🌹 01, DECEMBER 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹

🍀🌹 01, DECEMBER 2023 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 01, DECEMBER 2023 FRIDAY శుక్రవారం, బృగు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 465 / Bhagavad-Gita - 465 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 51 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 51 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 821 / Sri Siva Maha Purana - 821 🌹
🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 2 / The Vanishing of Viṣṇu’s delusion - 2 🌻 
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 78 / Osho Daily Meditations  - 78 🌹
🍀 78. ప్రాంగణంలో  చీకటిమాను / 78. CYPRESS IN THE COURTYARD 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 506 / Sri Lalitha Chaitanya Vijnanam - 506 🌹 
🌻 506. 'శూలాద్యాయుధ సంపన్నా' / 506. Shuladyayudha sanpanna 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 01, డిసెంబరు, DECEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*
 
*🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 19 🍀*

*35. ఈషణాత్రయనిర్ముక్తా సర్వరోగవివర్జితా ।*
*యోగిధ్యానాంతగమ్యా చ యోగధ్యానపరాయణా ॥*
*36. త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంతజ్ఞానరూపిణీ ।*
*భారతీ కమలా భాషా పద్మా పద్మవతీ కృతిః ॥*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : దృఢమైన పునాది - మన ప్రకృతి ఎంత మహాజటిలమో మనం తెలుసుకోవాలి. ఏయే శక్తులు దానిని నడుపుతున్నాయో స్పష్టంగా చూడ నేర్చుకోవాలి. విజ్ఞతా పూర్వకమైన నియమనంతో దానిని స్వాధీనానికి తెచ్చుకోవాలి. యోగ సాధనకు పడవలసిన దృఢమైన పునాదిలో ఇదియొక ముఖ్యాంశం. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
కార్తీక మాసం
తిథి: కృష్ణ చవితి 15:33:40 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: పునర్వసు 16:42:06
వరకు తదుపరి పుష్యమి
యోగం: శుక్ల 20:03:13 వరకు
తదుపరి బ్రహ్మ
కరణం: బాలవ 15:35:40 వరకు
వర్జ్యం: 03:51:30 - 05:34:06
మరియు 25:25:40 - 27:10:36
దుర్ముహూర్తం: 08:43:41 - 09:28:23
మరియు 12:27:09 - 13:11:51
రాహు కాలం: 10:41:01 - 12:04:49
గుళిక కాలం: 07:53:24 - 09:17:12
యమ గండం: 14:52:25 - 16:16:13
అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26
అమృత కాలం: 14:07:06 - 15:49:42
సూర్యోదయం: 06:29:36
సూర్యాస్తమయం: 17:40:01
చంద్రోదయం: 21:14:35
చంద్రాస్తమయం: 10:00:02
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 16:42:06 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 465 / Bhagavad-Gita - 465 🌹*
✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 51 🌴*

*51. అర్జున ఉవాచ*
*దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్ధన |*
*ఇదానీమస్మి సంవృత్త: సచేతా: ప్రకృతిం గత: ||*

*🌷. తాత్పర్యం : ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్యరూపమును గాంచినంత ఇట్లు పలికెను: ఓ జనార్ధనా! అత్యంత సుందరమైన ఈ నీ మానవరూపమును గాంచి శాంతచిత్తుడవై నా సహజస్వభావమును పొందితివి.*

*🌷. భాష్యము : దేవదేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడని ఈ శ్లోకమునందలి “మానుషం రూపం” అను పదము స్పష్టముగా తెలుపుచున్నది. శ్రీకృష్ణుడు సామాన్యమానవుడే యనెడి భావనలో ఆ దేవదేవుని అపహాస్యము చేయువారు అతని దివ్యస్వభావమును ఎరుగనివారని ఇచ్చట నిరూపించబడినది. శ్రీకృష్ణుడు సాధారణ మానవుడే యైనచో తొలుత విశ్వరూపమును, ఆ పిదప చతుర్భుజనారాయణ రూపమును చూపుట అతనికెట్లు సాధ్యమగును?*

*కనుక శ్రీకృష్ణుని సామాన్యమావవునిగా భావించుచు, నిరాకరబ్రహ్మమే శ్రీకృష్ణునిలో నుండి పలుకుచున్నదని వ్యాఖ్యానించుచు పాఠకుని తప్పుద్రోవ పట్టించువారు నిక్కము జనులకు గొప్ప అన్యాయము చేసిన వారగుదురు. ఈ విషయమే భగవద్గీత యందు ఇచ్చట స్పష్టముగా తెలుప బడినది. శ్రీకృష్ణుడు వాస్తవముగా విశ్వరూపమును మరియు చతుర్భుజనారాయణ రూపమును ప్రదర్శించినపుడు సామాన్యమానవుడెట్లు కాగలడు? శుద్ధభక్తుడైనవాడు సత్యదర్శియైనందున అట్టి తప్పుద్రోవ పట్టించు గీతావ్యాఖ్యానములచే కలతను పొందడు. భగవద్గీత యందలి మూలశ్లోకములు సూర్యుని భాతి సుస్పష్టములు. మూర్ఖవ్యాఖ్యాతల దీపపు వెలుగు వాటికి ఏమాత్రము అవసరము లేదు.*
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 465 🌹*
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 51 🌴*

*51. arjuna uvāca*
*dṛṣṭvedaṁ mānuṣaṁ rūpaṁ tava saumyaṁ janārdana*
*idānīm asmi saṁvṛttaḥ sa-cetāḥ prakṛtiṁ gataḥ*

*🌷 Translation : When Arjuna thus saw Kṛṣṇa in His original form, he said: O Janārdana, seeing this humanlike form, so very beautiful, I am now composed in mind, and I am restored to my original nature.*

*🌹 Purport : Here the words mānuṣaṁ rūpam clearly indicate the Supreme Personality of Godhead to be originally two-handed. Those who deride Kṛṣṇa as if He were an ordinary person are shown here to be ignorant of His divine nature. If Kṛṣṇa is like an ordinary human being, then how is it possible for Him to show the universal form and again to show the four-handed Nārāyaṇa form? So it is very clearly stated in Bhagavad-gītā that one who thinks that Kṛṣṇa is an ordinary person and who misguides the reader by claiming that it is the impersonal Brahman within Kṛṣṇa speaking is doing the greatest injustice.*

*Kṛṣṇa has actually shown His universal form and His four-handed Viṣṇu form. So how can He be an ordinary human being? A pure devotee is not confused by misguiding commentaries on Bhagavad-gītā because he knows what is what. The original verses of Bhagavad-gītā are as clear as the sun; they do not require lamplight from foolish commentators.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 820 / Sri Siva Maha Purana - 820 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 26 🌴*

*🌻. విష్ణువు యొక్క మోహమును తొలగించుట - 2 🌻*

*దేవతలిట్లు పలికిరి - ఓ మహాదేవా! నీవు శత్రువుల వలన కలిగిన భయమునుండి దేవతలను రక్షించితివి. కాని ఇపుడు మరియొక సమస్య ఉదయించినది. దాని విషయములో మేము ఏమి చేయవలెను? (8) ఓ ప్రభూ! విష్ణువు ప్రయత్నపూర్వకముగా బృందను మోహింపజేయగా, ఆమె వెంటనే అగ్నిలో భస్మమై సరమగతిని పొందినది (9). బృందయొక్క సౌందర్యముచే భ్రమితుడైన విష్ణువు మోహమును పొంది యున్నాడు. నీ మాయచే విశేషముగా మోహమునుపొంది యున్న విష్ణువు ఆమె యొక్క చితాభస్మను ధరించుచున్నాడు (10). మేము సిద్ధుల, మహర్షుల సంఘములతో గూడి ఆతనికి సాదరముగా బోధించితిమి. కాని నీ మాయచే విశేషముగా మోహితుడై యున్న ఆ విష్ణువు జ్ఞానమును పొందుట లేదు (11). ఓ మహేశ్వరా! నీవు దయను చూపి విష్ణువునకు బోధించుము ; బోధించుము. ప్రకృతినుండి పుట్టిన స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తు అంతయూ నీ ఆధీనములో నున్నది (12).*

*సనత్కుమారుడిట్లు పలికెను - గొప్ప లీలలు గలవాడు, స్వతంత్రుడు అగు మహేశుడు దేవతల ఈ మాటలను విని చేతులు జోడించి నమస్కరించుచున్న వారికి ఇట్లు బదులిడెను (13).*

*మహేశుడిట్లు పలికెను - ఓ బ్రహ్మా! సర్వదేవతలారా! నా మాటను శ్రద్ధతో వినుడు. సర్వప్రాణులను మోహింపజేయు నా మాయ దాట శక్యము కానిది (14). దేవతలు, మానవులు, మరియు రాక్షసులతో సహా జగత్తు అంతయు దానికి లోబడి యున్నది. పాపహారియగు విష్ణువు దానిచేతనే మోహింపబడిన వాడై కామమునకు వశుడైనాడు (15).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 820 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 26 🌴*

*🌻 The Vanishing of Viṣṇu’s delusion - 2 🌻*

The gods said:—
8. “O great lord, all the gods have been saved by you from the danger of the enemy but another event has happened. What shall we do in that respect?

9. O lord, Vṛndā was fascinated by Viṣṇu. She burnt herself on the pyre and attained the great goal.

10. But Viṣṇu deluded by your illusion is excessively agitated by the beauty of Vṛndā. He has smeared himself with the ashes from her pyre.

11. Although advised and consoled by the Siddhas and sages, and pacified by us with respect, Viṣṇu deluded by your illusion does not come to his former self.

12. O lord Śiva, be pleased. Restore Viṣṇu to his former self. This entire creation born of Prakṛti and consisting of the mobile and immobile beings, is subservient to you”.

Sanatkumāra said:—
13. On hearing these words of the gods, lord Śiva of great sports and free to act as he pleases replied to them as they stood with palms joined in reverence.

Lord Śiva said:—
14. O Brahmā, O gods, you listen to my words attentively. My illusion deludes all the worlds. It cannot be transgressed.

15. The entire universe including gods and human beings is subservient to it. Viṣṇu too was deluded by that illusion and became a prey to the lustful love.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 78 / Osho Daily Meditations  - 78 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 78. ప్రాంగణంలో  చీకటిమాను 🍀*

*🕉. ఈ క్షణమే నిజమైన మతం అంటే. కాబట్టి మీరు విచారంగా ఉంటే, అది ప్రాంగణంలో ఉన్న చీకటిమాను. దానిని చూడండి. ఇక చేసేదేమీ లేదు. 🕉*

*జెన్ మాస్టర్ చౌ చౌ గురించి చాలా ప్రసిద్ధ కథ ఉంది. ఒక సన్యాసి అడిగాడు, 'నిజమైన మతం అంటే ఏమిటి?' అది పౌర్ణమి రాత్రి మరియు చంద్రుడు ఉదయిస్తున్నాడు. మాస్టర్ చాలా సేపు మౌనంగా ఉండిపోయారు; అతను ఏమీ అనలేదు. ఆపై అకస్మాత్తుగా అతను స్పృహలోకి వచ్చి, 'ప్రాంగణంలోని చీకటిమానుని చూడు' అన్నాడు. అందమైన చల్లగాలి వీస్తూ, చీకటిమాను చెట్టుతో ఆడుకుంటూ, చంద్రుడు కొమ్మ పైకి వచ్చాడు. ఇది అందంగా, అపురూపంగా ఉంది. ఇంత అందంగా ఉండటం దాదాపు అసాధ్యం. కానీ సన్యాసి, 'ఇది నా ప్రశ్న కాదు. నేను ప్రాంగణంలోని చీకటిమాను గురించి, చంద్రుని గురించి లేదా దాని అందం గురించి అడగడం లేదు.*

*నా ప్రశ్నకు దీనికి సంబంధం లేదు. అసలు మతం అంటే ఏమిటి అని అడుగుతున్నాను. నా ప్రశ్న మర్చిపోయావా?' మాస్టారు మళ్ళీ చాలాసేపు మౌనంగా ఉండిపోయారు. అప్పుడు మళ్లీ స్ప్రుహలోకి వచ్చి, 'ప్రాంగణంలో ఉన్న చీకటిమానుని చూడు' అన్నాడు. నిజమైన మతం ఇక్కడ మరియు ఇప్పుడు కలిగి ఉంటుంది. ఈ క్షణం యొక్క వాస్తవమే నిజమైన మతం అంటే. కాబట్టి మీరు విచారంగా ఉంటే, అది ప్రాంగణంలో ఉన్న చీకటిమానే. ఇటు చూడు... అటు చూడు. ఇక చేసేదేమీ లేదు. ఆ దృష్టితో ఎన్నో రహస్యాలు బహిర్గతం అవుతాయి. ఇది చాలా తలుపులు తెరుస్తుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 78 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 78. CYPRESS IN THE COURTYARD 🍀*

*🕉  The fact if this moment is what true religion is all about. So if you are feeling sad, then that is the cypress in the courtyard Look at it ... just look at it. There is nothing else to be done.  🕉*

*There is a very famous story about a Zen master, Chou Chou. A monk asked him, "What is true religion?" It was a full-moon night and the moon was rising. The master remained silent for a long time; he didn't say anything. And then suddenly he came to life and said, "Look at the cypress in the courtyard." A beautiful cool breeze was blowing and playing with the cypress and the moon had just come above the branch. It was beautiful, incredible. It was almost impossible that it could be so beautiful. But the monk said, "This was not my question. I'm not asking about the cypress in the courtyard, or about the moon or its beauty.*

*My question has nothing to do with this. I am asking what true religion is. Have you forgotten my question?" The master again remained silent for a long time. Then again he came to life and said, "Look at the cypress in the courtyard." True religion consists of the here and now. The fact of this moment is what true religion is all about. So if you are feeling sad, then that is the cypress in the courtyard. Look at it ... just look at it. There is nothing else to be done. That very look will reveal many mysteries. It will open many doors.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 506 / Sri Lalitha Chaitanya Vijnanam  - 506 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  104. స్వాధిష్ఠానాంబుజగతా, చతుర్వక్త్ర మనోహరా ।*
*శూలాద్యాయుధ సంపన్నా, పీతవర్ణా,ఽతిగర్వితా ॥ 104 ॥ 🍀*

*🌻 506. 'శూలాద్యాయుధ సంపన్నా' 🌻*

*స్వాధిష్ఠాన దేవతగ శ్రీమాత త్రిశూలము, పాశము, కపాలమును, అభయ ముద్రలను కలిగి యుండునని అర్ధము. పై తెలిపినవి ఆమె ఆయుధములు. త్రిశూలముతో రాక్షస ప్రవృత్తిని సంహరించును. పాశముతో అజ్ఞాన ప్రవృత్తిని బంధించును. కపాలముతో శాశ్వతత్త్వము గోచరించును. అభయముద్రతో శిష్టుల కభయమిచ్చును.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 506  🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻104. Svadhishtananbujagata chaturvaktra manohara*
*shuladyayudha sanpanna pitavarna tigarvita ॥ 104 ॥ 🌻*

*🌻 506. Shuladyayudha sanpanna  🌻*

*It means that Swadhisthana deity Srimata has trident, nose, skull and abhaya mudras. The above are her weapons. Kills the demonic instinct with the trident. Binds the ignorant instinct with the noose. Eternity is seen with the skull. With the seal of Abhayamudra, she will protect the righteous.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 178 - 2 : 3-16. asanasthah sukham hrade nimajjati - 2 / శివ సూత్రములు - 178 - 2 : 3-16. ఆసనస్థః సుఖం హృదే నిమజ్జతి - 2


🌹. శివ సూత్రములు - 178 - 2 / Siva Sutras - 178 - 2 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

3వ భాగం - ఆణవోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 3-16. ఆసనస్థః సుఖం హృదే నిమజ్జతి - 2 🌻

🌴. ఏకాగ్రతలో ఉండి, పరాశక్తి సహాయంతో తన మనస్సును తనపై దృఢంగా నిలబెట్టి, అప్రయత్నంగా స్వచ్ఛమైన చైతన్య సరస్సులో మునిగిపోవాలి. 🌴


అటువంటి అభిలాషి, తన స్పృహ యొక్క అత్యున్నత స్థాయిలో (ఆసన) కూర్చోవడం ద్వారా, ఆ స్థితిలో తనను తాను సులభంగా స్థాపించుకుంటాడు. మరో మాటలో చెప్పాలంటే, అతను ఎటువంటి యోగ భంగిమలు లేదా శ్వాస నియంత్రణ, ధ్యాన అభ్యాసాలు లేదా ఏ రకమైన బాహ్య ప్రేరణలు లేకుండా అత్యున్నత స్థాయి స్పృహతో ఐక్యంగా ఉంటాడు. ఎందుకంటే అతను అత్యున్నత స్థాయి స్పృహతో శాశ్వతంగా సంబంధం కలిగి ఉన్నాడు. భగవంతుని స్పృహ నుండి ఎటువంటి విభజన లేకుండా ఉండేలా అతను చూసుకుంటాడు. అతను అత్యున్నతం నుండి తన స్పృహను ఉపసంహరించు కోకుండానే, సాధారణ మానవుని అన్ని చర్యలను కూడా చేస్తాడు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 178 - 2 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 3 - āṇavopāya

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 3-16. āsanasthah sukham hrade nimajjati - 2 🌻

🌴. Abiding in concentration, with his mind firmly fixed upon the self by the power shakti, he should effortlessly sink into the lake of pure consciousness. 🌴

Such an aspirant, by continuing to be seated (āsana) on the highest level of his consciousness, establishes himself with ease in that state. In other words, he stands united with the highest level of consciousness without any yogic postures or breath control, meditative practices or any type of external stimulations. This is because he is perpetually associated with the highest level of consciousness. He ensures that there is no disconnectedness from God consciousness. He does all the acts of a normal human being without withdrawing his consciousness from the Ultimate.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


DAILY WISDOM - 176 : 24. We Try to Subjugate Nature / నిత్య ప్రజ్ఞా సందేశములు - 176 : 24. మనము ప్రకృతిని లొంగదీసుకోవడానికి . . .



🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 176 / DAILY WISDOM - 176 🌹

🍀 📖 జ్ఞానం యొక్క కాంతి పుస్తకం నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 24. మనము ప్రకృతిని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాము 🌻


మనము ప్రకృతిని ఉపయోగించుకోవడానికి, జయించడానికి, అధిగమించడానికి మరియు లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఇది మనం అవలంబించిన చాలా పనికిరాని పద్ధతి! ప్రకృతిని మనం లొంగదీసుకునే లేదా అనుమానాస్పదమైన దృక్పథంతో సమీపించామంటే ఆ క్షణమే మనల్ని దూరంచేస్తుంది. ఎవరూ అనుమానంతో మనల్ని సంప్రదిచడానికి ప్రయత్నిస్తే ఇష్టపడరు. అది విజయవంతం కావాలంటే మన విధానం సానుభూతితో కూడినదై ఉండాలి ఈ సమయం వరకు మన శాస్త్రవేత్తలు ప్రకృతిని ఎలా సంప్రదించారో చూపించడానికి నేను ఇప్పుడు మనల్ని దశలవారీగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాను. ఖగోళ శాస్త్రవేత్తకు, ప్రకృతి వైవిధ్యభరితమైన వస్తువులతో ఏర్పడినట్లుగా కనిపిస్తుంది. అతను విషయాలను అవి కనిపించే విధంగా తీసుకున్నాడు.

ప్రతి నక్షత్రం మరియు ప్రతి గ్రహం విడివిడిగా ఉన్నాయి మరియు ఒకదానికొకటి మధ్య సంబంధాలు లేవు. ఖగోళ శాస్త్రం యొక్క అసలైన విధానం విషయాల వైవిధ్యం యొక్క వైఖరిలో ఒకటి. భౌతిక ఇంద్రియాలకు కనిపించే విధంగా అధిభూతం లేదా బాహ్య ప్రపంచం దర్శించ బడింది. . ఈ విధానం విశ్వాన్ని కేవలం భౌతిక వస్తువుగా చూసే జ్ఞానాన్ని తీసుకు వచ్చింది, అయితే అంతిమ ప్రశ్నలకు సమాధానం లేదు. పర్యవసానంగా, ప్రపంచం మనకు చాలా దూరంగా, కేవలం దృశ్య అనుభవంగా మాత్రమే తెలుస్తోంది.



కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 176 🌹

🍀 📖 In the Light of Wisdom 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 24. We Try to Subjugate Nature 🌻


We try to utilise, conquer, overcome and subjugate nature. This is a very untactful method which we have adopted! Nature puts us off the moment we approach it in a conquering spirit or in a suspicious attitude. Nobody wishes to be approached with suspicion. Our approach should be sympathetic, if it is going to be successful. I will now try to take us step by step to show how nature has been approached by our scientists up until this time. For the astronomer, nature appeared to be constituted of diversified objects, and he took things as they appeared.

Each star and each planet was separate, and there were no connections between one and the other. The original approach of astronomy was one of an attitude of the diversity of things. The adhibhuta or the external world was approached as it appears to the physical senses. This approach brought a knowledge which saw the universe as merely a physical object, but the ultimate questions remained unanswered. As a consequence, the world remained distant and only empirically knowable.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 864 / Vishnu Sahasranama Contemplation - 864


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 864 / Vishnu Sahasranama Contemplation - 864 🌹

🌻 864. నియన్తా, नियन्ता, Niyantā 🌻

ఓం నియన్త్రే నమః | ॐ नियन्त्रे नमः | OM Niyantre namaḥ


వ్యవస్థాపయతి స్వేషు కృత్యేషు కేశవః ।
యో దేవస్స నియన్తేతి ప్రోచ్యతే విబుధోత్తమైః ॥

ఎల్ల ప్రాణులను తమ తమ కృత్యములయందు తగిన విధమున నిలుపు కేశవుడు నియంతా.



సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹





🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 864🌹

🌻864. Niyantā🌻

OM Niyantre namaḥ


व्यवस्थापयति स्वेषु कृत्येषु केशवः ।
यो देवस्स नियन्तेति प्रोच्यते विबुधोत्तमैः ॥

Vyavasthāpayati sveṣu kr‌tyeṣu keśavaḥ,
Yo devassa niyanteti procyate vibudhottamaiḥ.


Since Lord Keśava ordains and establishes all creatures in their respective functions, He is called Niyantā.



🌻 🌻 🌻 🌻 🌻



Source Sloka



धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दमः ।
अपराजितस्सर्वसहो नियन्ता नियमो यमः ॥ ९२ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా దమః ।
అపరాజితస్సర్వసహో నియన్తా నియమో యమః ॥ 92 ॥

Dhanurdharo dhanurvedo daṇḍo damayitā damaḥ,
Aparājitassarvasaho niyantā niyamo yamaḥ ॥ 92 ॥


Continues....

🌹 🌹 🌹 🌹🌹




కపిల గీత - 272 / Kapila Gita - 272


🌹. కపిల గీత - 272 / Kapila Gita - 272 🌹

🍀. కపిల దేవహూతి సంవాదం 🍀

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌴 7. మానవజన్మను పొందే జీవుని గతిని వర్ణించుట - 03 🌴

03. మాసేన తు శిరో ద్వాభ్యాం బాహ్వంఘ్ర్యాద్యంగ విగ్రహః|
నఖలోమాస్థి చర్మాణి లింగచ్ఛిద్రోద్భవస్త్రిభిః॥


తాత్పర్యము : ఒక నెలలో దానికి శిరస్సు ఏర్పడును. రెండు నెలలలో ఆ పిండమునకు కాళ్ళు, చేతులు మొదలగు అంగములు ఏర్పడును. మూడు నెలలలో గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, స్త్రీ పురుష చిహ్నములు, ఇతర రంధ్రములు ఏర్పడును.


వ్యాఖ్య :


సశేషం..

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Kapila Gita - 272 🌹

🍀 Conversation of Kapila and Devahuti 🍀

📚 Prasad Bharadwaj

🌴 7. Lord Kapila's Instructions on the Movements of the Living Entities - 03 🌴

03. māsena tu śiro dvābhyāṁ bāhv-aṅghry-ādy-aṅga-vigrahaḥ
nakha-lomāsthi-carmāṇi liṅga-cchidrodbhavas tribhiḥ



MEANING : In the course of a month, a head is formed, and at the end of two months the hands, feet and other limbs take shape. By the end of three months, the nails, fingers, toes, body hair, bones and skin appear, as do the organ of generation and the other apertures in the body, namely the eyes, nostrils, ears, mouth and anus.


PURPORT :


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


30 Nov 2023 : Daily Panchang నిత్య పంచాంగము


🌹 30, నవంబరు, NOVEMBER 2023 పంచాంగము - Panchangam 🌹

శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻

🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 31 🍀

61. పినాకీ శశిమౌలీ చ వాసుదేవో దివస్పతిః |
సుశిరాః సూర్యతేజశ్చ శ్రీగంభీరోష్ఠ ఉన్నతిః

62. దశపద్మా త్రిశీర్షశ్చ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ |
త్రిసమశ్చ త్రితాత్మశ్చ త్రిలోకశ్చ త్రయంబకః

🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : మానవుని అజ్ఞస్థితి - సర్వసామాన్యంగా మానవులకు తామెవరో తెలియదు. తమ సత్తలో ఏయే విభాగాలున్నాయో తెలుసుకోలేరు. మనోవృత్తిజ్ఞానం ద్వారా వారి కవి తెలియబడుతున్న హేతువుచేత అన్నిటినీ కలిపి మనస్సని పేర్కొంటూ వుంటారు. అందుచే తమ స్థితులు, చేష్టలు వారికి అవగాహన కావు. ఒక వేళ అయితే అది పై పైన మాత్రమే. 🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

శరద్‌ ఋతువు, దక్షిణాయణం,

కార్తీక మాసం

తిథి: కృష్ణ తదియ 14:26:29

వరకు తదుపరి కృష్ణ చవితి

నక్షత్రం: ఆర్ద్ర 15:03:06 వరకు

తదుపరి పునర్వసు

యోగం: శుభ 20:14:51 వరకు

తదుపరి శుక్ల

కరణం: విష్టి 14:29:28 వరకు

వర్జ్యం: -

దుర్ముహూర్తం: 10:12:38 - 10:57:21

మరియు 14:40:58 - 15:25:41

రాహు కాలం: 13:28:18 - 14:52:09

గుళిక కాలం: 09:16:44 - 10:40:35

యమ గండం: 06:29:02 - 07:52:53

అభిజిత్ ముహూర్తం: 11:42 - 12:26

అమృత కాలం: 04:35:45 - 06:15:57

సూర్యోదయం: 06:29:02

సూర్యాస్తమయం: 17:39:51

చంద్రోదయం: 20:18:40

చంద్రాస్తమయం: 09:08:54

సూర్య సంచార రాశి: వృశ్చికం

చంద్ర సంచార రాశి: జెమిని

యోగాలు: కాల యోగం - అవమానం

15:03:06 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

దిశ శూల: దక్షిణం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹