శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀

🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 1 🌻


అపమృత్యువును, అకాల మృత్యువును మాత్రమే కాక మరణాను భవము కూడ నివారించునది శ్రీమాత అని అర్థము. అపమృత్యు వనగా అర్థాంతర మృత్యువు. పూర్ణ జీవితము జీవించక, తన వంతు కర్తవ్యమును నిర్వర్తింపక జీవితము సగభాగముననే మరణించుట అపమృత్యువు. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, వానప్రస్థము, ఇత్యాది మజిలీలు అన్నియూ అనుభవించి సంఘపరము, కుటుంబపరమునగు కర్తవ్యములను పూర్ణముగ నిర్వర్తించి పితృఋణము, దేవ ఋణము కూడ తృప్తికరముగ నిర్వహించి జీవునిగ పండి, దేహము విడచుట సవ్యమగు మృత్యువు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻

🌻 552. 'Sarvamrutyu Nivarini' - 1 🌻


It means that Srimata is the one who dispels not only mortality and premature death but also the feel of death itself. Apamrutyu means death that occurs suddenly. Not living a full life and dying half way through the life without fulfilling one's duty is untimely death. After experiencing all the stages of childhood, adolescence, youth, adulthood, and retirement, when one fulfills one's social and family duties, fulfills one's duty to one's ancestors, and fulfills one's debt to deities to satisfaction, matures as a jeeva and leaves the body it is considered as normal death


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


సిద్దేశ్వరయానం - 100 Siddeshwarayanam - 100


🌹 సిద్దేశ్వరయానం - 100 🌹

💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐

🏵 రాధాసాధన - 3 🏵


బృందావనధామంలో రాధాకృష్ణ సాధన మిగతాదేవతా సాధనా మార్గాలకంటే భిన్నమైనది. దీనిలో జపహోమములకు ప్రాధాన్యం లేదు. బ్రహ్మవైవర్త పురాణంలో, దేవీభాగవతంలో హోమములు చేయమని ఉన్నది. కానీ యమునాతీర యోగులు భక్తికి రసభావానికి ప్రాధాన్యం ఇస్తారు. దీర్ఘకాల జీవియైన ఒక ఔత్తరాహయోగిని మీ దీర్ఘాయువు యొక్క రహస్యమేమిటి అని ప్రశ్నిస్తే “రోజూ ఆర్తితో భజన చేస్తాను. అదే నా రహస్యము” అన్నాడట ! అయితే ఆ భావుకస్థితి రావటం సులభంకాదు. ఈ సాధన ప్రారంభించిన రోజుల్లో పట్టుదలతో లక్షలకొద్దిజపము, హోమములు చేశాను. ఏవో అనుభూతులు కలిగినవి. కానీ నాకు సంతృప్తి కలగలేదు. తీవ్రమైన వేదన చెందాను.

దుఃఖంతో మంత్రం ఆగిపోతున్నది. వేదన అగ్నివలె అవుతున్నది. అంతరిక్షంలో నుండి ఒక యోగి దిగివచ్చాడు. "బృందావనానికి వచ్చి పన్నెండురోజుల ధ్యానసాధన చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తుంది” అని పలికి అదృశ్యమైనాడు. ఆ మాటను శిరసావహించి చెప్పిన ప్రకారం చేశాను. రాసేశ్వరి కరుణించింది.

ఆ తర్వాత రాధాదేవి అవతరించిన రావల్ గ్రామానికి వెళ్ళి రాధాష్టమినాడు తెల్లవారుజామున ధ్యానంలో ఉన్నాను.గొప్ప అనుభూతి కలిగింది.అప్పటినుండి భాద్రపదశుద్ధ అష్టమి తెల్లవారు జామున ఎక్కడ ఉన్నా ఆ తల్లి కరుణ చూపిస్తూనే ఉన్నది. దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నది.బృందావనధామంలో ధ్యానసమయాలలో అమ్మ ఇటువంటి దివ్యానుభవాల నెన్నింటినో ప్రసాదించినది.

ఒక రాత్రి జపం చేస్తుంటే ఆ సువర్ణసుందరి తన కోమలహస్తంతో నా చేయి పట్టుకొని జపం చాలులే! నాకు వెన్నకావాలి పెట్టు అన్నది. ఆమె ఆజ్ఞ నెరవేర్చాను. దేవతలకు నిజంగా అవసరముందా ? సేవించుకోటానికి మనకు అవకాశమివ్వటం తప్ప! ఇటువంటి అనుగ్రహాన్ని తర్వాత కూడా చాలాసార్లు పొందాను.

దయామయి అయిన ఆ జగన్మాత నన్నొక ఉపకరణంగా మార్చి నాచేత చాలామందికి మంత్రోపదేశం చేయించి వారికి అద్భుతమైన అనుభూతులను ప్రసాదించింది. ఒకసారి బృందావనంలో నా గదిలో భక్తులతో కూర్చొని ఏదో మాట్లాడు తున్నాము. ఇంతలో ఒక భక్తురాలు వచ్చి కాళ్ళమీదపడి పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది. ఎంత ఆపమన్నా ఆగదు. “ఎన్నో ఏండ్ల నుంచి భక్తితో సాధన చేస్తున్నాను రాధారాణి అనుగ్రహించలేదు. మీరు ఆమె దర్శనం ఇప్పించండి" అంటూ దుఃఖిస్తున్నది. ఆమె కోరింది ఇప్పించటానికి నేనెంత వాడివి? ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. కొంతసేపు గడిచేసరికి ఆమె ఏడుపు ఆగింది. తలయెత్తి ఆనందంతో "నాకు దర్శనమైంది. నాకు దర్శనమైంది" అంటూ పొంగిపోతూ లేచి నమస్కరించింది. అప్పుడప్పుడు ఇటువంటి విచిత్రాలు జరుగుతున్నవి.

( సశేషం )

🌹🌹🌹🌹🌹


శ్రీమద్భగవద్గీత - 551: 14వ అధ్., శ్లో 27 / Bhagavad-Gita - 551: Chap. 14, Ver. 27

 

🌹. శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 27 🌴

27. బ్రాహ్మణో హి ప్రతిష్టాహమమృతస్యావ్యయస్య చ |
శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ||

🌷. తాత్పర్యం : అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమసుఖపు సహజస్థితియును అగు నిరాకారబ్రహ్మమునకు నేను మూలాధారమును.


🌷. భాష్యము : అమృతత్వము, అవ్యయత్వము, శాశ్వతత్వము, సౌఖ్యత్వములే బ్రహ్మము యొక్క సహజస్థితి. అట్టి బ్రహ్మానుభూతి యనునది ఆధ్యాత్మికానుభూతి యొక్క ఆరంభమై యున్నది. ఆధ్యాత్మికానుభూతి యందలి రెండవ దశయే పరమాత్మానుభూతి. ఈ దశయే మధ్యమ దశగా తెలియబడు చున్నది. ఇక దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరతత్త్వము యొక్క చరమానుభూతియై యున్నాడు. అనగా పరమాత్మ మరియు నిరాకారబ్రహ్మములు పరమపురుషుడైన శ్రీకృష్ణుని యందే యున్నవి.

భగవంతుడు అధమ, భౌతిక ప్రకృతిని ఉన్నతమైన స్వభావం కలిగిన జీవులతో నింపాడు. అదే భౌతిక ప్రకృతిలో ఉన్న ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతి ద్వారా నియమితం చేయబడిన జీవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించు కోవడం ప్రారంభించినప్పుడు, అతను భౌతిక ఉనికి నుండి తనను తాను ఉన్నతీకరించు కుంటాడు మరియు క్రమంగా పరమాత్మ యొక్క బ్రహ్మ భావనకు ఎదుగుతాడు.

జీవం యొక్క బ్రహ్మ భావన యొక్క ఈ సాధన స్వీయ-సాక్షాత్కారంలో మొదటి దశ. ఈ దశలో బ్రహ్మ సాక్షాత్కారమైన వ్యక్తి భౌతిక స్థానానికి అతీతుడు, కానీ అతను నిజానికి బ్రహ్మ సాక్షాత్కారంలో పరిపూర్ణుడు కాదు. అతను కోరుకుంటే, అతను ఈ స్థితిలో కొనసాగవచ్చు. క్రమంగా పరమాత్మ సాక్షాత్కారానికి, ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వీయస్థితికి ఎదుగుతాడు.

శ్రీమద్భగవద్గీత యందలి “ప్రకృతి త్రిగుణములు” అను చతుర్దశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 551 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 27 🌴

27. brahmaṇo hi pratiṣṭhāham amṛtasyāvyayasya ca
śāśvatasya ca dharmasya sukhasyaikāntikasya ca

🌷 Translation : And I am the basis of the impersonal Brahman, which is immortal, imperishable and eternal and is the constitutional position of ultimate happiness.


🌹 Purport : The constitution of Brahman is immortality, imperishability, eternity and happiness. Brahman is the beginning of transcendental realization. Paramātmā, the Supersoul, is the middle, the second stage in transcendental realization, and the Supreme Personality of Godhead is the ultimate realization of the Absolute Truth. Therefore, both Paramātmā and the impersonal Brahman are within the Supreme Person. It is explained in the Seventh Chapter that material nature is the manifestation of the inferior energy of the Supreme Lord. The Lord impregnates the inferior, material nature with fragments of the superior nature, and that is the spiritual touch in the material nature. When a living entity conditioned by this material nature begins the cultivation of spiritual knowledge, he elevates himself from the position of material existence and gradually rises up to the Brahman conception of the Supreme.

This attainment of the Brahman conception of life is the first stage in self-realization. At this stage the Brahman-realized person is transcendental to the material position, but he is not actually perfect in Brahman realization. If he wants, he can continue to stay in the Brahman position and then gradually rise up to Paramātmā realization and then to the realization of the Supreme Personality of Godhead.

Thus end the Bhaktivedanta Purports to the Fourteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Three Modes of Material Nature.

🌹 🌹 🌹 🌹 🌹


🌹 13, JULY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 13, JULY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551 🌹
🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 27 / Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 27 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 100 🌹
🏵 రాధాసాధన - 3 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 1 🌹 
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 1 / 552. 'Sarvamrutyu Nivarini' - 1 🌻
5) 🌹🎥 There is only one, it manifests itself in many forms The soul is eternal, eternally Holy 🎥🌹
https://youtu.be/LymdQ1XQK84si=ReRCRdmENLl2erFK
Like, Subscribe and Share. 👀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 551 / Bhagavad-Gita - 551 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 27 🌴*

*27. బ్రాహ్మణో హి ప్రతిష్టాహమమృతస్యావ్యయస్య చ |*
*శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాన్తికస్య చ ||*

*🌷. తాత్పర్యం : అమృతమును, అనశ్వరమును, శాశ్వతమును, చరమసుఖపు సహజస్థితియును అగు నిరాకారబ్రహ్మమునకు నేను మూలాధారమును.*

*🌷. భాష్యము : అమృతత్వము, అవ్యయత్వము, శాశ్వతత్వము, సౌఖ్యత్వములే బ్రహ్మము యొక్క సహజస్థితి. అట్టి బ్రహ్మానుభూతి యనునది ఆధ్యాత్మికానుభూతి యొక్క ఆరంభమై యున్నది. ఆధ్యాత్మికానుభూతి యందలి రెండవ దశయే పరమాత్మానుభూతి. ఈ దశయే మధ్యమ దశగా తెలియబడు చున్నది. ఇక దేవదేవుడైన శ్రీకృష్ణుడు పరతత్త్వము యొక్క చరమానుభూతియై యున్నాడు. అనగా పరమాత్మ మరియు నిరాకారబ్రహ్మములు పరమపురుషుడైన శ్రీకృష్ణుని యందే యున్నవి.*

*భగవంతుడు అధమ, భౌతిక ప్రకృతిని ఉన్నతమైన స్వభావం కలిగిన జీవులతో నింపాడు. అదే భౌతిక ప్రకృతిలో ఉన్న ఆధ్యాత్మిక స్పర్శ. ఈ భౌతిక ప్రకృతి ద్వారా నియమితం చేయబడిన జీవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించు కోవడం ప్రారంభించినప్పుడు, అతను భౌతిక ఉనికి నుండి తనను తాను ఉన్నతీకరించు కుంటాడు మరియు క్రమంగా పరమాత్మ యొక్క బ్రహ్మ భావనకు ఎదుగుతాడు.*

*జీవం యొక్క బ్రహ్మ భావన యొక్క ఈ సాధన స్వీయ-సాక్షాత్కారంలో మొదటి దశ. ఈ దశలో బ్రహ్మ సాక్షాత్కారమైన వ్యక్తి భౌతిక స్థానానికి అతీతుడు, కానీ అతను నిజానికి బ్రహ్మ సాక్షాత్కారంలో పరిపూర్ణుడు కాదు. అతను కోరుకుంటే, అతను ఈ స్థితిలో కొనసాగవచ్చు. క్రమంగా పరమాత్మ సాక్షాత్కారానికి, ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వీయస్థితికి ఎదుగుతాడు.*

*శ్రీమద్భగవద్గీత యందలి “ప్రకృతి త్రిగుణములు” అను చతుర్దశాధ్యాయమునకు భక్తివేదాంతభాష్యము సమాప్తము.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 551 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 27 🌴*

*27. brahmaṇo hi pratiṣṭhāham amṛtasyāvyayasya ca*
*śāśvatasya ca dharmasya sukhasyaikāntikasya ca*

*🌷 Translation : And I am the basis of the impersonal Brahman, which is immortal, imperishable and eternal and is the constitutional position of ultimate happiness.*

*🌹 Purport : The constitution of Brahman is immortality, imperishability, eternity and happiness. Brahman is the beginning of transcendental realization. Paramātmā, the Supersoul, is the middle, the second stage in transcendental realization, and the Supreme Personality of Godhead is the ultimate realization of the Absolute Truth. Therefore, both Paramātmā and the impersonal Brahman are within the Supreme Person. It is explained in the Seventh Chapter that material nature is the manifestation of the inferior energy of the Supreme Lord. The Lord impregnates the inferior, material nature with fragments of the superior nature, and that is the spiritual touch in the material nature. When a living entity conditioned by this material nature begins the cultivation of spiritual knowledge, he elevates himself from the position of material existence and gradually rises up to the Brahman conception of the Supreme.*

*This attainment of the Brahman conception of life is the first stage in self-realization. At this stage the Brahman-realized person is transcendental to the material position, but he is not actually perfect in Brahman realization. If he wants, he can continue to stay in the Brahman position and then gradually rise up to Paramātmā realization and then to the realization of the Supreme Personality of Godhead.*

*Thus end the Bhaktivedanta Purports to the Fourteenth Chapter of the Śrīmad Bhagavad-gītā in the matter of the Three Modes of Material Nature.*
🌹 🌹 🌹 🌹 🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 100 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
       
*🏵 రాధాసాధన - 3 🏵*

*బృందావనధామంలో రాధాకృష్ణ సాధన మిగతాదేవతా సాధనా మార్గాలకంటే భిన్నమైనది. దీనిలో జపహోమములకు ప్రాధాన్యం లేదు. బ్రహ్మవైవర్త పురాణంలో, దేవీభాగవతంలో హోమములు చేయమని ఉన్నది. కానీ యమునాతీర యోగులు భక్తికి రసభావానికి ప్రాధాన్యం ఇస్తారు. దీర్ఘకాల జీవియైన ఒక ఔత్తరాహయోగిని మీ దీర్ఘాయువు యొక్క రహస్యమేమిటి అని ప్రశ్నిస్తే “రోజూ ఆర్తితో భజన చేస్తాను. అదే నా రహస్యము” అన్నాడట ! అయితే ఆ భావుకస్థితి రావటం సులభంకాదు. ఈ సాధన ప్రారంభించిన రోజుల్లో పట్టుదలతో లక్షలకొద్దిజపము, హోమములు చేశాను. ఏవో అనుభూతులు కలిగినవి. కానీ నాకు సంతృప్తి కలగలేదు. తీవ్రమైన వేదన చెందాను.*

*దుఃఖంతో మంత్రం ఆగిపోతున్నది. వేదన అగ్నివలె అవుతున్నది. అంతరిక్షంలో నుండి ఒక యోగి దిగివచ్చాడు. "బృందావనానికి వచ్చి పన్నెండురోజుల ధ్యానసాధన చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తుంది” అని పలికి అదృశ్యమైనాడు. ఆ మాటను శిరసావహించి చెప్పిన ప్రకారం చేశాను. రాసేశ్వరి కరుణించింది.*
*ఆ తర్వాత రాధాదేవి అవతరించిన రావల్ గ్రామానికి వెళ్ళి రాధాష్టమినాడు తెల్లవారుజామున ధ్యానంలో ఉన్నాను.గొప్ప అనుభూతి కలిగింది.అప్పటినుండి భాద్రపదశుద్ధ అష్టమి తెల్లవారు జామున ఎక్కడ ఉన్నా ఆ తల్లి కరుణ చూపిస్తూనే ఉన్నది. దర్శనాన్ని అనుగ్రహిస్తూనే ఉన్నది.బృందావనధామంలో ధ్యానసమయాలలో అమ్మ ఇటువంటి దివ్యానుభవాల నెన్నింటినో ప్రసాదించినది.*

*ఒక రాత్రి జపం చేస్తుంటే ఆ సువర్ణసుందరి తన కోమలహస్తంతో నా చేయి పట్టుకొని జపం చాలులే! నాకు వెన్నకావాలి పెట్టు అన్నది. ఆమె ఆజ్ఞ నెరవేర్చాను. దేవతలకు నిజంగా అవసరముందా ? సేవించుకోటానికి మనకు అవకాశమివ్వటం తప్ప! ఇటువంటి అనుగ్రహాన్ని తర్వాత కూడా చాలాసార్లు పొందాను.*

*దయామయి అయిన ఆ జగన్మాత నన్నొక ఉపకరణంగా మార్చి నాచేత చాలామందికి మంత్రోపదేశం చేయించి వారికి అద్భుతమైన అనుభూతులను ప్రసాదించింది. ఒకసారి బృందావనంలో నా గదిలో భక్తులతో కూర్చొని ఏదో మాట్లాడు తున్నాము. ఇంతలో ఒక భక్తురాలు వచ్చి కాళ్ళమీదపడి పెద్దగా ఏడవటం మొదలు పెట్టింది. ఎంత ఆపమన్నా ఆగదు. “ఎన్నో ఏండ్ల నుంచి భక్తితో సాధన చేస్తున్నాను రాధారాణి అనుగ్రహించలేదు. మీరు ఆమె దర్శనం ఇప్పించండి" అంటూ దుఃఖిస్తున్నది. ఆమె కోరింది ఇప్పించటానికి నేనెంత వాడివి? ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. కొంతసేపు గడిచేసరికి ఆమె ఏడుపు ఆగింది. తలయెత్తి ఆనందంతో "నాకు దర్శనమైంది. నాకు దర్శనమైంది" అంటూ పొంగిపోతూ లేచి నమస్కరించింది. అప్పుడప్పుడు ఇటువంటి విచిత్రాలు జరుగుతున్నవి.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 552 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 552 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*

*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 1 🌻*

*అపమృత్యువును, అకాల మృత్యువును మాత్రమే కాక మరణాను భవము కూడ నివారించునది శ్రీమాత అని అర్థము. అపమృత్యు వనగా అర్థాంతర మృత్యువు. పూర్ణ జీవితము జీవించక, తన వంతు కర్తవ్యమును నిర్వర్తింపక జీవితము సగభాగముననే మరణించుట అపమృత్యువు. బాల్యము, కౌమారము, యౌవనము, వార్ధక్యము, వానప్రస్థము, ఇత్యాది మజిలీలు అన్నియూ అనుభవించి సంఘపరము, కుటుంబపరమునగు కర్తవ్యములను పూర్ణముగ నిర్వర్తించి పితృఋణము, దేవ ఋణము కూడ తృప్తికరముగ నిర్వహించి జీవునిగ పండి, దేహము విడచుట సవ్యమగు మృత్యువు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 552 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini  ॥112 ॥ 🌻*

*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 1 🌻*

*It means that Srimata is the one who dispels not only mortality and premature death but also the feel of death itself. Apamrutyu means death that occurs suddenly. Not living a full life and dying half way through the life without fulfilling one's duty is untimely death. After experiencing all the stages of childhood, adolescence, youth, adulthood, and retirement, when one fulfills one's social and family duties, fulfills one's duty to one's ancestors, and fulfills one's debt to deities to satisfaction, matures as a jeeva and leaves the body it is considered as normal death*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹🎥 There is only one, it manifests itself in many forms The soul is eternal, eternally Holy 🎥🌹*
*Prasad Bharadwaj.*
Like, Subscribe and Share. 👀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj