constitutes her nature? What is her form? Wherefrom did she originate? All that I wish to hear from you, O you supreme among the knowers of Brahman.' The Rishi said:
63-71. She is eternal, embodied as the universe. By her all this is pervaded. Nevertheless she incarnates in manifold ways; hear it from me. When she manifests herself in order to accomplish the purposes of the devas, she is said to be born in the world, though she is eternal.
At the end of a kalpa when the universe was one ocean( with the waters of the deluge) and the adorable Lord Vishnu stretched out on Sesa and took the mystic slumber, tow terrible asuras, the well-known Madhu and Kaitabha, sprung into being from the dirt of Vishnu's ears, sought to slay Brahma; Brahma, the father of beings, was sitting in the lotus( that came out) from Vishnu's navel.
Seeing these two fierce asuras and Janardhana asleep, and with a view to awakening Hari, (Brahma) with concentrated mind extolled Yoganidra, dwelling in Hari's eyes.
The resplendent Lord Brahma extolled the incomparable Goddess of Vishnu, Yoganidra, the queen of cosmos, the supporter of the worlds, the cause of the sustentation and dissolution alike (of the universe).
72-74. Brahma said: 'You are Svaha and Svadha. You are verily the Vasatkara and embodiment of Svara. You are the nectar. O eternal and imperishable One, you are the embodiment of the threefold mantra.
You are half a matra, though eternal. You are verily that which cannot be uttered specifically. You are Savitri and the supreme Mother of the devas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 246 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴*
56. అధ్యాయము - 11
*🌻. దుర్గాస్తుతి - 1 🌻*
నారదుడిట్లు పలికెను -
తండ్రీ! బ్రహ్మన్! నీవు మహా బుద్ధిశాలివి. వక్తలలో శ్రేష్ఠుడవు. మాకు చెప్పుము. విష్ణువు నిష్క్రమించిన తరువాత ఏమయ్యెను? హే విధీ! నీవు ఏమి చేసితివి ?(1).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఓ బ్రాహ్మణశ్రేష్ఠా! నీవు సావధానముగా వినుము. విష్ణుభగవానుడు నిష్క్రమించగనే నేను చేసిన కార్యమేదియో చెప్పెదను (2).
విద్యాస్వరూపిణి, మరియు అవిద్యా స్వరూపిణి, శుద్ధ పరబ్రహ్మ రూపిణి, జగన్మాత, సర్వదా శివప్రియ అగు దుర్గాదేవిని స్తుతించెదను (3).
సర్వవ్యాపకురాలు, నిత్యస్వరూపిణి, ఇతర ఆశ్రయము లేనిది, సంసార దుఃఖములు లేనిది, ముల్లోకములకు తల్లి, గొప్ప వాటి కంటె కూడ గొప్పది, రూపము వాస్తవముగా లేనిది అగు దుర్గను నమస్కరించు చున్నాను (4).
చైతన్యము, బ్రహ్మానందము నీవే . నీవే పరమాత్మ స్వరూపిణివి. దేవదేవీ! నీవు ప్రసన్నురాలవు కమ్ము. నా కార్యము సిద్ధింపజేయుము. నీకు నమస్కారము (5).
ఓ మహర్షీ! నేను యోగనిద్రను ఇట్లు స్తుతించితిని| ఓ దేవర్షీ! అపుడు నా ఎదుట చండిక ప్రత్యక్షమయ్యెను (6).
చిక్కని కాటుక వలె ప్రకాశించునది, సుందరమగు రూపము గలది, ప్రకాశించు నాల్గు భుజములు గలది, సింహము నధిష్ఠించి యున్నది, చేతియందు వరముద్ర గలది, ముత్యములచే నొప్పు చూడా మణితో ప్రకాశించే కేశభారము గలది (7),
శరత్కాల చంద్రుని వంటి ముఖము గలది, చంద్రుని వలె స్వచ్ఛమైన ఫాలభాగము కలది, మూడు కన్నులు గలది, సర్వాంగసుందరి, పద్మముల వంటి పాదముల నఖముల కాంతిచే ఒప్పారునది (8), శివుని శక్తి అగు ఆ ఉమాదేవిని నా ఎదుట గాంచితిని. ఓ మహర్షీ! నేను భక్తితో శిరస్సును వంచి నమస్కరించి స్తుంతిచితిని (9).
ఓతల్లీ! జగత్తులోని ప్రవృత్తి నివృత్తులు నీ స్వరూపమే. జగత్తు యొక్క సృష్టిస్థితులు నీ స్వరూపమే. స్థావరజంగ మాత్మకమగు ప్రాణులలో నీవు శక్తి రూపముగ నుండి సర్వప్రాణులను మోహపెట్టుచున్నావు. నీవు సనాతనివి. నీకు అనేక నమస్కారములు (10).
కేశవుని వక్షస్థ్సలమునందు అలంకారముగా నుండు లక్ష్మీదేవి నీవే. సకలమును భరించి పోషించు నీవు విశ్వంభరవు. నీవు సృష్టిని చేసిన మహేశ్వరివి. ముల్లోకములను లయము చేయునది నీవే.నీవు గుణాతీతురాలవు (11).
యోగులు నిన్ను పూజించి తమ హృదయములలో దర్శించెదరు.అట్టి నిన్ను నమస్కరించుచున్నాను. పరమాణువులలోని సారము (శక్తి) నీవే. యమనియమాదులచే పవిత్రమైన యోగుల హృదయములలో నీవు ఉండి వారికి ధ్యాన మార్గములో దర్శనము నిచ్చెదవు (12).
ప్రకాశము, శుద్ధి ఇత్యాది గుణములచే విరాజిల్లు నీకు రాగ ద్వేషములు లేవు. వివిధ శాస్త్ర విజ్ఞానములకు సంబంధించిన విద్యలన్నియూ నీ స్వరూపమే. నీ స్వరూపము కూటస్థము (మార్పులకు లోను కానిది), మరియు ఇంద్రియములకు అగోచరము. నీవే అనంత రూపములతో ప్రకటమైనావు. నీవు కాల స్వరూపురాలై ముల్లోకములను ధరించి యున్నావు (13).
నీవు గుణములతో కూడి సర్వమానవులలో నిత్యము వారికి రాగద్వేషాది వికారములకు మూలమైన అవిద్యా రూపములో నున్నావనుట నిశ్చయము. హే శివప్రియే! మూడు గుణములకు ఆశ్రయము నీవే. మరియు నీవు గుణాతీతురాలవై యున్నావు (14).
సత్త్వము, రజస్సు, తమస్సు అనే ఈ గుణముల వికారములు నీయందు లేవు. కాని వాటి ఉనికి నీ యందు మాత్రమే గలదు. జగత్తునకు ఏకైక కారణమైన త్రిగుణాత్మక ప్రకృతి నీవే. నీవే ఈ బ్రహ్మాండమును సృష్టించి, రక్షించి, భక్షించుచున్నావు (15).
సర్వజగత్తుల బీజము నీవే. జ్ఞేయ జ్ఞానములు నీ స్వరూపమే. హే శివపత్ని! లోకముల క్షేమమును కోరి నేను సర్వదా నీకు నమస్కరించుచున్నాను (16).
బ్రహ్మ ఇట్లు పలికెను -
ఈ నా మాటను విని లోకరక్షకురాలగు ఆ కాళీదేవి సృష్టికర్తనగు నాతో ప్రీతితో, తల్లి పిల్లవానిని వలె లాలించి, ఇట్లు పలికెను (17).
దేవి ఇట్లు పలికెను -
హే బ్రహ్మన్! నీవు నా ఎదుట ధైర్యము గలవాడైనచో, నీవు నన్ను స్తుతించుటకు గల కారణమును వెంటనే నిశ్చయముగా చెప్పుము (18).
నేను ప్రత్యక్షమైన పిదప కార్యము సిద్ధించుట నిశ్చయము. కావున నీవు నీ కోర్కెను తెలుపుము. నీచే ఆరాధింపబడిన నేను నీ కోర్కెను తీర్చెదను (19).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 LIGHT ON THE PATH - 4 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj
*🌴 THE FOUR PRELIMINARY STATEMENTS - 4 🌴*
38. When the disciple passes through Initiation and begins to develop the buddhic consciousness, this incapacity for tears takes on a new character.
He then begins to understand the word evolution, to realize that in man it means the unfoldment of the higher triad; then he begins to see the real use and object of all the suffering and pain.
He gradually becomes incapable of tears because he understands the value of the suffering to those who are undergoing it, because he sees that when pain comes to a man it does so as an absolute necessity for the higher development of his soul.
It is true that theoretically the man might have avoided that suffering if he had acted wisely in the past, for it is the result of his past karma when it is not produced by his present follies; but the practical aspect of the matter is that the man has been foolish, has elected to learn through this kind of experience instead of through wisdom, because he has not always chosen to follow the best he knew, and now he is suffering, and the pain is bringing him wisdom for the future, and is thereby promoting his evolution.
39. Realizing this, the disciple reaches a condition in which he may be described as full of the most perfect sympathy but without regret. The sense of regret comes in only when the consciousness is unillumined by the buddic life.
When the buddhic consciousness is felt, the disciple’s sympathy increases enormously, but his regret disappears, and as he rises higher this wider view makes him incapable of tears, because in the face of the bitterest suffering to which he is learning to respond and to feel in himself, he feels also its object and end.
He can share in the suffering to the full, but without the slightest wish that it should be anything other than it is. The absence of any wish to get rid of the suffering before it has done its work, can only exist when the consciousness has buddhic illumination. That is the condition which has been described as the Christ state.
The law is good and the will of the Supreme is perfect, and the suffering works for a perfect end; therefore the disciple is filled with content and satisfaction; he feels the suffering, but of grief and sorrow he feels none at all.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 134 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. నారద మహర్షి - 8 🌻*
61. నిర్గుణ పరబ్రహ్మ వస్తువును తొలిగా నారదుడే స్వయంగా తెలుసుకోవాలి. తాను చెప్పడు. చెబితే తాను కార్యబ్రహ్మ కానేరడు. “నీవే తెలుసుకుంటావు ఆ అష్టాక్షరి అర్థమేదో!” అని చెప్పి, ఆయనను గమ్యస్థానానికి తీసుకు వెళ్ళగలిగిన మార్గాన్ని ఉపదేశించాడు బ్రహ్మ. అదే అష్టాక్షరీమార్గం.
62. గమ్యం నారదుడే చేరుకుంటాడు. అంతవరకే! తాను మార్గాన్ని ఉపదేశించిన గురువు. గమ్యస్థానానికి వెళ్ళలేక కష్టంలో ఉన్నప్పుడు, తానే వచ్చి ఆ గమ్యస్థానానికి చెర్చేవాడు గురువు అని చెప్పి; ఆద్యంతములందు గురువు ఉంటాడనీ, ఆయన ఆద్యంతరహితుడనీకూడా – అలా రెండువిధాలుగా చెప్పారు.
63. మహర్షి లక్షణం కూడా చెప్పాడు బ్రహ్మ. “జీవసృష్టికి సమయం వచ్చింది. ఈ జగత్తంతా భవిష్యత్తులో జీవులు పుట్టబోతున్నారు. వీళ్ళందరూకూడా కేవలం అజ్ఞానంలో లేరు. శుద్ధజ్ఞానంలోనూ లేరు.
64. అలాగే దేవతలందరూకూడా జ్ఞానాజ్ఞాన సమ్మిశ్రమంలో ఉన్నారు. వీళ్ళకు కొంతజ్ఞానం, కొంతఅజ్ఞానం ఉంది. వారికి తమకుతాము ఏంచేసుకోవాలో తెలియదు. మనుష్యజాతి పుడుతుంది. చరిత్ర అంతా భవిష్యత్తులో నేవే చూస్తావు, వెళ్ళునాయనా!” అన్నాడు బ్రహ్మ.
65. బ్రహ్మ తాను సృష్టించిన కొడుకులందరినీ ఒకసారి పిలిచి, “మీరు పుత్రులను కనండి! ప్రజలను సృష్టించండి. వివాహితుల కండి. మీకు భార్యలను నేను సృష్టిస్తాను” అన్నాడు. వాళ్ళు ఎవరూ ఏమీ మాట్లాడక, మౌనం వహించారు. తలలు వంచుకుని నిలబడ్డారు.
66. అప్పుడు వాళ్ళు తమలో తాము, “మేము స్వయంసమృద్ధిగా సుఖంగా ఉన్నాము, మేమిప్పుడు చేయాల్సిన పని ఏముంది? మేము బాగానే ఉన్నాము. ఈయన ఏదో పని చెపుతాడేమిటి? వివాహం చేసుకోమంటాడు. సంతానం కనమంటాడు. సంతానం ఏమిచేసుకోవాలో తెలియదు. అదంతా ఆయన పనేమో! ఆయన పని మనచేత చేయిస్తుంటాడు” అనుకున్నారు.
67. నారదుడి అభిప్రాయం కూడా అలాగే ఉంది. అయితే నారదుడు మాత్రం ఇతరుల వలే కాక, బయటపడ్డాడు: “తండ్రీ! నీవు ఇప్పుడే కదా అష్టాక్షరి చెప్పావు నాకు. ఆ విష్ణుపదం ఎక్కడో ఉంది. అది నీకు కూడా అందనంత దూరంలో ఎక్కడో ఉంది. ఆ విష్ణుపదం ఏమిటో చూద్దామనే ఆకాంక్ష నాలో కలిగింది.
68. ఈ అష్టాక్షరీ జపం నేను చేసుకుంటూ దీనిమార్గంలో వెళ్ళిపోతాను. నాకు అన్నగార్లున్నరు, సనకసనందాదులు. వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళను ఏమీ అనలేదు కదా! మరి వాళ్ళు ఆనందంలో ఉన్నారు. వాళ్ళు నాకంటే ముదుపుట్టినవాళ్ళు. మరి వాళ్ళు వెళ్ళిపోయారు కదా! నేనుకూడా వాళ్ళలాగానే వెళ్ళిపోతాను. నేను మాత్రం నువ్వుచెప్పినట్లు వివాహంచేసుకోను” అన్నాడు నారదుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతోపనిషత్తు - 51 🌹*
*🍀 11. సంఘ శ్రేయస్సు - కృష్ణుని కర్మ సిద్ధాంతమున అసక్తత, నియతకర్మ, సమాచరణము, యజ్ఞార్థ జీవనములతో పాటు సంఘమున స్ఫూర్తిదాయకముతో గూడ నుండవలెనని తెలుపుచున్నది 🍀*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. కర్మయోగము - 20 📚*
20. కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః |
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్కర్తుమర్హసి || 20 ||
కర్మమంతయు సంఘముతో ముడిపడి యున్నది. సంఘము నడుచుటకు కర్మము ప్రధానము. వివిధములైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారముల ద్వారా ప్రతివారును సంఘమునకు తోడ్పాటు చేయుచు సంఘము నుండి లభించిన దానిని పొందుతూ జీవించుట జరుగుచున్నది.
సంఘమునకు శ్రేయోదాయకమైన కార్యముల నొనర్చుట ద్వారా సంఘమున జీవించుటకు జీవుడర్హత పొందుచున్నాడు. వివిధ పద్ధతులలో సంఘమునకు జీవుల సేవ లభ్యమగును.
సంఘమునకు తోడ్పాటు చేయు ఆశయముతోనే సంఘమున పనిచేయవలెను. అట్లు పనిచేయు వారిని సంఘము సహజముగ మన్నించును, గౌరవించును, ఆదరించును కూడ.
ఇట్లు సంఘమున ఆదరణము పొందినవారు, గౌరవము పొందినవారు, ఇతరులు కూడ అదే మార్గమున ప్రవర్తించుటకు స్పూర్తిని కలిగింతురు.
అందువలన కృష్ణుని కర్మ సిద్ధాంతమున అసక్తత, నియత కర్మ, సమాచరణము, యజ్ఞార్థ జీవనములతో పాటు సంఘమున స్ఫూర్తిదాయకముతో గూడ నుండవలెనని తెలుపుచున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Seeds Of Consciousness - 197 🌹*
✍️ Nisargadatta Maharaj
Nisargadatta Gita
📚. Prasad Bharadwaj
*🌻 46. The belief in the ‘I am’ to be something as a body, as an individual is the cause of all fear, in the absence of the ‘I am’, who is to fear what? 🌻*
This belief that ‘I am so and so’ with a mind and body, an individual living in this world and society is the cause of all fear.
Fears are many and diverse, there is fear of death, loss of wealth, loss of near and dear ones, then there is fear of illhealth, coming to disrepute and the many, many small ones that occur and change from moment to moment.
But, for the one who has realized that the ‘I am’ itself is false and since all fears are based on the ‘I am’, there is no fear anymore.
Quite obviously, if there is no individual, who is to fear what?
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. అద్భుత సృష్టి - 53 🌹*
✍️ . రచన, సంకలనం- DNA స్వర్ణలత గారు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻. యాక్టివేషన్ జరిగేటప్పుడు మనలో వచ్చే మార్పులు - 3 🌻*
🌟. *5వ లెవెల్*
మన మెంటల్ బాడీ ఆత్మ కు అనుగుణంగా ఉండాలని కోరుకుంటుంది. ఇప్పటివరకు ఉన్న కలల ప్రపంచం మారుతుంది. గొప్ప గొప్ప కలలు ఎరుకతో కనడం జరుగుతుంది. ఆలోచనా ప్రక్రియ సరళంగా మారుతుంది. ప్రశ్న మరి తెలుసుకోవడం మధ్య తేడాను గ్రహిస్తూ ఉంటాం.
✨. సమాజం, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల నుండి వచ్చిన అలవాట్లు మార్చబడతాయి. *"నేనే అంతా"* అనే స్థితి నుండి *"మనమంతా ఒక్కటే"* అనే స్థితికి మారుతాం.(మమాత్మా సర్వభూతాత్మ స్థితి) పాత భావాలన్నీ తొలగించబడి కొత్త భావాలను రీ ప్రోగ్రామింగ్ చేయడం జరుగుతుంది.
✨. ప్రతి విషయాన్నీ అర్థం చేసుకుంటూ తీర్పు ఇచ్చే మెంటాలిటీ నుండి హృదయం ద్వారా స్పందించే గుణానికి రీప్రోగ్రామింగ్ చేయబడతాం.
✨. కలల ద్వారా వివేచనావంతమైన మరి సరళమైన ఆలోచనా విధానాన్ని అభివృద్ధి పరచుకుంటాం. పాత ఆలోచనా విధానం అంతా మార్చబడి శరీరం నుండి విడుదల చేయబడుతుంది. *"నేను ఎవరు?"* అనే ప్రశ్న తలెత్తుతుంది. *"ఎవరు?"* అన్న ప్రశ్నకు సమాధానం వెతకటం ప్రారంభిస్తాం.
🌟. *6వ లెవెల్:-*
పరస్పర మద్దతును ఇచ్చిపుచ్చుకుంటూ ఒక్కొక్కరి ఎదుగుదలకు సహకరించుకుంటూ ఉంటాం.
సంబంధ బాంధవ్యాలలో, ఉద్యోగ, వ్యాపారాలలో అధిక మార్పులు సంభవిస్తాయి. మన యొక్క ఫ్రీక్వెన్సీ మార్పుల వలన ఇప్పటివరకు ఉన్న స్నేహితులు మారి..కొత్తవారు పరిచయం అవుతూ ఉంటారు అంటే మన సంబంధబాంధవ్యాలు అప్ గ్రేడ్ అవుతూ ఉంటాయి.
✨. 33% అధిక శక్తి పొందుతూ అంతరంగ శక్తులను మేల్కొల్పడం జరుగుతుంది.
ఆత్మ విస్తారమైన అవగాహన కలిగి ఉంటుంది. రియాలిటీ యొక్క జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూ లైట్ తో పనిచేసే లాగా మనల్ని ప్రోత్సహిస్తుంది. మీరు భౌతిక పదార్థం కాదని మల్టీ డైమెన్షనల్ బీయింగ్ అని తెలియజేస్తుంది. unconditional love షరతులు లేని ప్రేమను కలిగి ఉంటుంది. కరుణ ను కలిగి ఉంటాం. దీని వలన తమ జీవితాలకు ఇతరుల యొక్క జీవితాలకు సేవ చేయడం జరుగుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 36 / Sri Vishnu Sahasra Namavali - 36 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*
*కర్కాటక రాశి- అశ్లేష నక్షత్ర 4వ పాద శ్లోకం*
*🌻 36. స్కందః స్కందధరో ధుర్యోవరదో వాయువాహనః।*
*వాసుదేవో బృహద్భానుః ఆదిదేవః పురన్దరః॥ 🌻*
అర్ధము :
🍀. స్కందః -
ధర్మమార్గమును అనుసరించువాడు.
🍀. స్కందధరః -
ధర్మమార్గమును రక్షించువాడు.
🍀. ధుర్యః -
జీవుల ఉత్పత్తికి కారణమైనవాడు.
🍀. వరదః -
కావలసినవి సమకూర్చువాడు.
🍀. వాయువాహనః - వాయురూపమున విశ్వమంతటా వ్యాపించువాడు.
🍀. వాసుదేవః - అంతటా వుండువాడు.
🍀. బృహద్భానుః -
అఖండ సూర్యునిగా (ద్వాదశ ఆదిత్యులుగా) ప్రకాశించువాడు.
🍀. ఆదిదేవః -
సృష్టికి మూలపురుషుడు.
🍀. పురంధరః -
పురములను (బ్రహ్మాణ్డములను) ధరించినవాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Vishnu Sahasra Namavali - 36 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj
*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*
*Sloka for Karkataka Rasi, Aslesha 4th Padam*
*🌻 36. skandaḥ skandadharō dhuryō varadō vāyuvāhanaḥ |*
*vāsudevō bṛhadbhānurādidevaḥ purandaraḥ || 36 || 🌻*
🌻 Skandaḥ:
One who drives everything as air.
🌻 Skanda-dharaḥ:
One who supports Skanda or the righteous path.
🌻 Dhuryaḥ:
One who bears the weight of the burden of all beings in the form of birth etc.
🌻 Varadaḥ:
One who gives boons.
🌻 Vāyuvāhanaḥ:
One who vibrates the seven Vayus or atmospheres beginning with Avaha.
🌻 Vāsudevaḥ:
One who is both Vasu and Deva.
🌻 Bṛhadbhānuḥ:
The great brilliance.
🌻 Ādidevaḥ:
The Divinity who is the source of all Devas.
🌻 Purandaraḥ:
One who destroys the cities of the enemies of Devas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹