🌹 22, JULY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 22, JULY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, JULY 2023 SATURDAY శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹 కపిల గీత - 209 / Kapila Gita - 209🌹 
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 19 / 5. Form of Bhakti - Glory of Time - 19 🌴
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 801 / Vishnu Sahasranama Contemplation - 801 🌹 
🌻801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ🌻
4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 762 / Sri Siva Maha Purana - 762 🌹
🌻. దేవాసుర యుధ్ధము - 3 / The battle of the gods - 3 🌻
5) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 016 / Osho Daily Meditations - 016 🌹 
🍀 16. విభజించబడిన శరీరం / 16.  THE DIVIDED BODY 🍀
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 465 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 465 - 2 🌹 
🌻465. 'క్షోభిణీ' - 2 / 465. 'Kshobhini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 22, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 07 🍀*
 
*12. అమరామృతసంధాతా ధృతసం‍మోహినీవపుః |*
*హరమోహకమాయావీ రక్షస్సందోహభంజనః*
*13. హిరణ్యాక్షవిదారీ చ యజ్ఞో యజ్ఞవిభావనః |*
*యజ్ఞీయోర్వీసముద్ధర్తా లీలాక్రోడః ప్రతాపవాన్*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : ఇతరులతో సంబంధాలు - సాధకుడు తోటి సాధకులతో గాక ఇతరులతో సంబంధాలు పెట్టుకోరాదన్న నియనుమేమీ లేదు కాని సాధకుని అంతరంగంలో ఆధ్యాత్మిక జీవనం అభివృద్ధి చెందిన కొలదీ ఆ యితర సంబంధాలలో సైతం మార్పు వచ్చి, సాధకుని దృష్టి నుంచి ఆధ్యాత్మికత నలవరచుకోక తప్పదు. ఈశ్వరునికి అడ్డుగా గాని పోటీగా గాని తయారయేటట్టుగా ఏ సంబంధము నందూ సక్తత కూడదు. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
వర్ష ఋతువు, దక్షిణాయణం,
శ్రావణ మాసం
తిథి: శుక్ల చవితి 09:27:10 వరకు
తదుపరి శుక్ల పంచమి
నక్షత్రం: పూర్వ ఫల్గుణి 16:59:12
వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి
యోగం: వరియాన 13:24:57 వరకు
తదుపరి పరిఘ
కరణం: విష్టి 09:26:10 వరకు
వర్జ్యం: 25:01:24 - 26:48:36
దుర్ముహూర్తం: 07:36:10 - 08:28:13
రాహు కాలం: 09:07:15 - 10:44:51
గుళిక కాలం: 05:52:04 - 07:29:39
యమ గండం: 14:00:03 - 15:37:39
అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48
అమృత కాలం: 09:47:00 - 11:35:00
సూర్యోదయం: 05:52:04
సూర్యాస్తమయం: 18:52:51
చంద్రోదయం: 09:25:20
చంద్రాస్తమయం: 22:02:05
సూర్య సంచార రాశి: కర్కాటకం
చంద్ర సంచార రాశి: సింహం
యోగాలు: లంబ యోగం - చికాకులు,
అపశకునం 16:59:12 వరకు తదుపరి
ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కపిల గీత - 209 / Kapila Gita - 209 🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 19 🌴*

*19. మద్ధర్మిణో గుణైరేతైః పరిసంశుద్ధ ఆశయః|*
*పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్రగుణం హి మామ్॥*

*తాత్పర్యము : ఈ విధముగా భాగవత ధర్మములను అనుష్ఠించు భక్తుని చిత్తము అత్యంత పరిశుద్ధమగును. పరమేశ్వరుని దివ్యగుణములను గూర్చి కేవలము విన్నంత మాత్రముననే అతడు అవలీలగా భగవత్ప్రాప్తిని పొందును.*

*వ్యాఖ్య : ఇలా పరిపూర్ణముగా నా ధర్మాలను, పరమాత్మను పొందడానికి కీర్తించడానికి దర్శించడానికి అన్ని ధర్మాలు ఆచరించే వారు ఈ గుణాలన్నీ కలిగి ఉంటారు. ఈ గుణాలన్నీ కలిగి ఉంటే మనసు పరిశుద్ధమవుతుంది. అలాంటి వాడు నా గుణములు విని ఎలాంటి నన్ను సాక్షాత్కరించుకోవాలని భావించాడో , అలాంటి గుణములు గల నన్ను చేరతారు. కానీ మనసుకున్న మురికి పోవాలంటే ఇవన్నీ చేయాలి. మనసు శుద్ధి అయిన తరువాత, "నేను ఇవన్నీ చేస్తున్నానని" వారికీ తెలియదు, పక్కవారికీ తెలియదు. "నేను ఇవన్నీ చేస్తున్నాను" అని చెప్పుకునే వాడు ధంభం కలవాడు. అలాంటి వారు చేసేది కొంగ జపమే.*

*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Kapila Gita - 209 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*

*🌴 5. Form of Bhakti - Glory of Time - 19 🌴*

*19. mad-dharmaṇo guṇair etaiḥ parisaṁśuddha āśayaḥ*
*puruṣasyāñjasābhyeti śruta-mātra-guṇaṁ hi mām*

*MEANING : When one is fully qualified with all these transcendental attributes and his consciousness is thus completely purified, he is immediately attracted simply by hearing My name or hearing of My transcendental quality.*

*PURPORT : In the beginning of this instruction, the Lord explained to His mother that mad-guṇa-śruti-mātreṇa, simply by hearing of the name, quality, form, etc., of the Supreme Personality of Godhead, one is immediately attracted. A person becomes fully qualified with all transcendental qualities by following the rules and regulations, as recommended in different scriptures. We have developed certain unnecessary qualities by material association, and by following the above process we become free from that contamination. To develop transcendental qualities, as explained in the previous verse, one must become free from these contaminated qualities.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 801 / Vishnu Sahasranama Contemplation - 801🌹*

*🌻801. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ🌻*

*ఓం అక్షోభ్యాయ నమః | ॐ अक्षोभ्याय नमः | OM Akṣobhyāya namaḥ*

*రాగద్వేషాదిభిశ్శబ్దస్పర్శాదివిషయైరపి ।*
*త్రిదశారిభిరక్షోభ్య ఇత్యక్షోభ్య ఇతీర్యతే ॥*

*రాగము, ద్వేషము మొదలగు దోషముల చేతను; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అను జ్ఞానేంద్రియ విషయముల చేతను - త్రిదశుల అనగా దేవతల ఆరుల అనగా శత్రువుల చేతను కూడ క్షోభింప చేయబడడు, కలత పరచ బడడు.*

*999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 801🌹*

*🌻801. Akṣobhyaḥ🌻*

*OM Akṣobhyāya namaḥ*

रागद्वेषादिभिश्शब्दस्पर्शादिविषयैरपि ।
त्रिदशारिभिरक्षोभ्य इत्यक्षोभ्य इतीर्यते ॥

*Rāgadveṣādibhiśśabdasparśādiviṣayairapi,*
*Tridaśāribhirakṣobhya ityakṣobhya itīryate.*

*Not liable to be agitated by attachment, aversion etc., by sound and other external objects by enemies of the devas.*

*999. అక్షోభ్యః, अक्षोभ्यः, Akṣobhyaḥ*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
सुवर्णबिंदुरक्षोभ्यस्सर्ववागीश्वरेश्वरः ।महाह्रदो महागर्तो महाभूतो महानिधिः ॥ ८६ ॥
సువర్ణబిందురక్షోభ్యస్సర్వవాగీశ్వరేశ్వరః ।మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ 86 ॥
Suvarṇabiṃdurakṣobhyassarvavāgīśvareśvaraḥ,Mahāhrado mahāgarto mahābhūto mahānidhiḥ ॥ 86 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 762 / Sri Siva Maha Purana - 762🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 16 🌴*
*🌻. దేవాసుర యుధ్ధము - 3 🌻*

*దైత్యులచే పీడింపబుడచున్న దేవతల దుఃఖములు మొదలగు వాటిని నశింపచేయుటలో వజ్రము వంటి వాడా! శేషశయ్యపై పరుండు వాడవు, సూర్యచంద్రులు నేత్రములుగా గల వాడవు అగు నీకునమస్కారము (18). దయానిధీ! లక్ష్మీపతీ! శరణు పొందిన మమ్ములను రక్షించుము. జలంధరుడు స్వర్గమునుండి దేవతల నందరినీ వెళ్లగొట్టినాడు (19). సూర్యచంద్రులను, అగ్నిని, యమధర్మరాజును అతడు తమ తమ స్ధానములనుండి వెళ్లగొట్టినాడు. పాతాళమునుండి వాసుకిని తరిమివేసినాడు (20). మానవులు వలె తిరుగాడు చున్న దేవతలలో శోభ అంతరించినది. మేము నిన్ను శరణు పొందుచున్నాము. వానిని వధించు ఉపాయమును ఆలోచించుము (21).*

*సనత్కుమారుడిట్లు పలికెను - దేవతల ఈ దీనాలాపములను విని కరుణా సముద్రుడగు మధుసూదనుడు మేఘంగంభీరమగు వాక్కుతో నిట్లనెను (22).*

*విష్ణువు ఇట్లు పలికెను - ఓ దేవతలారా! భయమును విడనాడుడు. నేను యుద్ధయునకు వెళ్లి, జలందరాసురునకు నా పరాక్రమమును చూపించెదను (23). భక్త ప్రియుడు, రాక్షసశత్రువు అగు విష్ణువు ఇట్లు పలికి దయచే దుఃఖితమైన మనస్సు గలవాడై శీఘ్రముగా గరుడుని అధిష్ఠించెను (24). సముద్రపుత్రియగు లక్ష్మి దేవతలతో గూడి వెళ్లుచున్న తన భర్తను గాంచి కన్నీళ్లతో చేతులను జోడించి ఇట్లు పలికెను (25).*

*లక్ష్మి ఇట్లు పలికెను - ఓ నాథా! నేను నీకు ప్రియురాలనైనచో, నేను ఎల్లవేళలా నీకు భక్తురాలనైనచో, ఓ దయాసముద్రా! నా సోదరుని నీవు యుద్దములోఎట్లు వధించగల్గుదువు? (26).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 762🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 16 🌴*

*🌻 The battle of the gods - 3 🌻*

18. O thunderbolt for the destruction of misery etc. of the gods harassed by the Asuras. Obeisance to you lying on the Serpent-bed[4]. Obeisance to the one who has sun and the moon for his eyes.

19. O lord of Lakṣmī, O ocean of mercy, save us who have sought refuge in you. All the gods have been driven out of heaven by Jalandhara.

20. The sun has been dislodged from his post. Similarly the moon and the fire too have been removed. The Serpent-king has been removed from Pātāla and Dharmarāja has been dispossessed.

21. While men freely move about, the gods do not shine. We have sought refuge in you. Let measures for his annihilation be thought of.

Sanatkumāra said:—
22. On hearing these piteous entreaties of the gods, Viṣṇu the slayer of Madhu, the ocean of mercy, spoke in a thundering voice.

Viṣṇu said:—
23. “O gods, cast off your fear. I shall come to the battle-ground. I shall show my valour to Jalandhara.”

24. Having said this with distressed mind, Viṣṇu the enemy of the Asuras got up quickly. The god Viṣṇu who is favourably disposed to his devotees immediately mounted his vehicle Garuḍa.

25. On seeing her lord departing along with the gods, Lakṣmī, the daughter of the ocean, spoke with palms joined in reverence and tears welling up in the eyes.

26. “O lord, I am your beloved. If I am always devoted to you, O storehouse of mercy, how does my brother’s death be at your hands.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 16 / Osho Daily Meditations  - 16 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 16. విభజించబడిన శరీరం 🍀*

*🕉. ఆదిమ సమాజంలో మొత్తం శరీరం అంగీకరించ బడుతుంది. ఖండించడం లేదు. ఏదీ తక్కువ కాదు ఏదీ ఎక్కువ కాదు. ప్రతిదీ కేవలం ఉంది. 🕉*

*శరీరాన్ని అంగీకరించడంలో యోగా అంత దూరం వెళ్లదు. ఇది మిమ్మల్ని చాలా నియంత్రణలో ఉంచుతుంది అయితే ప్రతీ నియంత్రణ ఒక విధమైన అణచివేత. కాబట్టి మీరు అణచివేసి, అణచివేత గురించి మరచిపోతారు. ఇవి కడుపులోకి వెళ్లి డయాఫ్రాగమ్ దగ్గర అణచివేయబడిన వస్తువులన్నీ సేకరిస్తాయి. మీరు వస్తువులను విసిరివేయగలిగే ఏకైక స్థలం కడుపు; మరెక్కడా ఖాళీ లేదు. మీ నియంత్రణ పేలిన రోజు, మీరు చాలా స్వేచ్ఛగా, సజీవంగా ఉంటారు. మీరు పునర్జన్మ అనుభూతి చెందుతారు, ఎందుకంటే ఇది మీ విభజించబడిన శరీరాన్ని కలుపుతుంది. డయాఫ్రాగమ్ అనేది శరీరం ఎగువ మరియు దిగువ మధ్య విభజించబడిన ప్రదేశం.*

*పాత మత బోధనలన్నింటిలో, దిగువది ఖండించబడింది మరియు పైభాగం ఉన్నతమైనదిగా, పవిత్రమైనదిగా చూడబడుతుంది. అది కాదు. శరీరం ఒకటి, మరియు ఈ విభజన ప్రమాదకరమైనది; అది మిమ్మల్ని విడిపోయేలా చేస్తుంది. మీరు జీవితంలో చాలా విషయాలను తిరస్కరించారు. మీ జీవితం నుండి మీరు దేనిని మినహాయించినా ఏదో ఒక రోజు దానికి ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇది ఒక వ్యాధిగా వస్తుంది. ఇప్పుడు కొందరు వైద్య పరిశోధకులు క్యాన్సర్ అనేది లోపల చాలా ఒత్తిడి తప్ప మరొకటి కాదు. క్యాన్సర్ చాలా అణచివేయబడిన సమాజాలలో మాత్రమే ఉంటుంది. ఎంత నాగరికత, సంస్కారవంతమైన సమాజం ఉంటే అంత క్యాన్సర్ సాధ్యమవుతుంది. ఆదిమ సమాజంలో ఇది ఉనికిలో ఉండదు, ఎందుకంటే ఆదిమ సమాజంలో మొత్తం శరీరం అంగీకరించబడుతుంది. ఖండించడం లేదు. ఏదీ తక్కువ కాదు, ఏదీ ఎక్కువ కాదు. ప్రతిదీ కేవలం ఉంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 16 🌹*
📚. Prasad Bharadwaj

*🍀16.  THE DIVIDED BODY 🍀*

*🕉  In a primitive society the whole body is accepted. There is no condemnation. Nothinq is lower and nothing is higher. Everything simply is.  🕉*

*In accepting the body, yoga does not go far enough. It makes you very controlled, and every sort of control is a sort of repression. So you repress and then you forget all about the repression. It moves into the stomach, and near the diaphragm all those repressed things collect. The stomach is the only space where you can go on throwing things; nowhere else is there any space. The day your control explodes, you will feel so free, so alive. You will feel reborn, because it will connect your divided body. The diaphragm is the place where the body is divided between the upper and lower.*

*In all the old religious teachings, the lower is condemned and the upper is made to be something high, something superior, something holier. It is not.  The body is one, and this bifurcation is dangerous; it makes you split. By and by you deny many things in life. Whatever you exclude from your life will take its revenge some day. It will come as a disease. Now some medical researchers say that cancer is nothing but too much stress inside. Cancer only exists in very repressed societies. The more civilized and cultured a society, the more cancer is possible. It cannot exist in a primitive society, because in a primitive society the whole body is accepted. There is no condemnation. Nothing is lower and nothing is higher. Everything simply is.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 465 - 2  / Sri Lalitha Chaitanya Vijnanam  - 465  - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀  96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।*
*కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀*

*🌻465. 'క్షోభిణీ' - 2 🌻* 

*జీవులకు జీవుల రూపముననే క్షోభ కలిగించును. కర్మానుభవము కలిగించుటకు శ్రీమాత క్షోభిణి రూపమున తీరుబడి లేక పనిచేయుచున్న దనిపించును. పీత నుండి జగత్పిత వరకందరిని కార్యోన్ముఖులను చేయుచు మత్తు గలవారిని శిక్షించుచు, ప్రమత్తులైన వారిని మేల్కొలుపుచు,  అప్రమత్తులైన వారిని ప్రోత్సహించుచు సృష్టికార్యము జీవుల కొరకు నిర్వర్తించుచుండును. శ్రీమాత కలత పెట్టుటలోను, కలవర పరచుటలోను, క్షోభ కలిగించుటలోను జీవహితమై యున్నదని తెలియవలెను. ఆమె అందించు శిక్షకూడ శిక్షణ కొఱకే. తల్లి విధించు దండన బిడ్డ బాగు కొఱకే కదా! బిడ్డలకు అప్పుడప్పుడు తల్లి క్షోభ కలిగించినట్లు కనిపించును గాని, నిజమునకు క్షోభ కలిగించదు. అట్లే శ్రీమాత క్షోభ కూడను. ఆమె క్షోభకు ఎవ్వరునూ అతీతులు కారు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 465 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika*
*Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻*

*🌻465. 'Kshobhini' - 2 🌻*

*She causes distress to living beings in the form of living beings only. Srimata Ksobhini appears to work relentlessly to cause karmanubhava. From the crab to Jagatpitha, she makes all of them work hard, punishes the intoxicated, wakes up the sleepy, encourages the alert, and performs the work of creation for the sake of living beings. It should be known that Sri Mata is fond of upsetting, disturbing and causing trouble for the sake of training. The punishment imposed by the mother is for his own benefit! Sometimes the mother seems to cause distress to the children, but in reality it does not cause distress. Same is the case with sri Mata. No one is immune to her misery.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
https://www.threads.net/@prasad.bharadwaj

Siva Sutras - 115 : 2-07. Mātrkā chakra sambodhah - 18 / శివ సూత్రములు - 115 : 2-07. మాతృక చక్ర సంబోధః - 18


🌹. శివ సూత్రములు - 115 / Siva Sutras - 115 🌹

🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀

2వ భాగం - శక్తోపాయ

✍️. ప్రసాద్‌ భరధ్వాజ

🌻 2-07. మాతృక చక్ర సంబోధః - 18 🌻

🌴. ఒక గురువు సహాయంతో, యోగి మాతృక చక్ర జ్ఞానాన్ని మరియు మంత్ర శక్తులను స్వీయ-శుద్ధి మరియు స్వీయ-సాక్షాత్కారం కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాడు. 🌴


సృష్టి ప్రక్రియలో, అజ్ఞాన పూరిత ఆత్మలలో శివుని తేజస్సును పరిమితం చేయడంలో ఈ కవచాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఆరు కనుకల యొక్క భ్రమాత్మక ప్రభావాలను దాటి కదిలినప్పుడు, అతను ఉన్మేష అని పిలువబడే వాస్తవ ఉనికి యొక్క తదుపరి దశకు పురోగమిస్తాడు. అత్యున్నత స్థాయి చైతన్యం యొక్క ఆవిర్భావం ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇది ఆధ్యాత్మిక చైతన్యం యొక్క ప్రాథమిక దశ. ఈ దశను చివరి నాలుగు అక్షరాలు శ ష స హ సూచిస్తాయి. ఉన్మేష దశలో, ఉష్మాన్ జరగడం ప్రారంభమవుతుంది. ఉష్మణ (వేడి మరియు ప్రకాశం) అనేది అంతర్గత వేడి మరియు ప్రకాశాన్ని గ్రహించే ప్రారంభ దశ. ఒక్క శివుడు మాత్రమే స్వయం ప్రకాశించేవాడు. ఈ స్వయం ప్రకాశమే విశ్వం యొక్క కారణ మరియు ప్రభావానికి మూలం.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Siva Sutras - 115 🌹

🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀

Part 2 - Śāktopāya.

✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj

🌻 2-07. Mātrkā chakra sambodhah - 18 🌻

🌴. With the help of an guru, a yogi gains the knowledge of matruka chakra and how to harness the mantra shaktis, for self-purification and self-realization. 🌴


In the process of creation, these coverings play significant roles in limiting the splendour of Śiva in the ignorant souls. When a spiritual aspirant moves beyond the illusionary influences of the six kañuca-s, he progresses to the next stage of real existence known as unmeṣa, commencement of the unfolding of the highest level of consciousness. This is the sprouting stage of spiritual consciousness. This stage is represented by the last four letters śa, ṣa, sa and ha (श ष स ह). In the stage of unmeṣa, ūṣman begins to happen. Ūṣman (heat and glow) is the beginning stage of realising the internal heat and glow. Only Śiva alone is Self-illuminating. This Self-illumination is the source of cause and effect of the universe.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


నిర్మల ధ్యానాలు - ఓషో - 379


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 379 🌹

✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ప్రేమ కష్టాల్ని సృష్టించదు. నువ్వు దానికి విధించే హద్దులు కష్టాలని సృష్టిస్తాయి. ప్రేమని వదులుకోవడం పరిష్కారం కాదు, పరిధుల్ని వదులుకోవాలి. ప్రేమగా వుండాలి. 🍀

మీ ప్రేమని పదింతలు చెయ్యడానికే నా ప్రయత్నమంతా దాదాపు అన్ని మతాలు దానికి వ్యతిరేకంగా పని చేశాయి. ప్రేమ బాధలకు కారణమని ప్రేమని వదిలిపెట్టమని బోధించాయి. ప్రేమ దుఃఖాన్ని యిస్తుందని నేనూ గమనించాను. దాన్ని చూడ్డం వల్ల పరిమితుల్ని, హద్దుల్ని చెరిపెయ్యమని బోధించాను. నీ ప్రేమ హద్దుల్ని అధిగమించాలి. అన్ని మతాలకు సంబంధించిన నాకు సంబంధించిన ఆరంభం ఒకే కేంద్రం నించీ సాగినా అవి విభిన్న కోణాల్లో సాగాయి.

ప్రేమ కష్టాల్ని సృష్టిస్తుందని వాళ్ళంటారు. ప్రేమ కష్టాల్ని సృష్టించదు. నువ్వు దానికి విధించే హద్దులు కష్టాలని సృష్టిస్తాయి. ప్రేమని వదులుకోవడం పరిష్కారం కాదు, పరిధుల్ని వదులుకోవాలి. ప్రేమగా వుండాలి. ప్రేమ తక్షణ స్పందనగా, సహజ విషయంగా వుండాలి. అప్పుడు హద్దుల్లేని ప్రేమ స్వేచ్ఛగా వుంటుంది. అపుడు నీ అస్తిత్వం, నీ ఆత్మ ప్రేమగా మారుతాయి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹



DAILY WISDOM - 113 : 22. The Truth is Non-Relative / నిత్య ప్రజ్ఞా సందేశములు - 113 : 22. సత్యం సాపేక్షం కాదు




🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 113 / DAILY WISDOM - 113 🌹

🍀 📖 . ఆత్మ యొక్క ఆరోహణ నుండి 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 22. సత్యం సాపేక్షం కాదు 🌻


సత్యం సాపేక్షం కానిది అని చెప్పినప్పుడు, మేము దాని గురించి మొత్తం చెప్పినట్లే. ఎందుకంటే, దాని గురించి ఇంకేదైనా చెప్పడం అంటే మళ్ళీ అందులో సాపేక్షత ఉంటుంది. ఈ నిరపేక్షతలో ఏ విశేషణాలు లేకుండా చైతన్యాన్ని ఉంచడం అంటే సత్యంలో జీవించినట్లే. ఎందుకంటే ఈ విశేషణాల్లో మళ్ళీ సాపేక్షత దాగి ఉంటుంది. ఇది పరిపూర్ణ జీవితంలో పరిపూర్ణత అనే పదానికి పూర్తి అర్థాన్ని ఇచ్చే విషయం.దీనిని బయట విషయాల ఆధారంగా నిర్విచించలేము.

దీనినే ప్రజలు దేవుడు అని పిలుస్తారు. ఆ పదానికి అర్థం మనకు ఇప్పటికీ పూర్తిగా తెలియలేదు. సత్యం అద్భుతంగా మనస్సులో ఒక మెరుపులా అవగతమౌతుంది. ఇక్కడ భౌతిక అవయవాలు సహాయం చేయవు. అలాగే సాంప్రదాయ ఆలోచనా విధానాలు కూడా సహాయపడవు. ఈ పరివర్తనా ప్రక్రియ మనిషి తన అజ్ఞానాంధకారంలో తనకు ప్రియమైనవిగా ఉంచుకున్న ఎన్నో విషయాలను నాశనం చేస్తుంది. ఎందుకంటే దాని పని అతనిని సంతోషపెట్టడం కంటే జ్ఞానోదయం చేయడం కాబట్టి. అతని కోరికలను పోషించడం కంటే అవగాహన యొక్క దీపాన్ని వెలిగించడం కాబట్టి. అతనిని స్వప్నం నుంచి జాగ్రదావస్ధలోకి మేల్కొలపడం కాబట్టి.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 113 🌹

🍀 📖 The Ascent of the Spirit 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 22. The Truth is Non-Relative 🌻

When we say that Truth is non-relative, we have said everything about it. For, to say anything else about it would be to make it relative. And to maintain a consciousness of this non-relativity without any adjectives—for adjectives create again a sense of relativity—would be to live in Truth. This is life-absolute, which steers clear of all references to the outside, and stands supreme in the strictest sense of the term.

It is this that people call God, a word whose meaning has not become clear to us, still. The magic works by a single stroke of mental effort, and this magic is the realisation of Truth. Hands and feet do not help us here, nor do the traditional modes of thinking. This transfiguring process deals a deathblow to all that man holds as dear and near in the darkness of his ignorance, for its function is to enlighten him rather than please him, to light the lamp of understanding rather than feed his passions, to wake him from sleep rather than serve him a meal in dream.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీ మదగ్ని మహాపురాణము - 248 / Agni Maha Purana - 248


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 248 / Agni Maha Purana - 248 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 4 🌻


ఆకాశము వ్యోమాకారము! నాదబిందుమయము, గోలాకారము, బిందుశక్తి విభూషితము, శుద్ధ స్ఫటికనిర్మలము. (శరీరమున భ్రూమధ్యము మొదలు బ్రహ్మరంధ్రము వరకు ఆకాశస్థానము). అది ''హౌం ఫట్‌'' అను బీజముతో కూడినది. శాంత్యతీతకలామయము. ఒక్క గుణము కలది. పరమవిశుద్ధము. ఈ విధముగ చింతనము చేసి ఆకాశతత్త్వమును శోధన చేయవలెను. పిమ్మట అమృతవర్షిమూలమంత్రముచే సర్వమును పరిపుష్టము చేయవలెను. పిమ్మట ఆధారశక్తిని, కూర్మమును అనంతుని పూజించవలెను. పిమ్మట పీఠముయొక్క ఆగ్నేయ పాదము (కోడు) నందు ధర్మమును, నైరృతి పాదమున జ్ఞానమును, వాయవ్యమున వైరాగ్యమును, ఈశాన్యపాదమున ఐశ్వర్యమును పూజించవలెను.

పిమ్మట పీఠమునకు పూర్వాది దిశలందు క్రమముగ అధర్మ - అజ్ఞాన - అవైరాగ్య - అనైశ్వర్యములను పూజించవలెను. పీఠమధ్యభాగమున కమలమును పూజించవలెను. ఈ విధముగ మనస్సులోనే పీఠముపై నున్న కమలాసనమును ధ్యానించి దానిపై సచ్చిదానందఘనుడగు శివుని ఆవాహనము చేయవలెను. ఆ శివమూర్తియందు శివస్వరూపాత్మను చూచి, ఆసనమును, పాదుకాద్వయమును, తొమ్మిది పీఠశక్తులను ధ్యానించవలెను. శక్తిమంత్రము చివర ''వౌషట్‌'' చేర్చి దానిని ఉచ్చరించుచు పైన చెప్పిన ఆత్మమూర్తిని దివ్యామృతములో ముంచి, సకలీకరణము చేయవలెను. హృదయము మొదలు హస్తముల వరకును ఉన్న అవయవములందును, కనిష్ఠిక మొదలు వ్రేళ్లయందును హృదయమంతర (నమః) న్యాసమునకు సకలీకరణ మని పేరు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 248 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 4 🌻


25. (It should be contemplated) as filled in with ether, as of the form of the speck of ether, uniformly circular, spotless like the pure crystal and adorned by the energy of bindu.

26. After having contemplated on the form of the digit that is beyond tranquility by means of the (mantra) hauṃ ending with phaṭ, one should contemplate the pure (thing) by one stretch (of retention of breath)..

27. One should then permeate the lotus or circles such as ādhāra (base), ananta (endless), dharma (righteousness) and jñāna (knowledge) with the shower of ambrosia with the principal mantra.

28. After having contemplated this seat of the heart, one should then invoke the form of essence of Śiva placed inside that (lotus) with twelve petals.

29. Then that form should be permeated everywhere with the divine ambrosia with the mantra of the energy ending with vauṣaṭ and the sakalīkaraṇa (accomplishing) rite should be performed.

30. The sakalīkaraṇa is that by which the mantras for the heart etc. are placed in the different parts of the body such as the heart, arms, and the little fingers of the hand.



Continues....

🌹 🌹 🌹 🌹 🌹


శ్రీమద్భగవద్గీత - 401: 10వ అధ్., శ్లో 29 / Bhagavad-Gita - 401: Chap. 10, Ver. 29

 

🌹. శ్రీమద్భగవద్గీత - 401 / Bhagavad-Gita - 401 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 29 🌴

29. అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్ |
పితౄణామర్యమా చాస్మి యమ: సంయమతామహమ్ ||


🌷. తాత్పర్యం : నేను పెక్కుపడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మనిర్వాహకులలో మృత్యు దేవతయైన యముడను అయి యున్నాను.

🌻. భాష్యము : జలవాసులలో వరుణదేవుడు ఘనుడైనట్లుగా పెక్కుపడగలు గల నాగులలో అనంతుడు ఘనుడైనట్టివాడు. వారిరువురును శ్రీకృష్ణుని ప్రతినిధులు. ఆర్యముడు అధిపతిగా గల పితృలోకమొకటి కలదు. అతడు శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యము వహించును. దుష్కృతులైనవారిని దండించుటకు గల పెక్కుమందిలో యమధర్మరాజు ముఖ్యుడు. ఈ భూలోకమునకు చేరువలోగల లోకమునందే అతడు నిలిచియుండును. మరణానంతరము పాపులు అచ్చటకు గొనిపోబడగా అతడు వారికి వివిధరకములైన శిక్షలు విధించుచుండును.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 401 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 10 - Vibhuti Yoga - 29 🌴

29. anantaś cāsmi nāgānāṁ varuṇo yādasām aham
pitṝṇām aryamā cāsmi yamaḥ saṁyamatām aham


🌷 Translation : Of the many-hooded Nāgas I am Ananta, and among the aquatics I am the demigod Varuṇa. Of departed ancestors I am Aryamā, and among the dispensers of law I am Yama, the lord of death.

🌹 Purport : Among the many-hooded Nāga serpents, Ananta is the greatest, as is the demigod Varuṇa among the aquatics. They both represent Kṛṣṇa. There is also a planet of Pitās, ancestors, presided over by Aryamā, who represents Kṛṣṇa. There are many living entities who give punishment to the miscreants, and among them Yama is the chief. Yama is situated in a planet near this earthly planet. After death those who are very sinful are taken there, and Yama arranges different kinds of punishments for them.

🌹 🌹 🌹 🌹 🌹



21 Jul 2023 Daily Panchang నిత్య పంచాంగము


🌹 21, జూలై, JULY 2023 పంచాగము - Panchagam 🌹

శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday

మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ

🌻. పండుగలు మరియు పర్వదినాలు : వినాయక చతుర్థి, Vinayaka Chaturthi🌻

🍀. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం - 01 🍀

01. నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ ।
నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశస్వరూపిణీ ॥

02. మహాలక్ష్మీర్మహాకాలీ మహాకన్యా సరస్వతీ ।
భోగవైభవసంధాత్రీ భక్తానుగ్రహకారిణీ ॥


🌻 🌻 🌻 🌻 🌻


🍀. నేటి సూక్తి : ఈశ్వరునికి సర్వమూ ఆధీనమొనర్చే పద్ధతి - ఈశ్వర అనుసరణ మందు నిమగ్నుడు కావడంలో తక్కిన సర్వమునూ వదలి వేయడానికి బదులు ప్రతిదానిని ఈశ్వరాధీనం కావిస్తూ క్రమంగా రూపాంతరం చెందించడం మరొక పద్ధతి. అంతస్సత్త క్రమంగా పరిశుద్ధమవుతూ, ఆత్మతో ఆత్మకు ఐక్యం అనుభూతమై, సాంఘిక జీవనం ఈశ్వర చట్రంచే బద్ధమైన కొలదీ కామకాలుష్యం, అసూయ, క్రోధం, అహంకారిక వాంఛ మొదలైనవి వాటంతటవే రాలిపోతాయి.🍀


🌷🌷🌷🌷🌷



విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన

కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,

వర్ష ఋతువు, ఉత్తరాయణం,

శ్రావణ మాసం

తిథి: శుక్ల తదియ 06:59:48 వరకు

తదుపరి శుక్ల చవితి

నక్షత్రం: మఘ 13:58:33 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: వ్యతీపాత 12:24:23 వరకు

తదుపరి వరియాన

కరణం: గార 06:58:48 వరకు

వర్జ్యం: 00:27:00 - 02:15:08

మరియు 22:58:20 - 24:46:24

దుర్ముహూర్తం: 08:28:00 - 09:20:05

మరియు 12:48:27 - 13:40:32

రాహు కాలం: 10:44:44 - 12:22:24

గుళిక కాలం: 07:29:24 - 09:07:04

యమ గండం: 15:37:44 - 17:15:24

అభిజిత్ ముహూర్తం: 11:56 - 12:48

అమృత కాలం: 11:15:48 - 13:03:56

సూర్యోదయం: 05:51:43

సూర్యాస్తమయం: 18:53:05

చంద్రోదయం: 08:37:39

చంద్రాస్తమయం: 21:29:15

సూర్య సంచార రాశి: కర్కాటకం

చంద్ర సంచార రాశి: సింహం

యోగాలు: కాల యోగం - అవమానం

13:58:33 వరకు తదుపరి సిద్ది యోగం

- కార్య సిధ్ధి , ధన ప్రాప్తి

దిశ శూల: పశ్చిమం

✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻




🍀. నిత్య ప్రార్థన 🍀

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ

నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా

తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం

తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ

విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.

🌹🌹🌹🌹🌹