🍀 17 - DECEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀

🌹🍀 17 - DECEMBER - 2022 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 296 / Bhagavad-Gita -296 🌹 7వ అధ్యాయము, జ్ఞాన విజ్ఞాన యోగము -17వ శ్లోకము.
2) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 658 / Sri Siva Maha Purana - 658 🌹
3) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 009 / DAILY WISDOM - 009 🌹 9. జీవన్ముక్త అనుభవం - The Experience of the Jivanmukta
4) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 274 🌹
5) 🌹. శివ సూత్రములు - 11 / Siva Sutras - 11 🌹. 4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 2 - Jñānādhiṣṭhānaṁ mātṛkā - 2

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. శ్రీమద్భగవద్గీత - 297 / Bhagavad-Gita - 297 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 7 వ అధ్యాయము - జ్ఞానయోగం - 17 🌴*

*17. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే |*
*ప్రియో హి జ్ఞానినో(త్యర్థమహం స చ మమ ప్రియ: ||*

🌷. తాత్పర్యం :
*వీరిలో సంపూర్ణజ్ఞానము కలిగి సదా భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యంత ఉత్తముడు. ఏలయన నేనతనికి మిక్కిలి ప్రియుడను మరియు అతడును నాకు మిక్కిలి ప్రియతముడు.*

🌷. భాష్యము :
ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, దివ్యజ్ఞానమును సముపార్జించగోరు జ్ఞాని యనువారలు విషయకోరికల నుండి విడివడినప్పుడు శుద్ధభక్తులు కాగలరు. 

వీరిలో పరతత్త్వజ్ఞానమును కలిగి సర్వవిషయకోరికల నుండి ముక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని నిజమైన భక్తుడు కాగలడు. ఇట్టి సుకృతులైన నలుగురిలో సంపూర్ణ జ్ఞానవంతుడై యుండి అదే సమయమున భక్తియుక్తసేవలో నియుక్తుడై యుండెడివాడు అత్యుత్తముడని శ్రీకృష్ణభగవానుడు తెలుపుచున్నాడు. 

జ్ఞానమును అన్వేషించువాడు తనను దేహము కన్నను అన్యునిగా తెలిసికొని, మరింత పురోగతి పొందిన పిదప నిరాకారబ్రహ్మానుభూతిని మరియు పరమాత్మానుభవమును పొందును. అతడు పూర్ణముగా పవిత్రుడైనప్పుడు తన నిజస్థితి శ్రీకృష్ణభగవానుని దాసత్వమే ననెడి విషయమును అవగతము చేసికొనగలడు. 

అనగా శుద్ధభక్తుల సాంగత్యములో జిజ్ఞాసువు, ఆర్తుడు, అర్థార్థి, జ్ఞాని అనువారలు క్రమముగా పవిత్రులు కాగలరు. కాని ప్రయత్నదశలో శ్రీకృష్ణభగవానుని గూర్చిన జ్ఞానమును కలిగియుండి, అదే సమయమున సేవను సైతము గూర్చువాడు ఆ భగవానుని మిక్కిలి ప్రియతముడు కాగలడు. 

భగవానుని దివ్యమగు శుద్ధజ్ఞానమునందు నెలకొనినవాడు భక్తిచే రక్షితుడై యుండి భౌతికకల్మషములచే ఎన్నడును అంటబడకుండును.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 297 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 7 - Jnana Yoga - 17 🌴*

*17. teṣāṁ jñānī nitya-yukta eka-bhaktir viśiṣyate*
*priyo hi jñānino ’tyartham ahaṁ sa ca mama priyaḥ*

🌷 Translation : 
*Of these, the one who is in full knowledge and who is always engaged in pure devotional service is the best. For I am very dear to him, and he is dear to Me.*

🌹 Purport :
Free from all contaminations of material desires, the distressed, the inquisitive, the penniless and the seeker after supreme knowledge can all become pure devotees. 

But out of them, he who is in knowledge of the Absolute Truth and free from all material desires becomes a really pure devotee of the Lord. 

And of the four orders, the devotee who is in full knowledge and is at the same time engaged in devotional service is, the Lord says, the best. 

By searching after knowledge one realizes that his self is different from his material body, and when further advanced he comes to the knowledge of impersonal Brahman and Paramātmā. When one is fully purified, he realizes that his constitutional position is to be the eternal servant of God. 

So by association with pure devotees the inquisitive, the distressed, the seeker after material amelioration and the man in knowledge all become themselves pure. 

But in the preparatory stage, the man who is in full knowledge of the Supreme Lord and is at the same time executing devotional service is very dear to the Lord. 

He who is situated in pure knowledge of the transcendence of the Supreme Personality of God is so protected in devotional service that material contamination cannot touch him. 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 . శ్రీ శివ మహా పురాణము - 658 / Sri Siva Maha Purana - 658 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 17 🌴*
*🌻. గణేశుడు మరల జీవించుట - 2 🌻*

దేవి ఇట్లు పలికెను -

ఓ శక్తులారా! దేవీమూర్తులారా! నా ఆదేశముచే మీరిపుడు ఇచట ప్రలయమును చేయుడు. ఈ విషయములో ఏమియూ సందేహించకుడు (10). సఖులారా! దేవతలను, ఋషులను, యక్షులను, రాక్షసులను, మనవారిని, ఇతరులను కూడా తొందరగా భక్షించుడు (11).

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆమెచే ఇట్లు ఆజ్ఞాపించబడిన ఆ శక్తులందరు మిక్కిలి క్రోధముతో నిండియున్నవై దేవతలు మొదలగు వారినందరినీ సంహరించుటకు ఉద్యుక్తలయ్యెను (12). అగ్ని గడ్డిన కాల్చిన విధముగా ఆ శక్తులందరూ వారిని సంహరించుట ఆరంభించెను (13). గణనాయకుడు గాని, విష్ణువు గాని, బ్రహ్మ గాని, శంకరుడుగాని, ఇంద్రుడు గాని, కుబేరుడు గాని, స్కందుడు గాని, సూర్యుడే అయినా (14), వారు అందరినీ భేదము లేకుండగా సంహరించు చుండిరి. ఎక్కడ చూచిననూ ఆ శక్తులే కానవచ్చెను (15).

భయంకరాకారయ కల్గిన వారు, పొట్టివారు, కుంటివారు, వ్రేలాడు తలలు గలవారు అగు శక్తి మూర్తులు అనేకులగు దేవతలను చేతితో పట్టి నోటిలో వేసుకొని నమిలి వేసిరి (16). శివుడు, బ్రహ్మ, విష్ణువు, ఇంద్రాది సమస్త దేవతలు, గణములు, మరియు ఋషులు అపుడా సంహరమును గాంచి (17), 'ఆ దేవి ఏమి చేయునో! అకాలమునందీ సంహారమును చేయుచున్నది' అను సంశయమును పొందిరి. వారికి తాము బ్రదికియుందు మనే ఆశ లేకుండెను (18). మనమందరము కలిసి ఏమి చేయవలెనో ఆలోచించవలెను. ఇట్లు వారు తల పోసి ఒకరితో నొకరు ఇట్లు మాటలాడు కొనిరి (19).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 658🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 17 🌴*

*🌻 The Resuscitation of Gaṇeśa - 2 🌻*

The goddess said:—
10. O Śaktis, O goddesses, now a great deluge shall be created by you at my bidding. You need not hesitate in this regard.

11. “O friends, devour forcibly all these sages, gods, Yakṣas, Rākṣasas belonging to us and others.”

Brahmā said:—
12. On being commanded by her, the infuriated Śaktis got ready to destroy the gods and others.

13. Just as the fire consumes dry grass so also these Śaktis attempted to destroy.

14-15. Leaders of Gaṇas or Viṣṇu, Brahmā or Śiva, Indra or Kubera, Skanda or the Sun—Śaktis began to destroy them. Wherever one looked, Śaktis were present.

16. Karālīs (the Terrific), Kubjakās (the humpbacked), Khañjās (the lame), Lambaśīrṣās (the tall-headed) the innumerable Śaktis took up the gods with their hands and threw them in their own mouths.

17-18. On seeing that Śiva, Brahmā, Viṣṇu, Indra, the other gods, Gaṇas and the sages began to doubt what the Goddess Pārvatī would be doing, whether she would create an untimely dissolution. Their hopes and aspirations for life were quelled.

19. They all gathered together and discussed—“What shall be done now? Let us ponder.” Discussing thus they spoke to one another.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 09 / DAILY WISDOM - 09 🌹*
*🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 9. జీవన్ముక్త అనుభవం 🌻*

*జీవన్ముక్తుడు తాను అందరికి ప్రభువుగా, సర్వజ్ఞుడుగా, అన్నింటిని ఆనందించేవాడిగా తనని తాను తెలుసుకుంటాడు. అస్తిత్వమంతా అతనిదే; సమస్త విశ్వం అతని శరీరం. అతను ఎవరికీ ఆజ్ఞాపించడు, ఎవరిచేత ఆజ్ఞాపించబడడు. అతను ఎల్లలు లేని జగత్సాక్షిగా తనని తాను తెలుసుకుంటాడు. ఈ స్థితి వర్ణించనలవి కానిది.*

*అతను ఏకకాలంలో 'నేను మాత్రమే ఉన్నాను' లేదా 'నేనే సర్వం' అనే భావనతో ఉనికిలో లోతుగా మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అతను చైతన్యం యొక్క సరిహద్దులను విచ్ఛిన్నం చేస్తాడు. అనంతం లోకి అడుగుపెడతాడు. కొన్ని సమయాల్లో అతను అసంపూర్తిగా వ్యక్తిగత అనుభవం ద్వారా తెచ్చిన జ్ఞాపకంగా సాపేక్షత యొక్క స్పృహను లీలామత్రంగా కలిగి ఉంటాడు.*

కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 DAILY WISDOM - 9 🌹*
*🍀 📖 The Realisation of the Absolute 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 9. The Experience of the Jivanmukta 🌻*

*The Jivanmukta experiences his being the lord of all, the knower of all, the enjoyer of everything. The whole existence belongs to him; the entire universe is his body. He neither commands anybody, nor is he commanded by anybody. He is the absolute witness of his own glory, without terms to express it.*

*He seems to simultaneously sink deep into and float on the ocean of the essence of being, with the feeling “I alone am”, or “I am all”. He breaks the boundaries of consciousness and steps into the bosom of Infinity. At times he seems to have a consciousness of relativity as a faint remembrance brought about by unfinished individualistic experience.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 274 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆధ్యాత్మికం అంటే ప్రపంచంతో సంబంధం లేకుండా వుండడం. ప్రపంచంలో నివసించాలి. నీలో ప్రపంచాన్ని నిలపకూడదు. అది క్షణికమని గుర్తించాలి. అప్పుడు సంక్షోభాలు, దీవెనలు, వైఫల్యాలు, విజయాలు అన్నీ ఒక్కటే. 🍀*

*ప్రపంచంలో వుంటూనే ప్రపంచానికి అంటుకోకుండా, గుర్తింపు లేకుండా వుండడం. ఆధ్యాత్మికం అంటే అదే. ప్రపంచంతో సంబంధం లేకుండా వుండడం. ప్రపంచంలో నివసించాలి. నీలో ప్రపంచాన్ని నిలపకూడదు. అది క్షణికమని గుర్తించాలి. దాంతో ఆందోళనకు గురి కాకూడదు.*

*అప్పుడు సంక్షోభాలు, దీవెనలు, వైఫల్యాలు, విజయాలు అన్నీ ఒక్కటే. అప్పుడు చీకటిని, వెలుగుని జీవితాన్ని మరణాన్ని ఒకటిగా చూస్తావు. అద్భుతమైన నిర్మలత్వం, సమతౌల్యం, సంభవం. ఆసాధారణ నిశ్శబ్దమే సత్యం.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹. శివ సూత్రములు - 11 / Siva Sutras - 11 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*1- శాంభవోపాయ*
 *✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻4. జ్ఞానాధిష్ఠానం మాతృక - 2 🌻*
*🌴. తల్లి నుండి జ్ఞానానికి ఆధారం అక్షరాలు.🌴*

*ఈ పదానికి అర్థం ఏమిటంటే శబ్ద బ్రహ్మం రూపంలో ఉన్న శక్తి పరిమిత జ్ఞానానికి మూలం, పరిమితికి కారణం మూడు మలములు. "నేను పరిమితుడనై తఉన్నాను" (ఆనవ మలం), "నేను సన్నగా లేదా లావుగా ఉన్నాను" (మాయ మలం,) "నేను అగ్నిస్తోమ సమారాధకుడను" (కర్మ మలం) మూడవ సూత్రంలో చర్చించబడ్డాయి. ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకోవడానికి, మాతృకను అర్థం చేసుకోవడం చాలా అవసరం. మాతృకను మాతృ + కగా విభజించవచ్చు. మాతృ అంటే తల్లి మరియు కా అంటే గ్రహింపనలవికానిది(కా అంటే బ్రహ్మం అని కూడా అర్ధం). మాతృక అంటే పూర్తిగా గ్రహించలేని దివ్య తల్లి. పైన పేర్కొన్న మలాల కారణంగా ఆమెను పూర్తిగా గ్రహించలేరు.*

*శివుడు బ్రహ్మము మరియు అంతిమ విముక్తిని పొందడానికి శక్తి మాత్రమే ఒకరిని శివుని వైపు నడిపించగలదు. ముక్తిని పొందడానికి శక్తిని మొదట అర్థం చేసుకోవడం చాలా అవసరం. లలితా సహస్రనామం నామ 727 శివ జ్ఞాన ప్రదాయిని ఏమని చెబుతుందంటే, శక్తి ఒక్కటే శివుని గురించి జ్ఞానాన్ని ప్రసాదించి అంతిమ విముక్తికి దారితీస్తుందని. శక్తి యొక్క గతిశీలమైన స్వభావానికి విరుద్ధంగా శివుడు స్థిరంగా సాక్షీభూతంగా ఉంటాడు. మాయ యొక్క భ్రాంతికరమైన ప్రభావం కారణంగా అమ్మ సరిగ్గా గ్రహించబడదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹


*🌹 Siva Sutras - 11 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 1 - Sāmbhavopāya
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻4. Jñānādhiṣṭhānaṁ mātṛkā - 2 🌻*
*🌴. The basis of knowledge from Mother is alphabets.🌴*

*This aphorism means that Śaktī in the form of Śabda Brahman is the source for limited knowledge, the cause of limitation being the three malas, "I am finite" (ānava mala), "I am thin or fat" (māyīya mala), and "I am an Agnistoma sacrificer" (kārma mala) discussed in the third aphorism. To understand this sūtrā better, understanding Mātṛkā is essential. Mātṛkā can be split into mātṛ + ka. Mātṛ means mother and ka means un-comprehended (ka also means the Brahman). Mātṛkā means that the Divine mother, who is not fully comprehended. She is not fully comprehended because of the malas referred above.*

*Shiva is the Brahman and only Śaktī can lead one to Shiva to attain the final liberation. It becomes essential that Śaktī should be first understood to attain liberation. Lalithā Sahasranāmam nāmā 727 śiva jnāna pradāyinī says, that Śaktī alone can lead to knowledge about Shiva for final liberation. Shiva is static and witnessing as opposed to the kinetic nature of Śaktī, who is the universal dynamic energy. Mostly She is not comprehended properly due to the illusionary effect of māyā.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj