1) 🌹 03, SEPTEMBER 2023 SATURDAY ఆదివారం, భాను వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 423 / Bhagavad-Gita - 423 🌹
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 09 / Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 09 🌴
3) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 784 / Sri Siva Maha Purana - 784 🌹
🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 2 / The fight between the Gaṇas and the Asuras - 2 🌻
4) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 37 / Osho Daily Meditations - 37 🌹
🍀 37. భద్రత / 37. SECURITY 🍀
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 474 - 479 / Sri Lalitha Chaitanya Vijnanam - 474 - 479 🌹
🌻 474 నుండి 479 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 03, సెప్టెంబరు, SEPTEMBER 2023 పంచాంగము - Panchangam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : సంకష్టి చతుర్థి, Sankashti Chaturthi🌻*
*🍀. శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం - 22 🍀*
*43. ప్రాంశుర్విద్యోతనో ద్యోతః సహస్రకిరణః కృతీ |*
*కేయూరీ భూషణోద్భాసీ భాసితో భాసనోఽనలః*
*44. శరణ్యార్తిహరో హోతా ఖద్యోతః ఖగసత్తమః |*
*సర్వద్యోతో భవద్యోతః సర్వద్యుతికరో మతః*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : నిజ విశ్వాసము - రుజువు, జ్ఞానము కలుగక ముందు ఏర్పడి జ్ఞానోపలబ్ధికి తోడ్పడేది విశ్వాసం. భగవంతుడు ఉన్నాడనడానికి రుజువు లేదు, కాని, భగవంతుని యందు నాకు విశ్వాముంటే, పిమ్మట నేను భగవత్సాక్షాత్కారం పొందగలను. 🍀*
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: కృష్ణ చవితి 18:25:09 వరకు
తదుపరి కృష్ణ పంచమి
నక్షత్రం: రేవతి 10:40:02 వరకు
తదుపరి అశ్విని
యోగం: వృధ్ధి 27:11:46 వరకు
తదుపరి ధృవ
కరణం: బవ 07:33:47 వరకు
వర్జ్యం: 29:57:50 - 44:14:18
దుర్ముహూర్తం: 16:49:00 - 17:38:45
రాహు కాలం: 16:55:13 - 18:28:29
గుళిక కాలం: 15:21:57 - 16:55:13
యమ గండం: 12:15:25 - 13:48:41
అభిజిత్ ముహూర్తం: 11:51 - 12:39
అమృత కాలం: 25:24:54 - 39:41:22
సూర్యోదయం: 06:02:21
సూర్యాస్తమయం: 18:28:29
చంద్రోదయం: 21:03:40
చంద్రాస్తమయం: 09:04:54
సూర్య సంచార రాశి: సింహం
చంద్ర సంచార రాశి: మీనం
యోగాలు: వర్ధమాన యోగం - ఉత్తమ
ఫలం 10:40:02 వరకు తదుపరి
ఆనంద యోగం - కార్య సిధ్ధి
దిశ శూల: పశ్చిమం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 423 / Bhagavad-Gita - 423 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 09 🌴*
*09. సంజయ ఉవాచ*
*ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరి: |*
*దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరమ్ ||*
*🌷. తాత్పర్యం : సంజయుడు పలికెను :ఓ రాజా! యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు ఆ విధముగా పలికిన తదుపరి తన విశ్వరూపమును అర్జునునకు చూపెను.*
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 423 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 09 🌴*
*09. sañjaya uvāca*
*evam uktvā tato rājan mahā-yogeśvaro hariḥ*
*darśayām āsa pārthāya paramaṁ rūpam aiśvaram*
*🌷 Translation : Sañjaya said: O King, having spoken thus, the Supreme Lord of all mystic power, the Personality of Godhead, displayed His universal form to Arjuna.*
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 784 / Sri Siva Maha Purana - 784 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 20 🌴*
*🌻. రుద్రగణములతో రాక్షసుల యుద్ధము - 2 🌻*
*జలంధరుడిట్లు పలికెను- కాలనేమి, శుంభుడు, నిశుంభుడు మొదలగు రాక్షసవీరులందరు తమ సైన్యములతో గూడి బయలుదేరెదరు గాక! (9) కోటివీరకులమునందు పుట్టిన వారు, కంబు వంశజాతులు, దౌర్హృదులు, కాలకులు, కాలకేయులు, మౌర్యులు మరియు ధూమ్రులు కూడ బయల్వెడలెదరు గాక! (10) సముద్రపుత్రుడు, ప్రతాపవంతుడు అగు ఆ రాక్షసరాజు ఈ విధముగా ఆజ్ఞాపించి కోట్ల రాక్షసులతో చుట్టు వారబడి యున్నవాడై శీఘ్రముగా బయలు దేరెను (11). ఆతనికి ముందు శుక్రుడు మరియు తెగిన శిరస్సుతో కూడిన రాహువు నడిచిరి. అపుడాతని కిరీటము వేగము వలన జారి భూమిపై పడెను (12). ఆకాశమంతయు వర్షాకాలములో వలె మేఘములతో నిండి ప్రకాశించెను. గొప్ప ఉపద్రవమును సూచించే అపశకునములు అధికముగా బయలు దేరెను (13). ఆతని సైన్యోద్యోగమును పరికించిన ఇంద్రాదిదేవతలు అపుడాతనికి కానరాకుండా శంకరుని నివాసమగు కైలాసమునకు వెళ్లిరి (14). ఇంద్రాది దేవతలు అందరు అచటకు వెళ్లి శివుని దర్శించి తలలు వంచి నమస్కరించి చేతులు జోడించి స్తుతించిరి (15).*
*దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! నీకు నమస్కారమగు గాక! ఓ మహేశ్వరా! శరణు పొందిన మమ్ములను కాపాడుము (16). ఓ ప్రభూ! దేవేంద్రునితో సహా మేమందరము స్థాన భ్రష్టులమై భూమియందు నివసిస్తూ జలంధరుడు చేయుచున్న ఉపద్రవములచే చాల దుఃఖితులమై ఉన్నాము (17).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 784🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 20 🌴*
*🌻 The fight between the Gaṇas and the Asuras - 2 🌻*
Jalandhara said:—
9-10. Let all the Asuras such as Kālanemi and others set out with their entire divisions; Śumbha, Niśumbha and other heroes; the descendants of Koṭivīra, the scions of the family of Kambu. Daurhṛdas, Kalakas, Kālakeyas, Mauryas and Dhaumras—let all these start for the fight.
11. After ordering thus, the lord of the Asuras the valorous son of the ocean set out quickly accompanied by crores of Daityas.
12. Then Śukra and Rāhu with his head severed went ahead of him. In his quick jerky movement, his crown became dislodged and fell on the ground.
13. The sky was entirely enveloped by clouds as in the rainy season. Many ill omens occurred portending great slumber.
14. On seeing his enterprise, the gods including Indra went to Kailāsa, the abode of Śiva without being observed.
15. After going there and seeing Śiva, the gods including Indra, bowed to him with stooping shoulders. They joined their palms in reverence and eulogised.
The gods said:—
16. O great lord, lord of the gods, O Śiva the merciful, obeisance be to you. Save us who have sought refuge in you.
17. O lord, we are very much distressed by this harassment. All including Indra are deposed and compelled to stay on the earth.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 37 / Osho Daily Meditations - 37 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 37. భద్రత 🍀*
*🕉. ఎక్కడా భద్రత లేదు. జీవితం అసురక్షితమైనది మరియు దానికి ఎటువంటి ఆధారం లేదు - ఇది నిరాధారమైనది. 🕉*
*భద్రత కోసం అడగడంలోనే, మీరు సమస్యను సృష్టిస్తారు. మీరు ఎంత ఎక్కువ అడిగితే అంత అసురక్షితంగా ఉంటారు, ఎందుకంటే అభద్రత అనేది జీవిత స్వభావం. మీరు భద్రత కోసం అడగకపోతే, మీరు అభద్రత గురించి ఎప్పటికీ చింతించరు. చెట్లు పచ్చగా ఉంటాయి అనినంత సహజంగా జీవితంలో భద్రత ఉండదు అనవచ్చు. మీరు చెట్లు తెల్లగా ఉండాలని అడగడం ప్రారంభిస్తే, సమస్య తలెత్తుతుంది. సమస్య మీ వల్ల సృష్టించబడింది, చెట్ల వల్ల కాదు - అవి పచ్చగా ఉంటాయి కానీ మీరు వాటిని తెల్లగా ఉండమని అడుగుతారు! అవి ఆ విధంగా ఉండలేవు.*
*జీవితం అసురక్షితమైనది, ప్రేమ కూడా అంతే. అది అలా ఉండటం మంచిది. మీరు చనిపోయినప్పుడు మాత్రమే జీవితం సురక్షితంగా ఉంటుంది; అప్పుడు ప్రతిదీ ఖచ్చితంగా ఉంటుంది. ఒక రాయి కింద నేల ఉంది' ఒక పువ్వు కింద ఏదీ లేదు; పువ్వు అసురక్షితంగా ఉంది. చిన్న గాలితో పువ్వును చెదరగొట్టవచ్చు; రేకులు పడిపోవచ్చు మరియు అదృశ్యం కావచ్చు. అక్కడ పువ్వు ఉండటమే ఒక అద్భుతం. జీవితం ఒక అద్భుతం-ఎందుకంటే దానికి కారణం లేదు. మీరు ఉండటం ఒక అద్భుతం, లేకపోతే మీరు ఉండక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. మీరు దీన్ని అంగీకరించినప్పుడే మీకు పరిపక్వత వస్తుంది మరియు అంగీకరించడమే కాదు, దానిలో సంతోషించడం ప్రారంభించండి.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 37 🌹*
📚. Prasad Bharadwaj
*🍀 37. SECURITY 🍀*
*🕉 There is no security anywhere. Life is insecure, and there is no ground to it-it is groundless. 🕉*
*In the very asking for security, you create the problem. The more you ask the more insecure you will be, because insecurity is the very nature of life. If you don't ask for security, then you will never be worried about insecurity. As trees are green, life is insecure. If you start asking for trees to be white, there is a problem. The problem is created by you, not by the trees-they are green and you ask them to be white! They cannot perform in that way.*
*Life is insecure, and so is love. And it is good that it is so. life can be secure only if you are dead; then everything can be certain. Underneath a rock there is ground" Underneath a flower there is none; the flower is insecure. With a small breeze the flower may disperse; the petals may fall and disappear. It is a miracle that the flower is there. Life is a miracle-because there is no reason for it to be. It is simply a miracle that you are, otherwise there is every reason for you not to be. Maturity comes to you only when you accept this, and not only accept, but start rejoicing in it.*
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 474 to 479 / Sri Lalitha Chaitanya Vijnanam - 474 to 479 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 98. విశుద్ధి చక్రనిలయా,ఽఽరక్తవర్ణా, త్రిలోచనా ।*
*ఖట్వాంగాది ప్రహరణా, వదనైక సమన్వితా ॥ 98 ॥ 🍀*
*474. 'విశుద్దిచక్ర నిలయా' - విశుద్ధి చక్రము నందు ఉండునది శ్రీమాత.*
*475. 'రక్తవర్ణా’ - ఎఱ్ఱని రంగు గలది శ్రీమాత అని అర్థము.*
*476. 'త్రిలోచనా’ - మూడు కన్నులు కలది శ్రీమాత అని అర్థము.*
*477. 'ఖట్వాంగాది ప్రహరణా' - ఖట్వాంగము మొదలగు నాలుగు ఆయుధములు గలది శ్రీమాత అని అర్ధము.*
*478. 'వదనైక’ - ఏక వదనము కలది శ్రీమాత అని అర్థము.*
*479. 'సమన్వితా' - సమన్వితము చెందినది శ్రీమాత అని అర్థము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 474 to 479 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 98. Vishudichakra nilaya raktavarna trilochana*
*khatvangadi praharana vadanaika samanvita ॥ 98 ॥ 🌻*
*474. 'Vishuddhichakra Nilaya' - Sri Mata is the one who resides in Vishuddhi Chakra*
*475. 'Rakthavarna' - Srimata is the one with red color.*
*476. 'Trilochana' - It means Srimata with three eyes.*
*477. 'Khatwangadi Praharana' - The one with four weapons like khatwanga.*
*478. 'Vadanaika' - The one with one face.*
*479. 'Samanvita' - One who is balanced and virtuous*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj