శమీవృక్షం - మంత్రం - విధానం / Shamivriksha Mantra - Method / शमी/खेजड़ी के वृक्ष का मंत्र



🌹 శమీవృక్షం - మంత్రం - విధానం 🌹

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి , ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు.

శ్లో" శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ ||

పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.




🌹 Shamivriksha - Mantra - Method 🌹


On the evening of Vijayadashami, on the occasion of nakshatra darshan vijaya, aparajita devi at shamivriksha (jammi tree) is worshipped and circumambulated the tree in remembrance of the following shloka.

shlo" shami shamayatE paapaM shamishatru nivaariNee |
arjunasya dhanurthaarī rāmasya priyadarshinī ||

All the chits written in the above verse are attached to the branches of the tree. It is believed that by doing this, along with the grace of the Goddess, the prevention of Shani Dosha will also take place.


దసరా రోజు పాలపిట్టను చూడటం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు Why it is auspicious to see a Blue Jay quail on the day of Dussehra {Blue Jay/ Indian Roller bird/ Neelkanth नीलकंठ (Coracias benghalensis, family Coraciidae)}


దసరా రోజు పాలపిట్టను చూడటం ఎందుకు శుభప్రదంగా భావిస్తారు..!!

పాలపిట్టను ఎందుకు చూస్తారు?

పురాణాల ప్రకారం పాలపిట్ట చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఈ పక్షిని చూసిన తర్వాత శ్రీరాముడు రావణుడిపై జరిపిన యుద్ధంలో విజయం సాధించాడని మత విశ్వాసాలు చెబుతున్నాయి. నీలకంఠ పక్షిని చూసే సంప్రదాయం ఈ మంచితనపు విజయోత్సవంలో ఏళ్ల తరబడి కొనసాగుతోంది. రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు వచ్చినప్పుడు బ్రాహ్మణుడిని చంపిన పాపం అతనిపై మోపబడిందని కూడా చెబుతారు. తన పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి అతను లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అందుకు శివుడు సంతోషించి నీలకంఠ పక్షి రూపంలో రాముడు, లక్ష్మణునికి దర్శనమిస్తాడు. అందువల్ల దసరా పవిత్ర సందర్భంగా నీలకంఠ పక్షిని చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు.

మరొక కథనం ప్రకారం దసరా రోజు జమ్మి చెట్టును పూజించి పాల పిట్టను దర్శించుకున్న వారికి అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. ఈ పిట్ట అదృష్టం, శుభ సూచకంగా భావిస్తారు. పాండవులు అరణ్య వాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో పెట్టారని చెబుతారు. అప్పుడు ఇంద్రుడు పిట్ట రూపంలోకి వచ్చి వాటికి కాపలాగా ఉన్నాడని అంటారు.

అరణ్య వాసం ముగించుకుని పాండవులు తిరిగి వెళ్లేటప్పుడు ఆయుధాలు తీసుకుని వెళ్తున్నప్పుడు పాలపిట్ట ఎదురుపడింది. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అందుకే పాల పిట్ట ఎదురుపడితే అన్నింటా విజయం చేకూరుతుందనే విశ్వాసం అప్పటి నుంచి ఇప్పటి వరకు సంప్రదాయంగా కొనసాగుతోంది. విజయానికి ప్రతీకగా పాలపిట్టను చూసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.