29-June-2020 messages

1) శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412
2) శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 200 / Sripada Srivallabha Charithamrutham - 200 
3) మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 81 
4) The Masters of Wisdom - The Journey Inside - 104 
5) శ్రీ ఆర్యా ద్విశతి - 64
6) దాశరధి శతకము - పద్య స్వరూపం - 43 / Dasarathi Satakam - 43 
7) నారద భక్తి సూత్రాలు - 20
8) శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 54 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 54
9) సాధనా చతుష్టయ సంపత్తి - తితిక్ష
10) సౌందర్య లహరి - 27 / Soundarya Lahari - 27
11) గుప్త నవరాత్రి :
12) శ్రీ శివ మహా పురాణము - 159 
13) VEDA UPANISHAD SUKTHAM - 46 
14) భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 45 
15) AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 36
16) మనోశక్తి - Mind Power - 49 
17) Seeds Of Consciousness - 111
18) శ్రీ లలితా సహస్ర నామములు - 21 / Sri Lalita Sahasranamavali - Meaning - 21 
19) సాయి తత్వం - మానవత్వం - 43 / Sai Philosophy is Humanity - 43
20) శ్రీ మదగ్ని మహాపురాణము - 31

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people, food

🌹. శ్రీమద్భగవద్గీత - 412 / Bhagavad-Gita - 412 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 20 🌴

20. ద్యావాపృథివ్యోరిదమన్తరం హి
వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వా: |
దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదమ్
లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||

🌷. తాత్పర్యం : 
నీవు ఒక్కడవేయైనను సమస్త ఆకాశమును, స్వర్గలోకములను మరియు వాని నడుమగల ప్రదేశమునంతటిని వ్యాపించియున్నావు. ఓ మహానుభావా! అద్భుతమును, భయంకరమును అగు ఈ రూపమును గాంచి లోకములన్నియును కలతనొందుచున్నది.

🌷. భాష్యము : 
“ద్యావాపృథివ్యో” (స్వర్గమునకు, భూమికి నడుమగల ప్రదేశము) మరియు “లోకత్రయం” (ముల్లోకములు) అను పదములు ఈ శ్లోకమున ప్రాముఖ్యమును కలిగియున్నవి. అర్జునుడే గాక ఇతర లోకములందలి వారు కూడా శ్రీకృష్ణభగవానుని ఈ విశ్వరూపమును గాంచినట్లు గోచరించుటయే అందులకు కారణము. అర్జునుని విశ్వరూపదర్శనము స్వప్నము కాదు. దివ్యదృష్టి ఒసగబడిన వారందరును రణరంగమున విశ్వరూపమును గాంచగలిగినారు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 412 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 20 🌴

20. dyāv ā-pṛthivyor idam antaraṁ hi
vyāptaṁ tvayaikena diśaś ca sarvāḥ
dṛṣṭvādbhutaṁ rūpam ugraṁ tavedaṁ
loka-trayaṁ pravyathitaṁ mahātman

🌷 Translation : 
Although You are one, You spread throughout the sky and the planets and all space between. O great one, seeing this wondrous and terrible form, all the planetary systems are perturbed.

🌹 Purport :
Dyāv ā-pṛthivyoḥ (“the space between heaven and earth”) and loka-trayam (“the three worlds”) are significant words in this verse because it appears that not only did Arjuna see this universal form of the Lord, but others in other planetary systems saw it also. Arjuna’s seeing of the universal form was not a dream. All whom the Lord endowed with divine vision saw that universal form on the battlefield.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

Image may contain: 1 person

🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 200 / Sripada Srivallabha Charithamrutham - 200 🌹
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ

అధ్యాయము 31
🌻. దశ మహావిద్యల వర్ణనం 🌻

🌻. శ్రీ విద్య 🌻

మేము ప్రతిరోజు సాయంకాలం కృష్ణ యీవలి ఒడ్డుకు వచ్చే వాళ్ళం. ఉదయాన్నే మళ్ళీ శ్రీచరణుల వద్దకు వెళ్ళేవాళ్ళం. ఆ గురుసార్వభౌములు మాకు ఎన్నో యోగ రహస్యాలు తెలియ చేస్తుండేవారు. 

ఒకరోజు దశ మహావిద్యల గురించి వివరణ ఇస్తూ ఇలా చెప్పారు, “శ్రీవిద్యను ఉపాసించడం చాలా శ్రేష్ఠమైంది. పూర్వకాలం ఈ విద్యను అగస్త్య మహర్షి హయగ్రీవుల వద్ద నేర్చుకొని భార్య అయిన లోపాముద్రకు నేర్పించారు. 

ఆమె చాలా నిష్ఠతో ఈ విద్యని సాధనచేసి వాటి అంతరార్థాలను భర్తకు తెలియచేస్తుండేది. ఈ రకంగా భార్యాభర్తలు ఇద్దరు ఒకరికొకరు గురుశిష్యులయ్యారు. ఇది ఒక విచిత్రమైన విషయం. దశమహా విద్యలు

దశ మహావిద్యలలో మొదటిది కాళి రూపం. సమస్త విద్య లకు ఆదిరూపం మహాకాళి. ఆ దేవి విద్యామయ శక్తులనే మహావిద్యలని అంటారు. కృష్ణ వర్ణంలో ఉండటంవల్ల దేవికి కాళీ అనే నామ మేర్పడింది. 

అనేక సంవత్సరములకు కాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది మాసాలలోనో, రోజుల్లోనో సాధించాలనుకొంటే కాళీ ఉపాసన చేస్తారు. కాని కాళీశక్తిని తమ శరీరంలోనికి ఆకర్షిం చుకొనేటప్పుడు అగ్నితో సమాన మైన మంటలని, భయంకరమైన బాధని యోగి అనుభ విస్తారు. 

రెండవది తారా రూపం. తరింప చేసే దేవి కాబట్టి తార అయ్యింది. ఈమెను నీలసరస్వతి అని కూడా అంటారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. 

మూడ వది ఛిన్నమస్త. పార్వతి తన సఖురాండ్రైన డాకినీ, వర్ణినీ లతో మందాకినీ నదికి స్నానానికై వెళ్ళింది. స్నానం చేసిన తరువాత వారిద్దరు ఆకలిగా ఉందని తమ ఆకలిని తీర్చ మని అడగటంతో దేవి ఖడ్గంతో తన శిరస్సుని ఖండించు కున్నది. ఖండిత శిరస్సును ఆమె తమ వామ హస్తంలో పట్టుకొన్నది. దానినుండి వెలువడ్డ మూడు ధారలను ముగ్గురు త్రాగి తమ ఆకలిని తీర్చుకున్నారు. అప్పటి నుండి ఆమె ఛిన్నమస్తాదేవిగా ప్రసిద్ధి పొందింది.

 నాల్గవది షోడశీమహేశ్వరి. పార్వతీదేవి యొక్క ముగ్ధ మోహన మైన 16 సంవత్సరాల ప్రాయపు రూపమే షోడశీ మహేశ్వరి. ఈ తల్లిని ప్రసన్నం చేసుకోడానికి సాధకులు షోడశాక్షరీ (16 అక్షరాలుకల) మంత్రాన్ని జపిస్తారు. 

ఈ దేవిని ఆశ్రయించిన వారికి అన్ని విద్యలు అరచేతిలోనే ఉంటాయి. ఈ దేవి ఉపాసన వల్ల భోగము, మోక్షము రెండూ సిద్ధిస్తాయి. అయిదవ రూపం భువనేశ్వరీదేవి. ఈ దేవిని ఏడుకోట్ల మహా మంత్రాలు ఆరాధి స్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియా శక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేసారు. 

ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరీ అని పిలుస్తారు. అవ్యక్తంనుండి వ్యక్తమైన బ్రహ్మాండరూపం, చైతన్య స్వరూ పమే భువనేశ్వరీదేవి. 

ఆరవది త్రిపురభైరవి రూపం. కొన్ని ప్రత్యేకమైన క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటిని రూపుమాపగల శక్తిని త్రిపురభైరవి అంటారు.ఈ శక్తిని నృసింహ భగవానుడి అభిన్నశక్తిగానూ, కాలభైరవుని అవ తారంగా కూడా పరిగణిస్తారు. 

ఏడవ రూపం ధూమావతి. ఈ దేవి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వల్ల విపత్తులు నాశనమై సంప దలు లభిస్తాయి. జీవుని ఆకలి, దప్పికల బాధలకు, కలహ- దారిద్ర్యాలకు ఈమె కర్త. ఈ తల్లి అనుగ్రహం ఉంటే సమస్యలన్ని దూరం అవుతాయి. 

బగళాముఖి ఎనిమిదవ రూపం. కుటుంబ పరంగాను, ఆధ్యాత్మికంగాను, దేశంలోను, సమాజంలోను వికాసానికి అడ్డంకులుగా ఉన్న అరిష్టాలను రూపుమాపడానికి, శత్రువులను అణగత్రోక్కడానికి ఈ మాతను ఆరాధిస్తారు. బ్రహ్మ, విష్ణు, పరశురాములు ఈ దేవి ఉపాసకులే. చాలాకాలంవరకు తిరుపతి వేంకటేశ్వరుని బగళాముఖిగా పూజించారు. 

తొమ్మిదవ రూపమైన మాతంగి మతంగ మహాముని కుమార్తె. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసే శక్తి ఉంది. పదవరూపమైన కమలాలయ సమృద్ధికి ప్రతీక. ఈమె అనుగ్రహంవల్ల రాజభోగం, కీర్తి లభిస్తాయి.

🌻. చరితామృత పారాయణ మహిమ 🌻

ఇంతవరకు చెప్పిన శ్రీపాదులు ‘విస్తారంగా దశవిద్యా మహా స్వరూపాన్ని ఏ రోజున ఎవరి ద్వారా మీకు తెలియచెప్పాలో నేను నిర్ణయించి ఆ విధంగా బోధింపచేస్తాను,’ అని తెల్పి అనఘాదేవి దశమహావిద్యా స్వరూపిణి అని, అనఘా-అన ఘులను పూజించిన వారికి సమస్త కోరికలు ఫలించు తాయని చెప్పారు. 

తరువాత నన్ను ఉద్దేశించి, “శంకర భట్టూ! నీతో రచింపబడే చరితామృత గ్రంథాన్ని పారాయణ చేసి, ఆ తరువాత వెంటనే వచ్చే అష్టమి నాడు అనఘా ష్టమీ వ్రతం చేసుకొని 11మందికి భోజనాలు పెడితే వెంటనే ఫలితాలు కన్పిస్తాయ”ని చెప్పారు. 

శ్రీ చరితామృతగ్రంథం నామ మాత్ర గ్రంథం కాదు. దీని పారాయణ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండగనే మీరు నా సంపర్కంలో ఉంటారు. కాబట్టి మీ ధర్మబద్ధమైన కోరికలు తీరుతాయి. దీన్ని పూజా మందిరంలో ఉంచినట్లయితే దురదృష్టాన్ని, దారిద్ర్యాన్ని కలిగించే శక్తులని విచ్ఛిన్నం చేస్తుంది," అని హామీఇచ్చారు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sripada Srivallabha Charithamrutham - 200 🌹
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj 

CHAPTER 20
🌴. The Story of Vissavadhanulu Description of Sripada’s divine auspicious form - 7 🌴

🌻 Vissavadhanulu born as thorny bush due to sinful Karmas 🌻

While going to Orissa for business purpose, I reached Peethikapuram because of my fortune and found the house of Sri Bapanarya.  

At that time, Sripada was playing with Bapanarya in their backyard. There was a thorny bush in their house. Sripada was pouring water to it devotedly. 

Bapanarya asked Sripada ‘Bangaru Kanna! It is proper to water that tree devotedly as if it is a ‘somalatha’ or ‘sanjeevini’ plant. But whether you care for it or not, it will not stop growing.’ 

Sripada said, “Thatha! In previous birth, Vissavadhanulu thatha used to stay in our street and ridicule us saying ‘Swayambhu datta was said to be born as Bapanarya’s grandson! What a wonder? What a blasphemy?’  

He is now born as thorny bush. When mother, myself, brothers, Srividyadhari, Radha and Surekha, were taking food at Venkatappaiah Shresti and Narasimha Varma’s houses, he used to say ‘Malladi and Ghandikota families are really ‘anaachaaris’ (those who do not follow traditions).  

They are fallen from dharma. Those two families should be expelled from Brahmin community.’ Thus he raised a dispute in Brahmin Parishat. He is this thorny bush. ‘Is Sripada Himself Datta?  

Where is the proof for this? Is it there in Shastras? Is it there in Vedas?’ Thus he did distorted arguments.  

That same Vissavadhanulu is this thorny bush. He used to scold Venkatappaiah Shresti and Narasimha Varma who treated my mother Sumathi Maharani Sarvamangala Swaroopini (the one with auspicious qualities) as their daughter, gave food and new clothes and felt that thier life was fulfilled. 

 That same Vissavadhanulu thatha is this thorny bush. After death, as his last rites were not properly performed and by the weight of his own great sins, he is now born as this thorny bush in accordance with his nature.  

I am showing pity on him and doing ‘jala tarpanam’.” After a while, they came into the front yard. Seeing the beautiful mind bewitching form of Sripada, I got hiccups with great happiness.  

Pleasure tears were flowing from my eyes incessantly. I fell on the divine lotus feet of Sripada. Sripada lovingly tapped on my back with his hand and said ‘My Dear! Get up. What are these mad actions? You died, got back life and came to me’.  

Knowing that I do business in silk clothes, Bapanarya asked me. ‘Do you have any clothes for my golden grandson?’ I gave silk clothes suitable to Sripada.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 81 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 *సాధన- సమిష్టి జీవనము - 2* 🌻

పది మంది తోటి సాధకులతో కలసి పనిచేస్తున్నప్పుడు‌ పరస్పర సహకారముతో జీవించడం అలవాటవుతుంది. సమిష్టి జీవన మాధుర్యం ఆస్వాదనకు అందుతుంది. అయితే, ఈ సందర్భంలో సాధనకు‌ కొన్ని అవరోధాలు కూడా ఎదురవుతాయి. 

అతి పరిచయం వల్ల, అవజ్ఞాదృష్టి మనసులో చోటుచేసికొంటూ‌ ఉంటుంది. నాలుగుమార్లు‌ తోటివారికి మేలు చేయడంతో తాను అధికుడననే వికారం మొలకెత్తవచ్చు. దీని యెడల‌ జాగరూకత వహించాలి. 

అలాగే, తన మిత్రుల యెడల మొదట ఉన్న ఆప్యాయత, కాలం గడిచేకొద్దీ పరిమితమవవచ్చు. ఇతరుల యెడల వర్తించినట్లుగా‌ మిత్రుల యెడ కొందరు వర్తింపరు. ఉదాహరణకు, మనకు అవసరమైనప్పుడు ఋణమిచ్చి సాయం చేసిన, మన సహసాధకుడయిన మిత్రునికన్న ముందుగా, మనము ఇతరులు ఋణమిచ్చినవాళ్ళుంటే వాళ్ళకు ఋణము తీర్చుతూ ఉంటాము., 

ఇది నిజాయితీ కాదు. మనలను తిరిగి అడుగలేని మొగమాటము గల మిత్రులకు ముందు ఋణము తీర్చే మంచితనము‌ మనవద్ద ఉన్నప్పుడే, భగవంతుని దయ మనపై పనిచేస్తుంది. 

కొందరు సాధకులు తమకు మేలు చేసినవారు తమ తెలివిని, గొప్పను, అనుభవాన్ని గౌరవించి చేస్తున్నారని భ్రమించుతుంటారు. తమకు జరిగిన మేలుకు, గౌరవానికి ఎదుటివారి మంచియే కారణము. 

ఇంకో‌ సంగతి కొందరు సాధకులు తాము గొప్ప త్యాగమూర్తులమని పదిమందిలో ప్రసిద్ధి పొందాలనే తపనలో, కుటుంబము ఎడల‌ బాధ్యతలు కొంత విస్మరిస్తూ ఉంటారు దీన్నీ సర్దుబాటు చేసికోవాలి. కుటుంబము ఎడల ప్రత్యేక వ్యామోహము పనికిరాదంటే అర్థం, వారిని నిర్లక్ష్యం చేయమని కాదు. 

కుటుంబసభ్యులను, ఇతరులను గూడ అంతర్యామి స్వరూపులుగానే దర్శింపగలగాలి. ఎవరియెడలనయినా పరమప్రేమతో కర్తవ్యాలను‌ నెరవేర్చడం అభ్యాసం చేయాలి. 

అలాగే, సమిష్టి జీవనయాత్ర కొనసాగిస్తుండగా ఒక ‌ప్రదేశము నందు వసించు సాధకుల నడుమ అభిప్రాయ‌ భేదాలు వస్తుంటాయి. 

అభిప్రాయాలు మనోవికారాలు. ప్రేమ, హృదయ సంబంధి. తోటివారు మనతో విభేదించినంత మాత్రాన, వారితో మాట్లాడకపోవడం, అలుకపూనడం, ఇతరులతో వీరిని గూర్చి ఆరోపణ చేయడం సంకుచిత దౌర్భల్యం. ఇది సాధనకు అడ్డంకి అని గ్రహించాలి..
.......✍ *మాస్టర్ ఇ.కె.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: flower

🌹 The Masters of Wisdom - The Journey Inside - 104 🌹
🌴 Fiery Aspiration - 6 🌴
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj

🌻 The Sixth Ray 🌻

Master Morya, the master of the first ray, has been working for a long time with the sixth ray of devotion, because he has found out that a man full of devotion can better pool his forces and advance faster than someone who is fighting the whole time with his own mind.

We should not think that the sixth ray is no more necessary on the path, because now the seventh ray is gaining dominance. 

The seventh ray is an orderly way of working, the seventh ray helps to tame and to align the wild or the indifferent nature. Thus people of the sixth ray can pass over to the seventh ray more easily.

The fiery aspiration linked to striving for an ideal is nothing but the first ray working through the emotional body. 

The sixth ray adds worship and a deep interest to service, so that the enthusiasm can be permanently sustained and the work conducted with the rhythm and order of the seventh ray. 

Aspiration thus leads to the light of the soul and from the soul to the light of the universal soul.

🌻 🌻 🌻 🌻 🌻 🌻 🌻 
Sources: Master K.P. Kumar: The Aquarian Cross / notes from seminars. Master E. Krishnamacharya: Lessons on the Yoga of Patanjali.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 3 people

🌹. శ్రీ ఆర్యా ద్విశతి - 64 🌹
🌻. శ్రీ లలితా స్తవరత్న వైజ్ఞానిక ధ్యాన యోగము 🌻
✍️. విరచితం : భగవాన్ శ్రీ క్రోధభట్టారక (దుర్వాస మహర్షి)
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 II ఆర్యా ద్విశతి - 127వ శ్లోకము II 🌻 

అణిమాదిసిద్ధిఫలకస్యోపరి హరిణాంకఖండకృతచూడాః I
భద్రం పక్ష్మళయంతు బ్రాహ్మీముఖ్యాశ్చ మాతరో౨స్మాకమ్ II ౧౨౭

🌻. తాత్పర్యము :
అణిమాదిసిద్ధి ఫలకస్యోపరి - అణిమాది సిద్ధిదేవతలు నివసించున్ పీటకుమీద ఉండు, హరిణాంకఖండకృతచూడాః - బాలచంద్రుని శిరోభూషణముగా గలవారగు, బ్రాహ్మీముఖ్యాశ్చ - బ్రాహ్మీ మొదలగు, మాతరః - మాతృదేవతలు, అస్మాకం - మాకు, భద్రం - మంగళములను, క్షేమమును, పక్ష్మళయంతు - వృద్ధిపొందింతురుగాక !!

చింతామణి గృహమునందు, అణిమాది సిద్ధిదేవతలు నివసించు పీటకు పై భాగమున, బాలచంద్రుని శిరస్సున ధరించిన బ్రాహ్మీ మొదలగు మాతృదేవతలు మాకు మంగళములను వృద్ధి పొందింతురుగాక !!

🌻. వివరణ :
బ్రాహ్మి మొదలగు మాతృదేవతలు (అష్టశక్తులు)
బ్రాహ్మీ మాహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా I
వారాహీచైవ మాహేంద్రీ చాముండా చైవ సప్తమీ I
మహాలక్ష్మీరష్టమీ చ ద్విభుజాశ్శోణ విగ్రహాః II

🌻 II ఆర్యా ద్విశతి - 128వ శ్లోకము II 🌻 

తస్యోపరిమణిఫలకే తారుణ్యోత్తుంగపీనకుచభారాః I
సంక్షోభిణీ ప్రధానాః శ్రాంతిం విద్రావయంతు దశముద్రాః II ౧౨౮

🌻. తాత్పర్యము :
తస్యోపరి - ముందు చెప్పబడిన పీటకుపైన, మణిఫలకే - మణినిర్మితమైన పీటయందు, తారుణ్య - యౌవనము చేత, ఉత్తుంగ - ఉన్నతమైన, పీన - గొప్పవియగు, కుచభారాః - స్తనభారములు గలవారగు (అమ్మవారి యొక్క మాతృత్వము), సంక్షోభిణీప్రధానాః - సంక్షోభిణి మొదలగు, దశముద్రాః - పదిమంది ముద్రాదేవతలు, శ్రాంతిం - బడలికను, శ్రమను, మా సంకటములను, విద్రావయంతు - పోగొట్టుదురుగాక !!

చింతామణి గృహము నందు, బ్రాహ్మీదేవతలు నివసించు పీటకు పై భాగమున, మణినిర్మితమైన పీట యందు, యౌవనము చేత ఉన్నతమైన గొప్ప స్తనభారములు కలిగిన సంక్షోభిణి మొదలగు దశ ముద్రాదేవతలు, మా యొక్క బడలికను, శ్రమను, సంకటములను పోగొట్టుదురుగాక !!

🌻. వివరణ : 
దశముద్రాదేవతలు - 
తస్యాప్యూర్ధ్వస్థానగతా ముద్రాదేవ్యో మహత్తరాః I
ముద్రావిరచనాయుక్తైర్హస్తైః కమలకాంతిభిః I
సర్వసంక్షోభిణీచైవ సర్వవిద్రావిణీ తథా I
సర్వాకర్షిణికాముద్రా తథా సర్వవశంకరీ I
సర్వోన్మాదనముద్రా చ షష్ఠీ సర్వమహాంకుశా I
సర్వఖేచరముద్రా చ సర్వబీజా తథా పరా I
సర్వయోనిశ్చనవమీ తథా సర్వత్రిఖండికా II (లలితోపాఖ్యానము, 24వ అధ్యాయము 14-15వ శ్లోకము)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


🌹. దాశరధి శతకము - పద్య స్వరూపం - 43 / Dasarathi Satakam - 43 🌹
పద్యము - భావము 
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 85వ పద్యము : 
చిరతరభక్తి నొక్కతుళసీదళ మర్పణ చేయువాడు ఖే
చరగరు డోరగ ప్రముఖ సంఘములో వెలుగన్ సధా భవత్
సురుచిర ధీంద పాదముల బూజలొనర్చిన వారికెల్లద
త్పర మరచేతిధాత్రిగద దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
ఒక్క తులసి దళము భక్తితో సమర్పించినంతనే వాడు గంధర్వ, గరుడ, పన్నగులయందు ఒక్కడై ప్రకాశించుచుండును. బహు కాలము నీ పదసేవ జేసిన వారు కుడా ఊర్ధ్వలోకములందు నివసించుచుందురు. ఎల్లవేళలా నీ పాదార్చన చేయు వారికి పరమపదము అరిచేతిలో ఉసిరిక.

🌻. 86వ పద్యము : 
భానుడు తూర్పునందుగను పుట్టినఁ బావక చంద్ర తేజముల్
హీనత జెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము చేయుచున్నఁ బర దైవమరీచులడంగకుండు నే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ

🌻. భావము : 
రాక్షసుల గర్వమును హరించి, వారిని హతమార్చిన రామా! నీ అనితర కాంతిముందు, సూర్యుని ముందు చంద్రాగ్నుల కాంతి చిన్న బోయినట్లే, ఇతర దేవతల కాంతి క్షీణించును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Dasarathi Satakam - 43 🌹
Sloka and Meaning 
📚. Prasad Bharadwaj
 
🌻 85th Poem : 
cirataraBakti nokkatuLasIdaLa marpaNa cEyuvADu KE 
caragaru DOraga pramuKa saMGamulO velugan saDA Bavat 
sphuradaravinda pAdamula bUjalonarcina vArikellada 
tpara maracEtidhAtrigada dASarathI karuNApayOnidhI!

🌻 Meaning : 
A person who has worshipped you with just one Tulasi leaf is blessed and is shining among the company of celestials like Khecharas, Garuda and Serpents. Therefore for those meditating on Your Lotus Feet, spiritual achievement is child's play.

🌻 86th Poem : 
BAnuDu tUrpunaMduganu puTTina bAvaka caMdra tEjamul 
hInata jeMdinaTlu jagadEka virAjitamaina nI pada 
dhyAnamu cEyucunna bara daivamarIculaDaMgakuMDunE 
dAnava garva nirdaLana dASarathI karuNApayOnidhI.

🌻 Meaning : 
After the glorious sunshine during the daytime, the moonlight and light from fire look debilitated. In a similar way, after meditating on Your Lotus Feet people will find the other gods not worthy of worship. O Humiliator of the pride of demons!

Continues... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: Surendra Pss

🌹. నారద భక్తి సూత్రాలు - 20 🌹 
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ, అచల గురు పీఠము. 
📚. ప్రసాద్ భరద్వాజ 
ప్రథమాధ్యాయం - సూత్రము - 12

🌻 12. భవతు నిశ్చయ దార్డ్యా దూర్థ్వ శాస్త్ర రక్షణమ్‌ - 1 🌻

            లోక వ్యాపారంగాని, వైదిక వ్యాపారం గాని, చివరకు మోక్షార్థ సాధన క్రియలు గాని, ఈ భక్తుడు చేయడు. అప్పుడు ఆ భక్తుడు ఊరకే ఉండాలి కదా! కాని ఊరకుండలేడు. అందుకని శాస్త్రార్థాలను అనుష్ఠిస్తూ ఉంటాడు. శాస్త్రాలు సాధకులకు అవసరమే గాని, పరాభక్తులకు అవసరం లేదు. 

అయినప్పటికీ భగవంతుని నిర్ణయించే శాస్త్రమంటే అతడికి ప్రీతి ఉండటం చేత అనుష్ఠానం చేస్తూ, ఉపరతి పొందుతూ ఉంటాడు. ఈ పని చేయడం వలన సాధకులకు ఆదర్శంగానూ, మార్గదర్శంగానూ ఉంటాడు. దీనినే శాస్త్ర రక్షణ అంటారు.

            దేశ కాల పాత్రతలకు తగినట్లుగా సాధనలను మార్చవలసి ఉంటుంది. ఈ పరాభక్తుడు అప్రయత్నంగా చేసే పనులు ఇతరుల సాధనకు మార్గదర్శకంగా పనికి వస్తాయి. 

ఈ మార్పులు ఒకప్పుడు పూర్వ శాస్త్రానికి కొంచెం సవరించినట్లుగా ఉంటాయి. ఈ విధంగా పరాభక్తుడు శాస్త్రాలలో క్రమంగా మార్పులు చేయడం జరుగుతుంది. పరాభక్తుడంటే సిద్ధుడు గనుక, అతడే ప్రమాణం.

 పూర్వ శాస్త్ర ప్రమాణాలను నవీనీకరించడానికి అతడికి అధికారమున్నది. ఈ విధంగా అతడి వలన శాస్త్ర రక్షణ జరుగుతూ ఉంటుంది. శాస్త్రాలు సంస్కరించబడతాయి. 

పరాభక్తుడు నిశ్చయ జ్ఞానంతో త్రికాలాబాధ్యమైన సాధ్యం కొరకు దేశ కాలమాన పాత్రతలతో పరిమిత పరచబడే సాధనలలోని ఆచరణ విధానం ఇట్టి మహనీయుల ఆచరణ వలన సంస్కరింపబడి సర్వజనామోదంగా చేయబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person, beard

🌹. శ్రీ మాణిక్ ప్రభు చరితామృతము - 54 / SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 54 🌹
🌻. చతుర్థ దత్తావతారము 🌻 
 📚. సేకరణ : ప్రసాద్ భరద్వాజ  

🌴. యజ్ఞం 🌴

      శ్రీ ప్రభువు హాళిఖేడ్ కు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో మాణిక్ నగర్ లో 'సర్వతోముఖ' అనే పేరుగల యజ్ఞం చేయించారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వేలమంది నివాస, భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది.

    యజ్ఞేశ్వర్ దీక్షితుల ఇంటి వారిపై ప్రభువు అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు. ప్రభువు ఆశ్రయం దొరికిన తరువాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

    ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభు ఎక్కడనుండి తెచ్చారు అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు. సోలాపూర్ కి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయంలో ఇలా వ్రాశారు. 

     యజ్ఞం నిర్విఘ్నముగా జరుగుతుండడంతో ప్రభు కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్ధ్యంతో అది దూరమై యజ్ఞం ఎలా నిర్విఘ్నముగా జరిగిందో క్రింద వ్రాయడం జరిగింది.

    ఒక బ్రాహ్మణుని 13-14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణం కలిగి ఎక్కిళ్ళతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞ మండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. 

ప్రభువు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇకముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చివరివరకు చూసుకుంటాను. మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించినా ఆ బ్రాహ్మణుడు వినలేదు. 

చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞ మండపంలో శవం ఉండడం వలన యజ్ఞ కార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది. 

చివరికి ప్రభు తాత్యాసాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యాసాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ బాలుడి నోట్లో పోయగానే, ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందభరితులై యజ్ఞం పూర్ణాహుతి గావించారు.

దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 🙏
🌹🌹🌹🌹🌹

🌹 SHRI MANIK PRABHU - HIS LIFE AND MISSION - 54 🌹
✍️. Nagesh D. Sonde
📚. Prasad Bharadwaj

🌻 14. Shri Shankar Manik Prabhu (1895 – 1945) - 3 🌻

Consequently, he created a new awareness among the devotees of Maniknagar. The number of devotees visiting Maniknagar increased. He was available to every one.  

None would return without meeting him and receiving his blessings. His interest in education made him start a school in Maniknagar, where, along with modern educaton, emphasis was also given to religious, ethical and cultural education. 

The school was named as “Manik Vidyalaya” and Shreeji took personal interest in the day to day affairs of the school. There is nothing like the all-around development of human personality. 

 His emphasis therefore was to impress the devotees visiting Maniknagar that the place was a Shakti-sthala, the center of energy from where each one could draw his energy. 

 It is more important that one should also intellectually understand the Message given by Shri Manik Prabhu and assimilate it in one’s daily life. He had made his own life the symbol of humility, which is born out of wisdom of the Universality of the Supreme Self. 

Therefore, he would encourage intelligent discussion on the teachings of the previous Peethadhipatis. Shri Shankar Manik Prabhu undertook extensive tours and travels to propagate the message of Shri Prabhu’s Sampradaya.  

Where ever he went he was received with great love, devotion, respect and honour. His tours to Raichur, Narayanpeth, Bhongeer, Yadgeer and Tandur have a very special significance in the history of Manik Prabhu Samsthan.

Shri Shankar Manik Prabhu was, however, not destined to lead the Sampradaya for long. His innumerable duties which were assigned to him from his very childhood had tired him physically.  

While the spirit in him rose to fulfil the role assigned to him, his body could not sustain the ravages of time. 

When the time came for him to leave on the 28th of February 1945, he already had a son Siddharaj, who was hardly six years of age, whom he left to the loving care of his wife and the compassionate grace of Shri Manik Prabhu.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: one or more people, people sitting and outdoor

🌹. సాధనా చతుష్టయ సంపత్తి - తితిక్ష 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
చలాచల బోధ... 
📚. ప్రసాద్ భరద్వాజ

తితిక్ష అనగా
- భౌతిక , ప్రాపంచిక విషయముల పట్ల చలించని మనస్సు కలిగి ఉండుట
- ప్రపంచములో సంభవించు సమస్త ద్వంద్వముల యందు ఓర్పు కలిగి ఉండుట

- ప్రారబ్ధ వశమున కలుగు భోగ భాగ్యములకు సంతోషించక, అవి తొలగిన దుఖించక సమ బుద్ధితో ఉండుట

- ఇతరుల వలన కలిగిన దు:ఖమునకు ప్రతీకారము చేయ తలంపు లేకుండుట
- దిగులు విలాపము లేక సర్వ దు:ఖములను వాస్తవిక దృష్టితో స్వీకరించుట

- చింత అంటే తానున్న పరిస్థితిని గురించి పదే పదే అలోచించుచు దిగులు చెందుట
- విలాపము అంటే తానున్న పరిస్థితిని గురించి మొరపెట్టుకోవటము, మాట్లాడటము
 
ఈ విధమైన జీవితము జీవించుట వలన ప్రజ్ఞా స్తితిలో స్తిరత్వము, సమస్తమును సాక్షిగా ఉదాసీనముగా చూచుట అలవడును. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: text

🌹. సౌందర్య లహరి - 27 / Soundarya Lahari - 27 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

🌴. ఆత్మ జ్ఞానము కలుగుటకు, పరమ సత్యం పొందుటకు 🌴

శ్లో: 27. జపోజల్పశ్శిల్పం సకలమపి ముద్రా విరచనా గతిః ప్రాదక్షిణ్య క్రమణ మశనాద్యాహుతివిధిః l 
ప్రణామః సంవేశ స్సుఖ మఖిలమాత్మార్పణ దృశా సపర్యా పర్యాయ స్తవ భవతు యన్మే విలసితమ్ ll 
 
🌻. తాత్పర్యము : 
అమ్మా ! నేను నోటితో వాగు వాగుడు అంతయు నా మాత్రు నిర్మితమయిన నోటినుండి వచ్చినదే కావున అది అంతయు నీకు జపముగాను, ఈ కాయము నీవు ఇచ్చినది కావున నేను చేయు హస్తవిన్యాసాది క్రియలు అన్నియు నీ ముద్రలుగాను,నేను దేశ సంచారిని కావున అదియే నీకు ప్రదక్షణము గానూ, నా అంగాంగ భంగిమలు నీకు ప్రణామములుగానూ, నేను గ్రహించు అన్న పానాదులు, ఇష్ట దైవము కొఱకు నే చేయు హోమములు , నా యొక్క చేష్టారూపము అయిన విలాసములు నీకు పరిచర్యలు అగు గాక. 

🌻. జప విధానం - నైవేద్యం:

ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, పాలు నివేదించినచో ఆత్మ జ్ఞానము, పరమ సత్య స్థితి ప్రసాదించ బడును అని చెప్పబడింది.
🌹 🌹 🌹 🌹 🌹 

🌹 Soundarya Lahari - 27 🌹 
📚 Prasad Bharadwaj 

🌴 Realisation of Self and Ultimate Truth 🌴

Japo jalpah shilpam sakalam api mudra-virachana Gatih pradaksinya-kramanam asanady'ahuti-vidhih; Pranamah samvesah sukham akilam atmarpana-drsa Saparya-paryayas tava bhavatu yan me vilasitam.

🌻 Translation :
Let the mutterings that i do, with the sacrifice in my soul. Become chanting of your name, let all my movements become thine mudhras,let my travel become perambulations around thee, let the act of eating and drinking become fire sacrifice to thee, let my act of sleeping becomes salutations to you, and let all actions of pleasure of mine, become parts of thine worship.

🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :

If one chants this verse 1000 times each day for 45 days, offering milk as prasadam, it is said that one
 would be able to attain self realization and ultimate Truth.

🌻 BENEFICIAL RESULTS:
Attainment of knowledge of self (aathmagnaana) and mastery over spells. 
 
🌻 Literal Results:
Beneficial for instrumentalists, dancers and yoga practitioners. Enhances mind and body fitness. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: one or more people

_*🌻. గుప్త నవరాత్రి : అద్భుత శక్తులను పొందటానికి దుర్గామాతను ఏవిధంగా పూజించాలి ? 🌻*_

🕉🕉🕉🕉🕉🕉🕉

గుప్త నవరాత్రి జూన్ 22, సోమవారం నుండి ప్రారంభమై 2020 జూలై 1 బుధవారం ముగుస్తుంది. అనేక సిద్ధిలను పొందటానికి మరియు వివిధ కోరికలను నెరవేర్చడానికి , ఈ నవరాత్రంలో పూజలు మరియు ఆచారాలు నిర్వహిస్తారు. మీరు ఈ ఉపవాసం నుండి గరిష్ట ఫలాలను పొందాలనుకుంటే మరియు ఆచారాలు పాటిస్తూ గుప్త నవరాత్రి పూజలు చేయవచ్చు.

అలాగే , మీ పుట్టిన వివరాల ఆధారంగా ఆస్ట్రోసేజ్ యొక్క బృహత్ కుండ్లితో , మీరు ఈ నవరాత్రి మీ జీవితంపై ప్రభావం గురించి తెలుసుకోవచ్చు మరియు అలాంటి సంఘటనలు మరియు ఇతర గ్రహాల కదలికలు మీ జీవిత దిశను ఎలా మారుస్తాయో తెలుసుకోవచ్చు.

ఈ సందర్భాన్ని గుప్త నవరాత్రి అని పిలవడం వెనుక గల కారణాన్ని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు ఈ సంఘటన గురించి వివరణాత్మక అవగాహన పొందండి. 

*ఈ నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? ఈ నవరాత్రికి ప్రత్యేకత ఏమిటి మరియు ఇది ఇతర నవరాత్రుల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? పెరుగుతున్న కరోనావైరస్ భయం మధ్య మా దుర్గాదేవి ఆశీర్వాదం పొందడానికి గుప్త నవరాత్రి సమయంలో అనుసరించే ఆరాధన పద్ధతి ఏమిటి? ప్రతి ప్రశ్నకు సమాధానాలను ఇక్కడ పొందండి !*

ఒక సంవత్సరంలో నవరాత్రి సంభవించడం
హిందూ పంచాంగం ప్రకారం , ఆదిశక్తి ఆ అమ్మ భగవతిని పూజించడానికి ఏడాది పొడవునా మొత్తం నాలుగు నవరాత్రులు జరుగుతాయి , వీటిలో రెండు ఉదయ నవరాత్రి అని , మిగతా ఇద్దరిని గుప్త నవరాత్రి అని పిలుస్తారు. చైత్ర లేదా అశ్విజ మాసంలో ఉదయ నవరాత్రి బాడీ నవరాత్రి లేదా ప్రకాత్ నవరాత్రి అని పిలుస్తారు , అయితే ఆషాడ మరియు మాఘ మాసంలో శుక్ల పక్షంలో నవరాత్రిని గుప్త నవరాత్రి లేదా చోటి నవరాత్రి అని పిలుస్తారు.

గుప్త నవరాత్రి ప్రధానంగా పంజాబ్ , హర్యానా , ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రదేశాలలో జరుపుకుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న మహమ్మారి మరియు పెరుగుతున్న కరోనా సోకిన కేసుల మధ్య , మీరు ఆచారాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇస్తున్నారు.

*గుప్త నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు?*

గుప్త నవరాత్రి పండుగ తంత్ర సాధనకు ముఖ్యమైనదిగా భావిస్తారు. ఒక నిర్దిష్ట కాలంలో విష్ణువు నిద్రలో ఉన్నప్పుడు , దేవతల యొక్క శక్తి బలహీనపడటం ప్రారంభమవుతుంది , మరియు యమ లేదా వరుణుల ఆధిపత్యం భూమిపై పెరుగుతుందని అనిపిస్తుంది. అటువంటి విపత్తులు మరియు భీభత్సం నుండి బయటపడటానికి దుర్గాదేవిని గుప్త నవరాత్రిలో పూజిస్తారు. దుర్గాదేవిని పూజించడం ఈ రోజుల్లో చాలా ప్రయోజనకరంగా అనిపిస్తుంది.

అద్భుత శక్తులను పొందటానికి అన్వేషకులు గుప్త నవరాత్రి సమయంలో క్షుద్ర పద్ధతులు చేస్తారు. నిర్దిష్ట కోరికల నెరవేర్చుకోనుట కోసం దేవతను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు ప్రత్యేక తాంత్రిక కర్మలు చేస్తారు. ఈ కాలంలో , దుర్గా సప్తశతి , దుర్గా చలిసా మరియు దుర్గా సహస్రణం పఠించడం చాలా ఫలవంతమైనదిగా భావిస్తారు. గుప్త నవరాత్రి అద్భుత శక్తులను సాధించడంలో మాత్రమే కాకుండా , సంపద , శత్రువుల నుండి విముక్తి మరియు ప్రసవానికి కూడా ప్రభావవంతంగా ఉంటుంది.

*ఈ సందర్భంలో ఏఏ దేవతలు పూజిస్తారు*

గుప్త నవరాత్రి సమయంలో , వినాశన ప్రభువు మహాదేవ్ మరియు కాళి దేవిని ఆచారాల ప్రకారం భక్తులు పూజిస్తారు. ఈ వ్యవధిలో కింది పది దేవతలను పూజిస్తారు:

కాళిదేవి
మా భువనేశ్వరి
త్రిపుర సుందరి
మా చిన్న
బాగ్లముఖి దేవి
కమలా దేవి
త్రిపుర భైరవి మాతా
తారా దేవి
మా ధుమావతి
మాతంగి

*గుప్త నవరాత్రి ప్రాముఖ్యత*

భగవత పురాణం ప్రకారం , రెండు గుప్త నవరాత్రాలలో పది మహావిద్యలు సాధన మరియు సాధించబడతాయి. ఈ నవరాత్రి ముఖ్యంగా తాంత్రిక కార్యకలాపాలు , శక్తి సాధనలు , మహాకల్ మొదలైన వాటితో సంబంధం కలిగి ఉన్నవారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ నవరాత్రిలో , భగవతి దేవి భక్తులు వేగంగా నియమించి , కఠినమైన నియమాలను పాటిస్తూ ధ్యానం చేస్తారు.

*గుప్త నవరాత్రి సమయంలో దేవి పూజ*

ఇతర నవరాత్రుల మాదిరిగానే , గుప్త నవరాత్రి సమయంలో ఉపవాసం మరియు ఆరాధన జరుగుతుంది. భక్తులు పాడ్యమి నుండి నవమి వరకు ఉపవాసం పాటిస్తారు మరియు ఉదయం మరియు సాయంత్రం పూజలు చేస్తారు.

గుప్త నవరాత్రి సమయంలో మీరు తొమ్మిది రోజులు కలషాన్ని స్థాపించవచ్చు లేదా వ్యవస్థాపించవచ్చు.
మీరు కలషాన్ని వ్యవస్థాపించినట్లయితే , మీరు ఉదయం మరియు సాయంత్రం రెండుపూటలా సరిగ్గా స్నానం చేయాలి మరియు శుభ్రమైన బట్టలు ధరించాలి.
ఇప్పుడు పండ్లు , పువ్వులు , ధూపం , దీపం మొదలైన వాటితో దేవతను ఆరాధించండి. ఎరుపు రంగు పువ్వులు దేవతకు అత్యంత ఇష్టమైనవి అని గుర్తుంచుకోండి.
ఆకులు , వక్కలు , దూపం , తులసి వంటివి దేవికి అర్పించడం మర్చిపోవద్దు.

దీని తరువాత , మాతకు హారతి ఇవ్వండి. హారతి సమయంలో మంత్రం , చలిసా లేదా సప్తషాతిని పఠించడం చాలా ఫలవంతమైనదిగా భావిస్తారు.
దేవతకు భోగ్ సమర్పించండి. మీరు సరళమైన పూజలు చేస్తుంటే , దేవతను అర్పించడానికి ఉత్తమమైన భోగ్ లవంగం మరియు బటాషా.

దేవత ముందు నెయ్యి లేదా స్పష్టీకరించిన వెన్నని ఉపయోగించి పెద్ద ముఖం గల దీపం ఎల్లప్పుడూ వెలిగించండి.

ప్రత్యేక శుభాకాంక్షల కోసం , గుప్త నవరాత్రి సందర్భంగా ఉదయం మరియు సాయంత్రం 108 సార్లు *"ఓం ఐం హ్రీం క్లీం ఛాముండయా విచ్చే"* అనే మంత్రాన్ని జపించండి.
రాబోయే తొమ్మిది రోజులు సాత్విక లేదా స్వచ్ఛమైన శాఖాహార ఆహారాన్ని తీసుకోండి.

*గుప్త నవరాత్రి: ప్రత్యేకత ఏమిటి?*

నవరాత్రి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని మనందరికీ తెలుసు. సాధారణంగా , సాత్విక మరియు తాంత్రిక పూజ ఆచారాలు రెండూ జరుగుతాయి , కాని గుప్త నవరాత్రి సమయంలో , ఎక్కువగా తాంత్రిక పూజలు చేస్తారు. ఈ నవరాత్రిలో , ఎవరికీ తెలియకుండా లేదా బహిరంగంగా చర్చించకుండా కర్మలు చేయవలసి ఉంటుంది. అతను / ఆమె తన చర్యలను చర్చించడాన్ని నివారించి , రహస్యంగా పూజలు చేసినప్పుడు మాత్రమే ఒకరు కోరుకున్న ఫలాలను పొందుతారని నమ్ముతారు.

*గుప్త నవరాత్రి కథ*

గుప్త నవరాత్రికి సంబంధించిన ఒక పౌరాణిక మరియు ప్రామాణికమైన కథ చాలా ప్రసిద్ది చెందింది. ఈ పురాణం ప్రకారం , సేజ్ ష్రింగి తన భక్తులతో వారి బాధలు మరియు కష్టాలను వింటూ సంభాషిస్తున్నాడు. అకస్మాత్తుగా జనం నుండి ఒక మహిళ ముందుకు వచ్చి సేజ్ తన భర్త గురించి చెప్పింది. తన భర్త ఎప్పుడూ చెడు అలవాట్లతో ఉంటాడని , అతను మాంసం తినేవాడు మరియు జూదగాడు అని ఆమె వెల్లడించింది , ఈ కారణంగా ఆమె పూజను సరిగ్గా చేయలేము. అయితే దుర్గాదేవిని పూజించడం ద్వారా తన కుటుంబానికి ఆనందం మరియు శ్రేయస్సు కావాలని ఆమె అతనికి చెప్పింది.

ఇది వినడం ద్వారా , సేజ్ ష్రింగి ఆమె భక్తిని బాగా ఆకట్టుకుంది మరియు ఆమెకు పరిష్కారాన్ని చెప్పింది. వసంత , శారదియ నవరాత్రి గురించి అందరికీ తెలిసినప్పటికీ , *‘గుప్త నవరాత్రి'* అని పిలువబడే మరో రెండు నవరాత్రులు ఉన్నాయని ఆయన అన్నారు. వ్యక్తమైన నవరాత్రులు దేవత యొక్క తొమ్మిది అవతారాలను జరుపుకుంటారు , కాని గుప్త నవరాత్రి సమయంలో , పది మహావిద్యలను పూజిస్తారు. గుప్త నవరాత్రి సమయంలో ఏవరైనా భక్తుడు తల్లి దుర్గను ఆరాధిస్తే , అప్పుడు దేవత అతన్ని / ఆమెను అపారమైన విజయంతో ఆశీర్వదిస్తుంది.

గుప్త నవరాత్రి సమయంలో అత్యాశ , మాంసం తినేవాడు లేదా ఆరాధించని ఎవరైనా దేవతను పూజిస్తే , అతడు / ఆమె అతని / ఆమె జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కానీ ఈ వ్యవధిలో మీ చర్యలను ప్రచారం చేయవద్దని గుర్తుంచుకోండి. అతని సలహాలు వింటూ , ఆ మహిళ సంతోషంగా ఉండి , తదనుగుణంగా గుప్త నవరాత్రి పూజలను నిర్వహించింది.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹 . శ్రీ శివ మహా పురాణము - 159 🌹 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - సృష్టిఖండః 🌴 
37. అధ్యాయము - 12

🌻. సార, అసార వస్తు విచారము - 6 

దేవశ్చాయం మహీయాన్వై తస్యార్థే పూజనం త్విదమ్‌ | గంధ చందన పుష్పాది కిమర్థం ప్రతిమాం వినా || 66

తావచ్చ ప్రతిమా పూజ్యా యావద్వి జ్ఞాన సంభవః | జ్ఞానా భావే నపూజ్యేత పతనం తస్య నిశ్చితమ్‌ || 67

ఏతస్మాత్కారణాద్విప్రా శ్శ్రూయతాం పరమార్థతః | స్వజాత్యుక్తం తు యత్కర్మ కర్తవ్యం తత్ర్పయత్నతః || 68

యత్ర యత్ర యథా భక్తిః కర్తవ్యం పూజనాదికమ్‌ | వినా పూజనదానాది పాతకం న చ దూరతః || 69

యావచ్చ పాతకం దేహే తావత్సిద్ధిర్న జాయతే . గతే చ పాతకే తస్య సర్వం చ సఫలం భవేత్‌ || 70

శివుడు దేవోత్తముడు. ప్రతిమ లేనిచో శివుని పూజకై సమకూర్చుకోబడిన గంధ చందన పుష్పాది ద్రవ్యములకు వినియోగమే మున్నది?(66).

జ్ఞానము ఉదయించు నంతవరకు ప్రతిమను పూజించవలెను. జ్ఞానము కలుగకుండగనే పూజను వీడినాడు పతనమగుట నిశ్చయము (67) . 

ఓ విప్రులారా! పరమార్ధమును వినుడు. ఈ కారణము వలన మానవుడు తనకు విహితమైన కర్మను ప్రయత్న పూర్వకముగా చేయవలెను (68). 

మానవుడు భక్తిని అను రూపముగా వివిధ ప్రతిమాదులను పూజించవలెను. పూజ, దానము మొదలగు కర్మలను వీడినచో, పాపము దూరము కాదు (69). 

దేహము (సూక్ష్మ) లో పాపము ఉన్నంతవరకు సిద్ధి కలుగదు. పాపము నశించిన మానవునకు సర్వము సఫలమగును (70).

తథా చ మలినే వస్త్రే రంగశ్శుభతరో న హి | క్షాలనే హి కృతే శుధ్ధే సర్వో రంగః ప్రసజ్ఞతే || 71

తథా చ నిర్మలే దేహే దేవానాం సమ్యగర్చయా | జ్ఞానరంగః ప్రజాయేత తదా విజ్ఞానసంభవః || 72

విజ్ఞానస్య చ సన్మూలం భక్తి రవ్యభి చారిణీ | జ్ఞానస్యాపి చ సన్మూలం భక్తి రేవాభిధీయతే || 73

భ##క్తేర్మూలం హి సత్కర్మ స్వేష్ట దేవాది పూజనమ్‌ | తన్మూలం సద్గురుః ప్రోక్తస్తన్మూలం సంగతిస్సతామ్‌ || 74

మలిన వస్త్ర ముపై రంగు అందముగా పట్టదు. ఉతికి శుద్ధిచేసిన వస్త్రముపై రంగు పూర్తిగా పట్టును (71). 

అదే విధముగా దేవతలను చక్కగా అర్చించుటచే సాధకుని (సూక్ష్మ) దేహము శుద్ధమై, జ్ఞానమనే రంగు కలుగును. అపుడు విజ్ఞానము (విశేష జ్ఞానము) పుట్టును (72). 

చలనము లేని సద్భక్తి విజ్ఞానమునకు మూలము. జ్ఞానమునకు కూడా సద్భక్తి యే మూలమనిచేప్పబడినది (73). 

తన ఇష్ట దైవమును పూజించుట మొదలగు సత్కర్మలు భక్తికి మూలము గదా! సత్కర్మకు సద్గురువు మూలము. సద్గురువు లభించుటకు సత్సంగము మూలమని చెప్పబడినది (74).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person

🌹. VEDA UPANISHAD SUKTHAM - 46 🌹
🌻 1. Annapurna Upanishad - 8 🌻
--- From Atharva Veda
✍️ Dr. A. G. Krishna Warrier
📚. Prasad Bharadwaj

II-31. A child amidst children; adult amidst adults; bold amidst the bold; a youth amidst the youthful; lamenting amidst those who lament; 

II-32. Steadfast, blissful, polished, of holy speech, wise, simple and sweet; never given to self-pity; 

II-33. Through discipline, when the throb of vital breaths ceases, the mind is wholly dissolved; the impersonal bliss (Nirvana) remains; 

II-34. Whence all discursive speech turns back with the obliteration of all of one's mental constructions that (Brahmic) status abides. 

II-35. Here is the supreme Self whose essence is the light of Consciousness without beginning or end; the wise hold this luminous certitude to be the right knowledge. 

II-36. The plenitude due to the knowledge 'all the world is Self alone' is the right measure of Selfrealization everywhere in the world. 

II-37. All is Self alone; what are the (empirical) states being and non-being? Where have they fled? Where are those notions of bondage and liberation? What stands out is Brahman alone. 

II-38. All is the one supreme Sky. What is liberation? What is bondage? This is the great Brahman, established mightily, with extended form; duality has vanished far from It; be you, yourself, the Self alone. 

II-39. When the form of a stock, stone and cloth is seen aright, there is not even a shadow of difference; bent on imagination (of differences) where are you? 

II-40. This imperishable and tranquil essence, (present) at the beginning and end of things and yourself, always be That.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people

🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 45 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. అత్రి – అనసూయ - 12 🌻

51. బ్రహ్మకూడా పరమేశ్వరతత్త్వంలో ఈశ్వరుడు విధించిన పరమ శివత్త్వం. శ్రీమహావిష్ణువుతత్త్వమేద‌యితే ఉన్నదో, ఆ సర్వకారణమేదయితే వుందో అది ఎలా సంకల్పించబడిందో ఆ సంకల్పం విధివత్ అన్నమాట. 

52. అలాగ కనబడేటటువంటి దాన్ని నిర్మాణంచేసి, అది ఏమవుతుందో దానిని అలా చేస్తూఉండే అధికారమేతప్ప స్వతంత్రం బ్రహ్మకు లేదు. అటువంటి స్వతంత్ర రూపం పరమాత్మ.

53. ఈశ్వరతత్త్వంలో ఏదయినా ఉత్కృష్టమైన విషయం చెప్పవలసివచ్చినప్పుడు, “పార్వతి స్వామిని అడిగింది. స్వామి పార్వతికి ఇలా చెప్పాడు” అని అంటారు. ఇకదాన్నెవరూ ప్రశ్నించటానికి వీలులేదు. 

54. అమ్మవారు అడిగితే స్వామి చెపుతారు అంతే! ఇకదానిని సందేహించటం అనే ప్రశ్న పుట్టరాదు. ఇది వ్యాసుడే తన ముఖంగా చెప్పేస్తే, ఎవరైనా ప్రశ్నించవచ్చు. పరమ ప్రామాణ్యతను దానికి ఇవ్వటమే దాని ఉద్దేశ్యం.

55. ఈశ్వరుడియొక్క లక్షణం ఏమిటంటే, సర్వానికీ అతడుకర్తేకాని కర్తృత్వభావనలేనివాడు. 

56. శుద్ధసత్వానికీ, సాపేక్షసత్యానికీ అదీ తేడా. బ్రహ్మదేవుడు చేసేది సృష్టి అది సాపేక్షసత్యం. అందువల్ల దానికి కర్తని నేను అనుకుంటాడతడు.

57. సత్పదార్ధం యొక్క వస్తులక్షణం ఎలా ఉంటుందో అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. దాని మీద నుంచీ వచ్చి మళ్లీ వెళ్లిపోయేటటువంటి ఈ జగత్తుఅంతాకూడా, తాత్కాలికంగా ఉంటుంది. 

58. తాత్కాలికమైన ఇటువంటి నాటకానికి ఒకమూలకర్త ఉన్నాడు. దానిని ఆడేవాడు, పాడేవాడు, నాటకం వేసేవాడు వాళ్ళందరూ మధ్యన వచ్చి మధ్యనే వెళ్ళిపోతారు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: night

🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 36 🌹
Chapter 11
✍️ Bhau Kalchuri
📚 . Prasad Bharadwaj

The Avatar has no karmic past associations (he descends directly) and therefore, he comes into creation for the whole universe.  

Since it was the Avatar who originally took upon himself the responsibility for all creation from the beginning, he comes for the whole creation, and since he alone has no past karmic associati on in any sense of the word, he has to form a new circle each time he comes.  

The Avatar selects members of his circle who are suitable for his work, and those selected are the ones who have been dedicated in the past to the cause of Truth.  

The Avatar's cir cle members may be those who have loved him in previous advents, or may be others who were devoted and sincere lovers of the Truth, but never really loved him personally. 

The Avatar is always free, and he is bound only by his duty toward the creation by his free will.  

Therefore, the Avatar's association is with the whole creation, while a Perfect Master's association is with those with whom he was once karmically bound.  

The God Realized Soul has been freed from all bindings, but if a God Realized Being com es back to work, then his work is first with those with whom he has past karmic associations, and this work has to do with sanskaric annihilation. 

Ordinary human associations are formed out of bindings, and since the Avatar is eternally free, being bound only by his one duty toward the universe, he has no binding association with his circle members before his next advent.  

The Avatar is not bound by anything at anytime, except his one divine duty to work for all creation. 

 He is eternally free, and therefore , when he comes to perform his divine duty toward the creation he remains free even while he is working.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: text that says 'Eventually you ll stop calling them coincidences and realize how powerful you are.'

🌹. మనోశక్తి - Mind Power - 49 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్ ద్వారా మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ

Q 49:-- సంభావ్య ఆత్మలు, ప్రత్యామ్నాయ ఆత్మలు, సమాంతర ఆత్మలు అంటే ?

Ans :--
1) మన ఆలోచనల ద్వారా మనం 3 రకాల ఆత్మలను సృష్టిస్తాము. 

1) సంభావ్య ఆత్మ (probable soul)
2) ప్రత్యామ్నాయ ఆత్మ(alternate సోల్)
3) సమాంతర ఆత్మ(parallel soul)

1) సమాంతర ఆత్మ :--
భూమి frequency కి సరిపోయే ఇతర తలాలను parallel వరల్డ్స్ అంటారు. ఆత్మ భూమి మీద లేదా భూమికి సరిపోయే ఇతర frequency ఉన్న ఇతర లోకాలలో కూడా జన్మ తీసుకుంటుంది. దానిని సమాంతర ఆత్మ అంటారు.

ఆత్మ అనేక dimensions లో అంటే వివిధ లోకాలలో సంభావ్య ఆత్మలుగా,
సమాంతర ఆత్మలుగా ప్రత్యామ్నాయ ఆత్మలుగా జన్మలు తీసుకుంటూ చైతన్య పరిణామం చెందుతుంటుంది.

2) సంభావ్య ఆత్మలు సంభావ్య లోకాలలో, ప్రత్యామ్నాయ ఆత్మలు ప్రత్యామ్నాయ లోకాలలో, సమాంతర ఆత్మలు సమాంతర లోకాలలో జన్మ తీసుకుంటాయి.

3) మన భూమికి కూడా సంభావ్య భూలోకమూ, ప్రత్యామ్నాయ భూలోకమూ, సమాంతర భూలోకమూ ఉన్నాయి.

4) మనము భూమి మీద సంగీతం నేర్చుకుంటున్నాము. సంభావ్య లోకంలో డాన్స్ నేర్చుకుంటున్నాము. అలాగ ఒక్కో తలంలో ఒక్కో కళను అభ్యసిస్తున్నాము. అన్ని కళలు శాస్త్రాలకు సంబందించిన జ్ఞానం మన చైతన్యశక్తి అనే internet ద్వారా నేర్చుకొంటూ telepathy ద్వారా పంచుకుంటాము.

5) భూమి మీద 3d కళలు,3d శాస్త్రాలు ఉన్నాయి. కానీ కోటానుకోట్ల లోకాలలో కోటానుకోట్ల కళలు ఉన్నాయి. వివిధ dimensions లో ఆ frequency కి తగ్గట్లు మనకు వివిధ దేహాలు ఉన్నాయి. 

అక్కడ ఆ లోకాలలో లెక్కలేనన్ని కళలను అభ్యసిస్తున్నాము. ఇదంతా అంతర్ ప్రపంచం నుండి కమ్యూనికేషన్ జరుగుతుంది.

6) మన కర్మలన్నింటికి మనమే బాధ్యత వహించాలి. అనగా ఆలోచనలన్నింటికి మనమే బాధ్యత వహించాలి.

7) మన ఆలోచనలకు అనుగుణంగా సంభావ్య దేవుళ్లను కూడా మనమే సృష్టించాము.

8) దేవుడు సర్వశక్తిమంతుడు,
ఆయనకు అనేక గుణాలుంటాయని విశ్వసించడం వలన సంభావ్య దేవుడు ఒకానొక సంభావ్య లోకానికి చేరి అక్కడ చైతన్య పరిణామం చెందుతుంటాడు.

9) మనం భూత, ప్రేత,
పిశాచాలను నమ్మినట్లైతే సంభావ్య భూత, ప్రేత పిశాచాలు సంభావ్య లోకాలలో వాస్తవం పొంది అక్కడ మనుగడ సాగిస్తుంటాయి.
వినాశకర ఆలోచనలు గాని, నిర్మాణాత్మక ఆలోచనలు గాని అన్నీ మన నుండే సృష్టింపబడతాయి.

10) మనం drawing నేర్చుకోవాలనుకున్నాము మనం సంభావ్య లోకంలో మన అ0శాత్మ అందులో నైపుణ్యం సంపాదించిందనుకోండి. మనం మన అంతర్ ప్రపంచం నుండి సంగ్రహించడం జరుగుతుంది. 

మనం ఒక లక్ష్యం ఏర్పరుచుకుంటే దానికి సంబంధించిన నైపుణ్యమే సంగ్రహించడం జరుగుతుంది. వేరే ఆలోచనల నైపుణ్యం సంగ్రహించలేము. 

కావున లక్ష్యం ఏర్పరుచుకోవడం నేర్చుకోండి. లక్ష్యం లేనిదే ఎదుగుదల అసంభవం.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: text that says 'It all begins and ends in your mind. What you give power to has power over you. -Leon Brown The Minds Journal Tee ENUGHTEnMEnT'

🌹 Seeds Of Consciousness - 111🌹
✍️ Nisargadatta Maharaj 
📚. Prasad Bharadwaj

🌻 THE MIND GOES ASTRAY , THE MIND RETURNS HOME... 🌻

Q: Is perfection the destiny of all human beings?

M: Of all living beings -- ultimately. The possibility becomes a certainty when the notion of enlightenment appears in the mind.

Once a living being has heard and understood that deliverance is within his reach, he will never forget, for it is the first message from within. It will take roots and grow and in due course take the blessed shape of the Guru.

Q: So all we are concerned with is the redemption of the mind?

M: What else? The mind goes astray, the mind returns home. Even the word 'astray' is not proper. 

The mind must know itself in every mood. Nothing is a mistake unless repeated.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 2 people, including Ramana Prasad Maddirela

🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 21 / Sri Lalita Sahasranamavali - Meaning - 21 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

శ్లోకము 51

193. దుష్టదూరా - దుష్టత్వము అంటనిది. దుష్టులకు అంటనిది.

194. దురాచార శమనీ - చెడు నడవడికను పోగొట్టునది.

195. దోషవర్జితా - దోషములచే విడిచి పెట్టబడింది.

196. సర్వజ్ఞా - అన్నిటినీ తెలిసింది.

197. సాంద్రకరుణా - గొప్ప దయ గలది.

198. సమానాధిక వర్జితా - ఎక్కువ తక్కువ భేదాలచే విడువబడినది అనగా ఎక్కువ వారు తక్కువ వారు లేనిది.

సశేషం.... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 21 🌹
📚. Prasad Bharadwaj 

🌻 Sahasra Namavali - 21 🌻

193 ) Dushta doora -   
She who keeps far away from evil men

194 ) Durachara samani -   
She who destroys evil practices

195 ) Dosha varjitha -   
She who does not have anything bad

196 ) Sarvangna -   
She who knows everything

197 ) Saandra karuna -   
She who is full of mercy

198 ) Samanadhika varjitha -   
She who is incomparable

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: 1 person, sitting

🌹. సాయి తత్వం - మానవత్వం - 43 / Sai Philosophy is Humanity - 43 🌹
🌴. అధ్యాయము - 6 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. మసీదుకు మరమ్మతులు - 1 🌻

1. గోపాలరావుగుండునకు ఇంకొక మంచి యాలోచన తట్టెను. ఉరుసు ఉత్సవమును ప్రారంభించినవిధముగనే, మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకొనెను.

2. మసీదు మరమ్మతు చేయు నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించెను. కాని ఈపని బాబా అతనికి నియమించలేదు.

3. నానాసాహెబు చాందోర్కరుకు ఆ సేవ లభించినది. రాళ్ళ తాపన కార్యము కాకాసాహేబు దీక్షిత్కు నియోగింపబడెను.

4. మసీదుకు మరమ్మతులు చేయుట మొదట బాబా కిష్టము లేకుండెను. కాని భక్తుడగు మహల్సాపతి కల్పించుకొని, యెటులనో బాబా యనుమతిని సాధించెను.

5. బాబా చావడిలోపండుకొన్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ళతో తాపనచేయుట ముగించిరి.

6. అప్పటినుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపుమీద కూర్చుండువారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911వ సంవత్సరములో సభామండపము పూర్తిచేసిరి.

7. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది. సౌకర్యముగా లేకుండెను. కాకాసాహెబు దీక్షిత్ దానిని విశాలపరచి పై కప్పు వేయదలచెను.

8. ఎంతో డబ్బు పెట్టి ఇనుపస్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను. రాత్రయంతయు శ్రమపడి స్తంభములు నాటెడివారు.

9. మరుసటిదినము ప్రాతఃకాలముననే బాబా చావడినుండి వచ్చి యది యంతయు జూచి కోపముతో వానిని పీకి పారవైచెడివారు.

10. ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపితుడై, నాటిన ఇనుపస్తంభమును ఒక చేతితో బెకలించుచు, రెండవచేతితో తాత్యాపాటీలు పీకను బట్టుకొనెను.

11. తాత్యా తలపాగాను బలవంతముగా దీసి, యగ్గిపుల్లతో నిప్పంటించి, యొక గోతిలో పారవైచెను.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

🌹. Sai Philosophy is Humanity - 43 🌹
Chapter 6
✍️. Sri NV. Gunaji
📚. Prasad Bharadwaj

🌻 Repairs to the Masjid - 1 🌻

Another important idea occured to Gopal Gund. Just as he started the Urus or fair, he thought that he should put the Masjid in order. 

So in order to carry out the repairs, he collected stones and got them dressed. But this work was not assigned to him. 

This was reserved for Nanasaheb Chandorkar, and the pavement -work for Kakasaheb Dixit. 

First, Baba was unwilling to allow them to have these works done, but with the intervention of Mahalsapati, a local devotee of Baba, His permission was secured. 

When the pavement was completed in one night in the Masjid, Baba took a small Gadi for His seat, discarding the usual piece of sack - cloth used till then. In 1911, the Sabha - Mandap (court - yard) was also put in order with great labour and effort. The open space in front of the Masjid was very small and inconvenient. 

Kakasaheb Dixit wanted to extend it and put on it roofing. At great expense, he got iron-posts, and pillars and trusses and started the work. 

At night, all the devotees worked hard and fixed the posts; but Baba, when he returned from Chavadi next morning, uprooted them all and threw them out. 

Once it so happened that Baba got very excited, caught a pole with one hand, and began to shake and uproot it, and with the other hand caught the neck of Tatya Patil. 

He took by force Tatya’s Pheta, struck a match, set it on fire and threw it in a pit.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

Image may contain: one or more people, people standing and indoor

🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 31 🌹
✍️. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 13
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భారతము వాఖ్యానం  - 2 🌻

కురుపాణ్డవయోర్యుద్ధం దైవయోగాద్బభూవ హ. 11

దుర్యోధనో జతుగృహే పాణ్డవానదహత్కుధీః | దగ్ధాగారా ద్వినిష్క్రాన్తా మాతృషష్ఠాస్తు పాణ్డవాః. 12

దైవవశముచే కురుపాండవుల మధ్య వైరము ఏర్పడెను. దుష్టబుద్ధియైన దుర్యోధనుడు లక్క ఇంటిలో పాండవులను కాల్చెను. కాని తల్లితో కూడిన పంచపాండవులును కాలిపోయిన ఇంటినుండి తప్పించుకొని వెళ్ళిపోయిరి.

తతస్త ఏకచక్రాయాం బ్రాహ్మణస్య నివేశ##నే | మునివేషాః స్థితాః సర్వే నిహత్య బక రాక్షసమ్‌. 13

పిమ్మట ఆ పాండవులు ఏకచక్రనగరమునందు మునివేషధారులై ఒక బ్రాహ్మణుని ఇంట నివసించిరి. అచట వారు బకరాక్షసుని చంపిరి.

యయుః పాఞ్చొలవిషయం ద్రౌపద్యాస్తే స్వయంవరే | సంప్రాప్తా బహువేషేణ ద్రౌపదీ పఞ్జపాణ్డవైః 14

వారు ద్రౌపదీస్వయంవరనిమిత్తమై పాంచాలదేశమునకు వెళ్లిరి. అచట వివిధాలంకారభూషిత యైన ద్రౌపదిని పాండవు లైదుగురును భార్యగా పొందిరి.

అర్ధరాజ్యం తతః ప్రాప్తా జ్ఞాతా దుర్యోధనాదిభిః | గాణ్డీవం చ ధనుర్దివ్యం పావకాద్రథముత్తమమ్‌. 15

సారథిం చార్జునః సంఖ్యే కృష్ణమక్షయ్యసాయకాన్‌ | బ్రహ్మస్త్రాదీంస్తదా ద్రోణాత్సర్వే శస్త్రవిశారదాః 16

దుర్యోధనాదులచే గుర్తింపబడిన ఆ పాండవులు అర్దరాజ్యమును పొందిరి. అర్జునుడు, అగ్ని దేవునుండి గాండీవ మను దివ్యధనస్సును, ఉత్తమమైన రథమును, అక్షయ్యమైన బాణములు గల అమ్ములపొదలను పొందెను. ద్రోణునివలన బ్రహ్మద్యస్త్రములను పొందెను. కృష్ణుని యుద్ధసమయమున సారథిగా పొందెను. వారందరరును శస్త్రాస్త్రములందు నమర్థులైరి.

కృష్ణేన సో7ర్జునో వహ్నిం ఖాణ్డవే సమతర్పయేత్‌ | ఇన్ద్రవృష్టిం వారయంశ్చ శరవర్షేణ పాణ్ణవః 17

పాండుకుమారుడైన అర్జునుడు తన శరవర్షముచే, ఇంద్రుడు కురిపించిన వర్షమును అడ్డగించి, కృష్ణసహాయముతో, ఖాండవవనమునందు అగ్నిని సంతృప్తిని చేసెను.

జితా దిశః పాణ్ణవైశ్చ రాజ్యం చక్రే యుధిష్ఠరః | బహుస్వర్ణం రాజసూయం నసేహే తం సుయోధనః 18

పాండవులు నలుదిక్కులను జయించిరి. యధిష్ఠిరుడు రాజ్యము చేసెను. అధిక మగు సువర్ణదానము గల రాజసూయయాగమును చేసెను. దుర్యోధనుడు దీని నంతను సహింపలేకపోయెను.

భ్రాత్రా దుఃశాసనేనోక్తః కర్ణేన ప్రాప్తభూతినా| ద్యూతకార్యే శకునినా ద్యూతేన నయుధిష్ఠరమ్‌. 19

అజయత్తస్య రాజ్యం చ సభాస్థో మాయయా హసన్‌ |

సోదరుడైన దుఃశాసనుడును, ఐశ్వర్యము లభించిన కర్ణుడును, శకునియు చెప్పగా యుధిష్ఠిరుని ద్యూతము నకై ఆహ్వానించి, ఆ ద్యూతశాలలో యుధిష్ఠిరుని మోనము చేసి నవ్వుచు, అతని రాజ్యమును హరించెను.

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹