1) 🌹 శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588🌹
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 40🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 364 365 / Vishnu Sahasranama Contemplation - 364, 365🌹
4) 🌹 Daily Wisdom - 96🌹
5) 🌹. వివేక చూడామణి - 59🌹
6) 🌹Viveka Chudamani - 59🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 70🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 2🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 250 / Sri Lalita Chaitanya Vijnanam - 250🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 588 / Bhagavad-Gita - 588 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 17వ అధ్యాయము - శ్రద్ధాత్రయ విభాగములు - 27 🌴*
27. యజ్ఞే తపసి దానే చ స్థితి: సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||
🌷. తాత్పర్యం :
దివ్యములై యుండి పరమపురుషుని ప్రీత్యర్థమై ఒనరింపబడు సర్వ యజ్ఞ, తపో, దానకర్మలవలె అట్టి యజ్ఞకర్త కూడా “సత్” అనబడును.
🌷. భాష్యము :
అదే విధముగా అన్ని రకములైన యజ్ఞములందలి లక్ష్యము “ఓంతత్సత్” (భగవానుడు) అనునదియే. “తదర్థీయం” అను పదము శ్రీకృష్ణభగవానునికి సంబంధించిన సేవాకార్యములను సూచించును. అనగా ప్రసాదమును తయారుచేయుట, మందిరకార్యములందు సహకరించుట, శ్రీకృష్ణభగవానుని కీర్తిని ప్రచారము చేయుట వంటి సేవలన్నింటిని అది సూచించుచున్నది.
కనుకనే కర్మలను పూర్ణమొనర్చి సర్వమును సమగ్రమొనర్చు నిమిత్తమై ఈ దివ్యములైన “ఓంతత్సత్” అను పదములు పలురీతుల ఉపయోగింపబడుచుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 588 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 17 - The Divisions of Faith - 27 🌴*
27. yajñe tapasi dāne ca
sthitiḥ sad iti cocyate
karma caiva tad-arthīyaṁ
sad ity evābhidhīyate
🌷 Translation :
The performer of such sacrifice is also called sat, as are all works of sacrifice, penance and charity which, true to the absolute nature, are performed to please the Supreme Person,
🌹 Purport :
Similarly, in all kinds of performance of yajña the object is the Supreme, oṁ tat sat. The word tad-arthīyam further means offering service to anything which represents the Supreme, including such service as cooking and helping in the Lord’s temple, or any other kind of work for broadcasting the glories of the Lord.
These supreme words oṁ tat sat are thus used in many ways to perfect all activities and make everything complete.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 040 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 1, శ్లోకం 40
40
అధర్మాబిభవాత్ కృష్ణ
ప్రద్యుషన్తి కులస్త్రియ: |
స్త్రీషు దుష్టాసు వార్‌ష్ణేయ
జాయతే వర్ణసంకర: ||
తాత్పర్యము : ఓ కృష్ణా ! వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన కుల స్త్రీలు చెడిపోవుదురు. ఓ వృష్ణివంశసంజాతుడా! అట్టి కుల స్త్రీ పతనము వలన అవాంఛనీయ సంతానము వృద్ధినొందును.
భాష్యము : మానవ సహజ శాంతి సామరస్యాలు, ఆధ్యాత్మిక పురోగతి మంచి సంతానముపై ఆధారపడి ఉంటాయి. వర్ణాశ్రమ ధర్మాలనేవి మంచి సంతానము కొనసాగేటట్లు, సమాజ శ్రేయస్సు కాపాడబడేటట్లు రూపొందించబడినవి. ఈ ధర్మాలు స్త్రీల పాతివ్రత్యము మీద ఆధారపడి ఉంటాయి. పిల్లలు ఎలా సులభంగా మోసగించబడతారో, అలాగే స్త్రీలు సులువుగా తప్పుదోవ పట్టించబడతారు. కాబట్టి, స్త్రీలు, పిల్లలు కుటుంబ పెద్దలచే రక్షింపబడవలెను. వర్ణాశ్రమ ధర్మాలను పాటించినట్లయితే, అనేక సంక్షేమ కార్యాలలో పాల్గొని వారు తప్పుదోవ పట్టే అవకాశము ఉండదు. అలా వర్ణాశ్రమ ధర్మాలను పాటించనిచో, స్త్రీ పురుషులు విచ్చలవిడిగా కలిసే అవకాశము ఏర్పడి అనవసరపు పిల్లలు పుట్టి, మానవ సమాజము అథోగతి పట్టే అవకాశము ఉంటుంది. దుర్మార్గాలు, మోసాలు చివరికి యుద్ధాలు సర్వ సామాన్యమైపోతాయి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 364, 365 / Vishnu Sahasranama Contemplation - 364, 365 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻364. రోహితః, रोहितः, Rohitaḥ🌻*
*ఓం రోహితాయ నమః | ॐ रोहिताय नमः | OM Rohitāya namaḥ*
స్వచ్ఛందతయా రోహితం మూర్తిం వహన్ రోహితః విష్ణువు స్వచ్ఛందుడు. ఛందము అనగా ఇచ్ఛ. తన ఛందమును లేదా ఇచ్ఛను అనుసరించి మాత్రమే స్వతంత్రముగా వర్తించువాడు. స్వచ్ఛందుడు. తాను స్వచ్ఛందుడు కావున తన ఇచ్ఛ ననుసరించి రోహిత/రక్త వర్ణముకల మూర్తిని వహించువాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 364🌹*
📚. Prasad Bharadwaj
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥
Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 365 / Vishnu Sahasranama Contemplation - 365🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻365. మార్గః, मार्गः, Mārgaḥ🌻*
*ఓం మార్గాయ నమః | ॐ मार्गाय नमः | OM Mārgāya namaḥ*
ముముక్షవః తం దేవం మార్గయంతి మోక్షమును కోరువారు ఆతని వెదకుదురు. లేదా పరమానందః యేన సాధనేన ప్రాప్యతే సః మార్గః ఏ సాధనముచే పరమానందము పొందబడునో అది మార్గముతో సమానము కావున మార్గః అనబడును. అట్టి మార్గము కూడ పరమాత్ముని విభూతియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 365🌹*
📚. Prasad Bharadwaj
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥
Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 96 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻5. Interpreting Everything from the Point of View of the Ideal 🌻*
A spiritual life is that conduct or way of living and mode of thinking and understanding which enables one to interpret every situation in life—physical, social, ethical, political or psychological—from the point of view of the ideal that is above and is yet to be reached, notwithstanding the fact that it is a remote ideal in the future.
The inability to interpret the practical affairs of life, and the present state of existence in terms of the higher ideal immediately succeeding, would make us incomplete human beings and keep us unhappy. It is only the animal nature that is incapacitated in this respect. The animals and even human beings who have the animal nature preponderating in them cannot interpret present situations from the point of view of the ideal that is transcendent to the present state.
And once we are awakened to the capacity of being able to understand and interpret the lower in the light of the higher, then it is that we can be called real humans, for the superiority of humans over animals lies just in this special endowment. Merely because one walks with two legs, one need not necessarily be regarded as truly human.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 59 / Viveka Chudamani - 59🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 18. విశ్వము - 1 🍀*
213, 214. సమాధానము:- నీవు సరైన ప్రశ్నను అడిగినావు. నీవు మంచి, చెడులను తగినట్లు బేరీజు వేయుచున్నావు. దీని వలన అహం, మనస్సు, జ్ఞానేంద్రియాలు గాఢ నిద్రలో లేనప్పటకి, వాటిని ఆత్మ సాక్షిగా గ్రహిస్తుంది. కాని వాటికి అది అతీతముగా ఉంటుంది.
నీవు అదే ఆత్మవు అని గ్రహించినవాడు తన యొక్క సునిసితమైన తెలివితేటలతో గ్రహిస్తాడు. సినిమాల్లో తెర మీద అనేక రకాలైన బొమ్మలు వస్తుంటాయి. కాని వాటికి కారణమైన అసలైన ప్రొజెక్టరు వేరే ఉన్నది. ప్రకృతిలో మారే ప్రతి వస్తువు వెనుక శాశ్వతమైన ఆత్మ ఉంటుంది.
215. ఏదైన ఒక విషయాన్ని తెలుసు కొనుటకు వేరొకటి తోడ్పడినపుడు దానికి తొడ్పడిన దానిని దర్శిస్తుంది. ఒక వస్తువును తెలుసుకొనుటకు ఏజెండు లేని ఎడల, దాని గురించి ఏమియూ తెలియదు.
216. ఆత్మ తనను తానే గుర్తించును. ఎందువలనంటే అదే దానిని గుర్తించ గలిగినది. అందువలన జీవాత్మ ఒక్కటే నేరుగా పరమాత్మను దర్శించగలదు. మిగిలినవేవి దానిని దర్శించలేవు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 59 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻18. The Universe - 1 🌻*
213-214. The Guru answered: Thou has rightly said, O learned man ! Thou art clever indeed in discrimination. That by which all those modifications such as egoism as well as their subsequent absence (during deep sleep) are perceived, but which Itself is not perceived, know thou that Atman – the Knower – through the sharpest intellect.
215. That which is perceived by something else has for its witness the latter. When there is no agent to perceive a thing, we cannot speak of it as having been perceived at all.
216. This Atman is a self-cognised entity because It is cognised by Itself. Hence the individual soul is itself and directly the Supreme Brahman, and nothing else.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 70 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 51. ముక్కుసూటి మార్గము 🌻*
అతి చిన్న జీవియందు, అతి పెద్ద దైవమునందు నిన్ను నీవు దర్శించుట ఆత్మ దర్శనామార్గము. ఇట్లు దర్శించు సాధకుడు దేనిని అశ్రద్ధ చేయడు. మానవ మేధస్సు గొప్ప విషయములందు ఆసక్తి కలిగియుండుటచే ఆత్మ దర్శనమునకు అర్హత కలిగియుండదు. అట్టి అర్హత కలుగవలె నన్నచో ఆడంబరములకు తల ఒగ్గని మనస్సేర్పడ వలెను.
ఆత్మతత్త్వ మన్నిటను నిండి యున్నది గనుక అన్నిటి యందు దానిని దర్శించుట క్షేమమగు మార్గము. ఇట్లు దర్శించువానికి భ్రమ, భ్రాంతి కలుగును. క్రమముగ అతడు సత్యదర్శనుడు కాగలడు. పెద్దపెద్ద ఘనకార్యములను నిర్వహించువారు చిన్న విషయము లందు అశ్రద్ధవలన తలక్రిందులగుట, పతనము చెందుట లక్షల సార్లు జరిగినది.
పర్వత శిఖరము నధిరోహించినవాడు ఇంటి గడప దాటుచు జారిపడి ఎముకలను విరుగగొట్టు కొనిన సందర్భములు గలవు. ఆత్మ ఒకే శ్రద్ధతో సమస్తమును ఆవరించి యున్నది. ఆత్మకు పెద్ద-చిన్న లేదు. అంతయు తానే. ఆత్మదర్శనాభిలాషికి గూడ అట్టి గుణము అలవడవలెను.
“సమస్తము నేనే. నేను కానిదేదియు లేదు. అందరియందు నన్నే దర్శింతును. ప్రేమింతును. ఆదరింతును. స్ఫూర్తితో ప్రతిస్పందింతును” అని ప్రతి ఉదయము భావన చేసి, ఆ భావనను ఆచరణమున పెట్టుటకు ప్రయత్నించుట సూటియగు సాధన. ఇట్టి సాధనా మార్గమున మరపు కలిగినను మరల మరల ప్రయత్నించుటయే ఉపాయము. ప్రతి సాయంత్రము నీ ఆత్మదర్శనా
సాధన ఎట్లు సాగినదో పర్యాలోచనము చేయుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 2 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
మనిషికి ప్రేమ గానంగా మారగలిగిన శక్తి వుంది. ప్రేమ నాట్యంగా పరివర్తన చెందగలిగే సామర్థ్యముంది. కానీ కొద్ది మంది, అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే అట్లా కాగలుగుతున్నారు. అందరూ విత్తనాలుగా జన్మించారు. కొద్ది మందిని మినహాయిస్తే అందరూ విత్తనాలుగానే చనిపోతున్నారు. నిష్ఫలంగా నీరుగారి పోతున్నారు.
నాకు తెలిసినంత మేరకు గుళ్ళకు, మసీదులకు, చర్చిలకు వెళ్ళే జనం ప్రేమతో వెళ్ళడం లేదు. భయం కొద్దీ వెళుతున్నారు. ముసలివాళ్ళు మరీ ఎక్కువ మంది వెళుతూ వుంటారు. కారణం వాళ్ళకు మరణమంటే భయం. వాళ్ళు జీవితంలో ఏదో అపూర్వమయిన దాన్ని అందుకోవటం వల్ల ఆలయాలకు వెళ్ళడం లేదు. మరణమనే చీకటి వాళ్ళను సమీపిస్తుండటంతో భయపడి వెళుతున్నారు. ఏదో రక్షణ కోసం వెళుతున్నారు.
ఇప్పుడు వాళ్ళకు ఒక విషయం తెలిసొచ్చింది. వాళ్ళ డబ్బు వాళ్ళతో బాటు రాదు. స్నేహితులు వెంట రారు. వాళ్ళ కుటుంబం వాళ్ళని వదిలేస్తుంది. అందువల్ల నిరాశతో వాళ్ళు దేవుడనే అభిప్రాయానికి అతుక్కుపోతారు. యిదంతా ప్రేమ వల్ల, కృతజ్ఞత వల్ల కలిగే అభిప్రాయం కాదు. భక్తి కాదు. భయం వల్ల కలిగేది. భయం వల్ల పుట్టే దేవుడు నకిలీ దేవుడు.
నా సమస్త ప్రయత్నం అస్తిత్వ దర్శనం కోసం అన్ని కిటికీలు తెరిచి వుంచడం. దాని వల్ల మీరు భయం కొద్ది దేవుడి దగ్గరకి వెళ్ళరు. మీరు అనుభవ సౌందర్యం గుండా, సృజనాత్మక అనుభవం గుండా ఆ, ప్రేమానుభవం గుండా దైవాన్ని సమీపిస్తారు.
వ్యక్తి ఈ అనుభవాల గుండా వెళితే అతని సంబంధం అద్భుతంగా వుంటుంది. అపూర్వంగా వుంటుంది. అది రూపాంతరం చెందిస్తుంది. కేవలం ఒక్కసారి ఒక్క అనుభవం అస్తిత్వంతో ఏర్పడితే చాలు. అప్పుడు నువ్వు ఎప్పటికీ వెనకటిలా వుండవు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #నిర్మలధ్యానములు
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 250 / Sri Lalitha Chaitanya Vijnanam - 250 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।*
*చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀*
*🌻 250. 'పంచబ్రహ్మ స్వరూపిణీ 🌻*
పంచ బ్రహ్మముల రూపమున నుండునది శ్రీమాత అని అర్థము.
పంచ బ్రహ్మలు:
1) బ్రహ్మ - నారాయణుడు - సద్యోజాతుడు
2) విష్ణువు - వాసుదేవుడు - వామదేవుడు -
3) రుద్రుడు - సంకర్షణుడు - అఘోరుడు
4) ఈశ్వరుడు - ప్రద్యుమ్నుడు - తత్పురుషుడు
5) సదాశివుడు - అనిరుద్ధుడు - ఈశానుడు
పై తత్త్వములు శ్రీమాత స్వరూపములే. శ్రీమాతయే ఐదుగ ఆవిర్భవించి రూపములనుగొని సృష్టి కార్యమును నిర్వర్తించును. సర్వమునకు మూలమైన ఆమె నాలుగు స్థితులలోనికి ప్రవేశించి
ఐదగుచున్నది. గరుడ పురాణమునందు ఇట్లు తెలుపబడినది. లోకాను గ్రహము కొఱకై శ్రీ మహా విష్ణువు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నారాయణు లను పంచరూపములు గలవాడాయెను.
అట్లే త్రిపుర సిద్ధాంతమందు పరబ్రహ్మము మాయా విలాసముచే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడను పేర్లతో నున్నాడు అని చెప్పబడెను. పరతత్త్వము నాలుగుగ దిగివచ్చుట వలన మొత్తము ఐదైనది. పరతత్త్వము దిగివచ్చుట కొంత భాగమే. దిగిరాని భాగము మిక్కుటముగ దిగివచ్చిన తత్త్వము సృష్టిని నిర్వహించు చుండును.
ఒక వేదము నాలుగు వేదములైనవి-
1) ఋగ్వేదము, 2) యజుర్వేదము, 3) సామవేదము, 4) అధర్వణ వేదము.
ఒకే పరావాక్కు నాలుగు వాక్కులైనవి. అవియే 1) పర, 2) పశ్యంతి, 3) మధ్యమ, 4) వైఖరి.
ఒకే నారాయణుడు నలుగురు కుమారులైరి. వారే 1) సనాతన, 2) సనక, 3) సనందన, 4) సనత్కుమారులు. ఇట్లు సమస్తము పంచీకరణము చెందును.
ఆకాశము - ప్రాణము - వినుట - చెవి
వాయువు - అపానము - చూచుట - కన్ను
అగ్ని - వ్యానము - చర్మము - చర్మము
నీరు - ఉదానము - రుచి - నాలుక
భూమి - సమానము - వాసన - ముక్కు
ఇట్లు ఐదు, ఐదుగ సృష్టిని వివరించు శాస్త్రమున్నది. అంతయూ ఐదే. ఐదు నుండి ఐదు పుట్టుచుండును. ప్రధానమగు ఈ ఐదును శివతత్త్వముగను, శ్రీ తత్త్వముగను, విష్ణుతత్త్వముగను, బ్రహ్మతత్త్వముగను బహు విధములుగ పురాణము లందు పేర్కొనిరి. నామ భేదము చేత కొంత ప్రాథమికముగ తికమక యుండును.
అవగాహన కలిగినచో అన్నింటిని సమన్వయించుకొనవచ్చును. మన ఋషులు ఒకే సత్యమును పలు రకములుగ ప్రకటించిరి. అది వైభవమే గాని తికమక కాదు. ఒకే కూరగాయను, రక రకములుగ వండి రుచి చూచుట వైభవమే కదా! సమన్వయము సంపూర్ణముగ ఎఱిగిన వేదవ్యాస మహర్షి ఈ పంచ సూత్రము ననుసరించియే, పంచమ వేదముగ మహాభారతమును రచించెను. అందీవిధముగ నుడివెను.
“పాంక్తంవా ఇదగ్ం సర్వం, పాంక్లే నైవ పాంక్తం సృజోతీతి. ”
పంక్తి అనగా ఐదు. అంతయూ ఐదే. ఐదు నుండి ఐదు పుట్టును. సృష్టి కథ ఐదు కథ. భారత కథ కూడ ఐదుగురు పాండవుల కథయే కదా! ఇట్లు శ్రీమాతయే పంచమి. పంచమి, పంచభూతేషు, పంచ సంఖ్య ఉపచారిణి అను నామములతో కూడ ఈ తత్త్వమునే ఆరాధింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 250 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Pañca-brahma-svarūpiṇī पञ्च-ब्रह्म-स्वरूपिणी (250) 🌻*
This nāma is an extension of the previous one. The previous nāma underlined the importance of Lalitāmbikā in all acts of the Brahman and this nāma asserts that She is the Brahman. If the earlier nāma is not read along with this nāma, its significance would be lost.
These two nāma-s explain the cosmic creation. The Brahman has five functions to perform. They are creation, sustenance, destruction, annihilation and salvation. Each of these activities is governed by different Gods. Brahma for creation, etc has been explained in the previous nāma. These different Gods are only manifestations of the Brahman. Though one talks about various forms of gods, all these refer only to the Brahman, who does not have any form and is omnipresent.
This concept is further explained in this book under different nāma-s. In fact these Gods, Goddesses, ministers, yogini-s mean different natural activities that take place in the universe. That is why Nature is called as Mother Nature and worshipped as a Goddess as acts of the Brahman are unfolded only through Nature and in the arena of Nature.
The five acts of the Brahman is a cyclic process. Creation here means the creation of the universe in the broader perspective. It does not mean the birth of an individual. Sustenance also means the sustenance of the universe as a whole.
The birth and death of human beings as well as billions of other species is just a trivial part of the activities that happen in the universe. The first amongst the creations are the five basic elements viz. ākāś, air, fire, water and earth. Then the modifications of these elements take place gradually, which is called evolution. Such evolution happens both in physical and subtle planes. The highest known gross form of evolution is man and the highest form of subtle evolution is his mind.
The universe thus created is being administered by the Brahman Himself. In order to maintain a proper balance, creatures are allowed to shed their physical bodies. Souls make the physical bodies to function and hence soul is called kinetic energy. The souls originated from the hiraṇyagarbha or the golden egg.
This is so called, as it is born from a golden egg, formed out of the seed deposited in the waters when they were produced as the first creation of the Self-existent This seed became a golden egg, resplendent as the sun, in which the Self-existent Brahma was born as Brahmā the Creator, who is therefore regarded as a manifestation of the Self-existent. This is held as the fourth act of the Brahman, tirodhāna, or the great dissolution or the act of concealment. The difference between destruction and annihilation is significant.
Destruction is the death of a single organism and dissolution is the Supreme process of the Brahman, wherein He makes the entire universe to dissolve and merge unto Himself. At this stage the universe becomes non-existent. There will be no continents, no mountains, no oceans, none of the basic elements (Pañca bhūta-s) exist. Such an act of the Brahman is called mahā-pralayā. This happens when Śiva begins His mahā-pralaya tāṇḍava or the cosmic dance.
When Śiva performs this dance of annihilation, He becomes terribly ferocious. While He continues His dance, the universe gradually gets dissolved unto Him. The reverse modifications take place and penultimately there exists only the five basic elements. Finally these five elements too, dissolve into Śiva. Except Śiva and Śaktī none exists at this stage. Śaktī is the lone witness to Śiva’s cosmic dance (nāma-s 232 and 571).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹