Showing posts with label భగవద్గీత 6వ అధ్యాయము. Show all posts
Showing posts with label భగవద్గీత 6వ అధ్యాయము. Show all posts

శ్రీమద్భగవద్గీత - 280: 06వ అధ్., శ్లో 47 / Bhagavad-Gita - 280: Chap. 06, Ver. 47

 

🌹. శ్రీమద్భగవద్గీత - 280 / Bhagavad-Gita - 280 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 47 🌴

47. యోగినామపి సర్వేషాంమద్గతేనాంతరాత్మనా ।
శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్తతమో మతః ।।


🌷. తాత్పర్యం :

అందరి యోగులలో కెల్లా, ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నా యందు ధృఢ విశ్వాసం తో భక్తితో ఉంటారో, వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను.

🌷. భాష్యము :

యోగులలో కూడా, కర్మ యోగులు, భక్తి యోగులు, జ్ఞాన యోగులు, అష్టాంగ యోగులు మొదలైన వారు ఉంటారు. ఏ రకమైన యోగులు శ్రేష్ఠమైన వారో అన్న వివాదానికి ఈ శ్లోకం ముగింపు ఇస్తున్నది. 'భక్తి యోగి' యే పరమ శ్రేష్ఠుడు, మరియు, సర్వోత్తమమైన అష్టాంగ యోగి మరియు హఠ యోగుల కన్నా ఉన్నతమైన వాడు, అని శ్రీ కృష్ణుడు ప్రకటిస్తున్నాడు. ఇది ఎందుకంటే, భక్తి అనేది భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. అది ఎంత బలీయమైనదంటే, అది భగవంతున్ని కట్టి పడేసి, ఆయనను భక్తునికి బానిస గా చేస్తుంది. అందుకే, భాగవతంలో ఆయన ఇలా చెప్పాడు:

అహం భక్త-పరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ

సాధుబిర్ గ్రస్త-హృదయో భక్తైర్ భక్త-జన-ప్రియః (9.4.63)

"నేను సర్వ-స్వతంత్రుడను అయినా, నేను నా భక్తులకు బానిసై పోతాను. వారు నా హృదయాన్ని జయిస్తారు. నా భక్తులే కాదు, నా భక్తుల భక్తులు కూడా నాకు చాలా ప్రియమైనవారు." భక్తి యోగి దివ్య ప్రేమ శక్తి కలిగి ఉంటాడు, అందుకే భగవంతునికి అత్యంత ప్రియమైన వాడు మరియు ఆయన చే అందరి కంటే అత్యున్నతంగా పరిగణించబడుతాడు.

ముక్తానాం అపి సిద్ధానాం నారాయణ-పరాయణః

సు-దుర్లభః ప్రశాంతాత్మా కోటిష్వపి మహా-మునే (భాగవతం 6.14.5)

"కోట్ల మంది పరిపూర్ణ సిద్ది సాధించి విముక్తి పొందిన మహాత్ములలో కూడా, సర్వోన్నత భగవానుడు అయిన శ్రీమన్నారాయణుడి పట్ల భక్తికల, ప్రశాంత చిత్తులు, చాలా అరుదు."

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 280 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 47 🌴

47. yoginām api sarveṣhāṁ mad-gatenāntar-ātmanā
śhraddhāvān bhajate yo māṁ sa me yuktatamo mataḥ


🌷 Translation :

Of all yogis, those whose minds are always absorbed in Me, and who engage in devotion to Me with great faith, them I consider to be the highest of all.

🌹 Purport :

Even amongst yogis, there are karm yogis, bhakti yogis, jñāna yogis, aṣhṭāṅg yogis, etc. This verse puts to rest the debate about which form of Yog is the highest. Shree Krishna declares the bhakti yogi to be the highest, superior to even the best aṣhṭāṅg yogi and haṭha yogi. That is because bhakti , or devotion, is the highest power of God. It is such a power that binds God and makes him a slave of his devotee. Thus, he states in the Bhāgavatam:

ahaṁ bhakta-parādhīno hyasvatantra iva dvija
sādhubhir grasta-hṛidayo bhaktair bhakta-jana-priyaḥ (9.4.63)[v27]

“Although I am supremely independent, yet I become enslaved by my devotees. They conquer my heart. What to speak of my devotees, even the devotees of my devotees are very dear to me.” The bhakti yogi possesses the power of divine love, and is thus most dear to God and considered by him to be the highest of all.

muktānām api siddhānāṁ nārāyaṇa-parāyaṇaḥ
su-durlabhaḥ praśhāntātmā koṭiṣhv api mahā-mune (Bhāgavatam 6.14.5)[v28]

“Amongst many millions of perfected and liberated saints, the peaceful person who is devoted to the Supreme Lord, Narayan, is very rare.”

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 279: 06వ అధ్., శ్లో 46 / Bhagavad-Gita - 279: Chap. 06, Ver. 46

 

🌹. శ్రీమద్భగవద్గీత - 279 / Bhagavad-Gita - 279 🌹

✍️. శ్రీ ప్రభుపాద 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 46 🌴

46. తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధిక: |
కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ||


🌷. తాత్పర్యం :

యోగియైన వాడు తపస్వి కన్నను, జ్ఞాని కన్నను, కామ్యకర్మరతుని కన్నను అధికుడైనట్టివాడు. కనుక ఓ అర్జునా! అన్ని పరిస్థితుల యందును నీవు యోగివి కమ్ము.

🌷. భాష్యము :

యోగమును గూర్చి చర్చించినపుడు దానిని స్వీయచైతన్యమును పరతత్వముతో సంధించు విధానముగా మనము అన్వయింతుము. అట్టి విధానము మనుజులు తామనుసరించు ప్రత్యేక పద్ధతిని బట్టి వివిధనామములతో పిలుతురు. కామ్యకర్మలు అధికముగా నున్నచో అట్టి అనుసంధాన పద్ధతి కర్మయోగామనియు, జ్ఞానముతో అధికముగా ముడివడి యున్నచో జ్ఞానయోగామనియు, శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తకార్యములతో నిండియున్నచో భక్తియోగమును పిలువబడును. తదుపరి శ్లోకములలో వివరింపబడినట్లు భక్తియోగమే(కృష్ణభక్తిరసభావనము) సర్వయోగములకు చరమ పూర్ణత్వమై యున్నది. భగవానుడు ఇచ్చట యోగము యొక్క అధిపత్యమును ధ్రువీకరుంచుచున్నను, దానిని భక్తియోగము కన్నను ఉత్తమమని మాత్రము పలికియుండలేదు.

వాస్తవమునకు భక్తియోగము సంపూర్ణ ఆధ్యాత్మికజ్ఞానమైనందున దానిని ఏ యోగము సైతము అతిశయింపలేదు. ఆత్మజ్ఞానములేని తపస్సు అసంపూర్ణమైనది. అలాగుననే భగవానుని శరణాగతి లేని జ్ఞానము సైతము అసంపూర్ణమై యున్నది. ఇక కృష్ణభక్తిభావన లేనటువంటి కామ్యకర్మ వృథాకాలవ్యయమే అయియున్నది. కనుకనే ఇచ్చట ఘనముగా కీర్తించబడిన యోగపద్ధతి వాస్తవమునకు భక్తియోగమే. ఈ విషయము రాబోవు శ్లోకములలో మరింత విపులముగా వివరింపబడినది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 279 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 46 🌴

46. tapasvibhyo ’dhiko yogī jñānibhyo ’pi mato ’dhikaḥ
karmibhyaś cādhiko yogī tasmād yogī bhavārjuna


🌷 Translation :

A yogī is greater than the ascetic, greater than the empiricist and greater than the fruitive worker. Therefore, O Arjuna, in all circumstances, be a yogī.

🌹 Purport :

When we speak of yoga we refer to linking our consciousness with the Supreme Absolute Truth. Such a process is named differently by various practitioners in terms of the particular method adopted. When the linking process is predominantly in fruitive activities it is called karma-yoga, when it is predominantly empirical it is called jñāna-yoga, and when it is predominantly in a devotional relationship with the Supreme Lord it is called bhakti-yoga. Bhakti-yoga, or Kṛṣṇa consciousness, is the ultimate perfection of all yogas, as will be explained in the next verse.

The Lord has confirmed herein the superiority of yoga, but He has not mentioned that it is better than bhakti-yoga. Bhakti-yoga is full spiritual knowledge, and therefore nothing can excel it. Asceticism without self-knowledge is imperfect. Empiric knowledge without surrender to the Supreme Lord is also imperfect. And fruitive work without Kṛṣṇa consciousness is a waste of time. Therefore, the most highly praised form of yoga performance mentioned here is bhakti-yoga, and this is still more clearly explained in the next verse.

🌹 🌹 🌹 🌹 🌹
 

శ్రీమద్భగవద్గీత - 278: 06వ అధ్., శ్లో 45 / Bhagavad-Gita - 278: Chap. 06, Ver. 45

 

🌹. శ్రీమద్భగవద్గీత - 278/ Bhagavad-Gita - 278 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 45 🌴


45. ప్రయత్నాద్ యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిష: |
అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్

🌷. తాత్పర్యం :

సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత పురోగతి కొరకు శ్రద్ధతో యత్నించినపుడు బహుజన్మల అభ్యాసము పిదప పూర్ణత్వమును బడసి, అంత్యమున పరమగతి పొందును.

🌷. భాష్యము :

పవిత్రము, సంపన్నవంతము లేదా ధర్మయుక్తమైన వంశమున జన్మించిన మనుజుడు యోగాభ్యాసమునకై తనకున్నటువంటి అనుకూల పరిస్థితులను గుర్తించి అసంపూర్ణముగా మిగిలిన తన కార్యమును తీవ్రనిశ్చయముతో ఆరంభించును. ఆ విధముగా అతడు సమస్త పాపముల నుండి తనను ముక్తుని గావించుకొనును. అతడట్లు అంత్యమున సర్వపాపముల నుండి విడివడినంతనే పరమ పూర్ణత్వమైనటువంటి కృష్ణభక్తిరసభావనము అతని ప్రాప్తించగలదు. అట్టి కృష్ణభక్తిరసభావనము సర్వవిధములైన కల్మషముల నుండి దూరమైన సంపూర్ణస్థితియై యున్నది. ఈ విషయము భగవద్గీత (7.28) యందే ఈ క్రింది విధముగా నిర్ధారింపబడినది.

యేషాం త్వన్తగతం పాపం జనానాం పుణ్యకర్మణామ్ |
తే ద్వన్ద్వమోహనిర్ముక్తా భజన్తే మాం దృఢవ్రతా:

“బహుజన్మల యందు పుణ్యకర్మల నొనరించి సర్వపాపముల నుండియు మరియు భ్రాంతిమయమగు ద్వంద్వముల నుండియు విముక్తుడైనపుడు మనుజుడు శ్రీకృష్ణభగవానుని ప్రేమయుతసేవ యందు నియుక్తుడు కాగలడు.”

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 278 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 45 🌴

45. prayatnād yatamānas tu yogī saṁśuddha-kilbiṣaḥ
aneka-janma-saṁsiddhas tato yāti parāṁ gatim



🌷 Translation :

And when the yogī engages himself with sincere endeavor in making further progress, being washed of all contaminations, then ultimately, achieving perfection after many, many births of practice, he attains the supreme goal.

🌹 Purport :

A person born in a particularly righteous, aristocratic or sacred family becomes conscious of his favorable condition for executing yoga practice. With determination, therefore, he begins his unfinished task, and thus he completely cleanses himself of all material contaminations. When he is finally free from all contaminations, he attains the supreme perfection – Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is the perfect stage of being freed of all contaminations. This is confirmed in the Bhagavad-gītā (7.28):

yeṣāṁ tv anta-gataṁ pāpaṁ
janānāṁ puṇya-karmaṇām
te dvandva-moha-nirmuktā
bhajante māṁ dṛḍha-vratāḥ

“After many, many births of executing pious activities, when one is completely freed from all contaminations, and from all illusory dualities, one becomes engaged in the transcendental loving service of the Lord.”

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 277: 06వ అధ్., శ్లో 44 / Bhagavad-Gita - 277: Chap. 06, Ver. 44

 


🌹. శ్రీమద్భగవద్గీత - 277 / Bhagavad-Gita - 277 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 44 🌴

44. పూర్వభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి స: |
జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతివర్తతే

🌷. తాత్పర్యం :

పూర్వజన్మపు దివ్యచైతన్య కారణముగా అతడు కోరకనే అప్రయత్నముగా యోగము వైపునకు ఆకర్షితుడగును. జిజ్ఞాసువైన అట్టి యోగి శాస్త్రములందు తెలుపబడిన కర్మనియమములకు సదా అతీతుడై యుండును.

🌷. భాష్యము :

ఉన్నతులైన యోగులు శాస్త్రములందు తెలుపబడిన కర్మల యెడ అంతగా ఆకర్షితులు కాక, ఉన్నతయోగ పూర్ణత్వమైన పూర్ణ కృష్ణభక్తిభావనకు తమను ఉద్దరింపచేసెడి యోగనియమముల వైపునకే అప్రయత్నముగా ఆకర్షితులగుదురు. ఉన్నతమైన యోగులు అట్లు వేదకర్మల యెడ చూపు ఉపేక్షను గూర్చి శ్రీమద్భాగవతము (శ్రీమద్భాగవతము 3.33.7) నందు ఈ విధముగా వివరింపబడినది.

అహో బత శ్వపచోతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యమ్ |

తేపు స్తపస్తే జుహువు: సస్నురార్యా బ్రహ్మానూచుర్నామ గృణన్తి యే తే

“హే ప్రభూ! శునకమాంసమును భుజించు చండాలుర వంశమున జన్మించినను నీ పవిత్రనామములను కీర్తించువారు ఆధ్యాత్మికజీవనమున పురోగతి సాధించునట్టివారే. అట్టి భక్తులు అన్నిరకములైన తపస్సులను, యజ్ఞములను ఆచరించినట్టివారే. అన్ని తీర్థ స్థానములలో స్నానమాడినట్టివారే, సకల శాస్త్రాధ్యయనమును గావించినట్టివారే.”

శ్రీహరిదాసటాకూరును ముఖ్యశిష్యులలో ఒకనిగా స్వీకరించుట ద్వారా శ్రీచైతన్యమాహాప్రభువు ఈ విషయమున ఒక చక్కని ఉదాహరణమును నెలకొల్పిరి. హరిదాసటాకురు మహ్మదీయవంశమున జన్మించినను శ్రీచైతన్యమహాప్రభువు ఆయనను “నామాచార్యుని” స్థానమనకు ఉద్ధరించిరి. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే/ హరే రామ హరే రామ రామ రామ హరే హరే యను మహామంత్రము ద్వారా మూడులక్షల హరినామమును విడువక పట్టుదలతో ఆయన నిత్యము జపించుటయే అందులకు కారణము.

హరినామమును నిరంతరము జపించుటను బట్టి శబ్దబ్రహ్మమని పిలువబడు వేదకర్మవిధానముల నన్నింటిని పూర్వజన్మమందే ఆయన పూర్తిచేసినట్లుగా అవగతమగుచున్నది. కనుకనే పవిత్రులు కానిదే ఎవ్వరును కృష్ణభక్తిరసభావనను స్వీకరించుట గాని, శ్రీకృష్ణుని పవిత్రనామమైన హరేకృష్ణ మాహామంత్రం జపకీర్తనములందు నియుక్తులగుట గాని సంభవించును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 277 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 44 🌴

44. pūrvābhyāsena tenaiva hriyate hy avaśo ’pi saḥ
jijñāsur api yogasya śabda-brahmātivartate


🌷 Translation :

By virtue of the divine consciousness of his previous life, he automatically becomes attracted to the yogic principles – even without seeking them. Such an inquisitive transcendentalist stands always above the ritualistic principles of the scriptures.

🌹 Purport :

Advanced yogīs are not very much attracted to the rituals of the scriptures, but they automatically become attracted to the yoga principles, which can elevate them to complete Kṛṣṇa consciousness, the highest yoga perfection. In the Śrīmad-Bhāgavatam (3.33.7), such disregard of Vedic rituals by the advanced transcendentalists is explained as follows:

aho bata śva-paco ’to garīyān yaj-jihvāgre vartate nāma tubhyam
tepus tapas te juhuvuḥ sasnur āryā brahmānūcur nāma gṛṇanti ye te

“O my Lord! Persons who chant the holy names of Your Lordship are far, far advanced in spiritual life, even if born in families of dog-eaters. Such chanters have undoubtedly performed all kinds of austerities and sacrifices, bathed in all sacred places and finished all scriptural studies.”

The famous example of this was presented by Lord Caitanya, who accepted Ṭhākura Haridāsa as one of His most important disciples. Although Ṭhākura Haridāsa happened to take his birth in a Muslim family, he was elevated to the post of nāmācārya by Lord Caitanya due to his rigidly attended principle of chanting three hundred thousand holy names of the Lord daily: Hare Kṛṣṇa, Hare Kṛṣṇa, Kṛṣṇa Kṛṣṇa, Hare Hare/ Hare Rāma, Hare Rāma, Rāma Rāma, Hare Hare. And because he chanted the holy name of the Lord constantly, it is understood that in his previous life he must have passed through all the ritualistic methods of the Vedas, known as śabda-brahma. Unless, therefore, one is purified, one cannot take to the principles of Kṛṣṇa consciousness or become engaged in chanting the holy name of the Lord, Hare Kṛṣṇa.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 276: 06వ అధ్., శ్లో 43 / Bhagavad-Gita - 276: Chap. 06, Ver. 43

 

🌹. శ్రీమద్భగవద్గీత - 276 / Bhagavad-Gita - 276 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 43 🌴

43. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికమ్ |
యతతే చ తతో భూయ: సంసిద్ధౌ కురునన్దన ||

🌷. తాత్పర్యం :

ఓ కురునందనా! అట్టి జన్మను పొందిన పిమ్మట అతడ గతజన్మపు దివ్యచైతన్యమును పునరిద్ధరించుకొని పూర్ణవిజయమును సాధించుటకు తిరిగి యత్నము కావించును.

🌷. భాష్యము :

పూర్వజన్మపు ఆధ్యాత్మిక చైతన్యమును జాగృతము చేయుటకు ఉత్తమజన్మ అవసరమనెడి విషయమునకు తన మూడవజన్మను ఉత్తమ బ్రహ్మణవంశములో పొందినట్టి భరతమాహారాజు వృత్తాంతము చక్కని ఉదాహరణమై యున్నది. భరతమాహారాజు సమస్త ప్రపంచమునకు చక్రవర్తియై యుండెను. అతని కాలము నుండియే ఈ లోకము భారతవర్షముగా దేవతాలోకములలో ప్రసిద్ధి నొందినది. పూర్వము ఇది ఇలావృతవర్షముగా తెలియబడెడిది. ప్రపంచాధినేతయైన అతడు ఆధ్యాత్మికసిద్ధిని గోరి యుక్తవయస్సు నందే కర్మల నుండి విరమణను పొందినను జయమును సాధింపలేకపోయెను.

తత్కారణముగా అతడు జన్మనెత్తవలసి వచ్చినను, మూడవజన్మను ఒక ఉత్తమబ్రాహ్మణుని ఇంట పొందెను. సదా ఏకాంతస్థలములో వసించుచు మౌనియై నిలిచినందున అతడు జడభరతుడని పిలువబడెను. కాని అతడు గొప్పయోగి యని తదనంతరము రహుగణుడను రాజు అవగతము చేసికొనగలిగెను. ఆధ్యాత్మిక యత్నములు (యోగాభ్యాసము) ఎన్నడును వృథా కావని భరతుని ఈ చరిత్ర ద్వారా అవగతమగుచున్నది. అనగా యోగాభ్యాసి శ్రీకృష్ణభగవానుని కరుణచే కృష్ణభక్తిభావన యందలి పూర్ణత్వమునకై అనుకూల పరిస్థితులను మరల మరల పొందుచునే యుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 276 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 43 🌴

43. tatra taṁ buddhi-saṁyogaṁ labhate paurva-dehikam
yatate ca tato bhūyaḥ saṁsiddhau kuru-nandana


🌷 Translation :

On taking such a birth, he revives the divine consciousness of his previous life, and he again tries to make further progress in order to achieve complete success, O son of Kuru.

🌹 Purport :

King Bharata, who took his third birth in the family of a good brāhmaṇa, is an example of good birth for the revival of previous transcendental consciousness. King Bharata was the emperor of the world, and since his time this planet has been known among the demigods as Bhārata-varṣa. Formerly it was known as Ilāvṛta-varṣa.

The emperor, at an early age, retired for spiritual perfection but failed to achieve success. In his next life he took birth in the family of a good brāhmaṇa and was known as Jaḍa Bharata because he always remained secluded and did not talk to anyone. And later on he was discovered as the greatest transcendentalist by King Rahūgaṇa. From his life it is understood that transcendental endeavors, or the practice of yoga, never go in vain. By the grace of the Lord the transcendentalist gets repeated opportunities for complete perfection in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 273: 06వ అధ్., శ్లో 40 / Bhagavad-Gita - 273: Chap. 06, Ver. 40

 

🌹. శ్రీమద్భగవద్గీత - 273 / Bhagavad-Gita as It is - 273🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 40 🌴

40. శ్రీ భగవానువాచ

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే |
న హి కల్యాణకృత్కశ్చిద్ దుర్గతిం తాత గచ్ఛతి


🌷. తాత్పర్యం :

శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ పార్థా! శుభకార్యముల యందు నియుక్తుడైనవాడు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశమును పొందడు. మిత్రమా! మంచి చేయువాడెన్నడును చెడుచే పరాజితుడు కాడు.

🌷. భాష్యము :

శ్రీమద్భాగవతము (1.5.17) నందు శ్రీనారదముని వ్యాసదేవునికి ఈ విధముగా ఉపదేశము కావించిరి.

త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే ర్భజన్నపక్వోథ పతేత్తతో యది |
యత్ర క్వ వాభద్ర మభూదముష్య కిమ్ కో వార్థ ఆప్తోభజతాం స్వధర్మత:

“భౌతికవాంఛల నన్నింటిని త్యజించి దేవదేవుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ శరణాగతిని బడసినవానికి ఏవిధమైన నష్టము గాని, వినాశము గాని ఉండదు. కాని అభక్తుడైనవాడు తన విధ్యుక్తధర్మములలో సంపూర్ణముగా నిమగ్నుడైనను పొందునదేదియును లేదు.” భౌతికవాంఛా పూర్ణమునకై శాస్త్రవిహితములు మరియు ఆచారవిహితములు అయిన పలుకర్మలు కలవు. యోగియైనవాడు ఆధ్యాత్మికపురోగతి కొరకై అట్టి సమస్త లౌకికకర్మలను త్యజింప వలసి యుండును.

కృష్ణభక్తిభావనను పూర్ణముగా అనుసరించినచో దాని ద్వారా మనుజుడు అత్యున్నత పూర్ణత్వము బడయుననుట సత్యమే అయినను ఒకవేళ అతడు పూర్ణత్వస్థితిని పొందకున్నచో భౌతికరంగమునందును మరియు ఆధ్యాత్మికరంగమందును నష్టపోయినట్లు కాడా యని కొందరు ప్రశ్నించు నవకాశము కలదు. కాని ఈ విషయమున చింత ఏమాత్రము వలదని సఫలీకృతుడు కానట్టి యోగికి శ్రీమద్భాగవతము హామీ ఇచ్చుచున్నది. కర్మనిర్వాహణను పూర్ణముగా ఒనరించని కారణమున ఒకవేళ వారు అట్లు కర్మఫలముల ననుభవింపవలసివచ్చినను వారు ఎట్టి నష్టము పొందబోరు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 273 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 40 🌴

40. śrī-bhagavān uvāca

pārtha naiveha nāmutra vināśas tasya vidyate
na hi kalyāṇa-kṛt kaścid durgatiṁ tāta gacchati



🌷 Translation :

The Supreme Personality of Godhead said: Son of Pṛthā, a transcendentalist engaged in auspicious activities does not meet with destruction either in this world or in the spiritual world; one who does good, My friend, is never overcome by evil.

🌹 Purport :

In the Śrīmad-Bhāgavatam (1.5.17) Śrī Nārada Muni instructs Vyāsadeva as follows:

tyaktvā sva-dharmaṁ caraṇāmbujaṁ harer bhajann apakvo ’tha patet tato yadi
yatra kva vābhadram abhūd amuṣya kiṁ ko vārtha āpto ’bhajatāṁ sva-dharmataḥ

“If someone gives up all material prospects and takes complete shelter of the Supreme Personality of Godhead, there is no loss or degradation in any way. On the other hand a nondevotee may fully engage in his occupational duties and yet not gain anything.” For material prospects there are many activities, both scriptural and customary. A transcendentalist is supposed to give up all material activities for the sake of spiritual advancement in life, Kṛṣṇa consciousness. One may argue that by Kṛṣṇa consciousness one may attain the highest perfection if it is completed, but if one does not attain such a perfectional stage, then he loses both materially and spiritually.

The Bhāgavatam assures the unsuccessful transcendentalist that there need be no worries. Even though he may be subjected to the reaction for not perfectly executing prescribed duties, he is still not a loser, because auspicious Kṛṣṇa consciousness is never forgotten, and one so engaged will continue to be so even if he is lowborn in the next life. On the other hand, one who simply follows strictly the prescribed duties need not necessarily attain auspicious results if he is lacking in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 266: 06వ అధ్., శ్లో 33 / Bhagavad-Gita - 266: Chap. 06, Ver. 33

 

🌹. శ్రీమద్భగవద్గీత - 266 / Bhagavad-Gita - 266 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 33 🌴


33. అర్జున ఉవాచ

యోయం యోగస్త్వయా ప్రోక్త: సామ్యేన మధుసూదన |
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ||


🌷. తాత్పర్యం :

అర్జునుడు పలికెను : ఓ మధుసుదనా! మనస్సు చంచలమును మరియు అస్థిరమును అయియున్నందున నీవు సంగ్రహముగా తెలిపినటువంటి యోగపద్ధతి ఆచరణకు అసాధ్యమైనదిగను మరియు ఓర్వరానిదిగను నాకు తోచుచున్నది.


🌷. భాష్యము :

“శుచౌదేశే” యను పదముతో ఆరంభమై “యోగీపరమ:” యను పదముతో సమాప్తి నొందెడి యోగపద్ధతిని శ్రీకృష్ణుడు అర్జునునకు వివరించగా, దానికి తాను అశక్తుడననెడి భావనలో అతడు ఆ పద్ధతిని ఇచ్చట తిరస్కరించుచున్నాడు. కలియుగములో సాధారణమానవునకు గృహమును విడిచి కొండలలోనో, అడవులలోనో ఏకాంతస్థలమునకు పోయి యోగాభ్యాసము చేయుట సాధ్యము కానటువంటి విషయము. స్వల్పజీవితము కొరకు తీవ్రసంఘర్షణ యనునది ఈ యుగలక్షణమై యున్నది.

ఈ కాలమున జనులు ఆత్మానుభూతి విషయమున శ్రద్ధారహితులై యున్నారు. సామాన్యములు మరియు ఆచరణయోగ్యములైన పద్ధతులనే వారు స్వీకరింపలేరన్నచో నియమితజీవనము, ప్రత్యేక ఆసనపద్ధతి, స్థాననిర్దేసము, విషయకర్మల నుండి మనోనిగ్రహము వంటి కఠినకార్యములు గల యోగపద్ధతిని అనుసరింపలేరనెడి విషయమును గూర్చి వేరుగా చెప్పపనిలేదు. పలు అనుకూలపరిస్థితులను కలిగియున్నప్పటికిని క్రియాశీలునిగా అర్జునుడు అట్టి యోగము నాచరించుట తనకు సాధ్యము కాదని భావించెను. రాచవంశమునకు చెందిన అతడు పలుయోగ్యతల దృష్ట్యా అత్యంత ఉన్నతుడై యుండెను.

అతడు గొప్ప వీరుడు, దీర్ఘాయువు గలవాడు మరియు అన్నింటికి మించి దేవదేవుడైన శ్రీకృష్ణునికి ప్రియమిత్రుడు. ఐదువేల సంవత్సరములకు పూర్వము అర్జునుడు ప్రస్తుతము మనకున్నటువంటి పరిస్థితుల కన్నను చక్కని అనుకూల పరిస్థితులను కలిగియున్నను ఈ యోగపద్ధతిని తిరస్కరించెను. అతడు యోగమును ఆచరించినట్లుగా మనకెటువంటి చారిత్రికాధారము లభింపదు. కనకనే ఈ యోగపద్ధతి కలియుగమున అసాధ్యమని భావింపబడినది.

ఒకవేళ ఏ కొద్దిమందికో (అసాధారణ పురుషులు) సాధ్యపడినను జనసామాన్యమునకు మాత్రము ఇది మిగుల అసాధ్యము. ఐదువేల సంవత్సరముల క్రిందటే దీని విషయమిట్లుండ ఇక నేటి పరిస్థితి యేమిటి? నామమాత్ర యోగశాలల యందు మరియు సంఘములందు ఈ యోగవిధానము అనుకరింప యత్నించువారు తమను తాము కృతార్థులుగా భావించును, నిక్కముగా కాలమును వృథాపరచునట్టివారే యగుచున్నారు. వాంఛితమగు లక్ష్యమును గూర్చిన విషయమున వారు సంపూర్ణముగా అజ్ఞానులై యున్నారు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 266 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 33 🌴


33. arjuna uvāca

yo ’yaṁ yogas tvayā proktaḥ sāmyena madhusūdana
etasyāhaṁ na paśyāmi cañcalatvāt sthitiṁ sthirām


🌷 Translation :

Arjuna said: O Madhusūdana, the system of yoga which You have summarized appears impractical and unendurable to me, for the mind is restless and unsteady.


🌹 Purport :

The system of mysticism described by Lord Kṛṣṇa to Arjuna beginning with the words śucau deśe and ending with yogī paramaḥ is here being rejected by Arjuna out of a feeling of inability. It is not possible for an ordinary man to leave home and go to a secluded place in the mountains or jungles to practice yoga in this Age of Kali. The present age is characterized by a bitter struggle for a life of short duration. People are not serious about self-realization even by simple, practical means, and what to speak of this difficult yoga system, which regulates the mode of living, the manner of sitting, selection of place, and detachment of the mind from material engagements. As a practical man, Arjuna thought it was impossible to follow this system of yoga, even though he was favorably endowed in many ways.

He belonged to the royal family and was highly elevated in terms of numerous qualities; he was a great warrior, he had great longevity, and, above all, he was the most intimate friend of Lord Kṛṣṇa, the Supreme Personality of Godhead. Five thousand years ago, Arjuna had much better facilities than we do now, yet he refused to accept this system of yoga. In fact, we do not find any record in history of his practicing it at any time. Therefore this system must be considered generally impossible in this Age of Kali. Of course it may be possible for some very few, rare men, but for the people in general it is an impossible proposal.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 265: 06వ అధ్., శ్లో 32 / Bhagavad-Gita - 265: Chap. 06, Ver. 32

 

🌹. శ్రీమద్భగవద్గీత - 265 / Bhagavad-Gita - 265 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 32 🌴

32. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున |
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మత: ||


🌷. తాత్పర్యం :

ఓ అర్జునా! ఎవడు తనతో పోల్చుకొని సమస్తజీవులకు వాటి సుఖదుఃఖములందు సమముగా గాంచునో అతడే ఉత్తమయోగి యనబడును.

🌷. భాష్యము :

తన స్వానుభవకారణముగా సర్వుల సుఖదుఃఖములను తెలిసియుండెడి కృష్ణభక్తిరసభావితుడు వాస్తవమునకు ఉత్తమయోగి యనబడును. భగవానునితో తనకు గల సంబధమును మరచుటయే జీవుని దుఃఖమునకు కారణమై యున్నది.

కాని శ్రీకృష్ణుడే సర్వమానవకర్మలకు దివ్యభోక్తయనియు, సమస్తజగములకు ప్రభువనియు, సర్వజీవుల ఆప్తమిత్రుడనియు ఎరుగుటయే జీవుని సుఖశాంతులకు కారణము కాగలదు.

ప్రకృతిజన్య త్రిగుణములకు లొంగి యుండెడి జీవుడు తనకు శ్రీకృష్ణునితో గల సంబంధమును మరచుట చేతనే తాపత్రయములకు లోనగునని యోగియైనవాడు ఎరిగియుండును.

కృష్ణభక్తిభావన యందు నిలుచు అట్టి యోగి సుఖియై యుండును కనుక కృష్ణసంబంధ విజ్ఞానమును సర్వులకు పంచుటకు యత్నించును.

ప్రతియొక్కరు కృష్ణభక్తిరసభావితులు కావలసిన అవశ్యకతను అతడు ప్రచారము చేయ యత్నించునందున అతడే నిజముగా జగములో ఉత్తమమైన జహితైషియు మరియు శ్రీకృష్ణునకు ప్రియతమ సేవకుడును కాగలడు. “న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమ:” ( భగవద్గీత 18.69).

అనగా భక్తుడు సదా జీవులందరి క్షేమమును గాంచుట సర్వులకు ఆప్తమిత్రుడు కాగలడు. యోగమునందు పూర్ణత్వమును స్వీయలాభాపేక్ష కొరకు గాక కేవలము ఇతరుల కొరకే ఉపయోగించు కారణమున అతడు ఉత్తమయోగియు కాగలడు.

ఇతర జీవుల యెడ అతడెన్నడును ఈర్ష్యను కలిగియుండడు. విశుద్ధభక్తునికి మరియు స్వీయోద్ధారమునకై యత్నించు సాధారణయోగికి నడుమ వ్యత్యాసము ఇచ్చటనే యున్నది.

కనుకనే చక్కగా ధ్యానము చేయుట కొరకు ఏకాంతస్థలమునకు పోవు యోగి, ప్రతియొక్కరికి తన శక్తి కొలది కృష్ణభక్తిరసభావితులుగా మార్చ యత్నము చేయు భక్తుని కన్నను పూర్ణుడు కానేరడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 265 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 32 🌴

32. ātmaupamyena sarvatra samaṁ paśyati yo ’rjuna
sukhaṁ vā yadi vā duḥkhaṁ sa yogī paramo mataḥ


🌷 Translation :

He is a perfect yogī who, by comparison to his own self, sees the true equality of all beings, in both their happiness and their distress, O Arjuna!


🌹 Purport :

One who is Kṛṣṇa conscious is a perfect yogī; he is aware of everyone’s happiness and distress by dint of his own personal experience. The cause of the distress of a living entity is forgetfulness of his relationship with God.

And the cause of happiness is knowing Kṛṣṇa to be the supreme enjoyer of all the activities of the human being, the proprietor of all lands and planets, and the sincerest friend of all living entities.

The perfect yogī knows that the living being who is conditioned by the modes of material nature is subjected to the threefold material miseries due to forgetfulness of his relationship with Kṛṣṇa. And because one in Kṛṣṇa consciousness is happy, he tries to distribute the knowledge of Kṛṣṇa everywhere.

Since the perfect yogī tries to broadcast the importance of becoming Kṛṣṇa conscious, he is the best philanthropist in the world, and he is the dearest servitor of the Lord. Na ca tasmān manuṣyeṣu kaścin me priya-kṛttamaḥ (Bg. 18.69).

In other words, a devotee of the Lord always looks to the welfare of all living entities, and in this way he is factually the friend of everyone.

He is the best yogī because he does not desire perfection in yoga for his personal benefit, but tries for others also. He does not envy his fellow living entities. Here is a contrast between a pure devotee of the Lord and a yogī interested only in his personal elevation.

The yogī who has withdrawn to a secluded place in order to meditate perfectly may not be as perfect as a devotee who is trying his best to turn every man toward Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీమద్భగవద్గీత - 263: 06వ అధ్., శ్లో 30 / Bhagavad-Gita - 263: Chap. 06, Ver. 30

 

🌹. శ్రీమద్భగవద్గీత - 263 / Bhagavad-Gita - 263 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 30 🌴


30. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి |
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి

🌷. తాత్పర్యం :

నన్ను సర్వత్రా వీక్షించు వానికి మరియు నా యందు సమస్తము గాంచు వానికి నేను కనబడక పోవుట గాని, నాకు అతడు కనబడక పోవుట గాని జరుగదు.

🌷. భాష్యము :

కృష్ణభక్తిభావన యందున్నవాడు శ్రీకృష్ణభగవానుడు సర్వత్రా నిలిచియున్నట్లుగా నిక్కము గాంచగలుగును. అంతియేగాక అతడు ఆ దేవదేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టివాడు ప్రకృతి యొక్క విభిన్నరూపములను దర్శించినట్లు గోచరించినను సర్వము శ్రీకృష్ణుని శక్తిప్రదర్శనమే యని తెలిసికొని అన్నివేళలా కృష్ణభక్తిభావన యందు నిలిచియుండును. సర్వమునకు శ్రీకృష్ణుడే ప్రభువు మరియు కృష్ణుడు లేకుండా ఏదియును స్థితిని కలిగియుండలేదన్న భావనయే కృష్ణభక్తిరసభావనపు మూలసిద్ధాంతము. కృష్ణప్రేమ వృద్ధియే కృష్ణభక్తిరసభావనము. అట్టి దివ్యస్థితి లౌకికముక్తికి సైతము అతీతమై యున్నది.

ఆత్మానుభవమునకు అతీతమైన అట్టి కృష్ణప్రేమను పొందిన స్థితిలో భక్తుడు కృష్ణునితో ఏకమగును. అనగా భక్తునకు కృష్ణుడే సర్వస్వమై నిలుచును మరియు భక్తుడు అట్టి కృష్ణప్రేమతో నిండిపోవును. అంతట భగవానుడు మరియు భక్తుని నడుమ ఒక సన్నహిత సంబంధము ఏర్పడును. అటువంటి స్థితిలో జీవుడు నశించుట గాని, భగవానుడు భక్తుని చూపు నుండి దూరమగుట గాని జరుగదు. వాస్తవమునకు కృష్ణుని యందు లీనమగుట యనునది ఆధ్యాత్మికనశింపు వంటిది. కనుకనే భక్తుడు అట్టి ప్రమాదమును కొనితెచ్చుకొనడు. బ్రహ్మసంహిత (5.38) యందు ఇట్లు తెలుపబడినది.

ప్రేమాంజనచ్చురితభక్తివిలోచనేన సన్తస్సదైవ హృదయేషు విలోకయన్తి |
యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆదిపురుషం తమహం భజామి

“ప్రేమాంజనమును కనులకు పూసూకొనియున్న భక్తులచే సదా వీక్షింపబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తుని హృదయములో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపముతో సదా దర్శితమై యుండును.”

ఇటువంటి స్థితిలో భక్తుని చూపునకు శ్రీకృష్ణుడు ఎన్నడును దూరము కాడు. అలాగుననే భక్తుడును శ్రీకృష్ణభగవానుని దృష్టి నుండి దూరముగా పోడు. దేవదేవుడైన శ్రీకృష్ణుని హృదయస్థ పరమాత్మగా వీక్షించు యోగి విషయమును ఇది వర్తించును. అట్టి యోగి క్రమముగా శుద్ధభక్తునిగా మారి, హృదయమునందు శ్రీకృష్ణుని గాంచకుండా క్షణకాలమును జీవించలేని స్థితికి వచ్చును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 263 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 30 🌴


30. yo māṁ paśyati sarvatra sarvaṁ ca mayi paśyati
tasyāhaṁ na praṇaśyāmi sa ca me na praṇaśyati

🌷 Translation :

For one who sees Me everywhere and sees everything in Me, I am never lost, nor is he ever lost to Me.

🌹 Purport :

A person in Kṛṣṇa consciousness certainly sees Lord Kṛṣṇa everywhere, and he sees everything in Kṛṣṇa. Such a person may appear to see all separate manifestations of the material nature, but in each and every instance he is conscious of Kṛṣṇa, knowing that everything is a manifestation of Kṛṣṇa’s energy. Nothing can exist without Kṛṣṇa, and Kṛṣṇa is the Lord of everything – this is the basic principle of Kṛṣṇa consciousness. Kṛṣṇa consciousness is the development of love of Kṛṣṇa – a position transcendental even to material liberation.

At this stage of Kṛṣṇa consciousness, beyond self-realization, the devotee becomes one with Kṛṣṇa in the sense that Kṛṣṇa becomes everything for the devotee and the devotee becomes full in loving Kṛṣṇa. An intimate relationship between the Lord and the devotee then exists. In that stage, the living entity can never be annihilated, nor is the Personality of Godhead ever out of the sight of the devotee. To merge in Kṛṣṇa is spiritual annihilation. A devotee takes no such risk. It is stated in the Brahma-saṁhitā (5.38):

premāñjana-cchurita-bhakti-vilocanena

santaḥ sadaiva hṛdayeṣu vilokayanti

yaṁ śyāmasundaram acintya-guṇa-svarūpaṁ

govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi

“I worship the primeval Lord, Govinda, who is always seen by the devotee whose eyes are anointed with the pulp of love. He is seen in His eternal form of Śyāmasundara, situated within the heart of the devotee.”

At this stage, Lord Kṛṣṇa never disappears from the sight of the devotee, nor does the devotee ever lose sight of the Lord. In the case of a yogī who sees the Lord as Paramātmā within the heart, the same applies.

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీమద్భగవద్గీత - 262: 06వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 262: Chap. 06, Ver. 29

 

🌹. శ్రీమద్భగవద్గీత - 262 / Bhagavad-Gita - 262 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 29 🌴

29. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శన: ||


🌷. తాత్పర్యం :

నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును గాంచును. ఆత్మదర్శియైన అట్టివాడు దేవదేవుడైన నన్నే నిక్కముగా సర్వత్రా గాంచును.

🌷. భాష్యము :

సర్వుల హృదయములలో పరమాత్మ రూపున స్థితుడై యున్న శ్రీకృష్ణభగవానుని గాంచగలిగినందున కృష్ణభక్తిరసభావితుడైన యోగి నిజమైన ద్రష్ట యనబడును. “ఈశ్వర: సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి”. శ్రీకృష్ణభగవానుడు పరమాత్మ రూపములో శునక హృదయము నందును మరియు బ్రహ్మణుని హృదయమునందును నిలిచి యుండును. ఆ భగవానుడు నిత్యముగా భౌతికముగా ప్రభావితుడు కాడనియు పూర్ణయోగి ఎరిగి యుండును. ఆ విధముగా భౌతికత్వముచే ప్రభావితము కాకుండుటయే భగవానుని దివ్యమైన తటస్థ స్వభావమై యున్నది. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమందు నిలిచియున్న పరమాత్మ వలె అది ఎల్లరి హృదయములలో నిలిచియుండలేదు.

ఇదియే జీవాత్మ మరియు పరమాటం నడుమ గల భేదము. నిజమైన యోగాభ్యాసము నందు నియుక్తుడు కానివాడు ఈ విషయమున స్పష్టముగా గాంచలేదు. బాహ్యమునను జీవులు సదా భగవానుని శక్తి యందే నిలిచి యుందురు. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు ఆధ్యాత్మికశక్తి (ఉత్తమము), భౌతికశక్తి (అల్పము) యను రెండు శక్తులను శ్రీకృష్ణభగవానుడు ప్రధానముగా కలిగియుండును. జీవుడు ఉత్తమశక్తి అంశయైన అల్పమైన భౌతికశక్తిచే బద్ధుడై యుండును. ఈ విధముగా అతడు సర్వదా భగవానుని శక్తి యందున్నట్టివాడే. అనగా జీవుడు భగవానుని యందే ఏదో ఒక విధముగా స్థితిని కలిగియున్నట్టివాడే యగుచున్నాడు.

జీవులు తమ కర్మఫలముల ననుసరించి వివిధస్థితుల యందున్నప్పటికిని ఆన్ని పరిస్థితుల యందును వారు శ్రీకృష్ణభగవానుని దాసులే యని గాంచగలిగినందున యోగి సమదర్శియై యుండును. భౌతికశక్తి యందు నిలిచినపుడు జీవుడు ఇంద్రియములను సేవించును. కాని అదే జీవుడు ఆధ్యాత్మికశక్తి యందు నిలిచినప్పుడు మాత్రము ప్రత్యక్షముగా భగవానుని సేవించును. ఈ విధముగా రెండు పరిస్థితుల యందును అతడు భగవానుని దాసుడే. ఇట్టి సమత్వ వీక్షణము కృష్ణభక్తిభావనాపూర్ణుడైన వ్యక్తి యందు పూర్ణముగా నుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 262 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 29 🌴

29. sarva-bhūta-stham ātmānaṁ sarva-bhūtāni cātmani
īkṣate yoga-yuktātmā sarvatra sama-darśanaḥ


🌷 Translation :

A true yogī observes Me in all beings and also sees every being in Me. Indeed, the self-realized person sees Me, the same Supreme Lord, everywhere.

🌹 Purport :

A Kṛṣṇa conscious yogī is the perfect seer because he sees Kṛṣṇa, the Supreme, situated in everyone’s heart as Supersoul (Paramātmā). Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe ’rjuna tiṣṭhati. The Lord in His Paramātmā feature is situated within both the heart of the dog and that of a brāhmaṇa. The perfect yogī knows that the Lord is eternally transcendental and is not materially affected by His presence in either a dog or a brāhmaṇa. That is the supreme neutrality of the Lord. The individual soul is also situated in the individual heart, but he is not present in all hearts.

That is the distinction between the individual soul and the Supersoul. Outwardly, also, every living being is situated in the energy of the Lord. As will be explained in the Seventh Chapter, the Lord has, primarily, two energies – the spiritual (or superior) and the material (or inferior). The living entity, although part of the superior energy, is conditioned by the inferior energy; the living entity is always in the Lord’s energy. Every living entity is situated in Him in one way or another.

The yogī sees equally because he sees that all living entities, although in different situations according to the results of fruitive work, in all circumstances remain the servants of God. While in the material energy, the living entity serves the material senses; and while in the spiritual energy, he serves the Supreme Lord directly. In either case the living entity is the servant of God. This vision of equality is perfect in a person in Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 261: 06వ అధ్., శ్లో 28 / Bhagavad-Gita - 261: Chap. 06, Ver. 28

 

🌹. శ్రీమద్భగవద్గీత - 261 / Bhagavad-Gita - 261 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 28 🌴

28. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మష: |
సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యన్తం సుఖమశ్నుతే ||


🌷. తాత్పర్యం :

ఆ విధముగా ఆత్మనిగ్రహుడైన యోగి నిరంతరము యోగము నభ్యసించును భౌతికకల్మషములకు దూరుడై, భగవానుని దివ్యమైన ప్రేమయుతసేవ యందు అత్యున్నతమైన పూర్ణానందస్థితిని పొందును.

🌷. భాష్యము :

భగవానుని సంబంధములో తన నిజస్థితిని మనుజుడు తెలిసికొనగలుగుటయే ఆత్మానుభవమనబడును. ఆత్మ శ్రీకృష్ణభగవానుని అంశయైనందున ఆ దేవదేవునికి సేవను గూర్చుటయే దాని నిజస్థితియై యున్నది. ఆత్మకు భగవానునితో గల ఇట్టి దివ్యసంబంధమే “బ్రహ్మసంస్పర్శ” మని పిలువబడును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 261 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 28 🌴

28. yuñjann evaṁ sadātmānaṁ yogī vigata-kalmaṣaḥ
sukhena brahma-saṁsparśam atyantaṁ sukham aśnute



🌷 Translation :

Thus the self-controlled yogī, constantly engaged in yoga practice, becomes free from all material contamination and achieves the highest stage of perfect happiness in transcendental loving service to the Lord.

🌹 Purport :

Self-realization means knowing one’s constitutional position in relationship to the Supreme. The individual soul is part and parcel of the Supreme, and his position is to render transcendental service to the Lord. This transcendental contact with the Supreme is called brahma-saṁsparśa.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 260: 06వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 260: Chap. 06, Ver. 27

 


🌹. శ్రీమద్భగవద్గీత - 260 / Bhagavad-Gita - 260 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 27 🌴

27. ప్రశాన్తమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ |
ఉపైతి శాన్తరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ||


🌷. తాత్పర్యం :

నా యందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పుర్ణత్వమును బడయును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఎకతము నెరిగి పూర్వ కర్మఫలములన్నింటి నుండియు ముక్తుడగును.

🌷. భాష్యము :

భౌతికసంపర్కము నుండి ముక్తిని పొంది శ్రీకృష్ణభగవానుని దివ్యమైన భక్తియుక్తసేవలో నిలిచియుండు స్థితియే “బ్రహ్మభూతస్థితి” యనబడును.

“మధ్బక్తిం లభతే పరామ్” (భగవద్గీత 18.54) – మనస్సు శ్రీకృష్ణుని చరణకమలములపై లగ్నము కానిదే ఎవ్వరును బ్రహ్మభావనలో నిలిచియుండలేరు. “స వై మన: కృష్ణపదారవిందయో:”.

దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్యమైన భక్తియోగము నందు సదా నిలిచియండుటయే (కృష్ణభక్తిరసభావన యందు మగ్నమగుటయే) వాస్తవమునకు రజోగుణము నుండియు మరియు సమస్త భౌతికసంపర్కము నుండియు ముక్తిని పొందుటయై యున్నది.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 260 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 27 🌴

27. praśānta-manasaṁ hy enaṁ yoginaṁ sukham uttamam
upaiti śānta-rajasaṁ brahma-bhūtam akalmaṣam

🌷 Translation :

The yogī whose mind is fixed on Me verily attains the highest perfection of transcendental happiness. He is beyond the mode of passion, he realizes his qualitative identity with the Supreme, and thus he is freed from all reactions to past deeds.

🌹 Purport :

Brahma-bhūta is the state of being free from material contamination and situated in the transcendental service of the Lord. Mad-bhaktiṁ labhate parām (Bg. 18.54).

One cannot remain in the quality of Brahman, the Absolute, until one’s mind is fixed on the lotus feet of the Lord. Sa vai manaḥ kṛṣṇa-padāravindayoḥ.

To be always engaged in the transcendental loving service of the Lord, or to remain in Kṛṣṇa consciousness, is to be factually liberated from the mode of passion and all material contamination.

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 259: 06వ అధ్., శ్లో 26 / Bhagavad-Gita - 259: Chap. 06, Ver. 26

 

🌹. శ్రీమద్భగవద్గీత - 259 / Bhagavad-Gita - 259 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 26 🌴

26. యతో యతో నిశ్చలతి మనశ్చంచలమస్థిరమ్ |
తతస్తతో నియమ్యైతదాత్యన్యేవ వశం నయేత్ ||


🌷. తాత్పర్యం :

చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.

🌷. భాష్యము :

చంచలత్వము, అస్థిరత్వమనునవి మనస్సు యొక్క స్వభావములు. కాని ఆత్మదర్శియైన యోగి అట్టి మనస్సును నియమింపవలెను. దానిచే అతడెన్నడును నియమింపబడరాదు. మనస్సును నియమించినవాడు (తద్ద్వారా ఇంద్రియములను నియమించినవాడు) గోస్వామి లేదా స్వామి యనబడును. అట్లుగాక మనస్సు చేతనే నియమింప బడెడివాడు గోదాసుడు లేదా ఇంద్రియదాసుడని పిలువబడును.

ఇంద్రియముల వలన కలిగే ఆనందపు పరిమాణమును గోస్వామి ఎరిగియుండును. కనుకనే దివ్యానంద భావనలో అతని ఇంద్రియములు హృషీకేశుని (ఇంద్రియాధినేతయైన శ్రీకృష్ణుడు) సేవ యందు నియుక్తమై యుండును. ఆ విధముగా పవిత్రములైన ఇంద్రియములతో కృష్ణుని సేవించుటయే కృష్ణభక్తిరసభావనమనబడును.

ఇంద్రియములను అదుపులోనికి తెచ్చుటకు ఇదియే ఉత్తమమార్గము. యోగాభ్యాసపు అత్యున్నత పూర్ణత్వమైన దీనికి మించినది వేరొక్కటి లేదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 259 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 26 🌴

26. yato yato niścalati manaś cañcalam asthiram
tatas tato niyamyaitad ātmany eva vaśaṁ nayet


🌷 Translation :

From wherever the mind wanders due to its flickering and unsteady nature, one must certainly withdraw it and bring it back under the control of the Self.

🌹 Purport :

The nature of the mind is flickering and unsteady. But a self-realized yogī has to control the mind; the mind should not control him. One who controls the mind (and therefore the senses as well) is called gosvāmī, or svāmī, and one who is controlled by the mind is called go-dāsa, or the servant of the senses. A gosvāmī knows the standard of sense happiness. In transcendental sense happiness, the senses are engaged in the service of Hṛṣīkeśa, or the supreme owner of the senses – Kṛṣṇa. Serving Kṛṣṇa with purified senses is called Kṛṣṇa consciousness.

That is the way of bringing the senses under full control. What is more, that is the highest perfection of yoga practice.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 258: 06వ అధ్., శ్లో 25 / Bhagavad-Gita - 258: Chap. 06, Ver. 25

 

🌹. శ్రీమద్భగవద్గీత - 258 / Bhagavad-Gita - 258 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 25 🌴

25. శనై: శనైరుపరమేద్ బుద్ధ్యా ధృతిగృహీతయా |
ఆత్మసంస్థం మన: కృత్వా న కించిదపి చిన్తయేత్ ||


🌷. తాత్పర్యం :

నిశ్చయమైన బుద్ధితో క్రమముగా నెమ్మది నెమ్మదిగా మనుజుడు సమాధిమగ్నుడు కావలెను. ఆ విధముగా మనస్సును ఆత్మ యందే నిలిపి అతడు ఇక దేనిని గూర్చియు చింతింపరాదు.

🌷. భాష్యము :

సరియైన నిశ్చయము మరియు బుద్ధి ద్వారా మనుజుడు ఇంద్రియకర్మల నుండి క్రమముగా విరమణను పొందవలెను. ఇదియే “ప్రత్యాహారము” అనబడును. అనగా నిశ్చయము, ధ్యానము, ఇంద్రియకర్మల నుండి విరమణ ద్వారా మనస్సును సమాధి యందు లగ్నము చేయవలెను. ఆ సమయమున భౌతికభావన యందు కూరుకొనిపోవుట యనెడి భయము ఏమాత్రము కలుగదు.

వేరుమాటలలో దేహమున్నంతవరకు మనుజుడు భౌతిక విషయములను కూడియుండ వలసి వచ్చును ఇంద్రియతృప్తి భావనను మాత్రము కలిగియుండరాదు. శ్రీకృష్ణభగవానుని ప్రియమునకు అన్యమైన ప్రియమును గూర్చి అతడు చింతింపరాదు. ఇట్టి దివ్యస్థితి కృష్ణపరమగు కర్మల యందు ప్రత్యక్షముగా పాల్గొనుట ద్వారా సులభముగా ప్రాప్తించగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 258 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 25 🌴

25. śanaiḥ śanair uparamed buddhyā dhṛti-gṛhītayā
ātma-saṁsthaṁ manaḥ kṛtvā na kiñcid api cintayet

🌷 Translation :

Gradually, step by step, one should become situated in trance by means of intelligence sustained by full conviction, and thus the mind should be fixed on the Self alone and should think of nothing else.

🌹 Purport :

By proper conviction and intelligence one should gradually cease sense activities. This is called pratyāhāra. The mind, being controlled by conviction, meditation and cessation from the senses, should be situated in trance, or samādhi. At that time there is no longer any danger of becoming engaged in the material conception of life.

In other words, although one is involved with matter as long as the material body exists, one should not think about sense gratification. One should think of no pleasure aside from the pleasure of the Supreme Self. This state is easily attained by directly practicing Kṛṣṇa consciousness.

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీమద్భగవద్గీత - 257: 06వ అధ్., శ్లో 24 / Bhagavad-Gita - 257: Chap. 06, Ver. 24

 

🌹. శ్రీమద్భగవద్గీత - 257 / Bhagavad-Gita - 257 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 24 🌴

24. స నిశ్చయేన యోక్తవ్యో యోగోనిర్విణ్ణ చేతసా |
సంకల్పప్రభవాన్ కామాంస్త్యక్త్వా సర్వాన శేషత: |
మనసైవేన్ద్రియగ్రామం వినియమ్యసమన్తత:


🌷. తాత్పర్యం :

స్థిరనిశ్చయముతో శ్రద్ధను కలిగి యోగము నభ్యసించుచు మనుజుడు ఆ మార్గము నుండు వైదొలగక యుండవలెను. మానసికకల్పనల నుండి ఉత్పన్నమైన విషయకోరికల నన్నింటిని ఎటువంటి మినహాయింపు లేకుండా త్యజించి, అతడు మనస్సు ద్వారా ఇంద్రియములను అన్నివైపుల నుండి నియమింపవలెను.

🌷. భాష్యము :

యోగము నభ్యసించువాడు స్థిరనిశ్చయము కలిగి ఏమాత్రము మార్గము నుండి వైదొలగకే ఓపికగా తన అభ్యాసమును కొనసాగింపవలెను. అంతిమవిజయము నెడ విశ్వాసమును కలిగియుండి, గొప్ప పట్టుదలతో తన పనిని నిర్వహింపవలెను. విజయము లభించుట యందు ఆలస్యమైనచో అతడెన్నడును నిరాశ చెందరాదు. నిష్ఠతో అభ్యాసము కావించువానికి విజయము తథ్యమై యుండును. శ్రీరూపగోస్వామి భక్తియోగమును గూర్చి ఈ విధముగా పలికియుండిరి.

ఉత్సాహా న్నిశ్చయాద్ధైర్యాత్ తత్తత్కర్మప్రవర్తనాత్ |
సంగత్యగాత్ సతో వృత్తే: షడ్భిర్భక్తి: ప్రసిధ్యతి

“ఉత్సాహము, పట్టుదల, నిశ్చయము, భక్తుల సమక్షములో విధ్యుక్తధర్మములను నిర్వర్తించుట మరియు సత్వగుణకార్యములందే సంపూర్ణముగా నిమగ్నమగుట ద్వారా భక్తియోగమును మనుజుడు విజయవంతముగా నిర్వహింపగలడు.” (ఉపదేశామృతము 3)

యోగాభ్యాశము, ముఖ్యముగా కృష్ణభక్తిరసభావన యందు నిర్వహింపబడెడి భక్తియోగము అతికటినమైనదిగా తోచవచ్చును. కాని దాని నియమములను నిశ్చయముగా పాటించువారికి శ్రీకృష్ణభగవానుడు తప్పక సహాయమును గూర్చును. తనకు తాను సహాయము చేసికొనెడివానికి భగవానుని సహాయము లభించుచున్నది తెలిసిన విషయమే కదా!

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 257 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 24 🌴


24. sa niścayena yoktavyo yogo ’nirviṇṇa-cetasā
saṅkalpa-prabhavān kāmāṁs tyaktvā sarvān aśeṣataḥ
manasaivendriya-grāmaṁ viniyamya samantataḥ

🌷 Translation :

One should engage oneself in the practice of yoga with determination and faith and not be deviated from the path. One should abandon, without exception, all material desires born of mental speculation and thus control all the senses on all sides by the mind.

🌹 Purport :

The yoga practitioner should be determined and should patiently prosecute the practice without deviation. One should be sure of success at the end and pursue this course with great perseverance, not becoming discouraged if there is any delay in the attainment of success. Success is sure for the rigid practitioner. Regarding bhakti-yoga, Rūpa Gosvāmī says:

utsāhān niścayād dhairyāt tat-tat-karma-pravartanāt
saṅga-tyāgāt sato vṛtteḥ ṣaḍbhir bhaktiḥ prasidhyati

“One can execute the process of bhakti-yoga successfully with full-hearted enthusiasm, perseverance and determination, by following the prescribed duties in the association of devotees and by engaging completely in activities of goodness.” (Upadeśāmṛta 3)

Practice of yoga, especially bhakti-yoga in Kṛṣṇa consciousness, may appear to be a very difficult job. But if anyone follows the principles with great determination, the Lord will surely help, for God helps those who help themselves.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 256: 06వ అధ్., శ్లో 23 / Bhagavad-Gita - 256: Chap. 06, Ver. 23

🌹. శ్రీమద్భగవద్గీత - 256 / Bhagavad-Gita - 256 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 23 🌴

23. తం విద్యాద్ దుఃఖసంయోగవియోగం యోగసంజ్ఞితమ్ ।
స నిశ్చయేన యోక్తవ్యో యోగోఽనిర్విణ్ణచేతసా ।। 23 ।।


🌷. తాత్పర్యం :

దుఃఖముల నుండి విముక్తి పొందిన స్థితినే యోగమని అందురు. ఈ యోగమును ధృడ సంకల్పముతో ఎలాంటి నిరాశావాదం, అపనమ్మకం లేకుండా అభ్యాసం చేయవలెను.

🌷. భాష్యము :

దేహమున్నంతవరకు దేహావసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములను మనుజుడు నెరవేర్చవలసి యుండును. కాని శుద్ధభక్తియోగము (కృష్ణభక్తిరసభావనము) నందున్న వ్యక్తి అట్టి దేహావాసరములను తీర్చుకొనునప్పుడు ఇంద్రియములను అనవసరముగా ప్రేరేపింపడు. పైగా అతడు కేవలము దేహపోషణ నిమిత్తమే కావలసినవి గ్రహించి (చెడ్డబేరపు ఉత్తమలాభమును పొందుచు) కృష్ణభక్తిభావన యందు దివ్యసౌఖ్యము ననుభవించును.

అపాయము, రోగము, అభావము, ప్రియబంధువుల మృతి వంటి యాదృచ్చిక సంఘటనల యెడ అతడు నిర్లప్తుడై, తన కృష్ణపరకర్మల యెడ మాత్రము సదా జాగారూకుడై యుండును. అపాయము లెన్నడును అతనిని స్వీయకార్య విముఖుని చేయజాలవు. “ఆగమపాయినో (నిత్యాస్తాం స్తితిక్షస్వ భారత” యని భగవద్గీత యందలి ద్వితియాధ్యాయమున (2.14) తెలుపబడినది.

ఆ విధముగా అవి రాకపోకలు కలవనియు మరియు తన కర్మలను ప్రభావితము చేయజాలవనియు ఎరిగియుండుటచే అతడు తత్సంఘటనలను ఓర్పుతో సహించును. ఆ రీతిని అతడు యోగాభ్యాసమునందు అత్యున్నత పూర్ణత్వమును సాధించగలడు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 256 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 23 🌴

23. taṁ vidyād duḥkha-sanyoga-viyogaṁ yogasaṅjñitam
sa niśhchayena yoktavyo yogo ’nirviṇṇa-chetasā


🌷 Translation :

That state of severance from union with misery is known as Yog. This Yog should be resolutely practiced with determination free from pessimism.

🌹 Purport :

The best practice of yoga in this age is Kṛṣṇa consciousness, which is not baffling. A Kṛṣṇa conscious person is so happy in his occupation that he does not aspire after any other happiness. There are many impediments, especially in this age of hypocrisy, to practicing haṭha-yoga, dhyāna-yoga and jñāna-yoga, but there is no such problem in executing karma-yoga or bhakti-yoga.

As long as the material body exists, one has to meet the demands of the body, namely eating, sleeping, defending and mating. But a person who is in pure bhakti-yoga, or in Kṛṣṇa consciousness, does not arouse the senses while meeting the demands of the body. Rather, he accepts the bare necessities of life, making the best use of a bad bargain, and enjoys transcendental happiness in Kṛṣṇa consciousness.

He is callous toward incidental occurrences – such as accidents, disease, scarcity and even the death of a most dear relative – but he is always alert to execute his duties in Kṛṣṇa consciousness, or bhakti-yoga. Accidents never deviate him from his duty. As stated in the Bhagavad-gītā (2.14), āgamāpāyino ’nityās tāṁs titikṣasva bhārata. He endures all such incidental occurrences because he knows that they come and go and do not affect his duties. In this way he achieves the highest perfection in yoga practice.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 255: 06వ అధ్., శ్లో 22 / Bhagavad-Gita - 255: Chap. 06, Ver. 22

 

🌹. శ్రీమద్భగవద్గీత - 255 / Bhagavad-Gita - 255 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 22 🌴

22. యం లభ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత: |
యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే ||


🌷. తాత్పర్యం :

ఆ విధముగా సమాధి స్థితుడైన అతడు సత్యము నుండి వైదొలగక, దానిని మించిన వేరొక అధిక లాభము లేదని భావించును. అట్టి స్థితిలో నిలిచిన వాడు గొప్ప కష్టము నందైనను చలింపక యుండును.

🌷. భాష్యము :

అసంప్రజ్ఞాత సమాధి యందు మనుజుడు ఇంద్రియముల ద్వారా లభించెడి సర్వానందములకు దూరుడై యున్నందున ఎట్టి విధమైన లౌకికానందముతోను సంబంధమును కలిగియుండడు. అట్టి దివ్యస్థితి యందు నిలిచిన యోగి దాని నుండి ఏమాత్రమును వైదొలగడు. అటువంటి దివ్యస్థితి పొందలేనిచో యోగి పరాజయమును పొందినవాడే యగును. నేటికాలపు నామమాత్ర యోగపధ్ధతి సర్వవిధములైన ఇంద్రియప్రియ కార్యములను కూడి యుండి నిజమైన పధ్ధతికి విరుద్ధమై యున్నది. మైథునమునందు పాల్గొని, మత్తుపదార్థములను స్వీకరించు యోగి కపటియే కాగలడు.

యోగవిధానమునందు సిద్ధుల యెడ ఆకర్షణము కలిగిన యోగులు సైతము యోగము నందు పూర్ణత్వమును పొందినవారు కారు. అనగా యోగము యొక్క ఇతర లాభముల యెడ ఆకర్షితులైనచో ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు యోగులు పూర్ణత్వస్థితిని ఎన్నడును పొందజాలరు. కనుక యోగమును వ్యాయామ ప్రదర్శనముగా చేయువారు లేదా సిద్ధుల నిమిత్తమై వినియోగించువారు తమ యోగలక్ష్యము తత్కార్యమున నశించునని తెలిసికొనవలెను.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 255 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 22 🌴

22. yaṁ labdhvā cāparaṁ lābhaṁ manyate nādhikaṁ tataḥ
yasmin sthito na duḥkhena guruṇāpi vicālyate


🌷 Translation :

Having gained that state, one does not consider any attainment to be greater. Being thus established, one is not shaken even in the midst of the greatest calamity.

🌹 Purport :

In the yoga system, as described in this chapter, there are two kinds of samādhi, called samprajñāta-samādhi and asamprajñāta-samādhi. When one becomes situated in the transcendental position by various philosophical researches, he is said to have achieved samprajñāta-samādhi. In the asamprajñāta-samādhi there is no longer any connection with mundane pleasure, for one is then transcendental to all sorts of happiness derived from the senses. When the yogī is once situated in that transcendental position, he is never shaken from it.

Unless the yogī is able to reach this position, he is unsuccessful. Today’s so-called yoga practice, which involves various sense pleasures, is contradictory. A yogī indulging in sex and intoxication is a mockery. Even those yogīs who are attracted by the siddhis (perfections) in the process of yoga are not perfectly situated. If yogīs are attracted by the by-products of yoga, then they cannot attain the stage of perfection, as is stated in this verse. Persons, therefore, indulging in the make-show practice of gymnastic feats or siddhis should know that the aim of yoga is lost in that way.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 254: 06వ అధ్., శ్లో 21 / Bhagavad-Gita - 254: Chap. 06, Ver. 21

 

🌹. శ్రీమద్భగవద్గీత - 254 / Bhagavad-Gita - 254 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 21 🌴

21. సుఖమాత్యన్తికం యత్తద్ బుద్ధిగ్రాహ్యమతీన్ద్రియమ్ |
వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్త్వత: ||

🌷. తాత్పర్యం :

సమాధి అనబడే ఆనందమయ స్థితిలో పవిత్రమైన ఇంద్రియముల ద్వారా అనుభవమునకు వచ్చు అపరిమిత దివ్యానందములో మనుజుడు స్థితిని పొంది యుండును.

🌷. భాష్యము :

శ్రీచైతన్య మాహాప్రభువు వాక్యములలో ఇదియే “చేతోదర్పణమార్జనము” లేదా చిత్తదర్పణ మాలిన్యమును తొలగించుకొను కార్యము. నిజమునకు ఈ మనోమాలిన్య నిర్మూలనమే వాస్తవమైన ముక్తియై (భవమహా దావాగ్ని నిర్వాపణం) యున్నది. నిర్వాణమను సిద్ధాంతము (ఇది కూడా ప్రాథమికమైనదే) ఈ సిద్ధాంతములలో ఏకీభవించుచున్నది. శ్రీమద్భాగవతము (2.10.6) నందు ఇది “స్వరుపేణ వ్యవస్థితి:” అని పిలువబడినది. అట్టి స్థితియే భగవద్గీత యందు కూడా ఈ శ్లోకమున నిర్ధారింపబడినది.

నిర్వాణము పిదప (భౌతికత్వము యొక్క విరమణ పిమ్మట) కృష్ణభక్తిరస భావనముగా తెలియబడు శ్రీకృష్ణభగవానుని భక్తియుక్తసేవ (ఆధ్యాత్మికకర్మలు) ఆరంభమ్మగును. శ్రీమద్భాగవతము ప్రకారము అదియే జీవుని నిజస్థితియై యున్నది (స్వరూపేణ వ్యవస్థితి:). అట్టి జీవుని ఆధ్యాత్మికజీవనస్థితి భౌతికత్వముచే కలుషితమైనప్పడు అది మాయా అనబడును. అట్టి భౌతికసంపర్కము నుండి ముక్తిని పొందుట జీవుని ఆదియైన నిత్యస్థితిని నశింపజేయుట కాదు.

“కైవల్యం స్వరూపపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన వాక్యముల ద్వారా పతంజలి మునియు దీనిని ఆమోదించియున్నారు. ఈ చితశక్తియే(దివ్యానందము) నిజమైన జీవనస్థితియై యున్నది. “ఆనందమయో(భ్యాసాత్” యని వేదాంతసూత్రములందు (1.1.12) సైతము ఇది నిర్ధారింపబడినది. ఈ సహజ దివ్యానందమే యోగపు చరమలక్ష్యమై భక్తియోగము ద్వారా అతిసులభముగా పొందబడుచున్నది. ఈ భక్తియోగము భగవద్గీత యందలి సప్తమాధ్యాయమున విస్తారముగా వివరింపబడినది.

ఈ అధ్యాయమున వివరింపబడినట్లు యోగపద్ధతిలో సంప్రజ్ఞాతసమాధి మరియు అసంప్రజ్ఞాత సమాధి యను రెండు విధములైన సమాధిస్థితులు కలవు. వివిధములైన తాత్విక పరిశీలనచే ఎవ్వరేని ఆధ్యాత్మికస్థితి యందు నిలిచియున్నచో అతడు సంప్రజ్ఞాత సమాధిని సాధించినట్లు చెప్పబడును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 254 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 21 🌴


21. sukham ātyantikaṁ yat tad buddhi-grāhyam atīndriyam
vetti yatra na caivāyaṁ sthitaś calati tattvataḥ

🌷 Translation :

In that joyous state of Yog, called samadhi, one experiences supreme boundless divine bliss, and thus situated, one never deviates from the Eternal Truth.

🌹 Purport :

In the words of Lord Caitanya, this state of affairs is called ceto-darpaṇa-mārjanam, or clearance of the impure mirror of the mind. This “clearance” is actually liberation, or bhava-mahā-dāvāgni-nirvāpaṇam. The theory of nirvāṇa – also preliminary – corresponds with this principle. In the Bhāgavatam (2.10.6) this is called svarūpeṇa vyavasthitiḥ. The Bhagavad-gītā also confirms this situation in this verse.

After nirvāṇa, or material cessation, there is the manifestation of spiritual activities, or devotional service to the Lord, known as Kṛṣṇa consciousness. In the words of the Bhāgavatam, svarūpeṇa vyavasthitiḥ: this is the “real life of the living entity.” Māyā, or illusion, is the condition of spiritual life contaminated by material infection. Liberation from this material infection does not mean destruction of the original eternal position of the living entity. Patañjali also accepts this by his words kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti. This citi-śakti, or transcendental pleasure, is real life.

🌹 🌹 🌹 🌹 🌹



శ్రీమద్భగవద్గీత - 253: 06వ అధ్., శ్లో 20 / Bhagavad-Gita - 253: Chap. 06, Ver. 20

 

🌹. శ్రీమద్భగవద్గీత - 253 / Bhagavad-Gita - 253 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 20 🌴

20. యాత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా |
యత్ర చైవాత్మనాత్మనం పశ్యన్నాత్మని తుష్యతి ||


🌷. తాత్పర్యం :

భౌతిక కార్యకలాపాల నుండి నిగ్రహించబడిన మనస్సు, యోగ సాధన ద్వారా నిశ్చలంగా మారినప్పుడు, యోగి శుద్ధి చేయబడిన మనస్సు ద్వారా ఆత్మను చూడగలుగుతాడు మరియు అతను అంతర్గత ఆనందంలో ఆనందిస్తాడు.

🌷. భాష్యము :

యోగాభ్యాసము ద్వారా మనుజుడు క్రమముగా భౌతిక భావనల నుండి ముక్తుడగును. ఇదియే యోగసిద్ధాంతపు ప్రధాన లక్షణము. తదుపరి మనుజుడు సమాధి యందు మగ్నుడగును. అనగా ఆత్మ పరమాత్మతో సమానమనెడి ఎట్టి అపోహలు లేకుండా, పవిత్రమైన మనోబుద్దులతో హృదయస్థ పరమాత్మను యోగి గుర్తించగలుగు స్థితియే సమాధి యనబడును. వాస్తవమునాకు యోగపధ్ధతి దాదాపు పతంజలి యోగానియమముల పైననే ఆధారపడియున్నది. కొందరు అప్రమాణిక వ్యాఖ్యాతలు ఆత్మను పరమాత్మగా గుర్తించగా, అద్వైతులు అట్టి దానినే మోక్షమని భావింతురు.

కాని వారందరు పతంజలి యోగపద్ధతి యందు దివ్యానందమును విషయము అంగీకరింపబడినను, అద్వైతులు ఆ విషయము అద్వైతసిద్ధాంతమందలి ఏకత్వమునకు భంగకరమని భయపడి అట్టి దివ్యానందమును అంగీకరింపరు. జ్ఞానము మరియు జ్ఞాత యను ద్వైతమును అద్వైతులు అంగీకరింపకున్నను, పవిత్రములైన ఇంద్రియముల ద్వారా అనుభవింపబడెడి దివ్యానందము ఈ శ్లోకము నందు అంగీకరింపబడినది.

ఇదే విషయము యోగవిధానకర్తయైన పతంజలిముని చేతను ఆమోదింపబడినది. ఆ మహాముని “పురుషార్థశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ: కైవల్యం స్వరూపప్రతిష్టా వా చితిశక్తిరితి” యని తన యోగసూత్రములలో (4.33) ప్రకటించియున్నాడు.

పై సూత్రమునందలి “చితశక్తి” లేదా “అంతరంగశక్తి” దివ్యమైనది. ధర్మము, అర్థము, కామము, అంత్యమున భగవానునితో ఏకమగుటయైన మోక్షము అనునవియే పురుషార్థ మనబడును. ఈ పురుషార్థములలోని భగవదైక్యమే అద్వైతులచే కైవల్యమని పిలువబడును. కాని పతంజలి ముని ప్రకారం ఈ కైవల్యము అంతరంగశక్తి (ఆధ్యాత్మికశక్తి) అయియున్నది. దాని దవారా జీవుడు తన సహజస్థితి తెలిసికొనగలడు.

🌹 🌹 🌹 🌹 🌹H67




🌹 Bhagavad-Gita as It is - 253 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada

📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 20 🌴


20. yatroparamate cittaṁ niruddhaṁ yoga-sevayā
yatra caivātmanātmānaṁ paśyann ātmani tuṣyati


🌷 Translation :

When the mind, restrained from material activities, becomes still by the practice of Yog, then the yogi is able to behold the soul through the purified mind, and he rejoices in the inner joy.

🌹 Purport :

By practice of yoga one becomes gradually detached from material concepts. This is the primary characteristic of the yoga principle. And after this, one becomes situated in trance, or samādhi, which means that the yogī realizes the Supersoul through transcendental mind and intelligence, without any of the misgivings of identifying the self with the Superself. Yoga practice is more or less based on the principles of the Patañjali system. Some unauthorized commentators try to identify the individual soul with the Supersoul, and the monists think this to be liberation, but they do not understand the real purpose of the Patañjali system of yoga.

There is an acceptance of transcendental pleasure in the Patañjali system, but the monists do not accept this transcendental pleasure, out of fear of jeopardizing the theory of oneness. The duality of knowledge and knower is not accepted by the nondualist, but in this verse transcendental pleasure – realized through transcendental senses – is accepted. And this is corroborated by Patañjali Muni, the famous exponent of the yoga system.

The great sage declares in his Yoga-sūtras (4.33): puruṣārtha-śūnyānāṁ guṇānāṁ pratiprasavaḥ kaivalyaṁ svarūpa-pratiṣṭhā vā citi-śaktir iti. This citi-śakti, or internal potency, is transcendental. Puruṣārtha means material religiosity, economic development, sense gratification and, at the end, the attempt to become one with the Supreme. This “oneness with the Supreme” is called kaivalyam by the monist. But according to Patañjali, this kaivalyam is an internal, or transcendental, potency by which the living entity becomes aware of his constitutional position.

🌹 🌹 🌹 🌹 🌹


4 Jan 2020

శ్రీమద్భగవద్గీత - 252: 06వ అధ్., శ్లో 19 / Bhagavad-Gita - 252: Chap. 06, Ver. 19

 

🌹. శ్రీమద్భగవద్గీత - 252 / Bhagavad-Gita - 252 🌹

✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 6 వ అధ్యాయము - ధ్యానయోగం - 19 🌴

19. యథా దీపో నివాతస్థో నేఙ్గతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మన: ||


🌷. తాత్పర్యం :

గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి, నిగ్రహింపబడిన మనస్సు గల యోగి తన పరతత్త్వధ్యానమున సదా స్థిరుడై యుండును.

🌷. భాష్యము :

సదా దివ్యత్వమునందు రమించుచు తన పూజనీయ భగవానుని ధ్యానమున అచంచలముగా నిలుచు నిజమైన కృష్ణభక్తుడు గాలిలేని చోట నున్న దీపము వలె స్థిరముగా నుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 252 🌹

✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 6 - Dhyana Yoga - 19 🌴

19. yathā dīpo nivāta-stho neṅgate sopamā smṛtā
yogino yata-cittasya yuñjato yogam ātmanaḥ

🌷 Translation :

As a lamp in a windless place does not waver, so the transcendentalist, whose mind is controlled, remains always steady in his meditation on the transcendent Self.

🌹 Purport :

A truly Kṛṣṇa conscious person, always absorbed in transcendence, in constant undisturbed meditation on his worshipable Lord, is as steady as a lamp in a windless place.

🌹 🌹 🌹 🌹 🌹