శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 250 / Sri Lalitha Chaitanya Vijnanam - 250







🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 250 / Sri Lalitha Chaitanya Vijnanam - 250 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 61. పంచప్రేతాసనాసీనా, పంచబ్రహ్మ స్వరూపిణీ ।
చిన్మయీ, పరమానందా, విజ్ఞాన ఘనరూపిణీ ॥ 61 ॥ 🍀

🌻 250. 'పంచబ్రహ్మ స్వరూపిణీ 🌻


పంచ బ్రహ్మముల రూపమున నుండునది శ్రీమాత అని అర్థము.


పంచ బ్రహ్మలు:

1) బ్రహ్మ - నారాయణుడు - సద్యోజాతుడు

2) విష్ణువు - వాసుదేవుడు - వామదేవుడు -

3) రుద్రుడు - సంకర్షణుడు - అఘోరుడు

4) ఈశ్వరుడు - ప్రద్యుమ్నుడు - తత్పురుషుడు

5) సదాశివుడు - అనిరుద్ధుడు - ఈశానుడు


పై తత్త్వములు శ్రీమాత స్వరూపములే. శ్రీమాతయే ఐదుగ ఆవిర్భవించి రూపములనుగొని సృష్టి కార్యమును నిర్వర్తించును. సర్వమునకు మూలమైన ఆమె నాలుగు స్థితులలోనికి ప్రవేశించి

ఐదగుచున్నది. గరుడ పురాణమునందు ఇట్లు తెలుపబడినది. లోకాను గ్రహము కొఱకై శ్రీ మహా విష్ణువు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ నారాయణు లను పంచరూపములు గలవాడాయెను.

అట్లే త్రిపుర సిద్ధాంతమందు పరబ్రహ్మము మాయా విలాసముచే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడను పేర్లతో నున్నాడు అని చెప్పబడెను. పరతత్త్వము నాలుగుగ దిగివచ్చుట వలన మొత్తము ఐదైనది. పరతత్త్వము దిగివచ్చుట కొంత భాగమే. దిగిరాని భాగము మిక్కుటముగ దిగివచ్చిన తత్త్వము సృష్టిని నిర్వహించు చుండును.


ఒక వేదము నాలుగు వేదములైనవి-

1) ఋగ్వేదము, 2) యజుర్వేదము, 3) సామవేదము, 4) అధర్వణ వేదము.

ఒకే పరావాక్కు నాలుగు వాక్కులైనవి. అవియే 1) పర, 2) పశ్యంతి, 3) మధ్యమ, 4) వైఖరి.

ఒకే నారాయణుడు నలుగురు కుమారులైరి. వారే 1) సనాతన, 2) సనక, 3) సనందన, 4) సనత్కుమారులు. ఇట్లు సమస్తము పంచీకరణము చెందును.


ఆకాశము - ప్రాణము - వినుట - చెవి

వాయువు - అపానము - చూచుట - కన్ను

అగ్ని - వ్యానము - చర్మము - చర్మము

నీరు - ఉదానము - రుచి - నాలుక

భూమి - సమానము - వాసన - ముక్కు


ఇట్లు ఐదు, ఐదుగ సృష్టిని వివరించు శాస్త్రమున్నది. అంతయూ ఐదే. ఐదు నుండి ఐదు పుట్టుచుండును. ప్రధానమగు ఈ ఐదును శివతత్త్వముగను, శ్రీ తత్త్వముగను, విష్ణుతత్త్వముగను, బ్రహ్మతత్త్వముగను బహు విధములుగ పురాణము లందు పేర్కొనిరి. నామ భేదము చేత కొంత ప్రాథమికముగ తికమక యుండును.

అవగాహన కలిగినచో అన్నింటిని సమన్వయించుకొనవచ్చును. మన ఋషులు ఒకే సత్యమును పలు రకములుగ ప్రకటించిరి. అది వైభవమే గాని తికమక కాదు. ఒకే కూరగాయను, రక రకములుగ వండి రుచి చూచుట వైభవమే కదా! సమన్వయము సంపూర్ణముగ ఎఱిగిన వేదవ్యాస మహర్షి ఈ పంచ సూత్రము ననుసరించియే, పంచమ వేదముగ మహాభారతమును రచించెను. అందీవిధముగ నుడివెను.

“పాంక్తంవా ఇదగ్ం సర్వం, పాంక్లే నైవ పాంక్తం సృజోతీతి. ”

పంక్తి అనగా ఐదు. అంతయూ ఐదే. ఐదు నుండి ఐదు పుట్టును. సృష్టి కథ ఐదు కథ. భారత కథ కూడ ఐదుగురు పాండవుల కథయే కదా! ఇట్లు శ్రీమాతయే పంచమి. పంచమి, పంచభూతేషు, పంచ సంఖ్య ఉపచారిణి అను నామములతో కూడ ఈ తత్త్వమునే ఆరాధింతురు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 250 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj



🌻 Pañca-brahma-svarūpiṇī पञ्च-ब्रह्म-स्वरूपिणी (250) 🌻

This nāma is an extension of the previous one. The previous nāma underlined the importance of Lalitāmbikā in all acts of the Brahman and this nāma asserts that She is the Brahman. If the earlier nāma is not read along with this nāma, its significance would be lost.

These two nāma-s explain the cosmic creation. The Brahman has five functions to perform. They are creation, sustenance, destruction, annihilation and salvation. Each of these activities is governed by different Gods. Brahma for creation, etc has been explained in the previous nāma. These different Gods are only manifestations of the Brahman. Though one talks about various forms of gods, all these refer only to the Brahman, who does not have any form and is omnipresent.

This concept is further explained in this book under different nāma-s. In fact these Gods, Goddesses, ministers, yogini-s mean different natural activities that take place in the universe. That is why Nature is called as Mother Nature and worshipped as a Goddess as acts of the Brahman are unfolded only through Nature and in the arena of Nature.

The five acts of the Brahman is a cyclic process. Creation here means the creation of the universe in the broader perspective. It does not mean the birth of an individual. Sustenance also means the sustenance of the universe as a whole.

The birth and death of human beings as well as billions of other species is just a trivial part of the activities that happen in the universe. The first amongst the creations are the five basic elements viz. ākāś, air, fire, water and earth. Then the modifications of these elements take place gradually, which is called evolution. Such evolution happens both in physical and subtle planes. The highest known gross form of evolution is man and the highest form of subtle evolution is his mind.

The universe thus created is being administered by the Brahman Himself. In order to maintain a proper balance, creatures are allowed to shed their physical bodies. Souls make the physical bodies to function and hence soul is called kinetic energy. The souls originated from the hiraṇyagarbha or the golden egg.

This is so called, as it is born from a golden egg, formed out of the seed deposited in the waters when they were produced as the first creation of the Self-existent This seed became a golden egg, resplendent as the sun, in which the Self-existent Brahma was born as Brahmā the Creator, who is therefore regarded as a manifestation of the Self-existent. This is held as the fourth act of the Brahman, tirodhāna, or the great dissolution or the act of concealment. The difference between destruction and annihilation is significant.

Destruction is the death of a single organism and dissolution is the Supreme process of the Brahman, wherein He makes the entire universe to dissolve and merge unto Himself. At this stage the universe becomes non-existent. There will be no continents, no mountains, no oceans, none of the basic elements (Pañca bhūta-s) exist. Such an act of the Brahman is called mahā-pralayā. This happens when Śiva begins His mahā-pralaya tāṇḍava or the cosmic dance.

When Śiva performs this dance of annihilation, He becomes terribly ferocious. While He continues His dance, the universe gradually gets dissolved unto Him. The reverse modifications take place and penultimately there exists only the five basic elements. Finally these five elements too, dissolve into Śiva. Except Śiva and Śaktī none exists at this stage. Śaktī is the lone witness to Śiva’s cosmic dance (nāma-s 232 and 571).

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


11 Apr 2021

No comments:

Post a Comment