విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 314, 315 / Vishnu Sahasranama Contemplation - 314, 315

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 314/ Vishnu Sahasranama Contemplation - 314 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻314. క్రోధహా, क्रोधहा, Krodhahā🌻

ఓం క్రోధఘ్నే నమః | ॐ क्रोधघ्ने नमः | OM Krodhaghne namaḥ

క్రోధహా, क्रोधहा, Krodhahā

సాధూనాం హంతి యః క్రోధం క్రోధహేతి స ఉచ్యతే సాధుజనుల క్రోధమును నశింపజేయును.

పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::

ఉ.ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగానొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యమునొల్లరు యోగసిద్ధి మఱి యొండు భవంబుల నొందనీని నీసల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్‌. (678)క.ఘనసంసారరహతులగు, జను లాకాంక్షింపఁ గడు నశక్యం బగు శోభనము సమక్షంబున నహి, గనియోం దామసుఁడు రోషకలితుం డయ్యున్‍. (679)

అతిమనోహరములైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు దేవేంద్రపదవిని ఇష్టపడరు. బ్రహ్మపదవి గానీ, చక్రవర్తి పదవిని గానీ కోరరు. వరుణుని పదవినిగానీ, యోగసిద్ధినిగానీ ఇష్టపడరు. అటువంటి నీ పాదరేణువుల స్పర్శ ఏ జన్మలోనూ ఎవరూ పొందలేనిది.

ఎంతో గొప్ప సంసార భారంచేత క్రుంగిపోయిన జనులు కోరడానికి కూడా సాధ్యంకాని పరమశుభం నీ పాదస్పర్శ. అటువంటి భాగ్యాన్ని ఈ కాళీయుడు - క్రోధం నిండినవాడు, రోషం నిండినవాడూ అయిన ఈ సర్పరాజు పొందగలిగాడు. ఇది నీ సాన్నిధ్యంయొక్క మహిమ!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 314🌹

📚. Prasad Bharadwaj

🌻314. Krodhahā🌻

OM Krodhaghne namaḥ

Sādhūnāṃ haṃti yaḥ krodhaṃ krodhaheti sa ucyate / साधूनां हंति यः क्रोधं क्रोधहेति स उच्यते He eradicates anger of the virtuous.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 16

Tadeṣa nāthāpa durāpamanyaistamojaniḥ krodhavaśo’pyahīśaḥ,
Saṃsāracakre bhramataḥ śarīriṇo yadicchataḥ syādvibhavaḥ samakṣaḥ. (38)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे षोडशोऽध्यायः ::

तदेष नाथाप दुरापमन्यैस्तमोजनिः क्रोधवशोऽप्यहीशः ।
संसारचक्रे भ्रमतः शरीरिणो यदिच्छतः स्याद्विभवः समक्षः ॥ ३८ ॥

O Lord! Although (Kāḷīya) the king of the serpents, has taken birth in the mode of ignorance and is controlled by anger, he has achieved that which is difficult for others to achieve. Embodied souls, who are full of desires and are thus wandering in the cycle of birth and death, can have all benedictions manifested before their eyes simply by receiving the dust of Your lotus feet.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 315/ Vishnu Sahasranama Contemplation - 315🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻315. క్రోధకృత్‌కర్తా, क्रोधकृत्‌कर्ता, Krodhakr̥tˈkartā🌻

ఓం క్రోధకృత్‌కర్త్రే నమః | ॐ क्रोधकृत्‌कर्त्रे नमः | OM Krodhakr̥tˈkartre namaḥ

క్రోధకృత్‌: అసాధుషు విషయే క్రోధం కరోతి అసాధుజనుల విషయమున క్రోధమును కలిగించును.

కర్తా: కరోతి ఇతి కర్తాః చేయువాడు కావున కర్తా. దేనిని చేయువాడు అను ప్రశ్న రాగా క్రియతే (సృజ్యతే) ఇతి కర్మ జగత్ చేయబడునదీ, సృజించబడునదీ కావున జగత్తు 'కర్మము' మనబడును. అట్టి కర్మమునూ, జగత్తునూ చేయును. జగత్తు సృజన, పోషణ మరియూ సంహారములు చేయును.

క్రోధకృత్‌కర్తా: క్రోధ కృతాం కర్తా; సాధుషు విషయే క్రోధం కుర్వతః దైత్యాదీన్ కృతంతి ఇతి క్రోధకృత్‌కర్తా సాధుజనుల విషయమున క్రోధ ప్రదర్శన చేయు దైత్యాదులను ఛేదించును. అని ఇట్లు రెండును కలిసి ఒకే నామము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 315🌹

📚. Prasad Bharadwaj

🌻315. Krodhakr̥tˈkartā🌻

OM Krodhakr̥tˈkartre namaḥ

Krodhakr̥t: Asādhuṣu viṣaye krodhaṃ karoti / असाधुषु विषये क्रोधं करोति He who causes anger in the evil persons.

Kartā: Karoti iti kartāḥ / करोति इति कर्ताः What is done or created is action i.e., the world; the creator of the worlds is kartā.

Krodhakr̥tˈkartā: Krodha kr̥tāṃ kartā; sādhuṣu viṣaye krodhaṃ kurvataḥ daityādīn kr̥taṃti iti krodhakr̥tkartā / क्रोध कृतां कर्ता; साधुषु विषये क्रोधं कुर्वतः दैत्यादीन् कृतंति इति क्रोधकृत्कर्ता As one name may be interpreted as the One who is slayer of the the asurās or evil men who torment others.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹

28 Feb 2021

48 Types Of Moon - Taken In 10 Years

48 Types Of Moon - Taken In 10 Years

వివేక చూడామణి - 34 / Viveka Chudamani - 34

🌹. వివేక చూడామణి - 34 / Viveka Chudamani - 34 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు

🍀. ఆత్మ స్వభావము - 2 🍀

127. అది అన్నింటిని దర్శిస్తుంది. అది వివేకాన్ని ప్రభావితము చేస్తుంది. కాని అవేవి దానిని ప్రభావితము చేయలేవు.

128. అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అయితే దానిని వ్యాపింపచేసేది ఏదీ లేదు. అది ప్రకాశిస్తుంది. ఈ విశ్వమంతా దాని వలన ప్రకాశిస్తుంది.

129. దాని ప్రకాశము వలనే ఈ శరీరము దాని భాగములు, మనస్సు, విజ్ఞానము వాని యొక్క భూమండలాలు దానికి సేవకులుగా పనిచేస్తున్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI - 34 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 Nature of Soul - 2 🌻

127. Which Itself sees all, but which no one beholds, which illumines the intellect etc., but which they cannot illumine. –This is That.

128. By which this universe is pervaded, but which nothing pervades, which shining, all this (universe) shines as Its reflection. –This is That.

129. By whose very presence the body, the organs, mind and intellect keep to their respective spheres of action, like servants !

Continues....

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

దేవాపి మహర్షి బోధనలు - 45

🌹. దేవాపి మహర్షి బోధనలు - 45 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 31. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻

ఒక వేసవికాలంలో నేను లక్నో మహా నగరంలో యుండుట జరిగినది. వేసవి తీవ్రముగా నుండుటచే ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. జీవితములోని సమస్యలన్నియు మనోఫలకముపై మెదలి నన్ను తీవ్రముగా ఆందోళన పరచినవి. ఆరోగ్యము అంతంత మాత్రముగ నుండిన దినములవి. భరింపరాని శిరోవేదన యుండెడిది. జీవిత భాగస్వామి కొరకై తీవ్రమైన ఆవేదన యుండెడిది. తలకు మించిన బాధ్యత యుండెడిది.

కలగాపులగముగా యీ సమస్యలన్నియూ ఒక్కుమ్మడిగా దాడి చేసినవి. వీటికి తోడు లక్నో నగరమున రాత్రి సమయమున దోమల దాడి కూడా జరుగుచుండెడిది. నిద్ర శూన్య మగుటచే విశాలమగు వరండాలోనికి వచ్చి అటునిటు తచ్చాడు చుంటిని. అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు మెఱపువలె అవతరించినది. నేనున్న చోటునంతటినీ నింపినది. నా గురుదేవుని వాణి వినిపించినది. రూపము కన్పింపలేదు. నేను శ్రద్ధతో ఆయన వాణి వింటిని. వారిట్లు పలికిరి.

“నీవు అనవసరముగా చింతించుచున్నావు. చింతవలన నీకేమియూ ఉపకారము జరుగదు. నీ మనోభావములను, వాక్కులను, చేతలను నే నెప్పటికప్పుడు పరిశీలించుచునే యున్నాను.

ఈ జీవితమున నీవొనర్చవలసిన దివ్యకార్యము అతి త్వరలో నిన్ను చేరును. నీవా కార్యము నారంభింపగలవు. కాని, ఆరంభింప బడు తీరు మాత్రము నీవు తెలియగ లేవు. నీవు గుర్తించలేని విధముగా అది ప్రారంభమగును.”

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ

🌹. జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ 🌹

🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀

✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

🌻. ఒంటె- సింహం- శిశువు: - 2 🌻

గతం, భవిష్యత్తుల నుంచి ఎవరూ ఏ మాత్రం స్పందించకుండా, అందరూ ఈ అస్తిత్వం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒంటె గతంలో జీవిస్తుంది. సింహం భవిష్యత్తులో జీవిస్తుంది.

శిశువు ‘‘ఇప్పుడు, ఇక్కడ’’ అనే వర్తమానంలో జీవిస్తాడు. ఒంటె, సింహాలది మనసు, ఆత్మల పూర్వస్థితి. శిశువుది మనసు, ఆత్మల తరువాత స్థితి. మనోరహిత స్థితి అంటే అదే. దానినే ‘‘అహంరహిత స్థితి’’ అంటే మనసు, ఆత్మలు లేని స్థితి అంటారు. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి.

మనసు లేని ఆత్మ, ఆత్మ లేని మనసు మీకు ఎప్పుడూ ఉండదు. ‘‘నీవు, నేను’’ అనేవి ఒకే శక్తిలోని భాగాలు. అవి కూడా అంతర్థానమవుతాయి. శిశువు మాటల కందని మార్మికమైన, అనిర్వచనీయమైన అద్భుతం. ఒంటెకు జ్ఞాపకశక్తి, సింహానికి తెలివితేటలు, శిశువుకు జ్ఞానం ఉంటాయి.

ఒంటె ఎప్పుడూ ఆస్తికుడే. కానీ, సింహం ఎప్పుడూ నాస్తికుడే. అయితే శిశువు మాత్రం ఎప్పుడూ ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. వాడు కేవలం ప్రేమ, అమాయకత్వాలతో నిండిన ధార్మికుడు మాత్రమే.

జ్ఞానము సాధించిన మానవుడు సింహంలా మారాడు. అతని తెలివితేటలు అంతరించి పోగానే అంటే తిరిగి వదలగానే శిశువుగా మారిపోతాడు. శిశువుగా మారిపోవడమంటే దైవంగా మారిపోవడమే. దానినే బుద్ధుడు ‘‘నిర్వాణ’’అని అంటాడు. దానినే మీరు ‘‘తావో, దమ్మ, మోక్ష’’అంటూ ఎలాగైనా అనవచ్చు. ఎందుకంటే, మాటలకు అక్కడ పెద్దగా అర్థాలుండవు. అది మాటలు లేని మోనం, ఆలోచన లేని అమాయకత్వం.

🌻. ప్రేమ నుంచి వాత్సల్యానికి: 🌻

ప్రేమకు రెండు విభిన్నమైన పరస్పర వ్యతిరేక అర్థాలున్నాయి. మొదటిది ‘బాంధవ్యం’, రెండవది ‘అస్తిత్వ స్థితి’. బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ బానిసత్వంగా మారుతుంది. ఎందుకంటే, అక్కడ ఆశల కోరికలు, ఆశాభంగాల వేదనలు, పరస్పరం శాసించుకునే ప్రయత్నాలు ఉంటాయి. అందువల్ల అది అధికార పోరాటంగా మారుతుంది. కాబట్టి, బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ సరియైనది కాదు.

రెండవది ‘‘అస్తిత్వస్థితి ప్రేమ’’. అది పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆ స్థితిలోని ప్రేమ ఎవరినుంచి ఏదీ ఆశించకుండా వ్యాపించే సుమ సుగంధంలా ఉంటుంది. కాబట్టి, ఆ స్థితిలో ఉన్న మీరు ఎలాంటి బాంధవ్యాన్ని సృష్టించకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిరంతరం ప్రేమిస్తూ, ఆ ప్రేమను అందరికీ పంచుతూ ఉంటారు. అదే మీకు లభించే బహుమతి.

ప్రేమ సుగంధంలా మారినప్పుడు అది మానవత్వాన్ని మించిన అద్భుత సౌందర్యంతో కూడుకున్న దివ్యత్వ శోభతో వెలిగిపోతూ అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉంటుంది. దానిని మీరు ఆపలేరు. అంతేకాదు, అది ఎవరికి ఎలాంటి బంధనాలను సృష్టించదు, వాటిలో ఎవరినీ చిక్కుకోనివ్వదు.

కానీ, మీరు మీ పసితనం నుంచే బాంధవ్యాలను సృష్టించడానికి అలవాటుపడ్డారు. మీ జీవితమంతా అనేక రకాలైన బాంధవ్యాలతో ముడిపడి ఉంటుంది. అవి వాస్తవమైనవి కావచ్చు లేదా ఊహాత్మకమైనవి కావచ్చు. ఏదేమైనా, ఒక రకంగా ఆ బాంధవ్యాలన్నీ అతి సూక్ష్మమైన మానసిక బానిసత్వానికి సంబంధించినవే. మీరు వాటికి బానిస కావచ్చు లేదా మీకు మీరే బానిస కావచ్చు.

- ఇంకాఉంది.

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 222 / Sri Lalitha Chaitanya Vijnanam - 222

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 222 / Sri Lalitha Chaitanya Vijnanam - 222 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।
మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥

🌻 222. 'మహాబలా'🌻

మహత్తరమగు బలము కలది శ్రీలలిత అని అర్థము.

బలమను పదమునకు చాల అర్థములు కలవు. గంధమందలి సువాసనలను బలమందురు. రసమును బలమందురు. రసమనగా రుచి. ఇంద్రియముల రుచి ఇంద్రియబలము. గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి, బుద్ధిబలము, స్థిరత్వము, మనోబలము, ఆనందము, సంతోషము జీవుని బలము.

ఇట్లు రసము అనేక రుచులద్వారా జీవునికి బలమిచ్చు చుండును. రుచి బలమైనది గనుకనే బలహీనులు వానికి లోబడుదురు. వానిని లోబరచుకొన్న జీవుడు బలవంతుడు. అతడే బలుడు.

బలమనగా రూపమని కూడ అర్థము కలదు. బలమగు రూపములు గలవారిని కూడ బలులందురు. బలరాముడు, భీముడు, ఘోటోత్కచుడు, కుంభకర్ణుడు బలమగు రూపములు కలవారు. రూప బలము కూడ బలమే. రూపమున అందము కూడ బలమే. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి వారిది రూపమున గల సౌందర్య బలము. అట్లే సీతాదేవి, ద్రౌపదీ దేవి కూడ.

బలమనగా జీవ బలమని కూడ అర్థము కలదు. ఎట్టి కష్ట నష్టములనైననూ నోర్చుచూ జీవించు జీవులుందురు. వారిది జీవ బలము. భరింపరాని కష్టనష్టములను కూడ భరించుట బలమే కదా! ధర్మరాజు, నలుడు ఈ కోవకు చెందినవారు. వీరు జీవమునందు బలము కలవారు. మహత్తరమైన సేనలు కలవారు కూడ బలవంతులే.

అట్లే మహత్తరమగు సద్గుణములు కలవారు కూడ బలవంతులే. రాక్షస రాజగు వైరోచనుడు దాన బలము కలిగి చక్రవర్తియై బలిచక్రవర్తిగా పేరు గాంచెను. నిజమునకు అతడు బలి అనియే తెలియబడును. గాని అతని నిజనామము కొందరికే తెలియును. 

దాన గుణమే బలముగ అతడు వ్యాప్తి చెంది భూమికి చక్రవర్తి అయ్యెను. బలి అని పేరు గాంచెను. ఇట్లనే కానేక బలములు ఇన్ని విధములుగ ఇందరి యందు భాసించుటకు మూలకారణము శ్రీమాత బలమే. ఆమె మహాబల గావున బలమెచ్చట నున్ననూ, అది ఆమె అస్థిత్వమే అని తెలియ వలెను.

కాకియందు బలమున్నదని సామాన్యముగ మనము గ్రహించము. కాకులు చండుడను మహర్షి కుమారులు. వారు ఇరువది ఒక్కరు. వారు ప్రతిదినము బ్రాహ్మీకాలమున శ్రీదేవిని చిరకాలము పూజించిరి. ధ్యానించిరి. సమాధి స్థితిని పొందిరి.

అపుడు శ్రీదేవి అనుగ్రహించి వారికి ప్రత్యక్షమైనది. ముక్తి నొసగినది. ఈ విధముగ వాయసములు, వారి సంతతి ముక్తజీవులైనారు. ఈ కారణముగనే ముక్తి నపేక్షించుచూ కాకులకు అన్నము పెట్టుట సంప్రదాయముగ వచ్చినది. ముక్తి నొసగు బలము కాకులయందు నిక్షిప్తము చేయుటలో శ్రీమాత బల మాహాత్మ్యము తెలియనగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 222 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahā-balā महा-बला (222) 🌻

There are several meanings for the word vīrya. Generally it means courage, power, lustre, dignity, energy, etc. She is the reservoir of all these qualities and She provides these qualities to Her devotees depending upon the depth of devotion.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

గీతోపనిషత్తు -160

🌹. గీతోపనిషత్తు -160 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚

శ్లోకము 8

🍀 8 - 2. యోగ కారకములు - 1. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి చెందుట (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ): గురుబోధల ద్వారా బుద్ధిమంతుడగు సాధకుడు గ్రహింప వచ్చును. గ్రహించిన జ్ఞానమును దినచర్య యందు పూర్ణముగ అనుభూతి చెందుట విజ్ఞానము. అది సాధనతో కూడిన పని. తత్త్వజ్ఞానము స్థిరపడుటకు జీవుడు జీవితమున ఒక సోపానక్రమముగ యజ్ఞార్థ కర్మ లాచరించుచు, దైవము తెలిపిన పరహిత యజ్ఞమును నిర్వహించుచు, సన్యసించిన మనసు కలవాడై యుండవలెను. 🍀

జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8

పై తెలిపిన శ్లోకమందు నాలుగు అంశములు గోచరించును. యోగమునకివి ప్రధానమైనవి. అవి ఈ విధముగ నున్నవి.

1. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి చెందుట (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ): జ్ఞానము శాస్త్రముల ద్వారా, ఇతిహాస పురాణముల ద్వారా, భగవద్గీతాది గీతల ద్వారా, వేదాంగముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, మరియు గురుబోధల ద్వారా బుద్ధిమంతుడగు సాధకుడు గ్రహింప వచ్చును. గ్రహించిన జ్ఞానమును దినచర్య యందు పూర్ణముగ అనుభూతి చెందుట విజ్ఞానము. అది సాధనతో కూడిన పని.

పాకశాస్త్రము నేర్చుకొనినంత మాత్రమున వంట వచ్చిన దన లేము కదా! అనుభవముననే జ్ఞానము వచ్చును. అట్లే తత్త్వజ్ఞానము స్థిరపడుటకు జీవుడు జీవితమున ఒక సోపానక్రమముగ యజ్ఞార్థ కర్మ లాచరించుచు, దైవము తెలిపిన పరహిత యజ్ఞమును నిర్వహించుచు, సన్యసించిన మనసు కలవాడై యుండవలెను.

కర్మయందలి స్వరూప స్వభావముల నెరిగి యజ్ఞార్థము కర్మ నిర్వర్తించుట ఎట్లో మూడవ అధ్యాయమున తెలుపబడినది. అట్టి యజ్ఞకర్మను పండ్రెండు విధములుగ జ్ఞాన యోగమున దైవము తెలిపెను. వానిని నిర్వర్తించుట వలన జ్ఞానముతో యోగించుట సంభవించును. అట్టి వానికి కాంక్ష, ద్వేషము లేని స్థితి అన్ని విషయములయందు ఏర్పడుట సన్యాస యోగమున తెలుపబడినది.

అటు పైన ఈ అధ్యాయమున సంకల్ప సన్యాసము కూడ తెలుపబడినది. ఇట్లు క్రమసోపాన మార్గమున రెండవ అధ్యాయమున తెలిపిన సాంఖ్యము 3, 4, 5 అధ్యాయములలో నిర్వర్తించుట వలన క్రమముగ తత్త్వజ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందును. అట్టి వానికి ఒకటవ అధ్యాయమున తెలిపిన విషాద ముండదు. ఈ క్రమమగు సాధన ఓర్పుతో నిర్వర్తింపని సాధకునకు మిడిమిడి జ్ఞానమే మిగులును. జీవితమున తృప్తి యుండదు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

శ్రీ శివ మహా పురాణము - 360

🌹 . శ్రీ శివ మహా పురాణము - 360 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

93. అధ్యాయము - 05

🌻. మేనాదేవి వరములను పొందుట - 3 🌻

బ్రహ్మ ఇట్లు పలికెను -

మేనక చెప్పిన ఆ మాటను విని ప్రసన్నమగు మనస్సు గల ఆ దేవి ఆమె యొక్క మనోరథమును పూర్ణము చేయు చున్నదై, చిరునవ్వుతో నిట్లనెను (37).

దేవి ఇట్లు పలికెను -

నీకు బలశాలురగు వందమంది కుమారులు జన్మించ గలరు. వారిలో అతిశయించిన బలము గలవాడు, ప్రధానుడు అగు పుత్రుడు ఒకడు ముందుగా జన్మించగలడు (38). నీ భక్తికి నేను సంతసించితిని. నేను నీకు కుమార్తెనై జన్మించి, దేవతలందరిచే ఆరాధింపబడు దాననై దేవకార్యమును నిర్వర్తించెదను (39).

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగన్మాతా, శివపత్నియగు ఆ కాలికా పరమేశ్వరి ఇట్లు పలికి మేనక చూచుచుండగనే అచటనే అంతర్థనమాయెను (40).ఓ కుమారా! మేనకయు మహేశ్వరి నుండి అభీష్టమగు వరమును పొంది సాటిలేని ఆనందమును పొందెను. తపస్సు చేసినందు వలన కలిగిన శ్రమ అంతయూ మటుమాయమయ్యెను (41).

ఆమె పరమేశ్వరి అదృశ్యమైన దిక్కునకు నమస్కరించి మిక్కిలి ఆనందించిన మనస్సు గలదై, జయశబ్దము నుచ్చరించుచూ తన గృహమును ప్రవేశించెను (42). అపుడామె తాను పొందిన గొప్ప వరమును గూర్చి భర్తతో చెప్పెను. ఆమె ముఖ లక్షణములను బట్టియే భర్తకు సంగతి తెలియుచుండెను. అయిననూ ఆమె ఆ వృత్తాంతమును భర్తకు పదే పదే చెప్పెను (43).

శైలరాజగు హిమవంతుడా మేనా దేవి యొక్క ఆ వచనమును విని మిక్కిలి సంతసించి, ఉమాదేవి యందు స్థిరమగు భక్తిగల ఆ ప్రియురాలిని ప్రీతితో ప్రశంసించెను (44). ఓ మహర్షీ! వారిద్దరు కలిసి కాపురము చేయుచుండగా కొంత కాలమునకు మేన గర్భవతి ఆయెను. ఆమె గర్భము దినదిన ప్రవర్థమానమాయెను (45). భవిష్యత్తులో సముద్రునితో గాఢమగు మైత్రిని నెరపి, నాగకన్యలతో భోగింపబోవు, మైనాకుడనే పేరుగల అద్భుతమగు పుత్రరత్నమును ఆమె కనెను (46). పర్వతములకు రెక్కెలుండుటచే ప్రాణినాశము జరిగెడిది. దానిపై కోపించిన ఇంద్రుడు వజ్రముతో పర్వతముల రెక్కలను దనుమాడెను. ఓ దేవర్షీ! కాని ఈ మైనాకుని రెక్కలను మాత్రము ద్రుంచలేదు. మైనాకుడు శ్రేష్ఠమగు అంగములతో విరాజిల్లెను (47).

హిమవంతుని వందమంది పుత్రులలో మైనాకుడు శ్రేష్ఠుడు, గొప్ప బల పరాక్రమములు గలవాడు, హిమవంతుని కుమారులగు పర్వతములన్నింటిలో ఇతనికి మాత్రమే పర్వతరాజు అను స్థానము తగియున్నది (48). ఆ హిమవంతుని రాజధానిలో అద్భుతమగు మహోత్సవము ప్రవర్తిల్లెను. ఆ దంపతులిద్దరికీ కష్టములు తొలగి అతిశయించిన ఆనందము కలిగెను (49). వారు బ్రాహ్మణులకు దానమునిచ్చిరి. ఇతరులకు కూడా ధనమును పంచియిచ్చిరి. వారిద్దరికీ ఉమా పరమేశ్వరుల పాదపద్మముల యందు అధికమగు ప్రీతి కలిగెను (50).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో మేనక వరములను పొందుట అనే అయిదవ అధ్యాయము ముగిసినది (5).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242 🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 6 🌻

40. జ్ఞాని ముక్తుడైన తర్వాత అతడికి చ్యుతి లేదు. అందుకనే వారికి పరీక్షలు పెడితే – అప్సరసలు, ఇంద్రాదులు వాళ్ళను పరీక్షచేయబోయి వాళ్ళే భంగపడ్డారు. జ్ఞానులను ఏదీ భ్రమపెట్టలేదు.

41. బ్రహ్మవస్తువు దర్శనమైన తరువాత ఈ సృష్టిలో అతడిని భ్రమపెట్టగలిగినది ఇంకొకటి లేనేలేదు. సృష్టిలో ఎవరినైనా బాధించేది బాహ్యదృష్టి, రక్షించేది అంతర్దృష్టి. బాహ్య దృష్టి బాధిస్తుంది, బంధిస్తుంది. బాహ్యదృష్టే సహజమైతే, వాడు బద్ధుడు. ముక్తుడు కాడు.

42. బాహ్యదృష్టి కలిగి అది సహజంగా ఉండి, సహజదృష్టి వేరే ఉంటే, అతడిని బాహ్యదృష్టి బాధించదు. సహజంగా బాహ్యదృష్టి కలిగిన బద్ధుణ్ణి అంతర్దృష్టి రక్షిస్తుంది. ఈ అంతర్దృష్టిని అలవాటుచేసుకునే కాలంలో బాహ్యదృష్టిని ఉపసంహారంచేసే ప్రయత్నం పేరే సాధన.

43. అంతర్దృష్టిసాధన అంటే బాహ్యదృష్టి వైముఖ్యము. దీనినే సాధన అంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం, కామక్రోధాదులను జయించే ప్రయత్నం – ఇట్లాంటి ప్రయత్నమే సాధన అనబడుతుంది.

44. కానీ ఆత్మదర్శన సాధన చేస్తున్నానని చెప్పకూడదు. ఆత్మసర్శనం అసలు ఉండదక్కడ. బాహ్యదృష్టి నిర్మూలనమవుతుందంతే. ఇది సర్వులకూ సాధ్యమే! సంసారం అంత భయంకరమయినది, అంత బలమయినదీ అనుకోకూడదు. అది కేవలం బలహీనుడి విషయంలో మాత్రమే చాలా బలమైనది.

45. ఆసురీ సంపత్తి దైవీ సంపత్తి ఉన్నవారినే వచ్చి బాధిస్తుంది కాని, అది దానికి అహారం దొరకక్ కాదు. దానికి కావలసిన ఆహారం చాలాచోట్ల ఉంది కాని, ఈ జ్ఞానులను తింటే వచ్చే రుచి ఇంకెక్కడా ఉండదు! అది దాని తత్త్వం. దనిని చూచి కూడా ఉపేక్షించాలి. ఎందుచేతనంటే, ఆసురీసంపత్తికి దైవిసంపత్తిమీద స్వేషం ఉంటుందికాని, దైవీసంపత్తికి దానిపై ద్వేషం ఉంటుందా! ఉండదు. ఇది దాన్ని ఉపేక్షిస్తుంది.

46. ఆశ్రమంలో దుష్టుడు క్షేమంగా ఉంటాడు. బయట ఉండలేడు. అందుకే దానిని ఆశ్రయిస్తాడు. ప్రపంచంలో ఇదంతా సహజంగానే జరుగుతూ ఉంటుంది. భగవంతుడు హీనుడైన పూజారి దృష్టిలో అక్కడ లేడు. లేనేలేడాతడికి. ఉన్నాడనుకున్నవాడికి ఉన్నాడంతే.

47. ఎందుకంటే, శిథిలాలలో ఉండే గబ్బిలం శిథిలాలలోనే క్షేమంగా ఉంటుంది. బాగా పెద్ద లైటు వెలిగిచేటటువంటి దివ్యభవనాలలోకి వెళితే చంపేస్తారు దానిని. ఒక్కొక్కదానికి సృష్టిలో ఒక్కొక్క స్థానం కల్పించబడి ఉంది. అది అక్కడ క్షేమంగా ఉంటుంది, ఆ స్థానం కోల్పోతే స్థానబలిమి పోతుంది.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 182

🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 182 🌹

✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 4 🌻

ఒకేఒక అవతారము :-

688. భగవంతుడెల్లప్పుడును శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడుగా ఒకడే అయియుండుట వలన అవతార పురుషుడుకూడా ఒకడే అయియున్నాడు.

అతడు మానవ రూపములో అవతారంగా, బుద్ధినిగా, సర్వోన్నతుడై పురాణం పురుషునిగా తనకు తానై (స్వయంభువు) అభివ్యక్తుడగుచున్నాడు.

శాశ్వతుడైన ఈ ఏకైక అవతారమే, వేర్వేరు యుగములలో, వేర్వేరు నామములతో, వేర్వేరు మానవరూపములలో, వేర్వేరు ప్రదేశములలో వేర్వేరు భాషా స్వరూపములలో సత్యమును బహిర్గత పరచుటకును, అఙ్ఞానాగార్తమునందున్న మానవజాతిని సముద్ధరించుటకును, భ్రాంతిమయ బంధములనుండి విముక్తిగావించుటకును కాలాంతరములందు పునరాభివ్యక్తడగుచున్నాడు.

689. రక్షకుడు = పూర్ణ మానవుడు = మానవ పరిపూర్ణుడు = అవతార్ = = అనంత అస్థిత్వము + అనంతజ్ఞానము + అనంతానందము + చైతన్యము

= అనంతమందు , సాంతమందు ఏకకాలమందే ఎఱుకతో నుండుట

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

శ్రీ లలితా సహస్ర నామములు - 37 / Sri Lalita Sahasranamavali - Meaning - 37

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37 / Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹

🌻. మంత్రము - అర్ధం 🌻

📚. ప్రసాద్ భరద్వాజ

🍀 37. కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।
అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥🍀

🍀 92. కులాంగనా -
కుల సంబంధమైన స్త్రీ.

🍀 93. కులాంతఃస్థా - 
కులము యొక్క మద్యములో ఉంది.

🍀 94. కౌలినీ -
కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.

🍀 95. కులయోగినీ -
కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.

🍀 96. అకులా -
అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.

🍀 97. సమయాంతఃస్థా -
సమయాచార అంతర్వర్తిని.

🍀 98. సమయాచార తత్పరా -
సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹

📚. Prasad Bharadwaj

🌻 37. kulāṅganā kulāntasthā kaulinī kulayoginī |
akulā samayāntasthā samayācāra-tatparā || 37 || 🌻

🌻 92 ) Kulangana -
She who is a lady belonging to cultured family or She who is like Srividya known only to one whom it belongs

🌻 93 ) Kulanthastha -
She who is fit to be worshipped any where

🌻 94 ) Kaulini -
She who is the unification of the principles of Shiva and Shakthi

🌻 95 ) Kula yogini -
She who is related to the family or She who is related to the ultimate knowledge

🌻 96 ) Akula -
She who is beyond kula or She who is beyond any knowledge

🌻 97 ) Samayanthastha -
She who is within the mental worship of Shiva and Shakthi

🌻 98 ) Samayachara that para -
She who likes Samayachara i.e. worship stepwise from mooladhara Chakra.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

28 Feb 2021

28-FEB-2021 EVENING

10) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 160🌹  
11) 🌹. శివ మహా పురాణము - 358🌹 
12) 🌹 Light On The Path - 110🌹
13) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242🌹 
14) 🌹 Seeds Of Consciousness - 307🌹   
15) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 182🌹
16) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 009🌹*
AUDIO - VIDEO
17) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37 / Lalitha Sahasra Namavali - 37🌹 
18) 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 37 / Sri Vishnu Sahasranama - 37🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -160 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము 📚*
శ్లోకము 8

*🍀 8 - 2. యోగ కారకములు - 1. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి చెందుట (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ): గురుబోధల ద్వారా బుద్ధిమంతుడగు సాధకుడు గ్రహింప వచ్చును. గ్రహించిన జ్ఞానమును దినచర్య యందు పూర్ణముగ అనుభూతి చెందుట విజ్ఞానము. అది సాధనతో కూడిన పని. తత్త్వజ్ఞానము స్థిరపడుటకు జీవుడు జీవితమున ఒక సోపానక్రమముగ యజ్ఞార్థ కర్మ లాచరించుచు, దైవము తెలిపిన పరహిత యజ్ఞమును నిర్వహించుచు, సన్యసించిన మనసు కలవాడై యుండవలెను. 🍀*

జ్ఞానవిజ్ఞాన తృప్తాత్మా కూటస్థా విజితేంద్రియః |
యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాశ్మ కాంచనః || 8

పై తెలిపిన శ్లోకమందు నాలుగు అంశములు గోచరించును. యోగమునకివి ప్రధానమైనవి. అవి ఈ విధముగ నున్నవి.

1. జ్ఞాన విజ్ఞానములచే తృప్తి చెందుట (జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ): జ్ఞానము శాస్త్రముల ద్వారా, ఇతిహాస పురాణముల ద్వారా, భగవద్గీతాది గీతల ద్వారా, వేదాంగముల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, మరియు గురుబోధల ద్వారా బుద్ధిమంతుడగు సాధకుడు గ్రహింప వచ్చును. గ్రహించిన జ్ఞానమును దినచర్య యందు పూర్ణముగ అనుభూతి చెందుట విజ్ఞానము. అది సాధనతో కూడిన పని. 

పాకశాస్త్రము నేర్చుకొనినంత మాత్రమున వంట వచ్చిన దన లేము కదా! అనుభవముననే జ్ఞానము వచ్చును. అట్లే తత్త్వజ్ఞానము స్థిరపడుటకు జీవుడు జీవితమున ఒక సోపానక్రమముగ యజ్ఞార్థ కర్మ లాచరించుచు, దైవము తెలిపిన పరహిత యజ్ఞమును నిర్వహించుచు, సన్యసించిన మనసు కలవాడై యుండవలెను. 

కర్మయందలి స్వరూప స్వభావముల నెరిగి యజ్ఞార్థము కర్మ నిర్వర్తించుట ఎట్లో మూడవ అధ్యాయమున తెలుపబడినది. అట్టి యజ్ఞకర్మను పండ్రెండు విధములుగ జ్ఞాన యోగమున దైవము తెలిపెను. వానిని నిర్వర్తించుట వలన జ్ఞానముతో యోగించుట సంభవించును. అట్టి వానికి కాంక్ష, ద్వేషము లేని స్థితి అన్ని విషయములయందు ఏర్పడుట సన్యాస యోగమున తెలుపబడినది. 

అటు పైన ఈ అధ్యాయమున సంకల్ప సన్యాసము కూడ తెలుపబడినది. ఇట్లు క్రమసోపాన మార్గమున రెండవ అధ్యాయమున తెలిపిన సాంఖ్యము 3, 4, 5 అధ్యాయములలో నిర్వర్తించుట వలన క్రమముగ తత్త్వజ్ఞానము విజ్ఞానముగ పరిణతి చెందును. అట్టి వానికి ఒకటవ అధ్యాయమున తెలిపిన విషాద ముండదు. ఈ క్రమమగు సాధన ఓర్పుతో నిర్వర్తింపని సాధకునకు మిడిమిడి జ్ఞానమే మిగులును. జీవితమున తృప్తి యుండదు. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 360 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
93. అధ్యాయము - 05

*🌻. మేనాదేవి వరములను పొందుట - 3 🌻*

బ్రహ్మ ఇట్లు పలికెను -

మేనక చెప్పిన ఆ మాటను విని ప్రసన్నమగు మనస్సు గల ఆ దేవి ఆమె యొక్క మనోరథమును పూర్ణము చేయు చున్నదై, చిరునవ్వుతో నిట్లనెను (37).

దేవి ఇట్లు పలికెను -

నీకు బలశాలురగు వందమంది కుమారులు జన్మించ గలరు. వారిలో అతిశయించిన బలము గలవాడు, ప్రధానుడు అగు పుత్రుడు ఒకడు ముందుగా జన్మించగలడు (38). నీ భక్తికి నేను సంతసించితిని. నేను నీకు కుమార్తెనై జన్మించి, దేవతలందరిచే ఆరాధింపబడు దాననై దేవకార్యమును నిర్వర్తించెదను (39).

బ్రహ్మ ఇట్లు పలికెను -

జగన్మాతా, శివపత్నియగు ఆ కాలికా పరమేశ్వరి ఇట్లు పలికి మేనక చూచుచుండగనే అచటనే అంతర్థనమాయెను (40).ఓ కుమారా! మేనకయు మహేశ్వరి నుండి అభీష్టమగు వరమును పొంది సాటిలేని ఆనందమును పొందెను. తపస్సు చేసినందు వలన కలిగిన శ్రమ అంతయూ మటుమాయమయ్యెను (41). 

ఆమె పరమేశ్వరి అదృశ్యమైన దిక్కునకు నమస్కరించి మిక్కిలి ఆనందించిన మనస్సు గలదై, జయశబ్దము నుచ్చరించుచూ తన గృహమును ప్రవేశించెను (42). అపుడామె తాను పొందిన గొప్ప వరమును గూర్చి భర్తతో చెప్పెను. ఆమె ముఖ లక్షణములను బట్టియే భర్తకు సంగతి తెలియుచుండెను. అయిననూ ఆమె ఆ వృత్తాంతమును భర్తకు పదే పదే చెప్పెను (43).

శైలరాజగు హిమవంతుడా మేనా దేవి యొక్క ఆ వచనమును విని మిక్కిలి సంతసించి, ఉమాదేవి యందు స్థిరమగు భక్తిగల ఆ ప్రియురాలిని ప్రీతితో ప్రశంసించెను (44). ఓ మహర్షీ! వారిద్దరు కలిసి కాపురము చేయుచుండగా కొంత కాలమునకు మేన గర్భవతి ఆయెను. ఆమె గర్భము దినదిన ప్రవర్థమానమాయెను (45). భవిష్యత్తులో సముద్రునితో గాఢమగు మైత్రిని నెరపి, నాగకన్యలతో భోగింపబోవు, మైనాకుడనే పేరుగల అద్భుతమగు పుత్రరత్నమును ఆమె కనెను (46). పర్వతములకు రెక్కెలుండుటచే ప్రాణినాశము జరిగెడిది. దానిపై కోపించిన ఇంద్రుడు వజ్రముతో పర్వతముల రెక్కలను దనుమాడెను. ఓ దేవర్షీ! కాని ఈ మైనాకుని రెక్కలను మాత్రము ద్రుంచలేదు. మైనాకుడు శ్రేష్ఠమగు అంగములతో విరాజిల్లెను (47).

  హిమవంతుని వందమంది పుత్రులలో మైనాకుడు శ్రేష్ఠుడు, గొప్ప బల పరాక్రమములు గలవాడు, హిమవంతుని కుమారులగు పర్వతములన్నింటిలో ఇతనికి మాత్రమే పర్వతరాజు అను స్థానము తగియున్నది (48). ఆ హిమవంతుని రాజధానిలో అద్భుతమగు మహోత్సవము ప్రవర్తిల్లెను. ఆ దంపతులిద్దరికీ కష్టములు తొలగి అతిశయించిన ఆనందము కలిగెను (49). వారు బ్రాహ్మణులకు దానమునిచ్చిరి. ఇతరులకు కూడా ధనమును పంచియిచ్చిరి. వారిద్దరికీ ఉమా పరమేశ్వరుల పాదపద్మముల యందు అధికమగు ప్రీతి కలిగెను (50).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత యందలి పార్వతీ ఖండములో మేనక వరములను పొందుట అనే అయిదవ అధ్యాయము ముగిసినది (5). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 LIGHT ON THE PATH - 110 🌹*
*🍀 For those WHO DESIRE TO ENTER WITHIN - For DISCIPLES 🍀*
✍️. ANNIE BESANT and LEADBEATER
📚. Prasad Bharadwaj

CHAPTER 8 - THE 20th RULE
*🌻 20. Seek it not by any one road. - 3 🌻*

419. People have sometimes been disposed to think that the Masters ought to be doing this lower work, that They should, for example, be working with individuals down here. 

I have explained before that They do not do that, except in the comparatively rare cases of those who They see will very shortly repay Them for their effort. It is so entirely a case of what is best for the work that no sentiment of any sort enters into the matter at all. 

They will work with a pupil if he can do good work in return, and if the amount of energy spent in teaching and guiding him will produce more result in that way in a given time than would be produced by the same amount of energy expended along higher and wider lines; that is, only if the man is apt to learn, and prepared to do a great deal himself whenever opportunity offers. Up to that point Their interest in him would be what one might call a general concern.

420. There is much work to be done at these lower levels, and it is a fact that a great amount and variety of it has not been done previously. New ways of service are constantly being opened up as mankind advances in brotherhood. 

Our Masters had many pupils before the Theosophical Society came into existence, but most of them were Orientals, chiefly Hindus and Buddhists, Sufis and Zoroastrians. The trend of the Oriental mind is not quite the same as ours. 

I think without offence we may say it is less practical in some directions than ours, and the majority of Indian pupils have occupied themselves chiefly with their own studies, of which they had an immense amount to do, and only when they had advanced a considerable way on that line did they then turn aside to help others. They had not the incentive that we have for the work of the invisible helpers. 

Nobody in India – not even a coolie – is quite as ignorant as the average Christian about after-death states, so there is not the same need for rescuing them from the delusions created by the idea of eternal hell. 

As soon as our students began to see what astral work involved they realized that there was a crying need for help. Here were people by the thousand suffering intensely from a nightmare, a sort of bogey, which they had made for themselves simply on account of foolish teaching. 

A sight of that kind urges one at once to make some effort to relieve all that distress, consequently the work of the invisible helpers began, and increased like a rolling snowball. Every one who is helped sets to work to help others, so it has happened that in about thirty-five years, since the work was regularly taken in hand, the effect produced has been very great indeed.

421. A man may reach great heights by attending only to his own development, but along that line he will not reach Adeptship. The man who waits to attain Adeptship before he serves the world will never be an Adept. 

He may escape into nirvana, or obtain liberation, but because he has not realized what the Logos wants of him, he will presently be overtaken by numbers of less advanced and less talented people who have realized that one important thing. 

Then he will have to give up his life on higher planes and come back to learn what he has not learnt before – that humanity is one, and that a man who does not realize that fact cannot scale the loftiest heights of progress.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #LightonPath #Theosophy
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 242 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. యాజ్ఞవల్క్యమహర్షి - 6 🌻*

40. జ్ఞాని ముక్తుడైన తర్వాత అతడికి చ్యుతి లేదు. అందుకనే వారికి పరీక్షలు పెడితే – అప్సరసలు, ఇంద్రాదులు వాళ్ళను పరీక్షచేయబోయి వాళ్ళే భంగపడ్డారు. జ్ఞానులను ఏదీ భ్రమపెట్టలేదు. 

41. బ్రహ్మవస్తువు దర్శనమైన తరువాత ఈ సృష్టిలో అతడిని భ్రమపెట్టగలిగినది ఇంకొకటి లేనేలేదు. సృష్టిలో ఎవరినైనా బాధించేది బాహ్యదృష్టి, రక్షించేది అంతర్దృష్టి. బాహ్య దృష్టి బాధిస్తుంది, బంధిస్తుంది. బాహ్యదృష్టే సహజమైతే, వాడు బద్ధుడు. ముక్తుడు కాడు. 

42. బాహ్యదృష్టి కలిగి అది సహజంగా ఉండి, సహజదృష్టి వేరే ఉంటే, అతడిని బాహ్యదృష్టి బాధించదు. సహజంగా బాహ్యదృష్టి కలిగిన బద్ధుణ్ణి అంతర్దృష్టి రక్షిస్తుంది. ఈ అంతర్దృష్టిని అలవాటుచేసుకునే కాలంలో బాహ్యదృష్టిని ఉపసంహారంచేసే ప్రయత్నం పేరే సాధన. 

43. అంతర్దృష్టిసాధన అంటే బాహ్యదృష్టి వైముఖ్యము. దీనినే సాధన అంటారు. ఇంద్రియాలను నిగ్రహించుకునే ప్రయత్నం, కామక్రోధాదులను జయించే ప్రయత్నం – ఇట్లాంటి ప్రయత్నమే సాధన అనబడుతుంది. 

44. కానీ ఆత్మదర్శన సాధన చేస్తున్నానని చెప్పకూడదు. ఆత్మసర్శనం అసలు ఉండదక్కడ. బాహ్యదృష్టి నిర్మూలనమవుతుందంతే. ఇది సర్వులకూ సాధ్యమే! సంసారం అంత భయంకరమయినది, అంత బలమయినదీ అనుకోకూడదు. అది కేవలం బలహీనుడి విషయంలో మాత్రమే చాలా బలమైనది.

45. ఆసురీ సంపత్తి దైవీ సంపత్తి ఉన్నవారినే వచ్చి బాధిస్తుంది కాని, అది దానికి అహారం దొరకక్ కాదు. దానికి కావలసిన ఆహారం చాలాచోట్ల ఉంది కాని, ఈ జ్ఞానులను తింటే వచ్చే రుచి ఇంకెక్కడా ఉండదు! అది దాని తత్త్వం. దనిని చూచి కూడా ఉపేక్షించాలి. ఎందుచేతనంటే, ఆసురీసంపత్తికి దైవిసంపత్తిమీద స్వేషం ఉంటుందికాని, దైవీసంపత్తికి దానిపై ద్వేషం ఉంటుందా! ఉండదు. ఇది దాన్ని ఉపేక్షిస్తుంది. 

46. ఆశ్రమంలో దుష్టుడు క్షేమంగా ఉంటాడు. బయట ఉండలేడు. అందుకే దానిని ఆశ్రయిస్తాడు. ప్రపంచంలో ఇదంతా సహజంగానే జరుగుతూ ఉంటుంది. భగవంతుడు హీనుడైన పూజారి దృష్టిలో అక్కడ లేడు. లేనేలేడాతడికి. ఉన్నాడనుకున్నవాడికి ఉన్నాడంతే. 

47. ఎందుకంటే, శిథిలాలలో ఉండే గబ్బిలం శిథిలాలలోనే క్షేమంగా ఉంటుంది. బాగా పెద్ద లైటు వెలిగిచేటటువంటి దివ్యభవనాలలోకి వెళితే చంపేస్తారు దానిని. ఒక్కొక్కదానికి సృష్టిలో ఒక్కొక్క స్థానం కల్పించబడి ఉంది. అది అక్కడ క్షేమంగా ఉంటుంది, ఆ స్థానం కోల్పోతే స్థానబలిమి పోతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 307 🌹*
✍️ Nisargadatta Maharaj 
 Nisargadatta Gita 
📚. Prasad Bharadwaj

*🌻 156. The knowledge that is prior to thought - 'I am' - is covered by a human body which is a food-body with the vital breath and knowledge of the Self (Prana and Jnana). 🌻*

The very earliest 'I am' was devoid of name and form, free from words, non-verbal. Gradually, as the processes of conditioning begin, the non-verbal 'I am' becomes the verbal 'I am'. 

You learn words and language which accumulate on the pure non-verbal 'I am'. Through your senses you perceive the body which requires food and vital breath for sustenance. The 'I am' identifies with the body and you say 'I am so-and-so'. 

Despite all these coverings, the indwelling knowledge of the Self or the pure 'I am' is always there. It is only a question of putting aside everything, uncovering it and getting stabilized in it - which is the 'Sadhana' (practice) that is being prescribed.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #SeedsofConsciousness #Nisargadatta
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 182 🌹*
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - నాల్గవ దివ్య యానము - అవతార పురుషుడు - 4 🌻*

ఒకేఒక అవతారము :-
688. భగవంతుడెల్లప్పుడును శాశ్వతుడు, అవిభాజ్యుడు, అనంతుడుగా ఒకడే అయియుండుట వలన అవతార పురుషుడుకూడా ఒకడే అయియున్నాడు.
అతడు మానవ రూపములో అవతారంగా, బుద్ధినిగా, సర్వోన్నతుడై పురాణం పురుషునిగా తనకు తానై (స్వయంభువు) అభివ్యక్తుడగుచున్నాడు. 

శాశ్వతుడైన ఈ ఏకైక అవతారమే, వేర్వేరు యుగములలో, వేర్వేరు నామములతో, వేర్వేరు మానవరూపములలో, వేర్వేరు ప్రదేశములలో వేర్వేరు భాషా స్వరూపములలో సత్యమును బహిర్గత పరచుటకును, అఙ్ఞానాగార్తమునందున్న మానవజాతిని సముద్ధరించుటకును, భ్రాంతిమయ బంధములనుండి విముక్తిగావించుటకును కాలాంతరములందు పునరాభివ్యక్తడగుచున్నాడు. 

689. రక్షకుడు = పూర్ణ మానవుడు = మానవ పరిపూర్ణుడు = అవతార్ = = అనంత అస్థిత్వము + అనంతజ్ఞానము + అనంతానందము + చైతన్యము
= అనంతమందు , సాంతమందు ఏకకాలమందే ఎఱుకతో నుండుట 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భగవద్గీత యథాతథం - 1 - 009 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. విషాదయోగం - అధ్యాయము 1 - శ్లోకము 9 🌻*

09
అన్యే చ బహవ: శూరా:
మదర్థే త్యక్తజీవితా: |
నానాశస్త్ర ప్రహరణా:
సర్వే యుద్ధవిశారదా: ||

తాత్పర్యము : 
నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరును పలు విధములైన ఆయుధములను దాల్చినవారును మరియు యుద్ధ నిపుణతను కలిగినవారును అయియున్నారు.

భాష్యము : 
ఇక మిగిలిన వారి గురించి చెప్పవలెనంటే జయధ్రథుడు, కృతవర్మ మరియు శల్యుడు, దుర్యోధనుడి కోసము ప్రాణాలనర్పించుటకు సైతమూ సిద్ధపడి ఉన్నారు. మరో రకముగా చెప్పవలెనన్న పాపాత్ముడైన దుర్యోధనుని పక్షాన చేరినందుకు వారందరూ కురుక్షేత్ర యుద్ధము నందు సంహరించబడుదురని నిర్థారింపబడినది. అయితే దుర్యోధనుడు తన స్నేహితుల బలమును లెక్కించుకుని గెలుపు తనదేనని ధీమాతో ఉండెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 37 / Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 37. కుళాంగనా, కుళాంతఃస్థా, కౌళినీ, కుళయోగినీ ।*
*అకుళా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా ॥ 37 ॥🍀*

🍀 92. కులాంగనా - 
కుల సంబంధమైన స్త్రీ.

🍀 93. కులాంతఃస్థా - కులము యొక్క మద్యములో ఉంది.

🍀 94. కౌలినీ - 
కులదేవతల రూపంలో ఆరాధింపబడునది.

🍀 95. కులయోగినీ - 
కుండలినీ యోగ దేవతా స్వరూపిణి.

🍀 96. అకులా - 
అకులా స్వరూపురాలు లేదా కులము లేనిది.

🍀 97. సమయాంతఃస్థా - 
సమయాచార అంతర్వర్తిని.

🍀 98. సమయాచార తత్పరా -
సమయ అనే ఆచారములో ఆసక్తి కలది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 37 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 37. kulāṅganā kulāntasthā kaulinī kulayoginī |*
*akulā samayāntasthā samayācāra-tatparā || 37 || 🌻*

🌻 92 ) Kulangana -   
She who is a lady belonging to cultured family or She who is like Srividya known only to one whom it belongs

🌻 93 ) Kulanthastha -   
She who is fit to be worshipped any where

🌻 94 ) Kaulini -   
She who is the unification of the principles of Shiva and Shakthi

🌻 95 ) Kula yogini -  
 She who is related to the family or She who is related to the ultimate knowledge

🌻 96 ) Akula -   
She who is beyond kula or She who is beyond any knowledge

🌻 97 ) Samayanthastha -   
She who is within the mental worship of Shiva and Shakthi

🌻 98 ) Samayachara that para -   
She who likes Samayachara i.e. worship stepwise from mooladhara Chakra.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు -37 / Sri Vishnu Sahasra Namavali - 37 🌹*
*నామము - భావము*
📚. ప్రసాద్ భరద్వాజ 

*🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻*

*సింహ రాశి- మఖ నక్షత్ర 1వ పాద శ్లోకం*

*🍀 37. అశోక స్తారణ స్తారః శూరశ్శౌరి ర్జనేశ్వరః।*
*అనుకూల శ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః॥ 🍀*

🍀 336) అశోక: - 
శోకము లేనివాడు.

🍀 337) తారణ: - 
సంసార సాగరమును దాటించువాడు.

🍀 338) తార: - 
గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.

🍀 339) శూర: - 
పరాక్రమము గలవాడు.

🍀 340) శౌరి: - 
బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.

🍀 341) జనేశ్వర: - 
జనులకు ప్రభువు.

🍀 342) అనుకూల: - 
సర్వులకు అనుకూలుడైనవాడు.

🍀 343) శతావర్త: - 
ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.

🍀 344) పద్మీ - 
పద్మమును చేతియందు ధరించినవాడు.

🍀 345) పద్మనిభేక్షణ: - 
పద్మమువంటి నేత్రములు కలవాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Vishnu Sahasra Namavali - 37 🌹*
*Name - Meaning*
📚 Prasad Bharadwaj

*🌻 OM NARAYANAYA VIDMAHE VASUDEVAYA DHIMAHI । TANNO VISHNU PRACHODAYAT ॥ 🌻*

*Sloka for Simha Rasi, Makha 1st Padam*

*🌻 37. aśōkastāraṇastāraḥ śūraḥ śaurirjaneśvaraḥ |*
*anukūlaḥ śatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ || 37 || 🌻*

🌻 336. Aśokaḥ: 
One without the six defects - sorrow, infatuation, hunger, thirst, birth and death.

🌻 337. Tāraṇaḥ: 
One who uplifts beings from the ocean of samsara.

🌻 338. Tāraḥ: 
One who liberates beings from the fear of residence in the womb, birth, old age, death etc.

🌻 339. Śūraḥ: 
One of great prowess, that is, who fulfils the four supreme satisfactions of life – Dharma, Artha, Kama and Moksha.

🌻 340. Śauriḥ: 
One who as Krishna as the son of Sura, that is Vasudeva.

🌻 341. Janeśvaraḥ: 
The Lord of all beings.

342. Anukūlaḥ: 
One who, being the Atman of all beings, is favorable to all, for no one will act against oneself.

🌻 343. Śatāvartaḥ: 
One who has had several Avataras or incarnations.

🌻 344. Padmī: 
One having Padma or lotus in his hands.

🌻 345. Padma-nibhekṣaṇaḥ: 
One with eyes resembling lotus.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

28-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 652 / Bhagavad-Gita - 652🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 314, 315 / Vishnu Sahasranama Contemplation - 314, 315🌹
3) 🌹 Daily Wisdom - 71🌹
4) 🌹. వివేక చూడామణి - 34🌹
5) 🌹Viveka Chudamani - 34 🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 45🌹
7)  🌹.జ్ఞానాన్వేషణతో సత్యాన్వేషణ..  🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 222 / Sri Lalita Chaitanya Vijnanam - 222🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 563 / Bhagavad-Gita - 563 🌹 
 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 652 / Bhagavad-Gita - 652 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 69 🌴*

69. న చ తస్మాన్మసుష్యేషు 
కశ్చిన్మే ప్రియకృత్తమ: |
భవితా న చమే తస్మాదన్య: 
ప్రియతరో భువి ||

🌷. తాత్పర్యం : 
నాకు అతని కన్నను ప్రియుడైన సేవకుడు మరొక్కడు ఈ ప్రపంచమున లేడు. అతనికి మించిన ప్రియుడైనవాడు వేరొక్కడు ఉండబోడు.

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 652 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 69 🌴*

69. na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ
bhavitā na ca me tasmād anyaḥ priya-taro bhuvi

🌷 Translation : 
There is no servant in this world more dear to Me than he, nor will there ever be one more dear.

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 314, 315 / Vishnu Sahasranama Contemplation - 314, 315 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻314. క్రోధహా, क्रोधहा, Krodhahā🌻*

*ఓం క్రోధఘ్నే నమః | ॐ क्रोधघ्ने नमः | OM Krodhaghne namaḥ*

క్రోధహా, क्रोधहा, Krodhahā

సాధూనాం హంతి యః క్రోధం క్రోధహేతి స ఉచ్యతే సాధుజనుల క్రోధమును నశింపజేయును.

పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
ఉ.ఒల్లరు నిర్జరేంద్రపద మొల్లరు బ్రహ్మపదంబు నొందఁగానొల్లరు చక్రవర్తిపద మొల్లరు సర్వరసాధిపత్యమునొల్లరు యోగసిద్ధి మఱి యొండు భవంబుల నొందనీని నీసల్లలితాంఘ్రి రేణువుల సంగతి నొందిన ధన్యు లెప్పుడున్‌. (678)క.ఘనసంసారరహతులగు, జను లాకాంక్షింపఁ గడు నశక్యం బగు శోభనము సమక్షంబున నహి, గనియోం దామసుఁడు రోషకలితుం డయ్యున్‍. (679)

అతిమనోహరములైన నీ పాదరేణువుల స్పర్శ పొందిన ధన్యులు దేవేంద్రపదవిని ఇష్టపడరు. బ్రహ్మపదవి గానీ, చక్రవర్తి పదవిని గానీ కోరరు. వరుణుని పదవినిగానీ, యోగసిద్ధినిగానీ ఇష్టపడరు. అటువంటి నీ పాదరేణువుల స్పర్శ ఏ జన్మలోనూ ఎవరూ పొందలేనిది.

ఎంతో గొప్ప సంసార భారంచేత క్రుంగిపోయిన జనులు కోరడానికి కూడా సాధ్యంకాని పరమశుభం నీ పాదస్పర్శ. అటువంటి భాగ్యాన్ని ఈ కాళీయుడు - క్రోధం నిండినవాడు, రోషం నిండినవాడూ అయిన ఈ సర్పరాజు పొందగలిగాడు. ఇది నీ సాన్నిధ్యంయొక్క మహిమ!

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 314🌹*
📚. Prasad Bharadwaj 

*🌻314. Krodhahā🌻*

*OM Krodhaghne namaḥ*

Sādhūnāṃ haṃti yaḥ krodhaṃ krodhaheti sa ucyate / साधूनां हंति यः क्रोधं क्रोधहेति स उच्यते He eradicates anger of the virtuous.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 16
Tadeṣa nāthāpa durāpamanyaistamojaniḥ krodhavaśo’pyahīśaḥ,
Saṃsāracakre bhramataḥ śarīriṇo yadicchataḥ syādvibhavaḥ samakṣaḥ. (38)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे षोडशोऽध्यायः ::
तदेष नाथाप दुरापमन्यैस्तमोजनिः क्रोधवशोऽप्यहीशः ।
संसारचक्रे भ्रमतः शरीरिणो यदिच्छतः स्याद्विभवः समक्षः ॥ ३८ ॥

O Lord! Although (Kāḷīya) the king of the serpents, has taken birth in the mode of ignorance and is controlled by anger, he has achieved that which is difficult for others to achieve. Embodied souls, who are full of desires and are thus wandering in the cycle of birth and death, can have all benedictions manifested before their eyes simply by receiving the dust of Your lotus feet.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 315/ Vishnu Sahasranama Contemplation - 315🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻315. క్రోధకృత్‌కర్తా, क्रोधकृत्‌कर्ता, Krodhakr̥tˈkartā🌻*

*ఓం క్రోధకృత్‌కర్త్రే నమః | ॐ क्रोधकृत्‌कर्त्रे नमः | OM Krodhakr̥tˈkartre namaḥ*

క్రోధకృత్‌: అసాధుషు విషయే క్రోధం కరోతి అసాధుజనుల విషయమున క్రోధమును కలిగించును.

కర్తా: కరోతి ఇతి కర్తాః చేయువాడు కావున కర్తా. దేనిని చేయువాడు అను ప్రశ్న రాగా క్రియతే (సృజ్యతే) ఇతి కర్మ జగత్ చేయబడునదీ, సృజించబడునదీ కావున జగత్తు 'కర్మము' మనబడును. అట్టి కర్మమునూ, జగత్తునూ చేయును. జగత్తు సృజన, పోషణ మరియూ సంహారములు చేయును.

క్రోధకృత్‌కర్తా: క్రోధ కృతాం కర్తా; సాధుషు విషయే క్రోధం కుర్వతః దైత్యాదీన్ కృతంతి ఇతి క్రోధకృత్‌కర్తా సాధుజనుల విషయమున క్రోధ ప్రదర్శన చేయు దైత్యాదులను ఛేదించును. అని ఇట్లు రెండును కలిసి ఒకే నామము.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 315🌹*
📚. Prasad Bharadwaj 

*🌻315. Krodhakr̥tˈkartā🌻*

*OM Krodhakr̥tˈkartre namaḥ*

Krodhakr̥t: Asādhuṣu viṣaye krodhaṃ karoti / असाधुषु विषये क्रोधं करोति He who causes anger in the evil persons.

Kartā: Karoti iti kartāḥ / करोति इति कर्ताः What is done or created is action i.e., the world; the creator of the worlds is kartā.

Krodhakr̥tˈkartā: Krodha kr̥tāṃ kartā; sādhuṣu viṣaye krodhaṃ kurvataḥ daityādīn kr̥taṃti iti krodhakr̥tkartā / क्रोध कृतां कर्ता; साधुषु विषये क्रोधं कुर्वतः दैत्यादीन् कृतंति इति क्रोधकृत्कर्ता As one name may be interpreted as the One who is slayer of the the asurās or evil men who torment others.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
इष्टोऽविशिष्टश्शिष्टेष्टः शिखंडी नहुषो वृषः ।क्रोधहा क्रोधकृत्कर्ता विश्वबाहुर्महीधरः ॥ ३४ ॥

ఇష్టోఽవిశిష్టశ్శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౩౪ ॥

Iṣṭo’viśiṣṭaśśiṣṭeṣṭaḥ śikhaṃḍī nahuṣo vr̥ṣaḥ ।Krodhahā krodhakr̥tkartā viśvabāhurmahīdharaḥ ॥ 34 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 71 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 11. Physical Division Does Not Exist 🌻*

I shall give you a small example of how physical division does not exist. It is only imaginary. The bodies of people are constituted of the five elements—earth, water, fire, air and ether. Your body, my body and everybody’s body are constituted of only these things, nothing else—earth, water, fire, air, ether. 

If the body of one individual, ‘A’, is substantially the same as the body of another individual, ‘B’, because of its being formed of the same five elements, what is the reason for the distinction or the difference that we make between one body and another body? It is that which exists between the two bodies. The space is the cause. 

But space is a part of the very constitution of the body itself. So, how does this become an element of distinction? That which we regard as spatial, and, perhaps, the only reason for the distinction that we usually make between one body and another, is an element essentially present in the constitution of the body itself.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 34 / Viveka Chudamani - 34🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*

*🍀. ఆత్మ స్వభావము - 2 🍀*

127. అది అన్నింటిని దర్శిస్తుంది. అది వివేకాన్ని ప్రభావితము చేస్తుంది. కాని అవేవి దానిని ప్రభావితము చేయలేవు.

128. అది విశ్వమంతా వ్యాపించి ఉన్నది. అయితే దానిని వ్యాపింపచేసేది ఏదీ లేదు. అది ప్రకాశిస్తుంది. ఈ విశ్వమంతా దాని వలన ప్రకాశిస్తుంది.

129. దాని ప్రకాశము వలనే ఈ శరీరము దాని భాగములు, మనస్సు, విజ్ఞానము వాని యొక్క భూమండలాలు దానికి సేవకులుగా పనిచేస్తున్నాయి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 34 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 Nature of Soul - 2 🌻*

127. Which Itself sees all, but which no one beholds, which illumines the intellect etc., but which they cannot illumine. –This is That.

128. By which this universe is pervaded, but which nothing pervades, which shining, all this (universe) shines as Its reflection. –This is That.

129. By whose very presence the body, the organs, mind and intellect keep to their respective spheres of action, like servants !

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 45 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 31. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 1 🌻*

ఒక వేసవికాలంలో నేను లక్నో మహా నగరంలో యుండుట జరిగినది. వేసవి తీవ్రముగా నుండుటచే ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. జీవితములోని సమస్యలన్నియు మనోఫలకముపై మెదలి నన్ను తీవ్రముగా ఆందోళన పరచినవి. ఆరోగ్యము అంతంత మాత్రముగ నుండిన దినములవి. భరింపరాని శిరోవేదన యుండెడిది. జీవిత భాగస్వామి కొరకై తీవ్రమైన ఆవేదన యుండెడిది. తలకు మించిన బాధ్యత యుండెడిది. 

కలగాపులగముగా యీ సమస్యలన్నియూ ఒక్కుమ్మడిగా దాడి చేసినవి. వీటికి తోడు లక్నో నగరమున రాత్రి సమయమున దోమల దాడి కూడా జరుగుచుండెడిది. నిద్ర శూన్య మగుటచే విశాలమగు వరండాలోనికి వచ్చి అటునిటు తచ్చాడు చుంటిని. అకస్మాత్తుగా ఒక పెద్ద వెలుగు మెఱపువలె అవతరించినది. నేనున్న చోటునంతటినీ నింపినది. నా గురుదేవుని వాణి వినిపించినది. రూపము కన్పింపలేదు. నేను శ్రద్ధతో ఆయన వాణి వింటిని. వారిట్లు పలికిరి.

“నీవు అనవసరముగా చింతించుచున్నావు. చింతవలన నీకేమియూ ఉపకారము జరుగదు. నీ మనోభావములను, వాక్కులను, చేతలను నే నెప్పటికప్పుడు పరిశీలించుచునే యున్నాను. 

ఈ జీవితమున నీవొనర్చవలసిన దివ్యకార్యము అతి త్వరలో నిన్ను చేరును. నీవా కార్యము నారంభింపగలవు. కాని, ఆరంభింప బడు తీరు మాత్రము నీవు తెలియగ లేవు. నీవు గుర్తించలేని విధముగా అది ప్రారంభమగును.”

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. జ్ఞానాన్షేషణతో సత్యనిరూపణ 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఒంటె- సింహం- శిశువు: - 2 🌻*

గతం, భవిష్యత్తుల నుంచి ఎవరూ ఏ మాత్రం స్పందించకుండా, అందరూ ఈ అస్తిత్వం పట్ల బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఒంటె గతంలో జీవిస్తుంది. సింహం భవిష్యత్తులో జీవిస్తుంది. 

శిశువు ‘‘ఇప్పుడు, ఇక్కడ’’ అనే వర్తమానంలో జీవిస్తాడు. ఒంటె, సింహాలది మనసు, ఆత్మల పూర్వస్థితి. శిశువుది మనసు, ఆత్మల తరువాత స్థితి. మనోరహిత స్థితి అంటే అదే. దానినే ‘‘అహంరహిత స్థితి’’ అంటే మనసు, ఆత్మలు లేని స్థితి అంటారు. అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి. 

మనసు లేని ఆత్మ, ఆత్మ లేని మనసు మీకు ఎప్పుడూ ఉండదు. ‘‘నీవు, నేను’’ అనేవి ఒకే శక్తిలోని భాగాలు. అవి కూడా అంతర్థానమవుతాయి. శిశువు మాటల కందని మార్మికమైన, అనిర్వచనీయమైన అద్భుతం. ఒంటెకు జ్ఞాపకశక్తి, సింహానికి తెలివితేటలు, శిశువుకు జ్ఞానం ఉంటాయి. 

ఒంటె ఎప్పుడూ ఆస్తికుడే. కానీ, సింహం ఎప్పుడూ నాస్తికుడే. అయితే శిశువు మాత్రం ఎప్పుడూ ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. వాడు కేవలం ప్రేమ, అమాయకత్వాలతో నిండిన ధార్మికుడు మాత్రమే. 

జ్ఞానము సాధించిన మానవుడు సింహంలా మారాడు. అతని తెలివితేటలు అంతరించి పోగానే అంటే తిరిగి వదలగానే శిశువుగా మారిపోతాడు. శిశువుగా మారిపోవడమంటే దైవంగా మారిపోవడమే. దానినే బుద్ధుడు ‘‘నిర్వాణ’’అని అంటాడు. దానినే మీరు ‘‘తావో, దమ్మ, మోక్ష’’అంటూ ఎలాగైనా అనవచ్చు. ఎందుకంటే, మాటలకు అక్కడ పెద్దగా అర్థాలుండవు. అది మాటలు లేని మోనం, ఆలోచన లేని అమాయకత్వం.

🌻. ప్రేమ నుంచి వాత్సల్యానికి: 🌻

ప్రేమకు రెండు విభిన్నమైన పరస్పర వ్యతిరేక అర్థాలున్నాయి. మొదటిది ‘బాంధవ్యం’, రెండవది ‘అస్తిత్వ స్థితి’. బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ బానిసత్వంగా మారుతుంది. ఎందుకంటే, అక్కడ ఆశల కోరికలు, ఆశాభంగాల వేదనలు, పరస్పరం శాసించుకునే ప్రయత్నాలు ఉంటాయి. అందువల్ల అది అధికార పోరాటంగా మారుతుంది. కాబట్టి, బాంధవ్యంతో కూడుకున్న ప్రేమ సరియైనది కాదు.

రెండవది ‘‘అస్తిత్వస్థితి ప్రేమ’’. అది పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఆ స్థితిలోని ప్రేమ ఎవరినుంచి ఏదీ ఆశించకుండా వ్యాపించే సుమ సుగంధంలా ఉంటుంది. కాబట్టి, ఆ స్థితిలో ఉన్న మీరు ఎలాంటి బాంధవ్యాన్ని సృష్టించకుండా, ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, నిరంతరం ప్రేమిస్తూ, ఆ ప్రేమను అందరికీ పంచుతూ ఉంటారు. అదే మీకు లభించే బహుమతి.

ప్రేమ సుగంధంలా మారినప్పుడు అది మానవత్వాన్ని మించిన అద్భుత సౌందర్యంతో కూడుకున్న దివ్యత్వ శోభతో వెలిగిపోతూ అన్ని వైపులకు వ్యాపిస్తూ ఉంటుంది. దానిని మీరు ఆపలేరు. అంతేకాదు, అది ఎవరికి ఎలాంటి బంధనాలను సృష్టించదు, వాటిలో ఎవరినీ చిక్కుకోనివ్వదు. 

కానీ, మీరు మీ పసితనం నుంచే బాంధవ్యాలను సృష్టించడానికి అలవాటుపడ్డారు. మీ జీవితమంతా అనేక రకాలైన బాంధవ్యాలతో ముడిపడి ఉంటుంది. అవి వాస్తవమైనవి కావచ్చు లేదా ఊహాత్మకమైనవి కావచ్చు. ఏదేమైనా, ఒక రకంగా ఆ బాంధవ్యాలన్నీ అతి సూక్ష్మమైన మానసిక బానిసత్వానికి సంబంధించినవే. మీరు వాటికి బానిస కావచ్చు లేదా మీకు మీరే బానిస కావచ్చు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 222 / Sri Lalitha Chaitanya Vijnanam - 222 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా ।*
*మహాబుద్ధి, ర్మహాసిద్ధి, ర్మహాయోగేశ్వరేశ్వరీ ॥ 55 ॥*

*🌻 222. 'మహాబలా'🌻*

మహత్తరమగు బలము కలది శ్రీలలిత అని అర్థము.  

బలమను పదమునకు చాల అర్థములు కలవు. గంధమందలి సువాసనలను బలమందురు. రసమును బలమందురు. రసమనగా రుచి. ఇంద్రియముల రుచి ఇంద్రియబలము. గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి, సమయస్ఫూర్తి, బుద్ధిబలము, స్థిరత్వము, మనోబలము, ఆనందము, సంతోషము జీవుని బలము. 

ఇట్లు రసము అనేక రుచులద్వారా జీవునికి బలమిచ్చు చుండును. రుచి బలమైనది గనుకనే బలహీనులు వానికి లోబడుదురు. వానిని లోబరచుకొన్న జీవుడు బలవంతుడు. అతడే బలుడు.

బలమనగా రూపమని కూడ అర్థము కలదు. బలమగు రూపములు గలవారిని కూడ బలులందురు. బలరాముడు, భీముడు, ఘోటోత్కచుడు, కుంభకర్ణుడు బలమగు రూపములు కలవారు. రూప బలము కూడ బలమే. రూపమున అందము కూడ బలమే. శ్రీరాముడు,
శ్రీకృష్ణుడు వంటి వారిది రూపమున గల సౌందర్య బలము. అట్లే సీతాదేవి, ద్రౌపదీ దేవి కూడ. 

బలమనగా జీవ బలమని కూడ అర్థము కలదు. ఎట్టి కష్ట నష్టములనైననూ నోర్చుచూ జీవించు జీవులుందురు. వారిది జీవ బలము. భరింపరాని కష్టనష్టములను కూడ భరించుట బలమే కదా! ధర్మరాజు, నలుడు ఈ కోవకు చెందినవారు. వీరు జీవమునందు బలము కలవారు. మహత్తరమైన సేనలు కలవారు కూడ బలవంతులే. 

అట్లే మహత్తరమగు సద్గుణములు కలవారు కూడ బలవంతులే. రాక్షస రాజగు వైరోచనుడు దాన బలము కలిగి చక్రవర్తియై బలిచక్రవర్తిగా పేరు గాంచెను. నిజమునకు అతడు బలి అనియే 
తెలియబడును. గాని అతని నిజనామము కొందరికే తెలియును. 

దాన గుణమే బలముగ అతడు వ్యాప్తి చెంది భూమికి చక్రవర్తి అయ్యెను. బలి అని పేరు గాంచెను. ఇట్లనే కానేక బలములు ఇన్ని విధములుగ ఇందరి యందు భాసించుటకు మూలకారణము శ్రీమాత బలమే. ఆమె మహాబల గావున బలమెచ్చట నున్ననూ, అది ఆమె అస్థిత్వమే అని తెలియ వలెను.

కాకియందు బలమున్నదని సామాన్యముగ మనము గ్రహించము. కాకులు చండుడను మహర్షి కుమారులు. వారు ఇరువది ఒక్కరు. వారు ప్రతిదినము బ్రాహ్మీకాలమున శ్రీదేవిని చిరకాలము పూజించిరి. ధ్యానించిరి. సమాధి స్థితిని పొందిరి. 

అపుడు శ్రీదేవి అనుగ్రహించి వారికి ప్రత్యక్షమైనది. ముక్తి నొసగినది. ఈ విధముగ వాయసములు, వారి సంతతి ముక్తజీవులైనారు. ఈ కారణముగనే ముక్తి నపేక్షించుచూ కాకులకు అన్నము పెట్టుట సంప్రదాయముగ వచ్చినది. ముక్తి నొసగు బలము కాకులయందు నిక్షిప్తము చేయుటలో శ్రీమాత బల మాహాత్మ్యము తెలియనగును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 222 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Mahā-balā महा-बला (222) 🌻*

There are several meanings for the word vīrya. Generally it means courage, power, lustre, dignity, energy, etc. She is the reservoir of all these qualities and She provides these qualities to Her devotees depending upon the depth of devotion. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

🌹. శ్రీమద్భగవద్గీత - 563 / Bhagavad-Gita - 563 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 02 🌴*

02. . శ్రీభగవానువాచ
త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శ్రుణు ||

🌷. తాత్పర్యం : 
శ్రీకృష్ణభగవానుడు పలికెను : దేహధారి పొందిన త్రిగుణముల ననుసరించి శ్రద్ధ సాత్త్వికము, రాజసము, తామసము అనుచు మూడువిధములుగా నున్నది. ఈ విషయమును ఇప్పుడు ఆలకింపుము.

🌷. భాష్యము :
శాస్త్రపు విధినియమములను తెలిసియు బద్ధకత్వము లేదా సోమరితనము కారణముగా వానిని త్యజించు వాడు ప్రకృతి గుణములతో ప్రభావితుడైనట్టివాడు. 

పూర్వజన్మమున సత్త్వరజస్తమో గుణములలో తామొనరించిన కర్మల ననుసరించి జీవులు వర్తమానమున ప్రత్యేక గుణమును పొందుచుందురు. ప్రకృతి త్రిగుణములతో జీవునకు గల ఈ సాంగత్యము అనంతకాలముగా సాగుచున్నది. అట్టి ప్రకృతి సంగత్వకారణముగా జీవుడు గుణసంబంధమున వివిధ స్వభావములను పొందుచుండును. 

కాని అతడు ఆధ్యాత్మికగురువు యొక్క సాంగత్యము పొంది శాస్త్ర నియమ నిబంధనలను పాటించినచో తన గుణస్వభావమును మార్చుకొనగలడు. అనగా మనుజడు క్రమముగా తమోగుణము నుండి సత్త్వగుణమునకు గాని, రజోగుణము నుండి సత్త్వగుణమునకు గాని తన స్థితిని మార్చుకొనగలడు. 

సారాంశమేమనగా ఏదేని ఒక ప్రత్యేక గుణమునందలి గ్రుడ్డి నమ్మకము మనుజుని పూర్ణత్వస్థితికి గొనిపోలేదు. అతడు తప్పక ప్రతివిషయము శ్రద్ధ మరియు తెలివితో గురువు సమక్షమున పరిశీలించవలసియుండును. ఆ విధముగా అతడు తన స్థితిని ఉన్నత గుణమునకు మార్చుకొనగలడు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 563 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 17 - The Divisions of Faith - 02 🌴*

02. . śrī-bhagavān uvāca
tri-vidhā bhavati śraddhā
dehināṁ sā svabhāva-jā
sāttvikī rājasī caiva
tāmasī ceti tāṁ śṛṇu

🌷 Translation : 
The Supreme Personality of Godhead said: According to the modes of nature acquired by the embodied soul, one’s faith can be of three kinds – in goodness, in passion or in ignorance. Now hear about this.

🌹 Purport :
Those who know the rules and regulations of the scriptures but out of laziness or indolence give up following these rules and regulations are governed by the modes of material nature. According to their previous activities in the mode of goodness, passion or ignorance, they acquire a nature which is of a specific quality. 

The association of the living entity with the different modes of nature has been going on perpetually; since the living entity is in contact with material nature, he acquires different types of mentality according to his association with the material modes. But this nature can be changed if one associates with a bona fide spiritual master and abides by his rules and the scriptures. 

Gradually, one can change his position from ignorance to goodness, or from passion to goodness. The conclusion is that blind faith in a particular mode of nature cannot help a person become elevated to the perfectional stage. 

One has to consider things carefully, with intelligence, in the association of a bona fide spiritual master. Thus one can change his position to a higher mode of nature.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

48 Types of Moon 48 రకముల చంద్రుడు - taken in 10 years

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹