13-July-2020 Messages

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹
2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 214 / Sripada Srivallabha Charithamrutham - 214 🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94🌹 
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 117 🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 30 / Sri Lalita Sahasranamavali - Meaning - 30 🌹
6) 🌹 VEDA UPANISHAD SUKTHAM - 57 🌹
7) 🌹. నారద భక్తి సూత్రాలు - 34 🌹 
8) 🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తగీత - 2 / DATTATREYA JEEVANMUKTHA GEETA - 3 🌹 
9) 🌹. సౌందర్య లహరి - 41 / Soundarya Lahari - 41🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 340 / Bhagavad-Gita - 340 🌹

11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 168 🌹 
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 48 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 🌹
14) 🌹 Seeds Of Consciousness - 121🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 57 🌹 
16) 🌹. మనోశక్తి - Mind Power - 59 🌹
17) 🌹. సాయి తత్వం - మానవత్వం - 50 / Sai Philosophy is Humanity - 50🌹
18) 🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 4 🌹
19)
20) 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 426 / Bhagavad-Gita - 426 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 35 🌴*

35. సంజయ ఉవాచ
ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమాన: కిరీటీ |
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీత: ప్రణమ్య ||

🌷. తాత్పర్యం : 
ధృతరాష్ట్రునితో సంజయుడు పలికెను; ఓ రాజా! దేవదేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరల మరల వందనముల నొసగెను. భీతిని కూడినవాడై అతడు డగ్గుత్తికతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను.

🌷. భాష్యము : 
పూర్వమే తెలుపబడినట్లు శ్రీకృష్ణభగవానుని విశ్వరూపముచే సృష్టింపబడిన పరిస్థితి కారణముగా అర్జునుడు సంభ్రమమునకు గురియయ్యెను. 

తత్కారణముగా అతడు కృష్ణునకు గౌరవపూర్వక వందనములను మరల మరల అర్పించుట మొదలిడెను. అతడు స్నేహితునివలె గాక, అద్భుతరసభావితుడైన భక్తునిగా గద్గదస్వరముతో ప్రార్థింపదొడగెను.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 426 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 35 🌴*

35. sañjaya uvāca
etac chrutvā vacanaṁ keśavasya
kṛtāñjalir vepamānaḥ kirīṭī
namaskṛtvā bhūya evāha kṛṣṇaṁ
sa-gadgadaṁ bhīta-bhītaḥ praṇamya

🌷 Translation : 
Sañjaya said to Dhṛtarāṣṭra: O King, after hearing these words from the Supreme Personality of Godhead, the trembling Arjuna offered obeisances with folded hands again and again. He fearfully spoke to Lord Kṛṣṇa in a faltering voice, as follows.

🌹 Purport :
As we have already explained, because of the situation created by the universal form of the Supreme Personality of Godhead, Arjuna became bewildered in wonder; thus he began to offer his respectful obeisances to Kṛṣṇa again and again, and with faltering voice he began to pray, not as a friend, but as a devotee in wonder.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 214 / Sripada Srivallabha Charithamrutham - 214 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయం 39
*🌻. నాగమణి మహత్యం 🌻*
త్రిపురభైరవి (శ్రీపాదులకు 15 ఏళ్ళు) 

*🌻. నాగేంద్రశాస్త్రితో నాగులపై గోష్ఠి 🌻*

మేము కాలనాగమణిని తీసుకొని మా ప్రయాణం సాగిం చాము. దారిలో నాగేంద్రశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆగాము. వారి ఇంట్లో నాగుపాములు వాళ్ళ సంతానంలా స్వేచ్ఛగా తిరుగు తున్నాయి. అవి ఎవరికి హాని కలిగిం చవు. 

దివ్యనాగులకు పడగపై మణి ఉంటుంది. దానిని సంపాదించాలని వారు ఎన్నో ఏళ్ళు నాగోపాసన చేశారట. వారు ఇలా చెప్పడం మొదలు పెట్టారు," శ్రీపాదులకు 15 సంవత్సరాల వయసులో నేను పీఠికాపురం వెళ్ళాను. 

అక్కడ స్వయంభూదత్తుని మెడలో ఒక కాలనాగుని, దానిపై మణిని చూసాను. నాగమణికి మన జీవితంలోని ఎన్నో అరిష్టాలను నివారించే శక్తే కాకుండా, అంగారక గ్రహం తో సంబంధం ఉన్న అన్ని దోషాలను పోగొట్టే శక్తికూడా ఉంటుంది. ఆ మణిని చూసాక దానిని ఎలాగైనా సంపా దించి, జీవితంలో అభివృద్ధి సంపాదించాలని నిశ్చయించు కున్నాను.

 *🌻. నాగదోష శాంతి 🌻*

నేను నరసింహవర్మగారి ఇంటి మీదుగా వెళ్తూ, వర్మగారు చెట్లకు బోదెలు చేయడం, శ్రీపాదులు వాటికి నీళ్ళు పోయడం చూసాను. ఇంతలో వర్మగారికి ఔదుంబర వృక్షం కింద రాగి పాదుకలు కన్పించాయి. 

వాటిని కొబ్బరి నీళ్ళతో కడిగి ప్రభువుల పాదాల దగ్గర పెట్టారు. శ్రీపాదులు నన్ను నాగేంద్రశాస్త్రీ! అంటూ పిలిచి "నీవు నాగమణి కావాలని కోరు కుంటున్నావు. ఈ పాదుకలను తీసుకొని వీటిని పూజిస్తూ ఉండు. నాగులు వాటి మణులతో ఏ స్వామిని ఆరాధి స్తాయో ఆ ప్రభువుని నేనే. 

ఈ దివ్య పాదుకలని అర్చించి, ఆ తీర్థం ఇచ్చినట్లయితే వ్యాధిగ్రస్తుల రోగాలు తగ్గిపోతాయి, సర్పదోషాలు హరించుకు పోతాయి. కాలాంతరంలో శంకర భట్టు, ధర్మగుప్తులు నీ వద్దకు వచ్చినపుడు ఈ పాదుక లను వారికి ఇచ్చి, వారివద్దనుండి కాలనాగ మణిని తీసుకో," అని చెప్పి నాగదోషాన్ని శాంతింప చేయ డానికి పూజలు చేసేటప్పుడు పుట్టింటివారి సొమ్ము, లేదా మేన మామల సొమ్ము కొంతైనా ఆ పూజకి అయ్యే ఖర్చులో కలపాలని, లేకపోతే ఫలితం ఉండదు అని చెప్పుతూ దాని వెనుక ఉన్న కారణాన్ని ఈ విధంగా వివరించారు. 

 పూర్వం శుంభనిశుంభుల అత్యాచారాలవల్ల పీడితులైన దేవతలు హిమాలయాలకు వెళ్ళి హైమవతీదేవిని స్తుతించారు. గౌరీదేవి శరీరం నుండి కౌశికి అనే దేవత ఆవిర్భవించింది. దీనితో పార్వతీదేవి శరీరం నలుపుగా మారి కాళీ మాతగా ప్రసిద్ధి చెందింది. 

తను మళ్ళీ గౌరిగా మారాలనే భావన రావడంతో కాళి అంతర్ధానమయ్యింది. పరమేశ్వరుడు ఆమె జాడ తెలియక నారదమహర్షిని అడుగగా, సుమేరుపర్వతానికి ఉత్తరదిశలో ఉందని చెప్పారు. శివుని ఆజ్ఞమేరకు నారదుడు పార్వతీదేవి వద్దకు వెళ్ళి ఆమెను శివుని వివాహమాడమని కోరాడు. 

ఆ ప్రస్తావనకు కోపంతో పార్వతి ఛాయారూపిణి త్రిపురభైరవిగా మారింది. ఈ క్రోధావేశాలకు కాలాన్ని శాసించే కాలనాగులు కారణాలు కనుక విష్ణుస్వరూపుడినైన నేను శివుని త్రిశూలంతో నాగమణులను సృష్టించి అవి కాలనాగులు ధరించేలా వరమిచ్చాను. 

అంతేకాక హైమవతి నా చెల్లెలు కాబట్టి, నా చెల్లెలి కోసం నాగమణులని సృష్టించాను కాబట్టి నాగసర్పదోష నివారణకి పుట్టింటి వారి సొమ్ము తృణమో, పణమో ఖచ్చితంగా ఉండాలని నిబంధన చేసాను," అని శ్రీపాదులు తనకు వివరించారని చెప్పి తమ అనుభవం ఇలా తెలిపారు:

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sripada Srivallabha Charithamrutham - 214 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 21
*🌻 Sripada has 16 kalas in wholesome 🌻*

My Dear! Shankar Bhatt! “If one thing is broken into countless pieces, every piece becomes ‘sunyam’.  

When such ‘sunyas’ join in countless numbers, one limited form is created. Hence Siva and Kesava are not different. In the division of sixteen ‘dasaamsas’ when divided by ten, six ‘dasamsas’ come as the remainder.  

From that five ‘dasamsas’ are taken as the symbol of Vishnu, it is said that the creation (Srishti) made of five bhutas (air, water, fire, sky and earth) is the form of Vishnu.  

Vishnu told Veerabhadra who destroyed Daksha Yajna, “for Eswar, Moola Prakruthi is in the form of Parvathi for ‘bhogam’, in the form of Durga for killing demons, as ‘Kaalika Devi’ in the state of anger and as Veerabhadra in the form of ‘purusha’ (male form). This is the aim in telling that Sripada has the 16 kalas in wholesome.”  

He left Peethikapuram at the age of sixteen. As He is the combined form of Brahma, Vishnu and Rudra, learn that He is ‘Shodasa Kala Prapoorna’.

*🌻 The different forms of God 🌻*

As Prakruthi is the form of Vishnu, five ‘dasamsas’ are the symbol of Vishnu. As Brahma is the son of Parvathi and Parameswara, Brahma is 1/10th of Siva.  

The reason is very clear. Siva, being the form of ‘chaitanyam’, is important. The form of Vishnu being the symbol of ‘Jagat’ (which is illusion), is not important. So Brahma is 1/10th of Siva.  

The No.1 (Ekankam) is the symbol of Brahma. This Ekankam is spread in all eight Murthis from the numbers 2 to 8. So Brahma got the form of ‘Nava Prajapathi’.  

Out of the numbers sixteen (16), hundred (100) and thousand (1000), the last two words had 16 and 116 added and got the forms 116 and 1116. If these are divided by ten, they become symbols of all things in the creation.  

Rudra will get ‘1’ as purnankam, Vishnu gets 11 as two ‘purnankas’ and Brahma gets 111 as three ‘purnankas’. 16, 116 and 1116 are called ‘thridakshna’ (three dakshinas) starting from 16. It was said that people donating ‘thridakshina’ will get Brahma jnana.  

By donating thridakshina, one will be treated as having donated three things body, wealth and mind. By donating in equivalent amounts to 16, 116 and 1116, one will get the fruit of donating whole world.  

Pindandam is the symbol of ‘jagat’. Our body is in the form of three ‘savanas’ – prathassavanam, Madhyamdina savanam and Trutheeeya savanam.  

They are related to the ‘chandassu’ (metres) – Gayatri, Trishtup and Jagathi. Gayathri has 24 letters, Trishtup has 44 letters and Jagathi has 48 letters.  

The total is 116 letters. So by this pindanda danam (donation of body), also one gets the fruit of donation of the money as said above.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 94 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
సంకలనము : వేణుమాధవ్ 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. చేయవలసినది- చేయదలచినది - 10 🌻*

నీవు నా రథమందు వసింపుమయ్య! నందకుమారా యదుభూషణ" అని (అర్జునుడు) కోరాడు‌. 

కోరగానే కృష్ణుడు యుద్ధంలో రథం మీద కూర్చున్నాడు. అంతే! అంతకంటే ఇంకేమీ చేయలేదు. అన్న దానిలో సంకేతం ఇదే. మనం ధ్యానం చేసినా, అర్చన చేసినా, భగవంతుని మనం కోరవలసినదేమిటి? సారథిగా (భగవంతుని) కోరవలెను. 

సారథియై హృదయంలో‌ ఉండి‌ మనలను నడిపించేవాడు ఆయనే. అయినను మన హృదయంలోకి వచ్చి, లోనికి కూర్చోమని అహ్వానించాలి. "శరీరం రథమేవచ" అని‌ పెద్దలు చెప్పారు కదా, ఈ శరీరం అనే రథం తెల్లని గుర్రములతో కూడిదనదవుతుంది. 

అనగా ఇంద్రియములు శుద్ధములు,‌ స్వచ్చములు, నిష్కల్మషములు అవుతాయి. ఊభయ సైన్యాల మధ్య ఈ శరీరం అనే రథం జీవితం అనే భారతంలో నిలబడుతుంది. 

వీళ్ళందరు నా‌ స్నేహితులు, వీళ్ళందరు నా చుట్టాలు, వీళ్ళతో యుద్ధం చేయగా వీళ్ళు చనిపోతే హింస కదా! కనుక యుద్ధం మంచిది కాదు..
.*✍ మాస్టర్ ఇ.కె. 🌻*
🌹 🌹 🌹 🌹 🌹 


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 The Masters of Wisdom - The Journey Inside - 116 🌹*
*🌴 Meditation for the Aquarian AGE - 7 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

*🌻 “Dip deep” - 2 🌻*

The entire process can be summarized into three points: Observe the time in the morning and evening, invoke the sound key, and observe within. 

In addition we should meditate upon every form as the Master, that is the background consciousness of all that IS. 

And we shouldn’t work for our personal gains, that is not to entertain a feeling that we work for ourselves, but for the others.

If this meditation is practiced regularly over a longer period, it causes profound changes. It eliminates the old rhythm of life and stabilizes a new vibration. 

The outer life gets more organized and aligned with the inner life. We acquire the ability to include, accept and integrate. 

By this we prepare ourselves for the supra-consciousness to descend into ourselves. 

Thus we are uplifted and transformed into an immortal being. Master CVV calls this attaining physical immortality.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources used: Master K. P. Kumar: The Aquarian Master / seminar notes.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నారద భక్తి సూత్రాలు - 33 🌹* 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, 
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 20, 21

*🌻 20. అస్త్యేవ మేవమ్‌ 🌻*

            విస్మృతి వలన కలిగిన దుఃఖం కూడా భక్తుడిని మరింత గాఢంగా భగవంతునితోనే ఉండేటట్లు చేస్తుంది. అయితే అలాంటి భక్తులు కూడా ఉంటారా? అని అనుమానం అక్కరలేదు. దానికి గోపికా భక్తిని ఉదాహరణగా చెప్పబోతున్నారు.

*🌻 21. యథా వ్రజ గోపికానామ్‌ 🌻*

            వ్రజపురంలో నివసించే గోపికలే ఇందుకు నిదర్శనం.       
   
            చదువు, లోకజ్ఞానం లేని గోపికలు అమాయకులు. వారిని పరా భక్తులుగా నిర్ణయించారు మహర్షులు. వారి భక్తిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఏమన్నాడో చూడండి.

            ‘‘గోపికలారా! మీ భక్తి సాటిలేనిది. మీ చిత్తం నిర్మలం. నాపై నిష్ఠ గొలిపి సంసార బంధాలన్నీ త్రెంచివేసుకున్నారు. 

మీ భావాలను, అనుభవాలను నాయందే ఉంచి అనిర్వచనీయ ఆనందంతో నన్నే భజించు చున్నారు. మీ భక్తికి తగినట్లుగా ప్రతిఫలంగా నేను ఏమిచ్చినా సరిపోదు. 

స్వర్గలోకం, దేవతల అమరత్వం లాంటివేమీ సరిపోవు. మీ సౌశీల్యం చేత నన్ను ఋణగ్రస్తుని చేస్తున్నారు’’. ఈ మాటలనే ఉద్ధవునితో చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు.

            ‘‘ఉద్ధవా! గోపికలు నాయందే వారి మనసులను, ప్రాణాలను నిలిపి, నన్ను పొందడం కోసం భర్తలను, పిల్లలను అన్న పానాదులను, వస్త్రాలంకారా దులను, ఏక మొత్తంగా వదలి వేశారు. 

నా తోడిదే లోకంగా, నేనే వారి ప్రాణంగా భావిస్తున్నారు. నేను మళ్ళీ బృందావనానికి వస్తానని పేరాశతో ఉండి, విరహాన్ని అనుభవిస్తున్నారు’’.

            ఈ గోపికలకు పరమాత్మ యెడల విస్మృతి లేదు. అలా ఎప్పుడైనా జరిగితే మరలా ఆ పరమాత్మనే తలచి తలచి, ఆర్ధ్రత చెంది, మరింత ఎక్కువగా వారి భావాన్ని ఆయనపై నిలుపుకుంటారు. 

ఇది ఎవరో పరిశీలించి చెప్పిన మాటలు కావు. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మయే ఉద్ధవునితో చెప్పిన మాటలు. కనుక గోపికల భక్తిని శంకించవలసిన అవసరం లేదు. ఉద్ధవుడు గోపికలను చూచి ఏమన్నాడో చూడండి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 30 / Sri Lalita Sahasranamavali - Meaning - 30 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. శ్లోకం 61*

249. పంచప్రేతాసనాసీనా - 
పంచప్రేతలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది.

250. పంచబ్రహ్మస్వరూపిణీ -
 పంచబ్రహ్మల స్వరూపమైనది.

251. చిన్మయీ - జ్ఞానముతో నిండినది.

252. పరమానందా - బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము.

253. విజ్ఞానఘనరూపిణీ - విజ్ఞానము, స్థిరత్వము పొందిన రూపము గలది.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 30 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 Sahasra Namavali - 30 🌻*

249 ) Pancha prethasana seena -   
She who sits on the seat of five dead bodies ( these are Brahma , Vishnu, Rudra, Eesa and Sadasiva without their Shakthi(consort))

250 ) Pancha brahma swaroopini -   
She who is personification of five brahmas ( they are the gods mentioned in the last name with their Shakthi)

251 ) Chinmayi -  
 She who is the personification action in every thing. 

252 ) Paramananda -   
She who is supremely happy. 

253 ) Vignana Gana Roopini -   
She who is the personification of knowledge based on science

Continues.....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. VEDA UPANISHAD SUKTHAM - 57 🌹*
*🌻 1. Annapurna Upanishad - 18 🌻*
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

IV-71. In that vast mirror of Intelligence, all these perceptions of objects are reflected as the trees on the bank are reflected in the lake. 

IV-72. That is the pure un-obscured Truth of the Self; when that is known the mind is tranquillised. Having, through knowledge, won Its essence you become truly free from the fear of samsara. 

IV-73. By the application of the remedies mentioned by me for the causes of suffering, that (supreme) status is attained. 

IV-74-75. O knower of Truth! If by manly endeavour you forcefully eschew latent impressions and establish yourself, all alone, in that indestructible status, even for a moment, at the very summit of universal being, well, at this very moment you achieve it all right; 

IV-76. Or, if you sedulously cultivate the status of universal being, that status you will attain with somewhat greater effort. 

IV-77. Nidagha, if you stay meditating on the principle of cognition, through (still) greater effort you will win that exalted status. 

IV-78. Or, sir, if you strive to shed latent impressions (know) that till the mind is dissolved, the latent impressions, too, are not attenuated. 

IV-79. As long as the latent impressions are not attenuated, the mind is not tranquillised; as long as the knowledge of truth is not won, whence can come mental tranquility? 

IV-80. As long as the mind is not tranquil, Truth cannot be known; so long as the knowledge of Truth is not won whence can mental tranquility come?

Continues....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ దత్తాత్రేయ విరచిత జీవన్ముక్తిగీత - 3 / DATTATREYA JIVANMUKTA GITA - 3 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

9. శారీరం కేవలం కర్మ
శోకమోహాది వర్జితం
శుభాశుభ పరిత్యాగీ
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
ఎవడు శోక మోహములు తెలియని కాయక కర్మను చేయుచున్నాడో, శుభాశుభములను పరిత్యజించి యున్నాడో అతడే ‘జీవన్ముక్తుడు’.

10. కర్మ సర్వత్ర ఆదిష్టం
న జానాతి చ కించన
కర్మబ్రహ్మ విజానాతి
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
శాస్త్ర విధానోక్త కర్మలు కూడా తెలియనివాడు, కర్మ బ్రహ్మస్వరూపమేయని తెలిసినవాడు ‘జీవన్ముక్తుడు’

11. చిన్మయం వ్యాపితం సర్వం
ఆకాశం జగదీశ్వరం
సహితం సర్వభూతానాం
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
జగదీశ్వరుడైన పరమాత్మ చిద్రూప మనియు, ఆకాశము వలె సర్వవ్యాపకుడు అనియు, సర్వభూత సహితుడనియు ఎవ్వడు గ్రహించు చున్నాడో అతడే ‘జీవన్ముక్తుడు’.

12. అనాదివర్తి భూతానాం
జీవః శివో న హన్యతే
నిర్వైర స్సర్వ భూతేషు
జీవన్ముక్త స్స ఉచ్యతే ll  

భావము: 
సమస్త భూతముల యందలి అనాదియైన జీవుడు వాస్తవానికి శివుడే కనుక అతడు అవినాశి. సర్వభూతముల యందలి ఈ సత్యమును దర్శించువాడు వైరము లేనివాడై యుండును. అతడే ‘జీవన్ముక్తుడు’.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. DATTATREYA JIVANMUKTA GITA - 3 🌹*
📚. Prasad Bharadwaj

9. He is called a Jivanmukta who is free from vanity, crookedness, chicanery, cunningness, diplomacy, hypocrisy, harshness and double-dealing.

10. He is called a Jivanmukta who is benevolent, kind, compassionate, merciful and loving to all beings.

11. He is called a Jivanmukta who is free from Raga-Dvesha, likes and dislikes and who is endowed with dispassion, discrimination and cosmic love.

12. He is called a Jivanmukta who has no enemy, who has no body-consciousness and who ever dwells in the Eternal Brahman.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 


*🌹. సౌందర్య లహరి - 41 / Soundarya Lahari - 41 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ 

41 వ శ్లోకము

*🌴. గర్భమునకు సంబంధించిన రోగముల విముక్తి, కడుపులో పుండ్ల నివారణ, మూలాధార చక్ర జాగృతి 🌴*

శ్లో: 41. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా 
నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం l 
ఉభాభ్యా మేతాభ్యా ముదయ విధి ముద్దిశ్య దయయా 
సనాథాభ్యాం జజ్ఞే జనక జననీమజ్జిగ దిదమ్ ll 
 
🌻. తాత్పర్యం : 
అమ్మా ! నీ యొక్క మూలాధార చక్రమునందు సమయ అను పేరు గల కళతో లాస్య రూపమయిన తొమ్మిది రసములతో నాట్యమునందు మిక్కిలి ఆసక్తురాలవై ఆనందభైరవి అను శక్తితో కూడి నవరసములతో తాండవ నృత్యము చేయువానిని ఆనంద భైరవునిగా తలచెదను.దగ్ధమయిన ఈ జగత్తును మరల ఉత్పత్తి చేయు ఉద్దేశ్యముతో కలసిన ఈ ఆనందభైరవి భైరవులచే ఈ జగత్తు తల్లిదండ్రులు కలదిగా పుట్టును కదా ! 
  
🌻. జప విధానం - నైవేద్యం:--
ఈ శ్లోకమును 4000 సార్లు ప్రతి రోజు 30 రోజులు జపం చేస్తూ, తేనె, పొంగడాలు, నివేదించినచో గర్భమునకు సంబంధించిన సమస్త రోగముల విముక్తి, కడుపులో పుండ్లు, మూలాధార చక్ర జాగృతి జరుగును అని చెప్పబడింది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Soundarya Lahari - 41 🌹* 
📚 Prasad Bharadwaj 
SLOKA - 41 

*🌴 stomach disorders and Activation of muladhara Chakra 🌴*

Thavadhare mole saha samayaya lasyaparaya Navathmanam manye navarasa maha thandava natam Ubhabhya Methabhyamudaya vidhi muddhisya dhayaya Sanadhabyam jagne janaka jananimatha jagathidam.
 
🌻 Translation :
I pray in your holy wheel of mooladhara, you who likes to dance, and calls yourself as samaya, and that lord who performs the great vigorous dance, which has all the shades of nine emotions. This world has you both as parents, because you in your mercy, wed one another, to recreate the world, as the world was destroyed in the grand deluge.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :  

If one chants this verse 4000 times a day for 30 days, offering honey, pongalas prasadam, it is said that one would overcome stomach and lower related diseases.

🌻. BENEFICIAL RESULTS: 
Cures ulcers and intestinal disorders. 
 
🌻. Literal Results: 
Activation of muladhara chakra, rejuvenation of entire system, inducing high spirits and great optimism.

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 168 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴* 
39. అధ్యాయము - 14

*🌻. శివపూజ - 1 🌻*

అథ చతుర్దశోsధ్యాయః
ఋషయ ఊచుః |

వ్యాసశిష్య మహాభాగ కథయ త్వం ప్రమాణతః | కైః పుషై#్పః పూజితశ్శంభుః కిం కిం యచ్ఛతి వై ఫలమ్‌ || 1

ఋషులు ఇట్లు పలికిరి -

ఓ వ్యాసశిష్యా! మహాత్మా! నీవు ప్రమాణ పూర్వకముగా చెప్పుము. శివుని ఏయే పుష్పములతో పూజించిన, ఏయే ఫలముల నిచ్చును ?(1).

సూత ఉవాచ |

శౌనకాద్యాశ్చ ఋషయ శ్శృణుతాదరతోsఖిలమ్‌ | కథయామ్యద్య సుప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయమ్‌ || 2

ఏష ఏవ విధిః పృష్టో నారదేన మహర్షిణా | ప్రోవాచ పరమ ప్రీత్యా పుష్పార్పణ వినిర్ణయమ్‌ || 3

సూతుడిట్లు పలికెను -

శౌనకాది ఋషులారా! శ్రద్ధతో వినుడు. మీకీనాడు పుష్పములను అర్పించుటయందు గల సర్వ నిర్ణయములను ప్రీతితో చెప్పెదను (2). 

పుష్పములను అర్పించుటలో గల ఈ నిర్ణయమును నారదమహర్షి ప్రశ్నించగా బ్రహ్మ మిక్కిలి ప్రీతితో చెప్పియున్నాడు (3).

బ్రహ్మోవాచ |

కమలైర్బిల్వపత్రైశ్చ శతపత్రైస్తథా పునః | శంఖపుషై#్పస్తథా దేవం లక్ష్మీకామోsర్చయేచ్ఛివమ్‌ || 4

ఏతైశ్చ లక్ష సంఖ్యాకైః పూజితశ్చేద్భవేచ్ఛివః | పాపహానిస్తథా విప్ర లక్ష్మీ స్స్యాన్నాత్ర సంశయః || 5

వింశతిః కమలానాం తు ప్రస్థమేకముదాహృతమ్‌ | బిల్వో దలసహస్రేణ ప్రస్థార్థం పరిభాషితమ్‌ || 6

శతపత్రసహస్రేణ ప్రస్థార్థం పరిభాషితమ్‌ | పలైష్షోడశభిః ప్రస్థః పలం టంక దశః స్మృతః || 7

అనేనైవ తు మానేన తులామారోపయేద్యదా |సర్వాన్కామానవాప్నోతి నిష్కామశ్చేచ్ఛివో భ##వేత్‌ || 8

సంపదలను కోరు భక్తుడు శివదేవుని కమలములతో, బిల్వపత్రములతో, పద్మములతో, మరియు శంఖపుష్పములతో అర్చించవలెను (4). 

హే మహర్షీ! లక్ష సంఖ్య గల ఈ పుష్పములతో శివుని అర్చించినచో, పాపములు పోవుటయే గాక , సంపదలు కలుగుననుటలో సందియము లేదు (5). 

ఇరువది కమలములకు ఒక ప్రస్థము అని పేరు. వేయి బిల్వ దళములకు అర్థప్రస్థమను వాడుక (6). 

వేయి పద్మములు అర్థప్రస్థమగును. పది టంకములు ఒక పలమనియు, పదునారు పలములు ఒక ప్రస్థమనియు చెప్పబడినది (7). 

భక్తుడు ఈ మానముతో పుష్పములను తూచి శివునకు సమర్పించినచో, కోర్కెలన్నియూ ఈడేరును. భక్తుడు కామనలు లేనివాడైనచో శివస్వరూపుడగును (8).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 45 🌹*
Chapter 13
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

*🌻 THE DRAMA OF CREATION - 1 🌻*

The drama of creation is the pull between INFINITE CONSCIOUSNESS and INFINITE UNCONSCIOUSNESS.  

It is in this drama that we find ourselves caught in between. On the stage of the drama of creation, everyone and everything play their roles as actors, not knowing that they are actors.  

They are unconscious and in ignorance and they become one with their role, and therefore they exhibit only ignorance, doing every thing unconsciously. INFINITE CONSCIOUSNESS descends into INFINITE UNCONSCIOUSNESS in the form of the Avatar.  

The Avatar becomes everyone and everything, but he kn ows this, and therefore, while he is in the creation of INFINITE UNCONSCIOUSNESS he expresses Knowledge.  

This very expression of Knowledge, that is infinitely conscious, diminishes ignorance at every level of consciousness in the INFINITE UNCONSCIOUSNESS. 

Thus, there is a vast difference between the Avatar's becoming of everyone and everything, and the becoming of everything and everyone as everything and everyone.  

The Avatar is INFINITE CONSCIOUSNESS, and when he becomes everyone and everything, INFINITE CONSCIOUSNESS merges with Its own INFINITE UNCONSCIOUSNESS.  

But when everything and everyone are becoming everything and everyone, the consciousness of everything and everyone is being absorbed by the INFINITE UNCONSCIOUSNESS. 

Everyone and everything do n ot become what they actually are, drops of INFINITE CONSCIOUSNESS.  

They remain what they are not, drops of INFINITE UNCONSCIOUSNESS. Everyone and everything exist thereby out of ignorance.  

Therefore, their becoming is not becoming (they remain unconscious ) but acting motivated by the very forces of ignorance which are infinitely unconscious.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 41 🌹*
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 18
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. స్వాయంభువ వంశ వర్ణనము - 1 🌻*

అథ అష్టాదశోధ్యాయః

స్వాయమ్భువవంశవర్ణనమ్‌

అగ్ని రువాచ :

ప్రియవ్రతోత్తానపాదౌ మనః స్వాయమ్భువః సుతౌ | అజీజనత్సుతాం రమ్యాం శతరూపాం తపోన్వితామ్‌. 1

కామ్యాం కర్దమ భార్యాతః సమ్రాట్‌ కుక్షిర్విరాట్‌ ప్రభుః |

స్వాయంభువమనువు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కుమారులను, తపఃవాలిని యగు శతరూప యను సుందరి యగు కుమార్తెను జనింపచేసెను.

సురుచ్యాముత్తమో జజ్ఞీ పుత్ర ఉత్తానపాదతః 2

సునీత్యాం తు ధ్రువః పుత్రస్తపస్తే పే స కీర్తయే | ధ్రువో వర్షసహస్రాణి త్రీణి దివ్యాని హే మునే. 3

ఉత్తానపాదుని వలన సురుచియందు ఉత్తము డను పుత్రుడును, సునీతయందు ధ్రువు డను పుత్రుడును జనించిరి. ఓ మునీ ! ధ్రువుడు, కీర్తికొరకై, మూడు వేల దివ్యవర్షములపాటు తపస్సు చేసెను.

తస్త్మె ప్రీతో హరిః ప్రాదాన్మున్యగ్రే స్థానకం స్థిరమ్‌ |

శ్లోకం పపాఠ హ్యుశనా వృద్ధిం దృష్ట్వా స తస్య చ 4

అహో7స్య తపసో వీర్యమహో శ్రుతమహాద్భుతమ్‌ | యమద్య పురతః కృత్వా ద్రువం సప్తర్షయఃస్థితాః. 5

ఆతని విషయమున సంతసించిన విష్ణువు ఆతనికి సప్తర్షులకంటె ముందు స్థిర మైన స్థానము నిచ్చెను. ఆతని అభివృద్దిని చూచి ఉశనుడు ఒక శ్లోకమును (ప్రశంసావాక్యమును) చదివెను. ''ఈతని తపస్సుయొక్క ప్రభావము ఎంత గొప్పది! ఈతని శాస్త్రజ్ఞాన మెంత అద్భుత మైనది! సప్తర్షులు కూడ ఈతని తమ ఎదుట నిలుపుకొని యున్నారు కదా!

తస్మాచ్ఛిష్టిశ్చ భవ్యశ్చ ధ్రువాచ్చమ్భుర్వ్యజాయత | శిష్టేరాదత్త సుచ్ఛాయా పఞ్చ పుత్రానకల్మషాన్‌. 6

రిపుం రిపుఞ్జయం రిప్రం వృకలం వృకతేజసమ్‌ | రిపోరాధత్త బృహతీ చాక్షుషం సర్వతేజసమ్‌. 7

ధ్రుపునకు శిష్ట, భవ్యుడు శంభవు అను కుమారులు జనించిరి. శిషికి సుచ్ఛాయవలన, రిపువు. రిపుంజయుడు, రిప్రుడు, వృకలుడు, వృకతేజసుడు అను పుణ్యాత్ములైన కుమారులు జనించిరి. రిపువుకు బృహతియందు చాక్షుషుడు, సర్వతేజసుడు అను పుత్రులు జనించిరి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 56 🌹*
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. అంగిరసమహర్షి - శ్రద్ధ - 1 🌻*

*🌴. గ్రంధాలు: అంగిరస్మృతి, బృహదంగిరస్మృతి, మధ్యమాంగిరస్మృతి,*

*🌻. జ్ఞానం :*

1. బ్రహ్మగారి బుద్ధిలోంచి పుట్టినవారు అంగిరసమహర్షి. బ్రహ్మగారు ఆయనతో, “నా మానసపుత్రులలో నీవు మూడవ వాడివి. నీవు నా దయకు పాత్రుడివై నేనెప్పుడు స్మరిస్తే అప్పుడు నా దగ్గరికివచ్చి నేను చెప్పేదానిని చేస్తూ ఉండటమే నీ ఉద్యోగం. లోకక్షేమమే నీ కర్తవ్యం. లోకానికి ఏది క్షేమమని నేను అంటానో ఆ పని నీవు చెయ్యి. లోక క్షేమం కొరకు నేను ఆదేశించిన సమయానికి నీవు వివాహితుడవై సంసారంలో ప్రవేసించు” అని చెప్పాడు.

2. అంగిరసమహర్షి కర్దమప్రజాపతి కుమార్తె అయిన శ్రద్ధను ధర్మపత్నిగా స్వీకరించి గృహస్థజీవనంలో ప్రవేశించాడు. ఆ సంసారయాత్ర మోక్షలక్ష్మిని చేరుకోవటానికి ప్రయాణమేకాని, భౌతికమయిన లాలసతో కూడుకున్నటువంటి యాత్ర కాదు. ఇంద్రియవాంఛాప్రవృత్తులకు, లోభాదులకు అతీతులై నియమంతో, నిగ్రహంతో, తపస్సులో సంసారయాత్ర చేసారు వాళ్ళు. జగమంతా ఈశ్వరమై గోచరించింది వాళ్ళకు. ఇంద్రియములు, కర్మలు అన్నీ కూడా ఈశ్వరమయఒంగా చూసారు. ప్రశాంతచిత్తులై ఉన్నారు. గృహస్థజీవనాన్నికూడా తపస్సుగా భావించారు వాళ్ళు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 Seeds Of Consciousness - 121 🌹*
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

*🌻 Consciousness into Awareness 🌻*

Q: How does one go beyond consciousness into awareness?

M: Since it is awareness that makes consciousness possible, there is awareness in every state of consciousness. Therefore the very consciousness of being conscious is already a movement in awareness. 

Interest in your stream of consciousness takes you to awareness. It is not a new state. It is at once recognised as the original, basic existence, which is life itself, and also love and joy.

Q: Since reality is all the time with us, what does self-realisation consist of?

M: Realisation is but the opposite of ignorance. To take the world as real and one’s self as unreal is ignorance. The cause of sorrow. 

To know the self as the only reality and all else as temporal and transient is freedom, peace and joy. It is all very simple. Instead of seeing things as imagined, learn to see them as they are. 

It is like cleansing a mirror. The same mirror that shows you the world as it is, will also show you your own face. The thought 'I am' is the polishing cloth. Use it
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మనోశక్తి - Mind Power - 59 🌹*
 *Know Your Infinite Mind*
*🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴*
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. Q 54 :--నేను, పూర్ణాత్మ, అంశాత్మ - 2 🌻*

4) ఒక అంశాత్మ జ్ఞానాన్ని విస్తరింపచేసుకుంటే అది పూర్ణాత్మ కు అంశాత్మ కు విస్తరణ అవుతుంది. అనగా అంశాత్మ ప్రగతి పూర్ణాత్మ ప్రగతి అవుతుంది.

5) కోటానుకోట్ల పూర్ణాత్మ లు మూలచైతన్యం నుండి ఉద్భవించాయి. మూలచైతన్యం విశ్వమంతా వ్యాపించి ఉంది. చైతన్య పరిణామం చెందుతూ ఉంది.

6) నక్షత్రాలుగా, గ్రహాలుగా, సూర్యుళ్ళుగా, సముద్రాలుగా, పర్వతాలుగా, జీవరాసులన్నింటిలో ఆత్మశకలాలుగా విడగొట్టబడి ఉంది మూలచైతన్యం. 

పూర్ణాత్మలు నుండి అంశాత్మలు మరియు అంశాత్మలు నుండి పూర్ణాత్మలుగా సృష్టి ఆనంతకాలం కొనసాగుతూనే వుంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 4 🌹* 
 📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. కాలజ్ఞానంలో చెప్పినవి – ఇప్పటివరకు జరిగినవి 🌻*

1. కాశీ పట్న దేవాలయం నలభై రోజులు పాడుపడుతుంది అని భవిష్య వాణి చెప్పాడు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి. అది ఎలా నిజమయిందో చూద్దాం. 1910 – 12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్ళలేదు.

2. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది…. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాలపాటు మన దేశానికి ప్రధానిమంత్రిగా వున్నారు. తెరమీది బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. ప్రస్తుతం సినీ నటులు రాజకీయాల్లోకి విస్తృతంగా వస్తున్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంతకంటే ముందు సినిమా నటి. అలాగే మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సినీ రంగం నుంచి వచ్చినవారే! చిరంజీవి, విజయశాంతి, జమున- ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది తెరమీది నటులు రాజకీయాల్లో ప్రవేశించారు..

3. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ లేదు. ఆఖరికి జమీందారీ వ్యవస్థ కూడా నశించింది. ఉన్నదల్లా ప్రభుత్వము, మంత్రులూను. ఈ మంత్రులు వారసత్వం లాగా రారు. నిరంకుశత్వం ఉండదు. ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తేనే అధికారంలోకి వస్తారు. కనుక పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పిన మాట అక్షరాలా నిజమైంది.

4. ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు ఆకాశంలో పక్షి వాహనాలు నడుస్తాయని పోతులూరి చెప్పేనాటికి అసలు విమానమే పుట్టలేదు. పుష్పకవిమానం అంటూ పురాణ కధలు మాత్రం ఉన్నాయి. ప్రస్తుతం తరచుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విమాన ప్రమాదాల్లో ఎంతోమంది మరణిస్తున్నారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. సాయి తత్వం - మానవత్వం - 50 / Sai Philosophy is Humanity - 50 🌹*
🌴. అధ్యాయము - 7 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻. ఖండ యోగము 🌻*

1. బాబా తన శరీరావయవములన్నియు వేరుచేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచి పెట్టేవారు.

2. ఒకనాడొక పెద్దమనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట జూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూని చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను.

3. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసినవానికి ఆ విషయము గూర్చి కొంచెమైన తెలిసి యుండునని తననే అనుమానించెదరని భయపడి యూరకొనెను.

4. మరుసటి దినమతడు మసీదుకు పోగా, బాబా యెప్పటివలె హాయిగా కూర్చొనియుండుట చూచి యాశ్చర్యపడెను.

5. ముందు దినము తాను చూచిన దంతయు భ్రాంతియనుకొనెను.

6. చిరుప్రాయమునుండి బాబా వివిధ యోగప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి యెవ్వరికిని అంతుబట్టనిది.

7. రోగులవద్దనుంచి డబ్బు పుచ్చుకొనక యుచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్ధులు వారి యనుగ్రహమువల్ల స్వస్థత పొందిరి.

8. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతముకొరకు ఏమియు చేయక, యితరుల మేలుకొరకే యెల్లప్పుడు పాటుపడేవారు.

9. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసికొని ఆ బాధను తామనుభవించేవారు. అటువంటి సంఘటననొకదానిని యీ దిగువ పేర్కొందును.

10. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్థ్రహృదయము విదితమగును.

🌹. Sai Philosophy is Humanity - 50 🌹
Chapter 7
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻. KHANDA YOGA: 🌻

In this practice, Baba extracted the various limbs from His body, and left them separately at different places in the Masjid. 

Once, a gentleman went to the Masjid, and saw the limbs of Baba lying separately at separate places.

 He was much terrified; and he first thought of running to the village officers, and informing them of Baba being hacked to pieces and murdered.

 He thought that he would be held responsible, as he was the first informant, and knew something of the affair. So he kept silent.

 But next day when he went to the masjid, he was very much surprised to see Baba, hale and hearty and sound, as before. He thought, that what he had seen the previous day, was only a dream.

Baba practised Yoga since, His infancy and nobody knew or guessed the proficiency He attained. 

He charged no fees for His cures, became renowned and famous by virtue of His merits, gave health to many a poor and suffering person. 

This famous Doctor of doctors cared not for His interests, but always worked for the good and welfare of others, Himself suffering unbearable and terrible pain many a time in the process. 

One such instance, I give below, which will show the all-pervasive and most merciful character of Sai Baba.
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹