మైత్రేయ మహర్షి బోధనలు - 67

🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 67 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 53. నిరసించుట - ప్రేమించుట 🌻

మనుష్యులను ద్వేషించువారు మహత్తర కార్యములు చేయ లేరు. ఎల్లప్పుడును మానవజాతిని నిరసించుచు మాటాడు వక్తలు, ప్రవక్తలు చాలామంది కలరు. నిరసించుట వలన ఈ వక్తలు, ప్రవక్తలు ఏ మహత్కార్యమును సాధింపలేరు. కేవలము సిద్ధాంతవాదులుగ చరిత్రపుటలలో మిగిలిపోయినారు. జీవులను నిరసించుట సిగ్గుచేటు. తమలోని ద్వేషభావమునే, వక్తలందరును జీవులపై నిరసన భావముగ ప్రకటింతురు. నిరసించుటకన్న ప్రేమించుట మిన్న. జీవులను ప్రేమించు వారు జీవుల సమస్యలకు పరిష్కారము చూపుదురు. సహకారము నందింతురు. జీవుల పురోగతికి తోడ్పడుదురు. వీరు పరస్పరత్వమును నేర్పుదురు.

పరస్పరత్వము పునాదిగ ఏకత్వపు వైభవమును ఆవిష్కరింతురు. ఏకత్వము, పరస్పరత్వము, ఒకరిపై నొకరికి విశ్వాసము కారణముగ సహాయ సహకారముల నందించు కొనుచు మహత్తర కార్యములు చేయుదురు. కేవలము ప్రేమ, పరస్పరత్వము ఆధారముగనే కోతులు సముద్రముపై వంతెనను నిర్మాణము చేసినవి. ప్రగాఢమైన విశ్వాసము, పరస్పర ప్రేమ, సహాయ సహకారములు, రాముని యందు ఏకత్వము వంతెనకు పునాదిరాళ్ళుగ నిలచినవి. దుర్ఘట కార్యములు కూడ పై పునాదుల వలన సాధింపబడినవి.

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹

02 Feb 2022

నిర్మల ధ్యానాలు - ఓషో - 130

🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 130 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఎప్పుడయితే గొప్ప మార్మికుడుంటాడో అతన్ని అనుసరించేవాళ్ళ ఈ రెండు ప్రవాహాలుగా విడిపోతూ వుంటారు. నిజమైన వాళ్ళు గురువుని అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు మార్మికులవుతారు. పదాల్ని, మాటల్ని మాత్రమే పట్టుకున్న వాళ్ళు కావలసినంత 'జ్ఞానం' సంపాదించిన వాళ్ళు తాత్వికులవుతారు. 🍀

చైతన్యానికి సంబంధించిన రెండు నదులున్నాయి. ఒకటి తాత్వికులది. రెండోది మార్మికులకు సంబంధించింది. అది పూర్తిగా వేరయిన నది. దానికి తాత్వీకరణతో పని లేదు. అది అస్తిత్వ అనుభవం మీద ఆధారపడింది. అది ఎప్పుడూ వుంది. ఎప్పుడయితే గొప్ప మార్మికుడుంటాడో అతన్ని అనుసరించే వాళ్ళ ఈ రెండు ప్రవాహాలుగా విడిపోతూ వుంటారు. నిజమైన వాళ్ళు గురువుని అర్థం చేసుకునేవాళ్ళు. నిజంగా గురువును ప్రేమించే వాళ్ళు. వాళ్ళు మార్మికులవుతారు. పదాల్ని, మాటల్ని మాత్రమే పట్టుకున్న వాళ్ళు కావలసినంత 'జ్ఞానం' సంపాదించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు తాత్వికులవుతారు.

నా మార్గం మార్మిక మార్గం. తాత్విక మార్గం కాదు. నేను ఆనందాన్ని నమ్ముతాను. ఆనంద సిద్ధాంతాల్ని కాదు. మీరూ దాన్ని రుచి చూడాలని కోరుకుంటాను. దాన్ని గురించి ఆలోచించడం కాదు. ముందు ప్రవాహం వుంటే నీటి గురించి ఆలోచిస్తూ గడపడం తెలివితక్కువతనం. నీటి గురించి సిద్ధాంతాలు చెయ్యడం కాదు, నీటిని తాగాలి. దాహం తీర్చుకోవాలి. కాబట్టి ఆలోచించేవాడు కాకండి, ఫిలాసఫర్ కాకండి. మార్మికుడు కండి. నా సన్యాసులు మార్మికులు, అస్తిత్వ మార్మికులు. అది వివేకంలో భాగం.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹

02 Feb 2022

విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 550 / Vishnu Sahasranama Contemplation - 550

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 550 / Vishnu Sahasranama Contemplation - 550 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻 550. కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ 🌻

ఓం కృష్ణాయ నమః | ॐ कृष्णाय नमः | OM Kr̥ṣṇāya namaḥ

కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ

కృష్ణద్వైపాయన కృష్ణ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ।
ఇతి విష్ణుపురాణే శ్రీ పరాశర సమీరణాత్ ॥

కృష్ణద్వైపాయన వ్యాసుడు.

:: శ్రీ విష్ణుమహాపురాణే తృతీయాంశే చతుర్థోఽధ్యాయః ::

కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుమ్ ।
కో హ్యన్యో భువి మైత్రేయ మహాభారతకృద్భవేత్ ॥ 5 ॥

కృష్ణ ద్వైపాయన వ్యాసుని ప్రభుడగు నారాయణునిగా ఎరుగుము. ఏలయన హరికాక మరి ఇతరుడెవ్వడు మహాభారత రచయిత కాగలడు?

57. కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 550 🌹

📚. Prasad Bharadwaj

🌻 550. Kr̥ṣṇaḥ 🌻

OM Kr̥ṣṇāya namaḥ

कृष्णद्वैपायन कृष्ण इति सङ्कीर्त्यते बुधैः ।
इति विष्णुपुराणे श्री पराशर समीरणात् ॥

Kr̥ṣṇadvaipāyana kr̥ṣṇa iti saṅkīrtyate budhaiḥ,
Iti viṣṇupurāṇe śrī parāśara samīraṇāt.

The One with dark complexion and born on an island; Kr̥ṣṇadvaipāyana i.e., Sage Vyāsa.

:: श्री विष्णुमहापुराणे तृतीयांशे चतुर्थोऽध्यायः ::

कृष्णद्वैपायनं व्यासं विद्धि नारायणं प्रभुम् ।
को ह्यन्यो भुवि मैत्रेय महाभारतकृद्भवेत् ॥ ५ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part III, Chapter 4

Kr̥ṣṇadvaipāyanaṃ vyāsaṃ viddhi nārāyaṇaṃ prabhum,
Ko hyanyo bhuvi maitreya mahābhāratakr̥dbhavet. 5.

Know Kr̥ṣṇadvaipāyana Vyāsa to be the Lord Nārāyaṇa. For, who other than the Puṇḍarīkākṣa could have authored Mahābhārata?

57. కృష్ణః, कृष्णः, Kr̥ṣṇaḥ

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

02 Feb 2022

శ్రీ శ్యామలా దండకం Sri Shyamala Dandakam

🌹. శ్రీ శ్యామలా దండకం 🌹

ధ్యానమ్ Meditation

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి 1

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః 2

వినియోగః

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ౩

స్తుతి

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే 4

🍀. దండకం Dandakam 🍀

జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూర రశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండల వ్యాప్తమాణిక్య తేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ

మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||

🌹 🌹 🌹 🌹 🌹

02 Feb 2022

శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు Sri Shyamala Navratri

🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు 🌹

మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు.

శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి .

శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు..

విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు..

శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు..త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.

ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.

శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.

ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.

🌷. శ్రీ శ్యామలా స్తుతి 🌷 Sri Shyamala Stuti

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||

మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||

శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||

ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||

🌹 🌹 🌹 🌹 🌹

02 Feb 2022

02 - FEBRUARY - 2022 బుధవారం MESSAGES శ్రీ శ్యామలా దేవి నవరాత్రి ప్రారంభం

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam, 02, ఫిబ్రవరి 2022 బుధవారం, సౌమ్య వాసరే 🌹
🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రి శుభాకాంక్షలు 🌹
🌹. శ్రీ శ్యామలాదేవి స్థుతి, దండకం 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 153 / Bhagavad-Gita - 153 - 3-34 కర్మయోగము 🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 550 / Vishnu Sahasranama Contemplation - 550🌹
4) 🌹 DAILY WISDOM - 228🌹 
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 130🌹
6) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 67🌹 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రి శుభాకాంక్షలు మరియు శుభ బుధవారం మిత్రులందరికీ 🌹*
*సౌమ్య వాసరే, 02, ఫిబ్రవరి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. శ్రీ శ్యామలా స్తుతి 🍀*

*శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే*
*సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |*
*సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే*
*పాహిమాం పాహిమాం పాహి ||*

🌻 🌻 🌻 🌻 🌻

*పండుగలు మరియు పర్వదినాలు :*
*చంద్ర దర్శనం, శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం*
*Chandra Darshan, Shyamala Devi Navratri Begins*

*🍀. నేటి సూక్తి : ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నా, తనని తాను ద్వేషించు కుంటున్నట్లే 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం,
శిశిర ఋతువు, మాఘ మాసం
తిథి: శుక్ల పాడ్యమి 08:32:58 వరకు
తదుపరి శుక్ల విదియ
నక్షత్రం: ధనిష్ట 17:54:36 వరకు
తదుపరి శతభిషం
యోగం: వరియాన 23:58:40 వరకు
తదుపరి పరిఘ
కరణం: బవ 08:32:58 వరకు
సూర్యోదయం: 06:47:44
సూర్యాస్తమయం: 18:11:50
వైదిక సూర్యోదయం: 06:51:26
వైదిక సూర్యాస్తమయం: 18:08:05
చంద్రోదయం: 07:46:15
చంద్రాస్తమయం: 19:26:59
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కుంభం
వర్జ్యం: 24:41:36 - 26:12:24
దుర్ముహూర్తం: 12:06:58 - 12:52:35
రాహు కాలం: 12:29:47 - 13:55:17
గుళిక కాలం: 11:04:16 - 12:29:47
యమ గండం: 08:13:14 - 09:38:45
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 08:17:32 - 09:46:04
మిత్ర యోగం - మిత్ర లాభం 17:54:36
వరకు తదుపరి మానస యోగం - కార్య లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PANCHANGUM
#DAILYCalender
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు 🌹*

మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులు. 

శ్యామల సరస్వతీ రూపం జ్ఞాన స్వరూపం ఈమెను మంత్రిని అంటారు..అమ్మవారికి శ్యామల దేవి మంత్రి వారాహిమాత సేనాధిపతి .

శ్యామలా ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి (మాతంగ ముని కుమార్తె)రాజా మతాంగి, రాజశ్యామల అని కూడా అంటారు.. దశమహావిద్య లో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధ గా చెప్పుకునేది మాతాంగి శ్యామలా ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షణాచారం రెండు పద్ధతులలో ఆరాధిస్తారు, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ దశమహావిద్య సాధన మహా ప్రసిద్ధి ఈ పది విద్యలో ఏది ఉపాసించిన మిగతా తొమిది విద్యలు అందులో కలిసి ఉంటాయి కనుక దశమహావిద్య లో ఒక్క విద్య సాధన చేసిన మిగిలిన అన్నిటిలో ఉపాసన విధి తెలిసిపోతుంది త్వరగా సిద్ధిస్తుంది , అయితే ఈ దశమహావిద్యాలో శ్రీవిద్య ప్రధానంగా శంకరులు వారు వ్యాప్తిలో కి తెచ్చారు దానికి కారణం శ్రీ విద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలా నవరాత్రి ని విశేషంగా జరుపుకుంటారు..

విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహి శ్యామల రూపాలు ప్రధానమైనవి గా లలితా నామ వివరణలో తెలుసుకున్నాము ఇంకా అనేక సందర్భాలలో శ్యామలా దేవి గురించి సహస్త్ర నామంలో ప్రస్తావించబడినది, అమ్మవారి కుడివైపు శ్యామలా దేవి, యడమవైపు వారాహి దేవి ఉంటారు..అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలా దేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్య భారమంతా అప్పగించింది.. అందుకే రాజశ్యామల అంటారు..

శ్యామలా దేవిని ఉపాసించిన వారికి విద్యలో రాణిస్తారు, కోల్పోయిన పదవులు ,కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు..త్వరగా మంత్ర సిద్ధి పొందడానికి ఏదైనా చెడు ప్రయోగాలనుండి రక్షించడానికి, ఈ తల్లి ఉపాసన ప్రసిద్దిగా చేస్తారు.

ప్రధానంగా , ప్రసంగం మరియు “నాడా” కంపించే ప్రతిధ్వని, మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తాయి. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది, పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామల , అభివృద్ధికి , ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముకంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది.

శ్రీ శ్యామలా దండకం, శ్రీ శ్యామలా స్తుతి చాలా ప్రసిద్ధమైనవి. వీటిలో మంత్ర యంత్ర తంత్ర సంకేతాలు, శ్యామలా విద్య రహస్యము కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పవలసినది శ్యామల దండకం.

*ఈ తొమ్మిది రోజులూ శ్యామలాదేవిని శ్రీ శ్యామలా స్తుతితో, దండకంతో ఆరాధించు కుందాం.*

*🌷. శ్రీ శ్యామలా స్తుతి 🌷*

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసం |
మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసాస్మరామి || 1 ||

చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగాశోణే |
పుండ్రీక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః || 2 ||

మాతా మరకతశ్యామ మాతంగి మధుశాలినీ
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కడంబవనవాసినీ |
జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే
జయ సంగీతరసికే జయ లీలా శుక ప్రియే || 3 ||

శ్రీ స్స్వయం సర్వతీర్దాత్మికే సర్వామంత్రాత్మికే
సర్వతంత్రాత్మికే సర్వాముద్రాత్మికే |
సర్వశక్త్యాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే జగన్మాతృకే
పాహిమాం పాహిమాం పాహి || 4 ||

ఇతి శ్రీ శ్యామలా స్తుతి సంపూర్ణం ||
🌹 🌹 🌹 🌹 🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹

https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ శ్యామలా దండకం 🌹*

*ధ్యానమ్*

మాణిక్యవీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ |
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి 1 

చతుర్భుజే చంద్రకలావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే |
పుండ్రేక్షుపాశాంకుశపుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః 2 

*వినియోగః*

మాతా మరకతశ్యామా మాతంగీ మదశాలినీ |
కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబవనవాసినీ ౩ 

*స్తుతి*

జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే |
జయ సంగీతరసికే జయ లీలాశుకప్రియే 4 

*🍀. దండకం 🍀*

జయ జనని సుధాసముద్రాంతరుద్యన్మణీద్వీపసంరూఢ బిల్వాటవీమధ్యకల్పద్రుమాకల్పకాదంబకాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే, సాదరారబ్ధసంగీతసంభావనాసంభ్రమాలోలనీపస్రగాబద్ధచూలీసనాథత్రికే సానుమత్పుత్రికే, శేఖరీభూతశీతాంశురేఖామయూఖావలీబద్ధసుస్నిగ్ధనీలాలకశ్రేణిశృంగారితే లోకసంభావితే కామలీలాధనుస్సన్నిభభ్రూలతాపుష్పసందోహసందేహకృల్లోచనే వాక్సుధాసేచనే చారుగోరోచనాపంకకేళీలలామాభిరామే సురామే రమే, ప్రోల్లసద్వాలికామౌక్తికశ్రేణికాచంద్రికామండలోద్భాసి లావణ్యగండస్థలన్యస్తకస్తూరికాపత్రరేఖాసముద్భూత సౌరభ్యసంభ్రాంతభృంగాంగనాగీతసాంద్రీభవన్మంద్రతంత్రీస్వరే సుస్వరే భాస్వరే, వల్లకీవాదనప్రక్రియాలోలతాలీదలాబద్ధ-తాటంకభూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే, దివ్యహాలామదోద్వేలహేలాలసచ్చక్షురాందోలనశ్రీసమాక్షిప్తకర్ణైకనీలోత్పలే శ్యామలే పూరితాశేషలోకాభివాంఛాఫలే శ్రీఫలే, స్వేదబిందూల్లసద్ఫాలలావణ్య నిష్యందసందోహసందేహకృన్నాసికామౌక్తికే సర్వవిశ్వాత్మికే సర్వసిద్ధ్యాత్మికే కాలికే ముగ్ధమందస్మితోదారవక్త్రస్ఫురత్ పూగతాంబూలకర్పూరఖండోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే శ్రీకరే, కుందపుష్పద్యుతిస్నిగ్ధదంతావలీనిర్మలాలోలకల్లోలసమ్మేలన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే,

సులలిత నవయౌవనారంభచంద్రోదయోద్వేలలావణ్యదుగ్ధార్ణవావిర్భవత్కంబుబింబోకభృత్కంథరే సత్కలామందిరే మంథరే దివ్యరత్నప్రభాబంధురచ్ఛన్నహారాదిభూషాసముద్యోతమానానవద్యాంగశోభే శుభే, రత్నకేయూర రశ్మిచ్ఛటాపల్లవప్రోల్లసద్దోల్లతారాజితే యోగిభిః పూజితే విశ్వదిఙ్మండల వ్యాప్తమాణిక్య తేజస్స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః పూజితే వాసరారంభవేలాసముజ్జృంభ
మాణారవిందప్రతిద్వంద్విపాణిద్వయే సంతతోద్యద్దయే అద్వయే దివ్యరత్నోర్మికాదీధితిస్తోమ సంధ్యాయమానాంగులీపల్లవోద్యన్నఖేందుప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే,

తారకారాజినీకాశహారావలిస్మేర చారుస్తనాభోగభారానమన్మధ్యవల్లీవలిచ్ఛేద వీచీసముద్యత్సముల్లాససందర్శితాకారసౌందర్యరత్నాకరే వల్లకీభృత్కరే కింకరశ్రీకరే, హేమకుంభోపమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్తగంభీర నాభీసరస్తీరశైవాలశంకాకరశ్యామరోమావలీభూషణే మంజుసంభాషణే, చారుశించత్కటీసూత్రనిర్భత్సితానంగలీలధనుశ్శించినీడంబరే దివ్యరత్నాంబరే,

పద్మరాగోల్లస న్మేఖలామౌక్తికశ్రోణిశోభాజితస్వర్ణభూభృత్తలే చంద్రికాశీతలే వికసితనవకింశుకాతామ్రదివ్యాంశుకచ్ఛన్న చారూరుశోభాపరాభూతసిందూరశోణాయమానేంద్రమాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమలస్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీరశంకాకరోదార జంఘాలతే చారులీలాగతే నమ్రదిక్పాలసీమంతినీ కుంతలస్నిగ్ధనీలప్రభాపుంచసంజాతదుర్వాంకురాశంక సారంగసంయోగరింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాయ్వగ్నికోటీరమాణిక్య సంహృష్టబాలాతపోద్దామ లాక్షారసారుణ్యతారుణ్య లక్ష్మీగృహితాంఘ్రిపద్మే సుపద్మే ఉమే,

సురుచిరనవరత్నపీఠస్థితే సుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే శంఖపద్మద్వయోపాశ్రితే విశ్రుతే తత్ర విఘ్నేశదుర్గావటుక్షేత్రపాలైర్యుతే మత్తమాతంగ కన్యాసమూహాన్వితే భైరవైరష్టభిర్వేష్టితే మంచులామేనకాద్యంగనామానితే దేవి వామాదిభిః శక్తిభిస్సేవితే ధాత్రి లక్ష్మ్యాదిశక్త్యష్టకైః సంయుతే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చితే, భైరవీ సంవృతే పంచబాణాత్మికే పంచబాణేన రత్యా చ సంభావితే ప్రీతిభాజా వసంతేన చానందితే భక్తిభాజం పరం శ్రేయసే కల్పసే యోగినాం మానసే ద్యోతసే ఛందసామోజసా భ్రాజసే గీతవిద్యా వినోదాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యసే భక్తిమచ్చేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే, శ్రవణహరదక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వసిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్ వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషత్మకం చాటుగాథా సముచ్చారణాకంఠమూలోల్లసద్వర్ణరాజిత్రయం కోమలశ్యామలోదారపక్షద్వయం తుండశోభాతిదూరీభవత్ కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే,

పాణిపద్మద్వయేనాక్షమాలామపి స్ఫాటికీం జ్ఞానసారాత్మకం పుస్తకంచంకుశం పాశమాబిభ్రతీ తేన సంచింత్యసే తస్య వక్త్రాంతరాత్ గద్యపద్యాత్మికా భారతీ నిస్సరేత్ యేన వాధ్వంసనాదా కృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతిస్తియః పూరుషాః యేన వా శాతకంబద్యుతిర్భావ్యసే సోపి లక్ష్మీసహస్రైః పరిక్రీడతే, కిన్న సిద్ధ్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలా సరోవారిధీః తస్య కేలీవనం నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరి తస్య చాజ్ఞాకరీ శ్రీ స్వయం,

సర్వతీర్థాత్మికే సర్వ మంత్రాత్మికే, సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే, సర్వ చక్రాత్మికే సర్వ శక్త్యాత్మికే, సర్వ పీఠాత్మికే సర్వ వేదాత్మికే, సర్వ విద్యాత్మికే సర్వ యోగాత్మికే, సర్వ వర్ణాత్మికే సర్వగీతాత్మికే, సర్వ నాదాత్మికే సర్వ శబ్దాత్మికే, సర్వ విశ్వాత్మికే సర్వ వర్గాత్మికే, సర్వ సర్వాత్మికే సర్వగే సర్వ రూపే, జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః ||
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 153 / Bhagavad-Gita - 153 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 34 🌴*

*34. ఇన్ద్రియ స్యెన్ద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ |*
*తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్తినౌ ||*

🌷. తాత్పర్యం :
*ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల యెడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి గావున వాటికి ఎవ్వరును వశము కాకూడదు.*

🌷. భాష్యము :
భాష్యము కృష్ణభక్తిరసభావన యందున్నవారు ఇంద్రియ భోగముల యెడ సహజముగా విముఖులై యుందురు. అటువంటి దివ్యభావన లేనివారు శాస్త్రములలో తెలుపబడిన విధి నియమములను తప్పక అనుసరింపవలసియుండును. విచ్చలవడి భోగానుభవము భౌతికబంధము కలిగించగలదు. 

కాని శాస్త్రములందు తెలుపబడిన విధినియమములను పాటించువారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైథునభోగమనునది బద్ధజీవునకు అత్యంత అవసరమైనది. అట్టి సుఖము వివాహము ద్వారా ఆమోదింపబడినది. భార్యతో తప్ప ఇతర స్త్రీలతో లైంగియభోగమునందు పాల్గొనరాదనీ శాస్త్రములు తెలుపుచున్నవి. పరస్త్రీని తల్లిగా భావించవలెను. 

అటువంటి ఆదేశములు ఉన్నప్పటికిని మనుజుడు ఇతర స్త్రీలతో అక్రమసంబంధమును పొందగోరును. అటువంటి భావములను సంపూర్ణముగా నశింపజేయవలెను. లేనిచో అవి ఆత్మానుభవమార్గమున గొప్ప ఆటమకములు కాగలవు. దేహమున్నంత కాలము దేహావసరవములు తప్పవు కనుక వానిని నియమనిబంధనల ననుసరించి గ్రహించవలెను. అయినను ఆ నియమముల పైన కూడా పూర్తిగా ఆధారపడరాదు. కేవలము సంగరహితులమై వాటిని మనము అనుసరింపవలెను. భౌతికసంపర్క కారణమున భోగవాంఛ అనంతకాలము నుండి వచ్చుచున్నది. కావున ఇంద్రియభోగము నియమితమై నప్పటికిని మనుజుడు పతనము నొందుట ఆస్కారము కలదు. అందుచే విధినియమానుసార ఇంద్రియభోగము సైతము త్యజించ వలసియున్నది. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 153 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 3 - Karma Yoga - 34 🌴*

*34. indriyasyendriyasyārthe rāga-dveṣau vyavasthitau*
*tayor na vaśam āgacchet tau hy asya paripanthinau*

🌷 Translation : 
*There are principles to regulate attachment and aversion pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion, because they are stumbling blocks on the path of self-realization.*

🌷 Purport :
Those who are in Kṛṣṇa consciousness are naturally reluctant to engage in material sense gratification. But those who are not in such consciousness should follow the rules and regulations of the revealed scriptures. Unrestricted sense enjoyment is the cause of material encagement, but one who follows the rules and regulations of the revealed scriptures does not become entangled by the sense objects. For example, sex enjoyment is a necessity for the conditioned soul, and sex enjoyment is allowed under the license of marriage ties. According to scriptural injunctions, one is forbidden to engage in sex relationships with any women other than one’s wife. 

All other women are to be considered as one’s mother. But in spite of such injunctions, a man is still inclined to have sex relationships with other women. These propensities are to be curbed; otherwise they will be stumbling blocks on the path of self-realization. As long as the material body is there, the necessities of the material body are allowed, but under rules and regulations. And yet, we should not rely upon the control of such allowances.

Therefore, in spite of regulated sense enjoyment, there is every chance of falling down; therefore any attachment for regulated sense enjoyment must also be avoided by all means. But attachment to Kṛṣṇa consciousness, or acting always in the loving service of Kṛṣṇa, detaches one from all kinds of sensory activities. Therefore, no one should try to be detached from Kṛṣṇa consciousness at any stage of life. The whole purpose of detachment from all kinds of sense attachment is ultimately to become situated on the platform of Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj 
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 550 / Vishnu Sahasranama Contemplation - 550 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🌻 550. కృష్ణః, कृष्णः, Kr‌ṣṇaḥ 🌻*

*ఓం కృష్ణాయ నమః | ॐ कृष्णाय नमः | OM Kr‌ṣṇāya namaḥ*

కృష్ణః, कृष्णः, Kr‌ṣṇaḥ

*కృష్ణద్వైపాయన కృష్ణ ఇతి సఙ్కీర్త్యతే బుధైః ।*
*ఇతి విష్ణుపురాణే శ్రీ పరాశర సమీరణాత్ ॥*

*కృష్ణద్వైపాయన వ్యాసుడు.*

:: శ్రీ విష్ణుమహాపురాణే తృతీయాంశే చతుర్థోఽధ్యాయః ::
కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుమ్ ।
కో హ్యన్యో భువి మైత్రేయ మహాభారతకృద్భవేత్ ॥ 5 ॥

*కృష్ణ ద్వైపాయన వ్యాసుని ప్రభుడగు నారాయణునిగా ఎరుగుము. ఏలయన హరికాక మరి ఇతరుడెవ్వడు మహాభారత రచయిత కాగలడు?*

57. కృష్ణః, कृष्णः, Kr‌ṣṇaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 550 🌹*
*📚. Prasad Bharadwaj*

*🌻 550. Kr‌ṣṇaḥ 🌻*

*OM Kr‌ṣṇāya namaḥ*

कृष्णद्वैपायन कृष्ण इति सङ्कीर्त्यते बुधैः ।
इति विष्णुपुराणे श्री पराशर समीरणात् ॥

*Kr‌ṣṇadvaipāyana kr‌ṣṇa iti saṅkīrtyate budhaiḥ,*
*Iti viṣṇupurāṇe śrī parāśara samīraṇāt.*

*The One with dark complexion and born on an island; Kr‌ṣṇadvaipāyana i.e., Sage Vyāsa.*

:: श्री विष्णुमहापुराणे तृतीयांशे चतुर्थोऽध्यायः ::
कृष्णद्वैपायनं व्यासं विद्धि नारायणं प्रभुम् ।
को ह्यन्यो भुवि मैत्रेय महाभारतकृद्भवेत् ॥ ५ ॥

Śrī Viṣṇu Mahā Purāṇa - Part III, Chapter 4
Kr‌ṣṇadvaipāyanaṃ vyāsaṃ viddhi nārāyaṇaṃ prabhum,
Ko hyanyo bhuvi maitreya mahābhāratakr‌dbhavet. 5.

*Know Kr‌ṣṇadvaipāyana Vyāsa to be the Lord Nārāyaṇa. For, who other than the Puṇḍarīkākṣa could have authored Mahābhārata?*

57. కృష్ణః, कृष्णः, Kr‌ṣṇaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
वेदास्स्वाङ्गोऽजितःकृष्णो दृढस्सङ्कर्षणोऽच्युतः ।
वरुणो वारुणो वृक्षः पुष्कराक्षो महामनाः ॥ ५९ ॥

వేదాస్స్వాఙ్గోఽజితఃకృష్ణో దృఢస్సఙ్కర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ 59 ॥

Vedāssvāṅgo’jitaḥkr‌ṣṇo dr‌ḍassaṅkarṣaṇo’cyutaḥ,
Varuṇo vāruṇo vr‌kṣaḥ puṣkarākṣo mahāmanāḥ ॥ 59 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 DAILY WISDOM - 228 🌹*
*🍀 📖 from Lessons on the Upanishads 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*

*🌻 15. The Concept of Distance is the Concept of Space 🌻*

*Simultaneous with this concept of distance between us and God, there is also the concept of futurity of the attainment of God. It is not something that can be attained just now; it is a matter for tomorrow. “I will attain God one day.” This “one day” implies some time in the future. So, somehow the concept of time also comes in when we conceive God in the traditional pattern. Because of the space concept in our mind, we feel that God is far away from us; there is a distance. The concept of distance is the concept of space. It has entered our brains to such an extent that we cannot think anything except in terms of measurement—length, breadth, height, distance.*

*So, God is away from us, measurably, by a distance. He is also a futurity in time, and He can be attained by hard effort. There is also a causative factor involved in the concept of the attainment of God. Space, time and cause—these are the conditioning factors of human thinking. Without these concepts, we can think nothing. Hence, we are trying to cast God Himself into the mould, the crucible of this threefold determination of our thought— namely, space, time and cause. However, because the concept of space, time and cause involves objectivity, we cannot cast God into this mould.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
 #PrasadBhardwaj 
https://t.me/Seeds_Of_Consciousness
www.facebook.com/groups/dailysatsangwisdom/ 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 130 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఎప్పుడయితే గొప్ప మార్మికుడుంటాడో అతన్ని అనుసరించేవాళ్ళ ఈ రెండు ప్రవాహాలుగా విడిపోతూ వుంటారు. నిజమైన వాళ్ళు గురువుని అర్థం చేసుకునేవాళ్ళు. వాళ్ళు మార్మికులవుతారు. పదాల్ని, మాటల్ని మాత్రమే పట్టుకున్న వాళ్ళు కావలసినంత 'జ్ఞానం' సంపాదించిన వాళ్ళు తాత్వికులవుతారు. 🍀*

*చైతన్యానికి సంబంధించిన రెండు నదులున్నాయి. ఒకటి తాత్వికులది. రెండోది మార్మికులకు సంబంధించింది. అది పూర్తిగా వేరయిన నది. దానికి తాత్వీకరణతో పని లేదు. అది అస్తిత్వ అనుభవం మీద ఆధారపడింది. అది ఎప్పుడూ వుంది. ఎప్పుడయితే గొప్ప మార్మికుడుంటాడో అతన్ని అనుసరించే వాళ్ళ ఈ రెండు ప్రవాహాలుగా విడిపోతూ వుంటారు. నిజమైన వాళ్ళు గురువుని అర్థం చేసుకునేవాళ్ళు. నిజంగా గురువును ప్రేమించే వాళ్ళు. వాళ్ళు మార్మికులవుతారు. పదాల్ని, మాటల్ని మాత్రమే పట్టుకున్న వాళ్ళు కావలసినంత 'జ్ఞానం' సంపాదించిన వాళ్ళు అవుతారు. వాళ్ళు తాత్వికులవుతారు.*

*నా మార్గం మార్మిక మార్గం. తాత్విక మార్గం కాదు. నేను ఆనందాన్ని నమ్ముతాను. ఆనంద సిద్ధాంతాల్ని కాదు. మీరూ దాన్ని రుచి చూడాలని కోరుకుంటాను. దాన్ని గురించి ఆలోచించడం కాదు. ముందు ప్రవాహం వుంటే నీటి గురించి ఆలోచిస్తూ గడపడం తెలివితక్కువతనం. నీటి గురించి సిద్ధాంతాలు చెయ్యడం కాదు, నీటిని తాగాలి. దాహం తీర్చుకోవాలి. కాబట్టి ఆలోచించేవాడు కాకండి, ఫిలాసఫర్ కాకండి. మార్మికుడు కండి. నా సన్యాసులు మార్మికులు, అస్తిత్వ మార్మికులు. అది వివేకంలో భాగం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/EqnNZXIsHgS3n7FezzRz5T
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 67 🌹* 
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*

*🌻 53. నిరసించుట - ప్రేమించుట 🌻*

*మనుష్యులను ద్వేషించువారు మహత్తర కార్యములు చేయ లేరు. ఎల్లప్పుడును మానవజాతిని నిరసించుచు మాటాడు వక్తలు, ప్రవక్తలు చాలామంది కలరు. నిరసించుట వలన ఈ వక్తలు, ప్రవక్తలు ఏ మహత్కార్యమును సాధింపలేరు. కేవలము సిద్ధాంతవాదులుగ చరిత్రపుటలలో మిగిలిపోయినారు. జీవులను నిరసించుట సిగ్గుచేటు. తమలోని ద్వేషభావమునే, వక్తలందరును జీవులపై నిరసన భావముగ ప్రకటింతురు. నిరసించుటకన్న ప్రేమించుట మిన్న. జీవులను ప్రేమించు వారు జీవుల సమస్యలకు పరిష్కారము చూపుదురు. సహకారము నందింతురు. జీవుల పురోగతికి తోడ్పడుదురు. వీరు పరస్పరత్వమును నేర్పుదురు.*

*పరస్పరత్వము పునాదిగ ఏకత్వపు వైభవమును ఆవిష్కరింతురు. ఏకత్వము, పరస్పరత్వము, ఒకరిపై నొకరికి విశ్వాసము కారణముగ సహాయ సహకారముల నందించు కొనుచు మహత్తర కార్యములు చేయుదురు. కేవలము ప్రేమ, పరస్పరత్వము ఆధారముగనే కోతులు సముద్రముపై వంతెనను నిర్మాణము చేసినవి. ప్రగాఢమైన విశ్వాసము, పరస్పర ప్రేమ, సహాయ సహకారములు, రాముని యందు ఏకత్వము వంతెనకు పునాదిరాళ్ళుగ నిలచినవి. దుర్ఘట కార్యములు కూడ పై పునాదుల వలన సాధింపబడినవి.*

*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/