శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।
తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀

🌻 357-2. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻


సంసార జీవులకు తాపత్రయములు తప్పవు. సుఖమునకై యత్నించుచు వారు తాపత్రయాగ్నిలో ఉడికిపోవు చుందురు. చేసిన ప్రతి కర్మ, పలికిన ప్రతి మాట కొంత దోషముతో కూడిన దగుటచే ఫలితములను గూర్చిన కోరికలలో చిక్కుకొనుట జీవులకు తప్పదు. పనుల వలన కర్మలు బంధించుట, బంధము వలన ఉడుకుట జరుగు చుండును. ఇట్టి తాపత్రయములకు పరిష్కారము దైవమునకు సమర్పితమైన జీవితమును స్వీకరించుటయే.

జీవుని బుద్ధి, కర్మల ననుసరించి నడచును. కావున సతతము చిక్కుకొనుట జరుగుచునే యుండును. జీవితము చిక్కులు పడుచున్నకొద్ది తాపము పెరుగుచుండును. దేహ తాపము, భావతాపము, మరణించిన వెనుక తా నెటుపోవునో అన్న భయము పీడించు చుండగ జనన మరణముల ఊబిలో పడిపోవును. తనయందు కలుగు సంకల్పములు, తన చేతలు, తన మాటలు తన వశములో నుండనపుడు తరించుటకు ఉపాయము ఒక్కటియే యున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 79. Tapatrayagni santapta samahladana chandrika
Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻

🌻 357-2. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻


The three types of miseries are: 1. ādhyātmika – this comprises of the four components of antaḥkaraṇa, five karmendriya-s and five jñānendriya-s. 2. ādhibhautika – comprises of five basic elements and sense organs. 3. ādhidaivata – influence of super human powers.

All the three are called afflictions because they function on the basis of data provided by the sense organs.

Bṛhadāraṇyaka Upaniṣad (IV.iv.25) says, “That great birthless Self is un-decaying, immortal, undying, fearless...”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹



21 Mar 2022

ఓషో రోజువారీ ధ్యానాలు - 156. ఒంటరితనం / Osho Daily Meditations - 156. ALONENESS


🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 156 / Osho Daily Meditations - 156 🌹

📚. ప్రసాద్ భరద్వాజ్

🍀 156. ఒంటరితనం 🍀


🕉. ఒంటరితనం ఒక విధమైన విచారం, దుఃఖం మరియు చాలా లోతైన శాంతి, నిశ్శబ్దం రెండింటినీ కలిగి ఉంటుంది. మీరు దీన్ని ఎలా చూస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. 🕉

ఒకరు తమ స్వంత స్థలాన్ని కలిగి ఉండటం చాలా కష్టం. మీకు మీ స్వంత స్థలం లేకపోతే, మీ స్వంత జీవి గురించి మీకు ఎప్పటికీ పరిచయం ఉండదు. మీరు ఎవరో మీకు ఎప్పటికీ తెలియదు. ఎల్లప్పుడూ వెయ్యి విషయాలలో, నిశ్చితార్థం, ప్రాపంచిక వ్యవహారాలు, ఆందోళనలు, ప్రణాళికలు, భవిష్యత్తు, గతం ఇలా ఏదో ఒకటి ఎల్లప్పుడూ నిరంతరం ఉపరితలంపై నివసిస్తుంది. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు లోపలికి మునిగి పోవడం ప్రారంభించ వచ్చు.

మీరు విషయాలతో ఆక్రమించబడి లేనందున, మీరు ఎల్లప్పుడూ అనుభూతి చెందుతున్న విధంగా మీకు అనిపించదు. ఇది భిన్నంగా ఉంటుంది; ఆ వ్యత్యాసం కూడా వింతగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా తమ ప్రేమికులను, తమ స్నేహితులను కొంతకాలం కోల్పోతారు, కానీ ఇది ఎప్పటికీ ఉండదు. ఇది ఒక చిన్న క్రమశిక్షణ వంటి చర్య మాత్రమే. మీరు మిమ్మల్ని లోతుగా ప్రేమిస్తే, మీలోకి దిగితే, మీరు ఇతరులను మరింత లోతుగా ప్రేమించటానికి సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే తనను తాను తెలియని వాడు చాలా లోతుగా ప్రేమించలేడు. మీరు ఉపరితలంపై నివసిస్తుంటే, మీ సంబంధాలకు లోతు ఉండదు. ఇది ప్రస్తుత మీ సంబంధం. మీకు లోతు ఉంటే, అప్పుడు మీ సంబంధానికి కూడా లోతు ఉంటుంది.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Osho Daily Meditations - 156 🌹

📚. Prasad Bharadwaj

🍀 156. ALONENESS 🍀

🕉 Aloneness has in it both a sort of sadness, sorrow and a very deep peace and silence. It depends on you how you look at it. 🕉


It can be very difficult to have one's own space. But unless you have your own space, you will never become acquainted with your own being. You will never come to know who you are. Always engaged, always occupied in a thousand and one things-in relationships, in worldly affairs, anxieties, plans, future, past-one continuously lives on the surface. When you are alone you can start settling, sinking inward.

Because you are not occupied, you will not feel the way you have always been feeling. It will be different; that difference also feels strange. And certainly one misses one's lovers, one's friends, but this is not going to be forever. It is just a small discipline. And if you love yourself deeply and go down into yourself, you will be ready to love others even more deeply, because one who does not know oneself cannot love very deeply. If you live on the surface, your relationships cannot have depth. It is your relationship, after all. If you have depth, then your relationship will have depth.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


21 Mar 2022

మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 167


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 167 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. భావ బలము - 2 🌻


ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు. ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును.

సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింప జేయుటయే. ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించు కొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము.


...✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


21 Mar 2022

శ్రీ శివ మహా పురాణము - 537 / Sri Siva Maha Purana - 537


🌹 . శ్రీ శివ మహా పురాణము - 537 / Sri Siva Maha Purana - 537 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴

🌻. కన్యాదానము - 2 🌻

నారుదుడిట్లు పలికెను -

నీవు మూర్ఖుడవై నావు. నీకేమియూ తెలియదు. మహేశ్వరుని గురించి ప్రశ్నించుటచే నీవు పూర్తిగా బహిర్ముఖుడవై ఉన్నావని స్పష్టమైనది (14). నీవు ఈ సమయములో సాక్షాత్తు హరుని తన గోత్రమును చెప్పుమని ప్రశ్నించితివి. ఇది ఎంతయూ అపహాస్యకరమగు మాట యగును (15). ఓ పర్వతా ! ఈయన గోత్ర కుల నామములు విష్ణు బ్రహ్మాదులకైనను తెలియవు. ఇతరుల గురించి చెప్పున దేమున్నది? (16).

ఓ పర్వతా ! ఎవని యొక్క ఒక్క దినములో కోటి బ్రహ్మలు లయమగుదురో ఆ శంకరుడీనాడు కాళి యొక్క తపోబలము వలన నీకు కనుబడినాడు (17). ఈయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. ప్రకృతికి అతీతుడై ప్రకృతిని తన వశమునందుంచు కొనువాడు. వికారహీనుడగు శివుడు సర్వోత్కృష్టుడు (18). భక్తవత్సలుడు, స్వతంత్రుడునగు శివునకు కులగోత్రములు, నామములు లేవు. ఆయన తన ఇచ్ఛచే సగుణుడై దేహమును స్వీకరించి అనేక నామములను ధరించును (19).

మంచి గోత్రము గలవాడు, కాని గోత్రము లేనివాడు, మంచి కులమునకు చెందినవాడు, కాని కులము లేనివాడు ఆగు శివుడు ఈనాడు పార్వతి యొక్క తపస్సుచే నీ అల్లుడైనాడు. సందేహము లేదు (20). లీలా విహారియగు శివునిచే స్థావర జంగమాత్మకమగు విశ్వమంతయూ మోహింపబడి యున్నది. ఓ పర్వత శ్రేష్ఠా! శివుని పండితులు కూడా ఎరుంగ జాలరు (21).

మహేశ్వరుడు లింగాకారమును ధరించగా ఆయన అగ్రబాగము ఎవ్వరికీ కానరాలేదు. విష్ణువు పాతాళమునకు వెళ్లియూ ఆ లింగము యొక్క మూలమును గన జాలక చకితుడైనాడు (22). ఓ పర్వత రాజా! ఇన్ని మటలేల? శివమాయను దాట శక్యము కాదు. విష్ణు బ్రహ్మాదులతో సహా ముల్లోకములు శివమాయకు అధీనములై ఉన్నవి (23).

కావున పార్వతీ జనకుడవగు నీవు జాగ్రత్తగా విచారించు కొనుము. ఇటు వంటి వరుని విషయములో అల్పమగు విర్శయైననూ ఈ సమయములో చేయదగదు (24).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 537 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴

🌻 The ceremonious entry of Śiva - 2 🌻



Nārada said:—

14. You have been utterly deluded. You do not know anything about Śiva of whom you speak. You have no inner vision.

15. Śiva was directly asked by you to mention His Gotra. On this occasion these words are utterly ridiculous and derisible.

16. O mountain, even Viṣṇu, Brahmā and other gods do not know His Gotra, family and name. What then can be said about others?

17. It was a result of the severe penance of Pārvatī that Śiva was seen by you, O mountain, in one day according to whose calculation a crore of Brahmās become annihilated.

18. He is the formless supreme Brahman. He is attributeless. He is greater than Primordial Nature. He has no shape, is free from aberrations He is the master of delusion. He is greater than the greatest.

19. He has no Gotra, family or name. He is independent. He is favourably disposed to His devotees. At
His will He assumes bodies taking many names. He is full of attributes.

20. He is sugotrin (having good gotra) as well as devoid of gotra. He is of noble family as well as devoid of a family. Thanks to Pārvatī’s penance. He has now become your son-in-law, There is no doubt about it.

21. The whole world consisting of the mobile and immobile has been deluded by Him in His divine sport. O excellent mountain, even the wisest of men does not know Him.

22. The head of lord Śiva of phallic image was not seen by Brahma. Viṣṇu who went to the nether worlds did not see His foot. How surprised he was.

23. O excellent mountain, of what avail is this talk? Śiva’s magical power is inscrutable. The three worlds, Viṣṇu, Brahmā and others too are subservient to Him.

24. Hence, O father of Pārvatī, ponder over this deeply. No doubt need be entertained by you even slightly with respect to this bridegroom of your choice.


Continues....

🌹🌹🌹🌹🌹


21 Mar 2022

గీతోపనిషత్తు -339



🌹. గీతోపనిషత్తు -339 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-2 📚


🍀 29-2. అతీత స్థితి - సమాధి స్థితి ననుభవించినవారే పరమాత్మ నెరిగినవారు. తాముండుట యనగా దైవమే తానుగ నుండుట. తామున్నట్లే పశుపక్ష్యాదులు, వృక్షములు, ఖనిజములు కూడ యున్నవి. ఉండుట విషయములో అందరును సమానమే. ఉండుట లేకుండుట అనునవి చైతన్యమాదిగా గల లోకములకు, జీవులకు గాని పరమాత్మకు కాదు. స్థితి భేదము లన్నియు చైతన్యమునకే. నేను సముడను అని దైవము పలుకుచున్నాడు. తానందరి యందు రాగద్వేషములు లేక సమముగ నున్నాడని ప్రకటించుచున్నాడు. భగవంతుని ఈ ఉనికి ఆకళింపైన బ్రహ్మజ్ఞుడు కూడ అందరి విషయమున సమముగనే యుండును. 🍀

సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29

తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.

వివరణము : ఉండుట లేకుండుట అనునవి చైతన్యమాదిగా గల లోకములకు, జీవులకు గాని పరమాత్మకు కాదు. స్థితి భేదము లన్నియు చైతన్యమునకే. ఇట్లు సదా తటస్థుడుగ నుండు దైవముతో అనుసంధానము చెందుట సమాధి స్థితిని సూచించును. సమాధి స్థితి ననుభవించినవారే పరమాత్మ నెరిగినవారు. ప్రతివారును తామున్నామని భావింతురు. తాముండుట ననగానేమో పరిశీలింపవలెను. తాముండుట ఎట్లు సంభవించి నదో విచారించవలెను. తాముండుట యనగా దైవమే తానుగ నుండుట. తామున్నట్లే పశుపక్ష్యాదులు, వృక్షములు, ఖనిజములు కూడ యున్నవి. ఉండుట విషయములో అందరును సమానమే. చీమ, దోమ నుండి చతుర్ముఖ బ్రహ్మవరకు ఉండుట సమానము. భేద మంతయు చైతన్యపరముగ నుండును.

చతుర్ముఖ బ్రహ్మ చైతన్యము అతి విస్తారము. చీమ, దోమల విస్తారము అత్యంత పరిమితము. “సమోహం" అనగా సమ అహం - నేను సముడను అని దైవము పలుకుచున్నాడు. తానందరి యందు రాగద్వేషములు లేక సమముగ నున్నాడని ప్రకటించుచున్నాడు. ఈ ఉండుటలో ఎట్టి భేదములేదు. భగవంతుని ఈ ఉనికి ఆకళింపైన బ్రహ్మజ్ఞుడు కూడ అందరి విషయమున సమముగనే యుండును. ఉనికియే ప్రధానముగా నుండు తత్త్వమును స్థాణువని, శివమని పలుకుదురు. అదియే సత్యము. ఆ సత్య మాధారముగనే చైతన్య ముద్భవించి సృష్టి క్రియను గావించును. అట్టి శివునకు సురాసుర భేదము లేదు. సుర పక్షపాతము లేదు. అట్టి సత్యమును శివమును సుందరమును ఆశ్రయించి జీవించువారు పరమాత్ముని వలనే లోకాతీతులై వర్ధిల్లుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


21 Mar 2022

21 - MARCH - 2022 సోమవారం MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 21, సోమవారం, మార్చి 2022 ఇందు వాసరే 🌹
2) 🌹. గీతోపనిషత్తు - రాజవిద్య రాజగుహ్య యోగము 29-2 - 339 - అతీత స్ధితి🌹 
3) 🌹. శివ మహా పురాణము - 537 / Siva Maha Purana - 537 🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -167 🌹  
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 156 / Osho Daily Meditations - 156🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-2🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ సోమవారం మిత్రులందరికీ 🌹*
*ఇందు వాసరే, 21, మార్చి 2022*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : శివాజీ జయంతి, సంకష్టి చతుర్థి, Shivaji Jayanti, Sankashti Chaturthi🌻*

*🍀. రుద్రనమక స్తోత్రం - 15 🍀*

*29. పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!&
*ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!*
*30. అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!*
*స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ప్రకృతిలో ప్రస్తుతము మీరు ఎక్కడ ఉన్నారో అంతకంటే అత్యుత్తమమైన స్ధానం మీకు ఎక్కడా దొరకదు. - మాస్టర్‌ ఆర్‌.కె.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ,
ఉత్తరాయణం, శశిర ఋతువు, 
ఫాల్గుణ మాసం 
తిథి: కృష్ణ తదియ 08:21:22 వరకు
తదుపరి కృష్ణ చవితి
నక్షత్రం: స్వాతి 21:31:37 వరకు
తదుపరి విశాఖ
యోగం: వ్యాఘత 15:55:02 వరకు
తదుపరి హర్షణ
కరణం: విష్టి 08:20:23 వరకు
వర్జ్యం: 04:00:40 - 05:32:00 
మరియు 26:49:02 - 28:19:54
దుర్ముహూర్తం: 12:47:39 - 13:36:09 
మరియు 15:13:09 - 16:01:39
రాహు కాలం: 07:50:34 - 09:21:30
గుళిక కాలం: 13:54:20 - 15:25:16
యమ గండం: 10:52:27 - 12:23:23
అభిజిత్ ముహూర్తం: 11:59 - 12:47
అమృత కాలం: 13:08:40 - 14:40:00
సూర్యోదయం: 06:19:37
సూర్యాస్తమయం: 18:27:09
చంద్రోదయం: 21:27:24
చంద్రాస్తమయం: 08:24:08
సూర్య సంచార రాశి: మీనం
చంద్ర సంచార రాశి: తుల
ఛత్ర యోగం - స్త్రీ లాభం 21:31:37
వరకు తదుపరి మిత్ర యోగం 
- మిత్ర లాభం

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam 
#PanchangDaily
#DailyTeluguCalender 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -339 🌹*
*✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-2 📚*
 
*🍀 29-2. అతీత స్థితి - సమాధి స్థితి ననుభవించినవారే పరమాత్మ నెరిగినవారు. తాముండుట యనగా దైవమే తానుగ నుండుట. తామున్నట్లే పశుపక్ష్యాదులు, వృక్షములు, ఖనిజములు కూడ యున్నవి. ఉండుట విషయములో అందరును సమానమే. ఉండుట లేకుండుట అనునవి చైతన్యమాదిగా గల లోకములకు, జీవులకు గాని పరమాత్మకు కాదు. స్థితి భేదము లన్నియు చైతన్యమునకే. నేను సముడను అని దైవము పలుకుచున్నాడు. తానందరి యందు రాగద్వేషములు లేక సమముగ నున్నాడని ప్రకటించుచున్నాడు. భగవంతుని ఈ ఉనికి ఆకళింపైన బ్రహ్మజ్ఞుడు కూడ అందరి విషయమున సమముగనే యుండును. 🍀*

*సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |*
*యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29*

*తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.*

*వివరణము : ఉండుట లేకుండుట అనునవి చైతన్యమాదిగా గల లోకములకు, జీవులకు గాని పరమాత్మకు కాదు. స్థితి భేదము లన్నియు చైతన్యమునకే. ఇట్లు సదా తటస్థుడుగ నుండు దైవముతో అనుసంధానము చెందుట సమాధి స్థితిని సూచించును. సమాధి స్థితి ననుభవించినవారే పరమాత్మ నెరిగినవారు. ప్రతివారును తామున్నామని భావింతురు. తాముండుట ననగానేమో పరిశీలింపవలెను. తాముండుట ఎట్లు సంభవించి నదో విచారించవలెను. తాముండుట యనగా దైవమే తానుగ నుండుట. తామున్నట్లే పశుపక్ష్యాదులు, వృక్షములు, ఖనిజములు కూడ యున్నవి. ఉండుట విషయములో అందరును సమానమే. చీమ, దోమ నుండి చతుర్ముఖ బ్రహ్మవరకు ఉండుట సమానము. భేద మంతయు చైతన్యపరముగ నుండును.*

*చతుర్ముఖ బ్రహ్మ చైతన్యము అతి విస్తారము. చీమ, దోమల విస్తారము అత్యంత పరిమితము. “సమోహం" అనగా సమ అహం - నేను సముడను అని దైవము పలుకుచున్నాడు. తానందరి యందు రాగద్వేషములు లేక సమముగ నున్నాడని ప్రకటించుచున్నాడు. ఈ ఉండుటలో ఎట్టి భేదములేదు. భగవంతుని ఈ ఉనికి ఆకళింపైన బ్రహ్మజ్ఞుడు కూడ అందరి విషయమున సమముగనే యుండును. ఉనికియే ప్రధానముగా నుండు తత్త్వమును స్థాణువని, శివమని పలుకుదురు. అదియే సత్యము. ఆ సత్య మాధారముగనే చైతన్య ముద్భవించి సృష్టి క్రియను గావించును. అట్టి శివునకు సురాసుర భేదము లేదు. సుర పక్షపాతము లేదు. అట్టి సత్యమును శివమును సుందరమును ఆశ్రయించి జీవించువారు పరమాత్ముని వలనే లోకాతీతులై వర్ధిల్లుదురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
#గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 537 / Sri Siva Maha Purana - 537 🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 48 🌴*

*🌻. కన్యాదానము - 2 🌻*

నారుదుడిట్లు పలికెను -

నీవు మూర్ఖుడవై నావు. నీకేమియూ తెలియదు. మహేశ్వరుని గురించి ప్రశ్నించుటచే నీవు పూర్తిగా బహిర్ముఖుడవై ఉన్నావని స్పష్టమైనది (14). నీవు ఈ సమయములో సాక్షాత్తు హరుని తన గోత్రమును చెప్పుమని ప్రశ్నించితివి. ఇది ఎంతయూ అపహాస్యకరమగు మాట యగును (15). ఓ పర్వతా ! ఈయన గోత్ర కుల నామములు విష్ణు బ్రహ్మాదులకైనను తెలియవు. ఇతరుల గురించి చెప్పున దేమున్నది? (16). 

ఓ పర్వతా ! ఎవని యొక్క ఒక్క దినములో కోటి బ్రహ్మలు లయమగుదురో ఆ శంకరుడీనాడు కాళి యొక్క తపోబలము వలన నీకు కనుబడినాడు (17). ఈయన నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. ప్రకృతికి అతీతుడై ప్రకృతిని తన వశమునందుంచు కొనువాడు. వికారహీనుడగు శివుడు సర్వోత్కృష్టుడు (18). భక్తవత్సలుడు, స్వతంత్రుడునగు శివునకు కులగోత్రములు, నామములు లేవు. ఆయన తన ఇచ్ఛచే సగుణుడై దేహమును స్వీకరించి అనేక నామములను ధరించును (19). 

మంచి గోత్రము గలవాడు, కాని గోత్రము లేనివాడు, మంచి కులమునకు చెందినవాడు, కాని కులము లేనివాడు ఆగు శివుడు ఈనాడు పార్వతి యొక్క తపస్సుచే నీ అల్లుడైనాడు. సందేహము లేదు (20). లీలా విహారియగు శివునిచే స్థావర జంగమాత్మకమగు విశ్వమంతయూ మోహింపబడి యున్నది. ఓ పర్వత శ్రేష్ఠా! శివుని పండితులు కూడా ఎరుంగ జాలరు (21).

మహేశ్వరుడు లింగాకారమును ధరించగా ఆయన అగ్రబాగము ఎవ్వరికీ కానరాలేదు. విష్ణువు పాతాళమునకు వెళ్లియూ ఆ లింగము యొక్క మూలమును గన జాలక చకితుడైనాడు (22). ఓ పర్వత రాజా! ఇన్ని మటలేల? శివమాయను దాట శక్యము కాదు. విష్ణు బ్రహ్మాదులతో సహా ముల్లోకములు శివమాయకు అధీనములై ఉన్నవి (23). 

కావున పార్వతీ జనకుడవగు నీవు జాగ్రత్తగా విచారించు కొనుము. ఇటు వంటి వరుని విషయములో అల్పమగు విర్శయైననూ ఈ సమయములో చేయదగదు (24).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 537 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 48 🌴*

*🌻 The ceremonious entry of Śiva - 2 🌻*

Nārada said:—

14. You have been utterly deluded. You do not know anything about Śiva of whom you speak. You have no inner vision.

15. Śiva was directly asked by you to mention His Gotra. On this occasion these words are utterly ridiculous and derisible.

16. O mountain, even Viṣṇu, Brahmā and other gods do not know His Gotra, family and name. What then can be said about others?

17. It was a result of the severe penance of Pārvatī that Śiva was seen by you, O mountain, in one day according to whose calculation a crore of Brahmās become annihilated.

18. He is the formless supreme Brahman. He is attributeless. He is greater than Primordial Nature. He has no shape, is free from aberrations He is the master of delusion. He is greater than the greatest.

19. He has no Gotra, family or name. He is independent. He is favourably disposed to His devotees. At

His will He assumes bodies taking many names. He is full of attributes.

20. He is sugotrin (having good gotra) as well as devoid of gotra. He is of noble family as well as devoid of a family. Thanks to Pārvatī’s penance. He has now become your son-in-law, There is no doubt about it.

21. The whole world consisting of the mobile and immobile has been deluded by Him in His divine sport. O excellent mountain, even the wisest of men does not know Him.

22. The head of lord Śiva of phallic image was not seen by Brahma. Viṣṇu who went to the nether worlds did not see His foot. How surprised he was.

23. O excellent mountain, of what avail is this talk? Śiva’s magical power is inscrutable. The three worlds, Viṣṇu, Brahmā and others too are subservient to Him.

24. Hence, O father of Pārvatī, ponder over this deeply. No doubt need be entertained by you even slightly with respect to this bridegroom of your choice.

Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/ 
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 167 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు  
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

 *🌻. భావ బలము - 2 🌻* 

*ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు. ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును.*

*సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింప జేయుటయే. ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించు కొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము.*

...✍️ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
#మాస్టర్‌ఇకెసందేశములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
https://t.me/ChaitanyaVijnanam
 www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 156 / Osho Daily Meditations - 156 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*

*🍀 156. ఒంటరితనం 🍀*

*🕉. ఒంటరితనం ఒక విధమైన విచారం, దుఃఖం మరియు చాలా లోతైన శాంతి, నిశ్శబ్దం రెండింటినీ కలిగి ఉంటుంది. మీరు దీన్ని ఎలా చూస్తారనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. 🕉*
 
*ఒకరు తమ స్వంత స్థలాన్ని కలిగి ఉండటం చాలా కష్టం. మీకు మీ స్వంత స్థలం లేకపోతే, మీ స్వంత జీవి గురించి మీకు ఎప్పటికీ పరిచయం ఉండదు. మీరు ఎవరో మీకు ఎప్పటికీ తెలియదు. ఎల్లప్పుడూ వెయ్యి విషయాలలో, నిశ్చితార్థం, ప్రాపంచిక వ్యవహారాలు, ఆందోళనలు, ప్రణాళికలు, భవిష్యత్తు, గతం ఇలా ఏదో ఒకటి ఎల్లప్పుడూ నిరంతరం ఉపరితలంపై నివసిస్తుంది. కానీ మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు లోపలికి మునిగి పోవడం ప్రారంభించ వచ్చు.*

*మీరు విషయాలతో ఆక్రమించబడి లేనందున, మీరు ఎల్లప్పుడూ అనుభూతి చెందుతున్న విధంగా మీకు అనిపించదు. ఇది భిన్నంగా ఉంటుంది; ఆ వ్యత్యాసం కూడా వింతగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా తమ ప్రేమికులను, తమ స్నేహితులను కొంతకాలం కోల్పోతారు, కానీ ఇది ఎప్పటికీ ఉండదు. ఇది ఒక చిన్న క్రమశిక్షణ వంటి చర్య మాత్రమే. మీరు మిమ్మల్ని లోతుగా ప్రేమిస్తే, మీలోకి దిగితే, మీరు ఇతరులను మరింత లోతుగా ప్రేమించటానికి సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే తనను తాను తెలియని వాడు చాలా లోతుగా ప్రేమించలేడు. మీరు ఉపరితలంపై నివసిస్తుంటే, మీ సంబంధాలకు లోతు ఉండదు. ఇది ప్రస్తుత మీ సంబంధం. మీకు లోతు ఉంటే, అప్పుడు మీ సంబంధానికి కూడా లోతు ఉంటుంది.* 
  
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations - 156 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 156. ALONENESS 🍀*

*🕉 Aloneness has in it both a sort of sadness, sorrow and a very deep peace and silence. It depends on you how you look at it. 🕉*
 
*It can be very difficult to have one's own space. But unless you have your own space, you will never become acquainted with your own being. You will never come to know who you are. Always engaged, always occupied in a thousand and one things-in relationships, in worldly affairs, anxieties, plans, future, past-one continuously lives on the surface. When you are alone you can start settling, sinking inward.*

*Because you are not occupied, you will not feel the way you have always been feeling. It will be different; that difference also feels strange. And certainly one misses one's lovers, one's friends, but this is not going to be forever. It is just a small discipline. And if you love yourself deeply and go down into yourself, you will be ready to love others even more deeply, because one who does not know oneself cannot love very deeply. If you live on the surface, your relationships cannot have depth. It is your relationship, after all. If you have depth, then your relationship will have depth.* 
  
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse 
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj 
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 357-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 357-2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 79. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా ।*
*తరుణీ, తాపసారాధ్యా, తనుమధ్యా, తమోఽపహా ॥ 79 ॥ 🍀*

*🌻 357-2. 'తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా' 🌻* 

*సంసార జీవులకు తాపత్రయములు తప్పవు. సుఖమునకై యత్నించుచు వారు తాపత్రయాగ్నిలో ఉడికిపోవు చుందురు. చేసిన ప్రతి కర్మ, పలికిన ప్రతి మాట కొంత దోషముతో కూడిన దగుటచే ఫలితములను గూర్చిన కోరికలలో చిక్కుకొనుట జీవులకు తప్పదు. పనుల వలన కర్మలు బంధించుట, బంధము వలన ఉడుకుట జరుగు చుండును. ఇట్టి తాపత్రయములకు పరిష్కారము దైవమునకు సమర్పితమైన జీవితమును స్వీకరించుటయే.*

*జీవుని బుద్ధి, కర్మల ననుసరించి నడచును. కావున సతతము చిక్కుకొనుట జరుగుచునే యుండును. జీవితము చిక్కులు పడుచున్నకొద్ది తాపము పెరుగుచుండును. దేహ తాపము, భావతాపము, మరణించిన వెనుక తా నెటుపోవునో అన్న భయము పీడించు చుండగ జనన మరణముల ఊబిలో పడిపోవును. తనయందు కలుగు సంకల్పములు, తన చేతలు, తన మాటలు తన వశములో నుండనపుడు తరించుటకు ఉపాయము ఒక్కటియే యున్నది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 357-2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*

*🌻 79. Tapatrayagni santapta samahladana chandrika*
*Tatuni tapasaradhya tanumadhya tamo-paha ॥ 79 ॥ 🌻*

*🌻 357-2. Tāpatrayāgni-santapta-samāhlādana-candrikā तापत्रयाग्नि-सन्तप्त-समाह्लादन-चन्द्रिका 🌻*

*The three types of miseries are: 1. ādhyātmika – this comprises of the four components of antaḥkaraṇa, five karmendriya-s and five jñānendriya-s. 2. ādhibhautika – comprises of five basic elements and sense organs. 3. ādhidaivata – influence of super human powers.*

*All the three are called afflictions because they function on the basis of data provided by the sense organs.*

*Bṛhadāraṇyaka Upaniṣad (IV.iv.25) says, “That great birthless Self is un-decaying, immortal, undying, fearless...”*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#PrasadBhardwaj 
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://www.facebook.com/103080154909766/
https://incarnation14.wordpress.com/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹