శ్రీ మదగ్ని మహాపురాణము - 248 / Agni Maha Purana - 248


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 248 / Agni Maha Purana - 248 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 74

🌻. శివ పూజా విధి వర్ణనము - 4 🌻


ఆకాశము వ్యోమాకారము! నాదబిందుమయము, గోలాకారము, బిందుశక్తి విభూషితము, శుద్ధ స్ఫటికనిర్మలము. (శరీరమున భ్రూమధ్యము మొదలు బ్రహ్మరంధ్రము వరకు ఆకాశస్థానము). అది ''హౌం ఫట్‌'' అను బీజముతో కూడినది. శాంత్యతీతకలామయము. ఒక్క గుణము కలది. పరమవిశుద్ధము. ఈ విధముగ చింతనము చేసి ఆకాశతత్త్వమును శోధన చేయవలెను. పిమ్మట అమృతవర్షిమూలమంత్రముచే సర్వమును పరిపుష్టము చేయవలెను. పిమ్మట ఆధారశక్తిని, కూర్మమును అనంతుని పూజించవలెను. పిమ్మట పీఠముయొక్క ఆగ్నేయ పాదము (కోడు) నందు ధర్మమును, నైరృతి పాదమున జ్ఞానమును, వాయవ్యమున వైరాగ్యమును, ఈశాన్యపాదమున ఐశ్వర్యమును పూజించవలెను.

పిమ్మట పీఠమునకు పూర్వాది దిశలందు క్రమముగ అధర్మ - అజ్ఞాన - అవైరాగ్య - అనైశ్వర్యములను పూజించవలెను. పీఠమధ్యభాగమున కమలమును పూజించవలెను. ఈ విధముగ మనస్సులోనే పీఠముపై నున్న కమలాసనమును ధ్యానించి దానిపై సచ్చిదానందఘనుడగు శివుని ఆవాహనము చేయవలెను. ఆ శివమూర్తియందు శివస్వరూపాత్మను చూచి, ఆసనమును, పాదుకాద్వయమును, తొమ్మిది పీఠశక్తులను ధ్యానించవలెను. శక్తిమంత్రము చివర ''వౌషట్‌'' చేర్చి దానిని ఉచ్చరించుచు పైన చెప్పిన ఆత్మమూర్తిని దివ్యామృతములో ముంచి, సకలీకరణము చేయవలెను. హృదయము మొదలు హస్తముల వరకును ఉన్న అవయవములందును, కనిష్ఠిక మొదలు వ్రేళ్లయందును హృదయమంతర (నమః) న్యాసమునకు సకలీకరణ మని పేరు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 248 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 74

🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 4 🌻


25. (It should be contemplated) as filled in with ether, as of the form of the speck of ether, uniformly circular, spotless like the pure crystal and adorned by the energy of bindu.

26. After having contemplated on the form of the digit that is beyond tranquility by means of the (mantra) hauṃ ending with phaṭ, one should contemplate the pure (thing) by one stretch (of retention of breath)..

27. One should then permeate the lotus or circles such as ādhāra (base), ananta (endless), dharma (righteousness) and jñāna (knowledge) with the shower of ambrosia with the principal mantra.

28. After having contemplated this seat of the heart, one should then invoke the form of essence of Śiva placed inside that (lotus) with twelve petals.

29. Then that form should be permeated everywhere with the divine ambrosia with the mantra of the energy ending with vauṣaṭ and the sakalīkaraṇa (accomplishing) rite should be performed.

30. The sakalīkaraṇa is that by which the mantras for the heart etc. are placed in the different parts of the body such as the heart, arms, and the little fingers of the hand.



Continues....

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment