పాలపిట్టను ఎందుకు చూస్తారు?
పురాణాల ప్రకారం పాలపిట్ట చాలా శుభకరమైనదిగా భావిస్తారు. ఈ పక్షిని చూసిన తర్వాత శ్రీరాముడు రావణుడిపై జరిపిన యుద్ధంలో విజయం సాధించాడని మత విశ్వాసాలు చెబుతున్నాయి. నీలకంఠ పక్షిని చూసే సంప్రదాయం ఈ మంచితనపు విజయోత్సవంలో ఏళ్ల తరబడి కొనసాగుతోంది. రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు వచ్చినప్పుడు బ్రాహ్మణుడిని చంపిన పాపం అతనిపై మోపబడిందని కూడా చెబుతారు. తన పాపాలకు పశ్చాత్తాపం చెందడానికి అతను లక్ష్మణుడితో కలిసి పరమేశ్వరుడిని పూజించాడు. అందుకు శివుడు సంతోషించి నీలకంఠ పక్షి రూపంలో రాముడు, లక్ష్మణునికి దర్శనమిస్తాడు. అందువల్ల దసరా పవిత్ర సందర్భంగా నీలకంఠ పక్షిని చూడటం శుభప్రదంగా పరిగణిస్తారు.
మరొక కథనం ప్రకారం దసరా రోజు జమ్మి చెట్టును పూజించి పాల పిట్టను దర్శించుకున్న వారికి అంతా శుభమే జరుగుతుందని నమ్ముతారు. ఈ పిట్ట అదృష్టం, శుభ సూచకంగా భావిస్తారు. పాండవులు అరణ్య వాసానికి వెళ్లేటప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టులో పెట్టారని చెబుతారు. అప్పుడు ఇంద్రుడు పిట్ట రూపంలోకి వచ్చి వాటికి కాపలాగా ఉన్నాడని అంటారు.
అరణ్య వాసం ముగించుకుని పాండవులు తిరిగి వెళ్లేటప్పుడు ఆయుధాలు తీసుకుని వెళ్తున్నప్పుడు పాలపిట్ట ఎదురుపడింది. ఆ తర్వాత కౌరవులతో జరిగిన యుద్ధంలో పాండవులు విజయం సాధించారు. అందుకే పాల పిట్ట ఎదురుపడితే అన్నింటా విజయం చేకూరుతుందనే విశ్వాసం అప్పటి నుంచి ఇప్పటి వరకు సంప్రదాయంగా కొనసాగుతోంది. విజయానికి ప్రతీకగా పాలపిట్టను చూసే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
No comments:
Post a Comment