2) 🌹. శ్రీమద్భగవద్గీత - 135 / Bhagavad-Gita - 135 - 3-16🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 532 / Vishnu Sahasranama Contemplation - 532 🌹
4) 🌹 DAILY WISDOM - 210🌹
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 49🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 116-1🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 333-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 333-2 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*భౌమ వాసరే, 28, డిసెంబర్ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🍀. ఆంజనేయుని శ్లోకాలు-8 🍀*
*ఆంజనేయమతిపాటలాలనం కాంచనాద్రి కమనీయ విగ్రహం|*
*పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం||*
*భావము:- అంజనాదేవి కుమారుడు, దుష్టులను సం హరించేవాడు, అందమైన కొండంత బంగారు శరీరం కలిగి, పారిజాత చెట్టును నివాసం చేసుకున్న వాయుపుత్రుడికి నమస్కారాలు.*
🌻 🌻 🌻 🌻 🌻
విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
దక్షిణాయణం, హేమంత ఋతువు,
మృగశిర మాసం
తిథి: కృష్ణ నవమి 18:10:20 వరకు
తదుపరి కృష్ణ దశమి
నక్షత్రం: చిత్ర 28:12:02 వరకు
తదుపరి స్వాతి
యోగం: శోభన 06:51:45 వరకు
తదుపరి అతిగంధ్
కరణం: తైతిల 06:54:08 వరకు
వర్జ్యం: 12:49:20 - 14:21:36
దుర్ముహూర్తం: 08:57:44 - 09:42:08
రాహు కాలం: 15:04:05 - 16:27:21
గుళిక కాలం: 12:17:33 - 13:40:49
యమ గండం: 09:31:02 - 10:54:18
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:39
అమృత కాలం: 22:02:56 - 23:35:12
సూర్యోదయం: 06:44:30
సూర్యాస్తమయం: 17:50:36
వైదిక సూర్యోదయం: 06:48:25
వైదిక సూర్యాస్తమయం: 17:46:43
చంద్రోదయం: 00:55:07
చంద్రాస్తమయం: 13:07:06
సూర్య సంచార రాశి: ధనుస్సు
చంద్ర సంచార రాశి: కన్య
ధ్వాo క్ష యోగం - ధన నాశనం,
కార్య హాని 28:12:02 వరకు తదుపరి
ధ్వజ యోగం - కార్య సిధ్ధి
పండుగలు : లేదు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 135 / Bhagavad-Gita - 135 🌹*
*✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. తృతీయ అధ్యాయము - కర్మ యోగము - 16 🌴*
*16. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ య: |*
*ఆఘాయురిన్ద్రియారామో మోఘం పార్థ స జీవతి ||*
🌷. తాత్పర్యం :
*ఓ అర్జునా! ఈ విధముగా వేదములచే నిర్ణయింపబడిన యజ్ఞచక్రమును జీవితమున అనుసరింపనివాడు నిక్కముగా పాపజీవనుడగును. కేవలము ఇంద్రియతృప్తి కొరకే జీవించుచు అట్టివాడు నిరర్ధకముగా జీవనము గడుపును.*
🌷. భాష్యము :
“కష్టించి పనిచేసి పిదప ఇంద్రియభోగము ననుభవింపుము” అనెడి ధనలోభపూరితమైన తత్త్వము శ్రీకృష్ణభగవానునిచే ఇచ్చట నిరసించబడుచున్నది. కనుకకనుక ఈ భౌతికజగమును అనుభవింపగోరువారికి పైన తెలుపబడిన యజ్ఞచక్రము అత్యంత అవసరము. అట్టి నియమములను పాటింపనివాడు మిగుల నిరసింపవడినవాడై ప్రమాదకరజీవితమును గడుపువాడే యగును.
ప్రకృతి నియమము ప్రకారము మానవజన్మ యనునది కర్మయోగము లేదా జ్ఞానయోగము లేదా భక్తియోగమనెడి ఏదియో ఒక మార్గము ద్వారా ఆత్మానుభూతిని పొందుట కొరకే ప్రత్యేకముగా ఉద్దేశింపబడినది. నిర్దేశితమైనటువంటి యజ్ఞములను కచ్చితముగా అనుసరింపవలసిన అవసరము గుణదోషాతీతులైన మహాత్ములకు లేకున్నను, ఇంద్రియభోగమునందు నిలిచినవారు మాత్రము పైన తెలుపబడిన యజ్ఞచక్రము ద్వారా పవిత్రతను పొందవలసియున్నది. వాస్తవమునకు కర్మలు పలురకములు. కృష్ణభక్తిభావన లేనివారు నిక్కముగా భోగభావన కలిగినవారు భోగకర్మఫలములందు తగుల్కొనకుండా తమ కోరికలను సంతృప్తిపరచుకొనునట్లుగా యజ్ఞావిదానము ఏర్పాటు చేయబడినది.
ఈ జగత్తు యొక్క పురోభివృద్ధి మన స్వీయకృషిపై గాక, దేవతలచే ప్రత్యక్షముగా నిర్వహింపబడెడి భగవానుని ప్రణాళికపై ఆధారపడియుండును. కనుకనే వేదములందు తెలుపబడిన ప్రత్యేక దేవతల కొరకే యజ్ఞములు ప్రత్యక్షముగా ఉద్దేశింపబడినవి. అట్టి యజ్ఞాచరణము ద్వారా మనుజడు కృష్ణభక్తిభావితుడు కానిచో అవియన్నియును కేవలము నీతి సూత్రములుగా పరిగణింప బడును. కనుక ప్రతి యొక్కరు తమ పురోగతిని కేవలము నీతి సూత్రముల వరకే పరిమితము చేసికొనక, వాటిని అదిగమించి కృష్ణభక్తిభావనను పొందవలసియున్నది.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 135 🌹*
*✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada*
*📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 3 - Karma Yoga - 16 🌴*
*16. evaṁ pravartitaṁ cakraṁ nānuvartayatīha yaḥ*
*aghāyur indriyārāmo moghaṁ pārtha sa jīvati*
🌷Translation :
*My dear Arjuna, one who does not follow in human life the cycle of sacrifice thus established by the Vedas certainly leads a life full of sin. Living only for the satisfaction of the senses, such a person lives in vain.*
🌷 Purport :
The mammonist philosophy of “work very hard and enjoy sense gratification” is condemned herein by the Lord. Therefore, for those who want to enjoy this material world, the above-mentioned cycle of performing yajñas is absolutely necessary. One who does not follow such regulations is living a very risky life, being condemned more and more.
By nature’s law, this human form of life is specifically meant for self-realization, in either of the three ways – namely karma-yoga, jñāna-yoga or bhakti-yoga. There is no necessity of rigidly following the performances of the prescribed yajñas for the transcendentalists who are above vice and virtue; but those who are engaged in sense gratification require purification by the above-mentioned cycle of yajña performances. There are different kinds of activities. Those who are not Kṛṣṇa conscious are certainly engaged in sensory consciousness; therefore they need to execute pious work.
The yajña system is planned in such a way that sensory conscious persons may satisfy their desires without becoming entangled in the reaction of sense-gratificatory work. The prosperity of the world depends not on our own efforts but on the background arrangement of the Supreme Lord, directly carried out by the demigods. Therefore, the yajñas are directly aimed at the particular demigods mentioned in the Vedas.
Indirectly, it is the practice of Kṛṣṇa consciousness, because when one masters the performance of yajñas one is sure to become Kṛṣṇa conscious. But if by performing yajñas one does not become Kṛṣṇa conscious, such principles are counted as only moral codes. One should not, limit only to the point of moral codes, but should transcend them, to attain Kṛṣṇa consciousness.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita
#చైతన్యవిజ్ఞానం #PrasadBhardwaj
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 532 / Vishnu Sahasranama Contemplation - 532 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 532. కృతజ్ఞః, कृतज्ञः, Krtajñaḥ 🌻*
*ఓం కృతజ్ఞాయ నమః | ॐ कृतज्ञाय नमः | OM Krtajñāya namaḥ*
కార్యం జగత్కృతమితి జ్ఞ ఇత్యాత్మోచ్యతే హరిః ।
కృతస్యజ్ఞ ఇతి పరః కృతజ్ఞ ఇతి కథ్యతే ॥
*కృతం అనగా 'చేయబడినది' లేదా 'కార్య' రూపమగు జగత్తు. 'జ్ఞః' అనగా జానాతి లేదా ఎరుగును అనగా 'ఆత్మ'. పరమాత్ముడు జగత్తును తానే, ఆత్మయూ తానేగనుక కృతజ్ఞః.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 532 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 532. Krtajñaḥ 🌻*
*OM Krtajñāya namaḥ*
कार्यं जगत्कृतमिति ज्ञ इत्यात्मोच्यते हरिः ।
कृतस्यज्ञ इति परः कृतज्ञ इति कथ्यते ॥
Kāryaṃ jagatkrtamiti jña ityātmocyate hariḥ,
Krtasyajña iti paraḥ krtajña iti kathyate.
*Krtaṃ is the effect or the world. Jñaḥ is the ātma. He who is both krtaṃ and ñaḥ i.e., the world and its knower is Krtajñaḥ.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
महर्षिः कपिलाचार्यः कृतज्ञो मेदिनीपतिः ।त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृंगः कृतान्तकृत् ॥ ५७ ॥
మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాన్తకృత్ ॥ 57 ॥
Maharṣiḥ kapilācāryaḥ krtajño medinīpatiḥ,Tripadastridaśādhyakṣo mahāśrṃgaḥ krtāntakrt ॥ 57 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #PrasadBhardwaj
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 210 🌹*
*🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀*
*📝 Swami Krishnananda*
*📚. Prasad Bharadwaj*
*🌻 28. You have to Resort to a Higher Power 🌻*
*The senses are controlled and directed by the mind, and the mind works according to the understanding of the intellect. The one is higher than the other. Higher than the senses is the mind, and higher than the mind is the intellect. So by the power of the mind, the senses can be restrained. But how can the mind have the power to control the senses, when the intellect passes judgment that such-and-such thing is the proper thing? So the intellect has to be approached, and it has to put a check upon the mind itself; and, sympathetically, the mind puts a check on the senses.*
*But the problem arises—how will the intellect permit this process? It is the intellect that creates this mistake, and yet it is said that the intellect itself should restrain the mind, and the mind has to control the senses. The intellect sees a division between itself and the world outside. It is the creator of logic of every kind, and therefore it sees a gulf between itself and things outside. How will it permit the control of the senses by the mind? Therefore, the great Teacher of the Gita says: “You have to resort to a higher power.”*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#PrasadBhardwaj
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://pyramidbook.in/Chaitanyavijnanam
https://incarnation14.wordpress.com/
https://dailybhakthimessages.blogspot.com
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 49 🌹*
*✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🌻 37. వైకుంఠపాళి 🌻*
*జీవితమను వైకుంఠపాళీ క్రీడయందు నిచ్చెన లెక్కుట, సర్ప ముఖమున పడుట సామాన్యము. కాని, ఉత్సాహము నొదలక ముందుకు సాగుట యొక్కటియే క్రీడయందు పరమపదము చేర్చును. ఉత్సాహము, స్ఫూర్తి, ఆశాభావము, జీవుని నడిపించు త్రిశక్తులు. సర్పముఖమున బడిన క్రీడాకారుడు ఒక క్షణము నిరుత్సాహ పడిననూ, మరుక్షణము ముందుకు సాగుచున్నాడు కదా! చతికిలబడి దుఃఖించుట లేదు కదా! నిచ్చెన లెక్కుచున్నప్పుడు కూడా తాను సర్ప ముఖమున పడు అవకాశము గలదని గుర్తించుచునే సాగుచున్నాడు కదా! అట్లే మానవ జీవితమున శ్రీకైవల్య పదమును చేరుటకు సాధన చేయు సాధకుడు కూడా, నిరుత్సాహము చెందకుండా స్ఫూర్తితో ముందుకు సాగవలెను. పరమపదమును చేరువరకూ విశ్రమింప రాదు. క్రీడయందు విశ్రమించుట, వైదొలగుట అవహేళనకు అవకాశము కలిగించును.*
*మేమందరమూ మీవలెనే అట్టి క్రీడను నిర్వర్తించి, పరమ పదమును చేరి, మీరునూ అట్లే తరణము చెందవలెనని ఆకాంక్షించు జ్యేష్ఠ సోదరులము. విశ్రమించుటకన్నా శ్రమించుట యందు శ్రద్ధ కలిగియుండుడు. సత్సంకల్పములను మనస్సు యందు సృజింపుడు. వాటిని భూమిపై అవతరింప జేయుడు. నిత్యమూ మీకు స్ఫూర్తి నందించుటకు మేమందరమూ సంసిద్ధులమై యున్నాము. ఎప్పటి కప్పుడు హృదయమును నిర్మలముగా నుంచుకొనుటకు శ్రద్ధ వహించుడు. మా పిలుపు నందు కొనుటకు అది ఒక్కటియే ప్రాతిపదిక. మీకు శుభములు కలుగు గాక!*
*సశేషం.....*
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 116-1 🌹*
*✍️. సౌభాగ్య*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀. జ్ఞానోదయాన్ని కోరుకున్నవాడు నిర్నిబంధమైన ప్రేమతోని నిండి వుండాలి. నీ ప్రేమ స్వచ్ఛంగా, నిర్నిబంధంగా వుండనీ. ఎట్లా ప్రేమపూరింతంగా వుండాలి అన్నదే ముఖ్యం. ఆత్మకి ప్రేమ అవసరం. దాన్ని సజీవంగా వుంచేది అదే. 🍀*
*కాంతికి అవకాశముంది. కానీ అది ప్రేమ వుంటేనే వీలవుతుంది. ప్రేమ లేకుంటే చీకటి మాత్రమే వుంటుంది. లోపలి ప్రపంచంలో కాంతి, ప్రేమ ఒకదాని కొకటి ప్రత్యామ్నాయాలు. అవి వేరు వేరు కావు. కాబట్టి జ్ఞానోదయాన్ని కోరుకున్నవాడు నిర్నిబంధమైన ప్రేమతోని నిండి వుండాలి. ప్రేమకు ఎట్లాంటి డిమాండ్లు వుండకూడదు. డిమాండ్లు ప్రేమని అసహ్యంగా మారుస్తాయి. ప్రేమని నాశనం చేస్తాయి. నీ ప్రేమకి నువ్వు నిబంధనలు ఏర్పరిస్తే అది ప్రేమగా వుండదు. అది శారీరక కాంక్ష అవుతుంది. అది రాజకీయ నాటకమవుతుంది. అధికార క్రీడగా మారుతుంది.*
*నీ ప్రేమ స్వచ్ఛంగా, నిర్నిబంధంగా వుండనీ. దానికి హద్దులేర్పరచకు. ఎవర్ని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమించాలి? అని కాక ఎట్లా ప్రేమపూరింతంగా వుండాలి అన్నదే ముఖ్యం. శరీరానికి శ్వాస అవసరం. అదే దాని జీవితం. ఆత్మకి ప్రేమ అవసరం. దాన్ని సజీవంగా వుంచేది అదే. ప్రేమించే కొద్దీ ఆత్మ ఎదుగుతుంది. నీ ప్రేమ అనంతమైతే నీ ఆత్మ శాశ్వతమవుతుంది. అప్పుడు ప్రేమకు సరిహద్దులుండవు. అదే దైవత్వాన్ని తెలుసుకోవడం.*
*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 333-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 333-2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 74. కళావతీ, కళాలాపా, కాంతా, కాదంబరీప్రియా ।*
*వరదా, వామనయనా, వారుణీమదవిహ్వలా ॥ 74 ॥ 🍀*
*🌻 333-2. 'వారుణీ మదవిహ్వలా' 🌻*
*పిండము నుండి మానవ దేహ మంతయూ నిర్మాణము చేయునది వారుణియే. మన సహస్రారము నుండి మూలాధారము వరకు వారుణీ ప్రవాహ ముండుటచే మనము భౌతికము వరకు కొనిరాబడినాము. జీవునిగా మనము మిత్ర తత్త్వమునకు (పురుషునకు) సంబంధించిన వారమే. మనకు ఏడు పొరల దేహము ఏర్పరచునది వారుణీ, వసించు వానికి సుఖము నివాసమును బట్టి ఉండును కదా! దేహము సుఖము నివ్వనిచో జీవుడు సుఖముగ నుండలేడు కదా! 'మదవిహ్వల' యనగా తాదాత్మ్యము చెందిననూ విహ్వలురాలు కాదని భావము.*
*సామాన్యముగ స్వాత్మానందమున వున్నవారు బాహ్య కారణములను మరతురు. స్వాత్మానందమున తన్మయత్వము చెందుచునే ఏమరపాటు చెందక సర్వమును నిర్వహించుట సామాన్యము కాదు. అది కేవలము శ్రీమాతకే సాధ్యము. భూమిని భరించుటలో ఆదిశేషువు, సృష్టిని భరించుటలో శ్రీమాత విహ్వలురు కారని పురాణములు వీరిరువురిని పొగుడుచున్నవి. అమితాన ము, అప్రమత్తత ఒకదాని కొకటి విరుద్ధమగు స్థితులు. రెంటినీ ఏకకాలమున నిర్వర్తించుట అసామాన్యమగు విషయమని తెలియవలెను.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 333-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 74. Kalavati kalalapa kanta kadanbari priya*
*Varada vamanayana varunimadavihvala ॥ 74 ॥ 🌻*
*🌻 333-2. Vāruṇi-mada-vihvalā वारुणि-मद-विह्वला (333) 🌻*
*Vāruṇi is the extract of dates that is allowed to brew and when consumed causes inebriation. By consuming this, She forgets the surroundings and concentrates on Her inner Self (possibly meaning Śiva) is the literal meaning of this nāma. This will be further explained in nāma 878.*
*There is a nāḍi (nerve) called vāruṇi which can be controlled by breath. This nāḍi plays a significant role in excretion of bodily waste. If this nāḍi is brought under control by proper breathing exercises, one will never feel tiredness in the body. Sages keep this nāḍi under their control to cope up with longer duration of meditation. She is said to be in form of this nāḍi. This nāma could not have been conceptualised by any human brain to convey such an intricate meaning, other than Vāc-devi-s.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://chat.whatsapp.com/KtLL1EZQceL1YLFwsAp8bh
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹